![Bigg Boss 6 Telugu Starting Date Confirmed After 2 Months Of New Year - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/20/nagarjuna.jpg.webp?itok=9Rygcl4a)
Bigg Boss 6 Telugu Season Starts In 2 Months: ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ 5 తెలుగు ఆదివారంతో ముగిసింది. అందరూ ఊహించనట్టుగానే బిగ్‌బాస్ 5 తెలుగు సీజన్ టైటిల్‌ను వీజే సన్నీ కైవసం చేసుకున్నాడు. దీనితో పాటు టీవీఎస్ బైక్, సువర్ణ భూమి ఇన్‌ఫ్రాస్టక్చర్ నుంచి షాద్‌నగర్‌లో రూ.25 లక్షల విలువ చేసే 300 చదరపు గజాల భూమిని గెలుచుకున్నాడు సన్నీ. ఈ సీజన్‌లో షణ్ముక్ జశ్వంత్ రన్నర్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే ఈ గ్రాండ్ ఫినాలేలో బిగ్‌బాస్ ప్రేక్షకులకు హోస్ట్ నాగార్జున సర్‌ప్రైజింగ్ న్యూస్ చెప్పాడు.
చదవండి: Bigg Boss 5 Telugu Winner Sunny: విన్నర్ సన్నీతో పాటు రన్నరప్ షణ్ముఖ్‌కు కూడా ప్లాట్
ఎవరూ విన్నర్, ఎవరూ రన్నర్ అనేది ప్రకటించిన అనంతరం వెంటనే ఆ తర్వాత సీజన్ ఎప్పుడో ప్రకటించాడు నాగ్. ఒక సీజన్ ముగియగానే ఆ నెక్ట్స్ సీజన్ రావడానికి 5 నుంచి 6 నెలలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పడుతుంది. దీంతో నెక్ట్స్ సీజన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆడియన్స్‌కు నాగ్ తీపి కబురు అందించాడు. ‘సాధారణంగా ఒక సీజన్ అయిపోగానే కొత్త సీజన్ స్టార్ట్ అవ్వడానికి 5 నెలలు పడుతుంది. కానీ ఈసారి మీకు మరింత వినోదం పంచేందుకు బిగ్‌బాస్ 6 సీజన్‌ను అంతకు ముందే మీ ముందుకు తీసుకురాబోతున్నాము.
చదవండి: ఓడియమ్మ.. సిరి అంత సంపాదించిందా?
కొత్త సంవత్సరం మొదలైన రెండు నెలలకు బిగ్‌బాస్ కొత్త సీజన్ మొదలు కానుంది’ అని తెలిపాడు. అంటే నాగార్జున చెప్పిన దాని ప్రకారం చూస్తే కొత్త సంవత్సరం వచ్చిన రెండు నెలలకు అంటే మార్చి లేదా ఎప్రీల్ బిగ్‌బాస్ 6 సీజన్ స్టార్ట్ కానుంది అన్నమాట. ప్రతి రోజు రాత్రి 10 గంటల నుంచి 11 గంటలకు, వీకెండ్‌లో 9 గంటల నుంచి ఇంట్లో సందడి చేస్తూ వినోదాన్ని పంచే ఈ బిగ్‌బాస్ సీజన్ ముగియడంతో నిరాశలో ఉన్న ప్రేక్షకులకు ఇది నిజంగానే గుడ్‌న్యూస్ అని చెప్పుకొవాలి.
Comments
Please login to add a commentAdd a comment