సీఎం కోసం వచ్చి వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. | person suicide attempt in AP Secretariat | Sakshi
Sakshi News home page

సీఎం కోసం వచ్చి వ్యక్తి ఆత్మహత్యాయత్నం..

Published Wed, Nov 1 2017 4:46 PM | Last Updated on Tue, Nov 6 2018 8:08 PM

person suicide attempt in AP Secretariat - Sakshi

సాక్షి, అమరావతి: ఓ వ్యక్తి సీఎం నారా చంద్రబాబు నాయుడ్ని కలిసేందుకు ఏపీ సచివాలయంకు వచ్చాడు. అక్కడున్న సిబ్బంది అతని లోపలికి అనుమతించలేదు. దీంతో మనస్థాపానికి గురైన ఆ వ్యక్తి తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును తీసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాలివి.. భాదితుడు కర్నూల్‌ జిల్లా ఆదోనికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

సీఎంను కలిసేందుకు పంపాలని ఆ వ్యక్తి కోరినట్లు తెలిసింది. దీనికి సచివాలయ సిబ్బంది అతని లోపలికి అనుమతించలేదు. వారు సీఎం కాబినేట్‌ మీటింగ్‌లో ఉన్నారని చెప్పడంతో విషం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది ఆ వ్యక్తిని అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement