చివరి సారిగా నిన్ను చూడాలి.. భార్య వాట్సాప్‌ కాల్‌.. ఇంతలోనే.. | Married Woman Commits Suicide In Visakhapatnam | Sakshi
Sakshi News home page

చివరి సారిగా నిన్ను చూడాలి.. భార్య వాట్సాప్‌ కాల్‌.. ఇంతలోనే..

Sep 25 2022 7:59 PM | Updated on Sep 25 2022 8:01 PM

Married Woman Commits Suicide In Visakhapatnam - Sakshi

హైమ (ఫైల్‌)

ఆఖరిసారిగా నిన్ను చూడాలని వాట్సాప్‌ కాల్‌ చేశానని మాట్లాడి ఫోన్‌ పెట్టేసింది.

ఆనందపురం (భీమిలి): మండలంలోని భీమిలి క్రాస్‌ రోడ్డు వద్ద గల ఓ అపార్ట్‌మెంట్‌లో వివాహిత ఆత్మహత్య చేసుకున్నట్టు స్థానిక సీఐ రామచంద్రరావు శనివారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని గొట్టిపల్లి పంచాయతీ వెంకటాపురం గ్రామానికి చెందిన హైమకు మాకవరపాలెం మండలం అప్పన్నపాలెం గ్రామానికి చెందిన రమణతో రెండేళ్ల క్రితం వివాహమైంది. వారు బతుకు తెరువు కోసం వెంకటాపురం వచ్చి భీమిలి క్రాస్‌ రోడ్డు వద్ద గల ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. రమణ దివీస్‌లో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
చదవండి: భర్తతో విడిపోయి మరో వ్యక్తితో సహజీవనం.. చివరికి షాకింగ్‌ ట్విస్ట్‌

ఈ క్రమంలో వారికి ఏడాది క్రితం బాబు జన్మించాడు. అప్పట్లో హైమ(22)కు శస్త్ర చికిత్స జరగగా వికటించడంతో ఆమె చికిత్స పొందుతోంది. అప్పటి నుంచి కడుపునొప్పితో బాధపడుతోంది. శనివారం వారి కుమారుడు చేతన్‌ పుట్టిన రోజు. దీంతో బంధువులను ఆహ్వానించడానికని రమణ శుక్రవారం ఉదయం విజయనగరం వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో భర్త రమణకు హైమ వాట్సాప్‌ కాల్‌ చేసింది.

కడుపునొప్పి తీవ్రంగా ఉందని, భరించలేక పోతున్నానని, ఆఖరిసారిగా నిన్ను చూడాలని వాట్సాప్‌ కాల్‌ చేశానని మాట్లాడి ఫోన్‌ పెట్టేసింది. దీంతో కంగారుపడిన రమణ తిరిగి ఇంటికి చేరుకోగా అప్పటికే హైమ ఉరి వేసుకొని మరణించింది. ఈ మేరకు అందిన ఫిర్యాదు మేరకు సీఐ రామచంద్రరావు ఆధ్వర్యంలో ఎస్‌ఐ నరసింహమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement