Bigg Boss Non Stop Promo
-
నన్ను ఎక్కడ కొట్టకూడదో అక్కడ కొట్టావు, దేవుడున్నాడు
ఎంత కష్టపడ్డా ఫలితం రాకపోతే ఎవరికైనా ఆవేశం రాకమానదు. అందులోనూ బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షోలో మొదటి నుంచీ ఒంటరిగా పోరాడుతూ వస్తున్నాడు నటరాజ్ మాస్టర్. అవసరమైనప్పుడు తన ఫ్రెండ్స్‌కు సాయం కూడా చేశాడు. కానీ నిన్నటి టాస్క్‌లో మాత్రం తనకు బదులుగా అఖిల్ వేరొకరికి సాయం చేసి అతడిని గెలిపించడాన్ని తట్టుకోలేకపోయాడు. గెలుపు తథ్యం అనుకున్న సమయంలో ఓటమిపాలు కావడంతో భరించలేకపోయాడు. బాధపడ్డాడు, ఏడ్చేశాడు, ఆగ్రహించాడు. తాజాగా బిగ్‌బాస్ ఇచ్చిన బీబీ ఆవుల కొట్టం టాస్క్‌లో అఖిల్, నటరాజ్ మధ్య ఫైట్ జరిగింది. గేమ్‌లో నటరాజ్ తన చేయిని నెట్టేస్తుండటంతో అఖిల్ తన పాలన్నీ ఒలకబోసాడు. నీకు అత్యాశ ఎక్కువని ఫైర్ అయ్యాడు. దీనికి నటరాజ్ స్పందిస్తూ.. నన్ను ఎక్కడైతే కొట్టకూడదో అక్కడ కొట్టేశావు, దేవుడున్నాడు, నా కష్టానికి ఫలితం దక్కింది అని మాట్లాడాడు. నటరాజ్ మాటలను బట్టి అతడు ప్రేక్షకులను ఓట్లు అడిగే అవకాశాన్ని గెల్చినట్లు తెలుస్తోంది. మరి అఖిల్, నటరాజ్ మధ్య మాటల యుద్ధం ఎంతవరకు వెళ్లింది? వీళ్లు తిరిగి కలిసిపోయారా? లేదా? అన్నది తెలియాలంటే నేడు రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: ఆచార్య నుంచి ‘భలే భలే బంజారా’ ఫుల్ సాంగ్ అవుట్ సిరిని అర్థం చేసుకోవడం చాలా కష్టం: శ్రీహాన్ -
అఖిల్‌ని టార్గెట్ చేయడమేనా నీ గేమా? బిందుకు అనసూయ సూటి ప్రశ్న
వరుస గెస్టులతో బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షో జిగేలుమంటోంది. మొన్నటిదాకా బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ కంటెస్టెంట్లు హౌస్‌లోకి వచ్చి సందడి చేయగా ఆ తర్వాత అశోకవనంలో అర్జున కల్యాణం టీమ్ హౌస్‌ను ఓ ఊపు ఊపేసింది. తాజాగా ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ బిగ్‌బాస్ హౌస్‌లో అడుగు పెట్టింది. అయితే నవ్వడానికి, నవ్వించడానికో ఆమె రాలేదు. ప్రేక్షకుల మనసులో మెదులుతున్న ప్రశ్నలను తూటాల్లా వదిలేందుకు వచ్చింది. ఈ సందర్భంగా మొదట అరియానాకు ఆడియన్స్ రాసిన ప్రశ్నను వదిలింది. 'ఫ్యామిలీ వీక్ తర్వాత బిందుకు క్లోజ్ అయ్యావు. ఎందుకు వుమెన్ కార్డు వాడుతున్నావు? సడన్‌గా ఎందుకిలా మారిపోయావు?' అని ప్రశ్నించింది. దీంతో అరియానా ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక ఇందులో ఉమెన్ కార్డు అనిపించిందంటే అది మీకే వదిలేస్తున్నా అని బదులిచ్చింది. అనంతరం బిందును.. ఎప్పుడూ గ్రూప్ గేమ్స్ ఆడుతావు. కానీ అఖిల్ గ్రూప్ గేమ్స్ ఆడతాడని నిందిస్తావు. ఎందుకు? అని అడిగింది. అయితే బిందు మాత్రం ఎప్పుడూ గ్రూప్ గేమ్ ఆడలేదని కుండ బద్ధలు కొట్టింది. ఆ తర్వాత అఖిల్ వైపు తిరిగి.. వెకేషన్‌ను ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? గత వారం రోజులుగా బిందు గురించి నెగెటివ్‌గా మాట్లాడమే పనైపోయింది. కానీ ఫ్యామిలీ వీక్ తర్వాత బిందుతో మంచిగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నావు, ఎందుకు? అని అడిగింది. మరి దీనికి అఖిల్ ఏమని సమాధానం చెప్తాడో చూడాలి! ఆ తర్వాత శివ వైపు చూసి 'ఎలా అనిపిస్తోంది? అడిగే దగ్గర నుంచి అడిగించుకునే దాకా?' అని సరదాగా అనడంతో అక్కడున్నవారంతా ఘొల్లున నవ్వారు. చదవండి: ముంబైలో కళ్లు చెదిరే ఫ్లాట్ కొన్న బుల్లితెర నటుడు నరకం చూపించారు, బర్త్‌డే రోజే నా కూతుర్ని చంపేశారు: మోడల్ తల్లి -
ఆల్రెడీ సగం చచ్చిపోయాను: నటరాజ్ కంటతడి
బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో గుంపులుగా గేమ్ ఆడకుండా సొంతంగా ఆటాడుతూ ఇక్కడిదాకా వచ్చాడు నటరాజ్ మాస్టర్. కానీ కొన్నిసార్లు ఆటలో గెలవాలంటే పక్కవారి సాయం కూడా తప్పనిసరి. లేదంటే గెలుపు తలుపు తడుతున్నామనుకునేలోపే ఓటమి వచ్చి నెత్తిమీద కూర్చుంటుంది. ఇప్పుడు నటరాజ్ పరిస్థితి అలాగే ఉంది. ప్రేక్షకులను ఓట్లు అడిగే అవకాశాన్ని పొందేందుకు హౌస్‌మేట్స్‌కు ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ టాస్క్‌లో పై నుంచి పడే పూలను ఏరుకుని వారికి ఇచ్చిన తొట్టిలో పెట్టుకోవాలి. మొదటి రౌండ్లో నటరాజ్ మాస్టర్ దగ్గర ఎక్కువ పూలున్నాయి. దీంతో వెంటనే మిగతా హౌస్మేట్స్ ఏకమై నట్టూను ఓడించారు. తక్కువ పూలున్న అనిల్‌కు సాయం చేయాలనుకున్నారు. అనుకున్నదే తడవు శివ, అఖిల్ తమ దగ్గరున్న పూలను అనిల్‌కు అప్పగించడంతో అతడే గెలుపొందాడు. దీంతో నటరాజ్ కంటతడి పెట్టుకున్నాడు. అఖిల్ నాలుగోసారి మోసం చేశాడంటూ ఎమోషనల్ అయ్యాడు. ఆకాశం వంక చూస్తూ.. 'ఎవరూ సాయం చేయరు. కనీసం ఆడేసి ఓట్లు అడుక్కుందామనుకునే భాగ్యం కూడా లేదు. ఆ అవకాశం కూడా లాక్కున్నావు. సగం చచ్చిపోయి ఉన్నా..' అంటూ ఏడ్చేశాడు. మరోవైపు ఈరోజు హౌస్‌లోకి జీవిత, రాజశేఖర్, అనూప్ రూబెన్స్ వచ్చి సందడి చేశారు. మరి ఆ సందడి, మాస్టర్ గుండెల్లో రేగిన అలజడి చూడాలంటే నేడు రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: నా ఫ్రెండ్స్ నన్ను ద్వేషించేవారు, ఎన్నో కష్టాలు అనుభవించాను -
పరాశక్తిలా బిందు మాధవి ఫోజు.. శూర్పణఖ ఆడియెన్స్ నీ ముక్కు కోస్తారు
Bigg Boss Non Stop Telugu Bindu Madhavi Vs Nataraj Master Fight: బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షో రసవత్తరంగా మారింది. మరికొన్ని రోజుల్లో గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ తరుణంలో ఫైనల్‌కు చేరుకునేది ఎవరా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ప్రస్తుతం బిగ్‌బాస్ హౌజ్‌లో అరియానా, బిందు మాధవి, నటరాజ్ మాస్టర్, మిత్ర, యాంకర్ శివ, అఖిల్, అనిల్, బాబా మాస్టర్ ఉన్నారు. అయితే పదకొండో వారం నామినేషన్స్‌లో భాగంగా బిగ్‌బాస్ ఏ ముగ్గురు ఫినాలేకు చేరుకోవడానికి అర్హులు కారో చెప్పాలని హౌస్‌మేట్స్‌ను ఆదేశించిన విషయం తెలిసిందే. తర్వాత 72వ రోజు ఈ టాస్క్‌ను కొనసాగించమని సూచించాడు. ఈ క్రమంలో అరియానా, బిందు మాధవి, బాబా మాస్టర్ అర్హులు కానివారిగా నటరాజ్ ఎంపిక చేశాడు. దీనికి సంబంధించిన ప్రొమోను మంగళవారం (మే 10) విడుదల చేశారు. ఈ ఎంపికలో బిందు మాధవిపై విరుచుకుపడ్డాడు నటరాజ్ మాస్టర్. 'నెగెటివిటీ మాత్రమే కంప్లీట్‌గా ఉన్న ఏకైక పర్సన్ నువ్ మాత్రమే' అని నటరాజ్ అనగా, 'నీ సైడ్ ఏమొచ్చింది ఇన్ని రోజులు పాజిటివిటీనా' అని తిరిగి క్వశ్చన్ చేస్తుంది బిందు మాధవి. 'నీ బెస్ట్ గేమ్ ఏంటి' అని నటరాజ్ అడిగిన ప్రశ్నకు 'ఐయామ్ ది మోస్ట్ స్ట్రాంగెస్ట్ పర్సన్ ఇన్ దిస్ హౌజ్' అని బిందు గట్టిగానే చెబుతుంది. తర్వాత ఇద్దరిమధ్య మాటలు పెరిగి నీ బండారం బయట పెడుతున్న కెమెరా వైపు చూసి అని నటరాజ్ చెబుతాడు. దీనికి బిందు మాధవి పరాశక్తిలా అవతారంలా ఫోజు ఇస్తుంది. దీనికి 'శూర్పణఖ నీ టైమ్ ఆసన్నమైంది ఇదిగో లక్ష్మణ బాణం. ఆడియెన్స్ నీ ముక్కు కోస్తారు.. పక్కా' అంటూ బాణం విసిరినట్టుగా ఫోజు ఇస్తాడు నటరాజ్ మాస్టర్. అలాగే అఖిల్-శివ, అఖిల్-బిందు మాధవి, నటరాజ్-బాబా మాస్టర్ మధ్య మాటల రచ్చను కూడా ఈ ప్రొమోను చూపించారు. చదవండి: పిచ్చి ముదిరింది, శూర్పణఖ అంటూ రెచ్చిపోయిన నటరాజ్ -
'బిందుమాధవికి పిచ్చి ముదిరింది', 'అఖిల్‌కు మైండ్ లేదు'
బిగ్‌బాస్ కథ క్లైమాక్స్‌కు చేరుకుంటోంది. మరో రెండు వారాల్లో బిగ్‌బాస్ నాన్‌స్టాప్ గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ క్రమంలో ఎవరు ఫైనల్‌కు చేరుకుంటారన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం హౌస్‌లో అరియానా, నటరాజ్ మాస్టర్, అనిల్, మిత్ర, యాంకర్ శివ, బిందు మాధవి, అఖిల్, బాబా భాస్కర్ ఉన్నారు. వీరిలో అఖిల్, బిందుమాధవి, యాంకర్ శివ, బాబా భాస్కర్, నటరాజ్ మాస్టర్ ఫినాలేలో చోటు దక్కించుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఈసారి టాప్ 5కి బదులుగా టాప్ 6 ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే ఆ ఐదుగురితో పాటు మిత్ర, అరియానాలలో ఒకరికి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే బిగ్‌బాస్ కథ చివరికి చేరుకుంటున్నా నామినేషన్స్‌లో మాత్రం ఫైర్ తగ్గడం లేదు. తాజాగా పదకొండో వారం నామినేషన్స్‌లో భాగంగా బిగ్‌బాస్ ఏ ముగ్గురు ఫినాలేకు చేరుకోవడానికి అర్హులు కారో చెప్పాలని హౌస్‌మేట్స్‌ను ఆదేశించాడు. దీంతో బిందుమాధవి ఊహించినట్లుగానే మిత్ర, అఖిల్, నటరాజ్‌లు ఫినాలేకు అనర్హులని చెప్పింది. నేనొకటి మాట్లాడుతుంటే అన్సింక్లో నువ్వొకటి మాట్లాడుతుంటవ్ అని అఖిల్ అనగా.. 'నీకు బ్రెయిన్ లేదు కదా, ఉంటే ఏం మాట్లాడుతున్నానో అర్థమయ్యేది అని ఫైర్ అయింది. ఎమోషన్స్ వాడుకుంటూనే ఎమోషన్స్ వాడనంటుంది, వాహ్.'. అని అఖిల్ బిందుపై సెటైర్ వేశాడు. అటు నటరాజ్.. నీ వల్ల మీ నాన్న ఫెయిల్ అయ్యాడు. ఈమెకు జ్ఞానాన్ని నేర్పండి. తెలుగమ్మాయికి ఉన్న ఒక్క లక్షణం కూడా నీకు లేదు అంటూ బిందు తండ్రికి రిక్వెస్ట్ చేశాడు. నిద్రపోయిన సింహాన్ని లేపావు అంటూ నటరాజ్ మాస్టర్ ఉడికిపోయాడు. 'పిచ్చి ముదిరిపోయింది, నీకు పిచ్చి, నీ పిచ్చి మొత్తం బయటకు తీస్తా, ఒక్కసారి కూడా గేమ్ ఆడలేదు, పనికిరాని పిల్లి' అని బిందును తిడుతూ రెచ్చిపోయాడు. మరి ఇంతకీ ఈ నామినేషన్స్‌లో ఎవరెవరున్నారో తెలియాలంటే రాత్రి 9 గంటల వరకు వేచి చూడాల్సిందే! చదవండి: అశును వరస్ట్ అన్న రవి, కోపంతో ఆమె ఏం చేసిందంటే? 'బిగ్ డే, నా కల నెరవేరబోతోంది' డైమండ్ రింగ్‌తో హీరోయిన్ -
బిగ్‌బాస్ హౌస్‌లో సన్నీ, అతడే ఎవిక్షన్ ఫ్రీ పాస్ విన్నర్!
బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ కంటెస్టెంట్ యాంకర్ శివ నెత్తిన దరిద్రం తాండవం చేస్తోంది. అందుకే ఎవిక్షన్ ఫ్రీ పాస్ పోటీదారుడిగా నిలిచేందుకు ఎంత కష్టపడ్డా ఫలితం వచ్చినట్లే వచ్చి చేజారింది. ఇక ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం అఖిల్, అనిల్, బాబా, బిందు మాధవి పోటీపడ్డారు. వీరిలో బాబా భాస్కర్ పాస్ గెలుచుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ పాస్ బాబా ఎవరికోసం ఉపయోగిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. ఇక హౌస్‌లో ఇప్పటికే సిరి, షణ్ముఖ్, రవి, మానస్ రాగా తాజాగా విన్నర్ సన్నీ వచ్చాడు. అతడి రాకతో హౌస్మేట్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. అతడిని ఆటపట్టిస్తూ స్విమ్మింగ్ పూల్‌లో నెట్టేశారు. అయినా సరే సన్నీ పూల్‌లోనూ డ్యాన్స్ చేస్తూ తగ్గేదేలే అని నిరూపించాడు. మరి సన్నీ ఎంటర్టైన్మెంట్, హౌస్మేట్స్ గేమ్ చూడాలంటే రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: ఆ డైరెక్టర్స్ మన మంచితనాన్ని అలుసుగా తీసుకుని వాడుకుంటారు.. ఫ్యాన్స్‌కు మహేశ్‌బాబు రిక్వెస్ట్, సోషల్ మీడియాలో లేఖ వైరల్ -
బిగ్‌బాస్ హౌస్‌లో షణ్ముఖ్, ఇప్పటికైనా శివకు ఫలితం దక్కిందా?
యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్ బిగ్‌బాస్‌కు వచ్చాక అతడిపై విపరీతమైన నెగెటివిటీ పెరిగింది. సిరితో క్లోజ్‌గా ఉంటూ ఆమెపై పెత్తనం చెలాయిస్తున్నాడని, ఎవరితోనూ కలివిడిగా మాట్లాడనీయకుండా హద్దులు గీస్తున్నాడని విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాక గర్ల్‌ఫ్రెండ్ దీప్తి సునయన ఉందన్న విషయం మర్చిపోయి సిరితో ఎక్కువ సన్నిహితంగా మెదిలాడంటూ కామెంట్లూ వినిపించాయి. ఈ నెగెటివిటీతో బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ విన్నర్ కావాల్సిన షణ్ను రన్నరప్‌గా నిలిచాడు. బిగ్‌బాస్ తర్వాత తన ప్రేయసి కూడా గుడ్‌బై చెప్పడంతో ఒకింత శూన్యంలోకి వెళ్లిపోయాడు. అయితే తను చేసిన తప్పులను ఒప్పుకుంటూ తనను తాను సరిదిద్దుకుంటూ నెగెటివిటీని కూడా పాజిటివ్‌గా మార్చుకున్నాడు షణ్ను. దీంతో బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు తిట్టినవాళ్లే షణ్ను మెచ్యూరిటీని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. తాజాగా షణ్ను మరోసారి బిగ్‌బాస్ షోలో అడుగుపెట్టాడు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ కంటెండర్స్ గేమ్ ఆడించేందుకు హౌస్‌లో ఎంట్రీ ఇచ్చాడు. అందులో భాగంగా హౌస్‌మేట్స్‌తో ఓ గేమ్ ఆడించగా అందులో శివ గెలుపొందాడు. కానీ అఖిల్‌కు మిస్టరీ బాక్స్ రాగా అందులో ఎక్కువ పాయింట్స్ ఉన్నవాళ్లే గేమ్‌లో ముందుకు వెళ్లాలని రాసుంది. దీంతో ఇప్పటికే అనిల్, బాబా భాస్కర్, బిందు పోటీదారులుగా ఎంపికవగా ఈ జాబితాలో శివ లేదా అఖిల్‌లో ఎవరో ఒకరు చేరినట్లు తెలుస్తోంది. మరి హౌస్‌లో షణ్ను సందడి చూడాలంటే బిగ్‌బాస్ నాన్‌స్టాప్ చూడాల్సిందే! చదవండి: ఇట్స్ టూ మచ్, అంత మేకప్ అక్కర్లేదు.. నటిపై ట్రోలింగ్ రోమాలు నిక్కబొడిచే 'కొమురం భీముడో' వీడియో సాంగ్ చూశారా? -
ఇదేం ట్విస్టు, శివ వల్లే బిందుమాధవికి లక్కీ ఛాన్స్!
బిగ్‌బాస్ షోలో ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం హౌస్మేట్స్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. ఎలిమినేషన్ నుంచి గట్టెక్కించే ఈ ఆయుధాన్ని బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు అంత ఈజీగా ఇస్తాడా? ఛాన్సే లేదు. నానా టాస్క్‌లు ఆడిస్తూ హౌస్‌మేట్స్‌లో మరింత పట్టుదలను పెంచుతున్నాడు. ఈ క్రమంలో తాజగా యాంకర్ రవి హౌస్‌లో అడుగుపెట్టగా ఎవిక్షన్ ఫ్రీ పాస్ పోటీదారుడిగా యాంకర్ శివను ప్రకటించినట్లు తెలుస్తోంది. కానీ ఆ ఆనందం శివకు ఎంతోకాలం నిలవలేదు. తను అందుకున్న బాక్స్‌లో తన అవకాశాన్ని వేరొకరికి బదిలీ చేయాలని ఉంది. దీంతో శివ.. బిందుమాధవి ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం పోటీపడుతుందని ప్రకటించాడు. మూడు రోజులన ఉంచి నువ్వు జీరో పాయింట్స్ దగ్గరున్నావు, ఆడు అని చెప్పాడు. అంటే నేను ఆడలేదని ఇస్తున్నావా? నాకొద్దని తిరస్కరించింది బిందు. నేను సరిగా గేమ్ ఆడుతున్నానని నీకు నమ్మకం లేదు కదా అని ఆమె ఏడుపందుకోవడంతో శివ బిందును ఓదార్చాడు. కాస్త బుజ్జగింపుల తర్వాత బిందు కంటెండర్‌గా నిలిచేందుకు అంగీకరించింది. మరి ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం ఇంకా ఎవరెవరు పోటీదారులుగా నిలుస్తారో తెలియాలంటే బిగ్‌బాస్ నాన్‌స్టాప్ చూడాల్సిందే! చదవండి: నన్ను సెక్స్ స్కామ్‌లో ఇరికించి సోనాక్షిని స్టార్‌ను చేశారు సమంతతో పోల్చుకున్న ఉర్ఫీ, ఇదెక్కడి న్యాయం అంటూ ఆగ్రహం -
బిగ్‌బాస్ హౌస్‌లో యాంకర్ రవి రచ్చ
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ముగింపుకు చేరుకుంటోంది. ప్రస్తుతం హౌస్‌లో తొమ్మిది మంది మాత్రమే మిగిలారు. వీరిలో ఈసారి ఐదుగురు కాకుండా ఆరుగురు ఫినాలేకు చేరుకోనున్నారని టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే బిగ్‌బాస్ ఐదో సీజన్ కంటెస్టెంట్లు వరుసగా హౌస్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. హౌస్‌మేట్స్‌తో ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం గేమ్ ఆడిస్తున్నారు. ఇప్పటికే సిరి, మానస్ హౌస్‌లోకి రాగా తాజాగా యాంకర్ రవి బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టాడు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం ప్రాణం పెట్టి ఆడుతున్న హౌస్‌మేట్స్‌తో మరో టాస్క్ ఆడించాడు. అయితే దీనికంటే ముందు వాళ్లతో ఫన్నీ స్కిట్స్ వేయిస్తూ ప్రేక్షకులను తెగ ఎంటర్టైన్ చేశాడు. మరి ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఎవరి సొంతం కానుంది? ఈ పాస్‌తో ఎవరు గేమ్‌ను మలుపు తిప్పనున్నారు అనేది తెలియాలంటే నేడు రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: నామినేషన్స్‌లో బిందు ఓవరాక్షన్, టైటిల్ గెలిచే అర్హత లేదంటూ.. -
బిగ్‌బాస్ షోలో మానస్, ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఎవరికి దక్కుతుందో?
బిగ్‌బాస్ హౌస్‌లో ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం ఫైట్ జరుగుతోంది. ఇప్పటికే సిరి వచ్చి కంటెస్టెంట్స్‌తో మొదటి లెవల్ గేమ్ ఆడించి వెళ్లిపోగా తాజాగా మానస్ హౌస్‌లో అడుగుపెట్టాడు. హౌస్‌మేట్స్‌తో గేమ్స్ ఆడిస్తున్నాడు. ఈ క్రమంలో బిగ్‌బాస్ ఓ ఇంట్రస్టింగ్ టాస్క్ ఇవ్వగా ఇందులో నుంచి అఖిల్, అషూ, బిందు మాధవి మొదటగా అవుట్ అయ్యారు. వీరు పోటీదారులను డిస్టర్బ్ చేసేందుకు ఛాన్స్ ఇవ్వడంతో గేమ్‌లో ఇంకా పోటీపడుతున్న కంటెస్టెంట్ల ఆటకు ఆటంకం కలిగించేందుకు యత్నించారు. ఈ క్రమంలో బాబా, యాంకర్ శివ అవుట్ అయ్యారు. తర్వాతి లెవల్లో అరియానా గేమ్‌లో ఓడిపోగా నటరాజ్, అనిల్ మాత్రమే మిగిలారు. మరి వీరిలో ఎవరు ఎవిక్షన్ ఫ్రీ పాస్ సాధించారనేది తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే! చదవండి: ఆన్లైన్లో లీకైన 'అవతార్ 2' సినిమా ట్రైలర్ !.. సినీప్రియులకు ఆహా గుడ్‌న్యూస్, మేలో ఏకంగా 40కి పైగా సినిమాలు! -
అషూను చీపురుతో కొట్టడానికి బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చిన తల్లి
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షోలో ఆఖరి కెప్టెన్‌గా బాబా భాస్కర్ ఎన్నికయ్యాడు. ఆది నుంచి కెప్టెన్సీకోసం కష్టపడ్డ చాలామందికి ఇప్పటికీ కెప్టెన్ అయ్యే అవకాశం రాలేదు. కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన బాబా భాస్కర్ మాత్రం హౌస్‌లో అడుగుపెట్టిన వారం రోజులకే కెప్టెన్‌గా అవతరించడం విశేషమనే చెప్పాలి. ఇదిలా ఉంటే షో ప్రారంభమై ఇప్పటికే రెండు నెలలు కావస్తున్న తరుణంలో బిగ్‌బాస్ కంటెస్టెంట్ల కోసం ఓ సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. ప్రస్తుతం హౌస్‌లో ఉన్న టాప్ 10 హౌస్మేట్స్ కోసం వారి కుటుంబ సభ్యులను ఇంట్లోకి పంపించాడు. ఈమేరకు ఓ ప్రోమో వదిలాడు. అందులో భాగంగా అషూ తల్లి బిగ్‌బాస్ ఇంట్లోకి వచ్చింది. అయితే ఆమె చీపురు పట్టుకుని హౌస్‌లోకి రావడంతో అషూ వణికిపోయింది. చీపురుపట్టుకుని వచ్చావేంటి, పరువు పోతుంది మమ్మీ అంటూ వెళ్లి తన తల్లిని హత్తుకోవడంతో ఆమె చేతిలోని చీపురు కింద పడేసింది. ఆ తర్వాత నీ ఫేవరెట్ ఎవరంటే అషూ కాకుండా అందరూ అని బదులివ్వడంతో అక్కడున్నవాళ్లంతా సరదాగా నవ్వారు. అనంతరం యాంకర్ శివ సోదరి యమున హౌస్‌లోకి వచ్చింది. అలాగే నటరాజ్ మాస్టర్ భార్యాకూతురు గేట్ లోపల నుంచి లోపలకు రావడంతో అతడు ఎమోషనల్అయ్యాడు. తన గారాలపట్టిని ఎత్తుకుని ముద్దాడాడు. కూతురిని ఆడిస్తూ సంబరపడిపోయాడు. చదవండి: 'పోకిరి' ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన హీరోయిన్స్ ఎవరో తెలుసా? 'నటుడిగా పనికిరావు, పోయి ఇంకేదైనా పని చూసుకో అని హేళన చేశారు' -
బిందుకు దగ్గరయ్యావని అఖిల్ దూరం పెట్టాడా? అజయ్ ఏమన్నాడంటే?
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షోలో ఇప్పటివరకు ఏడుగురు ఎలిమినేట్ అయ్యారు. శ్రీరాపాక, ఆర్జే చైతూ, సరయు, తేజస్వి, ముమైత్ ఖాన్, స్రవంతి, మహేశ్ విట్టా వరుసగా ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. తాజాగా ఎనిమిదో వారం అజయ్ ఎలిమినేట్ అయ్యాడు. ఈ సందర్భంగా బిగ్‌బాస్ బజ్‌లో యాంకర్ రవికి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో భాగంగా యాంకర్ రవి.. నువ్వు బిందుకు దగ్గరయ్యావని అఖిల్ దూరమయ్యాడా? అని సూటిగా ప్రశ్నించాడు. దీనికి అజయ్.. ఈ మధ్యే ఆ చర్చ కూడా మొదలైందని, ఎందుకు ఆమెతో క్లోజ్ ఉంటున్నావని అఖిల్ తనను అడుగుతూ ఉండేవాడని బదులిచ్చాడు. అఖిల్ వల్లే అజయ్ ఇన్నాళ్లు హౌస్‌లో ఉండగలిగాడని ఇంతకుముందు ఎలిమినేట్ అయినవాళ్లు చెప్పారు. ఎప్పుడైతే అఖిల్‌కు కొద్దికొద్దిగా దూరమవుతూ వచ్చావో అప్పటినుంచి అజయ్ వీక్ అవుతూ వచ్చాడని రవి పేర్కొనడంతో అజయ్ అలాంటిదేం లేదని ఆన్సరిచ్చాడు. ఇక ఇంటిసభ్యుల గురించి చెప్తూ.. నటరాజ్ మాస్టర్ కొంచెం కంట్రోల్లో ఉంటే బాగుంటుందన్నాడు. శివ స్మార్ట్ కానీ గేమ్‌లో విలువలు, ఎమోషన్స్ కూడా పక్కన పెట్టేస్తాడని అభిప్రాయపడ్డాడు. బిందుమాధవి చాలా స్ట్రాంగ్ ప్లేయర్, కాకపోతే కొంచెం ఓవర్ థింకింగ్ ఆపేస్తే బాగుంటుందని చెప్పాడు. అరియానా ఇప్పుడే గేమ్ స్టార్ట్ చేసిందన్నాడు. అఖిల్ కప్పు తీసుకుని రావాలని ఆశపడ్డాడు. చదవండి: బిగ్‌బాస్ షో నుంచి అజయ్ ఎలిమినేట్ మూడో సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ తెలుగువాడే! -
ఒంటరైన మిత్రకు అఖిల్ సాయం, కొత్త కెప్టెన్ ఎవరంటే?
బిగ్‌బాస్ షోలో కెప్టెన్సీ పోటీలో గెలిచారంటే వారం రోజులపాటు ఎలాంటి చీకూచింత లేకుండా హాయిగా గడపొచ్చు. ఎందుకంటే కెప్టెన్ అయితే ఇంటి అధికారాలతో పాటు ఒకవారం నామినేషన్లో లేకుండా ఉండొచ్చు. ఇలాంటి కెప్టెన్సీని చేజిక్కించుకోవడానికి హౌస్మేట్స్ ఎంతగానో కష్టపడతారు. ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో జల జల జలపాతం అనే కెప్టెన్సీ టాస్క్ నడుస్తోంది. ఇందులో మిత్ర, అనిల్, అఖిల్, బాబా భాస్కర్, శివ పాల్గొన్నారు. ఇతర పోటీదారులు వారికి నచ్చిన కంటెండర్ బీకర్లో రంగు నీళ్లను పోయాల్సి ఉంటుంది. మిత్రకు ఎవరూ సపోర్ట్ చేయకపోవడంతో అఖిల్ తన బీకరులో ఉన్న రంగు నీళ్లను మిత్ర బీకర్లో పోశాడు. ఇదిలా ఉంటే రంధ్రాలున్న గ్లాస్లో నుంచి కలర్ వాటర్ బయట పడకుండా ఉండేందుకు రెండు గ్లాసులు సెట్ చేసుకుని కొందరు నీళ్లు పోశారు. దీన్ని అరియానా తప్పుపట్టడంతో సంచాలకురాలు అషూ ఇరకాటంలో పడింది. ఫస్ట్ రౌండ్‌ను క్యాన్సల్ చేయాలని బాబా, అలా ఎలా చేస్తారని అఖిల్ మండిపడ్డారు. ఈ కెప్టెన్సీ టాస్క్ ఎలా నడిచిందో తెలియాలంటే రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే! ఇదిలా ఉంటే ఈ వారం అఖిల్ సార్థక్ కెప్టెన్‌గా నిలిచినట్లు తెలుస్తోంది. చదవండి 👉 మీరు మనుషులేనా? మిత్రను అంతలా హింసిస్తారా? నడిచే నేల, పీల్చే గాలి మీద వారి సంతకం ఉంటుంది, వారి త్యాగాలను మరవద్దు -
అషూకు ఆదిలోనే దెబ్బ, సిగ్గు లేదంటూ రెచ్చిపోయిన మిత్ర
బాబా భాస్కర్ ఎంట్రీతో బిగ్‌బాస్ హౌస్‌లో సీన్ మారిపోయింది. అతడు వచ్చీరావడంతోనే బిందుమాధవిని నామినేషన్స్‌లో నుంచి సేవ్ చేయడంతో అందరూ ఖంగు తిన్నారు. తన గురించి ఒక్క మాట మాట్లాడలేదేంటని అఖిల్ హర్టయ్యాడు. ఇక బిందును సేవ్ చేసి తనకు జనాల్లో ఎంత పాపులారిటీ ఉందో చెప్పకనే చెప్పేశాడు బాబా. ఇదిలా ఉంటే ప్రస్తుతం హౌస్‌లో కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ నడుస్తోంది. ఇందులో అషూ, శివ, మిత్ర, అఖిల్, అనిల్, బాబా భాస్కర్లను మనుషుల టీమ్‌గా, అరియానా, బిందుమాధవి, అజయ్, హమీదా, నటరాజ్ మాస్టర్లను ఏలియన్స్ టీమ్‌గా విభజించారు. ఈ క్రమంలో ఏలియన్స్ తమదగ్గరున్న వస్తువులను కాపాడుకునే ప్రయత్నం చేయగా హ్యూమన్స్ వాటిని తీసుకుని పగలగొట్టి హ్యూమన్స్ టీమ్‌లో నుంచి ఒక్కొక్కరిని గేమ్‌లో నుంచి తొలగించేందుకు ట్రై చేస్తారు. గేమ్ ఆడే క్రమంలో ఏలియన్స్ స్విమ్మింగ్ పూల్‌లో దూకగా అందుకు వీల్లేదని స్పష్టం చేశాడు బిగ్‌బాస్. అందుకు శిక్షగా అషూ తన దగ్గరున్న మైక్ ధరించడానికి వీల్లేదని ప్రకటించాడు. అయితే ఇదే విషయాన్ని అరియానా చెప్పడానికి ప్రయత్నించగా అషూ అస్సలు వినిపించుకోలేదు. సంచాలక్ చెప్తేనే వింటానంటూ మొండికేయడంతో బాబా భాస్కర్ జరిగింది చెప్పి ఆమె దగ్గర నుంచి మైక్ తీసుకున్నాడు. ఇక గేమ్‌లో హమీదా, మిత్ర కొట్టుకున్నంత పని చేశారు. మిత్ర కొడుతుందని, తాను కూడా కొడతానంటూ ఆమె వెనకాల పరిగెత్తింది హమీదా. తనను కింద పడేయడంతో సిగ్గు లేదు అంటూ అమ్మాయిల మీద అరిచేసింది మిత్ర. ఇక ఈ టాస్క్‌లో హ్యూమన్స్ టీమ్ గెలిచి అందులోని సభ్యులు కెప్టెన్సీ కంటెండర్స్ అయినట్లు తెలుస్తోంది. చదవండి: నన్ను గర్భవతిని చేసి మోసం చేసింది ఆ డైరెక్టర్ కాదు! నిద్రలేని రాత్రులు, రక్తస్రావం, సాగిన చర్మం, గడ్డకట్టిన ప్యాడ్లు.. కాజల్ -
నామినేషన్స్ రచ్చ.. ఈవారం నామినేషన్స్‌లో ఎవరున్నారంటే
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ రసవత్తరంగా సాగుతోంది. ఈ షోలో అన్ని రోజులు ఒక ఎత్తైతే, నామినేషన్స్ రోజు మరొక ఎత్తు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆరోజు వీరు చేసే రచ్చ మామూలుగా ఉండదు. అప్పటిదాకా కలిసిమెలిసి ఉన్నవాళ్లు కూడా నామినేషన్స్ వచ్చేసరికి మాత్రం అన్నీ పక్కనపెట్టేసి నామినేట్ చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షోలో ఎనిమిదో వారం నామినేషన్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారాయి. షోలో మొదటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్‌లా కలిసున్న అషూ, అరియానా నామినేషన్స్‌లో మాత్రం బద్ద శత్రువులుగా మారినట్లు ప్రోమో చూస్తే అర్థమవుతుంది. ఇక మరోవైపు ఎప్పటిలాగే బిందు, అఖిల్ ఈసారి కూడా నామినేషన్స్‌లో గొడవ పడ్డారు. స్రవంతి అనే ఎమోషన్‌ను యూజ్ చేసుకున్నావంటూ బిందు ఫైర్ అయ్యింది. దీంతో చిర్రెత్తిపోయిన అఖిల్ ఏం మాటలు మాట్లాడుతున్నావ్? పిచ్చిదానిలా మాట్లాడుతున్నావ్ అంటూ మండిపడ్డాడు. అజయ్, హమీదా కూడా ఒకరిని ఒకరు నామినేట్ చేసుకున్నారు. మొత్తానికి వాడివేడిగా సాగిన ఈ ప్రక్రియలో అఖిల్, అషూ, అజయ్, అనిల్, హమీదా, బిందు నిలిచారు. వీరిలో బాబా భాస్కర్ మాస్టర్ పన పవర్‌ని ఉపయోగించి బిందుని సేవ్ చేసినట్లు తెలుస్తోంది. -
బిగ్‌బాస్ షోలో బాబా భాస్కర్, కాకపోతే ఓ ట్విస్ట్!
బాబా భాస్కర్.. బిగ్‌బాస్ ప్రేక్షకులకు ఈ పేరును కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. మూడో సీజన్లో ఆయన చేసిన సందడి అంతా ఇంతా కాదు. శ్రీముఖితో చేసిన కామెడీకి జనాలు పొట్టచెక్కలయ్యేలా నవ్వారు. కొరియోగ్రాఫర్ బాబాలో కామెడీ యాంగిల్ కూడా ఉందని నిరూపించాడు. ఇప్పుడు ఈయన పేరు ఎందుకు ప్రస్తావించామో మీకీపాటికే అర్థమై ఉంటుంది. తాజాగా అతడు బిగ్‌బాస్ ఓటీటీలోనూ అడుగుపెట్టాడు. ఈ మేరకు బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ఓ ప్రోమో రిలీజ్ చేసింది. నా ఇంటికి వచ్చేశాను అంటూ సంతోషం వ్యక్తం చేశాడు బాబా. అతడి ఎనర్జీని చూసి ఆశ్చర్యపోయిన నాగ్ మీరు ముదురులా ఉన్నారే అంటూ పంచ్ వేశాడు. ఇదిలా ఉంటే ఈరోజు మహేశ్ విట్టా ఎలిమినేట్ అవనున్నట్లు జోరుగా ప్రచారం నడుస్తోంది. అనంతరం రేపటి నామినేషన్స్ పర్వం ముగిశాక బాబాను హౌస్‌లోకి పంపించనున్నారట. అప్పటివరకు అతడిని సీక్రెట్ రూమ్‌లో ఉంచనున్నట్లు తెలుస్తోంది. మరి షో ప్రారంభమైన ఏడు వారాల తర్వాత హౌస్‌లో అడుగు పెట్టబోతున్న బాబా భాస్కర్‌ను హౌస్మేట్స్ ఎలా ఆదరిస్తారో చూడాలి! చదవండి: పదిహేను రోజుల్లోనే ఓటీటీలోకి గని, ఆహా ట్వీట్ చూశారా? నిఖిల్ పాన్ ఇండియా సినిమా టైటిల్ ఇదే, దసరా పండుగే టార్గెట్ -
నా కన్నతల్లిని ఎప్పుడూ చూడలేదు: కన్నీళ్లు పెట్టుకున్న మిత్ర
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షోలో ఎన్నో ప్రయత్నాల అనంతరం ఎట్టకేలకు కెప్టెన్ అయ్యాడు యాంకర్ శివ. మరోపక్క కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో అయోమయంతో నిర్ణయాలు తీసుకున్న అషూ వరస్ట్ కంటెస్టెంట్‌గా ఎంపికై జైలు పాలయ్యింది. ఇదిలా ఉంటే తాజాగా బిగ్‌బాస్ వారికి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకునే అవకాశం కల్పించాడు. కొన్ని ఫ్యామిలీ ఫొటోలను పంపించి దానితో మీకున్న అనుభవాలను తెలియజేయమన్నాడు. ఈ సందర్భంగా నటరాజ్ మాస్టర్ తను డ్యాన్స్ చేస్తున్నట్లుగా ఉన్న ఫొటో చూపిస్తూ ఎమోషనలయ్యాడు. 'చదువుకోకుండా డ్యాన్సులేంట్రా? ప్రభు మాస్టర్ ఏమైనా ఫుడ్ పెడతాడా? అని తిట్టేవారు. కానీ ఈరోజు నేను ఫుడ్ తింటున్నాను, నా ఫ్యామిలీని చూసుకుంటున్నాను, ఇంతపెద్ద ప్లాట్‌ఫామ్ మీదకు వచ్చి మీకు ఫుడ్ పెడుతున్నాను అంటే అదంతా ప్రభు మాస్టర్ వల్లే' అని చెప్పుకొచ్చాడు. శివ తన ఫ్యామిలీ ఫొటో చూపిస్తూ.. ఈ ఫొటో తర్వాత అమ్మవాళ్లతో కలిసిలేను. అమ్మ నన్ను ఇంట్లో నుంచి పంపించేసింది అని బాధపడ్డాడు. తర్వాత మిత్ర తన చిన్ననాటి ఫొటో చూపిస్తూ భావోద్వేగానికి లోనైంది. 'నన్ను పట్టుకున్న చేయి మా అమ్మది, కానీ నా కన్నతల్లిని నేనెప్పుడూ చూడలేదు. అమ్మ చేయి మాత్రమే నాకు తెలుసు' అని తెలిపింది. తర్వాత అనిల్ వంతు రాగా నా కంటే ముందు అన్నయ్య ఉండేవాడు, కానీ పుట్టిన రెండు రోజులకే చనిపోయాడు అంటూ ఏడ్చేశాడు. అటు బిందుమాధవి కూడా అన్నయ్యతో దిగిన ఫొటోలు చాలా తక్కువ అని, అతడిని మిస్ అవుతున్నానని చెప్పింది. చదవండి: ప్రియురాలితో యాంకర్ వివాహం, నెట్టింట ఫొటోలు వైరల్ ప్రేక్షకులు మెచ్చిన తెలుగు వెబ్ సిరీస్‌లు ఇవే.. -
అజయ్‌కు అరియానా గోరుముద్దలు, అడ్డుపడ్డ అషూ!
ప్రయోగాత్మకంగా ప్రారంభమైన బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌కు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. కంటెస్టెంట్ల కొట్లాటలతో ఆట మరింత రంజుగా మారుతోంది. 17 మందితో ప్రారంభమైన బిగ్‌బాస్ షోలో ప్రస్తుతం 11 మంది మిగిలారు. తాజాగా కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో వీరిని జంటలుగా విభజించి అషూను సంచాలకురాలిగా వ్యవహరించాలని ఆదేశించాడు బిగ్‌బాస్. ఈ క్రమంలో కంటెస్టెంట్ల మధ్య గొడవలు రాజుకుంటున్నట్లు తెలుస్తోంది. గురువారం రిలీజ్ చేసిన ప్రోమోలో అషూ, అరియానా మధ్య వార్ నడిచినట్లు కనిపిస్తోంది. అరియానా ప్లేటులో భోజనం పెట్టుకొని వచ్చి అజయ్‌కు తినిపించింది. అయితే ముందు కార్డు చూపించంటూ కెప్టెన్ అషూ పదేపదే అడగడంతో అన్నం మీద అలిగి వెళ్లిపోయింది అరియానా. ప్లేటులో ఫుడ్డు పెట్టుకొని వచ్చి ఎమోషన్స్ వాడుకుందామనుకుంటే కరెక్ట్ కాదని వ్యాఖ్యానించింది అషూ. దీనికి అరియానా.. వేరేవాళ్లను బ్యాడ్ చేసి గేమ్ ఆడటంలేదంటూ కౌంటరిచ్చింది. ఇక శివ బెడ్రూమ్లో తింటూ దొరికిపోవడంతో అతడిని బయటకు పంపించేసింది అషూ. బయటకు వచ్చిన శివ కోపంతో నీళ్ల బాటిల్‌ను నేలకేసి కొట్టాడు. ఇంతకూ ఈ గేమేంటి? ఈ గేమ్‌లో ఎవరి జోడీ గెలుస్తుంది? అన్నది తెలియాలంటే రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: ప్రముఖ హాస్య నటుడు కన్నుమూత వాడు అమ్మాయి టచ్ కోరుకున్నాడు: అజయ్ -
కలిసిపోయిన అఖిల్- బిందు, ఇక రచ్చరచ్చే!
'అరేయ్ అఖిల్.. ఒసేయ్ బిందూ..' అంటూ ఒకరి మీద ఒకరు నోరు పారేసుకున్నారు బిగ్‌బాస్ కంటెస్టెంట్లు. ఎవరూ తగ్గేదేలే అన్న రీతిలో గొడవపడ్డారు. ఈ దెబ్బతో అఖిల్, బిందు మాట్లాడుకోవడం కల్ల అనుకున్న తరుణంలో బిగ్‌బాస్ అనూహ్యంగా వాళ్లిద్దరినీ కలిపాడు. అవును, ఓ టాస్క్‌లో ఈ ఇద్దరినీ ఒక టీమ్‌గా ఏర్పాటు చేశాడు. బిగ్‌బాస్ హౌస్‌మేట్స్‌కు 'ఇది మా అడ్డా' అనే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా ఇంటిని ఐదు ప్రాంతాలుగా విభజించాడు. ఇంటిసభ్యులను కూడా ఐదు టీములుగా విభజిస్తూ ఒక్కో ప్రాంతాన్ని వారికి అప్పగించాడు. అఖిల్ - బిందు, అజయ్- అరియానా, యాంకర్ శివ- నటరాజ్, అనిల్- హమీదా జంటలుగా విడిపోయారు. కెప్టెన్ అషూ సంచాలకురాలిగా వ్యవహరించింది. ఈ గేమ్‌లో అఖిల్- బిందు కలిసి ఆడుతూ ఎత్తుకు పైఎత్తులు వేశారు. బిందు అయితే ఏకంగా అరియానా పాస్‌లు కొట్టేసి అఖిల్ చేతిలో పెట్టింది. ఇప్పటివరకు వీళ్ల కొట్లాటలనే చూశాం, మరి వీరి గేమ్ చూడాలంటే రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: ఆస్కార్ విన్నర్ నిర్మాత నిశ్చితార్థం.. ఎమోషనల్‌గా పోస్ట్ మిత్ర శర్మ నాకు రూ.5 లక్షలు ఇస్తానని చెప్పింది: స్రవంతి -
మిత్ర నాకు రూ.5 లక్షలు ఇస్తానంది: స్రవంతి
అన్ని రకాల ఎమోషన్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారింది బిగ్‌బాస్. కోపతాపాలు, ఆనందాశ్యర్యాలు, అరుపులు, కేకలు, ఏడుపులు, పెడబొబ్బలు, అలకలు, అసూయలు, ఆవేశాలు, దిగులు.. ఇలా అన్నింటినీ చూపిస్తున్నారు హౌస్మేట్స్. ప్రేక్షకులు వారి గేమ్, ప్రవర్తనను పరిగణనలోకి తీసుకుని ఓట్లు గుద్దుతున్నారు. ఇదిలా ఉంటే బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ప్రారంభమై నెల రోజులు దాటిపోగా ఇప్పటివరకు ఆరుగురు ఎలిమినేట్ అయ్యారు. అందులో ముమైత్ తొలివారమే ఎలిమినేట్ కాగా ఆమెను వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్‌లోకి పంపించారు. కానీ ప్రేక్షకులు ఆమెను మరోసారి ఎలిమినేట్ చేయడం గమనార్హం. నిన్నటి ఎపిసోడ్లో డబుల్ ఎలిమినేషన్ ద్వారా ముమైత్‌తో పాటు స్రవంతి కూడా హౌస్ నుంచి బయటకు వచ్చింది. చదవండి: బుల్లితెర నటుడి కొత్త ఇల్లు.. కోట్లల్లో ధర.. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మిత్ర శర్మ గురించి చెప్పుకొచ్చింది. 'బిగ్‌బాస్ హౌస్‌లో నా లైఫ్ గురించి చెప్పినప్పుడు మిత్ర ముందుకు వచ్చి రూ.5 లక్షలు ఇస్తానంది. మీరు బాధపడకండి, నా ఇంట్లో పనిచేసే అమ్మాయికి రూ.10 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేశాను. అలాంటిది మీరు నన్ను దగ్గరుండి చూసుకున్నారు. తినిపించారు. నా ఆరోగ్యం బాగోలేనప్పుడు కూడా బాగోగులు చూసుకున్నారు. అమ్మలా, అక్కలా చూసుకున్నారు. మీకు రూ.5 లక్షలిస్తాను అని చెప్పింది. నేనెవరో పూర్తిగా తెలియకపోయినా మిత్ర శర్మ నాకోసం అలా మాట్లాడటం నచ్చింది. అందుకే ఆమెకు ఎక్స్ట్రా హగ్ ఇచ్చాను' అని తెలిపింది స్రవంతి చొక్కారపు. చదవండి: లుంగీ ఎత్తడమేంటి? ఆ బూతులేంటి?: నాగార్జున ఫైర్ -
'ఒరేయ్ అఖిల్, ఒసేయ్ బిందూ' ఈ వారం నామినేషన్స్‌లో ఎవరున్నారంటే?
బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్ల నిజస్వరూపాలు బయటపడేవి నామినేషన్స్‌లోనే! అప్పటిదాకా కలిసిమెలిసి ఉన్నా ఒకరినొకరు నవ్వుతూ పలకరించుకున్నా నామినేషన్స్ వచ్చేసరికి మాత్రం అన్నీ పక్కనపెట్టేసి నామినేట్ చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షోలో ఏడోవారం నామినేషన్స్ రసవత్తరంగా మారాయి. హమీదా.. అనిల్‌ను నామినేట్ చేసినట్లు కనిపిస్తోంది. ఇక నటరాజ్ మాస్టర్, యాంకర్ శివ ఎప్పటిలాగే ఓ రేంజ్లో గొడవపడ్డారు. అటు బిందుమాధవి, అఖిల్ కూడా మరోసారి కొట్లాటకు దిగారు. స్రవంతి అనే ఎమోషన్‌ను యూజ్ చేసుకున్నావని ఫైర్ అయింది బిందు. తనకు కావాల్సినప్పుడు నువ్వు నిలబడలేదంటూ మండిపడింది. అంతటితో ఆగకుండా ఒరేయ్ అఖిల్‌గా చెప్పురా.. అనడంతో అక్కడున్నవాళ్లు ముక్కున వేలేసుకున్నారు. తనను అంతమాట అన్నాక అఖిల్ ఆగుతాడా? ఒసేయ్ బిందు.. ఏం చెప్పాలే నీకు అని రివర్స్ కౌంటరిచ్చాడు. మొత్తానికి వాడివేడిగా సాగిన ఈ ప్రక్రియలో అఖిల్, బిందుమాధవి, అరియానా, శివ, నటరాజ్ మాస్టర్, మిత్ర, అనిల్ శర్మ నామినేషన్స్‌లో నిలిచారు. అషూ తన కెప్టెన్సీ పవర్‌తో మహేశ్‌ను నామినేట్ చేసినట్లు తెలుస్తోంది. చదవండి: ఆ ఐదుగురికి హగ్, ఒక్కరికి మాత్రం పంచ్ ఇచ్చిన స్రవంతి -
ఆమె నోరు తెరిస్తే బూతులే, శివకు కఠిన శిక్ష విధించిన నాగ్!
ఎప్పుడూ కూల్‌గా ఉంటూ నవ్వుతూనే చురకలు అంటించే నాగార్జున ఈసారి మాత్రం విశ్వరూపం చూపించాడు. హద్దులు మీరి మాట్లాడుతూ అతి చేస్తున్న బిగ్‌బాస్ నాన్‌స్టాప్ కంటెస్టెంట్లపై ఫైర్ అయ్యాడు. ఈ క్రమంలో యాంకర్ శివ, నటరాజ్ మాస్టర్లకు గట్టి వార్నింగే ఇచ్చాడు. ఇదిలా ఉంటే హౌస్‌మేట్స్‌తో ఫన్నీ టాస్క్ కూడా ఆడించాడు నాగ్. హౌస్‌లో బూతులు మాట్లాడే కంటెస్టెంట్ ఎవరని ప్రశ్నించగా నటరాజ్ అషూరెడ్డి అని ఆన్సరిచ్చాడు. అషూ పచ్చిబూతులు మాట్లాడుతుందా అని నాగ్ ఆశ్చర్యం వ్యక్తం చేయగా మా మమ్మీ చూస్తే ఇంటికెళ్లాక చీపురుకట్ట తిరగేస్తుందని వాపోయింది అషూ. శివ ఒక హౌస్‌మేట్ డ్రెస్సును బాత్రూమ్ బ్రష్‌తో ఉతికేసిన వీడియోను చూపిస్తూ గరమయ్యాడు నాగ్. శివ చేసింది కరెక్టా? అని బిందు మాధవిని అడగ్గా ఆమె తప్పని బదులిచ్చింది. శివ ఏదో చెప్పడానికి ప్రయత్నించగా షటప్ అంటూ అతడి నోరు మూయించాడు. ఈ వారమంతా అమ్మాయిల బట్టలు ఉతకాలని పనిష్మెంట్ ఇచ్చాడు. అలాగే ఈ రోజు సింగిల్ ఎలిమినేషన్ కాదని, డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని హౌస్‌మేట్స్‌ను టెన్షన్ పెట్టాడు నాగ్. అయితే ఆ ఇద్దరు ముమైత్ ఖాన్, స్రవంతి అని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. చదవండి: కిరాక్ ఆర్పీ ఇల్లు చూశారా? లిఫ్ట్, హోమ్ థియేటర్.. అబ్బో ఇలా చాలానే ఉన్నాయి! డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్! ఆ ఇద్దరు బ్యాగు సర్దేయాల్సిందే! -
కత్తితో దాడి చేద్దామనుకున్నాను: శివను బెదిరించిన నటరాజ్
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షో వీకెండ్‌కు రెడీ అవుతోంది. అయితే ఎలిమినేషన్ కన్నాముందు వరస్ట్ పర్ఫామర్‌ను ఎన్నుకోవాల్సిన సమయం వచ్చేసింది. దీంతో మెజారిటీ ఇంటిసభ్యులు బిందుమాధవి పేరును ప్రస్తావించినట్లు తెలుస్తోంది. గేమ్‌లో నిర్లక్ష్యంగా వ్యవహరించి కాయిన్స్ పోగొట్టుకుందంటూ చాలామంది ఆమెను చెత్త ప్లేయర్‌గా అభిప్రాయపడ్డారు. ఆఖరికి ఆమె ఫ్రెండ్ యాంకర్ శివ కూడా కాయిన్స్ పోగొట్టుకోవడం తప్పంటూ బిందుకు వరస్ట్ పర్ఫామర్ ట్యాగ్ ఇచ్చాడు. ఈ క్రమంలో బిందు తన ఆటను తప్పుపట్టిన హౌస్మేట్స్ తీరును తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. దీంతో మరోసారి అఖిల్, బిందుమాధవి మధ్య గొడవ రాజుకుంది. ఈ వారం బిందు వరస్ట్ పర్ఫామర్‌గా ఎంపికై జైల్లో పడ్డట్లు కనిపిస్తోంది. మరోవైపు అటు నటరాజ్ మాస్టర్, యాంకర్ శివ మధ్య కూడా పెద్ద ఫైట్ నడిచినట్లు కనిపిస్తోంది. కొట్టకపోతే అడుగు అంటూ శివకు సవాలు విసిరాడు నటరాజ్. ఇద్దరూ ఒకరిమీదకు ఒకరు దూసుకెళ్తుండటంతో వీరి కొట్లాటను ఆపే ప్రయత్నం చేసింది కెప్టెన్ అషూ. కోపంతో రగిలిపోయిన నటరాజ్ మాస్టర్ కిచెన్‌లో కూడా చిందులు తొక్కాడు. నాకు రక్తం మరిగిపోతుంది, ఎన్నిసార్లు ఊరుకుంటాను? కత్తి తెచ్చి కట్ చేసి పాడేద్దామనుకున్నాను అని ఆవేశంతో ఊగిపోయాడు. చివర్లో మనిషికి రెండు కళ్లు, శివుడికి మూడు కళ్లు, నటరాజ్‌కు ఒళ్లంతా కళ్లు అన్న తనదైన స్టైల్లో డైలాగ్ వదిలాడు నటరాజ్ మాస్టర్. చదవండి: ఓటీటీల్లో మిస్ అవ్వకూడని టాప్ 6 సినిమాలు.. ఏడేళ్ల లవ్.. బావ అనుమానించాడు: అరియానా బ్రేకప్ స్టోరీ -
ఇంటి నుంచి పారిపోయా, తిరిగెళ్దాం అనుకునేలోపు అమ్మ చనిపోయింది
బిగ్‌బాస్ షోలో ఈరోజు విచిత్రం జరగబోతోంది. సందు దొరికితే చాలు కారాలు మిరియాలు నూరుకునే కంటెస్టెంట్లు ఈరోజు మాత్రం ఒకరిపై ఒకరు ఎక్కడలేని ప్రేమ చూపిస్తున్నారు. అందుకు కారణం లేకపోలేదు. ఇంట్లో ఉన్న పర్ఫెక్ట్ మ్యాచ్ ఎవరో తెలుసుకోమని చెప్తూనే వారిని ఫిదా చేయాలంటూ ఆసక్తికరమైన టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. దీంతో కంటెస్టెంట్లు వారి కోపాలను పక్కనపెట్టి ఇతర హౌస్‌మేట్స్‌ను ఇంప్రెస్ చేసే పనిలో పడ్డారు. ఈ క్రమంలో ముమైత్ అజయ్ కోసం సిగరెట్ తాగడం మానేస్తానంది. అరియానా మహేశ్కోసం ఆమ్లెట్ చేయడమే కాక స్వయంగా తినిపించింది. మరోపక్క శివను కాకా పట్టే పనిలో పడింది హమీదా. ఇదిలా ఉంటే బిగ్‌బాస్ వీరికి మరో టాస్క్‌ను సైతం ఇచ్చాడు. తొలి ప్రేమ అనుభవాలను పంచుకోమని హౌస్‌మేట్స్‌ను ఆదేశించాడు. బిందుమాధవి మాట్లాడుతూ.. తన ఫస్ట్ లవ్ స్టోరీ బ్రేకప్‌తో ముగిసిపోయిందని చెప్పింది. స్రవంతి.. ప్రేమించిన వ్యక్తి కోసం ఇంటి నుంచి వచ్చేశానని, కానీ ఇంటికెళ్దాం అనుకునేలోపే అమ్మ చనిపోయిందని ఫోన్ వచ్చిందంటూ ఏడ్చింది. మరి వారి లవ్ స్టోరీలు తెలుసుకోవాలంటే నేడు రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: అకీరా బాక్సింగ్ వీడియో షేర్ చేసిన రేణు దేశాయ్, అవి నమ్మొద్దని విజ్ఞప్తి -
Bigg Boss: ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నదెవరంటే?
బిగ్‌బాస్ షోలో ఎక్కువమంది ఇష్టపడే ప్రక్రియ నామినేషన్స్. ఇక్కడే కంటెస్టెంట్ల అసలు స్వరూపం బయటపడుతుంది. ఒకరినొకరు నామినేట్ చేసుకునే క్రమంలో కొట్లాటలకు దిగుతారు హౌస్మేట్స్. తాజాగా హౌస్‌లో ఐదో వారం నామినేషన్స్ రసవత్తరంగా సాగాయని ప్రోమో చూస్తుంటేనే తెలుస్తోంది. మిత్రతో ఈ మధ్య చనువుగా మెదులుతున్న అరియానా నామినేషన్స్‌లో ఆమె పేరునే తీసుకురావడం కొసమెరుపు. ఇంప్రెషన్‌ను ఫామ్ చేయడం నచ్చలేదంటూ మిత్రను, తాను రెండురకాలుగా గేమ్ ఆడుతున్నానని కామెంట్ చేసిన బిందుమాధవి ఫొటోలను మంటల్లో వేసింది. నామినేషన్స్ చేసుకునే క్రమంలో అజయ్, అషూ రెడ్డిలతో హమీదా గట్టిగానే పోరాడింది. అనిల్ నటరాజ్ మాస్టర్‌ను నామినేట్ చేయడంతో ఆయన తిరిగి అనిల్‌ను నామినేట్ చేశాడు. ఆ తర్వాత స్రవంతిని శకునితో పోల్చడంతో ఇద్దరి మధ్య అగ్ని రాజుకుంది. అలాగే బిందుమాధవి దూషిస్తోందంటూ ఆమె ఫొటోను అగ్నిలో కాల్చేశాడు మాస్టర్. మాట్లాడే దమ్ములేదా అంటూ మాస్టర్‌కే ఎదురుతిరిగింది బిందు. ఫైనల్‌గా ఈ వారం అజయ్, అషూ, మిత్ర, మహేశ్, హమీదా, అరియానా, నటరాజ్, అనిల్ నామినేషన్స్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: Bharti Singh: మగ బిడ్డకు జన్మనిచ్చిన లేడీ కమెడియన్ -
తండ్రి అనుకున్న వ్యక్తే కాటేశాడు: తేజస్వి ఎమోషనల్
బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్‌ను ఆదరించేవాళ్లు చాలామందే ఉన్నారు. దీనికున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని నిర్వాహకులు బిగ్‌బాస్ ఓటీటీని ప్రవేశపెట్టారు. బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షో ద్వారా ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నారు. టాస్కులు, నామినేషన్ల పర్వం, అప్పుడప్పుడూ గెస్టుల రాకతో బాగానే నెట్టుకొస్తున్నారు కానీ ఎలిమినేషన్లే ఎవరికీ అంతు చిక్కడం లేదు. టాప్ 5లో లేదా టాప్ 10లో ఉంటారనుకునే కంటెస్టెంట్లు ఒక్కొక్కరిగా ఇంటి బాట పడుతున్నారు. బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షో తొలి వారం ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అవగా ఆమె గత వారమే మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. రెండో వారం శ్రీరాపాక, మూడో వారం చైతూ, నాలుగో వారం సరయు ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. తాజాగా ఐదో వారం తేజస్వి మదివాడ ఎలిమినేట్ అవడం చాలామందికి ఇప్పటికీ మింగుడుపడటం లేదు. టాప్ 5లో ఉండాల్సిన కంటెస్టెంట్‌ను ఇలా సడన్‌గా ఎలా పంపించేస్తారంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నారు. ఇదిలా ఉంటే హౌస్ నుంచి వచ్చేసిన తేజస్వి బిగ్‌బాస్ బజ్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా యాంకర్ రవి దగ్గర హౌస్‌మేట్స్‌పై తన అభిప్రాయాలను చెప్పుకొచ్చింది. అఖిల్ హీరో, స్రవంతి మిర్చి, మిత్ర కాకరకాయ, నటరాజ్ మాస్టర్ రాడ్, అనిల్ కేటుగాడు అని తెలిపింది. అవకాశం ఇస్తే ఎవరిని తుపాకీతో లేపేస్తావంటే క్షణం ఆలోచించుకోకుండా నటరాజ్ మాస్టర్ పేరు చెప్పింది. నటరాజ్ మాస్టర్ లాంటి తండ్రి తనకు వద్దంది తేజస్వి. పక్కనవాళ్లను తొక్కుకుంటూ పోయేవాళ్లు నచ్చరంటూ బిందుమాధవి ఫొటోను చించేసింది. గతంలో బిగ్‌బాస్‌కు వెళ్లి వచ్చాక తనకు పనివ్వడమే మానేశారని, ట్రోలింగ్ వల్ల ఏడుస్తూనే ఉన్నానంది. దీన్నుంచి బయటపడేందుకు ట్రావెలింగ్ చేసి మళ్లీ నార్మల్ అయ్యానంది. ఈసారి బిగ్‌బాస్‌లో నటరాజ్ మాస్టర్ అనే వ్యక్తి ఒక్కడే నామినేట్ చేసి పంపించేశాడని. తండ్రి అనుకున్న వ్యక్తి కాటేశాడు అంటూ బాధపడింది. -
బిగ్‌బాస్ షోలోకి యాంకర్ సుమ ఎంట్రీ, నవ్వులే నవ్వులు
బిగ్‌బాస్ షోకు, సుమకు విడదీయరాని అనుబంధం ఉంది. ప్రతి సీజన్‌కు ఆమె ఆహ్వానం అందుతూనే ఉంది. పిలిచినప్పుడల్లా కాదనుకుండా ఆమె వస్తూనే ఉంది. నేడు ఉగాదిని పురస్కరించుకుని బిగ్‌బాస్ హౌస్‌లో అడుగు పెట్టింది జయమ్మ. అవును, ఈసారి యాంకర్ సుమగా కాకుండా జయమ్మ పంచాయితీ కథానాయిక జయమ్మగా షోలోకి ఎంట్రీ ఇచ్చింది. ఎప్పటిలాగే తన హుషారైన మాటలతో హౌస్‌లో జోష్ నింపింది. అలాగే కొందరు కంటెస్టెంట్లపై చమత్కారాలు కూడా పేల్చింది. పంపు కాదు పాతాళగంగ అంటూ మిత్రను ఆటపట్టించింది. మరోవైపు అఖిల్ సార్థక్ గిఫ్టులు వచ్చాయంటూ హౌస్‌లోని అమ్మాయిలను ఏప్రిల్ ఫూల్ చేశాడు. ఈ సరదా ఎపిసోడ్ చూడాలంటే మరికొద్ది గంటలు వెయిట్ చేయాల్సిందే! చదవండి: 'దరిద్రం, ఎన్నిసార్లు చెప్పినా మారడు అని చిరంజీవి తిట్టారు' -
Bigg Boss: అఖిల్- బిందుమాధవికి విడాకులు, ముమైత్ రీఎంట్రీ!
బుల్లితెరపై ప్రసారమయ్యే బిగ్‌బాస్ ఇప్పుడు అరచేతిలోకి వచ్చేసింది. టీవీలో కాకుండా కేవలం ఓటీటీలోనే ప్రసారమవుతోంది బిగ్‌బాస్ ఓటీటీ. వినోదానికి లేదు ఫుల్స్టాప్ అంటూ బిగ్‌బాస్ నాన్‌స్టాప్ 24 గంటలు స్ట్రీమింగ్ అవుతోంది. 17 మందితో ప్రారంభమైన ఈ షోలో ఇప్పటికే నలుగురు ఎలిమినేట్ అయ్యారు. అందులో ముమైత్, శ్రీరాపాక, చైతూ, సరయు ఉన్నారు. అయితే మొట్టమొదటగా ఎలిమినేట్ అయిన ముమైత్ తాజాగా హౌస్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఈ మేరకు ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో అఖిల్.. బిందుమాధవి గురించి మాట్లాడటంతో హర్ట్ అయినట్లుంది అషూ. ఇక హౌస్‌లో ఓ టాస్క్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. భార్యాభర్తలకు మధ్య జరిగిన గొడవను పరిష్కరించేందుకు కోర్టు సీన్‌ను ఏర్పాటు చేయగా.. ఇందులో శివ లాయర్‌గా వాదిస్తున్న సమయంలో సడన్‌గా ముమైత్ రీఎంట్రీ ఇచ్చింది. ఆమె రాకతో హౌస్మేట్స్ సర్ప్రైజ్ అయ్యారు. వచ్చీరాగానే జడ్జి స్థానంలో కూర్చున్న ముమైత్ విడాకుల సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేసింది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం అఖిల్, బిందుమాధవిలకు ముమైత్ విడాకులు మంజూరు చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ ఎపిసోడ్ ఎలా సాగిందో తెలియాలంటే రాత్రి 9 గంటల వరకు వేచి చూడాల్సిందే! చదవండి: ఆమెను సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని హాస్టల్లో పెట్టాను: యాంకర్ భర్త -
నన్ను హీరోయిన్ను చేయకండి సర్.. మెలికలు తిరిగిన అషూ
నాగార్జున వస్తున్నాడంటే చాలు హౌస్మేట్స్ ముఖాలు వెలిగిపోతాయి. కాసేపు వారి గేమ్‌ను, గొడవలను అంతా పక్కనపెట్టి నాగ్ ఏం చెప్తాడా? అని కుతూహలంగా ఎదురుచూస్తుంటారు. తాజాగా సండేను ఫండే చేసేందుకు ఎంట్రీ ఇచ్చాడు నాగ్. ఎప్పటిలాగే వారితో గేమ్స్ ఆడిస్తూ ఎంటర్టైన్ చేస్తూనే క్లిష్టమైన టాస్క్ ఇచ్చాడు. బిగ్‌బాస్ ఇంటి నుంచి బయటకు వెళ్లాక ఎవరిని ఫ్రెండ్ చేసుకుంటారు? ఎవరిని బ్లాక్ చేస్తారు? అని అడిగాడు. ఈ గేమ్ గురించి విన్న తేజు 'కొంపలో కుంపటి' ప్రోగ్రామ్ అంటూ దానికి ఓ టైటిల్ కూడా ఇచ్చేసింది. ముందుగా శివ.. బిందుమాధవిని ఫ్రెండ్ చేసుకుంటానన్నాడు. అనిల్.. అషూను ఫ్రెండ్ చేసుకుంటానంటే హమీదా మాత్రం అనిల్‌తో ఫ్రెండ్షిప్ చేస్తానంది. సరయు అనిల్‌ను బ్రదర్‌లా ఫీల్ అవుతానని, అతడిని ఫ్రెండ్ చేసుకుంటానంది. తర్వాత నటరాజ్ మాస్టర్ అషూ గురించి చెప్తూ ఇలాంటి ఫ్రెండ్ ఉంటే నాలాంటోడు ఎప్పుడైనా ది బెస్ట్ ఉంటాడని పేర్కొన్నాడు. ఈ పొగడ్తలతో పొంగిపోయిన అషూ.. దయచేసి నన్ను హీరో చేయకండి సార్ అని మెలికలు తిరిగింది. ఇక బిందు, అనిల్, అజయ్, స్రవంతి.. నటరాజ్ మాస్టర్‌ను బ్లాక్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక నిన్న కారాలు మిరియాలు నూరుకున్న అఖిల్, బిందు ఈరోజుమాత్రం ఇట్టే కలిసిపోయారు. మరి నాగ్ హౌస్‌మేట్స్‌తో ఇంకా ఎలాంటి గేమ్స్ ఆడించాడు. కెప్టెన్ నటరాజ్ మాస్టర్ ఇంకా గొడవపడుతున్నాడా? సైలెంట్ అయిపోయాడా? అన్నది తెలియాలంటే బిగ్‌బాస్ నాన్‌స్టాప్ లైవ్ లేదా నేడు రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: ట్రోలింగ్, సీక్రెట్ మ్యారేజ్‌పై స్పందించిన యాంకర్ భర్త కశ్మీర్ ఫైల్స్ వల్ల తన సినిమా ఎఫెక్ట్ అయిందన్న స్టార్ హీరో -
అఖిల్- బిందు మధ్య బిగ్ ఫైట్... హీటెక్కిస్తున్న ప్రోమో
Bigg Boss Non Stop Latest Promo Is Out: బుల్లితెరపై బిగ్‌బాస్ నాన్‌స్టాప్ రసవత్తరంగా సాగుతోంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 24గంటల పాటు ప్రసారం అవుతున్న బిగ్‌బాస్‌లో వినోదంతో పాటు గొడవలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. అప్పటి వరకు ఫ్రెండ్స్‌గా ఉన్న వారు కూడా టాస్క్‌లు వచ్చేవరకు ఎనిమీలుగా మారుతున్నారు. ఇక బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో ప్రస్తుతం కెప్టెన్సీ టాస్క్ జరుగుతున్న సంగతి తెలిసిందే. శివను ఆ రౌండ్లో ఎలిమినేట్ చేసే ప్రక్రియలో అఖిల్, బిందు మాధవికి మధ్య పెద్ద గొడవ జరిగింది. నువ్వు ఇప్పటివరకు ఎన్ని సార్లు కెప్టెన్సీ కంటెండర్ అయ్యావని అఖిల్ ప్రశ్నించగా.. నీలా నాకు ఫ్రెండ్స్ సపోర్ట్ చేయలేదు అంటూ బిందు కౌంటర్ వేసింది. 'ఫ్రెండ్స్ సపోర్ట్ లేకుండా నువ్వు ఒక్క గేమ్ కూడా ఆడలేవు. ఫ్రెండ్స్ సపోర్ట్‌తో బతుకుతుంది నువ్వు.. నేను కాదు. ఫ్రెండ్స్ సపోర్ట్ లేకుండా అఖిల్ ఈ ఇంట్లో బతకలేడు'.. అంటూ మండిపడింది. 'ఈ మాటలు పడటానికి వచ్చానా నేను.. ఇష్టం వచ్చిన మాటలు అంటున్నావ్' అంటూ అఖిల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ ఫైట్‌లో అజయ్ తన ఫ్రెండ్స్ అఖిల్‌కి సపోర్ట్‌గా నిలుస్తాడు. మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడాలని బిందుతో గొడవకు దిగుతాడు. దీనికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. -
Bigg Boss: అతడికి ముద్దు పెట్టిన అషూ రెడ్డి, ఏడ్చేసిన అరియానా
బిగ్‌బాస్ హౌస్‌లో జరిగే ఆటను కన్నార్పకుండా చూసేందుకు బిగ్‌బాస్ తెలుగు ఓటీటీని ప్రవేశపెట్టారు మేకర్స్. నో కామా, నో ఫుల్స్టాప్ అంటూ నాన్‌స్టాప్ షోను మొదలుపెట్టారు. తద్వారా హౌస్‌లో 24 గంటలు ఏం జరుగుతుందో చూసే అవకాశం కల్పించారు. కానీ కొన్ని సందర్భాల్లో హౌస్మేట్స్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడటం, జోక్స్ శృతిమించడం, బూతులు తిట్టుకోవడం చూస్తుంటే ఈ షోకు సెన్సార్ లేకుండా పోయిందని తిట్టుకునేవాళ్లూ లేకపోలేరు. తాజాగా షోలో అషూ.. అనిల్‌తో పులిహోర కలిపింది. నిన్ను ముద్దు పెట్టుకోవాలని ఉందని చెప్పడమే కాకుండా అతడి చేతిని తీసుకుని ముద్దాడింది. అషూ తనను ముద్దు పెట్టుకునేసరికి పులకరించిపోయిన అనిల్ ఆమె చేతిని ముద్దాడాడు. ఆ తర్వాత సీక్రెట్ టాస్క్‌లో భాగంగా హౌస్మేట్స్ మిత్ర శర్మ, అరియానాను ఏడిపించారు. మరి అషూ అనిల్‌ను కిస్ చేయడం కూడా సీక్రెట్ టాస్క్‌లో భాగమా? కాదా? అనేది తెలియాలంటే బిగ్‌బాస్ నాన్‌స్టాప్ లైవ్ చూడాల్సిందే! చదవండి: ఆర్జే చైతూ ఎలిమినేషన్‌కు కారణాలివే! ఆర్ఆర్ఆర్ కోసం జక్కన్న తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతంటే.. -
Bigg Boss: చెంపలు వాయించుకుని ఏడ్చేసిన మాస్టర్
ఆర్జే చైతూ ఎలిమినేట్ కాకపోయుంటే ఈ వారం కెప్టెన్‌గా అతడు బిగ్‌బాస్ హౌస్‌ను ఏలేవాడు. కానీ ఊహించని ఎలిమినేషన్‌తో అతడు బిగ్‌బాస్ హౌస్‌ను వీడక తప్పలేదు. దీంతో ప్రస్తుతం ఇల్లు కెప్టెన్ లేకుండానే నడుస్తోంది. ఇక బిగ్‌బాస్ హౌస్‌మేట్స్‌కు కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా గార్డెన్ ఏరియాలో విసిరేసే స్టార్స్‌ను ఎవరైతే ఎక్కువగా దక్కించుకుంటారో వారు కెప్టెన్సీకి పోటీపడతారు. ఇక ఎలాగైనా గెలవడం కోసం దొంగతనానికి కూడా వెనుకాడట్లేదు హౌస్మేట్స్. ఈ క్రమంలో తనను అభ్యంతరకరంగా టచ్ చేశాడంటూ అఖిల్ మీద ఫిర్యాదు చేసింది హమీదా. తనమీద లేనిపోని నిందలేయొద్దని అఖిల్ వారించగా సంచాలకురాలిగా వ్యవహరించిన అషూ వీరి గొడవను సద్దుమణిగే ప్రయత్నం చేసింది. ఇదిలా ఉంటే ఈ రోజు తెల్లారేసరికి కొందరి స్టార్లు చోరీ అయ్యాయట. అతడెవరో తెలిసినా చెప్పనని బుకాయించింది అరియానా. మరోపక్క అషూ.. అఖిల్ మీద అలిగింది. నా మీద అరిచేస్తూ, హర్ట్ చేసి సారీ చెప్పకని కుండ బద్ధలు కొట్టింది. గేమ్‌లో నటరాజ్ మాస్టర్ స్టార్లు దాచుకున్న కవర్ చినగడంతో వాటన్నింటినీ మిగతా కంటెస్టెంట్లు లాగేసుకున్నారు. దీంతో చిర్రెత్తిపోయిన మాస్టర్ ఏం చేయాలో అర్థం కాక తన చెంపలు వాయించుకుని ఏడ్చేశాడు. మరి ఈ గేమ్‌లో ఎవరు గెలుస్తారు? నెక్స్ట్ కెప్టెన్ ఎవరన్నది తెలియాలంటే బిగ్‌బాస్ నాన్‌స్టాప్ చూడాల్సిందే! చదవండి: గులాబీ పూలతో వెంటపడిన అమ్మాయిలు.. సిగ్గు పడిన హీరో -
మరోసారి నామినేషన్స్‌లోకి శివ, ఇంకా ఎవరెవరున్నారంటే?
బిగ్‌బాస్ షోలో నామినేషన్స్ కోసం వెయిట్ చేసేవాళ్లున్నారు, నామినేషన్స్ అంటే భయపడేవాళ్లూ ఉన్నారు. కానీ ఏదేమైనా ప్రతివారం నామినేషన్స్ తప్పనిసరి. దీన్నుంచి ఎవరూ తప్పించుకోలేరు. తాజాగా నాలుగోవారం నామినేషన్స్ షురూ అయ్యాయి. ఈసారి లారీ, హారన్ టాస్క్ ద్వారా నామినేషన్ ప్రక్రియ నిర్వహించాలన్నాడు బిగ్‌బాస్. ఇందులో భాగంగా లారీ హారన్ సౌండ్ మోగినప్పుడు ఎవరైతే ముందుగా బజర్ నొక్కుతారో వారికి ఇద్దరిని నామినేషన్ చేసే ఛాన్స్ లభిస్తుంది. అయితే ఈ ఇద్దరిలో ఎవరిని ఫైనల్‌గా నామినేట్ చేయాలన్నది మాత్రం ఇంటిసభ్యులు నిర్ణయిస్తారు. అందరూ ఊహించినట్టుగానే ఈసారి కూడా యాంకర్ శివకు ఎక్కువ ఓట్లు పడ్డాయి. బాడీ షేమింగ్ ఇష్యూతో ఇమేజ్ డ్యామేజ్ చేసుకున్న అరియానా వైబ్ డిస్టర్బ్ అయిందంటూ సరయును నామినేట్ చేసింది. దీంతో సరయు.. ఇప్పుడు అరియానా ఎలా ఆడుతుందో అర్థమైపోయిందని కౌంటరిచ్చింది. మహేశ్ విట్టా తనను నామినేట్ చేయడంతో విసిగిపోయిన అరియానా తానసలు బాడీ షేమింగ్ చేయలేదని చెప్పింది. ఇక ఈ వారం యాంకర్ శివ, బిందుమాధవి, అనిల్, అజయ్, సరయు, అరియానా, మిత్ర శర్మ నామినేషన్స్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: రోడ్డు ప్రమాదంలో బిగ్‌బాస్ ఫణికి తీవ్ర గాయాలు, చివరి పోస్ట్ వైరల్ -
సరయు నడిస్తే భూకంపం వచ్చినట్లే ఉంది: అరియానా తీవ్ర వ్యాఖ్యలు
సండేను ఫండే చేసేందుకు నాగార్జున వచ్చేశాడు. కంటెస్టెంట్ల లెక్క సరిచేసేందుకు ఆయన రెడీ అయ్యాడు. దీనికంటే ముదు హీరోయిన్ శ్రద్ధా దాస్ స్టేజీపై చిందులేసి అలరించింది. ఆ తర్వాత ఎప్పటిలాగే హౌస్‌మేట్స్‌తోనూ డ్యాన్సులేయించాడు నాగ్. ఈ క్రమంలో అషూ, హమీదా రెచ్చిపోయి మరీ చిందేశారు. అనంతరం గతవారం జరిగిన మోస్ట్ ఇరిటేట్ పర్సన్ ఎవరన్న ఓటింగ్ ఫలితాలను అందరిముందు ప్రకటించాడు నాగ్. అందరూ అనుకున్నట్లుగా శివకు కాకుండా ఆర్జే చైతూకు ఎక్కువ ఓట్లు రావడం గమనార్హం. అలాగే హౌస్‌లో మోస్ట్ ఫేక్ హౌస్ పర్సన్ ఎవరని చేపట్టిన ఓటింగ్ ఫలితాలను సైతం రివీల్ చేశాడు. అనంతరం సరయు తన మీద బాడీ షేమింగ్ జరిగిన విషయాన్ని నాగార్జునకు తెలిపింది. నేను నడుచుకుంటూ వస్తుంటే భూకంపం వచ్చినట్లు ఉందని అరియానా కామెంట్ చేసిందని చెప్పుకొచ్చింది. దీంతో అరియానా తనేమీ సీరియస్‌గా అనలేదని కవర్ చేసే ప్రయత్నం చేయగా నాగ్ వీడియో చూపించాడు. అందులో అరియానా తప్పు చేసినట్లు అడ్డంగా దొరికిపోవడంతో మారు మాట్లాడకుండా నిల్చుండిపోయింది. ఇక అరియానా చేసింది తప్పా? ఒప్పా? అన్నదానిపై హౌస్మేట్స్ అభిప్రాయాలు తెలుసుకోనున్నాడు నాగ్. మరి కంటెస్టెంట్లు సరయు పక్కన నిలబడతారా? లేదంటే అరియానాకు మద్దతిస్తారా? అన్నది తెలియాలంటే రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: మేఘన్‌తో పడుకున్నానని చెప్తే రూ.50 లక్షలిస్తామని ఆఫర్! -
బిగ్‌బాస్ నాన్‌స్టాప్: ప్రముఖ యాంకర్ ఓంకార్ వచ్చేశాడు!
Omakar Into Bigg Boss House: ఆనందాలను పంచే రంగుల హోలీ అంటే చిన్నవాళ్ల దగ్గరనుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ ఇష్టమే. రంగులు పూసుకుంటూ, నీళ్లు చల్లుకుంటూ అనుంబంధాలను మరింత ధృడంగా మార్చుకుంటారందరూ. ఇలాంటి హోలీ పండగను జరుపుకునే అవకాశం కంటెస్టెంట్లకు కల్పించాడు బిగ్‌బాస్. దీంతో నేటి ఎపిసోడ్ కలర్ఫుల్గా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ హోలీ వేడుకల్లో అమ్మాయిలను ఇంప్రెస్ చేయాలనే టాస్క్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. అందులో భాగంగా అనిల్ బిందుమాధవి మీద పొగడ్తల వర్షం కురిపించగా అనిల్ అషూ చేయి పట్టుకుని స్టెప్పులేశాడు. ఇక హౌస్‌మేట్స్‌కు రెట్టింపు వినోదాన్ని పంచేందుకు ప్రముఖ యాంకర్ ఓంకార్ రావడం విశేషం. మరి వీరు ఏ రేంజ్లో వినోదాన్ని పంచనున్నారో తెలియాలంటే హాట్‌స్టార్‌లో రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: కోట్లు సంపాదించిన మిత్ర శర్మ ఇల్లు చూశారా? -
అతడిని కెప్టెన్‌గా గెలిపించిన అఖిలే నంబర్ 1!
బిగ్‌బాస్ ఓటీటీ రంజుగా సాగుతోంది. హౌస్మేట్స్ చేసిన తప్పులకు కెప్టెన్ అనిల్ శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఇంటిసభ్యులు పట్టపగలు నిద్రపోతున్నా చూసీచూడనట్లు వదిలేయడం, మైకులు ధరించాలన్న నిబంధనకు కొందరు నీళ్లు వదలడంతో బిగ్‌బాస్ మండిపడ్డాడు. అనిల్ తన విధులు సరిగా నిర్వర్తించలేదంటూ కెప్టెన్సీ నుంచి అర్ధాంతరంగా తొలగించాడు. అయితే మెజారిటీ హౌస్మేట్స్ అనిల్ కెప్టెన్సీ సరిగ్గానే ఉందంటూ ఓటేయడంతో రెండు వారాలపాటు కెప్టెన్సీకి నేరుగా పోటీ చేసే అవకాశాన్ని గెలుచుకున్నాడు. దీంతో మూడోవారంలో కెప్టెన్సీ కంటెండర్స్‌లో అనిల్ కూడా ఉన్నాడు. ఇతడితో పాటు అషూ, అరియానా, శివ, చైతూ, అజయ్, హమీదా కెప్టెన్సీకి పోటీపడ్డారు. వీరిలో చైతూ గెలవగా అతడిని గెలిపించింది మాత్రం అఖిలే కావడం విశేషం. మరోపక్క అషూ కెప్టెన్ కాలేకపోయానని కంటతడి పెట్టుకుంది. ఈ ప్రోమో చూసిన నెటిజన్లు అఖిల్ మీద పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. 'అఖిల్ గేమ్‌లో దిగితే వేరే విషయాలు, గొడవలు పట్టించుకోడు', 'చైతూ అఖిల్‌ను సిల్లీ రీజన్స్‌తో నామినేట్ చేసినా అతడు అవేమీ పట్టించుకోకుండా కెప్టెన్ అవడానికి సాయం చేశాడు', 'అఖిలే నంబర్ 1' అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: నటి కావ్యశ్రీ బెంగళూరు ఇంటిని చూశారా? -
బిగ్‌బాస్ కెప్టెన్ అనిల్‌కు బిగ్ షాక్, కెప్టెన్సీ గోవిందా!
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ఇప్పుడిప్పుడే రంజుగా మారుతోంది. వారియర్స్, చాలెంజర్స్ అంటూ కంటెస్టెంట్ల మధ్య చిచ్చుపెట్టిన బిగ్‌బాస్ ఆ అడ్డుగోడను తొలగించేశాడు. దీంతో హౌస్మేట్స్ గొడవలు మాని కొంత కూల్ అయ్యారు. అలాగే బిగ్‌బాస్ రూల్స్‌ను కూడా పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. చాలామంది పగటిపూట నిద్రించకూడదన్న రూల్ బ్రేక్ చేశారు. కొందరు పాత కంటెస్టెంట్లు మైక్ పెట్టుకోవడం కూడా మర్చిపోతున్నారు. దీంతో సీరియస్ అయిన బిగ్‌బాస్ వారు చేసిన తప్పులను వీడియో వేసి చూపించాడు. హౌస్మేట్స్ చేసిన తప్పుకు కెప్టెన్ అనిల్‌కు శిక్ష విధించాడు. అతడి కెప్టెన్సీ అర్ధాంతరంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించాడు. వెంటనే తను ధరించిన కెప్టెన్సీ బ్యాడ్జ్‌ను స్టోర్‌రూమ్‌లో పెట్టాలని ఆదేశించాడు. ఈ మేరకు ప్రోమో రిలీజైంది. ఇది చూసిన నెటిజన్లు అనిల్ రాథోడ్‌ను చూసి జాలి పడుతున్నారు. అప్పుడు మోడల్ జెస్సీ కెప్టెన్సీని నాశనం చేస్తే ఇప్పుడు మోడల్ అనిల్ రాథోడ్ కెప్టెన్సీని భ్రష్టు పట్టించారని కామెంట్లు చేస్తున్నారు. మరి నిజంగానే బిగ్‌బాస్ అనిల్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించాడా? లేదంటే సీరియస్ వార్నింగ్ ఇచ్చి వదిలేశాడా? అన్నది నేటి ఎపిసోడ్లో తేలనుంది. చదవండి: బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విన్నర్ ఎవరో చెప్పేసిన కౌశల్ మండా -
Bigg Boss Non Stop: నామినేషన్స్‌లో 12 మంది!
బిగ్‌బాస్ కంటెస్టెంట్ల భవిష్యత్తును చెప్పేది నామినేషన్సే. ఈ ఒక్క గండం నుంచి బయటపడ్డారంటే ఆ వారం నిశ్చింతగా గుండెల మీద చేయేసుకుని నిద్రపోవచ్చు. ఒకవేళ నామినేషన్స్‌లోకి వచ్చారంటే వీకెండ్ వరకు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిందే! విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉన్నవాళ్లకు ఆ చింత అక్కర్లేదనుకోండి, అది వేరే విషయం. ఇక బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో ముచ్చటగా మూడో నామినేషన్స్ జరిగాయి. పక్కనే ఉండి గోతులు తవ్వేవాళ్లే అంటే నా జీవితంలో కూడా ఇష్టముండరంటూ తేజస్వి బోల్డ్ బ్యూటీ అరియానాను నామినేట్ చేసింది. ఇంతమాట అన్నాక అరియానా ఊరుకుంటుందా? తాను గోతులు తవ్వుతున్నట్లు అనిపిస్తే తేజు ఇన్ఫ్లూయెన్స్ చేస్తున్నట్లు అనిపిస్తోందంటూ ఆమెను నామినేట్ చేసింది. చదవండి: బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విన్నర్ ఎవరో చెప్పేసిన కౌశల్ మండా ఇక నామినేషన్స్‌లో చైతూ ఎవరివో కాళ్లు పట్టుకుంటానంటూ నామినేట్ చేశాడు. యాంకర్ శివ, నటరాజ్ మాస్టర్ మధ్య మహేశ్, అనిల్ మధ్య కూడా ముసలం మొదలైనట్లు కనిపిస్తోంది. ఎప్పటిలాగే అఖిల్, బిందుమాధవికి అస్సలు పడలేదు. మొత్తంగా ఈ మూడో వారం సరయు, అషూ రెడ్డి, కెప్టెన్ అనిల్ మినహా మిగతా 12 మంది నామినేషన్స్‌లో ఉన్నారు. -
అంత బలుపెందుకు? అంటూ హీరోను తిట్టేసిన అరియానా
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షో రోజురోజుకీ రంజుగా మారుతోంది. 17 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన షోలో ఇప్పటికే ముమైత్ ఖాన్ ఎలిమినేట్ కాగా తాజాగా మరో కంటెస్టెంట్ హౌస్‌ను వీడే సమయం ఆసన్నమైంది. సోషల్ మీడియాలో లీకువీరులు శ్రీరాపాక ఎలిమినేట్ అయిందని దండోరా వేస్తుండగా మరికొందరు మాత్రం మిత్రశర్మ వెళ్లిపోయే ఛాన్స్ ఉందంటున్నారు. ఈ సంగతి పక్కనపెడితే తాజాగా స్టాండప్ రాహుల్ చిత్రయూనిట్ బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టింది. రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ హౌస్‌లో అడుగుపెట్టి కంటెస్టెంట్లతో ఓ ఆటాడించారు. ఈ మేరకు ప్రోమో రిలీజ్ చేశారు. ఇందులో ఈ వారం మహేశ్ విట్టా వరస్ట్ పర్ఫామర్‌గా ఎంపికై జైలులో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక అతిథులుగా వచ్చిన హీరోహీరోయిన్లను హౌస్మేట్స్ తమ స్కిట్లతో కడుపుబ్బా నవ్వించి ఇంప్రెస్ చేశారు. కాగా రాజ్‌తరుణ్ అనుభవించు రాజా సినిమాలో అరియానా నటించిన విషయం తెలిసిందే! ఇక్కడ ఏర్పడ్డ పరిచయంతో హీరోతో చనువు పెంచుకున్న బోల్డ్ బ్యూటీ తాజాగా ప్రోమోలో రాజ్‌తరుణ్‌పై సీరియస్ అయింది. నీకు హాయ్ చెప్పడానికి బలుపేంటి? అని నిలదీసింది. రాగానే చెప్పాను కదా అని రాజ్‌తరుణ్ సమాధానం చెప్పినప్పటికీ ఆమె శాంతించలేదు. ఏంటి నీ ఫ్రెండ్ హాయ్ చెప్పట్లేదు అని చైతూ అప్పటినుంచి అంటున్నాడు అంటూ గరం అయింది. అయితే వీళ్లిద్దరూ మంచి ఫ్రెండ్సే కాబట్టి అంత సీరియస్ ఏం అయుండదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ స్టాండప్ రాహుల్ టీమ్‌తో బిగ్‌బాస్ కంటెస్టెంట్ల ఆటను చూడాలంటే నేడు రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఎపిసోడ్ వీక్షించాల్సిందే! చదవండి: నా ఫ్రెండ్‌ను నేనే చంపానంటున్నారు, అవును, నావల్లే: హీరోయిన్ -
బిగ్‌బాస్ రూల్స్ ఫాలో కానని తేల్చేసిన అఖిల్! కెప్టెన్ ఎవరంటే?
బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో బంధాలు, అనుబంధాల సంగతేమో కానీ కొట్లాటలు, కయ్యాలకు మాత్రం కొదవ లేకుండా పోయింది. బిగ్‌బాస్ ఏ ముహూర్తాన కంటెస్టెంట్లను వారియర్స్, చాలెంజర్స్‌గా విడగొట్టాడో రోజురోజుకీ వారు బద్ధ శత్రువుల్లా తయారవుతున్నారు. బిగ్‌బాస్ చెప్పిన రూల్స్ పాటించడం లేదంటూ ఒకరి టీమ్ మీద మరొకరు బురద చల్లుకుంటున్నారు. అసలు రూల్స్ పెట్టినా చాలెంజర్స్ దాన్ని పాటించడం లేదని వారియర్స్ అసహనానికి లోనయ్యారు. వాళ్లు నిబంధనలు పాటించకుండా ఇష్టారీతిన ఆడినప్పుడు బిగ్‌బాస్ సరైన తీర్పు ఇవ్వకపోతే మాత్రం తాను కూడా రూల్స్ ఫాలో కానని తేల్చి చెప్పాడు అఖిల్ సార్థక్. టాస్క్‌లో మహేశ్ విట్టా అనిల్‌ను అరేయ్ అనడంతో అతడు రెచ్చిపోయాడు. అరేయ్, గిరేయ్ అంటే పడను అని వార్నింగ్ ఇచ్చాడు. ఫైనల్‌గా చాలెంజర్స్ గెలిచినట్లు ప్రోమో చూస్తే అర్థమవుతోంది. దీంతో నటరాజ్ మాస్టర్ ఎంత కష్టపడి ఆడినా ఫలితం దక్కలేదని కంటతడి పెట్టుకున్నాడు. మరోపక్క మిత్రా శర్మ.. చాలెంజర్స్ లిస్టులో తనను చివరి వ్యక్తిగా చూస్తున్నారంటూ ఏడ్చేసింది. ఇదిలా ఉంటే అనిల్ హౌస్‌కు రెండో కెప్టెన్‌గా అవతరించినట్లు లీకువీరులు చెప్తున్నారు. -
సరయుపై శ్రీరాపాక దాడి! షాకైన హౌస్మేట్స్
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షో కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌తో రసవత్తరంగా మారింది. అటు వారియర్స్, ఇటు చాలెంజర్స్.. తగ్గేదే లే అన్న రేంజ్లో ఆడుతున్నారు. గాయాలవుతున్నా సరే వాటిని పట్టించుకోకుండా ప్రత్యర్థుల మీదకు దూకుతున్నారు. కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ మొదటి లెవల్లో వారియర్స్ స్మగ్లర్లుగా, చాలెంజర్స్ పోలీసుల్లా మారగా రెండో లెవల్లో వారి పాత్రలు తారుమారయ్యాయి. దీంతో వారియర్స్‌కు చుక్కలు చూపించడానికి సిద్ధమయ్యారు చాలెంజర్స్. ఈసారి ఎలాగైనా గేమ్ గెలవాలనుకున్న వీళ్లు తమకు తోచిన ప్లాన్లన్నీ అమల్లో పెట్టినట్లు కనిపిస్తోంది. మరోపక్క ఇదే గేమ్‌లో గాయపడ్డ రాపాక అందుకు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది. తన దగ్గరున్న బొమ్మలను సరయుపైకి విసిరేయడంతో ఆమె తలకు చేతులు పట్టుకుని కూలబడిపోయింది. అక్కడే ఉన్న అఖిల్ ఏం చేస్తున్నావో తెలుస్తుందా? అని ఆమె మీదకు ఫైర్ అయ్యాడు. ఇక స్రవంతి స్విమ్మింగ్ పూల్‌లో దూకడంతో అందరూ వెళ్లి ఆమెను బయటకు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. హెల్త్ బాగోలేనప్పుడు దూకడం ఎందుకు? అన్న సరయు మీద అరిచినంత పని చేసింది స్రవంతి. నా ఆరోగ్యపరిస్థితి గురించి తెలియకుండా మాట్లాడకు అంటూ సరయు మీద ఓ రేంజ్లో ఫైర్ అయింది. మొత్తానికి సరయు మీద హౌస్‌లో నెగెటివిటీ విపరీతంగా పెరిగిపోతోంది. ఈ వ్యతిరేకతకు చెక్ పెట్టే ప్రయత్నం చేయకపోతే అది ఆమె ఎలిమినేషన్‌కు కూడా దారి తీయవచ్చు. -
'పిచ్చిపిచ్చి మాట్లాడుతుండు', ఎమోషన్స్‌తో ఆటలొద్దన్న అఖిల్
బిగ్‌బాస్‌ను ఆదరించే బుల్లితెర అభిమానులు ఎంతోమంది ఉన్నారు. కానీ ఈసారి టీవీలో కాకుండా ప్రయోగాత్మకంగా కేవలం ఓటీటీ ప్లాట్‌ఫామ్ హాట్‌స్టార్‌లో మాత్రమే ప్రసారం చేస్తున్నారు. దీంతో బిగ్‌బాస్ షోను చూసేవాళ్ల సంఖ్య తగ్గిందనే చెప్పాలి. అయితే గొడవలు, కొట్లాటలు, వినోదంతో అందరినీ ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది బిగ్‌బాస్. ప్రస్తుతం హౌస్‌లో కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ నడుస్తోంది. అందులో భాగంగా వారియర్స్ స్మగ్లర్లుగా, చాలెంజర్స్ పోలీసులుగా మారిపోయారు. స్మగ్లర్లు చేసే పనులను అడ్డుకునే క్రమంలో రెండు టీముల మధ్య ఘర్షణ జరుగుతోంది. ఈ క్రమంలో వారియర్స్ టీమ్‌లోని అఖిల్, చాలెంజర్స్ టీమ్‌లోని అజయ్ మధ్య కూడా మనస్పర్థలు చోటు చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. గేమ్‌లో నాతో ఆడు, నా ఎమోషన్స్‌తో కాదంటూ పరోక్షంగా అజయ్ గురించే మాట్లాడాడు అఖిల్. అటు పక్క అజయేమో.. ఏదైనా జరుగుతున్నప్పుడు ఫ్రెండ్షిప్ను మధ్యలో రానివ్వద్దని వందసార్లు చెప్పాను, అయినా పిచ్చిపిచ్చి మాట్లాడుతుండు అంటూ అఖిల్ మీద అసహనానికి లోనయ్యాడు. ఇష్టమున్నట్లు మాట్లాడితే ఎవరూ పడరు కదా? అని స్రవంతితో చెప్పుకొచ్చాడు. మరో పక్క టాస్క్‌లో యాంకర్ శివ సరయుపై ప్రతీకారం తీర్చుకున్నట్లు కనిపిస్తోంది. ఆమె వెళ్తుంటే వెనకాల తనే బొమ్మ పడేసి ఆపై బొమ్మ దొరికిందంటూ సీజ్ చేశాడు. కెమెరాలు చూస్తున్నాయంటూ సరయు శివ బట్టల దగ్గరకు వెళ్లగా అతడు అగ్గిమీద గుగ్గిలమయ్యాడు, నువ్వు నామీద ఎన్నో నిందలు వేశావు. అలాంటి నీకు నా బట్టలు ముట్టే హక్కు లేదు అని ఫైర్ అయ్యాడు. టాస్క్ గరంగరంగా సాగుతున్న సమయంలో ఇంతటితో మొదటి లెవల్ పూర్తైందన్నాడు బిగ్‌బాస్. రెండో లెవల్లో వారియర్స్ పోలీసులుగా, చాలెంజర్స్ స్మగ్లర్లుగా మారతారని చెప్పాడు బిగ్‌బాస్. మరి ఈసారి ఆట ఎలా ఉండబోతుంది? ఏ టీమ్ గెలుస్తుంది? అనేది తెలియాలంటే గురువారం (మార్చి 10) రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే! -
'తగ్గేదే లే' టాస్క్‌లో రచ్చ, కొట్టుకునేదాకా వెళ్లిన కంటెస్టెంట్లు!
బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో కొట్లాటలకు కొదవ లేకుండా పోయింది. ఢీ అంటే ఢీ అంటూ వారియర్స్, చాలెంజర్స్ ఇద్దరూ కొట్టుకునేదాకా వెళ్లారు. ప్రస్తుతం హౌస్‌లో రెండో కెప్టెన్సీ పోటీ మొదలైంది. ఈ మేరకు బిగ్‌బాస్ తాజాగా ప్రోమో వదిలాడు. తగ్గేదేలే అనే కెప్టెన్సీ టాస్క్‌లో వారియర్స్ సభ్యులు స్మగ్లర్లుగా మారగా చాలెంజర్స్ పోలీసుల్లా మారతారు. స్మగ్లర్లను అడ్డుకునేందుకు పోలీసులు డోర్ దగ్గరే ఉండిపోవడంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. 'మేము వారియర్స్.. సీనియర్స్ ఇలాగే ఆడతాం అంటున్నారు' అని ఆర్జే అసహనానికి లోనవగా ఈ సీనియర్స్, జూనియర్స్ వద్దు అని అఖిల్ హచ్చ్చరించాడు. మరోపక్క నటరాజ్ మాస్టర్.. కొట్టేసుకుందాం అన్నావ్ కదా, రా అంటూ యాంకర్ శివ మీదకెళ్లాడు. దీంతో అక్కడున్నవాళ్లు వారిని శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. మరోపక్క ఈ టాస్క్‌లో శ్రీరాపాకకు గాయమైనట్లు కనిపిస్తోంది. కాగా బిగ్‌బాస్ నాన్‌స్టాప్ తొలివారంలో వారియర్ తేజస్వి కెప్టెన్‌గా నిలిచింది. మరి రెండో వారం చాలెంజర్స్ గెలుస్తారా? లేదంటే మరోసారి వారియర్స్‌లో నుంచి ఒకరు కెప్టెన్‌గా అవతరించనున్నారా? అనేది చూడాలి! చదవండి: Bindu Madhavi: కాలేజీలో ప్రేమించుకున్నాం, కానీ ఆ తర్వాత బ్రేకప్: బిందు మాధవి -
అందంపై నటరాజ్ మాస్టర్ సెటైర్లు, ఇచ్చిపడేసిన బిందు మాధవి!
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షోలో వినోదం కంటే గొడవలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. బిగ్‌బాస్ కంటెస్టెంట్లను వారియర్స్, చాలెంజర్స్ అంటూ రెండు టీములుగా విభజించడంతో వారి మధ్య పోటీ రసవత్తరంగా మారింది. తాజాగా మరోసారి ఈ రెండు టీముల మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయి. ఈ మేరకు హాట్‌స్టార్ తాజాగా ప్రోమో రిలీజ్ చేసింది. వారియర్స్.. వారి వసతులు గెలుచుకునేందుకు చివరి అవకాశంగా ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. బాస్కెట్ బొనాంజా టాస్క్‌లో వారియర్స్ గెలవగా వారు లగేజీ, బెడ్రూమ్ యాక్సెస్‌లో ఏదో ఒకటి పొందే చాన్స్ దక్కింది. దీంతో వారియర్స్ లగేజీ తీసుకుంటున్నామని ప్రకటించారు. ఆ తర్వాత వారియర్స్ వంట చేయడంలో బిజీగా అయిపోగా ఆర్జే చైతూ చాలెంజర్స్‌ను వెంటేసుకుని కిచెన్‌లో అడుగుపెట్టాడు. 'బెడ్రూం లేదా లగేజీ యాక్సెస్.. ఈ రెండింటిలో ఏ వసతిని వారియర్స్‌కు ఇవ్వాల్సి ఉంటుందో చాలెంజర్స్ సభ్యులు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది' అని కొత్త నిబంధనను వినిపించాడు చైతూ. దీంతో కెప్టెన్ అషూ.. మా లగేజీని వెనక్కు తీసుకోవాలుకుంటున్నారా? అని అడిగింది. ఏదివ్వాలని మేము నిర్ణయించాలి, కానీ మీరు ముందుగానే తీసేసుకున్నారని చెప్పడానికి వచ్చామని బిందుమాధవి తెలిపింది. దీనికి నటరాజ్ మాస్టర్ స్పందిస్తూ.. మనకు అందమెంత ఇచ్చాడో మన మనసు, ఆలోచన కూడా అంతే అందంగా ఉండాలని తేజస్వితో చెప్పుకొచ్చాడు. ఫేస్ టు ఫేస్ డైరెక్ట్‌గా చెప్తే వింటాను అని గట్టిగా ఇచ్చిపడేసింది బిందు. అందమైన మనసుండాలని చెప్పానంతేనని నటరాజ్ మాస్టర్ ఆన్సరిచ్చాడు. మరి వీరి గొడవ ఎంతదూరం వెళ్తుందో చూడాలంటే నేడు రాత్రి 9 గంటలకు హాట్‌స్టార్‌లో ప్రసారమయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే! E choose the answer ki anni aatankale! Mana housemates edi enchukuntaru? Catch them on @DisneyPlusHS today at 9 PM on #BiggBossNonStop #BiggBoss #BiggBossTelugu @endemolsunshineind pic.twitter.com/fnJRkzi7mr — DisneyPlus Hotstar Telugu (@DisneyPlusHSTel) March 9, 2022 -
నువ్వు బిగ్‌బాస్ హౌస్‌లో ఉండటం వేస్ట్ : అఖిల్ సార్థక్
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ రసవత్తరంగా సాగుతోంది. తొలి వారం ఎవరూ ఊహించని విధంగా ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయ్యింది. చివరి రౌండ్లో సరయు, ముమైత్‌కి జరిగిన పోరులో అనూహ్యంగా ముమైత్ ఖాన్‌కు తక్కువ ఓట్లు రావడంతో హౌస్ నుంచి బయటికి వెళ్లింది. ఈ మొత్తం ఎపిసోడ్లో ఆర్జే చైతూని నిందిస్తూ తన తర్వాత బయటికి వచ్చేది తనే అంటూ శాపనార్థాలు పెట్టింది. ఇక సండే ఎపిసోడ్ అలా సాగింది. తాజాగా బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో రెండవ వారానికి సంబంధించి నామినేషన్స్ షురూ అయ్యాయి. తాము ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో వారి ఫోటోను డ్యాగర్తో గుచ్చి తగిన కారణాలు చెప్పాల్సిందిగా బిగ్‌బాస్ ఆదేశించాడు. ఇక ఎప్పటిలాగే నామినేషన్స్‌లో ఒకరిపై ఒకరు అరుచుకోవడం, గొడవ పడటం జరిగాయి. ఇంట్లో ఉండటానికి ఒక అర్హత ఉండాలని అది గేమ్‌లో ఎక్కడా కనిపించడం లేదంటూ అఖిల్ యాంకర్ శివను నామినేట్ చేశాడు. సరయు సైతం తనతో డబల్ మీనింగ్‌తో మాట్లాడుతున్నాడంటూ శివనే నామినేట్ చేసింది. ఈ గొడవలో నటరాజ్ మాస్టర్ ఎంటర్ అయ్యి.. అవును నువ్వు డబల్ మీనింగ్‌లోనే మాట్లాడావ్ అంటూ సరయూకి సపోర్ట్‌గా నిలిచాడు. దీంతో ఒకవేళ మీరు చెప్పిన డైలాగ్ నేను అని ఉంటే తక్షణమే బిగ్‌బాస్ నుంచి బయటికి వెళ్లిపోతా అంటూ యాంకర్ శివ ఛాలెంజ్ చేస్తాడు. అషూ, మిత్రా శర్మ మధ్య జరిగిన గొడవ ఇంకా సద్దుమణిగినట్లు లేదు. ఇద్దరూ మాటల యుద్దంతో హీటెక్కించారు. మరోవైపు అరియానా నీ ఎక్స్పెక్టేషన్ కోసం హౌస్‌కి రాలేదంటూ శ్రీ రాపాకకి చురకలంటిస్తుంది. -
Bigg Boss: రాత్రిపూట ఒంటరిగా ఏడ్చేసిన అషూ
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ బుల్లితెరను కాదని కేవలం హాట్‌స్టార్‌లోనే ప్రసారమవుతోంది. అయితే 24 గంటలు లైవ్ స్ట్రీమింగ్ వీక్షించడం చాలా కష్టమంటున్నారు మెజారిటీ నెటిజన్లు. రెప్ప వాల్చకుండా షోను చూస్తూ ఉండటం ఇబ్బందేనని కామెంట్లు పెడుతున్నారు. దీంతో ఇలాంటివాళ్ల కోసం ప్రతి రోజు తొమ్మిందింటికి ఒక గంట పాటు ఎపిసోడ్ ప్రసారం చేయనున్నట్లు ప్రకటించింది బిగ్‌బాస్ టీమ్. ఈ వార్త విన్న అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్ నడుస్తోన్న విషయం తెలిసిందే! దీనికి సంబంధించి లేటెస్ట్ ప్రోమో వదిలింది హాట్‌స్టార్. వారియర్స్ టీమ్‌లో నుంచి ఇద్దరు కెప్టెన్సీ పోటీదారులను ఎన్నుకోమని బిగ్‌బాస్ ఆఫరిచ్చాడు. తేజస్వి, నటరాజ్ మాస్టర్ అరియానాను సెలక్ట్ చేయాలని అభిప్రాయపడ్డారు. సరయు.. హమీదా, అఖిల్ పేర్లను సూచించింది. అషూకు ముమైత్, మహేశ్ సపోర్ట్ చేసినట్లు కనిపిస్తోంది. ఫైనల్‌గా మెజారిటీ వారియర్స్ అఖిల్, అరియానా పేర్లను సూచించడంతో వారు కెప్టెన్సీకి పోటీపడుతున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంపై అషూ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసింది. నాకు ముమైత్, మహేశ్ తప్ప ఎవరూ సపోర్ట్ చేయలేదు, పోనీ, వచ్చేవారం ప్రయత్నిస్తాను, ఇంకేం చేస్తాం అని అనుకుంటూనే రాత్రిపూట ఒంటరిగా ఏడ్చేసింది. మరి బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో ఫస్ట్ కెప్టెన్ ఎవరయ్యారు? అన్న ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే! -
Bigg Boss Promo: ఆర్జే చైతూ సెటైర్లపై అఖిల్ సార్థక్ ఆగ్రహం!
Bigg Boss OTT Telugu Latest Promo: బిగ్‌బాస్ హంగామా మళ్లీ మొదలైంది. కాకపోతే ఈసారి బుల్లితెరపై కాకుండా ఓటీటీ ప్లాట్‌ఫామ్ హాట్‌స్టార్‌లో ప్రసారమవుతోంది బిగ్‌బాస్ నాన్‌స్టాప్. ఫిబ్రవరి 26న 17 మంది కంటెస్టెంట్లతో గ్రాండ్‌గా ప్రారంభమైందీ రియాలిటీ షో. వారియర్స్(మాజీ కంటెస్టెంట్లు), చాలెంజర్స్(కొత్త కంటెస్టెంట్లు) మధ్య పోటీ ఎలా ఉండబోతుందన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. తాజాగా హాట్‌స్టార్ బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ప్రోమో రిలీజ్ చేసింది. ఇందులో యాంకర్ శివ అరియానాను పొగుడుతూ పులిహోర కలిపాడు. ఇంకా టాస్కులు, నామినేషన్లు మొదలవలేదు కాబట్టి ప్రస్తుతానికి అందరూ కలిసిపోయి సరదాగా నవ్వుకుంటున్నారు. అయితే ప్రోమో చివర్లో మాత్రం అఖిల్ సార్థక్‌కు ఆర్జే చైతూ కోపం తెచ్చినట్లు కనిపిస్తోంది. బిగ్‌బాస్ అయిపోయాక శ్రీరాపాక ఓ సినిమా నిర్మిస్తుందట. అందులో సైకో క్యారెక్టర్ ఉందంటూ అఖిల్ భుజం తట్టాడు చైతు. దీంతో అఖిల్‌కు చిర్రెత్తిపోయింది. సోది టాపిక్ అని నసుగుతూ తను సైకో పాత్ర చేయడమేంటని అషూదగ్గర చిర్రుబుర్రులాడాడు. మరి అఖిల్ హర్ట్ అయ్యాడన్న విషయం చైతూకు తెలిసిందా? లేదా? హౌస్‌లో ఇంకా ఏమేం జరుగుతోంది? అన్నది తెలియాలంటే బిగ్‌బాస్ నాన్‌స్టాప్ చూసేయండి! -
బిగ్‌బాస్ నాన్‌స్టాప్: 24 గంటలు, 84 రోజులు, 17మంది కంటెస్టెంట్లు
Bigg Boss Telugu OTT Nonstop Promo: బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడే షో బిగ్‌బాస్. ఇప్పుడు 24గంటల పాటు ఎంటర్టైన్మెంట్ అందించేందుకు రెడీ అయ్యింది. 'బిగ్‌బాస్ నాన్‌స్టాప్' పేరుతో ప్రసారం కానున్న ఈ షో నేటి నుంచే ప్రారంభం కానుంది. 84 రోజుల పాటు 17 కంటెస్టెంట్లతో ప్రారంభం కానున్న బిగ్‌బాస్ షో సాయంత్రం 6గంటలకు ప్రసారం కానుంది. 'డిస్నీ+ హాట్‌స్టార్'లో 24/7 స్ట్రీమింగ్ కానున్న ఈ షో ప్రోమో రిలీజ్ అయ్యింది. 'ఈ ఇల్లును చూసుకోవడానికి ఓ మగాడు కావాలి'.. అనే వాయిస్‌తో షో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత నాగార్జున హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఇల్లు కలర్ఫుల్గా ఉందని, ఇక్కడి నుంచే హౌస్టింగ్ చేస్తే ఎలా ఉంటుంది అని తన అనుకుంటుండగా..ఇ ది నా అడ్డా నాగార్జున అంటూ బిగ్‌బాస్ సమాధానం చెబుతారు. ఇక కంటెస్టెంట్లను హౌస్ లోపలికి పంపే క్రమంలో నాగార్జున అడిగే ప్రశ్నలు ఆకట్టుకుంటాయి. నువ్వు పెళ్లి చేసుకున్న విషయం ఆడియెన్స్‌కి తెలుసా అంటూ కింగ్ నాగార్జున ఏ లేడీ కంటెస్టెంట్‌ని అడుగుతారు. మరి ఆ కంటెస్టెంట్ ఎవరు అన్నది మరికాసేపట్లో తెలియనుంది. చదవండి: బిగ్‌బాస్ నాన్‌స్టాప్.. చివరి నిమిషంలో ఆ కంటెస్టెంట్లు అవుట్ #BiggBossNonStop fans ready ikkada!! 🎉🎉🎉 The grand extravaganza coming to your screens at 6 PM! #Biggboss #disneyplushotstar @DisneyPlusHS @EndemolShineIND @iamnagarjuna https://t.co/4VJAOpdpoW — DisneyPlus Hotstar Telugu (@DisneyPlusHSTel) February 26, 2022