L & T
-
రష్మిక సంచలనం
ముంబై: ఎల్ అండ్ టి ముంబై ఓపెన్ డబ్ల్యూటీఏ–125 టెన్నిస్ టోర్నమెంట్లో భారత మూడో ర్యాంకర్, హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక సంచలనంతో శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 325వ ర్యాంకర్ రష్మిక 6–1, 6–0తో ప్రపంచ 182వ ర్యాంకర్ ఎలీనా ప్రిడాన్కినా (రష్యా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 64 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో రష్మిక కేవలం ఒక్క గేమ్ మాత్రమే కోల్పోవడం విశేషం. రెండు ఏస్‌లు సంధించిన రష్మిక మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తన సర్వీస్‌ను ఒక్కసారి చేజార్చుకున్న రష్మిక ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేసింది. ఓవరాల్‌గా మ్యాచ్ మొత్తంలో ప్రిడాన్కినా తన సర్వీస్‌ను ఒక్కసారి కూడా నిలబెట్టుకోకపోవడం గమనార్హం. భారత్‌కే చెందిన అంకిత రైనా, మాయ రేవతి రాజేశ్వరన్ కూడా తొలి రౌండ్లో నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. 15 ఏళ్ల క్వాలిఫయర్ మాయ 6–4, 6–1తో ఇరీనా షైమనోవిచ్ (బెలారస్)పై, అంకిత రైనా 6–2, 6–2తో భారత్‌కే చెందిన వైష్ణవి అడ్కర్‌పై విజయం సాధించారు. -
కుటుంబానికే ఓటు!
ముంబై: వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌పై కొన్నేళ్లుగా జరుగుతున్న చర్చలు.. వారంలో 90 గంటలు పని చేయాలన్న ఎల్అండ్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలు దానిపై సోషల్ మీడియాలో వెల్లువెత్తిన నిరసనలు, జోకులు, కామెంట్లు, వాదనలు తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్లోబల్ జాబ్ సైట్ ఇండీడ్ చేపట్టిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. సర్వేలో పాలుపంచుకున్న 78 శాతం మంది ఉద్యోగులు కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇండీడ్ ఫ్యూచర్ కెరీర్ రిజల్యూషన్ రిపోర్ట్ ప్రకారం.. భారతీయ ఉద్యోగుల ప్రాధాన్యతలలో గణనీయ మార్పు వచి్చంది. దాదాపు ఐదుగురిలో నలుగురు (78 శాతం) 2025లో కెరీర్లో పురోగతి కంటే జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులతో గడిపేందుకే మొగ్గుచూపుతున్నారు. ఉద్యోగులు తక్కువ ఒత్తిడిని కోరుకుంటున్నారు. మానసిక ప్రశాంతతపై ఎక్కువ దృష్టి పెట్టాలని భావిస్తున్నారు. ఉద్యోగం, వ్యక్తిగత జీవితం మధ్య మెరుగైన సమతుల్యత కావాలంటున్నారు. జాబ్ మార్కెట్‌పై సానుకూలం.. భారతీయ ఉద్యోగులు జాబ్ మార్కెట్ గురించి ఆశాజనకంగా ఉన్నారని నివేదిక వెల్లడించింది. అభివృద్ధి చెందుతున్న రంగాలు, పరిశ్రమలలో అవకాశాల విస్తరణపై 55 శాతం మంది విశ్వాసం వ్యక్తం చేశారు. ఉద్యోగులు విభిన్న నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి చురుకుగా పని చేస్తున్నారు. ఇందుకు అనువుగా తమనితాము మలుచుకుంటున్నారు. కొత్త ఉద్యోగ అవకాశాలు అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఏ ప్రాంతానికైనా వెళ్లి పనిచేసేందుకూ రెడీ అంటున్నారు. ఎక్కువ సంపాదించడం ముఖ్యం అయినప్పటికీ.. సురక్షిత ఉద్యోగం, న్యాయమైన వేతనం, ప్రత్యేకతను చూపే ప్రయోజనాలను కలిగి ఉండాలని కోరుకుంటున్నారని ఇండీడ్ ఆ్రస్టేలియా, ఇండియా, సింగపూర్ మార్కెటింగ్ డైరెక్టర్ రేచల్ టౌన్స్లీ తెలిపారు. 2024 డిసెంబర్–2025 జనవరి మధ్య చేపట్టిన ఈ సర్వేలో ఉద్యోగ వేటలో ఉన్న 2,507 మంది భారతీయులతో సహా సింగపూర్, జపాన్, ఆ్రస్టేలియాకు చెందిన 6,126 మంది పాలుపంచుకున్నారు. నైపుణ్యాల ఆధారంగానే.. అధునాతన సాంకేతికతలను స్వీకరించేందుకూ ఉద్యోగులు సిద్దంగా ఉన్నారని నివేదిక వివరించింది. ఆరి్టఫీíÙయల్ ఇంటెలిజెన్స్, సాంకేతికత కూడిన రంగాల్లో అవకాశాలు పెరుగుతున్నాయని 55 శాతం మంది ఆశాభావంతో ఉన్నారు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్, కాన్ఫ్లిక్ట్ రిజొల్యూషన్, డేటా లిటరసీ, ఏఐ, మెషీన్ లెరి్నంగ్, కోడింగ్ వంటివి 2025లో కెరీర్ పురోగతికి ఉపయోగపడే నైపుణ్యాలుగా భావిస్తున్నారు. సంప్రదాయ డిగ్రీ–ఆధారిత అర్హతల కంటే నైపుణ్యాల ఆధారిత నియామకాలు ఉంటాయని 59 శాతం మంది భారతీయ ఉద్యోగులు విశ్వసిస్తున్నారు. ఈ ధోరణి సాంకేతికత, ఏఐ వంటి అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలలో ఉద్యోగాల కోసం పెరుగుతున్న డిమాండ్‌ను ప్రతిబింబిస్తోంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలకు తగ్గట్టుగా అనుకూలత, ప్రత్యేక నైపుణ్యాలను ప్రదర్శించగల అభ్యర్థులకు కంపెనీలు ఎక్కువగా విలువ ఇస్తున్నాయి. ప్రతిభావంతులకే గుర్తింపు, తదుపరి దశలకు వెళ్తారన్న భావన ఉద్యోగుల్లో ఉంది’ అని నివేదిక వివరించింది. -
రూ.70,000 కోట్ల బిడ్‌ను తిరస్కరించిన రక్షణ శాఖ
భారత్ ప్రతిష్టాత్మంగా చేపట్టిన ప్రాజెక్టు 75ఇండియా(P75I)లో భాగంగా రూ.70,000 కోట్ల విలువైన జలాంతర్గాముల తయారీ కోసం లార్సెన్ అండ్ టుబ్రో (L&T) వేసిన బిడ్‌ను రక్షణ మంత్రిత్వ శాఖ తిరస్కరించింది. ఈ నిర్ణయంతో మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ (MDL) మాత్రమే ఆరు తదుపరి తరం జలాంతర్గాములను నిర్మించే రేసులో నిలిచింది.ప్రాజెక్ట్ 75 ఇండియాభారత నౌకాదళం ప్రాజెక్ట్ 75ఇండియా(పీ75ఐ) మూడు వారాల పాటు నీటి అడుగున ఉండగల సామర్థ్యం కలిగిన ఆరు అధునాతన జలాంతర్గాములను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. పెరుగుతున్న ప్రాంతీయ బెదిరింపుల మధ్య నౌకా సామర్థ్యాలను ఆధునీకరించడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించారు.ఎల్ అండ్ టీ బిడ్ భారత నౌకాదళ అవసరాలకు అనుగుణంగా లేదని రక్షణ మంత్రిత్వ శాఖ గుర్తించింది. స్పానిష్ కంపెనీ నవంతియా భాగస్వామ్యంతో ఎల్ అండ్ టీ స్పెయిన్‌లో కీలకమైన ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ (ఏఐపీ) వ్యవస్థ పనితీరును ప్రదర్శించింది. అయినా ప్రభుత్వం కంపెనీ బిడ్‌ను తిరస్కరించడం గమనార్హం. ఏదేమైనా, భారత నౌకాదళం వ్యవస్థను, దాని అంచనాలు, డిమాండ్లను అందుకోవడంలో ఎల్ అండ్ టీ విఫలమైంది.పరిమిత పోటీపై ఆందోళనఎల్ అండ్ టీ అనర్హతతో ఎండీఎల్ ఇప్పటికే షార్ట్ లిస్ట్ చేసిన ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చరర్స్(ఓఈఎం)ల్లో ఒకటైన నావల్ గ్రూప్ (ఫ్రాన్స్), థైసెన్ క్రుప్ మెరైన్ సిస్టమ్స్ (జర్మనీ), డేవూ షిప్ బిల్డింగ్ (దక్షిణ కొరియా), రోసోబోరో నెక్స్పోర్ట్(రష్యా)తో కలిసి పనిచేయనుంది. ఇంత ముఖ్యమైన ఒప్పందంలో పరిమిత పోటీపై ఆందోళనలను వస్తున్నాయి. రక్షణ రంగంలో, దేశీయంగా నౌకాదళ ఉత్పత్తుల తయారీలో కీలక పాత్ర పోషిస్తున్న ఎల్ అండ్ టీని మినహాయించడం భారత్ స్వావలంబనపై ప్రభావం చూపనుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: పన్ను చెల్లింపుదారులతో సర్వే.. ఆసక్తికర అంశాలుపీ75ఐ గురించి మరికొంత..ప్రాజెక్ట్ 75 ఇండియా (పీ75ఐ) భారత నౌకాదళం ముఖ్యమైన ప్రాజెక్ట్. అత్యాధునిక ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ (ఏఐపీ) వ్యవస్థలతో కూడిన ఆరు అధునాతన డీజిల్-ఎలక్ట్రిక్ జలాంతర్గాములను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏఐపీ వ్యవస్థ జలాంతర్గాములు ఎక్కువ సేపు బయటకు రాకుండా ఉండడానికి వీలు కల్పిస్తుంది. వీటిని ఎక్కువ లోతుల్లోకి వెళ్లేలా రూపొందించనున్నారు. ఈ జలాంతర్గాముల్లో సమకాలీన పరికరాలు, ఆయుధాలు, సెన్సర్లు, ఆధునిక క్షిపణులు ఉంటాయి. -
‘భార్యను తదేకంగాఎంతసేపు చూస్తారు? : అమూల్ స్పందన, ఈ కార్టూన్లు చూస్తే!
ఉద్యోగులు, పనిగంటలపై కార్పొరేట్ కంపెనీ ఎల్అండ్టీ (L&T) చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఉద్యోగులు వారానికి 90 గంటలు పని చేయాలని, ఇంట్లో కూర్చుని భార్యను ఎంత సేపు చూస్తారూ, ఆదివారం కూడా పని చేయండి అంటూ సుబ్రహ్మణ్యన్ చేసిన సంచలన వ్యాఖ్యలు వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇది సోషల్ మీడియాలో సుదీర్ఘ పని గంటలపై మరోసారి చర్చకు దారి తీసింది. సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలపై ఇప్పటికే నెటిజన్లు మండిపడుతున్నారు. దీనిపై పలువురు ఇండస్ట్రీ పెద్దలుకూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాజాగా ఈ జాబితాలోకి డైరీ బ్రాండ్ అమూల్ చేరింది.అమూల్ ఏమంది?ఎల్ అండ్ టి బాస్ "స్టేర్ ఎట్ వైఫ్" వ్యాఖ్యలపై అమూల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఒక డూడుల్ విడుదల చేసింది. ఇందులో ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అమూల్ "90 గంటల పని వారం గురించి వివాదం!" అనే శీర్షికతో పాటు ఒక డూడుల్‌ను షేర్ చేసింది! డూడుల్‌లోని టెక్స్ట్ బోల్డ్‌లో L & T లెటర్స్‌తో ((Labour & Toil) "శ్రమ అండ్ కఠోర శ్రమ?" అంటూ సుబ్రహ్మణ్యన్ను విమర్శించింది "మీరు మీ భార్యను ఎంతసేపు తదేకంగా చూడగలరు?" "అమూల్ రోజూ బ్రెడ్‌ను తదేకంగా చూస్తుంది," అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది.#Amul Topical: Controversy about the 90 hour work week! pic.twitter.com/VQlwoLoTx8— Amul.coop (@Amul_Coop) January 14, 2025కాగా ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ వార్తలు, అంశాలపై ప్రత్యేకమైన గ్రాఫిక్స్ ,పోస్టర్లను రూపొందించడంలో అమూల్ కంపెనీబాగా ప్రసిద్ధి చెందింది. క్రీడల నుండి వినోదం వరకు, అన్ని ముఖ్యమైన సందర్భాలు, ప్రధానంగా ప్రముఖులు చనిపోయినపుడు కూడా తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, 90 గంటల పనివారం గురించి కొనసాగుతున్న వివాదంపై కూడా స్పందించడం విశేషం. గతంలో వారానికి 70 గంటలు పని చేయాలనే ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ్ మూర్తి కూడా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇపుడు ఎల్అండ్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యన్ ఇంకో అడుగు ముందుకేసి, 90 గంటలు, "ఇంట్లో కూర్చొని మీరు ఏమి చేస్తారు? భార్యను ఎంత సేపు చూస్తారు,ఆఫీసుకు వెళ్లి పని ప్రారంభించండి." అంటూ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అధిక జీతం , సౌకర్యాలు ఉన్న కార్పొరేట్ కంపెనీల సీఈవోలు, కింది స్థాయి, తక్కువ జీతం పొందే ఉద్యోగుల నుండి అదే స్థాయి నిబద్ధతను ఎందుకు ఆశిస్తారంటూ నెటిజన్లు ప్రశ్నించారు. మరికొంతమంది కార్మిక శ్రమను దోచుకునే వీళ్లకి కార్మిక చట్టాలు, అమలు, కార్మిక సంక్షేమం గురించి మాట్లాడే మనసు ఉండదంటూ మండిపడ్డారు. అంతేకాదు ఈ వివాదంపై అనేక కార్డూన్లు, ఫన్నీ కామెంట్లు,వీడియోలు నెట్టింట సందడి చేశాయి కూడా. Dedicated to the L&T Chairman who wants a 90 hour work week pic.twitter.com/QtPtLjh2ej— Prashant Bhushan (@pbhushan1) January 13, 2025బాలీవుడ్ సూపర్ స్టార్ దీపికా పదుకొనే, ఆర్పీసీ గ్రూప్ చైర్పర్సన్ హర్ష్ గోయెంకా కూడా సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలను ఖండించారు. అలాగే ఎంఅండ్ ఎం అధినేత ఆనంద్ మహీంద్రా 90 గంటల పనివారం చర్చపై స్పందిస్తూ.. తూకం వేసి, పరిమాణం కంటే పని నాణ్యతపై దృష్టి పెట్టాలని సూచించారు. సుదీర్ఘ పని గంటల కంటే ఉత్పాదకత ,సామర్థ్యానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు.బండ చాకిరీ : మన దేశంమరోవైపు అంతర్జాతీయ కార్మిక సంస్థ( ILO) నివేదిక ప్రకారం, భారతదేశం ఇప్పటికే ప్రపంచ ఓవర్ వర్క్ రంగంలో ముందు వరుసలో ఉంది. అదనపు పని విషయంలో ప్రపంచ దేశాల్లో భారతదేశం 13వ స్థానంలో ఉందని వెల్లడించింది. సగటున భారతీయ ఉద్యోగులు ప్రతి వారం 46.7 గంటలు పనిచేస్తారని, భారతదేశంలోని 51శాతం మంది శ్రామిక శక్తి ప్రతి వారం 49 లేదా అంతకంటే ఎక్కువ గంటలు పనిచేస్తుందని, అత్యధికంగా సుదీర్ఘమైన పని గంటలు ఉన్న దేశాలలో భారతదేశం రెండవ స్థానంలో ఉందని కూడా సంస్థ పేర్కొన గమనార్హం. -
‘మీ లాభాల కోసం మేం చావలేం’
ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్.ఎన్ సుబ్రహ్మణ్యన్ 90 గంటల పనిదినాలపై ఇటీవల చేసిన వ్యాఖ్యలను కర్ణాటక స్టేట్ ఐటీ ఎంప్లాయీస్ యూనియన్ (కేఐటీయూ) తీవ్రంగా తప్పుబట్టింది. కార్మికుల శ్రేయస్సును పణంగా పెట్టి లాభాపేక్షతో అలుపెరగకుండా పని చేయించడం సరికాదని చెప్పింది. కంపెనీల లాభాల కోసం చావడానికి సిద్ధంగా లేమని కేఐటీయూ ప్రకటించింది. భారతీయ శ్రామిక శక్తిని అమానవీయంగా దోపిడీ చేయడం ద్వారా సుబ్రహ్మణ్యన్ సారథ్యం వహిస్తున్న కంపెనీ లాభాలు పొందుతుందని యూనియన్ ఆరోపించింది.కేఐటీయూ కార్యదర్శి సూరజ్ నిడియాంగా మాట్లాడుతూ..‘యూనియన్ ఈ అంశాన్ని ఒంటరి ప్రకటనగా పరిగణించడం లేదు. గతంలో నారాయణమూర్తి వారానికి 70 గంటల పని విధానం కావాలని సూచించినప్పుడు కర్ణాటకలో అమలు చేసే ప్రయత్నం జరిగింది. కేఐటీయూ జోక్యం, ఉద్యోగుల ప్రతిఘటన కారణంగానే వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఎల్ అండ్ టీ ఛైర్మన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. వారి లాభాల కోసం మా ప్రాణాలను పణంగా పెట్టలేం’ అని చెప్పారు.ఛైర్మన్ చేసిన వ్యాఖ్యలు ఇవే..‘ఇంట్లో కూర్చుని ఏం చేస్తారు? భార్యను ఎంత సేపు చూడగలరు? భర్తలను భార్యలు ఎంత సేపు చూస్తారు? ఆఫీసుకు వెళ్లి పని మొదలుపెట్టండి. ఆదివారాలు కూడా ఆఫీసుకురండి. వారానికి 90 గంటలు పనిచేయాలి’ అంటూ కంపెనీ లార్సన్ అండ్ టుబ్రో ఛైర్మన్ ఎస్ఎన్ సుబ్రమణ్యన్ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఆయన కామెంట్లపై ప్రముఖులు విభిన్నంగా స్పందిస్తున్నారు. ఇప్పటికే కార్పొరేట్ సంస్థల్లో పనిగంటలపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా, హెచ్‌సీఎల్ మాజీ సీఈఓ వినీత్ నాయర్ వంటి వ్యక్తులు పని గంటల పరిమాణం కంటే పని నాణ్యతపై దృష్టి పెట్టే అంశాన్ని నొక్కి చెప్పారు.ఇదీ చదవండి: మెటా క్షమాపణలు చెప్పాలి.. పార్లమెంటరీ కమిటీ సమన్లు..?అసలు ఉద్దేశంపై వివరణసోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి వెల్లువెత్తిన వ్యతిరేకతని గమనించిన ఎల్ అండ్ టీ ఇటీవల దిద్దుబాటు చర్యలకు దిగింది. ‘ఇది భారతదేశపు దశాబ్దమని ఛైర్మన్ సుబ్రమణ్యన్ విశ్వసిస్తున్నారు. అసాధారణ ఫలితాలు సాధించాలంటే అసామాన్య కృషి అవసరం. కలసికట్టుగా అంకితభావంతో కృషి చేస్తే వృద్ధిని కొనసాగించగలుగుతాం. అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవించాలనే విజన్‌ను సాకారం చేసుకోగలుగుతాం. కంపెనీ ఛైర్మన్ వ్యాఖ్యలు ఇదే లక్ష్యాన్ని ప్రతిఫలిస్తున్నాయి’ అని ప్రకటన జారీ చేసింది. -
మరీ అంత తేడానా..? L&T చైర్మన్ రూ.కోట్ల జీతంపై కామెంట్స్
వారానికి 90 గంటల పనిని సూచిస్తూ లార్సెన్ & టూబ్రో (L&T) చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ (SN Subrahmanyan) చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. దీనిపై సర్వత్రా తీవ్ర చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆయన అందుకున్న జీతం (salary) వివరాలు అందరి దృష్టినీ ఆకర్షించాయి.సుబ్రహ్మణ్యన్ జీతంసుబ్రహ్మణ్యన్ 2023-24 ఆర్థిక సంవత్సర కాలంలో రూ. 51.05 కోట్లు ఆర్జించారు. ఇది ఎల్అండ్టీ ఉద్యోగుల సగటు జీతం రూ. 9.55 లక్షలు కంటే 534.57 రెట్లు అధికం. ఎల్అండ్టీ 2023-24 ఇంటిగ్రేటెడ్ వార్షిక నివేదిక ప్రకారం సుబ్రహ్మణ్యన్ అందుకున్న రూ.51.05 కోట్లలో వేతనం రూ 3.60 కోట్లు, అవసరాల కింద రూ 1.67 కోట్లు, పదవీ విరమణ ప్రయోజనాలు రూ. 10.50 కోట్లు, కమీషన్ రూ. 35.28 కోట్లు ఉన్నాయి. ఆయన మొత్తం వేతనం రూ. 51.05 కోట్లు గత సంవత్సరంతో పోలిస్తే 43.11% పెరిగింది.ఆదివారం ఆఫీస్కంపెనీ అమలు చేస్తున్న వారానికి ఆరు రోజుల పని విధానాన్ని సమర్థిస్తూ సుబ్రహ్మణ్యన్ ఇటీవల ఉద్యోగులకు హితబోధ చేశారు. "నేను మీతో ఆదివారాలు పని చేయించలేకపోతున్నందుకు చింతిస్తున్నాను. మీరు ఆదివారాలూ పని చేస్తే నేను మరింత సంతోషిస్తాను. ఎందుకంటే నేను ఆదివారం పని చేస్తాను" అంటూ సుబ్రహ్మణ్యన్ మాట్లాడిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది."ఇంట్లో కూర్చొని ఏం చేస్తావు.. ఎంత సేపని భార్యను చూస్తూ ఉంటావు.. ఆఫీసుకు వచ్చి పని చేసుకో" అంటూ వివాదాస్పద వ్యాఖ్య కూడా సుబ్రహ్మణ్యన్ అందులో చేశారు. అమెరికన్లు వారానికి 50 గంటలు పనిచేస్తుండగా తాము వారానికి 90 గంటలు కష్టపడుతున్నామని ఓ చైనా వ్యక్తి తనతో చెప్పినట్లుగా ఆయన వివరించారు. దీన్ని ఉదాహరణగా తీసుకుని "మీరు ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండాలంటే, వారానికి 90 గంటలు పని చేయాలి" అంటూ సెలవిచ్చారు.ఈ వ్యాఖ్యలు విస్తృత విమర్శలను ఎదుర్కొన్నాయి. సోషల్ మీడియా వినియోగదారులతోపాటు కొందరు ప్రముఖులు సైతం సుబ్రహ్మణ్యన్పై విమర్శల దాడి చేశారు. నటి దీపికా పదుకొణె, బిలియనీర్ హర్ష్ గోయెంకా, బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల వంటి వారు అభ్యంతరం వ్యక్తం చేసిన వారిలో ఉన్నారు.కొంతమంది వినియోగదారులు సుబ్రహ్మణ్యన్ సంపాదన, సగటు ఉద్యోగి జీతం మధ్య వ్యత్యాసాన్ని ఎత్తిచూపారు. మరికొందరు వారానికి 70 గంటల పనిని సూచించిన ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తికి, ఈయనకు సారుప్యతలను ముందుకు తెచ్చారు."నేను L&T అనే మంచి కంపెనీ అనున్నాను. అందరూ నారాయణ మూర్తి అడుగుజాడలనే అనుసరిస్తున్నారు" అంటూ ఓ యూజర్ వ్యాఖ్యానించారు. "మనకు ఇలాంటి బిజినెస్ లీడర్లు ఉండటం దురదృష్టకరం" అని మరో యూజర్ కామెంట్ చేశారు. బయటి దేశాల్లో పనిచేసే ఉద్యోగులపై ఇటువంటి పని ఒత్తిడి ఉండదని మరికొందరు అభిప్రాయపడ్డారు. -
L&T ఛైర్మన్ ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలపై వివాదం
-
భార్యలవైపు ఎంతసేపు చూస్తారు... ఆదివారాలు కూడా ఆఫీసుకు రండి!
‘ఇంట్లో కూర్చుని ఏం చేస్తారు? భార్యను ఎంత సేపు చూడగలరు? భర్తలను భార్యలు ఎంత సేపు చూడగలరు? ఆఫీసుకు వెళ్లి పని మొదలుపెట్టండి. ‘ఆదివారాలు కూడా ఆఫీసుకురండి. వారానికి 90 గంటలు పనిచేయాలి’ అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరో కాదు దేశంలోనే ప్రముఖ కార్పొరేట్ కంపెనీ లార్సన్ అండ్ టుబ్రో చైర్మన్ ఎస్ఎన్ సుబ్రమణ్యన్. ఆ మధ్య వారానికి 70గంటలు పనిచేయాలని మాట్లాడి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సోషల్ మీడియాలో ట్రోలింగ్కి గురయ్యారు. ఇప్పుడు ఆ వంతు సుబ్రమణ్యన్ది. మూర్తి మీద జోకులు మీమ్‌లు ఆగకముందే ఎల్–టీ చైర్మన్ ఆయనకు తోడయ్యారు. ఉద్యోగులకు వ్యక్తిగత జీవితం ఉండదా, ఉండకూడదా అంటూ నెటిజనులు దాడి మొదలెట్టారు. ఇతర కార్పొరేట్ సీఈఓలు కూడా సుబ్రమణ్యన్ మాటల్ని కొట్టిపారేశారు. ఉద్యోగులపై ఒత్తిడి పెరిగి సమర్ధత సన్నగిల్లుతున్న ఈరోజుల్లో వారికి స్ఫూర్తినిచ్చే మాటలు చెప్పాల్సింది పోయి ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదన్నారు. సోషల్ మీడియాలో దాడిని నెటిజన్ల నుంచి వెల్లువెత్తిన వ్యతిరేకతని గమనించిన ఎల్–టీ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఇది భారతదేశపు దశాబ్దమని చైర్మన్ సుబ్రమణ్యన్ విశ్వసిస్తున్నారు..అసాధారణ ఫలితాలు సాధించాలంటే అసామాన్య కృషి అవసరం. కలసికట్టుగా అంకితభావంతో కృషి చేస్తే వృద్ధిని కొనసాగించగలుగుతాం. అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవించాలనే విజన్‌ను సాకారం చేసుకోగలుగుతాం. కంపెనీ చైర్మన్ వ్యాఖ్యలు ఇదే లక్ష్యాన్ని ప్రతిఫలిస్తున్నాయని ఎల్–టీ ప్రకటన జారీ చేసింది. జాతి నిర్మాణమే ఎల్అండ్టీ ప్రధాన లక్ష్యం. ఎనిమిది దశాబ్దాలుగా దేశ మౌలికసదుపాయాలు, పరిశ్రమలు, సాంకేతిక సామర్థ్యాలను బలపరుస్తున్నాం. ఉద్ధేశాలు, లక్ష్యాలు సాధనకు కట్టుబడి ముందుకు సాగుతామని స్పష్టం చేసింది. ఇదీ చదవండి: అపోహలు వీడితేనే మంచి స్కోరు -
లార్సెన్ & టూబ్రో భారీ ఆర్డర్స్: ఏకంగా..
లార్సెన్ & టుబ్రో (L&T) కంపెనీ భారతదేశంలో మాత్రమే కాకుండా.. మిడిల్ ఈస్ట్ నుంచి కూడా భారీ ఆర్డర్లను పొందింది. వీటి విలువ రూ. 2,500 కోట్ల నుంచి రూ. 5,000 కోట్ల మధ్య ఉన్నట్లు సమాచారం.పశ్చిమ బెంగాల్లో లేటెస్ట్ పంపిణీ నిర్వహణ వ్యవస్థను అమలు చేయడానికి లార్సెన్ & టుబ్రో ఆర్డర్లను సొంతం చేసుకుంది. ఈ టెక్నాలజీ.. అవుటేజ్ నిర్వహణ వ్యవస్థ & పంపిణీ నిర్వహణ వ్యవస్థ కార్యాచరణలను కలపడం ద్వారా విద్యుత్ పంపిణీని మరింత స్మార్ట్‌గా చేయనుంది.మీడియం, తక్కువ వోల్టేజ్ నెట్‌వర్క్‌ల రియల్ టైమ్ పర్యవేక్షణ మాత్రమే కాకుండా.. నియంత్రణ ద్వారా, లోపాలను త్వరగా వేరుచేయడం, వేగవంతమైన పునరుద్ధరణతో నెట్వర్క్ విశ్వసనీయత మెరుగుపడుతుంది.ఇక మధ్యప్రాచ్యం (మిడిల్ ఈస్ట్) విషయానికి వస్తే.. కంపెనీ సౌదీ అరేబియాలో, సౌర ఉత్పత్తిని తరలించడానికి వీలు కల్పించే కీలకమైన 380 కేవీ సబ్‌స్టేషన్ కోసం ఆర్డర్ పొందబడింది. అదే విధంగా కువైట్‌లోని గ్రిడ్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి కంపెనీ 400 కేవీ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేస్తుంది.ఇదీ చదవండి: మారుతి సుజుకి 'ఈ ఫర్ మీ' స్ట్రాటజీ: ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు అదేదుబాయ్లో కూడా కంపెనీ 40/132 kV సబ్‌స్టేషన్‌తో సహా ఎక్స్ట్రా హై వోల్టేజ్ (EHV) సబ్స్టేషన్లను ఏర్పాటు చేయడానికి అనేక ఆర్డర్లను పొందింది. ఈ ప్రాజెక్ట్‌లు దుబాయ్ పవర్ ట్రాన్స్మిషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను విస్తరించే ప్రయత్నాలలో భాగంగా ఉన్నాయి.The Power Transmission & Distribution (PT&D) vertical of Larsen & Toubro has won new orders in India and the Middle East. https://t.co/KEkpgCBaqH #LarsenToubroNews pic.twitter.com/848WPFsPKE— Larsen & Toubro (@larsentoubro) January 7, 2025 -
ఎల్&టీ టెక్నాలజీలో 2000 ఫ్రెషర్ జాబ్స్
ముంబై: ఇంజనీరింగ్ సర్వీసుల ఐటీ కంపెనీ ఎల్అండ్టీ టెక్నాలజీ సర్వీసెస్ ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జూలె–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం స్వల్పంగా 2 శాతం పుంజుకుని రూ. 320 కోట్లకు చేరింది. లాభాల మార్జిన్లు నీరసించడం ప్రభావం చూపింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 315 కోట్లు ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం 8 శాతం ఎగసి రూ. 2,573 కోట్లను తాకింది.యూరోపియన్ మార్కెట్ నుంచి ఆటోమొబైల్, సస్టెయినబిలిటీ సొల్యూషన్లకు ఏర్పడిన డిమాండ్ ఇందుకు తోడ్పాటునిచ్చింది. వాటాదారులకు షేరుకి రూ. 17 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ఇందుకు ఈ నెల 25 రికార్డ్ డేట్‌కాగా.. ఈ ఏడాది 2,000 మంది ఫ్రెషర్స్‌కు ఉద్యోగాలు ఆఫర్ చేయనున్నట్లు కంపెనీ ఎండీ, సీఈవో అమిత్ చద్దా పేర్కొన్నారు. ఈ కాలంలో 121 మందిని చేర్చుకోవడంతో సిబ్బంది సంఖ్య 23,698కు చేరింది.అమ్మకాలు, టెక్నాలజీలపై అధిక వ్యయాలతో నిర్వహణ లాభ మార్జిన్లు 17.1 శాతం నుంచి 15.1 శాతానికి బలహీనపడ్డాయి. 8–10 శాతం వృద్ధి ప్రస్తుత ఏడాది ఎల్అండ్టీ టెక్నాలజీ ఆదాయంలో 8–10 శాతం వృద్ధి నమోదుకానున్నట్లు అమిత్ చద్దా పేర్కొన్నారు. వార్షికంగా 2 బిలియన్ డాలర్ల ఆదాయ మార్క్‌ను అందుకోగలమనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇకపై మార్జిన్లు మెరుగుపడనున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఏడాది చివరికల్లా ఆదాయంలో 16 శాతం పురోగతిని అందుకోగలమని అంచనా వేశారు. ప్రస్తుత సమీక్షాకాలంలో 2 కోట్ల డాలర్ల విలువైన 2 డీల్స్తోపాటు కోటి డాలర్ల విలువైన 4 ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. -
ఎల్అండ్టీ గ్రూప్ కంపెనీలకు నాయక్ గుడ్‌బై
న్యూఢిల్లీ: ఎల్టీఐ మైండ్‌ట్రీ, ఎల్అండ్టీ టెక్నాలజీ సర్వీసెస్ (ఎల్టీటీఎస్) చైర్మన్‌గా తప్పుకోవాలని ఏఎం నాయక్ నిర్ణయించుకున్నారు. ఆయన స్థానంలో ఈ రెండు సంస్థలకు చైర్మన్‌గా ఎస్ఎన్ సుబ్రమణియన్ 27న బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ విషయాన్ని ఇరు కంపెనీలు ప్రకటించాయి. వ్యవస్థాపక చైర్మన్‌గా ఏఎం నాయక్ ఎల్టీఐ మైండ్‌ట్రీ కంపెనీని చురుకైన అంతర్జాతీయ కంపెనీగా తీర్చిదిద్దినట్టు సంస్థ పేర్కొంది. ఈ నెల 26నాటి ఎల్టీఐ మైండ్‌ట్రీ 28వ ఏజీఎంతో తన బాధ్యతలకు ముగింపు పలకాలని ఏఎం నాయక్ నిర్ణయించుకున్నారని, దీంతో ప్రస్తుతం వైస్ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రమణియన్‌ను నూతన చైర్మన్‌గా బోర్డు ఎంపిక చేసినట్టు, ఇది 27 నుంచి అమల్లోకి వస్తుందని ఎల్టీఐ మైండ్‌ట్రీ ప్రకటించింది. కంపెనీ పురోగతికి నాయక్ అందించిన సేవలకు అభినందనలు తెలియజేసింది.సుబ్రమణియన్ సారథ్యంలో ఎల్టీఐ మైండ్‌ట్రీ తన వృద్ధి పథాన్ని కొనసాగిస్తుందని, కొత్త విజయశిఖరాలను చేరుకుంటుందని ఆశిస్తున్నట్టు నాయక్ ప్రకటించారు. అంతకుముందు ఈ సంస్థ ఎల్అండ్టీ ఇన్ఫోటెక్గా కొనసాగగా, 2019లో మైండ్‌ట్రీని విలీనం చేసుకున్న అనంతరం ఎల్టీఐ మైండ్‌ట్రీగా మారడం తెలిసిందే. మైండ్‌ట్రీని సొంతం చేసుకోవడంలో నాయక్, సుబ్రమణియన్ కీలక పాత్ర పోషించారు. ఎల్టీఐ మైండ్‌ట్రీ, ఎల్టీటీఎస్ రెండింటిలోనూ ఎల్అండ్టీకి మెజారిటీ వాటాలున్నాయి. -
గుడ్ న్యూస్: ప్రముఖ కంపెనీలో భారీగా ఉద్యోగాలు!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3,000 మంది పైచిలుకు ఇంజినీరింగ్ ట్రెయినీలను తీసుకున్నట్లు ఇంజినీరింగ్, నిర్మాణ రంగ దిగ్గజం లార్సన్ అండ్ టూబ్రో (ఎల్అండ్టీ) వెల్లడించింది. వీరిలో తాజా గ్రాడ్యుయేట్, పోస్ట్గ్రాడ్యుయేట్లు ఉన్నట్లు తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో రిక్రూట్ చేసుకున్న 1,067 మందితో పోలిస్తే ఈసారి ట్రెయినీల సంఖ్య మూడు రెట్లు పెరిగినట్లు వివరించింది. మహిళా ఇంజినీర్ల సంఖ్య నాలుగు రెట్లు పెరిగి 248 నుండి 1,009కి చేరినట్లు ఎల్అండ్టీ తెలిపింది. మొత్తం సిబ్బందిలో ప్రస్తుతం మహిళా ఉద్యోగుల వాటా 7.6 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. చదవండి: ఊహించని షాక్.. ఒకప్పుడు ఈ కారుకి ఫుల్ డిమాండ్, ఇప్పుడేమో ఒక్కరూ కొనట్లేదు! -
ఎల్అండ్టీ లాభం జూమ్
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ ఇంజినీరింగ్ దిగ్గజం లార్సెన్ అండ్ టుబ్రో(ఎల్అండ్టీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 45 శాతం జంప్‌చేసి రూ. 1,702 కోట్లను అధిగమించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 1,174 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 29,335 కోట్ల నుంచి రూ. 35,853 కోట్లకు ఎగసింది. ఈ కాలంలో 57 శాతం అధికంగా రూ. 41,805 కోట్ల విలువైన గ్రూప్ స్థాయి ఆర్డర్లను సాధించింది. వీటిలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నుంచి 66 శాతం వృద్ధితో రూ. 18,343 కోట్ల విలువైన కాంట్రాక్టులు లభించాయి. ఇంధన ప్రాజెక్టుల విభాగం నుంచి రూ. 4,366 కోట్ల విలువైన ఆర్డర్లు సంపాదించింది. వెరసి జూన్ చివరికల్లా మొత్తం(కన్సాలిడేటెడ్) ఆర్డర్ బుక్ విలువ రూ. 3,63,448 కోట్లకు చేరింది. వీక్ క్వార్టర్లోనూ నిజానికి ఈపీసీ కంపెనీలకు ప్రధానంగా ఎల్అండ్టీకి తొలి త్రైమాసికం బలహీనంగా ఉంటుందని, అయినప్పటికీ పటిష్ట ఫలితాలను సాధించగలిగినట్లు కంపెనీ హోల్‌టైమ్ డైరెక్టర్, సీఎఫ్‌వో ఆర్.శంకర్ రామన్ పేర్కొన్నారు. కంపెనీ అంతర్గత పునర్వ్యవస్థీకరణ చేపట్టినట్లు తెలియజేశారు. తద్వారా తొమ్మిది విభాగాలను ఏడుగా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ ఏడాది రోడ్ కన్సెషన్ ప్రాజెక్టుల నుంచి వైదొలగే ఆలోచనలో ఉన్నట్లు తెలియజేశారు. ఐదేళ్ల లక్ష్యం 2026 ప్రణాళికలో భాగంగా కొత్త విభాగాలలోకి డైవర్సిఫై అవుతున్నట్లు వెల్లడించారు. వీటిలో గ్రీన్ ఎనర్జీ, ఈకామర్స్ ప్లాట్‌ఫామ్ బిజినెస్‌లున్నట్లు పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో ఎల్అండ్టీ షేరు 2% క్షీణించి రూ. 1,751 వద్ద ముగిసింది. చదవండి: RBI Unclaimed Deposits: క్లెయిమ్ చేయని నిధులు రూ.48వేల కోట్లు.. వీటిని ఏం చేస్తారంటే! -
అదరగొట్టిన ఎల్అండ్టీ ఇన్ఫోటెక్..మైండ్‌ట్రీతో విలీనంపై కీలక వ్యాఖ్యలు..!
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల మధ్యస్థాయి కంపెనీ ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 17 శాతం వృద్ధితో దాదాపు రూ. 638 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది(2021) ఇదే కాలంలో రూ. 545 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 32 శాతం వరకూ ఎగసి రూ. 4,302 కోట్లకు చేరింది. అంతక్రితం క్యూ4లో రూ. 3,269 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి కంపెనీ నికర లాభం 19 శాతం పుంజుకుని రూ.2,297 కోట్లయ్యింది. 2020–21లో రూ. 1,936 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 27 శాతం అధికమై రూ. 15,669 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది కేవలం రూ. 12,370 కోట్ల టర్నోవర్ నమోదైంది. విలీనం ఊహాజనితం గ్రూప్ కంపెనీ మైండ్‌ట్రీతో విలీనంపై ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ యాజమాన్యం ఊహాజనితమంటూ స్పందించింది. ఊహాగానాలపై వ్యాఖ్యానించబోమంటూ క్యూ4 ఫలితాల విడుదల సందర్భంగా కంపెనీ సీఈవో, ఎండీ సంజయ్ జలోనా స్పష్టం చేశారు. మైండ్‌ట్రీతో విలీనంపై ఎలాంటి వివరాలూ అందుబాటులో లేవని, మీడియా అంచనాలపై వ్యాఖ్యానించబోమని ఎక్సే్ఛంజీలకు తెలిపారు. 6,000 మందికి ఉద్యోగాలు... వాటాదారులకు షేరుకి రూ. 30 చొప్పున డివిడెండును ఎల్అండ్టీ ఇన్ఫో ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం(2022–23)లో 6,000 మంది ఫ్రెషర్స్‌కు ఉద్యోగాలివ్వనున్నట్లు పేర్కొంది. గతేడాది 6,200 మందికి ఉపాధి కల్పించినట్లు ప్రస్తావించింది. ప్రస్తుతం కంపెనీ సిబ్బంది సంఖ్య 46,648కు చేరినట్లు వెల్లడించింది. ఎట్రిషన్ రేటు 24 శాతంగా నమోదైంది. ఫలితాల నేపథ్యంలో ఎల్అండ్టీ ఇన్ఫో షేరు 8.3% పతనమై రూ. 5,385 వద్ద ముగిసింది. చదవండి: ఎల్అండ్టీ ఇన్ఫో, మైండ్‌ట్రీ విలీనం! -
ఐవోసి మాస్టర్ ప్లాన్.. అంబానీ, అదానీలకు పోటీగా..
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), ఇంజనీరింగ్, మౌలిక రంగ దిగ్గజం ఎల్అండ్టీ, పునరుత్పాదక ఇంధన రంగంలోని రెన్యూ పవర్.. గ్రీన్ హైడ్రోజన్ తయారీకి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించాయి. దీంతో గ్రీన్ హైడ్రోజన్ తయారీపై భారీ ప్రణాళికలను ప్రకటించిన రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ గ్రూపునకు ఈ జాయింట్ వెంచర్ గట్టీ పోటీనివ్వనుంది. సంయుక్తంగా గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల అభివృద్ధికి గాను ఒప్పందంపై ఈ మూడు సంస్థలు సంతకాలు చేశాయి. అలాగే, ఐవోసీ, ఎల్అండ్టీ విడిగా మరో జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయనున్నాయి. దీని ద్వారా అవి గ్రీన్ హైడ్రోజన్ తయారీకి అవసరమైన ఎలక్ట్రోలైజర్లను తయారు చేయనున్నాయి. ఐవోసీ–ఎల్అండ్టీ–రెన్యూపవర్ ఐవోసీకి చెందిన మధుర, పానిపట్ రిఫైనరీల వద్ద గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల ఏర్పాటుపై దృష్టి సారిస్తాయని సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో అవి పేర్కొన్నాయి. గ్రీన్ హైడ్రోజన్ తయారీకి అవసరమైన పునరుత్పాదక ఇంధనాన్ని రెన్యూ పవర్ సరఫరా చేసే అవకాశం ఉంది. ‘‘మూడు సంస్థల మధ్య జాయింట్ వెంచర్ ఏర్పాటు వల్ల.. ప్రాజెక్టుల డిజైన్, నిర్మాణంలో ఎల్అండ్టీకి ఉన్న అనుభవం, పెట్రోలియం రిఫైనరీలో ఐవోసీకి ఉన్న అనుభవం, ఇంధన చైన్ పట్ల అవగాహన, పునరుత్పాదక ఇంధనంలో రెన్యూపవర్కు ఉన్న అనుభవం కలసివస్తాయి’’ అని ఈ ప్రకటన తెలియజేసింది. చదవండి: గ్రీన్ ఎనర్జీలో దూసుకుపోతున్న రిలయన్స్.. మరో కీలక నిర్ణయం -
మెట్రో రైల్లో జాగ్రత్త! బిగ్‌బాస్ మిమ్మల్ని చూస్తున్నాడు!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మెట్రో రైల్లో ప్రయాణించేటప్పుడు అనుసరించాల్సిన ముందు జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు ‘బిగ్‌బాస్ మిమ్మల్ని చూస్తున్నాడు’ అనే అవగాహన కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. స్టార్ మా, ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ సంయుక్తంగా ఈ ప్రచారాన్ని చేపట్టాయి. నగరంలోని 57 మెట్రో స్టేషన్లలోని కాన్కోర్స్, ప్రవేశ, నిష్క్రమణ, చెక్ ఇన్ ప్రాంగణాల్లో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన జింగిల్స్‌తో ఈ ప్రచారం చేపట్టారు. మెట్రో కమ్యూటర్లు ప్రయాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు, మెట్రో స్టేషన్ ప్రాంగణాలలో అనుసరించాల్సిన విధానాలను గురించి అవగాహన కల్పించనున్నారు. ఈ సందర్భంగా బిగ్‌బాస్ హోస్ట్ అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. వినోదానికి ఓ సహేతుకమైన విధానమంటూ ఉండాలన్నారు. ఈ ప్రచారం అందుకు దోహదం చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెంట్రో ఎండీ అండ్ సీఈఓ కేవీబీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
5జీ సేవల్లో భాగంగా ఎల్అండ్టీ-వీఐ కీలక ఒప్పందం..!
5జీ సేవలపై పలు మొబైల్ నెట్వర్క్ సంస్థలు వేగంగా పావులను కదుపుతున్నాయి. కేంద్రం ఏజీఆర్ బకాయిలపై నాలుగేళ్ల పాటు మారటోరియం విధించడం, టెలికాం రంగంలో 100శాతం మేర ఎఫ్‌డీఐలను అనుమతి ఇవ్వడంతో టెలికాం కంపెనీలు 5జీ నెట్వర్క్ స్థాపన కోసం వేగంగా ప్రణాళికలను రచిస్తున్నాయి. 5జీ నెట్వర్క్ ట్రయల్స్‌లో భాగంగా వోడాఫోన్ ఐడియా తాజాగా ఎల్అండ్టీతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. 5జీ స్మార్ట్ సిటీల్లో భాగంగా ఎల్ అండ్ టీ, వోడాఫోన్ ఐడియా సంయుక్తంగా కలిసి పనిచేయనున్నాయి. చదవండి: మరో సంచలనం..చంద్రుడిపై వైఫై నెట్ వర్క్ ప్రయోగం ఇంటర్నెట్ ఆఫ్ థిగ్స్ (ఐవోటీ), వీడియో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలతో ఎల్అండ్టీ స్మార్ట్‌సిటీ ప్లాట్‌ఫాంపై వోడాఫోన్ ఐడియా పనిచేయనుంది. ఈ ఒప్పందం సందర్భంగా ... వొడాఫోన్ ఐడియా చీఫ్ ఎంటర్ప్రైజ్ బిజినెస్ ఆఫీసర్ అభిజిత్ కిషోర్ మాట్లాడుతూ... 5జీ టెక్నాలజీతో పలు పరిష్కారాలను, స్థిరమైన నగరాలను నిర్మించడానికి వెన్నెముక అని చెప్పారు. 5జీ టెక్నాలజీ రాకతో పట్టణాల్లోని సవాళ్లను సులువుగా పరిష్కరించవచ్చునని అన్నారు. ఇప్పటికే వొడాఫోన్ ఐడియా(వీఐ) పూణేలో నిర్వహిస్తున్న 5జీ ట్రయల్స్ సమయంలో 3.7 జీబీపీ వేగంతో డేటాను బదిలీ చేసింది. వోడాఫాన్ ఐడియా తన ఓఈఎమ్ భాగస్వాములతో కలిసి 3.5 Ghz బ్యాండ్ 5G ట్రయల్ నెట్వర్క్ భాగంగా లో 1.5 Gbps వరకు గరిష్ట డౌన్లోడ్ వేగాన్ని సాధించిందని వెల్లడించారు. చదవండి: దేశంలో అత్యంత సురక్షితమైన టాప్-10 కార్లు ఇవే! -
హైదరాబాద్ మెట్రో ప్రయాణీకులకు గుడ్‌న్యూస్!
హైదరాబాద్: దసరా, దీపావళి పండుగ సీజన్ పురస్కరించుకుని ఎల్అండ్టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్(ఎల్టీఎంఆర్హెచ్ఎల్) మరో మారు పండగ ఆఫర్లను తీసుకువస్తూ ‘మెట్రో సువర్ణ ఆఫర్ 2021’ను ప్రకటించింది. అక్టోబర్ 18 నుంచి ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్లో ట్రిప్ పాస్, గ్రీన్ లైన్‌పై ప్రత్యేక ధర, మెట్రో ప్రయాణీకుల కోసం లక్కీ డ్రా వంటివి ఉన్నాయి. ఈ ఆఫర్‌కు సంబంధించిన వివరాలను హైదరాబాద్ మెట్రో సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.(చదవండి: కేసీఆర్ చరిత్రలో ద్రోహిగా మిగిలిపోతారు) మెట్రో సువర్ణ ఆఫర్ 2021: ట్రిప్ పాస్ ఆఫర్: ఈ ఆఫర్ కింద మెట్రో ప్రయాణీకులు తమ ప్రయాణ అవసరాలకు తగినట్లుగా ఏదైనా ఫేర్‌తో 30 ట్రిప్పులను కేవలం 20 ట్రిప్పుల ధర చెల్లించి కొనుగోలు చేయవచ్చు. ఈ ట్రిప్పులను 45రోజుల లోపు వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ కేవలం మెట్రో స్మార్ట్ కార్డ్(పాత, నూతన)పై మాత్రమే వర్తిస్తుంది. మెట్రో ప్రయాణీకులు ఈ ఆఫర్‌ను 18 అక్టోబర్ 2021 నుంచి 15 జనవరి 2022 మధ్య వినియోగించుకోవాల్సి ఉంటుంది. గ్రీన్ లైన్‌పై ప్రత్యేక ఫేర్ ఆఫర్: ఎంజీబీఎస్, జెబీఎస్ పరేడ్ గ్రౌండ్స్ మెట్రో స్టేషన్ల నడుమ గ్రీన్ లైన్‌పై ప్రయాణించే ప్రయాణీకులు ప్రతి ట్రిప్‌కూ గరిష్టంగా 15 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. మెట్రో ప్రయాణీకులు ఈ ఆఫర్‌ను అన్ని టిక్కెటింగ్ మార్గాలపై 18 అక్టోబర్ 2021 నుంచి15 జనవరి 2022 వరకూ పొందవచ్చు. నెలవారీ లక్కీ డ్రా: అక్టోబర్ 2021 నుంచి ఏప్రిల్ 2022 వరకూ ఆకర్షణీయమైన బహుమతులను ప్రతినెలా గెలుచుకునే అవకాశం మెట్రో ప్రయాణీకులకు ఉంది. ప్రతి నెలా ఐదుగురు విజేతలను లక్కీడ్రా సీఎస్సీ కార్డు వినియోగదారుల నుంచి ఎంపిక చేస్తారు. వీరు ఓ క్యాలెండర్ నెలలో కనీసం 20 సార్లు ప్రయాణించాల్సి ఉంటుంది. వినియోగదారులు తమ సీఎస్సీ (కాంటాక్ట్‌లెస్ స్మార్ట్‌కార్డు)లను టీసవారీ లేదా మెట్రో స్టేషన్ల వద్ద నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ ప్రకటించిన తర్వాత ఎల్టీఎంఆర్హెచ్ఎల్ ఎండీ అండ్ సీఈవో కెవీబీ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘గత సంవత్సరం అక్టోబర్‌లో తొలిసారిగా ప్రకటించిన మెట్రో సువర్ణ ఆఫర్‌కు అపూర్వమైన స్పందన లభించింది. ఇప్పుడు ఈ సంవత్సరం మరో మారు ఈ ఆఫర్‌ను ప్రారంభించడం పట్ల సంతోషంగా ఉన్నాము. మా ప్రయాణీకులు మా సేవల పట్ల అపారమైన నమ్మకాన్ని చూపడంతో పాటుగా మెట్రోను తమ సురక్షితమైన ప్రయాణ భాగస్వామిగా ఎంచుకుంటున్నారు. నగరంలో అత్యంత విశ్వసనీయమైన, పర్యావరణ అనుకూల, సమయపాలన కలిగిన, సురక్షితమైన, సౌకర్యవంతమైన రవాణా మాధ్యమం ఇది. మా ప్రయాణీకులకు మెరుగైన సేవలను అందించేందుకు మమ్మల్ని మేము మెరుగుపరుచుకుంటూనే ఈ మహమ్మారి కాలంలో అత్యంత సురక్షితమైన భద్రతా ఏర్పాట్లను చేశాము’’ అని అన్నారు. -
24 వేల కోట్లతో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్
సాక్షి, న్యూఢిల్లీ: టెక్నాలజీ రంగంలో భారత్ మరో ముందడుగు వేసింది. హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్స్‌కు సంబంధించిన ప్రాజెక్ట్ పై హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్(ఎన్హెచ్ఆర్ఎస్సీఎల్) గురువారం అగ్రిమెంట్ కుదుర్చుకుంది. 24 వేలకోట్లతో ప్రారంభించే అతి పెద్ద ప్రాజెక్ట్ ఇది. ఎల్ అండ్ టీ కంపెనీ ఈ కాంట్రాక్ట్‌ను దక్కించుకుంది. మెదటగా ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య ఆరు రైళ్లను నడపనున్నారు. గుజరాత్లో ఎన్హెచ్ఆర్ఎస్సీఎల్ 325 కి.మీ. సంబంధించిన భూమి, ప్రాజెక్ట్ వివరాలను ఎల్ అండ్ టీ కి అప్పజెప్పింది. అయితే గుజరాత్ వైపు ఈ ప్రాజెక్ట్ పూర్తి అయిన తర్వాత మహారాష్ష్ర్ట ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌కు భూమిని సమకూర్చాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ కేవలం జపాన్ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయడమే కాకుండా..అన్ని ప్రాంతాల అభివృద్ధికి తోడ్పడుతుందని జపాన్ అంబాసిటర్ సంతోష్ సుజుకీ అభిప్రాయపడ్డారు. రైల్వే బోర్డు సీఈఓ, చైర్మన్ వి.కే యాదవ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్ట్ పూర్తి అయిన తర్వాత మరో ఏడు మార్గాలలో ఇలాంటి ప్రాజెక్ట్ ప్రారంభిస్తాం అన్నారు. ఇలాంటి ప్రాజెక్ట్‌ల వల్ల టెక్నాలజీని అందిపుచ్చుకోవడమే కాకుండా ఉద్యోగ కల్పన జరుగుతుంది అన్నారు. ఇంజనీర్స్, టెక్నీషియనన్స్, డిజైనర్ లాంటి స్కిల్ కలిగిన వారికి మాత్రమే కాక, నిర్మాణ కార్మికులకు, సెమీ స్కిల్ వర్కరర్స్కు పని దొరుకుతుందని పేర్కొన్నారు. -
మైండ్ ట్రీకి ఎల్ అండ్ టీ ఓపెన్ ఆఫర్
న్యూఢిల్లీ: మైండ్ ట్రీ కంపెనీ టేకోవర్‌లో భాగంగా ఎల్ అండ్ టీ కంపెనీ రూ.5,029.8 కోట్ల ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్లో భాగంగా మైండ్ ట్రీ కంపెనీలో 31 శాతం వాటాకు సమానమైన 5.13 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేస్తామని ఎల్ అండ్ టీ తెలిపింది. ఒక్కో షేర్‌కు రూ.980 ధరను (మైండ్ ట్రీ షేర్ శుక్రవారం రూ.969 ధర వద్ద ముగిసింది) ఆఫర్ చేస్తోంది. ఈ ఓపెన్ ఆఫర్ ఈ నెల 17 న మొదలై 28న ముగుస్తుంది. షెడ్యూల్ ప్రకారమైతే ఈ ఓపెన్ ఆఫర్ మే 14 నుంచే మొదలు కావలసి ఉంది. అయితే మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ నుంచి అనుమతి రావడం ఆలస్యం కావడంతో ఓపెన్ ఆఫర్లో జాప్యం చోటు చేసుకుంది. అసెట్– లైట్ సర్వీసెస్ బిజినెస్ పోర్ట్‌ఫోలియోలో ఆదాయం, లాభాలు పెంచుకునే వ్యూహంలో భాగంగా మైండ్ ట్రీ కంపెనీని ఎల్ అండ్ టీ కొనుగోలు చేస్తోంది. మొత్తం రూ.10,700 కోట్లు... ఎల్ అండ్‌టీ కంపెనీ ఇప్పటికే మైండ్ ట్రీలో 35.15 శాతం వాటా షేర్లను కొనుగోలు చేసింది. తాజా ఓపెన్ ఆఫర్ పూర్తిగా సబ్‌స్క్రైబయితే మైండ్‌ట్రీలో ఎల్ అండ్ టీ వాటా 66 శాతానికి చేరుతుంది. మొత్తం మీద మైండ్ ట్రీలో 66 శాతం వాటా కోసం ఎల్ అండ్ టీ కంపెనీ రూ.10,700 కోట్లు వెచ్చిస్తోంది. వి.జి. సిద్ధార్థ, కాఫీ డే ట్రేడింగ్ లిమిటెడ్, కాఫీ డే ఎంటర్ప్రైజెస్ల నుంచి 20.15 శాతం వాటాకు సమానమైన 3.33 కోట్ల షేర్లను ఎల్ అండ్ టీ కొనుగోలు చేసింది. ఒక్కో షేర్‌కు రూ.980 చెల్లించింది. ఈ వాటా షేర్ల కోసం మొత్తం రూ.3,269 కోట్లను వెచ్చించింది. ఇక మార్చి 18న యాక్సిస్ క్యాపిటల్ లిమిటెడ్ ద్వారా 15 శాతం వాటాకు సమానమైన 2.48 కోట్ల షేర్లను రూ.2,434 కోట్లకు కొనుగోలు చేసింది. -
ఎల్ అండ్ టీ బై బ్యాక్‌కు సెబీ నో
ఇంజనీరింగ్ మేజర్ లార్సన్ అండ్ టుబ్రోకు సెబీ నిరాశను మిగిల్చింది. రూ. 9వేల కోట్ల విలువైన షేర్ల బై బ్యాక్ ఆఫర్‌కు సెబీ అనుమతినివ్వలేదు. ఈ మేరకు ఎల్ అండ్ టీ శనివారం రెగ్యులేటరీ సమాచారంలో తెలిపింది. సెబి నిబంధనలకు అనుగుణంలేని కారణంగా బై బ్యాక్ ఆఫర్‌ను తిరస్కరించిందని పేర్కొంది. కాగా ఈక్విటీ షేరు రూ. 1475 వద్ద సుమారు 6.1 కోట్ల షేర్లను బై బ్యాక్ చేయనున్నామని గత ఏడాది ఆగస్టులో ప్రతిపాదించింది. -
ఆ ఐదు కంపెనీలపై అమితప్రేమ
సాక్షి, అమరావతి: రాజధానిలో చేపట్టే ప్రాజెక్టులకు ఎక్కడా లేని విధంగా చదరపు అడుగుకు ఏడు వేల నుంచి పది వేల రూపాయలకుపైగా అంచనాలు రూపొందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. వాటిని ఎలాంటి పోటీ లేకుండా అస్మదీయ సంస్థలకు కట్టబెట్టేస్తోంది. కేవలం ఐదు నిర్మాణ సంస్థలకు నాలుగున్నరేళ్లలో రూ.25 వేల కోట్లకుపైగా పనుల్ని అప్పగించింది. ప్రతిపాదనల దశలోనే ముఖ్యమంత్రి నోటి మాటతో వందల కోట్ల రూపాయల పనుల్ని ఈ సంస్థలు చేజిక్కించుకుంటున్నాయి. కొన్ని కీలక ప్రాజెక్టుల ప్రతిపాదనలైతే ఆ ఐదు సంస్థలే తయారుచేసి ముఖ్యమంత్రి ఎదుట పెడుతుండగా.. ఆయన ఆమోదముద్ర వేసి వాటికే నిర్మాణ బాధ్యతల్ని అప్పగిస్తుండడం గమనార్హం. ఎల్ అండ్ టీ, ఎన్సీసీ, షాపూర్జీ పల్లోంజి, బీఎస్ఆర్ ఇన్ఫ్రా కంపెనీలకు 80 శాతానికిపైగా పనులు కేటాయించగా మిగిలిన పనుల్ని బీఎస్సీపీఎల్, మేఘ ఇంజినీరింగ్ కంపెనీలకు అప్పగించారు. ఎల్ అండ్ టీకి రూ.8 వేల కోట్ల పనులు.. ఇప్పటివరకూ రూ.39,875 కోట్ల విలువైన పనుల్ని చేపట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించగా.. అందులో ఒక్క ఎల్ అండ్ టీ సంస్థకే రూ.8 వేల కోట్లకు పైగా పనుల్ని కట్టబెట్టారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయాన్ని ఈ సంస్థే నిర్మించగా.. ఇటీవలే మొదలైన శాశ్వత సచివాలయంలోని మూడు, నాలుగు టవర్లు, కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జి, తాత్కాలిక హైకోర్టు భవన నిర్మాణంతోపాటు రెండు భూ సమీకరణ లేఅవుట్ల అభివృద్ధి ప్రాజెక్టులు, పలు రోడ్ల ప్రాజెక్టులనూ ఎల్ అండ్‌టీ కే అప్పగించారు. సీడ్ యాక్సెస్ రోడ్, శాశ్వత సచివాలయంలో జీఏడీ టవర్, ఐఏఎస్ అధికారుల నివాస భవనాలు, రోడ్ల ప్రాజెక్టుల్లో ఎక్కువ భాగం ఎన్సీసీ చేజిక్కించుకుని మొత్తంగా రూ.4,700 కోట్ల విలువైన పనులు చేస్తోంది. షాపూర్జీ పల్లోంజి సంస్థ రూ.3 వేల కోట్లకు పైగా పనుల్ని చేపట్టగా వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంతో పాటు శాశ్వత సచివాలయంలోని ఒకటి, రెండు టవర్లు.. పూర్తిస్థాయి హైకోర్టు భవనం, గెజిటెడ్ అధికారులు, ఉద్యోగుల నివాస భవనాలు, ఇతర పనులను అప్పగించారు. ఆ కంపెనీల అర్హతలే టెండర్ నిబంధనలు.. రూ.వేల కోట్ల విలువైన పనుల్ని ఈ కంపెనీలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం టెండర్ల ప్రక్రియను వారికి అనుకూలంగా మార్చేస్తోంది. ఏ ప్రాజెక్టును ఎవరికివ్వాలో ముందే నిర్ణయించేస్తున్న ప్రభుత్వ పెద్దలు.. ప్రాజెక్టు డిజైన్లు, అంచనాలను సైతం ఆ కంపెనీలతోనే తయారు చేయిస్తున్నారు. పనులు అప్పగించిన తర్వాత ఆ కంపెనీలకున్న అర్హతలనే నిబంధనలుగా టెండర్లలో పెడుతుండడంతో ఇతర కంపెనీలకు అవకాశం దక్కడం లేదు. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణాన్ని ఎల్ అండ్ టీ, షాపూర్జీ పల్లోంజి సంస్థలకు అప్పగించేందుకు టెండర్లలో ప్రి కాస్ట్ భవనాలు నిర్మించిన అనుభవం ఉండాలనే నిబంధన పెట్టారు. దీంతో దేశంలో ఎన్నో భవనాలు నిర్మించిన కంపెనీలు కూడా ఈ పనులకు అర్హత సాధించలేకపోయాయి. కానీ ఎల్ అండ్ టీ ప్రి కాస్ట్ కాకుండా సాధారణ గోడల్నే కట్టేసి.. ఆ తర్వాత నిబంధనలను మార్పు చేయించుకుంది. భవన నిర్మాణాలతో సంబంధం లేకుండా ఎస్టీపీ, రోడ్ల నిర్మాణం, అంతర్గత వసతుల పనులు చేసి ఉండాలనే నిబంధనను విధించడం ద్వారానే ఎల్ అండ్ టీ, షాపూర్జీ పల్లోంజి, ఎన్సీసీ కంపెనీలకు రూ.వేల కోట్ల విలువైన పనుల్ని కట్టబెట్టారు. పలు రోడ్ల పనుల్ని సైతం వారికే అప్పగించి వాటితో సంబంధం లేని పనులు కూడా చేసి ఉండాలనే నిబంధనలు విధించారు. సర్కార్ పెద్దల కమీషన్లకు భయపడి.. రాజధాని నిర్మాణ వ్యవహారాలు చేపట్టిన సీఆర్డీఏ, ఏడీసీ (అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్) ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన కంపెనీలతో కుమ్మక్కై నిబంధనలు వారికి అనుకూలంగా రూపొందిస్తున్నాయి. రాజధాని నిర్మాణంలో పాలుపంచుకుందామని మొదట్లో టాటా కనస్ట్రక్షన్స్ వంటి కంపెనీలు ముందుకు వచ్చినా.. సర్కారు అనుకూల కంపెనీల ముందు నిలవలేకపోయాయి. సింగపూర్, ఇతర దేశాలకు చెందిన కంపెనీలు సైతం సర్కారు పెద్దల కమీషన్ల డిమాండ్లతో అవాక్కై వెనక్కి వెళ్లిపోయాయి. దీంతో పోటీ లేకుండా తాము తయారుచేసిన అంచనాల ప్రకారమే ప్రాజెక్టులు దక్కించుకుని ఆ కంపెనీలు లాభాలు పండించుకుంటుండగా.. సర్కారు పెద్దలు కమీషన్ల మత్తులో మునిగి మిగిలిన పనుల్నీ వారికే కేటాయించేందుకు వ్యూహ రచన చేస్తున్నారు. -
ఎల్ అండ్ టీ లాభం రూ.2,593 కోట్లు
న్యూఢిల్లీ: మౌలిక రంగ దిగ్గజం లార్సెన్ అండ్ టుబ్రో (ఎల్ అండ్ టీ) నికర లాభం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో 28 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.2,020 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.2,593 కోట్లకు పెరిగిందని ఎల్ అండ్ టీ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.26,846 కోట్ల నుంచి రూ.32,506 కోట్లకు ఎగసింది. మొత్తం వ్యయాలు రూ.24,308 కోట్ల నుంచి రూ.29,225 కోట్లకు పెరిగాయి. ఎబిటా రూ.2,962 కోట్ల నుంచి 27 శాతం వృద్ధితో రూ.3,771 కోట్లకు ఎగసిందని, నిర్వహణ మార్జిన్ 11.8 శాతానికి చేరిందని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 12–15 శాతం, ఆర్డర్లు 10–12 శాతం రేంజ్లో పెరగగలవని కంపెనీ అంచనా వేస్తోంది. ఆర్డర్లు 46 శాతం అప్ ఈ సెప్టెంబర్ క్వార్టర్లో గ్రూప్ కంపెనీలన్నింటి ఆర్డర్లు 46 శాతం పెరిగి రూ.41,921 కోట్లకు ఎగిశాయని ఎల్ అండ్ టీ తెలిపింది. ఈ మొత్తం ఆర్డర్లలో అంతర్జాతీయ ఆర్డర్ల వాటా 20 శాతంగా (రూ.8,268 కోట్లు) ఉందని పేర్కొంది. మౌలిక రంగ ఆర్డర్లు 69 శాతం వృద్ధితో రూ.23,406 కోట్లకు పెరిగాయి. భారీ ఇంజినీరింగ్ విభాగం రూ.1,296 కోట్ల తాజా ఆర్డర్లను చేజిక్కించుకోగా... డిఫెన్స్ ఇంజినీరింగ్ విభాగం ఆదాయం 6 శాతం తగ్గి రూ.930 కోట్లకు పరిమితమయింది. విద్యుత్తు విభాగం ఆదాయం 36 శాతం తగ్గి రూ.1,059 కోట్లకు చేరింది. ఎలక్ట్రికల్, ఆటోమేషన్ విభాగం ఆదాయం 14 శాతం పెరిగి రూ.1,403 కోట్లకు చేరింది. దివాలా చట్టం కారణంగా మొండి బకాయలు రికవరీ అవుతున్నాయని, ఇది బిజినెస్ సెంటిమెంట్‌ను మెరుగుపరిచిందని కంపెనీ తెలిపింది. కమోడిటీల ధరలు పెరగడం, రూపాయి బలహీనత, ముడి చమురు ధరల పెరుగుదల, లిక్వడిటీ సమస్యలు, తదితర సమస్యలు కారణంగా ప్రైవేట్ రంగంలో పెట్టుబడులకు సంబంధించి అప్రమత్త వాతావరణం నెలకొన్నదని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఎల్ అండ్ టీ షేర్ 2.11 శాతం లాభంతో రూ.1,298 వద్ద ముగిసింది. -
భారత ఇంజనీరింగ్ నైపుణ్యానికి ప్రతీక
న్యూఢిల్లీ: ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’(ఐక్యతా విగ్రహం) కేవలం సర్దార్ వల్లభ్‌భాయ్‌కి మాత్రమే ఘన నివాళే అని కాకుండా భారత ఇంజనీరింగ్ నైపుణ్యాలకూ గొప్ప ప్రతీక అని నిర్మాణరంగ దిగ్గజం ఎల్అండ్టీ పేర్కొంది. ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహంగా గుర్తింపు పొందిన చైనా స్ప్రింగ్ దేవాలయాల్లో ఉన్న బుద్ధ విగ్రహం (153 మీ.) నిర్మాణానికి 11 ఏళ్లు పడితే..ఆ రికార్డ్‌ను బ్రేక్ చేస్తూ ఎల్అండ్టీ ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ని కేవలం 33 నెలల్లోనే పూర్తి చేసినట్లు వెల్లడించింది. విగ్రహాన్ని రోడ్డు మార్గంలో నుంచి చూస్తే 182 మీటర్లు, నదీ మార్గం నుంచి చూస్తే 208.5 మీటర్ల ఎత్తు ఉంటుంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ (93 మీ.) కంటే ఇది రెట్టింపు ఎత్తు ఉంటుంది. రూ.2,989 కోట్లతో నిర్మితమైన ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ని అక్టోబర్ 31న ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఈ స్టాట్యూను 5 జోన్లుగా విభజించారు. మొదటి జోన్లో మెమోరియల్ గార్డెన్, మ్యూజియం, రెండో జోన్లో 149 మీ. విగ్రహమే ఉంటుంది. మూడో జోన్లో 153 మీ. వరకు గ్యాలరీ, నాలుగో జోన్లో మెయింట నెన్స్ ఏరియా, ఐదో జోన్లో పటేల్ భుజాలు, తల ఉంటుందని ఎల్అండ్టీ పేర్కొంది. గ్యాలరీలో ఒకేసారి 200 మంది తిరగవచ్చు. -
హైదరాబాద్ ఎయిర్‌పోర్టు విస్తరణ...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ పనుల కాంట్రాక్టులను ఎల్ అండ్ టీ, మెగావైడ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ దక్కించుకున్నాయి. ఇందులో ఎల్ అండ్ టీ కాంట్రాక్టు విలువ రూ.3,028 కోట్లు కాగా మెగావైడ్ దక్కించుకున్న కాంట్రాక్టు విలువ రూ.980 కోట్లు. జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈ మేరకు రెండు సంస్థలకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ చేసినట్లు జీఎంఆర్ ఇన్ఫ్రా ఎక్సే్చంజీలకు తెలిపింది. కాంట్రాక్టుల ప్రకారం టెర్మినల్ భవంతి విస్తరణతో పాటు ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించిన పనులను 42 నెలల్లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. తద్వారా ప్రస్తుతం వార్షికంగా 1.2 కోట్ల ప్రయాణికులుగా ఉన్న సామర్థ్యాన్ని 3.4 కోట్లకు పెంచనున్నట్లు జీఎంఆర్ పేర్కొంది. -
సెప్టెంబర్ 1న ఎల్బీనగర్–అమీర్‌పేట్ మెట్రో రన్
సాక్షి, హైదరాబాద్: ఎల్బీనగర్–అమీర్‌పేట్ మార్గంలో మెట్రో ప్రారంభానికి ముహూర్తం కుదిరింది. సెప్టెంబర్ ఒకటి నుంచి మెట్రో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మెట్రో రైలు మేనేజింగ్ డైరెక్టర్ కేవీబీ రెడ్డి తెలిపారు. ఈ మార్గంలో అన్ని పనులు, పరీక్షలు పూర్తయ్యాయని.. ట్రయల్ రన్ ముమ్మరంగా సాగుతుందని చెప్పారు. వాణిజ్య కార్యకలాపాలకు సంబంధించి కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్వే సేఫ్టీ (సీఎంఆర్ఎస్) ధ్రువీకరణ పొందేందుకు జూలై 31న ఆ సంస్థకు దరఖాస్తు సమర్పించామన్నారు. ఇండిపెండెంట్ సేఫ్టీ అసెసర్ (ఐఎస్ఏ), హాల్క్రో (యూకే) సంస్థలు సిగ్నలింగ్ వ్యవస్థ భద్రతను పరీక్షిస్తున్నాయని చెప్పారు. ఇండిపెండెంట్ సేఫ్టీ అసెస్మెంట్ సర్టిఫికెట్ అందిన తర్వాత సీఎంఆర్ఎస్ ప్రతినిధులు ఎల్బీనగర్–అమీర్‌పేట్ సెక్షన్‌ను పరిశీలించి భద్రతా ధ్రువీకరణ జారీ చేస్తారన్నారు. అన్ని స్టేషన్లకూ ఫీడర్ బస్సులు ఇప్పటివరకు 2.75 లక్షల మెట్రో స్మార్ట్ కార్డులు గ్రేటర్ సిటిజన్లు కొనుగోలు చేసినట్లు ఎల్అండ్టీ ప్రతినిధులు తెలిపారు. అన్ని మెట్రో స్టేషన్ల నుంచి సమీపంలోని కాలనీలు, బస్తీలకు ఫీడర్ బస్సు సర్వీసులను ఆర్టీసీ సహకారంతో అందుబాటులో ఉంచామన్నారు. మియాపూర్, జేఎన్టీయూ, కేపీహెచ్‌బీ, కూకట్పల్లి, అమీర్‌పేట్, బేగంపేట్, ప్రకాశ్‌నగర్, రసూల్‌పురా, ప్యారడైజ్, పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్, హబ్సిగూడ, ఎన్జీఆర్ఐ, ఉప్పల్, నాగోల్ తదితర 15 మెట్రో స్టేషన్లలో ప్రయాణికులకు లాస్ట్ మైల్ కనెక్టివిటీని సాకారం చేసేందుకు అత్యాధునిక సైకిళ్లు, స్మార్ట్ బైకులు, పీఈడీఎల్, మెట్రో బైకులు, డ్రైవ్‌జీ వాహనాలు లభ్యమవుతున్నాయని చెప్పారు. మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద సొంతంగా నడుపుకుని వెళ్లేందుకు వీలుగా జూమ్‌కార్ విద్యుత్ వాహనాలు.. మియాపూర్, పరేడ్ గ్రౌండ్స్ మెట్రో స్టేషన్ల వద్ద జూమ్‌కార్ పెట్రోల్, డీజిల్ వాహనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. పలు మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్ సదుపాయమూ అందుబాటులో ఉందని చెప్పారు. ప్యారడైజ్ స్టేషన్ ఫుట్ఓవర్ బ్రిడ్జీని ప్రారంభించడం ద్వారా ప్యారడైజ్ సర్కిల్, పీజీ రోడ్, ఎంజీ రోడ్ తదితర ప్రాంతాలకు చేరుకోవడం సులభమవుతోందన్నారు. ప్రకాశ్‌నగర్ మెట్రో స్టేషన్ వద్ద ఆర్మ్‌డీ ఎంట్రీ, ఎగ్జిట్ పూర్తికావడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తొలిగాయని చెప్పారు. -
ఆగస్టులో అమీర్‌పేట్–ఎంజీబీఎస్ మెట్రో
సాక్షి,సిటీబ్యూరో : అమీర్‌పేట్–ఎంజీబీఎస్ మార్గంలో మెట్రో రైళ్ల ట్రయల్‌రన్‌కు మార్గం సుగమమైంది. ఈ మార్గంలో మెట్రో ట్రాక్ విద్యుదీకరణ ప్రక్రియ, సెక్షన్ ఓవర్‌హెడ్ ఎలక్ట్రిక్ ట్రాక్షన్ సిస్టం(ఓఈటీఎస్)ను గురువారం కేంద్ర ప్రభుత్వ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ డీవీఎస్ రాజు తనిఖీచేసి సంతృప్తి వ్యక్తంచేశారు. ఈ ట్రాక్షన్ సిస్టంకు అవసరమైన విద్యుత్ ఎంజీబీఎస్, మియాపూర్‌లలో నిర్మించిన 132 కెవి/25 కెవి రిసీవింగ్ సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్‌ను అందుకుంటుంది. ఈ ఆర్ఎస్ఎస్కు ఇన్కమింగ్ సరఫరా టీఎస్ ట్రాన్స్‌కోకు చెందిన 220 కెవి/132 కెవి మెయిన్ సబ్‌స్టేషన్ నుంచి సరఫరా అవుతుందని మెట్రో అధికారులు తెలిపారు. కాగా ఈ ప్రక్రియ పూర్తికావడంతో ఈ మార్గంలో మెట్రో రైళ్లకు 18 రకాల సాంకేతిక పరీక్షలను నిర్వహించేందుకు మార్గం సుగమమౌతోందని తెలిపారు. ఆగస్టులో ఎల్బీనగర్–అమీర్‌పేట్ రూట్లో మెట్రో పరుగులు.. ఈ ఏడాది ఆగస్టునెలలో ఎల్బీనగర్–అమీర్పేట్మార్గంలో మెట్రో రైళ్లు ప్రయాణీకులకు అందుబాటులోకి రానున్నట్లు తెలిసింది. జూలై నెలలో ఈ మార్గంలో ట్రయల్‌రన్ ప్రక్రియను పూర్తిచేసేందుకు మెట్రో అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కాగా ప్రారంభతేదీని మాత్రం ప్రభు త్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక అమీర్‌పేట్–హైటెక్‌సిటీమార్గంలో అక్టోబరులో,ఎంజీబీఎస్–జేబీఎస్మార్గంలో ఈ ఏడాది డిసెంబరు నాటికి మెట్రో రైళ్లు గ్రేటర్ సిటీజన్లకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మెట్రో అధికారులు యుద్ధప్రాతిపదికన పనులు చేపడుతున్నారు. -
బెజవాడ మెట్రో రైలుకు మంగళం
-
అటకెక్కిన బెజవాడ మెట్రో!?
సాక్షి, అమరావతి: విజయవాడలో మెట్రో రైలును పరుగులు పెట్టిస్తామని కొద్దికాలం వరకూ హడావుడి చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఆ విషయాన్నే మరచిపోయింది. పనులు ప్రారంభమయ్యే దశలో మీడియం మెట్రో ప్రాజెక్టును రద్దు చేసుకుని లైట్ మెట్రో వైపు వెళ్లిన ప్రభుత్వం ఇప్పుడు దాన్నీ పట్టించుకోడంలేదు. రాష్ట్ర ప్రభుత్వ తీరుతో కేంద్రం కూడా ఈ ప్రాజెక్టును పట్టించుకోలేదు. ఈసారి బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. అసలు ఇప్పటివరకూ లైట్ మెట్రో రైలు ప్రాజెక్టు సవివర నివేదిక (డీపీఆర్) రూపకల్పనకే ముందడుగు పడలేదు. దీంతో మెట్రో ప్రాజెక్టు ఉంటుందో లేదోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యాపారుల ఒత్తిడికి తలొగ్గి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తిగా పక్కన పెట్టేసిందనే ప్రచారం జరుగుతోంది. విజయవాడ నగరంలో మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం మూడేళ్ల క్రితం శ్రీధరన్ నేతృత్వంలోని ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ (డీఎంఆర్సీ)తో డీపీఆర్ (సవివర నివేదిక) తయారుచేయించి ఆమోదించింది. రూ.7,200 కోట్లతో బందరు, ఏలూరు రోడ్లలో రెండు కారిడార్లుగా ఈ ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించి దాని నిర్మాణ బాధ్యతను కూడా డీఎంఆర్‌సీకే ప్రభుత్వం అప్పగించింది. డిజైన్లు, ఎలైన్మెంట్ సహా అన్ని పనులను డీఎంఆర్సీ పూర్తిచేసి ప్రాజెక్టు నిర్మాణానికి రెండుసార్లు టెండర్లు కూడా పిలిచింది. అయితే, టెండర్లు ఖరారు చేసి పనులు ప్రారంభించాల్సిన సమయంలో ప్రభుత్వం హఠాత్తుగా అసలు ఈ ప్రాజెక్టే వద్దని యూ టర్న్ తీసుకుంది. ఎల్ అండ్ టీకి శ్రీధరన్ నిరాకరణ ఎల్ అండ్ టీ సంస్థకు ప్రాజెక్టు పనులు అప్పగించాలని ప్రభుత్వం ఒత్తిడి చేయడం, 30 శాతం అదనంతో ఆ సంస్థ దాఖలు చేసిన టెండర్లపై శ్రీధరన్ అసంతృప్తి వ్యక్తంచేసి టెండర్లనే రద్దు చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఎల్ అండ్ టీకి పనులు అప్పగించేందుకు ఆయన నిరాకరించిన నేపథ్యంలో ప్రభుత్వం ఏకంగా ప్రాజెక్టునే రద్దుచేసింది. మరోవైపు.. ఈ ప్రాజెక్టువల్ల బందరు, ఏలూరు రోడ్లకిరువైపులా ఉన్న తమ సంస్థల వ్యాపారం దెబ్బతింటుందని బడా వ్యాపారులంతా గగ్గోలు పెట్టారు. కేంద్రమంత్రి సుజనాచౌదరి ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. ఒకవైపు వ్యాపారుల ఒత్తిడి, మరోవైపు అదనపు రేటుకు తాను చెప్పిన కంపెనీకి పనులిచ్చే పరిస్థితి లేకపోవడంతో ప్రభుత్వం మెట్రో ప్రాజెక్టును అటకెక్కించినట్లు తెలుస్తోంది. తెర మీదకు లైట్‌మెట్రో ఇదిలా ఉంటే.. తక్కువ వ్యయంతో లైట్ మెట్రో ప్రాజెక్టును చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి దాని డీపీఆర్ బాధ్యతను జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్లు్య సంస్థకు అప్పగించింది. వాస్తవానికి మెట్రో ప్రాజెక్టుకు రుణం ఇచ్చే విషయాన్ని పరిశీలించేందుకు కేఎఫ్‌డబ్లు్య ఇక్కడకు వచ్చింది. దానికి డీపీఆర్ బాధ్యత అప్పగించడంతో ఇప్పటివరకూ ఆ పని పూర్తిస్థాయిలో మొదలుకాలేదు. ఆ సంస్థ ఉత్సాహంగా ఉన్నా ప్రభుత్వం దీని గురించి పట్టించుకోవడం మానేసింది. ఈ నేపథ్యంలో అసలు లైట్ మెట్రో అయినా పట్టాలెక్కుతుందా లేదో అనుమానంగానే మారింది. ఒకవేళ కేఎఫ్‌డబ్లు్య సంస్థ డీపీఆర్ రూపకల్పన పనిని వెంటనే ప్రారంభించినా అది పూర్తయ్యేసరికి ఆరు నెలలు పడుతుంది. ఆ తర్వాత భూసేకరణ, ఇతర పనులకు సమయం కావాలి. అంటే ఇప్పట్లో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే పరిస్థితి ఏమాత్రం కనిపించడంలేదు. మరోవైపు, ప్రభుత్వ పెద్దలే కావాలని మెట్రోను పక్కన పెట్టేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. బెజవాడ మెట్రో రైలు ప్రస్థానం ఇలా.. జులై 2014: విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు సలహాదారుగా శ్రీధరన్ నియామకం సెప్టెంబర్ 2014 : డీఎంఆర్సీకి మెట్రో ప్రాజెక్టు డీపీఆర్ (సవివర నివేదిక) రూపకల్పన బాధ్యత అప్పగింత ఏప్రిల్ 2015 : ప్రభుత్వానికి డీపీఆర్ సమర్పించిన డీఎంఆర్సీ. ప్రాజెక్టు వ్యయం రూ.6769 కోట్లు. బస్టాండ్–పెనమలూరు, బస్టాండ్–నిడమానూరు కారిడార్లను 26 కిలోమీటర్ల మేర నిర్మాణానికి ప్రతిపాదన. 70 ఎకరాల భూసేకరణ.. ఇందుకు అదనంగా రూ.431 కోట్లు ఖర్చు అంచనా మే 2015 : డీఎంఆర్సీ ఇచ్చిన డీపీఆర్‌ను ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 2015 : మెట్రో ప్రాజెక్టు నిర్మాణం కోసం స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) ఏర్పాటు. దానికి అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ (ఏఎంఆర్‌సీ)గా నామకరణం. ఫిబ్రవరి 2016: మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధుల కోసం జపాన్‌కు చెందిన జైకాతో చర్చలు జూన్ 2016: ప్రాజెక్టును రెండు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచిన డీఎంఆర్సీ ఆగస్టు 2016: టెండర్లను రద్దు చేసిన డీఎంఆర్సీ డిసెంబర్ 2016: జైకాతో రుణం మంజూరు చర్చలు విఫలం మార్చి 2017: నూతన మెట్రో విధానాన్ని రూపొందిస్తున్న నేపథ్యంలో ప్రస్తుత విజయవాడ మెట్రో ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం ఆగస్టు 2017: ప్రాజెక్టు కోసం రెండోసారి టెండర్లు పిలిచిన ఏఎంఆర్‌సీ అక్టోబర్ 2017 : మళ్లీ టెండర్లు రద్దు చేసిన ఏంఎఆర్‌సీ నవంబర్ 2017 : విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు స్థానంలో ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన నవంబర్ 2017: డీఎంఆర్‌సీతో తెగతెంపులు, జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూతో లైట్ మెట్రో ప్రాజెక్టు గురించి చర్చలు నవంబర్ 2017: విజయవాడకు లైట్ మెట్రో ప్రాజెక్టు తీసుకొస్తామని ప్రకటించిన చంద్రబాబు, డీపీఆర్ ఇవ్వాలని కేఎఫ్డబ్లు్యకు బాధ్యత. -
స్టాక్స్ వ్యూ
ఎల్ అండ్ టీ - కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ.1,413 టార్గెట్ ధర: రూ.1,540 ఎందుకంటే: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి రెండు క్వార్టర్లు బలహీనంగా ఉన్న ఆర్డర్ల వృద్ధి ఈ క్యూ3లో పుంజుకుంది. ఈ క్యూ3లో ఇప్పటికే రూ.37,300 కోట్ల ఆర్డర్లు సాధించింది.మొత్తం మీద ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్డర్లు 5 శాతం వరకూ వృద్ధి చెంది రూ.1.5 లక్షల కోట్లకు చేరతాయని భావిస్తున్నాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో 15 శాతంగా ఉన్న దేశీయ ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్ విభాగం వృద్ధి ఈ క్యూ2లో 5 శాతానికే పరిమితమైంది. జీఎస్టీ సంబంధిత సమస్యలే దీనికి ప్రధాన కారణం. జీఎస్టీ సమస్యలు క్రమక్రమంగా తగ్గుతుండటంతో ఈ విభాగం వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10%, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 12%గా ఉండగలదని అంచనా. 2015–16 ఆర్థిక సంవత్సరం చివరికల్లా 25 శాతంగా(నికర అమ్మకాల్లో) ఉన్న నెట్ వర్కింగ్ క్యాపిటల్(ఎన్డబ్ల్యూసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో 20 శాతానికి తగ్గింది. జీఎస్టీ కింద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందడానికి సుదీర్ఘమైన జాప్యం జరుగుతుండడం, దేశీయ ఆర్డర్ల అమలులకు భారీగా వర్కింగ్ క్యాపిటల్ అవసరమవుతుండడం వంటి కారణాల వల్ల ఈ క్యూ3లో కూడా ఎన్డబ్ల్యూసీ 20 శాతం రేంజ్‌లోనే ఉండనున్నదని అంచనా వేస్తున్నాం. 2020–21 ఆర్థిక సంవత్సరం కల్లా ఎన్డబ్ల్యూసీని 18 శాతంగా (నికర అమ్మకాల్లో) సాధించాలని కంపెనీ ‘లక్ష్య’ వ్యూహాత్మక ప్రణాళిక నిర్దేశించింది. దీనికనుగుణంగానే కంపెనీ చర్యలు తీసుకుంటోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం అంచనా షేర్ వారీ ఆర్జన(ఈపీఎస్)కు 22 రెట్ల ధరకు ప్రస్తుతం ఈ షేర్ ట్రేడవుతోంది. సమ్ ఆఫ్ ద పార్ట్స్(ఎస్ఓటీపీ) ప్రాతిపదికన టార్గెట్ ధరను రూ.1,540గా నిర్ణయించాం. ఏడాదిలోగా ఈ షేర్ ఈ ధరను చేరగలదని భావిస్తున్నాం. ప్రభుత్వ వ్యయంలో భారీగా కోత ఏర్పడడం, పశ్చిమాసియా ప్రాంతం(ఇక్కడే ఈ కంపెనీ భారీ ఆర్డర్లను సాధించింది)లో ముడి చమురు ధరలు బాగా పతనం కావడం ప్రతికూలాంశాలు. జీ ఎంటర్టైన్మెంట్ - కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్ ప్రస్తుత ధర: రూ.595 టార్గెట్ ధర: రూ.640 ఎందుకంటే: జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. ప్రకటనల ఆదాయం 26శాతం పెరగడంతో మొత్తం ఆదాయం రూ.1,838 కోట్లకు పెరిగింది. చందా ఆదాయం మాత్రం 16 శాతం క్షీణించి రూ.502 కోట్లకు తగ్గింది. స్పోర్ట్స్వ్యాపారం నుంచి ఈ కంపెనీ నిష్క్రమించడం, అంతర్జాతీయ చందా ఆదాయం బలహీనంగా ఉండడం దీనికి ప్రధాన కారణాలు. మొత్తం ఆదాయం పెరగడంతో ఇబిటా కూడా పుంజుకుంది. ఇబిటా రూ.594 కోట్లుగా ఉండగా, ఇబిటా మార్జిన్లు 1 శాతం వృద్ధితో 32.3 శాతానికి ఎగిశాయి. ప్రకటనల ఆదాయం వృద్ధి, మార్జిన్ల విషయంలో ఈ రంగంలో అగ్రస్థానం ఈ కంపెనీదే. కంటెంట్‌పై తగిన విధంగా వ్యయం చేయడం, ప్రాంతీయ చానెళ్లు పటిష్టంగా ఉండడం వంటి కారణాల వల్ల ఇతర బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీల కంటే మంచి వృద్ధి సాధిస్తోంది. ఈ క్యూ3లో రూ.322 కోట్ల నికర లాభం సాధించింది. పన్ను కేటాయింపులు అధికంగా ఉండటం నికర లాభంపై ప్రతికూల ప్రభావం చూపించింది. స్పోర్ట్స్యేతర ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్ వ్యూయర్షిప్ మార్కెట్ షేర్ 2 శాతం వృద్ధితో 18.3 శాతానికి ఎగసింది. ‘జడ్ఫైవ్’ పేరుతో డిజిటల్ వెంచర్‌ను వచ్చే నెలలో ఈ కంపెనీ అందుబాటులోకి తేనున్నది. డిజిటల్ సెగ్మెంట్లో మార్జిన్లు 30 శాతానికి పైగానే ఉండగలవన్న అంచనాలున్నాయి. రెండేళ్లలో నికర ఆదాయం 15 శాతం చొప్పున చక్రగతి వృద్ధితో రూ.5,560 కోట్లకు, చందా ఆదాయం 6 శాతం చక్రగతి వృద్ధితో రూ.2,696 కోట్లకు పెరుగుతాయని అంచనా వేస్తున్నాం. 2019–20 ఆర్థిక సంవత్సరం అంచనా పీ/ఈకి 20 రెట్ల ధరను టార్గెట్ ధరగా నిర్ణయించాం. ట్రాయ్ కొత్త టారిఫ్ నిబంధనల కారణంగా డిస్ట్రిబ్యూషన్ భాగస్వాములతో కంటెంట్ డీల్స్ కుదరడంలో జాప్యం జరుగుతుండడం..ప్రతికూలాంశం. -
ఎల్ అండ్ టీకి బారీ ఆర్డర్లు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ ఇంజనీరింగ్, నిర్మాణ సంస్థ లార్సన్ టుబ్రో భారీ ఆర్డర్‌ను సాధించింది. ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్అథారిటీ (ఎపీ సీఆర్డీఏ)నుంచి రూ.2,265 కోట్ల కాంట్రాక్టును ఆర్జించింది. అమరావతి క్యాపిటల్ సిటీ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, డిజైన్లు కల్వర్టు, నీటి సరఫరా, మురుగునీరు, మురుగునీటి శుద్ధి కర్మాగారాలు, విద్యుత్తు యుటిలిటీ డక్ట్స్ తదితర నిర్మాణ పనులు చేపట్టనున్నట్టు సోమవారం వెల్లడించింది ఏపీ రాజధాని అమరావతి రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి ఈ ఆర్డర్లు ఆర్జించినట్లు ఎల్ అండ్ టి బీఎస్ఈ ఫైలింగ్‌లో పేర్కొంది. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రవాణా వ్యవస్థ నీరు, నీటి పారుదల రంగాల నుంచి ఉమ్మడిగా మూడు ఈపీసీ ఆర్డర్లను సాధించినట్టు తెలిపింది. రాజధాని నగరంలో 6, 7, 10 జోన్లలో ఈ పనులు నిర్వహించనుంది. మూడు ఎపిసి ఆర్డర్లు జారీ చేశాయి" అని ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మేజర్ బిఎస్ఇ ఫైలింగ్‌లో పేర్కొంది. దీంతో సోమవారం నాటి ట్రేడింగ్ ఎల్ అండ్‌టీ షేరు భారీ లాభాలను ఆర్జిస్తోంది. -
నా చావుకు ఎవరూ కారణం కాదని..!
ఎన్ఏడీ జంక్షన్(విశాఖ పశ్చిమ): మురళీనగర్ ఈస్ట్ అయ్యప్పనగర్‌కు చెందిన కడలి సత్యలావణ్య(28) బలవన్మరణానికి పాల్పడింది. బుధవారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి కంచరపాలెం పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సత్యలావణ్య ఎల్అండ్టీలో ఇంజినీర్‌గా పనిచేస్తోంది. బుధవారం ఉదయం తమ్ముడు రవిశంకర్ తల్లికి అనారోగ్యంగా ఉందని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో గదిలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని అత్మహత్యకు పాల్పడింది. ఆస్పత్రి నుంచి వచ్చిన వారు చూసి వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. కంచరపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేసుకుని వివరాలు సేకరించారు. గదిలో లావణ్య రాసిన సూసైడ్ నోటు లభించింది. ‘నా చావుకు ఎవరూ కారణం కాదని, అందరూ తనని క్షమించాలని, తన వల్లే అన్నయ్య ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని, అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలని’ అందులో రాసి ఉంది. అయితే లావణ్యకు పెళ్లిసంబంధం కుదిరిందని తెలిసింది. తల్లి క్యాన్సర్‌తో బాధపడుతోందని, ఈ పరిస్థితులను చూసి మనస్తాపంతో మృతి చెంది ఉంటుందని లావణ్య తమ్ముడు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
కనిష్టం రూ.10.. గరిష్టం రూ.60
సాక్షి, హైదరాబాద్: మెట్రో రైలు కనీస, గరిష్ట చార్జీలను ఎట్టకేలకు నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ మెట్రోరైల్ హైదరాబాద్ లిమిటెడ్ ప్రకటించింది. మెట్రో రైలులో కనీస చార్జీ రూ.10.. గరిష్ట చార్జీ రూ.60 ఉంటుందని శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. మెట్రోను ఈ నెల 28న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్న విషయం విదితమే. అయి తే ఈ నెల 29 నుంచి.. ఉదయం 6 – రాత్రి 10 గంటల వరకు మెట్రో రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. మెట్రో చార్జీలను సెంట్రల్ మెట్రో యాక్ట్ ప్రకారం ఖరారు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. నగర మెట్రో కనీస, గరిష్ట చార్జీలు ఢిల్లీ, బెంగళూరు, చెన్నై మహానగరాలకు దాదాపు సరిసమానంగా ఉండటం గమనార్హం. తొలిదశ మార్గాల్లో మెట్రో చార్జీలిలా నాగోల్–అమీర్‌పేట మార్గంలో 17 కి.మీ. మెట్రో రైళ్లలో ప్రయాణిస్తే రూ.45 చెల్లించాల్సి ఉంటుంది. ఇక మియాపూర్–అమీర్‌పేట మార్గంలో 13 కి.మీ.లకు రూ.40 చార్జీ చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. 29 నుంచి స్మార్ట్‌కార్డులు, టోకెన్ల విక్రయం... మెట్రో రైళ్లలో టికెట్ల గోల లేకుండా ప్రయాణించేందుకు విడుదల చేసిన నెబ్యులా స్మార్ట్‌కార్డు ధర రూ.100.. దీనికి మరో రూ.100 చెల్లించి రీచార్జీ చేసుకోవాలి. అంటే స్మార్ట్‌కార్డు కొనుగోలుకు మొత్తంగా రూ.200 చెల్లించాలన్నమాట. ఈ స్మార్ట్‌కార్డులను ఈ నెల 29 నుంచి నాగోల్, తార్నాక, ప్రకాశ్‌నగర్, ఎస్.ఆర్.నగర్ మెట్రో స్టేషన్లలో విక్రయిస్తారు. ఎక్కే.. దిగే స్టేషన్ల వద్దనున్న ఆటోమేటిక్ ఫెయిర్ కలెక్షన్ గేట్ల వద్ద ఈ కార్డులను స్వైప్‌చేస్తే ప్రయాణించిన దూరానికి చార్జీ కట్ అవుతుంది. స్మార్ట్‌కార్డుపై ఐదు శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు ఎల్అండ్టీ ప్రకటించింది. మెట్రో జర్నీకి వినియోగించే టోకెన్లు సైతం ఈ నెల 29 నుంచి అందుబాటులోకి రానున్నాయన్నారు. -
హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలివే!
ఎప్పుడెప్పుడు మెట్రో రైలులో ప్రయాణిద్దామా అని ఎదురుచూస్తున్న నగర వాసుల కోరిక మరో మూడు రోజుల్లో నెరవేరబోతుంది. ఈ నెల 28వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరుగబోతుంది. ఈ సందర్భంగా మెట్రో రైలు ఛార్జీలను ఎల్అండ్టీ నేడు(శనివారం) ప్రకటించింది. మెట్రో రైళ్లలో ప్రయాణించాలంటే కనిష్ట ధర రూ.10గా ఎల్అండ్టీ తెలిపింది. 2 నుంచి 4 కిలోమీటర్లు ప్రయాణించాలంటే రూ.15 ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా 4 నుంచి 6 కిలోమీటర్ల జర్నీకి రూ.25 ఛార్జీ, 6 నుంచి 8 కిలోమీటర్లు ప్రయాణించాలంటే రూ.30 ఛార్జీగా, 8 నుంచి 10 కిలోమీటర్ల జర్నీకి 35 రూపాయలుగా ప్రకటించింది. అదేవిధంగా 10 నుంచి 14 కిలోమీటర్ల ప్రయాణానికి రూ.40 ఛార్జీని విధించబోతున్నట్టు పేర్కొంది. 14 నుంచి 18 కిలోమీటర్లకు 45 రూపాయల ఛార్జీ, 18 నుంచి 22 కిలోమీటర్లకు రూ.50 ఛార్జీ, 22 నుంచి 26 కిలోమీటర్ల ప్రయాణానికి 55 రూపాయలు, 26 కిలోమీటర్ల కంటే ఎక్కువ ప్రయాణానికి 60 రూపాయల ఛార్జీని వసూలు చేయబోతున్నట్టు ఎల్అండ్టీ తెలిపింది. మెట్రో స్మార్ట్‌కార్డు ధర రూ.200 కాగ, 100 రూపాయల నుంచి ఎంతైనా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ కార్డులను ఈనెల 29 నుంచి అన్ని మెట్రో స్టేషన్లలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనుగోలు చేసుకోవచ్చని ఎల్అండ్టీ పేర్కొంది. మెట్రో స్టేషన్లు : నాగోల్ తార్నాకా ప్రకాష్ నగర్ ఎస్ఆర్ నగర్ ఎల్అండ్టీ నేడు ప్రకటించిన ఈ మెట్రో ఛార్జీలు సాధారణ బస్సు ఛార్జీల కంటే ఎక్కువగా ఉన్నట్టు తెలిసింది. సాధారణ ప్రజానీకానికి మెట్రో ఛార్జీలను అందుబాటులోకి తెస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం, తర్వాత ఛార్జీలను తగ్గించే అవకాశం కనిపిస్తోంది. -
మెట్రో జర్నీ..ఇలా ఈజీ!
పది కేజీల బ్యాగేజీ వరకే పరిమితం సులువుగా ప్రయాణించేలా సూచనలు.. సలహాలు గ్రేటర్ వాసుల కలల మెట్రో జర్నీకి ముహూర్తం దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం ఎల్అండ్టీ సంస్థ బుధవారం ‘యూజర్ గైడ్’ను విడుదల చేసింది. మెట్రో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ యూజర్గైడ్ను ఫాలో కావాలని సంస్థ సూచించింది. స్టేషన్లు, ఎస్కలేటర్లు, లిఫ్టుల వినియోగంపై స్పష్టంగా వివరించింది. స్టేషన్లోకి ఎంట్రీ నుంచి టికెట్ కొనుగోలు..రైలులోకి ప్రవేశించడం.. గమ్యస్థానంలో దిగడం వరకు చేయాల్సిన..చేయకూడని పనుల్ని పేర్కొంది. ఈ గైడ్‌ను పరిశీలించడం ద్వారా నగరవాసులు ఎలాంటి ఇబ్బంది పడకుండా మెట్రో జర్నీ చేయవచ్చని ఎల్అండ్టీ మెట్రో రైలు ఎండీ శివానంద నింబార్గీ తెలిపారు. సాక్షి, సిటీబ్యూరో: మెట్రో రైలులో ప్రయాణించే వారి కోసం ఎల్అండ్టీ సంస్థ బుధవారం ‘యూజర్ గైడ్’ను విడుదల చేసింది. ఆ విశేషాలు ఇలా... స్టేషన్‌కు ఇలా చేరుకోండి: ► ప్రతి స్టేషన్‌కు రోడ్డు లెవల్లో ఎలివేటర్లు, లిప్టులు, మెట్లు, ఎస్కలేటర్లుంటాయి. ఇక మధ్యభాగం(కాన్కోర్స్)నుంచి ప్లాట్‌ఫాం పైకి చేరుకునేందుకు సైతం ఇవే వసతులుంటాయి. ► శారీరక సామర్థ్యం సరిగా ఉన్నవారు మెట్ల మార్గాన్ని వినియోగిస్తే ఇతరులకు అసౌకర్యం ఉండదు. లిఫ్టులు, ఎస్కలేటర్ల వద్ద రద్దీ తగ్గుతుంది. ఎస్కలేటర్ల వినియోగం ఇలా... ► ఎస్కలేటర్ గమనానికి అనుగుణంగా మీ పాదాలను ఉంచి దానిపై నిల్చోవాలి. ► ఎస్కలేటర్‌పై కూర్చోవడం, నడవడం మంచిదికాదు. ► ఎస్కలేటర్‌పై ప్రయాణించేటప్పుడు రెయిలింగ్‌ను పట్టుకొని భద్రంగా నిల్చోవాలి. ► చిన్నారులను జాగ్రత్తగా పట్టుకోవాలి. ► చీరలు, దుపట్టాలు ఎస్కలేటర్‌లో చిక్కుపడకుండా జాగ్రత్తలు పాటించాలి. ► గమ్యం చేరగానే ఎస్కలేటర్‌పై నుంచి దిగి దూరంగా జరగాలి. ► అత్యవసర పరిస్థితుల్లో ఎస్కలేటర్‌ను నిలిపివేసేందుకు కింద..మధ్య..పైన ఉన్న రెడ్బటన్ను నొక్కాలి. లిఫ్టులు: ► దివ్యాంగులు, వృద్ధులు, అంధుల కోసమే లిప్టులను ఏర్పాటుచేశారని మరవద్దు. ► భారీ లగేజీతో వచ్చేవారు ..చిన్నారులను బేబీ కార్ట్‌లో తీసుకొచ్చేవారు, ట్రాలీ బ్యాగేజి ఉన్నవారు లిఫ్టులను వినియోగించాలి. స్టేషన్లో ఏమి ఉంటాయి..... ♦ స్టేషన్ లోనికి, బయటికి ప్రవేశించేందుకు మధ్యభాగంలో నాలుగు వైపులా గేట్లుంటాయి. స్టేషన్‌ను పెయిడ్, అన్‌పెయిడ్ ఏరియాగా విభజిస్తారు. ♦ పెయిడ్ ఏరియా: ప్లాట్‌ఫాంను పెయిడ్ ఏరియాగా పిలుస్తారు. టిక్కెట్, టోకెన్, స్మార్ట్ కార్డున్నవారినే ఈ ప్రాంతానికి అనుమతిస్తారు. ♦ అన్‌పెయిడ్ ఏరియా: స్టేషన్ కిందిభాగం(రోడ్ లెవల్), మధ్యభాగం(కాన్కోర్స్)లెవల్. ఇక్కడ రిటెయిల్ దుకాణాలు, స్టోర్లుంటాయి. ఇక్కడికి టిక్కెట్ అవసరం లేకుండా ఎవరైనా వెళ్లవచ్చు. సెక్యూరిటీ చెక్ ఇలా... ♦ ప్రతీ స్టేషన్లో ఎక్స్‌రే బ్యాగేజ్ స్కానర్ ♦ డీఎఫ్ఎండీ–డోర్‌ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్ ♦ పదికేజీల లగేజినిమాత్రమే మెట్రో జర్నీకి అనుమతిస్తారు. ♦ బ్యాగు నిడివి 60 సెంటీమీటర్ల పొడవు..45 సెంటీమీటర్ల వెడెల్పు..25 సెంటీమీటర్ల ఎత్తున్న బ్యాగులనే జర్నీకి వినియోగించాలి. ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లు... ♦ ఎంట్రీ గేటు:స్టేషన్‌లోనికి ప్రవేశించే మార్గం ♦ ఎగ్జిట్ గేటు:ప్లాట్‌ఫాం నుంచి దిగి బయటకు వెళ్లేమార్గం ♦ బై డైరెక్షనల్ వైడ్గేట్: వీల్‌చైర్‌లో తరలివచ్చే దివ్యాంగులు నేరుగా ప్లాట్‌ఫాం పైకి వెళ్లేందుకు ఇవి వినియోగిస్తారు. ♦ టోకెన్‌తో ప్రయాణించేవారు తాము దిగిన చోట టోకెన్‌ను ఎగ్జిట్ గేట్ వద్ద చూపాల్సి ఉంటుంది. స్టేషన్లో దిగిన తరవాత... ♦ స్టేషన్ బయటికి వెళ్లే చోట ఉన్న మ్యాప్‌ను పరిశీలించాలి. తద్వారా మీరు ఎక్కడికి ఎలా వెళ్లాలన్న విషయం స్పష్టమౌతుంది. ♦ ఎగ్జిట్ గేట్ గుండా బయటికి వెళ్లే సమయంలో మీ వద్దనున్న స్మార్ట్‌కార్డ్, టిక్కెట్ లేదా టోకెన్ చూపాల్సి ఉంటుంది. స్టేషన్ పరిసరాల్లో ఇలా.. ♦ స్టేషన్ కిందిభాగం(రోడ్‌లెవల్)లో పాదచారుల మార్గాలు, ఫుట్పాత్లుంటాయి. ♦ ఇక్కడ సైకిల్లు అద్దెకు తీసుకునే సౌకర్యం ఉంటుంది. ♦ బస్సులు, షెటిల్ బస్సులు, క్యాబ్‌లు, ఆటోలు నిలిపే అవకాశం ఉంటుంది. టికెట్లు, టోకెన్లు ఇలా కొనుగోలు చేయండి ⇔మెట్రో రైళ్లలో అప్పుడప్పుడూ ప్రయాణించేవారికి టోకెన్లు ఉపయుక్తంగా ఉంటాయి. ⇔స్టేషన్ మధ్యభాగం(కాన్కోర్స్)వద్ద టికెట్ ఆఫీస్ మెషిన్(టీఓఎం) వద్ద వీటిని కొనుగోలుచేయాలి. ⇔టిక్కెట్ విక్రయ యంత్రం వద్ద మీరు చేరాల్సిన గమ్యస్థానానికి సంబంధించి టిక్కెట్లు తీసుకోవాలి. టోకెన్ యంత్రం వెనకాలే టికెట్ విక్రయ యంత్రం ఉంటుంది. స్మార్ట్ కార్డ్ ఇలా తీసుకోండి... ⇔టిక్కెట్లు, టోకెన్ల గోల లేకుండా స్మార్ట్ కార్డ్‌తో జర్నీ చేసేందుకు స్మార్ట్ కార్డ్ నెబ్యులా ఉపయోగపడుతుంది. ⇔ప్రతి స్టేషన్ మధ్యభాగంలో ఏర్పాటుచేసిన టికెట్ ఆఫీస్ మెషిన్ వద్ద వీటిని కొనుగోలుచేయవచ్చు. ⇔ఎల్అండ్టీ మెట్రోరైల్ వెబ్సైట్ ద్వారా కూడా వీటి కొనుగోలుకు అవకాశం కల్పించనున్నారు. అయితే ఆన్లైన్ చెల్లింపులకు డెబిట్, క్రెడిట్ కార్డులను కొనుగోలు చేయాలి. స్టేషన్లలో అయోమయానికి తావులేదు... ⇔ప్రతి స్టేషన్లో మీరు ప్రయాణించే మార్గానికి సంబంధించి నెట్వర్క్ మ్యాప్, స్టేషన్ లేఅవుట్, లోకల్ ఏరియా మ్యాప్, రైళ్ల టైమ్‌టేబుల్, ఛార్జీల పట్టిక, చేయాల్సిన, చేయకూడని పనుల చార్టులుంటాయి. ⇔ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణించేందుకు..వారికి దిశానిర్దేశం చేసేందుకు సైనేజి బోర్డులను అన్ని చోట్లా ఏర్పాటు చేశారు. ⇔అత్యవసర పరిస్థితులు, విపత్తులు సంభవించినపుడు స్టేషన్ నుంచి సురక్షితంగా బయటపడే విధానంపై ప్రత్యేకంగా సైనేజి బోర్డులు ఏర్పాటుచేశారు. ⇔అంధులు నేరుగా స్టేషన్‌లోనికి చేరుకునేందుకు ప్రత్యేక టైల్స్‌తో మార్గం ఏర్పాటుచేశారు. ఈ మార్గంలో వారి చేతికర్ర ఆధారంగా నేరుగా ప్లాట్‌పాంపైకి చేరుకోవచ్చు. ⇔స్టేషన్లు, రైళ్ల రాకపోకలపై నిరంతరాయంగా స్టేషన్లో అనౌన్స్మెంట్ వినిపిస్తుంది. తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో అనౌన్స్మెంట్ ఉంటుంది. ⇔అత్యవసర పరిస్థితుల్లో స్టేషన్ కంట్రోలర్‌ను సంప్రదించవచ్చు. ⇔రైలులోపల అత్యవసర కాల్‌బటన్ ఉంటుంది. ఆపత్కాలంలో ఈ బటన్ నొక్కడం ద్వారా ట్రైన్ ఆపరేటర్‌ను సంప్రదించవచ్చు. ⇔ప్రతీ స్టేషన్లో కస్టమర్ సర్వీస్ సెంటర్లు ఉంటాయి. ప్రయాణికులకు కావాల్సిన సమాచారాన్ని అందజేస్తాయి. ప్లాట్‌ఫాంపై ఇలా... ⇔మీ భద్రతే..మాకు అత్యంత ప్రాధాన్యం అన్న నినాదమే ఇక్కడ కనిపిస్తుంది. ⇔ప్రయాణికులు ఎలాంటి ప్రమాదాల బారిన పడకుండా ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేశారు. ⇔ప్లాట్‌ఫాంపై పసుపురంగు గీతకు వెనకాలే రైలు కోసం వేచిచూడాలి. రైలు పూర్తిగా ప్లాట్‌ఫాంపై నిలిచిన తరవాతనే బోగీ డోర్లు తెరచుకుంటాయి. అప్పుడే అందులోకి ప్రవేశించాలి. ⇔బోగీలోకి ప్రవేశించే సమయంలో క్యూ పద్ధతిని పాటించాలి. బోగీలోని ప్రయాణికులు పూర్తిగా దిగిన తర్వాతే ఇతరులు లోనికి ప్రవేశించాలి. ⇔బోగీలో సీటు దొరకని పక్షంలో హ్యాండ్‌రైల్‌ను పట్టుకొని నిల్చోవాలి. వృద్ధులు, చిన్నారులు, మహిళలకు సీటివ్వడం ద్వారా వారికి సహకరించాలి. ⇔మెట్రో రైళ్లు, స్టేషన్లు పరిశుభ్రంగా ఉం చేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలి. ⇔రైలులో తినడం, తాగడం నిషిద్ధం. ⇔ప్రతీరైలులో ముందు..వెనక భోగీలో వికలాంగులు వీల్‌చైర్‌తో సహా కూర్చునేందుకు ప్రత్యేక ఏర్పాట్లుంటాయి. ⇔డోర్క్లోజింగ్ లైట్ ఆన్కాగానే అనౌన్స్మెంట్ వినిపిస్తుంది. అప్పుడే రైలు ముందుకు కదులుతుంది. డోర్లు మూసుకునే, తెరచుకునే సమయంలో వాటి మధ్యన నిలిచే ప్రయత్నం చేయరాదు. ⇔ప్లాట్‌ఫాంపై ప్రయాణికులను గైడ్ చేసేందుకు మెట్రో సిబ్బంది సదా అప్రమత్తంగా ఉంటారు. మెట్రో రైలు సిటీలో స్పీడ్‌గా పరుగులు పెడుతోంది. ప్రారంభోత్సవం సమీపిస్తున్న తరుణంలో ట్రయల్ రన్లు పెరిగాయి. బేగంపేట–సికింద్రాబాద్ రూట్లో బుధవారం పగలు.. రాత్రీ మెట్రో రైలు దృశ్యాలు ఇలా సాక్షి కెమెరాకు చిక్కాయి... మెట్రో మెరుపులు... -
పప్పీతో జర్నీ.. నో ఎంట్రీ..
పెంపుడు జంతువుల తోడుగా మెట్రో జర్నీ చేద్దామంటే కుదరదని మెట్రో నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ స్పష్టంచే సింది. త్వరలో నగర మెట్రో రైళ్లు పట్టాలెక్కనున్న దృష్ట్యా ఆయా స్టేషన్లలో ప్రయాణికులు చేయకూడని, చేయాల్సిన పనుల జాబితాను ఎల్అండ్టీ మెట్రో రైలు మేనేజింగ్ డైరెక్టర్ శివానంద నింబార్గీ మంగళవారం విడుదల చేశారు. ఇందులో పలు కీలక అంశాలున్నాయి. స్టేషన్లు, రైలులో చేయాల్సిన పనులివీ.. ♦ మీ చేతిలో లేదా బ్యాగులోని చెత్తను విధిగా చెత్తకుండీలోనే వేయాలి. స్టేషన్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే బాధ్యత అందరిదీ. ♦ మెట్రోస్టేషన్ పరిసరాలకు చేరుకున్న తరవాత మీ ప్రయాణానికి సంబంధించి తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో వినిపించే అనౌన్స్మెంట్లను జాగ్రత్తగా వినాలి. ♦ మీకేదైనా సహాయం కావాలంటే కస్టమర్ సర్వీస్ బృందం, స్టేషన్ సిబ్బందిని సంప్రదించాలి. ♦ మెట్రో స్టేషన్ లేదా బోగీలో నిషిద్ధ వస్తువులు, పేలుడు పదార్థాలున్నట్లు అనుమానిస్తే సిబ్బందికి వెంటనే తెలియజేయాలి. ♦ స్టేషన్‌లోనికి వెళ్లే సమయంలో వ్యక్తిగత, బ్యాగేజీ తనిఖీ విషయంలో భద్రతా సిబ్బందికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. ♦ తోటి ప్రయాణికులు, మెట్రో సిబ్బంది, స్టేషన్ స్టాఫ్‌తో మర్యాదగా ప్రవర్తించాలి. ♦ మెట్లు,ఎస్కలేటర్లపై వెళుతున్నప్పుడు జాగ్రత్తగా వెళ్లాలి. ♦ మీరు దిగాల్సిన స్టేషన్ రాగానే రైలు దిగి వెళ్లిపోవాలి. ♦ ఎస్కలేటర్‌పై ప్రయాణిస్తున్నప్పుడుఎడమవైపు మాత్రమే ఉండాలి. ♦ బోగీలో హ్యాండ్‌రైల్‌ను పట్టుకొని నిలబడాలి. ♦ చిన్నారులు, వృద్ధులు, వికలాంగులు, మహిళలు కూర్చునేందుకు మీ వంతుగా సహకరించాలి. ♦ చిన్నారులను తీసుకొచ్చే బేబీ బగ్గీస్, వీల్చైర్లలో వచ్చేవారు విధిగా ఎలివేటర్లలో ప్లాట్‌ఫాం మీదకు వెళ్లాలి. ♦ ఎస్కలేటర్ దిగిన వెంటనే దానికి దూరంగా జరగాలి. ♦ టిక్కెట్ కౌంటర్, టిక్కెట్ విక్రయ యంత్రాలు, ఆటోమెటిక్ ఫెయిర్ కలెక్షన్ గేట్ల వద్ద మీ వంతు వచ్చే వరకు క్యూలైన్లో నిలబడాలి. ♦ రైలు ప్లాట్‌ఫాంపై నిలిచిన తరవాతనే బోగీలోనికి ప్రవేశించాలి. ♦ రైలులో ప్రయాణిస్తున్నప్పడు సిబ్బంది టోకెన్లు, స్మార్ట్ కార్డులు చూపమన్నప్పుడు వారికి సహకరించాలి. టిక్కెట్ లేని ప్రయాణికులపై కఠిన చర్యలు తప్పవు. చేయకూడని పనులివే.. ♦ స్టేషన్లు, పరిసరాల్లోను, బోగీల్లోనూ ఉమ్మివేయడం, సిగరెట్లు తాగడం, పాన్ నమలడం చేయరాదు. ఆల్కహాల్ తాగడం పూర్తిగా నిషిద్ధం. ♦ రైలుల్లోకి ప్రవేశించిన తరవాత ఫొటోలు తీయరాదు. ♦ ప్లాట్‌ఫాం, స్టేషన్ పరిసరాల్లో నిషిద్ధ ప్రాంతాల్లో కూర్చోరాదు. ♦ రైళ్లలో ప్రయాణిస్తున్నప్పుడు తినుబండారాలు, ఆహారం తీసుకోరాదు. ♦ మీ పెంపుడు జంతువులను మెట్రో రైళ్లలో తీసుకెళ్లడం నిషిద్ధం. ♦ ప్రమాదకర వస్తువులు, అగ్నిప్రమాదం జరిగే అవకాశం ఉన్న వస్తువులను స్టేషన్ పరిసరాల్లోకి, బోగీల్లోకి అనుమతించరు. ♦ ఎస్కలేటర్లపై కూర్చోవడం, వాటిపై వాలడం, ఎస్కలేటర్ల పనితీరును అడ్డుకోరాదు. ♦ ప్లాట్‌ఫాంపై రైలు కోసం వేచివుండే సమయంలో పసుపురంగు లైన్‌ను దాటి రావద్దు. ♦ మెట్రో రైలులో ప్రయాణిస్తున్నప్పుడు బలవంతంగా రైలు డోర్లు తెరవరాదు. డోర్లకు ఆనుకొని నిల్చోరాదు. రైలు కోసం పరిగెత్తరాదు. ♦ మీ చిన్నారులను నిర్లక్ష్యంగా ప్లాట్‌ఫాం, స్టేషన్ పరిసరాల్లో విడిచిపెట్టరాదు. ♦ ట్రాక్‌పై ఏర్పాటు చేసిన ఓవర్‌హెడ్ వైర్లను ఎట్టిపరిస్థితుల్లో తాకరాదు. ♦ మెట్రో రైలు పరిసరాల్లోకి భద్రతా ధ్రువీకరణ లేని ఆయుధాలు తీసుకురావద్దు. ♦ చూపులేని వారి కోసం స్టేషన్లో ఏర్పాటు చేసిన టైల్స్‌పై ఇతరులు నడవరాదు. ♦ అత్యవసర కమ్యూనికేషన్ సాధనలతో రైలు డ్రైవర్‌తో సంభాషించరాదు. వైద్యపరమైన అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే వారితో సంప్రదించాలి. ♦ మెట్రోస్టేషన్ రైలు, పరిసరాల్లో హాకర్స్‌కు ప్రవేశం నిషిద్ధం. ♦ బోగీ డోర్లు తెరచుకునే.. మూసుకునే సమయాల్లో వాటి మధ్యలో నిలవరాదు. ♦ బోగీలకు ఎలాంటి నోటీసులు అంటించరాదు. ♦ స్టేషన్, బోగీ పరిసరాలను పాడుచేసిన వారు శిక్షార్హులు. ♦ రైలు గమనాన్ని అడ్డుకునే చర్యలపై కఠిన చర్యలు తప్పవు. ♦ మీ దగ్గర ఉన్న స్మార్ట్‌కార్డు లేదా టోకెన్‌ను తోటి ప్రయాణికులతో పంచుకోవద్దు. -
ఎల్ అండ్ టీ లాభాలు 32శాతం జంప్
సాక్షి, ముంబై: ఇంజినీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దిగ్గజం లార్సన్ టుర్బో (ఎల్అండ్టీ) శనివారం క్యూ2 ఫలితాలను వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఫలితాల్లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం 32శాతం జంప్ చేసి రూ. 2020 రూ. కోట్లను నమోదు చేసింది. నిర్వహణ లాభం(ఇబిటా) స్వల్పంగా పుంజుకొని రూ. 2960 కోట్లుగా నిలిచింది. అలాగే రూ. 137 కోట్లమేర వన్ టైమ్ గెయిన్ నమోదైనట్లు కంపెనీ వెల్లడించింది. మొత్తం ఆదాయం 6శాతం పెరిగి రూ. 26,447 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 9.2 శాతం నుంచి 11.2 శాతానికి బలపడ్డాయి. మొత్తం వ్యయం 23,507 కోట్ల నుంచి రూ .24,310 కోట్లకు పెరిగింది. కేంద్ర ప్రభుత్వ చర్యలు పెట్టుబడుల పునరుద్ధరణకు ఊతమిచ్చినప్పటికి ఆర్థిక సంస్కరణల ప్రభావంతో సవాళ్లను ఎదుర్కొన్నట్టు కంపెనీ పేర్కొంది. ముఖ్యంగా డీమానిటైజేషన్, జీఎస్టీ వ్యాపారం దెబ్బతిన్నట్టు తెలిపింది. పెట్టుబడులని ఆకర్షించడం, ఆర్థిక సరళతకు కట్టుబడి వుండటమనే రెండు సవాళ్లు తమ ముందున్నాయని చెప్పింది. -
ఎల్అండ్టీ లాభం 46% అప్
క్యూ1లో లాభం రూ.893 కోట్లు న్యూఢిల్లీ: ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్ దిగ్గజం ఎల్అండ్టీ జూన్ క్వార్టర్ ఫలితాలు విశ్లేషకుల అంచనాలను అందుకున్నాయి. లాభం ఏకంగా 46 శాతం వృద్ధితో రూ.893 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో వచ్చిన లాభం రూ.610 కోట్లు కావడం గమనార్హం. కన్సాలిడేటెడ్ ఆదాయం సైతం రూ.23,990 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న ఆదాయంతో పోలిస్తే 10 శాతం అధికం. అంతర్జాతీయ వ్యాపార విభాగాల ద్వారా వచ్చిన ఆదాయం ఈ కాలంలో రూ.8,233 కోట్లుగా ఉంది. సంస్థ మొత్తం ఆదాయంలో అంతర్జాతీయ కార్యకలాపాల వాటా 34%. సవాళ్లతో కూడిన వాతావరణంలోనూ జూన్ క్వార్టర్లో రూ.26,352 కోట్ల ఆర్డర్లను సంపాదించించినట్టు కంపెనీ పేర్కొంది. వీటిలో అంతర్జాతీయ ఆర్డర్ల విలువ రూ.7,885 కోట్లు (30%)గా ఉంది. ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగం నుంచి పెద్ద ఆర్డర్లు లభించాయని కంపెనీ వెల్లడించింది. జూన్ 30 నాటికి కంపెనీ మొత్తం ఆర్డర్ బుక్ విలువ రూ.2,62,860 కోట్లుగా ఉంది. వీటిలో అంతర్జాతీయ ఆర్డర్ల వాటా 26 శాతం. గతేడాది ఇదే కాలంలో ఉన్న ఆర్డర్ బుక్ విలువ కంటే 2 శాతం అధికం. జీఎస్టీకి మారడం, రియల్ ఎస్టేట్ నియంత్రణ చట్టం, ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్టసీ కోడ్ తదితర సంస్కరణలు వృద్ధికి ఊతమిస్తాయని కంపెనీ పేర్కొంది. మంచి వర్షపాత అంచనాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయ వృద్ధి, ప్రభుత్వ ఉద్యోగులకు వేతన పెంపు, తక్కువ వడ్డీ రేట్లు డిమాండ్‌ను పెంచుతాయని, జీడీపీకి ఉత్ప్రేరకంగా నిలుస్తాయని అభిప్రాయపడింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో శుక్ర వారం ఎల్అండ్టీ షేరు ధర బీఎస్ఈలో 1.96% లాభపడి రూ. 1,159 వద్ద ముగిసింది. -
ఎల్ అండ్ టీలో వాటా విక్రయం
ప్రభుత్వానికి 4,000 కోట్లు న్యూఢిల్లీ: ఇంజనీరింగ్ దిగ్గజం లార్సన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టీ)లో ప్రభుత్వానికి ఉన్న వాటాలో 2.5 శాతం షేర్లను విక్రయించడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ. 4,000 కోట్లు సమకూరింది. బుధవారం ఎల్ అండ్ టీ షేరు ధర స్వల్ప పెరుగుదలతో రూ. 1,754 వద్ద ముగిసింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్పెషల్ అండర్‌టేకింగ్ ఆఫ్ యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (ఎస్‌యూయూటీఐ)లో 6.53 శాతం ఎల్ అండ్ టీ వాటాలు ఉన్నాయి. తాజా విక్రయంతో ఎస్‌యూయూటీఐలో ప్రభుత్వం కలిగిన ఎల్ అండ్ టీ 4 శాతానికి తగ్గుతుంది. ఈ వాటా విక్రయంతో ప్రభుత్వానికి డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ రూ. 6,400 కోట్లు సమకూరినట్లవుతుంది. వివిధ కంపెనీల్లో వున్న మైనారిటీ వాటాలు, ప్రభుత్వ రంగ సంస్థల వ్యూహాత్మక విక్రయం వంటి వాటి ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ. 72,500 కోట్లు సమీకరించాలని కేంద్రం బడ్జెట్లో ప్రతిపాదించింది. ఎస్‌యూయూటీఐ వద్ద దాదాపు 50 కంపెనీల వాటాలు ఉన్నాయి. వీటిలో ప్రధానమైనవి ఐటీసీ (9.17 శాతం), యాక్సిస్ బ్యాంక్ (11.53 శాతం). ఈ ఏడాది ఫిబ్రవరిలో 2 శాతం ఐటీసీ వాటాను విక్రయించడం ద్వారా ప్రభుత్వం రూ. 6,700 కోట్లు సమీకరించింది. -
ఎల్ అండ్ టీ లాభం 1,435 కోట్లు
• 84 శాతం పెరుగుదల • 8 శాతం వృద్ధితో రూ.25,011 కోట్లకు మొత్తం ఆదాయం న్యూఢిల్లీ: మౌలిక రంగ దిగ్గజ కంపెనీ లార్సెన్ అండ్ టుబ్రో(ఎల్ అండ్ టీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ..1,435 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం(రూ.778 కోట్లు)తో పోల్చితే 84 శాతం వృద్ధి సాధించామని ఎల్ అండ్ టీ తెలిపింది. వ్యూహాత్మక ప్రణాళికలో భాగంగా సాధారణ బీమా వ్యాపారాన్ని విక్రరుుంచామని, ఈ విక్రయ లావాదేవీలో వచ్చిన లాభాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ స్థారుు నికర లాభం సాధించామని వివరించింది. గత క్యూ2లో రూ.23,123 కోట్లుగా ఉన్న ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో 8 శాతం వృద్దితో రూ.25,011 కోట్లకు పెరిగిందని పేర్కొంది. మొత్తం వ్యయాలు రూ.21,521 కోట్ల నుంచి రూ.23,173 కోట్లకు పెరిగాయని వివరించింది.అంతర్జాతీయ కార్యకలాపాల ద్వారా రూ.8,930 కోట్ల ఆదాయం ఆర్జించామని, మొత్తం ఆదాయంలో ఇది 36 శాతమని తెలిపింది. ఈ క్యూ2లో ఆర్డర్లు 11% పెరిగి రూ.31,119 కోట్లకు ఎగిశాయని పేర్కొంది. వీటిల్లో అంతర్జాతీయ ఆర్డర్ల వాటా రూ.7,386 కోట్ల(24%)ని వివరించింది. మౌలిక, హైడ్రో కార్బన్ రంగాల నుంచి ఎక్కువగా ఆర్డర్లు వచ్చాయని పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి మొత్తం ఆర్డర్ల విలువ 4 శాతం వృద్ధితో రూ.2,51,773 కోట్లకు పెరిగిందని వివరించింది. భవిష్యత్తు ఆశాజనకమే... మౌలిక రంగాభివృద్ధికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదని, రవాణా కారిడార్లు, మెట్రో రైల్వేలు, స్మార్ట్ సిటీలు, జల వనరుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తోందని ఎల్ అండ్ టీ పేర్కొంది. దేశీయంగా రక్షణ పరికరాల తయారీకి ప్రాధాన్యత పెరుగుతోందని, జీఎస్టీ, దివాలా కోడ్ బిల్లుల ఆమోదం కారణంగా చెప్పుకోదగ్గ మార్పులు వస్తాయని వివరించింది. అంతర్జాతీయ పరంగా చూస్తే, తమ స్థారుుని పటిష్టం చేసుకుంటామని, కీలకమైన మౌలిక, ఇంధన రంగాల్లో వృద్ధి సాధించడంపై దృష్టి కేంద్రీకరిస్తామని వివరించింది. -
ఐపీఓకు వస్తోన్న ఎల్ అండ్ టీ మరో సంస్థ
ముంబై: ఇంజినీరింగ్ దిగ్గజం లార్సెన్ అండ్ టుబ్రో(ఎల్ అండ్ టీ) నుంచి మరో కంపెనీ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు వస్తోంది. ఎల్ అండ్ టీకి చెందిన ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్ ఐపీఓ సంబంధిత పత్రాలను సెబీకి సమర్పించింది. ఈ ఐపీఓ ద్వారా ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్‌లో తనకున్న వాటాలో ఎల్ అంట్ టీ సంస్థ 15% వరకూ విక్రయించనున్నది. ఈ ఐపీఓ ద్వారా రూ.1,000 కోట్ల వరకూ ఎల్ అండ్ టీకి లభిస్తాయని అంచనా. -
కంపెనీల కొనుగోళ్ల రేసులోఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్
న్యూఢిల్లీ: లార్సెన్ అండ్ టుబ్రోకి చెందిన ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ కంపెనీ ఇతర ఐటీ కంపెనీలను కొనుగోళ్లపై కన్నేసింది. ఎనలిటిక్స్, కన్సల్టింగ్, ఇంటర్నెట్ ఆఫ్ ధింగ్స్, క్లౌడ్ ఆధారిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రాన్స్ఫార్మేషన్ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహించే కంపెనీలను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ తెలిపింది. ఈ కంపెనీ రూ.1,200 కోట్ల సమీకరణ నిమిత్తం ఈ నెల 11న(వచ్చే సోమవారం) ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు వస్తోంది. ఈ ఐపీఓలో ఎల్ అండ్ టీకి చెందిన 1.7 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ విధానంలో జారీ చేస్తారు. దీంతో ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్‌కు ఎలాంటి నిధులు రావు. ఐపీఓ నిధులన్నీ మాతృసంస్థ ఎల్ అండ్ టీకి వెళతాయి. తమకు 250 మందికి పైగా క్లయింట్లున్నారని, వీరికి సేవలందించడానికి భారత్, అమెరికా, యూరప్‌ల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోన్న ఐటీ కంపెనీలను కొనుగోలు చేయడానికి సిద్దంగా ఉన్నామని ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ సీఈఓ, ఎండీ సంజయ్ జలోన చెప్పారు. కంపెనీల కొనుగోళ్లకు కావలసిన నిధులను అంతర్గతంగా సమకూర్చుకుంటామని, లేదా మార్కెట్ నుంచి సమీకరిస్తామని, లేదా పబ్లిక్ ఇష్యూకు వస్తామని పేర్కొన్నారు. తమ ఆదాయంలో 69 శాతం అమెరికా నుంచి, 17 శాతం యూరప్ నుంచి, భారత్ నుంచి 5 శాతం చొప్పున లభిస్తాయని, మిగిలింది ఇతర దేశాల నుంచి వస్తోందని వివరించారు. ఇంగ్లాండ్ నుంచి వచ్చేది 2 శాతమేనని, అందుకని బ్రెగ్జిట్ ప్రభావం తమపై ఉండదని పేర్కొన్నారు. ఐపీఓ ధర శ్రేణి రూ.705-710 కాగా ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ (ఐపీఓ)కు ధర శ్రేణిని రూ.705-710గా కంపెనీ నిర్ణయించింది. లిస్టయిన తర్వాత ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.12,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఎల్ అండ్ టీ నుంచి స్టాక్ మార్కెట్లోకి లిస్టింగ్ కోసం వస్తోన్న రెండో అనుబంధ కంపెనీ ఇది. ఐదేళ్ల క్రితం ఎల్ అండ్ టీ ఫైనాన్స్ హోల్డింగ్స్ ఐపీఓకు వచ్చింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.14,000 కోట్లుగా ఉంది. -
ఎల్ అండ్ టీ సాధారణ బీమా...హెచ్డీఎఫ్సీ ఎర్గో చేతికి
♦ సాధారణ బీమా పరిశ్రమలో తొలి టేకోవర్ ♦ డీల్ విలువ రూ. 551 కోట్లు న్యూఢిల్లీ: హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్(హెచ్డీఎఫ్సీ)కు చెందిన సాధారణ బీమా సంస్థ విభాగం హెచ్డీఎఫ్సీ ఎర్గో, ఎల్ అండ్ టీ జనరల్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయనున్నది. ఇంజనీరింగ్ దిగ్గజం ఎల్ అండ్ టీ కంపెనీకి చెందిన ఎల్ అండ్ టీ జనరల్ ఇన్సూరెన్స్‌ను రూ.551 కోట్లకు, అంతా నగదులోనే కొనుగోలు చేయనున్నామని హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ చెప్పారు. బీమా వ్యాపారంలో వృద్ధి, స్థాయిలను బట్టి చూస్తే స్థిరీకరణ తప్పనిసరని ఆయన వ్యాఖ్యానించారు. ఈ లావాదేవీతో భారత బీమా రంగంలో స్థిరీకరణ దశ మొదలైనట్లేనని వెల్లడించారు. ఈ టేకోవర్ వల్ల రెండు సంస్థల పరిమాణం, నైపుణ్యం కలగలసి హెచ్డీఎఫ్సీ పనితీరు మెరుగుపడుతుందని, పాలసీదారులకు, ఇతర వాటాదారులకు ప్రయోజనం కలుగుతుందని వివరించారు. మూడో పెద్ద కంపెనీగా హెచ్డీఎఫ్సీ ఎర్గో 108 కార్యాలయాలతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న హెచ్డీఎఫ్సీ ఎర్గో రూ.3,467 కోట్ల స్థూల ప్రీమియమ్‌ను, రూ.151 కోట్ల నికర లాభాన్ని సాధించింది. హెచ్డీఎఫ్సీ, జర్మనీకి చెందిన ఎర్గో ఇంటర్నేషనల్ కంపెనీలు కలసి హెచ్డీఎఫ్సీ ఎర్గో జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేశాయి. సాధారణ బీమా రంగంలో ఈ కంపెనీది నాలుగో స్థానం. ఎల్ అండ్ టీ జనరల్ ఇన్సూరెన్స్ టేకోవర్‌తో మూడో స్థానానికి ఎగబాకుతుంది. ప్రస్తుతం ఎల్ అండ్ టీ జనరల్ ఇన్సూరెన్స్‌లో పనిచేస్తున్న 800 మంది ఉద్యోగులను విలీనాంతరం కూడా కొనసాగిస్తామని హెచ్డీఎఫ్సీ ఎర్గో ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ రితేశ్ కుమార్ చెప్పారు. ఈ విలీనం కారణంగా తమ ఆదాయం 15 శాతం వృద్ధి చెందుతుందని, ఎల్ అండ్ టీ జనరల్ ఇన్సూరెన్స్‌కు చెందిన రూ.600 కోట్ల ఆస్తులు హెచ్డీఎఫ్సీ ఎర్గో బ్యాలెన్స్ షీట్‌కు జతవుతాయని పేర్కొన్నారు. హెచ్డీఎఫ్సీ ఎర్గో సంస్థ వాహన, ఆరోగ్య, వ్యక్తిగత యాక్సిడెంట్, గృహ, పంట, తదితర బీమా సర్వీసులను అందిస్తోంది. స్థిరీకరణలో భారత బీమా రంగం.. సాధారణ బీమా రంగంలో ప్రభుత్వ రంగ బీమా సంస్థలు-న్యూ ఇండియా అష్యూరెన్స్, యునెటైడ్ ఇండియా, నేషనల్ ఇండియా, ఓరియంటల్ ఇన్సూరెన్స్‌లు అగ్రస్థానంలో ఉన్నాయి. ఇక ప్రైవేట్ రంగం విషయానికొస్తే, ఐసీఐసీఐ లాంబార్డ్, ఇఫ్కో టోకోయోలు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. కాగా, ఎఫ్‌డీఐ నిబంధనల సడలింపు నేపథ్యంలో భారత భీమా రంగంలో ఇప్పుడు స్థిరీకరణ మొదలైందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎర్గోకు వాటా అమ్మిన హెచ్డీఎఫ్సీ హెచ్డీఎఫ్సీ ఎర్గోలో తాజాగా 22.9% వాటాను విదేశీ భాగస్వామికి హెచ్డీఎఫ్సీ విక్రయించింది. ఈ మేరకు ఒక్కో షేర్‌ను రూ.90.973 చొప్పున 12.33 కోట్ల షేర్ల బదిలీ ప్రక్రియను పూర్తి చేశామని హెచ్డీఎఫ్సీ మరో ప్రత్యేక ప్రకటనలో తెలిపింది. ఈ డీల్ విలువ రూ.1,122 కోట్లని పేర్కొంది. హెచ్డీఎఫ్సీ ఎర్గో లిస్టెడ్ కంపెనీ కాదు. ఈ షేర్ల విక్రయంపై రూ.197 కోట్ల మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ షేర్ల విక్రయం తర్వాత హెచ్డీఎఫ్సీ ఎర్గో జాయింట్ వెంచర్లో హెచ్డీఎఫ్సీ వాటా 50.73 శాతంగానూ, ఎర్గో వాటా 48.74 శాతంగానూ ఉన్నాయి. బీమా వెంచర్లలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి పరిమితిని 26 శాతం నుంచి 49 శాతానికి పెంచుతూ గత ఏడాది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో తాము ఏర్పాటు చేసిన పలు జాయింట్ వెంచర్లలో వాటాను విదేశీ బీమా సంస్థలు పెంచుకుంటున్నాయి. -
ఏపీ తాత్కాలిక సచివాలయం ప్రారంభం
తెల్లవారు జామున 4.01 నిమిషాలకు ప్రారంభం సాక్షి, విజయవాడ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయ భవనానికి వెలగపూడిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభోత్సవం చేశారు. సోమవారం తెల్లవారు జామున నాలుగు గంటల ఒక్క నిమిషానికి భవనంలోకి ప్రవేశించి తాత్కాలిక సచివాలయాన్ని ప్రారంభించారు. ఈ నెల తరువాత సరైన ముహూర్తాలు లేవనే కారణంతో హడావుడిగా ఈ ముందస్తు ప్రారంభోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎల్ అండ్ టీ నిర్మిస్తున్న నాలుగో బ్లాకులో ఇందుకోసం ఒక గది(33 566 సైజులో)ని ఆగమేఘాల మీద సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ ఒత్తిడితో ఎల్ అండ్ టీ యుద్ధప్రాతిపదికన ఆ పనులు చేస్తోంది. మొదట రెండు గదులు సిద్ధం చేయాలని చూసినా.. రెండు రోజుల్లో అది సాధ్యమయ్యే పనికాకపోవడంతో ఒకదాన్నే అందుబాటులోకి తెచ్చారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, పలువురు అధికారులు హాజరయ్యారు. -
ఫుడ్ కాంట్రాక్ట్ ఇప్పిస్తానని మోసం - అరెస్ట్
వైఎస్సార్ జిల్లా కడప నగరంలోని నందిని రెస్టారెంట్ యజమాని నర్సింహులుకు ఎల్ అండ్ టి ఫుడ్ కాంట్రాక్ట్ ఇప్పిస్తామని మోసగించిన కేసులో కడప చిన్నచౌక్ పోలీసులు మంగళవారం నలుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్దనుంచి 15,50,000 రూపాయల నగదు, నాలుగు సెల్ఫోన్లు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్‌కు చెందిన సందీప్‌సింగ్ అనే వ్యక్తి నర్సింహులుకు ఫోన్‌చేసి ఎల్ అండ్‌టీ ఫుడ్ కాంట్రాక్ట్ ఇప్పిస్తానని నమ్మబలికి విడతలవారీగా 23 లక్షల రూపాయలు వసూలు చేసుకున్నాడు. ఎన్నిరోజులైనా ఫుడ్ కాంట్రాక్ట్ రాకపోవడంతో మోసపోయానని భావించిన నర్సింహులు పోలీసులను ఆశ్రయించాడు. దర్యాప్తు చేసిన పోలీసులు దుండగులు కర్నూలు జిల్లా నందికొట్కూరులో తలదాచుకున్నట్లు గుర్తించి మంగళవారం ఉదయం ఆ ముఠాలో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. అసలు నిందితుడు సందీప్ సింగ్ పరారయ్యాడు. అతనికోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు. -
అసెంబ్లీ మార్గంలో మెట్రో పనులు షురూ
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు పబ్లిక్ గార్డెన్స్-అసెంబ్లీ ప్రాంతంలో మెట్రోరైల్ మార్గం పనులు ప్రారంభమయ్యాయి. 18 పిల్లర్లకు అవసరమైన పునాదులు, వాటిపై మెట్రో పట్టాలు పరిచేందుకు వీలుగా వయాడక్ట్ సెగ్మెంట్లను ఏర్పాటు చేసే పనులను రేయింబవళ్లు పూర్తి చేయనున్నట్లు ఎల్ అండ్ టీ, హెచ్ఎంఆర్ వర్గాలు తెలిపాయి. పనులను రెండు నెలల వ్యవధిలో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నాయి. అక్కడ బస్టాపులున్న ప్రాంతాన్ని బారికేడ్లతో మూసివేశారు. హజ్‌హౌస్ ఎదురుగా ఒకే మార్గంలో వాహనాలను దారిమళ్లించి పనులు చేపడుతున్నారు. ప్రస్తుతం మొజంజాహీ మార్కెట్ జంక్షన్ మినహా గాంధీభవన్ వరకు మెట్రో పిల్లర్లు, వాటిపై వయాడక్ట్ సెగ్మెంట్ల ఏర్పాటు పూర్తయిన విషయం విది తమే. కీలకమైన అసెంబ్లీ ప్రాంతంలో మెట్రోమార్గంపై స్పష్టత రావడంతో ఇక్కడ పనులు ఊపందుకున్నాయి. అసెంబ్లీ, లక్డీకాపూల్, ఖైరతాబాద్, పంజగుట్ట మార్గంలో మెట్రోపనులు పూర్తయితే ఎల్బీనగర్-మియాపూర్(కారిడార్1) మార్గంలో సుమారు 29 కిలోమీటర్ల మేర మెట్రో పనులు పూర్తయినట్లే. ఈ మార్గంలో మెట్రో రైళ్లు 2016 చివరి నాటికి రాకపోకలు సాగించే అవకాశాలుంటాయి. ప్రస్తుతం పాతనగరం, సుల్తాన్‌బజార్ మినహా మిగతా ప్రాం తాల్లో మెట్రో పనులు ఊపందుకున్న విషయం విదితమే. ముఖ్యమైన కూడళ్లలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా బ్రిడ్జి అనుసంధానం విధానంలో పనులు చేపడుతున్నారు. -
ఐపీఓ పత్రాలను సమర్పించిన ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్
న్యూఢిల్లీ: ఎల్ అండ్ టీ ఐటీ సేవల అనుబంధ కంపెనీ ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ త్వరలో ఐపీఓకు రానున్నది. ఐపీఓ సంబంధిత ముసాయిదా పత్రాలను మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి ఈ సంస్థ సోమవారం సమర్పించింది. జీఎన్ఏ యాక్సిల్స్: ఈ కంపెనీ ఐపీఓ ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. నారాయణి స్టీల్స్: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నారాయణి స్టీల్స్ కంపెనీ, ముంబైకు చెందిన గంగా ఫార్మాస్యూటికల్స్ కంపెనీలు బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్‌ఫారమ్‌లో లిస్ట్ కావడానికి సంబంధిత పత్రాలను బీఎస్ఈకి సమర్పించాయి. నారాయణి స్టీల్స్ కంపెనీ రూ.11.52 కోట్లు సమీకరించనున్నదని సమాచారం. -
ఎల్అండ్టీ ఫైనాన్స్‌లో 10% వాటా బెయిన్ క్యాపిటల్‌కు
ముంబై: ఎల్ అండ్ టీ అనుబంధ సంస్థ ఎల్ అండ్ టీ ఫైనాన్స్‌లో 10.2% వాటాను అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బెయిన్ క్యాపిటల్ రూ.1,310 కోట్లకు కొనుగోలు చేసింది. ప్రిఫరెన్షియల్ కేటాయింపు, మార్కెట్ లావాదేవీలతో ఈ కొనుగోలు జరిగింది. ఎల్ అండ్ టీ ఫైనాన్స్ 5.27% వాటాను(9.5 కోట్ల షేర్లను) రూ.707.9 కోట్లకు, మాతృసంస్థ ఎల్ అండ్ టీ 4.95 శాతం వాటాను(8.5 కోట్ల షేర్లను ఒక్కోటి రూ.70కు) రూ.602 కోట్లకు బెయిన్ క్యాపిటల్‌కు విక్రయించాయి. సిటీ గ్రూప్ సంస్థ కస్డోడియన్గా వ్యవహరించిన ఈ లావాదేవీకి వాటాదారుల, సంబంధిత సంస్థల ఆమోదం పొందాల్సి ఉంది. -
మెట్రో స్టేషన్లకు మినీ బస్సులు..
ప్రయాణికుల రద్దీపై అధ్యయన బాధ్యతలు మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి 8 నుంచి 16 సీట్ల సామర్థ్యంగల మినీ బస్సులు నడిపే అవకాశం.. స్టేషన్లకు సమీపంలో పార్కింగ్ స్థలాలకు హెచ్ఎంఆర్, జీహెచ్ఎంసీల అన్వేషణ సిటీబ్యూరో:నగరంలో వేగంగా రూపుదిద్దుకుంటున్న మెట్రో రైలు నిర్మాణం పూర్తయి, రాకపోకలు ప్రారంభమయితే..ప్రజలకు ఎలాంటి సులభ రవాణా వసతులు కల్పించాలన్న అంశంపై నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ కసరత్తు ప్రారంభించింది. ముఖ్యంగా కాలనీల నుండి ప్రయాణికులు మెట్రో స్టేషన్లకు, మెట్రో స్టేషన్ల నుండి ఆయా కాలనీలకు ఎలా వెళ్లాలనే దానిపై అధ్యయనం ప్రారంభించారు. ఈమేరకు స్టేషన్ల నుంచి సమీప కాలనీలకు మినీ బస్సులు నడిపే అంశంపై ప్రముఖ రవాణా వాహనాల తయారీదారు మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థకు అధ్యయన బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. స్టేషన్లకు సమీపంలో ఉన్న పెద్ద, చిన్న కాలనీల సంఖ్య, ఉదయం, సాయంత్రం వేళల్లో ఆయా కాలనీల నుంచి బయలుదేరే ప్రయాణికుల వివరాలు, రద్దీ లేని సమయాల్లో మెట్రో స్టేషన్లకు వచ్చే ప్రయాణికుల సంఖ్యపై ఈ సంస్థ అధ్యయనం చేపట్టనుంది. ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా 8 నుంచి 16 సీట్ల సామర్థ్యంగల మినీ బస్సులకే అనుమతించే అవకాశాలున్నట్లు తెలిసింది. ఈ బస్సుల రాకపోకలు, నిర్వహణ బాధ్యతల కాంట్రాక్టును సైతం అదే సంస్థకు అప్పజెప్పే అవకాశాలున్నట్లు సమాచారం. ఇక మెట్రో స్టేషన్లకు ద్విచక్రవాహనాలు, కార్లలో చేరుకునే ప్రయాణికులు తమ వాహనాలను నిలిపేందుకు అవసరమైన పార్కింగ్ స్థలాలను సాధ్యమైనంత త్వరగా అన్వేషించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఆదేశించిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ,హెచ్ఎంఆర్ సంస్థలు రంగంలోకి దిగాయి. అందుబాటులో ఉన్న పార్కింగ్ స్థలాల కోసం అన్వేషిస్తున్నాయి. ఈ కసరత్తు త్వరలో కొలిక్కి రానుంది. ఇప్పటికే నాగోలు, తార్నాక, గాంధీఆస్పత్రి, గడ్డిఅన్నారం ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలు అందుబాటులో ఉండగా.. మరో 18 చోట్ల పార్కింగ్ స్థలాలను అన్వేషించనున్నట్లు తెలిసింది. ప్రభుత్వ భూములు అందుబాటులో లేని ప్రాంతాల్లో ప్రైవేటు స్థలాలను సైతం సేకరించాలన్న యోచనలో ఉన్నట్లు తెలిసింది. రద్దీ అధికంగా ఉండే పెద్ద మెట్రో స్టేషన్ల వద్ద విధిగా పార్కింగ్ స్థలం ఏర్పాటు చేసేందుకు రెండు విభాగాలు కసరత్తు చేస్తున్నాయి. రద్దీ తక్కువగా ఉండే చోట్ల ప్రతి రెండు స్టేషన్లకు ఒక పార్కింగ్ స్థలం కేటాయించనున్నట్లు తెలిసింది. పాతనగరం అలైన్‌మెంట్‌పై సర్కారు మౌనం.. జేబీఎస్-ఫలక్‌నుమా మార్గంలో మెట్రో మార్గాన్ని మూసీ నది మీదుగా మళ్లించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో నిర్మాణ సంస్థ ఎల్అండ్టీని ఆదేశించిన విషయం విదితమే. నూతన అలైన్మెంట్ ప్రకారం 3.2 కి.మీ మేర మెట్రో మార్గం పెరగనుంది. మరోవైపు మూసీ నదిలో పిల్లర్లు వేయడం సాంకేతికంగా కష్టసాధ్యమని, వాణిజ్యపరంగానూ ఈ మార్గంలో పనులు చేపట్టడం సాధ్యపడదని పేర్కొంటూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు సమాచారం. ఇక కోఠి ఉమెన్స్‌కళాశాల, బాటా మీదుగా మళ్లించాల్సిన మెట్రో మార్గంపైనా నిర్మాణ సంస్థ ప్రభుత్వానికి రెండు ప్రత్యామ్నాయాలు సూచించినట్లు తెలిసింది. ఈ విషయంలోనూ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో మెట్రో పనులు నిలిచాయి. వడివడిగా పనులు.. ఎల్బీనగర్-మియాపూర్, నాగోల్-శిల్పారామం మార్గాల్లో మెట్రో పనులు ఊపందుకున్నాయి. ఈ మార్గంలో 2017 చివరినాటికి పనులు పూర్తి కానున్నాయి. సర్కారు అనుమతిస్తే మియాపూర్-పంజాగుట్ట మార్గంలో 2016 మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో మెట్రో రైళ్ల రాకపోకలను ప్రారంభించేందుకు ఎల్అండ్టీ సన్నాహాలు చేస్తోంది. ఇక నాగోల్-సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ మార్గంలో ఒలిఫెంటాబ్రిడ్జి,ఆలుగడ్డబావి, మెట్టుగూడా వద్ద మూడు రైల్ ఓవర్‌బ్రిడ్జీలు (ఆర్ఓబీలు) నిర్మించాల్సిన అవసరం ఉండడంతో ఈ మార్గంలోనూ మెట్రో రైళ్ల రాకపోకలకు మరో ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది. -
ఎల్ అండ్ టీకి అధిక వ్యయాల దెబ్బ
33 శాతం తగ్గిన నికర లాభం ముంబై : ఇంజినీరింగ్, నిర్మాణ రంగ దిగ్గజం ఎల్ అండ్ టీ నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో 37 శాతం తగ్గింది. గత క్యూ1లో రూ.967 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.606 కోట్లకు తగ్గిపోయిందని ఎల్ అండ్ టీ పేర్కొంది. వ్యయాలు అధికమవడం, కొన్ని ప్రాజెక్టుల కార్యకలాపాలు నెమ్మదించడం నికర లాభం క్షీణతకు ప్రధాన కారణాలని తెలిపింది. నికర అమ్మకాలు రూ.18,975 కోట్ల నుంచి 7 శాతం వృద్ధితో రూ.20,252 కోట్లకు పెరిగాయని పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.26,376 కోట్ల కొత్త ఆర్డర్లు సాధించామని, వీటిల్లో అంతరాజీయ ఆర్డర్లు రూ.8,110 కోట్లని ్ల(31 శాతమని) వెల్లడించింది. జూన్ చివరి నాటికి తమ గ్రూప్ ఆర్డర్ బుక్ విలువ 22 శాతం వృద్ధితో రూ.2,38,973 కోట్లకు ఎగసిందని వివరించింది. దీంట్లో అంతర్జాతీయ ఆర్డర్ల వాటా 26 శాతమని పేర్కొంది. ఎల్ అండ్ టీ గ్రూప్ టెక్నాలజీ, ఇంజినీరింగ్,నిర్మాణ, తయారీ, ఆర్థిక సేవల రంగాల్లో దాఆపు 30 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కంపెనీ వార్షిక ఆదాయం 1,500 కోట్ల డాలర్లకు పైగా ఉంటుందని అంచనా. ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ ఐపీఓ ఎల్ అండ్ టీ సంస్థ తన ఐటీ విభాగం, ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్‌ను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయనుంది. ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్లో 15 శాతం వాటాను ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) ద్వారా విక్రయించాలన్న ప్రతిపాదన శుక్రవారం జరిగిన ఎల్ అండ్ టీ బోర్డ్ సమావేశంలో ఆమోదం పొందింది. ఈ వాటా విక్రయం ద్వారా రూ.2,500 కోట్లు నిధులు వస్తాయని అంచనా. దీనికి సంబంధించిన పత్రాలను ఎల్ అండ్ టీ వచ్చే నెల మూడో వారంలో సెబీకి సమర్పింస్తుందని సమాచారం. కాగా ఈ ఐపీఓకు కోటక్, సిటిబ్యాంక్, బార్క్లేస్లు లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తాయి. ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 9 డెలివరీ సెంటర్లతో షెవ్రాన్, హిటాచి, శాన్యో, లఫార్జే తదితర దిగ్గజ సంస్థలకు ఐటీ సేవలనందిస్తోంది. -
కష్టాల్లో ‘మెట్రో రైలు’
అవసరాల కోసం జంటనగరాల జనం తన దగ్గరకు రావడం కాక... రద్దీగా ఉండే రోడ్లపైకి తానే వెళ్లి జనం అవసరాలు తీర్చేలా ముస్తాబవుతున్న ప్రతిష్టాత్మక మెట్రో రైలు ప్రాజెక్టు ఉన్నట్టుండి పెను వివాదంలో చిక్కుకున్నది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌కు ప్రతీకగా, మహానగర ముఖ్య ప్రాంతాలన్నిటినీ ఒరుసుకుంటూ సాగిపోయేలా డిజైన్ చేసిన ఈ ప్రాజెక్టుపై అడపా దడపా ఏవో కథనాలు రావడం, వాటికి ఆ సంస్థనో, ప్రభుత్వమో వివరణలివ్వడం పాత కథే. కానీ, ఇప్పుడు మీడియాలో వెలువడిన కథనాలు అలాంటివి కాదు. ప్రాజెక్టు నుంచి ఎల్ అండ్ టీ మెట్రో రైలు సంస్థ వైదొలగేందుకు సిద్ధమవుతున్నదని, దానిని మీరే చేపట్టుకోండంటూ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసిందని ఆ కథనాల సారాంశం. ప్రాజెక్టు పనుల్లో తమకు ఎదురవుతున్న అనేకానేకా ప్రతిబంధకాలను ప్రస్తావించడంతో ఊరుకోక రాష్ట్ర విభజనానంతరం హైదరాబాద్ ప్రాధాన్యంలో మార్పు వచ్చిందంటూ ఆ లేఖ అభిప్రాయపడిందని తాజా కథనాలు పేర్కొనడంతో వివాదం పతాక స్థాయికి చేరుకున్నది. తమ ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకు ఉద్దేశపూర్వకంగానే ఈ కథనాలు వెలువడ్డాయని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అంటున్నారు. కథనాల వెనక దురుద్దేశాలు, కుట్రల ఆరోపణల సంగతలా ఉంచి ఎల్ అండ్ టీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాయడమైతే వాస్తవమని ఆ సంస్థ సీఈఓ వి.బి. గాడ్గిల్ అంగీకరించారు. ప్రాజెక్టుకు సంబంధించి రాస్తున్న లేఖల పరంపరలో ఇది కూడా భాగమని ఆయన ఉవాచ. భారీ ప్రాజెక్టు గనుక ఏవో సమస్యలొస్తుంటాయని కూడా ఆయన చెబుతున్నారు. పూర్తయ్యేసరికి సుమారు రూ. 14,000 కోట్లు ఖర్చుకాగలదని అంచనాలున్న ఈ ప్రాజెక్టు భారీ స్థాయిదే. దీనిపై ఇప్పటికే దాదాపు రూ. 5,000 కోట్లు ఖర్చుచేసినట్టు ఎల్ అండ్ టీ సంస్థ చెబుతున్నది. గాడ్గిల్ అన్నట్టు ప్రాజెక్టు ఇంత బృహత్తరమైనది కనుక సమస్యలొస్తాయన్న మాట కూడా వాస్తవమే. కానీ, ఈ వివాదాల పరంపరకు ఎక్కడో అక్కడ, ఏదో ఒక దశలో ముగింపు ఉండాలి కదా! ఆ విషయంలో ఇటు ఎల్ అండ్ టీ సంస్థకు... అటు ప్రభుత్వానికి అంత పట్టింపు ఉన్నట్టు కనబడదు. సరిగదా మధ్యమధ్య లీకులివ్వడం, ఆనక దానిపై మౌనంగా ఉండటం సర్వసాధారణమైంది. మెట్రో రైలు నిర్మాణం జంటనగరాల్లోని పలు చారిత్రక కట్టడాలను ధ్వంసం చేసేదిగా ఉన్నదని గతంలో మేథావులు కొందరు ఆందోళన వ్యక్తంచేశారు. రెండుచోట్ల భూగర్భ మెట్రో పనులు చేపడితే ఈ సమస్య పరిష్కారమవుతుందని మూడునెలల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో కేసీఆర్‌కు ఎల్ అండ్ టీ సంస్థ లేఖ రాసిందని, భూగర్భ మెట్రో తమ వల్ల కాదని చెప్పిందని లీకులు వెలువడటం తప్ప వివరణనిచ్చినవారు లేరు. ఇంత భారీ ప్రాజెక్టు విషయంలో జరుగుతున్నదేమిటో, చివరకు ఇది ఏమవుతుందో తెలుసుకోవాలన్న ఆసక్తి, ఆత్రుత పౌరులకు ఉంటుంది. అలా తెలుసుకోవడం వారి హక్కు కూడా. పారదర్శకంగా వ్యవహరించి, అన్నిటినీ ప్రజలముందుంచితే ఇలాంటి కథనాలకు ఆస్కారం ఉండదు. మెట్రో రైలు ప్రాజెక్టు ఒక్క హైదరాబాద్‌కో, తెలంగాణకో ప్రతిష్టాత్మకమైనది మాత్రమే కాదు...దేశానికే తలమానికమైనది. ప్రజారవాణా రంగంలో పీపీపీ పద్ధతిన దేశంలో చేపట్టిన తొలి ప్రాజెక్టు ఇది. కనుకనే ప్రాజెక్టుకు సారథ్యంవహిస్తున్న సంస్థ వ్యూహాత్మకంగానే కావొచ్చుగానీ... తప్పుకుంటాననడం అసాధారణమైన విషయం. ఎల్ అండ్ టీ సంస్థ ఈ విషయాన్ని సరిగా గుర్తించినట్టు లేదు. 2011నుంచీ ప్రభుత్వంతో తాము జరుపుతున్న సుదీర్ఘ ఉత్తరప్రత్యుత్తరాల్లో ఎన్నో విషయాలున్నాయని, అందులో ఇది కూడా ఒకటని గాడ్గిల్ చాలా అలవోకగా చెబుతున్నారు. మీడియాలో కథనాలు వెలువడటానికి ముందురోజు కూడా ఆయన ఒక కార్యక్రమంలో అరవై నెలల రికార్డు సమయంలో ఈ ప్రాజెక్టును పూర్తిచేయడమే లక్ష్యమని మాట్లాడారు. ప్రాజెక్టు పూర్తయ్యాక ఈ మహానగరం రూపురేఖలు ఎలా మారగలవో నోరూరేలా చెప్పారు. ఒకపక్క విభజన తర్వాత హైదరాబాద్ ప్రాధాన్యం తగ్గిపోయిందని, యూటీ చేస్తారనుకున్నామని రహస్య లేఖలో రాసి బహిరంగంగా అందుకు భిన్నంగా మాట్లాడటంలోని ఉద్దేశమేమిటి? ఇంతకన్నా చిత్రమైన సంగతేమంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా ఆ సంస్థ ఈ బాణీలోనే లేఖ రాసిందట. అయితే, అప్పుడు వైదొలగుతామనడానికి కారణాలు వేరు. ఇలా తరచు తప్పుకుంటామని లేఖలు రాయడం, సందర్భానుసారం అందుకు ఏదో ఒక కారణం చూపడం నిర్మాణ రంగంలో అగ్రగామిగా ఉంటున్న ఎల్ అండ్ టీ వంటి సంస్థకు భావ్యమేనా? లేఖ రాయడం వెనకా, దాన్ని లీక్ చేయడం వెనకా ఎవరో ఉన్నారని కేసీఆర్ అన్నారంటే అందుకు తమ బాధ్యతారహిత ధోరణే కారణమని ఇప్పటికైనా సంస్థ గుర్తిస్తుందా? ఇంత బృహత్తరమైన ప్రాజెక్టు చేపట్టినప్పుడు భూసేకరణ దగ్గరనుంచి ఎన్నో సమస్యలు వచ్చిపడతాయి. వాటి పరిష్కారంలో జాప్యం జరిగితే ఆ మేరకు ప్రాజెక్టు ఆలస్యమై దాని వ్యయం కూడా భారమవుతుంది. దీన్నెవరూ కాదనలేరు. అయితే, ఏ సమస్యనైనా సవ్యంగా పరిష్కరించుకోవడానికి కొన్ని మార్గాలంటూ ఉంటాయి. బాధ్యత గుర్తెరిగితే, చిత్తశుద్ధి ఉంటే అలాంటి మార్గాలను ఎన్నుకోవాలి. అంతేతప్ప వైదొలగుతామని లేఖలు రాయడం, వాటిని లీక్ చేయడం మంచిది కాదు. ప్రాజెక్టు రూపుదిద్దుకుంటున్న తీరు జంట నగరాల పౌరులకూ, ఇక్కడికి వచ్చిపోయేవారికి ఎంతో ఆసక్తిని కలిగిస్తున్నది. కానీ, దానికి సమాంతరంగా ఈ బాపతు లేఖలు రాసి కలవరం సృష్టిద్దామనుకోవడం ఎవరికీ మంచిది కాదు. -
మెట్రో డైలమా
*చారిత్రక కట్టడాలను కూల్చొద్దంటున్న సీఎం *టన్నెల్ విధానమే మేలని సూచన * సాధ్యం కాదంటున్న నిర్మాణ సంస్థ * మధ్యేమార్గంగా ఎల్అండ్టీ సర్వే సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మెట్రో రైల్ పనులపై నీలినీడలు కమ్ముకున్నాయి. చారిత్రక కట్టడాలున్న రెండు మార్గాల్లో భూగర్భ మెట్రో పనులు చేపట్టాలని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ డైలమాలో పడింది. భూగర్భ మార్గం సాధ్యం కాదని సదరు సంస్థ పేర్కొంటున్నా సీఎం వినే పరిస్థితి లేకపోవడంతో సదరు రూట్లలో పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఇప్పటికే పలు పిల్లర్లు పూర్తయినా మిగతా పనులను నిలిపివేసింది. మొదట సర్వే చేపట్టి తద్వారా వచ్చే ఆదేశాలకు అనుగుణంగా ముందుకు సాగాలని ఆ సంస్థ భావిస్తోంది. ఇందుకుగాను ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఏదేమైనా భూగర్భ మెట్రో సాధ్యం కాదనే విషయాన్ని ఎల్అండ్టీ బాహాటంగానే స్పష్టం చేస్తున్నా స్పష్టత వచ్చేందుకు మరికొంత సమయం పట్టే అవకాశముంది. నిలిచిన పనులు! చారిత్రక కట్టడాలున్న ప్రదేశాల్లో నిపుణుల బృందం అధ్యయనం చేయాల్సి ఉన్నందున మొజంజాహీ మార్కెట్, అసెంబ్లీ, లక్డీకాపూల్ మార్గంలో ప్రస్తుతానికి పనులు నిలిచిపోయినట్టు తెలిసింది. ఈ రూట్లో సోమవారం తాత్కాలికంగా కొన్ని బారికేడ్లను తొలగించారు. ఈ మార్గంలో సర్వే పూర్తయి, ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాకే పనులు మొదలయ్యే అవకాశాలున్నాయని హెచ్ఎంఆర్ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఈ మార్గంలో 20 వరకు ఎలివేటెడ్ పిల్లర్లు ఏర్పాటయ్యాయి. భూగర్భ మెట్రో అంశంపై సాధ్యాసాధ్యాలను తేల్చేందుకు హెచ్ఎంఆర్, ఎల్అండ్టీ సంస్థలు తాజాగా సంయుక్తంగా నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిసింది. ముఖ్యంగా జేబీఎస్-ఫలక్‌నుమా రూట్లో సుల్తాన్‌బజార్ ప్రాంతంతోపాటు, ఎల్బీనగర్-మియాపూర్ రూట్లో ఎంజే మార్కెట్, అసెంబ్లీ, గన్‌పార్క్ ప్రదేశాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ భూగర్భ మెట్రో మార్గం వేయాల్సిందేనని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అసెంబ్లీలో విస్పష్ట ప్రకటన చేయడంతో మెట్రో వర్గాలు ఈ బృందాన్ని ఏర్పాటు చేసినట్టు సమాచారం. నిపుణుల కమిటీలో హెచ్ఎంఆర్, ఎల్అండ్టీ ఉన్నతాధికారులతోపాటు స్ట్రక్చరల్ ఇంజనీర్లు, భూభౌతిక శాస్త్రవేత్తలు, రైల్వే రంగ నిపుణులు ఉన్నారని తెలిసింది. ఈ బృందం భూగర్భ మెట్రో సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్టు సమాచారం. భూగర్భ మార్గంపై అనుమానాలెన్నో.. కోల్‌కతాలోని భూగర్భ మెట్రో మార్గంలో ఇటీవల విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సుమారు రెండు గంటల పాటు ఓ మెట్రోరైలు నిలిచిపోయింది. ప్రయాణికులు బయటికి వెళ్లే దారిలేక, శ్వాస ఆడక స్పహతప్పిపోయిన ఉదంతాన్ని సైతం నిపుణుల బృందం పరిగణనలోకి తీసుకుని నివేదికలో ప్రస్తావించనున్నట్టు తెలిసింది. నగరంలో భూగర్భ మార్గంలో పనులు చేపట్టాల్సి వస్తే ప్రతి మూడు మీటర్ల లోతున వచ్చే రాతి నేల (రాక్ సాయిల్)ను తొలిచేందుకు బ్లాస్టింగ్ (పేలుడు పదార్థాల వినియోగం) చేయడం వీలుకాదనే అంశాన్ని నివేదికలో పొందుపరిచే అవకాశం ఉన్నట్టు సమాచారం. బ్లాస్టింగ్ల వల్ల చారిత్రక కట్టడాలకు మరో రూపంలో ప్రమాదం పొంచి ఉంటుందని, రద్దీ రూట్లో ఇది సాధ్యపడదని అంటున్నారు. కాగా భూగర్భ మార్గంలో పనులు చేపడితే భద్రతాపరంగా వచ్చే సమస్యలను సైతం ప్రస్తావించనున్నట్లు సమాచారం. ఎల్అండ్టీ లేఖపై కలకలం? భూగర్భ మెట్రో సాధ్యం కాదని మెట్రో ప్రాజెక్టు నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ వర్గాలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాసినట్టు వచ్చిన కథనాలను ఇటు ఎల్అండ్టీ, అటు హెచ్ఎంఆర్ వర్గాలు ఖండించలేదు. దీనిపై ఆయా సంస్థల ఉన్నతాధికారులు మాట్లాడేందుకు నిరాకరించారు. ముందుగా అనుకున్న ప్రకారం నాగోల్-మెట్టుగూడ రూట్లో మెట్రో మొదటి దశను 21 మార్చి 2015 నాటికి ప్రారంభిస్తామని హెచ్ఎంఆర్ వర్గాలు తెలిపాయి. జూలై మొదటి లేదా రెండో వారంలో ఇదే రూట్లో ట్రయల్ రన్‌కు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నాయి. ఆదేశాలు అందలేదు: ఎల్అండ్టీ భూగర్భ మెట్రోపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎల్అండ్టీ, హెచ్ఎంఆర్ సంస్థలకు ఎలాంటి ఆదేశాలు, సూచనలు అందలేదని ఎల్అండ్టీ వర్గాలు సోమవారం స్పష్టం చేశాయి. ముందుగా కుదిరిన ఒప్పందం మేరకు, అందులో ప్రస్తావించిన పనులు విధిగా పూర్తిచేస్తామని తెలిపాయి. ఒప్పందానికి విరుద్ధంగా ఎలాంటి పనులు చేపట్టలేమని స్పష్టం చేశాయి. దీనిపై తాము ప్రభుత్వానికి ఎలాంటి లేఖ రాయలేదని పేర్కొన్నాయి. -
ఎల్అండ్టీ లాభం హైజంప్
న్యూఢిల్లీ: క్యాపిటల్ గూడ్స్ దిగ్గజం ఎల్అండ్టీ గత ఆర్థిక సంవత్సరం(2013-14) జనవరి-మార్చి(క్యూ4) కాలానికి ఆకర్షణీయ ఫలితాలను సాధించింది. నికర లాభం 69% జంప్‌చేసి రూ. 2,723 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2012-13) ఇదే కాలంలో రూ. 1,610 కోట్లను మాత్రమే ఆర్జించింది. మౌలిక సదుపాయాలు, భారీ ఇంజనీరింగ్ విభాగాల పనితీరు ఇందుకు దోహదపడింది. స్టాండెలోన్ ఫలితాలివి. ఇదే కాలంలో నికర అమ్మకాలు 10% పుంజుకుని రూ. 20,079 కోట్లకు ఎగశాయి. గతంలో రూ. 18,076 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. పూర్తి అనుబంధ సంస్థ అయిన ఎల్అండ్టీ హైడ్రోకార్బన్‌కు 2013 ఏప్రిల్ నుంచి హైడ్రోకార్బన్ బిజినెస్‌ను బదిలీ చేసినందున ఫలితాలలో వీటిని కలపలేదని ఎల్అండ్టీ తెలిపింది. కొత్త ప్రభుత్వంపై ఆశలు... కేంద్రంలో మోడీ అధ్యక్షతన ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం ప్రకటించిన అభివృద్ధి అజెండా ఆశావహంగా ఉన్నదని, తద్వారా వృద్ధికి అనువైన వాతావరణం ఏర్పడుతుందని ఆశిస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. కంపెనీకి కీలకమైన మౌలిక సదుపాయాలు, విద్యుత్ రంగాలకు వృద్ధి అవకాశాలు అధికంగా ఉన్నాయని, స్పష్టమైన విధానాలు, వాటి అమలు కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపింది. భారీ ఇంజనీరింగ్ విభాగం నుంచి ఆదాయం 47% ఎగసి రూ. 1,348 కోట్లకు చేరగా, ఇన్ఫ్రా విభాగం నుంచి రూ. 13,260 కోట్లు లభించింది. ఇది 17% వృద్ధి. ఆర్డర్‌బుక్ విలువ 13% పుంజుకుని రూ. 1,62,952 కోట్లకు చేరింది. దీనిలో విదేశీ ఆర్డర్ల వాటా 21%. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో షేరు యథాతథంగా రూ. 1,549 వద్ద ముగిసింది.