
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మెట్రో రైల్‌లో ప్రయాణించేటప్పుడు అనుసరించాల్సిన ముందు జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు ‘బిగ్‌బాస్ మిమ్మల్ని చూస్తున్నాడు’ అనే అవగాహన కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. స్టార్ మా, ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ సంయుక్తంగా ఈ ప్రచారాన్ని చేపట్టాయి. నగరంలోని 57 మెట్రో స్టేషన్లలోని కాన్‌కోర్స్, ప్రవేశ, నిష్క్రమణ, చెక్ ఇన్ ప్రాంగణాల్లో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన జింగిల్స్‌తో ఈ ప్రచారం చేపట్టారు.
మెట్రో కమ్యూటర్లు ప్రయాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు, మెట్రో స్టేషన్ ప్రాంగణాలలో అనుసరించాల్సిన విధానాలను గురించి అవగాహన కల్పించనున్నారు. ఈ సందర్భంగా బిగ్‌బాస్ హోస్ట్ అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. వినోదానికి ఓ సహేతుకమైన విధానమంటూ ఉండాలన్నారు. ఈ ప్రచారం అందుకు దోహదం చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెంట్రో ఎండీ అండ్ సీఈఓ కేవీబీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment