
ఏపీ తాత్కాలిక సచివాలయం ప్రారంభం
తెల్లవారు జామున 4.01 నిమిషాలకు ప్రారంభం
సాక్షి, విజయవాడ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయ భవనానికి వెలగపూడిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభోత్సవం చేశారు. సోమవారం తెల్లవారు జామున నాలుగు గంటల ఒక్క నిమిషానికి భవనంలోకి ప్రవేశించి తాత్కాలిక సచివాలయాన్ని ప్రారంభించారు. ఈ నెల తరువాత సరైన ముహూర్తాలు లేవనే కారణంతో హడావుడిగా ఈ ముందస్తు ప్రారంభోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఎల్ అండ్ టీ నిర్మిస్తున్న నాలుగో బ్లాకులో ఇందుకోసం ఒక గది(33 566 సైజులో)ని ఆగమేఘాల మీద సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ ఒత్తిడితో ఎల్ అండ్ టీ యుద్ధప్రాతిపదికన ఆ పనులు చేస్తోంది. మొదట రెండు గదులు సిద్ధం చేయాలని చూసినా.. రెండు రోజుల్లో అది సాధ్యమయ్యే పనికాకపోవడంతో ఒకదాన్నే అందుబాటులోకి తెచ్చారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, పలువురు అధికారులు హాజరయ్యారు.