లార్సెన్ & టుబ్రో (L&T) కంపెనీ భారతదేశంలో మాత్రమే కాకుండా.. మిడిల్ ఈస్ట్ నుంచి కూడా భారీ ఆర్డర్‌లను పొందింది. వీటి విలువ రూ. 2,500 కోట్ల నుంచి రూ. 5,000 కోట్ల మధ్య ఉన్నట్లు సమాచారం.
పశ్చిమ బెంగాల్‌లో లేటెస్ట్ పంపిణీ నిర్వహణ వ్యవస్థను అమలు చేయడానికి లార్సెన్ & టుబ్రో ఆర్డర్‌లను సొంతం చేసుకుంది. ఈ టెక్నాలజీ.. అవుటేజ్ నిర్వహణ వ్యవస్థ & పంపిణీ నిర్వహణ వ్యవస్థ కార్యాచరణలను కలపడం ద్వారా విద్యుత్ పంపిణీని మరింత స్మార్ట్‌గా చేయనుంది.
మీడియం, తక్కువ వోల్టేజ్ నెట్‌వర్క్‌ల రియల్ టైమ్ పర్యవేక్షణ మాత్రమే కాకుండా.. నియంత్రణ ద్వారా, లోపాలను త్వరగా వేరుచేయడం, వేగవంతమైన పునరుద్ధరణతో నెట్‌వర్క్ విశ్వసనీయత మెరుగుపడుతుంది.
ఇక మధ్యప్రాచ్యం (మిడిల్ ఈస్ట్) విషయానికి వస్తే.. కంపెనీ సౌదీ అరేబియాలో, సౌర ఉత్పత్తిని తరలించడానికి వీలు కల్పించే కీలకమైన 380 కేవీ సబ్‌స్టేషన్ కోసం ఆర్డర్ పొందబడింది. అదే విధంగా కువైట్‌లోని గ్రిడ్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి కంపెనీ 400 కేవీ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేస్తుంది.
ఇదీ చదవండి: మారుతి సుజుకి 'ఈ ఫర్ మీ' స్ట్రాటజీ: ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు అదే
దుబాయ్‌లో కూడా కంపెనీ 40/132 kV సబ్‌స్టేషన్‌తో సహా ఎక్స్‌ట్రా హై వోల్టేజ్ (EHV) సబ్‌స్టేషన్‌లను ఏర్పాటు చేయడానికి అనేక ఆర్డర్‌లను పొందింది. ఈ ప్రాజెక్ట్‌లు దుబాయ్ పవర్ ట్రాన్స్‌మిషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను విస్తరించే ప్రయత్నాలలో భాగంగా ఉన్నాయి.
The Power Transmission & Distribution (PT&D) vertical of Larsen & Toubro has won new orders in India and the Middle East. https://t.co/KEkpgCBaqH #LarsenToubroNews pic.twitter.com/848WPFsPKE
— Larsen & Toubro (@larsentoubro) January 7, 2025
Comments
Please login to add a commentAdd a comment