బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో కొట్లాటలకు కొదవ లేకుండా పోయింది. ఢీ అంటే ఢీ అంటూ వారియర్స్, చాలెంజర్స్ ఇద్దరూ కొట్టుకునేదాకా వెళ్లారు. ప్రస్తుతం హౌస్‌లో రెండో కెప్టెన్సీ పోటీ మొదలైంది. ఈ మేరకు బిగ్‌బాస్ తాజాగా ప్రోమో వదిలాడు. తగ్గేదేలే అనే కెప్టెన్సీ టాస్క్‌లో వారియర్స్ సభ్యులు స్మగ్లర్లుగా మారగా చాలెంజర్స్ పోలీసుల్లా మారతారు. స్మగ్లర్లను అడ్డుకునేందుకు పోలీసులు డోర్ దగ్గరే ఉండిపోవడంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి.
'మేము వారియర్స్.. సీనియర్స్ ఇలాగే ఆడతాం అంటున్నారు' అని ఆర్జే అసహనానికి లోనవగా ఈ సీనియర్స్, జూనియర్స్ వద్దు అని అఖిల్ హచ్చ్చరించాడు. మరోపక్క నటరాజ్ మాస్టర్.. కొట్టేసుకుందాం అన్నావ్ కదా, రా అంటూ యాంకర్ శివ మీదకెళ్లాడు. దీంతో అక్కడున్నవాళ్లు వారిని శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. మరోపక్క ఈ టాస్క్‌లో శ్రీరాపాకకు గాయమైనట్లు కనిపిస్తోంది. కాగా బిగ్‌బాస్ నాన్‌స్టాప్ తొలివారంలో వారియర్ తేజస్వి కెప్టెన్‌గా నిలిచింది. మరి రెండో వారం చాలెంజర్స్ గెలుస్తారా? లేదంటే మరోసారి వారియర్స్‌లో నుంచి ఒకరు కెప్టెన్‌గా అవతరించనున్నారా? అనేది చూడాలి!
చదవండి: Bindu Madhavi: కాలేజీలో ప్రేమించుకున్నాం, కానీ ఆ తర్వాత బ్రేకప్: బిందు మాధవి
Comments
Please login to add a commentAdd a comment