
ఎన్‌ఏడీ జంక్షన్(విశాఖ పశ్చిమ): మురళీనగర్ ఈస్ట్ అయ్యప్పనగర్‌కు చెందిన కడలి సత్యలావణ్య(28) బలవన్మరణానికి పాల్పడింది. బుధవారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి కంచరపాలెం పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సత్యలావణ్య ఎల్‌అండ్‌టీలో ఇంజినీర్‌గా పనిచేస్తోంది. బుధవారం ఉదయం తమ్ముడు రవిశంకర్ తల్లికి అనారోగ్యంగా ఉందని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో గదిలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని అత్మహత్యకు పాల్పడింది. ఆస్పత్రి నుంచి వచ్చిన వారు చూసి వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు.
కంచరపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేసుకుని వివరాలు సేకరించారు. గదిలో లావణ్య రాసిన సూసైడ్ నోటు లభించింది. ‘నా చావుకు ఎవరూ కారణం కాదని, అందరూ తనని క్షమించాలని, తన వల్లే అన్నయ్య ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని, అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలని’ అందులో రాసి ఉంది. అయితే లావణ్యకు పెళ్లిసంబంధం కుదిరిందని తెలిసింది. తల్లి క్యాన్సర్‌తో బాధపడుతోందని, ఈ పరిస్థితులను చూసి మనస్తాపంతో మృతి చెంది ఉంటుందని లావణ్య తమ్ముడు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు
చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment