నాలుగేళ్లుగా సహజీవనం.. ప్రియుడు మందలించడంతో.. | Young Woman Commits Suicide After Boyfriend Reprimands Her | Sakshi
Sakshi News home page

నాలుగేళ్లుగా సహజీవనం.. ప్రియుడు మందలించడంతో..

Published Mon, Jan 17 2022 7:19 AM | Last Updated on Mon, Jan 24 2022 8:19 AM

Young Woman Commits Suicide After Boyfriend Reprimands Her - Sakshi

ఆత్మహత్య చేసుకున్న దుర్గాదేవి (ఫైల్‌)  

సాక్షి, మాకవరపాలెం (విశాఖపట్నం): ప్రియుడు మందలించాడని ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని లచ్చన్నపాలెం శివారు దాలింపేటకు చెందిన పోలవరపు దుర్గాదేవి(18), రోలుగుంట మండలం జేపీ అగ్రహారం గ్రామానికి చెందిన దమ్ము నాగేంద్ర ప్రేమించుకున్నారు.

అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకుందామనుకున్నా అనివార్య కారణాల వల్ల పెళ్లి జరగలేదు. నాలుగేళ్లుగా నాగేంద్ర ఇంటివద్ద సహజీవనం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో నాలుగు రోజుల క్రితం నాగేంద్ర, దుర్గాదేవి మధ్య ఘర్షణ జరిగింది. నాగేంద్ర మందలించడంతో మనస్తాపానికి గురైన దుర్గాదేవి దాలింపేట వద్ద ఏలేరు కాలువలో పడి ఆత్మహత్య చేసుకుంది. దుర్గాదేవి మృతదేహం మండలంలోని పైడిపాల వద్ద లభ్యమైంది. శనివారం అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు  ఎస్‌ఐ రామకృష్ణారావు తెలిపారు.

చదవండి: (భార్య చనిపోతే.. మరో కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement