VJ Sunny
-
ఫుడ్ బిజినెస్ లోకి బిగ్ బాస్ విన్నర్ విజే సన్నీ (ఫొటోలు)
-
ఇప్పటివరకు బిగ్‌బాస్ గెలిచినవారి జాతకాలివే!
ఫేమస్ అవడానికో లేదా డబ్బు సంపాదించడానికో బిగ్‌బాస్ షోకు వచ్చేవాళ్లు చాలామందే ఉన్నారు! అయితే వచ్చిన ప్రతి ఒక్కరూ అంతో ఇంతో డబ్బు వెనకేసుకుంటారేమో కానీ మంచి పేరు రావడం కష్టం. ఇక్కడ అడుగుపెట్టినవాళ్లలో నెగెటివిటీని మూటగట్టుకుని బయటకు వెళ్లినవాళ్లే ఎక్కువ. కొందరు మాత్రమే తామేంటో నిరూపించుకుని విజేతలుగా నిలిచి ప్రేక్షకుల మనసులు గెలిచారు. మరి ఇప్పటివరకు జరిగిన సీజన్లలో గెలిచినవారు ఇప్పుడు ఏం చేస్తున్నారో చూసేద్దాం..బిగ్‌బాస్ 1బిగ్‌బాస్ తెలుగు మొదటి సీజన్లో సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కంటెస్టెంట్లనే ఎక్కువగా తీసుకొచ్చారు. నవదీప్, హరితేజ, ఆదర్శ్ అందరినీ వెనక్కు నెట్టి శివబాలాజీ విజేతగా నిలిచాడు. ఈ విజయంతో తన కెరీర్ ఏమైనా మారిందా? అంటే లేదనే చెప్పాలి. 2017లో బిగ్‌బాస్ 1 సీజన్ జరగ్గా దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత 2022లో మళ్లీ బిగ్స్క్రీన్పై కనిపించాడు. ఒకప్పటి అంత స్పీడుగా సినిమాలు చేయకపోయినా ఆచితూచి ప్రాజెక్టులు ఎంపిక చేసుకుంటున్నాడు.బిగ్‌బాస్ 2బిగ్‌బాస్ రెండో సీజన్లో కౌశల్ మండా విజయం సాధించాడు. ఇతడి కోసం జనాలు ర్యాలీ చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. తన చేతిలో బోలెడన్ని ఆఫర్లు ఉన్నాయి, సినిమాలు చేస్తున్నాను అని చెప్పుకునే అతడు ఎక్కువగా బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్, షోలలోనే కనిపిస్తున్నాడు తప్ప సినిమాల ఊసే లేదు.బిగ్‌బాస్ 3శ్రీముఖిని వెనక్కు నెట్టి రాహుల్ సిప్లిగంజ్ బిగ్‌బాస్ 3 టైటిల్ ఎగరేసుకుపోయాడు. ఇతడికి ఉన్న టాలెంట్‌తో పెద్ద సినిమాల్లోనూ పాటలు పాడే ఛాన్సులు అందుకున్నాడు. అలా ఆర్ఆర్ఆర్ మూవీలోని ఆస్కార్ విన్నింగ్ సాంగ్ 'నాటు నాటు..'ను కాలభైరవతో కలిసి ఆలపించాడు. బిగ్‌బాస్‌కు వెళ్లొచ్చాక స్టార్ స్టేటస్ అందుకున్న ఏకైక విన్నర్ బహుశా ఇతడే కావచ్చు.బిగ్‌బాస్ 4కండబలం కన్నా బుద్ధిబలం ముఖ్యం అని నిరూపించాడు అభిజిత్. ఎక్కువగా టాస్కులు గెలవకపోయినా మైండ్ గేమ్ ఆడి, తన ప్రవర్తనతో టైటిల్ గెలిచేశాడు. బిగ్‌బాస్ తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకుని మోడ్రన్ లవ్ హైదరాబాద్ అనే సిరీస్‌లో తళుక్కున మెరిశాడు. మళ్లీ రెండేళ్లు గ్యాప్ తీసుకుని మెగా కోడలు లావణ్య త్రిపాఠితో కలిసి మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ చేశాడు. ఇప్పుడు మళ్లీ ఖాళీగానే ఉన్నట్లున్నాడు.బిగ్‌బాస్ 5బిగ్‌బాస్ ఐదో సీజన్లో వీజే సన్నీ విన్నర్‌గా నిలిచాడు. అప్పటివరకు సీరియల్స్‌లోనే కనిపించిన అతడిని వెండితెరకు పరిచయం చేయడానికి ఈ షో మంచి ప్లాట్‌ఫామ్ అని భావించాడు. బిగ్‌బాస్ విజేతగా బయటకు వచ్చి హీరోగా ఏడాదికో సినిమా చేశాడు. కానీ మంచి హిట్టు అందుకోలేకపోయాడు.'బిగ్‌బాస్ 6ఈ సీజన్ విన్నర్ సింగర్ రేవంత్ మంచి టాలెంటెడ్. అప్పటివరకు ఎన్నో హిట్ సాంగ్స్ పాడాడు. ఈ షో తర్వాత కూడా తన జీవితం అలాగే కొనసాగిందే తప్ప ఊహించని మలుపులు అయితే ఏమీ జరగలేదు. ఇంకా చెప్పాలంటే అప్పటికన్నా ఇప్పుడే కాస్త ఆఫర్లు తగ్గాయి.బిగ్‌బాస్ 7రైతుబిడ్డ.. ఈ ఒకే ఒక్క పదం అతడిని బిగ్‌బాస్ విన్నర్‌ను చేసింది. గెలిస్తే రైతులకు సాయం చేస్తానంటూ ఆర్భాటాలు పోయిన ఇతడు ఆ తర్వాత ఒకరిద్దరికి సాయం చేసి చేతులు దులిపేసుకున్నాడు. ఈ బిగ్‌బాస్ షో తర్వాత కూడా ఎప్పటిలాగే రోజూ పొలం వీడియోలు చేసుకుంటూ బతికేస్తున్నాడు.బిగ్‌బాస్ నాన్‌స్టాప్ (ఓటీటీ)హీరోయిన్ బిందుమాధవి.. లేడీ ఫైటర్‌గా పోరాడి బిగ్‌బాస్ నాన్‌స్టాప్ టైటిల్ ఎగరేసుకుపోయింది. ఈ తెలుగమ్మాయికి బిగ్‌బాస్ తర్వాత మంచి అవకాశాలే వచ్చాయి. యాంగర్ టేల్స్, న్యూసెన్స్, మాన్షన్ 24, పరువు వెబ్ సిరీస్‌లలో కనిపించింది. అయితే ఇప్పటికీ తమిళంలోనే సినిమాలు చేస్తోంది తప్ప టాలీవుడ్లో మాత్రం రీఎంట్రీ ఇవ్వలేదు.ఇప్పటివరకు బిగ్‌బాస్ గెలిచినవారి జాతకాలు ఇలా ఉన్నాయి. మరి ఈసారి ఇంట్లో అడుగుపెట్టిన పద్నాలుగో మందిలో ఎవరు గెలుస్తారో? తర్వాత వారి కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి! -
కల నెరవేర్చుకున్న బిగ్‌బాస్ విన్నర్
బిగ్‌బాస్ విన్నర్, హీరో వీజే సన్నీ తన కల నెరవేర్చుకున్నాడు. ఒక సెలూన్ ప్రారంభించాలన్న కలను నెరవేర్చుకున్నాడు. ద బార్బర్ క్లబ్ (టీబీస్) సెలూన్ ఫ్రాంచైజీని హైదరాబాద్‌లో ప్రారంభించాడు. ఈ ఓపెనింగ్‌కు బిగ్‌బాస్ సెలబ్రిటీలే మానస్, సోహైల్, ఆర్జే కాజల్, దీప్తి సునయన తదితరులు హాజరై సందడి చేశారు.ద బార్బర్ క్లబ్ సెలూన్‌ను ప్రవేశపెట్టిన జోర్డాన్ హైదరాబాద్‌లో ఫ్రాంచైజీ ఓపెనింగ్‌కు విచ్చేశాడు. అతడికి హారతి ఇచ్చి మరీ ఘన స్వాగతం పలికారు. ఈ వీడియోను సన్నీ షేర్ చేస్తూ నేటి నుంచి సెలూన్ అందుబాటులోకి వచ్చేసిందని తెలిపాడు. ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సెలూన్ తెరిచి ఉంటుందని పేర్కొన్నాడు.ఇది చూసిన అభిమానులు మొత్తానికి బిగ్‌బాస్ షోలో చెప్పిన కలను సాధించేశావు.. నువ్వు ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా యాంకర్‌గా కెరీర్ ఆరంభించిన సన్నీ తర్వాత నటుడిగా మారాడు. తెలుగు బిగ్‌బాస్ ఐదో సీజన్లో పాల్గొని విజేతగా అవతరించాడు. చివరగా సౌండ్ పార్టీ సినిమాలో నటించాడు. ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. View this post on Instagram A post shared by VJ Sunny (@iamvjsunny) View this post on Instagram A post shared by VJ Sunny (@iamvjsunny) చదవండి: సినీ‘వారం’: సాయితేజ్ ట్వీట్.. మంచు విష్ణు ఫైర్.. సారీ చెప్పిన సిద్ధార్థ్ -
‘సౌండ్ పార్టీ’ మూవీ రివ్యూ
టైటిల్: సౌండ్ పార్టీ నటీనటులు: వీజే సన్నీ, శివన్నారాయణ, అలీ, సప్తగిరి, థర్టీ ఇయర్స్ పృథ్వి, ‘మిర్చి’ ప్రియ, మాణిక్ రెడ్డి, అశోక్ కుమార్,రేఖ పర్వతాల తదితురులు నిర్మాతలు : రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర సమర్పణ : ‘పేపర్ బాయ్’ ఫేమ్ జయశంకర్ రచన - దర్శకత్వం : సంజయ్ శేరి సంగీతం: మోహిత్ రెహమానిక్ సినిమాటోగ్రఫీ: శ్రీనివాస్ రెడ్డి ఎడిటర్: జి.అవినాష్ విడుదల తేది: నవంబర్ 24, 2023 బిగ్‌బాస్ విజేత వీజే సన్నీ, యంగ్ హీరోయిన్ హృతికా శ్రీనివాస్ జంటగా నటించిన చిత్రం సౌండ్ పార్టీ. పేపర్ బాయ్‌తో హిట్ కొట్టిన డైరెక్టర్ జయశంకర్ తన చిరకాల మిత్రుడు సంజయ్ శేరికి దర్శకుడిగా అవకాశం ఇచ్చి ప్రోత్సహించాడు. అలా వీరి కాంబినేషన్లో సౌండ్ పార్టీ తెరకెక్కింది. అమాయకులైన తండ్రీకొడుకుల బంధం నేపథ్యంలో జరిగే కథాచిత్రమిది. మరి ఈ కథ జనాలకు కనెక్ట్ అయిందా? ప్రేక్షకులను మేరకు మెప్పించింది? బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్లో సౌండ్ చేయనుంది? అనేది రివ్యూలో చూసేద్దాం.. కథేంటంటే.. మధ్య తరగతి కుటుంబానికి చెందిన డాలర్ కుమార్(వీజే సన్నీ) ఆయన తండ్రి కుబేర్ కుమార్(శివన్నారాయణ)..కోటీశ్వరులు కావాలని కలలు కంటుంటారు. ఈజీ మనీ కోసం రకరకాల బిజినెస్‌లు చేసి నష్టపోతుంటారు. చివరకు కుబేర్ కుమార్‌కు పరిచయం ఉన్న సేటు నాగ భూషణం(నాగిరెడ్డి) దగ్గర అప్పు తీసుకొని ‘గోరు ముద్ద’అనే హోటల్ని ప్రారంభిస్తారు. అది ప్రారంభంలో బాగానే నడిచినా..డాలర్ కుమార్ ప్రియురాలు సిరి(హృతిక శ్రినివాస్) తండ్రి చెడగొడతాడు. దీంతో డాలర్ కుమార్ ఫ్యామిలీ మళ్లీ రోడ్డున పడుతుంది. మరోవైపు అప్పు ఇచ్చిన నాగ భూషణం డబ్బు కోసం ఒత్తిడి చేస్తుంటాడు. అలాంటి సమయంలో కుబేర్ కుమార్, డాలర్ కుమార్‌లకు ఓ ఆఫర్ వస్తుంది. ఎమ్మెల్యే వర ప్రసాద్ (పృథ్వీ) కొడుకు చేసిన నేరం మీద వేసుకిని వెళ్తే...రూ. 2 కోట్లు ఇస్తామని చెబుతారు. డబ్బుకు ఆశపడి అసలు నేరం ఏంటో తెలియకుండా తండ్రీ కొడుకులు జైలుకు వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఎమ్మెల్యే కుమారుడు చేసిన నేరమేంటి? ఉరిశిక్ష పడిన తండ్రీకొడుకులు దాని నుంచి ఎలా బయటపడ్డారు? ఆ రెండు కోట్ల రూపాయలు ఏం అయ్యాయి? కోటీశ్వరులు కావాలనే వారి కోరిక నెరవేరిందా? లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. కష్టపడకుండా డబ్బు సంపాదించి కోటీశ్వరులు కావాలని ఆశపడే ఓ ఫ్యామిలీ స్టోరీ ఇది. ఈ తరహా కాన్సెప్ట్‌తో తెలుగులొ చాలా సినిమాలే వచ్చాయి. సౌండ్ పార్టీలో కొత్తదనం ఏంటంటే..బిట్‌కాయిన్ అనే పాయింట్‌తో కామెడీ పండించడం. లాజిక్కులను పక్కకి పెట్టి..కేవలం కామెడీని నమ్ముకొనే ఈ కథను రాసుకున్నాడు దర్శకుడు సంజయ్ శేరి. అయితే పేపర్‌పై రాసుకున్న కామెడీ సీన్‌ని తెరపై అదే స్థాయిలో చూపించి, రక్తికట్టించడంలో కొంతవరకు మాత్రమే సఫలం అయ్యాడు. సినిమాలోని ప్రతి సీన్ నవ్వించే విధంగానే ఉంటుంది. కానీ కొన్ని సన్నివేశాలు కావాలనే కథకు అతికినట్లుగా అనిపిస్తుంది. కుబేర్ కుమార్ ఫ్యామిలీ నేపథ్యాన్ని తెలియజేస్తూ కథ ప్రారంభం అవుతుంది. స్టార్టింగ్ సీన్‌తోనే కథనం ఎలా సాగబోతుందో తెలియజేశాడు. డబ్బు కోసం తండ్రి కొడుకులు చేసే పనులు నవ్వులు పూయిస్తాయి. అయితే హీరోయిన్‌తో వచ్చే సీన్స్ మాత్రం కథకు అతికినట్లుగానే అనిపిస్తాయి. అలాగే కొన్ని చోట్ల చాలా రొటీన్‌గా అనిపిస్తాయి. హీరోయిన్ ఇంటికి వెళ్లిన హీరో..ఆమె పేరెంట్స్ దొరికిపోయినప్పుడు చేసే కవరింగ్.. అలాగే తండ్రీకొడుకులు అప్పు తీసుకున్న తీరు.. రొటీన్‌గా అనిపిస్తాయి. సీన్ల పరంగా చూస్తే ఫస్టాఫ్ నవ్వుకోవచ్చు. కానీ కథనం మాత్రం రొటీన్‌గా ఉంటుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితియార్థంలో కామెడీ బాగా వర్కౌట్ అయింది. జైలు నుంచి తప్పించుకునేందుకు తండ్రీకొడుకులు చేసే ప్రయత్నాలు సిల్లీగా అనిపించినా.. నవ్వులు పూయిస్తాయి. పత్తి సతీష్‌గా చలాకీ చంటి ఒకటిరెండు సీన్లలో కనిపించినా..బాగానే నవ్వించాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని ఓ సన్నివేశానికి చేసిన స్ఫూప్ సినిమాకు ప్లస్ అయింది. బిట్ కాయిన్ ఎపిసోడ్ కథను మలుపు తిప్పుతుంది. లాజిక్కులను పక్కకి పెట్టి.. సరదాగా నవ్వుకోవడానికి వెళ్తే మాత్రం ‘సౌండ్ పార్టీ’ అలరిస్తుంది. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాకు ప్రధాన బలం శివన్నారాయణ, సన్నీ పాత్రలే. కుబేర్ కుమార్ పాత్రలో శివన్నారాయణ, డాలర్ కుమార్ పాత్రలో సన్నీ అదరగొట్టేశారు. వీరిద్దరి ఫాదర్-సన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. సిరి పాత్రకు హృతిక న్యాయం చేసింది. తెరపై చాలా అందంగా కనిపించింది. అయితే ఆమె పాత్ర నిడివి తక్కువే. ఫాదర్-సన్ కెమిస్ట్రీ ముందు హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ తేలిపోయినట్లుగా అనిపిస్తుంది. శాస్త్రవేత్తగా అలీ ఒకటి రెండు సీన్లలో కనిపించినా.. బాగానే నవ్వించాడు. ఎమ్మెల్యే వరప్రసాద్‌గా పృథ్వీ మెప్పించాడు. హీరో చెల్లెలుగా రేఖ పర్వతాల తన పాత్ర పరిధిమేరకు చక్కగా నటించింది. ప్రియ, నాగిరెడ్డితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక పరంగా ఈ సినిమా పర్వాలేదు. మోహిత్ రెహమానిక్ నేపథ్య సంగీతంతో పాటు పాటలు బాగున్నాయి. శ్రీనివాస్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేమ్ రిచ్‌గా ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
రెండుగంటలు నవ్వుతూనే ఉంటారు
‘‘అమాయకులైన తండ్రీ కొడుకుల బంధం నేపథ్యంలో జరిగే కథే ‘సౌండ్ పార్టీ’. ఈ పాత్రలకి శివన్నారాయణ, సన్నీ కరెక్ట్‌గా సరిపోయారు. నా నిజ జీవితంలోని అనుభవాల నుంచి వినోదాత్మకంగా ఈ చిత్ర కథను రాశాను. ఈ సినిమాతో రెండు గంటలపాటు ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారు’’ అని డైరెక్టర్ సంజయ్ శేరి అన్నారు. వీజే సన్నీ, హృతికా శ్రీనివాస్ జంటగా శివన్నారాయణ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘సౌండ్ పార్టీ’. జయ శంకర్ సమర్పణలో ఫుల్ మూన్ మీడియాపై రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సంజయ్ శేరి మాట్లాడుతూ–‘‘మాది కామారెడ్డి. పూరి జగన్నాథ్‌గారిని స్ఫూర్తిగా తీసుకొని డైరెక్టర్ కావాలనుకున్నా. దర్శకులు మారుతి, సంపత్ నందిగార్ల వద్ద రచనా విభాంగలో పనిచేశా. జయశంకర్ ద్వారా నిర్మాతలకు ‘సౌండ్ పార్టీ’ కథ వినిపించాను.. వారికి నచ్చడంతో వెంటనే ఈ ప్రాజెక్ట్ ఆరంభించాం. శివ కార్తికేయన్గారితో ఓ సినిమా చేయాలని ఉంది’’ అన్నారు. -
అందుకే ‘సౌండ్ పార్టీ’ సినిమాలో నటించాను: వీజే సన్నీ
-
'ఆడిషన్స్‌కు వెళ్తే పాతిక లక్షలడిగారు, బిగ్‌బాస్ 7లో వాళ్లే టాప్ 5'
బిగ్‌బాస్ విన్నర్ వీజే సన్నీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సౌండ్ పార్టీ. హృతిక శ్రీనివాస్ హీరోయిన్గా నటించింది. సంజయ్ శేరి దర్శకత్వం వహించిన ఈ సినిమాను మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మించారు. ఈ మూవీ ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా కార్యక్రమంలో వీజే సన్నీ తను ఎదుర్కొన్న కష్టాలను ఏకరువు పెట్టాడు. నటుడిగా నిలదొక్కుకోవడానికి ఎంతగా ప్రయత్నించాడో చెప్పుకొచ్చాడు. హ్యాపీ డేస్ ఆడిషన్స్‌కు వెళ్తే రూ.25 లక్షలు అడిగారని చెప్పాడు. అంత డబ్బు ఇచ్చే స్థోమత లేకపోవడంతో సినిమా నుంచి తప్పుకున్నానని తెలిపాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు సినిమాల కోసం కష్టపడుతూనే ఉన్నానని పేర్కొన్నాడు. బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ విన్నర్‌గా విజయం సాధించిన సన్నీ ఈ సీజన్లో ప్రశాంత్, అమర్దీప్, ప్రిన్స్ యావర్, శోభా శెట్టి, శివాజీ టాప్ 5లో ఉంటారని అంచనా వేశాడు. కాగా యాంకర్‌గా కెరీర్ ఆరంభించిన సన్నీ తర్వాత నటుడిగా మారాడు. మొదట్లో సీరియల్స్‌లో నటించిన ఇతడు తర్వాత వెండితెరపై మెరిశాడు. అన్‌స్టాపబుల్, సకలగుణాభిరామ సినిమాలు చేశాడు. చదవండి: ఆ హీరోయిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నా.. అమ్మకు కూడా చెప్పా.. మనసులో మాట బయటపెట్టిన హీరో -
మందు బాటిల్ తో పోలీసులకు దొరికిపోయా
-
సీరియల్ అవకాశం ఎలా వచ్చిందంటే?: VJ సన్నీ
-
‘సౌండ్ పార్టీ’ ప్రతి పంచ్‌కి నవ్వాను: అనిల్ రావిపూడి
‘సౌండ్ పార్టీ ట్రైలర్ చాలా బాగుంది. ప్రతి పంచ్ కి నవ్వాను. ఈ మధ్యకాలంలో ఇంత హిలేరియస్ గా చూసిన ట్రైలర్ ఇదే. సన్నీ, శివన్నారాయణ మధ్య వచ్చే సీన్స్ బాగా పండుతాయని అర్థమవుతుంది. ఈ సినిమా విజయంతో వీజే సన్నీ కెరీర్లో మరింత ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను’అని ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్ జంటగా నటించిన తాజా చిత్రం ‘సౌండ్ పార్టీ’.ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మించిన ఈ చిత్రానికి సంజయ్ శేరి దర్శకత్వం వహించారు. జయ శంకర్ సమర్పణలో ఈ నెల 24న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రయూనిట్ ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించింది.ఈ ఈవెంట్‌కి ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా హాజరై సౌండ్ పార్టీ సినిమాకు సంబంధించి బిట్ కాయిన్ ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘బిగ్ బాస్ నుంచి వచ్చినప్పటి నుంచి సన్నీ బాగా కష్టపడుతున్నాడు. మంచి మంచి సినిమాలు చేస్తున్నాడు. ఈ చిత్రంతో సన్నీ కెరీర్ మలుపు తిరగాలని ఆశిస్తున్నాను’ అని అన్నారు. సన్నీ మాట్లాడుతూ.. మంచి స్టార్ కాస్ట్ తో ఈ చిత్రాన్ని రూపొందించాం. హీరోయిన్ హ్రితిక చాలా సపోర్ట్ చేసింది. ఈ సినిమా రూపంలో నాకు ఒక బ్యూటిఫుల్ డాడీని శివన్నారాయణ గారి రూపంలో ఇచ్చారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఇలాంటి డాడీ ఉంటే బాగుండు అనిపిస్తుంది. ప్రేక్షకులకు మా చిత్రాన్ని ఆదరించి మరింత ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నా’అని అన్నారు. ‘ఈ చిత్రం రెండు గంటలపాటు కంటిన్యూగా నవ్విస్తుంది సినిమా. సన్నీ చాలా ఎనర్జిటిక్ హీరో. తను నా లక్కీ చార్మ్. హీరోయిన్ హ్రితిక క్యూట్ లుక్స్ తో అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది’ అని డైరెక్టర్ సంజయ్ శేరీ అన్నారు. ఈ చిత్రం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది. సన్నీ, శివన్నారాయణ మధ్య వచ్చే కాంబినేషన్ సీన్స్ చాలా అందంగా ఉంటాయి అని నిర్మాతలు రవి, మహేంద్ర అన్నారు. -
క్లీన్ కామెడీతో పార్టీ
‘‘రెండు గంటల పాటు ప్రేక్షకులు నవ్వుకునే క్లీన్ కామెడీతో ‘సౌండ్ పార్టీ’ని రూపొందించాం’’ అన్నారు రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర. వీజే సన్నీ, హ్రితికా శ్రీనివాస్ జంటగా సంజయ్ శేరి దర్శకత్వం వహించిన చిత్రం ‘సౌండ్ పార్టీ’. జయ శంకర్ సమర్పణలో రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలవుతోంది. రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర మాట్లాడుతూ– ‘‘అమెరికాలో వ్యాపారం చేస్తున్న మేం సినిమాలపై ఫ్యాషన్‌తో తెలుగులో ‘సౌండ్ పార్టీ’ తీశాం. అమాయకులైన తండ్రీ కొడుకులిద్దరూ ధనవంతులు అయిపోవడానికి ఏం చేశారనేది ఈ చిత్రకథ. మన ప్రేక్షకులైనా, అమెరికా ఆడియన్స్ అయినా కామెడీ జానర్ చిత్రాలనే ఎక్కువగా ఇష్టపడతారు. మా చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో 100, యూఎస్‌లో 150కి పైగా థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. -
తండ్రీ, కొడుకులు ఇన్నోసెంట్ అయితే.. 'సౌండ్ పార్టీ' ఉండాల్సిందే!
వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్ జంటగా నటించిన తాజా చిత్రం సౌండ్ పార్టీ. ఈ చిత్రానికి సంజయ్ శేరి దర్శకత్వం వహించారు. జయ శంకర్ సమర్పణలో రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ అంచనాలు పెంచేశాయి. ఈ మూవీ ఈనెల 24న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ.. "మేం తెలంగాణలో పుట్టి పెరిగాం. అమెరికాలో బిజినెస్ చేస్తూ ఫ్రెండ్స్ అయ్యాం. సినిమాలపై ఉన్న ఇష్టంతో నిర్మాతలుగా మారాలనుకున్నాం. ఫిబ్రవరిలో యుఎస్ నుంచి వచ్చి 28 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాం. కాకపోతే అనుకున్న బడ్జెట్ కంటే కాస్తా పెరిగింది. కంప్లీట్ ఫ్యామిలీ అంతా చూసేలా సినిమా ఉంటుంది. సినిమాలో కామెడీ ఉంటే అమెరికా ప్రేక్షకులు బ్లాక్ బస్టర్ చేస్తారు. కుటుంబంలో తండ్రి కొడుకులు ఇద్దరూ ఇన్నోసెంట్ అయితే మనీ మేకింగ్ ఎలా చేస్తారనేదే సినిమా కాన్సెప్ట్. సన్నీ, శివన్నారాయణ మధ్య వచ్చే సీన్స్ ప్రేక్షకులకు నవ్వులు తెప్పిస్తాయి. ఫుల్ కామెడీతో రాబోతున్న చిత్రాన్ని ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని నమ్మకం ఉంది.' అని అన్నారు. ఈ చిత్రంలో శివన్నారాయణ, అలీ, సప్తగిరి, పృథ్వి, ‘మిర్చి’ ప్రియ, మాణిక్ రెడ్డి, అశోక్ కుమార్, కాదంబరి కిరణ్ కీలక పాత్రలు పోషించారు. -
ఆమనికి ఈ హీరోయిన్ ఏమవుతుందో తెలుసా?
వీజే సన్నీ, హ్రితికా శ్రీనివాస్ జంటగా సంజయ్ శేరి దర్శకత్వం వహించిన చిత్రం ‘సౌండ్ పార్టీ’. జయ శంకర్ సమర్పణలో రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా హ్రితికా శ్రీనివాస్‌మాట్లాడుతూ–‘‘నటి ఆమనిగారు మా మేనత్త. దీంతో చిన్నప్పటి నుంచే నాకు సినిమాలపై ఆసక్తి ఉండేది. బాలనటిగా కొన్ని సినిమాల్లో నటించాను. అమాయకులైన తండ్రీకొడుకులు ఈజీ మనీ కోసం ఏం చేస్తారు? అనేది ‘సౌండ్ పార్టీ’ కథ. ఇందులో నేను సిరి పాత్రలో నటించాను. కామెడీతో పాటు కంటెంట్ ఉన్న ఫిల్మ్ ఇది. తెలుగులో సాయిపల్లవిగారంటే ఇష్టం. ఆమెలాంటి పాత్రలు చేయాలని ఉంది. హీరోల్లో నానీగారు అంటే ఇష్టం. భవిష్యత్తులో ప్రయోగాత్మక సినిమాల్లో నటించాలని ఉంది’’ అన్నారు. -
‘సౌండ్ పార్టీ’లో నా పాత్ర ధోనీలా ఉంటుంది: హీరోయిన్
‘సౌండ్ పార్టీ’సినిమాలో నేను సిరి అనే పాత్ర పోషించాను. క్రికెట్ టీమ్‌లో ధోనీలా నా పాత్ర ఉంటుంది. మ్యాచ్ లాస్ట్‌లో వచ్చి ధోని ఎలా సిక్స్ లు కొడతారో అలా నా పాత్ర ఉంటుంది.క్లైమాక్స్ లో ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇస్తాను’ అని హీరోయిన్ హ్రితిక శ్రీనివాస్ అన్నారు. వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్ జంటగా నటించిన తాజా చిత్రం ‘సౌండ్ పార్టీ’. జయ శంకర్ సమర్పణలో సంజయ్ శేరి దర్శకత్వం వహించారు. రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాతలు. ఈ నెల 24న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ హ్రితిక మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ►సీనియర్ నటి ఆమని మా అత్త అవటంతో చిన్నప్పుడు నుంచి సినిమాలపై ఆసక్తి ఉండేది. చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో కూడా నటించాను. హీరోయిన్ గా తెలుగులో నాకు ఇది రెండో సినిమా. అల్లంత దూరాన తర్వాత నటించిన చిత్రమిది. సంజయ్ గారు కథ చెప్పినప్పుడు ఎక్సైటింగ్ గా అనిపించింది. ఇది ఒక కంప్లీట్ ఫన్ ఎంటర్టైనర్. కామెడీ తోపాటు కంటెంట్ కూడా ఉంది. ప్రేక్షకులు కచ్చితంగా ఎంటర్ టైన్ అవుతారని నమ్మకం ఉంది. ►ఇందులో నేను సిరి అనే పాత్రలో నటించాను. సిరి చాలా తెలివైన అమ్మాయి. నా పాత్ర సినిమాలో చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది. సీరియస్ క్యారెక్టర్ అయినా సిచువేషన్ మాత్రం చాలా కామెడీగా ఉంటుంది. నా రియల్ లైఫ్ కి రిలేటబుల్ గా ఈ పాత్ర ఉంటుంది. ►అమాయకులైన తండ్రి కొడుకులు ఈజీ మనీ కోసం ఎలాంటి పనులు చేస్తారనేది ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్. ఈ పాయింట్ నే చాలా ఫన్నీగా దర్శకులు చూపించారు. ఇందులో బిట్ కాయిన్ గురించి కూడా ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. బిట్ కాయిన్ వాల్యూను చూపించారు. ►సన్నీకి టెలివిజన్ లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. బిగ్ బాస్ లో ప్రేక్షకులు తనని ఎలా చూశారో సెట్ లోనూ ఆయన అలానే ఉంటారు. చాలా జెన్యూన్ గా, ఓపెన్ గా ఉంటారు. సౌండ్ పార్టీ టైటిల్ కి కరెక్ట్ ఎగ్జాంపుల్ గా నటించారు. సెట్ లో సన్నీ చాలా సపోర్ట్ చేశారు. తెలుగులో మాట్లాడేటప్పుడు కొన్ని పదాలు రాకపోతే ఆయనే నేర్పించారు. ►ఇందులో సిచువేషన్ కి తగ్గట్టుగా వచ్చే రెండు పాటలు మాత్రమే ఉంటాయి. మనీ మనీ అంటూ వచ్చే టైటిల్ సాంగ్ తో పాటు మరో సాంగ్ ఉంటుంది. డైరెక్టర్ సంజయ్ రైటింగ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆయన కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. ఎంజాయ్ చేస్తూ షూటింగ్ చేశాం. జయశంకర్ సార్ ప్రజెంటర్ గా ఉండడం ఈ సినిమాకు ప్లస్ అయింది. నిర్మాతలు రవి సార్, మహేంద్ర గజేంద్ర గారు చాలా సపోర్ట్ చేశారు. ఈ బ్యానర్ లో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ►ఎక్స్పరిమెంట్స్ సినిమాలు చేయాలని ఉంది. తెలుగులో నాకు నచ్చిన హీరోయిన్ సాయి పల్లవి. ఆమె చేసే రోల్స్ లాంటివి చేయాలని ఉంటుంది. హీరోల విషయంలో నాని అంటే నాకిష్టం. -
'ఇప్పుడు యూత్ అంతా జియో , ఓయో మీదే నడుస్తోంది'
వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్ జంటగా నటించిన చిత్రం 'సౌండ్ పార్టీ'. ఈ చిత్రాన్ని సంజయ్ శేరి దర్శకత్వంలో తెరకెక్కించారు. ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 24న థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తే ఫుల్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా అలరించనున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా హీరో వీజే సన్నీ, శివన్నారాయణ మధ్య వచ్చే డైలాగ్స్ నవ్వులు తెప్పిస్తున్నాయి. యూత్‌కు కనెక్ట్ అయ్యేలా పంచ్ డైలాగ్‌లు ఉన్నాయి. ఈ ట్రైలర్లో ప్రస్తుతం యూత్ అంతా జియో , ఓయో మీదే నడుస్తోంది' అనే డైలాగ్ హైలెట్‌గా ఉంది. కాగా.. ఈ చిత్రంలో శివన్నారాయణ, అలీ, సప్తగిరి, పృథ్వి, ‘మిర్చి’ ప్రియ, మాణిక్ రెడ్డి, అశోక్ కుమార్, కాదంబరి కిరణ్, ఇంటూరి వాసు, చలాకి చంటి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మోహిత్ రెహమానిక్ సంగీతమందించారు. -
బిగ్ బాస్: నా ప్రైజ్ మనీలో వాళ్లే రూ. 27 లక్షలు తీసుకున్నారు: వీజే సన్నీ
బిగ్గెస్ట్ రియాలటీ షోగా బిగ్‌బాస్‌కు మంచి గుర్తింపు ఉంది. అందులో వారం వారం కంటెస్టెంట్లకు రెమ్యునరేషన్‌తో పాటు రూ. 50 లక్షల ప్రైజ్ మనీ ఉంటుంది. దీంతో ఎలాగైన విన్నర్ కావాలని అందరూ అనుకుంటారు. ఈ షో ద్వారా మంచి అవకాశాలతో పాటు చేతకి డబ్బు కూడా అందుతుందని భావిస్తారు. బిగ్ బాస్ ప్రైజ్ మనీ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో సీజన్-5 విన్నర్ వీజే సన్నీ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. 'నేను విన్నర్ అయితే కంగ్రాట్యులేట్ నా ఒక్కడికే చెప్పకోలేదు.. గవర్నమెంట్‌కి కూడా చెప్పాను. ఎందుకంటే.. జీఎస్టీ ద్వారా నాకంటే ఎక్కువగా.. దాదాపు ఫిఫ్టీ- ఫిఫ్టీ షేర్ చేసుకున్నట్టే మేము. ఆడింది నేను.. గెలిచింది వాళ్లు అనేలా ఉంది. ఆట నాది ప్రైజ్ మనీ వాళ్లది. బిగ్ బాస్ విన్నర్ అయిన నాకు రూ.50 లక్షలు ఇవ్వాలి కానీ అందులో దాదాపు రూ.27 లక్షల వరకు ప్రభుత్వానికి వెళ్లిపోయింది. అంత డబ్బు టాక్స్ రూపంలో తీసేసుకున్నారు. కరెక్ట్‌గా ఎంతనేది నాకు గుర్తు లేదు కానీ.. దాదాపు సగానికి సగం టాక్స్ ద్వారా తీసేసుకున్నారు. గవర్నమెంట్ టాక్స్ కట్ చేసుకున్న తరువాతే మిగిలిన అమౌంట్ నాకు వచ్చింది. ఛానల్ వాళ్లు టాక్స్ రూపంలో ఆ డబ్బు కట్ చేసుకుని మిగిలన మొత్తం ఇస్తారు. డొనేషన్స్ రూపంలో చాలామంది టాక్స్ ఎగ్గొడుతుంటారు కానీ.. మనకి అన్ని తెలివితేటలు ఉంటే.. ఇక్కడెందుకు ఉంటాం.. అందుకే ఫుల్ అమౌంట్ టాక్స్ రూపంలో కట్టాల్సి వచ్చింది.' అంటూ తన ప్రైజ్ మనీ గురించి చెప్పుకొచ్చాడు వీజే సన్నీ. ఈ లెక్కన ఆయనకు కేవలం రూ. 23 లక్షలు చేతికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పన్నుతో పాటు అదనంగా జీఎస్టీ కూడా చేరడంతో ప్రైజ్ మనీలో ఎక్కువ కోత పడిందని ఆయన తెలిపాడు. బిగ్ బాస్‌తో గుర్తింపు తెచ్చుకున్న వీజే సన్నీ హీరోగా పలు సినిమా ఛాన్సులు దక్కించుకుంటున్నాడు. వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్ జంటగా నటిస్తున్న సినిమా 'సౌండ్ పార్టీ'. రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాతలు. సంజయ్ శేరి దర్శకత్వం వహించారు. తొలుత నవంబరు తొలివారంలో రిలీజ్ అనుకున్నారు కానీ వాయిదా పడింది. తాజాగా నవంబరు 24న కొత్త విడుదల అని ప్రకటించారు. పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. -
ఆ రోజు సౌండ్ పార్టీ
వీజే సన్నీ, హ్రితికా శ్రీనివాస్ జంటగా నటించిన చిత్రం ‘సౌండ్ పార్టీ’. శివన్నారాయణ, అలీ, సప్తగిరి, థర్టీ ఇయర్స్ పృధ్వీ, ‘మిర్చి’ ప్రియ కీలక పాత్రల్లో నటించారు. సంజయ్ శేరి దర్శకత్వంలో జయశంకర్ సమర్పణలో రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మించారు. ఈ సినిమాను ఈ నెల 24న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ మంగళవారం ప్రకటించింది. ‘‘ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్‌కు మంచి స్పందన లభిస్తోంది. సినిమా కూడా ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు .దర్శక– నిర్మాతలు. ఈ సినిమాకు సంగీతం: మోహిత్ రెహమానిక్. -
'బిగ్‌బాస్' విన్నర్ సన్నీ కొత్త మూవీ.. రిలీజ్ డేట్ ఫిక్స్
ప్రస్తుతం బిగ్‌బాస్ 7వ సీజన్ నడుస్తోంది. హౌస్మేట్స్ గొడవలతో ఓ మాదిరిగా ఎంటర్టైన్ చేస్తున్నారు. మరోవైపు ఈ షో ఐదో సీజన్ విజేత వీజే సన్నీ కొత్త సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించేందుకు రెడీ అయిపోయాడు. ఇప్పటికే రిలీజైన ఈ మూవీ టీజర్, పాటలు కాస్త ఆసక్తి రేపుతున్నాయి. తాజాగా చిత్ర విడుదల తేదీని ప్రకటించారు. ఇంతకీ ఏ మూవీ? ఏంటి సంగతి? (ఇదీ చదవండి: బిగ్‌బాస్ ప్లాన్ ఫెయిల్? ఈసారి ఆమెను కాపాడటం కష్టమే!) వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్ జంటగా నటిస్తున్న సినిమా 'సౌండ్ పార్టీ'. రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాతలు. సంజయ్ శేరి దర్శకత్వం వహించారు. తొలుత నవంబరు తొలివారంలో రిలీజ్ అనుకున్నారు కానీ వాయిదా పడింది. తాజాగా నవంబరు 24న కొత్త విడుదల అని ప్రకటించారు. పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: Bigg Boss 7: శుద్ధపూస శివాజీ మళ్లీ దొరికేశాడు.. రతిక, ప్రశాంత్ వల్లే ఇలా!) -
'సౌండ్ పార్టీ'తో రచ్చ చేస్తున్న విజే సన్నీ
బిగ్ బాస్ టైటిల్ విన్నర్ విజే సన్నీ ఇప్పుడు మంచి దూకుడు మీద ఉన్నాడు. వరుస సినిమాలతో ఆయన బిజీగా ఉన్నాడు. ఇందులో భాగంగా 'సౌండ్ పార్టీ' అనే సినిమాలో ఆయన నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ఇండస్ట్రీలో గట్టిగానే సౌండ్ చేస్తుంది. ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాతలుగా సౌండ్ పార్టీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జయ శంకర్ సమర్పణలో విడుదలవుతున్న ఈ మూవీకి సంజయ్ శేరి దర్శకుడు. (ఇదీ చదవండి: మెగా ఫ్యాన్స్ ఎఫెక్ట్.. కీలక నిర్ణయం తీసుకున్న లావణ్య త్రిపాఠి) హ్రితిక శ్రీనివాస్- విజే సన్నీ జంటగా నటించిన ఈ చిత్రంలోని ఓ పాటను తాజాగా ఒక పాటను మేకర్స్ విడుదల చేశారు. యూట్యూబ్‌లో వైరల్ అవుతోన్న ఈ సాంగ్ మంచి వ్యూస్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా రీల్స్ తో హల్ చల్ చేస్తోంది. ఫస్ట్ లిరికల్ తోనే మంచి బజ్ క్రియేట్ చేసిన 'సౌండ్ పార్టీ' చిత్రం ఇటు ఇండస్ట్రీలో అటు ఆడియన్స్ లో రీ -సౌండ్ సృష్టించడం ఖాయం అనడంలో సందేహం లేదు. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటోన్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ అధినేత రవి పోలిశెట్టి మాట్లాడుతూ... 'ఎప్పుడైతే మా 'సౌండ్ పార్టీ' చిత్రం టీజర్ విడుదలైందో అప్పటి నుంచి మా చిత్రానికి మంచి బజ్ వచ్చింది. ముఖ్యంగా టీజర్లో వీజే సన్నీ, శివన్నారాయణ చెప్పిన డైలాగ్స్ తో సినిమాలో ఎలాంటి హ్యుమర్ ఉండబోతుందో అర్థమవుతోంది. మా సంగీత దర్శకుడు మోహిత్ రెహమానిక్ అద్భుతమైన పాటలతో పాటు సినిమాను నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లే విధంగా బ్యాక్ గ్రౌండ్ స్కోరు చేశారు. అలాగే చిత్ర సమర్పకుడు జయ శంకర్ , దర్శకుడు సంజయ్ శేరి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తున్నారు. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం.' అని రవి పోలిశెట్టి అన్నారు. -
జాతి రత్నాలులా అనిపిస్తోంది
వీజే సన్నీ, హ్రితికా శ్రీనివాస్ జంటగా నటించిన చిత్రం ‘సౌండ్ పార్టీ’. దర్శకుడు జయశంకర్ సమర్పణలో సంజయ్ శేరి దర్శకత్వంలో రవి పోలి శెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్యామ్ గజేంద్ర నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరులో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా టీజర్ లాంచ్ వేడుకకు అతిథిగా హాజరై, టీజర్‌ను విడుదల చేసిన దర్శక–నిర్మాత సంపత్ నంది మాట్లాడుతూ– ‘‘సౌండ్ పార్టీ’ టీజర్ బాగుంది. మరో ‘జాతి రత్నాలు’ సినిమాలా ఉంటుందని టీజర్ చూస్తే అర్థం అవుతోంది. ఈ సినిమా అందరికీ పేరు తీసుకురావాలి’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో శివన్నారాయణగారు, నేను తండ్రీకొడుకులుగా చేశాం. ఇద్దరం ఫుల్‌గా నవ్విస్తాం’’ అన్నారు వీజే సన్నీ. ‘‘మా సినిమాను 28 రోజుల్లో పూర్తి చేయగలిగామంటే అది యూనిట్ సపోర్ట్ వల్లే’’ అన్నారు సంజయ్ శేరి. ‘‘ప్రతిభావంతులను ప్రోత్సహించాలనే మా ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్ బ్యానర్‌ను స్టార్ట్ చేశాం’’ అన్నారు రవి పోలిశెట్టి. ‘‘నేను చేయాల్సిన ఈ సినిమాను మా తమ్ముడు సంజయ్‌తో చేయించాను. ‘సౌండ్ పార్టీ’ను ఆదరిస్తే జంధ్యాల, ఈవీవీగార్ల తరహా చిత్రాలు సంజయ్ నుంచి చాలా వస్తాయి’’ అన్నారు జయశంకర్. -
'సౌండ్ పార్టీ' టీజర్.. స్టార్ డైరెక్టర్ చేతుల మీదుగా రిలీజ్
బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీ హీరోగా ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై తీస్తున్న సినిమా 'సౌండ్ పార్టీ'. హ్రితిక శ్రీనివాస్ హీరోయిన్. రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాతలు. జయ శంకర్ సమర్పణ. సంజయ్ శేరి దర్శకుడు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబరులో విడుదలకు సిద్ధమవుతోంది. (ఇదీ చదవండి: హీరోయిన్ శ్రుతిహాసన్ కోపం.. వాళ్లపై కౌంటర్!?) తాజాగా ప్రసాద్ ల్యాబ్స్‌లో డైరక్టర్ సంపత్ నంది చేతుల మీదుగా 'సౌండ్ పార్టీ' టీజర్ లాంచ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ''సౌండ్ పార్టీ' టీజర్ బాగుంది. మోహిత్ మ్యూజిక్ కూడా బాగుంది. ఈ చిత్రం మరో జాతిరత్నాలు సినిమాలా ఉండబోతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. వీజే సన్నీకి ఇది మంచి సినిమా అవుతుంది' అని అన్నారు. (ఇదీ చదవండి: Pizza 3 Review: 'పిజ్జా 3' సినిమా రివ్యూ) -
వీజే సన్నీ 'సౌండ్ పార్టీ'.. పోస్టర్ రిలీజ్ చేసిన ఎమ్మెల్సీ కవిత
వీజే సన్నీ హీరోగా, హ్రితిక శ్రీనివాస్ హీరోయిన్గా నటిస్తోన్న తాజా చిత్రం ‘సౌండ్ పార్టీ’. నిర్మాతలు. జయ శంకర్ సమర్పణ. సంజయ్ శేరి దర్శకత్వంలో రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవల షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ...'సౌండ్ పార్టీ టైటిల్, పోస్టర్ ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. కాన్సెప్ట్ కూడా ఎంటర్టైన్ చేయనుందని టైటిల్ చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రం ఘన విజయం సాధించి దర్శక నిర్మాతలకు , చిత్రబృందానికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నా.' అని అన్నారు. (ఇది చదవండి:83 ఏళ్ల వయసులో తండ్రైన నటుడు.. అప్పుడేమో డౌట్.. ఇప్పుడు ఏకంగా!) నిర్మాత రవి పోలిశెట్టి మాట్లాడుతూ..' ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్‌లో వస్తోన్న మొదటి సినిమా `సౌండ్ పార్టీ` పోస్టర్‌ను ఎమ్మెల్సీ కవిత లాంఛ్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఇటీవల విడుదల చేసిన సౌండ్ పార్టీ టైటిల్‌కు రెస్పాన్స్ బాగా వచ్చింది. మా యూనిట్ అంతా ఎంతో శ్రమించి అద్భుతంగా చిత్రాన్ని తెరకెక్కించారు. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం.'అని అన్నారు. హీరో వీజే సన్ని మాట్లాడుతూ...' ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. షూటింగ్ అంతా పూర్తయింది. సినిమా అనుకున్న దానికన్నా చాలా బాగొచ్చింది' అన్నారు. దర్శకుడు సంజయ్ శేరి మాట్లాడుతూ...'సౌండ్ పార్టీ' పోస్టర్‌ను కవిత లాంచ్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని' అన్నారు. ఈ చిత్రంలో శివన్నారాయణ, అలీ, సప్తగిరి, పృథ్వి, ‘మిర్చి’ ప్రియ, మాణిక్ రెడ్డి, అశోక్ కుమార్, కాదంబరి కిరణ్, ‘జెమిని’ సురేష్, భువన్ సాలూరు, ‘ఐ డ్రీమ్’ అంజలి, ఇంటూరి వాసు, చలాకి చంటి, ప్రేమ్ సాగర్, ఆర్.జె. హేమంత్, శశాంక్ మౌళి, త్రినాధ్, కృష్ణ తేజ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. (ఇది చదవండి: స్టార్ హీరోతో డేటింగ్లో లైగర్ భామ.. స్పందించిన హీరోయిన్ తండ్రి!) -
ఓటీటీలోకి వచ్చేసిన 'అన్‌స్టాపబుల్' మూవీ
'పిల్లా నువ్వు లేని జీవితం', 'సీమ శాస్త్రి', 'ఈడోరకం ఆడోరకం' తదితర కామెడీ సినిమాలతో రచయితగా పేరు తెచ్చుకున్న డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించిన కామెడీ ఎంటర్టైనర్ 'అన్‌స్టాపబుల్'. 'అన్లిమిటెడ్ ఫన్' అనేది ఉపశీర్షిక. బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీ, సప్తగిరి హీరోలుగా నటించిన ఈ చిత్రంలో నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్లు. ఏ2బీ ఇండియా ప్రొడక్షన్లో రజిత్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. జూన్ 9న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి స్పందన అందుకుంది. IMDBలోనూ 7.8 రేటింగ్ , బుక్ మై షోలో 8.2 రేటింగ్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదలైంది. థియేటర్స్‌లో మిస్ అయిన ప్రేక్షకులు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయొచ్చు. చక్కటి హాస్యంతో కూడిన ఈ సినిమాని కుటుంబం మొత్తం కలిసి వీక్షించవచ్చు. (ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి' గ్లింప్స్‌లో కమల్‌హాసన్.. ఎక్కడో గుర్తుపట్టారా?) -
ఫన్ పార్టీ
వీజే సన్నీ, హ్రితికా శ్రీనివాస్ జంటగా సంజయ్ శేరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సౌండ్ పార్టీ’. దర్శకుడు వి. జయశంకర్ సమర్పణలో రవిపొలిశెట్టి నిర్మించిన ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా టైటిల్ లోగో విడుదల పాత్రికేయుల చేతుల మీదగా జరిగింది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో వీజే సన్నీ మాట్లాడుతూ– ‘‘సౌండ్ పార్టీ’ చిత్రం థియేటర్స్‌లో గట్టిగా సౌండ్ చేస్తుంది’’ అన్నారు. ‘‘ఫుల్ ఫన్ రైడ్ చిత్రం’’ అన్నారు సంజయ్ శేరి. ‘‘పాతిక రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేశాం. ఇది మా యూనిట్‌కు, వృత్తి నైపుణ్యానికి నిదర్శనం. ఆగస్టులో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు రవి పొలిశెట్టి. -
వీజే సన్నీ 'సౌండ్ పార్టీ' టైటిల్ పోస్టర్ చూశారా?
బిగ్ బాస్ 5 విన్నర్ వీజే సన్నీ హీరోగా, హ్రితిక శ్రీనివాస్ హీరోయిన్గా నటిస్తున్న చిత్రం ‘సౌండ్ పార్టీ’. దర్శకుడు జయశంకర్ సమర్పణలో టాలెంటెడ్ రైటర్ ‘సంజయ్ శేరి’ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రం నేటితో విజయవంతంగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సారథి స్టూడియోలో ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగో పోస్టర్‌ను జర్నలిస్ట్ ల చేతుల మీదుగా ఆవిష్కరించారు. హీరో వీజే సన్నీ మాట్లాడుతూ.. 'నేను పార్టీ పెట్టబోతున్నా అంటూ చేసిన వీడియోకు చాలా మంది నుంచి ఫోన్స్ వచ్చాయి. `సౌండ్ పార్టీ` టైటిల్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మీడియా మిత్రుల చేతుల మీదుగా మా సినిమా టైటిల్ లోగో లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మా నిర్మాత అమెరికాలో ఉంటూ కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా పూర్తి చేయడానికి సహకరించారు. కచ్చితంగా సౌండ్ పార్టీ థియేటర్లో గట్టిగా సౌండ్ చేస్తుందని నమ్ముతున్నా' అన్నారు. నటుడు శివన్నారాయణ మాట్లాడుతూ...``సౌండ్ పొల్యూషన్ లేని సౌండ్ పార్టీ ఇది. ప్రతి సన్నివేశం, డైలాగ్ ఎంతో బాగా రాసుకున్నాడు దర్శకుడు. మా జయశంకర్ సినిమాకు బ్యాక్ బోన్ గా ఉంటూ సినిమాను ముందుకు నడిపించారు`` అన్నారు. ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ అధినేత, నిర్మాత రవి పొలిశెట్టి మాట్లాడుతూ... 'ఇది మా మొదటి తెలుగు సినిమా. USAలో ఆంగ్ల చలన చిత్రాలు, మ్యూజిక్ వీడియోలను నిర్మించడంలో మునుపటి అనుభవం ఉన్నందున, తెలుగు సినిమా వైపు వచ్చాను. 25 కంటే ఎక్కువ స్క్రిప్ట్‌లను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత, ప్రతిభావంతుడైన సంజయ్ శేరీ తో "సౌండ్ పార్టీ` సినిమా చేశాము. సినిమా షూటింగ్‌ని కేవలం 25 రోజుల్లోనే పూర్తి చేశాం. ఆగస్ట్ లో సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశాం' అన్నారు. చదవండి: జయసుధ సోదరి కూడా నటి అని తెలుసా? కానీ.. -
ఇకపై నవ్వించే సినిమాలే చేస్తాను
‘‘ప్రేక్షకులను నవ్వించాలనే ఉద్దేశంతో ‘అన్‌స్టాపబుల్’ చేశాను. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు హాయిగా నవ్వుకున్నామంటూ ఫోన్ చేస్తున్నారు. ప్రేక్షక దేవుళ్లు ఇచ్చిన తీర్పే రియల్ బ్లాక్ బస్టర్.. ఇకపై నేను అన్నీ నవ్వించే సినిమాలే చేస్తాను’’ అని డైరెక్టర్ ‘డైమండ్’ రత్నబాబు అన్నారు. వీజే సన్నీ, సప్తగిరి హీరోలుగా, నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్లుగా ‘డైమండ్’ రత్నబాబు దర్శకత్వం వహించిన చిత్రం ‘అన్‌స్టాపబుల్’. రజిత్ రావు నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన సక్సెస్ మీట్లో వీజే సన్నీ మాట్లాడుతూ– ‘‘ఒక సినిమా తీసి, థియేటర్లో రిలీజ్ చేయడం తేలికైన విషయం కాదు. రజిత్ రావుగారు సినిమాపై ΄్యాషన్‌తో ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమా చేశారు’’ అన్నారు. ‘‘అన్‌స్టాపబుల్ 2’ని రత్నబాబు దర్శకత్వంలోనే చేస్తున్నాం’’ అన్నారు రజిత్ రావు. -
బిగ్ బాస్ తరువాత గ్యాప్ ఎందుకు వచ్చిందంటే...?
-
అన్ స్టాపబుల్ చూసి ఒక్కసారి కూడా నవ్వని వాళ్లకు...!
-
సన్ అఫ్ ఇండియా సినిమా డిజాస్టర్ కి కారణం అదే
-
ఈవీవీ సినిమాలు గుర్తుకు వస్తున్నాయి
‘‘ఒకే సినిమాలో ఇంతమంది నటీనటులను చూస్తుంటే ఈవీవీగారి సినిమాలు గుర్తుకు వస్తున్నాయి. ‘అన్‌స్టాపబుల్’ చిత్రం పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు దర్శకుడు ఎ. కోదండరామి రెడ్డి. వీజే సన్నీ, సప్తగిరి హీరోలుగా, నక్షత్ర, ఆక్సాఖాన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అన్‌స్టాపబుల్’. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రజిత్ రావు నిర్మించిన ఈ చిత్రం నేడు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు ఎ. కోదండరామి రెడ్డి అతిథిగా ΄ాల్గొన్నారు. సప్తగిరి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాతో సన్నీ, డైమండ్ రత్నబాబులకు విజయం రావాలి’’ అన్నారు. ‘‘కుటుంబం అంతా కలిసి చూడదగ్గ వినోదాత్మక చిత్రం ఇది. డైమండ్ రత్నబాబు మంచి హిలేరియస్ కథ రాశారు’’ అన్నారు సన్నీ. ‘‘మా సినిమా ΄ోస్టర్ చూసిన వారు ఈవీవీగారి సినిమాలాంటి అనూభూతి కలుగుతుందని చెప్పడం సంతోషంగా ఉంది. ఈ సినిమా ఫస్ట్ షో ఎక్కడ ప్రదర్శించబడితే అక్కడ ఓ సీట్‌ను ఈవీవీగారి కోసం ఉంచుతాం. ఇది ఆయనకు మేం ఇచ్చే ఓ చిరు కానుక’’ అన్నారు డైమండ్ రత్నబాబు. ‘‘క్వాలిటీ కామెడీ ఉన్న ఈ ఫిల్మ్ ఆడియన్స్‌ను అలరిస్తుంది’’ అన్నారు రజిత్ రావు. -
అన్‌స్టాపబుల్ డైరెక్టర్ తో సూపర్ కాండీడ్ ఇంటర్వ్యూ
-
అందుకే ‘అన్ స్టాపబుల్’ టైటిల్ పెట్టాం : వీజే సన్నీ
నేను బాలకృష్ణ గారికి పెద్ద అభిమానిని. అన్‌స్టాపబుల్ షోకి కూడా వెళ్లాను. నా సినిమాకు ఆ టైటిల్ ఎందుకు పెడుతున్నారని రత్నబాబుని అడిగాను. ‘మన టైటిల్ అన్ స్టాపబుల్ అన్ లిమిటెడ్ ఫన్ ని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే టైటిల్ జనాల్లో ఉంది కాబట్టి అన్ స్టాపబుల్ యాప్ట్ గా ఉంటుంది’ అని చెప్పారు. నాకు కూడా టైటిల్ బాగా నచ్చింది’ అని హీరో వీజే సన్నీ అన్నాడు. రత్నబాబు దర్శకత్వంలో రూపొందిన హిలేరియస్ ఎంటర్ టైనర్ 'అన్ స్టాపబుల్'. 'అన్ లిమిటెడ్ ఫన్' అన్నది ఉపశీర్షిక. బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీ, సప్తగిరి హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్లు. ఎ2 బి ఇండియా ప్రొడక్షన్ లో రజిత్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూన్ 9న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో వీజే సన్నీ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► బిగ్ బాస్ తర్వాత కొత్త నిర్మాణ సంస్థల నుంచి చాలా మంది సంప్రదించారు. అయితే కథలన్నీ ఎక్కువగా మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ వున్నవే వచ్చాయి. నాకు కామెడీ, థ్రిల్లర్, హారర్ కామెడీ కథలు చేయాలని ఉండేది. పక్కింటి కుర్రాడిలా అనిపించే పాత్రలు చేయాలని ఉండేది. ఇలాంటి సమయంలో 'అన్ స్టాపబుల్' లాంటి అన్ లిమిటెడ్ ఫన్ కథ విన్నాను. చాలా నచ్చింది. కథ విన్నంత సేపు నవ్వుతూనే ఉన్నాను. కథని నమ్మి చేసిన చిత్రమిది. ► ఇందులో చాలా మంది సీనియర్ నటీనటులు ఉన్నారు. వాళ్లంతా నాకు కంఫర్ట్ జోన్ కల్పించారు. పృద్వీతో మంచి స్నేహం ఏర్పడింది. అలాగే పోసాని, రాజా రవీంద్ర, రఘు ఇలా అందరితో పని చేయడం మంచి అనుభూతి. నన్ను ఎప్పుడూ కొత్తవాడిలా ట్రీట్ చేయలేదు. నేను నాటకరంగం నుంచి రావడం కూడా ప్లస్ అయ్యింది. ► సప్తగిరి చాలా ఎనర్జిటిక్. సీన్ లో ఆయన ఉండే ఇన్వాల్వ్ మెంట్ నెక్స్ట్ లెవల్ ఉంటుంది. సీన్ ఇచ్చిన వెంటనే ఆయన ఒక ప్లాన్ లో ఉంటారు. ఆ ప్లాన్ ని మనం క్యాచ్ చేసుకోవాలి. తనని పరిశీలించాను కాబట్టి అతనకి తగట్టు నేను వెళ్లాలని డిసైడ్ అయిపోయాను. చాలా స్పోర్టివ్ స్పిరిట్ తో వర్క్ చేశాం. ► ఇందులో నాకు జోడిగా నక్షత్ర నటించింది. తను ఇంతకుముందు ‘పలాస’ అనే సినిమా చేశారు. తను తెలుగమ్మాయి కావడం వలన సెట్స్ లో ఉన్నప్పుడు ప్రామ్టింగ్ ఇచ్చే అవసరం ఉండేది కాదు. చాలా చక్కగా నటించారు. ► బిగ్ బాస్ తర్వాత దాదాపు ముఫ్ఫై కథలు విన్నాను. ఇందులో డైమండ్ రత్నబాబు గారు చెప్పిన కథ చాలా నచ్చింది. కథని బలంగా నమ్మి చేసిన చిత్రమిది. రత్నబాబు గారు కూడా చాలా స్వేచ్ఛ ఇచ్చారు. దర్శకుడు, నిర్మాత, నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరం టీం వర్క్ గా ఈ సినిమా చేశాం. ► ‘ఎటీఎం’ చూసి దర్శకుడు హరీష్ శంకర్ గారు ప్రశంసించారు. ఆయన ప్రశంస నాలో ఇంకా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఏ పాత్రనైనా చేయగలననే నమ్మకం ఉంది. నేను ఏ పాత్ర చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఒక ఆర్టిస్ట్ గా ముందుకు వెళ్లాలని ఉంది. హీరోగా చేస్తూనే ఓ పెద్ద హీరో సినిమాలో చిన్న క్యారెక్టర్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాను. ► ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాను. ఒకటి ఫన్, మరొకటి సస్పెన్స్ థ్రిల్లర్. -
కొంతమంది దర్శకులతో అభిప్రాయబేధాలు.. అవి సహజమే: డైరెక్టర్
‘‘ప్రతి రచయిత, దర్శకుడు వారి బలాలు ఏమిటో తెలుసుకోవడానికి కాస్త సమయం పడుతుంది. రచయితగా ‘పిల్లా నువ్వులేని జీవితం’ (కొన్ని కామెడీ సన్నివేశాలు), ‘సీమశాస్త్రి’, ‘ఈడోరకం ఆడోరకం’లాంటి నవ్వించిన సినిమాలే నాకు ఇండస్ట్రీలో పేరు తెచ్చాయి. దర్శకుడిగా నేను చేసిన రెండు సినిమాలు (బుర్రకథ, సన్నాఫ్ ఇండియా) ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. దీంతో నా బలం కామెడీ అని నమ్మి ‘అన్‌స్టాపబుల్’ మూవీ చేశాను. ఇకపై ప్రతి ఏడాది నా నుంచి ఓ నవ్వించే సినిమా వస్తుంది. ఒకవేళ ప్రయోగాలు చేయాలనుకుంటే ఓటీటీలో చేస్తా’’ అన్నారు డైమండ్ రత్నబాబు. వీజే సన్నీ, సప్తగిరి హీరోలుగా, నక్షత్ర, అక్సా ఖాన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అన్‌స్టాపబుల్’. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రజిత్ రావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం జరిగిన విలేకర్ల సమావేశంలో దర్శకుడు డైమండ్ రత్నబాబు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో కల్యాణ్ పాత్రలో సన్నీ, జిలానీ రాందాస్‌గా సప్తగిరి నటించారు. చాలామంది హాస్యనటులు నటించారు. ఇక ‘అన్‌స్టాపబుల్’ సినిమా కాన్సెప్ట్‌ని చెప్పలేను. కానీ ఈ సినిమాలోని ప్రతి పాత్రకు ప్రాముఖ్యత ఉంటుంది. ప్రీ క్లైమాక్స్‌లో అన్ని పాత్రలు ఓ పాయింట్‌కు కలుస్తాయి. ఈ అంశాలను థియేటర్స్‌లోనే చూడాలి. సినిమాలపై ఉన్న ప్యాషన్‌తో రజిత్‌రావు రాజీ పడకుండా నిర్మించారు. నిజం చెప్పాలంటే.. యాక్షన్, ఫ్యామిలీ తరహా సినిమాలను తీయడం కంటే కామెడీ సినిమాలు తీయడం కత్తిమీద సాము వంటిది. కానీ ఈ విషయంలో జంధ్యాల, ఈవీవీ, రేలంగి, ఎస్వీ కృష్ణారెడ్డిగార్లు సక్సెస్ అయ్యారు. నేను రచయితగా ఎలా అయితే నవ్వించానో దర్శకుడిగానూ నవ్వించే సినిమాలే చేస్తాను. ఏ రచయిత అయినా కెప్టెన్ ఆఫ్ ది షిప్ (డైరెక్టర్) కావాలనుకుంటాడు. నేను అలానే రచయిత నుంచి దర్శకుడిని అయ్యాను. నేను రచయితగా ఉన్నప్పుడు కొంతమంది దర్శకులతో అభిప్రాయబేధాలు వచ్చి ఉండొచ్చు. మన కుటుంబాల్లో ఉన్నట్లు ఇండస్ట్రీలో కూడా అలాంటివి సహజమే. అయినా ఇప్పుడు ప్రతి రచయితలోనూ ఓ దర్శకుడు ఉన్నాడు. తమిళ పరిశ్రమలో ఎవరైతే కథ రాస్తారో వాళ్లకే దర్శకత్వం చేసే చాన్స్ కూడా ఉంటుంది. తెలుగులో కూడా అది మొదలైనట్లుంది’’ అని అన్నారు. -
కొత్త వాళ్లను ప్రోత్సహించాలి
‘‘జంధ్యాల, రేలంగి నరసింహారావు, ఈవీవీ సత్యనారాయణ, ఎస్వీ కృష్ణారెడ్డిగార్ల సినిమాల్లో తెర నిండుగా నటీనటులు ఉండటం చూశాను. మళ్లీ ఇంతమందిని (దాదాపు 50 మంది) ఒక్క దగ్గరికి చేర్చి ‘అన్‌స్టాపబుల్’ లాంటి మంచి వినోదాత్మక సినిమా చేయడం ఆనందంగా ఉంది. నిర్మాతలని యువ దర్శకులు, నటులు ప్రోత్సహించాలి.. అప్పుడే చిత్ర పరిశ్రమకు కొత్త ప్రతిభ వస్తుంది’’ అని సీనియర్ నటుడు బ్రహ్మానందం అన్నారు. వీజే సన్నీ, సప్తగిరి హీరోలుగా, నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అన్ స్టాపబుల్’. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించారు. రజిత్ రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన బ్రహ్మానందం మాట్లాడుతూ– ‘‘అన్‌స్టాపబుల్’లో నటించిన వారందరూ ఒక బ్రహ్మానందం కావాలి’’ అన్నారు. ‘‘డైమండ్ రత్నబాబులాంటి దర్శకులు సక్సెస్ అయితే మాలాంటి వాళ్లకు మరిన్ని సినిమాలు వస్తాయి’’ అన్నారు సప్తగిరి. ‘‘ఈ మూవీతో ప్రేక్షకులను నవ్విస్తాం’’ అన్నారు వీజే సన్నీ. ‘‘అన్‌స్టాపబుల్’ పై ఉన్న నమ్మకంతో రిలీజ్‌కి ముందే నాకు కారుని బహుమతిగా ఇచ్చారు నిర్మాత రజిత్ రావు’’ అన్నారు డైమండ్ రత్నబాబు. ‘‘ఫ్యామిలీతో చూసే చిత్రం ఇది’’ అన్నారు రజిత్ రావు. -
షూటింగ్లో వీజే సన్నీకి గాయాలు, బుల్లెట్ తగలడంతో..
బిగ్‌బాస్ విన్నర్ వీజే సన్నీ షూటింగ్లో గాయపడ్డాడు. సినిమా రిలీజ్ డేట్‌కు సంబంధించి స్పెషల్ ప్రోమో షూట్ చేసే క్రమంలో అతడికి గాయాలయ్యాయి. సన్నీ, సప్తగిరి హీరోలుగా నటించిన చిత్రం అన్‌స్టాపబుల్. నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నాడు. రజిత్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం ఓ ప్రోమో షూట్ నిర్వహించింది. ఇందులో పోలీస్ గెటప్‌లో ఉన్న సప్తగిరి అన్‌స్టాపబుల్ రిలీజ్ ఎప్పుడు? అని గన్ పట్టుకుని పృథ్వీరాజ్‌ను బెదిరించాడు. ఇంతలో అటువైపుగా సన్నీ రావడంతో పృథ్వీ అతడిపైకి గన్ ఎక్కుపెట్టాడు. పొరపాటున అది పేలడంతో సన్నీకి బుల్లెట్ తగిలింది. అది డమ్మీ బుల్లెట్ అయినప్పటికీ సన్నీకి గాయం కావడంతో అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ డమ్మీ గన్ను కావాలనే పేల్చారని, సన్నీకి ఏ గాయమూ కాలేదని, ఇదంతా మూవీ ప్రమోషన్ స్టంట్ అని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాగా గతంలోనూ సన్నీ డబ్బులు దొంగతనం చేసిన వీడియో వైరల్ అయింది. ఏటీఎమ్ వెబ్ సిరీస్ కోసం అలా స్టంట్ చేశాడని ఇట్టే పసిగట్టారు ఆడియన్స్. ఇకపోతే గతంలో సీరియల్స్‌లో నటించిన సన్నీ బిగ్‌బాస్ షోతో మరింత పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత అతడికి వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి. షూటింగ్ లో బిగ్ బాస్ సన్నీకి ప్రమాదం బుల్లెట్ తగలడంతో ఆసుపత్రికి తరలింపు#vjsunny #UnstoppableEknath pic.twitter.com/CO3Vqtf3Kn — yenugula somasekhar (@yenugulasomase1) May 12, 2023 చదవండి: మోడ్రన్ లవ్ చెన్నై.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే? -
Unstoppable: ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తారు: వీజే సన్నీ
‘బిగ్ బాస్’ ఫేమ్ వీజే సన్నీ, సప్తగిరి, నక్షత్ర, అక్సాఖాన్ హీరో హీరోయిన్లుగా డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అన్‌స్టాపబుల్’. రజిత్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని ‘బేబీ బేబీ’ సాంగ్‌ను విడుదల చేశారు. భీమ్స్ సిసిరోలియో స్వరకల్పనలో కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించిన ఈ పాటను ఇంద్రావతి చౌహాన్ పాడారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్లో వీజే సన్నీ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలోని ప్రతి సీన్ ఎంజాయ్ చేసేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘సినిమాలో నా, వీజే సన్నీ టైమింగ్ అదిరిపోతుంది’’ అన్నారు సప్తగిరి. ‘‘రిలీజ్ తర్వాత చిన్న సినిమాల పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. అందుకే చిన్న సినిమాలు తీస్తున్న ప్రతి నిర్మాత నాకు ఓ హీరోయే. ఈ సినిమా తర్వాత నన్ను ‘అన్‌స్టాపబుల్’ డైరెక్టర్ డైమండ్ రత్నబాబు అని పిలుస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు డైమండ్ రత్నబాబు. ‘‘మంచి సినిమాలు తీయాలని ఇండస్ట్రీకి వచ్చాను. ‘అన్‌స్టాపబుల్’ చిన్న సినిమా కాదు. అన్నీ ఉన్న సినిమా’’ అన్నారు రజిత్ రావు. -
రాహుల్ సిప్లిగంజ్ పాడిన బుల్..బుల్.. సాంగ్ విన్నారా?
వీజే సన్నీ, సప్తగిరి హీరోలుగా, నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అన్‌స్టాపబుల్’. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రజిత్ రావు నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘బుల్ బుల్ అన్‌స్టాపబుల్..’ అనే తొలి పాటని హీరో గోపీచంద్ విడుదల చేశారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ పాటని రాహుల్ సిప్లిగంజ్‌తో కలసి భీమ్స్ పాడారు. ‘‘ఈ పాటలో సన్నీ, సప్తగిరి మాస్ మూమెంట్స్ ఆకట్టుకుంటాయి’’ అని చిత్రయూనిట్ తెలిపింది. -
బిగ్‌బాస్ ఫేం వీజే సన్నీ హీరోగా కామెడీ చిత్రం
‘బిగ్ బాస్’ తెలుగు 5 సీజన్ విజేత వీజే సన్నీ హీరోగా కొత్త సినిమా ఆరంభమైంది.టాలెంటెడ్ రైటర్ ‘సంజయ్’ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. వైవిధ్యమైన కథలను చిత్రీకరించడంలో పేరు పొందిన వి. జయశంకర్ దర్శకత్వ పర్యవేక్షణలో ఒక అద్భుతమైన వినోదాత్మక చిత్రంగా రూపొందనుంది. ‘‘చక్కని వినోదం నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. శుక్రవారమే రెగ్యులర్ షూటింగ్ ఆరంభించాం.. సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేయనున్నాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. శివన్నారాయణ, శైలజ ప్రియ, సప్తగిరి, రేఖ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి కెమెరా: శ్రీనివాస్ రెడ్డి, సంగీతం: మదీన్, దర్శకత్వ పర్యవేక్షణ: వి. జయశంకర్. -
టెన్షన్ పడుతూనే ‘ఏటీఎం’ను ఎంజాయ్ చేస్తారు: దిల్ రాజు
బిగ్‌బాస్ ఫేం వీజే సన్నీ నటిస్తున్న తొలి వెబ్ సిరీస్ ‘ఏటీఎం’. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ ఈ సిరీస్‌కి కథ అందించగా, జీ5 సంస్థతో కలిసి ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సిరీస్‌ని నిర్మించారు. దోపిడీ నేపథ్యంలో సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్‌కు సి చంద్రమోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. జనవరి 20న ప్రముఖ ఓటీటీ జీ5లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. తాజాగా చిత్ర యూనిట్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. మా ఫ్యామిలీ నుంచి మా అబ్బాయి హర్షిత్, అమ్మాయి హన్షితలను నిర్మాతలుగా మార్చి ఈ వెబ్ సిరీస్ చేయించాం. ట్రైలర్ చూడగానే సినిమా ట్రైలర్‌గానే అనిపించింది. చంద్ర మోహన్ కంటెంట్‌ను హ్యాండిల్ చేసిన తీరు నచ్చింది. టెన్షన్ పడుతూనే సిరీస్‌ను ఎంజాయ్ చేస్తారు’ అన్నారు. ‘కొత్తగా కథలను చెప్పటానికి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ బాగుంటుందని ఆలోచన వచ్చింది. అప్పుడు జీ 5 టీమ్‌తో కలిశాను. ఈ కథను నేనే రాశాను. కానీ.. డైరెక్టర్‌గా నాకంటే చంద్ర మోహన్ బాగా తీశాడనిపించింది’అని దర్శకుడు హరీశ్ శంకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకులు క్రిష్ జాగర్లమూడి , సి.చంద్ర మోహన్, హీరో వీజే సన్నీ, సుబ్బరాజ్, నిర్మాతలు హర్షిత్ రెడ్డి, హన్షిత తదితరులు పాల్గొన్నారు. -
ఆసక్తి రేకెత్తిస్తున్న హరీశ్ శంకర్ ‘ఏటీఎం’ టీజర్
బిగ్‌బాస్ ఫేం వీజే సన్నీ నటిస్తున్న తొలి వెబ్ సిరీస్ ‘ఏటీఎం’. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ ఈ సిరీస్‌కి కథ అందించారు. దోపిడీ నేపథ్యంలో సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్‌కు సి చంద్రమోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. జనవరి 20న ప్రముఖ ఓటీటీ జీ5లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ‘ఏటీఎం’టీజర్‌ని హరీశ్ శంకర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. `దోపిడీ జోనర్లో రాసే కథల్లో చాలా పొటెన్షియల్ ఉంటుంది. సెట్టింగ్ రియలిస్టిక్‌గా ఉంటుంది. ఈ సీరీస్‌లో దొంగలు రొటీన్‌గా ఉండరు. వాళ్లల్లో ఓ ప్రత్యేకత ఉంటుంది. వీజే సన్నీ కీ రోల్ చేశారు. స్లమ్ లైఫ్ మీద అతనికున్న ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది. నవాబ్ తరహా జీవితాన్ని కోరుకున్న అతను ఏం చేశాడనేది ఆసక్తికరం. సీరీస్ గురించి ఇంతకు మించి ఎక్కువ చెప్పదలచుకోలేదు. ఓ వైపు నవ్విస్తూనే ఉంటుంది. చాలా కొత్త ప్రయత్నం చేశాం`అని అన్నారు. ‘పవర్ ఫుల్ ఫోర్సుల వల్ల కార్నర్ అయిన నలుగురు చిన్న దొంగల రోలర్ కోస్టరే ఈ సీరీస్. ప్రాణాలతో బతికి ఉండాలంటే కొన్ని కోట్ల రూపాయలను దోపిడీ చేయాల్సిన పరిస్థితుల్లోకి నెట్టబడిన వాళ్ల కథే ఇది. సుబ్బరాజు చాలా స్ట్రాంగ్ రోల్ ప్లే చేశారు` అని నిర్మాత హర్షిత్ రెడ్డి అన్నారు. -
ఓటీటీలోకి వచ్చేస్తున్న వీజే సన్నీ ATM, ఎప్పుడంటే?
బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ విన్నర్ వీజే సన్నీ దొంగతనం చేస్తూ సీసీ కెమెరాకు అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే కదా! అయితే ఇదంతా తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్ ప్రమోషన్స్‌లో భాగమేనని ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు. చివరకు వారు అనుకుందే నిజమైంది. వీజే సన్నీ ఏటీఎమ్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాడు. ఇందులో సుబ్బరాజు, దివి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హరీష్ శంకర్ అందించిన కథను చంద్రమోహన్ డైరెక్ట్ చేస్తున్నాడు. దిల్ రాజు బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్సిత రెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సిరీస్ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఏటీఎమ్: పైసల్తో ఆట అనే వెబ్ సిరీస్ జనవరి 20 నుంచి తెలుగు, తమిళ భాషల్లో జీ5లో ప్రసారం కానుందని ప్రకటించింది చిత్రయూనిట్. A heist that will make you relook at your way of life & startle you to your very core.#ATMOnZee5 - The game of money, #PaisalThoAata, STARTS SOON@VJSunnyOfficial @actorsubbaraju @RoielShree @ravirajdance @KrishnaBurugula @DiviActor@harish2you @chandramohan_c @DilRajuProdctns pic.twitter.com/rKkoheUOQ2 — ZEE5 Telugu (@ZEE5Telugu) January 6, 2023 చదవండి: పంత్ ఉన్న ఆస్పత్రి ఫోటో షేర్ చేసిన నటి -
దొంగతనం చేస్తూ దొరికిపోయిన సన్నీ
-
వీడియో.. దొంగతనం చేస్తూ సీసీ కెమెరాకు దొరికిపోయిన సన్నీ
బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ విన్నర్ వీజే సన్నీ దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఓ అపార్ట్మెంట్లోకి చొరబడి నోట్ల కట్టలున్న బ్యాగును ఎత్తుకెళ్లిపోయాడు. తీరా కారు దగ్గరకు వెళ్లగానే బ్యాగు కిందపడటంతో అందులో ఉన్న డబ్బులు బయటపడ్డాయి. వెంటనే వాటిని ఆదరాబాదరాగా తిరిగి బ్యాగులో సర్దుకున్న సన్నీ ఎవరూ తనను చూడట్లేదని కన్ఫామ్ చేసుకుని వెంటనే అక్కడి నుంచి కారులో చెక్కేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఈ దొంగతనం నిజమా? అబద్ధమా? అని తల గోక్కుంటున్నారు. అయితే ఇది కేవలం ప్రీప్లాన్డ్ డ్రామా అని తెలుస్తోంది. అవును, సన్నీ ప్రస్తుతం ఏటీఎమ్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాడు. సి.చంద్రమోహన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సిరీస్‌కు హరీష్ శంకర్ కథ అందించారు. దిల్ రాజు బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్సిత రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగానే సన్నీ దొంగతనం చేశాడని స్పష్టమవుతోంది. లేకపోతే కారులో అంత స్టైలిష్‌గా వచ్చి దొంగతనం చేస్తారా? అంటున్నారు ఫ్యాన్స్. చదవండి: సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న ఫ్లాట్ అద్దెకు, ఎన్ని లక్షలో తెలుసా? -
‘అన్‌స్టాపబుల్’ టీజర్‌ను విడుదల చేసిన నాగార్జున
బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీ, సప్తగిరి హీరోలుగా నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘అన్‌స్టాపబుల్’. అన్ లిమిటెడ్ ఫన్ అన్నది ఉపశీర్షిక. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రజిత్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ‘అన్‌స్టాపబుల్’ టీజర్‌ను హీరో నాగార్జునతో విడుదల చేయించారు. ‘ట్విస్టులకే టీషర్టు వేసినట్లుండే ఇద్దరు ఇలఖత మఫిలియా గురించి మీకు చెప్తా’ అంటూ 30 ఇయర్స్ పృథ్వీ వాయిస్ ఓవర్‌తో టీజర్ సాగుతుంది. ‘‘డైమండ్ రత్నబాబు తన మార్క్ ఎంటర్టైన్మెంట్తో ప్రేక్షకులను నవ్వించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. స్క్రీన్‌ప్లే రసవత్తరంగా ఉంటుంది. భీమ్స్ సిసిరోలియో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఓ అసెట్. రఘుబాబు, బిత్తిరి సత్తి, షకలక శంకర్, పాత్రలు నవ్వులు పంచే విధంగా ఉంటాయి. త్వరలో సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: వేణు మురళీధర్, కో ప్రొడ్యూసర్: షేక్ రఫీ, బిట్టు, రాము ఉరుగొండ. -
బిగ్‌బాస్ ఫేం సన్ని, సప్తగిరి హీరోలుగా ‘అన్‌స్టాపబుల్’
బిగ్‌బాస్ సీజన్ 5 విజేత వీజే సన్నీ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం అన్‌స్టాపబుల్. ‘అన్ లిమిటెడ్ ఫన్’ అనేది ఉపశీర్షిక. ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమాకు డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో కమెడియన్ సప్తగిరి మరో హీరోగా నటిస్తుండగా.. నక్షత్ర, అక్సా ఖాన్ హీరోయిన్ల. ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను శనివారం నిర్మాత దిల్‌రాజు విడుదలచేశాడు. రజిత్ రావు నిర్మిస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ని ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘టైటిల్ బాగుంది. సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘కుటుంబంతో సహా నవ్వుకునే చిత్రమిది’’ అన్నారు డైమండ్ రత్నబాబు. ‘‘సినిమాలపై ప్యాషన్‌తో ఇండస్ట్రీకి వచ్చాను’’ అన్నారు రజిత్ రావు. ఈ సినిమాకు షేక్ రఫీ, బిట్టు(నర్సయ్య న్యవనంది) సహా నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా.. భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు. -
టాప్ 9 కంటెస్టెంట్ల కోసం బిగ్‌బాస్ మరో సర్ప్రైజ్
బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు డబుల్ సర్ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. ఈపాటికే ఫ్యామిలీ మెంబర్స్‌ను హౌస్‌లోకి పంపించిన బిగ్‌బాస్ వీకెండ్లో మిగతా ఇంటిసభ్యులను, ఫ్రెండ్స్‌ను స్టేజీపైకి రప్పించి వారిని సర్ప్రైజ్ చేయనున్నాడు. ఈ మేరకు తాజాగా ఓ ప్రోమో రిలీజైంది. టాప్ 9 కంటెస్టెంట్ల కోసం వీజే సన్ని, రోల్ రైడా, బుల్లెట్ భాస్కర్, సింగర్ సాకెత్, సోహైల్ ఇలా ఎంతోమంది వచ్చారు. అయితే ఈసారి వారితో ఎవరు టాప్5 అనే గేమ్‌కు బదులుగా మరో డిఫరెంట్ గేమ్ ఆడించాడట. అదేంటో తెలుసుకోవాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే! చదవండి: అలాంటి కథలు చిరంజీవికి సెట్ కావు: పరుచూరి ఫైమా చేతిలో ఎలిమినేషన్, అతడే ఎలిమినేట్ కానున్నాడా? -
‘సకల గుణాభిరామ’ మూవీ రివ్యూ
టైటిల్: సకల గుణాభిరామ నటీనటులు: వి జె సన్నీ, అసిమా, శ్రీతేజ్, తరుణీ సింగ్, జెమినీ సురేష్, సరయూ. చమ్మక్ చంద్ర,తదితరులు నిర్మాత: సంజీవ్ రెడ్డి దర్శకుడు : వెలిగొండ శ్రీనివాస్ సంగీతం: అనుదీప్ కెమెరా మాన్ : నళిని కాంత్ ఎడిటర్ : వెంకట్ విడుదల తేది: సెప్టెంబర్16, 2022 బిగ్‌బాస్ షోతో పాపులర్ అయ్యాడు నటుడు విజే సన్నీ. అంతకు ముందే పలు సిరియల్స్‌తో పాటు సినిమాలలో నటించినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు కానీ.. బిగ్‌బాస్ 5లో పాల్గొని విన్నర్‌గా నిలవడంతో సన్నీ పేరు రెండు తెలుగు రాష్ట్రాలకు తెలిసింది. బిగ్‌బాస్ షో తర్వాత వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘సకల గుణాభిరామ’. అసిమా హీరోయిన్గా నటించిన ఈ చిత్రం నేడు(సెప్టెంబర్ 16)న విడుదలైంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. మధ్య తరగతి కుటుంబానికి చెందిన అభిరామ్(సన్నీ) ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి. స్వాతి(అసిమా)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వచ్చే జీతం చాలక వడ్డీ వ్యాపారి ప్రదీప్(శ్రీతేజ్) దగ్గర అప్పు తీసుకొని ఇబ్బంది పడుతుంటాడు. ఆర్థిక పరిస్థితి కారణంగా స్వాతి పిల్లలను కనడం వాయిదా వేస్తూ వస్తుంది. ఓ రోజురాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగి.. స్వాతి పుట్టింటికి వెళ్లిపోతుంది. ఆ తర్వాత అభిరామ్ ఎదుర్కొన్న సమస్యలేంటి? అలిగివెళ్లిపోయిన భార్య తిరిగి వచ్చిందా లేదా? భార్య పుట్టింటికి వెళ్లిన తర్వాత రామ్ ఏం చేశాడు? అతనిలో వచ్చిన మార్పు ఏంటి? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. మిడిల్ క్లాస్ అబ్బాయి.. చాలీచాలని జీతం.. దాని వల్ల ఫ్యామిలీతో జరిగే గొడవలు..ఇలాంటి కాన్సెప్ట్ కథలు నవ్విస్తూనే.. ఎమోషనల్‌కు గురిచేస్తాయి. అలాంటి కథే ‘సకల గుణాభిరామ’. ప్రేమించి పెళ్ళి చేసుకోవడమే కాదు… ఏవైనా పొరపాట్లు జరిగితే… వాటిని క్షమించే గుణం కూడా భార్యా భర్తలకు ఉండాలి’ అనే మంచి సందేశాన్ని హాస్యాన్ని జోడించి చెప్పాడు దర్శకుడు వెలిగొండ శ్రీనివాస్ .ఫస్ట్ హాఫ్ అంతా… హీరో పనిచేసే కంపెనీలో సహా ఉద్యోగులతోనూ, యజమానితోను సరదా సరదా సన్నివేశాలతో రోటీన్‌గా సాగుతుంది. అసలు కథ సెకండాఫ్‌లో ఉంటుంది. పరాయి స్త్రీతో పరిచయం ఎలాంటి పరిణామాలకు దారి తీసింది?దాని వల్ల అభి నేర్చుకునే గుణపాఠం ఏంటి? తదితర విషయాలన్నీ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే సినిమాలో వచ్చే కొన్ని సీన్స్ మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఇబ్బంది కలిగిస్తాయి. యూత్ ఆడియన్స్‌ని మెప్పించడానికే కొన్ని సీన్స్‌ని పెట్టారు. దర్శకుడు వెలిగొండ శ్రీనివాస్ మంచి కథ.. కథనాలను రాసుకున్నాడు. అయితే మరింత బాగా దాన్ని తెరమీద ఆవిష్కరించి ఉంటే మంచి సినిమా అయ్యేది. ఎవరెలా చేశారంటే.. సాఫ్ట్వేర్ ఉద్యోగి, చిలిపి భర్త అభిరామ్ పాత్రలో ఒదిగిపోయాడు సన్నీ. కామెడీ సీన్స్‌తో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తనదైన నటనతో మెప్పించాడు. డ్యాన్స్ కూడా ఇరగదీశాడు. అభిరామ్ భర్త స్వాతిగా ఆసిమా తనదైన నటనతో ఆకట్టుకుంది. విలన్ భార్య దీపిక పాత్రలో నటించిన తరుణీ సింగ్ తన బబ్లీ నటనతో ఆకట్టుకుంటుంది. సెకండ్ హాఫ్ లో ఆమెతో హీరో కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. వడ్డీ వ్యాపారి ప్రదీప్ పాత్రలో శ్రీతేజ్ విలక్షణంగా కనిపించి మెప్పించాడు. జెమినీ సురేష్, సరయూ. చమ్మక్ చంద్రతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. అనుదీప్ సంగీతం, నళిని కాంత్ సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్ వెంకట్ తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్స్‌ని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్టుగా ఉన్నాయి. -
Sakala Gunabhi Rama: ఈ శుక్రవారం సన్నిదే .. యాంకర్ రవి
‘సినిమా వాళ్లు ఏదో ఒక శుక్రవారం మాది కావాలని కోరుకుంటారు. ఈ శుక్రవారం మాత్రం మా సన్నిదే. సకల గుణాభి రామ చిత్రం నేను చూసాను, చాలా బాగుంది. ఈ చిత్రం కచ్చితంగా విజయం సాధిస్తుంది’అని యాంకర్ రవి అన్నారు. బిగ్ బాస్ ఫేమ్ వి జె సన్నీ, అషిమా హీరో హీరోయిన్ గా శ్రీనివాస్ వెలిగొండ దర్శకత్వంలో సంజీవ్ రెడ్డి నిర్మించిన చిత్రం సకల గుణాభి రామ. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 16 న ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అది నారాయణ ఎస్ కె ఎమ్ ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో బిగ్ బాస్ ఫేమ్ నటులు సోహైల్, మానస్, జెస్సి, హమీద, యాంకర్ రవి మరియు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాంకర్ రవి మాట్లాడుతూ.. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ అద్భుతమైన మ్యూజిక్ అందించాడు. పాటలు చాలా బాగున్నాయి. సన్నీ కి ఈ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరికి ఈ చిత్రం మంచి విజయం సాధించాలి’ అని కోరుకున్నారు. సోహైల్ మాట్లాడుతూ ..మేమంతా బిగ్ బాస్ తర్వాత ఫేమస్ అయ్యాము కానీ మా అందరి గోల్ మాత్రం సినిమాల్లో నటించడమే. మేము అందరం చాలా కష్టపడి మా కెరీర్ ని నిలబెట్టుకుంటున్నాం. అలాగే సన్నీ కూడా చాలా కష్టపడ్డాడు. ప్రేక్షకులు అందరూ ఈ చిత్రం చూడండి. ఇలాంటి చిన్న చిత్రాలు విజయవంతం అయితే మరిన్ని మంచి చిత్రాలు మీ ముందుకు వస్తాయి. అందరూ మా సన్నీ నటించిన సకల గుణాభి రామ చిత్రాన్ని చూసి విజయవంతం చేయండి’ అని కోరుకున్నారు. ‘లాక్ డౌన్ టైం లో చిన్న సినిమా గా ప్రారంభం అయిన సకల గుణాభి రామ చిత్రం ఇప్పుడు థియేటర్స్ లో విడుదల కావడం చాలా సంతోషంగా ఉంది. అందరం కొత్త టెక్నిషన్స్ చాలా కష్టపడి పని చేసాం. సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందరికీ బాగా నచ్చుతుంది’అని దర్శకుడు శ్రీనివాస్ వెలిగండ అన్నారు. హీరో సన్నీ మాట్లాడుతూ .. నేను బిగ్ బాస్ లో రాక ముందే నాకు హీరో గా అవకాశం ఇచ్చిన మా నిర్మాత సంజీవ్ గారికి నా కృతజ్ఞతలు. మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ అద్భుతమైన పాటలు ఇచ్చారు. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాన్ని చేసాం, ప్రేక్షకులు అందరూ మా సినిమా ని చూసి హిట్ చేస్తారు’ అని కోరుకున్నారు. -
బిగ్‌బాస్ విన్నర్ అని చెప్పుకోవడం మానేశాను : వీజే సన్నీ
బుల్లితెరపై బిగ్‌బాస్ రియాలిటీ షోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షోతో అప్పటిదాకా పెద్దగా గుర్తింపు లేని సెలబ్రిటీలకు కూడా పాపులారిటీ దక్కుతుంది. బిగ్‌బాస్ షోతో రాత్రికి రాత్రి స్టార్లు అయిన వాళ్లూ ఉన్నారు. అయితే ఈ క్రేజ్ వారి కెరీర్‌కు ఏమాత్రం ఉపయోగపడటం లేదనే చెప్పాలి. ఎందుకంటే గత సీజన్లలో విన్నర్స్‌గా బోలెడంత పాపులారిటీని దక్కించుకున్న కంటెస్టెంట్ల జాతకాల్లోనూ పెద్దగా మార్పులు ఉండట్లేదు. తాజాగా బిగ్‌బాస్ సీజన్-5విజేత వీజే సన్నీ బిగ్‌బాస్ షోపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... 'బిగ్‌బాస్ వల్ల నాకు ఒరిగిందేమీ లేదు. బిగ్‌బాస్ విన్నర్ అని చెప్పుకోవడం కూడా మనేశాను. ఎవరినైనా కలిసినపుడు నేను బిగ్‌బాస్ విన్నర్ అని చెప్తుంటే అంటే ఏంటి అని అడుగుతున్నారు. బిగ్‌బాస్ షో వల్ల నాకు ఫేమ్,నేమ్ వచ్చిన మాట నిజమే కానీ నా కెరీర్‌కు మాత్రం పెద్దగా ఉపయోగపడలేదు. దీంతో బిగ్‌బాస్ విన్నర్ అని చెప్పడం మానేసి ప్రస్తుతం నా సినిమాలు, సీరియల్స్ మీదే దృష్టి పెడుతున్నా' అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సన్నీ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. -
బిగ్‌బాస్ విన్నర్ సన్నీపై దాడి, పోలీసులకు ఫిర్యాదు
బిగ్‌బాస్ విన్నర్ వీజే సన్నీపై దాడి జరిగింది. బిగ్‌బాస్ షోతో మరింత పాపులరైయిన సన్నీ వరుస ఆఫర్లు అందుకుంటున్నాడు. ఈ క్రమంలో పలు సినిమాలకు సంతకం చేసిన సన్నీ ప్రస్తుతం షూటింగ్స్ బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో సన్నీ హీరోగా ఏటీఎం అనే సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుపుకుంటుంది. ఈ క్రమంలో బుధవారం హైదరాబాద్‌లోని హస్తినాపురం ప్రాంతంలో ఈ మూవీ షూటింగ్‌ను జరుపుకుంది. అయితే షూటింగ్ జరుగుతుండగా సాయంత్రం సమయంలో ఓ రౌడీషీటర్ సెట్‌కు వచ్చి హల్చల్ చేశాడు. అంతేగాక హీరో సన్నీతో గొడవకు దిగుతూ అతడిపై దాడి చేశాడు. దీంతో అక్కడే ఉన్న సిబ్బంది వెంటనే సన్నీని షూటింగ్ నుంచి కారులో పంపించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రౌడీషీటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా విజేగా కెరీర్ స్టార్ట్ చేసిన సన్నీ పలు టీవీ షోలు, సీరియల్స్‌తో గుర్తింపు పొందాడు. ఈ క్రమంలో ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5లో పాల్గొనే ఆఫర్ కొట్టేశాడు. ఈ షో తనదైన ప్రవర్తనతో బుల్లితెర ప్రేక్షకుల హృదయానలు గెలుచుకున్న సన్నీ బిగ్‌బాస్ సీజన్ 5 విజేతగా నిలిచి టైటిల్ అందుకున్నాడు. -
ప్రేక్షకులను మెప్పించడానికి వందశాతం కష్టపడతా : వీజే సన్నీ
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విన్నర్ వీజే సన్నీ కొత్త చిత్రం ప్రారంభమైంది. అన్‌స్టాపబుల్ (నో డౌట్ 100% ఎంటర్టైన్మెంట్), ఏ 2 బి ఇండియా ప్రొడక్షన్స్ ప్రవేట్ లిమిటెడ్ బ్యానర్లో రంజిత్ రావ్.బి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సప్తగిరి, పొసాని కృష్ణమురళి, పృద్వి, షకలక శంకర్ తదితరులు ఇతర కీలకపాత్రల్లో నటించనున్న ఈ చిత్రం పూజా కార్యక్రమం మంగళవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత వి.విజయేంద్రప్రసాద్, దర్శకుడు బి.గోపాల్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, హీరో తనీష్ తదితరులు పాల్గొన్నారు. రచయిత విజయేంద్ర ప్రసాద్ హీరో వి.జె సన్నీ లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. దర్శకుడు బి.గోపాల్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన పాత్రికేయులు సమావేశంలో చిత్ర హీరో సన్నీ మాట్లాడుతూ.. ‘దర్శకుడు డైమండ్ రత్నబాబు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నాను. బిగ్ బాస్ తర్వాత నటుడుగా నేను ప్రూవ్ చేసుకోవా లని వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకోకుండా సినిమా చేస్తున్నాను. ప్రేక్షకులను మెప్పించడానికి, నవ్వించడానికి నటుడుగా నేను వందశాతం కష్టపడి పని చేస్తాను. రిజల్ట్ అనేది ఆడియన్స్ చేతుల్లో ఉంటుంది. ఈ సినిమాకు త్రిమూర్తులు వంటి నిర్మాతల తో పాటు మంచి టీం దొరికారు. సీనియర్ నటులతో నటిస్తున్న ఈ సినిమా ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది’అన్నారు. సూపర్ స్టార్ కృష్ణ, మహేశ్‌బాబు ఫ్యాన్స్‌కు ఈ సినిమా ప్రారంభోత్సవాన్ని అంకితం చేస్తున్నానని దర్శకుడు డైమండ్ రత్నబాబు అన్నారు. జూన్ 9 నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ చేసి జూన్,జులై నెలల్లో షూటింగ్ పూర్తి చేసుకొని దసరాకు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని చెప్పారు. ఇకపై తమ బ్యానర్లో ప్రేక్షకులు ఎంజాయ్ చేసే మంచి చిత్రాలను తీసుకొస్తామని అన్నారు నిర్మాత రంజన్ రావు బి. ఈ చిత్రానికి బీమ్స్ సంగీతం అందిస్తున్నారు. -
బిగ్‌బాస్ హౌస్‌లో సన్నీ, అతడే ఎవిక్షన్ ఫ్రీ పాస్ విన్నర్!
బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ కంటెస్టెంట్ యాంకర్ శివ నెత్తిన దరిద్రం తాండవం చేస్తోంది. అందుకే ఎవిక్షన్ ఫ్రీ పాస్ పోటీదారుడిగా నిలిచేందుకు ఎంత కష్టపడ్డా ఫలితం వచ్చినట్లే వచ్చి చేజారింది. ఇక ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం అఖిల్, అనిల్, బాబా, బిందు మాధవి పోటీపడ్డారు. వీరిలో బాబా భాస్కర్ పాస్ గెలుచుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ పాస్ బాబా ఎవరికోసం ఉపయోగిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. ఇక హౌస్‌లో ఇప్పటికే సిరి, షణ్ముఖ్, రవి, మానస్ రాగా తాజాగా విన్నర్ సన్నీ వచ్చాడు. అతడి రాకతో హౌస్మేట్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. అతడిని ఆటపట్టిస్తూ స్విమ్మింగ్ పూల్‌లో నెట్టేశారు. అయినా సరే సన్నీ పూల్‌లోనూ డ్యాన్స్ చేస్తూ తగ్గేదేలే అని నిరూపించాడు. మరి సన్నీ ఎంటర్టైన్మెంట్, హౌస్మేట్స్ గేమ్ చూడాలంటే రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: ఆ డైరెక్టర్స్ మన మంచితనాన్ని అలుసుగా తీసుకుని వాడుకుంటారు.. ఫ్యాన్స్‌కు మహేశ్‌బాబు రిక్వెస్ట్, సోషల్ మీడియాలో లేఖ వైరల్ -
దొంగతనం మొదలుపెట్టిన బిగ్‌బాస్-5 విజేత సన్నీ
ప్రముఖ నిర్మాత దిల్‌రాజు, హరీష్ శంకర్ సంయుక్తంగా జీ5 కోసం రూపొందిస్తున్న వెబ్ సీరిస్ ‘ఏటీఎం’. బిగ్‌బాస్ ఫేం వీజే సన్నీ, దివితో పాటు నటుడు సుబ్బరాజు ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సి.చంద్రమోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సీరీస్‌కు హరీష్ శంకర్ కథ అందించారు. హర్షిత్ రెడ్డి, హన్సిత రెడ్డి ఈ వెబ్‌సిరీస్‌ను నిర్మిస్తున్నారు. ఈనెల 27నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ సందర్భంగా సోమవారం పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్ట్‌ను లాంచ్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇక తన కొత్త వెబ్‌సిరీస్‌పై సన్నీ ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించాడు. 'ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఏటీఎం వెబ్‌సిరీస్ గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. దొంగతనం షురూ' అంటూ రాసుకొచ్చాడు. ఈ సందర్భంగా వీజే సన్నీకి అలీ, సోహైల్ సహా పలువురు బెస్ట్ విషెస్ తెలియజేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by VJ Sunny (@iamvjsunny) -
ఆర్జే కాజల్‌కి అదిరిపోయే పంచ్ వేసిన వరుణ్ సందేశ్
Varun Sandesh Hilarious Punch to RJ Kajal: తెలుగు బిగ్‌బాస్ ఐదో సీజన్ విన్నర్ వీజే సన్నీ హీరోగా చేసిన సినిమా సకలగుణాభిరామ. ఇటీవలె ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఇక ఈ ఈవెంట్‌కి శ్రీరామచంద్ర, వరుణ్‌తేజ్, సోహేల్, ఆనీ మాస్టర్, మానస్ సహా పలువురు బిగ్‌బాస్ కంటెస్టెంట్లు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఆర్జే కాజల్ హోస్ట్‌గా నిర్వహించింది. కాగా సన్నీతో అనుబంధం గురించి హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతతూ.. సన్నీ తనకు ఎన్నో సంవత్సరాల నుంచి తెలుసని, బిగ్‌బాస్‌తో అందరి మనసులు గెలుచుకున్నాడని అభినందించాడు. సకలగుణాభిరామ టీం అందరికి ఆల్ ది బెస్ట్ అంటూ తన స్పీచ్‌ని ముగించాడు. అయితే వరుణ్ మాట్లాడిన వెంటనే మైక్ అందుకున్న కాజల్.. నీ ఇందువదన సినిమాకి ఆల్ ది బెస్ట్ అని పేర్కొనగా సినిమా ఆల్రెడీ రిలీజ్ అయ్యిందంటూ వరుణ్ కౌంటర్ ఇచ్చాడు. దీంతో అక్కడుకున్న వారంతా కౌజల్ తప్పులో కాలేసిందంటూ తెగ నవ్వుకున్నారు. -
సకల గుణాభిరామ ట్రైలర్ లాంఛ్.. ఎమోషనల్‌గా వీజే సన్నీ స్పీచ్
VJ Sunny Emotional In Sakala Gunabhi Rama Trailer Launch: బిగ్‌బాస్ సీజన్-5 విజేతగా నిలిచిన సన్నీకి సోషల్ మీడియాలో యమ క్రేజ్ ఉంది. ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్‌లో ఎంట్రీ ఇచ్చిన సన్నీ తన ఆటతీరుతో, ఎంటర్టైన్మెంట్తో ట్రోపీని సొంతం చేసుకున్నాడు. బిగ్‌బాస్ టైటిల్ విన్నర్‌గా నిలిచి తెలుగు రాష్ట్రాల్లో మరింత పాపులర్ అయ్యాడు. ఈ క్రేజ్‌తోనే హీరోగా మారాడు. వీజే సన్నీ నటించిన చిత్రం 'సకల గుణాభిరామ'. ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా డైరెక్టర్ అనిల్ రావిపూడి, విశ్వక్ సేన్, బిగ్‌బాస్ కంటెస్టెంట్లు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి విశ్వక్ సేన్ అతిథిగా రావడంతో వీజే సన్నీ ఎమోషనల్ అయ్యాడు. తాను బిగ్‌బాస్ ట్రోఫీ గెలిచేందుకు విశ్వక్ సేన్ ప్రయత్నాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు సన్నీ. 'నేను బిగ్‌బాస్ టైటిల్ కొట్టడానికి కారణం నా స్నేహితులే. వాళ్లే నా వెనుక ఉండి నన్ను ముందుకు నడిపిస్తారు. జీవితంలో కావాల్సింది పైసల్ కాదు. దోస్తులు కావాలి. నా దోస్తులందరికీ నేను హీరో కావాలనే కల ఉండేది. ఆ కలను ఈ చిత్రంతో నిజం చేశాను. ఈ కార్యక్రమానికి పిలవగానే విశ్వక్ సేన్ అన్న, అనిల్ అన్నా వచ్చారు. నేను బిగ్‌బాస్ హౌజ్‌లో ఉన్నప్పుడు విశ్వక్ సేన్‌కు నేను ఎవరో తెలియదు. కానీ నాకు చాలా సపోర్ట్ ఇచ్చారని బయటకు రాగానే నా స్నేహితులు చెప్పారు. విశ్వక్ సేన్ అన్న ఎంత సపోర్ట్ చేశారో.. అనిల్ రావిపూడి అన్న అంతే సపోర్ట్ చేశారు. నేను బయటకు రాగానే అన్నని కలిశాను. వాళ్ల డాటర్ కేక్ కట్ చేసిన వీడియో నాకు చూపించేసరికి నేను ఫిదా అయిపోయా. థాంక్యూ అన్నా.' అని తెలిపాడు వీజే సన్నీ. -
బిగ్‌బాస్ విన్నర్ సన్నీకి మ్యారేజ్ ప్రపోజల్.. 100 కోట్ల కట్నం!
Bigg Boss 5 Winner Vj Sunny gets Marriage Proposal With 100 Cr Dowry: బిగ్‌బాస్ సీజన్-5 విజేతగా నిలిచిన సన్నీకి సోషల్ మీడియాలో యమ క్రేజ్ ఉంది. ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్‌లో ఎంట్రీ ఇచ్చిన సన్నీ తన ఆటతీరుతో, ఎంటర్టైన్మెంట్తో ట్రోపీని సొంతం చేసుకున్నాడు. బిగ్‌బాస్ టైటిల్ విన్నర్‌గా నిలిచి తెలుగు రాష్ట్రాల్లో మరింత పాపులర్ అయ్యాడు. ముఖ్యంగా అమ్మాయిల ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. తాజాగా సన్నీకి ఓ ఎన్నారై మహిళ నుంచి బంపర్ ఆఫర్ వచ్చింది. అమెరికా నుంచి ఉష అనే మహిళ సన్నీకి వీడియో కాల్ చేసి తన కూతుర్ని పెళ్లి చేసుకో అని అడిగేసింది. అంతేకాకుండా కట్నంగా 100కోట్లు ఇస్తానని పేర్కొంది. దీంతో 'నన్ను భరించాలంటే చాలా ఓర్పు ఉండాలి. మీరు ఆ మాట అన్నారు చాలు' అంటూ సన్నీ ఆన్సర్ ఇవ్వగా.. నేను సీరియస్‌గా అడుగుతున్నా అంటూ ఆమె లైవ్‌లోనే పెళ్లి సంబంధం మాట్లాడింది. ప్రస్తుతం సన్నీకి వచ్చిన ఈ పెళ్లి ప్రపోజల్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. -
పాపం శ్రీహాన్.. సిరికి చాలాసార్లు చెప్దామనుకున్నా: సన్నీ
VJ Sunny Comments On Shannu Siri Relationship: బిగ్‌బాస్ షో సిరి, షణ్ముఖ్‌ను బాగా దగ్గర చేసింది. ఎవరేమనుకున్నా మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని కుండ బద్ధలు కొట్టేశాడు షణ్ను. అదే సమయంలో సిరి వల్లే తను ఓడిపోయానని కూడా వెల్లడించాడు. ఇక షణ్ముఖ్ ఆల్రెడీ దీప్తి సునయనతో పీకల్లోతు ప్రేమలో ఉండగా.. సిరికి శ్రీహాన్‌తో నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ వీరిద్దరూ ఆ విషయం మర్చిపోయి బిగ్‌బాస్ హౌస్‌లో ఒకరికొకరు హగ్గులిచ్చుకుంటూ, ముద్దులు పెట్టుకున్నారు. ఇది చాలామందికి మింగుడుపడలేదు. స్నేహం పేరుతో వీళ్లు అతిగా ప్రవర్తించారన్న విమర్శలు వచ్చాయి. అయితే సిరి తల్లి హౌస్‌లోకి వచ్చినప్పుడు సన్నీ వాళ్ల కోసం స్టాండ్ తీసుకున్నాడు. మానస్‌ది తనది ఎలాంటి ఫ్రెండ్షిప్పో.. సిరి, షణ్నులది కూడా అలాంటి స్నేహమేనని మద్దతుగా మాట్లాడాడు. తాజాగా సిరి- షణ్ముఖ్‌ల బంధంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు సన్నీ. 'సిరికి ఒక మాట చెప్పాలనుకున్నాను. దోస్తాన్ దోస్తానే కానీ బయట నిన్ను నమ్ముకుని ఒక మనిషి(శ్రీహాన్) ఉన్నాడు. పాపం అతడు ఫీల్ అవుతాడు కదా అని చాలాసార్లు చెప్పాలనిపించింది. కానీ ఇది నేరుగా చెప్దాం అనుకున్నా వాళ్లు తీసుకోరు అనిపించింది. ఎందుకంటే వాళ్లను మాట్లాడిద్దాం అని వెళ్లినప్పుడల్లా.. మాకు కొంచెం సమయం కావాలి. ఇప్పుడు మాట్లాడాలనుకోవట్లేదు అంటారు. కనెక్షనే లేనప్పుడు ఇంకేం చెప్తాం' అని చెప్పుకొచ్చాడు సన్నీ. -
తండ్రి గురించి తొలిసారి ఓపెన్ అయిన సన్నీ..
Bigg Boss 5 Winner Sunny Emotional Comments About His Father: బిగ్‌బాస్ సీజన్-5 విజేతగా వీజే సన్నీ టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. తల్లి కళావతి గురించి ఎప్పుడూ చెప్పే సన్నీ.. తండ్రి గురించి ఇంతవరకు ఎక్కడా ప్రస్తావించలేదు. తాజాగా సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తండ్రి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. కొన్ని ఎలా జరుగుతాయో మనకి తెలియదు. అలాంటి సందర్భం ముందు ముందు రాకూడదని అనుకుంటున్నా. అమ్మానాన్న వెరీ గుడ్. 'నేను అమ్మతో ఉంటాను. నాన్నంటే కూడా రెస్పెక్ట్ ఇస్తున్నా. వాళ్ల మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు. ఈ విషయం గురించి అమ్మని ఎప్పుడూ అడగలేదు. అది వాళ్ల పర్సనల్ మ్యాటర్. నాకు కళావతి అనే మంచి ఫ్రెండ్ ఉంది' అంటూ చెప్పుకొచ్చారు. కాగా సన్నీకి ఏడాది వయసున్నప్పుడే పేరెంట్స్ విడిపోవడంతో తండ్రి ప్రేమకు దూరమైన సన్నీకి అప్పటి నుంచి తల్లి అన్నీ తానై చూసుకుంది. అంతేకాకుండా ఆమె తనకు మొదటి సారి అడిగిన గిఫ్ట్ బిగ్‌బాస్ విజయం అని, కప్పు గెలిచిన రోజు ఓ కొడుకుగా ఆమె ఆనందం చూసి ముచ్చటేసిందని పేర్కొన్నాడు. -
'సన్నీ చేస్తుంది తప్పు.. అతడు కనిపిస్తే చెంప పగలగొడతాను'
Madhavi Latha Fires On Bigg Boss 5 Telugu Winner VJ Sunny: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ ముగిసినప్పటికీ కంటెస్టెంట్ల హడావుడి మాత్రం ఇంకా కొనసాగుతోంది. ఫినాలేలో అడుగుపెట్టిన సిరి, శ్రీరామచంద్ర, సన్నీ, మానస్, షణ్ముఖ్.. ఇంటర్వ్యూలు, ఫ్యాన్స్ మీట్, గెట్ టు గెదర్ అంటూ తెగ సందడి చేస్తున్నారు. అయితే సన్నీ మాత్రం తనకు అండగా నిలబడ్డవాళ్లను కనీసం పట్టించుకోవట్లేదన్న విమర్శలు మొదలయ్యాయి. అతడి విజయంలో కీలక పాత్ర పోషించిన ఫ్యాన్ పేజీలు, కొన్ని యూట్యూబ్ ఛానళ్ల వంక తలెత్తి కూడా చూడటం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం టీవీ ఛానళ్లకు మాత్రమే ఇంటర్వ్యూలు ఇస్తూ తన కోసం ఎంతగానో పోరాడిన యూట్యూబ్ రివ్యూయర్లకు, ఓట్ల కోసం కష్టపడ్డ ఫ్యాన్ పేజీలకు కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పలేదట! దీంతో విన్నర్‌గా నిలిచిన సన్నీకి గర్వం తలకెక్కిందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయం తెలిసిన నటి మాధవీలత అగ్గి మీద గుగ్గిలమైంది. సన్నీకి ఓట్లేయాలంటూ మద్దతుగా నిలిచిన ఆమె అతడి తలబిరుసును తీవ్రంగా తప్పుపట్టింది. 'సన్నీ కోసం సపోర్ట్ చేసిన ఫ్యాన్ పేజీలను వదిలేసి, రివ్యూయర్లను వదిలేసి, ఓట్లు వేయడానికి వాళ్లు పడ్డ కష్టాన్ని వదిలేసి, ఓట్లు వేయండని మొత్తుకునే వాళ్లను వదిలేసి బడా టీవీ ఛానళ్లకు, ఎక్కువ ఫాలోవర్లు ఉన్న యూట్యూబ్ ఛానళ్లకు అతడు ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. కనీసం తనకు ఓట్లేయమని చెప్పనివాళ్లకు ప్రిఫరెన్స్ ఇచ్చి తప్పు చేస్తున్నాడు. బిగ్‌బాస్ షోలో సన్నీ నిజాయితీ మెచ్చి ఎంత ప్రమోట్ చేశానో, ఇప్పుడు తను చేస్తున్న తప్పుని కూడా ఎత్తి చూపిస్తాను. సన్నీ తప్పు చేస్తున్నాడు. కృతజ్ఞతాభావం లేనివాళ్లంటే నాకు చిరాకు. అతడి కోసం ఎంతమంది పీఆర్(పర్సనల్ రిలేషన్షిప్ మేనేజర్)లా మారిపోయారు. వాళ్లకు థ్యాంక్స్ అని ఒక మాట చెప్తే అయిపోతుందా? తన గురించి గొప్పగా చెప్పుకొచ్చిన యూట్యూబ్ రివ్యూయర్ల పేర్లయినా మెన్షన్ చేశాడా? పోనీ తనకు తెలీకపోతే అతడి ఫ్రెండ్స్‌కి తెలీదా? కళ్లు నెత్తికెక్కాయా? తొలి ప్రాధాన్యత ఎవడికి ఇవ్వాలి? మీడియా నుంచి వచ్చా కాబట్టి మీడియాకే ప్రాధాన్యతనిస్తానన్నే సన్నీ బిస్కెట్ బాగానే ఉంది. నీకోసం పర్సనల్ పీఆర్‌లా పనిచేసిన వాళ్లకు లైవ్ అడిగితే దొరక్కుండా పెద్ద ఛానళ్లకు ఇంటర్వ్యూలిస్తున్నావు.. నీ ఫ్యాన్ పేజెస్ మెయింటెన్ చేసిన వాళ్లను కలవాలి, నీకోసం మామూలు అమ్మాయిలు ఎన్ని మాటలు పడ్డారు? నీ విజయం వాళ్లదని ఫీలయ్యారు. నీ పీఆర్ ఫ్రెండ్ కనిపిస్తే చెంప పగలగొడతాను. సాధారణ జనానికి విలువివ్వకపోతే అక్కడే ఆగిపోతావు గుర్తుంచుకో.. ఫ్యాన్ పేజీలను క్రియేట్ చేసిన ఒక్కరికీ సన్నీ నుంచి ఎటువంటి మెసేజ్, ఫోన్ రాలేదు. పాపం.. వాళ్లంతా సన్నీ ఏడిస్తే ఏడ్చారు, సన్నీ నవ్వితే నవ్వారు. వారం రోజులవుతున్నా ఇంకా టాప్ ఛానల్స్‌తోనే బిజీ ఉండటం తప్పు, నాకు నచ్చట్లేదు. నాకు కోపం వస్తే అదే మీడియాలో నిలబెట్టి కడిగేస్తా. నచ్చితే నెత్తిన పెట్టుకుంటాను, తిక్కలేస్తే తాట తీసి ఆరేస్తా' అని వార్నింగ్ ఇచ్చింది మాధవీలత. మరి దీనిపై సన్నీ ఏమైనా రియాక్ట్ అవుతాడేమో చూడాలి! -
షణ్నూకి ఛాలెంజ్ విసిరిన బిగ్‌బాస్ విన్నర్ సన్నీ
బిగ్‌బాస్ సీజన్-5 విజేత వీజే సన్నీ షణ్నూ, సిరిలతో పాటు సింగర్ శ్రీరామచంద్రను నామినేట్ చేశాడు. బిగ్‌బాస్ అయిపోయింది ఇంక నామినేషన్స్ ఏంటి అనే కదా మీ డౌటు.. ఈ ఛాలెంజ్ బిగ్‌బాస్‌కి సంబంధించింది కాదు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్. తెలంగాణ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దిగ్విజయంగా ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంతో మంది టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటుతున్నారు. . పర్యావరణాన్ని రక్షించే మంచి ఆలోచనతో ప్రారంభమైన ఈ గ్రీన్ ఛాలెంజ్‌లో ఎంతోమంది ఉత్సాహంగా పాల్గొంటున్నారు. తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన సన్నీ.. బిగ్‌బాస్ కంటెస్టెంట్లు షణ్ముక్, సిరి, శ్రీరామచంద్రలకు ఛాలెంజ్ విసిరారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ జోగినపల్లి సంతోష్‌కు ధన్యవాదాలు తెలిపాడు. -
బిగ్‌బాస్-5 విజేత వీజే సన్నీకి కరెంట్ షాక్
బిగ్‌బాస్ సీజన్-5 ముగిసింది. ఈ సీజన్ విన్నర్‌గా సన్నీ నిలిచాడు. తనదైన ఆట తీరుతో మెప్పింపిన సన్నీ, బెస్ట్ ఎంటర్టైనర్గానూ ఎంతోమంది మనసుల్ని గెలుచుకున్నాడు. ఇక బిగ్‌బాస్ టైటిట్ గెలిచిన అనంతరం వరుస ఇంటర్వ్యూలతో యమ బిజీగా గడిపేస్తున్నాడు సన్నీ. అయితే తాజాగా జరిగిన ఓ ప్రెస్మీట్లో అనుకోని పరిణామం ఎదురైంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ ప్రెస్మీట్లో పలు మీడియా చానెల్స్‌తో పాటు యూట్యూబ్ ఛానెల్స్ కూడా పాల్గొన్నాయి. ఈ సందర్భంగా వారు అడిగిన పలు ప్రశ్నలకు సన్నీ సమాధానం చెప్పాడు. ఈ క్రమంలో మొబైల్లోని ఓ క్లిప్పింగ్‌ను సన్నీకి చూపిస్తుండగా అకస్మాత్తుగా చిన్నపాటి కరెంట్ షాక్ తగిలింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ ఘటనలో ఎవరికి హానీ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
బిగ్‌బాస్ : ఈ కారణంగానే సన్నీ ట్రోఫీ గెలిచాడు!
Bigg Boss 5 Winner Sunny Success Reasons: బిగ్ బాస్ సీజన్ 5 ఘనంగా ముగిసింది. అందరూ ఊహించిన విధంగానే సన్ని సీజన్ 5 విన్నర్ గా నిలిచాడు. 50 లక్షల ప్రైజ్ మనీతో పాటు, 25 లక్షలు విలువజేసే స్థలాన్ని సైతం అందుకున్నాడు. మొదట వీడియో జాకీ ఆ తర్వాత యాంకర్, సీరియల్ లో కూడా నటించాడు. ఇప్పుడు బిగ్ బాస్ 5 విన్నర్ అయ్యాడు. త్వరలో సకల గుణాభిరామా సినిమాతో బిగ్ స్క్రీన్ కు ఎంట్రీ ఇస్తున్నాడు. మొత్తంగా సన్ని సాగిస్తున్న జర్నీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టిన ఫస్ట్ డే నుంచే తనదైన ఆటతో, అందరి మనసుల్ని గెలుచుకుంటూ ఎన్నో ఎలిమినేషన్ రౌండ్స్ దాటుకుంటూ చివరకు బిగ్ బాస్ ట్రోఫీని అందుకున్నాడు. బిగ్ బాస్ విజేతగా నిలిచేందుకు సన్ని చాలా కష్టపడ్డాడు.ముఖ్యంగా బిగ్ బాస్ ఇచ్చే టాక్స్ లను చాలా సీరియస్ గా తీసుకునేవాడు. గేమ్స్ లో పీక్స్ లో అగ్రెసివ్ గా కనిపించేవాడు.కొన్ని సార్లు మిగితా కంటెస్టెంట్స్ తో గొడవ పడేవాడు. అయితే టాస్క్ ఏదైనా సరే సన్ని మాత్రం తనదైన ముద్ర వేసేవాడు. అందరి దృష్టిని ఆకర్షించేవాడు. వివిధ టాస్క్ లలో భాగం సన్నిని మిగితా కంటెస్టెంట్స్ ఎన్నో సార్లు కార్నర్ చేశారు. కాంట్రవర్సీ ఇష్యూస్ లోకి అతన్ని లాగారు. కానీ ప్రతీసారి సన్ని నిర్దోషిగా నిలిచాడు. బిగ్ బాస్ ఆడియెన్స్ తో పాటు బిగ్ బాస్ మనసును గెల్చుకున్నాడు. హౌస్ లో సరదాగా ఉంటూ, అందరి ముఖాల్లో నవ్వు తెప్పిస్తూ అప్నా టైమ్ ఆయేగా అంటూ ఒక్కో ఎలిమినేషన్ ను దాటుకుంటూ వచ్చాడు సన్ని. ఎప్పుడూ కూల్ గా టోపీతో కనిపించడం, అందర్నీ మచ్చా అని పిలవడం, థ్యాంక్స్ చెప్పేందుకు లవ్ సింబల్ ను వాడటం సన్నికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. ఇక హౌస్ లో మానస్ తో స్నేహం, సిస్టర్ కాజల్ తో బాండింగ్ అతనికి అదనపు బలాన్ని అందించింది. -
ఆ ఒక్కటి సన్నీని విన్నర్‌గా నిలబెట్టింది
Bigg Boss 5 Telugu Winner VJ Sunny: బిగ్‌బాస్ షో మొదటి రోజు నుంచే తన ఎనర్జీతో, మాటలతో అందరినీ బుట్టలో వేసుకున్నాడు సన్నీ. దోస్తానాకి కేరాఫ్ అడ్రస్‌గా ఉండే అతడు ప్రేమొస్తే అందరివాడిలా కోపమొస్తే అర్జున్‌రెడ్డిలా మారిపోయేవాడు. కానీ హోస్ట్ నాగార్జున పెట్టిన చీవాట్లతో తనను తాను సరిచేసుకున్నాడు. నాగ్‌కు ఇచ్చిన మాట మేరకు తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని మరో కొత్త సన్నీని చూపించాడు. ఇక రియాలిటీ షోలో ప్రధానంగా కావాల్సింది ఎంటర్టైన్మెంట్. మొదటి రోజు నుంచి 106వ రోజు వరకు వినోదాన్ని పంచడంలో ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. హోటల్ టాస్క్‌ను వన్ మ్యాన్ షోలా నడిపించాడు. లోబో వెళ్లిపోయాక తనే ఎంటర్టైనర్గా మారి అటు హౌస్‌మేట్స్‌తో పాటు ఇటు ప్రేక్షకులను సైతం కడుపుబ్బా నవ్వించాడు. తన పంచ్‌లకు, ఎక్స్ప్రెషన్స్కు, కామెడీ టైమింగ్‌కు అందరూ ఫిదా అయ్యారు. నవ్వడం ఒక భోగమైతే నవ్వించడం ఒక యోగం.. అందరినీ నవ్వించే శక్తి సన్నీలో ఉంది. ఇదే అతడిని గెలుపు తీరాలకు చేర్చిందంటారు ఆయన ఫ్యాన్స్. టాస్కుల్లో విజృంభించి ఆడే సన్నీ మొదట్లో అందరి మాటలను తేలికగా నమ్మేసేవాడు. ఈజీగా ఇన్ఫ్లూయెన్స్ అయ్యేవాడు. కానీ రానురానూ ఎవరేంటో తెలుసుకుని గేమ్‌ను తన స్టైల్లో ఆడటం మొదలు పెట్టాడు. ఎవరితో గొడవపెట్టుకున్నా వెంటనే దాన్ని పరిష్కరించుకుని కలిసిపోవాలనుకోవడం అతడిలోని మంచితనానికి దర్పణం పట్టాయి. పైగా సిరి, ప్రియలతో జరిగిన గొడవల వల్ల ప్రేక్షకుల్లో నెగెటివిటీకి బదులుగా అతడిపై సానుభూతి పెరగడం విశేషం. అయితే సన్నీలో కూడా కొన్ని మైనస్‌లు ఉన్నాయి. ఏ టాస్క్ అయినా తనే గెలవాలనుకునేవాడు. గెలవాలనుకోవడంలో తప్పులేదు కానీ ఇతరులు గెలిస్తే వాళ్లేదో తొండి ఆట ఆడారని, నిజానికి తాను గెలవాల్సిందంటూ పంచాయితీ పెట్టుకునేవాడు. ఓటమిని అంత ఈజీగా స్వీకరించకపోయేవాడు. కోపంలో ఎదుటివ్యక్తిని ఇమిటేట్ చేసేవాడు. ఆవేశంలో నోరు జారేవాడు. కానీ తనకున్న ఎన్నో ప్లస్‌ల ముందు ఈ మైనస్‌లు కొట్టుకుపోయాయి. సన్నీ మచ్చా మనవాడన్న అభిప్రాయం ప్రేక్షకుల్లో బలంగా నాటుకుపోయింది. అదే అతడిని విన్నర్‌గా నిలబెట్టింది. -
వీజే సన్నీ ది విన్నర్
-
సిరికి చుక్కలు చూపించిన అరియానా.. ప్రతి ప్రశ్నలో కౌంటర్ అటాక్
BB5 Siri Bigg Boss Buzz Interview With Ariyana, Check Promo Inside: బిగ్‌బాస్ టాప్-5లో చోటు దక్కించుకున్న లేడీ కంటెస్టెంట్ సిరి. మొదటి నుంచి అబ్బాయిలకు సమానంగా గట్టి పోటీ ఇచ్చిన సిరి ఒక దశలో టాప్-3 ఉంటందనుకున్నారు. కానీ షణ్నూతో మితిమీరిన హగ్గులతో విపరీతంగా ట్రోల్స్ బారిన పడింది. పైకి బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పినా జనాలకు మాత్రం వీరి మధ్య ఇంకేదో రిలేషన్ ఉందని గట్టిగా ఫిక్స్ అయ్యేలా ప్రవర్తించారు. దీంతో అప్పటివరకు వీళ్లకు సపోర్ట్ చేస్తూ వచ్చిన వాళ్లు సైతం సైడయ్యారు. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన అనంతరం అరియానాతో బిగ్‌బాస్ బజ్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా సన్నీని కావాలనే టార్గెట్ చేశావా అన్న ప్రశ్నకు లేదు అని ఆన్సర్ ఇచ్చింది. టాస్కుల్లో ఎప్పుడూ గొడవలే జరుగుతుండటంతో ఇక ఫ్రెండిష్ ఎక్కడ నుంచి వస్తుంది అని బదులిచ్చింది. దీంతో మరి షణ్నూతో కూడా గొడవలు అవుతుంటాయి కదా అంటూ అరియానా కౌంటర్ వేసింది. ఇక రవిని నామినేట్ చేసి అతను ఎలిమినేట్ అయ్యాక మాత్రం రవి కోసం గేమ్ ఆడుతున్నాం అని చెప్పడం ఏంటి అని అడగ్గా.. కొంచెం సందేహంలో పడిపోయిన సిరి రవి ఎలిమినేషన్‌ను ఊహించలేదని ఆన్సర్ ఇచ్చింది. చివరగా ఒకనొక సందర్భంలో చోటు లేదా షణ్నూ ఇద్దరిలో ఒకరినే సెలక్ట్ చేసుకోవాలి అంటే ఎవరిని ఎంచుకుంటావ్ అంటూ అరియానా ప్రశ్నించింది. దీంతో ఒకింత అయోమయంలో పడిపోయిన సిరి ఏం చెప్పాలో తెలియక సైలెంట్ అయ్యింది. ఇది చూసిన నెటిజన్లు.. అరియానా అడిగిన ప్రశ్నలకు సిరికి బొమ్మ కనపడుతుందంటూ నెటిజన్లు సెటైర్లు వేశారు. దీనికి సంబంధించిన వీడియోను స్టార్ మా రిలీజ్ చేసింది. -
స్టేజ్‌పై సన్నీ అన్న మాటలకు ఎమోషనల్ అయిన సిరి
Bigg Boss 5 Winner Sunny Comments On Shanmukh Friendship With Siri:ఎలాంటి అంచనాలు లేకుండా బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టిన సన్నీ టైటిల్ ఎగరేసుకుపోయాడు. టాస్కుల్లో వందశాతం ఆడటంతో పాటు హౌస్‌లో రియల్ ఎంటర్టైనర్ అనే పేరు సంపాదించాడు. దీంతో పాటు షణ్నూ-సిరిలపై నెగిటివిటి పెరగడం సన్నీకి మరింత లాభం చేకూర్చింది. మచ్చా అంటూ తనదైన మ్యానరిజంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సన్నీ బిగ్‌బాస్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ సందర్భంగా గ్రాండ్ ఫినాలేలో మాట్లాడిన సన్నీ.. సిరి, షణ్నూల రిలేషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'షణ్నూ-సిరిల రిలేషన్ గురించి ఒక క్లారిటీ ఇస్తాను. అది ఈ స్టేజ్ మీదే మాట్లాడాలి. సిరి, అండ్ షణ్ముఖ్ అలాంటి ఫ్రెండిష్ దొరకడం అదృష్టం. నాకు, మానస్‌కు మధ్య ఎలాంటి స్నేహం ఉందో వాళ్లిద్దరి మధ్య కూడా అదే ఉంది' అంటూ చెప్పుకొచ్చాడు. సన్నీ అన్న మాటలకు సిరి ఎమోషనల్ అయ్యింది. -
చేయని తప్పుకు నిందమోశాను, నేనంటే ఎవరికీ ఇష్టం లేదు
Bigg Boss 5 Telug Winner Sunny Exclusive Interview: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ విన్నర్ వీజే సన్నీ విజయానందంలో తేలియాడుతున్నాడు. ఏ క్షణమైతే తన తల్లి ట్రోఫీ తీసుకురావాలని చెప్పిందో అప్పుడే కప్పు తనదేనని ఫిక్సయ్యాడు. చివరికి అమ్మ కలను నిజం చేస్తూ బిగ్‌బాస్ ట్రోఫీ సొంతం చేసుకున్నాడు. షో నుంచి విన్నర్‌గా బయటకు వచ్చిన అనంతరం అతడు అరియానా గ్లోరీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ బజ్ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన సంతోషాన్ని అరియానాతో పంచుకున్న సన్నీ హౌస్‌లో తను బాధపడ్డ క్షణాలను, హౌస్మేట్స్ గురించి వివరంగా చెప్పుకొచ్చాడు. 'నేను చేయని తప్పుకు రెండుమూడుసార్లు నింద పడ్డాను. కానీ ఆ బాధతో వెనక్కి తగ్గకుండా టాస్కుల్లో మరింత గట్టిగా ఫైట్ చేశాను. బేటన్ టాస్కులో చాలా కష్టపడ్డాను కానీ అందరూ నన్ను వరస్ట్ పర్ఫామర్‌గా ఎన్నుకున్నారు. నేను కెప్టెన్సీ కోసం నిలబడ్డప్పుడు అందరూ ఏవేవో సిల్లీ రీజన్స్ చెప్పి కత్తితో కసాకసా పొడిచేశారు. చాలా బాధేసింది. ఎందుకో తెలీదు కానీ హౌస్‌లో నేను వాళ్లకు నచ్చలేదు. శ్రీరామ్ నామినేషన్స్‌లో ఒకలా ఉంటాడు, సాధారణసమయంలో ఇంకోలా ఉంటాడు. ఉమాదేవి.. సూర్యకాంతం.. బయటకు అరుస్తారు కానీ చాలా మంచావిడ. విశ్వ గేమ్ అంటే ప్రాణమిస్తాడు. నటరాజ్ మాస్టర్ హార్డ్ వర్కర్, అతడిని ముద్దుగా సింహం అని పిలుచుకుంటాం. సరయూను అర్థం చేసుకునే సమయంలోనే ఆమె వెళ్లిపోయింది. ప్రియాంక సింగ్ బంగారం, డాక్టర్ ప్రియాంక ఎవరు బాధపడినా తట్టుకోలేదు. పింకీలాంటి అమ్మాయి దొరకాలంటే రాసిపెట్టుండాలి. లహరి చాలా జెన్యూన్, యానీ మాస్టర్ స్వీట్, స్ట్రాంగ్ లేడీ. రవి ఫైటర్. కాజల్ స్మార్ట్, స్ట్రయిట్ ఫార్వర్డ్. ఆమెకు నాగిని, స్ట్రాటజీ క్వీన్ అని చాలా స్టాంపులు వేశారు. శ్రీరామచంద్ర హౌస్‌లో లేకపోతే చాలా బోర్ అయ్యేది. ఆయన టాలీవుడ్లో మంచి బెస్ట్ సింగర్‌గా ఎదుగుతాడు. సిరి షణ్ముఖ్ ఫ్రెండ్షిప్ బాగుండేది. వీళ్లిద్దరూ ఒకరిపై ఒకరు కేర్ తీసుకునేవారు. మానస్ నా డార్లింగ్, ఇద్దరం కుక్కపిల్లల్లా కొట్టుకుంటాం. అతడు నన్ను చాలా నడిపించాడు. అలాంటి ఫ్రెండ్ దొరకాలంటే అదృష్టం ఉండాలి. జెస్సీ చిన్నపిల్లోడు. మొదట్లో అందరూ టార్గెట్ చేశారు. లోబో మంచి వ్యక్తి, ఎంటర్టైనర్. ప్రియకు నాకు మధ్య అభిప్రాయబేధాలు వచ్చాయి. కానీ తర్వాత క్లోజ్ అయ్యాం. హమీదా ఫ్రెండ్లీ నేచర్, టాకెటివ్, టాలెంటెడ్. శ్వేత చాలా డిఫరెంట్. షణ్ను బ్రహ్మ బ్రెయిన్‌తో గేమ్ ఆడాడు. నిజానికి నాతో, మానస్‌తో పాటు కాజల్ లేదా శ్రీరామ్ టాప్ 3లో ఉంటారు అనుకున్నా. కానీ అది జరగలేదు' అని చెప్పుకొచ్చాడు సన్నీ. -
5 సీజన్ల బిగ్‌బాస్ విన్నర్లు, వారి ప్రైజ్‌మనీ, పారితోషికం ఎంతంటే
All Bigg Boss Telugu Seasons Winners: ప్రముఖ బుల్లితెర రియాలిటీ షోకు ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో పేరు తెచ్చుకున్న బిగ్‌బాస్ హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది. తొలుత హాలీవుడ్లో ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఆ తర్వాత బాలీవుడ్‌కు అనంతరం కన్నడ, తమిళం, మలయాళం, మరాఠీ, బెంగాలీ, తెలుగులోకి అడుగుపెట్టింది. అన్ని భాషల్లో ఈ షో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఏ భాషలో అయిన బిగ్‌బాస్ షో వచ్చిందంటే అప్పటి వరకు ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న టీవీ షోలు, సీరియల్స్ వెనుకంజ వేయాల్సిందే. అంతగా టీఆర్పీ రెటింగ్స్‌ను కొల్లగొడుతూ బిగ్‌బాస్ అన్ని భాషల్లో దూసుకుపోతుంది. చదవండి: ‘పుష్ప’ స్పెషల్ సాంగ్‌పై ట్రోల్స్, ఎట్టకేలకు స్పందించిన సమంత ఇదిలా ఉంటే తాజాగా తెలుగు బిగ్‌బాస్ 5వ సీజన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. అయితే మిగతా సీజన్స్ కంటే ఈ సీజన్ కాస్తా టీఆర్పీ వెనకంజలో ఉన్నప్పటికీ అట్టహాసంగా ఈ సీజన్‌కు గ్రాండ్ ఫినాలేతో గుడ్‌బాయ్ చెప్పారు నిర్వాహకులు. ఈ సీజన్లో వీజే సన్నీ టైటిల్‌ను కైవసం చేసుకోగా ప్రముఖ యూట్యూబ్ స్టార్ షణ్ముక్ జశ్వంత్ రన్నర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో మిగతా బిగ్‌బాస్ సీజన్ల విన్నర్స్ వారి పారితోషికం, గెలుచుకున్న ప్రైజ్‌మనీ ఎంతో పలువరు సెర్చక్ష్ చేయడం ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలి సీజన్ నుంచి 5వ సీజన్ వరకు విన్నర్లు, రన్నర్స్ వారి ప్రైజ్‌మనీకి సంబంధించి ఆసక్తికర విశేషాలు మరోసారి మీ కోసం... బిగ్‌బాస్ సీజన్ 1 తెలుగు తొలిసారిగా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తూ బిగ్‌బాస్ తొలి సీజన్ 2017లో ప్రారంభమైంది. మొత్తం 16 మంది కంటెస్టెంట్స్‌తో 70 రోజుల పాటు జరిగిన బిగ్‌బాస్ తొలి సీజన్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాత వ్యవహరించాడు. 2017 జులై 16న ప్రారంభమైన ఈ షో 2017 డిసెంబర్ 24న పూర్తయింది. ఇందులో టాలీవుడ్ యాక్టర్ శివ బాలాజీ విన్నర్‌గా నిలిచి టైటిల్‌ను గెలుచుకొగా రన్నర్ అప్‌గా ఆదర్శ్ బాలకృష్ణ నిలిచాడు. విన్నర్‌గా గెలిచిన శివ బాలాజీ రూ. 50 లక్షలను సొంతం చేసుకోగా, పూర్తి ఎపోసోడ్లకు 8 లక్షల రూపాయల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. ఈ సీజనల్ సెకండ్ రన్నరప్‌గా నటి హరితేజ, మూడో రన్నరప్‌గా నవదీప్, నాలుగో రన్నరప్ ఆచార్య శాస్త్రీలు ఉన్నారు. చదవండి: బేబీ బంప్‌తో స్టార్ హీరోయిన్.. పట్టేసిన నెటిజన్లు, ఫొటోలు వైరల్ బిగ్‌బాస్ సీజన్ 2 తెలుగు నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్‌బాస్ తెలుగు 2వ సీజన్లో మోడల్, నటుడు కౌశల్ మండ విన్నర్‌గా నిలిచాడు. 2018 జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు మొత్తం 112 రోజుల పాటు జరిగిన ఈ సీజన్లో 15 మంది సెలబ్రెటీలు రాగా ముగ్గురు సాధారణ వ్యక్తులు కంటెస్టెంట్‌గా వచ్చారు. 2018 సెప్టెంబర్ 30న జరిగిన ఫైనల్లో కౌశల్ మండ ఫైనల్‌గా నిలిచి రూ. 50 లక్షలు గెలుచుకున్నాడు. ఈ సీజనల్ హౌజ్‌లో ఎన్నో విమర్శలు, వివాదాలను ఎదుర్కొ అతడు హౌజ్ బయటక ఆర్మినే సంపాదించుకున్నాడు. ఈ సీజన్లో సింగర్ గీతా మాధురి రన్నరప్‌గా నిలిచింది. సెకండ్ రన్నరప్ తనిష్ అల్లాడి ఆతర్వాత దీప్తి నల్లమోతు, సమ్రాట్ రెడ్డిలు ఉన్నారు. బిగ్‌బాస్ సీజన్ 3 తెలుగు తొలిసారి నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్‌బాస్ తెలుగు మూడవ సీజన్లో ర్యాప్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ విన్నర్‌గా నిలిచాడు. 2019 జులై 21 ఆరంభమై 2019 నవంబర్ 3 వరకు జరిగిన ఈ సీజనల్ మొత్తం 17 మంది కంటెస్టెంట్స్ 105 రోజులకు వరకు అలరించారు. ఈ సీజన్ ఫైనల్లో రాహుల్ సిప్లిగంజ్ విన్నర్‌గా నిలిచి రూ. 50 లక్షల ప్రైజ్‌మనీ గెలుచుకోగా ప్రముఖు బుల్లితెర యాంకర్ శ్రీముఖి రన్నర్ అప్‌గా నిలిచింది. రెండవ రన్నరప్‌గా బాబా భాస్కర్, ఆ తర్వాత వరుణ్ సందేశ్, అలీ రేజాలు ఉన్నారు. బిగ్‌బాస్ సీజన్ 4 తెలుగు నటుడు అబిజిత్ విన్నర్‌గా నిలిచిన ఈ సీజన్‌కు కూడా నాగార్జుననే వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. 2020 సెప్టెంబర్ 6న స్టార్ట్ అయిన ఈ సీజన్లో మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. 105 రోజుల పాటు సాగిన ఈ సీజన్ 2020 డిసెంబర్ 20న గ్రాండ్ ఫైనాలేను జరుపుకుంది. ఈ సీజన్‌కు అభిజిత్ విన్నర్‌గా నిలవగా అఖిల్ సార్థక్ రన్నరప్‌గా నిలిచాడు. విన్నర్‌గా అభిజిత్ రూ. 25 లక్షల ప్రైజ్‌మనీ గెలుచుకోగా, ఓ బైక్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. ఇక మొత్తం 106 రోజులకు 60 లక్షలు పారితోషికం అందుకున్నాడు. మూడో రన్నరప్ సయ్యద్ సోహైల్ రూ. 20 లక్షలు తీసుకున్నాడు. మూడవ రన్నర్‌గా అరియాన గ్లోరీ, ఆ తర్వాత స్థానంలో అలేఖ్య హారిక ఉంది. బిగ్‌బాస్ సీజన్ 5 తెలుగు నటుడు, యాంకర్ వీజే సన్నీ విజేతగా నిలిచిన ఈ సీజన్‌కు నాగార్జున అక్కినేని హోస్ట్‌గా వ్యవహరించాడు. 2021 సెప్టెంబర్ 5వ తేదీన ప్రారంభమైన ఈ షోలో మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ 106 రోజుల పాటు వినోదం అందించారు. 2021 డిసెంబర్ 19 గ్రాండ్ ఫినాలే జరపుకున్న ఈ సీజన్ విన్నర్‌గా సన్నీ నిలవగా రన్నర్‌గా షణ్ముక్ జశ్వంత్ ఉన్నాడు. ఆ తర్వాత శ్రీరామ్ చంద్ర, మానస్, సిరి హన్మంత్లు ఉన్నారు. ఈ సీజన్ విన్నర్ సన్నీ రూ. 50 లక్షల ప్రైజ్‌మనీతో పాటు ఓ బైక్, రూ. 25 లక్షలు విలువ చేసే ప్లాట్‌ను గెలుచుకున్నాడు. ఇక బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా వారానికి రెండు లక్షల చొప్పున 15 వారాలకు రూ.30 లక్షలు రెమ్యునరేషన్ అందుకున్నాడట సన్నీ. -
బిగ్‌బాస్ సీజన్-5 విజేత వీజే సన్నీ ఫోటోలు
-
బిగ్‌బాస్ షోలో సన్నీ సంపాదన ఎంత?
Bigg Boss 5 Telugu Winner VJ Sunny Remuneration: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ విన్నర్‌గా ఖమ్మం కుర్రాడు వీజే సన్నీ చరిత్ర సృష్టించాడు. ఇతడు హౌస్‌లో వెనక్కు తిరిగి చూసుకుంటే కత్తిపోట్లు, వరస్ట్ పర్ఫామర్ ట్యాగులు, గిల్టీ బోర్డు, సిరితో గొడవలు, నాగార్జునతో చీవాట్లు.. ఇవే ప్రధానంగా కనిపిస్తాయి. కానీ అతడి అభిమానులకు మాత్రం అతడు చేసిన ఎంటర్టైన్మెంట్, అమాయకత్వం, టాస్కులు గెలిచే ధీరుడిగానే ప్రముఖంగా కనిపిస్తాడు. తనకు మైనస్లుగా ఉన్నవాటిని ప్లస్‌లుగా మార్చుకుని గెలుపు తలుపు తట్టాడు సన్నీ. కల్మషం లేని మనసు, ఫ్రెండ్షిప్లో నిజాయితీ అతడిని ఉన్నత స్థానంలో నిలబెట్టాయి. ఆప్నా టైం ఆయేగా అంటూ ఉండే సన్నీకి నిజంగానే తన టైం వచ్చేసింది. విజయతీరాలను ముద్దాడటం కోసం తీవ్రంగా కష్టపడ్డ అతడు చివరకు అనుకున్నది సాధించాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) సన్నీ విన్నర్‌గా ఎలాగో రూ.50 లక్షల ప్రైజ్‌మనీ అందుకున్నాడు. దీనితో పాటు సువర్ణ భూమి ఇన్ఫ్రాస్టక్చర్ నుంచి రూ.25 లక్షల విలువ చేసే 300 చదరపు గజాల భూమిని సొంతం చేసుకున్నాడు. అలాగే టీవీఎస్ అపాచీ స్పోర్ట్స్ బైక్ కూడా గెలుచుకున్నాడు. వీటితో పాటు అతడు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడనేది హాట్ టాపిక్‌గా మారింది. తనకున్న పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని బిగ్‌బాస్ టీం సన్నీకి వారానికి రెండు లక్షల రూపాయలు ఇచ్చారట! అంటే 15 వారాల్లో రూ.30 లక్షలు సంపాదించాడు. -
సర్ప్రైజింగ్: రెండు నెలల్లోనే బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6
Bigg Boss 6 Telugu Season Starts In 2 Months: ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ 5 తెలుగు ఆదివారంతో ముగిసింది. అందరూ ఊహించనట్టుగానే బిగ్‌బాస్ 5 తెలుగు సీజన్ టైటిల్‌ను వీజే సన్నీ కైవసం చేసుకున్నాడు. దీనితో పాటు టీవీఎస్ బైక్, సువర్ణ భూమి ఇన్ఫ్రాస్టక్చర్ నుంచి షాద్‌నగర్‌లో రూ.25 లక్షల విలువ చేసే 300 చదరపు గజాల భూమిని గెలుచుకున్నాడు సన్నీ. ఈ సీజన్లో షణ్ముక్ జశ్వంత్ రన్నర్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే ఈ గ్రాండ్ ఫినాలేలో బిగ్‌బాస్ ప్రేక్షకులకు హోస్ట్ నాగార్జున సర్ప్రైజింగ్ న్యూస్ చెప్పాడు. చదవండి: Bigg Boss 5 Telugu Winner Sunny: విన్నర్ సన్నీతో పాటు రన్నరప్ షణ్ముఖ్‌కు కూడా ప్లాట్ ఎవరూ విన్నర్, ఎవరూ రన్నర్ అనేది ప్రకటించిన అనంతరం వెంటనే ఆ తర్వాత సీజన్ ఎప్పుడో ప్రకటించాడు నాగ్. ఒక సీజన్ ముగియగానే ఆ నెక్ట్స్ సీజన్ రావడానికి 5 నుంచి 6 నెలలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పడుతుంది. దీంతో నెక్ట్స్ సీజన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆడియన్స్‌కు నాగ్ తీపి కబురు అందించాడు. ‘సాధారణంగా ఒక సీజన్ అయిపోగానే కొత్త సీజన్ స్టార్ట్ అవ్వడానికి 5 నెలలు పడుతుంది. కానీ ఈసారి మీకు మరింత వినోదం పంచేందుకు బిగ్‌బాస్ 6 సీజన్‌ను అంతకు ముందే మీ ముందుకు తీసుకురాబోతున్నాము. చదవండి: ఓడియమ్మ.. సిరి అంత సంపాదించిందా? కొత్త సంవత్సరం మొదలైన రెండు నెలలకు బిగ్‌బాస్ కొత్త సీజన్ మొదలు కానుంది’ అని తెలిపాడు. అంటే నాగార్జున చెప్పిన దాని ప్రకారం చూస్తే కొత్త సంవత్సరం వచ్చిన రెండు నెలలకు అంటే మార్చి లేదా ఎప్రీల్ బిగ్‌బాస్ 6 సీజన్ స్టార్ట్ కానుంది అన్నమాట. ప్రతి రోజు రాత్రి 10 గంటల నుంచి 11 గంటలకు, వీకెండ్లో 9 గంటల నుంచి ఇంట్లో సందడి చేస్తూ వినోదాన్ని పంచే ఈ బిగ్‌బాస్ సీజన్ ముగియడంతో నిరాశలో ఉన్న ప్రేక్షకులకు ఇది నిజంగానే గుడ్‌న్యూస్ అని చెప్పుకొవాలి. -
Bigg Boss 5 Telugu Winner: ‘బిగ్‌బాస్’ మనోడే!
సాక్షి, భద్రాచలం అర్బన్: ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్లో ఆదివారం రాత్రి ముగిసిన బిగ్‌బాస్ షో విజేతగా నగరానికి చెందిన అరుణ్ రెడ్డి (సన్నీ) విజేతగా నిలిచారు. జిల్లా వాసి కావడంతో ఫైనల్ షోను అభిమానులు, జిల్లావాసులు అనేకమంది ఆసక్తిగా చూశారు. గెలిచాక పలుచోట్ల అభిమానులు సంబరాలు చేసుకున్నారు. సన్నీ తల్లి కళావతి స్టాఫ్‌నర్సుగా ఖమ్మంలో విధులు నిర్వర్తించారు. ఇద్దరు అన్నయలు ఉజ్వల్, స్పందన్ ఉన్నారు. ఇతను నిర్మల్ హృదయ హైస్కూల్లో పాఠశాల విద్య, ఖమ్మం స్టడీ సర్కిల్లో సీఈసీ గ్రూపుతో ఇంటర్ ఫస్టియర్ చదివారు. విజేతగా నిలిచిన ఖమ్మంకు చెందిన సన్నీ అనంతరం తల్లి వృత్తి రీత్యా కరీంనగర్‌కు బదిలీ అవ్వడంతో సెకండియర్ అక్కడ పూర్తి చేశారు. బాల్యమంతా ఇక్కడే గడవడంతో జిల్లాతో విడదీయలేని అనుబంధం ఉంది. స్నేహితులు, బంధువులు ఉండడంతో జిల్లాలో బిగ్‌బాస్ షోను ఎంతో ఆసక్తిగా వీక్షించారు. చదవండి: (బిగ్‌బాస్ విన్నర్ సన్నీ ఏమేం గెలుచుకున్నాడంటే?) ఓటింగ్ ఫ్లెక్సీలు.. సన్నీకి ఓటింగ్ చేయాలంటూ కోరుతూ నగరంలోని ప్రధాన కూడళ్లలో అతడి స్నేహితులు వారం పది రోజుల కిందటే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచి అధికంగా ఓటింగ్ నమోదైనట్లు తెలిసింది. జిల్లా వాసి కావడంతో ఆయన గెలుపొందాలని పలువురు ఆకాంక్షించి, ఉత్కంఠగా వీక్షించారు. చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఇష్టమని, వినాయక మండపాల వద్ద, ఈవెంట్లలో ఎంతో ఉత్సాహంగా వేసేవాడని మిత్రులు తెలిపారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) హైదరాబాద్ వెళ్లాక కొంతకాలం మీడియా రిపోర్టర్‌గా చేశారు. ఆ తర్వాత సీరియల్ అవకాశాలను అందిపుచ్చుకున్నారు. బిగ్‌బాస్ షోలో సన్నీని చూశాక..అతడిని గుర్తించిన వాళ్లు మనోడే, మన జిల్లా వాసే అని..ప్రత్యేక అభిమానం పెంచుకున్నారు. ఫైనల్ దశకు చేరడం, చివరకు విజేతగా నిలవడంతో ఆయన అభిమానులు, బంధువులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. మిత్రుల సందడి ఆదివారం రాత్రి బిగ్‌బాస్ షో విజేతగా సన్నీని ప్రకటించాక అతడి మిత్రులు పలువురు కేరింతలు కొట్టారు. విన్నర్ సన్నీ..అంటూ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. సినిమాల్లోకి రావాలని అనేవాడని, పట్టుదలతో ఆ రంగంవైపు అడుగులు వేసి సీరియళ్లలో నటిస్తున్నాడని తెలిపారు. త్వరలోనే సన్నీని ఖమ్మంకు తీసుకొచ్చేందుకు సన్నిహితులు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. -
బిగ్‌బాస్ విన్నర్ సన్నీ ఏమేం గెలుచుకున్నాడంటే?
Bigg Boss Telugu 5 Winner: VJ Sunny is the Title Winner of Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ విన్నర్ ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. మోస్ట్ ఎంటర్టైనర్ సన్నీ బిగ్‌బాస్ విజేతగా అవతరించాడు. తనే విన్నర్ అని చెప్పగానే సంతోషంతో నాగార్జునను ఎత్తుకున్నాడు. ఇక తాను పడ్డ వంద రోజుల కష్టమంతా ట్రోఫీ అందుకోగానే మటుమాయమైపోయింది. ఎన్నో ఏళ్లుగా సన్నీ పడుతున్న కష్టానికి నేడు ప్రతిఫలం దక్కిందని అతడి తల్లి భావోద్వేగానికి లోనైంది. ఇక యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ గెలుపుకు ఒక్క అడుగు దూరంలో ఆగిపోయాడు. తనకున్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌తో పెద్ద మొత్తంలో ఓట్లు సాధించినప్పటికీ సన్నీని దాటలేకపోయాడు. దీంతో రన్నరప్ స్థానంతో సరిపెట్టుకున్నాడు. విజేతగా అవతరించిన సన్నీకి కింగ్ నాగార్జున బిగ్‌బాస్ ట్రోఫీని బహుకరించాడు. అంతేకాక రూ.50 లక్షల చెక్‌ను అందజేశాడు. దీనితో పాటు సువర్ణ భూమి ఇన్ఫ్రాస్టక్చర్ నుంచి షాద్‌నగర్‌లో రూ.25 లక్షల విలువ చేసే 300 చదరపు గజాల భూమిని విన్నర్ సన్నీ సొంతం చేసుకున్నట్లు ప్రకటించాడు. టీవీఎస్ బైక్ కూడా గెలుచుకున్నాడని ప్రకటించాడు. గెలిచామా? లేదా అన్నది కాదు, ఎలా ఆడామన్నది ముఖ్యం అని చెప్పుకొచ్చాడు షణ్ముఖ్. ఇప్పుడు కాకపోతే తర్వాతైనా గెలవచ్చాన్నాడు. తర్వాత విన్నర్ స్పీచిచ్చాడు సన్నీ. ఈ సందర్భంగా నన్ను గెలిపించిన ఆడియన్స్‌ను ఎప్పటికీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటానని మాటిచ్చాడు. మనమెంత కొట్టుకున్నా సరే హౌస్మేట్స్ అందరం కలిసే ఉందామన్నాడు సన్నీ. అమ్మ అడిగిన మొట్టమొదటి బహుమతి బిగ్‌బాస్ ట్రోఫీ అంటూ దాన్ని ఆమె చేతుల్లో పెట్టి సంతృప్తి చెందాడు. తర్వాత షణ్ను గురించి మాట్లాడుతూ.. షణ్ను, సిరికి అంతమంచి ఫ్రెండ్షిప్ దొరకడం అదృష్టమని, తనకూ మానస్కూ మధ్య అలాంటి ఫ్రెండ్షిప్పే ఉందన్నాడు. నువ్వు చాలామంది మనసులు గెలుచుకున్నావ్ షణ్నూ అంటూ అతడిపై పొగడ్తలు కురిపించాడు. మరో ఇంట్రస్టింగ్ విషయం ఏంటంటే.. విన్నర్‌కు ప్లాట్ ఇచ్చిన సువర్ణ కుటీర్ డెవలపర్స్ రన్నరప్ షణ్నుకు కూడా ఎంతో కొంత ప్లాట్ ఇస్తామని ముందుకు రావడం విశేషం. ఇక ఐదో సీజన్‌కు గుడ్‌బై చెప్పిన నాగ్.. మరో రెండు నెలల తర్వాత కొత్త సీజన్ మొదలవుతుందని హింటిచ్చాడు. అది బిగ్‌బాస్ ఐదవ సీజనా? లేదా బిగ్‌బాస్ ఓటీటీనా? అన్నది మాత్రం స్పష్టతనివ్వలేదు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సన్నీ విన్నర్, రన్నరప్‌తో సరిపెట్టుకున్న షణ్ముఖ్!
Bigg Boss Telugu 5 Winner And Runner up: బిగ్‌బాస్ షోలో నామినేషన్స్, ఎలిమినేషన్స్నే వదలిపెట్టని లీకువీరులు గ్రాండ్ ఫినాలేను మాత్రం వదులుతారా? ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. నిన్న సిరి, మానస్ ఎలిమినేట్ అయ్యారని వెల్లడించిన లీకువీరులు తాజాగా మిగిలిన ముగ్గురిలో విజేత ఎవరో తేలిపోయిందంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. అందరూ ఊహించినట్లుగా వీజే సన్నీ విజేతగా అవతరించాడని చెప్తున్నారు. ఇక రెండో ర్యాంకు కోసం శ్రీరామ్, షణ్ను మధ్య గట్టి పోటీ కనిపించినప్పటికీ షణ్ను రన్నరప్‌గా నిలవగా శ్రీరామ్ సెకండ్ రన్నరప్ స్థానంతో సరిపెట్టుకున్నాడట! ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ ట్రోఫీని సన్నీ ఎగరేసుకుపోయాడోచ్ అంటూ అతడి అభిమానులు అప్పుడే సంబరాలు మొదలు పెట్టారు. దాదాపు ఇదే నిజమయ్యే అవకాశాలున్నాయి. మరి సన్నీ ట్రోఫీ అందుకున్న క్షణాలను ఆస్వాదించాలంటే కాసేపు ఆగాల్సిందే! -
శ్రీరామ్‌ను విన్నర్‌గా తేల్చిన కంటెస్టెంట్లు!
Bigg Boss 5 Telugu Grand Finale: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో తెరదించనుంది. ప్రేక్షకులు ఎవరిని గెలిపించారనే విషయం పక్కకు పెడితే హౌస్మేట్స్ మనసులు గెలుచుకుంది ఎవరన్న ప్రశ్నకు సమాధానం దొరికింది. గ్రాండ్ ఫినాలేలో నాగార్జున బిగ్‌బాస్ షో నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లతో ముచ్చటించారు. టాప్ 5లో ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఎవరు గెలుస్తారు? అన్న ప్రశ్నకు హౌస్మేట్స్ వారి అభిప్రాయాలను వెల్లడించారు. రవి, సరయు, విశ్వ, యానీ, ప్రియ, హమీదా.. శ్రీరామచంద్ర గెలుస్తాడని, అతడే గెలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. లహరి.. శ్రీరామ్, సన్నీ ఇద్దరూ గెలవాలని ఉందని చెప్పింది. లోబో, జెస్సీ షణ్నుకు సపోర్ట్ ఇవ్వగా శ్వేత, నటరాజ్ మాస్టర్, కాజల్, ఉమాదేవి సన్నీ గెలుస్తాడని పేర్కొన్నారు. ప్రియాంక సింగ్ మాత్రం ఏకంగా ముగ్గురి పేర్లను వెల్లడించింది. మానస్, సన్నీ, శ్రీరామ్‌లలో ఎవరు గెలిచినా ఓకే అని చెప్పింది. వీళ్ల అభిప్రాయం ప్రకారం శ్రీరామ్ విన్నర్ అయితే సన్నీ రన్నర్‌గా నిలుస్తాడన్నమాట. మరి వీరి అంచనా ఎంతమేరకు నిజమవుతుందో చూడాలి! -
బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే: క్యాష్ ఆఫర్ వదిలేసుకున్న ఫైనలిస్టులు
Bigg Boss 5 Telugu Grand Finale Highlights: తెలుగు నాట అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షో బిగ్‌బాస్ ఐదో సీజన్ గ్రాండ్ ఫినాలే ఆదివారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమైంది. సెప్టెంబర్ 5న ప్రారంభమైన ఈ బిగ్ రియాల్టీ షోకు నేడు శుభం కార్డు పలికారు. మొత్తం 19 మంది టైటిల్ కోసం పోటీ పడగా.. ఒక్కోవారం ఒక్కక్కరు ఎలిమినేట్ అవుతూ వచ్చారు. 15 వారాలపాటు ఒకే ఇంట్లో ఉంటూ ఎన్నో ఎమోషన్స్‌ను తట్టుకుంటూ ఐదుగురు ఇంటి సభ్యులు సన్నీ, మానస్, శ్రీరామ్, షణ్ముఖ్, సిరి హన్మంత్ ఫైనల్‌కు చేరుకున్నారు. వీరిలో విన్నర్‌ను ప్రకటించేందుకు గ్రాండ్‌ఫినాలేను అట్టహాసంగా నిర్వహించారు. బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రణ్‌బీర్- అలియా హాజరయ్యారు. అలాగే శ్యామ్ సింగరాయ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నేచురల్ స్టార్ నాని, కృతి శెట్టి, సాయి పల్లవి వచ్చారు. పుష్ప సినిమా ప్రమోషన్స్ నేపథ్యంలో సుకుమార్, దేవీశ్రీ ప్రసాద్, రష్మిక మందన్న బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేశారు. శ్రియ, డింపుల్ హయతి తమ డ్యాన్స్‌లతో అదరగొట్టారు. మరి వీళ్లు చేసిన హంగామా ఏంటో? ఫైనలిస్టులు ఏయే స్థానాలతో సరిపెట్టుకున్నారో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి.. కింగ్ నాగార్జున గ్రాండ్ ఎంట్రీ బిగ్‌బాస్ ఐదో సీజన్ గ్రాండ్ ఫినాలేలో టాలీవుడ్ మన్మథుడు నాగార్జున బ్లాక్ డ్రెస్‌లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. మిర్చీ మూవీలోని బార్బీ గాల్, అఖిల్ చిత్రంలోని అక్కినేని, బంగర్రాజు పాటలకు అదిరిపోయే స్టెప్పులేస్తూ అలరించాడు నాగార్జున. తర్వాత ఐదో సీజన్ 14 మంది ఎక్స్ కంటెస్ట్‌లను ఆహ్వానించారు. వారు తమదైన స్టైల్‌తో డ్యాన్స్ చేసి అలరిస్తారని చెప్పాడు. అలరించిన జెస్సీ.. ఆకట్టుకున్న కాజల్ నాగార్జున చెప్పిచెప్పడంతోనే సీరియల్ నటి ఉమాదేవి.. దిగు దిగు నాగ అనే పాటకు నాట్యం చేసి ఆకట్టుకుంది. ఆ వెంటనే బృందావనం సినిమాలోని చిన్నదో వైపు పెద్దదోవైపు పాటకు జెస్సీ, ప్రియాంక, లహరి మాస్ స్టెప్పులేసి ఆడియెన్స్‌ను అలరించారు. అనంతరం ఆర్జే కాజల్ బాలకృష్ణ అఖండ చిత్రంలోని 'బాలయ్య' పాటతో ఎంట్రీ ఇచ్చింది. 'నాటు నాటు' అంటూ నటరాజ్, యానీ మాస్టర్స్ అదరగొట్టారుగా.. ఏ బిడ్డా ఇది నా అడ్డా అంటూ విశ్వ వచ్చి తనదైన డ్యాన్స్‌తో అదరగొట్టాడు. అదే పాటకు కంటున్యూగా 'పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైరు' అంటూ హమిదా హాట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో డ్యాన్స్ చేసింది. వీరి తర్వాత కొరియోగ్రాఫర్స్ నటరాజ్ మాస్టర్, యానీ మాస్టర్ ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్‌కు కలిసి స్టెప్పులేసి అబ్బురపరిచారు. ఈ ఇద్దరి పర్ఫామెన్స్ విజిల్స్ కొట్టకుండా ఉండలేమన్నట్లుగా ఉంది. నటరాజ్ మాస్టర్‌కు సినిమా హీరోగా అవకాశం.. రవి, సరయు, విశ్వ, యానీ, ప్రియ, హమీదా.. శ్రీరామచంద్ర గెలుస్తాడని, అతడే గెలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. లహరి.. శ్రీరామ్, సన్నీ ఇద్దరూ గెలవాలని ఉందని చెప్పింది. లోబో, జెస్సీ షణ్నుకు సపోర్ట్ ఇవ్వగా శ్వేత, నటరాజ్ మాస్టర్, కాజల్, ఉమాదేవి సన్నీ గెలుస్తాడని పేర్కొన్నారు. ప్రియాంక సింగ్ మాత్రం ఏకంగా 'సన్నీ, మానస్, శ్రీరామ్ ముగ్గురూ గెలవాలనుందని చెప్పుకొచ్చింది. జెస్సీ, నటరాజ్ మాస్టర్ తమకు హీరోగా సినిమా అవకాశాలు వస్తున్నాయని చెప్పగా ప్రియాంక సింగ్ సైతం తనకు మంచి ఆఫర్లు వస్తున్నాయంది. నాగార్జున కన్నా పెద్ద కింగ్ ఎవరూ లేరు: రణ్‌బీర్ ఇక టాప్ 5 కంటెస్టెంట్లు సైతం డ్యాన్సులతో అదరగొట్టారు. అనంతరం రాజమౌళితో పాటు బ్రహ్మాస్త్రం డైరెక్టర్ అయాన్, హీరోహీరోయిన్లు రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ స్టేజీపై సందడి చేశారు. ఈ సందర్భంగా బ్రహ్మాస్త్రం మోషన్ పోస్టర్ ప్లే చేశారు. నీ కన్నా పెద్ద కింగ్ ఎవరూ లేరంటూ నాగార్జునపై పొగడ్తల వర్షం కురిపించాడు రణ్‌బీర్. మానస్‌కు బ్రహ్మాస్త్రం ఇచ్చిన రాజమౌళి బిగ్‌బాస్ హౌజ్‌లో టాప్ 5 కంటెస్టెంట్స్‌తో బ్రహ్మాస్త్రం గేమ్ ఆడించాడు నాగార్జున. ఈ గేమ్‌ను సన్నీతో మొదలు పెట్టారు. తనలో ఉన్న పవర్ ఏంటో తమకు చెప్పాలని రాజమౌళి సన్నీకి చెప్తాడు. తాను పడ్డ కష్టాలనుంచి ఇప్పుడున్న పొజిషన్ తనకున్న అతి పెద్ది పవర్ అని చెప్పుకొచ్చాడు సన్నీ. తర్వాత గేమ్ మానస్ వైపుకు వెళ్లింది. తనలోని పవర్ ఏంటో చెప్పమని నాగార్జున అడగ్గా.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా కామ్‌గా ఉండి, విశ్లేషించి సరైనా నిర్ణయం తీసుకోవడమే తన అల్టిమేట్ పవర్ అని మానస్ సమాధానమిచ్చాడు. ఇండిపెండెంట్, సెల్ఫ్‌లెస్‌గా ఉండటం తన పవర్ అన్న శ్రీరామ్ పాట పాడి అందరినీ అలరించాడు. టాప్ 5 కంటెస్టెంట్స్ తమ పవర్స్ చెప్పిన తర్వాత వారందరిలో తనకు నచ్చిన సమాధానం సాయి మానస్‌ది అని దర్శక ధీరుడు రాజమౌళి తెలిపాడు. తర్వాత బ్రహ్మాస్త్రంను మానస్‌కు ఇచ్చాడు రాజమౌళి. తర్వాత పరంపర టీమ్ సైతం స్టేజీపైకి వచ్చి సందడి చేసింది. బిగ్‌బాస్ నుంచి సిరి ఎలిమినేట్.. బిగ్‌బాస్ స్టేజిపై పుష్ప టీం వచ్చి సందడి చేసింది. టాప్ 5 కంటెస్టెంట్స్‌లో ఒకరిని ఎలిమినేట్ చేయడానికి హీరోయిన్ రష్మిక మందన్నా, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్‌ను బిగ్‌బాస్ హౌజ్‌లోకి పంపాడు నాగార్జున. రష్మిక మందన్నా, దేవి శ్రీప్రసాద్ హౌస్‌లోకి వెళ్లి హౌస్‌మేట్స్‌తో స్టెప్పులేశారు. తర్వాత ఫైనలిస్టుల ఫొటోలున్న డ్రోన్లను గాల్లోకి వదిలారు. ఇందులో సిరి ఫొటో ఉన్న డ్రోన్ ఇంటి నుంచి బయటకు వెళ్లడంతో ఆమె ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. దీంతో సిరిని తీసుకుని హౌస్ నుంచి బయటకు వచ్చేశారు రష్మిక, దేవి శ్రీ ప్రసాద్. సిరి ఎలిమినేషన్ తర్వాత రాహుల్ సిప్లిగంజ్‌తోపాటు ప్రముఖ సింగర్స్ వచ్చి పాటలు పాడి అలరించారు. అలాగే పలువురి డ్యాన్స్‌లు ఆకట్టుకున్నాయి. బిగ్‌బాస్ నుంచి సాయి మానస్ ఔట్.. మిగిలింది ముగ్గురే సిరి ఎలిమినేషన్ తర్వాత రాహుల్ సిప్లిగంజ్‌తోపాటు ప్రముఖ సింగర్స్ వచ్చి పాటలు పాడి అలరించారు. అలాగే పలువురి డ్యాన్స్‌లు ఆకట్టుకున్నాయి. అనంతరం శ్యామ్ సింగరాయ్ సినిమాలోని నటీనటులు వచ్చి బిగ్‌బాస్ స్టేజిపై తమ చిత్ర విశేషాలు పంచుకున్నారు. అనంతరం సాయి పల్లవి, కృతిశెట్టి బిగ్‌బాస్ హౌజ్లోనిక వెళ్లి హౌజ్‌మేట్స్‌తో ముచ్చిటించారు. తర్వాత నాని ఒక పెట్టే తీసుకుని బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఎంటర్ అవుతాడు. నాని హౌజ్‌మేట్స్‌కు క్యాష్ ఆఫర్ చేసిన ఎవరూ తీసుకోరు. తర్వాత మేనిక్విన్ (బొమ్మల) గేమ్‌తో మానస్ ఎలిమినేట్ అయ్యాడని ప్రకటిస్తాడు నాగార్జున. శ్యామ్ సింగరాయ్ టీం మానస్‌తో పాటు హౌజ్ నుంచి బయటకు వస్తారు. తర్వాత శ్రియ వచ్చి అలేగ్రా, డ్యాంగ్ డ్యాంగ్, స్వింగ్ జర పాటలకు అదిరిపోయే స్టెప్పులేసి అదరగొట్టింది. అనూహ్యంగా శ్రీరామ్ చంద్ర ఎలిమినేట్.. మరి విన్నర్ ? శ్రియ బ్యూటిఫుల్ పర్ఫామెన్స్ తర్వాత అక్కినేని నాగ చైతన్య బిగ్‌బాస్ స్టేజిపై అడుగు పెడతాడు. అనంతరం నాగార్జునకు సంబంధించిన ఏవీని ప్లే చేస్తారు. దీంతో హౌజ్‌మేట్స్, ఎక్స్ కంటెస్టెంట్స్, నాగార్జున్ ఎమోషనల్ అవుతారు. దీని తర్వాత మిగిలిన హౌజ్‌మేట్స్‌ను టెంప్ట్ చేసేందుకు గోల్డ్ బాక్స్‌తో నాగా చైతన్య బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇస్తాడు. ఇంతకుముందు నాని తీసుకు వచ్చిన సిల్వర్ సూట్‌కేసు కన్నా మూడు రెట్లు ఎక్కువ డబ్బు ఉంటుందని నాగ చైతన్య హౌజ్‌మేట్స్‌ను ఊరించాడు. అది కూడా ఎవరూ తీసుకోకపోవడంతో చివిరిగా ఎలిమినేషన్ క్యార్యక్రమానికి వస్తాడు నాగార్జున్. ఈసారి అనూహ్యంగా సింగర్ శ్రీరామ్ చంద్ర ఎలిమినేట్ అవుతాడు. శ్రీరామ్ చంద్రను నాగ చైతన్య హౌజ్ నుంచి బయటకు తీసుకు వస్తాడు. స్టేజ్‌పై ఉన్న అమ్మలందరి కోసం పాట పాడి అలరించాడు శ్రీరామ్ చంద్ర. శ్రీరామ్ చంద్ర ఎలిమినేషన్ తర్వాత బిగ్‌బాస్ స్టేజ్ పైకి ఫరియా అబ్దుల్లా వచ్చి సందడి చేసింది. అనంతరం తనను హౌజ్‌లోకి పంపిస్తాడు నాగార్జున. మిగిలిన హౌజ్‌మేట్స్ సన్నీ, షణ్ముఖ్‌ను తన మాటలతో రిలాక్స్ చేస్తుంది చిట్టి. తర్వాత ముగ్గురు కలిసి బంగార్రాజు పాటకు డ్యాన్స్ చేస్తారు. తర్వాత ఒక బాక్స్‌లో ఇద్దరిని చేతులు పెట్టమని చెప్తాడు నాగార్జున. అందులో విన్నర్‌కు గ్రీన్, రన్నరప్‌కు రెడ్ కలర్ వస్తుందని చెప్తాడు. తీరా చూస్తే ఇద్దరికీ బ్లూ కలర్ రావడంతో బిగ్‌బాస్ ట్విస్ట్పెట్టాడని అర్థమవుతుంది. అనంతరం నాగార్జున స్వతాహాగా హౌస్‌లోకి వెళ్లి వాళ్లిద్దరినీ స్టేజీపైకి తీసుకువచ్చాడు. తీవ్ర ఉత్కంఠ మధ్య సన్నీని బిగ్‌బాస్ సీజన్ 5 విన్నర్‌గా, షణ్ముఖ్‌ను రన్నరప్‌గా ప్రకటించాడు. -
ప్రపోజ్ చేసిన హీరోయిన్, గాల్లో తేలిపోయిన సన్నీ
Bigg Boss Telugu 5, BB Telugu Grand Finale Promo: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ గ్రాండ్ ఫినాలేను కనీవినీ ఎరుగని రీతిలో ప్లాన్ చేశారు. టాలీవుడ్ సెలబ్రిటీల నుంచి బాలీవుడ్ స్టార్స్ వరకు అందరినీ బిగ్‌బాస్ స్టేజీపైకి తీసుకొచ్చారు. రణ్‌బీర్ కపూర్- ఆలియా భట్, రష్మిక మందన్నా, దేవిశ్రీ ప్రసాద్, సుకుమార్, నాని, సాయిపల్లవి, కృతీశెట్టి, జగపతిబాబు.. వీళ్లేకాక మరెంతోమంది సింగర్లు, నటీనటులు, సెలబ్రిటీలు షోలో సందడి చేశారు. తారల తళుకుబెళుకులతో బిగ్‌బాస్ స్టేజీ మరింత కలర్ఫుల్గా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఫైనలిస్ట్ సన్నీకి ఎంతో ఇష్టమైన హీరోయిన్ ఆలియాభట్. తన ఫేవరెట్ హీరోయిన్ అయిన ఆమె కళ్లముందు స్టేజీపై కనిపించగానే సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు సన్నీ. అతడికి ఆనందాన్ని రెట్టింపు చేస్తూ ఆలియా ఏకంగా సన్నీకి ఐ లవ్యూ చెప్పింది. ఇది కలా? నిజమా? అనుకుంటూ గాల్లో తేలిపోయిన సన్నీ పరవశంతో సరదాగా కిందపడిపోయాడు. మొత్తానికి తనకు ఎంతో ఇష్టమైన బాలీవుడ్ హీరోయిన్‌తో ఐ లవ్యూ చెప్పించుకున్న సన్నీ ఈ క్షణాలను జీవితాంతం గుర్తుంచుకోవడం ఖాయం. అటు సరయూ నాగార్జునను డేట్‌కు వెళ్దామని అడిగింది. దీనికి సరేనంటూ తలూపిన నాగ్.. గ్రాండ్ ఫినాలే అయిపోగానే డేట్‌కి వెళ్దామని పచ్చజెండా ఊపాడు. ఇక స్టార్ సెలబ్రిటీలు చేసిన హంగామా చూడాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే! -
ఆడేసుకున్న మాజీ కంటెస్టెంట్లు, అంతా బిగ్‌బాస్ వరకే అన్న షణ్ను!
Bigg Boss Telugu 5, Episode 105: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ ఫైనలిస్టులతో మాజీ సీజన్ల కంటెస్టెంట్లు రచ్చరచ్చ చేశారు. మొదటగా ఫస్ట్ సీజన్ కంటెస్టెంట్లు శివబాలాజీ, హరితేజ హౌస్‌మేట్స్‌తో ముచ్చటించారు. శ్రీరామ్‌తో ఎవరు ఫ్రెండ్షిప్ చేసినా వారు వెళ్లిపోతారని సెటైర్ వేయడంతో అతడు తల పట్టుకున్నాడు. తర్వాత ఒక పీపా పట్టుకుని ఊదితే ఆ పాటేంటో హౌస్మేట్స్ గెస్ చేయాలి. పాట సరిగ్గా గెస్ చేస్తే దానికి డ్యాన్స్ చేయాలి. ఈ క్రమంలో షణ్ను, సిరి కలిసి జంటగా స్టెప్పులేస్తుంటే మిగతా ముగ్గురు మాత్రం ఎవరికి వారే డ్యాన్స్ చేశారు. ఇది చూసిన హరితేజ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అయిన ముగ్గురిపై జాలి చూపించింది. దీంతో రెచ్చిపోయిన శ్రీరామ్ సిరిని ఎలిమినేట్ చేసినట్లే చేసి మళ్లీ తీసుకొచ్చారంటూ జోక్ చేశాడు. ఇక హరితేజ బిగ్‌బాస్ షో గురించి, టాప్ 5 కంటెస్టెంట్ల గురించి హరికథ చెప్పి వీడ్కోలు తీసుకున్నారు. తర్వాత రెండో సీజన్ కంటెస్టెంట్లు గీతా మాధురి, రోల్ రైడా ఆటపాటలతో హౌస్‌మేట్స్‌ను అలరించారు. టాప్ 5లో చోటు దక్కించుకున్న సిరి తెలుగు రాష్ట్రాల్లోని మహిళలకు ఆదర్శం అంటూ తెగ పొగిడాడు. అయితే వచ్చిన కంటెస్టెంట్లు అందరూ పొగడ్తలతో పాటు షణ్ను, సిరిల ఫ్రెండ్షిప్పై సెటైర్లు వేస్తూ వారిని ఓ ఆటాడుకుండటంతో సన్నీ, మానస్, శ్రీరామ్ పడీపడీ నవ్వారు. అసలే చిన్న మాట అంటేనే తట్టుకోలేని షణ్ను ఇలా అందరూ కలిసి తన మీద పడిపోవడంతో అట్టుడికిపోయాడు. మనిద్దరం హైలైట్ అయిపోతున్నామని ముగ్గురికీ మండిపోతున్నట్లుందని సిరితో వాపోయాడు. అయితే సిరి మాత్రం ఏ షిప్ అయినా బిగ్‌బాస్ హౌస్ వరకే అని షణ్ను అన్న మాటను గుర్తు చేసుకుని బాధపడింది. దీంతో అతడు సిరిని ఓదార్చుతూ హగ్ చేసుకున్నాడు. ఇది చూసిన సన్నీ.. బయటకు వెళ్లాక షణ్ను హగ్ గురూ అయిపోతాడని కామెంట్ చేశాడు. అనంతరం నాలుగో సీజన్ కంటెస్టెంట్లు శివజ్యోతి, సావిత్రి హౌస్‌మేట్స్‌తో కబుర్లాడారు. బెలూన్లలోని హీలియం పీల్చుకుని పాట లేదా డైలాగులు చెప్పాలన్నారు. ఈ గేమ్‌లో హౌస్మేట్స్ గొంతులు మారిపోవడంతో అందరూ పడీపడీ నవ్వారు. ఐదో సీజన్ కంటెస్టెంట్లు అఖిల్ సార్థక్, అరియానా వచ్చీరాగానే శ్రీరామ్ చేసిన మొట్ట మొదటి ఆల్బమ్‌లోని సాంగ్ ప్లే చేయడంతో అతడు సర్ప్రైజ్ అయ్యాడు. ఆ వెంటనే కంటెస్టెంట్లందరినీ కొన్ని సరదా ప్రశ్నలడిగారు. అందులో భాగంగా డేటింగ్ యాప్‌లో ఎవరినైనా కలిశారా? అని అడగ్గా సన్నీ ఒకరిని కలిశాను కానీ ఆ అమ్మాయి బాయ్‌ఫ్రెండ్ గురించి చెప్పుకుంటూ పోయిందని, దీంతో తానే ఆమెను ఓదార్చాల్సి వచ్చిందన్నాడు. వేరే కంటెస్టెంట్ టవల్ వాడారా? అన్న ప్రశ్నకు షణ్ను.. శ్రీరామ్ టవల్ వాడానని చెప్పగా మధ్యలో సిరి కలగజేసుకుంటూ తన టవల్ కూడా వాడాడని ఆరోపించింది. కొన్ని ఫొటోలు చూపించి అవి హౌస్‌లో ఎక్కడ ఉన్నాయో చెప్పాలన్న గేమ్‌లో శ్రీరామ్ గెలిచాడు. సిరి తాను తీసుకోవాలనుకుని మర్చిపోయిన ఫొటోను అఖిల్, అరియానా చూపించడంతో ఆమె చాలా సర్ప్రైజ్ అయింది. అంతేకాదు షణ్ను, సిరి ఆ ఫొటోలో ఏ పాటకైతే డ్యాన్స్ చేశారో మరోసారి అదే సాంగ్‌కు స్టెప్పులేశారు. మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ సరదా సరదాగా సాగింది. -
Bigg Boss5 Telugu: బిగ్‌బాస్-5 విజేతగా సన్నీ?.. నెట్టింట లీకైన ఓటింగ్!
Bigg Boss Telugu 5 Grand Finale: Winner Prediction: బిగ్‌బాస్ సీజన్-5 ముగింపు దశకు చేరుకుంది. ఆదివారం నాడు జరగనున్న గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌తో ఈ సీజన్‌కు తెరపడనుంది. దీంతో టైటిల్ విన్నర్ ఎవరన్న దానిపై సర్వంత ఉత్కంఠ నెలకొంది. టాప్-5 కంటెస్టెంట్లలో టైటిల్ కోసం గట్టి పోటీ ఉన్నా ప్రధాన పోటీ మాత్రం సన్నీ- షణ్ముక్‌ల మధ్యే ఉండనున్నట్లు తెలుస్తుంది. యూట్యూబ్ స్టార్‌గా ఎంట్రీ ఇచ్చిన షణ్నూ ఓటింగ్‌లో మాత్రం సన్నీ కంటే వెనుక ఉన్నట్లు అన్ అఫీషియల్ పోల్స్ ద్వారా తెలుస్తుంది. ఇప్పటివరకు ఓటింగ్ పర్సంటేజీలను చూస్తే సన్నీనే టాప్‌లో ఉన్నాడని తెలుస్తోంది. 34% ఓట్లతో సన్నీ విజేతగా నిలిచాడని సోషల్‌మీడియాలో టాక్ వినిపిస్తుంది. టైటిల్ రేసులో ఉన్న షణ్నూ 31%ఓట్లతో రెండో స్థానంలో, 20% ఓట్లతో శ్రీరామ్ మూడవ స్థానంలో, 8% ఓట్లతో మానస్ నాలుగో స్థానంలో నిలవగా , అత్యల్పంగా సిరికి7%ఓట్లు వచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు లీకు వీరులు చెప్పినట్లుగానే ఎపిసోడ్ సహా ఎలిమినేషన్ ప్రక్రియ జరిగింది. దీంతో ఇప్పుడు మరోసారి లీకువీరులు అందించిన ఈ సమాచారం నిజమనే వాదనలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియాలంటే ఫినాలే ప్రసారం అయ్యేవరకు ఎదురు చూడాల్సిందే. -
త్వరలో సిరి పెళ్లి, హనీమూన్‌కు ఫారిన్ ట్రిప్! కానీ
Bigg Boss Telugu 5, Episode 104: సన్నీతో జరిగిన గొడవతో సిరి బాగా హర్ట్ అయినట్లు ఉంది. రాత్రిపూట కూడా నిద్రపోకుండా ఏడుస్తూ ఉండిపోయింది. ఒక్క గేమ్ ఓడిపోతే ఓడిపోయినట్లేనా అంటూ అర్ధరాత్రి 1 గంటలకు బాత్రూమ్లో గుక్కపెట్టి ఏడ్చింది. తనను కొట్టడానికి సన్నీ మీదమీదకొచ్చాడంటూ వాపోయింది. దీంతో ఆమెను హత్తుకుని ఓదార్చిన షణ్ను ఎవడికీ కొట్టేంత సీన్ లేదని తేల్చి చెప్పాడు. నేనేదైనా అంటే ఫీల్ అవ్వు కానీ ఇంకెవడన్నా ఏడవద్దు, మూసుకుని కూర్చో అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. బిగ్‌బాస్ ప్రయాణంలో తుది మజిలీకి చేరుకున్న మీలో ఎన్నో ప్రశ్నలు మిమ్మల్ని కుదిపేసి ఉంటాయని, మీ జాతకాలేంటో తెలుసుకోండంటూ జ్యోతిష్యురాలు శాంతిని పంపాడు బిగ్‌బాస్. ఆమె మొదటగా షణ్ను గురించి చెప్తూ.. జీవితంలో మంచి మార్పు ఉండబోతుంది. మీ ప్రేమ జీవితం బాగుండబోతోంది. కొంగొత్త అవకాశాలతో కావాల్సినంత సంపాదించబోతారు అని చెప్పింది. సన్నీ దగ్గరకు వచ్చేసరికి.. కొత్త వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నాడు. బయటకు వచ్చాక కొత్త ప్రయాణం మొదలుపెడతారు. కార్డ్‌లో స్వప్న సుందరి వచ్చింది అంటూ త్వరలో అతడు ప్రేమలో పడతాడని హింట్ ఇచ్చింది. ఇక సిరి గురించి చెప్తూ.. త్వరలో పెళ్లిబాజాలు మోగనున్నాయని శుభం పలికింది. శ్రీరామచంద్రకు గెలుపు కార్డు వచ్చిందన్న ఆమె అతడు లోలోపల చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాడంది. బిగ్‌బాస్ షో తర్వాత అతడికి ఎన్నో అవకాశాలు రాబోతున్నాయని పేర్కొంది. మానస్‌కు బిగ్‌బాస్ జర్నీ తర్వాత అన్నీ సాధించానన్న తృప్తి మిగులుతుందని తెలిపింది. ఇక అందరి లవ్ లైఫ్ గురించి చెప్తూ వచ్చిన జ్యోతిష్యురాలు షణ్ముఖ్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఆగిపోయింది. బిగ్‌బాస్ షోలోని లవ్ లైఫ్ గురించి చెప్పాలా? బయట లవ్ లైఫ్ గురించి చెప్పాలా? అనడంతో సిరి, షణ్నులకు నోట మాట రాలేదు. వెంటనే షాక్ నుంచి తేరుకున్న షణ్ను బయట మాది ఐదేళ్ల రిలేషన్షిప్, తర్వాత ఎలా ఉండబోతున్నాం అని అడిగాడు. మీలో ఉన్న చిన్నచిన్న భయాలను తీసేస్తే సంతోషంగా ఉంటారని సమాధానమిచ్చిందావిడ. బిగ్‌బాస్ తర్వాత సిరి పెళ్లి చేసుకోవడంతో పాటు ఫారిన్‌కు హనీమూన్‌కు కూడా వెళ్తుందని చెప్పుకొచ్చింది. తర్వాత సిరి, షణ్ను మరోసారి గొడవపడ్డారు. ఇద్దరి కోసం కాకుండా అందరికీ ఎందుకు వంట చేస్తావని మండిపడ్డాడు షణ్ను. నువ్వు పొద్దున చేసిన దోసెలు వాళ్లు తినలేదని, అలాంటప్పుడు మళ్లీ ఎందుకు వండతావని ఫైర్ అయ్యాడు. దీంతో రెచ్చిపోయిన సిరి.. నేను కష్టపడి వండితే ఎందుకు తినలేదని మానస్‌ను నిలదీసింది. మానస్ మాత్రం తాను తిన్నానని చెప్పాడు. సన్నీకి రైస్ తినాలనిపిస్తే పులిహోర చేసుకుని తిన్నాడని బదులిచ్చాడు. అయినప్పటికీ వినిపించుకోని సిరి, షణ్ను మా వంట మేము చేసుకుంటామని తేల్చేశారు. ఇంతలో బిగ్‌బాస్ ఇంటిసభ్యులందరినీ సూట్‌కేసులు ప్యాక్ చేసుకోమని చెప్పాడు. ఈ మాట విని అవాక్కైన హౌస్మేట్స్ అయిష్టంగానే బ్యాగులు సర్దుకున్నారు. మీలో ఒకరి ప్రయాణం ఈ క్షణమే ముగుస్తుందంటూ షాక్ ఇచ్చిన బిగ్‌బాస్ ఎవరు ఎలిమినేట్ అవ్వాలనేదానిపై మీ అభిప్రాయం చెప్పాలని కంటెస్టెంట్లను ఆదేశించాడు. మానస్, సన్నీ.. షణ్ముఖ్; శ్రీరామ్.. సిరి; షణ్ముఖ్.. సన్నీ; సిరి.. మానస్ ఎలిమినేట్ అవడానికి అర్హులని సూచించారు. బిగ్‌బాస్ మాత్రం అనూహ్యంగా సిరి ఇంటి నుంచి వెళ్తుందని ప్రకటించడంతో ఆమె, షణ్ను ఏడ్చేశారు. కానీ సన్నీ మాత్రం నువ్వెళ్లెట్లేదని బల్లగుద్ది చెప్పాడు. చివరికి అతడి మాటే నిజమైందనుకోండి. సిరిని కన్ఫెషన్ రూమ్‌లో కూర్చోబెట్టి షణ్ను ఏడుస్తున్న వీడియో చూపించాడు బిగ్‌బాస్. షణ్ను కంటతడి పెట్టుకోవడాన్ని చూసి సిరి హృదయం ముక్కలైంది. వాడు అక్కడ ఏడుస్తున్నందుకు బాధపడాలో, నన్ను మళ్లీ హౌస్‌లోకి పంపిస్తున్నందుకు సంతోషపడాలో తెలీట్లేదంటూ గోడు వెల్లబోసుకుంది. గేటు నుంచి బయటకు వెళ్లగొట్టిన కాసేపటికే తిరిగి ఆమెను హౌస్‌లోకి పంపించారు. దీంతో సిరి ఆనందంతో వెళ్లి షణ్నును హత్తుకుని ముద్దులు పెట్టింది. -
ఓటింగ్‌లో ట్విస్ట్.. షణ్ను దూకుడు, సన్నీ వెనకంజ!
Bigg Boss Telugu 5, Finale Week Voting: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ ఆఖరి ఘట్టానికి చేరుకుంది. ఎవరు టైటిల్ ఎగరేసుకుపోతారని బుల్లితెర ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. షణ్ముఖ్, మానస్, సన్నీ, సిరి, శ్రీరామ్ గ్రాండ్ ఫినాలేకు చేరుకోగా వీరిలో ఎవరు విజేతగా అవతరిస్తారు? ఎవరు రన్నరప్‌గా నిలుస్తారన్నది అత్యంత ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో ట్రెండింగ్స్ చూస్తుంటే షణ్ను, సన్నీ, శ్రీరామ్‌ల మధ్యే రసవత్తర పోటీ సాగుతున్నట్లు కనిపిస్తోంది. ఇక అనఫీషియల్ ఓటింగ్‌లో మొదటి రోజు శ్రీరామ్ భారీ ఓట్లతో మొదటి స్థానంలో దూసుకువెళ్లాడు. అదే దూకుడు అధికారిక ఓటింగ్‌లోనూ కొనసాగితే శ్రీరామ్ గెలిచే అవకాశాలున్నాయి. పైగా ప్రభాస్ పెద్దమ్మ, సోనూసూద్, ఉత్తరాది నుంచి పలువురి స్టార్స్ మద్దతు అతడికి పుష్కలంగా ఉంది. ఇక ఐస్ టాస్క్‌లో గాయపడి మంచానికే పరిమితం కావడంతో సింపతీ ఓట్లు కూడా భారీగానే పడుతున్నాయి. కానీ రెండోరోజుకు వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న శ్రీరామ్ మూడో స్థానంలోకి పడిపోయాడు. యూట్యూబ్ సంచలనం షణ్ముఖ్ రెండో స్థానంలోకి దూసుకురాగా సన్నీ ప్రథమ స్థానంలోకి వచ్చి చేరాడు. అప్పటినుంచి ఈరోజు వరకు అనధికారిక ఓటింగ్‌లో సన్నీ, షణ్నులే తొలి స్థానం కోసం పోటీపడ్డట్లు కనిపించింది. దీంతో వీళ్లిద్దరిలోనే విన్నర్, రన్నర్ ఉండే అవకాశాలున్నాయంటున్నారు. కానీ అనఫీషియల్ ఓటింగ్‌లో ఫ్యామిలీ ఆడియన్స్ పాల్గొనరు కాబట్టి దీన్ని పూర్తిగా విశ్వసించేందుకు ఆస్కారం లేదు. ఇకపోతే సిరి ఎలిమినేట్ అయినట్లు బిగ్‌బాస్ తాజాగా ఓ ప్రోమో రిలీజ్ చేశాడు. ఇది సన్నీ ఓట్లను దెబ్బకొట్టడానికే అని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే సిరి నిజంగానే ఎలిమినేట్ అవుతుందనుకునే చాలామంది ఆమెకు బదులుగా షణ్నుకు ఓట్లేస్తారు. పైగా తన ఒక్కగానొక్క తోడు వెళ్లిపోతుండటంతో షణ్ను కన్నీరుమున్నీరుగా విలపించడం, వీరి ఫ్రెండ్షిప్ను హైలైట్ చేయడం కూడా అతడికి ప్లస్ పాయింట్‌గా మారనున్నట్లు కనిపిస్తోంది. నిజానికి సిరిది ఫేక్ ఎలిమినేషన్. ఆ విషయం సోషల్ మీడియా వాడని చాలామంది ప్రేక్షకులకు రాత్రి ఎపిసోడ్ అయిపోయే 11 గంటల వరకు తెలియదు. సాధారణంగా ఎవరైనా ఎలిమినేట్ అవుతున్నారంటే వారిపై ప్రేక్షకులను సానుభూతి ఏర్పడుతుంది. ఇప్పుడు సిరి వెళ్లిపోతుందంటే కూడా ఆ సానుభూతితో ఆమె ఫ్రెండ్ అయిన షణ్నుకు ఓట్లు గుద్దుతారు. కొన్ని అనఫీషియల్ పోలింగ్స్‌లో షణ్ను దూకుడు కనబరుస్తున్నట్లు నెట్టింట కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఫినాలే ఓటింగ్‌లో ఒక్క ఓటు కూడా విలువైనదే. ఎలాగో సన్నీ గెలుస్తాడని ఆయన అభిమానులు సైలెంట్ అయ్యారంటే షణ్ను విన్నర్‌గా నిలవడం ఖాయం! ఎందుకంటే వీళ్లిద్దరికీ మధ్య ఓట్ల తేడా స్వల్పంగానే ఉంది. ఈ రోజుతో ఓటింగ్ లైన్లు ముగిసిపోతాయి. మరి విన్నర్ ఎవరనేది తేలాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే! House nundi eliminate aina #Siri #BiggBossTelugu5 today at 10 PM on #StarMaa #FiveMuchFun #BiggBosTelugu pic.twitter.com/Ww0q2wpjWB — starmaa (@StarMaa) December 17, 2021 -
'నా నరాలు తెగిపోయాయి, హ్యాట్సాఫ్ సన్నీ'
Bigg Boss 5 Telugu, Natraj Master Supports VJ Sunny: నా రూటే సెపరేటు అన్నట్లుగా నడుచుకుంటూ అందరితో కయ్యానికి దిగుతూ నాలుగువారంలోనే ఎలిమినేట్ అయ్యాడు నటరాజ్ మాస్టర్. బిగ్‌బాస్ షో నుంచి బయటకు వచ్చాక అతడు ఎవరికీ సపోర్ట్ ఇవ్వలేదు. తాజాగా మాత్రం ముగ్గురికీ మరీ ముఖ్యంగా ఒకరికి మద్దతునిస్తున్నాడు. 'ఎవరు విన్ అవుతారు? ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? అని చాలామంది అడుగుతున్నారు. నేనైతే శ్రీరామచంద్ర, సన్నీ, షణ్ముఖ్.. ముగ్గురికి సపోర్ట్ చేస్తున్నా. షణ్ముఖ్‌కు ఎందుకు సపోర్ట్ అంటే.. ఒకరి ఇన్ఫ్లూయెన్స్ వల్ల జనాల్లో కొంత ఇబ్బందిపడుతున్నా నామినేషన్స్‌లో పర్ఫెక్ట్గా ఉండేవాడు. శ్రీరామచంద్రకు సపోర్ట్ ఎందుకంటే? అతడు చాలావరకు నిజమే మాట్లాడేవాడు, అనిపించింది చెప్పేవాడు. కానీ కొన్నిసార్లు మాత్రం ఇన్‌ప్లూయెన్స్ అయ్యాడనిపించింది' 'ఇక సన్నీ గురించి.. ఫస్ట్‌లో అతడు ఇన్ఫ్లూయెన్స్ అయ్యాడు. ఎవరేం చెప్పినా నమ్మేసేవాడు. కాకపోతే అందరితో సరదాగా ఉండేవాడు. ముగ్గురికీ సపోర్ట్ చేసినప్పుడు ఒక చిన్న పాయింట్ ఏమనిపించిందంటే శ్రీరామచంద్ర ఇండియన్ ఐడల్ విన్నర్. షణ్ముఖ్ యూట్యూబ్‌లో నెంబర్ 1. సన్నీ చాలారోజుల నుంచి కష్టపడుతున్నాడు.. అతడికి మంచి లైఫ్ రావాలనిపించింది. జనాలను ఎంటర్టైన్మెంట్ చేయడం ముఖ్యం. అది సన్నీ చేశాడు. తన జర్నీ చూసి నవ్వుకున్నాను, ఫీల్ కూడా వచ్చింది. తనను ఇష్టపడేవాళ్లను సన్నీ సూపర్‌గా ఇష్టపడతాడు. నచ్చకపోతే కొంచెం అగ్రెసివ్ అవుతాడు' ముగ్గురూ గెలవాలని ఉంది, కానీ ఒక్కరికే ఛాన్స్ కాబట్టి సన్నీ విన్ అవ్వాలని ఉంది. ఇన్నిరోజులు ఎందుకు ఆగానంటే వీళ్లు చివరి వరకు ఎలా ఉంటారో చూద్దామనుకున్నా. నిన్న సన్నీని ఇష్టమొచ్చినట్లు అంటూ కోపమొచ్చేలా చేశారు. అయినా సరే కంట్రోల్ అయ్యాడు. ఆ ప్లేస్‌లో నేనుంటే ఆగేవాడినే కాదు. తనని అలా చూస్తే బీపీ వచ్చేసింది. నరాలు తెగిపోయాయి. సన్నీ మాత్రం కంట్రోల్‌గా ఉన్నాడు. హ్యాట్సాఫ్ సన్నీ. సీరియల్ కూడా వదిలేసి బిగ్‌బాస్ చేస్తున్నాడు. అతడు గెలవాలని గట్టిగా పీలవుతున్నా. నా సపోర్ట్ కచ్చితంగా సన్నీకే. అతడికి సపోర్ట్ చేయండి' అని పిలుపునిచ్చాడు నటరాజ్ మాస్టర్. View this post on Instagram A post shared by Natrajmaster (@natraj_master) -
ఇంత ఓవరాక్టింగ్ బ్యాచ్ ఏంట్రా? నన్ను బ్యాడ్ చేస్తే ఏమొస్తది?
ఎప్పటిలాగే షణ్ముఖ్, సిరి ఇద్దరే కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు. సిరి నాకు పడిపోయావ్ కదా అంటూ ఆమె ఒడిలో తల పెట్టుకుని పులిహోర ముచ్చట్లు మాట్లాడాడు షణ్ను. అయితే సిరి మాత్రం నీకంత సీన్ లేదులే అంటూ గాలి తీసేసింది. తర్వాత బిగ్‌బాస్ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చిన టాస్కుల్లో మళ్లీ జీవించే అవకాశాన్నిచ్చాడు. అందులో భాగంగా పాత టాస్కులను మరోసారి ప్రవేశపెట్టాడు. మొదటగా బెలూన్లలో గాలిని నింపుతూ వాటిని పగిలిపోయేలా చూడాలన్న టాస్క్ ఇచ్చాడు. ఇందులో షణ్ను గెలవగా దానిపై అనుమానం వ్యక్తం చేశాడు సన్నీ. లేబుల్ లేదు మచ్చా అనే రెండో టాస్కులో స్విమ్మింగ్ పూల్‌లో ఒకవైపున్న టీషర్ట్ వేసుకుని పూల్‌లో దూకి మరోవైపున్న టీ షర్ట్ వేసుకోవాలి. ఇలా ఎవరెక్కువ టీ షర్ట్స్ వేసుకుంటే వారే గెలిచినట్లు. ఈ గేమ్‌లో మానస్, షణ్ముఖ్ పోటీపడగా మానస్ గెలిచాడు. తర్వాత ఖాళీగా ఉండి ఏం చేయాలో పాలుపోక కాసేపు బంతి గేమ్ ఆడుకున్నారు సన్నీ, శ్రీరామ్, మానస్. ఈ క్రమంలో వారి బంతి హౌస్‌పై పడటంతో దాన్ని తీసుకోవడానికి ప్రయత్నించారు. ఇంతలో బిగ్‌బాస్ వారి ప్రయత్నాన్ని అడ్డుకుంటూ హౌస్లోపలకు వెళ్లమని హెచ్చరించాడు. అంతేకాదు బిగ్‌బాస్ ఇంటిపై ఎక్కాలని ప్రయత్నించడం ఏమాత్రం సహించబడదని వార్నింగ్ ఇచ్చాడు. దీనికి ఫలితంగా మీ ముగ్గురూ కలిసి గార్డెన్ ఏరియాను శుభ్రపరచాలని శిక్ష విధించాడు. దీంతో చచ్చాన్రా దేవుడా అనుకుంటూ శ్రీరామ్, మానస్ అంతా క్లీన్ చేయగా సన్నీ శుభ్రం చేస్తున్నట్లు నటించాడు. అనంతరం ఇంటిసభ్యులందరూ 13 నిమిషాలు లెక్కించాలని మూడో టాస్క్ ఇచ్చాడు. హౌస్మేట్స్ అంతా తీక్షణంగా క్షణాలను లెక్కిస్తున్న సమయంలో బిగ్‌బాస్ వారిని డిస్టర్బ్ చేసేందుకు నానారకాలుగా ప్రయత్నించాడు. ఈ గేమ్‌లో షణ్ను, శ్రీరామ్, మానస్, సన్నీ, సిరి వరుసగా ఐదు స్థానాల్లో నిలిచారు. ఫస్ట్ ప్లేస్‌లో నిలిచిన షణ్ను బిర్యానీ గెలుచుకోగా దాన్ని అందరూ ఆరగించారు. తర్వాత సిరి, షణ్ను ఒకరిగురించి మరొకరు మనసు విప్పి మాట్లాడుకున్నారు. 'నువ్వు కరెక్ట్ అని నమ్మాను, మన రిలేషన్‌కు నేనిచ్చే గౌరవం అది. కొన్నిసార్లు కంట్రోల్ అయ్యాను, ఎందుకనేది బయటకు వెళ్లాక చెప్తాను అని సస్పెన్స్‌లో పెట్టింది సిరి. షణ్ను మాత్రం మనం బాగా కనెక్ట్ అయిపోయాం.. అప్పుడప్పుడు నువ్వు జెన్యూన్ కాదేమో అనిపిస్తుంది, కాకపోతే అది కోపంలో ఉన్నప్పుడు అని పేర్కొన్నాడు. అనంతరం బిగ్‌బాస్ నాలుగో టాస్క్‌లో కొన్ని శబ్ధాలు ప్లే చేయగా అవేంటో రాయాలన్నాడు. ఈ గేమ్‌లో బెకబెకల శబ్ధాన్ని సిరి ఎలుకగా గుర్తించి తప్పులో కాలేయడంతో అందరూ పగలబడి నవ్వారు. ఈ ఛాలెంజ్‌లో శ్రీరామ్ గెలుపొందాడు. ఐదో టాస్కులో తాళ్లను ఎక్కువసేపు ఆపకుండా కదపాల్సి ఉంటుంది. ఇందులో సిరి, సన్నీ, షణ్ను ఆడగా సన్నీ గెలిచాడు. ఓడిపోయావ్ కదా, మళ్లీ ఆడదామా అంటూ సన్నీ సిరిని సరదాగా ఆటపట్టించాడు, కానీ ఆమెకు ఓడిపోయావన్న మాట అస్సలు నచ్చలేదు. నువ్వే ఓడిపోయావ్, షణ్ను ఒక్కడే కరెక్ట్‌గా ఆడాడని రివర్స్ కౌంటర్ ఇచ్చింది. నేను జోక్‌గా అన్నానని సన్నీ అనగా ఓడిపోయావన్న మాట సరదా కాదని తేల్చి చెప్పింది. మజాక్‌గా అన్నానని సన్నీ ఎంత సర్దిచెప్పినప్పటికీ ఆమె వినిపించుకోలేదు. తిందాం రమ్మని పిలిచినప్పటికీ రానంటూ మొండిగా ప్రవర్తించింది. పక్కనోడు గెలిస్తే సహించలేడంటూ ఆవేశంతో ఊగిపోయింది. నాతో జోకులొద్దు అని సన్నీకి వార్నింగ్ ఇచ్చింది. సిరి అరవడంతో సహనం కోల్పోయిన సన్నీ ఆమెను ఇమిటేట్ చేయగా సిరి మరింత ఉడికెత్తిపోయింది. ప్రతిసారి వచ్చి ఇమిటేట్ చేయడమేంటని మండిపడింది. నువ్వేమైనా హీరో అనుకుంటున్నావా? తోపు అని ఫీలవుతున్నావా? అంటూ ఏకిపారేసింది. మాటలు పడింది నేను, మళ్లీ పిజ్జా తిందువు రా అని పిలిస్తే ఎవడొస్తాడు అని చిర్రెత్తిపోయింది. అటు సన్నీ.. మానస్‌తో మాట్లాడుతూ.. ఎప్పుడు ఏ గొడవైనా కూడా నేనే వెళ్తాను, ఇంత ఓవరాక్టింగ్ బ్యాచ్ ఏంట్రా? వెళ్లేముందు నన్ను బ్యాడ్ చేస్తే వాళ్లకు ఏమొస్తదిరా? నువ్వు పెద్ద హీరోవా? అంటే నన్ను ఇష్టపడేవాళ్లకు, నా దునియాల నేను హీరోనే' అని స్పష్టం చేశాడు సన్నీ. మరి వీళ్ల గొడవ ఇలాగే కంటిన్యూ అయిందా? లేదా ఎండ్ కార్డ్ పడిందా? అన్నది రేపటి ఎపిసోడ్లో తేలనుంది. -
టాస్క్‌లో ఫైట్.. సిరి రెచ్చగొట్టిందా? లేక సన్నీ రెచ్చిపోయాడా?
Bigg Boss Telugu 5 Promo: బిగ్‌బాస్ ఇంట్లో పాత టాస్కులనే మరోసారి ఆడిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలో తాళ్లను కంటిన్యూగా ఆడించే టాస్క్‌లో సిరి, సన్నీ, షణ్ముఖ్ పాల్గొన్నారు. తాళ్లను పట్టుకుని ఎవరు ఎక్కువసేపు కదుపుతూ ఉంటే వారే గెలిచినట్లు లెక్క! ఈ ఆటలో సిరి ఎక్కువసేపు తాళ్లను కదపలేక అవుట్ అయింది. దీంతో పక్కకు వచ్చిన సిరి షణ్ను గెలవాలంటూ అతడిని ఎంకరేజ్ చేసింది. అక్కడిదాకా బానే ఉంది కానీ సన్నీ సరిగా ఆడట్లేదంటూ సరదాగా మాట్లాడింది. ఇది దృష్టిలో పెట్టుకున్న సన్నీ.. ఓడిపోయావ్ కదా అని ఆటపట్టించాడు. దీంతో చిర్రెత్తిపోయిన సిరి.. నువ్వూ ఓడిపోయావు.. షణ్ను ఒక్కడే గట్టిగా ఆడాడు అని రెచ్చగొట్టేలా మాట్లాడింది. నేను సరదాగా అన్నానని సన్నీ సర్ది చెప్పడానికి ప్రయత్నించగా ఓడిపోయావు అన్నది జోకా? అని సీరియస్ అయింది. అది మజాక్లో అన్నానని సన్నీ చెప్పగా సిరి మాత్రం నాతో జోకులెయ్యొద్దని వార్నింగ్ ఇచ్చింది. అలా వీరిద్దరి మధ్య పెద్ద గొడవే జరిగినట్లు తెలుస్తోంది. మరి ఈ గొడవ చల్లారిందా? లేదా? అన్నది ఎపిసోడ్లో తేలనుంది. -
అప్పుడు ఇప్పుడు మానసే విన్నర్!!
Bigg Boss Telugu 5 Promo: బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలేకు ఇంకా మూడు రోజుల సమయం ఉంది. అప్పటిదాకా ఏం చేయాలో అటు కంటెస్టెంట్లకే కాదు, ఇటు బిగ్‌బాస్‌కు కూడా పాలు పోవట్లేదు. నిన్న అయితే హౌస్మేట్స్ అంతా చిన్నపిల్లల్లా మారిపోయి దాగుడుమూతలు ఆడుకున్నారు. ఇప్పుడు బిగ్‌బాస్ కూడా వారిదారిలోకే వచ్చాడు. ఇంతకుముందు ఆడిన టాస్కులనే మళ్లీ మళ్లీ ఆడించాడు. ఈమేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. లేబుల్ లేదు మచ్చా గేమ్‌లో షణ్ముఖ్, మానస్ పోటీపడగా మానస్ గెలిచినట్లు సమాచారం. బెలూన్స్ టాస్క్‌లో షణ్ను గెలిచినట్లు లీకైంది. కొన్ని శబ్ధాలను ప్లే చేసి అవేంటో పసిగట్టి రాయాలన్న టాస్క్‌లో సన్నీ బెకబెక సౌండ్‌ను Frogకు బదులుగా Forg అని తప్పుగా రాయడంతో అందరూ పగలబడి నవ్వారు. సిరి అయితే ఏకంగా అది కప్ప కాదంటూ ఎలుక అని రాసింది. దీంతో కప్పకు, ఎలుకకు ఉన్న సంబంధాన్ని చెప్పమన్నాడు బిగ్‌బాస్. ఇలా ఈరోజు ఎపిసోడ్ ఫన్నీ టాస్కులతో సరదాగా గడిచిపోనున్నట్లు కనిపిస్తోంది. -
సిరి ప్రియుడిపై షణ్ముఖ్ అసహనం.. 'హగ్గు తప్పయితే ఇదేంటి?'
Bigg Boss Telugu 5, Shanmukh Jaswanth: బిగ్‌బాస్ షో ముగింపుకు వస్తుండటంతో కంటెస్టెంట్లు వారి జర్నీని, జ్ఞాపకాలను నెమరేసుకుంటున్నారు. 100 రోజుల తర్వాత తిరిగి కుటుంబంతో గడపనున్నామన్న ఆనందం ఒకవైపు, ఎన్నో గుణపాఠాలు నేర్పిన బిగ్‌బాస్ హౌస్‌ను వీడనున్నామన్న బాధ మరోవైపు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎప్పటిలాగే సిరి, షణ్ను కబుర్లలో మునగగా మానస్, సన్నీ ముచ్చట్లలో తేలారు. ఒంటరిగా కూర్చున్న శ్రీరామ్ ఏం చేయాలో ఊసుపోక కెమెరాలతో మాట్లాడుకున్నాడు. అయితే త్వరలో ఇంటికి వెళ్తున్నానన్న సంతోషం కన్నా షణ్ముఖ్‌ను వదిలి వెళ్తున్నానన్న బాధే సిరిని ఎక్కువగా వెంటాడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ విషయాన్ని షణ్ముఖ్ బెడ్‌పై చేరి అతడికి హగ్గిస్తూ మరీ చెప్పింది. కానీ దీనికన్నా ముందు వీళ్లిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. సిరి ప్రియుడు శ్రీహాన్ బిగ్‌బాస్ షోకు వచ్చినప్పుడు టాప్ 5లో ఎవరెవర్ని పెట్టారన్న విషయాన్ని మరోసారి ప్రస్తావిస్తూ అసహనం వ్యక్తం చేశాడు షణ్ను. అటు సన్నీ ప్రవర్తనలో కూడా ఏదో తేడా కొడుతోందంటూ అనుమానం వ్యక్తం చేశాడు. ఈ మేరకు షణ్ముఖ్ సిరితో మాట్లాడుతూ.. 'సన్నీ తన ఇద్దరు ఫ్రెండ్స్ కాజల్, మానస్‌ను టాప్ 5లో చూడాలనుకున్నాడు. దానికి తగ్గట్టుగా జెన్యూన్ అని పదేపదే మాట్లాడాడు. రెండుమూడువారాలుగా సన్నీ చాలా డిఫరెంట్‌గా ఉన్నాడనిపించింది. వెళ్లి మీ చోటు(సిరి ప్రియుడు శ్రీహాన్)కు చెప్పు. సన్నీ ఫొటో ఫస్ట్‌లో పెట్టాడుగా.. వాడు ఇలాంటివి చేస్తుంటాడు.. వెళ్లి ఎంకరేజ్ చేయమని చెప్పు. నీకోసం స్టాండ్ తీసుకుంటే మీరు అవతలివాడికి రెస్పెక్ట్ ఇస్తారు. మీవాడికి హౌస్‌లో జరిగేవన్నీ తెలీదేమో.. వెళ్లి చెప్పు. హగ్గివ్వడం తప్పయితే ఇదేంటి.. అంటే ఇదంతా ఓకేనా? ఈ ఇంట్లో నీకు తప్ప ఏ అమ్మాయికి స్ట్రయిట్ హగ్గివ్వలేదు' అని చెప్పుకొచ్చాడు. దీంతో సిరి బోరుమని ఏడ్చేయగా షణ్ను దగ్గరకు తీసుకుని ఓదార్చాడు. అయితే సిరి ఏడ్చింది తనకు కాబోయే భర్తను అన్ని మాటలన్నందుకు కాదు! త్వరలో షణ్నును వదిలి హౌస్ నుంచి వెళ్లిపోతానని! ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుగా మాటకు మాట ఇచ్చిపడేసే సిరి తన ప్రియుడిపై అలా కామెంట్ చేసినప్పటికీ లైట్ తీస్కోవడం ఏంటో అర్థం కావడం లేదంటున్నారు నెటిజన్లు. -
బిగ్‌బాస్: జర్నీ వీడియో అదిరింది..ఈ సారి కప్పు అతనికేనా!
Bigg Boss Telugu 5, Episode 101: బిగ్‌బాస్ ఐదో సీజన్ ముగింపు దశకు చేరుకుంది. మరో నాలుగు రోజుల్లో ఈ బిగ్ రియాల్టీ షోకి శుభం కార్డు పడనుంది. హౌస్‌లో ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో ఐదుగురు ఉన్నారు. వారికి మధురజ్ఞాపకాలను అందిస్తున్నాడు బిగ్‌బాస్. సోమవారం ఎపిసోడ్లో శ్రీరామ్, మానస్‌ల బిగ్‌బాస్ జర్నీ చూపించి, వారిలో జోష్ నింపాడు. మంగళవారం ఎపిసోడ్లో షణ్ముఖ్, సన్నీల జర్నీని చూపించి, అలరించాడు బిగ్‌బాస్. మొదటగా షణ్ముఖ్‌ని పిలిచాడు. అతనికి సంబంధించిన ఫోటోలను చూపించాడు. అందులో ఎక్కువగా మోజ్ రూం ఫోటోలే ఉండడంతో.. మోజ్ రూం.. మోజ్ రూం అంటూ కేకలు వేశాడు షణ్ముఖ్. తర్వాత షణ్ముఖ్ జర్నీ గురించి బిగ్‌బాస్ మాట్లాడుతూ.. ‘ఈ తరం వారికి ముఖ్యంగా సోషల్ మీడియా ఉపయోగించే వారికి షణ్ముఖ్ జస్వంత్ అనేపేరు ఎంతో సుపరిచితం. మీరు ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరికి పోటీలా నిలిచారు. ఇది వేరే ప్రపంచం. ఇక్కడ నిజమైన మనుషులు, విభిన్న వ్యక్తిత్వాలు, కోపం, ప్రేమ ఇలా ప్రతి ఒక్కటి నిక్కచ్చిగా ఉంటాయి. నీలోని ప్రతి కోణాన్ని ఒక్కొక్కటిగా.. అందంగా ఈ ప్రయాణం బయటకు తీసుకొచ్చింది. అర్థం చేసుకునే మనుషులు ఉండడం మనుసును తేలిక పరచడం కాగ, ఆటలో ముందుకు వెళ్లేందుకు కావాల్సిన ఉత్సాహాన్ని నింపుతుంది. అలాంటి అర్థం చేసుకునే స్నేహితులు నీకు ఈ ఇంట్లో దొరికారు. మీ కోపాన్ని, అసహనాన్ని దూదిలాగా పీల్చుకుంటూనే.. నీలోని నిప్పుని నిరంతరం వెలిగిస్తూ.. ముందుకు తీసుకొచ్చారు. మీ మనసుకి దగ్గరైన వారితో అభిప్రాయభేదాలు వచ్చిన ప్రతిసారి.. మీరు మోసిన బరువుని బిగ్ బాస్ గమనించారు. ఈ ఇంట్లో మీకు దగ్గరైన బంధాలు.. మీకు ఎంత ముఖ్యమో.. మీరు వారి కోసం నిలబడ్డ తీరు తెలియజేస్తుంది. వారి కోసం ఎంత దూరం అయినా వెళ్లడానికి నిర్ణయించుకున్నారు. అందుకే ఎన్ని గొడవలైనా.. చివరి వరకూ ఒకటిగానే ఉన్నారు. ఎప్పుడైతే మీ మనసులోని భారం తగ్గిందో అప్పటి నుంచి టాస్కుల్లో పట్టుదల చూపి, బుద్ది బలం ఉపయోగించి ఇంటి కెప్టెన్ కావడమే కాకుండా అందరితో బ్రహ్మా అనిపించుకున్నారు. మీకు ఇష్టమైన చోటు మోజ్ రూం అని బిగ్ బాస్‌కి తెలుసు. అక్కడ మీరు ఒంటరిగా గడిపిన క్షణాలు.. మీలోకి కోపం, బాధ, ప్రేమ అన్నింటిని ఆ గది చూసింది. మీ తీరులో ఆటను ఒక్కో లెవల్ తీసుకొచ్చి ఫినాలే వరకు వచ్చారు’అని బిగ్‌బాస్ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత సన్నీ జర్నీని చూపించాడు బిగ్‌బాస్. సరదా మరియు సన్నీ ఒకే అక్షరంతో మొదలౌతాయని.. మీరు అడుగు పెట్టిన మొదటి రోజు నుంచి ఈ షో చూస్తున్న అందరికి మీరు గుర్తు చేశారు. ఈ ఇంట్లో మీరు కోరుకున్న బంధాలు.. మీమ్మల్ని కోరుకునే స్నేహితులు.. గెలిచిన ఆటలు.. జరిగిన గొడవలు.. మోసిన నిందలు.. చేసిన వినోదం.. ఇలా మీరు పోగు చేసుకున్నవి ఎన్నో జ్ఞాపకాలు. ఇలా అన్ని కలిసి మిమ్మల్ని ఒక కొత్త మనిషిగా, అందరి మొహంపై నవ్వు తీసుకువచ్చే ఎంటర్టైనర్గా ఆవిష్కృతం చేసుకొని అందరి మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. మీ వాళ్ల కోసం మీరు నిలబడే తీరు.. వాళ్లు మిమ్మల్ని ఇష్టపడినా లేకున్నా.. మీలోని స్నేహితుడు వాళ్లని పరిచయం చేశాడు. మీలోకి కోపం మీకు ఇబ్బందులు తీసుకుని వచ్చి.. అందరి ముందు దోషిగా నిలబెట్టిన క్షణాలు.. మీ మనసుని ఎంతో బరువుగా చేసిన విషయాన్ని బిగ్ బాస్ గమనించారు. ప్రతి టాస్క్‌లో గెలవాలనే మీ తపన.. గెలిచేవరకూ పోరాడే పట్టుదల.. ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడినా.. మీ ఓర్పు మిమ్మల్ని ఇక్కడి వరకూ తీసుకుని వచ్చింది. ఒంటరిగా వచ్చిన మనిషికి కొంచెం ప్రేమను సంపాదించుకోవడం కంటే పెద్ద విజయం ఏదీ లేదని మీరు సాగించిన ప్రయాణమే మళ్లీ గుర్తు చేస్తుంది. మీరు వెతుకున్న స్వప్న సుందరి కూడా మీకు త్వరలోనే దొరకాలని బిగ్‌బాస్ ఆశిస్తున్నాడు. అప్నా టైం ఆయేగా.. అన్న మీ మాట మిమ్మల్ని ప్రేమించే వారికి గట్టిగా వినిపించింది. సన్నీ ఇప్పుడు మీ సమయం వచ్చేసింది’ అంటూ సన్నీ జర్నీని చూపించారు బిగ్ బాస్. తన జర్నీని చూసుకుని ఎమోషనల్ అయ్యాడు సన్నీ. బిగ్ బాస్ షోకి రావాలనేది నా డ్రీమ్.. నన్ను అభిమానించే ప్రతి ఒక్కరికీ మచ్చా లవ్యూ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అనంతరం ఒక ఫొటోగ్రాఫ్‌ని మీతో తీసుకుని వెళ్లండని బిగ్ బాస్ చెప్పడంతో.. తన తల్లితో ఉన్న ఫొటోతో పాటు.. మానస్‌తో ఉన్న ఫొటోని కూడా తీసుకున్నాడు.వెళ్తూ వెళ్తే.. బిగ్ బాస్ తనకి గిఫ్ట్‌గా ఇచ్చిన కేక్‌ని కూడా తీసుకుని వెళ్లాడు సన్నీ. ఆ రోజు అందరితో షేర్ చేసుకుని కేక్‌ని తినలేకపోయా.. ఇప్పుడు సర్ ప్రైజ్ చేస్తా అని ఆ కేక్‌ని తీసుకుని వెళ్లాడు సన్నీ. మొత్తంగా ఫైనల్‌కి చేరిన ఐదుగురు కంటెస్టెంట్స్‌కి సంబంధించిన జర్నీలలో ఇప్పటికైతే సన్నీదే హైలెట్ అని చెప్పాలి. ఈ వీడియోతో సన్నీకి పడే ఓట్ల సంఖ్య కచ్చితంగా పెరుగుతుంది. కప్పు కూడా అతను గెలిచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సిరి జర్నీ వీడియో బుధవారం ఎపిసోడ్లో ప్రసారం కానుంది. -
Bigg Boss 5 Telugu: సన్నీ.. సమయం వచ్చేసింది.. బిగ్‌బాస్ ప్రశంసలు
సన్నీ.. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న ఏకైక ఎంటర్టైనర్. హౌస్‌లో ఎంత కోపం ప్రదర్శించాడో అంతే ప్రేమను పంచాడు. అందరిని నవ్విస్తూ బెస్ట్ ఎంటర్టైనర్గా నిలిచాడు. నామినేషన్స్‌ని నవ్వుతూ స్వీకరించి.. ప్రేక్షకుల మనసు గెలుచుకొని టాప్ 5కి చేరాడు. సన్నీ ఆట, మాట ప్రేక్షకులను బాగా నచ్చింది.. అందుకే చాలా వారాలు నామినేట్ అవుతూ వచ్చినప్పటికీ.. ప్రతిసారి అతన్ని సేవ్ చేస్తూనే వచ్చారు. ఈ ఆదివారం (డిసెంబర్ 19)తో బిగ్‌బాస్ ఐదో సీజన్‌కి శుభం కార్డు పడనుంది. దీంతో హౌస్‌లో ఉన్న టాప్ 5 కంటెస్టెంట్స్ శ్రీరామ్, మానస్, సిరి, షణ్ముఖ్, సన్నీలకు తమ తమ జర్నీలను చూపిస్తున్నాడు బిగ్‌బాస్. ఇప్పటికే శ్రీరామ్, మానస్‌ల బ్యూటిఫుల్ జర్నీ చూపించిన బిగ్‌బాస్.. తాజాగా సన్నీ బిగ్‌బాస్ ప్రయాణాన్ని చూపించి, ఆనందపరిచాడు. హౌస్ లో సన్నీ మెమొరీస్ కి సంబంధించిన ఫొటోలన్నీ వేర్వేరు ప్లేసెస్ లో పెట్టి, సన్నీని ఆహ్వానించాడు. తన ఫోటోలను చూసి సన్నీ నవ్వుకున్నాడు. అక్కడ ఓ కోతి బొమ్మ ఉండే.. ‘ఓ కాజల్ ఎట్లున్నావ్.. బాగున్నావా’అంటూ తనదైన శైలీలో కామెడీ చేసి నవ్వులు పూయించాడు. ఇక పక్కనే ఉన్న కేక్ ముక్క ఉంటే.. దాన్నీ తీసుకొని వాసన చూసి.. 'వెయిట్ ఫర్ ది క్లైమాక్స్' అంటూ వేరో చోటుకి వెళ్లిపోయాడు. ఆ తరువాత బిగ్ బాస్ సన్నీను ప్రశంసిస్తూ.. 'సరదా.. సన్నీ రెండూ ఒకే అక్షరంతో మొదలవుతాయని మీరు గుర్తుచేశారు. గెలిచిన ఆటలు, జరిగిన గొడవలు, మోసిన నిందలు, చేసిన వినోదం.. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా.. అందరి మొహంపై నవ్వు తీసుకొచ్చి ఎంటర్టైనర్గా అందరి మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఒంటరిగా వచ్చే మనిషికి కొంచెం ప్రేమను సంపాదించుకోవడం కన్నా.. పెద్ద విజయం ఏదీ లేదని మీరు సాధించిన ప్రయాణమే మళ్లీ రుజువు చేస్తోంది. అప్నా టైం ఆయేగా.. సన్నీ.. మీ సమయమొచ్చేసింది' అంటూ సన్నీని ఓ రేంజ్లో పొగిడేశాడు బిగ్‌బాస్. మరి హౌస్‌లో సన్నీ ఇంకెంత కామెడీ చేశారో నేటి ఎపిసోడ్లో చూడాల్సిందే. -
బరాబర్ కప్పు గెలుస్తా, అమ్మకు ఇస్తా: సన్నీ ధీమా
Bigg Boss Telugu 5, Episode 100: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ నేటితో సెంచరీ కొట్టింది. ప్రస్తుతం ఉన్న సిరి, మానస్, శ్రీరామ్, షణ్ను, సన్నీలు గ్రాండ్ ఫినాలే కోసం రకరకాలుగా ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో మానస్- సన్నీ కప్పు గురించి కబుర్లాడారు. సన్నీ మాట్లాడుతూ.. 'టెన్షన్‌గా ఉంది, ఎలాగైనా టైటిల్ గెలవాలి, మా అమ్మకు కప్ ఇస్తరా బయ్.. ఇది ఫిక్స్.. ఏదైనా కానీ.. బరాబర్ కప్పు ఇస్తా..' అంటూ తన విజయంపై ధీమా వ్యక్తం చేశాడు. అనంతరం బిగ్‌బాస్ ఫైనలిస్టుల జర్నీని కళ్లకు కట్టినట్లు చూపించడానికి రెడీ అయ్యాడు. మొదటగా ఫస్ట్ ఫైనలిస్టు శ్రీరామ్‌ను సర్ప్రైజ్ చేశాడు. అతడు గార్డెన్ ఏరియాలోకి వచ్చి ఇప్పటివరకు జరిగిన టాస్కుల తాలూకు వస్తువులు చూసి ముచ్చటపడిపోయాడు. అనంతరం బిగ్‌బాస్ మాట్లాడుతూ.. మీ పాటే కాకుండా మాట, ఆటతో లక్షల మందిని పలకరించారు. ఆటలో మీరు చూపించిన పోరాట పటిమ, స్నేహితుల కోసం మీరు నిలబడ్డ తీరు ప్రపంచానికి కొత్త శ్రీరామ్‌ను పరిచయం చేశాయి. ఆట సాగుతున్నకొద్దీ మీకు దగ్గరైనవారు ఒక్కొక్కరిగా మీకు దూరమయ్యారు. ఎంతోమంది మిమ్మల్ని లోన్ రేంజర్ అన్నా మీరు వన్ మ్యాన్ ఆర్మీలా లక్ష్యం వైపు ముందుకెళ్లారు అంటూ జర్నీ వీడియో ప్లే చేశాడు. ఇది చూసి శ్రీరామ్ ఎమోషనల్ అయ్యాడు. నా జీవితంలో ఈ రోజును మర్చిపోలేను. నన్ను నేను కొత్తగా చూసుకుంటున్నాను, బిగ్‌బాస్ నా ఎమోషన్స్‌ను బయటపెట్టగలిగింది.. ఈ జర్నీ నాకు వెరీవెరీ స్పెషల్ అంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. నీ మనసుకు బాగా దగ్గరైన ఒక ఫొటోను తీసుకెళ్లమని బిగ్‌బాస్ అవకాశమివ్వగా శ్రీరామ్ తన చెల్లితో ఉన్న ఫొటోను తీసుకున్నాడు. తర్వాత మానస్ గార్డెన్ ఏరియాలోకి వచ్చాడు. అమ్మ ముద్దుల కొడుకుగా ఇంట్లో అడుగుపెట్టారు. ఇంట్లో అడుగుపెట్టిన క్షణం నుంచి ఇప్పటివరకు మీ ఓర్పు, అందరినీ అర్థం చేసుకునే తత్వం ఈ ఇంట్లో మీకు ప్రత్యేక స్థానాన్ని తీసుకువచ్చాయి. స్నేహం కోసం ఆఖరివరకు నిలబడ్డ తీరు ప్రతి ఒక్కరినీ హత్తుకుంది. మనసు నొప్పించకుండా విషయం అర్థమయ్యేలా సున్నితంగా చెప్పడం, అవసరమైతే గొంతెత్తి నిలదీయడం మీకే చెల్లింది. మనసు, తెలివి రెండింటినీ సమంగా ఉపయోగించి ఆడటం మీతోనే సాధ్యమం అని మెచ్చుకుంటూ జర్నీ వీడియో ప్లే చేశాడు బిగ్‌బాస్. ఈ జర్నీలో ఎత్తుపల్లాలు, స్వీట్ అండ్ సాడ్ మెమొరీస్ చూసి మానస్ కదిలిపోయాడు. తర్వాత ఒక ఫొటోగ్రాప్ తీసుకెళ్లమంటే బిగ్‌బాస్‌ను అభ్యర్థించి రెండు ఫొటోలు పట్టుకెళ్లాడు. అమ్మతో దిగిన ఫొటోతో పాటు తన ఫ్రెండ్ సన్నీతో ఉన్న ఫొటోను జాగ్రత్తగా కాపాడుకుంటానన్నాడు. ఇది చూసిన శ్రీరామ్ తానూ రెండు ఫొటోలు తెచ్చుకోవాల్సిందని నిరాశ చెందాడు. -
బిగ్‌బాస్ హౌస్‌లో గొడవలకు నేనే మూల కారణం: కాజల్
Bigg Boss Telugu 5, Episode 99, Kajal Eliminated: వచ్చేవారం (డిసెంబర్ 19న) గ్రాండ్ ఫినాలే జరగబోతుందని వెల్లడించాడు కింగ్ నాగార్జున. అంటే నెక్స్ట్ సండే ఎవరు విన్నర్ అనేది తేలనుందన్నాడు. ఇక ఈరోజు ఎవరెవరు ఫినాలేలో అడుగుపెట్టనున్నారనేది కూడా తేల్చేశాడు. ఇప్పటికే టికెట్ టు ఫినాలే గెలుచుకుని శ్రీరామ్ ఫస్ట్ ఫైనలిస్టుగా నిలవగా సన్నీని రెండో ఫైనలిస్టుగా ప్రకటించారు. నేటి(డిసెంబర్ 12) ఎపిసోడ్లో సిరిని మూడో ఫైనలిస్టుగా, షణ్నును నాలుగో ఫైనలిస్టుగా వెల్లడించడంతో వాళ్లు సంతోషంలో మునిగి తేలారు. అనంతరం బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు వీడియో ద్వారా ప్రశ్నలను సంధించగా హౌస్మేట్స్ వాటికి సమాధానాలు చెప్పారు. ► జెస్సీ: షణ్నుకి, సిరికి ఎలాంటి బాండింగ్ ఉందో నాకు తెలుసు. కానీ జనాలు ఏమనుకుంటున్నారు? అని ఎప్పుడైనా ఆలోచించావా? షణ్ను: ఫ్యామిలీస్ ఇంట్లోకి వచ్చినప్పటినుంచి నాకూ ఈ ప్రశ్న ఎదురైంది. అది తప్పే, కానీ సిరి నా బెస్ట్‌ఫ్రెండ్.. జీవితాంతం ఆమెకు సపోర్ట్‌గా ఉంటాను. ► యానీ మాస్టర్: బిగ్‌బాస్ నుంచి వచ్చాక కొన్ని ఎపిసోడ్లు చూశాను. సన్నీ, మానస్ నా వెనకాల మాట్లాడారు. నేనెప్పుడూ నీ గురించి బ్యాక్ బిచింగ్ చేయలేదు. నువ్వు నా గుడ్ ఫ్రెండ్ అన్నాను. కానీ నువ్వు మాత్రం నేను నటిస్తున్నానని ఇంకా ఏవేవో అన్నావు. నిజంగా నీ మీద జెలసీ ఉంటే నిన్ను కెప్టెన్ చేయడం కోసం నేను కష్టపడకపోయేదాన్ని! సన్నీ: నేను బ్యాక్ బిచింగ్ చేయలేదు. యానీ మాస్టర్ కొన్నిసార్లు మాట మీద నిలబడదు, అప్పుడు నేను నా అభిప్రాయాన్ని ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకున్నానంతే.. ఆమె నాకెప్పుడూ మంచి స్నేహితురాలే.. ► నటరాజ్ మాస్టర్: ఐస్ టాస్క్‌లో పింకీ చేసిన వైద్యం వల్ల శ్రీరామ్ నడవలేకపోయాడు. టికెట్ టు ఫినాలే టాస్కులో వేరేవాళ్లు నీ తరపున గేమ్ ఆడారు. అంటే పింకీ చేసిన వైద్యం గేమ్పరంగా నీకు ప్లస్ అయిందా? మైనస్ అయిందా? శ్రీరామ్: ఇది ప్లస్సో, మైనసో పక్కనపెడితే నేను టాస్కుల్లో 100% ఇచ్చాను. నా ఆట నేను ఆడలేకపోయాను కాబట్టి మైనస్ అయింది. ► ప్రియాంక: ఇన్నిరోజులు హౌస్‌లో నన్ను భరించావా? నటించావా? మానస్: కచ్చితంగా భరించాను. నేనైతే నటించలేదు ► జెస్సీ: సిరి.. బిగ్‌బాస్ హౌస్‌లోకి గేమ్ ఆడటానికి వెళ్లావు కదా! కానీ నువ్వు గేమ్ మీద శ్రద్ధ తగ్గించి ఎమోషనల్ కనెక్ట్ అవుతున్నాను అదీఇదీ అంటూ పిచ్చెక్కిపోతున్నావు, నీకిది అవసరమా? సిరి: గేమ్ ఆడటానికే వచ్చాను. మధ్యలో కొన్నికొన్ని ఎమోషన్స్ తీసుకుంటున్నాను. కానీ గేమ్‌లో ఎమోషనల్ కనెక్ట్ అయితే అవసరం లేదు ► ప్రియ: బయట ఎలా ఉంటావో తెలుసుకోవాలని ఉంది. సహజంగా నువ్వు ఇలాగే ఉంటావా? గేమ్ వరకేనా? కాజల్: నాకు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవాలనిపిస్తే అలానే రియాక్ట్ అవుతున్నా. నేనిలాగే ఉంటాను. ప్రశ్నోత్తరాలు ముగిసిన తర్వాత మానస్‌ను ఐదో ఫైనలిస్టుగా ప్రకటించిన నాగ్ కాజల్ ఎలిమినేట్ అయినట్లు వెల్లడించాడు. దీంతో సన్నీ, మానస్ వెక్కివెక్కి ఏడ్చారు. ఇక శ్రీరామ్‌తో నువ్వెప్పటికీ నా బ్రదర్వే అని చెప్పుకొచ్చింది కాజల్. నన్ను బాగా మిస్సవ్వండి అంటూ బిగ్‌బాస్ హౌస్ నుంచి నిష్క్రమించింది. స్టేజీ మీదకు వచ్చిన కాజల్‌తో నాగార్జున ఓ ఇంట్రస్టింగ్ గేమ్ ఆడించాడు. ఐదు ఎమోషన్స్‌ను ఐదుగురు కంటెస్టెంట్లకు అంకితమివ్వాలన్నాడు. సన్నీ ఐదు రెట్ల ఎంటర్టైన్మెంట్ ఇస్తే మానస్ ఐదు రెట్ల ఫ్రెండ్షిప్ చేస్తాడంది కాజల్. సిరి ఐదు రెట్ల ఎమోషన్ ఇస్తే, శ్రీరామ్ ఐదు రెట్ల యాక్షన్ చేస్తాడని తెలిపింది. షణ్ముఖ్ ఐదు రెట్ల డ్రామా చేస్తాడని పేర్కొంది. సిరిని కంట్రోల్ చేయడం, తిట్టడం, హగ్గులివ్వడం.. ఇలా ప్రతిదాంట్లో డ్రామా ఉంటుందని అభిప్రాయపడింది. తాను టాప్ 6లో ఉండగానే ఎలిమినేట్ అవుతానని కల వచ్చిందని, చివరకు అదే నిజమైందని నాగార్జునతో చెప్పుకొచ్చింది. చివరగా ఇంట్లో జరిగిన గొడవలన్నింటికీ తనే మూల కారణమని ఒప్పుకోవడం గమనార్హం. కానీ అవేవీ తను కావాలని చేయలేదని స్పష్టం చేసింది. ఫైనల్‌గా శ్రీరామ్, సిరి, మానస్, షణ్ను, సన్నీ ఈ సీజన్లో టాప్ 5 కంటెస్టెంట్లుగా నిలిచి ట్రోఫీ కోసం పోటీపడనున్నారు. -
మాట మార్చిన సిరి, 4వ స్థానానికి పడిపోయిన షణ్ముఖ్
Bigg Boss 5 Telugu, Episode 98: బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు ఓ ప్రమోషన్ టాస్క్ ఇచ్చాడు. ఈ టీవీఎస్ అపాచీ గేమ్‌లో కాజల్ సంచాలకురాలిగా వ్యవహరించింది. అయితే గేమ్‌లో సన్నీకి గైడెన్స్ ఇవ్వడాన్ని తప్పుపట్టింది సిరి. పైగా సన్నీ చిన్నచిన్న పొరపాట్లు చేసినప్పటికీ కాజల్ అతడినే విజేతగా ప్రకటించడాన్ని జీర్ణించుకోలేకపోయింది. సంచాలకురాలిగా కాజల్ ఫెయిలయిందని చెప్పిందే చెప్తూ ఆమెను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించింది. ఫ్రెండ్ అని సన్నీని విన్నర్‌గా ప్రకటించిందని మండిపడింది. ఈ క్రమంలో వీళ్లిద్దరూ చాలాసేపు గొడపడ్డారు. ఇక స్టేజీపైకి వచ్చిన నాగార్జున హౌస్‌మేట్స్‌తో ఓ ఇంట్రస్టింగ్ గేమ్ ఆడించాడు. ఈ పద్నాలుగో వారాల్లో సంతోషపెట్టిన క్షణాలతో పాటు, బాధపడ్డ రోజులు, రిగ్రెట్‌గా ఫీలైన సంఘటనలు ప్రతి ఒక్కరికీ ఉండే ఉంటాయని, ఈ జర్నీలో ఏ వారంలో మీకు రిగ్రెట్ ఉందో చెప్పాలన్నాడు నాగ్. మొదటగా కాజల్ మాట్లాడుతూ.. '9 వారంలో జైలు నామినేషన్ జరిగింది. అప్పుడు సన్నీ, మానస్‌ను సేవ్ చేసే అవకాశం ఉన్నప్పటికీ వాళ్లను చేయలేదు. శ్రీరామచంద్రతో మాట్లాడాక షణ్నును సేవ్ చేయాలనుకున్నా. అంటే ఎవరో గుర్తు చేస్తే నన్ను సేవ్ చేశావని అతడూ హ్యాపీగా లేడు' అని చెప్పుకొచ్చింది. షణ్ను మాట్లాడుతూ.. 'ఎమోషనల్ కనెక్ట్ పెద్ద రిగ్రెట్. 11వ వారంలో నా వల్ల సిరి తలబాదుకోవడం నచ్చలేదు. 14వ వారం టాప్ 5 గురించి మరీ ఎక్కువగా ఆలోచించాను. హౌస్మేట్స్ ఏం చేసినా, ఏం మాట్లాడినా గేమ్ గురించేనేమో అని అనుమానపడి సిరిని కొన్ని విషయాల్లో ఆపాను. అయితే ఆమెకు సాయం చేద్దామనేదే నా ఉద్దేశ్యం. కానీ ఆమె గేమే బాగుందేమో, అనవసరంగా సాయం చేస్తున్నానేమో అని కొంత రిగ్రెట్‌గా ఫీలయ్యా. ఒకవేళ ఆమె టాప్ 5లో లేకపోతే అది నా తప్పు అవుతుందేమో అనిపిస్తోంది' అని చెప్పుకొచ్చాడు. సన్నీ వంతురాగా.. '12వ వారంలో నేను అగ్రెసివ్ అయి గేమ్ ఆడాను. దీనివల్ల సిరి ఐస్బకెట్లో నుంచి కాళ్లు తీయకుండా ఆడింది. దీంతో వారమంతా సఫర్ అయింది. అది నా వల్లే అనిపించింది. మరొకటి గిల్టీబోర్డు వేసుకున్నది కూడా మర్చిపోలేను' అని తెలిపాడు. మానస్.. '4వ వారంలో కెప్టెన్సీ కోసం బరువు తగ్గాం, చాలా కష్టపడ్డాం. అప్పుడు సన్నీ,నేను ఇద్దరిలో ఎవరు కెప్టెన్సీకి పోటీపడాలా అని ఆలోచించుకున్నాక సన్నీకి అవకాశమిచ్చాను. అయితే హౌస్‌లో ఎక్కువ కత్తిపోట్లు సన్నీకే పడ్డాయి. ఏ కారణం లేకుండానే అందరూ కత్తితో పొడిచేస్తున్నారు. ఆరోజు నేనే పోటీకి వెళ్లుంటే వాడు అలాంటి స్థితి ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండేది అనిపించింది' అన్నాడు. శ్రీరామ్.. '4వ వారంలో ఎవరి వంట వాళ్లు వండుకోవాలి అన్న గొడవ జరిగింది. ఆ తర్వాత నేను చాలా డల్ అయ్యాను. ఎక్కువ తప్పు జరిగిపోయిందా? నావల్లే ఇంట్లో గొడవలు మొదలయ్యాయా? అని తెగ ఆలోచించి డిస్టర్బ్ అయ్యాను' అని పేర్కొన్నాడు. సిరి.. 11వ వారంలో షణ్నుతో గొడవపడి తల బాదుకోవడం తప్పనిపించిందని చెప్పుకొచ్చింది. అనంతరం నాగ్ మరో గేమ్ ఆడించాడు. ఈ పద్నాలుగువారాలను పరిగణనలోకి తీసుకుని ఎవరు హిట్ స్టార్? ఎవరు ఫ్లాప్ స్టార్? చెప్పాలన్నాడు. ముందుగా కాజల్.. సన్నీకి హిట్ స్టార్, షణ్నుకి ఫ్లాప్ స్టార్ అన్న ట్యాగ్‌నిచ్చింది. శ్రీరామ్.. సన్నికీ హిట్, కాజల్‌కు ఫ్లాప్ స్టార్ బిరుదునిచ్చాడు. సన్నీ.. మానస్‌కు హిట్, షణ్నుకి ఫ్లాప్ స్టార్ అన్న ట్యాగ్‌నిచ్చాడు. కానీ పద్నాలుగు వారాలను పరిగణనలోకి తీసుకోవాలని నాగ్ గుర్తు చేయగానే ఆ ఫ్లాప్ స్టార్ ట్యాగ్‌ను షణ్నుకి కాకుండా సిరికిచ్చాడు. తర్వాత సిరి.. షణ్నును హిట్, సన్నీని ఫ్లాప్ స్టార్‌గా పేర్కొంది. మానస్.. సన్నీకి హిట్, షణ్నుకు ఫ్లాప్ స్టార్ ట్యాగ్ ఇచ్చాడు. షణ్ముఖ్.. సిరికి హిట్, కాజల్‌కు ఫ్లాప్ స్టార్ బిరుదునిచ్చాడు. అనంతరం సన్నీని సెకండ్ ఫైనలిస్టుగా ప్రకటించారు. తర్వాత హౌస్‌మేట్స్‌ను మరోసారి 1 నుంచి 6 ర్యాంకుల వరకు నిల్చోమన్నాడు నాగ్. కాజల్, సిరి తప్ప మిగతా మేల్ కంటెస్టెంట్స్ అంతా మొదటి స్థానం తమదే అన్నారు. దీంతో నాగ్.. అమ్మాయిలిద్దరు మాత్రమే రెండో స్థానానితో సరిపెట్టుకుంటున్నారని పెదవి విరిచారు. షణ్నును మొదటి స్థానంలో చూడాలనుకుంటున్న సిరి తన మాటను వెనక్కు తీసుకుంటూ వెళ్లి ఫస్ట్ ర్యాంక్‌పై నిలబడింది. శ్రీరామ్, కాజల్, షణ్ముఖ్, సన్నీ, మానస్ వరుసగా రెండు నుంచి ఆరు స్థానాల వరకు నిలబడ్డారు. -
సన్నీ ఏడవడం చూసి ఎమోషనల్ అయ్యా: మానస్
Bigg Boss Telugu 5 Promo: ఇవాళ శనివారం.. అంటే టాలీవుడ్ కింగ్ నాగార్జున బిగ్‌బాస్ స్టేజీపై సందడి చేసే రోజు. ప్రతి శనివారం ఆయన నామినేషన్లో ఉన్న కొంతమందిని సేఫ్ చేస్తాడు. కానీ ఇవాళ మాత్రం సేఫ్ చేయడానికి బదులుగా ఎవరెవరు ఫినాలేలో అడుగుపెట్టనున్నారో వెల్లడించనున్నాడు. ఇకపోతే ఇన్నివారాల జర్నీని ఒకసారి గుర్తు చేస్తూ వీల్ ఆఫ్ ద వీక్స్‌ను ప్రవేశపెట్టాడు. ఏ వారంలో అతిగా బాధపడ్డారో, ఏ వారంలో తప్పులు చేశామని ఫీలయ్యారో వాటిని కంటెస్టెంట్లు చెప్పుకొచ్చారు. మొదటిసారి సన్నీ ఏడవడంచూసి తాను మొట్టమొదటిసారిగా ఎమోషనల్ అయ్యానన్నాడు మానస్. గడిచిన సమయం మళ్లీ వస్తే అలా చేసుకోనని ఫిక్స్ అయ్యానంటూ తను బాధపడిన సంఘటన గురించి చెప్పుకొచ్చింది సిరి. హిట్ స్టార్ ఎవరు? ఫ్లాప్ స్టార్ ఎవరు? అన్న గేమ్ ఆడించగా అందులో కాజల్.. షణ్నుకు ఫ్లాప్ స్టార్ అన్న బిరుదిచ్చింది. దీంతో నాగ్ కాజల్ మీద సెటైర్లు వేశాడు. సన్నీ, సిరి ఒకరికొకరు ఫ్లాప్ ట్యాగిచ్చుకున్నారు. మరి శ్రీరామచంద్ర తర్వాత ఇంకా ఎవరెవరు ఫినాలేకు వెళ్లబోతున్నారనే సస్పెన్స్‌కు నేడు తెర దించనున్నట్లు కనిపిస్తోంది. ఎవరెవరు టాప్ 5లో ఉంటారనేది తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే! -
అతడే నా ఫేవరెట్ హీరో, అది జీవితంలో మర్చిపోలేను
Bigg Boss 5 VJ Sunny Experience With Star Hero: బుల్లితెర హిట్ షో బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ విజయవంతంగా ప్రసారమవుతోంది. సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చల ప్రకారమైతే సన్నీ, షణ్ముఖ్, శ్రీరామ్‌లలో ఒకరు విజేతగా నిలుస్తారని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా పోటీ షణ్ను, సన్నీల మధ్యే ఉంటుందని మెజారిటీ నెటిజన్లు విశ్వసిస్తున్నారు. ఇదిలా ఉంటే షణ్ను, సన్నీ ఇద్దరూ వేర్వేరు స్వభావం కలవారు. షణ్ను సైలెంట్ అయితే సన్నీ వయొలెంట్.. అతడు మైండ్ గేమ్‌లో ఎక్స్పర్ట్ అయితే సన్నీ ఫిజికల్ గేమ్‌లో ఎక్స్పర్ట్. ఇలా ఒక్కొక్కరు ఒక్కోదాంట్లో ముందున్నారు. షణ్ముఖ్ ఫేవరెట్ హీరో సూర్య అని మనందరికీ తెలుసు. మరి సన్నీ ఫేవరెట్ ఎవరో తెలుసా? బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ అట! 'షారుక్ ఖాన్‌ను వ్యక్తిగతంగా కూడా చాలా ఇష్టపడతాను. జర్నలిస్టుగా ఉన్నప్పుడే ఆయనను కలిశాను. ఒక స్టార్ అన్న ఫీలింగ్ లేకుండా అందరితో కలిసిపోతారు. డాన్ 2 ప్రమోషన్స్ నేను వెనకుండి నడిపించాను. ఆ విషయం ఆయనకు కూడా తెలీదు. ఉదయం నుంచి ఆయన వెనకాలే ఉన్నా.. ఆరోజు ఆయన వెళ్లిపోతుంటే భాయ్.. ఏక్ ఫొటో అని గట్టిగా అడిగా.. అంత జనంలోనూ ఆయన వెనక్కు వచ్చి నవ్వుతూ నాతో ఫొటో దిగారు. అది జీవితంలో మర్చిపోలేను' అని చెప్పుకొచ్చాడు సన్నీ. -
ప్లీజ్, మా కల నెరవేర్చండి..: సన్నీ, కాజల్
Bigg Boss Telugu, Episode 97: హౌస్మేట్స్ స్టార్లుగా నటించాల్సిన టాస్కులో అందరూ తమ ప్రతిభను ప్రదర్శిస్తూ ఇరగదీశారు. సూర్యగా షణ్ను, జెనీలియాగా సిరి, పవన్ కల్యాణ్‌గా మానస్, చిరంజీవిగా శ్రీరామ్, బాలయ్యగా సన్నీ, శ్రీదేవిగా కాజల్ అదరగొట్టారు. కానీ అందరికంటే ఎక్కువగా కాజల్ తన పాత్రలో లీనమై అందరినీ ఆకట్టుకుంది. దీంతో హౌస్మేట్స్ ఆమెను బెస్ట్ పర్ఫామర్‌గా ఎన్నుకున్నారు. అలా కాజల్‌కు నేరుగా ప్రేక్షకులను ఓట్లు అడిగే అవకాశం వచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'నా కల నెరవేరడానికి మీరు ఎంతగానో సహకరించారు. నేను టాప్ 5లో నా ఫ్రెండ్స్‌తో పాటు ఉండాలనుకుంటున్నాను, దయచేసి ఓటేయండి' అని ప్రేక్షకులను అభ్యర్థించింది కాజల్. కంటెస్టెంట్లపై ప్రేమాభిమానాలు కురిపించే ప్రేక్షకుల మనసుల్లో ఎన్నో ప్రశ్నలున్నాయన్న బిగ్‌బాస్ వారి ప్రశ్నలను హౌస్మేట్స్ ఎదుర్కోవాల్సి ఉంటుందన్నాడు. అందులో భాగంగా ప్రేక్షకుల ప్రశ్నలు స్క్రీన్‌పై ప్రత్యక్షం అవగానే అది ఎవర్నైతే అడిగారో వారు దానికి బదులివ్వాల్సి ఉంటుంది. ఎలాంటి ముసుగు వేసుకోకుండా సమాధానాలు చెప్పినవారు ఓట్ ఫర్ అప్పీల్‌కు అవకాశం పొందుతారు. మొదటి ప్రశ్న: మీరు షణ్ను కన్నా స్ట్రాంగ్ ప్లేయర్. కానీ మిమ్మల్ని మీరు ఎందుకలా కన్సైడర్ చేసుకోవడం లేదు? సిరి: నేను స్ట్రాంగ్ ప్లేయర్‌నే. కాకపోతే కొన్ని సంఘటనల్లో షణ్ను నాకు తోడుగా ఉన్నాడు, ఒక్కసారి నమ్మానంటే ప్రాణం ఇచ్చేస్తాను. ఒక ఫ్రెండ్‌గా నేను వాడిని ఫస్ట్ ప్లేస్‌లో చూడాలనుకున్నాను. రెండో ప్రశ్న: అనీ మాస్టర్‌తో రెస్పెక్ట్ గురించి మాట్లాడినప్పుడు తుడిచిన టిష్యూని సన్నీ మీద కొట్టడం రెస్పెక్టా? కాజల్: సన్నీ దగ్గర నాకు చనువుంది, అతడంటే నాకు చాలా గౌరవం. అది సరదా గొడవలో చేశాను. మూడో ప్రశ్న: గిల్టీ బోర్డ్ వేసుకుని తిరిగినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఆ ఇన్సిడెంట్ తర్వాత మీ కాన్ఫిడెన్స్‌ను ఎలా తిరిగి పొందారు ? సన్నీ: గిల్టీ బోర్డ్ వేసుకోవడమనేది ఈ సీజన్లోనే నేను బాగా హర్టయిన సంఘటన. గిల్టీ అనే పదానికి దరిదాపుల్లో కూడా వెళ్లకూడదనుకున్నాను. అద్దంలో చూసుకుంటూ నాలో నేను కాన్ఫిడెన్స్ నింపుకుంటాను. నాలుగో ప్రశ్న: జెస్సీ ఇష్యూ జరిగినప్పుడు షణ్ను ఇమ్మెచ్యూర్ అని మీరు చెప్పారు. కానీ ర్యాంకింగ్ టాస్క్‌లో మీరే షణ్ను మెచ్యూర్ అని, తనను సెకండ్ ప్లేస్‌లో పెట్టారు. మీ అభిప్రాయం ఎందుకు మారింది? ఇప్పుడు మీరు షణ్ను గ్రూపులో ఉన్నారా? శ్రీరామ్: ఇప్పుడు తెలిసిన షణ్ముఖ్ వేరు.. ప్రస్తుతం షణ్ను చాలా మెచ్యూర్. ఐదో ప్రశ్న: ఆడియన్స్ దగ్గర మంచి మార్కుల కోసం సన్నీ మిమ్మల్ని ఫ్రెండ్‌లా వాడుకుంటున్నాడని మీకు అనిపించట్లేదా? మానస్: వాడుకోవడమనేది రాంగ్. జన్యున్‌గా కనెక్ట్ అయిన వ్యక్తి సన్నీ. ఫ్రెండ్స్‌కు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడు? ఫ్రెండ్స్ సేవ్ చేసినప్పుడు సన్నీ ఎక్స్ప్రెషన్స్ చూసుంటే మీకు అర్థమవుతుంది. నాకెప్పుడూ అతడు వాడుకోవాలనిపించలేదు. ఆరో ప్రశ్న: సిరి అంటే మీరు ఎందుకంత పొసెసివ్‌గా ఫీల్ అవుతారు? మీరు సిరిని ప్రతిసారి ఎందుకు కంట్రోల్ చేస్తున్నారు. తనని తనలా ఎందుకు ఉండనివ్వరు? షణ్ను: ఇది నేనూ ఊహించాను. నేను పొసెసివ్‌గా ఫీల్ అవుతున్నానని నాకూ తెలుసు. కొన్ని కొన్ని విషయాల్లో ఆమెను కంట్రోల్ చేస్తే బెటర్ అని, మిగతా కొన్నింటిలో ఆమె ఆమెలా ఉంటే సరిపోతుందని అనుకున్నాను. కానీ ఏది కంట్రోల్ చేస్తున్నానో, ఏది పొసెసివ్‌గా ఫీల్ అవుతున్నానో నాకే తెలియడం లేదు. నన్ను నాకన్నా ఎక్కువ తనే అర్థం చేసుకుంటుంది. తనమీద ఎవరైనా గేమ్ ఆడాలనుకుంటే తప్పకుండా కంట్రోల్ చేస్తాను. ఎందుకంటే ఆమెను టాప్ 5లో చూడాలనుకుంటున్నాను. అందరిముందు కాజల్‌ను ఎందుకు హ్యుమిలియేట్ చేస్తారు? స్టాండ్ తీస్కొని మీకోసం ఎవిక్షన్ ఫ్రీ పాస్ తను విన్ అయింది సన్నీ: మేం ఫ్రెండ్స్. మీకలా అనిపించిందంటే ఇంకా ఎక్కువ చేస్తాను. రవిని నామినేట్ చేశారు, ఇన్ఫ్లూయెన్సర్ అనే పేరు కూడా పెట్టారు. మరి టికెట్ టు ఫినాలే టాస్క్‌లో మేం నీకోసం ఆడుతున్నాం రవి , మిస్ యూ రవి అని అనడం కరెక్ట్ అనుకుంటున్నారా? సిరి: మనిషి పక్కన ఉన్నప్పుడు అతడి వాల్యూ తెలియలేదు. నన్ను చెల్లెలిగా చూస్తూ ఏడిపిస్తాడు. రవి సడన్‌గా ఎలిమినేట్ అవడంతో షాక్‌లోకి వెళ్లిపోయా. టికెట్ టు ఫినాలే టాస్క్‌లో రవి గుర్తొచ్చాడు, అతడి కోసం ఆడాలనిపించింది. మీరు ప్రియాంక మీ ఫ్రెండ్ అనుకున్నప్పుడు తనని బ్యాక్బిచ్ ఎందుకు చేశారు? మానస్: ప్రియాంక ప్రవర్తన నచ్చనప్పుడు దాన్ని నేను షేర్ చేసుకుంటాను. కానీ నేనెప్పుడూ ఆమె మంచి కోరేవాడినే! కానీ నా ఇంటెన్షన్ మాత్రం అది కాదు మొదట్లో షణ్ముఖ్‌తో, తర్వాత రవితో, ఇప్పుడు సన్నీ, మానస్‌తో ఫ్రెండ్‌లా ఉంటున్నారు. మీరు కేవలం ఆటలో ముందుకు వెళ్లడానికి ఇలా ఫ్రెండ్లీగా ఉంటున్నారా? కాజల్: మొదట్లో షణ్ను నచ్చాడు, కనెక్ట్ అయ్యాను. కానీ కొన్ని సంభాషణల వల్ల మా మధ్య దూరం పెరిగింది. రవితో ఫ్రెండ్లీ కనెక్ట్ రాలేదు. మానస్, సన్నీలతో కనెక్ట్ అయ్యాను. ఆట కోసం ఈ కనెక్షన్స్ పెట్టుకోలేదు ఆడియన్స్‌కు ఇవెలా నచ్చుతాయి? అవెలా నచ్చుతాయని ఆడియన్స్‌ను ఎందుకు జడ్జ్ చేస్తున్నారు? వారిపై ఫన్ ఎందుకు చేస్తున్నారు? అన్న ప్రశ్నకు షణ్ముఖ్ తానైతే ప్రేక్షకుల మీద ఫన్ చేయట్లేదని సమాధానమిచ్చాడు. మొదటి నుంచీ గ్రూప్‌లోనే ఆడుతున్నా మిమ్మిల్ని మీరు లోన్ రేంజర్లా ప్రొక్లైం చేసుకున్నారు. ఎవిక్షన్ ఫ్రీ పాస్‌లో మీరు, రవి ఇద్దరూ ఇద్దరి ఫొటోలు కాల్చేయలానుకున్నారు. కానీ కాజల్ ఆ పని చేస్తే మాత్రం ఆగ్రహించారు? అని ఓ నెటిజన్ ప్రశ్నించగా అందరితో కలిసుండాలనుకున్నా, కలిసి ఆడాలనుకున్నానంటూ సింపుల్‌గా తేల్చేశాడు. గేమ్ ఎథికల్‌గా ఆడకపోతే కోపమొస్తుందని తెలిపాడు. మొత్తానికి ఈ ప్రశ్నోత్తరాల టాస్కులో ఎలాంటి ముసుగు లేకుండా అడిగిన అన్ని ప్రశ్నలకు జవాబిచ్చింది సిరి, సన్నీ అని హౌస్మేట్స్ అభిప్రాయపడ్డారు. ఓట్లు అడిగే అవకాశాన్ని సన్నీ కోసం సిరి జాడవిరుచుకుంది. దీంతో సన్నీ వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ.. 'నేను అగ్రెసివ్ కాదు, టాస్కుల్లో 100 % ఇస్తున్నాను. నాకోసం కప్పు గెలుచుకురారా అని అమ్మ నన్ను ఒక కోరిక కోరింది. అది నెరవేర్చలేకపోతే బాధపడతాను. నాకీ అవకాశమిచ్చిన సిరికి సపోర్ట్ చేయండి. ప్లీజ్ వోట్ ఫర్ మీ..' అని కోరాడు. -
ఎమోషనల్ కనెక్షన్, లైట్ తీస్కోమన్న శ్రీరామ్.. ఏడ్చేసిన కాజల్
Bigg Boss 5 Telugu, Episode 96: కంటెస్టెంట్లు ప్రేక్షకులను నేరుగా ఓట్లు అడిగేందుకు బిగ్‌బాస్ అవకాశాన్ని కల్పించిన విషయం తెలిసిందే. బిగ్‌బాస్ ఇచ్చే టాస్కుల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచినవారికి ఓట్లు వేయమని అడిగేందుకు ఛాన్స్ ఇస్తారు. ఈ క్రమంలో నిన్నటి ఎపిసోడ్లో కొన్ని ముఖ్యమైన సంఘటనలను రీక్రియేట్ చేసే టాస్కులో షణ్ను గెలిచి ఓట్లు వేయమని అభ్యర్థించే అవకాశాన్ని గెలుపొందాడు. అలాగే నవ్వకుండా ఉండాల్సిన టాస్కులో శ్రీరామ్, మానస్ ఇద్దరూ గెలిచినట్లు నేటి(డిసెంబర్ 9) ఎపిసోడ్లో వెల్లడైంది. ఇద్దరికీ టై అవడంతో శ్రీరామ్ మానస్‌కు ఛాన్స్ ఇచ్చాడు. అలా మానస్ మైకు ముందుకు వచ్చి.. తనకు ఓట్లేయండంటూనే తన ఫ్రెండ్స్ కాజల్, సన్నీకి కూడా ఓట్లేసి గెలిపించమని కోరుకున్నాడు. హౌస్‌లో శ్రీరామ్, కాజల్‌కు మరోసారి గొడవ జరిగింది. తిట్టుకుంటున్న క్రమంలోనే కాజల్ అతడిని బ్రో అనేసింది. అది నచ్చని శ్రీరామ్.. నువ్వు నాకు సిస్టర్ కాదు, బ్రో అని పిలవకు అని ముఖం మీదే చెప్పాడు. దీంతో హర్టైన కాజల్ బోరుమని ఏడ్చేసింది. ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాను, అతడు అలా పిలవద్దనేసరికి తట్టుకోలేకపోయానంటూ తన బాధను సన్నీ, మానస్‌లకు చెప్పింది. అటు నుంచి కనెక్షన్ లేనప్పుడు నిన్ను లైట్ తీసుకున్నప్పుడు ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దంటూ హితవు పలికాడు సన్నీ. ఇక వోట్ అప్పీల్ టాస్క్‌లో భాగంగా బిగ్‌బాస్ మూడో అవకాశం ఇచ్చాడు. ఇంటిసభ్యులందరూ సూపర్ స్టార్స్‌లా నటించాల్సి ఉంటుందన్నాడు. అందులో భాగంగా సన్నీ.. బాలయ్య, శ్రీరామ్.. చిరంజీవి, కాజల్.. శ్రీదేవి, మానస్.. పవన్ కల్యాణ్, షణ్ను.. సూర్య, సిరి.. జెనీలియాగా నటించారు. ప్రతి ఒక్కరూ వారివారి పాత్రల్లో జీవించేశారు. క్లాస్, మాస్ పాటలకు స్టెప్పులు కూడా ఇరగదీశారు. ఈ టాస్క్ వల్ల హౌస్మేట్స్ అంతా కలిసిపోయారు. ఇంతలో షణ్ను సిరికి మధ్య మరోసారి తగవు మొదలైంది. నువ్వు వాళ్లతో(సన్నీ గ్రూప్‌తో) అయితే హ్యాపీగా ఉంటావు, వెళ్లు, నీతో నేను సింక్ అవ్వట్లేదు అని సిరికి ముఖం మీదే చెప్పాడు షణ్ను. ఎప్పుడూ లేనిది ఈ వారమే నీకు ప్రాబ్లం అవుతుంది కదా అంటూ సిరి అసహనం వ్యక్తం చేసింది. కాసేపటికే నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటూ షణ్ను కోపాన్ని కరిగించింది. అతడు నవ్వేయగానే మన ఫ్రెండ్షిప్ అంటే చాలా ఇష్టమంటూ వెళ్లి అతడిని హత్తుకుంది. అలా వీళ్ల గొడవ చప్పున చల్లారిపోయింది. కానీ రేపటి ఎపిసోడ్లో కూడా వీళ్లు మళ్లీ గొడవపడుతున్నట్లు తెలుస్తోంది. -
అతడే బిగ్‌బాస్ 5 విన్నర్, వాళ్లే టాప్‌లో ఉంటారు
Syed Sohel Ryan Predicted About Bigg Boss 5 Telugu Winner: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ విన్నర్ ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే రెండు వారాలు ఆగాల్సి ఉంది. కానీ విన్నర్‌గా ఎవరు నిలుస్తారనేది ముందుగానే జోస్యం చెప్తున్నాడు సోహైల్. బిగ్‌బాస్ నాల్గో సీజన్లో టాప్ 5 కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచిన సోహైల్ ఈ సీజన్‌పై మాట్లాడటానికి చాలావరకు తటపటాయించాడు. బిగ్‌బాస్ ద్వారా వచ్చిన ఫేమ్‌తో ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి వస్తున్నాడు. ఇలాంటి సమయంలో ఒకరికి సపోర్ట్ చేసి మిగతావారి ఫ్యాన్స్ నుంచి విమర్శలు మూటగట్టుకోవడం ఎందుకని ఎవరికీ మద్దతు పలకకుండా వెనకడుగు వేశాడు. కానీ హౌస్‌లో ఉన్న సన్నీని చూసి తనను తాను చూసుకున్నట్లు ఉందంటూ మురిసిపోయాడు సోహైల్. ఆ మధ్య సన్నీ విన్నర్ అవుతాడంటూ ఏకంగా పోస్ట్ కూడా పెట్టాడు. సన్నీతో పాటు కాజల్, మానస్ కూడా ఫినాలేలో ఉంటారని ఆ పోస్ట్‌లో పేర్కొన్నాడు. కానీ మిగతా కంటెస్టెంట్ల ఫ్యాన్స్ తన మీద యుద్ధానికి రావడంతో ఆ పోస్ట్‌నే డిలీట్ చేశాడు. అప్పటినుంచి ఈ షో గురించి మాట్లాడాలంటేనే జంకుతున్నాడు. తాజాగా ఇదే విషయం గురించి మాట్లాడుతూ.. 'ఎవరికి సపోర్ట్ చేసినా.. మావాడు ఏం చేశిండు? మా పిల్ల ఏం చేసింది? అని నన్ను వేసుకుంటున్నారు. కాజల్, మానస్, సన్నీ టాప్‌లో ఉంటారనిపిస్తుందని పోస్ట్ పెట్టా.. మా వాళ్లు ఎటు పోతారంటూ అందరూ నన్ను గట్టిగా వేసుకున్నారు. ఇప్పుడిప్పుడే సినిమాలు స్టార్ట్ చేస్తున్నా. ఇదంతా ఎందుకులే అని భయం వేసింది. పోస్ట్ డిలీట్ చేశా. ఈ వారమైతే సిరి, కాజల్ డేంజర్ జోన్లో ఉన్నాడు. నాకు నచ్చిన కంటెస్టెంట్లు శ్రీరామ్, సన్నీ. వీళ్లిద్దరిలో ఒకరు టైటిల్ గెలుస్తారు' అని సోహైల్ జోస్యం పలికాడు. -
మీ అమ్మ హగ్గుల గురించి మాట్లాడింది.. వెళ్లిపో, నా నెత్తి మీద ఎక్కకు
Bigg Boss 5 Telugu: షోలో బాగా హైలైట్ అయిన సంఘటనలను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు బిగ్‌బాస్. ఈ ఐకానిక్ సంఘటనలలో ఒకరి రోల్ మరొకరు ప్లే చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రియాంక సింగ్, యానీ మాస్టర్‌గా మానస్; షణ్ముఖ్గా సన్నీ; లోబో, కాజల్‌గా శ్రీరామ్; సన్నీగా సిరి.. ఇలా ప్రతి ఒక్కరు సమయానుసారంగా ఆయా పాత్రల్లో దూరిపోయి తెగ నవ్వించారు. తాజాగా సన్నీ హమీదాలా మారిపోయాడు. హమీదా పాత్రలో పరకాయ ప్రవేశం చేసిన సన్నీ శ్రీరామ్ సరసన వాలిపోయాడు. మరోపక్క షణ్ను సిరితో మళ్లీ గొడవపడ్డాడు. 'నువ్వు ఎవరితోనైనా ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతే నేను ఆపాను, నిన్నెవడో అప్పడం అంటే నీకోసం వాదించాను, మీ అమ్మ వచ్చి అందరి ముందు హగ్గుల గురించి మాట్లాడింది.. నేను నెగెటివ్ అవట్లేదు కానీ నేను నెగెటివ్‌గా ఆలోచిస్తున్నాను?! అవతలవాళ్ల ముందు నేను తక్కువైనా పర్లేదు కానీ నీ గురించి ఫైట్ చేస్తున్నాను.. అప్పుడూ నేను నెగెటివ్ అవలేదు? వెళ్లిపో, మిగతా హౌస్మేట్స్ ఎలాగో నువ్వూ అంతే, నా నెత్తి మీద ఎక్కకు.. వెళ్లిపో' అని తెగేసి చెప్పాడు షణ్ను. షణ్ను ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి చూస్తూ అన్నీ తప్పుగా ఊహించుకుంటూ సిరికి చుక్కలు చూపిస్తున్నాడని ఫైర్ అవుతున్నారు నెటిజన్లు. ఫినాలే దగ్గరపడుతున్న సమయంలో ఇలా ప్రవర్తిస్తున్నాడేంటని ముక్కున వేలేసుకుంటున్నారు. -
Bigg Boss-5: సన్నీ అరాచకం.. హగ్‌లతో ‘అప్పడం’.. షణ్ముఖ్ పరువు తీశాడుగా!
Bigg Boss 5 Telugu, Episode 94: ఇంటి సభ్యులకు సూపర్ లగ్జరీ ఐటమ్స్ ఇచ్చేందుకు చిన్నపాటి టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. లగ్జరీ ఐటమ్ పొందాలంటే ముందుగా గుజాబ్ జామ్ టాస్క్ గెలవాలని కండీషన్ పెట్టారు. చేతులు ఉపయోగించకుండా ఎవరైతే ఎక్కువగా గులాబ్ జామ్‌లు తింటారో వారే టాస్క్ విజేతలుగా నిలిచి, లగ్జరీ ఐటమ్ పొందుతారు. ఈ టాస్క్‌లో సిరి గెలిచి ఫ్రైడ్ చికెన్ ఐటమ్ పొందింది. ‘అప్పడం’ చేసేసిన సన్నీ ప్రేక్షకులకు నచ్చిన ఐకానిక్ సంఘటనల్ని ఒకరి రోల్ మరొకరు ప్లే చేయాల్సి ఉంటుందని చెప్పారు బిగ్‌బాస్. ఎవరైతే బెస్ట్ పెర్ఫామెన్స్ ఇస్తారో వాళ్లకి గార్డెన్ ఏరియాలో స్పెషల్‌గా ఏర్పాటు చేసిన ఓటింగ్ బూత్ నుంచి ఆడియన్స్‌కి ఓటింగ్ అప్పీల్ చేసుకునే అవకాశం ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. దీనిలో భాగంగా సన్నీ-సిరిల మధ్య జరిగిన ‘అప్పడం’వివాదాన్ని ఇమిటేట్ చేసి చూపించాలని ఇంటి సభ్యులను ఆదేశించాడు. ఈ టాస్క్‌లో సన్నీలా సిరి, సిరిలా షణ్ముఖ్, షణ్ముఖ్‌లా సన్నీ, కాజల్‌లా శ్రీరామ్.. యానీ మాస్టర్లా మానస్, రవిలా కాజల్ వారి వారి పాత్రల్లో అద్భుత నటనను ప్రదర్శించారు. ముఖ్యంగా షణ్ముఖ్ పాత్ర చేసిన సన్నీ అయితే... తనదైన యాక్టింగ్‌తో తెగ నవ్వించేశాడు. సద్దుదొరికితే చాలు... సిరి పాత్రలో ఉన్న షణ్ముఖ్‌ని గట్టిగా చేసుకుంటూ.. ఆంటీ ఇది ఫ్రెండ్ షిప్ హగ్ అంటూ రోజూ షణ్ముఖ్-సిరిలు ఎలాగైతే చేస్తారో అలా చేసి నవ్వులు పూయించాడు. సన్నీ వేసే పంచులకు షణ్ముఖ్ బిత్తరపోయాడు. తనను మాములుగా ఇమిటేట్ చేస్తేనే భరించలేని షన్నూ.. సన్నీ ఫెర్ఫామెన్స్‌ని తట్టుకోలేక పాత్ర నుంచి బయటకు వచ్చి.. ఇదే వేరే విధంగా వెళ్తుంది.. నువ్ బాగా ఓవర్ చేస్తున్నావ్ అని స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో సన్నీ కొంచెం తగ్గాడు. మొత్తానికి ఈ అప్పడం టాస్క్‌లో అయితే సన్నీ కొంచెం అతిగా రెచ్చిపోయి... షణ్ముఖ్, సిరిల పరువు తీశాడనే చెప్పాలి. అయితే ఇది సన్నీ కేవలం నవ్వించడానికే చేశాడు తప్ప కావాలని చేసినట్లయితే కనిపించదు. టాస్క్ అయిపోయిన తరువాత.. సన్నీ దగ్గరకు వచ్చిన షణ్ముఖ్.. నువ్ చాలా వెకిలి చేష్టలు చేశావ్.. ఇమిటేట్ చేస్తే నాకు అస్సలు నచ్చదు.. ఇమిటేషన్ వేరు.. వెకిలివేరు.. నువ్ చేసినట్టుగా ఎదుటివాళ్లు నీ గురించి చేస్తే బాధ తెలుస్తుంది.. నెక్స్ట్ టైం ఇలా చేయొద్దు అని చెప్పడంతో సన్నీ వివరణ ఇచ్చేకున్నాడు. నేను కామెడీగానే చేశాను.. క్యారెక్టర్లో ఉన్నాను.. కాజల్‌ని కూడా తిట్టాను కదా.. నెక్స్ట్ టైం అలా చేయను అంటూ వచ్చి షణ్ముఖ్‌ని హగ్ చేసుకున్నాడు సన్నీ. పక్కనే ఉన్న సిరి.. సర్లే అయిపోయిందిగా వదిలేయండి అని చెప్పడంతో షణ్ముఖ్ కూల్ అయిపోయాడు. కాజల్‌పై మానస్ ఫైర్ ఇక ఈ రెండో టాస్క్‌గా మానస్-ప్రియాంకల ప్రయాణాన్ని ఇమిటేట్ చేసి చూపించాలని చెప్పాడు బిగ్‌బాస్. దీంతో సన్నీ ప్రియాంకలా మారగ, కాజల్ మానస్‌లా మారిపోయింది. శ్రీరామ్‌లా సిరి, జెస్సీలా షణ్ముఖ్, సిరిలా శ్రీరామ్ మారిపోయారు. అయితే ఈ టాస్క్ కోసం సన్నీ రెడీ అవుతున్న క్రమంలో కాజల్, మానస్‌ల మధ్య గొడవ జరిగింది. పింకీకి 100 సార్లు ఐలవ్యూ చెబుతానని కాజల్ కామెడీగా అన్నప్పటికీ.. మానస్ సీరియస్‌గా తీసుకున్నాడు. గబ్బు చేస్తే బాగుండదని మానస్ ముందే హెచ్చరించగా.. ఎట్ల అనిపిస్తే అట్ల చేస్తామని సన్నీ తేలిగ్గా తీసిపాడేశాడు. ఎంటర్టైనింగ్ చేస్తున్నామని కాజల్ చెప్పబోగా.. ‘ఎంటర్టైనింగ్గా చేస్తే చేయ్.. కానీ 100సార్లు ఐ లవ్యూ అని ఎవడు చెప్పాడు?’అని కాజల్‌పై మానస్ సీరియస్ అయ్యాడు. దీంతో బాగా హర్ట్ అయిన కాజల్.. మానస్ క్యారెక్టర్ చేయనని చెప్పింది. సన్నీ సర్దిచెప్పే ప్రయత్నం చేసినా.. కాజల్ వినలేదు. దీంతో సన్నీ మానస్‌ని పింకీ క్యారెక్టర్ చేయమని కోరగా.. దానికి మానస్ ఓకే చెప్పేశాడు. పింకీగా మానస్.. మళ్లీ సన్నీ అదరగొట్టేశాడుగా పింకీగా మానస్ , మానస్‌గా సన్నీ.. ఇద్దరు తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ముఖ్యంగా మానస్ అయితే.. అచ్చం ప్రియాంకలా ప్రవర్తిస్తూ ఆమెపై తనకు ఉన్న ప్రేమనంతా తీర్చుకున్నాడు. మానస్ పాత్రలో ఉన్న సన్నీతో మసాజ్ కూడా చేయించుకున్నాడు. మరోవైపు షణ్ముఖ్ జెస్సీలా మారి.. సిరిని ఓ రేంజ్లో ఆటపట్టించాడు. జెస్సీలా మాట్లాడుతూ.. సిరి ఓ ముద్దు అడిగాడు. దీంతో సిరిగా మారిన శ్రీరామ్ చేతులు అడ్డుపెట్టి షన్నూకు లిప్‌లాక్ ఇచ్చాడు. ఇక చివరగా.. మానస్ నుంచి పింకీ ఎలాంటి ప్రేమను ఆశించిందో అది చేసి చూపించాడు సన్నీ. పింకీ పాత్రలో ఉన్న మానస్ దగ్గరు వెళ్లి.. నా ప్రేమ, మన ఫ్రెండ్షిప్ ఎప్పటికీ ఇలానే కొనసాగుతుంది పింకీ అని భరోసా ఇచ్చాడు. ఇది చూసి కాజల్ కనీళ్లు పెట్టుకుంది. తమ తమ క్యారెక్టర్ల నుంచి బయటకు వచ్చి ముగ్గురు గట్టిగా హగ్ చేసుకున్నారు. మొత్తనానికి మంగళవారం ఎపిసోడ్లో సన్నీ తన ఆట తీరుతో అందరిని మెప్పించాడనే చెప్పాలి. -
సిరి - సన్నీకి లింకు, భరించలేకపోయిన షణ్ను
Bigg Boss 5 Telugu 14th Week Nominations, Episode 93: కాజల్‌కు మరీ ఎక్కువ అటాచ్ అవద్దని సిరికి సూచించాడు షణ్ను. ఆ వెంటనే ఫ్రెండ్షిప్ హగ్ అంటూ ఒకరికొకరు హగ్గిచ్చుకున్నారు. రాత్రవగానే కాజల్ సన్నీకి, సిరి షణ్నుకు దిష్టి తీశారు. మరోవైపు ప్రియాంక వెళ్లిపోయిన బాధతో మానస్ ఒంటరిగా కూర్చుంటే కాజల్, సన్నీ వెళ్లి అతడిని ఏడిపించారు. ప్రియాంక కోసం పాడిన లవ్ సాంగ్‌ను పాడుతూ మానస్‌ను టీజ్ చేశారు. మాది ఫ్రెండ్షిప్రా, లవ్ కాదురా అని మానస్ మొత్తుకున్నప్పటికీ వాళ్లు వినిపించుకోలేదు. ఆ తర్వాత మానస్, కాజల్... సన్నీ, సిరి ఇద్దరికీ లింకు పెడుతూ జోక్ చేశారు. సిరి కనబడగానే నీ ఆలియాభట్ వస్తుందంటూ కామెంట్లు చేశారు. కానీ దీన్ని సరదాగా తీసుకోలేకపోయిన షణ్ను సిరిపై అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. మీ ఇద్దరి మధ్య ట్రాక్ క్రియేట్ చేయాలని చూస్తున్నారని, నువ్వు జాగ్రత్తపడకపోతే నీ క్యారెక్టర్ బ్యాడ్ అవుతుందని హెచ్చరించాడు. వాళ్లు సరదాగా అన్నార్లే అని సిరి లైట్ తీసుకోవడంతో మరింత ఉడికెత్తిపోయిన షణ్ను ఇది చెప్పడం వల్ల నాకు ఒరిగేదేమీ లేదంటూ విసురుగా వెళ్లిపోయాడు. దీంతో సిరి ఏడ్చేసింది. తర్వాతి రోజు ఉదయం సన్నీ నటించిన సకలగుణాభిరామ సినిమాలోని సైకో సైకో పిల్లా సాంగ్ ప్లే చేయడంతో అతడు ఆనందంతో ఎగిరి గంతేశాడు. అటు షణ్ను మాత్రం మళ్లీ.. ఈ హౌస్‌లో ఎందుకున్నాను అంటూ తనలో తానే సణుక్కున్నాడు. 'నేను మోస్ట్ బోరింగ్ పర్సన్‌ను. ఇన్నివారాలు ఎలా ఉన్నానా? అనిపిస్తుంది. ప్రతిసారి నేను ఓడిపోతూనే ఉన్నాను. కానీ నేను ఒంటరిగా పోరాడుతున్నాను, నా క్యారెక్టర్ ఇంతే.. మొదటి రోజు నుంచి ఇప్పటివరకు నువ్వెక్కడా నాకు సాయం చేసినట్లు అనిపించలేదు బిగ్‌బాస్' అని కెమెరాలతో తన గోడు చెప్పుకున్నాడు. ఆ తర్వాత సిరి దగ్గరకెళ్లి మనిద్దరం దూరం కావాలని వాళ్లు ప్లాన్లు చేస్తున్నారని షణ్ను అభిప్రాయపడ్డాడు. సన్నీతో గొడవ పెట్టుకున్న ప్రియ, రవి అందరూ వెళ్లిపోయారని కాజల్ ఆలోచిస్తుంది. ఆమె నెక్స్ట్ నీ దగ్గరకే వస్తుందంటూ సిరిని హెచ్చరించాడు. నిన్ను నా నుంచి దూరం పెట్టాలని చూస్తున్నారు అని అభిప్రాయపడ్డాడు. అనంతరం బిగ్‌బాస్ 1 నుంచి 6 ర్యాంకుల వరకు మీ స్థానాలకు నిర్ణయించుకోవాలని ఇంటిసభ్యులను ఆదేశించాడు. దీంతో అందరూ ఏయే స్థానాల్లో నిలబడాలో ఒక్కొక్కరిగా వారి అభిప్రాయాలను చెప్పుకొచ్చారు. ముందుగా షణ్ను మాట్లాడుతూ.. ఫస్ట్ ప్లేస్‌లో నేను, సెకండ్ ప్లేస్‌లో శ్రీరామ్, మూడో స్థానంలో సన్నీ, నాల్గో స్థానంలో సిరి, ఐదారు స్థానాల్లో మానస్, కాజల్ ఉంటారన్నాడు. కాజల్ మాట్లాడుతూ.. నేను 1, సన్నీ 2, మానస్ 3, శ్రీరామచంద్ర 4, సిరి 5, షణ్ముఖ్ 6 స్థానాల్లో ఉండాలని అభిప్రాయపడింది. మానస్ మాట్లాడుతూ.. సన్నీ 1, కాజల్ 2, షణ్ముఖ్ 3, శ్రీరామచంద్ర 4, సిరి 5 స్థానాల్లో ఉండాలన్నాడు. శ్రీరామచంద్ర మాట్లాడుతూ.. షణ్ముఖ్, సిరి 2, సన్నీ 3, కాజల్ 4, మానస్ 5వ ర్యాంకులో ఉండాలన్నాడు. ఫస్ట్ స్థానం ఆ దేవుడే నిర్ణయిస్తాడన్నాడు. తర్వాత సన్నీ వంతు రాగా.. కాజల్ 1, మానస్ 2, సిరి 3, శ్రీరామచంద్ర, షణ్ముఖ్ 4, నేను 5వ స్థానంలో ఉంటానన్నాడు. అనంతరం సిరి మాట్లాడుతూ.. బిగ్‌బాస్ హౌస్‌కు అన్‌ఫిట్ అనుకున్నాను, కానీ ఆ అభిప్రాయాన్ని షణ్ను మార్చాడు కాబట్టి అతడిని ఫస్ట్ ర్యాంక్‌లో చూడాలనుంది. వాడి పక్కనే రెండో ర్యాంక్‌లో నేను ఉండాలనుకుంటున్నాను. సన్నీ 3, శ్రీరామ్ 4, మానస్, కాజల్ 5 ర్యాంకుల్లో ఉంటారు అని చెప్పుకొచ్చింది. అందరూ అభిప్రాయాలు చెప్పడం పూర్తయ్యాక.. సన్నీ 1, షణ్ను 2, కాజల్ 3, శ్రీరామ్ 4, మానస్ 5, సిరి 6 స్థానాల్లో నిలబడ్డారు. అనంతరం బిగ్‌బాస్ శ్రీరామ్ మినహా మిగతా ఇంటిసభ్యులందరూ 14వ ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి నామినేట్ అయ్యారని ప్రకటించాడు. ర్యాంకుల టాస్కులో తన అభిప్రాయాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుని షణ్ను ఆరవ స్థానంలో నిలబడటాన్ని సహించలేకపోయింది కాజల్. ఇదంతా కావాలనే చేశాడని ఫీలైంది. అలా షణ్ను-కాజల్ మధ్య మరోసారి ఫైట్ నడిచింది. దీంతో కాజల్ చాలా యాటిట్యూడ్ చూపిస్తుందన్నాడు షణ్ను. అది ఓవర్ కాన్ఫిడెన్స్ అంది సెటైర్ వేసిం సిరి. ఏదేమైనా ఈ వారం ఎలిమినేషన్‌తో టాప్ 5లో ఎవరుంటారనేది తేలిపోనుంది! -
సన్నీని అల్లుడని ఫిక్సయ్యా, కానీ నా కూతురు చెడగొట్టింది!
Bigg Boss Telugu 5, Uma Devi About VJ Sunny: కార్తీకదీపం ఫేమ్ పావుశేరు భాగ్యం బిగ్‌బాస్ షోను రఫ్ఫాడించిన సంగతి తెలిసిందే! మంచితనానికి మంచిగా ఉంటూనే తేడా వస్తే తిట్లదండకం అందుకునే ఉమాదేవి అంటే హౌస్‌లో అందరూ బెంబేలెత్తిపోయేవారు. ఆమెతో ఎందుకు గొడవ పెట్టుకోవడంలే అని దూరందూరంగానే ఉండేవారు. అలా అందరితో తగాదాలు పెట్టుకుని ఉమాదేవి రెండోవారంలోనే హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. అప్పటినుంచి ఆమె సన్నీకి సపోర్ట్ చేస్తూ వస్తోంది. అయితే ఈ షోకు రాకముందే అతడితో కలిసి సీరియల్లో నటించిన ఉమాదేవి ఒకానొక సమయంలో సన్నీని ఇంటి అల్లుడిగా చేసుకోవాలనుకున్నానని చెప్తూ అందరికీ షాకిచ్చింది. తాజాగా ఇదే విషయం గురించి సాక్షి ఎంటర్టైన్మెంట్ ఛానల్‌తో మాట్లాడింది. 'కళ్యాణ వైభోగమే సీరియల్ మొదలు పెట్టినప్పుడు సన్నీ హీరో అని చెప్పారు. సన్నీ ఎవరు? అని అడిగితే నా పెద్ద కూతురు వీజే అని చెప్పింది. అప్పటికే అతడికి చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. నేను వెళ్లి అతడితో మాట్లాడాను. అబ్బాయి బాగున్నాడు, పెద్దమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయొచ్చు అని మనసులో అనుకున్నాను. కానీ అంతలోనే మా పెద్దమ్మాయి వచ్చి సన్నీ అన్న అంది. ఆరోజు నుంచి సన్నీ నా కూతుళ్లను చెల్లెలుగా, వీళ్లు అతడిని అన్నగా ఫిక్సయిపోయారు. అలా అత్త అవ్వాల్సినదాన్ని సన్నీకి పిన్నీనైపోయాను. నా కూతురు అతడిని అన్న అని పిలవకపోతే సీన్ ఇంకోలా ఉండేది' అని చెప్పుకొచ్చింది ఉమాదేవి. -
సన్నీ నెంబర్ 1, షణ్ముఖ్ ర్యాంక్ ఎంతంటే?
Bigg Boss 5 Telugu Promo: అసలు ఆట ఇప్పుడే మొదలవుతుందంటూ బిగ్‌బాస్ ఓ ఇంట్రస్టింగ్ టాస్క్ ఇచ్చాడు. ఒకటి నుంచి ఆరు వరకు ఎవరెవరు ఏయే ర్యాంకుల్లో ఉండాలో నిర్ణయించుకుని వాటి వెనకాల నిల్చుండాలని ఆదేశించాడు. దీంతో షణ్ముఖ్, సన్నీ, కాజల్, సిరి ఫస్ట్ ర్యాంకు నాకు కావాలంటే నాకు కావాలని పోటీపడ్డారు. మరీ ముఖ్యంగా కాజల్ మాత్రం మొదటి స్థానంలో నిల్చుండాలని తహతహలాడింది. అయితే సన్నీ అందుకు ఒప్పుకోలేదు. అతిగా ఆశపడే ఆడది అతిగా ఆవేశపడే మగాడు సుఖపడినట్లు చరిత్రలో లేదంటూ డైలాగులు వల్లించాడు. అయితే మొత్తానికి సన్నీ ఫస్ట్ ప్లేస్‌లో నిల్చున్నట్లు సమాచారం. రెండో స్థానంలో షణ్ముఖ్, మూడో స్థానంలో కాజల్, నాలుగో ప్లేస్‌లో శ్రీరామ్, ఐదో స్థానంలో మానస్, ఆరో ర్యాంక్ వద్ద సిరి నిలబడ్డారట! అంటే హౌస్మేట్స్ అభిప్రాయం మేరకు సిరి వచ్చే వారం వెళ్లిపోతే మిగతా ఐదుగురు ఫినాలేలో అడుగుపెడతారన్నమాట! ఇంటిసభ్యులు సన్నీని విన్నర్‌గా, షణ్ముఖ్‌ను రన్నర్‌గా తేల్చారు. కానీ వీళ్లమధ్య గట్టి పోటీ నడుస్తుండటంతో ఈ ఇద్దరిలో ఎవరు విజేత అని ఇప్పుడే చెప్పడం కష్టంగా మారింది. -
సన్నీతో సారీ చెప్పించిన నాగ్, సిరిపై సెటైర్లు
Bigg Boss 5 Telugu Promo: బిగ్‌బాస్ ప్రియులు పొద్దుటి నుంచి ప్రోమో కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. వారి సహనానికి పరీక్ష పెట్టిన బిగ్‌బాస్ టీం ఎట్టకేలకు ప్రోమో వదిలింది. ఇందులో కింగ్ నాగార్జున కంటెస్టెంట్ల దగ్గర నుంచి ఫిర్యాదులు తీసుకున్నాడు. సిరి.. తనను తిడుతున్నాడని షణ్ముఖ్ మీద ఫిర్యాదు చేసింది. కాజల్.. నా మీద అరిచేస్తున్నాడంటూ సన్నీపై కంప్లైంట్ ఇచ్చింది. దీంతో నాగ్.. సన్నీతో ఆమెకు సారీ చెప్పించాడు. సిరి హెలికాప్టర్ సౌండ్‌ను కనిపెట్టలేకపోయిన విషయాన్ని నాగ్ ప్రస్తావిస్తూ ఆమెపై సెటైర్లు వేశాడు. మీ ఊర్లో ట్రాక్టర్ సౌండ్ అలాగే వస్తుందా? అని కౌంటరిచ్చాడు. మరోపక్క శ్రీరామ్ సేఫ్ అయితేనే అతడికి ఫస్ట్ ఫైనలిస్టు ట్రోఫీ దక్కుతుందన్నాడు నాగ్. ఎలాగో శ్రీరామ్ ఎలిమినేషన్ నుంచి సేఫ్ అన్న విషయం అందరికీ తెలిసిందే. అంటే ఈరోజు శ్రీరామ్ టికెట్ టు ఫినాలేలో గెలిచిన ట్రోఫీని తన సొంతం చేసుకోబోతున్నాడన్న మాట! -
బిగ్‌బాస్: టాప్ 5 కంటెస్టెంట్లు వీళ్లే!
Bigg Boss 5 Telugu, Top 5 Finalists: టికెట్ టు ఫినాలే టాస్క్ ఏమోకానీ సిరి, శ్రీరామ్ ఇప్పటికీ తమంతట తాము నడవలేక నానా అవస్థ పడుతున్నారు. ఎవరో ఒకరు సాయం చేస్తే తప్ప సరిగ్గా నిలబడలేకపోతున్నారు. రెండుమూడురోజులుగా కాళ్లకు కట్లు కట్టుకుని కుర్చీల్లోనే కూర్చుండిపోయారు. అలా అని టికెట్ టు ఫినాలేను గాలికి వదిలేయలేదు. కూర్చుని ఆడే గేమ్స్ స్వయంగా వాళ్లే ఆడారు కానీ ఫిజికల్ టాస్కుల్లో మాత్రం ఇతరుల సాయం తీసుకున్నారు. అలా సిరి రెండుసార్లు షణ్ను హెల్ప్ తీసుకోగా శ్రీరామ్.. షణ్ను, సన్నీ ఇద్దరి సాయం తీసుకున్నాడు. వాళ్లిద్దరి సాయంతో చివరి రౌండ్‌కు చేరుకున్న శ్రీరామ్ ఫైనల్లో మాత్రం అతడే ఆడి టికెట్ టు ఫినాలే గెలిచాడు. అలా ఈ సీజన్లో టాప్ 5లో బెర్త్ కన్ఫార్మ్ చేసుకున్న మొట్టమొదటి కంటెస్టెంట్‌గా చరిత్ర సృష్టించాడు. అయితే శ్రీరామ్‌తో పాటు ఎవరెవరు ఫినాలేలో అడుగు పెడతారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. షణ్ముఖ్, సన్నీ, శ్రీరామ్ టాప్ 3లో ఉంటారని నెటిజన్లు బలంగా అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ శ్రీరామ్‌ను వెనక్కి నెట్టి మానస్ టాప్ 3లో చోటు దక్కించుకునే ఛాన్స్ ఉంది. లేదంటే అతడు నాలుగో స్థానానికి పరిమితమయ్యేట్లు కనిపిస్తోంది. చివరి స్థానంలో లేడీ కంటెస్టెంట్ నిలిచేందుకు ఆస్కారం ఉంది. అయితే ఆ స్థానాన్ని సిరి, కాజల్‌లో ఎవరు దక్కించుకుంటారనేది ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే ఊహించని ఎలిమినేషన్లతో ప్రేక్షకులను అవాక్కయ్యేలా చేస్తున్నాడు బిగ్‌బాస్. ఈ రెండు వారాలు ఎలిమినేషన్‌ను తప్పించుకునే కంటెస్టెంట్ ఫినాలేకు వెళ్తుంది. ఒకవేళ సిరి ఎలిమినేట్ అయితే మాత్రం ఫినాలేలో అడుగుపెట్టాలన్న కాజల్ కోరిక నెరవేరుతుంది. మరోపక్క ఈ వారం పింకీ వెళ్లిపోతుందని అనఫీషియల్ ఓటింగ్స్ చెప్తున్నాయి. ఒకవేళ అది నిజం కాకపోతే కాజల్ బయటకు వచ్చేస్తుందంటున్నారు. ఈ వారం జరగనున్న ఎలిమినేషన్‌తో టాప్ 5లో ఎవరుంటారనేదానిపై ఓ స్పష్టత రానుంది. -
ప్రియాంకకు బిగ్‌బాస్ వార్నింగ్, సొంత వైద్యం అక్కర్లేదని హెచ్చరిక!
Bigg Boss 5 Telugu, Episode 90: వీకెండ్ దగ్గరపడుతుందంటే చాలు హౌస్‌మేట్స్‌లో ఎక్కడలేని భయం తొంగి చూస్తుంది. ఈ వారం నేను లేదా కాజల్ ఎలిమినేట్ అయ్యే చాన్స్ ఉందని ప్రియాంక అభిప్రాయపడింది. కానీ షణ్ను మాత్రం మానస్ కూడా వెళ్లొచ్చేమోనని అనుమానం వ్యక్తం చేశాడు. అనఫీషియల్ పోలింగ్ చూస్తుంటే పింకీ మాటలే నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. ఇక ఇంటిసభ్యులు 'టికెట్ టు ఫినాలే' టాస్క్‌లో ఫోకస్ ఛాలెంజ్ ఎంచుకున్నారు. ఇందులో భాగంగా కొన్ని శబ్ధాలు ప్లే చేయగా వాటిని సరిగ్గా గుర్తించి వరుస క్రమంలో రాసినవాళ్లు మొదటి స్థానంలో నిలుస్తారని బిగ్‌బాస్ ప్రకటించాడు. అయితే కాజల్ పదేపదే మధ్యలో మాట్లాడుతూ పోటీదారులను డిస్టర్బ్ చేయడంతో సన్నీ ఆమెపై ఫైర్ అయ్యాడు. ఇది తర్వాత చిలికి చిలికి గాలివానలా మారింది. ఇక హెలికాప్టర్ సౌండ్‌ను ట్రాక్టర్ అని, గురక శబ్ధాన్ని పులి గాండ్రింపు అని సిరి రాయడంతో అందరూ నవ్వాపుకోలేకపోయారు. షణ్ను అయితే ఈ విషయంలో సిరిని చాలా ఏడిపించాడు. ఈ ఛాలెంజ్‌లో సన్నీ, మానస్ ఎక్కువ పాయింట్లతో మొదటి స్థానంలో నిలవగా శ్రీరామ్, సిరి తర్వాతి స్థానాల్లో నిలిచారు. గేమ్‌లో సన్నీని డిస్టర్బ్ చేసినందుకు కాజల్ పదేపదే సారీ చెప్పింది. అయినప్పటికీ సన్నీ తన మాటలను పట్టించుకోనట్లు నటిస్తూ ఆమెను మరింత ఉడికించాడు. చిర్రెత్తిపోయిన కాజల్.. టిష్యూ పేపర్‌ను ముఖం మీద విసరగా అసహనానికి లోనైన సన్నీ కామన్సెన్స్ లేదని తిట్టాడు. దీంతో కాజల్ దుప్పటి కప్పుకుని ఏడ్చేసింది. టికెట్ టు ఫినాలే టాస్క్‌లో అక్యురెసీ అనే ఐదో ఛాలెంజ్ ఎంచుకున్నారు హౌస్మేట్స్. ఈ టాస్క్‌లో బోర్డుపై ఉన్న బల్బ్స్లో కొన్ని ఆన్, కొన్ని ఆఫ్ చేసి ఉన్నాయి. తక్కువ సమయంలో అన్నింటినీ ఆన్ చేసినవారు ప్రథమస్థానంలో నిలుస్తారు. ఈ గేమ్‌లో ఇప్పటికీ సరిగా నడవలేకపోతున్న సిరి, శ్రీరామ్ ఇద్దరి తరపున షణ్ను ఆడాడు. ఈ ఛాలెంజ్‌లో శ్రీరామ్, సన్నీ, సిరి, మానస్ వరుసగా నాలుగు స్థానాల్లో నిలిచారు. ఈ ఛాలెంజ్‌లన్నీ ముగిసే సమయానికి చివరి రెండు స్థానాల్లో ఉన్న సిరి, సన్నీ రేసు నుంచి తప్పుకోగా మానస్, శ్రీరామ్ ఫినాలే టికెట్ కోసం పోటీపడ్డారు. సిరికి మోషన్స్ అవుతున్నాయంటే ప్రియాంక ఏదో సలహా ఇవ్వడానికి ప్రయత్నించింది. షుగర్ వాటర్ తాగమని, అరటిపండు తినమని తనకు తోచిన సూచనలు ఇచ్చింది. ఇప్పటికే ఆమె చేసిన వైద్యం వల్ల శ్రీరామ్ పూర్తిగా బెడ్‌కే పరిమితమయ్యాడు. ఇప్పుడు కొత్తగా సిరికి వైద్యసలహా ఇవ్వడంతో వెంటనే స్పందించిన బిగ్‌బాస్ నీకోసం కానీ, ఇతర ఇంటిసభ్యుల కోసం కానీ సొంత వైద్యం చేయడం శ్రేయస్కరం కాదని హెచ్చరించాడు. ఈ దెబ్బతో పింకీ తలెక్కడ పెట్టుకోవాలో తెలియక చిన్నబుచ్చుకుంది. ఆఖరి రౌండ్లో శ్రీరామ్, మానస్ పోటీపడగా శ్రీరామ్ విజయం సాధించి ఫినాలేలో అడుగుపెట్టాడు. షణ్ను, సన్నీ ఇద్దరూ తన గెలుపుకు సాయం చేశారని వారికి అభినందనలు తెలిపాడు. ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యానోచ్ అంటూ తెగ సంబరపడిపోయిన శ్రీరామ్‌కు పట్టరాని ఆనందంతో రాత్రంతా నిద్ర కూడా పట్టలేదు. మరోపక్క చివరిదాకా వచ్చి ఓటమిని చవిచూసినందుకు మానస్ దిగులుచెందాడు. ఫినాలే టికెట్ వచ్చినట్లే వచ్చి చేజారిపోయిందని ఎంతగానో బాధపడ్డాడు. -
ఫినాలేలో అడుగుపెట్టిన శ్రీరామ్, సన్నీ గెలిపించాడా?
Bigg Boss 5 Telugu, Ticket To Finale Winner Sreerama Chandra: బిగ్‌బాస్ హౌస్‌లో 'టికెట్ టు ఫినాలే' టాస్క్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటివరకు కొనసాగిన గేమ్‌లో కాజల్, ప్రియాంక సింగ్, షణ్ముఖ్ అవుట్ అవగా సన్నీ, శ్రీరామ్, సిరి, మానస్ టాప్ 5లో బెర్తు దక్కించుకోవడం కోసం పోటీపడుతున్నారు. అయితే సిరి ఫినాలే టికెట్ సొంతం చేసుకుని ఫైనల్లో అడుగు పెట్టిందంటూ సోషల్ మీడియాలో నిన్నటి నుంచి తెగ ప్రచారం జరిగింది. అయితే ఇంకా టాస్క్ పూర్తవలేదని, అది కేవలం ఊహాగానాలేనని పలువురూ పేర్కొన్నారు. కానీ ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే కంటెస్టెంట్ గెలుస్తున్నారంటూ క్లూ ఇచ్చారు. దీంతో సిరి, శ్రీరామ్, సన్నీలలో ఒకరు ఫినాలేకు వెళ్తారని అంతా అనుకుంటున్నారు. ఈ సమయంలో టికెట్ టు ఫినాలే పోటీ ముగిసిందంటూ, విన్నర్ ఎవరో తెలిసిపోయిందంటూ నెట్టింట లీకువీరులు హల్చల్ చేస్తున్నారు. అందరూ అనుకున్నట్లుగా సిరి కాకుండా శ్రీరామ్ గెలిచాడని చెప్తున్నారు. ఇప్పటివరకు వాళ్లు చెప్పినవేవీ నిజం కాకుండా పోలేదు, దీంతో ఈ వార్త నిజమే అయి ఉంటుందంటూ శ్రీరామ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఐస్ క్యూబ్స్‌లో నిలబడాల్సిన టాస్క్‌లో శ్రీరామ్ పాదాలు స్పర్శ కోల్పోయిన విషయం తెలిసిందే కదా! దీంతో ఫిజికల్ టాస్క్‌లో శ్రీరామ్‌కు బదులు సన్నీ ఆడి అతడిని గెలిపించాడు. తన ఆటలో వెనకబడిపోయినా సరే శ్రీరామ్‌ను మాత్రం గేమ్‌లో ముందు వరుసలో ఉంచాడు. అలా అతడు శ్రీరామ్‌ను గెలిపించాడంటూ ఫ్యాన్స్ సన్నీని ఆకాశానికెత్తుతున్నారు. కానీ నేటి ఆటలో శ్రీరామ్ కోసం సన్నీ ఆడాడా? షణ్ను ఆడాడా? అన్నది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. -
సిరి కోసం ఆడుతున్న షణ్ను, ఆమెను గెలిపిస్తాడా?
Bigg Boss Telugu 5 Promo, Ticket To Finale: బిగ్‌బాస్ షో 13వ వారం ముగింపుకు చేరుకుంది. ప్రస్తుతం హౌస్‌లో ఏడుగురు కంటెస్టెంట్లు ఉన్నారు. వీరిలో ఒకరు నేరుగా ఫినాలేకు చేరుకునేందుకు బిగ్‌బాస్ 'టికెట్ టు పినాలే' ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. సన్నీ, మానస్, శ్రీరామ్, సిరి ఈ గేమ్‌లో కొనసాగుతుండగా కాజల్, ప్రియాంక, షణ్ముఖ్ రేసు నుంచి తప్పుకున్నారు. ఏ ఛాలెంజ్ ఎంచుకుంటారు? అన్న ప్రశ్నకు సిరి.. మెమొరీ తప్ప ఏదైనా సరే అని బదులిచ్చింది. మెమొరీ ఎందుకు వద్దంటున్నావని మానస్ ప్రశ్నించగా.. అది నీకుంది, కానీ మాకు లేదు అని ఆన్సరివ్వడంతో అక్కడున్నవారంతా ఘొల్లున నవ్వారు. కాజల్‌తో తిరిగి సైకోలా మారావంటూ మానస్‌తో జోక్ చేశాడు సన్నీ. చివరగా ఫోకస్ అనే ఛాలెంజ్ ఎంపిక చేసుకోగా ఇందులో శబ్ధాల సౌండు వినిపిస్తే దాన్ని వరుసగా బోర్డు మీద రాయాలి. అయితే అందరూ సరిగ్గా రాస్తే సిరి మాత్రం హెలికాప్టర్ సౌండ్‌ను ట్రాక్టర్ అని రాయడం విశేషం. తర్వాత అక్యురసీ ఛాలెంజ్‌లో అన్ని బల్బ్స్ వెలిగేలా స్విచ్ ఆన్ చేయాలి. ఈ గేమ్‌లో షణ్ను సిరి తరపున గేమ్ ఆడినట్లు కనిపిస్తోంది. ఐస్ క్యూబ్స్ టాస్క్ ఎఫెక్ట్ వల్ల ఇప్పటికీ సిరి నడవలేకపోతోంది. దీంతో నిన్నటి గేమ్‌లో సిరి తరపున ఆడి ఆమెను గెలిపించిన షణ్ను తన గేమ్‌లో మాత్రం ఓడిపోయాడు. మరి నేడు కూడా ఆమె కోసం ఆడుతున్న షణ్ను సిరిని గెలిపిస్తాడా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. -
బిగ్‌బాస్ షోలో వార్ వన్‌సైడ్ అయిందంటున్న రాహుల్
Bigg Boss Telugu 5, Rahul Supports Sunny!: బిగ్‌బాస్ షో ముగింపు చేరుకుంటోంది. ఎవరు విన్నర్ అవుతారు? ఎవరు రన్నర్ అవుతారు? అని సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. ఇప్పటివరకు ఈ షోపై స్పందించని సెలబ్రిటీలు కూడా ఇప్పుడిప్పుడే తమ అభిమాన కంటెస్టెంట్లకు మద్దతు తెలుపుతున్నారు. బిగ్‌బాస్ షో తర్వాత కనిపించకుండా పోయిన తమన్నా సింహాద్రి తాజాగా ప్రియాంక సింగ్‌కు సపోర్ట్ చేస్తూ వీడియో రిలీజ్ చేసింది. ప్రియ హౌస్‌లో ఉన్నంతవరకు ఆమెకు మద్దతు తెలిపిన అఖిల్ సార్థక్ ఇప్పుడు శ్రీరామచంద్రకు అండగా నిలిచాడు. షో చూసి ఎంజాయ్ చేస్తున్నా, కానీ ఎవరికీ సపోర్ట్ చేయనన్న బిగ్‌బాస్ మూడో సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఇప్పుడు మాట మార్చాడు. సన్నీకి సపోర్ట్ చేస్తున్నట్లు కనిపిస్తున్నాడు. సన్నీ గేమ్‌కు ఫిదా అయినట్లు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వార్ వన్‌సైడ్ అయిందంటూ హార్ట్ సింబల్ షేర్ చేశాడు. సగటు ప్రేక్షకుడిగా నా అభిప్రాయాన్ని సోషల్ ప్లాట్ఫామ్లో షేర్ చేశాను. నన్ను ఫాలో అయ్యేవారిలో ఏ ఒక్కరిని కూడా నేను ఇన్ఫ్లూయెన్స్ చేయడం లేదు. మీకు నచ్చిన కంటెస్టెంట్‌కు సపోర్ట్ చేయండి. మీ అభిప్రాయాలను నేను గౌరవిస్తాను అని చెప్పుకొచ్చాడు. -
'చూసుకుంటున్నాడు, హగ్గివ్వకపోతే ఎలా?' తల్లిని తలుచుకున్న సిరి
Bigg Boss Telugu 5, Episode 89: టికెట్ టు ఫినాలే టాస్క్‌లో భాగంగా.. 29 నిమిషాలు లెక్కపెట్టాల్సిన ఛాలెంజ్‌లో మానస్ మొదటి స్థానంలో నిలిచాడు. షణ్ముఖ్, సిరి, శ్రీరామ్, ప్రియాంక, కాజల్, సన్నీ వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు. మానస్ సాయం చేసినా సన్నీ ఓడిపోవడంతో హౌస్మేట్స్ అతడిపై కౌంటర్లు వేశారు. మరోపక్క సిరి హగ్గివ్వంటూ షణ్నును అడిగింది. దీంతో అతడు కాస్త తటపటాయిస్తూనే ఫ్రెండ్షిప్హగ్ అని కెమెరాల వంక చూడగా.. నన్ను బాగా చూసుకుంటున్నాడు, మరి హగ్గివ్వకపోతే ఎలా అంటూ అతడిని హత్తుకుంది సిరి. వారి ఫ్రెండ్షిప్ గురించో మరేంటో కానీ.. మా అమ్మకు ఇప్పుడు అర్థమవుతుందని తనలో తానే అనుకుంది సిరి. అయితే వీళ్ల హగ్గులు చూసిన పింకీ.. తనకు కూడా ఓ హగ్గివ్వమని కోరింది కానీ అతడు మాత్రం పట్టించుకోలేదు. అనంతరం షణ్ను, కాజల్ మధ్య మాటల యుద్ధం జరిగింది. నిజంగా నేను తప్పైతే నీకంటే ముందే వెళ్లిపోతా! అని కాజల్‌తో శపథం చేశాడు షణ్ను. నువ్వెప్పుడూ నేను తప్పు అని ప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తావని ఫైర్ అయింది కాజల్. ఈ క్రమంలో షణ్ను నీ బొంద, కామన్సెన్స్ అంటూ కొన్ని అనవసర మాటలు జారాడు. తర్వాతరం హౌస్మేట్స్ స్కిల్ ఛాలెంజ్ స్వీకరించారు. ఇందులో భాగంగా ఏటవాలుగా ఉన్న స్టాండ్‌లో నీళ్లు పోసి అందులోని జార్స్‌లో ఉన్న బాల్స్ కింద పడేలా చేయాలి. ఎవరైతే అన్ని బాల్స్ ముందుగా కిందపడేలా చేస్తారో వారు మొదటి స్థానంలో నిలుస్తారు. ఐస్ టాస్క్ వల్ల ఇప్పటికీ నిలబడి నడవలేకపోతున్న శ్రీరామ్, సిరిల స్థానంలో సన్నీ, షణ్ను ఆడారు. ఇక ఈ గేమ్‌లో మానస్, శ్రీరామ్, సిరి, ప్రియాంక, కాజల్, సన్నీ, షణ్ముఖ్ వరుసగా ఏడు స్థానాల్లో నిలిచారు. మొత్తంగా టికెట్ టు ఫినాలే టాస్క్‌లో మూడు ఛాలెంజ్‌లు పూర్తయ్యే సరికి తక్కువ పాయింట్లు ఉన్న కాజల్, ప్రియాంక రేసు నుంచి తప్పుకున్నట్లు బిగ్‌బాస్ వెల్లడించాడు. సన్నీ, షణ్ముఖ్లిద్దరికీ సమాన పాయింట్లు రావడంతో వీరికి మళ్లీ గేమ్ పెట్టగా ఇందులో సన్నీ గెలిచి తర్వాతి రౌండ్‌కు అర్హత సాధించాడు. షణ్ను రేసు నుంచి వైదొలిగాడు. రేపటి ఎపిసోడ్లో మానస్, సన్నీ, షణ్ను, సిరిలకు చివరి పోటీ పెట్టినట్లు కనిపిస్తోంది. మరి ఈ గేమ్‌లో ఎవరు గెలిచి ఫినాలేలో మొదటగా అడుగు పెడతారో రేపటి ఎపిసోడ్లో చూడాలి! -
టికెట్ టు ఫినాలే రేసులో నుంచి వాళ్లు అవుట్!
Bigg Boss Telugu 5: ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పుడొక లెక్క.. ఎన్ని రోజులు ఉన్నామన్నది కాదు ముఖ్యం.. ఫినాలేలో అడుగుపెట్టామా? లేదా? అన్నది పాయింట్! ఇప్పుడు బిగ్‌బాస్ కంటెస్టెంట్లు కూడా ఫినాలే టికెట్ కోసం రేసు మొదలు పెట్టారు. మరి హౌస్‌లో ఉన్న ఏడుగురిలో ఎవరు టికెట్ సొంతం చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు ఎండురెన్స్, స్పీడ్ టాస్క్‌లు పూర్తవగా ముచ్చటగా మూడో టాస్క్ కూడా ప్రారంభమైనట్లు తాజా ప్రోమోలో కనిపిస్తోంది. స్కిల్ చాలెంజ్‌లో శ్రీరామ్, సిరి మినహా మిగతా అందరూ ఆడినట్లు కనిపించింది. నిన్నటి ఐస్‌క్యూబ్స్ గేమ్ ఫలితం కారణంగా సిరి, శ్రీరామ్ లేచి నిలబడలేని స్థితిలో ఉన్నారు. దీంతో వీరిద్దరి తరపున షణ్ను, సన్నీ గేమ్ ఆడినట్లు సమాచారం! మొత్తానికి మానస్, సన్నీ, సిరి, శ్రీరామ్ ఫైనల్ గేమ్‌కు అర్హత సాధించగా, కాజల్, ప్రియాంక, షణ్ను రేసు నుంచి అవుట్ అయినట్లు వినికిడి! మరి ఆ నలుగురిలో ఎవరు ముందుగా ఫినాలేలో అడుగుపెడతారో చూడాలి! -
ప్రియాంక వల్ల బెడ్‌కే పరిమితమైన శ్రీరామ్!
Bigg Boss Telugu 5, Episode 87: బిగ్‌బాస్ షోలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 'టికెట్ టు ఫినాలే' టాస్క్ మొదటి లెవల్లో ఐస్ వాటర్‌లో కాళ్లు పెట్టి తమ బకెట్లో ఉన్న బంతులు కాపాడుకుంటూనే పక్కవారి బకెట్‌లోని బాల్స్‌ను లేపేయాలి. ఈ గేమ్‌లో సన్నీ, సిరి మధ్య మళ్లీ గొడవ మొదలైంది. నన్ను కావాలనే టార్గెట్ చేసి బ్యాడ్ చేస్తోందంటూ సిరిపై చిర్రుబుర్రులాడాడు సన్నీ. అతడు తన బాల్స్ తీయడానికి కాచుకుని కూర్చుండటంతో ఐస్ వాటర్‌లో నుంచి అడుగు బయట పెట్టలేదు సిరి. ఈ క్రమంలో రవి.. ఐ మిస్ యూ అంటూ సిరి ఏడ్చేయగా, నీకోసం ఆడుతున్నా రవి అంటూ షణ్ముఖ్ గొంతెత్తి అరిచాడు. ఈ చర్యతో మిగతా వాళ్లు ఒక్కసారిగా ఖంగు తిన్నారు. సన్నీ తనను టార్గెట్ చేయడంతో ఐస్ బకెట్లో నుంచి కాళ్లు తీయకుండా అలాగే నిల్చుండిపోయిన సిరికి కాళ్లు పట్టేసుకున్నాయి. దీంతో గేమ్ ముగియగానే మానస్ ఆమెకు సాయం అందించాడు. మరోపక్క బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు మెడికల్ రూమ్‌లోకి వైద్యం అందించారు. సిరి నడవలేని స్థితిలో ఉండటంతో మానస్ ఆమెను ఎత్తుకుని తీసుకురావడాన్ని షణ్ను తట్టుకోలేకపోయాడు. వాళ్ల సాయం ఎందుకు తీసుకున్నావని ప్రశ్నించాడు. ఇలాగైతే నాకు ఫ్రెండ్‌గా ఉండకంటూ ఆవేశంతో ఊగిపోగా సిరి ఏడ్చేసింది. ఐస్ వాటర్ నుంచి బయటకు రాగానే వేడినీళ్లు పోయడం హానికరమని వార్నింగ్ ఇచ్చాడు బిగ్‌బాస్. అదేమీ పట్టించుకోని ప్రియాంక... కాళ్లు తిమ్మిరెక్లిన శ్రీరామ్‌కు అర్ధరాత్రి జండూ భామ్ రాసి కాళ్లపై వేడినీళ్లు పోసి మసాజ్ చేసింది. దీంతో అతడికి వాపు తగ్గడం కాదు కదా నొప్పి మరింత ఎక్కువైంది. దీంతో వెంటనే శ్రీరామ్‌ను మెడికల్ రూమ్‌లోకి పిలిచి మందులు రాసిచ్చారు. ఐస్ వాటర్‌లో నుంచి బయటకు వచ్చాక కాళ్లపై వేడినీళ్లు పోయడం హానికరమని చెప్పినప్పటికీ పింకీ శ్రీరామ్‌కు అలా చేసిందేంటని మానస్, కాజల్ అసహనానికి లోనయ్యారు. అయితే ఇలా జరుగుతుందని ఊహించలేదని పింకీ శ్రీరామ్‌కు క్షమాపణలు చెప్పింది. కానీ ఆమె చేసిన తప్పు వల్ల శ్రీరామ్ బెడ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. ఒక అడుగు కూడా వేయలేకపోతున్న కంటెస్టెంట్ల బాధలు చూసి సన్నీ ఏడ్చేశాడు. తర్వాతి రోజు శ్రీరామ్ పాడిన 'గెలుపు తలుపులే తీసే ఆకాశమే..' సాంగ్ ప్లే చేయడంతో అతడు మనసారా ఏడ్చాడు. ఫైనల్‌గా తొలి రౌండ్లో సన్నీ ఆధిక్యంలో ఉండగా ప్రియాంక సింగ్ చిట్టచివరి స్థానంలో నిలిచింది. తర్వాత ఫోకస్ అనే రెండో లెవల్లో బజర్ మోగినప్పుడు 29 నిమిషాలు లెక్కించి గంట కొట్టాలి. ఎవరైతే సరిగ్గా, లేదా 29 నిమిషాలకు దగ్గరలో ఉన్నప్పుడు బెల్ మోగిస్తారో వారు గెలిచినట్లు లెక్క! ఈ గేమ్‌లో సన్నీకి మానస్ సాయం కోరగా అతడు అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో సన్నీ మానస్ లెక్కపెడుతున్నాడని తాపీగా కూర్చోవడమే కాదు, పదేపదే అతడి వంకే చూడసాగాడు. దీంతో అక్కడున్న మిగతా హౌస్‌మేట్స్‌కు వీరి మ్యాచ్ ఫిక్సింగ్ అర్థమైపోయింది. చివరకు సన్నీ మానస్ సైగ చేసిన వెంటనే గంట కొట్టాడు. ఆ తర్వాత సన్నీ జోకర్లా రెడీ అయి శ్రీరామ్‌ను నవ్వించాడు. అతడు నడవలేని స్థితిలో ఉండటంతో బెడ్‌పైనే ఉండి గేమ్ ఆడగా మిగతా అందరు మాత్రం గార్డెన్ ఏరియాలో ఉండి ఆడారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారమైతే ఈ రౌండ్లో ప్రియాంక, శ్రీరామ్, సిరి, షణ్ను, మానస్ ఆధిక్యంలో ఉన్నారట! అంటే సాయం తీసుకుని కూడా సన్నీ ఓడిపోయి అప్రతిష్ట మూటగట్టుకున్నట్లు కనిపిస్తోంది. -
టికెట్ టు ఫినాలే: ఆధిక్యంలో మానస్, ఆ ఇద్దరు వెనుకంజ!
Bigg Boss Telugu 5 Promo, Ticket To Finale Task: బిగ్‌బాస్ హౌస్‌లో ఇన్నివారాల పాటు ఉండటం ఒకెత్తు అయితే, టాప్ 5కి చేరుకోవడం మరో ఎత్తు. ఎలాగో ఇంతదాకా వచ్చాం కాబట్టి ఫైనల్లో కాలు పెట్టాల్సిందేనని కంటెస్టెంట్లు ధృడ నిశ్చయంతో ఉన్నారు. అలాంటివారికి బిగ్‌బాస్ టికెట్ టు ఫినాలే టాస్క్‌తో శుభవార్తను అందజేశాడు. ఈ టాస్క్‌లో గెలిచినవారు నేరుగా ఫైనల్‌కు వెళ్తారని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం హౌస్‌లో 'టికెట్ టు ఫినాలే' మొదటి లెవల్ నడుస్తోంది. ఇందులో ఐస్ క్యూబ్స్‌పై నిల్చొని పక్కవారి బంతులు లాక్కునేదానిమీద ఫోకస్ పెట్టాలి. ఈ గేమ్‌లో సిరి, సన్నీ మధ్య ఫైట్ నడిచినట్లు కనిపిస్తోంది. దీంతో సిరి ఏడ్చేసినట్లు ప్రోమోలో చూపించారు. ఒకరిని విలన్ చేయడానికి సిరి రెడీగా ఉంటుందని చిరాకుపడ్డాడు సన్నీ. మరి ఈ గేమ్‌లో ఎవరు గెలిచారు? ఎవరు ఓడిపోయారు? అన్నది ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారమైతే మానస్ ఎక్కువ పాయింట్లతో ఆధిక్యంలో ఉన్నాడట! శ్రీరామ్, సిరి తర్వాతి స్థానాల్లో కొనసాగుతుండగా కాజల్, ప్రియాంక చివరి రెండు స్థానాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. రసవత్తరంగా సాగుతున్న ఈ పోటీలో ఫినాలేకు ఎవరు ముందుగా బెర్త్ ఖాయం చేసుకుంటారో చూడాలి! -
రూ.50 లక్షలు గెలిస్తే అమ్మనవుతా: ట్రాన్స్‌జెండర్ ప్రియాంక
Bigg Boss Telugu 5, Ravi Eliminated From BB Show: ఇప్పటివరకు బిగ్‌బాస్ షో విజేతలకు రూ.50 లక్షల ప్రైజ్‌మనీ మాత్రమే ఇచ్చేవారు. కానీ ఈ సీజన్లో మాత్రం దీనికి అదనంగా ఇల్లు కట్టుకోవడానికి అనుకూలమైన భూమిని కూడా కానుకగా అందిస్తున్నారు. ఈ విషయాన్ని మన్మథుడు నాగార్జున అధికారికంగా ప్రకటించాడు. బిగ్‌బాస్ విన్నర్ రూ.50 లక్షలతో పాటు, షాద్‌నగర్‌లోని సువర్ణ కుటీర్‌లో రూ.25 లక్షల విలువైన 300 చదరపు గజాల స్థలాన్ని సైతం సొంతం చేసుకోనున్నట్లు వెల్లడించాడు. ఈ ప్రైజ్‌మనీ గెలిస్తే ఆ డబ్బుతో ఎవరేం చేస్తారో చెప్పాలని హౌస్‌మేట్స్‌ను ఆదేశించాడు నాగ్. మొదటగా ప్రియాంక మాట్లాడుతూ.. 'నేను రూ.50 లక్షలు గెలుచుకుంటే తల్లిదండ్రుల కోసం ఇల్లు కొనిస్తా. అలాగే నాకు చిన్నప్పటి నుంచి అమ్మ అని పిలిపించుకోవాలని కోరికగా ఉండేది. కానీ దత్తత తీసుకోవాలంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలన్నారు. కాబట్టి ఈ ప్రైజ్‌మనీ గెలిస్తే ఒక అమ్మాయిని దత్తత తీసుకుంటా' అని చెప్పుకొచ్చింది. శ్రీరామ్ మాట్లాడుతూ.. 'తెలుగు ప్రేక్షకులకు ఇంకా దగ్గరవ్వడానికే షోకు వచ్చాను. పెద్ద ఇల్లు కట్టి పేరెంట్స్‌తో కలిసి ఉండాలన్నది నా కోరిక' అని చెప్పాడు. 'కొంత వియా చదువు కోసం పొదుపు చేస్తా. నిర్మాణసంస్థ నెలకొల్పాన్న కోరికను నెరవేర్చుకుంటా' అని చెప్పాడు రవి. కాజల్ తనకున్న 30 లక్షల రూపాయల అప్పు తీర్చుకుంటానంది. అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టాలనుకుంటున్నానని చెప్పింది. సువర్ణ కుటీర్‌లో ఇల్లు కట్టుకుంటానంది. సన్నీ వచ్చిందంతా అమ్మకిచ్చేస్తానని, కొంత డబ్బు తీసుకుని సెలూన్ పెడతానన్నాడు. మానస్ తనకు వచ్చిన డబ్బుతో నిర్మాణ సంస్థను నెలకొల్పి కొత్తవాళ్లను ఎంకరేజ్ చేస్తానని చెప్పాడు. షణ్ముఖ్.. ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని పెంచుతున్న అమ్మకు 25 లక్షలు ఇస్తానన్నాడు. తనకెన్నో సార్లు డబ్బు సాయం చేసి ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చిన దీప్తి సునయనకు మరో 25 లక్షలిస్తానన్నాడు. సిరి శ్రీహాన్ పేరెంట్స్‌కు ఉన్న 10 లక్షల అప్పు తీర్చేసి కొంత అమ్మకిస్తానని, అలాగే అంధులకు సాయం చేస్తానని పేర్కొంది. తర్వాత షణ్ముఖ్, ప్రియాంక సేఫ్ అవగా రవి, కాజల్ మాత్రమే నామినేషన్స్‌లో మిగిలారు. ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను నువ్వు వాడుకుంటావా? లేదా వీళ్లలో ఒకరిని సేవ్ చేస్తావా? అని నాగ్ సన్నీని అడిగాడు. ఆ పాస్ తనకు రావడం కోసం ఎంతగానో ఫైట్ చేసిన కాజల్‌కు వాడాడు. కానీ ఓటింగ్‌లో రవి చివరి స్థానంలో ఉండటంతో అతడు ఎలిమినేట్ అయ్యాడని నాగ్ ప్రకటించాడు. దీంతో ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడి ఉపయోగం లేకపోయింది. రవి కోసం వాడి ఉంటే కనీసం అతడైనా సేవ్ అయ్యేవాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న రవి ఎలిమినేట్ అవడంతో ఏడుపాపుకోలేకపోయిన సన్నీ తన దగ్గరున్న గిఫ్ట్ వోచర్‌ను అతడికి బహుమతిగా ఇచ్చాడు. సన్నీ మాత్రమే కాదు, ఇంటిసభ్యులెవరూ రవి ఎలిమినేషన్‌ను జీర్ణించుకోలేకపోయారు. అందరూ కన్నీటితో భారంగా ఆయనకు వీడ్కోలు పలికారు. స్టేజీ మీదకు వచ్చిన రవి చాలా తొందరగా బయటకు వచ్చేశానని బాధపడ్డాడు. అనంతరం ఈ బిగ్‌బాస్ జర్నీలో ఎవరు పాస్, ఎవరు ఫెయిల్? అనే గేమ్ ఆడాడు. షణ్ను పాస్ అయ్యాడని చెప్పడంతో అతడు లేచి ఏదైనా బాధపెట్టి ఉంటే క్షమించమని కోరాడు. లేట్‌గా కనెక్ట్ అయిన చందూలో అన్నీ పాజిటివ్సే ఉన్నాయన్నాడు రవి. నువ్వు లోపలి నుంచి ఆడు, నేను బయట నుంచి ఆడతానని చెప్తూ అతడిని పాస్ చేశాడు. ఫ్రెండ్ కోసం ఏదైనా చేస్తాడు, తోపు అంటూ సన్నీని పాస్ చేశాడు. ప్రియాంక, సిరి, కాజల్‌కు ఫెయిల్ ట్యాగ్ ఇచ్చాడు. టాప్ 5లోకి రావాలని సిరిని ఎంకరేజ్ చేశాడు. మానస్‌ను చూసి చాలా ఇన్స్పైర్ అయ్యానంటూనే అతడికి ఫెయిల్ ట్యాగ్ ఇచ్చాడు. షణ్ను ఎంతకూ కన్నీళ్లను ఆపుకోలేకపోవడంతో రవి.. నేనెళ్తేనే నువ్వు గెలుస్తావంటూ ఆఖరి మాటగా చెప్పి వీడ్కోలు తీసుకున్నాడు. -
ఎలిమినేషన్‌ను మార్చే అధికారం సన్నీ చేతుల్లో!
Bigg Boss Telugu 5 Promo: సండే అంటే ఫన్డే మాత్రమే కాదు ఎలిమినేషన్డే కూడా! ఈ వారం నామినేషన్స్‌లో రవి, సన్నీ, శ్రీరామ్, ప్రియాంక, షణ్ముఖ్, కాజల్, సిరి ఉన్నారు. వీరిలో సిరి, శ్రీరామ్, సన్నీ నిన్నటి ఎపిసోడ్‌లోనే సేవ్ అయ్యారు. మిగతావారిలో ఎవరు ఎలిమినేట్ కానున్నారన్నది నేడు అధికారికంగా వెల్లడి కానుంది. ఈ ఎలిమినేషన్ ఘట్టంపై తాజాగా ప్రోమో వదిలాడు బిగ్‌బాస్. రవి, కాజల్ ఇద్దరూ ఎలిమినేషన్ అంచుల్లో ఉన్నట్లు చూపించారు. వీరిలో ఒకరిని సేవ్ చేసే అవకాశం మీలో ఒక్కరికే ఉందని నాగ్ వెల్లడించాడు. దీంతో సన్నీ తనకు దక్కిన ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను గార్డెన్ ఏరియాలోకి పట్టుకొచ్చాడు. మరి సన్నీ ఆ పాస్‌ను ఉపయోగించి ఆ ఇద్దరిలో ఎవరినైనా సేవ్ చేశాడా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం మేరకైతే సన్నీ ఆ పాస్‌ను వాడలేదట! రవి ఎలిమినేట్ అయ్యాడట! అలాగే ఎవిక్షన్ ఫ్రీ పాస్ కూడా నేటితో ఎక్స్పైర్ అయినట్లు ప్రకటించి షాకిచ్చాడట నాగ్.. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే! -
బిగ్‌బాస్ సీజన్-5 విన్నర్ ప్రైజ్‌మనీలో 'బిగ్' సర్ప్రైజ్
Bigg Boss 5 Telugu: BB5 Title Winner Prize Money Details: బిగ్‌బాస్ సీజన్-5 మరో మూడు వారాల్లో ముగియనుంది. ప్రస్తుతం టైటిల్ పోరులో మిగతా కంటెస్టెంట్లతో పోలిస్తే సన్నీ-షణ్నూకే అవకాశాలు ఎక్కువ. టైటిల్ రేస్ కూడా వీరిద్దరి మధ్యే జరుగుతుందన్నది పలువురి అభిప్రాయం. ఇక ట్రోఫీని ముద్దాడే విజేత ఎవరనే దాన్ని పక్కన పెడితే, బిగ్‌బాస్ విన్నర్‌కి ఇచ్చే ప్రైజ్‌మనీకి సంబంధించి ఆసక్తికర వార్త ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తుంది. గత సీజన్లతో పోలిస్తే బిగ్‌బాస్ సీజన్-5 విజేతకు డబుల్ బొనాంజ దక్కుతుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. బిగ్‌బాస్ విన్నర్‌కి గాను ఈసారి 50లక్షల రూపాయల ప్రైజ్‌మనీతో పాటు 25 లక్షల విలువైన ఫ్లాట్ కూడా దక్కుతుందని సమాచారం. ఇప్పటివరకు బిగ్‌బాస్ తెలుగు సీజన్లలో 50 లక్షల ప్రైజ్‌మనీ అన్నది అత్యధికం. కానీ ఈసారి తొలిసారిగా ఆ రికార్డును బ్రేక్‌చేస్తూ 50 లక్షల ప్రైజ్‌మనీకి అదనంగా పాతిక లక్షల విలువైన ఫ్లాట్ కూడా అందించనున్నట్లు సమాచారం. మరికొందరేమో ప్రైజ్‌మనీలో సగాన్ని తగ్గించి ఫ్లాట్ ఇస్తారని ప్రచారం చేస్తున్నారు. ఏది ఏమైనా బిగ్‌బాస్ సీజన్-5 విన్నర్‌గా ఎవరు నిలవనున్నారన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. -
ఒకరిని హీరో చేయడం కోసం మరొకరిని జీరో చేయకండి : సన్నీ తల్లి
Bigg Boss 5 Telugu, Sunny Mother Kalavathi Request To All BB5 Fans: బిగ్‌బాస్ ఫినాలే ఎపిసోడ్‌కు ఇంకా మూడు వారాలే మిగిలుంది. దీంతో బిగ్‌బాస్ సీజన్-5 విజేతగా ఎవరు నిలవనున్నారన్నది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం టాప్-1 పోటీలో సన్నీ, షణ్నూల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. సిరి చేసే అతివల్ల షణ్నూకి నెగిటిటివి పెరిగిందని, ఇది సన్నీకి ప్లస్ అవుతుందని పలువురు భావిస్తున్నారు. మొదటి నుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఉన్న సన్నీ టైటిల్ విన్నర్‌కి అర్హుడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనికి తోడు వీకెండ్ ఎపిసోడ్లో సైతం మిగతా కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ సైతం సన్నీ టాప్-5లో కశ్చితంగా ఉంటాడని చెప్పడం మరింత బలం చేకూర్చింది. ఈ నేపథ్యంలో షణ్నూ- సన్నీ ఫ్యాన్స్ మధ్య కాస్త సోషల్ వార్ నడుస్తుంది. విన్నర్‌గా తేలేది అతడే అంటూ ఇద్దరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు ట్రోల్స్ చేస్తూ నెగిటివిని పెంచేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై సన్నీ తల్లి కళావతి స్పందించింది. 'ఎవరికి నచ్చితే వాళ్లకు ఓట్లు గెలిపించండి తప్పితే విమర్శించకండి అని విన్నవించుకున్నారు. అక్కడ అందరూ ఫ్రెండ్స్‌లా ఉన్నారు. నెగిటివ్ కామెంట్స్ చేయకండి. ఒకరిని హీరో చేయడం కోసం మరొకరిని జోరో చేయకండి' అని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. A request to all of you from kalavathi amma 😍#biggbosstelugu5 pic.twitter.com/Jw2bwrdJax — Sunny Vj (@vjsunnyofficial) November 28, 2021 -
అంతా కలిసి సన్నీని విన్నర్‌గా తేల్చారు! టాప్ 5లో ఎవరున్నారంటే?
Bigg Boss Telugu 5, Episode 84: కింగ్ నాగార్జున హౌస్మేట్స్ కోసం సర్ప్రైజ్ పట్టుకొచ్చాడు. కంటెస్టెంట్ల కోసం మరికొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ స్టేజీపైకి వస్తారని చెప్పాడు. కానీ వాళ్లు మిమ్మల్ని కలవాలంటే మీకు బాగా నచ్చిన వస్తువులను త్యాగం చేయాలని మెలిక పెట్టాడు. అయినవాళ్లను చూడటం కన్నా విలువైనది ఏముంటుందనుకున్న హౌస్మేట్స్ అందుకు ఓకే అనేశారు. మొదటగా యాంకర్ రవి పాప బొమ్మను త్యాగం చేయడంతో అతడి తల్లి ఉమాదేవి స్టేజీపైకి వచ్చింది. ఫ్యామిలీ అంతా నిన్ను చూసి గర్వపడుతుందని నువ్వు బిగ్‌బాస్ హౌస్‌కు రాజువని మెచ్చుకుంది. రవి కోసం బిగ్‌బాస్ తొలి సీజన్ విన్నర్ శివబాలాజీ కూడా షోకి విచ్చేశాడు. హౌస్‌లో ఎవరికి సపోర్ట్ చేయొద్దని, నీకు చెప్పాలనిపించిన పాయింట్ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపొమ్మని కోరాడు. అనంతరం ఉమావేవి.. రవి, సన్నీ, శ్రీరామ్, షణ్ముఖ్, మానస్లు వరుసగా టాప్ 5లో ఉంటారని చెప్పుకొచ్చింది. తర్వాత పింకీ మేకప్ కిట్ త్యాగం చేయగా ఆమెకోసం హాస్యనటులు సాయి, అప్పారావు వచ్చారు. వీరు ప్రియాంకను విన్నర్‌గా తేల్చుతూ సన్నీ, శ్రీరామ్, రవి, మానస్‌లను టాప్ 5లో ఉంచారు. ఈ సందర్భంగా పింకీ మాట్లాడుతూ.. 'నన్ను కన్నడ నుంచి తెలుగుకి తీసుకువచ్చి కామెడీ షో చేయించారు.. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే మీరే కారణం' అంటూ అప్పారావుకు కృతజ్ఞతలు తెలిపింది. సన్నీ తనకు ఫ్రెండ్స్ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్‌ను త్యాగం చేయగా ఇద్దరు ఫ్రెండ్స్ నిఖిల్, వెంకట్ స్టేజీపై సందడి చేశారు. కప్పు ముఖ్యం బిగిలూ అంటూనే బోర్డు మీద సన్నీని విన్నర్ స్థానంలో ఉంచారు. షణ్ముఖ్, మానస్, శ్రీరామచంద్ర, కాజల్‌ను తర్వాతి నాలుగు స్థానాల్లో ఉంచారు. మానస్.. తల్లి పంపిన బ్రేస్‌లెట్‌ను త్యాగం చేయగా అతడి కంటే ఎక్కువగా పింకీ బాధపడిపోయింది. తర్వాత మానస్ తండ్రి వెంకట్రావు, ఫ్రెండ్ అమర్దీప్ వచ్చాడు. ఏమీ లేనివాడిని తీసుకొచ్చి అన్నీ ఉన్నవాడిలా చేశాడు, నాకు ఇంత గుర్తింపు వచ్చిందంటే మానస్ వల్లేనంటూ అతడిని పొగిడేశాడు. అనంతరం మానస్‌ను ఫస్ట్ ప్లేస్‌లో సన్నీ, కాజల్, శ్రీరామ్, షణ్ముఖ్‌ను మిగిలిన నాలుగు స్థానాల్లో పెట్టారు. కాజల్ ఎంతగానో ఇష్టపడే బొమ్మను త్యాగాల పెట్టెలో పడేసింది. ఆమెను కలవడానికి సోదరితో పాటు, సింగర్ లిప్సిక కూడా వచ్చారు. వీళ్లు కాజల్‌ను విన్నర్‌గా తేల్చుతూ సన్నీ, షణ్ను, శ్రీరామచంద్ర, మానస్‌ను తర్వాతి స్థానాల్లో పెట్టారు. అనంతరం శ్రీరామ్.. హమీదా ఇచ్చిన కానుకను త్యాగం చేయగా అతడి కోసం తల్లి, స్నేహితురాలు వచ్చారు. వీళ్లు శ్రీరామ్, రవి, ప్రియాంక సింగ్, సన్నీ, షణ్ముఖ్‌లు వరుసగా టాప్ 5లో ఉంటారని జోస్యం చెప్పారు. సిరి కోసం వచ్చిన శ్రీహాన్.. సన్నీ, షణ్ముఖ్, రవి, శ్రీరామ్, సిరిలు వరుసగా టాప్ 5లో ఉంటారన్నాడు. చివరగా షణ్ముఖ్.. తన ప్రేయసి దీప్తి సునయన ఇచ్చిన టీషర్ట్‌ను భారంగా త్యాగం చేశాడు. అతడి కోసం మొదట అన్నయ్య సంపత్ రాగా తర్వాత దీప్తి సునయన స్పెషల్ ఎంట్రీ ఇవ్వడంతో షణ్ను ఆనందంతో ఉబ్బితబ్బిబైపోయాడు. ఎమోషన్స్‌ను స్ట్రెంత్‌గా మార్చుకో కానీ వీక్ అయిపోవద్దని దీప్తి సూచించింది. నాకు నువ్వేంటో తెలుసంటూ అతడికి ముద్దులు పంపించింది. షణ్ముఖ్, శ్రీరామ్, సన్నీ, రవి, మానస్లు వరుసగా టాప్ 5లో ఉంటారని వీళ్లు అభిప్రాయపడ్డారు. ఫినాలేలో కలుద్దామంటూ వీడ్కోలు తీసుకుంది. ఈరోజు వచ్చిన మెజారిటీ ఫ్యామిలీ మెంబర్స్ సన్నీని టాప్ 5లోని మొదటి రెండు స్థానాల్లో పెడుతూ అతడే విన్నర్ అని చెప్పకనే చెప్పారు. -
బిగ్‌బాస్‌లో సిరి బాయ్‌ఫ్రెండ్.. 'వదిలేస్తున్నావా సిరి' అంటూ సూటి ప్రశ్న
బిగ్‌బాస్‌లో ఈ వారం ఫ్యామిలీ ఎపిసోడ్‌తో సరదాగా సాగింది. ఫ్యామిలీ మెంబర్స్ బిగ్‌బాస్‌లోకి ఎంటర్ కావడంతో రియల్ ఎమోషన్స్ బయటకొచ్చాయి.దాదాపు 80 రోజుల తర్వాత కుటుంబసభ్యులను చూసే అవకాశం రావడంతో హౌస్మేట్స్ బాగా ఎమోషనల్ అయ్యారు. అయితే యాంకర్ రవి, కాజల్ కుటుంబసభ్యులు మినహాయించి మిగతా కంటెస్టెంట్ల కోసం కేవలం ఫ్యామిలీలోనే ఒకరిని మాత్రమే బిగ్‌బాస్‌లోకి అనుమతించారు. తాజాగా హౌస్మేట్స్ ఆనందాన్ని మరింత రెట్టింపు చేయడానికి డబుల్ ఎమోషన్స్‌ని బయటకు రప్పించడానికి మిగతా కుటుంబసభ్యులను కూడా బిగ్‌బాస్ ఆహ్వానించారు. ఇందులో భాగంగానే రవికోసం ఆయన తల్లి, కాజల్ ఫ్రెండ్ సహా సిరి బాయ్‌ఫ్రెండ్ శ్రీహాన్ సైతం బిగ్‌బాస్ స్టేజ్‌పై సందడి చేశారు. శ్రీహాన్‌ను చూడగానే సిరి తలదించుకుంది. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ 'వదిలేస్తున్నావా సిరి'.. అంటూ శ్రీహాన్ అడగ్గానే ఏం చెప్పాలో తెలియక బాగా ఎమోషనల్ అయ్యింది సిరి. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్‌మా రిలీజ్ చేసింది. ఇప్పటివరకు సిరిని ఎంతగానో సపోర్ట్ చేస్తున్న శ్రీహాన్..అలా 'వదిలేస్తున్నావా సిరి'.. అని ఎందుకు అడిగాడు అన్నది తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే. Weekend is here...More family members on the stage #BiggBossTelugu5 today at 9 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/Wp3ayU5TV8 — starmaa (@StarMaa) November 27, 2021 -
హగ్గుల వివాదం.. షణ్నును వెనకేసుకొచ్చిన సన్నీ
Bigg Boss Telugu 5, Sunny Supports Shannu: షణ్నుకు దగ్గరవుతున్నావు, కానీ అతడిని హగ్ చేసుకోవడమే నచ్చలేదు అని సిరి తల్లి బిగ్‌బాస్ హౌస్‌లో సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో హౌస్మేట్స్ అందరూ షాకవగా షణ్ను అయితే తలెత్తుకోలేకపోయాడు. ఆమె అలా అంటుంటే సిరి దాన్ని ఆపకుండా సైలెంట్‌గా ఉండటాన్ని తట్టుకోలేకపోయాడు. ఇంత చేసి ఇలాంటి మాటలు పడాల్సి వచ్చిందేనని కుంగిపోయి ఏడ్చేశాడు. అయితే ఇలాంటి సమయంలో సన్నీ అతడికి అండగా నిలిచాడు. వాళ్లది ఫ్రెండ్షిప్ అని నొక్కి చెప్పాడు. '82 రోజులుగా వాళ్లను చూస్తూనే ఉన్నాం. వాళ్లిద్దరిదీ చాలా మంచి ఫ్రెండ్షిప్. బెస్ట్‌ఫ్రెండ్స్‌గా కనెక్ట్ అయ్యారు. నేను, మానస్ ఎంత బెస్ట్ఫ్రెండ్సో వాళ్లిద్దరూ అంత బెస్ట్‌ఫ్రెండ్స్' అంటూ ఆమెకు అర్థమయ్యేలా చెప్పుకొచ్చాడు. సన్నీ వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. షణ్ను ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి కూడా థ్యాంక్స్ మచ్చా అంటూ కృతజ్ఞతలు తెలిపారు. బిగ్‌బాస్ కంటెస్టెంట్ రోహిణి అయితే వీడు బంగారం అంటూ సన్నీని మెచ్చుకుంది. చదవండి: హగ్గుల గురించి తీయకు.. తల్లిగా చెప్పడం నా బాధ్యత.. ఏడ్చేసిన షణ్ను View this post on Instagram A post shared by Rohini (@actressrohini) -
పాన్‌షాప్ పెట్టి చదివించాను, ఎన్నో మాటలు పడ్డాను: సిరి తల్లి
Bigg Boss 5 Telugu Promo: నామినేషన్స్, కెప్టెన్సీ టాస్క్‌తో రణరంగంగా మారిన బిగ్‌బాస్ హౌస్ ఫ్యామిలీ మెంబర్స్ ఎంట్రీతో చల్లబడిపోయింది. ఆవేశంతో చిందులు తొక్కిన కంటెస్టెంట్లు వారి ఆత్మీయులను చూడగానే మెత్తబడిపోయారు. కొన్ని వారాల తర్వాత కన్నవారు, కట్టుకున్నవారు కళ్ల ముందుకు రావడంతో ఎమోషల్ అవుతున్నారు. నిన్నటి ఎపిసోడ్లో కాజల్ భర్త, కూతురు హౌస్‌లో అడుగుపెట్టగా నేడు శ్రీరామ్ సోదరి, సిరి తల్లి, మానస్ తల్లి, సన్నీ తల్లి ఇంట్లోకి వస్తున్నట్లు ప్రోమో రిలీజ్ చేశాడు బిగ్‌బాస్. సన్నీ తన తల్లిని చూడగానే నిన్ను ఎక్కడో చూశానే అంటూ సరదాగా మాట్లాడాడు. మానస్ తల్లి అయితే తన వాక్చాతుర్యంతో హౌస్మేట్స్ అందరినీ ఇట్టే కలుపుకుపోయింది. 'నాకు, మానస్‌కు మీలాంటి అమ్మాయిని చూడండి' అని శ్రీరామ్ అడగ్గా.. 'బయట హమీదా వెయిటింగేమో' అని మానస్ తల్లి పంచ్ ఇచ్చింది. దీంతో శ్రీరామ్ సిగ్గుతో ముఖం దాచుకున్నాడు. 'సిరికి ఊహ తెలిసినప్పుడే డాడీ చనిపోయారు, పాన్ షాప్ పెట్టి ఆమెను చదివించాను. జనాలతో ఎన్నో మాటలు పడ్డాను. ఈ బిగ్‌బాస్‌ను కోట్లాది మంది చూస్తున్నారు. నన్ను బిగ్‌బాస్ సిరి తల్లిగా గుర్తుపడుతున్నారు' అంటూ భావోద్వేగానికి లోనైంది సిరి తల్లి. బాత్రూంకి వెళ్లాలనుకున్న షణ్నును లోనికి వెళ్లనీయకుండా పాజ్ అంటూ అతడిని కదలకుండా ఉండమన్నాడు బిగ్‌బాస్. దొరికిందే ఛాన్స్ అనుకున్న హౌస్మేట్స్ అతడిని అమ్మాయిగా అందంగా ముస్తాబు చేశారు. -
బిగ్‌బాస్ కంటెస్టెంట్లపై విశ్వక్ సేన్ సెటైర్లు!
Bigg Boss 5 Telugu, Vshwak Sen Supports VJ Sunny: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో సన్నీని సపోర్ట్ చేస్తున్నాడు. అంతేకాదు, అతడిని ఎవరైనా ఏమైనా అంటే వారికి గట్టి కౌంటర్లు విసురుతున్నాడు. హౌస్‌లో సన్నీ ఎవిక్షన్ ఫ్రీపాస్ గెలుచుకుంటే ఎవరూ దాన్ని సెలబ్రేట్ చేయలేదని సెటైర్ విసిరాడు షణ్ను. దీనిపై విశ్వక్ రియాక్ట్ అవుతూ.. మేము చేసుకుంటున్నాంలే.. అని ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాసుకొచ్చాడు. తాజాగా నామినేషన్స్ జరిగిన తీరుపై కూడా రియాక్ట్ అయ్యాడు. నిన్నటి నామినేషన్స్‌లో సన్నీకి శ్రీరామచంద్ర, రవిలతో ఫైట్ జరిగింది. ఈ గొడవలో ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు? అనేది పక్కన పెడితే విశ్వక్ ఎప్పటిలాగే సన్నీకి సపోర్ట్ చేశాడు. అంతటితో ఆగకుండా రవి, శ్రీరామచంద్రలపై సెటైర్లు విసిరాడు. శ్రీరామచంద్ర అటూఇటూ తిరుగుతుంటే షుగర్ వచ్చిందేమోనని కౌంటర్ వేయగా రవికి ఓవర్ స్మార్ట్ షుగర్ అని ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాసుకొచ్చాడు. అయితే సపోర్ట్ చేయడం ఓకే కానీ మధ్యలో మా వాళ్లను ఎందుకు తిడుతున్నారని అటు శ్రీరామ్, ఇటు రవి ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. వాళ్లకన్నా ముందు నీకు షుగర్ వచ్చినట్లుందంటూ పరుష పదజాలంతో కామెంట్లు చేస్తున్నారు. -
ఉసురు పోసుకుంటున్నారు.. హీటెక్కించిన నామినేషన్స్
Bigg Boss 5 Telugu, 12th Week Nominations: బిగ్‌బాస్ ఇంట్లో 12వ వారం నామినేషన్స్ వాడివేడిగా జరిగాయి. నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా నామినేట్ చేయాలనుకున్న ఇద్దరు వ్యక్తుల దిష్టిబొమ్మలను పగలగొట్టాల్సి ఉంటుంది. మొదటగా రవి వంతు రాగా.. విధులు సరిగా నిర్వర్తించట్లేదంటూ సన్నీని, తర్వాత కాజల్‌ను నామినేట్ చేశాడు. గతవారం గేమ్ పెద్దగా ఆడలేదంటూ షణ్ను కుండ పగలగొట్టింది ప్రియాంక. సిరిని నామినేట్ చేసే క్రమంలో ఆమెతో పెద్ద గొడవే అయింది. కెప్టెన్‌గా, సంచాలకుడిగా పర్ఫెక్ట్గా లేడంటూ షణ్ను.. రవి దిష్టిబొమ్మపై కుండ పెట్టి పగలగొట్టాడు. సిరి-షణ్ను ప్లాన్ చేసుకుని వచ్చారా? అన్న ప్రశ్న వీకెండ్లో కాకుండా డైరెక్ట్‌గా అడుగుంటే బాగుండేదని కాజల్‌ను నామినేట్ చేశాడు. నీవల్ల కెప్టెన్సీ కంటెండర్ కాలేకపోయానంటూ సన్నీ కుండ బద్ధలకొట్టాడు శ్రీరామ్. ఎవిక్షన్ పాస్ యానీ మాస్టర్‌కు రాకుండా చేసి సన్నీకిచ్చిన కాజల్ కుండ ముక్కలు చేస్తూ ఆమెపై నిప్పులు చెరిగాడు శ్రీరామ్. యానీ మాస్టర్‌కు పాస్ రాకుండా చేయడం వల్ల ఆమె ఎలిమినేట్ అయిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. హౌస్‌లో అందరికంటే ఫేక్ అంటూ రవిని నామినేట్ చేశాడు సన్నీ. ఇక హౌస్ నుంచి వెళ్లిపోయిన యానీ మాస్టర్ కోసం సన్నీ, శ్రీరామ్ గొడవపడ్డారు. ఇద్దరూ ఒకరినొకరు నానా మాటలు అనుకున్నారు. అనంతరం సిరి.. నా వెనకాల మాట్లాడొద్దంటూ పింకీని, అలాగే రవిని నామినేట్ చేసింది. హౌస్‌లో నాకు ఇష్టం లేని వ్యక్తి, జెన్యున్‌గా లేనిది ఒక్కడేనంటూ రవిని నామినేట్ చేసింది కాజల్. యానీ మాస్టర్ ఉసురు పోసుకుంటున్నామని అనడం నచ్చలేదని శ్రీరామ్ కుండ పగలగొట్టింది. తర్వాత కెప్టెన్ మానస్.. శ్రీరామ్, రవిని నామినేట్ చేశాడు. మొత్తానికి వాడివేడిగా సాగిన ఈ ప్రక్రియలో కెప్టెన్ మానస్ మినహా మిగతా ఏడుగురూ నామినేట్ అయ్యారు. -
కాజల్‌పై భగ్గుమన్న శ్రీరామ్, దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన సన్నీ
Bigg Boss 5 Telugu, 12th Week Nominations: బిగ్‌బాస్ కథ కంచికి చేరుకుంటోంది. 19 మందితో మొదలైన బిగ్‌బాస్ ప్రయాణంలో ప్రస్తుతం ఎనిమిది మంది మాత్రమే మిగిలారు. వీరంతా ఎవరికి వారు టాప్ 5కి చేరుకోవాలని తహతహలాడుతున్నారు. ఈ క్రమంలో ఎప్పటిలాగే తమలో నుంచి ఒకరిని పంపించే నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఈమేరకు తాజా ప్రోమో రిలీజైంది. ఎవిక్షన్ ఫ్రీ పాస్‌లో సన్నీని గెలిపించడం కోసం సిరి, యానీ ఇద్దరి ఫొటోలు కాల్చేసిన కాజల్‌పై భగ్గుమని లేచాడు శ్రీరామ్. అందరూ ఒకరిని సేవ్ చేయాలన్న ఉద్దేశంతో ఆడితే నువ్వు మాత్రం ఇద్దరిని గేమ్ నుంచి సైడ్ చేయాలని ఆడావు. అది నాకు నచ్చలేదని చెప్తూ కాజల్‌ను నామినేట్ చేశాడు. దీనికి కాజల్ స్పందిస్తూ.. నా ఫ్రెండ్‌ను సేవ్ చేసి అతడికి పాస్ వచ్చేలా చేయడమే నాక్కావాల్సింది అని తేల్చి చెప్పింది. ఆమె సమాధానం నచ్చని శ్రీరామ్.. నీ ఫ్రెండ్ వెళ్లిపోతాడని భయమా? అని ప్రశ్నించాడు. తర్వాత సన్నీతోనూ పోట్లాటకు దిగాడు. సిరి, షణ్ను, రవి, నేను ఒక గ్రూప్ అని ఒప్పుకున్నాడు. అంతెందుకు, నేను, ఐదు కోట్ల మంది తెలుగు ప్రజలు ఒక గ్రూప్.. ఇప్పుడు చెప్పు అని శ్రీరామ్ డైలాగ్ విసరగా.. 'ఆ గ్రూపుకు నేను లీడర్‌ను' అంటూ దిమ్మ తిరిగే పంచ్ ఇచ్చాడు సన్నీ. ఇదిలా వుంటే కెప్టెన్ మానస్ మినహా మిగతా అందరూ ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నట్లు సమాచారం! -
సన్నీ-కాజల్ రిలేషన్‌పై నోరు జారిన సుదర్శన్.. వీడియోతో క్లారిటీ
Comedian Sudharshan Says Sorry To Sunny And Kajal Fans: బిగ్‌బాస్ రియాలిటీ షోలో వీకెండ్ ఎపిసోడ్స్ మరింత స్పెషల్‌గా ఉంటాయన్నది తెలిసిందే. సండే(నవంబర్21)ఫండేగా సాగిన ఎపిసోడ్లో 'అనుభవించు రాజా' టీం సందడి చేసింది. హీరోహీరోయిన్లు రాజ్ తరుణ్, కౌశిష్, నటుడు నెల్లూరు సుదర్శన్ కాసేపు హౌస్‌మేట్స్‌తో చిట్‌చాట్ చేసి అందరినీ సరదాగా నవ్వించారు. అయితే అంతవరకు బాగానే ఉన్నా కాజల్-సన్నీల రిలేషన్‌ను తప్పుబడుతూ సుదర్శన్ చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. వీరిద్దరి గేమ్‌పై అప్పటివరకు సరదాగా పంచులేసిన సుదర్శన్..'చివర్లో కాజల్ మీరు అలిగినప్పుడు చాలా బాగుంటుంది. సన్నీ వచ్చి ఓదార్చడం..అదో టైప్ రొమాన్స్ బాగుంది'.. అంటూ నోరుజారాడు. దీంతో షాక్ అయిన సన్నీ.. మాది బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అయితే సన్నీ-కాజల్‌ల రిలేషన్‌పై తప్పుగా మాట్లాడినందుకు కమెడియన్ సుదర్శన్‌ను నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. ఫ్రెండ్స్‌లా ఉన్న వాళ్లు మీకు రొమాన్స్ చేస్తూ ఎప్పుడు కనిపించారు? అయినా సినిమా ప్రమోషన్స్‌కి వచ్చి ఇలాంటి చీప్ కామెంట్స్ చేయడం సన్నీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తప్పు తెలుసుకున్న సుదర్శన్ సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పాడు. 'మేం చాలా మాట్లాడుకున్నాం. కానీ ఎడిటింగ్ వల్ల కేవలం 5నిమిషాలే చూపించారు. కాజల్-సన్నీ రిలేషన్ గురించి తప్పుగా మాట్లాడే ఉద్దేశం నాకు లేదు. బయటకు వచ్చిన వీడియో వల్ల నెగిటివ్‌గా అనుకుంటున్నారు. సన్నీ ఫ్యాన్స్, కాజల్ ఫ్యామిలీకి క్షమాపణలు చెబుతున్నా' అంటూ వీడియో రిలీజ్ చేశాడు సుదర్శన్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. -
సన్నీ మీద పగ తీర్చుకున్నావా?: రవికి నాగ్ సూటి ప్రశ్న
Bigg Boss Telugu 5 Promo, Gold Evariki? Coal Evariki?: కంటెస్టెంట్ల తప్పొప్పులను సరిదిద్దేందుకు రెడీ అయ్యాడు కింగ్ నాగార్జున. ఈ క్రమంలో యాంకర్ రవికి స్ట్రాంగ్ కోటింగ్ పడినట్లు కనిపిస్తోంది. ఈ మేరకు తాజా ప్రోమో రిలీజైంది. బాగా ఆడిన వాళ్లకు గోల్డ్, వరస్ట్ పర్ఫామర్స్కు కోల్(బొగ్గు) ఇవ్వాలని చెప్పాడు నాగ్. రవి వరస్ట్‌గా ఆడింది సన్నీ అంటూ అతడి చేతికి బొగ్గందించాడు. దీంతో నాగ్.. స్విమ్మింగ్ టాస్క్‌లో సన్నీ మీద పగ తీర్చుకున్నావా? అని రవిని సూటిగా ప్రశ్నించాడు. దీనికతడు అలాంటిదేం లేదని బుకాయించాడు. టీషర్ట్స్ సరిగ్గా వేసుకోవాలని చెప్తూ ఉన్నా అతడు వినిపించుకోలేదని తప్పు సన్నీమీదకు తోసేశాడు. అయితే సన్నీ.. రూల్ బుక్‌లో టీ షర్ట్ పూర్తిగా ధరించాలని ఉందే తప్ప సరిగ్గా ధరించాలని రాసి లేదని చెప్పుకొచ్చాడు. ఇతడి వాదనతో ఏకీభవించని నాగ్.. మరి మానస్ మొదటి నుంచే ఎలా సరిగ్గా వేసుకున్నాడని తిరిగి ప్రశ్నించాడు. దొరికితే దొంగ అంటూ కాజల్ గేమ్‌పైనా సెటైర్లు వేశాడు. ఇక శ్రీరామ్ కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో తనకొచ్చిన పవర్‌ను రవికిచ్చిన విషయం తెలిసిందేగా. అది నెగెటివ్ పవర్ అని తెలియగానే రవి ముఖం మాడిపోయింది. దీన్ని ప్రస్తావించిన నాగ్.. అతడికి బకరా రవి అన్న పేరు సరిగ్గా సెట్టవుతుందన్నాడు. ఇదిలా వుంటే హౌస్మేట్స్ ఎవరిని వరస్ట్ పర్ఫామర్‌గా ఎన్నుకోనున్నారనేది నేటి ఎపిసోడ్లో తెలియనుంది. -
'ఈ వారం సన్నీ ఎలిమినేట్ అవుతాడు!'
Bigg Boss 5 Telugu, Task For Eviction Free Pass: బిగ్‌బాస్ హౌస్‌లో సిరి, ప్రియాంక సింగ్, యానీ, మానస్ కెప్టెన్సీ కోసం పోటీ పడ్డారు. రింగ్ ఈజ్ కింగ్ టాస్క్‌లో ఎవరు రింగ్‌ను చివరి వరకు పట్టుకుంటారో వాళ్లే కెప్టెన్‌గా నిలుస్తారు. ఈ గేమ్‌లో మానస్ గెలిచి విజేతగా అవతరించాడు. కెప్టెన్ మానస్ కాజల్‌కు సారీ చెప్పి ఆమెతో గొడవలకు ఫుల్స్టాప్ పెట్టేశాడు. ఎలిమినేషన్ నుంచి సేవ్ అయ్యేందుకు బిగ్‌బాస్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ప్రవేశపెట్టాడు. 'నిప్పులే శ్వాసగా.. గుండెలో ఆశగా' టాస్క్‌లో మీ ఫొటో కాలకుండా చూసుకోవాలని, చివరి వరకు ఎవరి ఫొటో కాలకుండా ఉంటుందో ఆ కంటెస్టెంట్‌కు ఈ పాస్ దక్కుతుందని ప్రకటించాడు. అయితే తనకెందుకో ఈ వారం సన్నీ ఎలిమినేట్ అవుతాడనిపిస్తోందని రవి జోస్యం చెప్పాడు. ఒకవేళ ఎవిక్షన్ పాస్ గెలిచినా కూడా సన్నీ దాన్ని వాడుకోడని అభిప్రాయపడ్డాడు. తర్వాత టాస్క్‌లో భాగంగా ఫైర్ ఇంజన్ అలారమ్ మోగగా రవి, షణ్ముఖ్ మొదట ట్రక్ ఎక్కారు. వీరికి మానస్, శ్రీరామ్ ఫొటోలు వచ్చాయి. షణ్ను సేవ్ చేసే అవకాశం మానస్కిద్దామంటే రవి మాత్రం శ్రీరామ్‌కే ఇద్దామని ఒప్పించాడు. అలా మానస్ ఫొటో మంటల్లో కాలిపోయింది. నెక్స్ట్ రౌండ్లో సన్నీ, మానస్ ట్రక్ ఎక్కారు. వీరి ఎదుట రవి, యానీ మాస్టర్ ఫొటోలు రాగా.. ఏకాభిప్రాయంతో రవి ఫొటోను కాల్చేశారు. షణ్ను, సిరిలు ట్రక్ ఎక్కగా వారు పింకీని కాకుండా సన్నీని సేవ్ చేశారు. తర్వాత యానీ, శ్రీరామ్‌ల వంతు రాగా జనాల ఓటింగే నాకు ముఖ్యం, ఈ పాస్ అవసరం లేదన్నాడు షణ్ను. ఆడియన్స్ సపోర్ట్‌తోనే ఇక్కడిదాకా వచ్చాను, వారి డెసిషన్‌తోనే వెళ్లిపోవాలని ఉందని చెప్పుకొచ్చింది సిరి. వీళ్లిద్దరూ తమకీ పాస్ అవసరం లేదని చెప్పినప్పటికీ యానీ, శ్రీరామ్ ఆలోచించుకుని సిరిని సేవ్ చేశారు. దీంతో ఆమె సంతోషంతో షణ్నును హత్తుకుని అతడికి ఐ లవ్యూ చెప్పింది. ప్రియాంక, కాజల్.. శ్రీరామ్, సిరిలలో నుంచి సిరిని సేవ్ చేశారు. యానీ, ప్రియాంకలకు సన్నీ, కాజల్ ఫొటోలు వచ్చాయి. యానీ.. ఆ రెండు ఫొటోలు కాల్చేద్దామని చెప్పింది. కానీ పింకీ అది తప్పని వారించడంతో ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చి కాజల్ ఫొటోను కాల్చేసి సన్నీని సేవ్ చేశారు. తర్వాత అలారమ్ మోగినప్పుడు ట్రక్‌లో కూర్చున్న మానస్, కాజల్‌లకు యానీ, సిరి ఫొటోలు వచ్చాయి. ఇద్దరూ ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. ఇద్దరూ కాలిపోతే సన్నీ గేమ్‌లో ఉంటాడని కాజల్ అభిప్రాయపడింది. తన ఫొటోను కాల్చేస్తారని భయపడిపోయిన యానీకి కోపం కట్టలు తెంచుకుంది. తనకు పాస్ దక్కుండా చేస్తున్నారని మండిపడిపోయింది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం మేరకైతే ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్ సన్నీకి దక్కినట్లు సమాచారం! -
యాక్టింగ్ నెం.1, ఇద్దరూ కాలిపోతే సన్నీ మిగులుతాడు
Bigg Boss Telugu 5, Sunny Wins Eviction Free Pass: బిగ్‌బాస్ హౌస్‌లో ఎవిక్షన్ ఫ్రీ పాస్ ప్రవేశపెట్టాడు. ఎలిమినేషన్ నుంచి తప్పించుకునేందుకు ఉపయోగపడే ఈ పాస్ కోసం ఇంటిసభ్యులు పోటీపడుతున్నారు. ఆ పాస్‌ను దక్కించుకునేందుకు బిగ్‌బాస్ 'నిప్పులే శ్వాసగా.. గుండెలో ఆశగా' అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా బజర్ మోగగానే ఫైర్ ఇంజన్ వ్యాన్‌లో కూర్చున్న ఇద్దరు ఇంటిసభ్యులు.. ఎదురుగా ఉన్న రెండు ఫొటోల్లోనుంచి ఒకరిని సేవ్ చేసి మరొకరి ఫొటోను కాల్చేయాలి. చివరి వరకు ఎవరి ఫొటో అయితే కాలకుండా ఉంటుందో వారికి ఎవిక్షన్ ఫ్రీ పాస్ దక్కుతుంది. ఈ క్రమంలో బజర్ మోగగానే మానస్, కాజల్ ట్రక్ ఎక్కారు. వీరికి ఎదురుగా యానీ, సిరి ఫొటోలు దర్శనమివ్వడంతో ఇద్దరూ తలలు పట్టుకున్నారు. మానస్.. యానీని సేవ్ చేయాలనుకుంటే, సిరి మాత్రం కాజల్‌ను సేవ్ చేద్దామంటుంది. కానీ వీళ్లిద్దరూ కాలిపోతే సన్నీ మిగులుతాడు అని చెప్తుంది కాజల్. ఒకరిని సేవ్ చేసే అధికారం ఉన్నప్పుడు ఇద్దరి ఫొటోలు కాల్చేయడం కరెక్ట్ కాదంటాడు రవి. మొత్తంగా ఈ గేమ్‌లో సన్నీ ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలుచుకున్నట్లు తెలుస్తోంది. మరోపక్క యానీ.. పింకీని యాక్టింగ్ నెంబర్ 1 అనడంతో ఆమె విరుచుకుపడింది. -
ఎవిక్షన్ ఫ్రీ పాస్ దక్కించుకున్న సన్నీ! కానీ వాడేది ఎవరికి?
Bigg Boss 5 Telugu Promo, Eviction Free Pass Task: బిగ్‌బాస్ ఇంటిసభ్యులకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను ప్రవేశపెట్టాడు. ఇది గెల్చుకున్న కంటెస్టెంట్ ఈజీగా ఎలిమినేషన్ గండం నుంచి తప్పించుకోవచ్చు. లేదంటే వేరే ఎవరినైనా సేవ్ చేయవచ్చు. ఈ పాస్‌ను పొందడం కోసం బిగ్‌బాస్ నిప్పులే శ్వాసగా గుండెలో ఆశగా అనే టాస్క్ ఇచ్చాడు. ఈ గేమ్‌లో భాగంగా ఫైర్ అలారమ్ మోగినప్పుడు ఏ ఇద్దరు ట్రక్కులోకి వెళతారో వారు బర్నింగ్ హౌస్‌లో నుంచి ఒకరిని సేవ్ చేస్తూ మరొకరి ఫొటోను కాల్చేసే అధికారం పొందుతారు. అలా చివరి వరకు ఎవరి ఫొటో అయితే కాలకుండా ఉంటుందో ఆ కంటెస్టెంట్‌కు పాస్ దక్కుతుంది. అయితే తనకు ఎవిక్షన్ ఫ్రీ పాస్ కన్నా జనాల ఓటింగే ముఖ్యం అని బిగ్‌బాస్‌కు షాకిచ్చాడు షణ్ముఖ్. ప్రేక్షకుల వల్లే ఇక్కడిదాకా వచ్చానని, గెలుపైనా, ఓటమైనా వాళ్ల చేతుల్లో నుంచి తీసుకోవాలని ఉందని చెప్పింది సిరి. అంటే షణ్ను- సిరి తమకు ఈ పాస్ అక్కర్లేదని నిర్భయంగా, నిస్సంకోచంగా చెప్పేశారు. మొత్తానికి ఈ గేమ్‌లో సన్నీ గెలిచినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో లీకైంది. అదే నిజమైతే సన్నీ ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను ఈ వారమే వాడతాడా? ఒకవేళ వాడితే తనకోసం వాడతాడా? ఇతరులను సేవ్ చేయడానికి ఉపయోగిస్తాడా? అన్నది ఆసక్తికరంగా మారింది! -
తొలిసారి కెప్టెన్ అయిన మానస్, కుంగిపోతున్న సన్నీ!
Bigg Boss 5 Telugu Promo, Maanas Is New Captain!: గత ఆదివారం యాంకర్ రవి అందరి ముందు తనది బ్యాడ్ బిహేవియర్ అంటూ మాట్లాడటం తట్టుకోలేకపోయాడు సన్నీ. అందుకే అతడు ఏం చేసినా, ఏం మాట్లాడినా తీసుకోలేకపోతున్నాడు. ఎప్పటిలా సరదాగా ఉండలేకపోతున్నాడు. తాజాగా అతడు సంచాలకుడిగా ఉన్న గేమ్‌లోనూ కొట్లాటకు దిగాడు. అయితే రవి.. ఈ దూరాన్ని తగ్గిద్దామనుకున్నాడో? మరింకేదో కానీ తనకు వచ్చిన పవర్‌ను సన్నీకి త్యాగం చేయడానికి రెడీ అయ్యాడు. అదేమాట బిగ్‌బాస్‌కు చెప్పాడు. కానీ సన్నీ మాత్రం అతడిస్తానంటున్న పవర్‌ను తీసుకోవడానికి రెడీగా లేనని తేల్చి చెప్పాడు. దీంతో హౌస్మేట్స్ అతడికి నచ్చజెప్పేందుకు ఎంతగానో ప్రయత్నించగా చివరాఖరకు అయిష్టంగానే సరేనంటూ తలూపాడు. ఆ పవర్ ద్వారా సన్నీ తదుపరి సైరన్ వచ్చినప్పుడు ఒకరిని తొలగించి వారి స్థానంలో మైన్‌లో దిగి బంగారం వెతికే అవకాశాన్ని కొట్టేశాడు. ఇదిలా ఉంటే కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌తో పాటు కెప్టెన్సీ టాస్క్ కూడా ముగిసిందని, మానస్ కొత్త కెప్టెన్‌గా అవతరించాడని లీకువీరులు సోషల్ మీడియాలో చాటింపు చేశారు. మానస్ తొలిసారి కెప్టెన్ అయినందుకు కొందరు నెటిజన్లు సంతోషిస్తూనే మరోపక్క సన్నీ బాధతో కుమిలిపోతున్నాడని విచారం వ్యక్తం చేస్తున్నారు. -
ఇద్దరం బాగా కనెక్ట్ అయ్యాం, అందుకే షణ్ను అలా..: రవితో చెప్పేసిన సిరి
Bigg Boss Telugu, Episode 74: కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌లో మానస్ తనకు దక్కిన గొడ్డలిని సన్నీకిచ్చిన విషయం తెలిసిందే!దీంతో సన్నీని కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచిన బిగ్‌బాస్ అతడికో స్పెషల్ పవర్ ఇచ్చాడు. ఒకరి నుంచి సగం బంగారు ముత్యాలను తీసుకుని ఇంకొకరికి ఇవ్వాలని చెప్పాడు. దీంతో సన్నీ.. సిరి దగ్గర నుంచి గోల్డ్‌ను షణ్ముఖ్‌కు ఇచ్చాడు. మొదటి రౌండ్లో ఎక్కువ బంగారం సంపాదించిన ప్రియాంక, మానస్‌లకు బెలూన్ టాస్క్ ఇవ్వగా అందులో పింకీ గెలిచింది. ఇద్దరం ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అయ్యామని, అందుకే షణ్ను ట్రిప్ అవుతున్నాడని పేర్కొంది సిరి. మీరిద్దరూ ఒకరినొకరు బాగా సీరియస్‌గా తీసుకుంటున్నారని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు రవి. 'కానీ నీ విషయంలో అతడు ఎందుకంత ట్రిప్ అవుతున్నాడు? నీ విషయంలోనే ఎందుకు ట్రిప్ అవుతున్నాడో ఆలోచించు, నీకు అర్థమవుతుందనుకుంటా, మీరే ఆలోచించుకోండి' అని హితవు పలికాడు. తర్వాత శ్రీరామచంద్రకు ఓ పవర్ వచ్చింది. అయితే అది అతడికి అనుకూలంగా రాలేదు. 30 బంగారు ముత్యాలను ఇవ్వాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. తన దగ్గర ఒక్క ముత్యం కూడా లేకపోవడంతో పథకం రచించిన శ్రీరామ్ తనకో పవర్ వచ్చిందంటూ రవి ముత్యాలను సొంతం చేసుకున్నాడు. చివర్లో మాత్రం ఈ స్పెషల్ పవర్ నాకు రాలేదంటూ బాంబు పేల్చడం గమనార్హం. రెండో రౌండ్లో సన్నీ, సిరి బంగారం వెతుకులాటలో టాప్‌లో ఉన్నారు. వీళ్లిద్దరిలో ఒకరు కెప్టెన్సీ కంటెండర్ అయ్యే అవకాశాన్ని కల్పించాడు బిగ్‌బాస్. అయితే సిరి తరపున వేరొకరు ఛాలెంజ్‌లో పాల్గొనాలంటూ ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో సిరి తనకోసం మానస్ పోటీపడతాడని చెప్పింది. అలా సన్నీని ఓడించేందుకు రంగంలోకి దిగాడు మానస్. తాను గెలిచి సిరిని కెప్టెన్సీ కంటెండర్‌ను చేశాడు. అయితే ఈ గేమ్ నియమనిబంధనలు తనకు ముందే సరిగా చెప్పలేదంటూ సంచాలకుడైన రవి మీద ఫైర్ అయ్యాడు సన్నీ. అలాగే తన స్నేహితులు మానస్, కాజల్ మీద కూడా చిందులు తొక్కాడు. ఉప్పొంగుకొస్తున్న తన కోపాన్ని తగ్గించుకునేందుకు సన్నీ స్విమ్మింగ్ పూల్‌లో దూకాడు. ఇది హౌస్‌లో నుంచి యానీ మాస్టర్ చూడగా సన్నీ మూగబాషలో సంభాషించాడు. ఈ ఒత్తిడి నా వల్ల కాదన్నట్లు ఫేస్ పెడుతూ సూసైడ్ చేసుకుంటున్నట్లుగా చేతితో గన్ పేల్చుకుని నీళ్లలో పడిపోయాడు. -
నిన్ను వాడుకుంటున్నారు, జాగ్రత్త: జెస్సీ హెచ్చరిక
Bigg Boss 5 Telugu, 10th Week Jessie Eliminated: అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అంటే ఇదేనేమో! అదృష్టం బాగుండి నామినేషన్లో లేకపోయినా అనారోగ్యం వెంటాడటంతో జెస్సీ బిగ్‌బాస్ షో నుంచి తప్పుకోక తప్పలేదు. సీక్రెట్ రూమ్‌లో పెడితే తనను తిరిగి హౌస్‌లోకి పంపిస్తారేమోనని వేయి కళ్లతో ఎదురు చూసిన జెస్సీ ఆశలు అడియాశలే అయ్యాయి. బిగ్‌బాస్ హౌస్‌లో నీ జర్నీ పూర్తైందని పంపించివేశారు. అయితే వెళ్లిపోయేముందు జెస్సీ కంటెస్టెంట్లకు విలువైన సూచనలు, సలహాలు ఇచ్చాడు. ల్యాండ్‌ఫోన్ ద్వారా ఒక్కొక్కరితో పర్సనల్‌గా మాట్లాడే అవకాశం కల్పించాడు బిగ్‌బాస్. ముందుగా జెస్సీ.. సన్నీతో మాట్లాడుతూ.. 'జాగ్రత్తగా ఉండు, టెంపర్ లూజ్ అవకు. ఒక్కడిగా గేమ్ ఆడితే ఇండివిడ్యువల్ హీరో అవుతావు, లేదంటే కమెడియన్ అవుతావు' అని ఒకరకంగా వార్నింగ్ ఇచ్చాడు. తర్వాత మానస్‌తో మాట్లాడుతూ.. 'నువ్వు సైలెంట్ కిల్లర్. రవికే బాబువి నువ్వు, ఒప్పుకోవు కానీ ఇదే నిజం. నీ ఐడియాస్ బాగున్నాయ్ కానీ అందరినీ నెగెటివ్‌గా చూడకు' అని సూచించాడు. కాజల్‌తో.. 'నీ గేమ్ ఏమైంది? నువ్వు పక్కవాళ్లను హైలైట్ చేయడానికి రాలేదు. నీ ఫ్రెండ్స్ నీకు వాల్యూ ఇస్తున్నారనుకుంటున్నావు, కానీ ఇవ్వట్లేదు. నిన్ను వాడుకుంటున్నారు అది తెలుసుకో' అని హెచ్చరించాడు. యానీ మాస్టర్ గేమ్ బాగుందన్న జెస్సీ ప్రియాంక సింగ్‌ను త్యాగాలు ఆపేయమని హితవు పలికాడు. నీ గేమ్ ఇదేనా? అని నిలదీశాడు. 'తర్వాత సీజన్లో వచ్చేవాళ్లు నిన్ను చూసి ఇన్స్పైర్ అవ్వాలి, అంతేకానీ అబ్బో, అది 10 వారాలు ఎలా ఉంది? అని చులకనచేయొద్దు' అని ఘాటుగా వ్యాఖ్యానించాడు. దేనిలో ఇన్వాల్వ్ అవని శ్రీరామ్ టాప్ 5లో ఉంటాడని అభిప్రాయపడ్డాడు. రవితో ఫోన్లో ముచ్చటిస్తూ.. ఇన్ఫ్లూయెన్స్ చేసినా కానీ నీ గేమ్ బాగుంటుంది. ఫైనల్లో కలుస్తానని చెప్పాడు. తర్వాత సిరితో మాట్లాడుతూనే తిట్టుకోవడం మొదలుపెట్టారు. ఒక పక్క తంతానంటూనే మరోపక్క నీ ఫైటింగ్ బాగుందని మెచ్చుకున్నాడు. కానీ నీ గేమ్ నువ్వు ఆడమని హెచ్చరించాడు. తర్వాత కిస్సులు లేవా? అని అడడగడంతో గాల్లోనే ముద్దులు పంపింది సిరి. చివర్లో వచ్చేవారమే బయటకు వచ్చేయకు, ఫైనల్‌దాకా అక్కడే ఉండమని చెప్పాడు. షణ్ముఖ్‌తో మాట్లాడుతూ ఎమోషనల్ అయిపోయాడు జెస్సీ. 'హౌస్‌లో ఉన్న చివరి రోజుల్లో నీతో ఉండలేకపోయానన్నదే నా బాధ. నేను ఎప్పటికీ నీ సీక్రెట్ ఫ్రెండ్‌నే' అన్నాడు. ఇక షణ్ను మాట్లాడుతూ.. 'నువ్వు ఫస్ట్ వీక్‌లోనే వెళ్లిపోతావనుకున్నారు, కానీ పదో వారంలో ఒకరికి లైఫ్ ఇచ్చి వెళ్లిపోతున్నావ్.. అదిరా నా జెస్సీ' అని పొగిడేయడంతో అందరూ చప్పట్లు కొట్టారు. ఈ ఫోన్ సంభాషణల్లో జెస్సీ.. సిరి, షణ్ను, శ్రీరామ్, రవి టాప్ 5లో ఉంటారని చెప్పకనే చెప్పాడు. తర్వాత జెస్సీ భారమైన హృదయంతో అందరి దగ్గరా వీడ్కోలు తీసుకున్నాడు. -
రవి ఫేక్, సిరి డబుల్ ఫేస్.. 'అరె, కరెక్ట్‌గా సెట్టయ్యిందే!'
Bigg Boss Telugu 5 Promo: సండేను ఫండే చేస్తానంటూ కంటెస్టెంట్లతో టాస్క్‌లు ఆడిస్తుంటాడు నాగ్. అయితే కొన్ని ఫన్నీగా ఉన్నా, మరికొన్ని మాత్రం హౌస్మేట్స్ మధ్య చిచ్చు రాజేసేలా ఉంటాయి. తాజగా అలాంటి టాస్కే హౌస్‌మేట్స్‌కు ఇచ్చినట్లు కనిపిస్తోంది. తాజాగా రిలీజైన ప్రోమోలో.. నాగ్ కొన్ని పదాలు ఇచ్చి అది ఎవరికి సెట్ అవుతాయో చెప్పాలన్నాడు. దీంతో శ్రీరామ్.. గేమ్‌లో కాజల్ కన్నింగ్ అని చెప్పుకొచ్చాడు. కాజల్.. సిరి గురించి చెప్తూ ఆమెకు రెండు ముఖాలున్నాయని, టాస్క్‌లో ఒక ఫేస్, సాధారణంగా ఒక ఫేస్ ఉంటుందని తెలిపింది. ఇవి కాకుండా సిరి తనకు మూడో ఫేస్ కూడా ఉందని చెప్తూ ఉంటుందని, అది హౌస్ బయటకెళ్లాక చూపిస్తానందని పేర్కొంది. తర్వాత సన్నీ.. రవి మాట మార్చుతాడంటూ అతడు ఫేక్ అని చెప్పాడు. దీంతో చిర్రెత్తిపోయిన రవి.. ఎంత చెప్పినా వినకుండా నాకు నచ్చింది చేస్తా, ఎవ్వడు చెప్పినా నేను వినను అంటే అది యారోగెంటే కదా అంటూ ఆ ట్యాగును సన్నీ మెడలో వేశాడు. ఈ ప్రోమో చూసిన నెటిజన్లు అందరూ కరెక్ట్ ట్యాగులిచ్చుకుంటున్నారని కామెంట్లు చేస్తున్నారు. -
బ్యాడ్ బిహేవియర్, సన్నీని దోషిగా తేల్చిన నాగ్
Bigg Boss Telugu 5, Episode 70: సన్నీ నోటికొచ్చినట్లు వాగాడంటూ సిరి.. షణ్నును పట్టుకుని ఏడ్చేసింది. ఓ పక్క అతడి మీదున్న కోపాన్ని బయటకు కక్కుతూనే మరోపక్క షణ్నుకు హగ్గులిస్తూ ఐ లవ్యూ చెప్పింది. కాజల్ పేరు తీస్తేనే బుసలు కొడుతున్న యానీ బిగ్‌బాస్ ఇంట్లో ఉన్నంతవరకు ఆమెతో మాట్లాడనని, ముఖం కూడా చూడనని భీష్మించుకు కూర్చుంది. అటు మానస్ కూడా పింకీ ప్రవర్తనలో ఏదో తేడా కొడుతోందని ఆమెను కట్ చేయాలని చూస్తున్నాడు. కంటెస్టెంట్లు పలుచబడే కొద్దీ కంటెస్టెంట్ల మధ్య వైరాలు పెరుగుతున్నాయి. తర్వాత ఓ టాస్క్‌లో ప్రియాంక గెలిచి రామ్‌చరణ్ ఆటోగ్రాఫ్ అందుకుని మురిసిపోయింది. సీక్రెట్ రూమ్‌లో ఉన్న జెస్సీ తన శరీరం లావైతున్నట్లుగా, ఎవరో బాడీని పట్టుకున్నట్లుగా ఉందని, చూపు షేక్ అవుతుందని చెప్పుకొచ్చాడు. అతడిని పరీక్షించిన వైద్యులు జెస్సీకి మరింత మెరుగైన చికిత్స అవసరమని అభిప్రాయపడ్డారు. భీమ్లా నాయక్ పాటతో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ఇంటిసభ్యులతో ఎఫ్ఐఆర్ గేమ్ ఆడించారు. మొదటగా యానీ.. కాజల్‌పై ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. నాగ్ ముందే నాగిణి డ్యాన్స్ చేస్తూ ఆమెను వెక్కిరించింది. అయినప్పటికీ మెజారిటీ కంటెస్టెంట్లు యానీకే సపోర్ట్ చేశారు. తర్వాత రవి.. వెరీ బ్యాడ్ బిహేవియర్, లూజ్ టంగ్ అంటూ సన్నీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు. తంతా, అప్పడం చేసి అమ్మేస్తా అన్నాడని రవి చెప్పడంతో తాను అనలేదని బుకాయించాడు సన్నీ. దీంతో నాగ్ వీడియో ప్లే చేశాడు. సన్నీ మొదట తంతానన్నాడని, కానీ ఎవరిని అనడంతో టవర్‌ను తంతానని కవర్ చేశాడని నాగ్ చెప్పడంతో అతడి పరువు పోయినట్లైంది. అయితే సన్నీ మాత్రం తాను బ్రిక్స్నే తంతానన్నానని మరీమరీ చెప్పాడు. అమ్ముతానని సిరిని అన్నావంటూ మరో వీడియో చూపించాడు నాగ్. సన్నీ తరపున వాదించిన కాజల్ అతడు సిరిని అమ్ముతానని అనలేదని బల్లగుద్ది చెప్పింది. తర్వాత సన్నీ.. సిరిని బోనులో నిలబెట్టి ఎఫైఆర్ ఫైల్ చేశాడు. కానీ మానస్, కాజల్ తప్ప అందరూ సిరిని నిర్దోషి అని పేర్కొన్నారు. మానస్.. యానీ మాస్టర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ అది వీగిపోయింది. శ్రీరామచంద్ర.. ప్రియాంకను బోనులో పెట్టాడు. ఎన్ని పాటలు పాడినా 100 రూపాయల కంటే ఎక్కువ ఇవ్వలేదని ఆరోపించాడు. శ్రీరామ్ ముందుగానే ఫ్లాట్ అయిపోయి పాట పాడితే నాది తప్పా? అని రాగాలు తీసింది. హౌస్మేట్స్ సగం మంది తనను గిల్టీ, మిగతావాళ్లు గిల్టీ కాదని చెప్పారు. మానస్ గట్టిగా అరవడం నచ్చలేదని అతడిని ప్రియాంక బోనులో పెట్టింది. అయితే హౌస్మేట్స్ మానస్‌ను నిర్దోషిగా తేల్చారు. తర్వాత కాజల్.. యానీ తనను వెక్కిరిస్తుందంటూ బోనులో నిలబెట్టింది. అయితే ఆమె వెక్కిరించలేదని, అది తన బాడీ లాంగ్వేజ్ అని సిరి వాదించింది. మెజారిటీ కంటెస్టెంట్లు సిరి వాదనతో ఏకీభవించడం విశేషం. తర్వాత షణ్ను.. నేను ఆడవాళ్లను అడ్డం పెట్టుకుని ఆడతాననడం, నన్ను యూట్యూబ్ వరకే అని చెప్పడం నచ్చలేదంటూ సన్నీని బోనులో నిలబెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా ప్లే చేసి చూపించగా రవి, శ్రీరామ్, సిరి, యానీ.. అతడు షణ్నును యూట్యూబ్ వరకే అన్నాడని చెప్పగా మిగిలిన ముగ్గురు షణ్నును అనలేదని, కామెంట్లు యూట్యూబ్ వరకే అని చెప్పాడని వివరించే ప్రయత్నం చేశారు. కానీ మెజారిటీ కంటెస్టెంట్లు షణ్నును సమర్థించారు. అందరూ మధ్యలో రావడం వల్లే గొడవలు వస్తున్నాయని కాజల్ ఉన్నమాట చెప్పింది. సిరి సన్నీ గొడవ పడుతుంటే షణ్ను మధ్యలోకి రావడం వల్లే గొడవ పెద్దదైందని తెలిపింది. అయితే నాగ్ మాత్రం కాజల్.. యానీకి గిలిగింతలు పెట్టడం వల్లే అసలు గొడవ మొదలైందన్నాడు నాగ్. మొత్తంగా సన్నీ మెడలో గిల్టీ బోర్డు వేలాడదీశారు. తర్వాత సన్నీ సేవ్ అయినట్లు వెల్లడించాడు నాగ్. -
వీడియోతో అడ్డంగా దొరికిపోయిన సన్నీపై నాగ్ ఫైర్
Bigg Boss Telugu 5 Promo: సిరి-సన్నీల మధ్య జరిగిన వార్తో నాగార్జున ఎటువైపు నిలబడతాడనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఉదయం నుంచి ప్రోమో కోసం కళ్లు కాయలు కాచేలా వేచి చూశారు. ఎట్టకేలకు ఆలస్యంగానైనా బిగ్‌బాస్ ప్రోమో వదిలాడు. అందరూ ఊహించినట్లుగానే ఆవేశంలో సన్నీ మాటలు జారడాన్ని నాగ్ తప్పుపట్టాడు. రవి కూడా సన్నీది చాలా బ్యాడ్ బిహేవియర్ అని, లూజ్ టంగ్ అని, ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతూ ఇష్టమొచ్చినట్లు చేస్తాననడం తప్పన్నాడు. తంతా అనడం తప్పని రవి అనడంతో ఆ మాటే అనలేదని సన్నీ బుకాయించాడు. మానస్ కూడా అవుననంటూ సన్నీకి వత్తాసు పలకడం గమనార్హం. దీంతో బిగ్‌బాస్ వీడియో చూపించగా అందులో సన్నీ తంతాను అనడం స్పష్టంగా కనిపించింది. అయితే తంతానని టవర్ బ్రిక్స్‌ను అన్నానని చెప్పగా సిరి మాత్రం లేదు, తననే అన్నాడని చెప్పింది. నిజానికి సన్నీ బ్రిక్స్నే తంతాను అని చెప్పాడు కానీ బిగ్‌బాస్ ఆ క్లిప్పింగ్ చూపించనట్లు కనిపిస్తోంది. నిన్నే అమ్మేస్తానని ఎవర్ని అన్నావని నిలదీయగా ఆ మాట అనలేదన్నాడు సన్నీ. దీంతో యానీ మధ్యలో కలగజేసుకుంటూ అతడు కోపంలో ఏదో అనేస్తాడు, కానీ సిరిని అమ్మేస్తాననలేదని చెప్పింది. అంటే కోపంలో ఏదైనా అనేయొచ్చా? అని నిలదీశాడు. మరి నాగ్ సన్నీకి మాత్రమే క్లాస్ పీకాడా? ఇంకా ఎవరెవరికి కోటింగ్ ఇచ్చాడనేది తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే! -
షణ్ను-సిరి ప్యాకేజీ, సిరి ఎలిమినేట్ అయితే షణ్నూ కూడా..!
Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ హౌస్ కోపావేశాలతో అట్టుడుకిపోతోంది. కెప్టెన్సీ టాస్క్‌లో సిరి.. సన్నీ గేమ్‌ను ఆడటానికి ప్రయత్నించడం, దీంతో అతడు నోరు జారడం, ఇది సహించలేకపోయిన షణ్ను మధ్యలోకి దూరడంతో ఈ గొడవ చిలికి చిలికి గాలి వానలా మారింది. సిరి, సన్నీ గొడవ పడుతుంటే మధ్యలో షణ్ను ఎందుకు జోక్యం చేసుకున్నాడని కొందరు విమర్శిస్తుంటే, సిరి కోసం స్నేహితుడిగా షణ్ను స్టాండ్ తీసుకోవడంలో తప్పు లేదంటున్నారు మరికొందరు. అయితే ఇద్దరు వాదులాడుకుంటున్నప్పుడు మూడో వ్యక్తి కలగజేసుకోవడం తప్పని షణ్ను మాట్లాడిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. 'ఇంకోసారి సన్నీ వచ్చి తనకు కాజల్‌తో, మానస్‌తో, పింకీతో ఉన్న ఇష్యూల గురించి నాతో మాట్లాడితే.. వాళ్లు ఎలిమినేట్ అయినప్పుడు నువ్వు కూడా ఎలిమినేట్ అవ్వమని చెప్తాను. నెక్స్ట్సారి ఇలా మాట్లాడితే మాత్రం.. వాళ్లు ఎలిమినేట్ అయినప్పుడు వీళ్లను కూడా పంపించేయండి సర్.. వీళ్లిద్దరూ ప్యాకేజీ, కలిసి వచ్చారు అని నాగ్ సర్‌కు చెప్తాను. ఎంత ఇరిటేషన్ వస్తుందంటే.... హౌస్‌లో 19 మంది ఉన్నప్పుడు వేరు, 15 మంది ఉన్నప్పుడు వేరు, 10 మంది ఉన్నప్పుడు కూడా ఇంకా నీది నువ్వు మాట్లాడకుండా పక్కనవాళ్లది ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కాదు. నేనసలు ఎప్పుడైనా నీ(సిరి) గొడవలో ఇన్వాల్ అవుతానా? ' అని సిరితో సంభాషించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Big Boss Telugu Season 5 (@bigbosstelugu5.adda) షణ్ను అడిగిన ప్రశ్నకు సిరి స్పందిస్తూ.. నువ్వు నా గొడవలో జోక్యం చేసుకోవని చెప్పింది. అలాగే షణ్నుకు ఇతర హౌస్‌మేట్స్‌తో గొడవైనప్పుడు తాను కూడా కలగజేసుకోలేదని బదులిచ్చింది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. ఆయన రూల్స్ పెడతారు కానీ ఫాలో అవరని షణ్నూని విమర్శిస్తున్నారు. 'అంటే సరి-సన్నీ గొడవలో షణ్ను మధ్యలోకి వచ్చాడు కాబట్టి షణ్ను, సిరి ప్యాకేజీ అన్నమాట! సిరి ఎలిమినేట్ అయినప్పుడు షణ్నుని కూడా ఎలిమినేట్ చేయాలి' అని చెప్తున్నారు. వీళ్లిద్దరూ ప్యాకేజీ అని సరయూ మొదట్లోనే చెప్పింది, కానీ మనమే పట్టించుకోలేదని కామెంట్లు చేస్తున్నారు. -
సన్నీకి శివజ్యోతి చురకలు, నువ్వు నీతులు చెప్పకంటున్న నెటిజన్లు
Bigg Boss 5 Telugu, Trolling On Shiva Jyothi: కెప్టెన్సీ టాస్క్‌లో మొదలైన గొడవ చిలికి చిలికి గాలివానలా మారిన విషయం తెలిసిందే! సిరి, షణ్ను- సన్నీ కొట్టుకునే స్థాయికి వెళ్లారు. ఆడవాళ్లను అడ్డం పెట్టుకుని గేమ్ ఆడుతున్నావ్ అన్న సన్నీ వ్యాఖ్యలను షణ్ను ప్రేయసి దీప్తి సునయన తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే! సపోర్ట్‌గా నిల్చుంటే ఆడవాళ్లను అడ్డు పెట్టుకుని గేమ్ ఆడినట్లా? అని మండిపడింది. మరి నీకు కాజల్ సపోర్ట్ చేసినప్పుడు ఏమైంది? అని ప్రశ్నించింది. యూట్యూబ్ వరకే గుర్తుపెట్టుకో? అని సన్నీ హెచ్చరించడాన్ని సైతం తప్పుపట్టింది. ఎంతో కష్టపడి ఈ స్టేజ్ వరకు వచ్చాడని సంతోషించకుండా ఇలా నోటికొచ్చినట్లు మాట్లాడటం తప్పని హితవు పలికింది. తాజాగా మరో బిగ్‌బాస్ కంటెస్టెంట్ శివజ్యోతి కూడా షణ్నూకు మద్దతుగా నిలబడింది. దీప్తి సునయన ఇన్స్టాగ్రామ్ స్టోరీని షేర్ చేస్తూ.. 'ఆడవాళ్లని అడ్డం పెట్టుకుని ఆడటం అంటే? ఒకసారి మీరు కెప్టెన్ అవడానికి యానీ మాస్టర్ సపోర్ట్ చేశారు. ఇది లేడీ కార్డ్ వాడటం కాదా? గుర్తు తెచ్చుకోండి. హౌస్ బయట కాదు, హౌస్ లోపల హెల్తీ గేమ్ ఆడండి, మీరు మీ ఫ్రెండ్స్‌తో గేమ్ ఆడొచ్చు, మీ ఫ్రెండ్ మిమ్మల్ని సేవ్ చేయకపోతే అలగొచ్చు, ఏంటో మరి..' అని సన్నీకి చురకలు అంటించింది. అయితే సన్నీ ఫ్యాన్స్ శివజ్యోతి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'షణ్ను సిరి క్యారెక్టర్ గురించి మాట్లాడటంలో తప్పు లేదు, సిరి సన్నీ క్యారెక్టర్‌ను బ్యాడ్ చేయడంలో తప్పు లేదు, దీనికి షణ్ను సపోర్ట్ చేయడంలో అస్సలు తప్పు లేదు కదూ. మీరు కేవలం కొన్ని పాయింట్లే పట్టుకుని వేలాడకండి, అన్నింటి గురించి మాట్లాడండి. ఇలా పక్షపాతం చూపిస్తారనుకోలేదు, ఏంటో మరి' అని సెటైర్లు వేస్తున్నారు. షోని షోలాగే చూడండి, క్యారెక్టర్ జడ్జ్ చేయొద్దు అని నీతులు చెప్తూ వీడియోలు పెట్టారు, మరిప్పుడు మీరు చేస్తుందేంటి? అని నిలదీస్తున్నారు. 'నువ్వు బిగ్‌బాస్ మూడో సీజన్లో పాల్గొన్నప్పుడు గేమే ఆడలేదు, ఊరికే ఏడ్వడం తప్ప! అలాంటిది మీరు గేమ్ గురించి మాట్లాడుతున్నారు' అని ట్రోల్ చేస్తున్నారు. మరికొందరైతే ఇంకోసారి సన్నీని ఏమైనా అంటే మర్యాదగా ఉండదని వార్నింగ్ ఇస్తున్నారు. -
మానస్‌ను వాడుకుంది చాలు, వదిలెయ్: పింకీపై నెటిజన్ల ఫైర్
Bigg Boss Telugu 5, Priyanka Stop Using Maanas: ఎప్పుడూ గొడవలతో ఊగిపోయే కంటెస్టెంట్లు సైలెంట్‌గా ఉన్నారేంటి అనుకునేలోపే హౌస్మేట్స్ అందరూ విశ్వరూపం చూపించారు. ఒక్క కెప్టెన్సీ టాస్క్‌లోనే యానీ- కాజల్, సిరి, షణ్ను- సన్నీ, రవి- మానస్ గొడవపడ్డారు. ఈ కొట్లాటల తర్వాత వీళ్లెలా ఉన్నారో తెలియదు గానీ అభిమానులు మాత్రం ఆవేశంతో ఊగిపోతున్నారు. మా అభిమాన కంటెస్టెంట్ చేసింది కరెక్ట్ అంటూ ఎవరి ఫ్యాన్స్ వాళ్లకు సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేయడంలో తప్పు లేదు కానీ అవతలి కంటెస్టెంట్ మీద విరుచుకుపడుతూ నానా మాటలు అంటున్నారు. పింకీ వెన్నుపోటు పొడిచిందా? దీంతో నిన్నటి నుంచి సన్నీ, షణ్నుల పేర్లు సోషల్ మీడియాలో మార్మోగిపోతున్నాయి. వీళ్ల ఫ్యాన్స్ ఒకరినొకరు దూషించుకుంటూ నెట్టింట రచ్చరచ్చ చేస్తున్నారు. ఇదిలా వుంటే నిన్నటి టాస్క్‌లో ప్రియాంక వల్ల సన్నీ కెప్టెన్సీ కోల్పోయాడని చాలామంది వాదిస్తున్నారు. ప్రియాంక చీర తగిలే రెండుసార్లు అతడి టవర్ కూలిపోయింది. దీంతో మానస్ కూడా పింకీపై అనుమానం వ్యక్తం చేశాడు. ఒకసారంటే ఏదో అనుకోకుండా జరిగిందనుకోవచ్చు, కానీ రెండుసార్లు ఎలా సాధ్యమని సందేహపడ్డాడు. తను కావాలనే చేసినట్లు అనిపిస్తోందని మానస్, సన్నీ అభిప్రాయపడ్డారు. నమ్మినవాళ్లే వెన్నుపోటు పొడిస్తే ఎలా? అని సన్నీ బాధపడ్డాడు. ఇక పింకీ వల్ల మానస్ గ్రాఫ్ కూడా పడిపోతుందని ఆయన ఫ్యాన్స్ ఆగ్రహంతో ఉన్నారు. మానస్‌కు ఆ వీడియో చూపించాల్సిందే దీంతో మానస్‌ను వదిలెయ్ ప్రియాంక(#PriyankaStopUsingMaanas) అన్న హ్యాష్‌ట్యాగ్ ట్విటర్లో వైరల్‌గా మారింది. మానస్ ఆటను పింకీ సర్వనాశనం చేస్తోందంటూ ఆమెను దుమ్మెత్తిపోస్తున్నారు. కెప్టెన్సీ టాస్క్‌లో కావాలనే తన తనలతో టవర్ కూలిపోయేలా చేసి సన్నీకి నమ్మకద్రోహం చేసిందని విమర్శిస్తున్నారు. ఈ వీడియోను బిగ్‌బాస్ సన్నీ, మానస్‌లకు చూపించి వారి కళ్లు తెరిపించాలని కోరుకుంటున్నారు. అయితే ప్రియాంక అభిమానులు మాత్రం మానస్‌ను ఎంతో ప్రేమించే పింకీ అతడి నమ్మకాన్ని వమ్ము చేయదంటున్నారు. అనుకోకుండా జరిగిన పొరపాటుకు ఆమెను అనుమానించి కించపరచొద్దని కోరుతున్నారు. Wow... pinky , what a gamer you are 😡.. Claps needed 👏👏👏... #BiggBossTelugu5 #PriyankaStopUsingMaanas https://t.co/ljwNn1hBR7 — Sharmila (@Sharmila_146) November 13, 2021 Pinky did on purpose it was not saree but she only lean on the Sunny's box tower & acting as if she haven't did on purpose..#Sunny may or may not have won with equation 5:3 but double side pinky spoiled his fair chance.#PriyankaStopUsingMaanas #Maanas #Sunny#BiggBossTelugu5 pic.twitter.com/xW4eTjxBXY — CommonMan 🍥 (@Truly_CommonMan) November 13, 2021 Pinky please play ur game and let #Maanas play his game @StarMaa stop pushing priyanka onto maanas #BiggBossTelugu5 #priyankastopusingmaanas https://t.co/EgzNa4hd62 — MS👑 (@viren730) November 13, 2021 -
సన్నీని ఏకిపారేసిన దీప్తి సునయన.. స్ట్రాంగ్ కౌంటర్
Bigg Boss Telugu 5: Deepthi Sunaina Strong Counter To Vj Sunny : బీబీ హోటల్ టాస్క్‌లో షణ్ను, సన్నీలకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగిన సంగతి తెలిసిందే. కెప్టెన్సీ టాస్క్‌లో తన టవర్ కాపాడుకుంటున్న తరుణంలో సన్నీ-సిరిలకు మధ్య జరిగిన గొడవలో షణ్నూ కలగజేసుకోవడంతో గొడవ మరింత పెద్దదైంది. ఈ క్రమంలో సన్నీ-షణ్నూలకు మధ్య పెద్ద వారే జరిగింది. ఆడవాళ్లను అడ్డం పెట్టుకొని గేమ్ ఆడుతున్నావ్ అంటూ సన్నీ రెచ్చిపోయాడు. దీనిపై షణ్నూ గర్ల్‌ఫ్రెండ్ దీప్తి సునయన కౌంటర్ రిప్లై ఇచ్చింది. 'అప్పడం అయిపోతావ్ అనవసరంగానా? చేతగాని ఆటలు ఆడుతున్నాడు ఏంటి? ఫిజికల్ అయ్యి గట్టి గట్టిగా అరిస్తే గేట్ ఆడినట్లా? ఫిజికల్ అవ్వడం కన్నా కష్టం అయిన టాస్క్ మైండ్‌తో ఆడటం. అది షణ్నూ వంద శాతం ఇస్తున్నాడు. బిగ్‌బాస్ చూశాక తన మీద ప్రేమ మరింత పెరిగింది. ఎంత మెచ్యూర్‌గా బిహేవ్ చేస్తున్నాడు. సపోర్ట్‌గా నిల్చుంటే ఆడవాళ్లని అడ్డుపెట్టుకొని గేమ్ ఆడినట్లా? మరి నీకు కాజల్, మానస్ సపోర్ట్ చేసినప్పుడు ఏమైంది?నువ్వు ఎలా ఉండాలో మిగతా వాళ్లుకూడా అలానే ఉండాలా ఏంది? నువ్వు బెస్ట్ అనుకోం తప్పులేదు. కానీ మిగతా అందరిని ఎందుకు అలా చూస్తున్నారు?నీలా ఇంకొకరు ఉండలేరు. ఇంకొకరిలా నువ్వు ఉండలేవు. యూట్యూబ్ వరకే గుర్తుపెట్టుకోనా? ఈ స్టేజ్ వరకు వచ్చాడు అంటే ఎంత కష్టపడి వచ్చాడు అని హ్యాపీగా ఫీల్ అవ్వకుండా అలాంటి మాటలు అనడం తప్పు సన్నీగారు. మీకు రా అంటేనే పడలేకపోయారు. మరి మీరు అన్ని మాటలు అంటే ఎలా?' అంటూ సన్నీని ఏకిపారేసింది. దీనికి సంబంధించిన ఇన్‌స్టా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.మరోవైపు షణ్నూ ఆటను పొడగ్తలతో ముంచెత్తింది. 'తప్పు అయితే నేర్చుకుంటాం రా బై అని ఎంత బాగా చెప్పావ్ షణ్నూ..నిన్ను హగ్ చేసుకోవాలనుంది' అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. -
కళ్లు లేవా? కామన్ సెన్స్ లేదా? ఫాల్తూ, తంతా: కంటెస్టెంట్ల తిట్ల దండకాలు
Bigg Boss Telugu 5, Episode 69: బీబీ హోటల్ టాస్క్‌లో కాజల్ డబ్బులు దొంగిలించిన రవి వాటిని ఆమెకు తిరిగిచ్చేశాడు. మరోవైపు టిప్పు కోసం యానీ సన్నీనెత్తుకుని తిప్పింది. తర్వాత బిగ్‌బాస్ కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ ముగిసిందని ప్రకటించాడు. టాస్క్ ముగిసే సమయానికి హోటల్ సిబ్బంది దగ్గర రూ.9,500 మాత్రమే ఉన్నాయి. అతిథులు దగ్గర నుంచి 15 వేల రూపాయలు రాబట్టనందున హోటల్ సిబ్బంది ఓడిపోయిందని, అతిథుల టీమ్ గెలిచిందని ప్రకటించాడు బిగ్‌బాస్. ఇక రాత్రిపూట ముచ్చట్లు పెట్టిన రవి, షణ్ను, సిరి.. మానస్ ఎక్కువ పని చేస్తాడు కానీ సన్నీ మాత్రం ఏ పనీ చేయడని గుసగుసలాడారు. ఎప్పుడూ తప్పించుకు తిరుగుతాడని అభిప్రాయపడ్డారు. షణ్ముఖ్ ప్రెస్టీజ్ చాంపియన్ ఆఫ్ ది వీక్‌గా ఎంపికై రూ.25,000 గిఫ్ట్ వోచర్ అందుకోవడం విశేషం. ఇదిలా వుంటే సీక్రెట్ టాస్క్ విజయవంతంగా పూర్తి చేసిన రవిని కెప్టెన్సీ పోటీదారుడిగా ప్రకటించాడు బిగ్‌బాస్. అతిథుల టీమ్‌లో నుంచి ఇద్దరిని అనర్హులుగా ప్రకటించాలని హోటల్ సిబ్బందిని ఆదేశించగా వారు ఏకాభిప్రాయంతో మానస్, పింకీలపై వేటు వేశారు. దీంతో వారు కెప్టెన్సీకి పోటీపడే అవకాశాన్ని కోల్పోయారు. మిగిలిన సిరి, కాజల్, సన్నీ, రవి కెప్టెన్సీకి పోటీ పడ్డారు. వీరికి 'టవర్‌లో ఉంది పవర్' అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందులో పోటీదారులు టవర్ కట్టి అది కూలిపోకుండా చూసుకోవాలి. మొదటి లెవల్లో ఓడిపోయిన కాజల్.. రవికి సపోర్ట్ చేస్తున్న యానీకి గిలిగింతలు పెట్టింది. దీంతో మండిపోయిన యానీ.. ఓవరాక్షన్ చేయకని హెచ్చరించింది. మరోపక్క తనను గేమ్ ఆడనీయకుండా అడ్డుకున్న సిరిపై మండిపడ్డాడు సన్నీ. నీ టవర్‌ను తంతానని చెప్పాడు. నన్ను పట్టుకున్నప్పుడు తోసేస్తే అప్పడం అయిపోయేదానివన్నాడు. దీంతో మధ్యలో కలగజేసుకున్న షణ్ను ఏదీ, తన్ను చూద్దామంటూ మరింత రెచ్చగొట్టాడు. అలా వీరిద్దరి మధ్య పెద్ద వారే జరిగింది. సిరి, షణ్ను ఒకరి కోసం ఒకరు సపోర్ట్ చేసుకుంటూ ఇద్దరూ కలిసి సన్నీ మీదకు దూసుకెళ్లారు. కళ్లు లేవా? కామన్సెన్స్ లేదా? ఆడవాళ్లను అడ్డం పెట్టుకుని ఆడుతున్నావ్ అని ఎలా అంటావ్? అని సిరి సన్నీని ఏకిపారేసింది. సన్నీ కూడా ఆవేశంలో మాటలు తూలాడు కానీ నాగ్‌కు ఇచ్చిన మాట కోసం ఎవరికీ వేలు చూపించలేదు. ఇక యానీ.. ఈ గేమ్‌లో ఎవరికి సపోర్ట్ చేశావని కాజల్‌ను ప్రశ్నించగా ఆమె తెలివిగా సన్నీకి అని కాకుండా రవికి అని చెప్పింది. దీంతో చిర్రెత్తిపోయిన యానీ.. అన్ని ఫాల్తూ గేమ్ ఆడతావ్, నువ్వు గేమ్‌లో నన్ను టచ్ చేయొద్దు అని వార్నింగ్ ఇచ్చింది. ఒక్క గేమ్ నిజాయితీగా ఆడలేదంటూ ఆమె ముందుకెళ్లి నాగిణి డ్యాన్స్ చేసింది. ఆమెను వెక్కిరిస్తూ మరింత రెచ్చగొట్టింది. ఇదిలా వుంటే పింకీ చీర తగిలి టవర్ కూలిపోవడం సన్నీ గేమ్ నుంచి అవుట్ అయ్యాడు. అయితే పింకీ కావాలనే టవర్‌ను కూల్చిందని సన్నీ, మానస్ అభిప్రాయపడ్డారు. నమ్మినవాళ్లే మోసం చేస్తే ఇంకేం చేయాలని తెగ ఫీలయ్యారు. మొత్తానికి ఈ టవర్‌లో ఉంది పవర్ టాస్క్‌లో రవి గెలిచి కెప్టెన్‌గా అవతరించాడు. -
గేమ్ ఆడితే తంతా, అప్పడం అయితవ్!: సిరికి సన్నీ వార్నింగ్
Bigg Boss 5 Telugu Promo, Sunny Vs Shannu: ఈ వారం బిగ్‌బాస్ షో ఏ గొడవా లేకుండా సాగిపోతుంది అనుకుంటున్న తరుణంలో సన్నీ, షణ్ముఖ్ తగవులాడారు. కెప్టెన్సీ టాస్క్‌లో వీళ్లిద్దరూ పోట్లాటకు దిగారు. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. బిగ్‌బాస్ 10వ వారం 'టవర్‌లో ఉంది పవర్' అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. ఇందులో కెప్టెన్సీ కంటెండర్లు సిరి, సన్నీ, రవి, కాజల్ తాము చేసిన టవర్‌ను కాపాడుకుంటూనే ఇతరుల టవర్‌ను కూల్చాల్సి ఉంటుంది. దీనికి ఇంటిసభ్యుల సాయం కూడా తీసుకోవచ్చు. అయితే తన టవర్ కూల్చాలనుకుంటున్న సన్నీని గట్టిగా పట్టేసుకుని ఆపే ప్రయత్నం చేసింది సిరి. దీంతో చిర్రెత్తిపోయిన సన్నీ.. నన్నెందుకు పట్టుకున్నావని ఆవేశంతో ఊగిపోయాడు. 'నేను గేమ్ ఆడితే తంతా మరి! అప్పడం అయితవ్' అంటూ సిరికి వార్నింగ్ ఇచ్చాడు. ఇది నచ్చని షణ్ముఖ్ తనేం అనలేదు కదా అని సిరిని వెనకసుకొచ్చాడు. దీంతో మరింత ఉడికెత్తిపోయిన సన్నీ.. నువ్వాగు అంటూ అతడి మీదమీదకొచ్చాడు. దీంతో సీరియస్ అయిన షణ్ను.. నువ్వు తన్నలేవు? రా వచ్చి తన్ను అంటూ సన్నీని మరింత రెచ్చగొట్టాడు. ఆడపిల్లను పంపించి నువ్వు మాట్లాడుతున్నావు, చేతగాని ఆటలు ఆడుతున్నావని ఫైర్ అయ్యాడు సన్నీ. మరి వీరిద్దరి మధ్య గొడవలు ఎటువైపుకు దారితీస్తాయో చూడాలి! -
పేరుకు రిచ్.. కానీ చేసేది దొంగతనం!
Bigg Boss Telugu 5 Latest Promo: గతంలో ఇచ్చిన బిగ్‌బాస్ హోటల్ టాస్క్‌ను ఉన్నదున్నట్లుగా దింపాడు బిగ్‌బాస్. కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో భాగంగా హౌస్‌లో బీబీ హోటల్ రన్ అవుతోంది. ఇందులో జీవితంలోనే మొట్టమొదటిసారి ఫైవ్ స్టార్ హోటల్‌కు వచ్చిన వ్యక్తిలా సన్నీ ఇరగదీస్తుంటే డాన్ కూతురిగా సిరి రెచ్చిపోతోంది. ఇక హనీమూన్ జంట కోసం ప్రత్యేకంగా తయారు చేసిన పూలపాన్పుపై సన్నీ పడుకుని యానీకి రావాల్సిన టిప్పును చెడగొట్టాడు. షణ్ముఖ్, శ్రీరామ్, యానీ.. అతిథులకు అన్ని సపర్యలు చేసినా ఒక్కరూ సరిగా టిప్ ఇవ్వకపోవడంతో అసహనానికి లోనయ్యారు. తన దగ్గర దొంగిలించిన 1700 రూపాయలు తిరిగి ఇచ్చేదాకా పైసా టిప్పు కూడా ఇవ్వమని తెగేసి చెప్పింది కాజల్. అయితే మేము సర్వీసులు ఆపేస్తామని ఎదురు తిరిగాడు రవి. దీంతో సిరి, మానస్, కాజల్ హోటల్లో ఫుడ్ దొంగతనం చేసి తిన్నారు. మరి ఈ దొంగతనంపై హోటల్ సిబ్బంది ఎలా స్పందిస్తారు? దీనికి తగ్గ రుసుము వారి దగ్గరి నుంచి రాబడతారా? లేదా? అన్నది తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే! చదవండి: అందుకే ప్రియాంకకు సపోర్ట్ చేయం.. హిజ్రా ఫౌండర్ -
కాజల్‌కు షాకిచ్చిన రవి, మేడమ్ మేడమ్ అంటూనే..
Bigg Boss 5 Telugu, Episode 67: కేక్ తినే అర్హత ఎవరికి ఉందని కంటెస్టెంట్లు చర్చోపచర్చలు పెట్టారు. ఈ తొక్కలో మీటింగ్ ఏంటో అర్థం కాని సన్నీ తినేస్తే పోలా అని కేక్ తీసుకుని లాగించాడు. ఖరాబవుతుందని తిన్నానంటూనే ఇప్పుడు ఏం పంచాయితీ అవుతుందోనని మథనపడ్డాడు. అన్నట్లుగానే యానీ మాస్టర్ వచ్చి సన్నీ స్ట్రాటజీ ప్లే చేస్తున్నాడని, నువ్వెలా తింటావని తిట్టుకుంటూ వెళ్లి ఏడ్చేసింది. బిగ్‌బాస్ బీబీ హోటల్ అనే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ ఇచ్చాడు. ఇందులో హౌస్ కీపింగ్ స్టాఫ్‌లో ఉంటూనే అతిథులకిచ్చే సర్వీసులను చెడగొట్టమని రవికి సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. బీబీ హోటల్లో శ్రీరామ్, షణ్ముఖ్ చెఫ్స్, వెయిటర్లుగా, యానీ మాస్టర్ మేనేజర్, రిసెప్షనిస్ట్‌గా, రవి ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న హౌస్ కీపింగ్, మానస్- ప్రియాంక హనీమూన్‌కు వచ్చిన జంట, కాజల్.. హోటల్ ఓనర్‌కు స్నేహితురాలు, సన్నీ తొలిసారి 5 స్టార్ హోటల్‌కు వచ్చిన అతిథిగా, సిరి.. ఎంతో గారాబంగా పెరిగిన డాన్ కూతురుగా నటించాల్సి ఉంటుంది. ఈ టాస్క్‌లో హోటల్ సిబ్బంది అతిథుల నుంచి రూ.15 వేల రూపాయలు గెలిస్తే వారు గెలిచినట్లు లెక్క! టాస్క్ మొదలవగానే ఇంటిసభ్యులు రెచ్చిపోయి మరీ ఆడారు. సన్నీ, సిరి అయితే పాత్రలో జీవించారు. దొరికిందే ఛాన్స్ అనుకున్న సిరి షణ్ముఖ్‌ను ముప్పుతిప్పలు పెడుతూ మూడు చెరువుల నీళ్లు తాగించింది. సిరితో ఈజీ కాదు అని పాట పాడుతూ స్విమ్మింగ్ పూల్‌లోని నీటిని స్పూన్‌తో తీస్తూ కాఫీ కప్పు నింపాడు షణ్ను. దీంతో అతడికి టిప్పిచ్చింది సిరి. సన్నీ తనను టచ్ చేస్తుంటే సైలెంట్‌గా ఉన్నావేంటని మానస్ మీద చిర్రుబుర్రులాడింది పింకీ. మరోపక్క రవి.. కాజల్ బ్యాగులోంచి డబ్బులు కొట్టేసి ఏమీ ఎరగనట్లున్నాడు. దీంతో కాజల్ డబ్బులు పోయాయంటూ మొత్తుకుంది. మరి రేపటి ఎపిసోడ్లో అతిథులు హోటల్ సిబ్బందిని ఇంకెన్ని తిప్పలు పెడతారో చూడాలి! చదవండి: బిగ్‌బాస్ షోలో షాకింగ్ ఘటన, కంటెస్టెంట్ సూసైడ్ అటెంప్ట్! -
రవికి సీక్రెట్ టాస్క్, షణ్నును ఆడేసుకున్న సిరి
Bigg Boss Telugu 5 Today Promo: మరీ ఎక్కువగా ఆలోచిస్తే అన్నీ అనుమానాలే పుట్టుకొస్తాయి. బిగ్‌బాస్ కేక్ పంపించి ఇది తినే అర్హత మీలో ఎవరికి ఉంది? అని అడిగితే ఏ ఒక్కరూ టచ్ చేయలేకపోయారు. దీనివల్ల నామినేషన్లో పడతామేమో, లేదంటే నేరుగా ఎలిమినేట్ చేస్తారేమో అని రకరకాలుగా ఆలోచించారు. అయితే సన్నీ మాత్రం ఏదైతే అది అవుతుందని ఆ కేక్‌ను చటుక్కుమని తీసి లటుక్కున తినేశాడు. ఖరాబైతదని తింటున్నానంటూ కవరింగ్ ఇచ్చాడు. మరో ప్రోమోలో గత సీజన్‌లోని బీబీ హోటల్ టాస్క్ మరోసారి ప్రవేశపెట్టాడు. ఈ టాస్క్‌లో శ్రీరామచంద్ర, షణ్ముఖ్ చెఫ్స్ అండ్ వెయిటర్లుగా, మానస్- ప్రియాంక హనీమూన్ జంటగా, సన్నీ మొదటిసారి ఫైవ్‌స్టార్ హోటల్‌కు వచ్చిన గెస్ట్‌గా నటించాల్సి ఉంటుంది. దొరికిందే ఛాన్స్ అని రెచ్చిపోయిన సిరి.. షణ్నుతో సపర్యలు చేయించుకుంది. దీంతో అతడు సిరితో అంత ఈజీ కాదు అని ఉన్నమాటనే పాట రూపంలో పాడుకున్నాడు. మరోవైపు బిగ్‌బాస్ యాంకర్ రవికి మరోసారి సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. మరి రవి ఆ సీక్రెట్ టాస్క్‌ను విజయవంతంగా పూర్తి చేశాడా? లేదా? బీబీ హోటల్లో కంటెస్టెంట్లు ఏ రేంజ్లో రచ్చ చేసారో చూడాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే! -
నువ్వు అన్నీ మానస్‌కే ఇచ్చుకో: ప్రియాంకపై సన్నీ సెటైర్లు
Bigg Boss 5 Telugu Today Promo: కంటెస్టెంట్ల కోసం బిగ్‌బాస్ ఓ గిఫ్ట్ పంపాడు. నోరూరించే ఫుడ్ ఐటమ్‌ను పంపి ఇది తినే అర్హత మీలో ఏ ఒక్కరికి ఉంది? అని అడిగాడు. దీంతో ఇంటిసభ్యులు దీని వెనకాల ఏమైనా మతలబు ఉందా? అని బుర్రలు బద్ధలు చేసుకున్నారు. ఇది చూసిన సన్నీ 'ఈ తొక్కలో డిస్కషన్ ఏంటో అర్థం కావడం లేదు, పోనీ నేను లటుక్కుమని తినేయనా?' అని అడిగాడు. కాజల్ అందుకు పచ్చజెండా ఊపినప్పటికీ యానీ మాస్టర్ మాత్రం వద్దని వారించింది. ఇక శ్రీరామ్ అయితే దాని చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. చివరగా యానీ.. తాను కెప్టెన్‌ను కాబట్టి తినడానికి తనకే అర్హత ఉందని చెప్పింది. అయితే ఇంటిసభ్యుల అభిప్రాయం కూడా కనుక్కుందామని చూసింది. ఇంతలో ప్రియాంక.. నాకు మానస్‌కు ఇవ్వాలని ఉంది అనగా సన్నీ.. నువ్వు అన్నీ మానస్‌కే ఇచ్చుకో, పో లోపలికి.. అని ఫన్నీ కౌంటర్ ఇచ్చాడు. మరి ఈ కేక్ ఎవరు తిన్నారు? అసలు తిన్నారా? లేదా? అనేది తెలియాలంటే నేటి బిగ్‌బాస్ ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే! -
బిగ్‌బాస్: హీరో అంటూనే నామం పెట్టారు! ఆవిడే విలన్!
Bigg Boss 5 Telugu, Episode 63: సిరిని ఓదార్చడానికి షణ్నుకు తల ప్రాణం తోకకొచ్చింది. 'దీనమ్మ ప్రేమేందిరాబై గిట్ల సంపుతున్నాది, పోరీ పీకినాక హ్యాంగోవర్ టార్చరున్నాది..' అంటూ ఒంటరిగా పాటందుకున్నాడు. అయినా దీపు(దీప్తి సునయన)ను భరిస్తే ఎవరినైనా భరించగలను అంటూ తనను తానే ఓదార్చుకున్నాడు. మరోపక్క పింకీ.. దేవుడు నాకు మంచి లైఫ్ ఇచ్చి ఉంటే బాగుండేది అంటూ అర్ధరాత్రి ఏడుపందుకుంది. అప్పుడు నీతో హ్యాపీగా ఉండేదాన్నని మానస్‌తో గోడు చెప్పుకుంటూ బాధపడింది. దీంతో మానస్.. ఆమెను చేరదీసి ఓదార్చాడు. కెప్టెన్‌గా షణ్నుకు 9 మార్కులు: నాగ్ కానీ మరుసటి రోజు మాత్రం పింకీకి క్లాస్ పీకాడు. 'నువ్వు కావాలని, ఏదో అనుకుని నాతో మాట్లాడుతున్నావు, నేను చిన్నపిల్లాడిని కాదు, నాకు తెలీదు అనుకోకు..' అని చురకలంటించాడు. దీంతో పింకీ సరేనని తలూపింది. కెప్టెన్సీ టాస్క్‌లో షణ్ను తమను సపోర్ట్ చేయలేదని అటు సిరి, ఇటు జెస్సీ బాగా హర్టయ్యారు. దీంతో షణ్ను వాళ్లిద్దరినీ బతిమాడలేక చచ్చిపోయాడు. నాగార్జున స్టేజీపైకి వచ్చీరావడంతోనే యానీ కెప్టెన్ అయిందంటూ ఆమెను మెచ్చుకున్నాడు. కెప్టెన్‌గా నీకు నువ్వు ఎన్ని మార్కులిచ్చుకుంటావని నాగ్ అడగ్గా అతడు 7 అని టపీమని ఆన్సరిస్తాడు. కానీ తాను మాత్రం 9 మార్కులిస్తానని చెప్పాడు నాగ్. ఇక కొద్దిరోజులుగా దూరందూరంగా ఉంటున్న సిరి, షణ్నులను ఫ్రెండ్షిప్ సాంగ్‌తో కలిపేశాడు నాగ్. (చదవండి: Archana: ఆ హీరో వంకరగా ఆలోచించేవాడు.. అతడి నిజస్వరూపం వేరే..) కాజల్‌తో నాగిన్ జ్యూస్ తాగిపించిన యానీ కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో నిన్ను చిత్రహింసలు పెట్టిన టీమ్‌లో నుంచి ఒకరిపై ప్రతీకారం తీర్చుకోమని అవకాశం ఇచ్చాడు నాగ్. దీంతో రవి.. సోయా సాస్, చిల్లీ సాస్, గుడ్డు.. అన్నీ కలిపి దానికి షణ్స్ సిర్స్ జెస్స్ కాక్టెయిల్ అని పేరుపెట్టాడు. తప్పించుకునే దారి లేక షణ్ను దాన్ని అతి కష్టం మీద దాన్ని తాగేశాడు. యానీ... కాజల్‌తో మిర్చి తినిపించి తర్వాతో నాగిన్ జ్యూస్ తాగమని చేతికందించింది. అయితే కాజల్ ఎత్తిన గ్లాసు దించకుండా తాగి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రియాంక ఇచ్చిన పచ్చిగుడ్డును మింగేశాడు రవి. శ్రీరామ్.. సన్నీతో మిర్చి తినిపించాడు. ఆ వెంటనే జ్యూస్‌లో ఇంకేవేవో కలపడానికి ప్రయత్నించగా మొగడా ఆగరా అంటూ విసుక్కుంటూనే మొత్తానికి తాగేశాడు సన్నీ. నేను నమ్మే ఏకైక వ్యక్తి ఇతడే: కాజల్ హౌస్‌మేట్స్‌తో నాగ్.. ఎవరు హీరో? ఎవరు విలన్? గేమ్ ఆడించాడు. ముందుగా సిరి.. షణ్ముఖ్‌కు స్టార్ బ్యాడ్జ్ పెట్టి అతడు ఎప్పుడూ హీరోనే అని చెప్తూ మురిసిపోతూ, ప్రియాంక సింగ్ తనకు విలన్ అని పేర్కొంది. ప్రియాంక.. మానస్ హీరో అని, సిరి విలన్ అని తెలిపింది. శ్రీరామ్.. విశ్వ తన హీరో అని, సిరి విలన్ అని పేర్కొన్నాడు. కాజల్.. నన్ను విలన్ అనుకుంటున్న యానీయే విలన్ అని చెప్పుకొచ్చింది. ఇక సన్నీకి హీరో బ్యాడ్జ్ పెట్టబోగా అతడు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదన్నాడు. దీంతో కాజల్ యూటర్న్ తీసుకుని మానస్‌కు స్టార్ బ్యాడ్జ్ పెట్టింది. నేను నమ్ముతున్న ఏకైక వ్యక్తి మానస్ అంటూ అతడిని హీరోను చేసింది. సన్నీ.. జెస్సీ హీరో అవ్వాలంటూ అతడికి స్టార్ బ్యాడ్జ్ పెట్టాడు. ప్రియాంకను విలన్ అని చెప్పుకొచ్చాడు. తర్వాత సిరి సేఫ్ అయినట్లు ప్రకటించాడు నాగ్. నాకెప్పుడూ ఒకరే విలన్: షణ్ను తర్వాత రవి వంతు రాగా.. తన నమ్మకం ఎప్పుడూ వమ్ము చేయలేదని, టాస్కుల్లో 100 శాతం కష్టపడతాడంటూ విశ్వను హీరోగా పేర్కొన్నాడు. ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియని షణ్ను విలన్ అని చెప్పాడు. ఇక షణ్ను.. తనకెప్పుడూ ఒకరే విలన్ అంటూ రవి మీద క్రాస్ గుర్తు గుద్దాడు. ఈ విలన్ లేకపోతే తాను హీరో అవలేనన్నాడు. అబ్బాయిల కంటే దారుణంగా గేమ్ ఆడే సిరి హీరో అని పొగిడాడు. యానీ.. కాజల్‌తో కంఫర్టబుల్‌గా లేనంటూ ఆమెను విలన్‌గా పేర్కొంది. మొదటి వారం నుంచి చాలా చక్కగా ఆడుతాన్నాడంటూ విశ్వకు స్టార్ బ్యాడ్జ్ ఇచ్చింది. విశ్వ.. గేమ్ ఛేంజర్ శ్రీరామ్ హీరో అని, ప్రియాంక సింగ్ విలన్ అని అభిప్రాయపడ్డాడు. పాపం సన్నీ, ఆఖరికి కమెడియన్.. జెస్సీ.. తన గురించి ఎంతో కేర్ తీసుకుంటూ, అమ్మలా చూసుకునే సిరి హీరో అని ఆకాశానికెత్తాడు. గేమ్‌లో డల్ అవుతున్న కాజల్ విలన్ అని చెప్పుకొచ్చాడు. మానస్.. ప్రియాంక తనకు హీరో అని చెప్పడంతో ఆమె ఆనంద భాష్పాలు కార్చింది. అనంతరం రవి విలన్ అని చెప్పాడు. మొత్తంగా ఈ టాస్క్‌లో విశ్వ ఈ హౌస్‌కు హీరోగా, ప్రియాంకను విలన్‌గా తేల్చేశాడు నాగ్. హీరో, విలన్ ఏ ట్యాగూ రాని సన్నీని హీరోకు, విలన్‌కు మధ్యలో ఉన్న కమెడియన్ అన్నాడు నాగ్. ఏదేమైనా విశ్వను హీరో అంటూనే హౌస్ నుంచిం పంపించి వేస్తున్నట్లు తెలుస్తోంది. ] -
ఈ విలన్ లేకపోతే నేను హీరో కాలేను: షణ్ను
ఈ వారం బిగ్‌బాస్ ఇచ్చిన సూపర్ హీరో వర్సెస్ సూపర్ విలన్స్ టాస్క్‌లో కంటెస్టెంట్లు రెచ్చిపోయారు. దాదాపు అందరూ తమ బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించారు. తాజాగా నాగార్జున వీరికి.. మీకు హౌస్‌లో ఎవరు హీరో? ఎవరు విలన్? అనే గేమ్ ఆడించారు. దీంతో యానీ.. కాజల్‌ను విలన్ అని తేల్చేసింది. ప్రియాంక, శ్రీరామ్.. సిరిని విలన్‌గా పేర్కొన్నట్లు కనిపిస్తోంది. ఇక రవి, షణ్ను ఇద్దరూ ఒకరికొకరు విలన్ ట్యాగ్ ఇచ్చుకున్నారు. ఈ సందర్భంగా షణ్ను.. ఈ విలన్ లేకపోతే తాను హీరో అవలేనని చెప్పుకొచ్చాడు. ఇక ప్రియాంక.. తనకు మానస్ హీరో అని చెప్పగా అతడు కాకుండా వేరే పేరు చెప్పమని అడిగాడు నాగ్. నిన్ను ఎంత ఏడిపించినా అతడే హీరోనా? అని ప్రశ్నించగా అవునని తలూపుతూ సిగ్గుపడిపోయింది పింకీ. ఇక సిరి.. షణ్ను ఎప్పుడూ హీరోనే అంటూ అతడికి హీరో ట్యాగ్ ఇచ్చింది. దీంతో వీళ్ల ఫ్రెండ్షిప్ను చూసి సంతోషపడుతున్నారు ఫ్యాన్స్. ఇక సన్నీకి ఎవరూ విలన్, హీరో ట్యాగ్ ఇవ్వకపోవడంతో తెగ బాధపడిపోయాడు. ఏదో ఒకటి ఇచ్చి చావచ్చు కదా అన్నాడు. దీంతో నాగ్.. సన్నీ విలన్‌కు, హీరోకు మధ్యలో ఉండే కమెడియన్ అని సెటైర్ వేశాడు. -
యాటిట్యూడ్‌తో సన్నీని మళ్లీ రెచ్చగొట్టిన షణ్ను
బిగ్‌బాస్ ఇచ్చిన కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో కంటెస్టెంట్లు ఒకరినొకరు తోసుకుంటూ నెట్టేసుకుంటూ గొడవలకు దిగుతున్నారు. అలా నెట్టేయడం కరెక్ట్ కాదని విశ్వకు సూచించాడు మానస్.. ఇదిలా వుంటే స్వాప్ ఆప్షన్‌తో బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్. తమ టీమ్‌లోని ఒకరిని మరొక టీమ్‌లోని ఒకరితో స్వాప్(మార్పు) చేసుకోవాలని చెప్పాడు. దీంతో తమ టీమ్‌లో నుంచి ఎవరిని పంపించి అవతలి టీమ్‌లో నుంచి ఎవరిని తీసుకోవాలా? అని ఆలోచనలో పడ్డారు హౌస్మేట్స్. అయితే సన్నీ.. ఇదొక ఆప్షన్ మాత్రమేనని చెప్పగా షణ్ముఖ్ మధ్యలో అడ్డుకుంటూ ఇది ఆప్షన్ కాదని చెప్పుకొచ్చాడు. అవకాశం ఇస్తున్నాం అంటే అదొక ఆప్షన్ మాత్రమేనని.. తెలుగులో ఎవరికైనా ఇదే అర్థమవుతుందని సన్నీ పేర్కొనగా అయితే నేను ఇంగ్లీషులో విన్నాను అని ఫైర్ అయ్యాడు షణ్ను. నేను చాలా కూల్‌గా చెప్తున్నా.. అని సన్నీ నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా.. ఇక్కడ ఏసీ వేయలేదు, వేడిగా ఉందని అతడు కౌంటరిచ్చాడు. ఈ క్రమంలో వీరిద్దరికీ మధ్య మరోసారి లొల్లి షురూ అయింది. నాకూ యాటిట్యూడ్ ఉంటుంది, కానీ అది వేరే ఉంటుంది అని సన్నీ వార్నింగ్ ఇవ్వగా చూపించమని రెచ్చగొట్టాడు షణ్ను. మరి బిగ్‌బాస్ చెప్పిన స్వాప్ అనేది కేవలం ఆప్షన్ మాత్రమేనా? లేదా తప్పనిసరిగా స్వాప్ చేయాల్సిందేనా? అనేది తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే! -
జెస్సీకి అస్వస్థత, లెక్క చేయని షణ్ముఖ్, సిరి
Bigg Boss 5 Telugu, 9th Week Nominations: జెస్సీ పొద్దుటినుంచి వాంతింగ్ చేసుకుంటుంటే పక్కనే ఉండి కాసేపు అతడికి అండగా నిలబడ్డాడు. జెస్సీ ఆరోగ్యం బాగోలేకపోతే షణ్నూ, సిరి ఏమాత్రం పట్టించుకోవట్లేదేంటని సన్నీ మానస్‌తో వాపోయాడు. కానీ మానస్ వాళ్ల మధ్యలోకి వెళ్లకని సలహా ఇచ్చాడు. మరోవైపు జెస్సీ లోపలికి వెళ్లి బెడ్‌పై కూర్చుని అవస్థ పడుతున్నాడు. అతడి పక్కనే ఉన్న షణ్ను చూసి వదిలేశాడే కానీ, కనీసం ఏమైందని కూడా ఆరా తీయకపోవడం గమనార్హం. సీక్రెట్ టాస్క్ ఫెయిలయినప్పటి నుంచి జెస్సీని వాళ్లు దూరం పెడుతున్నారని మానస్ అభిప్రాయపడ్డాడు. అనంతరం 9వ వారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. నామినేట్ చేయాలనుకున్న ఇద్దరు ఇంటి సభ్యులకు ఫోమ్ పూసి తగు కారణాలు చెప్పి నామినేట్ చేయాలని ఆదేశించాడు బిగ్‌బాస్. ప్రతివారం ఎవరో ఒకరు వెళ్లిపోవాలని, నువ్వెళ్లిపోయినా నాకు ఫరాఖ్ పడదంటూ శ్రీరామ్‌ను నామినేట్ చేశాడు మానస్. నువ్వు ఉన్నా ఫరాఖ్ పడదని కౌంటరిచ్చాడు శ్రీరామ్. తర్వాత సంచాలకుడిగా సరైన నిర్ణయం తీసుకోలేదని జెస్సీని నామినేట్ చేశాడు. కాలేజీ బ్యాచ్‌లాంటి గొడవలొద్దంటూ శ్రీరామ్.. సన్నీ, మానస్‌ను నామినేట్ చేశాడు. 'అన్నీ గుడ్ క్వాలిటీస్, ఫెంటాస్టిక్ పర్సన్.. కానీ ధైర్యం కోల్పోతున్నావ్' అంటూ రవి.. మానస్‌ను, తర్వాత కాజల్‌ను నామినేట్ చేశాడు. పింకీ.. స్ట్రాంగ్ అంటూ విశ్వను, రవి ఆలోచనలను అందుకోలేకపోతున్నానని అతడిని నామినేట్ చేసింది. సిరి.. సన్నీ, యానీని; జెస్సీ.. సన్నీ, మానస్‌ను; సన్నీ.. జెస్సీ, సిరిని నామినేట్ చేశారు. స్ట్రాంగ్‌గా ఉండేవాళ్లు వెళ్లిపోవాలంటే వీక్‌గా ఉండేవాళ్లు కూడా ఈ ఇంట్లో ఉండేందుకు అర్హత లేదంటూ విశ్వ ప్రియాంకను, తర్వాత మానస్‌ను నామినేట్ చేశాడు. ఇక కాజల్- రవి మధ్య మరోసారి ఫైట్ జరిగింది. ఆమె రవితోపాటు శ్రీరామ్‌ను నామినేట్ చేసింది. యానీ.. సిరి, కాజల్‌ను నామినేట్ చేసింది. షణ్ను.. మానస్‌తో పాటు ప్రియాంకను నామినేట్ చేశాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. 'ప్రియాంక నీ గేమ్ నువ్వే ఆడు, అందరిలో నువ్వే స్ట్రాంగ్ అనిపిస్తావు' అని సలహా ఇచ్చాడు. దీంతో చిర్రెత్తిపోయిన పింకీ.. 'నామినేట్ చేసి వెళ్లిపోయాక ఇంకెవరు ఆడతారు?' అని చిర్రుబుర్రులాడింది. అయినా నేను ఏ గేమ్ సరిగా ఆడటం లేదో చెప్పాలి కదా! అని ఆవేశపడింది. షణ్ను ఫోమ్ పూయబోతే పింకీ ఆ ప్లేట్‌ను తన ముఖాన గట్టిగా కొట్టుకుంది. నామినేషన్ పూర్తయ్యాక సిరి మరోసారి సన్నీని ఎందుకు నామినేట్ చేశానో అర్థమయ్యేలా చెప్పాలనుకుంది. కానీ ఇది వారిద్దరి మధ్య గొడవలకు దారి తీసింది. హైలైట్ అవ్వాలనే ఇలా చేసింది అని సన్నీ మానస్ గుసగుసలు పెట్టడంతో వినేసిన సిరి... నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఎవరూ పడరిక్కడ అని గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇక ఈ వారం మానస్, సన్నీ, శ్రీరామ్, సిరి, కాజల్, ప్రియాంక, రవి, జెస్సీ, యానీ, విశ్వ నామినేట్ అయినట్లు ప్రకటించాడు బిగ్‌బాస్. చదవండి: బిగ్‌బాస్‌లో లోబో మిత్రువులు, శత్రువులు ఎవరో తెలుసా? -
బిగ్‌బాస్ హౌస్‌లో కాటు వేసే నాగిణి ఎవరో తెలుసా?
Bigg Boss Telugu 5, Episode 56: బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు పూరీలు చేసే టాస్క్ ఇచ్చాడు. యానీ మాస్టర్, శ్రీరామ్, విశ్వ, రవి, లోబో ఒక టీమ్ కాగా మిగిలినవారంతా మరో టీమ్. ఈ గేమ్‌లో కాజల్ టీమ్ ముందుగా 50 పూరీలు చేసినప్పటికీ అవి సరిగా లేవంటూ సంచాలకుడు షణ్ను యానీ టీమ్‌ను విజేతగా ప్రకటించాడు. దీంతో గెలిచిన టీమ్ సభ్యులందరికీ ఏడాది పాటు వంటనూనె ఉచితంగా లభించే ఆఫర్ అందుకున్నారు. అయితే కాజల్ వాళ్లు కష్టపడి త్వరగా పూరీలు చేశారని సన్నీ జైల్లో నుంచి తన ఒపీనియన్ చెప్పాడు. దీంతో చిర్రెత్తిపోయిన యానీ.. 'బుద్ధుండాలి, మధ్యలో నీ జడ్జిమెంట్ ఏంటి? న్యూట్రల్‌గా మాట్లాడు' అని వేలెత్తి చూపుతూ రెచ్చిపోయింది. సౌతిండియన్, నార్తిండియన్ అంటూ వీళ్లిద్దరూ ఎక్కడెక్కడికో వెళ్లిపోయారు ఈ గొడవ చిలికి చిలికి గాలివానలా మారగా విసిగిపోయిన సన్నీ చెంపలేసుకున్నాడు. వీళ్లిద్దరికీ గొడవ జరుగుతుంటే షణ్ను నవ్వాపుకోలేకపోయాడు. ఒకపక్క హౌస్ అంతా ఆవేశంతో ఊగిపోతుంటే కెప్టెన్ మాత్రం దాన్ని ఎంజాయ్ చేస్తూ నవ్వడమేంటని ఫైర్ అయ్యాడు సన్నీ. 'హౌస్‌లో కొందరు బాధపడుతుంటే నీకు నవ్వొస్తుంది, అది తప్పు' అని నొక్కి చెప్పాడు. ఆ మాటలను పెద్దగా పట్టించుకోని షణ్ను తన నవ్వును కంటిన్యూ చేస్తూ సన్నీని మరింత రెచ్చగొట్టాడు.నువ్వు కొడతానంటే కొట్టు, వెయిట్ చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. ఈ గొడవలతో హౌస్ అంతా హీటెక్కిపోగా వారికి కూల్ చేసేందుకు స్టేజీపై ఎంటరయ్యాడు నాగార్జున. రవి.. డబ్బుల గురించి రాలేదని, నా భార్యాపిల్లలు ఎలా ఉన్నారో చెప్పండని, లేదంటే బిగ్‌బాస్ నుంచి పంపించివేయండి అని మాట్లాడిన వీడియో క్లిప్పింగ్ చూపించాడు నాగ్. నువ్వు వెళ్లిపోతానంటే చెప్పు గేట్లు ఓపెన్ చేయిస్తానని హెచ్చరించాడు. కెప్టెన్సీ టాస్క్‌ను మధ్యలో వదిలేసిన యానీ మాస్టర్‌ను బిగ్‌బాస్ హౌస్‌లో ఉండి ఎందుకు? అని ప్రశ్నించాడు. ఇకపై డల్‌గా ఉండొద్దని సూచించాడు. కాజల్‌ను తొండాట వద్దని, పద్ధతిగా ఆడమని హితవు పలికాడు. తర్వాత సన్నీ ఫొటోను చేతులతో చింపేశిన నాగ్.. వరస్ట్ పర్ఫామర్‌గా జైలుకు పంపించినా మార్పు రాలేదా? అని నిలదీశాడు. ఒక వ్యక్తి పట్టుకున్న బ్యాగును తన్నడం సరైనదా? అని తిట్టిపోశాడు. బాగా ఆడుతున్నావ్ అంటూనే కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోమని సూచించాడు. తర్వాత హౌస్‌మేట్స్‌తో వైకుంఠపాళి గేమ్ ఆడించాడు నాగ్. ఈ ఇంట్లో పైకి వెళ్లకుండా కాటేసేది, ముందుకు వెళ్లడానికి నిచ్చెనలా సాయం చేసేది ఎవరో చెప్పాలని ఆదేశించాడు. ముందుగా కాజల్.. తను ముందుకు వెళ్లడానికి సాయపడే నిచ్చెన మానస్ అని, పాములా అడ్డుకునేది శ్రీరామ్ అని చెప్పుకొచ్చింది. రవి.. తనను పైకి ఎక్కించేది షణ్ను అని, కాజల్‌తో కనెక్షన్ అవడం లేదంటూ ఆమెను పాముగా పేర్కొన్నాడు. జెస్సీ.. విశ్వ నిచ్చెన అని, తనకు గొడవలు నచ్చవంటూ సన్నీని పాముగా తెలిపాడు. ప్రియాంక.. అందరూ ఊహించినట్లుగానే మానస్ తనను ముందుకు తీసుకెళ్లే నిచ్చెనగా, లోబోను పాముగా పేర్కొంది. సన్నీ.. మానస్ నిచ్చెన అని, సైలెంట్‌గా ఉంటూ కాటేసే షణ్ముఖ్ పాము అని అభిప్రాయపడ్డాడు. యానీ.. రవిని నిచ్చెనగా, కాజల్‌ను పాముగా; విశ్వ.. లోబోను నిచ్చెనగా, కాజల్‌ను పాముగా తెలిపారు. లోబో.. రవి నిచ్చెన అని, సన్నీ పాము అని చెప్పుకొచ్చాడు. సొంత నీడను కూడా నమ్మొద్దని, ఇప్పటికైనా కళ్లు తెరువు అని లోబో సన్నీకి క్లాస్ పీకాడు. శ్రీరామచంద్ర.. యానీ నిచ్చెన అని, పాములో ఉండాల్సిన లక్షణాలన్నీ కాజల్‌కు ఉన్నాయని తెలిపాడు. మానస్.. సన్నీని నిచ్చెనగా, రవిని పాముగా అభిప్రాయపడ్డాడు. రవి కరెక్ట్ టైంలో సపోర్ట్ చేయలేదని ఫీలయ్యాడు. ఇక షణ్ముఖ్.. సిరిని నిచ్చెనగా, రవిని పాముగా చెప్పుకొచ్చాడు. రవి నా మైండ్ ఎక్కడ చదివేస్తాడో అని భయమేస్తుందంటూనే తన వల్లే గేమ్‌లో ముందుకెళ్తున్నానన్నాడు. సిరి మోటివేట్ చేస్తుందని చెప్తూ వాళ్లిద్దరూ హౌస్‌లో ఉండాలన్నాడు. తర్వాత సిరి.. షణ్నును నిచ్చెనగా, సన్నీని పాముగా చెప్పుకొచ్చింది. మొత్తంగా కాజల్‌ను నాగిణిగా, సన్నీని పాముగా ప్రకటించాడు నాగ్. అనంతరం 'మెడలో మోత- సరిపోయే సామెత' గేమ్ ఆడించాడు. ఇందులో నాగ్ సామెతలు చెప్తే దానికి సంబంధించిన ప్లేట్‌ను ఎవరికి సూటవుతుందో వారి మెడలో వేయాలన్నాడు. సన్నీ.. కుక్క తోక వంకర సామెతను జెస్సీకి అంకితమిచ్చాడు. మానస్.. అబద్ధం ఆడినా అతికినట్లు ఉండాలని రవికి సూచించాడు. కాజల్.. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అన్న సామెత శ్రీరామ్‌కు సెట్టవుతుందని చెప్పింది. యానీ.. రానురాను రాజు గుర్రం గాడిదైంది అన్నదాన్ని కాజల్‌కు ఇచ్చింది. ప్రియాంక.. కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు అన్న సామెతను సిరికి అంకితమిచ్చింది. తర్వాత శ్రీరామ్.. అంతంత కోడికి అద్దసేరు మసాలా సామెత కాజల్‌కు సూటవుతుందన్నాడు. విశ్వ.. దున్నపోతు మీద వర్షం కురిసినట్లు సామెత లోబోకు సెట్టవుతుందన్నాడు. జెస్సీ.. పైన పటారం, లోన లొటారం అన్న ప్లేటును సన్నీకిచ్చాడు. సిరి.. అందని ద్రాక్ష పళ్లు పుల్లన అన్న ప్లేటును షణ్ను మెడలో వేసింది. షణ్ను.. ఏకులా వచ్చి మేకులా తగులుకున్నాడని రవి గురించి అభిప్రాయపడ్డాడు. రవి.. ఓడ ఎక్కేవరకు ఓడ మల్లన్న, ఓడ దిగిన తర్వాత బోడ మల్లన్న అనేది మానస్‌కు సరిపోతుందన్నాడు. లోబో.. చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం లాభం అన్న సామెతను యానీకి అంకితమిచ్చాడు. ఈ రోజు నాగ్ ఎవరినీ సేవ్ చేయలేదు. ఇదిలా వుంటే రేపటి దీపావళి స్పెషల్ ఎపిసోడ్లో శ్రియ, సుమ, బిగ్‌బాస్ కంటెస్టెంట్లు సహా పలువురు సెలబ్రిటీలు స్పెషల్ గెస్ట్స్‌గా రాబోతున్నారు. ఆ హంగామా చూడాలంటే రేపు సాయంత్రం ఆరు గంటలకు రెడీగా ఉండాల్సిందే! -
రా, వచ్చి కొట్టు.. వెయిట్ చేస్తున్నా: సన్నీని రెచ్చగొట్టిన షణ్ను
బిగ్‌బాస్ హౌస్‌లో సన్నీని ఆపడం ఎవరివల్లా కావట్లేదు. అతడి ఆవేశాన్ని చల్లార్చడం ఒక్క నాగార్జున వల్లే సాధ్యమయ్యేలా కనిపిస్తోంది. తాజాగా రిలీజైన ప్రోమోలో ఇంటిసభ్యులను రెండుగా విభజించిన బిగ్‌బాస్ వారికి పూరీలు చేసే టాస్క్ ఇచ్చాడు. దీనికి షణ్ముఖ్ సంచాకుడిగా వ్యవహరించాడు. ఈ గేమ్‌లో కాజల్ టీమ్ 50 పూరీలు ముందుగా రెడీ చేసినప్పటికీ షణ్ను.. యానీ మాస్టర్ టీమ్ చేసిన పూరీలే పర్ఫెక్ట్గా ఉన్నాయంటూ వారిని గెలిపించాడు. అయితే జైల్లో ఈ టాస్క్‌ను మొదటి నుంచీ గమనిస్తోన్న సన్నీ.. పాపం వాళ్లు కష్టపడి చేశారని పేర్కొన్నాడు. దీంతో చిర్రెత్తిపోయిన యానీ.. నీ ఫ్రెండ్స్ కష్టమే కనిపిస్తది, వేరేవాళ్ల కష్టం కనిపించదా? మాట్లాడేందుకైనా బుద్ధి ఉండాలి అని మండిపడింది. సన్నీ మీదకు ఫైర్ అవడంతో శ్రీరామ్, షణ్ముఖ్ నవ్వాపుకోలేకపోయారు. హౌస్‌లో కొంతమంది బాధపడుతుంటే నవ్వుతున్నావు, అది కరెక్ట్ కాదు, బయటకొస్తా ఆగు అని సూచించాడు. దీంతో షణ్ను నాకిప్పటి నుంచే భయమేస్తుంది అని నవ్వాడు. భయపడ్డావు, కాబట్టే నన్ను లోపలేశావు అని కౌంటరిచ్చాడు సన్నీ. దీంతో అతడిని మరింత రెచ్చగొడుతూ షణ్ను.. అయితే కొట్టు మరి వెయిట్ చేస్తున్నా అని సవాల్ చేశాడు. మరి సన్నీ జైలు నుంచి బయటకొచ్చాక ఏం జరిగింది? అన్నది తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే! -
తన్నడం కరెక్టా?: సన్నీ ఫొటో చించి పడేసిన నాగ్
Bigg Boss 5 Telugu Promo: కెప్టెన్సీ కోసం బిగ్‌బాస్ హౌస్‌లో పెద్ద లొల్లే జరిగింది. టాస్క్ ముగిసి షణ్ముఖ్ కెప్టెన్ అయినా కూడా సన్నీ, మానస్ దాన్నే తలుచుకుంటూ ఓపక్క బాధపడుతూ, మరోపక్క హౌస్మేట్స్ మీద నిప్పులు చెరిగారు. ముఖ్యంఆ ఆ టాస్క్‌లో సంచాలకుడిగా వ్యవహరించిన జెస్సీని ఆడేసుకున్నారు. అతడు కూడా వీళ్లిద్దరికీ గట్టిగానే సమాధానమిచ్చాడు. తాజాగా ఈ గొడవను ప్రస్తావిస్తూ సన్నీని ఆడేసుకున్నా హోస్ట్ నాగ్. తొండిగా ఆడటమేంటని కాజల్ మీద సెటైర్ వేశాడు నాగ్. హౌస్‌లో ఏమైనా అన్యాయం జరుగుతోందా? అని నాగ్ అడగ్గా సంచాలకుడి నిర్ణయం నచ్చలేదని చెప్పాడు మానస్. దీంతో నాగ్.. సంచాలకుడి నిర్ణయమే ఫైనల్ అని తేల్చేశాడు. ఇక సన్నీ.. తనను చాలామంది ప్రొవోక్ చేశారని చెప్పగా అభ్యంతరం వ్యక్తం చేసిన నాగ్.. మీద మీదకు వెళ్లిపోతావా? అని నిలదీశాడు. ఒక మనిషి ఒక వస్తువు పట్టుకుంటే దాన్ని తన్నడం కరెక్ట్ అనుకుంటున్నావా? అని ప్రశ్నించాడు. బిగ్‌బాస్ హౌస్‌లో రూల్స్ ఉన్నాయి కాబట్టే వాళ్లు తిరిగి కొట్టలేదని చెప్తూ అతడి ఫొటోను చింపి పడేశాడు నాగ్. తర్వాత నాగ్.. కంటెస్టెంట్లతో వైకుంఠపాళి ఆడించాడు. రవి తన మైండ్ చదివేస్తాడేమోనని భయంగా ఉందన్నాడు షణ్ను. ఏంటి? రవి బ్రహ్మ మైండ్‌నే చదివేస్తున్నాడా! అని ఆశ్చర్యపోయాడు నాగ్. ఒకపక్క పంచాయితీలు, మరోపక్క టాస్క్‌ల వినోదాలు.. అన్నీ చూడాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే!