నెలాఖరు కల్లా ఏపీ సచివాలయం ఖాళీ | AP Secretariat empty By end of the month | Sakshi
Sakshi News home page

నెలాఖరు కల్లా ఏపీ సచివాలయం ఖాళీ

Published Thu, Sep 15 2016 3:10 AM | Last Updated on Sat, Aug 18 2018 8:27 PM

నెలాఖరు కల్లా ఏపీ సచివాలయం ఖాళీ - Sakshi

నెలాఖరు కల్లా ఏపీ సచివాలయం ఖాళీ

ఒకటి నుంచి వెలగపూడిలోనే విధులు

 సాక్షి, హైదరాబాద్: ఈ నెలాఖరు కల్లా హైదరాబాద్‌లోని ఏపీ సచివాలయం ఖాళీ కానుంది. వచ్చే నెల ఒకటి నుంచి వెలగపూడి సచివాలయం నుంచి విధులు నిర్వర్తించేందుకు సచివాలయ శాఖల్లోని అధికారులు, ఉద్యోగులు సన్నద్ధమవుతున్నారు. గురువారం నుంచి తాత్కాలిక సచివాలయం నుంచే మంత్రులందరూ పనిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించడంతో వీరు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ నెల 19న సచివాలయ మున్సిపల్ శాఖ ఉద్యోగులు, అధికారులు వెలగపూడి తరలివెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అలాగే మిగతా శాఖలు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.

వచ్చే నెల దసరా రోజున సీఎం చంద్రబాబు కూడా వెలగపూడిలోని కార్యాలయం నుంచే పనిచేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరు కల్లా హైదరాబాద్‌లోని సచివాలయం ఖాళీ కానుంది. ఒక్కో శాఖలో అవసరానికి అనుగుణంగా  ఒకరిద్దరిని మాత్రమే హైదరాబాద్‌లోని సచివాలయంలో ఉంచేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement