బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ కంటెస్టెంట్ యాంకర్ శివ నెత్తిన దరిద్రం తాండవం చేస్తోంది. అందుకే ఎవిక్షన్ ఫ్రీ పాస్ పోటీదారుడిగా నిలిచేందుకు ఎంత కష్టపడ్డా ఫలితం వచ్చినట్లే వచ్చి చేజారింది. ఇక ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం అఖిల్, అనిల్, బాబా, బిందు మాధవి పోటీపడ్డారు. వీరిలో బాబా భాస్కర్ పాస్ గెలుచుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ పాస్ బాబా ఎవరికోసం ఉపయోగిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది.
ఇక హౌస్‌లో ఇప్పటికే సిరి, షణ్ముఖ్, రవి, మానస్ రాగా తాజాగా విన్నర్ సన్నీ వచ్చాడు. అతడి రాకతో హౌస్‌మేట్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. అతడిని ఆటపట్టిస్తూ స్విమ్మింగ్ పూల్‌లో నెట్టేశారు. అయినా సరే సన్నీ పూల్‌లోనూ డ్యాన్స్ చేస్తూ తగ్గేదేలే అని నిరూపించాడు. మరి సన్నీ ఎంటర్‌టైన్‌మెంట్, హౌస్‌మేట్స్ గేమ్ చూడాలంటే రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ఎపిసోడ్ చూడాల్సిందే!
చదవండి: ఆ డైరెక్టర్స్ మన మంచితనాన్ని అలుసుగా తీసుకుని వాడుకుంటారు..
ఫ్యాన్స్‌కు మహేశ్‌బాబు రిక్వెస్ట్, సోషల్ మీడియాలో లేఖ వైరల్
Comments
Please login to add a commentAdd a comment