Bigg Boss Non Stop
-
'బిగ్‌బాస్' ఓటీటీ తెలుగు సీజన్ రద్దు? అదే అసలు కారణమా?
బిగ్‌బాస్ రియాలిటీ షో గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే మొన్నీమధ్యే డిసెంబరులో ఏడో సీజన్ పూర్తయింది. ఫినాలేలో రైతుబిడ్డ ప్రశాంత్ విజేతగా నిలవడం.. ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియో బయట విధ్వంసం.. కార్లు, ఆర్టీసీ బస్సులు ధ్వంసం.. ఇలా ఎంత జరగాలో అంతా జరిగింది. ఈ క్రమంలోనే ఫిబ్రవరిలో ఓటీటీ సీజన్ ఉందన్నట్లు వార్తలొచ్చాయి. ఇప్పుడేమో ఏకంగా అది రద్దయినట్లు చెబుతున్నారు. ఇంతకీ ఏమైంది? రద్దుకు కారణమేంటి? తెలుగులో బిగ్‌బాస్ షో ఇప్పటివరకు ఏడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఎన్టీఆర్ హోస్ట్ చేసిన తొలి సీజన్ హిట్ అయింది. ఆ తర్వాత నుంచి మాత్రం ఏదో ఒక గొడవ అవుతూనే ఉంది. షో ఆపేయాలని విమర్శలు.. కోర్టు కేసులు.. ఇలా ప్రతిసారి రచ్చ అవుతూనే ఉంటుంది. ఇన్ని జరుగుతున్నా సరే షోని ఆపట్లేదు సరికదా ఓటీటీ సీజన్ కూడా ఆ మధ్యలో ఒకటి పెట్టారు. పాతవాళ్లతో పాటు కొత్తవాళ్లు పాల్గొన్న ఆ సీజన్లో బింధుమాధవి విన్నర్‌గా నిలిచింది. కాకపోతే ఆ సీజన్ ఫెయిలైంది. (ఇదీ చదవండి: స్టార్ హీరోని పెళ్లి చేసుకోబోతున్న 'హనుమాన్' నటి?) అయితే రీసెంట్గా జరిగిన ఏడో సీజన్.. విమర్శల కారణంగా వార్తల్లో నిలిచింది. దీన్ని క్యాష్ చేసుకుందామని నిర్వహకులు పెద్ద ప్లాన్ వేశారు. ఫిబ్రవరిలో తొలి వారంలో ఓటీటీ సీజన్ మొదలుపెట్టేయాలని అనుకున్నారు. ఏడో సీజన్లో పాల్గొన్న భోలె షావళి, నయన పావని తోపాటు యావర్ కూడా ఈ సీజన్లో పాల్గొంటారని రూమర్స్ వచ్చాయి. కానీ వీళ్లు తప్పితే మిగతా వాళ్లు ఎవరూ దీనిపై కనీస ఆసక్తి చూపించట్లేదట. టీవీ సీజన్ అయితే వస్తాం గానీ ఓటీటీ సీజన్‌కి మాత్రం వచ్చేది లేదని చెబుతున్నారట. రెమ్యునరేషన్ పెంచి ఇస్తామని చెప్పినా సరే పెద్దగా ఆసక్తి చూపించట్లేదట. మరోవైపు నాగార్జున కూడా అందుబాటులో ఉండట్లేదు. దీంతో హోస్ట్ కూడా మారే ఛాన్స్ ఉంటుంది. ఇలా సమస్యలు ఎక్కువయ్యేసరికి నిర్వహకులు.. సీజన్‌ని రద్దు చేయాలని ఫిక్సయ్యారట. మరి ఇందులో నిజమేంటి అనేది తెలియాల్సి ఉంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవేంటో తెలుసా?) -
డ్రెస్సింగ్‌పై ట్రోల్.. తనదైన స్టైల్లో నెటిజన్ నోరుమూయించిన బిందు
సోషల్ మీడియాలో తనపై నెగిటివ్ కామెంట్ చేసిన ఓ నెటిజన్‌కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది బిగ్‌బాస్ శివంగి బిందు మాధవి. అవకాయా బిర్యానీ, బంపర్ ఆఫర్ వంటి చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు పొందింది బిందు. తెలుగు అమ్మాయి అయిన బిందు ఇక్కడ అవకాశాలు తగ్గడంతో కోలీవుడ్‌లో అదృష్టం పరీక్షించుకుంది. అక్కడ వరుస ఆఫర్లు అందుకుంటూ సౌత్‌లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో తెలుగు బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ఓటీటీ కంటెస్టెంట్‌గా దర్శనం ఇచ్చింది. హౌజ్‌లో తనదైన ఆట, యాటిటూడ్, మాటలతో గట్టి పోటి ఇస్తూ చివరికి బిగ్‌బాస్ నాన్‌స్టాప్ టైటిల్ గెలిచింది. చదవండి: నందమూరి ఫ్యామిలీకి కలిసిరాని ఆగస్టు, విషాదాలన్నీ ఈ నెలలోనే.. అంతేకాదు సంప్రాదాయమైన దుస్తులనే ధరించి బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న బిందుమాధవి తన తాజా పోస్ట్‌లో కాస్తా ట్రెండి డ్రెస్‌లో కనిపించింది. ఈ ఫొటోను తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేయగా ఓ నెటిజన్ తన డ్రెస్సింగ్‌పై అభ్యంతరం వ్యక్తం చేసింది. బిగ్‌బాస్‌లో హౌజ్‌లో అందరు శరీరం కరిపించేలా డ్రెస్స్‌లు వేసుకుంటే.. తను మాత్రం కేవలం సంప్రదాయమైన అలంకరణకే ప్రాధాన్యత ఇచ్చింది. దీంతో బిందు మాధవి అంటే రెస్పాక్ట్ పెరిగింది. కానీ ఇప్పుడు అది పోయింది. అందరి దగ్గర మార్కులు కొట్టాలనే ఉద్దేశంతోనే తను హౌజ్‌లో అలా ఉంది’ అంటూ విమర్శించారు. చదవండి: ‘కార్తీకేయ 2’ ప్రమోషన్స్‌కి అనుపమ డుమ్మా.. నిఖిల్ షాకింగ్ కామెంట్స్! Why this narrow minded people judge a women by her dressing they like a women by her clothes and not by her character. In telugu der is a saying "ఆడదానికీ ఆడదే శత్రువు" this is apt 4 dis girl🤨 Bindu gave slipper shot answer 👏 you go girl more power to you 🔥#BinduMadhavi pic.twitter.com/78NhUznHO3 — SiriKota (@SiriKota_04) August 2, 2022 దీంతో సదరు నెటిజన్ కామెంట్స్ బిందు స్పందించి తనదైన స్టైల్లో గట్టి కౌంటర్ ఇచ్చింది. ‘హో.. మనం ధరించే దుస్తులను బట్టే వ్యక్తికి గౌరవం ఇస్తారంటే.. అలాంటి గౌరవం నాకు వద్దు’ అంటూ నెటిజన్ నోరు మూయించింది ఈ ఆడపులి. ప్రస్తుతం బిందు మాధవి సమాధానం నెట్టింట చర్చనీయాంశమైంది. బిందు ఇచ్చిన రిప్లైకు ఓ నెటిజన్ ఫిదా అయ్యాడు. ఈ కామెంట్సకు సంబంధించిన స్క్రీన్ షాట్ తీసి ట్విటర్లో పోస్ట్ చేస్తూ బిందుకు మద్దుతు తెలిపాడు. -
మనసులో మాట చెప్పమన్న అషూ, ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు
అషూ రెడ్డి.. బుల్లితెర ప్రేక్షకులకు, సోషల్ మీడియా యూజర్లకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే అషూ తరచూ తన గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ కనువిందు చేస్తోంది. టిక్‌టాక్ వీడియోస్‌తో జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న ఆమె అదే క్రేజ్‌తో బిగ్‌బాస్ 3 ఆఫర్ కొట్టేసింది. దీంతో మరింత పాపులర్ అయిన అషూ రీసెంట్గా బిగ్‌బాస్ ఓటీటీలోను అడుగుపెట్టింది. చదవండి: ‘సమంత అలా ఒంటరిగా చనిపోవాలి’ కామెంట్‌పై సామ్ ఏమన్నదంటే.. ఫినాలేకు అతి దగ్గర్లో ఉండగా అనూహ్యాంగా హౌజ్ నుంచి బయటకు వచ్చింది అషూ. అప్పటి నుంచి హాట్‌హాట్ ఫొటోలకు ఫోజులు ఇస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఆమె షేర్ చేసిన వీడియోపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆమె బిగ్‌బాస్ నాన్‌స్టాప్ సహా కంటెస్టెంట్ అజయ్‌తో కలిసి మిర్చి మూవీలోని అనుష్క డైలాగ్పై రీల్ చేసింది అషూ. ‘కాలం మారిపోయి పద్దతులు మారాయి కానీ నాకే కనుక స్వయంవరం పెడితే ఎంతమంది రాజులు గుర్రాలు వేసుకుని వచ్చెవారో తెలుసా?’ అని చెబుతుంది. చదవండి: ‘ఆర్ఆర్ఆర్’ చూసిన హాలీవుడ్ మూవీ రైటర్, జక్కన్నపై ఆసక్తికర వ్యాఖ్యలు ఈ డైలాగ్ విని పక్కనే ఉన్న అజయ్ అషూ తలపై ఒకట్టిస్తాడు. ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ‘మీ మనసులోని మాటను కామెంట్ చేయండి’ అని క్యాప్షన్ ఇచ్చింది. దీంతో రెచ్చిపోయిన నెటిజన్లు రకరకాలుగా వారి మనసులో మాటను బయటపెడుతూ అషూను దారుణంగగా ట్రోల్ చేయడం ప్రారంభించారు. ‘ముందు మేకప్ తీసి రీల్ చేయ్ గుర్రాలు కాదు కదా.. కనీసం గాడిదలను వేసుకుని కూడా రారు’, ‘ముందు స్నానం చేయమ్మా.. కంపు కొడుతోంది.. ఆ తర్వాత రీల్ చేయ్’, ‘నీ ప్లాస్టిక్ సర్జరీ, మేకప్ ఫేస్‌కి అంత సీన్ లేదులే’ అంటూ దారుణంగా నెటిజన్లు దారుణంగా ల్రోల్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) -
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విన్నర్ బిందు మాధవికి బంపర్ ఆఫర్!
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విజేతగా బిందు మాధవి నిలిచిన విషయం తెలిసిందే. తెలుగు బిగ్‌బాస్ చరిత్రలో ఓ మహిళ విన్నర్‌గా నిలవడం ఇదే తొలిసారి. దీంతో తెలుగు బిగ్‌బాస్ విన్నర్‌గా నిలిచి బిందు మాధవి చరిత్ర సృష్టించింది. టాస్క్‌లో.. మాటల్లో ఆడపులిలా రెచ్చిపోయిన బిందుకి ఒక్కసారిగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. ఇది వరకు ఆమె తెలుగులో పలు చిత్రాల్లో చేసిన రానీ గుర్తింపు ఒక్కసారిగా బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌తో తెచ్చుకుంది. దీంతో ఆమెకు టాలీవుడ్ నుంచి వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. చదవండి: కరణ్ జోహార్ బర్త్‌డే పార్టీ, ఒకే రంగు దుస్తుల్లో మెరిసిన రష్మిక, విజయ్ ఈ నేపథ్యంలో బిందుకు సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఏకంగా ఆమె ఓ స్టార్ డైరెక్టర్ సినిమాలో చాన్స్ కొట్టేసిందంటూ తాజాగా వార్తలు గుప్పుమన్నాయి. ఇండస్ట్రీలో వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న యంగ్ డైరెక్టర్ అనిల్‌రావిపూడి తదుపరి ప్రాజెక్ట్‌లో నటించే చాన్స్ కొట్టేసిందని వినికిడి. కాగా ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్ 3 మూవీ ప్రమోషన్‌తో బిజీగా ఉన్నాడు. దగ్గుబాటి హీరో విక్టరి వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించి ఈ చిత్రం రేపు(మే 27న) ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని అనంతరం ఆయన బాలకృష్ణతో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. చదవండి: రాత్రి 11 గంటలు, కానిస్టేబుల్ వల్ల అభద్రతకు గురయ్యా: హీరోయిన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన అనిల్ రావిపూడితో బాలయ్య సినిమా అనేసరికి అందరిలో ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమా అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రమంలో బిందు మాధవిని ఓ కీ రోల్ కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో హీరోయిన్గా మెహ్రీన్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. అంతేకాదు మరో యువ నటి శ్రీలీలా బాలయ్య కూతురిగా కనిపించబోతుందట. మరి ఇందులో బిందు మాధవి రోల్‌పై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇదిలా ఉంటే బాలయ్య కోసం తన కామెడీ టచ్‌ను పక్కన పెట్టి యాక్షన్‌పై దృష్టి పెట్టానని అనిల్ రావిపూడి ఇటీవల ఓ ఇంటర్య్వూలో చెప్పిన సంగతి తెలిసిందే. -
బిగ్‌బాస్ షోలో బిందుమాధవి పారితోషికం ఎంతో తెలుసా?
Bindu Madhavi Remuneration: బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ విన్నర్‌గా నిలిచింది బిందు మాధవి. షో విజేతగా అవతరించడంతో ఆమెకు రూ.40 లక్షలు దక్కాయి. నిజానికి విన్నర్ ప్రైజ్‌మనీ అరకోటి. కానీ గ్రాండ్ ఫినాలే రోజు బోల్డ్ బ్యూటీ అరియానా గ్లోరీ రూ.10 లక్షలు తీసుకుని రేసు నుంచి తప్పుకుంది. దీంతో ఆ పది లక్షలు ప్రైజ్‌మనీలో నుంచి కోత పెట్టారు. అలా బిందు చేతికి 40 లక్షల రూపాయలు వచ్చాయి. ఇకపోతే బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షో 12 వారాలు సాగింది. మరి 12 వారాలు హౌస్‌లో ఉన్నందుకు ఆమెకు ఎంత పారితోషికం వచ్చిందనుకుంటున్నారు? రూ. 55- 60 లక్షలు. అంటే మొత్తంగా బిందు ఇంచుమించు కోటి రూపాయలు గెల్చుకున్నట్లు తెలుస్తోంది. కానీ ట్యాక్స్ కటింగ్స్ వల్ల ఆమె చేతికి దాదాపు రూ.90 లక్షల మేరకు వచ్చే ఛాన్స్ ఉంది! మొత్తానికి బిందు ఈ రేంజ్లో రెమ్యునరేషన్ అందుకుందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది. కాగా బిందు తెలుగులో ఆవకాయ బిర్యానీ, బంపర్ ఆఫర్ సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే! తమిళ బిగ్‌బాస్ మొదటి సీజన్లో పాల్గొన్న బిందు అక్కడ నాలుగో రన్నరప్‌గా నిలిచింది. ఇక తెలుగులో ఏకంగా ట్రోఫీ అందుకుని బిగ్‌బాస్ కప్పు గెలిచిన మొట్టమొదటి మహిళా విజేతగా అవతరించింది. చదవండి 👇 స్టార్ హీరో తండ్రికి అస్వస్థత, పొత్తికడుపులో రక్తస్రావం నా సినిమాను చంపేశారు: శేఖర్ నిర్మాత ఆవేదన -
బింధుమాధవి పెళ్లిపై ఆమె తండ్రి ఏమన్నాడంటే..
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విజేతగా బిందు మాధవి నిలిచిన విషయం తెలిసిందే. చివరి వరకు అఖిల్ గట్టి పోటీ ఇచ్చినా.. బిందు విజేతగా నిలిచి ట్రోపీతో పాటు రూ.40 లక్షలు దక్కించుకుంది. తెలుగు బిగ్‌బాస్ చరిత్రలో ట్రోపీ అందుకున్న తొలి మహిళగా బిందు మాధవి నిలిచింది. గతంలో పలు తెలుగు సినిమాల్లో నటించిన రాని గుర్తింపు..బిగ్‌బాస్ రియాల్టీ షోతో ఆమెకు వచ్చింది. ప్రస్తుతం బిందు వరుస ఇంటర్వ్యలతో ఫుల్ బిజీగా ఉంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు బిందు మాధవి పెళ్లిపై నెట్టింట చర్చ జరుగుతోంది. త్వరలోనే బిందు పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా బిందు పెళ్లిపై ఆమె తండ్రి స్పందించారు. పెళ్లి గురించి తాము ఆలోచించడం లేదని, ఆమెకు ఇష్టం ఉన్నప్పుడే చేస్తామని చెప్పుకొచ్చాడు. (చదవండి: బాత్రూమ్లో సీక్రెట్ స్మోకింగ్.. బిందుమాధవి ఏమందంటే?) ‘బిందు ఇంజనీరింగ్ చదివేటప్పుడే పెళ్లి గురించి చాలా ఒత్తిడి చేశా. అప్పుడు చాలా మంచి సంబంధాలు వచ్చాయి. ఐపీఎస్, ఐఆర్ఎస్, డాక్టర్, అమెరికా ఇంజనీరింగ్ సంబంధాలు వచ్చాయి. అప్పుడు ఒక తండ్రిగా నేను ఇంతమంచి సంబంధాలు వస్తున్నాయి.. పెళ్లి చేసుకో అని బిందుపై ఒత్తిడి తెచ్చాను. నేను కూడా చాలా బాధపడ్డాను. ఇక సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని సంబంధాలు చూశాను.కానీ ఒప్పుకోలేదు. ‘నేనే చూసుకుంటాను నాన్న..నేనేం చిన్నపిల్లను కాదు కదా? నా మంచి చెడుల గురించి నాకు తెలుసు. నేను చెప్పినప్పుడు నా పెళ్లి చేయండి ’అని బిందు చెప్పింది. అప్పటి నుంచి ఆమె ఆకాంక్షలకు, అభిలాషకు నేను పూర్తిగా వదిలేశాను. కాలాలు మారాయి. పిల్లల ఆకాంక్షలకు, అభిలాషలకు అనుగుణంగా తల్లిదండ్రులు ప్రవర్తించాల్సిన బాధ్యత ప్రతి తల్లికి, తండ్రికి ఉంది’ అని బిందు మాధవి తండ్రి అన్నారు. -
బయటకు రాగానే యాంకర్ శివ రచ్చ, క్లాస్ పీకిన మహిళ పోలీస్
Bigg Boss Telugu Non Stop: బిగ్‌బాస్ తెలుగు నాన్‌స్టాప్‌కు శనివారంతో ఎండ్‌కార్డ్ పడింది. బిగ్‌బాస్ ఓటీటీ తొలి సీజన్ విన్నర్‌గా బిందు మాధవి నిలిచిన సంగతి తెలిసిందే. హౌజ్‌లో చివరి రోజు వరకు బిందు మాధవి, అఖిల్ సార్థక్, యాంకర్ శివ, అరియాన గ్లోరీ, బాబా భాస్కర్ మాస్టర్, మిత్ర శర్మ టైటిల్ కోసం పోరాడగా.. చివరకు బిందు టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే హౌజ్ నుంచి బయటకు వచ్చిన కంటెస్టెంట్ హావా మామూలుగా ఉండదు. వారి ఫ్యాన్స్ భారీగా తరలి వచ్చి తమ ఫేవరెట్ కంటెస్టెంట్‌కు నీరాజనాలు పలుకుతుంటారు. చదవండి: 'శేఖర్' సినిమా వివాదం.. జీవితా రాజశేఖర్ గెలుపు? ఈ సందర్భంగా వారి ఫ్యాన్స్ చేసే రచ్చ, హడావుడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బిగ్‌బాస్ సెట్ నుంచి ఇంటి వరకు రోడ్‌షో నిర్వహిస్తారు. అలాగే హౌజ్ నుంచి బయటకు వచ్చిన యాంకర్ శివ కోసం అతడి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వాగతం పలికారు. దీంతో శివ ఓపెన్ టాప్ కారులో తన ఫ్యాన్స్‌కు అభివాదం చేస్తూ ముందుకు కదిలాడు. ఈ క్రమంలో శివ ఫ్యాన్స్ కారు వద్దకు చేరి నానా హంగామా చేశారు. కారు చూట్టు ముట్టి కారును ముందుకు కదలకుండా చేశారు. అంతేకాదు పెద్ద ఎద్దున అరుస్తూ రచ్చ చేశారు. దీంతో ఆ ఎరియాలో తీవ్ర ట్రాఫిక్ సమస్య నెలకొంది. చదవండి: ప్రేమపై నోరు విప్పిన సాయి పల్లవి, ఏమన్నదంటే.. శివ కారు కారణంగా వెనకాలే వచ్చు కార్లు కూడా ముందుకు కదలని పరిస్థితి ఏర్పడింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి యాంకర్ శివకు క్లాస్ పీకారు. ఇలా కార్ టాప్ మీదకు రావడం కరెక్ట్ కాదని, మీరు లోపల కూర్చొని ఇక్కడి నుంచి వెళ్లాలని ఓ మహిళ పోలీసు అధికారిని శివను వారించారు. అంతేకాదు మీ వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుందని, తొందరగా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు శివను వారించినట్లు సమాచారం. దీంతో యాంకర్ శివ కారు లోపల కూర్చొని వెళ్ళిపోయాడు. కాగా గతంలోనూ పలువురు కంటెస్టెంట్స్ ఇలాగే రచ్చ చేయడంతో పోలీసులు వారిని మందలించిన సంగతి తెలిసిందే. పర్మిషన్ లేకుండా ఇలాంటి ర్యాలీలు చేపడితే ఊరుకోమని పోలీసులు పేర్కొన్నారు. AnchorShiva craze ea verabba 😎 Anchor Shiva on the way home 🏡@anchor_shiva #AnchorShiva #BiggBossNonStop #BiggBossNonStopTelugu pic.twitter.com/Z5GsaDBb9Q — Shiva Fans Ikkada ⚡🔥❤️🥷 (@iamkundum) May 21, 2022 -
బాత్రూమ్లో సీక్రెట్ స్మోకింగ్.. బిందుమాధవి ఏమందంటే?
మొదట్లో బిగ్‌బాస్ షో అంటే కేవలం టీవీలకే పరిమితమయ్యేది. కానీ ఓటీటీలు వచ్చాక బిగ్‌బాస్ రూటు మారింది. గంట ఎపిసోడ్ మాత్రమే ఎందుకు చూపించాలి, హౌస్‌లో ఏం జరుగుతుందో ప్రత్యక్ష ప్రసారం చూపిస్తే పోలా అనుకున్నారు. అనుకున్నట్లుగా బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ప్రవేశపెట్టారు. 24 గంటలు లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులోకి తేవడమే కాకుండా నిరంతరం షో చూడలేనివాళ్ల కోసం ప్రత్యేకంగా గంట ఎపిసోడ్ కూడా పెట్టారు. కంటెస్టెంట్ల మీద ఓ కన్నేసి ఉంచే వాటినుంచి తప్పించుకుని ఏమీ చేయలేరు కంటెస్టెంట్లు. కానీ కెమెరాలకు సైతం కనబడకుండా అషూ, బిందు మాధవి సిగరెట్ తాగారంటూ ప్రచారం జరిగింది. అర్ధరాత్రి సిగరెట్లు మాయమవుతున్నాయని, బాత్రూమ్లో కూడా పొగ వాసన వస్తుందని నటరాజ్ ఎప్పుడో పసిగట్టాడు. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన సమయంలోనూ అషూకు సిగరెట్ తాగావా? అన్న ప్రశ్న ఎదురైంది. కానీ అషూ తెలివిగా దాని నుంచి తప్పించుకుంది. తాజాగా ఫ్యాన్స్‌తో సోషల్ మీడియాలో సరదాగా చిట్‌చాట్ చేసిన బిందుమాధవికి సైతం అదే ప్రశ్న ఎదురైంది. నువ్వు స్మోకింగ్ చేస్తున్నావని స్రవంతి.. అఖిల్‌తో పాటు అతడి ఫ్రెండ్స్‌కు చెప్పింది. అది నిజమేనా? అని ఓ అభిమాని అడిగారు. దీనికి బిందు స్పందిస్తూ.. తానసలు పొగ తాగలేదని స్పష్టం చేసింది. తనకా అలవాటు ఉండుంటే ఓపెన్‌గానే స్మోకింగ్ చేసేదాన్నని చెప్పుకొచ్చింది. చదవండి 👉🏾 హీరోయిన్ ప్రణీత బేబీ బంప్ ఫొటోలు వైరల్ కుంభకర్ణుడిలా పడుకుంది చాలు, ముందు అప్డేట్ ఇవ్వు -
బిందు మాధవితో లవ్ ట్రాక్.. క్లారిటీ ఇచ్చిన శివ
Anchor Shiva Gave Clarity On Love Story With Bindu Madhavi: బిగ్‌బాస్.. ప్రేక్షకుల నుంచి ఎంతో ఆదరణ పొందింది ఈ రియాలిటీ షో. గంట ఎపిసోడ్ కోసం రోజంతా ఎదురుచూసే ప్రేక్షకుల కోసం బిగ్‌బాస్ నాన్స్టాప్పేరుతో ఓటీటీలో ప్రవేశపెట్టారు. బిగ్‌బాస్ హౌజ్‌లో 24 గంటలు ఏం జరుగుతుందో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా చూసేయండంటూ షోపై మరింత ఆసక్తి పెంచారు. ఈసారి బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో వచ్చిన గొడవలు ఏ బిగ్‌బాస్ సీజన్లో రాలేదు. ఎంతలా అంటే ప్రేమలు, ఆప్యాయతలు కంటే కంటెస్టెంట్ల మధ్య వాగ్వాదాలతోనే మోస్ట్ పాపులర్ అయ్యారు. ఈ ఓటీటీ మొదటి సీజన్లో మొత్తం 18 మంది (ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీతో సహా) పాల్గొన్నారు. వీరిలో అనిల్ రాథోడ్, అరియానా గ్లోరీ, అఖిల్ సార్థక్, బిందు మాధవి, శివ, మిత్రా శర్మ, బాబా భాస్కర్ గ్రాండ్ ఫినాలేకు చేరుకున్నారు. బిందు మాధవి విన్నర్‌గా నిలవగా అఖిల్ రన్నరప్‌గా సరిపెట్టుకున్నాడు. ఇక కాంట్రవర్సీ యాంకర్‌గా పేరు తెచ్చుకున్న శివ టాప్ 3 కంటెస్టెంట్‌గా నిలిచాడు. అయితే హౌజ్‌లో ఉన్నప్పుడు యాంకర్ శివ, బిందు మాధవి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని అనేక రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే తర్వాత జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి చెప్పుకొచ్చాడు శివ. చదవండి: అనిల్, సునిల్‌ను దొంగసచ్చినోళ్లు అంటూ అరియానా తిట్లు.. బిందుతో లవ్ ట్రాక్ నడపడం వల్లే ఫైనల్ వరకు వచ్చారా అని అడిగిన ప్రశ్నకు 'అసలు రాంగ్ ఇన్ఫర్మేషన్ అనుకుంటా. నిజానికి నేను బిందుతో ఉన్నది లవ్ ట్రాక్ కాదు. మా ఇద్దరిది ఫ్రెండ్షిప్ మాత్రమే. అసలు లవ్ ట్రాక్ అయితే కానేకాదు.' అని తెలిపాడు శివ. తర్వాత బిగ్‌బాస్‌కు వెళ్లడం ఎలా ఉందన్న ప్రశ్నకు 'కాంట్రవర్సీ యాంకర్‌గా పేరు తెచ్చుకున్న నేను మొదట్లో భయపడ్డాను. ఎక్కడ నెగెటివిటీ వస్తుందో అని. నన్ను యాక్సెప్ట్ చేస్తారో లేదో అనుకున్నా. కానీ హౌజ్‌లోపలికి గెస్ట్‌లు, పేరెంట్స్ వచ్చి ఎంటర్టైనర్ ఎంటర్టైనర్ అంటే సంతోషంగా అనిపించింది. ఇంత మంచి పేరు వచ్చినందుకు హ్యాపీగా ఉంది.' అని పేర్కొన్నాడు. చదవండి: తెలుగు బిగ్‌బాస్ చరిత్రలోనే మొదటి మహిళా విజేతగా బిందు మాధవి.. -
నాకేం ఫరక్ పడదు, బిందు నా పండు: అఖిల్ సార్థక్
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షోకు శుభం కార్డు పడింది. తెలుగు బిగ్‌బాస్ చరిత్రలోనే తొలిసారిగా ఒక మహిళా కంటెస్టెంట్ విన్నర్‌గా నిలిచింది. 17 మంది కంటెస్టెంట్లతో పోటీపడి బిందుమాధవి ట్రోఫీ ఎగరేసుకుపోయింది. గతంలో గెలుపుకు ఒక అడుగు దూరంలో ఆగిపోయిన అఖిల్ సార్థక్ ఈసారి ఎలాగైనా ట్రోఫీని సొంతం చేసుకుకోవాలనుకున్నాడు. కానీ అతడికి మరోసారి భంగపాటు ఎదురైంది. ఓటింగ్‌లో అతడిని వెనక్కు నెట్టి మరీ బిందు మాధవి విజేతగా అవతరించడంతో అఖిల్ మరోసారి రన్నర్‌గా నిలిచాడు. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన అతడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'నేను రన్నర్ అయినా మావాళ్లు నన్ను విన్నర్‌గానే ట్రీట్ చేస్తారు. కానీ నేను ఏడ్చేశానంటూ కొందరు ఏవేవో రాశారు. ఆల్రెడీ ఒకసారి దెబ్బ తగిలినప్పుడు దానిపై మళ్లీ తాకితే పెద్దగా ఫరక్ పడదు. బిందు నా పండు. మేం చాలా సరదాగా ఉన్నాం. బిగ్‌బాస్ షో మొదటి నుంచే తనతో కలవడానికి ప్రయత్నిస్తున్నా. కానీ చివరి వారంలో కలిశాము. చాలా సంవత్సరాల నుంచి ఆమె విజయం కోసం ఎదురుచూస్తోంది. చివరకు తను అనుకున్నది సాధించినందుకు హ్యాపీ. హౌస్‌లో తేజు, శ్రీరాపాక, ముమైత్, నటరాజ్ మాస్టర్ బెస్ట్ కంటెస్టెంట్స్. యాంకర్ శివ నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వస్తాడట, అప్పుడు అతడి గురించి చెప్తా' అన్నాడు అఖిల్. చదవండి 👉🏾 నా నామినేషన్స్ బాగా నచ్చాయట, బిగ్‌బాస్‌కు మళ్లీ వెళ్తా: మిత్ర బిందుమాధవి గెల్చుకున్న ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా? -
బిగ్‌బాస్ నెక్స్ట్ సీజన్‌కి మళ్లీ వెళ్తా: మిత్ర శర్మ
బిగ్‌బాస్ ఓటీటీ నాన్‌స్టాప్‌లో టాప్ 5లో చోటు దక్కించుకుంది మిత్ర శర్మ. ఆమె ఫినాలేలో స్థానం సంపాదించినందుకు కొందరు సంతోషిస్తుంటే మరికొందరు ఈమె ఇక్కడిదాకా ఎలా వచ్చిందా? అని తలలు పట్టుకుంటున్నారు. బిగ్‌బాస్ షోలో ఆమె ఎక్కువగా కనిపించేది నామినేషన్స్‌లోనే. అందరి నామినేషన్ ఒక ఎత్తైతే మిత్ర నామినేషన్ మాత్రం వేరే లెవల్ ఉండేది. గంటల తరబడి వాదిస్తుంటే మిగతావాళ్ల కాళ్లు నొప్పులు పుట్టేవి. అన్న అన్న అనుకుంటూనే మహేశ్, శివను నామినేట్ చేసింది. బిందు, శివను నామినేట్ చేసేటప్పుడు మిత్రలో మరో యాంగిల్ బయటకు వచ్చేది. ఇమిటేట్ చేయడం, డ్రామా క్రియేట్ చేయడం, గార్డెన్ ఏరియాను అంతా వాడేసుకుంటూ పరిగెత్తుతూ అరిచేస్తూ గోలగోల చేసేది. ఎదుటివారిని మాట్లాడనీయకుండా తను చెప్పాలనుకున్న విషయాలను ముక్కుసూటిగా బల్లగుద్ది చెప్పేది. నామినేషన్స్‌లో ఓ రేంజ్లో విరుచుకుపడే మిత్ర తర్వాత మాత్రం అసలు ఎపిసోడ్లో ఎక్కడో ఓ చోట కనిపించేది. ఓపక్క గొడవపడుతూనే మళ్లీ వారితో సఖ్యతగా ఉండటానికి ప్రవర్తించేది. షో ప్రారంభంలో అయితే నోరు తెరిచి మాట్లాడేదే కాదు. తన అభిప్రాయాలను టిష్యూ పేపర్ల మీద రాసి వెల్లడించేది. ఈ ప్రవర్తనను అందరూ తప్పు పట్టడంతో అప్పటి నుంచి తన రూటు మార్చుకుంది. తనవరకు గేమ్‌లో బాగానే కష్టపడేది కానీ ఇతర హౌస్మేట్స్ నుంచి ఆమెకు ఎలాంటి సపోర్ట్ లభించేది కాదు. దీంతో ఎప్పుడూ తాను ఒంటరిని అని ఎక్కువగా ఫీల్ అయ్యేది. మొత్తానికి టాప్ 5లో చోటు దక్కించుకున్న మిత్ర తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఓ అమ్మాయిగా బిందు గెలిచినందుకు సంతోషంగా ఉందంది. తన నామినేషన్స్ జనాలకు బాగా నచ్చాయని, కాబట్టి తనకు మళ్లీ ఆఫర్ వస్తే ఆరో సీజన్‌కి తప్పకుండా వెళ్తానంది. మరి నిజంగానే బిగ్‌బాస్ ఆరో సీజన్‌కు మిత్రకు పిలుపొస్తుందా? నెక్స్ట్ సీజన్లో మరోసారి మిత్రను బిగ్‌బాస్ హౌస్‌లో చూస్తామా? అన్నది వేచి చూడాలి! చదవండి 👉🏾 బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విన్నర్ ఎన్ని లక్షలు గెలుచుకుందో తెలుసా? నటితో ఎఫైర్ పెట్టుకో, ఫేమస్ చేస్తామన్నారు -
ఆ కంటెస్టెంట్ వల్లే నాకు టైటిల్ దక్కింది: బిందు మాధవి
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విన్నర్‌గా బిందు మాధవి రికార్డు సృష్టించింది.టైటిల్ రేసులో ఉన్న అఖిల్ సార్థక్ నుంచి గట్టి పోటీ ఎదురైనా చివరికి బిందు మాధవి టైటిల్ విన్నర్‌గా నిలిచింది. తెలుగు బిగ్‌బాస్ చరిత్రలోనే తొలి లేడీ విన్నర్‌గా నిలిచి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ట్రోఫీతో పాటు రూ. 40లక్షల క్యాష్ ప్రైజ్‌ను సైతం సొంతం చేసుకుంది. 'మస్తీ' హ్యాష్ ట్యాగ్‌తో ఎంట్రీ ఇచ్చి 'ఆడపులి' అనే హ్యాష్ ట్యాగ్‌తో బయటికొచ్చింది. అనంతరం బిగ్‌బాస్ బజ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిందు మాధవి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. బిగ్‌బాస్ టైటిల్ గెలవడం తన మొదటి విజయంగా భావిస్తున్నానని, ఇప్పటి నుంచి ఇక విజయవంతంగా ముందుకు వెళ్తానని అనుకుంటున్నట్లు పేర్కొంది. ఇప్పుడు విన్నర్ అయ్యావ్ కానీ, ఒకసారి కూడా కెప్టెన్ ఎందుకు అవ్వలేదు అని యాంకర్ అడగ్గా అది తనకు కూడా తెలియదని చెప్పింది. హౌస్‌లో మోస్ట్ ఇరిటేటింగ్ కంటెస్టెంట్ ఎవరు అని అడగ్గా ఏమాత్రం తడుముకోకుండా వెంటనే నటరాజ్ మాస్టర్ అని తెలిపింది. ఈ సీజన్లో పలానా కంటెస్టెంట్ ఉన్నపపుడు నేను ఈ సీజన్‌కి రావాల్సింది లేకుండే అని ఎవరిని చూస్తే అనిపించింది?అని అడగ్గా వారి వళ్లే తనకీ టైటిల్ దక్కిందంటూ చెప్పుకొచ్చింది. చివరగా విన్నింగ్ మూమెంట్లో గెలుస్తానో, లేదో అని చాలా కన్ఫ్యూజన్లో ఉన్నానని బిందు పేర్కొంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట చక్కర్లు కొడుతుంది. -
బిందుమాధవి గెల్చుకున్న ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?
బిగ్‌బాస్ షో... గంట ఎపిసోడ్ కోసం రోజంతా ఎదురుచూసేవాళ్లు ప్రేక్షకులు. వారి ఆసక్తిని అర్థం చేసుకుని బిగ్‌బాస్ ఓటీటీని ప్రవేశపెట్టారు. 24 గంటలు హౌస్‌లో ఏం జరిగిందో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసేయండంటూ బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షో మొదలుపెట్టారు. విచిత్రంగా బిగ్‌బాస్ షోలో లేనన్ని గొడవలు ఈ ఓటీటీలో చోటు చేసుకున్నాయి. ప్రేమలు, ఆప్యాయతల కంటే గొడవలతోనే కంటెస్టెంట్లు ఎక్కువగా ఫేమస్ అయ్యారు. ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీతో కలిపి ఈ ఓటీటీ మొదటి సీజన్లో మొత్తం 18 మంది పాల్గొన్నారు. వీరిలో అనిల్, అరియానా, అఖిల్, బిందు, శివ, మిత్ర, బాబా ఫినాలేకు చేరుకున్నారు. శనివారం గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ జరగ్గా నాగార్జున బిందును విన్నర్‌గా ప్రకటించాడు. అఖిల్ సార్థక్ రన్నర్‌గా నిలిచాడు. యాంకర్ శివ సెకండ్ రన్నరప్ స్థానానికి పరిమితమయ్యాడు. ఈ స్థానాలను ముందుగానే అంచనా వేసిన అరియానా రూ.10 లక్షల సూట్‌కేస్‌తో రేస్ నుంచి తప్పుకుంది. మరి విజేతగా నిలిచిన బిందుమాధవి ఎంత గెలుచుకుందో తెలుసా? అక్షరాలా రూ.40 లక్షలు. నిజానికి బిందుకు అరకోటి దక్కాలి. కానీ మధ్యలో అరియానా రూ.10 లక్షలున్న సూట్‌కేస్ చేజిక్కించుకోవడంతో దాన్ని ప్రైజ్‌మనీలో నుంచి తగ్గించారు. మొత్తానికి బిందు ప్రజల మనసుతో పాటు భారీ ప్రైజ్‌మనీ కూడా గెల్చుకుంది. ఊహించని గెలుపుతో ఉక్కిరిబిక్కిరి అయిన బిందు బిగ్‌బాస్ స్టేజీపై భావోద్వేగానికి లోనైంది. కొందరికి కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు కష్టపడితే సక్సెస్ వస్తుంది. కానీ చాలామందికి ఎన్నో సంవత్సరాలు కష్టపడితేనే విజయం వరిస్తుంది. అలా ఆలస్యంగా విజయాన్ని అందుకునే లేట్ బ్లూమర్స్‌కు నా గెలుపు అంకితం. నేను కూడా లేట్ బ్లూమర్నే. చాలా సంవత్సరాలు కష్టపడ్డ తర్వాత నాకు ఈ ట్రోఫీ వచ్చింది అని చెప్తూ ఎమోషనలైంది. చదవండి 👉🏾 నటితో ఎఫైర్ పెట్టుకో, ఫేమస్ చేస్తామన్నారు తెలుగు బిగ్‌బాస్ చరిత్రలోనే మొదటి మహిళా విజేతగా బిందు మాధవి.. -
తెలుగు బిగ్‌బాస్ చరిత్రలోనే మొదటి మహిళా విజేతగా బిందు మాధవి..
Bigg Boss Non Stop Telugu Winner Is Bindu Madhavi: తెలుగు నాట అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షో బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షో గ్రాండ్ ఫినాలే శనివారం (మే 20) సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమైంది. ఫిబ్రవరి 26న ప్రారంభమైన ఈ బిగ్ రియాల్టీ షోకు శనివారం (మే 20) శుభం కార్డు పలికారు. 83 రోజులు జరిగిన ఈ షోలో టాప్ 7 కంటెస్టెంట్స్‌గా బాబా భాస్కర్, అనీల్ రాథోడ్, మిత్రా శర్మ, అరియానా గ్లోరి, యాంకర్ శివ, అఖిల్ సార్థక్, బిందు మాధవి నిలిచారు. అనీల్ రాథోడ్, మిత్రా శర్మ, బాబా భాస్కర్ ఎలిమినేషన్ తర్వాత ఆట రసవత్తరంగా మారింది. అరియానా గ్లోరి రూ. 10 లక్షలతో బిగ్‌బాస్ నాన్‌స్టాప్ హౌజ్ నుంచి బయటకు వెళ్లింది. తర్వాత ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా యాంకర్ శివ బయటకు వెళ్లాడు. అనంతరం గోల్డెన్ బాక్స్‌తో హౌజ్‌లోకి వెళ్లిన నాగార్జున టాప్ 2 కంటెస్టెంట్స్ అయిన అఖిల్, బిందు మాధవి అనుభవాల గురించి అడిగి తెలుసుకన్నాడు. బిగ్‌బాస్ ఆదేశంతో వారిద్దరిని స్టేజ్‌పైకి తీసుకొచ్చాడు నాగార్జున. బిగ్‌బాస్ స్టేజ్‌పై ఫైనల్ విన్నర్‌గా బిందు మాధవిని ప్రకటించాడు నాగార్జున. దీంతో తెలుగు బిగ్‌బాస్ చరిత్రలోనే మొదటిసారిగా ఒక మహిళ గెలిచింది. తెలుగు బిగ్‌బాస్ తొలి మహిళా విజేతగా బిందు మాధవి నిలిచింది. దీంతో ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయింది బిందు. బిగ్‌బాస్ కప్ కొట్టాలన్న అఖిల్ ఆశలు మరోసారి అడియాశలే అయ్యాయి. -
బిగ్‌బాస్ నుంచి బయటకు అరియానా.. ఎంత గెలుచుకుందంటే ?
Bigg Boss Non Stop Telugu Grand Finale: Ariyana Came Out With 10 Lakhs: బిగ్‌బాస్ నాన్‌స్టాప్ గ్రాండ్ ఫినాలే నుంచి అనిల్, బాబా భాస్కర్, మిత్రా శర్మ బయటకు వచ్చాక డబ్బుల ఎపిసోడ్ రసవత్తరంగా మారింది. డబ్బుల బ్రీఫ్‌కేసుతో హౌజ్‌లోకి వెళ్లిన అనిల్ రావిపూడి, సునీల్ డబ్బులతో బేరం చేశారు. అఖిల్ కప్ కోసం వచ్చానని చెప్పగా, బిందు మాధవి తెలుగు ప్రేక్షకులకు దగ్గరవడానికే వచ్చానని తెలిపింది. అరియానా అయితే డబ్బు కోసమే వచ్చానని, ఒక ప్లాట్ కొనాలనే కోరికతోనే వచ్చానని వెల్లడించింది. తన ఆర్థిక కష్టాలని తీర్చుకునేందుకు, కప్పు కూడా కొట్టాలని ఉద్దేశ్యంతోనే వచ్చినట్లు శివ చెప్పుకొచ్చాడు. దీంతో డబ్బుల బేరం మొదలైంది. ఈ బేరంలో అందరు సైలెంట్‌గా ఉంటే అరియానా మాత్రం ఎంత డబ్బు ఉండొచ్చని, డబ్బు తీసుకునేందుకే ఉత్సాహాన్ని చూపించింది. కానీ అందులో ఎంత డబ్బు ఉందనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. అందులో లక్షల్లో డబ్బు ఉందని నాగార్జున మాటిచ్చిన తర్వాత అరియానా ఈ సూట్‌కేస్‌ను తీసుకుంది. సూట్‌కేస్‌తో స్టేజ్‌పైకి వచ్చిన అరియానాతో నాగార్జున, అనిల్, సునీల్ ఆట ఆడుకున్నారు. అందులో డబ్బు ఉందంటే ఎలా నమ్మావ్ అని బాంబు పేల్చారు. దీంతో అనిల్, సునీల్‌లను దొంగసచ్చినోళ్లను నమ్మి వ్చచానని అరియానా తిట్టేసింది. కొద్దిసేపు అరియానా అనిల్, సునీల్, నాగార్జున, బాబా భాస్కర్ ఆడుకున్నారు. చివరికి అందులో రూ. 10 లక్షలు ఉన్నాయని నాగార్జున చెప్పడంతో అరియానా ఊపిరి పీల్చుకుంది. -
డబ్బులు పట్టుకుని పోదామనుకున్నా: బాబా భాస్కర్
Bigg Boss Non Stop Telugu Grand Finale: బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షో గ్రాండ్ ఫినాలే జోరుగా ప్రారంభమైంది. ఈషోలో బాబా భాస్కర్ మాస్టర్ ప్రయాణం ముగిసిపోయింది. టాప్ 7 నుంచి అనిల్ రాథోడ్ ఎలిమినేట్ కాగా తర్వాత సత్యదేవ్ చేతుల మీదుగా బాబా బాస్కర్ ఎలిమినేట్ అయి బయటకు వచ్చేశాడు. బాబా మాస్టర్ స్టేజ్‌పైకి వస్తూనే ఆయన భార్య రేవతికి దండం పెట్టేశాడు. ఇది గమనించిన నాగార్జున భలే కవర్ చేస్తున్నావ్ కదా ? అన్నట్లుగా సెటైర్ వేశాడు. దీని తర్వాత బాబా మాస్టార్ తన అనుభూతి గురించి తెలిపాడు. ఈ సీజన్ కంటే ముందుగా వచ్చిన సీజన్ అనుభవం బాగుంది. అప్పుడు మాకేం తెలియదు. కానీ ఈ సీజన్‌కు వచ్చే సరికి అంత ఎగ్జైట్మెంట్ లేదు. బిగ్‌బాస్ గురించి అంతా తెలుసు కాబట్టి అలా అనిపించలేదు. అయితే ఈ షోకు రావడం ఆనందగా ఉంది. సీక్రెట్ రూమ్‌లో ఉండటం, ఎవిక్షన్ పాస్ రావడం అన్ని బాగున్నాయి. కానీ శ్రీకాంత్ లోపలకు వస్తాడేమో, డబ్బులు పట్టుకుని పోదామనుకున్నా. అలా జరగలేదు. అదొక్క అసంతృప్తి మాత్రమే ఉంది. తర్వాత విన్నర్ ఎవరు అవుతారని నాగార్జున అడగ్గా, ముందుగా బిందు అని సమాధానం ఇచ్చాడు బాబా మాస్టర్. తర్వాత మళ్లీ శివ, అఖిల్ పేర్లు చెప్పాడు. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు కావాలని అన్నట్లుగా తెలిపాడు. -
Bigg Boss Non Stop Telugu: మరోసారి అఖిల్‌కు దక్కని బిగ్‌బాస్ ట్రోఫీ.. ఈసారి రన్నరప్‌గా
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ గ్రాండ్ ఫినాలే చాలా గ్రాండ్‌గా ప్రారంభమైంది. సిటీమార్ పాటలతో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు నాగార్జున. హౌజ్‌లోకి వెళ్లేముందు టాప్ 7లో ఉన్న కంటెస్టెంట్స్ ఫ్యామిలీస్‌తో మాట్లాడాడు నాగార్జున. అనంతరం మిత్రకోసం వచ్చిన బాలాని మిత్రా శర్మని ఎలా పడేశావ్ అని అడగ్గా, మేం ఫ్రెండ్స్ మాత్రమే అన్నాడు. దీనికి వెనుక ఉన్న తేజస్వీ 'వీళ్లది మాత్రం ఫ్రెండ్షిప్ కాదు' అని చెప్పింది. ఇదిలా ఉంటే ముందుగా అనిల్‌ను ఎలిమినేట్ అయ్యాడు. తర్వాత స్టేజ్‌పైకి హీరో సత్యదేవ్ వచ్చాడు. సత్యదేవ్‌తో 'గాడ్సే' మూవీ తన తదితర సినిమా ప్రాజెక్ట్స్, ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడాడు నాగార్జున. తర్వాత హౌజ్‌లోపలికి వెళ్లి ఒకరిని ఎలిమినేట్ చేసి తీసుకురావల్సిందిగా సత్యదేవ్‌కు చెప్తాడు నాగ్. దీంతో హౌజ్‌లోకి వెళ్లిన సత్యదేవ్ బాబా మాస్టర్‌ను ఎలిమినేట్ చేసి స్టేజిపైకి తీసుకువస్తారు. అనంతరం స్టేజిపైకి వచ్చిన బాబా మాస్టర్‌తో నాగార్జున కొద్దిసేపు ముచ్చటించి పంపించివేశారు. అనంతరం మేజర్ టీమ్ వచ్చి స్టేజిపై సందడి చేసింది. ఇదివరకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌కు ఒక్కో అవార్డు ఇచ్చారు నాగార్జున. ఆర్జే చైతుకి కొకొనట్, అజయ్‌కు మిస్టర్ కూల్, నటరాజ్ మాస్టర్‌కు రింగ్ మాస్టర్ అవార్డ్స్ ప్రదానం చేశారు. అనంతరం హాజ్లో ఉన్నవారికి కూడా అవార్డ్స్ ఇచ్చారు. బిందు మాధవికి అడ్వకేట్ అవార్డు ఇచ్చారు. తర్వాత మిత్రా శర్మ ఎలిమినేట్ అయినట్లుగా నాగార్జున ప్రకటించాడు. మిత్ర ఎలిమినేషన్ తర్వాత 'ఎఫ్ 3' చిత్రబృందం వచ్చి సందడి చేసింది. సినిమా విశేషాలు, మాజీ కంటెస్టెంట్స్‌తో కబుర్లు చెబుతూ నవ్వించారు. తర్వాత హౌజ్‌లోకి ఒక సూట్‌కేస్ పట్టుకుని డైరెక్టర్ అనిల్ రావిపూడి, సునీల్ వెళ్తారు. లోపల ఉన్న కంటెస్టెంట్స్‌తో కొద్దిసేపు కబుర్లు చెబుతూ సందడి చేశారు. అనంతరం బిందు మాధవి, అఖిల్, అరియానా, శివను వారు బిగ్‌బాస్‌కు ఎందుకు వచ్చారు అని అడగ్గా ఒక్కొక్కరి గోల్ చెబుతూ వచ్చారు. తర్వాత అనిల్, సునిల్ తీసుకొచ్చిన సూట్‌కేస్‌ను అరియానా తీసుకుంది. సూట్‌కేస్‌తోపాటు అరియానాను స్టేజ్‌పైకి తీసుకొచ్చారు అనిల్, సునీల్. ఆ సూట్‌కేసులో రూ. 10 లక్షలు ఉన్నట్లు నాగార్జున తెలిపాడు. అరియానా రూ. 10 లక్షలు ఉన్న సూట్‌కేస్ తీసుకొని స్టేజ్‌పైనుంచి మాజీ కంటెస్టెంట్ల మధ్య కూర్చుంది. తర్వాత హీరోయిన్ మెహ్రీన్ తన సూపర్ డ్యాన్స్‌తో అలరించింది. అనంతరం మళ్లీ ఎలిమినేషన్ ప్రక్రియ మొదలుపెట్టాడు నాగార్జున. ఈ ఎలిమినేషన్లో యాంకర్ శివ బిగ్‌బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చాడు. అనంతరం గోల్డెన్ బాక్స్‌తో నాగార్జున హౌజ్‌లోపలికి వెళ్లాడు. బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ప్రయాణంలో అఖిల్, బిందు మాధవి అనుభవాలను అడిగి తెలుసుకున్నాడు నాగార్జున. తర్వాత వారిద్దరిని స్టేజ్‌పైకి తీసుకెళ్లాడు. తర్వాత బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విజేతగా బిందు మాధవిని ప్రకటించాడు నాగార్జున. రన్నరప్‌గా అఖిల్ నిలిచాడు. బిగ్‌బాస్ విన్నర్‌గా కప్ కొట్టాలని ఇదివరకు ప్రయత్నించి ఓడిపోయిన అఖిల్‌కు మరోసారి ట్రోఫి దక్కలేదు. ఇక తెలుగు బిగ్‌బాస్ చరిత్రలోనే మొదటి మహిళా విన్నర్‌గా బిందు మాధవి నిలిచింది. -
బిగ్‌బాస్ ఓటీటీ గ్రాండ్ ఫినాలే ప్రోమో వచ్చేసింది
బిగ్‌బాస్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న గ్రాండ్ ఫినాలేకు సమయం ఆసన్నమైంది. ప్రస్తుతం హౌస్‌లో బాబా భాస్కర్, అరియానా, అనిల్, మిత్ర శర్మ, అఖిల్, బిందు మాధవి, యాంకర్ శివ ఉన్నారు. ఇలా ఏడుగురు కంటెస్టెంట్లు ఫినాలేకు చేరుకోవడం తెలుగు బిగ్‌బాస్ చరిత్రలోనే ఇదే తొలిసారి. కాగా నేడు (మే 21) సాయంత్రం గ్రాండ్ ఫినాలే జరగనున్నట్లు హాట్‌స్టార్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ప్రోమో రిలీజ్ చేసింది. ఇందులో గ్రాండ్ ఫినాలేను మరింత హుషారెత్తించేందుకు వచ్చిన మేజర్, ఎఫ్ 3 సినిమా టీమ్స్ స్టేజీపై సందడి చేశాయి. బిగ్‌బాస్ ఓటీటీలో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు సైతం స్టేజీపై సందడి చేశారు. స్పెషల్ గెస్ట్‌గా వచ్చిన అనిల్ రావిపూడి ఓ సూట్‌కేసుతో బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లాడు. అంటే హౌస్‌లో ఉన్న ఏడుగురిలో ఎవరో ఒకరు ఆ సూట్‌కేసును తీసుకునే అవకాశాలున్నాయి. అయితే పది లక్షల వరకు డబ్బున్న ఆ సూట్‌కేసును అరియానా గ్లోరీ ఎగరేసుకుపోయిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా బిగ్‌బాస్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక అమ్మాయి టైటిల్ సొంతం చేసుకుందంటూ నెట్టింట బిందుమాధవికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈసారి ఎలాగైనా ట్రోఫీ సొంతం చేసుకోవాలన్న అఖిల్ ఆశలు అడియాశలయ్యాయని మరోసారి అతడు రన్నరప్‌గా నిలిచినట్లు తెలుస్తోంది. ఈ గ్రాండ్ ఫినాలే సాయంత్రం ఆరు గంటల నుంచి ప్రసారం కానుంది. చదవండి 👉🏾 గుట్కా యాడ్ ఎఫెక్ట్: నలుగురు స్టార్ హీరోలపై కేసు ఆ నటిని పెళ్లాడనున్న రష్మిక మందన్నా మాజీ ప్రియుడు -
Bigg Boss OTT: 10 లక్షల సూట్‌కేస్‌తో తప్పుకున్న అరియానా!
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విన్నర్ ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. గత సీజన్ల కంటే భిన్నంగా ఏడుగురు కంటెస్టెంట్లతో గ్రాండ్ ఫినాలేకి చేరుకున్న బిగ్‌బాస్ చివరి మజిలీకి చేరుకుంది. బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే అప్డేట్స్ అప్పుడే సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. నెట్టింట లీక్ అవుతున్న సమాచారం ప్రకారం.. బిందు మాధవి బిగ్‌బాస్ నాన్‌స్టాప్ టైటిల్ విన్నర్‌గా నిలిచింది. దీంతో ఈసారైనా విన్నర్ అవ్వాలన్నా అఖిల్ కల కలగానే మిగిలిపోయింది. బిగ్‌బాస్ చరిత్రలోనే తొలిసారి ఒక అమ్మాయి టైటిల్ విన్నర్‌గా నిలవడం బిందుకే సాధ్యమైంది. ఆడపులి హ్యాష్‌ట్యాగ్‌తో ఫేమస్ అయిన బిందు ఓటీటీ విన్నర్‌గా నిలిచి సత్తా చాటింది. కాగా ఈ సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన బాబా మాస్టర్ టాప్7 స్థానంలో నిలవగా, అనిల్ 6వ స్థానంలో నిలిచారు. ఆ తర్వాత మిత్రా, అరియానా గ్లోరీ, శివ వరుసగా టాప్- 3 స్థానాల్లో నిలిచినట్లు టాక్ వినిపిస్తుంది. టాప్-4లో ఉన్న కంటెస్టెంట్లకు నాగార్జున డబ్బులు ఆఫర్ చేయగా అరియానా గ్లోరీ 10 లక్షల బ్రీఫ్ కేసును తీసుకొని టైటిల్ రేసు నుంచి స్వయంగా తప్పుకుంది. ఆ తర్వాత టాప్-3లో ఉండగా మరోసారి డబ్బులు ఆఫర్ చేయగా, శివ, బిందు, అఖిల్ ఆ ఆఫర్‌ను తిరస్కరించారు.ఫైనల్‌గా బిందు, అఖిల్‌కి మధ్య జరిగిన రేస్‌లో బిందు విజేతగా నిలిచినట్లు తెలుస్తుంది. దీంతో సోషల్ మీడియా వేదికగా బిందుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. -
బిగ్‌బాస్ ఓటీటీ విన్నర్ ఎవరో తేల్చేసిన గీతూ రాయల్
గీతూ రాయల్ ఈ మధ్య బుల్లితెరపై తెగ సందడి చేస్తుంది. చిత్తూరు యాసలో బెరుకు లేకుండా మాట్లాడుతూ అందరిని ఆకట్టుకుంటుంది. కానీ ఆమె గతంలో తన బిగ్ బాస్ రివ్యూస్ తో బాగా పాపులర్ అయ్యింది. గలాటా గీతూ పేరుతో ఆమె రివ్యూస్ చెప్పేది.ఇప్పుడు కూడా గలాటా గీతూ రాయల్ పేరుతో ఒక ఛానల్ స్టార్ట్ చేసి బిగ్ బాస్ OTT కి సంబందించిన రివ్యూస్ అందులో పోస్ట్ చేస్తుంది. అయితే ఈ శనివారం ఈ సీజన్ కి సంబందించిన ఫినాలే జరగబోతుంది.బిందు మాధవి,అఖిల్ ఈ సారి బిగ్ బాస్ ట్రోఫీ రేస్ లో ముందున్నారు.అలాగే అరియనా,యాంకర్ శివ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు.ఈ సందర్భంగా సాక్షి కి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ లో గీతూ ఈ సీజన్ విన్నర్ ఎవరు అవుతారు అనే ప్రశ్నకి తన స్టైల్ లో ఎనాలిసిస్ చేసి చెప్పింది.మరి గీతూ రాయల్ చెప్పిన దాని ప్రకారం బిగ్ బాస్ OTT విన్నర్ ఎవరో మీరూ ఒక లుక్ వెయ్యండి. -
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విన్నర్‌గా ఆడపులి! చరిత్ర సృష్టించిన బిందు!
బుల్లితెర హిట్ షో బిగ్‌బాస్‌ను అభిమానించేవాళ్లు ఎంతోమంది. సాధారణ ప్రేక్షకులే కాదు పలువురు సెలబ్రిటీలు సైతం ఈ షోను ఫాలో అవుతుంటారు. గత సీజన్లలో గ్రాండ్ ఫినాలేకు వచ్చిన పలువురూ ఇదే మాట చెప్పారు. ఇక వెండితెరపై రాణించాలనుకునేవాళ్లు, జనాల మనసులు గెల్చుకోవాలనుకునేవాళ్లు, ఆర్థిక సమస్యలు చక్కదిద్దుకోవాలనుకునేవాళ్లు ఈ షోకు రావాలని తహతహలాడుతుంటారు. ఆల్రెడీ ఫేమస్ అయిన వాళ్లనే కాకుండా ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని ముఖాలను కూడా తీసుకువచ్చి వారికి పాపులారిటీ, అవకాశాలను తెచ్చిపెట్టిందీ షో. తెలుగులో ఐదు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ ఈసారి నాన్‌స్టాప్ పేరిట ఓటీటీలో హడావుడి చేసింది. 17 మంది కంటెస్టెంట్లతో ఫిబ్రవరి 26న మొదలైన ఈ షోకు ఈవారంతో శుభంకార్డు పడనుంది. ప్రస్తుతం హౌస్‌లో ఏడుగురు ఉన్నారు. గతంలో ఐదుగురు మాత్రమే ఫినాలేకు చేరుకునే అవకాశం ఉండేది. కానీ ఈసారి ఏకంగా ఏడుగురు ఫినాలేలో అడుగుపెట్టడం విశేషమనే చెప్పాలి. అనిల్, బిందు, అఖిల్, బాబా భాస్కర్, మిత్ర, శివ, అరియానా ఫినాలే వీక్‌లో అడుగుపెట్టారు. వీరిలో టైటిల్ ఎవరి సొంతం అవుతుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే అప్పుడే బిగ్‌బాస్ విన్నర్‌గా బిందుమాధవి నిలిచిందంటూ ప్రచారం జరుగుతోంది. అఖిల్‌ను వెనక్కు నెట్టి ఆడపులి బిందు టైటిల్ ఎగరేసుకుపోయిందంటూ #BinduTheSensation, #BinduMadhavi అన్న హ్యాష్‌ట్యాగ్‌లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. తెలుగు బిగ్‌బాస్ చరిత్రలోనే తొలిసారిగా ఒక అమ్మాయి గెలిచిందంటూ ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బిగ్‌బాస్ అంటే కేవలం ఫిజికల్ టాస్కులే కాదని వ్యక్తిత్వానికి కూడా సంబంధించిందన్న విషయాన్ని అభిజిత్ నిరూపించాడు. ఇప్పుడు బిందు తన విజయంతో మరోసారి చాటిచెప్పింది అని కామెంట్లు చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం.. బిందు విన్నర్‌గా, అఖిల్ సార్థక్ రన్నర్‌గా నిలిచినట్లు తెలుస్తోంది. మిత్ర శర్మ మూడో స్థానంలో ఉండగా యాంకర్ శివ నాలుగో స్థానంలో, అరియానా ఐదో స్థానంలో ఉన్నారట. ఇప్పటికే బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ఫినాలే షూట్ కావడంతో ఈ లీకులు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాలంటే నాగార్జున అధికారికంగా ప్రకటించేవరకు వేచి చూడాల్సిందే! చదవండి 👇 తప్పు చేస్తే రోడ్డు మీద నిలబెట్టి కొట్టండి, అంతేకానీ.. విడాకుల బాటలో బాలీవుడ్ దంపతులు! -
బిగ్‌బాస్ తెలుగు నాన్‌స్టాప్‌లో పాయల్ సపోర్ట్ ఎవరికో తెలుసా?
Bigg Boss Telugu OTT: బుల్లితెరపై ఎంతో ఆదరణ పొందిచి రియాలిటీ షో బిగ్‌బాస్. తెలుగులో ఇప్పటికే 5 సీజన్లు పూర్తి చేసుకున్న ఈషో ఓటీటీలోకి కూడా అడుగు పెట్టింది. తొలిసారి ఈ సో బిగ్‌బాస్ ఓటీటీ నాన్‌స్టాప్ పేరుతో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతుంది. ఓటీటీలో ప్రసారం అవుతున్న ఈ షోకి కూడా మంచి ప్రేక్షక ఆదరణ లభించింది. ప్రస్తుతం ఈ షో చివరి వారానికి చేరుకుంది. బిగ్‌బాస్ ఓటీటీ తొలి సీజన్ టైటిల్‌ను సొంతం చేసుకునేదెవరో తెలిసేందుకు ఇంకా కొద్ది రోజులే మిగిలి ఉన్నాయి. దీంతో హౌజ్‌లోని కంటెస్టెంట్స్ అంతా ఒకరికి ఒకరు గట్టి పోటీ ఇచ్చుకుంటున్నారు. చదవండి: Bigg Boss Non Stop: బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే, అసలైన పోటీ ఆ ఇద్దరి మధ్యే! ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో తన సపోర్ట్ ఎవరికో బయటపెట్టింది ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. ప్రస్తుతం బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌజ్‌లో బిందు మాధవి, అఖిల్, అరియానా, బాబా భాస్కర్ మాస్టర్, యాంకర్ శివ, మిత్రా శర్మ ఉన్నారు. ఇక శనివారం లోపు టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరూ అనేదానిపై క్లారిటీ కూడా వచ్చేస్తుంది. అయితే ఇదే సమయంలో బయట ఉన్న ఫ్యాన్స్ తమకు నచ్చిన కంటెస్టెంట్స్‌కు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. తాజాగా నటి పాయల్ రాజ్‌పుత్ కూడా సోషల్ మీడియా వేదికగా బిందు మాధవికి తన మద్దతు తెలిపింది. చదవండి: సర్కారు వారి పాట విజయంపై సూపర్ స్టార్ కృష్ణ స్పందన బిందు మాధవికి ఓటు వేసి గెలిపించాలని తన ఫాలోవర్స్‌ను కోరింది. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో బిందు ఫొటోను షేర్ చేస్తూ.. ‘నువ్వు టైటిల్ గెలవడానికి అర్హురాలివి’ అంటూ బిందుకు సపోర్ట్ చేసింది పాయల్. అయితే ఇప్పటివరకు బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో ఓ అమ్మాయి టైటిల్ గెలవలేదు. అయితే బిగ్ బాస్ నాన్ స్టాప్‌లో ట్రోఫీ గెలుచుకునే రేసులో ముందంజలో ఉంది బిందు మాధవి. తన ఆటతీరుతో పాటు బిందు మాధవికి సంబంధించిన ఎన్నో అంశాలు ప్రేక్షకులను ఫిదా చేసేస్తున్నాయి. అందుకే టాప్ 5లో బిందు ఉండాలని చాలామంది కోరుకుంటున్నారు. -
బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే.. టైటిల్ గెల్చుకునేదెవరో?
బిగ్‌బాస్ షో అంటే ఇష్టపడేవాళ్లే కాదు, ఇష్టపడనివాళ్లు కూడా ఉంటారు. బిగ్‌బాస్ కాన్సెప్ట్‌ను తిట్టిపోస్తూనే తీరా సమయానికి షో చూసి ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఎవరేమన్నా బుల్లితెర ఆడియన్స్ మాత్రం బిగ్‌బాస్ షోను విపరీతంగా ఆదరిస్తారు. తెలుగులో ఇప్పటివరకు ఐదు సీజన్లను ప్రేక్షకులు విజయవంతం చేశారు. ఈ ధైర్యంతో నిర్వాహకులు బిగ్‌బాస్ ఓటీటీని కూడా ముందుకు తీసుకువచ్చారు. కాకపోతే ఇది ఫ్యామిలీ అంతా చూడటానికి వీల్లేకుండా టీవీలోకి బదులుగా హాట్‌స్టార్ యాప్‌కు మాత్రమే పరిమితమైంది. అయినా సరే ఓటీటీలో ప్రయోగాత్మకంగా మొదలుపెట్టిన బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విజయవంతంగా చివరిదశకు చేరుకుంది. 17 మందితో మొదలైన ఈ షోలో మధ్యలో ఓ వైల్డ్‌కార్డ్ ఎంట్రీ కూడా చేరడంతో మొత్తం కంటెస్టెంట్ల సంఖ్య 18కి చేరుకుంది. ఇప్పటివరకు శ్రీరాపాక, చైతూ, సరయు, తేజస్వి, ముమైత్ ఖాన్, స్రవంతి, మహేశ్, అజయ్, హమీదా, అషూ, నటరాజ్ వరసగా ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌస్‌లో అరియానా, అనిల్, మిత్ర, శివ, బిందు మాధవి, అఖిల్, బాబా భాస్కర్ మిగిలారు. ఈ టాప్ 7లో నుంచి ఒకరు వారం మధ్యలోనే హౌస్‌ను వీడే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. దీంతో మిగిలిన ఆరుగురు ఫినాలేలో అడుగుపెడతారు. ఒకవేళ ఇదే నిజమైతే ఆరుగురు కంటెస్టెంట్లు ఫినాలేకు చేరుకోవడం ఇదే మొదటిసారవుతుంది. అయితే ఎప్పటిలా ఈసారి వార్ వన్‌సైడ్ అయిపోలేదు. అఖిల్ సార్థక్, బిందుమాధవి మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. ఎలాగైనా ఈసారి టైటిల్ గెలవాలని కసిగా ఆడిన అఖిల్‌కు అతడి అభిమానులు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. హౌస్‌మేట్స్‌ను ఓ కబడ్డీ ఆడుకున్న బిందుమాధవి ధైర్యానికి ముగ్ధులైపోయిన ఫ్యాన్స్ ఆమెను ఎలాగైనా గెలిపించాలని తాపత్రయపడుతున్నారు. ఈరోజుతో ఓటింగ్ ముగియనుండటంతో ఇరువురి ఫ్యాన్స్ వీలైనన్ని ఓట్లు గుద్దుతున్నారు. ఇక గురు, శుక్రవారాల్లో గ్రాండ్ ఫినాలే షూటింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది. మరి ఫినాలే ఎపిసోడ్ కూడా రెండు రోజులు ప్రసారం చేస్తారేమో చూడాలి! చదవండి: కరాటే కల్యాణితో దెబ్బలు తిన్న యూట్యూబర్‌కు బిగ్‌బాస్ 6 సీజన్లో ఆఫర్ -
బిగ్‌బాస్ ఓటీటీ: రవిపై ఫైర్ అయిన నటరాజ్ మాస్టర్?
Nataraj Master Bigg Boss Buzz Interview After Elimination: బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ చివరి దశకు చేరుకుంది. టైటిల్‌ను గెలిచేందుకు హౌజ్‌మేట్స్ గట్టిగా పోటీ పడుతున్నారు. ఇక గతవారం హౌస్మేట్స్ అందరూ నామినేషన్లో ఉన్నారు. బిందు, అఖిల్, బాబా బాస్కర్, నటరాజ్ మాస్టర్, ఆరియాన గ్లోరీ, మిత్ర, అనిల్, యాంకర్ శివ నామినేషన్‌ల్లో ఉండగా ఇందులో తక్కువ ఒట్స్ వచ్చిన నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యి హౌజ్న వీడాడు. ఎలిమినేషన్ అనంతరం నటరాజ్ మాస్టర్ బిగ్‌బాస్ బజ్ ఎపిసోడ్లో యాంకర్ రవితో ముచ్చటించాడు. ఇందుకు సంబంధించిన ప్రోమోను తాజాగా డిస్ని ప్లస్ హాట్‌స్టార్ రిలీజ్ చేసింది. చదవండి: చిక్కుల్లో కరాటే కల్యాణి, చిన్నారి దత్తతపై నోటీసులు ఇక వచ్చి రాగానే ‘నా రాక కోసం ఎదురు చూస్తున్నావా?’ అని రవికి కౌంటర్ ఇచ్చాడు మాస్టర్. తాను ఒక్కడినే అనుకుంటే మీ తప్పు అంటూ రవి రీకౌంటర్ ఇచ్చాడు. అనంతరం ఒకరి వల్ల మధ్యలోనే ఇంటి నుంచి బయటకు వచ్చాననడంతో అంతా నెగిటివి ఎందుకు మాస్టర్ అని రవి అంటాడు. ఆ తర్వాత చెన్నై.. తమిళ్.. చేసుకుని వెళ్లిపోతారు అనే నటరాజ్ వ్యాఖ్యలను రవి తప్పబట్టినట్లు కనిపించాడు. దీనికి మాస్టర్ దానికి కూడా క్లారిటీ ఇస్తా అంటాడు. ఆ తర్వాత మాస్టర్ తనకు ఒక సక్సెస్ అనేది రాలేదడంతో.. టాలెంట్‌కి బౌండరీస్ లేవు అంటాడు రవి. అనంతరం ‘నువ్వు ఏదో లోపల పెట్టుకుని ఒక పాయింట్స్ రాసుకుని నా మీద అటాక్ చేస్తున్నావ్ ప్రతి పాయింట్ అర్థమవుతుంది’ అని రవిపై ఫైర్ అయ్యాడు మాస్టర్. ఇలా ఇద్దరి మధ్య సంభాషణ కాస్తా ఘాటూగానే సాగింది. ఆ తర్వాత ఇంత క్రుయల్గా ఏ అమ్మాయిని చూడలేదని, ఆమె తీసే పాయింట్స్ అంటూ నటరాజ్ మాస్టర్ అంటుండగా ఈ రోజు బిందు పాయింట్స్ తీసింది కాబట్టే తనకు.. ఆడియాన్స్‌కి బిందు లోపట ఉండాలని ఓట్ వేశారు అంటాడు రవి. ఆ వెంటనే శకుని అనే ఓ నెగిటివ్ క్యారెక్టర్ ఒక అమ్మాయికి పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని అడగ్గా.. ఆడించేది ఎవరు మహా భారతంలో శకుని.. బిగ్‌బాస్‌లో ఆ ఇద్దరి ఆడిస్తున్నావంటే నువ్వు శకునే కదా అని సమాధానం ఇస్తాడు మాస్టర్. చదవండి: త్వరలో పెళ్లి.. అంతలోనే బ్యాడ్‌న్యూస్ చెప్పిన పాప్ సింగర్ ఇక ఆరియానకు ఇంటి డబ్బులు వచ్చాయి ఇంటికి పంపించేయండనం ఏంటని అన్నదానికి.. బిడ్డ మీద ఒట్టు వేయమంటే గేమ్ అయిన వదిలేస్తాను కానీ ఒట్టు వేయను అంటాడు నటరాజ్ మాస్టర్. ఇక నువ్వు బాగానే ప్రిపేర్ అయ్యిన్నావ్ అర్థమైందంటూ రవిపై మాస్టర్ సటైరికల్ కామెంట్స్ చేస్తాడు. దీనికి రవి తాను చాలా బెటర్‌గా మాట్లాడుతున్నానని, బయటకు వెళ్లి చూస్తే మీరు చాలా బాధపడతారని సమాధానం ఇవ్వడం ఆసక్తి నెలకొంది. ఈ ఇంటర్య్వూలో రవి నటరాజ్ మాస్టర్రను ఎలాంటి ప్రశ్నలతో ఇబ్బంది పెట్టాడు.. నటరాజ్ మాస్టర్ ఎందుకు ఇంత అసహనానికి లోనయ్యాడనేది తెలియాంటే ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే. -
కరాటే కల్యాణితో పెట్టుకున్నాడు, బిగ్‌బాస్ ఛాన్స్ పట్టేశాడు!
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ముగింపుకు వచ్చేసింది. అఖిల్ సార్థక్, బిందు మాధవిలలో ఎవరు ఒకరు టైటిల్ ఎగరేసుకుపోనున్నారు. టాప్ 5కి చేరుకునేవారిలో నుంచి కొందరిని బిగ్‌బాస్ ఆరో సీజన్‌కు సైతం తీసుకోనున్నారు. ఆ జాబితాలో జనాలను ఎంటర్టైన్ చేసే యాంకర్ శివ తప్పకుండా ఉండే అవకాశముంది. అలాగే ఆరో సీజన్ కోసం ఇప్పటినుంచే కంటెస్టెంట్ల ఎంపిక మొదలైంది. బిగ్‌బాస్ టీమ్ రోషన్, మంజూష అనే మరో ఇద్దరు యాంకర్లను సైతం సంప్రదించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా ఓ యూట్యూబర్ బిగ్‌బాస్‌లోకి వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రాంక్ వీడియోలతో పాపులర్ అయిన శ్రీకాంత్ రెడ్డి బిగ్‌బాస్ ఆరో సీజన్లో పాల్గొనే అవకాశాలున్నట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి. మరి ఇదెంతవరకు నిజం? ఒకవేళ పిలుపు వస్తే నిజంగానే బిగ్‌బాస్ హౌస్‌కి వెళ్తాడా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. కాగా బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ కరాటే కల్యాణితో గొడవతో కొద్దిరోజులుగా అతడు వార్తల్లో నిలుస్తున్నాడు. ప్రాంక్ వీడియోల పేరుతో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ యువతను చెడుదోవ పట్టిస్తున్నాడని కరాటే కల్యాణి శ్రీకాంత్ రెడ్డి ఇంటివద్దకు వెళ్లి అతడిని చితకబాదింది. దీంతో అతడు కూడా కల్యాణిపై చేయిచేసుకున్నాడు. పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడంతో ఇరువురిపై కేసులు నమోదవగా పోలీసులు విచారణ చేపట్టారు. చదవండి: కరాటే కల్యాణి ఎక్కడికి వెళ్లింది..? ఎప్పుడు వస్తుంది..? హీరోయిన్ సీమంతం ఫంక్షన్, ఫొటోలు వైరల్ -
మిత్రా శర్మను మెచ్చుకున్న జీవిత, రాజశేఖర్..
Bigg Boss Non Stop Telugu OTT: Mithra Sharma Will Top 5 Contestants: బిగ్‌బాస్ నాన్‌స్టాప్ రియాలిటీ షో మరింత రసవత్తరంగా మారనుంది. హౌజ్ కంటెస్టెంట్స్ అందరూ టాప్ 5లో చేరండంపైనే దృష్టి పెట్టారు. ఇంటి సభ్యుల్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకున్న వాళ్లలో మిత్రా శర్మ ఒకరు. సాధారణంగా కంటెస్టెంట్‌గా చేరిన మిత్రా శర్మ ఇంటి సభ్యులకు మంచి పోటీ ఇస్తుంది. గత 70 రోజులకుపైగా జరిగిన రియాలిటీ షోలో రకరకాల టాస్కుల్లో పార్టిస్పేట్ చేస్తూ పర్వాలేదనిపించింది. ప్రత్యర్థుల ఆరోపణలకు సరైనా సమాధానాలు చెబుతూ స్ట్రాంగ్ కంటెస్టెంట్లో ఒకరిగా మారింది. అంతేకాకుండా ఇటీవల ఇంటిలోకి అతిథులుగా వచ్చిన సినీ తారలు, సెలబ్రిటీల ప్రశంసలు కూడా అందుకుంది. శేఖర్ సినిమా ప్రమోషన్స్ కోసం హీరో రాజశేఖర్, ఆయన సతీమణి, దర్శకురాలు జీవిత బిగ్‌బాస్ ఇంటిలోకి అడుగుపెట్టారు. అయితే కంటెస్టెంట్లకు రకరకాల టాస్క్‌లు ఇస్తూ.. వారిలోని ప్రతిభను వెలికి తీసే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ.. ఒక యాక్టింగ్ స్కూల్లో సీటు వస్తే ఎలా స్పందిస్తారు.. సీటు రాకపోతే ఎలా ఫీలవుతారు అనే థీమ్ ఆధారంగా నటించి చూపమన్నారు. దీంతో తనదైన శైలిలో రకరకాల భావాలు పలికిస్తూ నటించి చూపించింది మిత్రా శర్మ. ఓ దశలో భావోద్వేగంతో మిత్రా శర్మ నటించి చూపించిన తీరు చూసి జీవిత, రాజశేఖర్ మాత్రమే కాకుండా ఇంటి సభ్యులు కూడా ఎమోషనల్ అయ్యారు. అనంతరం మిత్రా శర్మను జీవిత, రాజశేఖర్ అభినందిస్తూ.. ఆమె నటనపై ప్రశంసలు కురిపించారు. ఇక ఆదివారం రోజున టాప్ 5 కంటెస్టెంట్లు ఎవరో తేలిపోనుంది. వారాంతంలో హోస్ట్ నాగార్జున వచ్చి తుదివారానికి, టైటిల్ రేసుకు పోటీపడే అభ్యర్థులను నిర్ణయిస్తారు. ఇలాంటి నేపథ్యంలో మిత్రా శర్మ టాప్ 5లో చోటు సంపాదించడానికి అన్ని అర్హతలను సాధించినట్లుగా తెలుస్తోంది. మరీ ఈ ఆదివారం ఏమవుతుందో వేచి చూడాలి. -
నటరాజ్ మాస్టర్‌కు కోలుకోలేని దెబ్బ, ఈ వారం అతడే ఎలిమినేట్!
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షోలో మరో ఎలిమినేషన్ జరగబోతోంది. 17 మందితో ప్రారంభమైన ఈ షోలో ఇప్పటివరకు 10 మంది ఎలిమినేట్ అయ్యారు. శ్రీరాపాక, చైతూ, సరయు, తేజస్వి, ముమైత్ ఖాన్, స్రవంతి, మహేశ్, అజయ్, హమీదా, అషూ వరుసగా ఎలిమినేట్ అయ్యారు. అయితే షో సగం దాకా వచ్చాక బాబా భాస్కర్ వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈమధ్య ఇచ్చిన టాస్క్‌లో ఎవిక్షన్ ఫ్రీ పాస్ కూడా గెలుచుకోవడంతో అతడు ఫినాలేలో అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఈ వారం హౌస్మేట్స్ అందరూ నామినేషన్లో ఉన్నారు. ఎప్పటిలాగే అఖిల్, బిందుకు పోటాపోటీగా ఓట్లు పడుతుండటంతో వీరు సేఫ్ జోన్లో ఉన్నారు. ఆ తర్వాత బాబా, శివకు సైతం భారీగానే ఓట్లు పడుతున్నాయి, కాబట్టి ఈ వారం వీళ్లు బయటకు వెళ్లే ప్రసక్తే లేదు. ఒకవేళ బాబా డేంజర్ జోన్లో ఉన్నా ఎవిక్షన్ ఫ్రీ పాస్ సాయంతో ఈజీగా గండం గట్టెక్కుతాడు. మిత్ర, అరియానా, అనిల్‌కు అంతంతమాత్రంగానే ఓట్లు వస్తున్నాయి. నటరాజ్ మాస్టర్‌కు అందరికంటే తక్కువ ఓట్లు పడ్డట్లు తెలుస్తోంది. దీంతో ఈ వారం నటరాజ్ మాస్టర్ ఇంటినుంచి బయటకు వెళ్లనున్నట్లు సమాచారం. మొదటి నుంచీ కష్టపడి ఆడుతూ వస్తున్న నటరాజ్ మాస్టర్ ఈ సీజన్లో ఫినాలేలో అడుగుపెట్టడం ఖాయం అనుకున్నారంతా! కానీ అనూహ్యంగా నామినేషన్స్‌లో బిందుతో, టాస్క్‌లో అఖిల్‌తో పెట్టుకుని నెగెటివిటీ మూటగట్టుకున్నాడు. ఫలితంగా అతడు పదకొండో వారంలోనే బిగ్‌బాస్ హౌస్‌కు వీడ్కోలు పలకబోతున్నాడు. చదవండి: ముగ్గురు ఖైదీలు తప్పించుకునేందుకు వేసిన ప్లాన్ -
నన్ను ఎక్కడ కొట్టకూడదో అక్కడ కొట్టావు, దేవుడున్నాడు
ఎంత కష్టపడ్డా ఫలితం రాకపోతే ఎవరికైనా ఆవేశం రాకమానదు. అందులోనూ బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షోలో మొదటి నుంచీ ఒంటరిగా పోరాడుతూ వస్తున్నాడు నటరాజ్ మాస్టర్. అవసరమైనప్పుడు తన ఫ్రెండ్స్‌కు సాయం కూడా చేశాడు. కానీ నిన్నటి టాస్క్‌లో మాత్రం తనకు బదులుగా అఖిల్ వేరొకరికి సాయం చేసి అతడిని గెలిపించడాన్ని తట్టుకోలేకపోయాడు. గెలుపు తథ్యం అనుకున్న సమయంలో ఓటమిపాలు కావడంతో భరించలేకపోయాడు. బాధపడ్డాడు, ఏడ్చేశాడు, ఆగ్రహించాడు. తాజాగా బిగ్‌బాస్ ఇచ్చిన బీబీ ఆవుల కొట్టం టాస్క్‌లో అఖిల్, నటరాజ్ మధ్య ఫైట్ జరిగింది. గేమ్‌లో నటరాజ్ తన చేయిని నెట్టేస్తుండటంతో అఖిల్ తన పాలన్నీ ఒలకబోసాడు. నీకు అత్యాశ ఎక్కువని ఫైర్ అయ్యాడు. దీనికి నటరాజ్ స్పందిస్తూ.. నన్ను ఎక్కడైతే కొట్టకూడదో అక్కడ కొట్టేశావు, దేవుడున్నాడు, నా కష్టానికి ఫలితం దక్కింది అని మాట్లాడాడు. నటరాజ్ మాటలను బట్టి అతడు ప్రేక్షకులను ఓట్లు అడిగే అవకాశాన్ని గెల్చినట్లు తెలుస్తోంది. మరి అఖిల్, నటరాజ్ మధ్య మాటల యుద్ధం ఎంతవరకు వెళ్లింది? వీళ్లు తిరిగి కలిసిపోయారా? లేదా? అన్నది తెలియాలంటే నేడు రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: ఆచార్య నుంచి ‘భలే భలే బంజారా’ ఫుల్ సాంగ్ అవుట్ సిరిని అర్థం చేసుకోవడం చాలా కష్టం: శ్రీహాన్ -
అఖిల్‌ని టార్గెట్ చేయడమేనా నీ గేమా? బిందుకు అనసూయ సూటి ప్రశ్న
వరుస గెస్టులతో బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షో జిగేలుమంటోంది. మొన్నటిదాకా బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ కంటెస్టెంట్లు హౌస్‌లోకి వచ్చి సందడి చేయగా ఆ తర్వాత అశోకవనంలో అర్జున కల్యాణం టీమ్ హౌస్‌ను ఓ ఊపు ఊపేసింది. తాజాగా ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ బిగ్‌బాస్ హౌస్‌లో అడుగు పెట్టింది. అయితే నవ్వడానికి, నవ్వించడానికో ఆమె రాలేదు. ప్రేక్షకుల మనసులో మెదులుతున్న ప్రశ్నలను తూటాల్లా వదిలేందుకు వచ్చింది. ఈ సందర్భంగా మొదట అరియానాకు ఆడియన్స్ రాసిన ప్రశ్నను వదిలింది. 'ఫ్యామిలీ వీక్ తర్వాత బిందుకు క్లోజ్ అయ్యావు. ఎందుకు వుమెన్ కార్డు వాడుతున్నావు? సడన్‌గా ఎందుకిలా మారిపోయావు?' అని ప్రశ్నించింది. దీంతో అరియానా ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక ఇందులో ఉమెన్ కార్డు అనిపించిందంటే అది మీకే వదిలేస్తున్నా అని బదులిచ్చింది. అనంతరం బిందును.. ఎప్పుడూ గ్రూప్ గేమ్స్ ఆడుతావు. కానీ అఖిల్ గ్రూప్ గేమ్స్ ఆడతాడని నిందిస్తావు. ఎందుకు? అని అడిగింది. అయితే బిందు మాత్రం ఎప్పుడూ గ్రూప్ గేమ్ ఆడలేదని కుండ బద్ధలు కొట్టింది. ఆ తర్వాత అఖిల్ వైపు తిరిగి.. వెకేషన్‌ను ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? గత వారం రోజులుగా బిందు గురించి నెగెటివ్‌గా మాట్లాడమే పనైపోయింది. కానీ ఫ్యామిలీ వీక్ తర్వాత బిందుతో మంచిగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నావు, ఎందుకు? అని అడిగింది. మరి దీనికి అఖిల్ ఏమని సమాధానం చెప్తాడో చూడాలి! ఆ తర్వాత శివ వైపు చూసి 'ఎలా అనిపిస్తోంది? అడిగే దగ్గర నుంచి అడిగించుకునే దాకా?' అని సరదాగా అనడంతో అక్కడున్నవారంతా ఘొల్లున నవ్వారు. చదవండి: ముంబైలో కళ్లు చెదిరే ఫ్లాట్ కొన్న బుల్లితెర నటుడు నరకం చూపించారు, బర్త్‌డే రోజే నా కూతుర్ని చంపేశారు: మోడల్ తల్లి -
ఆల్రెడీ సగం చచ్చిపోయాను: నటరాజ్ కంటతడి
బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో గుంపులుగా గేమ్ ఆడకుండా సొంతంగా ఆటాడుతూ ఇక్కడిదాకా వచ్చాడు నటరాజ్ మాస్టర్. కానీ కొన్నిసార్లు ఆటలో గెలవాలంటే పక్కవారి సాయం కూడా తప్పనిసరి. లేదంటే గెలుపు తలుపు తడుతున్నామనుకునేలోపే ఓటమి వచ్చి నెత్తిమీద కూర్చుంటుంది. ఇప్పుడు నటరాజ్ పరిస్థితి అలాగే ఉంది. ప్రేక్షకులను ఓట్లు అడిగే అవకాశాన్ని పొందేందుకు హౌస్‌మేట్స్‌కు ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ టాస్క్‌లో పై నుంచి పడే పూలను ఏరుకుని వారికి ఇచ్చిన తొట్టిలో పెట్టుకోవాలి. మొదటి రౌండ్లో నటరాజ్ మాస్టర్ దగ్గర ఎక్కువ పూలున్నాయి. దీంతో వెంటనే మిగతా హౌస్మేట్స్ ఏకమై నట్టూను ఓడించారు. తక్కువ పూలున్న అనిల్‌కు సాయం చేయాలనుకున్నారు. అనుకున్నదే తడవు శివ, అఖిల్ తమ దగ్గరున్న పూలను అనిల్‌కు అప్పగించడంతో అతడే గెలుపొందాడు. దీంతో నటరాజ్ కంటతడి పెట్టుకున్నాడు. అఖిల్ నాలుగోసారి మోసం చేశాడంటూ ఎమోషనల్ అయ్యాడు. ఆకాశం వంక చూస్తూ.. 'ఎవరూ సాయం చేయరు. కనీసం ఆడేసి ఓట్లు అడుక్కుందామనుకునే భాగ్యం కూడా లేదు. ఆ అవకాశం కూడా లాక్కున్నావు. సగం చచ్చిపోయి ఉన్నా..' అంటూ ఏడ్చేశాడు. మరోవైపు ఈరోజు హౌస్‌లోకి జీవిత, రాజశేఖర్, అనూప్ రూబెన్స్ వచ్చి సందడి చేశారు. మరి ఆ సందడి, మాస్టర్ గుండెల్లో రేగిన అలజడి చూడాలంటే నేడు రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: నా ఫ్రెండ్స్ నన్ను ద్వేషించేవారు, ఎన్నో కష్టాలు అనుభవించాను -
నటరాజ్ మాస్టర్‌తో ఫైటింగ్, ఉమ్మేసిన బిందు, నెట్టింట రచ్చరచ్చ
సాధారణంగా నామినేషన్స్ ప్రక్రియను బిగ్‌బాస్ ప్రేమికులు ఎంజాయ్ చేస్తారు. కానీ రెండు రోజులుగా సాగిన నామినేషన్స్‌తో ప్రేక్షకుల తల బొప్పి కట్టింది. కొట్టుకోవడం ఒక్కటే తక్కువగా అన్నట్లుగా పోట్లాడుకున్నారు హౌస్మేట్స్. ఆటలో రఫ్ఫాడించే నటరాజ్ మాస్టర్ నామినేషన్స్‌లోనూ జూలు వదిలిన సింహంలా పోరాడాడు. తనకు టాప్ 5లో ఉండే అర్హత లేదు అన్నందుకు బిందుమాధవిపై నిప్పులు చెరిగాడు. బయట పీఆర్ టీంలు పెట్టుకుని హౌస్‌లో కొనసాగుతోందని ఆరోపించాడు. ఈ క్రమంలో నటరాజ్ మాస్టర్ ముందు నిలబడిన బిందు అతడిని చూస్తూ ఉమ్మేసింది. ఆమె ప్రవర్తనకు అక్కడున్నవారంతా షాకయ్యారు. అటు సోషల్ మీడియాలోనూ నట్టూ ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఆడపులి అని పిలిపించుకోవచ్చు గానీ దానికి సమర్థత కూడా ఉండాలని చెప్తున్నారు. కనీసం అతడి వయసుకైనా గౌరవం ఇచ్చి ఉండాల్సిందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయినా స్ట్రాంగ్‌గా ఆడే నటరాజ్ మాస్టర్ ఎక్కడ? ఏమీ ఆడకుండా కూర్చునే బిందు ఎక్కడ? అని విమర్శిస్తున్నారు. కిల్లర్ టాస్క్ దగ్గర నుంచి ప్రతీ టాస్క్‌లోనూ నటరాజ్ చెడుగుడు ఆడేస్తూ అందరి మనసులు గెలుచుకున్నాడని, కానీ బిందు ఎక్కడ గేమ్ ఆడిందో కనిపించడం లేదని సెటైర్లు వేస్తున్నారు. ఆమె పీఆర్ టీం బిందుమాధవికి ఆడపులి అన్న ట్యాగ్ ఇచ్చిందని, ఇతర కంటెస్టెంట్లు ఆమెను ఏమన్నా సరే వారిపై బూతులతో రెచ్చిపోతూ కామెంట్లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమెను గెలిపించుకోవడానికి పీఆర్ టీం అహర్నిశలు కష్టపడుతోందని, అటు బిగ్‌బాస్ కూడా ఈసారి లేడీ విన్నర్‌కే కిరీటం పెట్టాలని ముందే ఫిక్స్ అయిపోయినట్లు కనిపిస్తోందని కామెంట్లు చేస్తున్నారు. అటు బిందు ఫ్యాన్స్ ఈ విమర్శలను తిప్పికొడుతున్నారు. ముందు నటరాజ్ మాస్టర్‌కు అమ్మాయిలను గౌరవించడం నేర్పించండని కౌంటర్ ఇస్తున్నారు. బిందు ఉమ్మేసినందుకే తప్పంటున్నారు, మరి అతడు బాబా భాస్కర్ ముందు కాండ్రించి ఉమ్మేశాడు. అప్పుడు మీకు రోషం పొడుచుకురాలేదా? అని తిట్టిపోస్తున్నారు. మొత్తానికి ఈ ఫ్యాన్స్ వార్తో సోషల్ మీడియాలో #BiggBossNonStop, #BinduMadhavi హ్యాష్‌ట్యాగ్ తెగ ట్రెండ్ అవుతున్నాయి. Tamil bigg boss antene istam anta... kamal hassan norella bettaru.. ee ammayi enti mother tongue ki value ivvatledu ani.. So nat master correct ganey guess chesaru.. cup kosamey telugollu kavali..aa tarvatha vadilestundi ani🔥 #BiggBossNonStop #BiggBossNonStopTelugu pic.twitter.com/98QOVa2UZv — BiggBossTeluguSpy (@bbteluguspy) May 11, 2022 One Contestant Vs All Other Contestants & BB Management & PR &Paid mafia & Trolls,Abuses,Harassment But Fighting like a warrior One &Only @thebindumadhavi#BinduMadhavi🐯 #BiggBossNonStop VOTE FOR BINDU MADHAVI pic.twitter.com/GvqJrvSG01 — Shareef (@UrsShareef) May 11, 2022 #BiggBossNonStop No Drama No Safe game No Fakeness No sympathy drama Only Genuine Honest Fearless in debate. Lady tigress #BinduMadhavi. VOTE FOR BINDU MADHAVI. Go to DISNEY PLUS HOTSTAR. Search BIGBOSS NONSTOP Select VOTE Click BINDU MADHAVI Give 10 VOTES. pic.twitter.com/Fm4vuqNKUk — N Harsha (@harshanamburi) May 11, 2022 #BiggBossNonStop For me this is her best It needs lots of guts and strength Becoz of this treatment, yesterday Mithraw behaved 80% normal and ariyana and Siva ripped her with point to point.#BinduMadhavi is a Brand now pic.twitter.com/GnVmup0Tsj — Vijay (@Vijay2itz) May 11, 2022 I am from Chennai, I support Baba Master.I don't support people who spit when others are speaking and people who are arrogant. All Tamilians support #BabaMaster Thanks #NatrajMaster for exposing #BinduMadhavi and asking us to vote for genuine people like Baba. #BiggBossNonStop https://t.co/a5caXnzjHM — AYUSH (@ayush45MM) May 11, 2022 చదవండి: నా విషయం పక్కనపెట్టు, నీ ముఖం సంగతేంటి?: ట్రోలింగ్‌కు నటి కౌంటర్ పరాశక్తిలా బిందు మాధవి ఫోజు.. శూర్పణఖ ఆడియెన్స్ నీ ముక్కు కోస్తారు -
పరాశక్తిలా బిందు మాధవి ఫోజు.. శూర్పణఖ ఆడియెన్స్ నీ ముక్కు కోస్తారు
Bigg Boss Non Stop Telugu Bindu Madhavi Vs Nataraj Master Fight: బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షో రసవత్తరంగా మారింది. మరికొన్ని రోజుల్లో గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ తరుణంలో ఫైనల్‌కు చేరుకునేది ఎవరా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ప్రస్తుతం బిగ్‌బాస్ హౌజ్‌లో అరియానా, బిందు మాధవి, నటరాజ్ మాస్టర్, మిత్ర, యాంకర్ శివ, అఖిల్, అనిల్, బాబా మాస్టర్ ఉన్నారు. అయితే పదకొండో వారం నామినేషన్స్‌లో భాగంగా బిగ్‌బాస్ ఏ ముగ్గురు ఫినాలేకు చేరుకోవడానికి అర్హులు కారో చెప్పాలని హౌస్‌మేట్స్‌ను ఆదేశించిన విషయం తెలిసిందే. తర్వాత 72వ రోజు ఈ టాస్క్‌ను కొనసాగించమని సూచించాడు. ఈ క్రమంలో అరియానా, బిందు మాధవి, బాబా మాస్టర్ అర్హులు కానివారిగా నటరాజ్ ఎంపిక చేశాడు. దీనికి సంబంధించిన ప్రొమోను మంగళవారం (మే 10) విడుదల చేశారు. ఈ ఎంపికలో బిందు మాధవిపై విరుచుకుపడ్డాడు నటరాజ్ మాస్టర్. 'నెగెటివిటీ మాత్రమే కంప్లీట్‌గా ఉన్న ఏకైక పర్సన్ నువ్ మాత్రమే' అని నటరాజ్ అనగా, 'నీ సైడ్ ఏమొచ్చింది ఇన్ని రోజులు పాజిటివిటీనా' అని తిరిగి క్వశ్చన్ చేస్తుంది బిందు మాధవి. 'నీ బెస్ట్ గేమ్ ఏంటి' అని నటరాజ్ అడిగిన ప్రశ్నకు 'ఐయామ్ ది మోస్ట్ స్ట్రాంగెస్ట్ పర్సన్ ఇన్ దిస్ హౌజ్' అని బిందు గట్టిగానే చెబుతుంది. తర్వాత ఇద్దరిమధ్య మాటలు పెరిగి నీ బండారం బయట పెడుతున్న కెమెరా వైపు చూసి అని నటరాజ్ చెబుతాడు. దీనికి బిందు మాధవి పరాశక్తిలా అవతారంలా ఫోజు ఇస్తుంది. దీనికి 'శూర్పణఖ నీ టైమ్ ఆసన్నమైంది ఇదిగో లక్ష్మణ బాణం. ఆడియెన్స్ నీ ముక్కు కోస్తారు.. పక్కా' అంటూ బాణం విసిరినట్టుగా ఫోజు ఇస్తాడు నటరాజ్ మాస్టర్. అలాగే అఖిల్-శివ, అఖిల్-బిందు మాధవి, నటరాజ్-బాబా మాస్టర్ మధ్య మాటల రచ్చను కూడా ఈ ప్రొమోను చూపించారు. చదవండి: పిచ్చి ముదిరింది, శూర్పణఖ అంటూ రెచ్చిపోయిన నటరాజ్ -
'బిందుమాధవికి పిచ్చి ముదిరింది', 'అఖిల్‌కు మైండ్ లేదు'
బిగ్‌బాస్ కథ క్లైమాక్స్‌కు చేరుకుంటోంది. మరో రెండు వారాల్లో బిగ్‌బాస్ నాన్‌స్టాప్ గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ క్రమంలో ఎవరు ఫైనల్‌కు చేరుకుంటారన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం హౌస్‌లో అరియానా, నటరాజ్ మాస్టర్, అనిల్, మిత్ర, యాంకర్ శివ, బిందు మాధవి, అఖిల్, బాబా భాస్కర్ ఉన్నారు. వీరిలో అఖిల్, బిందుమాధవి, యాంకర్ శివ, బాబా భాస్కర్, నటరాజ్ మాస్టర్ ఫినాలేలో చోటు దక్కించుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఈసారి టాప్ 5కి బదులుగా టాప్ 6 ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే ఆ ఐదుగురితో పాటు మిత్ర, అరియానాలలో ఒకరికి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే బిగ్‌బాస్ కథ చివరికి చేరుకుంటున్నా నామినేషన్స్‌లో మాత్రం ఫైర్ తగ్గడం లేదు. తాజాగా పదకొండో వారం నామినేషన్స్‌లో భాగంగా బిగ్‌బాస్ ఏ ముగ్గురు ఫినాలేకు చేరుకోవడానికి అర్హులు కారో చెప్పాలని హౌస్‌మేట్స్‌ను ఆదేశించాడు. దీంతో బిందుమాధవి ఊహించినట్లుగానే మిత్ర, అఖిల్, నటరాజ్‌లు ఫినాలేకు అనర్హులని చెప్పింది. నేనొకటి మాట్లాడుతుంటే అన్సింక్లో నువ్వొకటి మాట్లాడుతుంటవ్ అని అఖిల్ అనగా.. 'నీకు బ్రెయిన్ లేదు కదా, ఉంటే ఏం మాట్లాడుతున్నానో అర్థమయ్యేది అని ఫైర్ అయింది. ఎమోషన్స్ వాడుకుంటూనే ఎమోషన్స్ వాడనంటుంది, వాహ్.'. అని అఖిల్ బిందుపై సెటైర్ వేశాడు. అటు నటరాజ్.. నీ వల్ల మీ నాన్న ఫెయిల్ అయ్యాడు. ఈమెకు జ్ఞానాన్ని నేర్పండి. తెలుగమ్మాయికి ఉన్న ఒక్క లక్షణం కూడా నీకు లేదు అంటూ బిందు తండ్రికి రిక్వెస్ట్ చేశాడు. నిద్రపోయిన సింహాన్ని లేపావు అంటూ నటరాజ్ మాస్టర్ ఉడికిపోయాడు. 'పిచ్చి ముదిరిపోయింది, నీకు పిచ్చి, నీ పిచ్చి మొత్తం బయటకు తీస్తా, ఒక్కసారి కూడా గేమ్ ఆడలేదు, పనికిరాని పిల్లి' అని బిందును తిడుతూ రెచ్చిపోయాడు. మరి ఇంతకీ ఈ నామినేషన్స్‌లో ఎవరెవరున్నారో తెలియాలంటే రాత్రి 9 గంటల వరకు వేచి చూడాల్సిందే! చదవండి: అశును వరస్ట్ అన్న రవి, కోపంతో ఆమె ఏం చేసిందంటే? 'బిగ్ డే, నా కల నెరవేరబోతోంది' డైమండ్ రింగ్‌తో హీరోయిన్ -
అశును వరస్ట్ కంటెస్టెంట్ అన్న రవి, షో మధ్యలో నుంచి వెళ్లిపోయిన నటి
బిగ్‌బాస్ షో చివరకు చేరుకుంటోంది. ఫ్యామిలీ ఎపిసోడ్లో ఎమోషన్స్‌తో నిండిన బిగ్‌బాస్ హౌజ్ గతవారం మాజీ కంటెస్టెంట్స్ సడెన్ విజిట్‌తో సందడిగా మారింది. నిన్నటి వీకెండ్ ఎపిసోడ్లో అశు రెడ్డి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఎలిమినేషన్ అనంతరం ఆ కంటెస్టెంట్ మనసులో మాటలను బయట పెట్టించే బిగ్‌బాస్ బజ్ ఎపిసోడ్లో అశు పాల్గొంది. ఈ సందర్భంగా రవి అశును ఇబ్బంది పెట్టేలా ప్రశ్నలు అడిగినట్టు తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో చూస్తుంటే తెలుస్తోంది. ఎలిమినేషన్ అనంతరం బిగ్‌బాస్ బజ్ కార్యక్రమంలో పాల్గొన్న అశును వచ్చి రాగానే సైటర్తో ఏడిపించాడు రవి. ఎలిమినేట్ అయినందుకు బాధగా ఉన్నా.. తనకు కంగ్రాట్స్ చెప్పాలని ఉందంటాడు. దానికి అశు ఎందుకని ప్రశ్నించగా.. ఎప్పుడో బయటకు రావాల్సిన నువ్వు ఇప్పుడోచ్చావ్, గుడ్ జర్నీ అని ఆటపట్టించాడు. ఆ తర్వాత ‘నీ గేమ్ చూస్తే.. వరస్ట్ కెప్టెన్, వరస్ట్ హౌజ్‌మేట్, వరస్ట్ సంచాలక్, వరస్ట్ బిహెవీయర్ అన్ని వరస్ట్ వరస్ట్ కంప్టీట్‌గా నీకే వచ్చింది’ అంటాడు. దీనికి ఆమె మనమే కాదు మనకంటే వేదవలు ఉన్నారంటుంది. దీంతో ‘నీన్ను నువ్వు వేదవ అనుకోవడం. నాకా అర్హత లేదు అనుకోవడం ఎంతవరకు కరెక్ట్’ అంటాడు. కొంతమందిని నామినేట్ చేయాలంటే ఆశు భయపడిందా? అని, హౌజ్‌లో ఒక్కరిదగ్గర అవసరానికి మించి అలిగావు.. వారి మీద ఏమైన స్పెషల్ ఇంట్రెస్టా? అని ప్రశ్నించాడు రవి. ఆ తర్వాత అఖిల్ ఫొటో చూపించగా.. నామినేట్ చేస్తాను అంటూ అతడి ఫొటో తీసుకుని విరగ్గోడుతుంది. ఆ తర్వాత రవి.. ఓక సంఘటన తర్వాత గేమ్‌లో చాలా లో అయిపోయావని, మీరు ఒకే అంటే దానిపై మాట్లాడుదామనుకుంటున్నా అంటాడు. అయితే అశు దానికి సమాధానం ఇచ్చేందుకు రెడీగా లేనని అంటుంది. అయితే ఇది హౌజ్‌లో జరిగింది కాబట్టి దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నామనగానే అశు ఇంటర్య్వూ మధ్యలో నుంచి వెళ్లిపోవడం కోసమెరుపు. ఇలా శాంతం ఆసక్తిగా సాగినా బిగ్‌బాస్ నాన్-స్టాప్ బజ్‌లో ప్రోమో ఆసక్తి నెలకొంది. మరి రవి అడిగిన ఈ ప్రశ్నలపై అశు ఎలా స్పందించిందో తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే. -
బాబా భాస్కరా? మజాకా? నేరుగా ఫినాలేలోకి!
బిగ్‌బాస్ షోను రక్తికట్టించేవి నామినేషన్స్, ఎలిమినేషన్సే! అయితే కొన్నిసార్లు ఎలిమినేషన్ కూడా కంటెస్టెంట్ల చేతిలోనే ఉంటుంది. అందుకు నేటి ఎపిసోడ్‌ను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎనిమిదో వారంలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన బాబా భాస్కర్ హౌస్మేట్స్ అందరినీ వెనక్కు నెట్టుతూ ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలిచాడు. దీన్ని డేంజర్ జోన్లో ఉన్న అరియానా, అషూలలో ఎవరికోసమైనా వాడొచ్చని నాగ్ చెప్పాడు. ఈ మేరకు ప్రోమో కూడా రిలీజైంది. అంటే ఈ ఇద్దరిలో ఒకరు వెళ్లిపోవాలా? వద్దా? అన్నది బాబా భాస్కర్ చేతిలో ఉంది. అయితే నాగ్ ఇక్కడే ఓ మెలిక పెట్టాడు. ఈసారి తనెలాగో నామినేషన్స్‌లో లేడు కాబట్టి ఈ వారం ఎవరినైనా సేవ్ చేయడానికి ఆ ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడొచ్చు, లేదంటే వచ్చేవారం తను నామినేషన్స్ నుంచి గట్టెక్కడానికి వాడుకోవచ్చు అని చెప్తాడు. ఇంత మంచి అవకాశం ఇచ్చాక ఇంకా ఎవరికోసమో ఎందుకు పాస్ వాడతాడు. ఛాన్సే లేదు, నెక్స్ట్ వీక్ తనకోసం వాడుకుంటానని అతడు ముక్త కంఠంతో చెప్పేసినట్లు తెలుస్తోంది. దీంతో తక్కువ ఓట్లు పడ్డ అషూ ఎలిమినేట్ అయినట్లు సమాచారం. ఎలాగో బాబా సోమవారం తన పాస్ వాడుకుంటాడు కాబట్టి వచ్చేవారం(11వ వారం) నామినేషన్లో ఉండడు. ఒకవేళ 11వ వారం మధ్యలో సడన్ ఎలిమినేషన్ ఉన్నా, వీకెండ్లో డబుల్ ఎలిమినేషన్ ఉన్నా బాబా భాస్కర్ నేరుగా టాప్ 6లో చోటు దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ లెక్కన బాబా బిగ్‌బాస్ ఓటీటీలో ఫస్ట్ ఫైనలిస్టుగా చరిత్ర సృష్టించనున్నట్లు తెలుస్తోంది. చదవండి: బిగ్‌బాస్ షో నుంచి ఆమె ఎలిమినేట్ -
అరియానా వర్సెస్ అషూ, చివరికి ఆమె ఎలిమినేట్!
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ మరో రెండు, మూడు వారాల్లో ముగిసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం హౌస్‌లో తొమ్మిది మంది ఉన్నారు. వీరిలో యాంకర్ శివ, అరియానా, అషూ రెడ్డి, మిత్రా శర్మ, బిందు మాధవి, అఖిల్, అనిల్ నామినేషన్లో ఉన్నారు. ఎప్పటిలాగే ఓటింగ్‌లో అఖిల్, బిందు దూసుకుపోయారు. కాకపోతే ఈసారి బిందు కంటే అఖిల్‌కే ఎక్కువ ఓట్లు పడ్డట్లు తెలుస్తోంది. ఆ తర్వాతి స్థానంలో యాంకర్‌శివ ఉన్నాడు. అనూహ్యంగా మిత్ర శర్మకు ఓట్ల సంఖ్య పెరిగినట్లు సమాచారం. అంటే ఈ వారం అనిల్, అషూ, అరియానా డేంజర్ జోన్లో ఉన్నారు. వీరిలో అషూకు అందరికంటే తక్కువ ఓట్లు నమోదయ్యాయని లీకువీరులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. దీంతో బిగ్‌బాస్ నాన్‌స్టాప్ నుంచి పదవ వారం అషూను ఎలిమినేట్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాలంటే రేపు రాత్రి నాగార్జున ప్రకటించేవరకు వేచి చూడాల్సిందే! చదవండి: మోస్ట్ ఎంటర్టైనర్ కంటెస్టెంట్ చేతికి ఎవిక్షన్ ఫ్రీ పాస్ భర్త చనిపోయాడన్న బాధ కొంచెం కూడా లేదే? నీతూ కపూర్‌పై ట్రోలింగ్ -
బిగ్‌బాస్ హౌస్‌లో సన్నీ, అతడే ఎవిక్షన్ ఫ్రీ పాస్ విన్నర్!
బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ కంటెస్టెంట్ యాంకర్ శివ నెత్తిన దరిద్రం తాండవం చేస్తోంది. అందుకే ఎవిక్షన్ ఫ్రీ పాస్ పోటీదారుడిగా నిలిచేందుకు ఎంత కష్టపడ్డా ఫలితం వచ్చినట్లే వచ్చి చేజారింది. ఇక ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం అఖిల్, అనిల్, బాబా, బిందు మాధవి పోటీపడ్డారు. వీరిలో బాబా భాస్కర్ పాస్ గెలుచుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ పాస్ బాబా ఎవరికోసం ఉపయోగిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. ఇక హౌస్‌లో ఇప్పటికే సిరి, షణ్ముఖ్, రవి, మానస్ రాగా తాజాగా విన్నర్ సన్నీ వచ్చాడు. అతడి రాకతో హౌస్మేట్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. అతడిని ఆటపట్టిస్తూ స్విమ్మింగ్ పూల్‌లో నెట్టేశారు. అయినా సరే సన్నీ పూల్‌లోనూ డ్యాన్స్ చేస్తూ తగ్గేదేలే అని నిరూపించాడు. మరి సన్నీ ఎంటర్టైన్మెంట్, హౌస్మేట్స్ గేమ్ చూడాలంటే రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: ఆ డైరెక్టర్స్ మన మంచితనాన్ని అలుసుగా తీసుకుని వాడుకుంటారు.. ఫ్యాన్స్‌కు మహేశ్‌బాబు రిక్వెస్ట్, సోషల్ మీడియాలో లేఖ వైరల్ -
బిగ్‌బాస్ హౌస్‌లో షణ్ముఖ్, ఇప్పటికైనా శివకు ఫలితం దక్కిందా?
యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్ బిగ్‌బాస్‌కు వచ్చాక అతడిపై విపరీతమైన నెగెటివిటీ పెరిగింది. సిరితో క్లోజ్‌గా ఉంటూ ఆమెపై పెత్తనం చెలాయిస్తున్నాడని, ఎవరితోనూ కలివిడిగా మాట్లాడనీయకుండా హద్దులు గీస్తున్నాడని విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాక గర్ల్‌ఫ్రెండ్ దీప్తి సునయన ఉందన్న విషయం మర్చిపోయి సిరితో ఎక్కువ సన్నిహితంగా మెదిలాడంటూ కామెంట్లూ వినిపించాయి. ఈ నెగెటివిటీతో బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ విన్నర్ కావాల్సిన షణ్ను రన్నరప్‌గా నిలిచాడు. బిగ్‌బాస్ తర్వాత తన ప్రేయసి కూడా గుడ్‌బై చెప్పడంతో ఒకింత శూన్యంలోకి వెళ్లిపోయాడు. అయితే తను చేసిన తప్పులను ఒప్పుకుంటూ తనను తాను సరిదిద్దుకుంటూ నెగెటివిటీని కూడా పాజిటివ్‌గా మార్చుకున్నాడు షణ్ను. దీంతో బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు తిట్టినవాళ్లే షణ్ను మెచ్యూరిటీని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. తాజాగా షణ్ను మరోసారి బిగ్‌బాస్ షోలో అడుగుపెట్టాడు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ కంటెండర్స్ గేమ్ ఆడించేందుకు హౌస్‌లో ఎంట్రీ ఇచ్చాడు. అందులో భాగంగా హౌస్‌మేట్స్‌తో ఓ గేమ్ ఆడించగా అందులో శివ గెలుపొందాడు. కానీ అఖిల్‌కు మిస్టరీ బాక్స్ రాగా అందులో ఎక్కువ పాయింట్స్ ఉన్నవాళ్లే గేమ్‌లో ముందుకు వెళ్లాలని రాసుంది. దీంతో ఇప్పటికే అనిల్, బాబా భాస్కర్, బిందు పోటీదారులుగా ఎంపికవగా ఈ జాబితాలో శివ లేదా అఖిల్‌లో ఎవరో ఒకరు చేరినట్లు తెలుస్తోంది. మరి హౌస్‌లో షణ్ను సందడి చూడాలంటే బిగ్‌బాస్ నాన్‌స్టాప్ చూడాల్సిందే! చదవండి: ఇట్స్ టూ మచ్, అంత మేకప్ అక్కర్లేదు.. నటిపై ట్రోలింగ్ రోమాలు నిక్కబొడిచే 'కొమురం భీముడో' వీడియో సాంగ్ చూశారా? -
ఇదేం ట్విస్టు, శివ వల్లే బిందుమాధవికి లక్కీ ఛాన్స్!
బిగ్‌బాస్ షోలో ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం హౌస్మేట్స్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. ఎలిమినేషన్ నుంచి గట్టెక్కించే ఈ ఆయుధాన్ని బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు అంత ఈజీగా ఇస్తాడా? ఛాన్సే లేదు. నానా టాస్క్‌లు ఆడిస్తూ హౌస్‌మేట్స్‌లో మరింత పట్టుదలను పెంచుతున్నాడు. ఈ క్రమంలో తాజగా యాంకర్ రవి హౌస్‌లో అడుగుపెట్టగా ఎవిక్షన్ ఫ్రీ పాస్ పోటీదారుడిగా యాంకర్ శివను ప్రకటించినట్లు తెలుస్తోంది. కానీ ఆ ఆనందం శివకు ఎంతోకాలం నిలవలేదు. తను అందుకున్న బాక్స్‌లో తన అవకాశాన్ని వేరొకరికి బదిలీ చేయాలని ఉంది. దీంతో శివ.. బిందుమాధవి ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం పోటీపడుతుందని ప్రకటించాడు. మూడు రోజులన ఉంచి నువ్వు జీరో పాయింట్స్ దగ్గరున్నావు, ఆడు అని చెప్పాడు. అంటే నేను ఆడలేదని ఇస్తున్నావా? నాకొద్దని తిరస్కరించింది బిందు. నేను సరిగా గేమ్ ఆడుతున్నానని నీకు నమ్మకం లేదు కదా అని ఆమె ఏడుపందుకోవడంతో శివ బిందును ఓదార్చాడు. కాస్త బుజ్జగింపుల తర్వాత బిందు కంటెండర్‌గా నిలిచేందుకు అంగీకరించింది. మరి ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం ఇంకా ఎవరెవరు పోటీదారులుగా నిలుస్తారో తెలియాలంటే బిగ్‌బాస్ నాన్‌స్టాప్ చూడాల్సిందే! చదవండి: నన్ను సెక్స్ స్కామ్‌లో ఇరికించి సోనాక్షిని స్టార్‌ను చేశారు సమంతతో పోల్చుకున్న ఉర్ఫీ, ఇదెక్కడి న్యాయం అంటూ ఆగ్రహం -
బిగ్‌బాస్ హౌస్‌లో యాంకర్ రవి రచ్చ
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ముగింపుకు చేరుకుంటోంది. ప్రస్తుతం హౌస్‌లో తొమ్మిది మంది మాత్రమే మిగిలారు. వీరిలో ఈసారి ఐదుగురు కాకుండా ఆరుగురు ఫినాలేకు చేరుకోనున్నారని టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే బిగ్‌బాస్ ఐదో సీజన్ కంటెస్టెంట్లు వరుసగా హౌస్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. హౌస్‌మేట్స్‌తో ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం గేమ్ ఆడిస్తున్నారు. ఇప్పటికే సిరి, మానస్ హౌస్‌లోకి రాగా తాజాగా యాంకర్ రవి బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టాడు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం ప్రాణం పెట్టి ఆడుతున్న హౌస్‌మేట్స్‌తో మరో టాస్క్ ఆడించాడు. అయితే దీనికంటే ముందు వాళ్లతో ఫన్నీ స్కిట్స్ వేయిస్తూ ప్రేక్షకులను తెగ ఎంటర్టైన్ చేశాడు. మరి ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఎవరి సొంతం కానుంది? ఈ పాస్‌తో ఎవరు గేమ్‌ను మలుపు తిప్పనున్నారు అనేది తెలియాలంటే నేడు రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: నామినేషన్స్‌లో బిందు ఓవరాక్షన్, టైటిల్ గెలిచే అర్హత లేదంటూ.. -
బిగ్‌బాస్ షోలో మానస్, ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఎవరికి దక్కుతుందో?
బిగ్‌బాస్ హౌస్‌లో ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం ఫైట్ జరుగుతోంది. ఇప్పటికే సిరి వచ్చి కంటెస్టెంట్స్‌తో మొదటి లెవల్ గేమ్ ఆడించి వెళ్లిపోగా తాజాగా మానస్ హౌస్‌లో అడుగుపెట్టాడు. హౌస్‌మేట్స్‌తో గేమ్స్ ఆడిస్తున్నాడు. ఈ క్రమంలో బిగ్‌బాస్ ఓ ఇంట్రస్టింగ్ టాస్క్ ఇవ్వగా ఇందులో నుంచి అఖిల్, అషూ, బిందు మాధవి మొదటగా అవుట్ అయ్యారు. వీరు పోటీదారులను డిస్టర్బ్ చేసేందుకు ఛాన్స్ ఇవ్వడంతో గేమ్‌లో ఇంకా పోటీపడుతున్న కంటెస్టెంట్ల ఆటకు ఆటంకం కలిగించేందుకు యత్నించారు. ఈ క్రమంలో బాబా, యాంకర్ శివ అవుట్ అయ్యారు. తర్వాతి లెవల్లో అరియానా గేమ్‌లో ఓడిపోగా నటరాజ్, అనిల్ మాత్రమే మిగిలారు. మరి వీరిలో ఎవరు ఎవిక్షన్ ఫ్రీ పాస్ సాధించారనేది తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే! చదవండి: ఆన్లైన్లో లీకైన 'అవతార్ 2' సినిమా ట్రైలర్ !.. సినీప్రియులకు ఆహా గుడ్‌న్యూస్, మేలో ఏకంగా 40కి పైగా సినిమాలు! -
ఒక్క ఎపిసోడ్‌తో పాతాళానికి పడిపోయిన బిందు!
Bindu Madhavi: ఫ్యామిలీ ఎపిసోడ్‌తో బిగ్‌బాస్ ఓటీటీ మరింత రసవత్తరంగా మారింది. ముఖ్యంగా అఖిల్, బిందుమాధవి, యాంకర్ శివ మధ్యే టైటిల్ పోరు ఉందన్న విషయం స్పష్టమైంది. మరీ ముఖ్యంగా ఈసారి లేడీ కంటెస్టెంట్ గెలిచే అవకాశాలున్నాయంటూ సోషల్ మీడియాలో బిందుమాధవి గురించి విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఫినాలే దగ్గరపడిన తరుణంలో ఎంతో జాగ్రత్తగా, ఆచితూచి ఆటాడాల్సిన క్రమంలో బిందు మాధవి అదుపు తప్పుతోంది. గట్టిగట్టిగా అరుస్తూ తను చెప్పేదే రైట్ అని బల్లగుద్ది చెప్పే తను నిన్నటి ఎపిసోడ్లో చిత్రవిచిత్రంగా ప్రవర్తించింది. సాధారణంగా నామినేషన్స్‌లో మిత్ర తను నామినేట్ చేయాలనుకునేవాళ్లను ఇమిటేట్ చేసి ఇరిటేట్ చేస్తుంటుంది. కానీ ఈసారి మాత్రం బిందు ఆ పనిని తన భుజానెత్తుకుంది. మిత్రను నామినేట్ చేస్తూ ఆమె ఎలా ప్రవర్తించేదో ఇమిటేట్ చేసి చూపించింది. ఈ క్రమంలో ఆమె ప్రవర్తన అతిగా అనిపించింది. ఒకరకంగా చెప్పాలంటే తనను చులకన చేస్తూ మాట్లాడింది. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో 'ఎలిమినేట్ బిందుమాధవి'(#Eliminate Bindu Madhavi) అన్న హ్యాష్‌ట్యాగ్ ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. మిత్ర మాట్లాడుతున్నంతసేపూ బిందు ఆమెను ఇమిటేట్ చేస్తూ పిచ్చి పిచ్చి చేష్టలతో ఈ సీజన్లోనే వరస్ట్ బిహేవియర్ అనిపించిందని పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. దగ్గరైనవాళ్లకే వెన్నుపోటు పొడుస్తావని మిత్రను నిందించిన బిందు.. మరి తనకు క్లోజ్ అయిన శివను నామినేట్ చేయడం వెన్నుపోటు కాదా? అని ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా టైటిల్ రేసులో ఉన్న బిందు ఈ ఒక్క ఎపిసోడ్‌తో పాతాళానికి పడిపోయిందంటున్నారు. కానీ బిందు ఫ్యాన్స్ మాత్రం ముళ్లును ముళ్లుతోనే తీయాలని, మిత్రకు సరిగ్గా బుద్ధి చెప్పిందని సపోర్ట్ చేస్తున్నారు. Motham pre-planned nomination from #BindhuMadhavi Eliminate Bindu Madhavi pic.twitter.com/AaCw8tjKne — Wierd_explorer1 (@Explorer1Wierd) May 3, 2022 From the first day I didn't likes her she behaves very worst she should be kicked out of the house Eliminate Bindu Madhavi pic.twitter.com/LcoOhBrJmh — rajesh (@ujjwalsaaho3) May 3, 2022 Targeting someone on the personal aspects is worst from any contestants and she has been then worst in that Eliminate Bindu Madhavi pic.twitter.com/TbCRt9m3Iz — Chandini (@LoveForChandini) May 3, 2022 చదవండి: నేను కథ వినను: ఎడిటర్ ఆయన ఫోటో చూసి బోరున విలపించిన మిత్రాశర్మ -
Bigg Boss Non Stop: ఆయన ఫోటో చూసి భోరున విలపించిన మిత్రాశర్మ
బిగ్‌బాస్ నాన్ స్టాప్‌లో తన ఆటతీరుతో దూసుకెళ్తోంది మిత్రాశర్మ. ‘తొలి సంధ్య వేళలో' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మిత్ర.. ఆ తర్వాత శ్రీ పిక్చర్స్ బ్యానర్ స్థాపించి బాయ్స్ అనే సినిమాను కూడా నిర్మించింది. అయినప్పటికీ ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు. తెలుగు ప్రజలకు మరింత చేరువయ్యేందుకే బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లోకి వచ్చింది. తొలుత కాస్త తడబడినా.. ప్రస్తుతం తనదైన గేమ్‌తో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా మారింది. హౌస్‌లో ఫైర్‌బ్రాండ్‌గా పేరుగాంచిన మిత్ర..తాజాగా ఓ ఫోటో చూసి భోరున విలపించింది. వివరాల్లోకి వెళితే... గతవారం హౌస్‌లోకి కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్‌ని పంపించాడు బిగ్‌బాస్. దాదాపు అందరి కుటుంబ సభ్యులు వచ్చారు. కానీ మిత్రాశర్మకి తల్లిదండ్రులు లేకపోవడంతో.. ఎవరిని ఇంట్లోకి పంపలేదు. ఇక వీకెండ్లో నాగార్జున వచ్చి మిత్రాశర్మ తండ్రి ఫోటోని హౌస్‌లోకి పంపించాడు. అది చూసి మిత్ర ఎమోషనల్ అయింది. ఇంట్లోకి అందరి కుటుంబ సభ్యులు వచ్చారు.. కానీ నాకు నా అనేవాళ్లు లేరంటూ భోరున విలపించింది. తను బిగ్‌బాస్ షోలో పాల్గొనడానికి తన తండ్రే కారణమని చెప్పింది. ఇక తనతో మాట్లాడానికి వచ్చిన సిరి, గంగాధర్‌లను చూసి కూడా మిత్రాశర్మ కనీళ్లు పెట్టుకుంది. గంగాధర్ తనకు తండ్రిలాంటి వాడని, ప్రతి విషయంతో నాకు సపోర్టుగా ఉన్నాడని చెప్పుకొచ్చింది. ఇక గంగాధర్ మాట్లాడుతూ.. మిత్ర సివంగి అని, బయట ఎలా ఉంటుందో...బిగ్‌బాస్ హౌస్‌లో కూడా అలానే ఉందని చెప్పాడు. ఇక సిరి హన్మంత్ అయితే మిత్రాశర్మపై ప్రశంసల వర్షం కురిపించింది. టాప్ 5లో కచ్చితంగా మిత్రాశర్మ ఉంటుందని జోస్యం చెప్పింది. -
బిగ్‌బాస్ వంటి షోల్లో హింస, అశ్లీలత తప్ప ఏముంది?
సాక్షి, అమరావతి: బిగ్‌బాస్ వంటి షోల్లో హింస, అశ్లీలత వంటివి తప్ప ఏమున్నాయని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. రియాల్టీ షోల పేరుతో ఏది పడితే అది చూపిస్తామంటే తాము కళ్లు మూసుకుని ఉండలేమని స్పష్టం చేసింది. బిగ్‌బాస్ షోలో ఏం చూపిస్తున్నారో అందరికీ తెలుసంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. బిగ్‌బాస్ షోను ఆపేయాలంటూ దాఖలైన వ్యాజ్యంపై విచారణను వేసవి సెలవుల తరువాతకు సీజే ధర్మాసనం వాయిదా వేసిన విషయాన్ని తమ దృష్టికి తీసుకురాకపోవడం పట్ల పిటిషనర్ తరఫు న్యాయవాదిపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. నిజాయితీగా ఈ విషయాన్ని తమకు తెలియచేసి ఉంటే తాము ఈ వ్యాజ్యాన్ని విచారించేవాళ్లమని, అలా చెప్పకుండా దాచిపెట్టిన నేపథ్యంలో ఈ వ్యాజ్యంపై తాము విచారణ జరపబోమంది. సీజే ధర్మాసనం వద్దే ఈ వ్యాజ్యం గురించి ప్రస్తావించుకోవాలని పిటిషనర్ తరఫు న్యాయవాదికి తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎటువంటి సెన్సార్షిప్ లేకుండా ప్రసారమవుతున్న బిగ్‌బాస్ వంటి కార్యక్రమాలు యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయని, కేవలం ధనార్జనే ధ్యేయంగా ప్రసారమవుతున్న వీటిని అడ్డుకోవాలంటూ తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి 2019లో హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి వాటిని అనుమతించేది లేదు ఈ వ్యాజ్యంపై సోమవారం ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది గుండాల శివప్రసాద్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. బిగ్‌బాస్ షో వల్ల యువత చెడిపోతుందన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. బిగ్‌బాస్ వంటి రియాలిటీ షోల్లో ఏది పడితే అది చూపిస్తున్నారని వ్యాఖ్యానించింది. ఇలాంటి వాటిని అనుమతించేది లేదంది. ఈ సమయంలో బిగ్‌బాస్ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి స్పందిస్తూ.. పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతామన్నారు. ఇదే పిటిషనర్ బిగ్‌బాస్‌పై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి తర్వాత ఉపసంహరించుకున్నారని తెలిపారు. బిగ్‌బాస్ వ్యాజ్యంపై అత్యవసర విచారణ జరపాలని పిటిషనర్ తరఫు న్యాయవాది ఇటీవల సీజే ధర్మాసనం ముందు అభ్యర్థించారన్నారు. అయితే ధర్మాసనం వేసవి సెలవుల తరువాత చూస్తామని చెప్పిందని వివరించారు. ఈ విషయాలను ప్రస్తుత ధర్మాసనం దృష్టికి తీసుకురాలేదన్నారు. దీంతో ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని సీజే ధర్మాసనం ముందే తేల్చుకోవాలంటూ విచారణ నుంచి ఈ వ్యాజ్యాన్ని తొలగించింది. -
‘బిగ్ బాస్’ను హైకోర్టు బ్యాన్ చేయాలి: నారాయణ
నగరి (చిత్తూరు): బిగ్ బాస్ కార్యక్రమం పై హైకోర్టు వ్యాఖ్యలను స్వాగతిస్తున్నానని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. శనివారం ఆయన చిత్తూరు జిల్లా నగరిలో విలేకరులతో మాట్లాడారు. యువతను పెడదారి పట్టిస్తున్న బిగ్ బాస్ కార్యక్రమాన్ని నిషేధించాలని గతంలో తాను హైదరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని చెప్పారు. బిగ్ బాస్‌పై దాఖలైన ఓ రిట్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా బిగ్‌బాస్ కార్యక్రమం ద్వారా సమాజానికి తప్పుడు సంకేతాలు వెళుతున్నాయని ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని పూర్తిగా బ్యాన్ చేసే బాధ్యతను తీసుకోవాలని హైకోర్టుకు నారాయణ విజ్ఞప్తి చేశారు. చదవండి: (బిగ్‌బాస్ లాంటి షోలతో యువత పెడదారి పడుతోంది: హైకోర్టు) -
బ్రేకప్‌తో బిజీ అయ్యావా? షణ్ముఖ్‌పై నాగ్ సెటైర్లు
బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు ఈ వారం సర్‌ప్రైజ్‌ల మీద సర్ప్రైజ్లు ఇస్తున్నాడు. ఈ వారం ఫ్యామిలీ మెంబర్స్‌ను పంపి హౌస్మేట్స్ ముఖాల్లో వెలుగులు తీసుకొచ్చిన బిగ్‌బాస్ వీకెండ్లో ఏకంగా వారి క్లోజ్‌ఫ్రెండ్స్‌ను, మరికొందరి పేరెంట్స్‌ను, బంధువులను స్టేజీమీదకు తీసుకొచ్చాడు. వారిని చూసి మరోసారి సర్ప్రైజ్ అయ్యారు కంటెస్టెంట్లు. ఈమేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. అఖిల్ కోసం సోహైల్ స్టేజీపైకి వచ్చి స్నేహితుడిని పొగిడేస్తుండగా... నాకోసం కూడా చెప్పరా అంటూ మధ్యలో అరియానా లేచి నిలబడింది. దీంతో సోహైల్.. నేను అన్నీ విన్నాలే, కూర్చో అన్నట్లుగా పంచ్ వేశాడు. తర్వాత అరియానా కోసం ఆమె సోదరి, దేవి నాగవల్లి, యాంకర్ శివ కోసం అతడి ఫ్రెండ్స్ ధనుష్, షణ్ముఖ్ వచ్చారు. చదవండి: మహేశ్‌బాబు పెన్నీ సాంగ్ కోసం సితార ఎందుకన్నారు: తమన్ షణ్నును చూసిన నాగ్ బిగ్‌బాస్ తర్వాత ఎక్కడా కనపడలేదేంటి, బ్రేకప్‌తో బిజీగా ఉన్నావా? అని ప్రశ్నించడంతో అతడికి ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్ అయిపోయాడు. దొరికిందే ఛాన్స్ అనుకున్న అషూ.. దీప్తి సునయన ఎలా ఉందని అడుతూ షణ్నును మరింత ఉడికించింది. అనంతరం సిరి స్టేజీపైకి రాగా మిత్రశర్మ ఎమోషనలైంది. అనిల్ కోసం వచ్చిన తండ్రి మాట్లాడుతూ.. అతడు మాట్లాడకపోవడానికి కారణం నేనే, వాడిని అలా పెంచాను అంటూ గొప్పగా చెప్పాడు. దీంతో విషయం అర్థమైన నాగ్ మాట్లాడనివ్వకుండా పెంచారా? అని సెటైర్ వేశాడు. ఇక వచ్చినవారితో టాప్ 5 కంటెస్టెంట్లు ఎవరో చెప్పమని గేమ్ ఆడించాడు. ఈ గేమ్‌తో ఎవరు ఫినాలేలో చోటు దక్కించుకుంటారు? ఎవరికి టైటిల్ గెలిచే ఆస్కారం ఉందన్న విషయాలపై ఓ క్లారిటీ రానుంది. చదవండి: అనిల్ అదృష్టం, బిగ్‌బాస్ నుంచి హమీదా ఎలిమినేట్! -
ఒకరికి బదులుగా మరొకరిని ఎలిమినేట్ చేసిన బిగ్‌బాస్!
బిగ్‌బాస్ షో చివరకు చేరుకుంటోంది. ఫ్యామిలీ ఎపిసోడ్‌తో హౌస్ ఎమోషనల్‌గా మారింది. ప్రస్తుతం హౌస్‌లో అషూ, అరియానా, నటరాజ్ మాస్టర్, అనిల్, మిత్ర శర్మ, యాంకర్ శివ, బిందుమాధవి, హమీదా, అఖిల్, బాబా భాస్కర్ ఉన్నారు. వీరిలో అషూ, అఖిల్, బిందు మినహా మిగతా అందరూ నామినేషన్లో ఉన్నారు. ఫినాలే దగ్గరపడుతున్న సమయంలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్నదానిపై జోరుగా చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో బిగ్‌బాస్ హౌస్ నుంచి హమీదా ఎలిమినేట్ అయినట్లు లీకువీరులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. గత ఎనిమిది వారాలుగా నామినేషన్స్, ఎలిమినేషన్ విషయంలో వాళ్లు చెప్పిందే నిజమవుతూ వస్తోంది. ఈ లెక్కన బిగ్‌బాస్ హౌస్ నుంచి తొమ్మిదవ వారం హమీదా బయటకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అయితే ముందుగా అనిల్‌ను ఎలిమినేట్ చేయాలనుకున్నారని, కానీ ఏదో సమస్య వల్ల చివరి నిమిషంలో హమీదాను పంపించివేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా అనిల్‌కు లక్ బాగానే ఉందంటున్నారు బిగ్‌బాస్ ఫ్యాన్స్. చదవండి: మా ఇంట్లో దాదాపు ప్రేమ వివాహాలే, నేనూ లవ్ మ్యారేజ్ చేసుకుంటా! -
కథలు పడుతుండు, అసలు గేమ్ ఆడుతున్నావా?: శివపై అఖిల్ తల్లి సెటైర్లు
బిగ్‌బాస్ హౌస్‌లో ఫ్యామిలీ ఎపిసోడ్ జరుగుతోంది. రెండు నెలలుగా కష్టపడి గేమ్ ఆడుతూ టాప్ 10లో చోటు దక్కించుకున్న కంటెస్టెంట్ల కోసం బిగ్‌బాస్ వారి ఫ్యామిలీ మెంబర్స్‌ను హౌస్‌లోకి పంపించాడు. ఇప్పటికే అషూ తల్లి, నటరాజ్ మాస్టర్ భార్యాకూతురు, యాంకర్ శివ సోదరి, అఖిల్ తల్లి, అరియానా ఫ్రెండ్, మిత్ర ఫ్రెండ్ హౌస్‌లోకి వెళ్లారు. అందరూ వారికి తోచిన సూచనలు, సలహాలు ఇచ్చారు. అయితే అఖిల్ తల్లి మాత్రం శివతో వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. కొడుక్కి రిలేషన్స్ పక్కన పెట్టి గేమ్ మీద దృష్టి పెట్టు. ఎవరేమన్నా ఇచ్చిపడేయ్.. అని సూచించిన ఆమె యాంకర్ శివ మీద మాత్రం వరుసగా సెటైర్లు వేసింది. 'గేమ్ ఆడుతున్నవా? లేదా దానం చేస్తున్నావా? అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూనే.. 'సరేలే, బిగ్‌బాస్‌కు రావాలన్నది నీ కోరిక.. నన్ను అడిగావా? లేదా? వస్తావని చెప్పానా? లేదా? వచ్చావు.. నీ కోరిక నెరవేరిపోయింది, హ్యాపీ..' అని చెప్పుకొచ్చింది. శివకు, తనకు గొడవలవుతున్నాయని అఖిల్ అనగా ఆమె మరోసారి శివ మీద అసహనం వ్యక్తం చేసింది. వాడు కావాలనే చేస్తాడు, కథలు పడుతుండు అని విమర్శించింది. చదవండి: నా జిందగీలో నుంచే కాదు, నా బాడీలో నుంచి కూడా వదిలించుకున్నా ఇప్పటిదాకా ఐదు సీజన్లు చూశావు, ఇది ఆరోదా.. అని అడుగుతూ నవ్వేసింది. దీంతో అఖిల్ కలగజేసుకుంటూ మా అమ్మ చెప్పినదాని కోసం ఏమనుకోకురా అని చేతులెత్తి వేడుకున్నాడు. అటు అఖిల్ తల్లి మాత్రం.. ఏ క్వశ్చన్ పేపర్ ఉందో దానికి సంబంధించింది చదివితేనే పాస్ అవుతరు. కానీ అన్ని క్వశ్చన్ పేపర్లు చదివేస్తే దేనికి దేనికి ఆన్సర్ రాయాలో అర్థం కాదు, నీ కాంట్రవర్సీ అలా అయిపోయింది అని సెటైర్లు వేస్తూనే చివర్లో మాత్రం బుజ్జగింపుగా బాగా ఆడుతున్నావు అని పేర్కొంది. శివ ఫస్ట్ టైం హౌస్‌లోకి వచ్చాడు కానీ ఇప్పటికే ఐదుసార్లు వచ్చినట్లు ఉందని పంచ్ వేసింది. ఆ తర్వాత హౌస్ నుంచి వెళ్లిపోయే ముందు వర్షంలో తల్లీకొడుకులు కలిసి డ్యాన్స్ చేసి ఆనందించారు. దీంతో ఇతర హౌస్మేట్స్ కూడా మైకులు తీసేసి వర్షంలో చిందులేశారు. చదవండి: బాలీవుడ్ నటికి సల్మాన్ ఖాన్ బంపర్ ఆఫర్, కావాల్సినంత తీసుకో! -
బిగ్‌బాస్ లాంటి షోలతో యువత పెడదారి పడుతోంది: హైకోర్టు
సాక్షి, అమరావతి: బిగ్‌బాస్ వంటి చెత్త రియాలిటీ షోల వల్ల యువత పెడదారి పడుతోందని ఏపీ హైకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి షోలతో సమాజంలో ప్రమాదకర పోకడలు పెరిగిపోతున్నాయంది. ఇలాంటి వాటిని ఎవరూ అడ్డుకోవడం లేదని, సమాజం ఎటుపోతోందో అర్థం కావడం లేదని అభిప్రాయపడింది. బిగ్‌బాస్ షోను నిలిపేయాలంటూ దాఖలైన వ్యాజ్యంపై వచ్చేనెల 2న విచారణ జరుపుతామని తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ తర్లాడ రాజశేఖరరావు ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎటువంటి సెన్సార్షిప్ లేకుండా ప్రసారం అవుతున్న బిగ్‌బాస్ వంటి కార్యక్రమాలు యువతను తప్పుదోవపట్టిస్తున్నాయని, ఈ కార్యక్రమాలను అడ్డుకోవాలంటూ తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి 2019లో హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. (క్లిక్: పట్టణాల్లో ఫిర్యాదులపై ప్రత్యేక వ్యవస్థ!) జగదీశ్వర్‌రెడ్డి తరఫు న్యాయవాది శివప్రసాద్‌రెడ్డి శుక్రవారం జస్టిస్ అమానుల్లా నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. దీనిపై అత్యవసర విచారణ జరపాలని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ.. ‘మంచి వ్యాజ్యం దాఖలు చేశారు. బిగ్‌బాస్ లాంటి చెత్త షోల వల్ల యువత జీవితాలు నాశనం అవుతున్నాయి. యువత పెడదోవ పడుతోంది. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో అసభ్యత, అశ్లీలతను పెంచేస్తున్నాయి. అనర్థాలకు దారితీసే ఈ కార్యక్రమాల వల్ల సమాజం పాడవుతుందన్న విషయాన్ని అందరూ గుర్తెరగాలి’ అని వ్యాఖ్యానించింది. (క్లిక్: బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో సంచలన తీర్పు) -
అషూను చీపురుతో కొట్టడానికి బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చిన తల్లి
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షోలో ఆఖరి కెప్టెన్‌గా బాబా భాస్కర్ ఎన్నికయ్యాడు. ఆది నుంచి కెప్టెన్సీకోసం కష్టపడ్డ చాలామందికి ఇప్పటికీ కెప్టెన్ అయ్యే అవకాశం రాలేదు. కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన బాబా భాస్కర్ మాత్రం హౌస్‌లో అడుగుపెట్టిన వారం రోజులకే కెప్టెన్‌గా అవతరించడం విశేషమనే చెప్పాలి. ఇదిలా ఉంటే షో ప్రారంభమై ఇప్పటికే రెండు నెలలు కావస్తున్న తరుణంలో బిగ్‌బాస్ కంటెస్టెంట్ల కోసం ఓ సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. ప్రస్తుతం హౌస్‌లో ఉన్న టాప్ 10 హౌస్మేట్స్ కోసం వారి కుటుంబ సభ్యులను ఇంట్లోకి పంపించాడు. ఈమేరకు ఓ ప్రోమో వదిలాడు. అందులో భాగంగా అషూ తల్లి బిగ్‌బాస్ ఇంట్లోకి వచ్చింది. అయితే ఆమె చీపురు పట్టుకుని హౌస్‌లోకి రావడంతో అషూ వణికిపోయింది. చీపురుపట్టుకుని వచ్చావేంటి, పరువు పోతుంది మమ్మీ అంటూ వెళ్లి తన తల్లిని హత్తుకోవడంతో ఆమె చేతిలోని చీపురు కింద పడేసింది. ఆ తర్వాత నీ ఫేవరెట్ ఎవరంటే అషూ కాకుండా అందరూ అని బదులివ్వడంతో అక్కడున్నవాళ్లంతా సరదాగా నవ్వారు. అనంతరం యాంకర్ శివ సోదరి యమున హౌస్‌లోకి వచ్చింది. అలాగే నటరాజ్ మాస్టర్ భార్యాకూతురు గేట్ లోపల నుంచి లోపలకు రావడంతో అతడు ఎమోషనల్అయ్యాడు. తన గారాలపట్టిని ఎత్తుకుని ముద్దాడాడు. కూతురిని ఆడిస్తూ సంబరపడిపోయాడు. చదవండి: 'పోకిరి' ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన హీరోయిన్స్ ఎవరో తెలుసా? 'నటుడిగా పనికిరావు, పోయి ఇంకేదైనా పని చూసుకో అని హేళన చేశారు' -
బిగ్‌బాస్ : నిజం తెలిసి షాక్ అయిన హౌస్మేట్స్.. ప్రోమో రిలీజ్
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ రోజురోజుకూ రసవత్తరంగా సాగుతోంది. ఇక మంగళవారం నాటి ఎపిసోడ్ మరింత ఇంట్రెస్టింగ్గా సాగింది. కెప్టెన్సీ కంటెండర్స్ కోసం బిగ్‌బాస్ ఇచ్చిన కిల్లర్ టాస్క్‌లో నటరాజ్ మాస్టర్ మ్యాన్ ఆఫ్ ది షోగా నిలిచాడు. ఒక్క టాస్క్‌తో నటరాజ్ మాస్టర్ రేంజ్ మారిపోయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. హౌస్‌లో ఉన్న వాళ్లందర్నీ ముప్పుతిప్పులు పెట్టి అయిదుగిరిని మర్డర్ చేసినా మాస్టరే కిల్లర్ అని ఒక్కరు కూడా కనిపెట్టలేకపోయారు. బిగ్‌బాస్ ఇచ్చిన సూచనలు పాటిస్తూ కిరాక్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టాడు. ఇక ఈరోజు ఎపిసోడ్లో నటరాజ్ మాస్టరే కిల్లర్ అని చెప్పడంతో షాక్ అవడం హౌస్మేట్స్ వంతవుతుంది. అఖిల్, అషూలు కిల్లర్ అయి ఉండొచ్చని హౌస్మేట్స్ భావించినా చివరకు కిల్ కిల్ కిలాడీ అంటూ నటరాజ్ మాస్టర్ ఎంట్రీ ఇవ్వడంతో హౌస్మేట్స్ అంతా నోరెళ్లబెట్టారు. దీనికి సంబంధించి ప్రోమో విడుదల అయ్యింది. "WHAT IS HAPPENING IN THIS HOUSE?!" 🤯 What a win! Never before Never after have we seen such a killer! Watch the 'KILLER' Bigg Boss Non-Stop episode at 9PM exclusively on @DisneyPlusHS #BiggBoss #BiggBossTelugu #BiggBossNonStop @EndemolShineIND pic.twitter.com/4giCtrZ710 — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) April 27, 2022 -
అషూ, నీ షర్ట్ బటన్స్ తీసేయ్: యాంకర్ శివ వ్యాఖ్యలపై దుమారం
ఎవరి సపోర్ట్ లేకుండా ఒంటరిగా ఆడుతూ ఇక్కడిదాకా వచ్చాడు యాంకర్ శివ. బిగ్‌బాస్ షోలో అందరితో సరదాగా ఉంటూ, కామెడీ పంచుతూ, గేమ్ ఆడుతూ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు తనవంతు కష్టపడుతున్నాడు శివ. అతడి డెడికేషన్ చూసి టాప్ 5లో ఉండటం ఖాయం అనుకున్నారంతా. కానీ సోమవారం జరిగిన నామినేషన్‌తో శివపై వ్యతిరేకత మొదలైంది. ఇంతకీ నామినేషన్లో ఏం జరిగిందటారా? బిగ్‌బాస్ హౌస్‌లో శివ ఓసారి లేడీ గెటప్ వేసుకున్న విషయం తెలిసిందే కదా! దానికి అషూనే తన జాకెట్, షాట్, జాకెట్ లోపల వేసుకునే లోదుస్తులను కూడా శివకు ఇచ్చింది. అయితే ఆ సమయంలో శివ పదేపదే షర్ట్ బటన్స్ తీసేయ్, బటన్స్ తీసేయ్ అనడం నచ్చలేదని నామినేట్ చేసింది. నీ ఉద్దేశం ఏదైనా ఉండనీ, కానీ ఆ పదాలు వాడటం ఇబ్బందికరంగా అనిపించిందని చెప్పుకొచ్చింది. అషూ చెప్పిన మాటలు విని అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాకయ్యారు. అటు సోషల్ మీడియాలోనూ దీనిపై పెద్ద దుమారమే నడుస్తోంది. నిజానికి ఆరోజు ఏం జరిగిందో వారి మాటల్లోనే.. బాత్రూమ్ ఏరియాలో జరిగిన సంభాషణ.. శివ: దాంతోపాటు పైన షర్ట్ కూడా కావాలి, నువ్వు నార్మల్‌గా వేస్తావు కదా! అషూ: మరేం కావాలి? శివ: బటన్స్ తీయ్, నీ షర్ట్ బటన్స్ తీయ్, ఆ టైప్ కావాలి అషూ: దానికి బటన్స్ ఎందుకు తీయమంటున్నావు? ఆగు, నేనిస్తా శివ: అహ, ఆ టైప్ కావాలని అడుగుతున్నా అషూ: (లోదుస్తులను ఇస్తూ) నేను వేసుకుంది కూడా ఇలాంటిదే, సేమ్రా నిజం, ఒకసారి వేసుకుని చూడు అషూ: అలాగే నా దగ్గర ఒక జాకెట్ ఉంది, దానితో పాటు ఒక షాట్ కూడా ఇస్తా ఇదీ వాళ్లమధ్య జరిగిన సంభాషణ. ఇక ఇందులో శివ బటన్స్ తీయమని అడగడం స్పష్టంగా ఉండటంతో అషూ ఫ్యాన్స్ అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. ఒక అమ్మాయితో అలాగే మాట్లాడతావా? ఒంటి మీదున్న షర్ట్ బటన్స్ తీయమని అడగడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శివ ఫ్యాన్స్ మాత్రం లో దుస్తులు అనే పదాన్ని ఉపయోగించడం ఇష్టం లేకనే అలా అడిగాడని అతడిని వెనకేసుకొస్తున్నారు. అక్కడ శివ తప్పుగా మాట్లాడినట్లు ఏమీ అనిపించలేదని కామెంట్లు చేస్తున్నారు. చదవండి: స్క్రీన్షాట్లున్నాయి, అంత ఈజీగా వదిలిపెట్టనంటూ నటుడి వార్నింగ్ ఆయన కంట్రోల్లో ఉండాలి, అఖిల్ కప్పు తీసుకొచ్చేసేయ్ -
బిందుకు దగ్గరయ్యావని అఖిల్ దూరం పెట్టాడా? అజయ్ ఏమన్నాడంటే?
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షోలో ఇప్పటివరకు ఏడుగురు ఎలిమినేట్ అయ్యారు. శ్రీరాపాక, ఆర్జే చైతూ, సరయు, తేజస్వి, ముమైత్ ఖాన్, స్రవంతి, మహేశ్ విట్టా వరుసగా ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. తాజాగా ఎనిమిదో వారం అజయ్ ఎలిమినేట్ అయ్యాడు. ఈ సందర్భంగా బిగ్‌బాస్ బజ్‌లో యాంకర్ రవికి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో భాగంగా యాంకర్ రవి.. నువ్వు బిందుకు దగ్గరయ్యావని అఖిల్ దూరమయ్యాడా? అని సూటిగా ప్రశ్నించాడు. దీనికి అజయ్.. ఈ మధ్యే ఆ చర్చ కూడా మొదలైందని, ఎందుకు ఆమెతో క్లోజ్ ఉంటున్నావని అఖిల్ తనను అడుగుతూ ఉండేవాడని బదులిచ్చాడు. అఖిల్ వల్లే అజయ్ ఇన్నాళ్లు హౌస్‌లో ఉండగలిగాడని ఇంతకుముందు ఎలిమినేట్ అయినవాళ్లు చెప్పారు. ఎప్పుడైతే అఖిల్‌కు కొద్దికొద్దిగా దూరమవుతూ వచ్చావో అప్పటినుంచి అజయ్ వీక్ అవుతూ వచ్చాడని రవి పేర్కొనడంతో అజయ్ అలాంటిదేం లేదని ఆన్సరిచ్చాడు. ఇక ఇంటిసభ్యుల గురించి చెప్తూ.. నటరాజ్ మాస్టర్ కొంచెం కంట్రోల్లో ఉంటే బాగుంటుందన్నాడు. శివ స్మార్ట్ కానీ గేమ్‌లో విలువలు, ఎమోషన్స్ కూడా పక్కన పెట్టేస్తాడని అభిప్రాయపడ్డాడు. బిందుమాధవి చాలా స్ట్రాంగ్ ప్లేయర్, కాకపోతే కొంచెం ఓవర్ థింకింగ్ ఆపేస్తే బాగుంటుందని చెప్పాడు. అరియానా ఇప్పుడే గేమ్ స్టార్ట్ చేసిందన్నాడు. అఖిల్ కప్పు తీసుకుని రావాలని ఆశపడ్డాడు. చదవండి: బిగ్‌బాస్ షో నుంచి అజయ్ ఎలిమినేట్ మూడో సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ తెలుగువాడే! -
ఫ్రెండ్‌ను పక్కన పెట్టిన అఖిల్, అతడే ఎలిమినేట్!
బిగ్‌బాస్ షోలో ఫుల్ కామెడీ పంచుతున్నాడు బాబా. మరోవైపు నటరాజ్ తన జోలికొచ్చినవాళ్లను జంతువులతో పోలుస్తూ, ఇమిటేట్ చేస్తూ చుక్కలు చూపిస్తున్నాడు. అయితే బాబా దగ్గరకు వచ్చేసరికి మాత్రం వాళ్లు అలాంటివారు, వీళ్లు ఇలాంటివారు అంటూ కంటెస్టెంట్ల గురించి లేనిపోనివి అతడి బుర్రలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. మరి బాబా వీటన్నింటినీ పట్టించుకుంటున్నాడా లేదా అన్న విషయం పక్కన పెడితే ఈ వారమే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన అతడు నామినేషన్స్‌లో లేడు. కాబట్టి తాపీగా వీకెండ్‌ను ఎంజాయ్ చేయవచ్చు. అటు నట్టూ కూడా ఎలిమినేషన్ జోన్లో లేడు. ఈ వారం అఖిల్, అజయ్, అనిల్, హమీదా, అషూ రెడ్డి నామినేషన్లో ఉన్నారు. వీరిలో అఖిల్, అషూ సేఫ్ అన్న విషయం మనకెలాగో తెలుసు. మిగిలిందల్లా అనిల్, అజయ్, హమీదా. ఈ ముగ్గురిలో హమీదాకు మంచి ఓట్లు పడ్డట్లు తెలుస్తోంది. దీంతో అనిల్, అజయ్ డేంజర్ జోన్లో ఉన్నారు. ఇక అజయ్‌ను అఖిల్ పక్కన పెట్టడంతో అతడి ఫ్యాన్స్ అజయ్‌ను సేవ్ చేసే పరిస్థితి లేనట్లే కనిపిస్తోంది. ఫలితంగా అతడు ఇంటి నుంచి బయటకు వెళ్లే సూచనలున్నాయి. ఇదిలా ఉంటే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారన్న విషయాన్ని లీకువీరులు మరోసారి సోషల్ మీడియాలో ముందుగానే ప్రకటించేశారు. ఊహించినట్లుగానే అజయ్ బిగ్‌బాస్ హౌస్‌ను వీడనున్నట్లు వెల్లడించారు. మరి ఇదెంతవరకు నిజమో తెలియాలంటే సాయంత్రం 6 గంటలకు ప్రసారమయ్యే బిగ్‌బాస్ నాన్‌స్టాప్ చూడాల్సిందే! చదవండి 👉 ఆ బ్రేకప్‌కు కారణం రోహిత్ శర్మ: సోఫియా టాస్క్ రద్దు చేయాలన్న బాబా, వీల్లేదని అఖిల్ డిమాండ్, ఇరకాటంలో అషూ -
ఒంటరైన మిత్రకు అఖిల్ సాయం, కొత్త కెప్టెన్ ఎవరంటే?
బిగ్‌బాస్ షోలో కెప్టెన్సీ పోటీలో గెలిచారంటే వారం రోజులపాటు ఎలాంటి చీకూచింత లేకుండా హాయిగా గడపొచ్చు. ఎందుకంటే కెప్టెన్ అయితే ఇంటి అధికారాలతో పాటు ఒకవారం నామినేషన్లో లేకుండా ఉండొచ్చు. ఇలాంటి కెప్టెన్సీని చేజిక్కించుకోవడానికి హౌస్మేట్స్ ఎంతగానో కష్టపడతారు. ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో జల జల జలపాతం అనే కెప్టెన్సీ టాస్క్ నడుస్తోంది. ఇందులో మిత్ర, అనిల్, అఖిల్, బాబా భాస్కర్, శివ పాల్గొన్నారు. ఇతర పోటీదారులు వారికి నచ్చిన కంటెండర్ బీకర్లో రంగు నీళ్లను పోయాల్సి ఉంటుంది. మిత్రకు ఎవరూ సపోర్ట్ చేయకపోవడంతో అఖిల్ తన బీకరులో ఉన్న రంగు నీళ్లను మిత్ర బీకర్లో పోశాడు. ఇదిలా ఉంటే రంధ్రాలున్న గ్లాస్లో నుంచి కలర్ వాటర్ బయట పడకుండా ఉండేందుకు రెండు గ్లాసులు సెట్ చేసుకుని కొందరు నీళ్లు పోశారు. దీన్ని అరియానా తప్పుపట్టడంతో సంచాలకురాలు అషూ ఇరకాటంలో పడింది. ఫస్ట్ రౌండ్‌ను క్యాన్సల్ చేయాలని బాబా, అలా ఎలా చేస్తారని అఖిల్ మండిపడ్డారు. ఈ కెప్టెన్సీ టాస్క్ ఎలా నడిచిందో తెలియాలంటే రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే! ఇదిలా ఉంటే ఈ వారం అఖిల్ సార్థక్ కెప్టెన్‌గా నిలిచినట్లు తెలుస్తోంది. చదవండి 👉 మీరు మనుషులేనా? మిత్రను అంతలా హింసిస్తారా? నడిచే నేల, పీల్చే గాలి మీద వారి సంతకం ఉంటుంది, వారి త్యాగాలను మరవద్దు -
అమ్మాయిలా, రాక్షసులా? మిత్ర చేయి విరగ్గొట్టేలా ఉన్నారే!
బాబా భాస్కర్ ఎంట్రీతో బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షో మరింత రసవత్తరంగా మారింది. ఆయన వచ్చీరావడంతోనే బిందుమాధవిని సేవ్ చేయడంతో అందరూ ముక్కున వేలేసుకున్నారు. తాజాగా అతడు కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో సంచాలక్‌గా ఉన్నాడు. అరియానా, హమీదా, బిందుమాధవి, అజయ్, నటరాజ్ మాస్టర్ ఏలియన్స్ టీమ్‌లో, మిగిలినవారంతా హ్యూమన్స్ టీమ్‌లో ఉన్నారు. ఏలియన్స్ దగ్గర ఉన్న బ్యాటరీలను దొంగిలించి పగలగొట్టడం హ్యూమన్స్ పనైతే వారి చేతులకు రంగు పూయడం ఏలియన్స్ పని. ఈ టాస్క్ కోసం రక్తాలు కారేలా ఆడారు హౌస్మేట్స్. అమ్మాయిలా, ఆటంబాంబులా అనేలా రెచ్చిపోయారు ఏలియన్స్ టీమ్ సభ్యులు. అయితే ఈ క్రమంలో వారు గేమ్‌లో శృతి మించిపోయినట్లు కనిపిస్తోంది. హ్యూమన్స్ టీమ్‌లోని మిత్ర శర్మను దొరపుచ్చుకుని ఆమె చేతికి రంగు పూయాలని భావించింది ఏలియన్స్ టీమ్. అనుకున్నదే తడవు పదేపదే ఆమెను టార్గెట్ చేస్తూ దాడి చేసింది. ఆమె చేయి పట్టుకుని లాగుతూ, కిందపడేస్తూ నానారచ్చ చేశారు. కిందపడేసినప్పుడు తనకు దెబ్బలు తాకినా ఏమాత్రం పట్టించుకోకుండా బిందు మాధవి ఆమె చేయి పట్టుకుని లాగింది. ఒకరకంగా చెప్పాలంటే హమీదా, అరియానా, బిందు ఆమెను హింసించారు. దీంతో సోషల్ మీడియాలో వీరిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆమె చేయి విరగ్గొట్టేలా ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిత్ర అవస్థను గుర్తించిన బాబా భాస్కర్వెంటనే వెళ్లి జుట్టు సరిచేసి చెమట తుడిచి గేమ్ పాజ్ చేశాడు. అటు అఖిల్ ఆమె షర్ట్ పైకి పోవడంతో దాన్ని కిందకు సరిచేశాడు. వీళ్లిద్దరూ అంత మానవత్వంతో ప్రవర్తిస్తుంటే ఆ ముగ్గురు మాత్రం మరీ దారుణంగా వ్యవహరించారని తిట్టిపోస్తున్నారు నెటిజన్లు. మిత్ర గేమ్ ఆడిన విధానం బాగుందని మెచ్చుకుంటున్నారు. చదవండి: యశ్ నుంచి ప్రకాశ్ రాజ్ దాకా.. కేజీఎఫ్ 2 నటీనటుల పారితోషికం ఎంతంటే? నన్ను కొట్టింది, నేనూ కొడ్తా: మిత్ర వెనకాల హమీదా పరుగు -
అషూకు ఆదిలోనే దెబ్బ, సిగ్గు లేదంటూ రెచ్చిపోయిన మిత్ర
బాబా భాస్కర్ ఎంట్రీతో బిగ్‌బాస్ హౌస్‌లో సీన్ మారిపోయింది. అతడు వచ్చీరావడంతోనే బిందుమాధవిని నామినేషన్స్‌లో నుంచి సేవ్ చేయడంతో అందరూ ఖంగు తిన్నారు. తన గురించి ఒక్క మాట మాట్లాడలేదేంటని అఖిల్ హర్టయ్యాడు. ఇక బిందును సేవ్ చేసి తనకు జనాల్లో ఎంత పాపులారిటీ ఉందో చెప్పకనే చెప్పేశాడు బాబా. ఇదిలా ఉంటే ప్రస్తుతం హౌస్‌లో కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ నడుస్తోంది. ఇందులో అషూ, శివ, మిత్ర, అఖిల్, అనిల్, బాబా భాస్కర్లను మనుషుల టీమ్‌గా, అరియానా, బిందుమాధవి, అజయ్, హమీదా, నటరాజ్ మాస్టర్లను ఏలియన్స్ టీమ్‌గా విభజించారు. ఈ క్రమంలో ఏలియన్స్ తమదగ్గరున్న వస్తువులను కాపాడుకునే ప్రయత్నం చేయగా హ్యూమన్స్ వాటిని తీసుకుని పగలగొట్టి హ్యూమన్స్ టీమ్‌లో నుంచి ఒక్కొక్కరిని గేమ్‌లో నుంచి తొలగించేందుకు ట్రై చేస్తారు. గేమ్ ఆడే క్రమంలో ఏలియన్స్ స్విమ్మింగ్ పూల్‌లో దూకగా అందుకు వీల్లేదని స్పష్టం చేశాడు బిగ్‌బాస్. అందుకు శిక్షగా అషూ తన దగ్గరున్న మైక్ ధరించడానికి వీల్లేదని ప్రకటించాడు. అయితే ఇదే విషయాన్ని అరియానా చెప్పడానికి ప్రయత్నించగా అషూ అస్సలు వినిపించుకోలేదు. సంచాలక్ చెప్తేనే వింటానంటూ మొండికేయడంతో బాబా భాస్కర్ జరిగింది చెప్పి ఆమె దగ్గర నుంచి మైక్ తీసుకున్నాడు. ఇక గేమ్‌లో హమీదా, మిత్ర కొట్టుకున్నంత పని చేశారు. మిత్ర కొడుతుందని, తాను కూడా కొడతానంటూ ఆమె వెనకాల పరిగెత్తింది హమీదా. తనను కింద పడేయడంతో సిగ్గు లేదు అంటూ అమ్మాయిల మీద అరిచేసింది మిత్ర. ఇక ఈ టాస్క్‌లో హ్యూమన్స్ టీమ్ గెలిచి అందులోని సభ్యులు కెప్టెన్సీ కంటెండర్స్ అయినట్లు తెలుస్తోంది. చదవండి: నన్ను గర్భవతిని చేసి మోసం చేసింది ఆ డైరెక్టర్ కాదు! నిద్రలేని రాత్రులు, రక్తస్రావం, సాగిన చర్మం, గడ్డకట్టిన ప్యాడ్లు.. కాజల్ -
బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్ నుంచి కొరియోగ్రాఫర్‌గా!
బాబా భాస్కర్.. బిగ్‌బాస్ ప్రేక్షకులకు ఈయన గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. చెన్నైలో పుట్టి పెరిగిన ఆయనకు చిన్ననాటి నుంచే డ్యాన్స్ అంటే ఇష్టం. ఈ ఇష్టంతోనే అతడు శివ శంకర్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్‌గా కొన్నేళ్లు పని చేశాడు. తర్వాత సుందరం మాస్టార్‌కు అసిస్టెంట్‌గా చేరాడు. వీళ్లిద్దరూ బాబాకు సినిమా కొరియోగ్రఫీలో ఓనమాలు నేర్పించారు. పాటను ఎలా కొరియోగ్రఫీ చేయాలనేదాన్ని వారి దగ్గరి నుంచే నేర్చుకున్నాడు. తెలుగు, తమిళ చిత్రాల్లో బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌గా కెరీర్ ఆరంభించిన బాబా భాస్కర్ కొత్త బంగారు లోకంతో కొరియోగ్రాఫర్‌గా మారాడు. కేడీ సినిమాతో కోలీవుడ్‌లోనూ కొరియోగ్రాఫర్‌గా అడుగుపెట్టాడు. ఆ సినిమాతో బాబా ఇక వెనక్కు తిరిగి చూసుకోలేదు. రజనీకాంత్, విజయ్, అజిత్, సూర్య, ధనుష్, సిద్దార్థ్, కార్తీ, విజయ్ సేతుపతి, ప్రభుదేవా, విశాల్ వంటి ఎందరో స్టార్ హీరోలతో స్టెప్పులేయించాడు బాబా. తెలుగులో మహేశ్ బాబు, రామ్‌చరణ్, నాగార్జున వంటి బడా హీరోల సినిమాలకు సైతం కొరియోగ్రఫీ చేశాడు. ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్‌గా రాణిస్తోన్న బాబా భాస్కర్ గతంలో బిగ్‌బాస్ మూడో సీజన్లో పాల్గొన్నాడు. అయితే అప్పుడు ఫినాలేకు అడుగు దూరంలో ఆగిపోయిన ఆయన తాజాగా బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షోలో అడుగు పెట్టాడు. ఎనిమిదో వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ఆయన టాప్ 5లో చోటు దక్కించుకుంటాడేమో చూడాలి! -
నామినేషన్స్ రచ్చ.. ఈవారం నామినేషన్స్‌లో ఎవరున్నారంటే
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ రసవత్తరంగా సాగుతోంది. ఈ షోలో అన్ని రోజులు ఒక ఎత్తైతే, నామినేషన్స్ రోజు మరొక ఎత్తు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆరోజు వీరు చేసే రచ్చ మామూలుగా ఉండదు. అప్పటిదాకా కలిసిమెలిసి ఉన్నవాళ్లు కూడా నామినేషన్స్ వచ్చేసరికి మాత్రం అన్నీ పక్కనపెట్టేసి నామినేట్ చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షోలో ఎనిమిదో వారం నామినేషన్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారాయి. షోలో మొదటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్‌లా కలిసున్న అషూ, అరియానా నామినేషన్స్‌లో మాత్రం బద్ద శత్రువులుగా మారినట్లు ప్రోమో చూస్తే అర్థమవుతుంది. ఇక మరోవైపు ఎప్పటిలాగే బిందు, అఖిల్ ఈసారి కూడా నామినేషన్స్‌లో గొడవ పడ్డారు. స్రవంతి అనే ఎమోషన్‌ను యూజ్ చేసుకున్నావంటూ బిందు ఫైర్ అయ్యింది. దీంతో చిర్రెత్తిపోయిన అఖిల్ ఏం మాటలు మాట్లాడుతున్నావ్? పిచ్చిదానిలా మాట్లాడుతున్నావ్ అంటూ మండిపడ్డాడు. అజయ్, హమీదా కూడా ఒకరిని ఒకరు నామినేట్ చేసుకున్నారు. మొత్తానికి వాడివేడిగా సాగిన ఈ ప్రక్రియలో అఖిల్, అషూ, అజయ్, అనిల్, హమీదా, బిందు నిలిచారు. వీరిలో బాబా భాస్కర్ మాస్టర్ పన పవర్‌ని ఉపయోగించి బిందుని సేవ్ చేసినట్లు తెలుస్తోంది. -
దేవుడా, నువ్వున్నావా? ఇది చూస్తున్నావా?: సరయు
బిగ్‌బాస్ షోలో నామినేషన్స్, ఎలిమినేషన్స్ మనం ఊహించినట్లుగా ఉండవు. మరీ ముఖ్యంగా ఎలిమినేట్ అవుతారనుకున్న కంటెస్టెంట్లు ఎక్కువ వారాలు హౌస్‌లో కొనసాగుతే, ఫినాలేకు చేరుకునే సత్తా ఉన్న హౌస్మేట్స్ మధ్యలోనే వెనుదిరుగుతారు. ఇలాంటి అద్భుతాలు ఒక్క బిగ్‌బాస్‌లోనే జరుగుతాయి. తాజాగా బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ షోలో నుంచి మహేశ్ విట్టా ఎలిమినేట్ అయ్యాడు. అతడి స్థానంలో కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్‌ను హౌస్‌లోకి పంపించారు. బాబాను ఇంట్లోకి పంపడం మంచి నిర్ణయమే కానీ చాలా ఆలస్యంగా దాన్ని అమలు చేశారు. అయితే గేమ్‌లో ప్రత్యర్థులకు టఫ్ కాంపిటీషన్ ఇస్తున్న మహేశ్‌ను ఎలిమినేట్ చేయడమే అస్సలు బాగోలేదంటున్నారు ఆయన ఫ్యాన్స్. తాజాగా సరయు సైతం ఇది అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అని అభిప్రాయపడింది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో నేను నమ్మకం కోల్పోయాను. దేవుడా, అసలు నువ్వు నిజంగానే ఉన్నావా? ఇక్కడ జరిగేది గమనిస్తున్నావా? అంటూ భావోద్వేగానికి లోనైంది. ఇతరులను బాధపెట్టడానికి ట్రోల్స్ చేస్తుంటారు. కానీ దానివల్ల వారి కుటుంబాలు నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది. మానసిక ఆరోగ్యం దెబ్బతిని డిప్రెషన్లోకి కూడా వెళ్తుంటారు అని అఖిల్ సార్థక్ తల్లి దుర్గ ఓ పోస్ట్ షేర్ చేసింది. దీనికి సరయు స్పందిస్తూ కరెక్ట్‌గా చెప్పారు ఆంటీ అంటూ ఆ పోస్ట్‌ను తిరిగి షేర్ చేసింది. చదవండి: సమంత ఒంటిపై మూడు టాటూలు, పచ్చబొట్టు వేయించుకోవద్దంటున్న సామ్ గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లాడిన బిగ్‌బాస్ కంటెస్టెంట్ -
బిగ్‌బాస్ షోలో బాబా భాస్కర్, కాకపోతే ఓ ట్విస్ట్!
బాబా భాస్కర్.. బిగ్‌బాస్ ప్రేక్షకులకు ఈ పేరును కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. మూడో సీజన్లో ఆయన చేసిన సందడి అంతా ఇంతా కాదు. శ్రీముఖితో చేసిన కామెడీకి జనాలు పొట్టచెక్కలయ్యేలా నవ్వారు. కొరియోగ్రాఫర్ బాబాలో కామెడీ యాంగిల్ కూడా ఉందని నిరూపించాడు. ఇప్పుడు ఈయన పేరు ఎందుకు ప్రస్తావించామో మీకీపాటికే అర్థమై ఉంటుంది. తాజాగా అతడు బిగ్‌బాస్ ఓటీటీలోనూ అడుగుపెట్టాడు. ఈ మేరకు బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ఓ ప్రోమో రిలీజ్ చేసింది. నా ఇంటికి వచ్చేశాను అంటూ సంతోషం వ్యక్తం చేశాడు బాబా. అతడి ఎనర్జీని చూసి ఆశ్చర్యపోయిన నాగ్ మీరు ముదురులా ఉన్నారే అంటూ పంచ్ వేశాడు. ఇదిలా ఉంటే ఈరోజు మహేశ్ విట్టా ఎలిమినేట్ అవనున్నట్లు జోరుగా ప్రచారం నడుస్తోంది. అనంతరం రేపటి నామినేషన్స్ పర్వం ముగిశాక బాబాను హౌస్‌లోకి పంపించనున్నారట. అప్పటివరకు అతడిని సీక్రెట్ రూమ్‌లో ఉంచనున్నట్లు తెలుస్తోంది. మరి షో ప్రారంభమైన ఏడు వారాల తర్వాత హౌస్‌లో అడుగు పెట్టబోతున్న బాబా భాస్కర్‌ను హౌస్మేట్స్ ఎలా ఆదరిస్తారో చూడాలి! చదవండి: పదిహేను రోజుల్లోనే ఓటీటీలోకి గని, ఆహా ట్వీట్ చూశారా? నిఖిల్ పాన్ ఇండియా సినిమా టైటిల్ ఇదే, దసరా పండుగే టార్గెట్ -
స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుట్, బాబా భాస్కర్ వైల్డ్‌కార్డ్ ఎంట్రీ!
బుల్లితెరపై ప్రసారమయ్యే బిగ్‌బాస్‌ను ఓటీటీలోకి తెస్తే ఎలా ఉంటుంది? బిగ్‌బాస్ హౌస్‌లో జరిగేదాన్ని గంట ఎపిసోడ్‌గా చూపించడం కంటే కంటెస్టెంట్లు ఏం చేస్తున్నారో తెలుసుకునేందుకు 24 గంటలు చూసేలా లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేస్తే ఇంకెలా ఉంటుంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా పుట్టుకొచ్చిందే బిగ్‌బాస్ ఓటీటీ. హిందీ, తమిళంలోనూ వర్కవుట్ అయిన ఈ బిగ్‌బాస్ ఓటీటీ తెలుగులో ప్రారంభమై ఏడువారాలవుతోంది. 17 మందితో ప్రారంభమైన ఈ షోలో ప్రస్తుతం 11 మంది మాత్రమే మిగిలారు. శ్రీరాపాక, చైతూ, సరయు, తేజస్వి, ముమైత్ ఖాన్, స్రవంతి వరుసగా ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం అనిల్, నటరాజ్, శివ, మిత్రా శర్మ, బిందు మాధవి, అఖిల్, అరియానా, మహేశ్ విట్టా నామినేషన్లో ఉన్నారు. వీరిలో అఖిల్, బిందు మాధవి ఓట్ల రేసులో దూసుకుపోతున్నారు. అరియానా, శివ మొదటి నుంచి మంచి గేమ్ ఆడుతుండటంతో వీరికంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. ఓట్ల విషయం పక్కన పెడితే ఎప్పటిలాగే ఈవారం కూడా మిత్ర శర్మ సేఫ్. మిగిలిందల్లా అనిల్, మహేశ్. ఇద్దరూ గేమ్ ఎవరి స్టైల్లో వారు గేమ్ ఆడుతున్నారు, కానీ శ్రమకు తగ్గ గుర్తింపు మాత్రం దొరకడం లేదు. ఇంకా చెప్పాలంటే అనిల్ ఇంట్లో ఉండీలేనట్టుగా ఉంటున్నాడు. చదవండి: ప్రియురాలితో యాంకర్ వివాహం, నెట్టింట ఫొటోలు వైరల్ అటు మహేశ్ గతంలో కంటే కూడా చాలా మెరుగయ్యాడు. హౌస్‌మేట్స్‌కు టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నాడు. టాప్ 5కి చేరుకునే సత్తా ఉంది. కానీ అనూహ్యంగా అతడిని ఎలిమినేట్ చేసినట్లు తెలుస్తోంది. ఏడో వారం మహేశ్ ఎలిమినేట్ అయ్యాడని లీకువీరులు దండోరా వేసి చెప్తున్నారు. నిజానికి ఓట్ల పరంగా అతడు మెరుగైన స్థానంలోనే ఉన్నప్పటికీ కావాలనే అతడిని గేమ్ నుంచి తప్పించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే గేమ్‌లో కొట్లాటలు తప్ప పెద్దగా కామెడీ లేకుండా పోవడంతో బిగ్‌బాస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మూడో సీజ్‌లో పాల్గొన్న బాబా భాస్కర్‌ను హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పంపించనున్నట్లు తెలుస్తోంది. మరి బిగ్‌బాస్ ప్లాన్ ఏమేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి! చదవండి: అమ్మ నన్ను ఇంట్లో నుంచి గెంటేసింది: యాంకర్ -
నా కన్నతల్లిని ఎప్పుడూ చూడలేదు: కన్నీళ్లు పెట్టుకున్న మిత్ర
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షోలో ఎన్నో ప్రయత్నాల అనంతరం ఎట్టకేలకు కెప్టెన్ అయ్యాడు యాంకర్ శివ. మరోపక్క కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో అయోమయంతో నిర్ణయాలు తీసుకున్న అషూ వరస్ట్ కంటెస్టెంట్‌గా ఎంపికై జైలు పాలయ్యింది. ఇదిలా ఉంటే తాజాగా బిగ్‌బాస్ వారికి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకునే అవకాశం కల్పించాడు. కొన్ని ఫ్యామిలీ ఫొటోలను పంపించి దానితో మీకున్న అనుభవాలను తెలియజేయమన్నాడు. ఈ సందర్భంగా నటరాజ్ మాస్టర్ తను డ్యాన్స్ చేస్తున్నట్లుగా ఉన్న ఫొటో చూపిస్తూ ఎమోషనలయ్యాడు. 'చదువుకోకుండా డ్యాన్సులేంట్రా? ప్రభు మాస్టర్ ఏమైనా ఫుడ్ పెడతాడా? అని తిట్టేవారు. కానీ ఈరోజు నేను ఫుడ్ తింటున్నాను, నా ఫ్యామిలీని చూసుకుంటున్నాను, ఇంతపెద్ద ప్లాట్‌ఫామ్ మీదకు వచ్చి మీకు ఫుడ్ పెడుతున్నాను అంటే అదంతా ప్రభు మాస్టర్ వల్లే' అని చెప్పుకొచ్చాడు. శివ తన ఫ్యామిలీ ఫొటో చూపిస్తూ.. ఈ ఫొటో తర్వాత అమ్మవాళ్లతో కలిసిలేను. అమ్మ నన్ను ఇంట్లో నుంచి పంపించేసింది అని బాధపడ్డాడు. తర్వాత మిత్ర తన చిన్ననాటి ఫొటో చూపిస్తూ భావోద్వేగానికి లోనైంది. 'నన్ను పట్టుకున్న చేయి మా అమ్మది, కానీ నా కన్నతల్లిని నేనెప్పుడూ చూడలేదు. అమ్మ చేయి మాత్రమే నాకు తెలుసు' అని తెలిపింది. తర్వాత అనిల్ వంతు రాగా నా కంటే ముందు అన్నయ్య ఉండేవాడు, కానీ పుట్టిన రెండు రోజులకే చనిపోయాడు అంటూ ఏడ్చేశాడు. అటు బిందుమాధవి కూడా అన్నయ్యతో దిగిన ఫొటోలు చాలా తక్కువ అని, అతడిని మిస్ అవుతున్నానని చెప్పింది. చదవండి: ప్రియురాలితో యాంకర్ వివాహం, నెట్టింట ఫొటోలు వైరల్ ప్రేక్షకులు మెచ్చిన తెలుగు వెబ్ సిరీస్‌లు ఇవే.. -
Bigg Boss Non Stop: ఫేక్ అకౌంట్లతో నటరాజ్ ఫ్యామిలీపై ట్రోలింగ్!
తెలుగు రాష్ట్రాల్లో బిగ్‌బాస్‌కు ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. ఐదు సీజన్స్ దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ షో.. ప్రయోగాత్మకంగా ఓటీటీలో ప్రారంభించగా, అక్కడ కూడా చక్కటి ఆదరణను సంపాదించుకుంటుంది. కంటెంస్టెంట్ల కొట్లాటలతో గేమ్ రోజు రోజుకు రసవత్తరంగా సాగుతుంది. 17 మందితో ప్రారంభమైన బిగ్‌బాస్ నాన్‌స్టాప్ లో ప్రస్తుతం 11 మంది మిగిలారు. వీరంతా గేమ్‌ని చాలా సీరియస్‌గా తీసుకొని ఆడుతున్నారు. ఇక నటరాజ్ మాస్టర్ అయితే ఫోకస్ అంతా బిగ్‌బాస్ ట్రోపీ పైనే పెట్టాడు. బిగ్‌బాస్ 5లో పాల్గొని, తనదైన ఆటతీరు, ముక్కుసూటితనంతో వేలాది మంది అభిమానులను సంపాందించుకున్నాడు నటరాజ్. అయితే తన కోపం వల్లే ఐదో సీజన్లో ఫైనల్ వరకు వెళ్లలేకపోయాడు. దీంతో బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో ఆయన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ.. ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. ఎలాంటి గ్రూపులో చేరకుండా.. ఒంటరిగానే గేమ్ ఆడుతూ అందరిని ఆకట్టుకుంటున్నాడు. అందుకే ఆయన ఇప్పటికీ హౌస్‌లో ఉన్నాడు. ఇక ఇలాంటి రియాల్టీ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్‌పై ట్రోలింగ్ అనేది సహజమే. కొంతమంది తమకు నచ్చిన కంటెస్టెంట్‌ని పొగుడుతూ.. ప్రత్యర్థులను తిడుతుంటారు. అయితే దానికి ఓ కారణం, సందర్భం ఉంటేనే ఫ్యాన్స్ ఇతరులను ట్రోలింగ్ చేస్తుంటారు. కానీ నటరాజ్ మాస్టర్ విషయం అలా జరగడం లేదు. కొంతమంది ఆయన ఫ్యామిలీపై అభ్యంతరకరంగా కామెంట్స్ చేయడం వివాదంగా మారింది. సోషల్ మీడియాలో కొంతమంది ఫేక్ అకౌంట్లు సృష్టించి, నటరాజ్‌ని, వాళ్ల కుటుంబ సభ్యుల్ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారని మాస్టర్ సన్నిహితులు చెబుతున్నారు. అసభ్యకరంగా కామెంట్స్ చేస్తున్నారంటూ నటరాజ్ ఫ్యామిలీ సభ్యులు సైబర్ పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఫిర్యాదును అందుకున్న సైబర్ క్రైం డిపార్ట్మెంట్ .. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం, నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నవారిని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చిందట. బిగ్‌బాస్ కంటెస్టెంట్లు తమ ఆటని తాము పొగుడుకోవాలి గానీ ఇంకొకరి భార్యల్ని, పిల్లల్ని, కుటుంబాల్ని బయట నుంచి దూషించడం తగదని కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వాస్తవానికి బిగ్‌బాస్ లాంటి రియాల్టీ షోలోకి వెళ్లే కంటెస్టెంట్స్ ముందే ఓ గట్టి పీఆర్ టీమ్‌ని ఏర్పాటు చేసుకుంటుంది. వాళ్లు హౌస్‌లో ఉంటే బయట పీఆర్ టీమ్ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తుంది. అయితే తమ కంటెస్టెంట్స్‌ని పొగుడుతూ ప్రచారం చేస్తే బాగుంటుంది కానీ...తమవారిని హైలెట్ చేయడం కోసం ఇతరులను ట్రోల్ చేయడం సరికాదు. -
అజయ్‌కు అరియానా గోరుముద్దలు, అడ్డుపడ్డ అషూ!
ప్రయోగాత్మకంగా ప్రారంభమైన బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌కు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. కంటెస్టెంట్ల కొట్లాటలతో ఆట మరింత రంజుగా మారుతోంది. 17 మందితో ప్రారంభమైన బిగ్‌బాస్ షోలో ప్రస్తుతం 11 మంది మిగిలారు. తాజాగా కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో వీరిని జంటలుగా విభజించి అషూను సంచాలకురాలిగా వ్యవహరించాలని ఆదేశించాడు బిగ్‌బాస్. ఈ క్రమంలో కంటెస్టెంట్ల మధ్య గొడవలు రాజుకుంటున్నట్లు తెలుస్తోంది. గురువారం రిలీజ్ చేసిన ప్రోమోలో అషూ, అరియానా మధ్య వార్ నడిచినట్లు కనిపిస్తోంది. అరియానా ప్లేటులో భోజనం పెట్టుకొని వచ్చి అజయ్‌కు తినిపించింది. అయితే ముందు కార్డు చూపించంటూ కెప్టెన్ అషూ పదేపదే అడగడంతో అన్నం మీద అలిగి వెళ్లిపోయింది అరియానా. ప్లేటులో ఫుడ్డు పెట్టుకొని వచ్చి ఎమోషన్స్ వాడుకుందామనుకుంటే కరెక్ట్ కాదని వ్యాఖ్యానించింది అషూ. దీనికి అరియానా.. వేరేవాళ్లను బ్యాడ్ చేసి గేమ్ ఆడటంలేదంటూ కౌంటరిచ్చింది. ఇక శివ బెడ్రూమ్లో తింటూ దొరికిపోవడంతో అతడిని బయటకు పంపించేసింది అషూ. బయటకు వచ్చిన శివ కోపంతో నీళ్ల బాటిల్‌ను నేలకేసి కొట్టాడు. ఇంతకూ ఈ గేమేంటి? ఈ గేమ్‌లో ఎవరి జోడీ గెలుస్తుంది? అన్నది తెలియాలంటే రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: ప్రముఖ హాస్య నటుడు కన్నుమూత వాడు అమ్మాయి టచ్ కోరుకున్నాడు: అజయ్ -
ఛీ, అషూ నువ్వు అమ్మాయివేనా? అజయ్ నోటికొచ్చినట్లు వాగుతావా?
బిగ్‌బాస్ షోలో హద్దులు మీరి ప్రవర్తించినా, బూతులు మాట్లాడినా దాన్ని ఎడిటింగ్‌లో తీసే ఆస్కారం ఉండేది. కానీ బిగ్‌బాస్ తెలుగు ఓటీటీలో మాత్రం అలాంటి చాన్స్ లేదు. 24 గంటలు లైవ్ స్ట్రీమింగ్ ఉండటంతో కంటెస్టెంట్లు ఏం మాట్లాడినా, ఏం చేస్తున్నా ప్రతీది ప్రేక్షకుడు ఓ కంట గమనిస్తూనే ఉంటాడు. అయితే నాన్‌స్టాప్ షోలో ఆది నుంచి వల్గర్ జోకులు, బూతుపురాణం నడుస్తూనే ఉంది. ఈసారి ఆ హాస్యం మరింత హద్దు మీరింది. నిన్నటి కెప్టెన్సీ కంటెండర్స్ టాస్కులో అఖిల్, బిందును ఒక టీమ్‌గా ఏర్పాటు చేశాడు బిగ్‌బాస్. వీళ్లు మిగతా జోడీలకంటే బాగానే ఆడుతున్నారు. అయితే ఈ గేమ్‌కు సంచాలకురాలిగా ఉన్న అషూ మాత్రం ఎప్పటిలాగే తన నోటి దురుసు ప్రదర్శించింది. అఖిల్.. మిత్ర దగ్గరకు వెళ్లి తనకు, బిందుకు రెండు యాపిల్స్, రెండు అరటిపండ్లు, రెండు ఆరెంజ్ కావాలని డీల్ మాట్లాడుకుంటున్నాడు. ఇది విన్న అషూ టాస్క్ ఆడబోతున్నారా? ఫస్ట్ నైట్‌కు పోతున్నారా? అంటూ సెటైర్ వేసింది. దీనికి అఖిల్ ఏమీ అనకుండా ఓ నవ్వు విసిరాడు. ఇక మరో చోట అఖిల్, అషూ, అజయ్, నటరాజ్ బెడ్ మీదకు చేరి ముచ్చట్లు పెట్టారు. ఆ సమయంలో అఖిల్.. అజయ్ చెవిలో శివ, బిందు హీరోహీరోయిన్స్ అంటూ ఊదాడు. దీనికి అజయ్ దుప్పట్లో దడదడే అంటూ కామెంట్ చేయగా మధ్యలో అషూ అందుకుని ముసుగులో గుద్దులాట అని మాట్లాడింది. దీంతో ఓ అడుగు ముందుకేసిన అజయ్ గోడకేసి గుద్దు అంటూ ఓ టైటిల్ ఇచ్చాడు. ఈ సంభాషణ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారగా ఇంత నీచంగా మాట్లాడతారా? అని ఫైర్ అవుతున్నారు నెటిజన్లు. అషూ ఒక అమ్మాయి అయి ఉండి మరో ఆడదాని గురించి ఇంత దారుణంగా మాట్లాడుతుందా? అని తిట్టిపోస్తున్నారు. ఇక నటరాజ్ మాస్టర్, అజయ్.. నామినేషన్స్ గురించి మాట్లాడుకున్నారు. హమీదా తల మీద చేయి వేసి మాట్లాడుతుంది. ఆమె తనకు అమ్మలాగా అనిపిస్తుందని, తనకోసమే నామినేట్ అయ్యానని అనిల్ బిందుతో చెప్పాడట అంటూ నటరాజ్ మాస్టర్ చెప్పుకొచ్చాడు. దీనికి అజయ్.. వాడు అమ్మాయి టచ్ కోరుకున్నాడు అని అడ్డగోలుగా ఆన్సరిచ్చాడు. దీంతో అజయ్‌ను సైతం నెట్టింట ఆడేసుకుంటున్నారు. బిందుమాధవి, హమీదాలకు కనీస మర్యాద ఇవ్వండని డిమాండ్ చేస్తున్నారు. “Whenever you think about disrespecting a woman, think about how you were born into this world.” #BinduMadhavi RESPECT GIRLS IN BB NON STOP#BiggBossNonStop pic.twitter.com/nYm0SZRgeO — Raju Reddy (@RajuRed55149023) April 12, 2022 Statements passed by AS which exposed male chauvinist attitude out of him 1. Pampering kaavala? 2. Nenu kalaloki vastunna anindi 3. Punishment ga massage cheyamani adgatam All on a single strng woman #Bindu Y soo insecure Mr. AS? Verry disgusting to c this#BiggBossNonStop — 𝑀𝒶𝒽𝑒𝓈𝒽 ✨😇 (@ursTrulyMahi88) April 9, 2022 #BinduMadhavi #BiggBossNonStop I want body massage I want Mango pandu I want eat Mango pandu I want Mango Pandu rasalu Dupatlo dadthad Musugulo gudulata Godamida vese dadthad. Aada sentiment drama .#akhilsarthak and gang talks about a woman. RESPECT GIRLS IN BB NON STOP — N Harsha (@harshanamburi) April 12, 2022 Again and again. Akhil to Mithraw on deal: Me and Bindu need 2 apple, 2 banana, 2 orange Ashu to akhil: Task adapothunara, first night ku pothunara 😡😡😡 its going worse day by day. Passing sexualized jokes over Bindu.#BiggBossNonStop — Vijay (@Vijay2itz) April 12, 2022 🤐 no words .. very disturbing behavior.. @DisneyPlusHSTel @DisneyPlusHS @iamnagarjuna @StarMaa please address this or eliminate them . #BiggBossNonStop #BinduMadhavi https://t.co/XBZh1F5WzO — Sirisha (@jayareddyv) April 13, 2022 చదవండి: మిత్ర శర్మ నాకు రూ.5 లక్షలు ఇస్తానని చెప్పింది: స్రవంతి చిరంజీవిని గట్టిగా కొట్టాను, ముఖం ఎరుపెక్కిపోయింది: రాధిక -
కలిసిపోయిన అఖిల్- బిందు, ఇక రచ్చరచ్చే!
'అరేయ్ అఖిల్.. ఒసేయ్ బిందూ..' అంటూ ఒకరి మీద ఒకరు నోరు పారేసుకున్నారు బిగ్‌బాస్ కంటెస్టెంట్లు. ఎవరూ తగ్గేదేలే అన్న రీతిలో గొడవపడ్డారు. ఈ దెబ్బతో అఖిల్, బిందు మాట్లాడుకోవడం కల్ల అనుకున్న తరుణంలో బిగ్‌బాస్ అనూహ్యంగా వాళ్లిద్దరినీ కలిపాడు. అవును, ఓ టాస్క్‌లో ఈ ఇద్దరినీ ఒక టీమ్‌గా ఏర్పాటు చేశాడు. బిగ్‌బాస్ హౌస్‌మేట్స్‌కు 'ఇది మా అడ్డా' అనే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా ఇంటిని ఐదు ప్రాంతాలుగా విభజించాడు. ఇంటిసభ్యులను కూడా ఐదు టీములుగా విభజిస్తూ ఒక్కో ప్రాంతాన్ని వారికి అప్పగించాడు. అఖిల్ - బిందు, అజయ్- అరియానా, యాంకర్ శివ- నటరాజ్, అనిల్- హమీదా జంటలుగా విడిపోయారు. కెప్టెన్ అషూ సంచాలకురాలిగా వ్యవహరించింది. ఈ గేమ్‌లో అఖిల్- బిందు కలిసి ఆడుతూ ఎత్తుకు పైఎత్తులు వేశారు. బిందు అయితే ఏకంగా అరియానా పాస్‌లు కొట్టేసి అఖిల్ చేతిలో పెట్టింది. ఇప్పటివరకు వీళ్ల కొట్లాటలనే చూశాం, మరి వీరి గేమ్ చూడాలంటే రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: ఆస్కార్ విన్నర్ నిర్మాత నిశ్చితార్థం.. ఎమోషనల్‌గా పోస్ట్ మిత్ర శర్మ నాకు రూ.5 లక్షలు ఇస్తానని చెప్పింది: స్రవంతి -
కోలీవుడ్ హీరోతో బిందు మాధవి ప్రేమలో ఉందా? ట్వీట్ వైరల్
తెలుగమ్మాయి బిందు మాధవి టాలీవుడ్లో కంటే కోలీవుడ్‌లోనే ఎక్కువ పాపులర్ అయ్యింది. ఆవకాయ బిర్యానీతో తెలుగులో హీరోయిన్గా మంచి గుర్తింపు సాధించినా అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. దీంతో కొన్నాళ్లు తెలుగుతెరపై ఎక్కడా కనిపించలేదు. కానీ బిగ్‌బాస్ పుణ్యమా అని మళ్లీ ఇన్నాళ్లకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తనదైన ఆటతీరుతో ఆశ్చర్యపరుస్తున్న బిందుకు సోషల్ మీడియాలోనూ సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వోటింగ్ విషయంలోనూ ముందంజలో ఉంటూ టైటిల్ హాట్ ఫేవరేట్‌గా దూసుకుపోతుంది. అయితే తాజాగా బిందు లవ్ ఎఫైర్ గురించి ఓ వార్త సోషల్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. తమిళ యంగ్ హీరో హరీష్ కళ్యాణ్ బిందు మాధవికి సపోర్ట్ చేస్తూ చేసిన ట్వీట్ ఇందుకు కారణం. గతంలో వీరిద్దరు రిలేషన్లో ఉన్నారని జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా ఈ కోలీవుడ్ హీరో బిందుకు సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేయడంతో మరోసారి ఈ రూమర్స్ తెరపైకి వచ్చాయి. కాగా తమిళ సీజన్1లో బిందు మాధవి పాల్గొన్న సంగతి తెలిసిందే. హీరో హరీష్ కళ్యాణ్ కూడా అదే సీజన్లో మరో కంటెస్టెంట్‌గా ఉన్నాడు. ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందని టాక్ వచ్చింది. తాజాగా మరోసారి ఈ విషయం తెరపైకి వచ్చింది. Best wishes to my dear friend @thebindumadhavi your doing a great job in #BiggBossNonStopTelugu 🔥👌🤗#BiggBossNonStopTelugu #ShowStealerBindu — Harish Kalyan (@iamharishkalyan) April 10, 2022 -
మిత్ర నాకు రూ.5 లక్షలు ఇస్తానంది: స్రవంతి
అన్ని రకాల ఎమోషన్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారింది బిగ్‌బాస్. కోపతాపాలు, ఆనందాశ్యర్యాలు, అరుపులు, కేకలు, ఏడుపులు, పెడబొబ్బలు, అలకలు, అసూయలు, ఆవేశాలు, దిగులు.. ఇలా అన్నింటినీ చూపిస్తున్నారు హౌస్మేట్స్. ప్రేక్షకులు వారి గేమ్, ప్రవర్తనను పరిగణనలోకి తీసుకుని ఓట్లు గుద్దుతున్నారు. ఇదిలా ఉంటే బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ప్రారంభమై నెల రోజులు దాటిపోగా ఇప్పటివరకు ఆరుగురు ఎలిమినేట్ అయ్యారు. అందులో ముమైత్ తొలివారమే ఎలిమినేట్ కాగా ఆమెను వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్‌లోకి పంపించారు. కానీ ప్రేక్షకులు ఆమెను మరోసారి ఎలిమినేట్ చేయడం గమనార్హం. నిన్నటి ఎపిసోడ్లో డబుల్ ఎలిమినేషన్ ద్వారా ముమైత్‌తో పాటు స్రవంతి కూడా హౌస్ నుంచి బయటకు వచ్చింది. చదవండి: బుల్లితెర నటుడి కొత్త ఇల్లు.. కోట్లల్లో ధర.. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మిత్ర శర్మ గురించి చెప్పుకొచ్చింది. 'బిగ్‌బాస్ హౌస్‌లో నా లైఫ్ గురించి చెప్పినప్పుడు మిత్ర ముందుకు వచ్చి రూ.5 లక్షలు ఇస్తానంది. మీరు బాధపడకండి, నా ఇంట్లో పనిచేసే అమ్మాయికి రూ.10 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేశాను. అలాంటిది మీరు నన్ను దగ్గరుండి చూసుకున్నారు. తినిపించారు. నా ఆరోగ్యం బాగోలేనప్పుడు కూడా బాగోగులు చూసుకున్నారు. అమ్మలా, అక్కలా చూసుకున్నారు. మీకు రూ.5 లక్షలిస్తాను అని చెప్పింది. నేనెవరో పూర్తిగా తెలియకపోయినా మిత్ర శర్మ నాకోసం అలా మాట్లాడటం నచ్చింది. అందుకే ఆమెకు ఎక్స్ట్రా హగ్ ఇచ్చాను' అని తెలిపింది స్రవంతి చొక్కారపు. చదవండి: లుంగీ ఎత్తడమేంటి? ఆ బూతులేంటి?: నాగార్జున ఫైర్ -
'ఒరేయ్ అఖిల్, ఒసేయ్ బిందూ' ఈ వారం నామినేషన్స్‌లో ఎవరున్నారంటే?
బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్ల నిజస్వరూపాలు బయటపడేవి నామినేషన్స్‌లోనే! అప్పటిదాకా కలిసిమెలిసి ఉన్నా ఒకరినొకరు నవ్వుతూ పలకరించుకున్నా నామినేషన్స్ వచ్చేసరికి మాత్రం అన్నీ పక్కనపెట్టేసి నామినేట్ చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షోలో ఏడోవారం నామినేషన్స్ రసవత్తరంగా మారాయి. హమీదా.. అనిల్‌ను నామినేట్ చేసినట్లు కనిపిస్తోంది. ఇక నటరాజ్ మాస్టర్, యాంకర్ శివ ఎప్పటిలాగే ఓ రేంజ్లో గొడవపడ్డారు. అటు బిందుమాధవి, అఖిల్ కూడా మరోసారి కొట్లాటకు దిగారు. స్రవంతి అనే ఎమోషన్‌ను యూజ్ చేసుకున్నావని ఫైర్ అయింది బిందు. తనకు కావాల్సినప్పుడు నువ్వు నిలబడలేదంటూ మండిపడింది. అంతటితో ఆగకుండా ఒరేయ్ అఖిల్‌గా చెప్పురా.. అనడంతో అక్కడున్నవాళ్లు ముక్కున వేలేసుకున్నారు. తనను అంతమాట అన్నాక అఖిల్ ఆగుతాడా? ఒసేయ్ బిందు.. ఏం చెప్పాలే నీకు అని రివర్స్ కౌంటరిచ్చాడు. మొత్తానికి వాడివేడిగా సాగిన ఈ ప్రక్రియలో అఖిల్, బిందుమాధవి, అరియానా, శివ, నటరాజ్ మాస్టర్, మిత్ర, అనిల్ శర్మ నామినేషన్స్‌లో నిలిచారు. అషూ తన కెప్టెన్సీ పవర్‌తో మహేశ్‌ను నామినేట్ చేసినట్లు తెలుస్తోంది. చదవండి: ఆ ఐదుగురికి హగ్, ఒక్కరికి మాత్రం పంచ్ ఇచ్చిన స్రవంతి -
ముమైత్, స్రవంతి ఎలిమినేట్, ఏడ్చేసిన బిందుమాధవి
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షోలో ఆరోవారం ఎలిమినేషన్ జరిగింది. ఈసారి డబుల్ ఎలిమినేషన్‌తో సర్ప్రైజ్ చేశాడు నాగ్. ఈ వారం నామినేషన్లో పది మంది ఉండగా అందులో ముమైత్ ఖాన్, స్రవంతిని ఎలిమినేట్ చేసి బయటకు పంపించేశారు. అయితే దీనికంటే ముందు నటరాజ్ మాస్టర్, యాంకర్ శివపై మండిపడ్డాడు నాగ్. లుంగీ ఎత్తుతూ నటరాజ్‌ను రెచ్చగొట్టేలా ప్రవర్తించడం తప్పని శివను హెచ్చరించాడు నాగార్జున. అలాగే నోటికొచ్చినట్లు మాట్లాడటం కూడా తప్పంటూ నటరాజ్‌ను మందలించాడు. అనంతరం అషూ డ్రెస్‌ను బాత్రూమ్లో కిందపడేసి తొక్కిన శివ వీడియోను ప్లే చేసి చూపించాడు. ఆ పని చేయడం కరెక్టేనా అని ప్రశ్నిస్తూ అతడికి ఏం పనిష్మెంట్ ఇవ్వాలని బిందుమాధవిని అడిగాడు. అలా చేయడం తప్పని చెప్పిన బిందు వారం రోజులవరకు అమ్మాయిల బట్టలు ఉతకాలని చెప్పింది. దీంతో ఇదే శిక్షను ఫైనల్ చేశాడు నాగ్. అనంతరం స్రవంతి, ముమైత్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. స్రవంతి వెళ్లిపోతుంటే బిందుమాధవి ఏడ్చేసింది. ఆమె కంట్లో నుంచి మొదటిసారి కన్నీళ్లు చూస్తున్నానన్నాడు నాగ్. మరోవైపు స్రవంతి.. షోలో నుంచి వెళ్లిపోతున్నానన్న బాధ కన్నా అఖిల్, అజయ్‌ను మిస్ అవుతున్నానన్న బాధే ఎక్కువగా ఉందని ఎమోషనలైంది. అనంతరం తన పర్సనాలిటీని కించపరచడం నచ్చలేదంటూ నటరాజ్ మాస్టర్‌కు పంచ్ ఇచ్చింది. ఎవరిని హగ్ చేసుకుంటావు అన్న ప్రశ్నకు అఖిల్ పేరును చెప్తూ ఏడ్చేసింది. అలాగే అజయ్, అషూ, బిందు మాధవి, అరియానాలకు హగ్ ఇచ్చి వీడ్కోలు తీసుకుంది. చదవండి: కిరాక్ ఆర్పీ ఇల్లు చూశారా? లిఫ్ట్, హోమ్ థియేటర్.. అబ్బో ఇలా చాలానే ఉన్నాయి! చూడకూడని స్థితిలో బావను చూశాను, విడిపోదామనుకున్నా: ఏడ్చేసిన అరియానా -
ఆమె నోరు తెరిస్తే బూతులే, శివకు కఠిన శిక్ష విధించిన నాగ్!
ఎప్పుడూ కూల్‌గా ఉంటూ నవ్వుతూనే చురకలు అంటించే నాగార్జున ఈసారి మాత్రం విశ్వరూపం చూపించాడు. హద్దులు మీరి మాట్లాడుతూ అతి చేస్తున్న బిగ్‌బాస్ నాన్‌స్టాప్ కంటెస్టెంట్లపై ఫైర్ అయ్యాడు. ఈ క్రమంలో యాంకర్ శివ, నటరాజ్ మాస్టర్లకు గట్టి వార్నింగే ఇచ్చాడు. ఇదిలా ఉంటే హౌస్‌మేట్స్‌తో ఫన్నీ టాస్క్ కూడా ఆడించాడు నాగ్. హౌస్‌లో బూతులు మాట్లాడే కంటెస్టెంట్ ఎవరని ప్రశ్నించగా నటరాజ్ అషూరెడ్డి అని ఆన్సరిచ్చాడు. అషూ పచ్చిబూతులు మాట్లాడుతుందా అని నాగ్ ఆశ్చర్యం వ్యక్తం చేయగా మా మమ్మీ చూస్తే ఇంటికెళ్లాక చీపురుకట్ట తిరగేస్తుందని వాపోయింది అషూ. శివ ఒక హౌస్‌మేట్ డ్రెస్సును బాత్రూమ్ బ్రష్‌తో ఉతికేసిన వీడియోను చూపిస్తూ గరమయ్యాడు నాగ్. శివ చేసింది కరెక్టా? అని బిందు మాధవిని అడగ్గా ఆమె తప్పని బదులిచ్చింది. శివ ఏదో చెప్పడానికి ప్రయత్నించగా షటప్ అంటూ అతడి నోరు మూయించాడు. ఈ వారమంతా అమ్మాయిల బట్టలు ఉతకాలని పనిష్మెంట్ ఇచ్చాడు. అలాగే ఈ రోజు సింగిల్ ఎలిమినేషన్ కాదని, డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని హౌస్‌మేట్స్‌ను టెన్షన్ పెట్టాడు నాగ్. అయితే ఆ ఇద్దరు ముమైత్ ఖాన్, స్రవంతి అని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. చదవండి: కిరాక్ ఆర్పీ ఇల్లు చూశారా? లిఫ్ట్, హోమ్ థియేటర్.. అబ్బో ఇలా చాలానే ఉన్నాయి! డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్! ఆ ఇద్దరు బ్యాగు సర్దేయాల్సిందే! -
లుంగీ ఎత్తడమేంటి? ఆ బూతులేంటి?: నాగార్జున ఫైర్
సాధారణంగా బిగ్‌బాస్ షోలో సండే అనగానే ఫండే అంటూ ఎపిసోడ్ స్టార్ట్ చేస్తాడు నాగార్జున. కానీ బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ షోలో మాత్రం ఫన్ అండ్ ఫ్రస్టేషన్ రెండూ చూపిస్తాడు. ఇక ఈ వారం అయితే ఎన్నడూ లేనంతగా సీరియస్ అయ్యాడు. హౌస్మేట్స్ ప్రవర్తనపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యాడు. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. ముందుగా నాగ్ హౌస్‌మేట్స్‌ను ఒక్కొక్కరిగా కన్ఫెషన్ రూమ్‌లోకి పిలుస్తూ నిన్ను మోసం చేస్తుంది ఎవరో చెప్పాలన్నాడు. మోసం చేసేంత చనువు తానెవరికీ ఇవ్వలేదని తెలివిగా ఆన్సరిచ్చాడు మహేశ్ విట్టా. అసలు ఈ హౌస్‌లో ఎవరినీ నమ్మడం లేదని తనదైన స్టైల్లో సమాధానమిచ్చింది హమీదా. ఇక నటరాజ్ మాస్టర్ యాంకర్ శివ మోసం చేస్తున్నాడని చెప్పినట్లు తెలుస్తోంది. చివరికి అతడు బిందును కూడా మోసం చేస్తాడన్నాడు. స్రవంతి.. తను ఎంతో బెస్ట్ ఫ్రెండ్స్‌గా భావించిన అఖిల్, అజయ్ మోసం చేశారని తెలిపింది. యాంకర్ శివ.. నటరాజ్ మాస్టర్ పేరు చెప్పాడు. ఈ సందర్భంగా నటరాజ్ మాస్టర్‌కు లుంగీ ఎత్తి చూపించడం కరెక్ట్ అనుకుంటున్నావా? అని సూటిగా ప్రశ్నించాడు. దానికి శివ సరదాగా అన్నానని చెప్పగా బిగ్‌బాస్ వీడియో ప్లీజ్ అంటూ అతడి నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. అటు మాస్టర్ బూతులు మాట్లాడటాన్ని కూడా తప్పుపట్టాడు నాగ్. 23 ఏళ్ల అనుభవం ఉంది.. ఆ బూతులు మాట్లాడటమేంటి? అని ప్రశ్నించడంతో నటరాజ్ నీళ్లు నమిలాడు. మరోవైపు లుంగీ ఎత్తడం తప్పు అని శివను హెచ్చరిస్తుండగా పదేపదే మధ్యలో కలగజేసుకున్న మాస్టర్ మీద ఫుల్ ఫైర్ అయ్యాడు హోస్ట్. మాస్టర్ సైలెంట్, నేను అతడితో మాట్లాడుతున్నాను కదా అని మండిపడ్డాడు. మరి నాగ్ చేతిలో ఎవరికి కోటింగ్ పడతాయి?, ఎవరికి కాంప్లిమెంట్స్ దక్కుతాయో తెలియాలంటే నేడు సాయంత్రం 6 గంటలకు ప్రసారమయ్యే బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: ఏడేళ్ల లవ్.. చూడకూడని స్థితిలో బావను చూశాను: అరియానా బ్రేకప్ స్టోరీ ప్రభాస్ ‘నో’ చెప్పి ఉంటే ఆదిపురుష్ ఉండేది కాదు -
కత్తితో దాడి చేద్దామనుకున్నాను: శివను బెదిరించిన నటరాజ్
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షో వీకెండ్‌కు రెడీ అవుతోంది. అయితే ఎలిమినేషన్ కన్నాముందు వరస్ట్ పర్ఫామర్‌ను ఎన్నుకోవాల్సిన సమయం వచ్చేసింది. దీంతో మెజారిటీ ఇంటిసభ్యులు బిందుమాధవి పేరును ప్రస్తావించినట్లు తెలుస్తోంది. గేమ్‌లో నిర్లక్ష్యంగా వ్యవహరించి కాయిన్స్ పోగొట్టుకుందంటూ చాలామంది ఆమెను చెత్త ప్లేయర్‌గా అభిప్రాయపడ్డారు. ఆఖరికి ఆమె ఫ్రెండ్ యాంకర్ శివ కూడా కాయిన్స్ పోగొట్టుకోవడం తప్పంటూ బిందుకు వరస్ట్ పర్ఫామర్ ట్యాగ్ ఇచ్చాడు. ఈ క్రమంలో బిందు తన ఆటను తప్పుపట్టిన హౌస్మేట్స్ తీరును తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. దీంతో మరోసారి అఖిల్, బిందుమాధవి మధ్య గొడవ రాజుకుంది. ఈ వారం బిందు వరస్ట్ పర్ఫామర్‌గా ఎంపికై జైల్లో పడ్డట్లు కనిపిస్తోంది. మరోవైపు అటు నటరాజ్ మాస్టర్, యాంకర్ శివ మధ్య కూడా పెద్ద ఫైట్ నడిచినట్లు కనిపిస్తోంది. కొట్టకపోతే అడుగు అంటూ శివకు సవాలు విసిరాడు నటరాజ్. ఇద్దరూ ఒకరిమీదకు ఒకరు దూసుకెళ్తుండటంతో వీరి కొట్లాటను ఆపే ప్రయత్నం చేసింది కెప్టెన్ అషూ. కోపంతో రగిలిపోయిన నటరాజ్ మాస్టర్ కిచెన్‌లో కూడా చిందులు తొక్కాడు. నాకు రక్తం మరిగిపోతుంది, ఎన్నిసార్లు ఊరుకుంటాను? కత్తి తెచ్చి కట్ చేసి పాడేద్దామనుకున్నాను అని ఆవేశంతో ఊగిపోయాడు. చివర్లో మనిషికి రెండు కళ్లు, శివుడికి మూడు కళ్లు, నటరాజ్‌కు ఒళ్లంతా కళ్లు అన్న తనదైన స్టైల్లో డైలాగ్ వదిలాడు నటరాజ్ మాస్టర్. చదవండి: ఓటీటీల్లో మిస్ అవ్వకూడని టాప్ 6 సినిమాలు.. ఏడేళ్ల లవ్.. బావ అనుమానించాడు: అరియానా బ్రేకప్ స్టోరీ -
Bigg Boss: డబుల్ ఎలిమినేషన్, ఇద్దరు లేడీ కంటెస్టెంట్లు అవుట్!
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ప్రారంభమై అప్పుడే ఆరు వారాలు పూర్తి కావస్తోంది. ఇప్పటివరకు ముమైత్ ఖాన్, శ్రీరాపాక, ఆర్జే చైతూ, సరయు, తేజస్వి వరుసగా ఎలిమినేట్ అయ్యారు. వీరిలో తొలివారంలోనే ఎలిమినేట్ అయిన ముమైత్ గతవారమే రీఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ వారం మిత్ర శర్మ, నటరాజ్, మహేశ్ విట్టా, అషూ రెడ్డి, హమీదా, బిందు మాధవి, యాంకర్ శివ, అజయ్, స్రవంతి, ముమైత్ ఖాన్ నామినేషన్లో ఉన్నారు. ఈ పది మందిలో ముమైత్ ఖాన్, స్రవంతి, మిత్ర శర్మకు తక్కువ ఓట్లు నమోదయ్యాయని, ఈ ముగ్గురే డేంజర్ జోన్లో ఉన్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. రాకరాక నామినేషన్లోకి వచ్చిన స్రవంతిని, వైల్డ్ కార్డ్ ద్వారా రీఎంట్రీ ఇచ్చిన ముమైత్‌ను ఇంటి నుంచి బయటకు పంపుతున్నారంటూ లీకువీరులు దండోరా వేస్తున్నారు. ఇక ప్రతివారం నామినేషన్లో ఉంటూ వస్తున్న మిత్రశర్మ పెద్దగా గేమ్ ఆడకపోయినా సేవ్ అవుతూ వస్తుండటం గమనార్హం. ఈసారి కూడా ఆమె ఎలిమినేట్ అయ్యేట్లు కనిపించడం లేదు. ఫలితంగా నిజంగానే ముమైత్, స్రవంతి బ్యాగు సర్దేసుకుని బయటకు వచ్చేలా కనిపిస్తున్నారు. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాలంటే రేపు నాగార్జున అధికారికంగా ప్రకటించేవరకు ఎదురు చూడాల్సిందే! చదవండి: అతడి కోసం సిగరెట్ మానేసిన ముమైత్ ఖాన్ రెండేళ్లు సహజీవనం..బ్రేకప్..20 ఏళ్లకు మళ్లీ పెళ్లి! -
చూడకూడని స్థితిలో బావను చూశాను, విడిపోదామనుకున్నా: ఏడ్చేసిన అరియానా
తొలి ప్రేమ కొందరికి తీపి గుర్తులను మిగుల్చుతే మరికొందరికి మాత్రం భారమైన జ్ఞాపకాలను వదులుతుంది. తొలి ప్రేమను చివరి మజిలీదాకా తీసుకువెళ్లడం అంత ఈజీయేం కాదు. చాలామంది ఫస్ట్ లవ్ బ్రేకప్‌తోనే ముగుస్తుంది. ఈ లిస్టులో తాను కూడా ఉన్నానంటోంది బిగ్‌బాస్ నాన్‌స్టాప్ కంటెస్టెంట్ అరియానా గ్లోరీ. చిన్నతనంలోనే తండ్రి ప్రేమకు దూరమైన ఆమె తన బావను ప్రేమించి నయవంచనకు గురయ్యానంటోంది. 'తొమ్మిదో తరగతిలోనే బావకు, నాకు మధ్య లవ్ స్టోరీ మొదలైంది. అది పదో తరగతిలో బలపడింది. చిన్నప్పటి నుంచే డాడీ లేడు. అతడు తిన్నావా? ఎలా ఉన్నావు? అంటూ నా మీద కేరింగ్ చూపిస్తుండటం నచ్చేది. అతడు విజయవాడలో, నేను తాండూరులో ఉండేవాళ్లం. ఫోన్లు మాట్లాడుకునేవాళ్లం. అతడిది డిగ్రీ అయిపోయాక తనకో జాబ్ వచ్చింది. మేము హైదరాబాద్‌లో కలిసి ఉన్నాం. రిలేషన్షిప్లో ఉండి అప్పటికే మూడేళ్లకు పైనే అయింది. కానీ అతడికి నేను బోర్ కొట్టేశాను అన్న విషయం ఇప్పుడు అర్థమవుతోంది. ఒకరోజు ఏమైందంటే.. చూడకూడని స్థితిలో మా బావను చూశాను. కలలో కూడా అనుకోలేదు అలా జరుగుతుందని! అక్కడేం జరిగిందనేది ఈ ప్రపంచానికి కూడా చెప్పుకోలేను. అది చూశాక నా గుండె పగిలిపోయింది. అలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. విడిపోదామనుకున్నాం కానీ తను వచ్చి సముదాయించాడు. సరేనని మళ్లీ రెండేళ్లదాకా అతడితోనే ఉన్నాను. నాకు ఆర్జే అవాలనుందని చెప్తే సరే ట్రై చేసుకో అన్నాడు. ఈ ప్రయత్నంలో నాకో అబ్బాయి పరిచయమయ్యాడు. దాన్ని అతడు అనుమానించాడు. ఇంత అనుమానిస్తుంటే నా వల్ల కాదని బ్రేకప్ చెప్పుకున్నాం. ఆ తర్వాత నేను ఉద్యోగం చేసుకుంటున్న రోజుల్లో కూడా నాకు బావ రోజూ గుర్తొచ్చేవాడు. ప్లీజ్ మాట్లాడు బావా, తప్పైపోయింది బావా, మళ్లీ కలిసిపోదాం అని బతిమిలాడాను. మా అత్తమ్మను ఒప్పించి ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ చేద్దామనుకున్నాను. సెప్టెంబర్ 19 తెల్లవారుజామున నాలుగు గంటలకు పింక్ కలర్ పట్టు చీర తీసుకుని అత్తమ్మ వాళ్ల ఇంటికి వెళ్లి డోర్ కొట్టాను. మా బావ తలుపు తీసి ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారంటూ అక్కడి నుంచి వెళ్లిపోమన్నాడు. అక్కడే కొద్ది దూరంలో బయట చిట్టినగర్ రోడ్డు మీద కూర్చొన్నాం. హ్యాపీ బర్త్‌డే బావ అని గిఫ్టిచ్చాను. ఈ గిఫ్ట్ తీసుకుంటే ప్రాబ్లం అయిపోతుంది, నేను తీసుకోలేను అన్నాడు. అన్ని రోజులు నన్ను చూసుకున్నాడు, నాకోసం ఖర్చుపెట్టాడు కదా, ఇప్పుడు నేను సంపాదిస్తున్నాను కాబట్టి ఏదైనా కానుక ఇవ్వాలని ఉండేది కానీ అది కూడా రిజెక్ట్ అయిపోయింది. 7-8 ఏళ్ల రిలేషన్షిప్.. సెట్ అవలేదంతే. ఇప్పుడు బావ వచ్చినా కూడా నాకు వద్దు' అని ఏడుస్తూ చెప్పుకొచ్చింది అరియానా. చదవండి: టాప్ 5లో ఉంటుందనుకుంటే ఎలిమినేట్ అయిపోయిన తేజస్వి ‘బీస్ట్’ సినిమా విడుదల.. ఫ్యాన్స్ హెచ్చరించిన విజయ్ -
రక్తంతో లెటర్.. ఆరేళ్ల తర్వాత అలా చేసింది.. అఖిల్ బ్రేకప్ స్టోరీ
బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్‌లో శుక్రవారం సభ్యులంతా తమ తొలి ప్రేమ అనుభవాలను చెప్పుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ప్రతి ఒక్కరు తమ బ్రేకప్ స్టోరీని మిగతావాళ్లతో పంచుకున్నారు. అఖిల్ కూడా బ్రేకప్ స్టోరిని చెప్పుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్‌గా ఉన్న చిన్నుతో ప్రేమలో పడ్డాడని, కానీ ఆమె వేరే వ్యక్తితో రిలేషనల్‌లో ఉండి తనకు బ్రేకప్ చెప్పిందని అఖిల్ చెప్పాడు. ‘తను నా స్కూల్ ఫ్రెండ్. మా కాలనీలోనే ఉండేది. నేను ముద్దుగా చిన్ను అని పిలిచేవాడిని. మేమిద్దరం తిట్టుకునేవాళ్లం..కొట్టుకునేవాళ్లం.ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. మేము ఎప్పుడూ లవ్ లో పడతాం అని అనుకోలేదు. మా ఫ్యామిలీల మధ్య గొడవ జరిగి రెండేళ్ల వరకు మాట్లాడుకోలేదు. ఓ రోజు పక్కవీధిలోకి రమ్మని పిలిచి లెటర్ ఇచ్చింది. అది తన రక్తంతో రాసిన లెటర్. తన చేతికి ఉన్న గాయాలను చూసి.. నా కోసం ఇలా చెసిందా అనుకొని ప్రేమలో పడిపోయా. చాలా కాలం మేం ప్రేమలో ఉన్నాం. ఆమె ఇంజనీరింగ్‌లో జాయిన్ అయింది. ఈ నాలుగేళ్లు కూడా మనం ఇలానే ఉంటే.. మనది నిజమైన లవ్ అని చెప్పా. తను లాస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు.. నేను షూటింట్‌లతో బిజీ అయిపోయా. అయినా కూడా క్షణం తీరిక దొరికినా తనకు మెసేజ్ చేసేవాడిని. ఓ రోజు సాయంత్రం ఫోన్ చేస్తే.. బిజీ వచ్చింది. ఆ రోజంతా ఎన్నిసార్లు చేసినా బిజీ వస్తునే ఉంది. రాత్రి 10 గంటల సమయంలో మళ్లీ ఫోన్ చేసి ఎవరితో మాట్లాడుతున్నావ్ అని అడిగాను. డాడితో మాట్లాడిన అని అబద్దం చెప్పింది. హాస్టల్‌కి మీ ఇంటికి దగ్గరే కదా.. ఇంటికెళ్లి మాట్లాడొచ్చుగా అని అడిగితే.. నాపై నమ్మకం లేదా అని సీరియస్ అయింది. ఇలా ఉంటే కష్టం అని అన్నందుకు అదే మాటని రిపీట్ చేస్తూ బ్రేకప్ చెప్పింది. బ్రేకప్ వద్దని చెప్పినా వినలేదు. ‘మా ఇంట్లో ఒప్పుకోరు..మీ క్యాస్ట్, మా క్యాస్ట్ వేరు. ఇండస్ట్రీకి చెందిన అబ్బాయి అంటే మా ఇంట్లో ఒప్పుకోరు’అంటూ ఆరేళ్ల తర్వాత బ్రేకప్ చెప్పింది. అప్పుడు నేను డిప్రెషన్లోకి వెళ్లాను. బ్రేకప్‌కి ముందే ఆమె ఓ కెనడా అబ్బాయితో రిలేషన్లో ఉంది. ఈ విషయాన్ని ఆమె ఫ్రెండ్ నాతో చెప్పడంతో నేను బ్యాక్ స్టెప్ వేశా. దాదాపు తొమ్మిది నెలల తర్వాత ఆమే మళ్లీ నాకు ఫోన్ చేసి ‘కర్మా ఈజ్ బ్యాక్ అన్నట్టుగా.. నేను నిన్ను వదిలేస్తే.. నన్ను ఆ కెనడా అబ్బాయి వదిలేశాడు’అని చెప్పింది. అక్కడ నుంచి లవ్ అంటే నేను భయపడతాను. కానీ ఫస్ట్ లవ్ మ్యాజిక్ అనేది మళ్లీ జరగదని అనిపిస్తుంది. ఇప్పటికీ తన మీద నాకు ఎలాంటి కోపం లేదు. నన్ను నేను స్ట్రాంగ్‌గా మార్చుకునేందుకు దోహదపడింది’అంటూ అఖిల్ చెప్పుకొచ్చాడు. -
ఇంటి నుంచి పారిపోయా, తిరిగెళ్దాం అనుకునేలోపు అమ్మ చనిపోయింది
బిగ్‌బాస్ షోలో ఈరోజు విచిత్రం జరగబోతోంది. సందు దొరికితే చాలు కారాలు మిరియాలు నూరుకునే కంటెస్టెంట్లు ఈరోజు మాత్రం ఒకరిపై ఒకరు ఎక్కడలేని ప్రేమ చూపిస్తున్నారు. అందుకు కారణం లేకపోలేదు. ఇంట్లో ఉన్న పర్ఫెక్ట్ మ్యాచ్ ఎవరో తెలుసుకోమని చెప్తూనే వారిని ఫిదా చేయాలంటూ ఆసక్తికరమైన టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. దీంతో కంటెస్టెంట్లు వారి కోపాలను పక్కనపెట్టి ఇతర హౌస్‌మేట్స్‌ను ఇంప్రెస్ చేసే పనిలో పడ్డారు. ఈ క్రమంలో ముమైత్ అజయ్ కోసం సిగరెట్ తాగడం మానేస్తానంది. అరియానా మహేశ్కోసం ఆమ్లెట్ చేయడమే కాక స్వయంగా తినిపించింది. మరోపక్క శివను కాకా పట్టే పనిలో పడింది హమీదా. ఇదిలా ఉంటే బిగ్‌బాస్ వీరికి మరో టాస్క్‌ను సైతం ఇచ్చాడు. తొలి ప్రేమ అనుభవాలను పంచుకోమని హౌస్‌మేట్స్‌ను ఆదేశించాడు. బిందుమాధవి మాట్లాడుతూ.. తన ఫస్ట్ లవ్ స్టోరీ బ్రేకప్‌తో ముగిసిపోయిందని చెప్పింది. స్రవంతి.. ప్రేమించిన వ్యక్తి కోసం ఇంటి నుంచి వచ్చేశానని, కానీ ఇంటికెళ్దాం అనుకునేలోపే అమ్మ చనిపోయిందని ఫోన్ వచ్చిందంటూ ఏడ్చింది. మరి వారి లవ్ స్టోరీలు తెలుసుకోవాలంటే నేడు రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: అకీరా బాక్సింగ్ వీడియో షేర్ చేసిన రేణు దేశాయ్, అవి నమ్మొద్దని విజ్ఞప్తి -
శివకు కత్తిపోట్లు, కెప్టెన్‌గా లేడీ కంటెస్టెంట్
బిగ్‌బాస్ అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతోంది బిగ్‌బాస్ నాన్‌స్టాప్. అలకలు, కొట్లాటలు, కయ్యాలు, కలవరింపులకు కొరతే లేకపోవడంతో ప్రేక్షకులు ఈ ఓటీటీ షోను ఆదరిస్తున్నారు. కాకపోతే ప్రతి సీజన్లో ఉన్నట్లుగానే ఈ సీజన్లో కూడా కంటెస్టెంట్లు ఎక్కువశాతం గ్రూపులు గ్రూపులుగానే ఆడుతున్నారు. అయితే నటరాజ్ మాస్టర్ మాత్రం సింగిల్‌గా ఆడటానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే హౌస్‌లో జరిగిన కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో బిందుమాధవి, అజయ్ పెద్దగా ఆడలేదు. శివ, అఖిల్, అరియానా, హమీదా, మహేశ్ సహా మరికొందరు బాగానే కష్టపడ్డారు. కానీ చివరగా హౌస్మేట్స్ మద్దతుతో కెప్టెన్‌ను ఎన్నుకోవాల్సి రావడంతో మరోసారి శివకు మొండిచేయి ఎదురైంది. అతడు కెప్టెన్ అవడం ఇష్టం లేదంటూ హౌస్మేట్స్ అతడిని కత్తితో పొడిచారు. అటు హమీదా, ముమైత్ సైతం కత్తిపోట్లు ఎదుర్కొన్నారు. తక్కువ కత్తిపోట్లు పడ్డ అషూ కెప్టెన్‌గా అవతరించినట్లు తెలుస్తోంది. చదవండి: శ్రీహాన్‌పై సిరి ఆసక్తికర వ్యాఖ్యలు, చివరికి ఇలా క్లారిటీ ఇచ్చిందా? నన్ను రావణాసురుడితో పోలిస్తే బాగుంటుంది: ఆర్జీవీ -
Bigg Boss: ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నదెవరంటే?
బిగ్‌బాస్ షోలో ఎక్కువమంది ఇష్టపడే ప్రక్రియ నామినేషన్స్. ఇక్కడే కంటెస్టెంట్ల అసలు స్వరూపం బయటపడుతుంది. ఒకరినొకరు నామినేట్ చేసుకునే క్రమంలో కొట్లాటలకు దిగుతారు హౌస్మేట్స్. తాజాగా హౌస్‌లో ఐదో వారం నామినేషన్స్ రసవత్తరంగా సాగాయని ప్రోమో చూస్తుంటేనే తెలుస్తోంది. మిత్రతో ఈ మధ్య చనువుగా మెదులుతున్న అరియానా నామినేషన్స్‌లో ఆమె పేరునే తీసుకురావడం కొసమెరుపు. ఇంప్రెషన్‌ను ఫామ్ చేయడం నచ్చలేదంటూ మిత్రను, తాను రెండురకాలుగా గేమ్ ఆడుతున్నానని కామెంట్ చేసిన బిందుమాధవి ఫొటోలను మంటల్లో వేసింది. నామినేషన్స్ చేసుకునే క్రమంలో అజయ్, అషూ రెడ్డిలతో హమీదా గట్టిగానే పోరాడింది. అనిల్ నటరాజ్ మాస్టర్‌ను నామినేట్ చేయడంతో ఆయన తిరిగి అనిల్‌ను నామినేట్ చేశాడు. ఆ తర్వాత స్రవంతిని శకునితో పోల్చడంతో ఇద్దరి మధ్య అగ్ని రాజుకుంది. అలాగే బిందుమాధవి దూషిస్తోందంటూ ఆమె ఫొటోను అగ్నిలో కాల్చేశాడు మాస్టర్. మాట్లాడే దమ్ములేదా అంటూ మాస్టర్‌కే ఎదురుతిరిగింది బిందు. ఫైనల్‌గా ఈ వారం అజయ్, అషూ, మిత్ర, మహేశ్, హమీదా, అరియానా, నటరాజ్, అనిల్ నామినేషన్స్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: Bharti Singh: మగ బిడ్డకు జన్మనిచ్చిన లేడీ కమెడియన్ -
తండ్రి అనుకున్న వ్యక్తే కాటేశాడు: తేజస్వి ఎమోషనల్
బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్‌ను ఆదరించేవాళ్లు చాలామందే ఉన్నారు. దీనికున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని నిర్వాహకులు బిగ్‌బాస్ ఓటీటీని ప్రవేశపెట్టారు. బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షో ద్వారా ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నారు. టాస్కులు, నామినేషన్ల పర్వం, అప్పుడప్పుడూ గెస్టుల రాకతో బాగానే నెట్టుకొస్తున్నారు కానీ ఎలిమినేషన్లే ఎవరికీ అంతు చిక్కడం లేదు. టాప్ 5లో లేదా టాప్ 10లో ఉంటారనుకునే కంటెస్టెంట్లు ఒక్కొక్కరిగా ఇంటి బాట పడుతున్నారు. బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షో తొలి వారం ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అవగా ఆమె గత వారమే మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. రెండో వారం శ్రీరాపాక, మూడో వారం చైతూ, నాలుగో వారం సరయు ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. తాజాగా ఐదో వారం తేజస్వి మదివాడ ఎలిమినేట్ అవడం చాలామందికి ఇప్పటికీ మింగుడుపడటం లేదు. టాప్ 5లో ఉండాల్సిన కంటెస్టెంట్‌ను ఇలా సడన్‌గా ఎలా పంపించేస్తారంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నారు. ఇదిలా ఉంటే హౌస్ నుంచి వచ్చేసిన తేజస్వి బిగ్‌బాస్ బజ్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా యాంకర్ రవి దగ్గర హౌస్‌మేట్స్‌పై తన అభిప్రాయాలను చెప్పుకొచ్చింది. అఖిల్ హీరో, స్రవంతి మిర్చి, మిత్ర కాకరకాయ, నటరాజ్ మాస్టర్ రాడ్, అనిల్ కేటుగాడు అని తెలిపింది. అవకాశం ఇస్తే ఎవరిని తుపాకీతో లేపేస్తావంటే క్షణం ఆలోచించుకోకుండా నటరాజ్ మాస్టర్ పేరు చెప్పింది. నటరాజ్ మాస్టర్ లాంటి తండ్రి తనకు వద్దంది తేజస్వి. పక్కనవాళ్లను తొక్కుకుంటూ పోయేవాళ్లు నచ్చరంటూ బిందుమాధవి ఫొటోను చించేసింది. గతంలో బిగ్‌బాస్‌కు వెళ్లి వచ్చాక తనకు పనివ్వడమే మానేశారని, ట్రోలింగ్ వల్ల ఏడుస్తూనే ఉన్నానంది. దీన్నుంచి బయటపడేందుకు ట్రావెలింగ్ చేసి మళ్లీ నార్మల్ అయ్యానంది. ఈసారి బిగ్‌బాస్‌లో నటరాజ్ మాస్టర్ అనే వ్యక్తి ఒక్కడే నామినేట్ చేసి పంపించేశాడని. తండ్రి అనుకున్న వ్యక్తి కాటేశాడు అంటూ బాధపడింది. -
బిగ్‌బాస్ షోలోకి యాంకర్ సుమ ఎంట్రీ, నవ్వులే నవ్వులు
బిగ్‌బాస్ షోకు, సుమకు విడదీయరాని అనుబంధం ఉంది. ప్రతి సీజన్‌కు ఆమె ఆహ్వానం అందుతూనే ఉంది. పిలిచినప్పుడల్లా కాదనుకుండా ఆమె వస్తూనే ఉంది. నేడు ఉగాదిని పురస్కరించుకుని బిగ్‌బాస్ హౌస్‌లో అడుగు పెట్టింది జయమ్మ. అవును, ఈసారి యాంకర్ సుమగా కాకుండా జయమ్మ పంచాయితీ కథానాయిక జయమ్మగా షోలోకి ఎంట్రీ ఇచ్చింది. ఎప్పటిలాగే తన హుషారైన మాటలతో హౌస్‌లో జోష్ నింపింది. అలాగే కొందరు కంటెస్టెంట్లపై చమత్కారాలు కూడా పేల్చింది. పంపు కాదు పాతాళగంగ అంటూ మిత్రను ఆటపట్టించింది. మరోవైపు అఖిల్ సార్థక్ గిఫ్టులు వచ్చాయంటూ హౌస్‌లోని అమ్మాయిలను ఏప్రిల్ ఫూల్ చేశాడు. ఈ సరదా ఎపిసోడ్ చూడాలంటే మరికొద్ది గంటలు వెయిట్ చేయాల్సిందే! చదవండి: 'దరిద్రం, ఎన్నిసార్లు చెప్పినా మారడు అని చిరంజీవి తిట్టారు' -
Bigg Boss: అఖిల్- బిందుమాధవికి విడాకులు, ముమైత్ రీఎంట్రీ!
బుల్లితెరపై ప్రసారమయ్యే బిగ్‌బాస్ ఇప్పుడు అరచేతిలోకి వచ్చేసింది. టీవీలో కాకుండా కేవలం ఓటీటీలోనే ప్రసారమవుతోంది బిగ్‌బాస్ ఓటీటీ. వినోదానికి లేదు ఫుల్స్టాప్ అంటూ బిగ్‌బాస్ నాన్‌స్టాప్ 24 గంటలు స్ట్రీమింగ్ అవుతోంది. 17 మందితో ప్రారంభమైన ఈ షోలో ఇప్పటికే నలుగురు ఎలిమినేట్ అయ్యారు. అందులో ముమైత్, శ్రీరాపాక, చైతూ, సరయు ఉన్నారు. అయితే మొట్టమొదటగా ఎలిమినేట్ అయిన ముమైత్ తాజాగా హౌస్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఈ మేరకు ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో అఖిల్.. బిందుమాధవి గురించి మాట్లాడటంతో హర్ట్ అయినట్లుంది అషూ. ఇక హౌస్‌లో ఓ టాస్క్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. భార్యాభర్తలకు మధ్య జరిగిన గొడవను పరిష్కరించేందుకు కోర్టు సీన్‌ను ఏర్పాటు చేయగా.. ఇందులో శివ లాయర్‌గా వాదిస్తున్న సమయంలో సడన్‌గా ముమైత్ రీఎంట్రీ ఇచ్చింది. ఆమె రాకతో హౌస్మేట్స్ సర్ప్రైజ్ అయ్యారు. వచ్చీరాగానే జడ్జి స్థానంలో కూర్చున్న ముమైత్ విడాకుల సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేసింది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం అఖిల్, బిందుమాధవిలకు ముమైత్ విడాకులు మంజూరు చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ ఎపిసోడ్ ఎలా సాగిందో తెలియాలంటే రాత్రి 9 గంటల వరకు వేచి చూడాల్సిందే! చదవండి: ఆమెను సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని హాస్టల్లో పెట్టాను: యాంకర్ భర్త -
నన్ను హీరోయిన్ను చేయకండి సర్.. మెలికలు తిరిగిన అషూ
నాగార్జున వస్తున్నాడంటే చాలు హౌస్మేట్స్ ముఖాలు వెలిగిపోతాయి. కాసేపు వారి గేమ్‌ను, గొడవలను అంతా పక్కనపెట్టి నాగ్ ఏం చెప్తాడా? అని కుతూహలంగా ఎదురుచూస్తుంటారు. తాజాగా సండేను ఫండే చేసేందుకు ఎంట్రీ ఇచ్చాడు నాగ్. ఎప్పటిలాగే వారితో గేమ్స్ ఆడిస్తూ ఎంటర్టైన్ చేస్తూనే క్లిష్టమైన టాస్క్ ఇచ్చాడు. బిగ్‌బాస్ ఇంటి నుంచి బయటకు వెళ్లాక ఎవరిని ఫ్రెండ్ చేసుకుంటారు? ఎవరిని బ్లాక్ చేస్తారు? అని అడిగాడు. ఈ గేమ్ గురించి విన్న తేజు 'కొంపలో కుంపటి' ప్రోగ్రామ్ అంటూ దానికి ఓ టైటిల్ కూడా ఇచ్చేసింది. ముందుగా శివ.. బిందుమాధవిని ఫ్రెండ్ చేసుకుంటానన్నాడు. అనిల్.. అషూను ఫ్రెండ్ చేసుకుంటానంటే హమీదా మాత్రం అనిల్‌తో ఫ్రెండ్షిప్ చేస్తానంది. సరయు అనిల్‌ను బ్రదర్‌లా ఫీల్ అవుతానని, అతడిని ఫ్రెండ్ చేసుకుంటానంది. తర్వాత నటరాజ్ మాస్టర్ అషూ గురించి చెప్తూ ఇలాంటి ఫ్రెండ్ ఉంటే నాలాంటోడు ఎప్పుడైనా ది బెస్ట్ ఉంటాడని పేర్కొన్నాడు. ఈ పొగడ్తలతో పొంగిపోయిన అషూ.. దయచేసి నన్ను హీరో చేయకండి సార్ అని మెలికలు తిరిగింది. ఇక బిందు, అనిల్, అజయ్, స్రవంతి.. నటరాజ్ మాస్టర్‌ను బ్లాక్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక నిన్న కారాలు మిరియాలు నూరుకున్న అఖిల్, బిందు ఈరోజుమాత్రం ఇట్టే కలిసిపోయారు. మరి నాగ్ హౌస్‌మేట్స్‌తో ఇంకా ఎలాంటి గేమ్స్ ఆడించాడు. కెప్టెన్ నటరాజ్ మాస్టర్ ఇంకా గొడవపడుతున్నాడా? సైలెంట్ అయిపోయాడా? అన్నది తెలియాలంటే బిగ్‌బాస్ నాన్‌స్టాప్ లైవ్ లేదా నేడు రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: ట్రోలింగ్, సీక్రెట్ మ్యారేజ్‌పై స్పందించిన యాంకర్ భర్త కశ్మీర్ ఫైల్స్ వల్ల తన సినిమా ఎఫెక్ట్ అయిందన్న స్టార్ హీరో -
Bigg Boss: అంచనాలు తారుమారు, సరయు ఎలిమినేట్!
బుల్లితెర బిగ్గెస్ట్ హిట్ షో బిగ్‌బాస్.. తెలుగులో విజయవంతంగా ఐదు సీజన్లు పూర్తి చేసుకుందీ రియాలిటీ షో. ఈ క్రమంలో హౌస్‌లో 24 గంటలు ఏం జరుగుతుందో చూడండంటూ లైవ్ స్ట్రీమింగ్‌తో ముందుకు వచ్చింది ఓటీటీ. బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ద్వారా కావాల్సినంత వినోదాన్ని పంచుతోంది. ఫిబ్రవరి 26న 17 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ షోలో ఇప్పటికే ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు. అందులో ముమైత్ ఖాన్, శ్రీరాపాక, ఆర్జే చైతూ ఉన్నారు. తాజాగా నాలుగో కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యే సమయం ఆసన్నమైంది. ఈ క్రమంలో ఈ వారం సరయు హౌస్‌ను వీడనుందని ప్రచారం చేస్తున్నారు లీకువీరులు. ఇప్పటివరకు వారు చెప్పిందే నిజమవుతూ వచ్చింది కాబట్టి ఇది కూడా నిజమయ్యే అవకాశాలున్నాయి. నిజానికి నాలుగోవారం చాలెంజర్స్‌లో నుంచి ఒకరు ఎలిమినేట్ అవుతారనుకున్నారంతా. పెద్దగా పాపులారిటీ లేని అనిల్, మిత్ర శర్మలలో ఎవరో ఒకరు బయటకు వచ్చేయడం తథ్యం అని ఫిక్స్ అయ్యారు. కానీ అంచనాలను తలకిందులు చేస్తూ చాలెంజర్స్‌లో నుంచి కాకుండా వారియర్స్‌లో నుంచి సరయు ఎలిమినేట్ అయిపోవడం కొంత ఆశ్చర్యకరమే! కాగా సరయు నాలుగో సీజన్లో ఎంట్రీ ఇచ్చి తొలి వారమే ఎలిమినేట్ అయింది. ఆమెకు మరోసారి ఓటీటీ నుంచి పిలుపు రావడంతో ఈసారి టాప్ 5లోకి అయినా చేరుకోవాలనుకుంది. కానీ నాలుగువారాలకే తిరుగుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. చదవండి: అందువల్లే ఆర్జే చైతూ ఎలిమినేట్ అయ్యాడా? Bigg Boss: చెంపలు వాయించుకుని ఏడ్చేసిన మాస్టర్ -
ఆమెను సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని హాస్టల్లో పెట్టాను: యాంకర్ భర్త
చొక్కారపు స్రవంతి.. యాంకర్‌గా ఆమెను గుర్తుపడతారో లేదో కానీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ అంటే మాత్రం ఇట్టే గుర్తుపడతారు. రాయలసీమలోని మారుమూల గ్రామం నుంచి వచ్చిన ఆమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగే ఉంది. యాంకర్‌గా మంచి పేరు సంపాదించుకున్న స్రవంతి ఇటీవల బిగ్‌బాస్ ఓటీటీలో అడుగుపెట్టింది. అయితే తనకు పెళ్లైన విషయాన్ని ఎంతోకాలంగా దాచిపెట్టిన ఆమె బిగ్‌బాస్ స్టేజీపై మాత్రం రెండుసార్లు పెళ్లి చేసుకున్న విషయాన్ని వెల్లడించింది. ఎంతో హుషారుగా హౌస్‌లోకి అడుగుపెట్టిన ఆమె ఎలా గేమ్ ఆడుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ వెళ్లినప్పటి నుంచి ఆమె అఖిల్ జపం చేస్తోందే తప్ప గేమ్ ఆడటం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా స్రవంతి భర్త ప్రశాంత్ ఈ ట్రోలింగ్‌పై, రహస్య వివాహంపై స్పందించాడు. నిజానికి బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ సమయంలో స్రవంతికి ఆఫర్ వచ్చింది కానీ ఆరోగ్యం సహకరించకపోవడంతో తను వెళ్లలేదన్నాడు. ఇంతకుముందు తాను బిజినెస్ చేసేవాడినని, కానీ స్నేహితులను నమ్మి మోసపోవడంతో అందులో చాలా నష్టాలు వచ్చాయన్నాడు. అప్పటికే స్రవంతి, తాను ప్రేమలో ఉన్నామని, బిజినెస్‌లో నిండా మునిగిన సమయంలో స్రవంతి ఫోన్ చేసి ఇంట్లో పెళ్లంటున్నారు, ఏం చేయాలని భయపడిపోయిందన్నాడు. ఏం చేయాలో అర్థం కాక ఆమెను ఇంట్లో నుంచి వచ్చేయమని చెప్పి సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నామని చెప్పాడు. పెళ్లి తర్వాత ఆమెను హాస్టల్లో ఉంచానని, కొన్నాళ్లకు అందరినీ ఒప్పించి మళ్లీ పెళ్లి చేసుకున్నామని తెలిపాడు. ఇక బిగ్‌బాస్‌లో అడుగుపెట్టాక లేడీ క్లబ్లో ఉంటుందనుకున్నాను, కానీ అఖిల్, అజయ్లతో కలిసిపోయిందన్నాడు. ఆమె విన్నర్ అయి రావాలని కోరుకున్నాడు. ఫిట్టింగ్ మాస్టర్ అని ట్రోల్ చేస్తున్నారని, కానీ అక్కడ గేమ్ ఆడుతున్నవాళ్లకి స్రవంతి అంటే ఏంటో తెలుసని, ఆమె ఇప్పుడు గేమ్ మొదలుపెడుతుందని చెప్పుకొచ్చాడు. అక్కడ వాతావరణం స్రవంతికి ఇంకా కొత్తగానే ఉంది.. ఇప్పుడు ఆమె గేమ్‌లో పుంజుకుంటుందన్నాడు. చదవండి: రోడ్డు ప్రమాదంలో బిగ్‌బాస్ ఫణికి తీవ్ర గాయాలు, చివరి పోస్ట్ వైరల్ -
అఖిల్- బిందు మధ్య బిగ్ ఫైట్... హీటెక్కిస్తున్న ప్రోమో
Bigg Boss Non Stop Latest Promo Is Out: బుల్లితెరపై బిగ్‌బాస్ నాన్‌స్టాప్ రసవత్తరంగా సాగుతోంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 24గంటల పాటు ప్రసారం అవుతున్న బిగ్‌బాస్‌లో వినోదంతో పాటు గొడవలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. అప్పటి వరకు ఫ్రెండ్స్‌గా ఉన్న వారు కూడా టాస్క్‌లు వచ్చేవరకు ఎనిమీలుగా మారుతున్నారు. ఇక బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో ప్రస్తుతం కెప్టెన్సీ టాస్క్ జరుగుతున్న సంగతి తెలిసిందే. శివను ఆ రౌండ్లో ఎలిమినేట్ చేసే ప్రక్రియలో అఖిల్, బిందు మాధవికి మధ్య పెద్ద గొడవ జరిగింది. నువ్వు ఇప్పటివరకు ఎన్ని సార్లు కెప్టెన్సీ కంటెండర్ అయ్యావని అఖిల్ ప్రశ్నించగా.. నీలా నాకు ఫ్రెండ్స్ సపోర్ట్ చేయలేదు అంటూ బిందు కౌంటర్ వేసింది. 'ఫ్రెండ్స్ సపోర్ట్ లేకుండా నువ్వు ఒక్క గేమ్ కూడా ఆడలేవు. ఫ్రెండ్స్ సపోర్ట్‌తో బతుకుతుంది నువ్వు.. నేను కాదు. ఫ్రెండ్స్ సపోర్ట్ లేకుండా అఖిల్ ఈ ఇంట్లో బతకలేడు'.. అంటూ మండిపడింది. 'ఈ మాటలు పడటానికి వచ్చానా నేను.. ఇష్టం వచ్చిన మాటలు అంటున్నావ్' అంటూ అఖిల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ ఫైట్‌లో అజయ్ తన ఫ్రెండ్స్ అఖిల్‌కి సపోర్ట్‌గా నిలుస్తాడు. మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడాలని బిందుతో గొడవకు దిగుతాడు. దీనికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. -
Bigg Boss: అతడికి ముద్దు పెట్టిన అషూ రెడ్డి, ఏడ్చేసిన అరియానా
బిగ్‌బాస్ హౌస్‌లో జరిగే ఆటను కన్నార్పకుండా చూసేందుకు బిగ్‌బాస్ తెలుగు ఓటీటీని ప్రవేశపెట్టారు మేకర్స్. నో కామా, నో ఫుల్స్టాప్ అంటూ నాన్‌స్టాప్ షోను మొదలుపెట్టారు. తద్వారా హౌస్‌లో 24 గంటలు ఏం జరుగుతుందో చూసే అవకాశం కల్పించారు. కానీ కొన్ని సందర్భాల్లో హౌస్మేట్స్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడటం, జోక్స్ శృతిమించడం, బూతులు తిట్టుకోవడం చూస్తుంటే ఈ షోకు సెన్సార్ లేకుండా పోయిందని తిట్టుకునేవాళ్లూ లేకపోలేరు. తాజాగా షోలో అషూ.. అనిల్‌తో పులిహోర కలిపింది. నిన్ను ముద్దు పెట్టుకోవాలని ఉందని చెప్పడమే కాకుండా అతడి చేతిని తీసుకుని ముద్దాడింది. అషూ తనను ముద్దు పెట్టుకునేసరికి పులకరించిపోయిన అనిల్ ఆమె చేతిని ముద్దాడాడు. ఆ తర్వాత సీక్రెట్ టాస్క్‌లో భాగంగా హౌస్మేట్స్ మిత్ర శర్మ, అరియానాను ఏడిపించారు. మరి అషూ అనిల్‌ను కిస్ చేయడం కూడా సీక్రెట్ టాస్క్‌లో భాగమా? కాదా? అనేది తెలియాలంటే బిగ్‌బాస్ నాన్‌స్టాప్ లైవ్ చూడాల్సిందే! చదవండి: ఆర్జే చైతూ ఎలిమినేషన్‌కు కారణాలివే! ఆర్ఆర్ఆర్ కోసం జక్కన్న తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతంటే.. -
Bigg Boss: చెంపలు వాయించుకుని ఏడ్చేసిన మాస్టర్
ఆర్జే చైతూ ఎలిమినేట్ కాకపోయుంటే ఈ వారం కెప్టెన్‌గా అతడు బిగ్‌బాస్ హౌస్‌ను ఏలేవాడు. కానీ ఊహించని ఎలిమినేషన్‌తో అతడు బిగ్‌బాస్ హౌస్‌ను వీడక తప్పలేదు. దీంతో ప్రస్తుతం ఇల్లు కెప్టెన్ లేకుండానే నడుస్తోంది. ఇక బిగ్‌బాస్ హౌస్‌మేట్స్‌కు కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా గార్డెన్ ఏరియాలో విసిరేసే స్టార్స్‌ను ఎవరైతే ఎక్కువగా దక్కించుకుంటారో వారు కెప్టెన్సీకి పోటీపడతారు. ఇక ఎలాగైనా గెలవడం కోసం దొంగతనానికి కూడా వెనుకాడట్లేదు హౌస్మేట్స్. ఈ క్రమంలో తనను అభ్యంతరకరంగా టచ్ చేశాడంటూ అఖిల్ మీద ఫిర్యాదు చేసింది హమీదా. తనమీద లేనిపోని నిందలేయొద్దని అఖిల్ వారించగా సంచాలకురాలిగా వ్యవహరించిన అషూ వీరి గొడవను సద్దుమణిగే ప్రయత్నం చేసింది. ఇదిలా ఉంటే ఈ రోజు తెల్లారేసరికి కొందరి స్టార్లు చోరీ అయ్యాయట. అతడెవరో తెలిసినా చెప్పనని బుకాయించింది అరియానా. మరోపక్క అషూ.. అఖిల్ మీద అలిగింది. నా మీద అరిచేస్తూ, హర్ట్ చేసి సారీ చెప్పకని కుండ బద్ధలు కొట్టింది. గేమ్‌లో నటరాజ్ మాస్టర్ స్టార్లు దాచుకున్న కవర్ చినగడంతో వాటన్నింటినీ మిగతా కంటెస్టెంట్లు లాగేసుకున్నారు. దీంతో చిర్రెత్తిపోయిన మాస్టర్ ఏం చేయాలో అర్థం కాక తన చెంపలు వాయించుకుని ఏడ్చేశాడు. మరి ఈ గేమ్‌లో ఎవరు గెలుస్తారు? నెక్స్ట్ కెప్టెన్ ఎవరన్నది తెలియాలంటే బిగ్‌బాస్ నాన్‌స్టాప్ చూడాల్సిందే! చదవండి: గులాబీ పూలతో వెంటపడిన అమ్మాయిలు.. సిగ్గు పడిన హీరో -
మరోసారి నామినేషన్స్‌లోకి శివ, ఇంకా ఎవరెవరున్నారంటే?
బిగ్‌బాస్ షోలో నామినేషన్స్ కోసం వెయిట్ చేసేవాళ్లున్నారు, నామినేషన్స్ అంటే భయపడేవాళ్లూ ఉన్నారు. కానీ ఏదేమైనా ప్రతివారం నామినేషన్స్ తప్పనిసరి. దీన్నుంచి ఎవరూ తప్పించుకోలేరు. తాజాగా నాలుగోవారం నామినేషన్స్ షురూ అయ్యాయి. ఈసారి లారీ, హారన్ టాస్క్ ద్వారా నామినేషన్ ప్రక్రియ నిర్వహించాలన్నాడు బిగ్‌బాస్. ఇందులో భాగంగా లారీ హారన్ సౌండ్ మోగినప్పుడు ఎవరైతే ముందుగా బజర్ నొక్కుతారో వారికి ఇద్దరిని నామినేషన్ చేసే ఛాన్స్ లభిస్తుంది. అయితే ఈ ఇద్దరిలో ఎవరిని ఫైనల్‌గా నామినేట్ చేయాలన్నది మాత్రం ఇంటిసభ్యులు నిర్ణయిస్తారు. అందరూ ఊహించినట్టుగానే ఈసారి కూడా యాంకర్ శివకు ఎక్కువ ఓట్లు పడ్డాయి. బాడీ షేమింగ్ ఇష్యూతో ఇమేజ్ డ్యామేజ్ చేసుకున్న అరియానా వైబ్ డిస్టర్బ్ అయిందంటూ సరయును నామినేట్ చేసింది. దీంతో సరయు.. ఇప్పుడు అరియానా ఎలా ఆడుతుందో అర్థమైపోయిందని కౌంటరిచ్చింది. మహేశ్ విట్టా తనను నామినేట్ చేయడంతో విసిగిపోయిన అరియానా తానసలు బాడీ షేమింగ్ చేయలేదని చెప్పింది. ఇక ఈ వారం యాంకర్ శివ, బిందుమాధవి, అనిల్, అజయ్, సరయు, అరియానా, మిత్ర శర్మ నామినేషన్స్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: రోడ్డు ప్రమాదంలో బిగ్‌బాస్ ఫణికి తీవ్ర గాయాలు, చివరి పోస్ట్ వైరల్ -
అందువల్లే ఆర్జే చైతూ ఎలిమినేట్ అయ్యాడా?
బిగ్‌బాస్.. ఇక్కడ ఏదైనా జరగొచ్చు. గెలుస్తారనుకున్నవాళ్లు ఓడిపోనూవచ్చు. ఎప్పుడో ఎలిమినేట్ కావాల్సినవాళ్లు ఫినాలేకు చేరుకోనూవచ్చు. మరీ ముఖ్యంగా ఊహించని కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవనూ వచ్చు. ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్నామో మీకీపాటికే అర్థమై ఉంటుంది. అవును, ఆర్జే చైతూ ఎలిమినేట్ అయినందుకే! అతడి ఆట అందరికీ నచ్చిందా? అన్నది పక్కన పెడితే అతడు గేమ్ ఆడాడు. హౌస్‌లో తను ఉన్నాడన్న విషయాన్ని నిరూపించుకున్నాడు. బిగ్‌బాస్ నాన్‌స్టాప్ నాలుగోవారంలోకి అడుగుపెట్టినా ఇప్పటికీ కొంతమంది కంటెస్టెంట్లు ఉన్నాలేనట్లుగానే వ్యవహరిస్తున్నారు. మరి వారందరూ ఉండగా గేమ్ ఆడుతూ, అందులోనూ సీనియర్ కంటెస్టెంట్లను ముప్పు తిప్పలు పెట్టి గేమ్‌ను రఫ్ఫాడించిన ఆర్జే చైతూ ఎందుకు ఎలిమినేట్ అయ్యాడు? అందుకు కారణాలేంటో చూద్దాం.. మూడోవారం నామినేషన్స్‌లో మిత్ర శర్మ, శివ, చైతూ, తేజస్వి, అజయ్, స్రవంతి, అఖిల్, మహేశ్, హమీదా, నటరాజ్, అరియానా, బిందు మాధవి ఉన్నారు. ఎలిమినేషన్ చివరి రౌండ్లో స్రవంతి, చైతూ ఇద్దరే మిగిలారు. చాలామటుకు అందరూ స్రవంతి హౌస్‌ను వీడటం ఖాయం అనుకున్నారు. కానీ బిగ్‌బాస్ చైతూ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించడంతో అటు హౌస్‌మేట్స్‌తో పాటు బిగ్‌బాస్ ప్రేక్షకులు సైతం ఖంగు తిన్నారు. ఎంతో కష్టపడి సంపాదించుకున్న కెప్టెన్సీ పవర్‌ను అనుభవించకుండానే హౌస్‌ను వీడి వచ్చేశాడు. ఇక్కడ అర్థం కాని విషయమేంటంటే నామినేషన్స్‌లో చైతూ కంటే తక్కువ ఫ్యాన్ బేస్ ఉన్నవాళ్లుకూడా ఉన్నారు. అయినా చైతూకి పెద్దగా ఓట్లు పడకపోవడానికి ఒకరకంగా అఖిల్ కూడా కారణమే! ఇద్దరూ ఫ్రెండ్సే అయినప్పటికీ బిగ్‌బాస్ హౌస్‌లో ఇద్దరికీ పొసగకపోవడం, ఒకరినొకరు నామినేట్ చేసుకోవడం, మాటలు విసురుకోవడం, తగాదాలు పెట్టుకోవడం.. ఫైనల్‌గా ఈ గొడవ చైతూకే మైనస్ అయింది. అఖిల్ ఫ్యాన్స్ నామినేషన్లో ఉన్న అతడితో పాటు, అతని ఫ్రెండ్ స్రవంతికి ఓట్లు గుద్దారు, ఫలితంగా చైతూ వెనకబడిపోయాడు. ఇక చైతూ తనకు సంబంధం లేని విషయాల్లో దూరుతున్నాడన్న ఆరోపణ కూడా ఉంది. దీంతో చైతూ కాస్త అతి చూపిస్తున్నాడని తిట్టుకునేవాళ్లు కూడా లేకపోలేదు. నిజానికి వారియర్స్ వర్సెస్ చాలెంజర్స్ మధ్య నడిచిన పోరులో చాలెంజర్స్ తరపున గట్టిగా మాట్లాడింది చైతూనే. ఎవరితోనూ పులిహోర కలపకుండా ముక్కుసూటిగా మాట్లాడుతూ తన గేమ్ తను ఆడాడు. కానీ చివరాఖరకు బిగ్‌బాస్ అన్‌ఫెయిర్ ఎలిమినేషన్‌కు బలవక తప్పలేదు. చదవండి: థియేటర్లలో మూవీ చూడక చాన్నాళ్లయింది.. మంచి సినిమా ఉంటే... -
సరయు నడిస్తే భూకంపం వచ్చినట్లే ఉంది: అరియానా తీవ్ర వ్యాఖ్యలు
సండేను ఫండే చేసేందుకు నాగార్జున వచ్చేశాడు. కంటెస్టెంట్ల లెక్క సరిచేసేందుకు ఆయన రెడీ అయ్యాడు. దీనికంటే ముదు హీరోయిన్ శ్రద్ధా దాస్ స్టేజీపై చిందులేసి అలరించింది. ఆ తర్వాత ఎప్పటిలాగే హౌస్‌మేట్స్‌తోనూ డ్యాన్సులేయించాడు నాగ్. ఈ క్రమంలో అషూ, హమీదా రెచ్చిపోయి మరీ చిందేశారు. అనంతరం గతవారం జరిగిన మోస్ట్ ఇరిటేట్ పర్సన్ ఎవరన్న ఓటింగ్ ఫలితాలను అందరిముందు ప్రకటించాడు నాగ్. అందరూ అనుకున్నట్లుగా శివకు కాకుండా ఆర్జే చైతూకు ఎక్కువ ఓట్లు రావడం గమనార్హం. అలాగే హౌస్‌లో మోస్ట్ ఫేక్ హౌస్ పర్సన్ ఎవరని చేపట్టిన ఓటింగ్ ఫలితాలను సైతం రివీల్ చేశాడు. అనంతరం సరయు తన మీద బాడీ షేమింగ్ జరిగిన విషయాన్ని నాగార్జునకు తెలిపింది. నేను నడుచుకుంటూ వస్తుంటే భూకంపం వచ్చినట్లు ఉందని అరియానా కామెంట్ చేసిందని చెప్పుకొచ్చింది. దీంతో అరియానా తనేమీ సీరియస్‌గా అనలేదని కవర్ చేసే ప్రయత్నం చేయగా నాగ్ వీడియో చూపించాడు. అందులో అరియానా తప్పు చేసినట్లు అడ్డంగా దొరికిపోవడంతో మారు మాట్లాడకుండా నిల్చుండిపోయింది. ఇక అరియానా చేసింది తప్పా? ఒప్పా? అన్నదానిపై హౌస్మేట్స్ అభిప్రాయాలు తెలుసుకోనున్నాడు నాగ్. మరి కంటెస్టెంట్లు సరయు పక్కన నిలబడతారా? లేదంటే అరియానాకు మద్దతిస్తారా? అన్నది తెలియాలంటే రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: మేఘన్‌తో పడుకున్నానని చెప్తే రూ.50 లక్షలిస్తామని ఆఫర్! -
షాకింగ్, కెప్టెన్‌ను ఎలిమినేట్ చేసిన బిగ్‌బాస్!
బిగ్‌బాస్.. ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. కొన్నిసార్లు మన అంచనాలు నిజమైనా అప్పుడప్పుడు మాత్రం బొక్క బోర్లా పడక తప్పదు. రంజుగా సాగుతున్న బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షోలో ఇంట్రస్టింగ్‌గా అనిపిస్తుంది కొద్దిమంది కంటెస్టెంట్లే! అదేంటో కానీ, ఆ కొద్దిమందిలో ఒక్కొక్కరూ ఎలిమినేట్ అవుతూ వస్తుండటం బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. మొదటివారం ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అవగా రెండో వారం వారియర్స్‌కు టఫ్ ఫైట్ ఇస్తూ ఆడిన శ్రీరాపాక ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. తాజాగా మూడో వారం కూడా చాలెంజర్స్‌లో నుంచి ఒకరు ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. లీకువీరులు లీక్ చేసిన సమాచారం ప్రకారం ఆర్జే చైతూ ఎలిమినేట్ అయ్యాడట! ఈవారం కెప్టెన్సీ టాస్క్‌లో సత్తా చూపి కెప్టెన్‌గా అవతరించిన చైతూకి ఆ ఆనందం ఎంతోకాలం నిలవలేకపోయిందని తెలుస్తోంది. ఇతడికి ఆర్జే కాజల్, యాంకర్ శ్రీముఖి, నేహాచౌదరి సహా పలువురు సెలబ్రిటీల నుంచి మద్దతు ఉన్నప్పటికీ అతడికే తక్కువ ఓట్లు పడ్డట్లు తెలుస్తోంది. చివరి రెండు స్థానాల్లో శివ, చైతూ ఉండగా చివరికి ఆర్జేకే అతి తక్కువ ఓట్లు పడటంతో అతడిని పంపించేసినట్లు కనిపిస్తోంది. వారియర్స్‌ను ముప్పులు తిప్పలు పెట్టిన చైతూ నిజంగానే ఎలిమినేట్ అయ్యాడా? చివరి నిమిషంలో మరెవరైనా హౌస్ నుంచి బయటకు వచ్చేశారా? అన్నది రేపు తేలనుంది. చదవండి: హీరోయిన్ కోసం 16 గంటలు వెయిట్ చేసిన రిషబ్ పంత్ ! బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విన్నర్ ఎవరో చెప్పేసిన కౌశల్ మండా -
బిగ్‌బాస్ నాన్‌స్టాప్: ప్రముఖ యాంకర్ ఓంకార్ వచ్చేశాడు!
Omakar Into Bigg Boss House: ఆనందాలను పంచే రంగుల హోలీ అంటే చిన్నవాళ్ల దగ్గరనుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ ఇష్టమే. రంగులు పూసుకుంటూ, నీళ్లు చల్లుకుంటూ అనుంబంధాలను మరింత ధృడంగా మార్చుకుంటారందరూ. ఇలాంటి హోలీ పండగను జరుపుకునే అవకాశం కంటెస్టెంట్లకు కల్పించాడు బిగ్‌బాస్. దీంతో నేటి ఎపిసోడ్ కలర్ఫుల్గా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ హోలీ వేడుకల్లో అమ్మాయిలను ఇంప్రెస్ చేయాలనే టాస్క్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. అందులో భాగంగా అనిల్ బిందుమాధవి మీద పొగడ్తల వర్షం కురిపించగా అనిల్ అషూ చేయి పట్టుకుని స్టెప్పులేశాడు. ఇక హౌస్‌మేట్స్‌కు రెట్టింపు వినోదాన్ని పంచేందుకు ప్రముఖ యాంకర్ ఓంకార్ రావడం విశేషం. మరి వీరు ఏ రేంజ్లో వినోదాన్ని పంచనున్నారో తెలియాలంటే హాట్‌స్టార్‌లో రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: కోట్లు సంపాదించిన మిత్ర శర్మ ఇల్లు చూశారా? -
మ్యూజిక్ డైరెక్టర్‌తో బ్రేకప్.. బయటపెట్టిన బిగ్‌బాస్ బ్యూటీ
Shree Rapaka Revealed About Her Break Up: బిగ్‌బాస్ నాన్‌స్టాప్ రోజురోజుకు రసవత్తరంగా సాగుతోంది. 24గంటల ఎంటర్టైన్మెంట్తో కంటెస్టెంట్లు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు. ఇటీవలె బిగ్‌బాస్ ఓటీటీలో రెండోవారం ఎలిమినేట్ అయి బయటికొచ్చిన శ్రీ రాపాక తాజాగా తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె గతంలో ఓ మ్యూజిక్ డైరెక్టర్‌తో ప్రేమలో ఉన్నట్లు చెప్పుకొచ్చింది. 'బిగ్‌బాస్‌లో నా లవ్‌స్టోరీ గురించి చెప్పాను. దాన్ని లవ్ ఫెయిల్యూర్ అని అనను. ఎందుకంటే, ఇద్దరం ఒకే ఫీల్డ్‌లో ఉండే సెట్ అవుతుందనుకున్నా కానీ అదే దెబ్బ కొట్టింది. మేం పెద్దగా గొడవ పడింది లేదు. విడిపోవాలని అనుకోలేదు. కానీ తెలియకుండానే మా మధ్య గ్యాప్ వచ్చింది. ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతుంది. దాదాపు రెండేళ్లు అవుతుంది. తను కాల్ చేయడు, నేనూ చేయను. అతను ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఇప్పటికీ 4 సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేశాడు. అతని తర్వాత నేను కూడా ఎవరిని లవ్ చేయలేదు. ఇక పెళ్లి విషయానికి వస్తే.. నన్ను కమాండ్ చేసే అబ్బాయే నాకు భర్తగా కావాలి. అలాంటి వాడినే పెళ్లి చేసుకుంటా. కమాండ్ చేసే మగాడు ఉంటేనే లైఫ్ కొత్తగా అనిపిస్తుంది.. ఆ కొత్తలో లైఫ్ బోర్ కొట్టదు. నేను ప్రేమను ఇస్తా.. ఆ ప్రేమను తిరిగి ఇస్తే చాలు' అంటూ తన మనసులో మాటను బయటపెట్టేసింది. -
అతడిని కెప్టెన్‌గా గెలిపించిన అఖిలే నంబర్ 1!
బిగ్‌బాస్ ఓటీటీ రంజుగా సాగుతోంది. హౌస్మేట్స్ చేసిన తప్పులకు కెప్టెన్ అనిల్ శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఇంటిసభ్యులు పట్టపగలు నిద్రపోతున్నా చూసీచూడనట్లు వదిలేయడం, మైకులు ధరించాలన్న నిబంధనకు కొందరు నీళ్లు వదలడంతో బిగ్‌బాస్ మండిపడ్డాడు. అనిల్ తన విధులు సరిగా నిర్వర్తించలేదంటూ కెప్టెన్సీ నుంచి అర్ధాంతరంగా తొలగించాడు. అయితే మెజారిటీ హౌస్మేట్స్ అనిల్ కెప్టెన్సీ సరిగ్గానే ఉందంటూ ఓటేయడంతో రెండు వారాలపాటు కెప్టెన్సీకి నేరుగా పోటీ చేసే అవకాశాన్ని గెలుచుకున్నాడు. దీంతో మూడోవారంలో కెప్టెన్సీ కంటెండర్స్‌లో అనిల్ కూడా ఉన్నాడు. ఇతడితో పాటు అషూ, అరియానా, శివ, చైతూ, అజయ్, హమీదా కెప్టెన్సీకి పోటీపడ్డారు. వీరిలో చైతూ గెలవగా అతడిని గెలిపించింది మాత్రం అఖిలే కావడం విశేషం. మరోపక్క అషూ కెప్టెన్ కాలేకపోయానని కంటతడి పెట్టుకుంది. ఈ ప్రోమో చూసిన నెటిజన్లు అఖిల్ మీద పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. 'అఖిల్ గేమ్‌లో దిగితే వేరే విషయాలు, గొడవలు పట్టించుకోడు', 'చైతూ అఖిల్‌ను సిల్లీ రీజన్స్‌తో నామినేట్ చేసినా అతడు అవేమీ పట్టించుకోకుండా కెప్టెన్ అవడానికి సాయం చేశాడు', 'అఖిలే నంబర్ 1' అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: నటి కావ్యశ్రీ బెంగళూరు ఇంటిని చూశారా? -
బిగ్‌బాస్ కెప్టెన్ అనిల్‌కు బిగ్ షాక్, కెప్టెన్సీ గోవిందా!
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ఇప్పుడిప్పుడే రంజుగా మారుతోంది. వారియర్స్, చాలెంజర్స్ అంటూ కంటెస్టెంట్ల మధ్య చిచ్చుపెట్టిన బిగ్‌బాస్ ఆ అడ్డుగోడను తొలగించేశాడు. దీంతో హౌస్మేట్స్ గొడవలు మాని కొంత కూల్ అయ్యారు. అలాగే బిగ్‌బాస్ రూల్స్‌ను కూడా పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. చాలామంది పగటిపూట నిద్రించకూడదన్న రూల్ బ్రేక్ చేశారు. కొందరు పాత కంటెస్టెంట్లు మైక్ పెట్టుకోవడం కూడా మర్చిపోతున్నారు. దీంతో సీరియస్ అయిన బిగ్‌బాస్ వారు చేసిన తప్పులను వీడియో వేసి చూపించాడు. హౌస్మేట్స్ చేసిన తప్పుకు కెప్టెన్ అనిల్‌కు శిక్ష విధించాడు. అతడి కెప్టెన్సీ అర్ధాంతరంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించాడు. వెంటనే తను ధరించిన కెప్టెన్సీ బ్యాడ్జ్‌ను స్టోర్‌రూమ్‌లో పెట్టాలని ఆదేశించాడు. ఈ మేరకు ప్రోమో రిలీజైంది. ఇది చూసిన నెటిజన్లు అనిల్ రాథోడ్‌ను చూసి జాలి పడుతున్నారు. అప్పుడు మోడల్ జెస్సీ కెప్టెన్సీని నాశనం చేస్తే ఇప్పుడు మోడల్ అనిల్ రాథోడ్ కెప్టెన్సీని భ్రష్టు పట్టించారని కామెంట్లు చేస్తున్నారు. మరి నిజంగానే బిగ్‌బాస్ అనిల్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించాడా? లేదంటే సీరియస్ వార్నింగ్ ఇచ్చి వదిలేశాడా? అన్నది నేటి ఎపిసోడ్లో తేలనుంది. చదవండి: బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విన్నర్ ఎవరో చెప్పేసిన కౌశల్ మండా -
ఇంద్రభవనం లాంటి ఇల్లు, కోటి 20 లక్షల కారు.. అదీ మిత్ర రేంజ్!
Bigg Boss Non Stop Telugu OTT Contestant: మిత్ర శర్మ.. బిగ్‌బాస్ నాన్‌స్టాప్ చూసేవాళ్లకు ప్రత్యేకంగా ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మిత్రబిందగా ఆడియన్స్‌కు ఇప్పుడిప్పుడే దగ్గరవుతోందామె. అయితే హౌస్‌లో అందరూ తనను దూరం పెడుతున్నారంటూ నిన్నటివరకు ఏడ్చి గోల చేసిన మిత్ర.. ఇలా సాఫ్ట్‌గా ఉంటే లాభం లేదనుకుని తిరగబడింది. నామినేషన్స్‌లో తన ప్రతాపం చూపించినట్లు బిగ్‌బాస్ రిలీజ్ చేసిన ప్రోమోలో తెలుస్తోంది. ఇప్పటినుంచి ఆమె గేమ్ వేరే లెవల్లో ఉండేట్లు కనిపిస్తోంది. ఇక మిత్ర శర్మ వ్యక్తిగత విషయానికి వస్తే ఆమె చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయింది. తండ్రి పోయాక ఫ్యామిలీ తనను దూరం పెట్టడంతో ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయి ఒంటరిగా జీవిస్తోంది. అవకాశాల కోసం అనేక ఆఫీస్‌ల చుట్టూ తిరిగిన ఆమె తొలి సంధ్యవేళలో సినిమాతో హీరోయిన్గా మారింది. ఆ తర్వాత రెండు మూడు చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో సొంతంగా శ్రీపిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను నెలకొల్పింది. చదవండి: కంటెస్టెంట్లపై నాగ్ ఫైర్, శ్రీ రాపాక అవుట్ ఈ బ్యానర్ ద్వారా బాయ్స్ సినిమా నిర్మించింది. అలా తన వ్యాపారాన్ని విస్తరిస్తూ కోట్లు ఆర్జించింది. ఆమెకు హైదరాబాద్‌లో ఇంద్రభవనం లాంటి ఇల్లు, కోటి 20 లక్షలు ఖరీదు చేసే బెంజ్ ఆల్టర్ కారు ఉన్నాయి. ఈ లగ్జరీ కారు ఇండియాలో పది మాత్రమే ఉంటే అందులో ఒకే ఒక్కటి హైదరాబాద్‌లో ఉంది. ఆ ఒక్క కారు కూడా మిత్రదే కావడం విశేషం. ఈ కారుకు 999 అనే ఫ్యాన్సీ నంబర్ ఉంది. కుక్కపిల్లలంటే ఎంతో ఇష్టపడే మిత్ర శర్మ పది కుక్కలను ఇంట్లో పెంచి పోషిస్తోంది. కుక్కపిల్లల కోసం ప్రత్యేకించి 5 బెడ్ రూమ్స్ కూడా ఉన్నాయి. -
Bigg Boss Non Stop: నామినేషన్స్‌లో 12 మంది!
బిగ్‌బాస్ కంటెస్టెంట్ల భవిష్యత్తును చెప్పేది నామినేషన్సే. ఈ ఒక్క గండం నుంచి బయటపడ్డారంటే ఆ వారం నిశ్చింతగా గుండెల మీద చేయేసుకుని నిద్రపోవచ్చు. ఒకవేళ నామినేషన్స్‌లోకి వచ్చారంటే వీకెండ్ వరకు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిందే! విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉన్నవాళ్లకు ఆ చింత అక్కర్లేదనుకోండి, అది వేరే విషయం. ఇక బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో ముచ్చటగా మూడో నామినేషన్స్ జరిగాయి. పక్కనే ఉండి గోతులు తవ్వేవాళ్లే అంటే నా జీవితంలో కూడా ఇష్టముండరంటూ తేజస్వి బోల్డ్ బ్యూటీ అరియానాను నామినేట్ చేసింది. ఇంతమాట అన్నాక అరియానా ఊరుకుంటుందా? తాను గోతులు తవ్వుతున్నట్లు అనిపిస్తే తేజు ఇన్ఫ్లూయెన్స్ చేస్తున్నట్లు అనిపిస్తోందంటూ ఆమెను నామినేట్ చేసింది. చదవండి: బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విన్నర్ ఎవరో చెప్పేసిన కౌశల్ మండా ఇక నామినేషన్స్‌లో చైతూ ఎవరివో కాళ్లు పట్టుకుంటానంటూ నామినేట్ చేశాడు. యాంకర్ శివ, నటరాజ్ మాస్టర్ మధ్య మహేశ్, అనిల్ మధ్య కూడా ముసలం మొదలైనట్లు కనిపిస్తోంది. ఎప్పటిలాగే అఖిల్, బిందుమాధవికి అస్సలు పడలేదు. మొత్తంగా ఈ మూడో వారం సరయు, అషూ రెడ్డి, కెప్టెన్ అనిల్ మినహా మిగతా 12 మంది నామినేషన్స్‌లో ఉన్నారు. -
వాళ్లను చూస్తే నవ్వొస్తోంది, ఆ కంటెస్టెంటే బిగ్‌బాస్ విన్నర్: కౌశల్
వినోదానికి లేదు ఫుల్స్టాప్ అంటూ వచ్చింది బిగ్‌బాస్ నాన్‌స్టాప్. హౌస్‌లో 24 గంటలు ఏం జరిగిందో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడండంటూ ప్రేక్షకులను ఊరించింది. అదెలా సాధ్యమని ప్రశ్నించిన నోళ్లను 24/7 లైవ్ స్ట్రీమింగ్‌తో ఆశ్చర్యపరిచింది. అయితే రోజంతా షో చూడటం సాధ్యపడనివాళ్ల కోసం ప్రతిరోజు ఒక గంటపాటు ఎపిసోడ్ ప్రసారం చేస్తోంది. ఇప్పటికే షో ప్రారంభమై రెండు వారాలు పూర్తవగా ముమైత్ ఖాన్, శ్రీరాపాక ఎలిమినేట్ అయ్యారు. తాజాగా బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షోపై ఆసక్తికర కామెంట్లు చేశాడు బిగ్‌బాస్ మాజీ విన్నర్ కౌశల్ మండా. 'బిగ్‌బాస్ షోలో ఎవరు గెలుస్తారన్నదానిపై నా అంచనాలు ఎప్పుడూ తప్పలేదు. ఈసారి బిగ్‌బాస్ ఓటీటీ సీజన్లో బిందుమాధవి గెలుస్తుంది. కొన్ని ప్రోమోలు చూశాను. అందులో బిందుమాధవి యాటిట్యూడ్, ఆమె సామర్థ్యాలు ఆవిడే గెలుస్తాయని చెప్తున్నాయి. రీ ఎంట్రీ ఇచ్చిన కొందరు కంటెస్టెంట్లు బిగ్‌బాస్ గేమ్‌ను అర్థం చేసుకోవడంలో ఇప్పటికీ తడబడటం చూస్తుంటే నవ్వొస్తోంది' అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు. మరి నిజంగానే కౌశల్ మండా జోస్యం నిజమవుతుందా? లేదా? అనేది చూడాలి! చదవండి: నా ఫ్రెండ్‌ను నేనే చంపానంటున్నారు, అవును, నావల్లే: హీరోయిన్ -
బిగ్‌బాస్ షో నుంచి శ్రీ రాపాక ఎలిమినేట్
బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఇష్టపడే షోలలో బిగ్‌బాస్ రియాలిటీ షోది అగ్రస్థానం. ఎన్నో భాషల్లో విజయవంతంగా ప్రసారమవుతున్న బిగ్‌బాస్ తెలుగులో ఇప్పటివరకు ఐదు సీన్లు పూర్తి చేసుకుంది. ఈసారి ఆరో సీజన్ కంటే ముందు బిగ్‌బాస్ ఓటీటీని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు మేకర్స్. టీవీలో కాకుండా కేవలం హాట్‌స్టార్‌లో బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ప్రసారం చేస్తున్నారు. 17 మందితో మొదలైన ఈ షో ఇప్పటికే ఒకరు ఎలిమినేట్ అవగా నిన్నటి సండే ఎపిసోడ్లో మరొకరు హౌస్‌ను వీడారు. సండే ఫండే చేయడానికి వచ్చిన నాగార్జున ఎప్పటిలాగే కంటెస్టెంట్ల తప్పొప్పులను ప్రస్తావిస్తూ వారికి చీవాట్లు పెట్టాడు. డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడిన యాంకర్ శివను షో నుంచి పంపించేసినంత పని చేశాడు. అన్నం మీద అలక చూపించిన చైతూ, బిందుమాధవిలను కూడా హెచ్చరించాడు. ఇలా హౌస్మేట్స్ ఒక్కొక్కరి మీద విరుచుకుపడ్డ నాగ్ తర్వాత వారితో గేమ్స్ ఆడించాడు. అనంతరం శ్రీరాపాక ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. ఇప్పుడిప్పుడే ఆటలో పుంజుకుంటున్న శ్రీరాపాక అప్పుడే ఎలిమినేట్ అవడంతో భారంగా హౌస్ నుంచి వీడ్కోలు తీసుకుంది. -
అంత బలుపెందుకు? అంటూ హీరోను తిట్టేసిన అరియానా
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షో రోజురోజుకీ రంజుగా మారుతోంది. 17 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన షోలో ఇప్పటికే ముమైత్ ఖాన్ ఎలిమినేట్ కాగా తాజాగా మరో కంటెస్టెంట్ హౌస్‌ను వీడే సమయం ఆసన్నమైంది. సోషల్ మీడియాలో లీకువీరులు శ్రీరాపాక ఎలిమినేట్ అయిందని దండోరా వేస్తుండగా మరికొందరు మాత్రం మిత్రశర్మ వెళ్లిపోయే ఛాన్స్ ఉందంటున్నారు. ఈ సంగతి పక్కనపెడితే తాజాగా స్టాండప్ రాహుల్ చిత్రయూనిట్ బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టింది. రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ హౌస్‌లో అడుగుపెట్టి కంటెస్టెంట్లతో ఓ ఆటాడించారు. ఈ మేరకు ప్రోమో రిలీజ్ చేశారు. ఇందులో ఈ వారం మహేశ్ విట్టా వరస్ట్ పర్ఫామర్‌గా ఎంపికై జైలులో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక అతిథులుగా వచ్చిన హీరోహీరోయిన్లను హౌస్మేట్స్ తమ స్కిట్లతో కడుపుబ్బా నవ్వించి ఇంప్రెస్ చేశారు. కాగా రాజ్‌తరుణ్ అనుభవించు రాజా సినిమాలో అరియానా నటించిన విషయం తెలిసిందే! ఇక్కడ ఏర్పడ్డ పరిచయంతో హీరోతో చనువు పెంచుకున్న బోల్డ్ బ్యూటీ తాజాగా ప్రోమోలో రాజ్‌తరుణ్‌పై సీరియస్ అయింది. నీకు హాయ్ చెప్పడానికి బలుపేంటి? అని నిలదీసింది. రాగానే చెప్పాను కదా అని రాజ్‌తరుణ్ సమాధానం చెప్పినప్పటికీ ఆమె శాంతించలేదు. ఏంటి నీ ఫ్రెండ్ హాయ్ చెప్పట్లేదు అని చైతూ అప్పటినుంచి అంటున్నాడు అంటూ గరం అయింది. అయితే వీళ్లిద్దరూ మంచి ఫ్రెండ్సే కాబట్టి అంత సీరియస్ ఏం అయుండదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ స్టాండప్ రాహుల్ టీమ్‌తో బిగ్‌బాస్ కంటెస్టెంట్ల ఆటను చూడాలంటే నేడు రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఎపిసోడ్ వీక్షించాల్సిందే! చదవండి: నా ఫ్రెండ్‌ను నేనే చంపానంటున్నారు, అవును, నావల్లే: హీరోయిన్ -
బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో ఈసారి ఎలిమినేట్ అయ్యేది ఆమెనా ?
Bigg Boss NonStop Second Week Nominations: ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్న రియాలిటీ షోలలో బిగ్‌బాస్ ఒకటి. ప్రస్తుతం ఓటీటీ వేదికగా వస్తున్న బిగ్‌బాస్ నాన్‌స్టాప్ రసవత్తరంగా మారింది. బంధాలు, అనుబంధాలను పక్కన పెడితే కయ్యాలు, కొట్లాటలతో వేడెక్కుతోంది. కంటెస్టెంట్లను వారియర్స్, చాలెంజర్స్‌గా విడగొట్టినప్పటినుంచి బద్ధ శత్రువుల్లా ఒకరిపైఒకరు విరుచుకుపడుతున్నారు. బిగ్‌బాస్ హౌజ్ రూల్స్ పాటజ్ట్లేదంటూ ఒకరి బృందం మీద ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఇదిలా ఉంటే గతవారం ఎలిమినేషన్లో ముమైత్ ఖాన్ బయటకు వెళ్లిపోయింది. ఈ వారం మొత్తం 11 మంది నామినేషన్ లిస్ట్‌లో ఉన్నారు. దీంతో రెండో వారం నామినేషన్లపై ఆసక్తి నెలకొంది. చదవండి: సరయుపై శ్రీరాపాక దాడి! షాకైన హౌస్మేట్స్ బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షో రెండో వారం నామినేషన్లలో మొత్తం ఏడుగురు సీనియర్లు, నలుగురు జూనియర్లు ఉన్నారు. వారిలో కేవలం ముగ్గురు మాత్రమే డేంజర్ జోన్లో ఉన్నట్లు కనిపిస్తోంది. ఆ ముగ్గురు శ్రీరాపాక, అనిల్ రాధోడ్, మిత్ర శర్మ. అయితే నటరాజ్ మాస్టర్, మహేష్ విట్టా కూడా డేంజర్ జోన్లో ఉండగా.. స్మగ్లర్ల టాస్క్‌లో వీరిద్దరూ బాగా రాణించడంతో ఓటింగ్ శాతం కొంచెం పెరిగిపోయింది. దీంతో ఈ ఇద్దరూ ఈసారికి బయటపడ్డారనే చెప్పుకోవచ్చు. టాప్ ప్లేస్‌లో ఉన్న అఖిల్ సార్ధక్కు అరియానా గట్టి పోటీ ఇస్తుంది. సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉండటంతో యాంకర్ శివకు ఓటింగ్ శాతం బాగానే వస్తోంది. అంతేకాకుండా బిందు మాధవితో స్నేహం కారణంగా ఆమె ఫ్యాన్స్, అలాగే షణ్ముక్ జశ్వంత్ ఫాలోవర్స్ కూడా శివకే ఓటేస్తున్నారని సమాచారం. దీంతో శివ సేఫ్ అయినట్లే. ఇక ఓటీంగ్ శాతాన్ని బట్టి చూస్తే డేంజర్ జోన్లో ఉన్న శ్రీరాపాక ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: 'తగ్గేదే లే' టాస్క్‌లో రచ్చ, కొట్టుకునేదాకా వెళ్లిన కంటెస్టెంట్లు! -
బిగ్‌బాస్ రూల్స్ ఫాలో కానని తేల్చేసిన అఖిల్! కెప్టెన్ ఎవరంటే?
బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో బంధాలు, అనుబంధాల సంగతేమో కానీ కొట్లాటలు, కయ్యాలకు మాత్రం కొదవ లేకుండా పోయింది. బిగ్‌బాస్ ఏ ముహూర్తాన కంటెస్టెంట్లను వారియర్స్, చాలెంజర్స్‌గా విడగొట్టాడో రోజురోజుకీ వారు బద్ధ శత్రువుల్లా తయారవుతున్నారు. బిగ్‌బాస్ చెప్పిన రూల్స్ పాటించడం లేదంటూ ఒకరి టీమ్ మీద మరొకరు బురద చల్లుకుంటున్నారు. అసలు రూల్స్ పెట్టినా చాలెంజర్స్ దాన్ని పాటించడం లేదని వారియర్స్ అసహనానికి లోనయ్యారు. వాళ్లు నిబంధనలు పాటించకుండా ఇష్టారీతిన ఆడినప్పుడు బిగ్‌బాస్ సరైన తీర్పు ఇవ్వకపోతే మాత్రం తాను కూడా రూల్స్ ఫాలో కానని తేల్చి చెప్పాడు అఖిల్ సార్థక్. టాస్క్‌లో మహేశ్ విట్టా అనిల్‌ను అరేయ్ అనడంతో అతడు రెచ్చిపోయాడు. అరేయ్, గిరేయ్ అంటే పడను అని వార్నింగ్ ఇచ్చాడు. ఫైనల్‌గా చాలెంజర్స్ గెలిచినట్లు ప్రోమో చూస్తే అర్థమవుతోంది. దీంతో నటరాజ్ మాస్టర్ ఎంత కష్టపడి ఆడినా ఫలితం దక్కలేదని కంటతడి పెట్టుకున్నాడు. మరోపక్క మిత్రా శర్మ.. చాలెంజర్స్ లిస్టులో తనను చివరి వ్యక్తిగా చూస్తున్నారంటూ ఏడ్చేసింది. ఇదిలా ఉంటే అనిల్ హౌస్‌కు రెండో కెప్టెన్‌గా అవతరించినట్లు లీకువీరులు చెప్తున్నారు. -
సరయుపై శ్రీరాపాక దాడి! షాకైన హౌస్మేట్స్
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షో కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌తో రసవత్తరంగా మారింది. అటు వారియర్స్, ఇటు చాలెంజర్స్.. తగ్గేదే లే అన్న రేంజ్లో ఆడుతున్నారు. గాయాలవుతున్నా సరే వాటిని పట్టించుకోకుండా ప్రత్యర్థుల మీదకు దూకుతున్నారు. కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ మొదటి లెవల్లో వారియర్స్ స్మగ్లర్లుగా, చాలెంజర్స్ పోలీసుల్లా మారగా రెండో లెవల్లో వారి పాత్రలు తారుమారయ్యాయి. దీంతో వారియర్స్‌కు చుక్కలు చూపించడానికి సిద్ధమయ్యారు చాలెంజర్స్. ఈసారి ఎలాగైనా గేమ్ గెలవాలనుకున్న వీళ్లు తమకు తోచిన ప్లాన్లన్నీ అమల్లో పెట్టినట్లు కనిపిస్తోంది. మరోపక్క ఇదే గేమ్‌లో గాయపడ్డ రాపాక అందుకు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది. తన దగ్గరున్న బొమ్మలను సరయుపైకి విసిరేయడంతో ఆమె తలకు చేతులు పట్టుకుని కూలబడిపోయింది. అక్కడే ఉన్న అఖిల్ ఏం చేస్తున్నావో తెలుస్తుందా? అని ఆమె మీదకు ఫైర్ అయ్యాడు. ఇక స్రవంతి స్విమ్మింగ్ పూల్‌లో దూకడంతో అందరూ వెళ్లి ఆమెను బయటకు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. హెల్త్ బాగోలేనప్పుడు దూకడం ఎందుకు? అన్న సరయు మీద అరిచినంత పని చేసింది స్రవంతి. నా ఆరోగ్యపరిస్థితి గురించి తెలియకుండా మాట్లాడకు అంటూ సరయు మీద ఓ రేంజ్లో ఫైర్ అయింది. మొత్తానికి సరయు మీద హౌస్‌లో నెగెటివిటీ విపరీతంగా పెరిగిపోతోంది. ఈ వ్యతిరేకతకు చెక్ పెట్టే ప్రయత్నం చేయకపోతే అది ఆమె ఎలిమినేషన్‌కు కూడా దారి తీయవచ్చు. -
'పిచ్చిపిచ్చి మాట్లాడుతుండు', ఎమోషన్స్‌తో ఆటలొద్దన్న అఖిల్
బిగ్‌బాస్‌ను ఆదరించే బుల్లితెర అభిమానులు ఎంతోమంది ఉన్నారు. కానీ ఈసారి టీవీలో కాకుండా ప్రయోగాత్మకంగా కేవలం ఓటీటీ ప్లాట్‌ఫామ్ హాట్‌స్టార్‌లో మాత్రమే ప్రసారం చేస్తున్నారు. దీంతో బిగ్‌బాస్ షోను చూసేవాళ్ల సంఖ్య తగ్గిందనే చెప్పాలి. అయితే గొడవలు, కొట్లాటలు, వినోదంతో అందరినీ ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది బిగ్‌బాస్. ప్రస్తుతం హౌస్‌లో కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ నడుస్తోంది. అందులో భాగంగా వారియర్స్ స్మగ్లర్లుగా, చాలెంజర్స్ పోలీసులుగా మారిపోయారు. స్మగ్లర్లు చేసే పనులను అడ్డుకునే క్రమంలో రెండు టీముల మధ్య ఘర్షణ జరుగుతోంది. ఈ క్రమంలో వారియర్స్ టీమ్‌లోని అఖిల్, చాలెంజర్స్ టీమ్‌లోని అజయ్ మధ్య కూడా మనస్పర్థలు చోటు చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. గేమ్‌లో నాతో ఆడు, నా ఎమోషన్స్‌తో కాదంటూ పరోక్షంగా అజయ్ గురించే మాట్లాడాడు అఖిల్. అటు పక్క అజయేమో.. ఏదైనా జరుగుతున్నప్పుడు ఫ్రెండ్షిప్ను మధ్యలో రానివ్వద్దని వందసార్లు చెప్పాను, అయినా పిచ్చిపిచ్చి మాట్లాడుతుండు అంటూ అఖిల్ మీద అసహనానికి లోనయ్యాడు. ఇష్టమున్నట్లు మాట్లాడితే ఎవరూ పడరు కదా? అని స్రవంతితో చెప్పుకొచ్చాడు. మరో పక్క టాస్క్‌లో యాంకర్ శివ సరయుపై ప్రతీకారం తీర్చుకున్నట్లు కనిపిస్తోంది. ఆమె వెళ్తుంటే వెనకాల తనే బొమ్మ పడేసి ఆపై బొమ్మ దొరికిందంటూ సీజ్ చేశాడు. కెమెరాలు చూస్తున్నాయంటూ సరయు శివ బట్టల దగ్గరకు వెళ్లగా అతడు అగ్గిమీద గుగ్గిలమయ్యాడు, నువ్వు నామీద ఎన్నో నిందలు వేశావు. అలాంటి నీకు నా బట్టలు ముట్టే హక్కు లేదు అని ఫైర్ అయ్యాడు. టాస్క్ గరంగరంగా సాగుతున్న సమయంలో ఇంతటితో మొదటి లెవల్ పూర్తైందన్నాడు బిగ్‌బాస్. రెండో లెవల్లో వారియర్స్ పోలీసులుగా, చాలెంజర్స్ స్మగ్లర్లుగా మారతారని చెప్పాడు బిగ్‌బాస్. మరి ఈసారి ఆట ఎలా ఉండబోతుంది? ఏ టీమ్ గెలుస్తుంది? అనేది తెలియాలంటే గురువారం (మార్చి 10) రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే! -
'తగ్గేదే లే' టాస్క్‌లో రచ్చ, కొట్టుకునేదాకా వెళ్లిన కంటెస్టెంట్లు!
బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో కొట్లాటలకు కొదవ లేకుండా పోయింది. ఢీ అంటే ఢీ అంటూ వారియర్స్, చాలెంజర్స్ ఇద్దరూ కొట్టుకునేదాకా వెళ్లారు. ప్రస్తుతం హౌస్‌లో రెండో కెప్టెన్సీ పోటీ మొదలైంది. ఈ మేరకు బిగ్‌బాస్ తాజాగా ప్రోమో వదిలాడు. తగ్గేదేలే అనే కెప్టెన్సీ టాస్క్‌లో వారియర్స్ సభ్యులు స్మగ్లర్లుగా మారగా చాలెంజర్స్ పోలీసుల్లా మారతారు. స్మగ్లర్లను అడ్డుకునేందుకు పోలీసులు డోర్ దగ్గరే ఉండిపోవడంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. 'మేము వారియర్స్.. సీనియర్స్ ఇలాగే ఆడతాం అంటున్నారు' అని ఆర్జే అసహనానికి లోనవగా ఈ సీనియర్స్, జూనియర్స్ వద్దు అని అఖిల్ హచ్చ్చరించాడు. మరోపక్క నటరాజ్ మాస్టర్.. కొట్టేసుకుందాం అన్నావ్ కదా, రా అంటూ యాంకర్ శివ మీదకెళ్లాడు. దీంతో అక్కడున్నవాళ్లు వారిని శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. మరోపక్క ఈ టాస్క్‌లో శ్రీరాపాకకు గాయమైనట్లు కనిపిస్తోంది. కాగా బిగ్‌బాస్ నాన్‌స్టాప్ తొలివారంలో వారియర్ తేజస్వి కెప్టెన్‌గా నిలిచింది. మరి రెండో వారం చాలెంజర్స్ గెలుస్తారా? లేదంటే మరోసారి వారియర్స్‌లో నుంచి ఒకరు కెప్టెన్‌గా అవతరించనున్నారా? అనేది చూడాలి! చదవండి: Bindu Madhavi: కాలేజీలో ప్రేమించుకున్నాం, కానీ ఆ తర్వాత బ్రేకప్: బిందు మాధవి -
బిగ్‌బాస్: వారానికి ముమైత్ ఖాన్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ నుంచి తొలివారం ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. వారియర్స్ టీమ్ కంటెస్టెంట్ అయిన ముమైత్‌కు అతి తక్కువ ఓట్లు రావడంతో ఆమె బిగ్‌బాస్ హౌజ్‌ను వీడాల్సి వచ్చింది. అయితే ఆమె ముందునుంచి భయపడ్డట్టే జరిగింది. హౌజ్‌లో అడుగుపెట్టిన మరు క్షణం నుంచి ముమైత్ తీరు గమనిస్తే ఆమె ఆట మీద కంటే.. నామినేషన్స్ ఎలిమినేషన్ మీదే ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో ఆమె ప్రతి ఒక్కరి దగ్గర సింపతి గేన్ చేసే పనిమీదే ధ్యాస ఉంచినట్లు కనిపించింది. ఇలా బయటికి వచ్చిన ముమైత్.. తాను ఇంత తొందరగా బయటకు వస్తానని ఊహించలేదంటూ స్టేజ్‌పైనే ఎమోషనల్ అయ్యింది. చదవండి: సమంతపై దారుణమైన ట్రోల్స్.. చీచీ ఇలా దిగజారిపోతున్నావేంటి? ఇదిలా ఉంటే బిగ్‌బాస్‌లో ముమైత్ ఖాన్ రెమ్యునరేషన్ హాట్‌టాపిక్ మారింది. దీంతో బిగ్‌బాస్ నిర్వాహకులు ఆమెకు బిగ్‌బాస్ నిర్వాహకులు పారితోషికం ఎంత ఇచ్చారా అని ఆరా తీయడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో ఆమెకు ఒక్క వారానికి రూ. 80 వేలు పారితోషికం ఇచ్చినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. దిన్ని బట్టి చూస్తే ఆమె రెమ్యునరేషన్ లక్ష రూపాయల లోపే ఉండవచ్చని సమాచారం. ఇక షో నుంచి బయటకు వచ్చేముందు హౌజ్‌లో విలువైన వ్యక్తులు(వర్తీ), పనికిరాని వాళ్లు(వేస్ట్) అనే ట్యాగ్ ఎవరికీ ఇస్తావని హోస్ట్ నాగార్జున అడగ్గా.. అఖిల్, అజయ్, తేజస్విని, అరియానా, అషురెడ్డిలకు వర్తీ ట్యాగ్, సరయు, మిత్ర, శివ, బిందు, ఆర్జే చైతులకు వేస్ట్ ట్యాగ్ ఇస్తానని ముమైత్ తెలిపిన సంగతి తెలిసిందే. చదవండి: నేను కూడా కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నా: మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్ -
అందంపై నటరాజ్ మాస్టర్ సెటైర్లు, ఇచ్చిపడేసిన బిందు మాధవి!
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షోలో వినోదం కంటే గొడవలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. బిగ్‌బాస్ కంటెస్టెంట్లను వారియర్స్, చాలెంజర్స్ అంటూ రెండు టీములుగా విభజించడంతో వారి మధ్య పోటీ రసవత్తరంగా మారింది. తాజాగా మరోసారి ఈ రెండు టీముల మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయి. ఈ మేరకు హాట్‌స్టార్ తాజాగా ప్రోమో రిలీజ్ చేసింది. వారియర్స్.. వారి వసతులు గెలుచుకునేందుకు చివరి అవకాశంగా ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. బాస్కెట్ బొనాంజా టాస్క్‌లో వారియర్స్ గెలవగా వారు లగేజీ, బెడ్రూమ్ యాక్సెస్‌లో ఏదో ఒకటి పొందే చాన్స్ దక్కింది. దీంతో వారియర్స్ లగేజీ తీసుకుంటున్నామని ప్రకటించారు. ఆ తర్వాత వారియర్స్ వంట చేయడంలో బిజీగా అయిపోగా ఆర్జే చైతూ చాలెంజర్స్‌ను వెంటేసుకుని కిచెన్‌లో అడుగుపెట్టాడు. 'బెడ్రూం లేదా లగేజీ యాక్సెస్.. ఈ రెండింటిలో ఏ వసతిని వారియర్స్‌కు ఇవ్వాల్సి ఉంటుందో చాలెంజర్స్ సభ్యులు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది' అని కొత్త నిబంధనను వినిపించాడు చైతూ. దీంతో కెప్టెన్ అషూ.. మా లగేజీని వెనక్కు తీసుకోవాలుకుంటున్నారా? అని అడిగింది. ఏదివ్వాలని మేము నిర్ణయించాలి, కానీ మీరు ముందుగానే తీసేసుకున్నారని చెప్పడానికి వచ్చామని బిందుమాధవి తెలిపింది. దీనికి నటరాజ్ మాస్టర్ స్పందిస్తూ.. మనకు అందమెంత ఇచ్చాడో మన మనసు, ఆలోచన కూడా అంతే అందంగా ఉండాలని తేజస్వితో చెప్పుకొచ్చాడు. ఫేస్ టు ఫేస్ డైరెక్ట్‌గా చెప్తే వింటాను అని గట్టిగా ఇచ్చిపడేసింది బిందు. అందమైన మనసుండాలని చెప్పానంతేనని నటరాజ్ మాస్టర్ ఆన్సరిచ్చాడు. మరి వీరి గొడవ ఎంతదూరం వెళ్తుందో చూడాలంటే నేడు రాత్రి 9 గంటలకు హాట్‌స్టార్‌లో ప్రసారమయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే! E choose the answer ki anni aatankale! Mana housemates edi enchukuntaru? Catch them on @DisneyPlusHS today at 9 PM on #BiggBossNonStop #BiggBoss #BiggBossTelugu @endemolsunshineind pic.twitter.com/fnJRkzi7mr — DisneyPlus Hotstar Telugu (@DisneyPlusHSTel) March 9, 2022 -
సరయుపై డబుల్ మీనింగ్ డైలాగ్! నిరూపిస్తే వెళ్లిపోతానన్న యాంకర్!
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ రెండోవారంలో అడుగుపెట్టింది. రెండోసారి కూడా నామినేషన్లు రసవత్తరంగా మారాయి. వారియర్స్ టీం నుంచి ఒక్కొక్కరు ఒక్కో కంటెస్టెంట్‌ను మాత్రమే నామినేట్ చేయాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. నామినేట్ చేయాలనుకున్న వ్యక్తి ఫొటోపై కత్తి గుచ్చి నామినేషన్ ప్రక్రియ కొనసాగించాలని సూచించాడు. మరి ఎవరు ఎవరెవర్ని నామినేట్ చేశారో కింది స్టోరీలో చదివేయండి. ముందుగా సరయు వంతు రాగా డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతున్నాడంటూ యాంకర్ శివను నామినేట్ చేసింది. తర్వాత అషూరెడ్డి.. గేమ్ మీద ఫోకస్ పెట్టడం లేదంటూ మిత్రశర్మను నామినేట్ చేసింది. అఖిల్.. యాంకర్ శివను నామినేట్ చేస్తూ అతడిపై సెటైర్లు విసిరాడు. ఇంట్లో ఉండాలంటే అర్హత ఉండాలని, నీమీద నీకు నమ్మకం లేకపోతే ఇంట్లో ఉండి వేస్ట్ అని విమర్శించాడు. తేజస్వి.. అతడిని నామినేట్ చేస్తే కానీ అసలు గేమ్ బయటకు రాదంటూ అనిల్‌ను నామినేట్ చేసింది. మహేశ్ విట్టా కూడా తేజు చెప్పిన కారణమే చెప్తూ అనిల్ ఫొటోపై కత్తితో గుచ్చాడు. నటరాజ్ మాస్టర్.. శివను నామినేట్ చేసే క్రమంలో వీరిద్దరికి మధ్య పెద్ద ఫైటే జరిగింది. హమీదా.. మిత్రను, అరియానా.. శ్రీరాపాకు నామినేట్ చేశారు. చాలెంజర్స్ టీమ్.. వారియర్స్‌లో ఇద్దరిద్దర్ని నామినేట్ చేయాలని ఆదేశించాడు బిగ్‌బాస్. దీంతో మొదటగా ఆర్జే చైతూ.. అఖిల్, అరియానాను; స్రవంతి చొక్కారపు.. సరయు, నటరాజ్ మాస్టర్‌ను; శ్రీరాపాక.. అరియానా, సరయును; అనిల్.. సరయు, హమీదాను నామినేట్ చేశారు. అజయ్.. సరయు, మహేశ్ విట్టాను; బిందు మాధవి.. నటరాజ్ మాస్టర్, సరయును; మిత్ర శర్మ.. అషూ, హమీదా; యాంకర్ శివ.. సరయు, అఖిల్‌ను నామినేట్ చేశారు. యాంకర్ శివ సరయును నామినేట్ చేసే క్రమంలో తాను డబుల్ మీనింగ్ డైలాగ్ మాట్లాడినట్లు నిరూపిస్తే హౌస్‌లో నుంచి వెళ్లిపోతానని సవాలు విసిరాడు. దీంతో ఫైనల్‌గా 11 మందికి ఎక్కువ ఓట్లు వచ్చాయి. దీంతో ఈ వారం సరయు, అఖిల్, హమీదా, అనిల్, మిత్ర శర్మ, అరియానా, శివ, నటరాజ్, అషూ, శ్రీరాపాక, మహేశ్ నామినేషన్లో ఉన్నారు. -
నువ్వు బిగ్‌బాస్ హౌస్‌లో ఉండటం వేస్ట్ : అఖిల్ సార్థక్
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ రసవత్తరంగా సాగుతోంది. తొలి వారం ఎవరూ ఊహించని విధంగా ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయ్యింది. చివరి రౌండ్లో సరయు, ముమైత్‌కి జరిగిన పోరులో అనూహ్యంగా ముమైత్ ఖాన్‌కు తక్కువ ఓట్లు రావడంతో హౌస్ నుంచి బయటికి వెళ్లింది. ఈ మొత్తం ఎపిసోడ్లో ఆర్జే చైతూని నిందిస్తూ తన తర్వాత బయటికి వచ్చేది తనే అంటూ శాపనార్థాలు పెట్టింది. ఇక సండే ఎపిసోడ్ అలా సాగింది. తాజాగా బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో రెండవ వారానికి సంబంధించి నామినేషన్స్ షురూ అయ్యాయి. తాము ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో వారి ఫోటోను డ్యాగర్తో గుచ్చి తగిన కారణాలు చెప్పాల్సిందిగా బిగ్‌బాస్ ఆదేశించాడు. ఇక ఎప్పటిలాగే నామినేషన్స్‌లో ఒకరిపై ఒకరు అరుచుకోవడం, గొడవ పడటం జరిగాయి. ఇంట్లో ఉండటానికి ఒక అర్హత ఉండాలని అది గేమ్‌లో ఎక్కడా కనిపించడం లేదంటూ అఖిల్ యాంకర్ శివను నామినేట్ చేశాడు. సరయు సైతం తనతో డబల్ మీనింగ్‌తో మాట్లాడుతున్నాడంటూ శివనే నామినేట్ చేసింది. ఈ గొడవలో నటరాజ్ మాస్టర్ ఎంటర్ అయ్యి.. అవును నువ్వు డబల్ మీనింగ్‌లోనే మాట్లాడావ్ అంటూ సరయూకి సపోర్ట్‌గా నిలిచాడు. దీంతో ఒకవేళ మీరు చెప్పిన డైలాగ్ నేను అని ఉంటే తక్షణమే బిగ్‌బాస్ నుంచి బయటికి వెళ్లిపోతా అంటూ యాంకర్ శివ ఛాలెంజ్ చేస్తాడు. అషూ, మిత్రా శర్మ మధ్య జరిగిన గొడవ ఇంకా సద్దుమణిగినట్లు లేదు. ఇద్దరూ మాటల యుద్దంతో హీటెక్కించారు. మరోవైపు అరియానా నీ ఎక్స్పెక్టేషన్ కోసం హౌస్‌కి రాలేదంటూ శ్రీ రాపాకకి చురకలంటిస్తుంది. -
నన్ను చూడగానే అందరూ భయపడుతున్నారు, ఆ ఐదుగురు వేస్ట్!
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షోలో మొదటి వారం ఎలిమినేషన్ జరిగింది. సరయు, మిత్ర శర్మ కాకుండా ఊహించని కంటెస్టెంట్ ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయింది. సండే ఫండే ఎపిసోడ్లో నాగార్జున ఆమెను దగ్గరుండి బయటకు పంపించాడు. మరి ఆ సంగతులేంటో మార్చి 7 నాటి కథనంలో చూసేయండి.. సండేను ఫండే చేసేందుకు నాగార్జున హౌస్‌మేట్స్‌తో సరదా గేమ్స్ ఆడించాడు. అందులో భాగంగా రెండు టీములతో డ్యాన్సులు కూడా చేయించాడు. ఈ పోటీ వారియర్స్, చాలెంజర్స్ పోటీపడి స్టెప్పులేశారు. బిగ్‌బాస్ మొదలై వారం రోజులైతున్న సందర్భంగా అందరి మనసులో ఏముందో అడిగి తెలుసుకున్నాడు. అలాగే మహేశ్ విట్టా పెళ్లి గురించి ఆరా తీయగా.. అతడు మాట్లాడుతూ.. మా రిలేషన్‌కు ఐదేళ్లు. రెండేళ్ల క్రితమే పెళ్లి చేసుకుందామనుకున్నాం. కానీ కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ వస్తూనే ఉన్నాయి. ఈ కరోనా తగ్గాక పెళ్లి చేసుకుందామని ఆగాం. త్వరలోనే అది కూడా జరుగుతుంది అని చెప్పాడు. నచ్చినవాళ్లకు ఎర్ర గులాబీ, నచ్చనివాళ్లకు నల్ల గులాబీ ఇవ్వాలని నాగ్ ఓ టాస్క్ ఇచ్చాడు. ఇందులో మెజారిటీ ఎర్ర గులాబీలు వచ్చిన తేజస్వికి లవ్ బ్యాడ్జ్, ఎక్కువ నల్ల గులాబీలు వచ్చిన మిత్ర శర్మకు హేట్ బ్యాడ్జ్ పెట్టారు. అనంతరం ఎలిమినేషన్ జోన్లో సరయు, ముమైత్ ఖాన్ ఇద్దరే మిగిలారు. ఈసారి కూడా ఫస్ట్ వీక్‌లోనే వెళ్లిపోతాననుకున్న సరయు గుక్కపెట్టి ఏడ్చేసింది. ఫైనల్‌గా ముమైత్ ఎలిమినేట్ అని ప్రకటించడంతో సరయు కిందపడి కన్నీళ్లు పెట్టుకుంది. నా వ్యక్తిత్వం గురించి చెడుగా మాట్లాడారు, అందుకే ఎలిమినేట్ అవాల్సి వచ్చిందని ఫైర్ అయింది ముమైత్. అప్పటిదాకా గొంతులోనే దుఃఖాన్ని ఆపుకున్న ఆమె అఖిల్‌ను హత్తుకోగానే ఏడ్చేసింది. స్టేజీపైకి వచ్చాక కూడా కన్నీళ్లు ఆపుకోలేకపోవడంతో నాగార్జున ఆమెను ఓదార్చాడు. తర్వాత ఆమెతో నాగ్ టాస్క్ ఆడించాడు. హౌస్‌లో ఉండాల్సిన ఐదుగురు, అవసరం లేని కంటెస్టెంట్లు ఎవరో చెప్పాలన్నాడు. దీనికి ముమైత్.. అఖిల్, అషూ, తేజస్వి, అజయ్, అరియానా ఉండాల్సిన వారని చెప్పింది. చైతూ, శివ, మిత్ర, సరయు, బిందు మాధవి వేస్ట్ కంటెస్టెంట్లని చెప్పుకొచ్చింది. చివరగా అఖిల్ నీ స్నేహం అంటూ పాటతో ముమైత్‌కు వీడ్కోలు పలికాడు. -
ముమైత్ ఎలిమినేట్.. బిందు మాధవిపై షాకింగ్ కామెంట్స్
Bigg Boss Non-Stop Buzz: బిగ్‌బాస్ నాన్‌స్టాప్.. తొలివారం పూర్తి చేసుకుంది. నో కామా నో ఫుల్ స్టాప్ అంటూ నాగార్జున మొదలుపెట్టిన ఈ షో నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్తో ముందుకి సాగుతుంది. ఫన్, ఫ్రస్టేషన్, ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ ఇలా 17మందితో మొదలైన బిగ్‌బాస్ షో రసవత్తరంగా సాగుతుంది. మాజీ కంటెస్టెంట్లతో పోటీపడి మరీ కొత్త కంటెస్టెంట్లు తమదైన ఆట కొనసాగిస్తున్నారు. ఇక బిగ్‌బాస్ ఓటీటీలో తొలి ఎలిమినేషన్ చోటుచేసుకుంది. చదవండి: ఆర్జీవీపై యాంకర్ శ్యామల ఆసక్తికర వ్యాఖ్యలు ఈ వారం వారియర్స్ టీమ్ కంటెస్టెంట్ ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయ్యి బిగ్‌బాస్ హౌజ్‌ను వీడింది. 24/7 డిస్నీ హాట్ స్టార్‌లో నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్ను అందిస్తున్న బిగ్‌బాస్ అన్ని సీజన్ల మాదిరిగానే బిగ్‌బాస్ నాన్‌స్టాప్ బజ్‌ను షోను కూడా నిర్వహిస్తోంది. ఈ షో ద్వారా ఎలిమినేట్ అయిన సభ్యులు మిగతా కంటెస్టెంట్స్‌పై ఉన్న తమ అభిప్రాయాన్ని చెప్పుకొవచ్చు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో యాంకర్ రవి ఈ షోకు హోస్ట్‌గా కనిపించాడు. ఈ సందర్భంగా రవితో కలిసి బిగ్‌బాస్ హౌజ్ ముచ్చట్లు చెప్పిన ముమైత్ మిగతా కంటెస్టెంట్స్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చదవండి: ఎల్లలు దాటిన అభిమానం, ‘ఆర్ఆర్ఆర్’ కోసం ఏకంగా థియేటర్‌నే కొనేశారు! బిందు మాధవిని నాగినితో పోల్చింది. ఇక తన తర్వాత హౌజ్‌ను వీడేది ఎవరని అడగ్గా.. ఆర్జే చైతూ అంటూ ధీమాగా సమాధానం ఇచ్చింది. ఇలా రవి.. ముమైత్ మనసులోని మాటలను ఎలా బయట పెట్టించాడో తెలుసుకోవాలంటే ఫుల్ ఎపిసోడ్ చూసేయండి. ఇదిలా ఉంటే బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో యాంకర్ రవి సందడి చేయనున్నాడంటూ ముందు నుంచి ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ షో మొదలయ్యాక రవి కనిపించకపోవడంతో అతడి ఫ్యాన్స్ నిరాశ చెందారు. చివరికి కంటెస్టెంట్‌గా కాకుండా హోస్ట్‌గా రవికి బిగ్‌బాస్ నుంచి పిలుపు వచ్చిందని తెలిసి అతడి ఫాలోవర్స్ అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రేమించుకున్నాం, కానీ విడిపోయాం, అది మాత్రం చెప్పను: హీరోయిన్
ఈసారి 'నాన్‌స్టాప్' ఎంటర్టైన్మెంట్తో సరికొత్తగా ముందుకు వచ్చింది బిగ్‌బాస్. 17 మంది కంటెస్టెంట్లతో ఫిబ్రవరి 26న గ్రాండ్‌గా ప్రారంభమైందీ షో. ఈసారి కొత్త కంటెస్టెంట్లే కాకుండా మాజీలు సైతం రంగంలోకి దిగారు. అందులో రన్నరప్ అఖిల్‌తో పాటు అరియానా, తేజస్వి, అషూ, మహేశ్ విట్టా, నటరాజ్ మాస్టర్, సరయు, హమీదా, ముమైత్ ఖాన్ ఉన్నారు. వీరంతా వారియర్స్ టీమ్‌లా ఏర్పడగా కొత్తగా ఎంట్రీ ఇచ్చిన చైతూ, బిందుమాధవి, మిత్ర శర్మ, శ్రీరాపాక, అజయ్, అనిల్, శివ, స్రవంతి చాలెంజర్స్ టీమ్‌లో ఉన్నారు. ఇప్పటివరకు జరిగిన ఆటల్లో దాదాపు వారియర్స్‌దే పైచేయి అవుతూ వస్తోంది. దీంతో చాలెంజర్స్ ఎలాగైనా వారియర్స్‌ను ఓడించాలని కసిగా ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా కంటెస్టెంట్లు వారి వ్యక్తిగత విషయాలను హౌస్‌మేట్స్‌తో పంచుకోవాలనే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. అందులో భాగంగా 'ఆవకాయ బిర్యానీ' హీరోయిన్ బిందుమాధవి తన లవ్ లైఫ్‌ను వివరించింది. కాలేజీలో చదువుకునే రోజుల్లో ఇద్దరం ప్రేమించుకున్నామని, కానీ కెరీర్ కోసం దూరమవ్వాల్సి వచ్చిందని తెలిపింది. అతడు పై చదువుల కోసం అమెరికా వెళ్లిపోగా తాను నటన మీదున్న ఆసక్తితో సినీరంగంలోకి వచ్చేశానని పేర్కొంది. అయితే ఇప్పటికీ ఆ రిలేషన్ తనకెంతో స్పెషల్ అన్న బిందు ప్రియుడి పేరును మాత్రం వెల్లడించలేదు. అంతేకాదు, అతడికి పెళ్లి కూడా అయిపోయిందని తెలిపింది. కాగా ప్రియుడితో బ్రేకప్ అయిన సమయంలో డిప్రెషన్లోకి వెళ్లిపోయానని గతంలో బిందు బిగ్‌బాస్ స్టేజీ మీదే చెప్పుకొచ్చింది. అలాంటి సమయంలో తమిళ బిగ్‌బాస్ నుంచి ఆఫర్ రావడంతో షోకి వెళ్లగా.. ఆశ్చర్యంగా కొన్నిరోజుల్లోనే డిప్రెషన్ నుంచి బయటపడినట్లు చెప్పింది. ఇప్పుడు తెలుగులోనూ ఛాన్స్ రావడంతో ఇక్కడి ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు నాన్‌స్టాప్ షోలో అడుగుపెట్టింది బిందుమాధవి. -
బిగ్‌బాస్: తారుమారైన ఓటింగ్.. ముమైత్ ఖాన్ ఎలిమినేట్!
బిగ్‌బాస్ నాన్‌స్టాప్.. తొలివారం పూర్తి చేసుకుంది. నో కామా నో ఫుల్ స్టాప్ అంటూ నాగార్జున మొదలుపెట్టిన ఈ షో నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్తో ముందుకి సాగుతుంది. . ఫన్, ఫ్రస్టేషన్, ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ ఇలా 17మందితో మొదలైన బిగ్‌బాస్ షో రసవత్తరంగా సాగుతుంది. మాజీ కంటెస్టెంట్లతో పోటీపడి మరీ కొత్త కంటెస్టెంట్లు తమదైన ఆట కొనసాగిస్తున్నారు. ఇక 24/7 డిస్నీ హాట్ స్టార్‌లో ప్రసారం కానుండటంతో ప్రేక్షకులకు బోలెడంత ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. ఇక బిగ్‌బాస్ ఓటీటీలో మొదటి వారం నామినేషన్స్‌లో సరయు, ముమైత్ ఖాన్, మిత్రా శర్మ, ఆర్జే చైతు అరియానా గ్లోరి, నటరాజ్ మాస్టర్ ఉన్నారు. వీరిలో ఎవరు మొదటి వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే చర్చ జరుగుతుంది. అయితే సోషల్ మీడియాలో అందుతున్న సమాచారం ప్రకారం.. ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తుంది. నిజానికి మిత్రా శర్మ ఎలిమినేట్ అవుతుందని అంతా భావించారు. కానీ లాస్ట్ మినిట్‌లో ఓటింగ్ తారుమారు అవ్వడంతో ఆమె సేఫ్ అయ్యి ముమైత్ ఎలిమినేట్ అయినట్లు లీకు వీరులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. మరి నిజంగానే ముమైత్ ఎలిమినేట్ అయ్యిందా అనేది తెలియాలంటే రేపు జరగనున్న సండే ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే. -
సిగరెట్ల కోసం ఏడుస్తుంది, ముమైత్ ముఖం చూడబుద్ది కాదు: చైతూ
ఏడాదికోసారి వచ్చే బిగ్‌బాస్ షో అంటే బుల్లితెర ప్రేక్షకులకు ఎంతో ఇష్టం. అంతలా షోను ఆదరించేవారి కోసం బిగ్‌బాస్ ఓటీటీని ప్రవేశపెట్టారు నిర్వాహకులు. ఇదివరకే పరియమున్న కంటెస్టెంట్లతోపాటు కొత్తవాళ్లను సైతం షోలోకి ఆహ్వానించి గేమ్ మొదలు పెట్టారు. అలా కొత్త, పాతల కలయికతో బిగ్‌బాస్ నాన్‌స్టాప్ మొదలైంది. మరి బిగ్‌బాస్ షోలో ఏం జరుగుతోంది? ఎవరు కెప్టెన్ అయ్యారు? చైతూకు, ముమైత్‌కు మధ్య గొడవకు కారణమేంటి? అన్న విషయాలు మార్చి 4 నాటి ఎపిసోడ్లో చూసేద్దాం.. స్మోకింగ్ రూమ్‌లో దమ్ము లాగుతూ ముమైత్ ఏడుస్తుండటంతో ఆమెను ఊరడించే ప్రయత్నం చేసింది అషూ. ఆమెను ఎలాగైనా నవ్వించాలనుకున్న అషూ అందుకు అఖిల్‌ను పావుగా వాడుకుంది. ఆ సీజన్లో ఆమె(మోనాల్)ను, ఈ సీజన్‌ను ఈమె(ముమైత్)ను ఎందుకు ఏడిపిస్తున్నావ్? అని సరదాగా కౌంటర్లు వేసింది. కానీ ఆమె మాటలకు అఖిల్ హర్టవడంతో తప్పు తెలుసుకున్న బ్యూటీ అతడికి క్షమాపణలు చెప్పింది. అయినప్పటికీ ఆ బాధలో నుంచి అంత త్వరగా తేరుకోలేకపోయిన అఖిల్ మోనాల్ గుర్తొస్తోందని బాధపడ్డాడు. తర్వాత బిగ్‌బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. ఉదయం లేవగానే ఎవరి ముఖం చూడాలనుకుంటారు? ఎవరి ముఖం చూడొద్దనుకుంటారో చెప్పాలన్నాడు. మొదటగా చైతూ మాట్లాడుతూ.. బిందుమాధవి ముఖం చూస్తే రోజంతా హ్యాపీగా ఉంటుందంటూ ఆమెకు హార్ట్ సింబల్ బ్యాడ్జ్ పెట్టాడు. పొద్దున లేవగానే బిగ్‌బాస్‌తో గొడవలు పడే ముమైత్ ఖాన్ ముఖం చూడకూడదనుకుంటున్నానని అసహ్యపు ఎమోజీ ఉన్న బ్యాడ్జ్ పెట్టాడు. తర్వాత తేజస్వి ముమైత్‌కు హార్ట్ బ్యాడ్జ్, కుళ్లు జోకులేసే అజయ్ ముఖం చూడొద్దనుకుంటున్నానని అతడికి అసహ్యపు బ్యాడ్జ్ పెట్టింది. యాంకర్ స్రవంతి.. తేజస్వికి హార్ట్ బ్యాడ్జ్, తొడపాశం పెడతానన్న అజయ్‌కు అసహ్యపు బ్యాడ్జ్ ఇచ్చింది. అషూ.. నటరాజ్ మాస్టర్‌కు హార్ట్, శివకు అసహ్యపు బ్యాడ్జ్ పెట్టింది. ఓ వైపు టాస్క్ జరుగుతుండగానే ముమైత్ ఏడుపందుకుంది. తెలుగు సరిగా రాదు కాదు కాబట్టి సరిపోయింది, లేకపోతే గుద్దుతా, నాన్సెన్స్, నన్ను టార్గెట్ చేస్తున్నాడు, నా వ్యక్తిత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు అంటూ చైతూ ఫైర్ అయింది ముమైత్. పొద్దుపొద్దునే సిగరెట్ల కోసం ఏడుస్తుంది, అలా పొద్దున ఏడవకూడదని చెప్పాను. అది తప్పా? అని ఫ్రస్టేట్ అయ్యాడు చైతూ. వీళ్ల మధ్య ఇలా గొడవ కొనసాగుతున్న సమయంలోనే కెప్టెన్సీ టాస్క్ జరగ్గా ఇందులో తేజస్వి గెలిచి మొదటి కెప్టెన్‌గా అవతరించింది. తేజస్వి నటరాజ్ మాస్టర్‌ను రేషన్ మేనేజర్‌గా ఎన్నుకుంది. ఇదిలా ఉంటే బిగ్‌బాస్ కెప్టెన్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. పర్మినెంట్‌గా బెడ్రూమ్ యాక్సెస్, లగేజీ ఉంచుకునే అవకాశాన్ని ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారని అడగ్గా తేజస్వి.. అషూ పేరు చెప్పింది. దీంతో అషూ వారియర్స్‌తో పాటు బెడ్రూమ్లో నిద్రించే అవకాశం దక్కించుకుంది. -
Bigg Boss: చెప్పుతో కొట్టిన అషూ, హర్ట్ అయిన అరియానా!
బిగ్‌బాస్ నాన్‌స్టాప్.. ఇచట అన్ని రకాల ఎమోషన్స్ దొరుకుతాయి. వారియర్స్, చాలెంజర్స్ తగ్గేదేలే అన్నట్లుగా ఆడుతున్నారు. అయితే మార్చి 3 నాటి ఎపిసోడ్లో అషూ, అరియానా ఇద్దరూ చెప్పులతో కొట్టుకున్నారు. దీంతో హర్టయిన అరియానా చెప్పుతో కొట్టడం నచ్చలేదని మాట్లాడింది. నువ్వు అలా చేశావ్ కాబట్టే తాను తిరిగి కొట్టానని చెప్పింది. దీంతో అషూ ఆమెకు సారీ చెప్పింది. ఇక అషూ తన సిగరెట్ ప్యాకెట్లు దాచిందన్న అనుమానంతో ఆమెకు సంబంధించిన బ్యాగ్‌ను దాచేశాడు యాంకర్ శివ. ఎలాగైనా తన బ్యాగ్‌ను తిరిగి రాబట్టాలనుకున్న అషూ.. 'శివ ఎలా అయిపోతున్నాడో చూడండి, సిగరెట్లు తాగకుండా ఉండలేకపోతున్నాడు, పిచ్చెక్కిపోతున్నాడు, గజతాగుబోతుగా తయారైపోతున్నాడు' అంటూ కామెంట్రీ మొదలు పెట్టడంతో శివ వెంటనే లేచి ఆమె బ్యాగును అప్పజెప్పాడు. ఆ తర్వాత బిగ్‌బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. వారియర్స్ గతంలో బిగ్‌బాస్ షోకు వచ్చినప్పడు చేసిన పొరపాట్లు ఏంటి? వాటి నుంచి నేర్చుకున్న గుణపాఠాలేంటో చెప్పాలన్నాడు. ఇందులో భాగంగా అఖిల్ మాట్లాడుతూ.. తనెక్కువగా నవ్వలేదని, దానివల్లే గెలవలేకపోయానని చెప్పుకొచ్చాడు. మోనాల్‌తో ఉన్న బంధం వల్లే గెలవలేదని బయట టాక్, దీనికేమంటావని యాంకర్ శివ ప్రశ్నించాడు. మోనాల్‌తో ఫ్రెండ్షిప్ వల్ల వెనకబడిపోయానంటే ఒప్పుకోను, ఆమెతో స్నేహం అలాగే ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు అఖిల్. తర్వాత అరియానా మాట్లాడుతూ.. ఎంజాయ్ చేస్తూ గేమ్ ఆడతానని చెప్పుకొచ్చింది. గతంలో నేర్చుకున్న గుణపాఠాల వల్ల ఇప్పుడు అందరినీ అంత ఈజీగా నమ్మలేనని తెలిపింది తేజస్వి. వేరే వాళ్లు ఎక్కువ రోజులు ఉండేందుకు నా క్యారెక్టర్ బ్యాడ్ చేసి పంపించేయాలనుకున్నారంటూ పరోక్షంగా వితిక- వరుణ్‌ల మీద ఫైర్ అయ్యాడు మహేశ్. ఇంతకుముందు వచ్చినప్పుడు బిగ్‌బాస్ షోను చాలా లైట్ తీసుకున్నానంటూ అషూ ఉపన్యాసం మొదలు పెట్టిందో లేదో మధ్యలో తేజస్వి కల్పించుకోవడంతో వీరిమధ్య గొడవ రాజుకుంది. అనంతరం వారియర్స్ టీమ్‌లో నుంచి మరో ఇద్దరిని కెప్టెన్సీ కంటెండర్లుగా ఎన్నుకోమని ఆదేశించగా మెజారిటీ సీనియర్లు అఖిల్, అరియానా పేర్లు చెప్పారు. దీంతో తొలివారం కెప్టెన్సీ కోసం మహేశ్, తేజస్వి, సరయు, నటరాజ్‌తో పాటు వీరిద్దరూ పోటీపడ్డారు. ఎంత ప్రెషర్ పెట్టి ఆడుతున్నా మోటివేషన్ లేకపోయేసరికి నిరాశగా అనిపిస్తోంది. ముమైత్, మహేశ్ తప్ప ఎవరూ నాకు సపోర్ట్ చేయలేదు అని బాధపడింది. అర్ధరాత్రి లైట్లు ఆర్పేశాక తనలో తనే కుమిలిపోతూ ఏడ్చేసింది. ఫైనల్‌గా మొదటి వారం తేజస్వి కెప్టెన్‌గా అవతరించినట్లు తెలుస్తోంది. -
బిగ్‌బాస్ ఓటీటీ ఫస్ట్ కెప్టెన్ ఎవరంటే?
బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ స్ట్రీమింగ్‌లో ఎదురైన అవాంతరాలకు చెక్ పడింది. నాన్‌స్టాప్ అన్న పేరుకు తగ్గట్టుగానే రోజుకి 24 గంటలు హాట్‌స్టార్‌లో ప్రసారమవుతోంది. 17 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన హౌస్‌లో తొలివారం నామినేషన్స్ కూడా పూర్తయ్యాయి. సరయు, నటరాజ్ మాస్టర్, ముమైత్ ఖాన్, అరియానా గ్లోరీ, మిత్ర శర్మ, హమీదా, ఆర్జే చైతూ ఫస్ట్ వీక్ నామినేషన్స్‌లో ఉన్నారు. ఇదిలా ఉంటే హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్ ముగిసింది. ఈ టాస్క్‌లో తేజస్వి మదివాడ గెలిచి మొదటి కెప్టెన్‌గా అవతరించింది. ఆమె నటరాజ్ మాస్టర్‌ను రేషన్ మేనేజర్‌గా ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా కెప్టెన్ అవ్వాలనుకున్న అషూ రెడ్డి కనీసం కంటెండర్‌గా కూడా పోటీ చేయలేపోవడంతో బాధతో ఏడ్చేసింది. మరి తేజస్వి కెప్టెన్‌గా బిగ్‌బాస్ హౌస్‌ను, హౌస్‌మేట్స్‌ను ఎలా దారిలో పెడుతుందో చూడాలి! -
నాలుగేళ్లుగా ప్రేమలో, త్వరలోనే మా పెళ్లి: మహేశ్ విట్టా
ఒక్క ఛాన్స్ అంటూ సినిమాల్లో అవకాశాల కోసం రేయింబవళ్లూ కష్టపడిన మహేశ్ విట్టా ఇప్పుడు సొంతంగా నిర్మాణ సంస్థ స్థాపించి సినిమాలు తీసే స్థాయికి ఎదిగాడు. తన యాసతో, కామెడీతో ప్రేక్షకులను అలరించిన మహేశ్ విట్టా గతంలో బిగ్‌బాస్ మూడో సీజన్లో పాల్గొన్నాడు. తాజాగా అతడు మరోసారి బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో అడుగుపెట్టాడు. అయితే షోలోకి వెళ్లేముందు ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు మహేశ్. 'నాలుగేళ్లుగా రిలేషన్లో ఉంటున్నాం. ఎంత గొడవపడ్డా వెంటనే కలిసిపోతాం. అతి త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. ఆమె నా చెల్లెలి స్నేహితురాలు. తను ఐటీలో ఉద్యోగం చేస్తుంది. రెండుసార్లు చూసినప్పుడు మా అమ్మ ఫేస్‌కట్ ఉందనిపించింది. వెంటనే ప్రపోజ్ చేశాను. పరిచయమవగానే ప్రపోజ్ ఏంటి? పో అంది. సరే ఫ్రెండ్స్‌గా ఉందామన్నాను. రెండేళ్ల తర్వాత ప్రేమకు ఓకే చెప్పింది. గతేడాది మా ఇద్దరి ఇంట్లో చెప్పాము, ఒప్పుకున్నారు. నా సినిమా రిలీజయ్యాక ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో వివాహం చేసుకుంటాను' అని చెప్పుకొచ్చాడు మహేశ్ విట్టా. బిగ్‌బాస్ ఓటీటీ గురించి మాట్లాడుతూ.. ఈసారి ఎలాగైనా కప్పు కొట్టే వస్తానని ధీమా వ్యక్తం చేశాడు. -
Bigg Boss: రాత్రిపూట ఒంటరిగా ఏడ్చేసిన అషూ
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ బుల్లితెరను కాదని కేవలం హాట్‌స్టార్‌లోనే ప్రసారమవుతోంది. అయితే 24 గంటలు లైవ్ స్ట్రీమింగ్ వీక్షించడం చాలా కష్టమంటున్నారు మెజారిటీ నెటిజన్లు. రెప్ప వాల్చకుండా షోను చూస్తూ ఉండటం ఇబ్బందేనని కామెంట్లు పెడుతున్నారు. దీంతో ఇలాంటివాళ్ల కోసం ప్రతి రోజు తొమ్మిందింటికి ఒక గంట పాటు ఎపిసోడ్ ప్రసారం చేయనున్నట్లు ప్రకటించింది బిగ్‌బాస్ టీమ్. ఈ వార్త విన్న అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్ నడుస్తోన్న విషయం తెలిసిందే! దీనికి సంబంధించి లేటెస్ట్ ప్రోమో వదిలింది హాట్‌స్టార్. వారియర్స్ టీమ్‌లో నుంచి ఇద్దరు కెప్టెన్సీ పోటీదారులను ఎన్నుకోమని బిగ్‌బాస్ ఆఫరిచ్చాడు. తేజస్వి, నటరాజ్ మాస్టర్ అరియానాను సెలక్ట్ చేయాలని అభిప్రాయపడ్డారు. సరయు.. హమీదా, అఖిల్ పేర్లను సూచించింది. అషూకు ముమైత్, మహేశ్ సపోర్ట్ చేసినట్లు కనిపిస్తోంది. ఫైనల్‌గా మెజారిటీ వారియర్స్ అఖిల్, అరియానా పేర్లను సూచించడంతో వారు కెప్టెన్సీకి పోటీపడుతున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంపై అషూ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసింది. నాకు ముమైత్, మహేశ్ తప్ప ఎవరూ సపోర్ట్ చేయలేదు, పోనీ, వచ్చేవారం ప్రయత్నిస్తాను, ఇంకేం చేస్తాం అని అనుకుంటూనే రాత్రిపూట ఒంటరిగా ఏడ్చేసింది. మరి బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో ఫస్ట్ కెప్టెన్ ఎవరయ్యారు? అన్న ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే! -
బిగ్‌బాస్ ఓటీటీ ఎలిమినేషన్స్: ఆ ఇద్దరిలో ఒకరు అవుట్!
బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌కు ఆదిలోనే ఆటంకాలు ఎదురయ్యాయి. 24 గంటలు ప్రత్యక్ష ప్రసారం అంటూ ఊరించిన బిగ్‌బాస్ షో లైవ్ స్ట్రీమింగ్‌ను ఆపేస్తూ అభిమానులకు సడన్ షాకిచ్చింది. సాంకేతిక లోపాలు తలెత్తడంతో లైవ్ స్ట్రీమింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే గురువారం అర్ధరాత్రి నుంచి మళ్లీ స్ట్రీమింగ్‌ను ప్రారంభిస్తామని స్పష్టం చేసింది హాట్‌స్టార్. ఇకపోతే షోలో అడుగుపెట్టిన కంటెస్టెంట్లు ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచిపెడుతున్నారు. ఫన్, ఫ్రస్టేషన్, ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్, ఏడుపులు, అల్లర్లు, గొడవలు.. ఇలా అన్నింటినీ చూపిస్తున్నారు. 17 మందితో మొదలైన ఈ షోలో మాజీలతో పోటీపడి మరీ ఆడుతున్నారు కొత్త కంటెస్టెంట్లు. నామినేషన్స్‌లో కూడా తగ్గేదేలే అన్నట్లుగా వారియర్ల (సీనియర్ల) తప్పొప్పులను ఎత్తిచూపిస్తూ నామినేట్ చేశారు. ఈ వారం వారియర్స్ టీమ్‌లో నుంచి సరయు, నటరాజ్ మాస్టర్, అరియానా గ్లోరీ, హమీదా, ముమైత్ ఖాన్ చాలెంజర్స్ టీమ్‌లో నుంచి మిత్ర శర్మ, ఆర్జే చైతూ నామినేట్ అయ్యారు. ఈ ఏడుగురిలో అరియానా, హమీదాకు మంచి ఫాలోయింగ్ ఉండటంతో వీరు ఎలిమినేషన్ దరిదాపుల్లో కూడా ఉండరు. ఆర్జే చైతూకు యాంకర్ శ్రీముఖి, ఆర్జే కాజల్ సహా పలువురి సపోర్ట్ ఉండనే ఉంది. కాబట్టి అతడు కూడా గండం గట్టెక్కినట్లే! ముమైత్ ఖాన్‌కు కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉండటంతో ఆమె ఎలిమినేట్ అయ్యే దాఖలాలు కనిపించడం లేదు. మిగిలిందల్లా నటరాజ్ మాస్టర్, సరయు, మిత్ర శర్మ. ఈ ముగ్గురిలో నటరాజ్ మాస్టర్, సరయుకు బిగ్‌బాస్ ఐదో సీజన్ కంటెస్టెంట్ల నుంచి సపోర్ట్ లభిస్తోంది. అలాగే మాస్టర్ ఉంటే షోలో కొంత గొడవల మసాలా కూడా ఉంటుందని భావించేవాళ్లు చాలామందే. ఈ లెక్కన నటరాజ్ మాస్టర్ కూడా సేవ్ అయిపోతాడని తెలుస్తోంది. గత సీజన్లో మొదటివారంలోనే ఎలిమినేట్ అయింది సరయు. ఈసారి ఆమె ఆటతీరు చూడాలని ప్రేక్షకులు ఛాన్స్ ఇస్తే ఆమె కూడా హౌస్‌లో ఉండగలుగుతుంది. మిత్రశర్మ గురించి ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. అందులోనూ నామినేషన్స్‌లో ఎక్కువతగా తడబడింది. తను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పలేకపోయింది. ఈ తడబాటు వల్లే వారియర్స్ ఆమెను ఏకగ్రీవంగా నామినేట్ చేశారు. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం మిత్ర శర్మకు తక్కువ ఓట్లు నమోదయ్యాయట. పరిస్థితి ఇలాగే కొనసాగితే తొలి వారంలోనే మిత్ర శర్మ తిరుగుముఖం పట్టడం ఖాయంగా కనిపిస్తోంది! -
తోలు తీస్తా, ఏం పీకుతావ్..: యాంకర్ శివపై నటరాజ్ ఉగ్రరూపం
బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో నిమిషానికో రకంగా మారిపోతున్నారు హౌస్మేట్స్. అప్పుడే నవ్వుతూ కనిపించే కంటెస్టెంట్లు ఆ మరుక్షణమే గొడవలో దూరుతూ కన్నీళ్లు పెట్టుకుంటే మరికొందరేమో బూతులు మాట్లాడుతూ చెవులు మూసుకునేలా చేస్తున్నారు. మరీ ముఖ్యంగా గొడవలంటే చాలు ఎవరూ తగ్గేదే లే అన్నట్లుగా ఢీ అంటే ఢీ అంటూ ముందుకు దూకుతున్నారు. ఫలితంగా ఏడుపులు, పెడబొబ్బలు ఉండనే ఉన్నాయి. ఈ క్రమంలో నా మంచితనాన్ని ఆధారంగా చేసుకుని నన్ను చులకన చేస్తున్నారంటూ ఏడ్చేసింది సరయు. హమీదా ఎప్పుడూ తనను చులకన చేస్తూ మాట్లాడుతోందని కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో అఖిల్ వెళ్లి ఆమెను ఓదార్చాడు. ఆ తర్వాత సరయు నేరుగా హమీదా దగ్గరకు వెళ్లి తన పైన జోకులు చేయొద్దని నొక్కి చెప్పింది. మరోవైపు యాంకర్ శివ పులిహోర కలుపుతూనే ఉన్నాడు. హౌస్‌లో అడుగుపెట్టగానే అరియానాను పొగిడిన ఆయన ఆ తర్వాత బిందు మాధవిని ఫోకస్ చేస్తూ ఆమె మీద పొగడ్తల వర్షం కురిపిస్తున్నాడు. చదవండి: అషూ మీద నీళ్లు ఉమ్మేసిన చైతూ, షాకైన హౌస్మేట్స్ ఇక కెప్టెన్సీ టాస్ఖ్లో అఖిల్, బిందు మాధవికి మధ్య పెద్ద ఫైటే జరిగింది. తాను ఫిజికల్ అయితే మామూలుగా ఉండదంటూ హీరోయిన్‌కు వార్నింగ్ ఇచ్చాడు అఖిల్. మరో పక్క నటరాజ్ మాస్టర్, యాంకర్ శివ దాదాపు కొట్టుకున్నంత పని చేశారు. రా అన్నావంటే తోలు తీస్తా, ఏం పీకుతావో చూస్తా అంటూ యాంకర్ శివ పైపైకి వెళ్లాడు మాస్టర్. దీంతో మిగతా హౌస్మేట్స్ వారిని కూల్ చేసేందుకు చాలానే ప్రయత్నించారు. ఫైనల్‌గా మహేశ్, తేజస్వి, నటరాజ్, సరయు మొదటి వారం కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచారు. మరి వీరిలో ఎవరు కెప్టెన్ అవుతారో చూడాలి! Voice being raised 🔊 words being exchanged 🤬 Can the contestants keep their 🆒?! Don't miss the recap episodes every day at 10 am and 9 pm, exclusively on @DisneyPlusHS@EndemolShineIND#BiggBoss #BiggBossNonStop #BiggBossTelugu pic.twitter.com/o5bSEoMqih — DisneyPlus Hotstar Telugu (@DisneyPlusHSTel) March 2, 2022 -
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ కోసం నాగార్జున పారితోషికం ఎంతో తెలుసా?
బుల్లితెర రియాలిటీ షో అనగానే టక్కున గుర్తొచ్చే పేరు బిగ్‌బాస్. ఈ ఆటలో ఉండే మజానే వేరు. ఆడేవారికన్నా చూసేవారికే ఎక్కువ ఇంట్రస్టింగ్‌గా అనిపిస్తుంటుందీ గేమ్ షో. ఇప్పటిదాకా బుల్లితెరపై సందడి చేసిన బిగ్‌బాస్ తాజాగా టీవీకి బైబై చెప్పేసి ఓటీటీలో ప్రసారమవుతోంది. బిగ్‌బాస్ నాన్‌స్టాప్ అంటూ కొత్త, పాత కంటెస్టెంట్లతో గేమ్ మొదలుపెట్టింది. 17 మంది కంటెస్టెంట్లతో ఫిబ్రవరి 26న ఘనంగా ప్రారంభమైందీ షో. గత మూడు సీజన్ల మాదిరిగానే ఈసారి కూడా నాగార్జున బిగ్‌బాస్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. కాకపోతే శని, ఆది వారాల్లో కాకుండా కేవలం శనివారం మాత్రమే వ్యాఖ్యాతగా స్క్రీన్‌పై కనిపించనున్నాడు. ఈ క్రమంలో నాగార్జున బిగ్‌బాస్ ఓటీటీ కోసం ఎంత పారితోషికం తీసుకుంటున్నాడన్న విషయం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. గత సీజన్‌కు పది నుంచి పన్నెండు కోట్ల దాకా రెమ్యునరేషన్ అందుకున్న నాగార్జున ఈసారి దాన్ని కొంత తగ్గించినట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్ నాన్‌స్టాప్ హోస్టింగ్ కోసం ఆయన దాదాపు రూ.8-9 కోట్ల మేర తీసుకున్నట్లు నెట్టింట ఓ వార్త వైరల్‌గా మారింది. మరి ఇదెంతవరకు నిజమో తెలీదు కానీ నాగ్ హోస్టింగ్‌కు ఆ మాత్రం తీసుకోవడంలో తప్పే లేదంటున్నారు ఆయన అభిమానులు. -
అషూ మీద నీళ్లు ఉమ్మేసిన చైతూ, షాకైన హౌస్మేట్స్
బిగ్‌బాస్ ప్రారంభమై మూడు రోజులయ్యిందో లేదో ఆట మొదలుపెట్టేశారు కంటెస్టెంట్లు. వారికి వారే టాస్కులు ఇచ్చుకుంటూ సరదాగా కాలం గడుపుతున్నారు. దీంతో బిగ్‌బాస్ వీరికో చాలెంజ్ విసిరాడు. సీనియర్స్‌లా భావిస్తున్న వారియర్స్‌కు షాకిస్తూ చాలెంజర్స్‌కు ఆధిపత్యం చెలాయించే అవకాశమిచ్చాడు. ఛాలెంజర్స్ అనుమతి లభించిన ఒక వారియర్ మాత్రమే బెడ్రూమ్లో నిద్రపోయే అవకాశం ఉంటుందని పేర్కొన్నాడు. అంతేకాదు, వారియర్స్‌కు సంబంధించిన లగేజ్ నుంచి ఒక్కో వారియర్ ఐదు వస్తువులు మాత్రమే తీసుకోవాలని, అవి తీసుకోవడానికి చాలెంజర్స్ అనుమతి పొందాలని మెలిక పెట్టాడు. చాలెంజర్స్ భోజనం చేశాక వారియర్స్ విందు ఆరగించాలని కండీషన్ పెట్టాడు. వారియర్స్ అందరూ మాజీ కంటెస్టెంట్లే కాబట్టి వారికి హౌస్‌ను ఎలా శుభ్రంగా ఉంచుకోవాలన్న అవగాహన ఉంటుంది. దీంతో ఇంటి పనులన్నీ వారియర్స్‌కే అప్పజెప్పాడు. ఒకవేళ పనులు చేయకపోతే జూనియర్స్ అయిన చాలెంజర్స్ వారిని శిక్షించవచ్చన్నాడు. ఇక వారియర్స్‌తో సేవలు చేయించుకునే అవకాశం ఉండటంతో చైతూ అషూను ఓ ఆటాడుకున్నాడు. మంచినీళ్లు తీసుకురమ్మని చెప్పడంతో ఆమె బాటిల్లో నీళ్లు పట్టుకొచ్చింది. దాన్ని తాగించమని చైతూ అడగడంతో ఆమె అలానే తాగించింది. అలా తాగిస్తున్న క్రమంలో చైతూ నోట్లో ఉన్న నీళ్లను ఊసేయడంతో అవి అషూ మీద పడ్డాయి. ఈ చర్యతో అక్కడున్న హౌస్మేట్స్ ఒక్కసారిగా షాకయ్యారు. నోట్లో నీళ్లు ఎక్కువవడం వల్ల అలా ఊసేశానని చైతూ క్లారిటీ ఇవ్వడంతో అషూ దాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. అయితే చైతూ కావాలనే అలా చేశాడంటూ నెట్టింట ప్రచారం జరుగుతుండటం గమనార్హం. -
ఇంటర్వ్యూలో ముమైత్ నా చేయి విరగ్గొట్టింది: శ్రీరాపాక కన్నీటిపర్యంతం
బిగ్‌బాస్.. వినోదానికే కాదు, వివాదాలకు కూడా కేరాఫ్ అడ్రస్. కేవలం గంటపాటు చూపించే ఎపిసోడ్‌లోనే ఆటపాటలు, అలకలు, కొట్లాటలు, కేరింతలు, సరదాలు, ఏడుపులు, పెడబొబ్బలు.. ఇలా ఎన్నింటినో చూపించారు. అయితే బిగ్‌బాస్ హౌస్‌లో ఏం జరుగుతుందనేది ప్రేక్షకులకు 24 గంటలు చూపిస్తే ఎలా ఉంటుంది? ఈ ఐడియాతో పురుడు పోసుకున్నదే బిగ్‌బాస్ ఓటీటీ. తెలుగులో ఐదు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో తాజాగా బిగ్‌బాస్ నాన్‌స్టాప్ పేరుతో సరికొత్తగా ముందుకు వచ్చింది. ఈసారి టీవీ ఛానల్లో కాకుండా కేవలం హాట్‌స్టార్‌లో మాత్రమే వీక్షించే అవకాశం కల్పించారు. అది కూడా కేవలం గంట ఎపిసోడ్‌లా కాకుండా 24 గంటలు ఏం జరుగుతుందో చూపిస్తున్నారు. అప్పుడే హౌస్‌లో మొదటి నామినేషన్స్ కూడా జరిగిపోయాయి. ఈ నామినేషన్స్ తర్వాత కంటెస్టెంట్ల మధ్య మనస్పర్థలు పెరిగాయి. ఈ క్రమంలో ముమైత్ ఖాన్ వల్ల హీరోయిన్ శ్రీరాపాక బాగా హర్ట్ అయినట్లు కనిపిస్తోంది. ఆమె తోటి కంటెస్టెంట్లతో మాట్లాడుతూ.. 'మూడేళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో ముమైత్ ఖాన్ నా చేయి విరగ్గొట్టింది, అప్పుడు నా చేయి వాచిపోయింది. దీనికి ఆర్జే చైతూనే సాక్ష్యం. ఆ సమయంలో చైతూ, కాజల్ అక్కడే ఉన్నారు. చేయి విరిగినట్లున్న రిపోర్టులు చూసి నా వైపు నిలబడ్డారు. అయినా సరే ఆ విషయాన్ని నేను అక్కడితో వదిలేశాను. కానీ ముమైత్ ఇంకా దాన్నే మనసులో పెట్టుకుంది. ఇప్పుడు బిగ్‌బాస్‌కు వచ్చాక నాతో అదోలా మాట్లాడుతోంది. నేనే స్వయంగా ఆమె దగ్గరకు వెళ్లినా కూడా సరిగా మాట్లాడటం లేదు. పైగా నన్ను లయర్ అనేసింది. నా శరీరానికి గాయం చేసినా పట్టించుకోలేదు. కానీ ఆమె మాత్రం అదే విషయాన్ని పట్టుకుని వేలాడుతూ నన్ను అంత మాట అనేసింది. చీటింగ్, లయర్ అనేవి నాకు నచ్చని పదాలు. ఆ మాట నేను భరించలేకపోతున్నాను' అంటూ తన బాధను బయటకు చెప్పుకుంటూ ఏడ్చేసింది శ్రీరాపాక. దీంతో మిగతా కంటెస్టెంట్లు ఆమెను ఓదార్చారు. మరి నిజంగానే ముమైత్ గతంలో జరిగిన విషయాలను మనసులో పెట్టుకుందా? వీళ్లిద్దరి మధ్య దూరం పెరుగుతుందా? తగ్గుతుందా? అనేది చూడాలి! -
నామినేషన్స్‌లో బాడీ షేమింగ్! ఏడ్చేసిన నటరాజ్, చైతూ
బిగ్‌బాస్.. ఆరడుగుల దూరం నుంచి చూసే ఈ షో అరచేతిలో నుంచి చూసేంత దగ్గరయ్యైంది. బుల్లితెర నుంచి మొబైల్ ఫోన్లో చూసేందుకు వీలుగా ఓటీటీలోకి వచ్చేసింది. కొత్త, పాత కంటెస్టెంట్ల కలయికతో బిగ్‌బాస్ నాన్‌స్టాప్ గ్రాండ్‌గా ప్రారంభమైంది. వచ్చీరావడంతోనే పరిచయాలే కాదు పోట్లాటలు కూడా మొదలు పెట్టేశారు కంటెస్టెంట్లు. ఒకరినొకరు తెలుసుకునే క్రమంలో గొడవలు రాజుకుంటున్నాయి. అగ్నికి ఆజ్యం పోసినట్టుగా దీనికి నామినేషన్ ప్రక్రియ తోడైంది. వారియర్స్, చాలెంజర్స్ మధ్య జరిగిన నామినేషన్ రసాభాసగా మారింది. ఈ ప్రక్రియలో పాల్గొన్న చైతు తనను బాడీ షేమింగ్ చేస్తున్నాడంటూ నటరాజ్ మాస్టర్‌ను నామినేట్ చేశాడు. దాదాపు చాలెంజర్స్ అందరూ నటరాజ్ మాస్టర్‌ను నామినేట్ చేశారు. దీంతో తనను టార్గెట్ చేశారంటూ మాస్టర్ కంటతడి పెట్టుకున్నాడు. నేను అందరికీ ఆదర్శంగా నిల్చుంటానే తప్ప బాడీ షేమింగ్ చేయలేదంటూ మోకాలి మీద కూర్చుని ఏడ్చేశాడు. అయితే తాను చిన్నప్పటి నుంచి బాడీ షేమింగ్ కామెంట్లు ఫేస్ చేస్తున్నా కాబట్టే తట్టుకోలేకపోయానని కన్నీళ్లు పెట్టుకున్నాడు చైతు. వారియర్స్ అందరూ ఏకాభిప్రాయంతో మిత్ర శర్మ, చైతూను నామినేట్ చేశారు. ఫైనల్‌గా తొలివారం నటరాజ్ మాస్టర్, సరయు, హమీదా, మిత్ర శర్మ, ఆర్జే చైతూ, అరియానా, ముమైత్ ఖాన్ నామినేషన్స్‌లో ఉన్నారు. మరి వీరిలో ఎవరు ఎలిమినేషన్ గండం గట్టెక్కుతారు? ఎవరు వచ్చిన వారంలోనే బయటకు వెళ్లిపోతారు? అనేది చూడాలి! Nominations bringing out the True Emotions!!⚔️😱💥💥 It's 🔥🔥🔥🔥 in the House, ofcourse with Nonstop entertainment!! #Biggboss #BiggBossTelugu #BiggBossNonStop @DisneyPlusHS @EndemolShineIND pic.twitter.com/n8XQVlJMLd — DisneyPlus Hotstar Telugu (@DisneyPlusHSTel) February 28, 2022 -
అరియానా, అషూ రెడ్డికి షాకిచ్చిన ఆర్జీవీ!
బిగ్‌బాస్ హౌస్ ఈసారి మరింత కలర్ఫుల్గా ఉంది. హౌస్‌లో 17 మంది కంటెస్టెంట్లు అడుగుపెడితే అందులో పది మంది అమ్మాయిలే కావడం గమనార్హం. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవచ్చేమోకానీ, ఒకే ఇంట్లో రెండు కొప్పులు ఇమడవు అని ఓ సామెత ఉంది. అలాంటిది బిగ్‌బాస్ హౌస్‌లో 10 మంది అమ్మాయిలు ఒకేచోట ఉన్నారు. మరి కలిసుంటారా? కొట్లాటలతో హౌస్‌ను హీటెక్కిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బిగ్‌బాస్‌లోని ఓ కంటెస్టెంట్‌కు మద్దతు ప్రకటించాడు. నగ్నం హీరోయిన్ శ్రీరాపాకకు ఆల్‌ద బెస్ట్ చెప్తూ వీడియో రిలీజ్ చేశాడు. దీంతో అవాక్కైన నెటిజన్లు అరియానా, అషూ రెడ్డి పరిస్థితేంటి? అని ప్రశ్నిస్తున్నారు. అప్పుడు అరియానాకు మద్దతిచ్చారు, ఆమె టాప్ 5లో చోటు దక్కించుకుంది. ఇప్పుడు రాపాకకు సపోర్ట్ అంటున్నారంటే, ఈమె కూడా ఫినాలే వరకు ఉంటుందోమో చూడాలి అని కామెంట్లు చేస్తున్నారు. కాగా ఆర్జీవీ ఇంటర్వ్యూతో ఒక్కసారిగా ఫేమస్ అయింది అరియానా. బిగ్‌బాస్ తెలుగు నాలుగో సీజన్లో పాల్గొన్నప్పుడు ఈ బోల్డ్ బ్యూటీకి మద్దతు పలికాడు వర్మ. అటు అషూతోనూ ఇంటర్వ్యూలు చేస్తూ రచ్చరచ్చ చేశాడు. దీంతో ఈసారి ఆర్జీవీ సపోర్ట్ ఈ ఇద్దరికీ తప్పకుండా ఉంటుందని ఫ్యాన్స్ ఊహించారు. కానీ ఆ ఊహలను పటాపంచలు చేస్తూ తను డైరెక్ట్ చేసిన నగ్నం సినిమా హీరోయిన్ శ్రీరాపాకకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాడీ దర్శకుడు. మరి ఆమె బిగ్‌బాస్ ఓటీటీలో ఎలా రాణిస్తుందో చూడాలి! Wishing all the best to Sweety aka @ShreeRapaka for her entry into BIG BOSS 👍💪💐💐💐 pic.twitter.com/AqBMzBZEXQ — Ram Gopal Varma (@RGVzoomin) February 27, 2022 -
బిగ్‌బాస్ షోలో అప్పుడే గొడవలు, అరియానాది ఓవరాక్టింగ్ అన్న శ్రీరాపాక
బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ అంటే ఇష్టపడేవాళ్లు ఎంతోమంది. దేశంలోని పలు భాషల్లో ప్రసారమవుతున్న ఈ షో తెలుగులో విజయవంతంగా ఐదు సీజన్లు పూర్తి చేసుకుంది. తాజాగా ఈ షో ఓటీటీ ట్రాక్ ఎక్కింది. బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌గా హాట్‌స్టార్‌లో ప్రసారమవుతోంది. మాజీ కంటెస్టెంట్లు వారియర్స్‌గా, కొత్త కంటెస్టెంట్లు చాలెంజర్స్‌గా ఎంట్రీ ఇచ్చారు. అయితే బిగ్‌బాస్ ఇంట్లో అందరూ సమానమే అంటూ ప్రోమో వదిలింది హాట్‌స్టార్. ప్రతిరోజు చాలెంజర్స్ నుంచి అనుమతి పొందిన ఒక వారియర్‌కు మాత్రమే బెడ్రూమ్లో నిద్రపోయే అవకాశం లభిస్తుందని మెలిక పెట్టారు. చాలెంజర్స్ భోజనం చేసిన తర్వాతే వారియర్స్ ఒకేచోట కలిసి ఒకేసారి తినాలని నిబంధన పెట్టారు. వారియర్స్ సభ్యులు ఎవరే పని చేయాలో నిర్ణయించేందుకు చాలెంజర్స్ ఆధ్వర్యంలో జాబ్ మేళా జరిగింది. ఈ క్రమంలో శ్రీరాపాకకు, అరియానాకు మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇంటర్వ్యూలో ఓవరాక్టింగ్ వద్దని శ్రీరాపాక అనడంతో భగ్గున లేచింది అరియానా. స్టేట్మెంట్స్ ఇవ్వద్దు, నా స్టైల్ ఇలానే ఉంటుంది అని కౌంటరిచ్చింది బోల్డ్ బ్యూటీ. ఇక హౌస్‌లో నామినేషన్ల పర్వం కూడా మొదలైంది. మరి ఎవరెవరు ఎవరెవర్ని నామినేట్ చేశారో తెలియాలంటే హాట్‌స్టార్‌లో నాన్‌స్టాప్ స్ట్రీమింగ్ చూసేయండి. "Prathi roju challengers nunchi anumathi pondhina okka Warrior ki maatrame Bedroom lo nidhara poye avakasam labhistundi!" 😱😱😱 How will the Warriors react?!#Biggboss #BiggBossTelugu #BiggBossNonStop @DisneyPlusHS @EndemolShineIND pic.twitter.com/QkGGqDD1WX — DisneyPlus Hotstar Telugu (@DisneyPlusHSTel) February 27, 2022 -
Bigg Boss Promo: ఆర్జే చైతూ సెటైర్లపై అఖిల్ సార్థక్ ఆగ్రహం!
Bigg Boss OTT Telugu Latest Promo: బిగ్‌బాస్ హంగామా మళ్లీ మొదలైంది. కాకపోతే ఈసారి బుల్లితెరపై కాకుండా ఓటీటీ ప్లాట్‌ఫామ్ హాట్‌స్టార్‌లో ప్రసారమవుతోంది బిగ్‌బాస్ నాన్‌స్టాప్. ఫిబ్రవరి 26న 17 మంది కంటెస్టెంట్లతో గ్రాండ్‌గా ప్రారంభమైందీ రియాలిటీ షో. వారియర్స్(మాజీ కంటెస్టెంట్లు), చాలెంజర్స్(కొత్త కంటెస్టెంట్లు) మధ్య పోటీ ఎలా ఉండబోతుందన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. తాజాగా హాట్‌స్టార్ బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ప్రోమో రిలీజ్ చేసింది. ఇందులో యాంకర్ శివ అరియానాను పొగుడుతూ పులిహోర కలిపాడు. ఇంకా టాస్కులు, నామినేషన్లు మొదలవలేదు కాబట్టి ప్రస్తుతానికి అందరూ కలిసిపోయి సరదాగా నవ్వుకుంటున్నారు. అయితే ప్రోమో చివర్లో మాత్రం అఖిల్ సార్థక్‌కు ఆర్జే చైతూ కోపం తెచ్చినట్లు కనిపిస్తోంది. బిగ్‌బాస్ అయిపోయాక శ్రీరాపాక ఓ సినిమా నిర్మిస్తుందట. అందులో సైకో క్యారెక్టర్ ఉందంటూ అఖిల్ భుజం తట్టాడు చైతు. దీంతో అఖిల్‌కు చిర్రెత్తిపోయింది. సోది టాపిక్ అని నసుగుతూ తను సైకో పాత్ర చేయడమేంటని అషూదగ్గర చిర్రుబుర్రులాడాడు. మరి అఖిల్ హర్ట్ అయ్యాడన్న విషయం చైతూకు తెలిసిందా? లేదా? హౌస్‌లో ఇంకా ఏమేం జరుగుతోంది? అన్నది తెలియాలంటే బిగ్‌బాస్ నాన్‌స్టాప్ చూసేయండి! -
నాన్‌స్టాప్ బిగ్‌బాస్ 17 మంది కంటెస్టెంట్లు వీళ్ళే!
-
సీపీఐ నారాయణపై తమన్నా సింహాద్రి అభ్యంతరకర వ్యాఖ్యలు
Tamanna Simhadri Shocking Reaction On CPI Narayana Comments: బిగ్‌బాస్ రియాలిటీ షో క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియాలో అన్ని భాషల్లో బిగ్‌బాస్ ఎంతో ప్రేక్షక ఆదరణ పొందింది. తెలుగులో ఇప్పటికే 5సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ ఇప్పుడు ఓటీటీలోకి ఎంటర్ అయిపోయింది. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ హౌస్‌పై సీపీఐ నేత నారాయణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. బిగ్‌బాస్ షో గేమ్ కాదని, లైసెన్స్ తీసుకున్న బ్రోతల్ హౌస్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ షో పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై బిగ్‌బాస్ కంటెస్టెంట్, ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి మండిపడింది. ఓ టీవీ డిబేట్లో పాల్గొన్న ఆమె బిగ్‌బాస్ షోను బ్రోతల్ హౌస్ అన్నందుకు నారాయణను చెప్పుతో కొట్టాలంటూ అభ్యంతకర వ్యాఖ్యలు చేసింది. ఈ షో వల్ల తమకు ఎంతో గుర్తింపు, ఉపాధి కలుగుతున్నాయని, ఒకవేళ షో నచ్చకపోతే ఛానెల్ మార్చుకోవాలంటూ సలహా ఇచ్చింది. -
మరోసారి రన్నర్‌గా అఖిల్ సార్థక్
బిగ్‌బాస్ నాల్గో సీజన్ రన్నరప్ అఖిల్ సార్థక్ తన పేరు వెనక ఓ చరిత్ర ఉంది. అఖిల్ నటించిన సిసింద్రి చిత్రం విడుదలైన మరుసటి రోజే తాను జన్మించడంతో కుటుంబ సభ్యులు తనకు అఖిల్ అని పేరు పెట్టాడని గతంలో చెప్పుకొచ్చాడీ మోడల్. హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాలో అఖిల్ మూడో స్థానం సంపాదించుకున్న అఖిల్ పలు సీరియల్స్‌లోనూ నటించాడు. బిగ్‌బాస్ హౌస్‌లో ఫైటర్‌గా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ ఈసారి రన్నరప్‌గా కాకుండా కప్ గెలుచుకుని విన్నర్‌గా బయటకు వస్తానన్నాడు. దానికోసం హౌస్‌లో నిరంతరం కష్టపడ్డాడు. కానీ చివరాఖరకు బిందుమాధవితో పోటీపడలేక మరోసారి రెండో స్థానానికే పరిమితమయ్యాడు. -
రీఎంట్రీ ఇచ్చిన బుట్టబొమ్మ
సాహసం సేయరా డింభకా సినిమాలో నటించింది హమీదా. అందంచందం ఉన్నప్పటికీ ఈమెకు పెద్దగా ఆఫర్లు రాలేదు. నటిగా రాణించేందుకు మంచి ఆఫర్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో బిగ్‌బాస్ నుంచి పిలుపు వచ్చింది. ఇంకేముందీ.. ఏం ఆలోచించకుండా వెంటనే ఓకే చెప్పేసింది. అలా బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో 11వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. సింగర్ శ్రీరామ్‌ను స్నేహితుడి కన్నా ఎక్కువ ప్రేమికుడి కన్నా తక్కువగా ఊహించుకున్న ఆమె అతడికే ఎక్కువ అంకితమైంది. దీంతో హమీదా అసలు గేమ్ చూడలేమనుకున్నవాళ్లకోసం మరోసారి బిగ్‌బాస్ షోలో అడుగుపెట్టిందీ బూరబుగ్గల బ్యూటీ. మరి ఈసారి ఈ డేరింగ్ అండ్ డాషింగ్ హీరోయిన్ గేమ్ ఎలా ఉండబోతోంది? ప్రత్యర్థులను ఎలా మట్టికరిపించనుంది? అనేది ఇంట్రస్టింగ్‌గా మారింది. -
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విన్నర్‌గా బిందుమాధవి
బిందుమాధవి అచ్చ తెలుగు హీరోయిన్. 'ఆవకాయ బిర్యానీ', 'రామరామ కృష్ణకృష్ణ' సినిమాల్లో కథానాయికగా నటించిన ఈమెకు తెలుగులో పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో కన్నడ ఇండస్ట్రీలో వాలిపోయిన ఆమెకు అక్కడ అవకాశాలతోపాటు ఆదరణ కూడా బాగానే ఉండటంతో అక్కడే సెటిలైంది. కన్నడ బిగ్‌బాస్‌లోనూ పాల్గొన్న బిందు తెలుగు బిగ్‌బాస్ ఓటీటీలో పాల్గొంది. షో ప్రారంభంలో ఆమె మాట్లాడుతూ.. 'కన్నడ బిగ్‌బాస్ షోలో వైల్డ్‌కార్డ్ ఎంట్రీగా అడుగుపెట్టాను. అప్పుడు నేను డిప్రెషన్లో ఉన్నాను. లవ్ ఫెయిల్యూర్ వల్ల నేను ఎంతో బాధలో ఉన్నాను. కానీ షో నుంచి బయటకు వచ్చేసరికి డిప్రెషన్ నుంచి బయటపడ్డాను. నా స్వస్థలం చిత్తూరులోని మదనపల్లి. బిగ్‌బాస్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వాలనుకుంటున్నాను' అని చెప్పుకొచ్చింది. మస్తీ ట్యాగ్‌తో హౌస్‌లో అడుగుపెట్టిన హీరోయిన్ బిందుమాధవికి ఆడపులిగా పేరు తెచ్చుకుంది. తన ఆటతో, ధైర్యంతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుని విజేతగా అవతరించింది. -
యాంకరింగ్‌కు పనికి రానని ముఖం మీదే అన్నారు: యాంకర్ శివ
యాంకర్ శివ.. యూట్యూబర్లకు బాగా పరిచయమున్న పేరు. వివాదాస్పద ఇంటర్వ్యూలతో సెన్సేషనల్ అయ్యాడు శివ. శ్రీకాకుళంలో పుట్టిన అతడు వైజాగ్‌లో విద్యనభ్యసించాడు. సెలబ్రిటీల నుంచి బిగ్‌బాస్ కంటెస్టెంట్లను సైతం ఇంటర్వ్యూ చేసే ఆయన తాజాగా బిగ్‌బాస్ ఓటీటీలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా బిగ్‌బాస్‌కు రావడానికి గల కారణాన్ని చెప్పుకొచ్చాడు. 'నలభై వేలు ఖర్చు పెట్టి ఇంటర్వ్యూలు చేశాను. ఎడిటర్ దగ్గరకు వెళ్తే అతడు యాంకర్‌గా నువ్వు పనికిరావని ముఖం మీదే అనేశారు. డిజిటల్ మీడియాలో కాంట్రవర్సీ ఇంటర్వ్యూలు చేయడానికి కారణం జనాల్లో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు రాబట్టడమే! ఎవరేమనుకున్నా కుర్చీలో కూర్చోవడం, కుర్చీలో కూర్చొని ప్రశ్నించడం ఇష్టం. ఒకానొక సమయంలో నేను ఇంట్లో అమ్మకు నచ్చలేదు. దీంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చేశాను. ఇప్పుడైతే డబ్బులు కావాలి, చెల్లి పెళ్లి చేయాలి, అదే నా టార్గెట్' అని చెప్పుకొచ్చాడు. 24 గంటలు మసాలా అందిస్తానంటూ హౌస్‌లోకి ప్రవేశించాడు శివ. మరి ఈ ఇంటర్వ్యూయర్ హౌస్‌లో ఎలా ఉంటాడు? ఎన్ని వారాలు ఉండగలుగుతాడో చూడాలి! -
ఇంట్లో మంట పెడతానంటున్న సరయు
సరయు పూర్తి పేరు సరయు రాయ్. నిన్నే పెళ్లాడతా సీరియల్లో నెగెటివ్ రోల్లో నటించింది. 7 ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్లో అడల్ట్ కామెడీ వీడియోలు చేస్తూ ఫేమస్ అయింది. బిగ్‌బాస్ ఐదో సీజన్లో 13వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన సరయు మొదటివారంలోనే ఎలిమినేట్ అయ్యింది. తన ఆటను చూడకుండా ఒక్కవారానికే ఎలా ఎలిమినేట్ చేస్తారని బాధపడిపోయిన సరయు మరోసారి బిగ్‌బాస్ షోలో అడుగుపెట్టింది. తనేంటో, తన పవరేంటో ఇప్పుడు చూపిస్తానంటోందీ భామ. హౌస్‌లో ఎలా మంటపెడతాన్నో చూడండి అంటూ ఫైర్ ట్యాగ్‌తో హౌస్‌లోకి వెళ్లింది సరయు. మరి ఆమె నోటిప్రవాహాన్ని ఇతర కంటెస్టెంట్లు తట్టుకోగలరా? ఆమె బూతుల దండకానికి ఆడియన్స్ ఓట్లు గుద్దుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది. -
మీ రుణాన్ని తీర్చేస్తానంటోన్న ఐస్‌క్రీమ్ హీరోయిన్
హీరోయిన్ తేజస్వి మదివాడ ఎన్నో కష్టాలు పడింది. చిన్నప్పుడే తల్లి క్యాన్సర్ బారిన పడి చనిపోగా తండ్రి ఆర్మీ ఆఫీసర్ అయినా మద్యానికి బానిసయ్యాడు. దీంతో తినడానికి కూడా తిండి లేక పస్తులున్న రోజులున్నాయి. అలాంటి దీన స్థితి నుంచి హీరోయిన్ స్థాయికి ఎదిగింది తేజస్వి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన ఆమె హార్ట్ ఎటాక్, లవర్స్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, కేరింత, నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్ వంటి పలు సినిమాల్లో నటించింది. రామ్‌గోపాల్ వర్మ ఐస్ క్రీం చిత్రంతో హీరోయిన్‌గానూ గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగులో అంతంతమాత్రంగానే అవకాశాలు తెచ్చుకుంటున్న తేజస్వి గతంలో బిగ్‌బాస్ రెండో సీజన్లో పాల్గొంది. తాజాగా బిగ్‌బాస్ ఓటీటీలో అడుగు పెట్టిన ఆమె అభిమానులకు ఎంతో రుణపడి ఉన్నానని, ఎంటర్టైన్ చేస్తూ ఆ రుణాన్ని తీర్చేసుకుంటానంది. మరి ఈసారైనా ఈ రియాలిటీ షో తేజస్వికి కలిసి వస్తుందా? లేదా? చూడాలి! -
వచ్చీరాగానే ఆర్జేకు షాకిచ్చిన హీరోయిన్!
'తొలి సంధ్య వేళలో' సినిమాతో తెలుగులో హీరోయిన్గా పరిచయమైంది మిత్ర శర్మ. ఆ తర్వాత పలు సినిమాలు చేస్తూ తెలుగు మాట్లాడటం కూడా నేర్చేసుకుంది. ముంబై నుంచి వచ్చి హైదరాబాద్‌లో సెటిల్ అయిన ఈ హీరోయిన్ సొంతంగా శ్రీ పిక్చర్స్ బ్యానర్ స్థాపించింది. బాయ్స్ సినిమాతో నిర్మాతగానూ మారింది. డ్రామా ట్యాగ్‌తో బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టింది మిత్ర. హౌస్‌లోకి వచ్చీరాగానే చైతూను అన్నయ్య అని పిలిచి అతడికి పెద్ద షాకిచ్చింది. మరి ఈ హీరోయిన్ అందరికీ ఎలాంటి పోటీ ఇవ్వనుంది? తన గేమ్ ఎలా ఉండబోతుంది అన్నది చూడాలి! -
లిప్‌స్టిప్ పెదాలను కనుక్కునే పనిలో మోడల్!
అనిల్.. ప్రేక్షకులకు అస్సలు పరిచయం లేని పేరు. ఇతడి తండ్రి, తాత కూడా పోలీసాఫీసర్. కానీ అనిల్ మాత్రం మోడలింగ్ వైపు అడుగులు వేశాడు. మొదట్లో అతడి నిర్ణయాన్ని కుటుంబసభ్యులు వ్యతిరేకించినప్పటికీ అనిల్ ఇష్టాన్ని కాదనలేక మోడలింగ్‌కు సరేనన్నారు. దీంతో తక్కువ కాలంలోనే బెస్ట్ మోడల్‌గా ఎన్నో అవార్డులు అందుకున్నాడు అనిల్. అంత ఈజీగా గివప్ ఇవ్వనన్న అనిల్.. నెవర్ గివప్ ట్యాగ్‌తో హౌస్‌లో అడుగు పెట్టాడు. ప్రారంభంలోనే అతడికి అమ్మాయితో ముడిపెట్టేందుకు ప్రయత్నించాడు బిగ్‌బాస్. లిప్‌స్టిక్ పెదాలు ఉన్న ఓ కార్డు పట్టుకుని అది ఏ అమ్మాయిదో గుర్తించాలని మెలిక పెట్టాడు. మరి అతడు ఆ లిప్‌స్టిక్ ఎవరిదో కరెక్ట్‌గా కనుక్కుంటాడా? ఈ మోడల్ గేమ్ ఎలా ఉండబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది! -
దుమ్ము దులిపేస్తానంటున్న హీరోయిన్
హీరోయిన్ శ్రీరాపాక పుట్టింది తూర్పుగోదావరిలో, పెరిగింది హైదరాబాద్‌లో. ఫ్యాషన్ డిజైనర్‌గా ప్రయాణం మొదలుపెట్టిన ఆమె ప్రస్తుతం నటిగా రాణిస్తోంది. కబడ్డీ, కోకో ఆటల్లో జాతీయస్థాయిలో ఆటలు ఆడింది. అయితే ఓ సారి మాత్రం ఆంధ్రా నుంచి వచ్చానని ఆట ఆడనివ్వలేదని, దీంతో ఆ క్షణమే స్పోర్ట్స్ వదిలేశానని చెప్పుకొచ్చింది. వెస్ట్రన్‌లో ఉన్న మాస్, ట్రెడిషనల్లో ఉన్న క్లాస్.. రెండూ కలిపి దుమ్ము దులిపేస్తానంటూ రేసుగుర్రం ట్యాగ్‌తో బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టింది శ్రీరాపాక. తనకు ఎమోషన్స్ ఎక్కువంటున్న ఆమె వాటిని నియంత్రించుకోగలుగుతుందా? లేదా? అనేది చూడాలి! -
తగ్గేదే లే అంటున్న నటరాజ్ మాస్టర్
తెలుగులో వస్తున్న డ్యాన్స్ రియాలిటీ షోలకు నటరాజ్ మాస్టర్ ఓరకంగా ఆద్యుడని చెప్పవచ్చు. గతంలో ఉదయభానుతో కలిసి డ్యాన్స్ బేబీ డ్యాన్స్ షో చేసిన నటరాజ్ పలు షోలకు కొరియోగ్రాఫర్‌గా, మెంటార్‌గా వ్యవహరించాడు. దాదాపు టాప్ హీరోలు, దర్శకులందరితోనూ కలిసి పని చేసిన నటరాజ్ మాస్టర్‌కు 20 ఏళ్లకు పైనే అనుభవం ఉంది. కృష్ణా జిల్లాకు చెందిన ఈ కొరియోగ్రాఫర్ ఏడు సంవత్సరాలుగా ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. భార్య ఏడు నెలల గర్భంతో ఉన్నప్పుడు బిగ్‌బాస్ ఐదో సీజన్లో అడుగు పెట్టిన ఆయన బిడ్డ పుట్టిన తర్వాత మరోసారి బిగ్‌బాస్‌లో అడుగుపెట్టాడు. అప్పుడు భార్య కోసం, ఇప్పుడు కూతురి కోసం షోలోకి వచ్చానని, ఈసారి మాత్రం తగ్గేదేలే అంటున్నాడు. రోరింగ్ ట్యాగ్‌తో హౌస్‌లో అడుగుపెట్టిన నటరాజ్ మాస్టర్ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లకు ఏయే జంతువుల పేర్లు పెడతాడు? కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఎలా ఆడతాడో చూడాలి! -
సీక్రెట్ బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారన్న అరియానా గ్లోరీ!
యాంకర్‌గా కెరీర్ ఆరంభించిన అరియానా పలు టీవీ షోలలో వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసిన వీడియోతో సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిన ఈ భామకు బిగ్‌బాస్ నాలుగో సీజన్లో పిలుపు రావడంతో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. తన అందచందాలతోనే కాకుండా ఆటతోనూ అభిమానులను కట్టిపడేసిన అరియానా.. తనకు తప్పనిపిస్తే బిగ్బాస్నేంటి? ఏకంగా నాగార్జునను సైతం నిలదీసింది. ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించిన అరియానా థర్డ్ రన్నరప్‌గా వెనుదిరిగింది. ఆ తర్వాత ఐదో సీజన్ బజ్కు హోస్ట్‌గానూ వ్యవహరించిన ఈ బ్యూటీ ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు ఓటీటీలో కంటెస్టెంట్‌గా పాల్గొంది. బిగ్‌బాస్ తర్వాత జీరో ఫ్యాన్‌బేస్ నుంచి ప్రపంచం మొత్తానికి పరిచయమయ్యానంటూ ఎగ్జైట్ అయ్యింది అరియానా. అంతేకాదు సీక్రెట్ బాయ్‌ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, కానీ వాళ్లెవరో బయటపెట్టనని చెప్పింది. అయితే నాగ్ కూపీ లాగేందుకు ప్రయత్నించడంతో అలాంటిదేమీ లేదని, ఇప్పటివరకు ఎవరూ కనెక్ట్ కావడం లేదని చెప్పుకొచ్చింది. మరి అరియానా ఈసారైనా కప్పు కొడుతుందా? లేదా? అనేది చూడాలి! -
అదే నా డ్రీమ్ అంటున్న ఆర్జే చైతూ
ఈయన నోరు తెరిచాడంటే ఆనకట్ట వేయడం కష్టం. అతడే ఆర్జే చైతూ. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన అతడు కుటుంబ పోషణ కోసం ఎంతగానో కష్టపడ్డాడు. విజయవాడకు చెందిన చైతూ హైదరాబాద్‌కు వచ్చి డిగ్రీ చదువుతూ, యానిమేషన్స్ చేసుకుంటూనే రకరకాల ఉద్యోగాలు చేశాడు. కానీ ఎప్పుడైతే ఆర్జేగా మారాడో అప్పుడే అతడి దశ తిరిగిపోయింది. ఇప్పటివరకు ఆరు జాతీయ అవార్డులు అందుకున్నాడు చైతు. కనిపించకుండా వినిపించిన అతడు బిగ్‌బాస్ షోలో కనిపించబోతున్నాడు. అయితే తల్లికి డ్రీమ్ హౌస్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాడు చైతు. అయితే భోజన ప్రియుడైన చైతూకు నాగార్జున చికెన్ పిజ్జాను తినిపించాడు. దీంతో సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు చాటర్‌బాక్స్ చైతూ. మరి ఈ ఆర్జే షోలో ఎన్నివారాలు ఉండగలుగుతాడు? అతడి వాగ్ధాటిని మిగతావాళ్లు తట్టుకుంటారో లేదో చూడాలి! -
రెండుసార్లు పెళ్లి చేసుకున్నాను, ఎవరికీ తెలీదు: యాంకర్
రాయలసీమలోని మారుమూల గ్రామమైన కదిరి నుంచి వచ్చింది యాంకర్ స్రవంతి చొక్కారపు. సోషల్ మీడియా నుంచి టీవీ దాకా సాగిందామె ప్రయాణం. బిగ్‌బాస్ స్టేజీపై ఐదో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె తన స్మైల్ గురించి రోజుకో వంద కామెంట్లు వస్తాయంటూ సిగ్గుపడిపోయింది. కానీ కొన్నిసార్లు బాడీ షేమింగ్ కామెంట్లు కూడా చేస్తారని మూతి ముడుచుకుంది. ఇక తాను రెండుసార్లు పెళ్లి చేసుకున్నానన్న విషయాన్ని బయటపెట్టింది. మొదటిసారి ప్రేమ వివాహం చేసుకోగా రెండోసారి పెద్దల సమక్షంలో మరోసారి పెళ్లి చేసుకున్నానని చెప్పింది. అయితే ఈ విషయం ప్రేక్షకులకు ఇంతవరకు తెలియదని పేర్కొంది. బిగ్‌బాస్ ఓటీటీలో నవరసాలతో ఎంటర్టైన్ చేస్తానని మనసావాచా కర్మణా మాటిస్తున్నానంటూ శపథం చేసింది స్రవంతి. మరి ఈ మాటను ఆమె నిలబెట్టుకుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. -
హీరోగా సినిమా, అంతలో రోడ్డు ప్రమాదం: అజయ్
అజయ్ కాతువాయూర్.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని వ్యక్తి. కానీ ఇప్పటికే రెండు సినిమాలు చేశాడు. తనే దర్శకుడిగా మరి ఓ కొత్త సినిమా కూడా చేస్తున్నాడు అజయ్. అయితే విధి తన జీవితంతో ఆడుకుందంటూ బిగ్‌బాస్ స్టేజీపై ఓ బాధాకర విషయాన్ని పంచుకున్నాడు. 'ఫస్ట్ టైం ఆడిషన్‌కు వెళ్లగానే హీరోగా సెలక్ట్ అయ్యాను, షూటింగ్ పూర్తయ్యే సమయంలో రోడ్డు ప్రమాదం జరిగి కాళ్లు, చేతులు చచ్చుబడిపోయాయి. 8 నెలల తర్వాత కోలుకుని ఇప్పుడు నడవగలుగుతున్నా'నని చెప్పుకొచ్చాడు. ఏదైనా మొండిగా వెళ్లిపోయే అలవాటుందన్న అతడు సంకి అన్న బిరుదుతో హౌస్‌లో అడుగుపెట్టాడు. మరి ఈ జూనియర్ సీనియర్స్‌తో ఎలా పోటీపడతాడు, బిగ్‌బాస్ ఓటీటీలో ఎన్ని వారాలు ఉంటాడన్నది చూడాలి! -
బిగ్‌బాస్ తర్వాత లైఫే మారిందంటున్న ముమైత్ ఖాన్
ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అంటూ ఐటం సాంగ్స్‌తో కుర్రకారుకు ముచ్చెమటలు పట్టించింది ముమైత్ ఖాన్. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, బెంగాలీ, ఒడియా, బెంగాలీ భాషల్లోని పలు చిత్రాల్లో నటించింది. బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఆమె తక్కువకాలంలోనే స్టార్ డ్యాన్సర్‌గా ఎదిగింది. బిగ్‌బాస్ మొదటి సీజన్లో అడుగుపెట్టి వివాదాలతో, గొడవలతో సంచలనంగా మారిన ముమైత్ మరోసారి ఓటీటీలో ఎంట్రీ ఇచ్చింది. కానీ అప్పటికి, ఇప్పటికి చాలా మారానంటోంది ముమైత్. తన ఆలోచనలు, కోపం, అవకాశాలు.. జీవితమే మారిపోయిందని చెప్పుకొచ్చింది. బిగ్‌బాస్ ఓటీటీలోకి డైనమైట్‌గా అడుగుపెట్టిన ముమైత్ గేమ్‌ప్లాన్ ఈసారి ఎలా ఉండబోతోంది? వచ్చీరాని తెలుగుతో ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేస్తుందా? వంటి విషయాలన్నీ త్వరలో తేలిపోనున్నాయి. -
ఆదాయం పెరిగింది, ఆటిట్యూడ్ మారిందంటున్న మహేశ్ విట్టా
మహేశ్ విట్టా యూట్యూబర్, నటుడు, కమెడియన్. 2017లో నేనే రాజు నేనే మంత్రి సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు. యాక్టింగ్ టాలెంట్‌తో పలు సినిమాల్లో అవకాశాలు సంపాదించుకున్న ఆయన బిగ్‌బాస్ రెండో సీజన్లో పాల్గొన్నాడు. అయితే తన ఫ్రస్టేషన్‌ను పక్కనవారికి చెప్పుకోవడమే అతడి పాలిట శాపంగా మారింది. నారదుడు అన్న బిరుదును అతడికి అంకితమచ్చారు. అయితే అప్పుడొచ్చిన మహేశ్ విట్టాకు భయముండేది. కానీ ఇప్పుడొచ్చిన మహేశ్ విట్టాకు జల్లికట్టులో ఎద్దు మాదిరిలా గుద్దుకుంటా పోతాడంతే.. బోత్ ఆర్ నాట్ సేమ్ అని చెప్పుకొచ్చాడు మహేశ్. బిగ్‌బాస్ తర్వాత ఆదాయం పెరిగింది, ఆటిట్యూడ్ మారింది, సొంత ప్రొడక్షన్ హౌస్ పెట్టి సినిమా కూడా తీశానని చెప్పుకొచ్చాడు మహేశ్. ఊరమాస్‌గా ఎంట్రీ ఇచ్చిన మహేశ్ బుల్లితెరపై కూడా నవ్వులు పంచుతూ ప్రేక్షకులను తనవైపుకు తిప్పుకుంటాడా? అనేది చూడాలి! -
నాగార్జునకు ముద్దు పెట్టిన అషూ రెడ్డి
డబ్‌స్మాష్‌తో ఫేమస్.. టిక్‌టాక్‌తో మరింత పాపులర్.. బిగ్‌బాస్ షోతో ఊహించని క్రేజ్.. ఆమె మరెవరో కాదు అషూ రెడ్డి. అభిమానులు ఆమెను ముద్దుగా జూనియర్ సమంత అని పిలుచుకుంటారు. నిత్యం ఫొటోషూట్లతో సందడి చేసే ఈ భామ ఛల్ మోహనరంగ సినిమాలోనూ మెరిసింది. పలు షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ హోస్ట్‌గానూ మెప్పిస్తోంది. గతంలో బిగ్‌బాస్ మూడో సీజన్లో పాల్గొన్న అషూ ఫినాలే వరకు వెళ్లకుండానే వెనుదిరిగింది. అయితే ఈసారి మాత్రం ఫైనల్స్‌లో కచ్చితంగా అడుగుపెడతానంటోందీ ముద్దుగుమ్మ. ఎలాగో అషూకు బిగ్‌బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ సపోర్ట్ ఉండనే ఉంది. ఇక వచ్చేముందు కూడా రాహుల్ తనలా ఆడొద్దని, అవే స్ట్రాటజీలు వాడొద్దని సలహా ఇచ్చాడని స్టేజీ మీద చెప్పింది అషూ. అంతేకాదు నాగ్ బుగ్గపై ముద్దు పెట్టి కప్పు కొట్టినంత హ్యాపీగా ఫీలైంది. హౌస్‌లో ప్రేమ తప్ప అన్ని ఎమోషన్స్ పండిస్తానంటున్న అషూ తన గేమ్‌తో పిచ్చెక్కిస్తానంటోంది. మరి అషూ నిజంగానే ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తుందా? లేదా? అనేది చూడాలి! -
Bigg Boss Non Stop : ఇదిగో 17 మంది కంటెస్టెంట్స్.. బుల్లితెర హంగామా షురూ
బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్‌బాస్ ఓటీటీ సీజన్ శనివారం సాయంత్రం ప్రారంభమైంది. 'బిగ్‌బాస్ నాన్‌స్టాప్' పేరుతో ప్రసారం కానున్న ఈ షోకి సైతం నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో 24*7 నాన్ స్టాప్‌గా ప్రసారం కానునున్న ఈ షో నేటితో మొదలై.. 84 రోజులు పాటు నిరంతరంగా ప్రసారం కానుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో శనివారం సాయంత్రం 6 గంటలకు మొదలైన ఈ షోలో తారాజువ్వల వెలుగులో గ్రాండీయర్‌గా ఎంట్రీ ఇచ్చాడు హోస్ట్ నాగార్జున. స్టాప్.. దిస్ ఈస్ బిగ్‌బాస్ నాన్ స్టాప్ అంటూ స్మాల్ స్క్రీన్‌పైకి వచ్చేశాడు. అనంతరం బిగ్‌బాస్ హౌస్‌లో వెళ్లి ఇల్లంతా తిరుగుతూ సందడి చేశాడు. తొలి కంటెస్టెంట్‌గా అషురెడ్డి బిగ్‌బాస్ నాన్‌స్టాప్ తొలి కంటెస్టెంట్‌గా అషురెడ్డి ఎంట్రీ ఇచ్చింది. పుష్ప సినిమాలోని ఊ అంటావా మామ.. సాంగ్ తో అదరగొట్టింది అషు రెడ్డి. అషురెడ్డి గేమ్ ఆడితే ఎలా ఉంటుందో చూపిస్తానంటూ.. హౌస్‌లోకి ఎంట్రీఇచ్చింది అషు. డబ్‌స్మాష్‌తో ఫేమస్..‘బిగ్‌బాస్’తో ఊహించని క్రేజ్ డబ్‌స్మాష్‌తో ఫేమస్.. టిక్‌టాక్‌తో మరింత పాపులర్.. బిగ్‌బాస్ షోతో ఊహించని క్రేజ్.. ఆమె మరెవరో కాదు అషూ రెడ్డి. అభిమానులు ఆమెను ముద్దుగా జూనియర్ సమంత అని పిలుచుకుంటారు. నిత్యం ఫొటోషూట్లతో సందడి చేసే ఈ భామ ఛల్ మోహనరంగ సినిమాలోనూ మెరిసింది. పలు షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ హోస్ట్‌గానూ మెప్పిస్తోంది. గతంలో బిగ్‌బాస్ మూడో సీజన్లో పాల్గొన్న అషూ ఫినాలే వరకు వెళ్లకుండానే వెనుదిరిగింది. అయితే ఈసారి మాత్రం ఫైనల్స్‌లో కచ్చితంగా అడుగుపెడతానంటోందీ ముద్దుగుమ్మ. ఎలాగో అషూకు బిగ్‌బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ సపోర్ట్ ఉండనే ఉంది. మరి ఈసారి అషూ గేమ్‌ప్లాన్ ఎలా ఉండబోతోంది? ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తుందా? లేదా? అనేది మున్ముందు తేలనుంది. రెండో కంటెస్టెంట్‌గా మహేశ్ విట్టా రెండో కంటెస్టెంట్‌గా నటుడు మహేశ్ విట్టా ఎంట్రీ ఇచ్చాడు. ముందుగా అతని ఏవీ వేసి చూపించారు. చిరంజీవి సినిమాలు చూస్తూ ఆయన పాటలు వింటూ సినిమాల్లోకి వచ్చానని మహేశ్ చెప్పాడు. బిగ్‌బాస్ షో వల్ల చిరంజీవిని కలిసే అవకాశం వచ్చిందన్నారు. అనంతరం ఇంట్లోకి వెళ్లి.. అషురెడ్డితో కలిసి ఇల్లంగా తిరిగి చూశాడు. ఎవరీ మహేశ్ విట్టా? మహేశ్ విట్టా యూట్యూబర్, నటుడు, కమెడియన్. 2017లో నేనే రాజు నేనే మంత్రి సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు. యాక్టింగ్ టాలెంట్‌తో పలు సినిమాల్లో అవకాశాలు సంపాదించుకున్న ఆయన బిగ్‌బాస్ రెండో సీజన్లో పాల్గొన్నాడు. అయితే తన ఫ్రస్టేషన్‌ను పక్కనవారికి చెప్పుకోవడమే అతడి పాలిట శాపంగా మారింది. నారదుడు అన్న బిరుదును అతడికి అంకితమచ్చారు. అయితే అప్పుడొచ్చిన మహేశ్ విట్టాకు భయముండేది.కానీ ఇప్పుడొచ్చిన మహేశ్ విట్టాకు జల్లికట్టులో ఎద్దు మాదిరిలా గుద్దుకుంటా పోతాడంతే.. బోత్ ఆర్ నాట్ సేమ్ అని చెప్పుకొచ్చాడు మహేశ్. బిగ్‌బాస్ తర్వాత ఆదాయం పెరిగింది, ఆటిట్యూడ్ మారింది, సొంత ప్రొడక్షన్ హౌస్ పెట్టి సినిమా కూడా తీశానని చెప్పుకొచ్చాడు మహేశ్. ఊరమాస్‌గా ఎంట్రీ ఇచ్చిన మహేశ్ బుల్లితెరపై కూడా నవ్వులు పంచుతూ ప్రేక్షకులను తనవైపుకు తిప్పుకుంటాడా? అనేది చూడాలి! మూడో కంటెస్టెంట్‌గా ముమైత్‌ఖాన్ మూడో కంటెస్టెంట్ గా అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది ముమైత్ ఖాన్. ‘నా పేరు కనకం’అనే ఐటమ్ సాంగ్‌కి స్టెప్పులేస్తూ స్మాల్ స్క్రీన్‌పైకి వచ్చింది ముమైత్. అనంతరం వచ్చీరాని తెలుగుతో నాగార్జునతో పాటు ప్రేక్షకులను నవ్వించింది. బిగ్‌బాస్ షోకి వచ్చిన తర్వాత తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయని చెప్పింది. తన గురించి తాను బాగా తెలుసుకున్నానని చెప్పింది. అనంతరం ముమైత్‌కి ఓ టాస్క్ ఇచ్చి ఇంట్లోకి పంచించాడు. ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అంటూ ఐటం సాంగ్స్‌తో కుర్రకారుకు ముచ్చెమటలు పట్టించింది ముమైత్ ఖాన్. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, బెంగాలీ, ఒడియా, బెంగాలీ భాషల్లోని పలు చిత్రాల్లో నటించింది. బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఆమె తక్కువకాలంలోనే స్టార్ డ్యాన్సర్‌గా ఎదిగింది. బిగ్‌బాస్ మొదటి సీజన్లో అడుగుపెట్టి వివాదాలతో, గొడవలతో సంచలనంగా మారిన ముమైత్ మరోసారి ఓటీటీలో ఎంట్రీ ఇచ్చింది. కానీ అప్పటికి, ఇప్పటికి చాలా మారానంటోంది ముమైత్. తన ఆలోచనలు, కోపం, అవకాశాలు.. జీవితమే మారిపోయిందని చెప్పుకొచ్చింది. బిగ్‌బాస్ ఓటీటీలోకి డైనమైట్‌గా అడుగుపెట్టిన ముమైత్ గేమ్‌ప్లాన్ ఈసారి ఎలా ఉండబోతోంది? వచ్చీరాని తెలుగుతో ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేస్తుందా? వంటి విషయాలన్నీ త్వరలో తేలిపోనున్నాయి. నాలుగో కంటెస్టెంట్‌గా కొత్త కుర్రాడు నాలుగో కంటెస్టెంట్‌గా ఛాలెంజర్ కొత్త కుర్రాడు అజయ్ ఎంట్రీ ఇచ్చాడు. డీజే టిల్లు పాటకు స్టెప్పులేస్తూ స్టేజ్ మీదకు వచ్చాడు. అనంతరం అతని గురించి చెప్పుకుంటూ.. గతంలో ఒకటి రెండు సినిమాల్లో నటించానని చెప్పాడు. ఇప్పుడు ఒక సినిమాకు దర్శకత్వం వహిస్తూనే హీరోగా నటిస్తున్నానని చెప్పారు. ఈ బిగ్ బాస్ ప్లాట్ ఫామ్ తనకు చాలా ప్లస్ అవుతుందని తెలిపాడు. సంకీగా ( మొండిగా ) వెళ్లిపోతానని ఇంట్లోకి వెళ్లాడు. మరి ఈ జూనియర్ సీనియర్స్‌తో ఎలా పోటీపడతాడు, బిగ్‌బాస్ ఓటీటీలో ఎన్ని వారాలు ఉంటాడన్నది చూడాలి! ఐదో కంటెస్టెంట్‌గా యాంకర్ స్రవంతి చొక్కారపు ఐదో కంటెస్టెంట్‌గా యాంకర్ స్రవంతి చొక్కారపు ఎంట్రీ ఇచ్చింది. ఎవరికి తెలియని సీక్రెట్ ఏదైనా ఉంటే చెప్పమని నాగ్ అడగ్గా.. తను రెండు సార్లు పెళ్లి చేసుకున్నానని, ఒక్కసారి పారిపోయి చేసుకుంటే.. తర్వాత ఇంట్లో వాళ్ల ముందు మళ్లీ అతన్నే చేసుకున్నానని చెప్పింది. తనకు పెళ్లి అయిన విషయం బిగ్బాగ్ స్టేజ్ మీద చెప్పడం సంతోషంగా ఉందని చెప్పింది. నవరసాలతో ఎంటర్టైన్ చెస్తానని లోనికి వెళ్లిపోయింది. రాయలసీమలోని మారుమూల గ్రామమైన కదిరి నుంచి వచ్చింది యాంకర్ స్రవంతి చొక్కారపు. సోషల్ మీడియా నుంచి టీవీ దాకా సాగిందామె ప్రయాణం. ఆరో కంటెస్టెంట్‌గా ఆర్జే చైతూ బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ఆరో కంటెస్టెంట్‌గా ఆర్జే చైతూ ఎంట్రీ ఇచ్చాడు. మొదటగా అతని జర్నీని వీడియో రూపంలో చూపించి, అనంతరం అతన్ని స్టేజ్ మీదకు ఆహ్వానించాడు నాగార్జున. స్పెషల్ సర్ప్రైజ్ అంటూ అతని తల్లిని స్జేజ్ మీదకు తీసుకొచ్చాడు నాగ్. అలాగే అతనికి ఇష్టమైన చికెన్ బర్గర్ ఇచ్చి ఇంట్లోకి పంపించేశాడు. నోరు తెరిస్తే.. ఆనకట్ట వేయడం కష్టమే ఈయన నోరు తెరిచాడంటే ఆనకట్ట వేయడం కష్టం. అతడే ఆర్జే చైతూ. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన అతడు కుటుంబ పోషణ కోసం ఎంతగానో కష్టపడ్డాడు. విజయవాడకు చెందిన చైతూ హైదరాబాద్‌కు వచ్చి డిగ్రీ చదువుతూ, యానిమేషన్స్ చేసుకుంటూనే రకరకాల ఉద్యోగాలు చేశాడు. కానీ ఎప్పుడైతే ఆర్జేగా మారాడో అప్పుడే అతడి దశ తిరిగిపోయింది. ఇప్పటివరకు ఆరు జాతీయ అవార్డులు అందుకున్నాడు చైతు. ఏడో కంటెస్టెంట్‌గా అరియానా ఏడో కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్-4 ఫేమ్ అరియానా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. బిగ్‌బాస్ తర్వాత తన జీవితమే మారిపోయిందని చెప్పిందీ బ్యూటీ. బిగ్‌బాస్ 4 తర్వాత.. బిగ్‌బాస్ బజ్‌కి హోస్ట్‌గా, ఓటీటీకి మళ్లీ డ్రామా, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్.. ఆట అంటే ఆటే అంటూ ఇంట్లోకి వెళ్లింది అరియానా. యాంకర్‌గా కెరీర్ ఆరంభించిన అరియానా పలు టీవీ షోలలో వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసిన వీడియోతో సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిన ఈ భామకు బిగ్‌బాస్ నాలుగో సీజన్లో పిలుపు రావడంతో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. తన అందచందాలతోనే కాకుండా ఆటతోనూ అభిమానులను కట్టిపడేసిన అరియానా.. తనకు తప్పనిపిస్తే బిగ్బాస్నేంటి? ఏకంగా నాగార్జునను సైతం నిలదీసింది. ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించిన అరియానా థర్డ్ రన్నరప్‌గా వెనుదిరిగింది.ఆ తర్వాత ఐదో సీజన్ బజ్కు హోస్ట్‌గానూ వ్యవహరించిన ఈ బ్యూటీ ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు ఓటీటీలో కంటెస్టెంట్‌గా పాల్గొంది. ఎనిమిదో కంటెస్టెంట్‌గా..నటరాజ్ మాస్టర్ ఎనిమిదో కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్ ఐదో సీజన్ కంటెస్టెంట్ నటరాజ్ మాస్టర్ సూపర్ ఏవీతో ఎంట్రీ ఇచ్చాడు.ఈ సారి మాత్రం గేమ్‌లో తగ్గదేలే అంటూ ఇంట్లోకి వెళ్లాడు నటరాజ్. ఇంతకు ముందు భార్య కోసం వచ్చాను.. ఇప్పుడు తన పాప కోసం బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చానని చెప్పుకొచ్చాడు నటరాజ్ మాస్టర్. నటరాజ్ కు తన పాప ఫోటోను గిఫ్ట్ గా ఇచ్చారు నాగ్. తెలుగులో వస్తున్న డ్యాన్స్ రియాలిటీ షోలకు నటరాజ్ మాస్టర్ ఓరకంగా ఆద్యుడని చెప్పవచ్చు. గతంలో ఉదయభానుతో కలిసి డ్యాన్స్ బేబీ డ్యాన్స్ షో చేసిన నటరాజ్ పలు షోలకు కొరియోగ్రాఫర్‌గా, మెంటార్‌గా వ్యవహరించాడు. దాదాపు టాప్ హీరోలు, దర్శకులందరితోనూ కలిసి పని చేసిన నటరాజ్ మాస్టర్‌కు 20 ఏళ్లకు పైనే అనుభవం ఉంది. కృష్ణా జిల్లాకు చెందిన ఈ కొరియోగ్రాఫర్ ఏడు సంవత్సరాలుగా ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. భార్య ఏడు నెలల గర్భంతో ఉన్నప్పుడు బిగ్‌బాస్ ఐదో సీజన్లో అడుగు పెట్టిన ఆయన బిడ్డ పుట్టిన తర్వాత మరోసారి బిగ్‌బాస్‌లో అడుగుపెట్టాడు. అప్పుడు భార్య కోసం, ఇప్పుడు కూతురి కోసం షోలోకి వచ్చానని, ఈసారి మాత్రం తగ్గేదేలే అంటున్నాడు. రోరింగ్ ట్యాగ్‌తో హౌస్‌లో అడుగుపెట్టిన నటరాజ్ మాస్టర్ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లకు ఏయే జంతువుల పేర్లు పెడతాడు? కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఎలా ఆడతాడో చూడాలి! తొమ్మిదో కంటెస్టెంట్‌గా శ్రీరాపాక తొమ్మిదో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది శ్రీ రాపాక. బిగ్ బాస్ తనకు డైమండ్ తో సమానం అని చెప్పింది. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన నగ్నం సినిమాతో ఈ బ్యూటీ హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఎంటర్టైన్మెంట్ అనే మెడిసిస్తో అందరికి వినోదాన్ని అందిస్తానంటూ బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లింది. హీరోయిన్ శ్రీరాపాక పుట్టింది తూర్పుగోదావరిలో, పెరిగింది హైదరాబాద్‌లో. ఫ్యాషన్ డిజైనర్‌గా ప్రయాణం మొదలుపెట్టిన ఆమె ప్రస్తుతం నటిగా రాణిస్తోంది. కబడ్డీ, కోకో ఆటల్లో జాతీయస్థాయిలో ఆటలు ఆడింది. అయితే ఓ సారి మాత్రం ఆంధ్రా నుంచి వచ్చానని ఆట ఆడనివ్వలేదని, దీంతో ఆ క్షణమే స్పోర్ట్స్ వదిలేశానని చెప్పుకొచ్చింది. వెస్ట్రన్‌లో ఉన్న మాస్, ట్రెడిషనల్లో ఉన్న క్లాస్.. రెండూ కలిపి దుమ్ము దులిపేస్తానంటూ రేసుగుర్రం ట్యాగ్‌తో బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టింది శ్రీరాపాక. తనకు ఎమోషన్స్ ఎక్కువంటున్న ఆమె వాటిని నియంత్రించుకోగలుగుతుందా? లేదా? అనేది చూడాలి! పదో కంటెస్టెంట్‌గా మోడల్ అనిల్ రాథోడ్ పదో కంటెస్టెంట్‌గా మోడల్ అనిల్ రాథోడ్ ఎంట్రీ ఇచ్చాడు. అతనికి లిప్ మార్క్ ఇచ్చి, అది ఎవరిదో చెప్పాలంటూ.. ఇంట్లోకి పంపించాడు నాగార్జున. ఇక ఇంట్లోకి వెళ్లిన అనిల్‌కు ఘన స్వాగతం పలికారు ఇంటి సభ్యులు. ఎవరీ అనిల్? అనిల్.. ప్రేక్షకులకు అస్సలు పరిచయం లేని పేరు. ఇతడి తండ్రి, తాత కూడా పోలీసాఫీసర్. కానీ అనిల్ మాత్రం మోడలింగ్ వైపు అడుగులు వేశాడు. మొదట్లో అతడి నిర్ణయాన్ని కుటుంబసభ్యులు వ్యతిరేకించినప్పటికీ అనిల్ ఇష్టాన్ని కాదనలేక మోడలింగ్‌కు సరేనన్నారు. దీంతో తక్కువ కాలంలోనే బెస్ట్ మోడల్‌గా ఎన్నో అవార్డులు అందుకున్నాడు అనిల్. 11వ కంటెస్టెంట్‌గా నటి మిత్ర శర్మ 11వ కంటెస్టెంట్‌గా నటి మిత్ర శర్మ ఎంట్రీ ఇచ్చింది. ముంబై నుంచి హైదరాబాద్‌కు వచ్చిన మిత్ర ‘తొలి సంధ్యవేళలో’ మూవీలో హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాల్లో నటించింది. కొన్నాళ్ల తర్వాత శ్రీ పిక్చర్స్ అనే ప్రొడెక్షన్స్ హౌస్‌ని ఓపెన్ చేసింది. బాయ్స్ అనే సినిమాతో నిర్మాతగా మారింది. 12వ కెంటెస్టెంట్గా తేజస్వీ 12వ కంటెస్టెంట్‌గా నటి తేజస్వీ.. ‘టచ్ మీ..టచ్ మీ’అనే ఐటమ్ సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చింది. ఈ సారి మరింత ఎంటర్టైన్మెంట్ అందిస్తా అంటుంది. హీరోయిన్ తేజస్వి మదివాడ ఎన్నో కష్టాలు పడింది. చిన్నప్పుడే తల్లి క్యాన్సర్ బారిన పడి చనిపోగా తండ్రి ఆర్మీ ఆఫీసర్ అయినా మద్యానికి బానిసయ్యాడు. దీంతో తినడానికి కూడా తిండి లేక పస్తులున్న రోజులున్నాయి. అలాంటి దీన స్థితి నుంచి హీరోయిన్ స్థాయికి ఎదిగింది తేజస్వి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన ఆమె హార్ట్ ఎటాక్, లవర్స్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, కేరింత, నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్ వంటి పలు సినిమాల్లో నటించింది. రామ్‌గోపాల్ వర్మ ఐస్ క్రీం చిత్రంతో హీరోయిన్‌గానూ గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగులో అంతంతమాత్రంగానే అవకాశాలు తెచ్చుకుంటున్న తేజస్వి గతంలో బిగ్‌బాస్ రెండో సీజన్లో పాల్గొంది. తాజాగా బిగ్‌బాస్ ఓటీటీలో అడుగు పెట్టిన ఆమె అభిమానులకు ఎంతో రుణపడి ఉన్నానని, ఎంటర్టైన్ చేస్తూ ఆ రుణాన్ని తీర్చేసుకుంటానంది. మరి ఈసారైనా ఈ రియాలిటీ షో తేజస్వికి కలిసి వస్తుందా? లేదా? చూడాలి! 13వ కంటెస్టెంట్‌గా సరయు 13వ కంటెస్టెంట్‌గా సోషల్ మీడియా స్టార్ సరయు ఎంట్రీ ఇచ్చింది. ఐదో సీజన్లో ఇలా వచ్చి అలా వెళ్లిన సరయు.. ఈ సారి మాత్రం తగ్గేదేలే అంటోంది. సరయు పూర్తి పేరు సరయు రాయ్. నిన్నే పెళ్లాడతా సీరియల్లో నెగెటివ్ రోల్లో నటించింది. 7 ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్లో అడల్ట్ కామెడీ వీడియోలు చేస్తూ ఫేమస్ అయింది. బిగ్‌బాస్ ఐదో సీజన్లో 13వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన సరయు మొదటివారంలోనే ఎలిమినేట్ అయ్యింది. తన ఆటను చూడకుండా ఒక్కవారానికే ఎలా ఎలిమినేట్ చేస్తారని బాధపడిపోయిన సరయు మరోసారి బిగ్‌బాస్ షోలో అడుగుపెట్టింది. తనేంటో, తన పవరేంటో ఇప్పుడు చూపిస్తానంటోందీ భామ. హౌస్‌లో ఎలా మంటపెడతాన్నో చూడండి అంటూ ఫైర్ ట్యాగ్‌తో హౌస్‌లోకి వెళ్లింది సరయు. మరి ఆమె నోటిప్రవాహాన్ని ఇతర కంటెస్టెంట్లు తట్టుకోగలరా? ఆమె బూతుల దండకానికి ఆడియన్స్ ఓట్లు గుద్దుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది. 14వ కంటెస్టెంట్‌గా యాంకర్ శివ 14వ కంటెస్టెంట్‌గా యాంకర్ శివ ఎంట్రీ ఇచ్చారు. డబ్బులు గెలిచి చెల్లి పెళ్లి చేయడం కోసమే బిగ్‌బాస్‌లోకి వెళ్తున్నానని శివ చెప్పాడు. యాంకర్ శివ విషయానికొస్తే.. యూట్యూబర్లకు బాగా పరిచయమున్న పేరు. వివాదాస్పద ఇంటర్వ్యూలతో సెన్సేషనల్ అయ్యాడు శివ. శ్రీకాకుళంలో పుట్టిన అతడు వైజాగ్‌లో విద్యనభ్యసించాడు. సెలబ్రిటీల నుంచి బిగ్‌బాస్ కంటెస్టెంట్ల దాకా అందరినీ ఇంటర్వ్యూ చేసే ఆయన తాజాగా బిగ్‌బాస్ ఓటీటీలో పాల్గొన్నాడు. 15వ కంటెస్టెంట్‌గా హీరోయిన్ బిందు మాధవి 15వ కంటెస్టెంట్‌గా హీరోయిన్ బిందు మాధవి ఎంట్రీ ఇచ్చింది. ఫుల్ కిక్ సాంగ్‌కి అదిరిపోయే స్టెప్పులేస్తూ స్టేజ్ మీదకు వచ్చింది బిందు. తెలుగులో ఆవకాయ బిర్యాని, పిల్ల జమిందార్ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న బిందు మాధవి.. తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అవ్వడానికి బిగ్‌బాస్‌లో వచ్చానని చెప్పింది. బిందుమాధవి అచ్చ తెలుగు హీరోయిన్. 'ఆవకాయ బిర్యానీ', 'రామరామ కృష్ణకృష్ణ' సినిమాల్లో కథానాయికగా నటించిన ఈమెకు తెలుగులో పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో కన్నడ ఇండస్ట్రీలో వాలిపోయిన ఆమెకు అక్కడ అవకాశాలతోపాటు ఆదరణ కూడా బాగానే ఉండటంతో అక్కడే సెటిలైంది. కన్నడ బిగ్‌బాస్‌లోనూ పాల్గొన్న బిందు ఇప్పుడు తెలుగు బిగ్‌బాస్ ఓటీటీలో పాల్గొంటోంది. 16వ కంటెస్టెంట్‌గా హమిదా 16వ కంటెస్టెంట్‌గా హమిదా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. బిగ్‌బాస్ 5లోకి వచ్చినప్పుడు తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియదని,ఈ సారి మాత్రం అందరికి తెలిసిపోతానని హమిదా చెప్పుకొచ్చింది. అనంతరం హమిదాకు ఓ టాస్క్ ఇచ్చాడు హోస్ట్ నాగార్జున. ఓ ఐదు కళ్ళను చూపించి ఏ కళ్ళు నచ్చాయో చెప్పమన్నాడు నాగార్జున. ఆమె ఓ ఫోటో సెలెక్ట్ చేసుకోగా..ఆ కళ్లు ఎవరివో వచ్చే వారం చెప్పాలంటూ.. హమిదాని హౌస్‌లోకి పంపాడు నాగార్జున. సాహసం సేయరా డింభకా సినిమాలో నటించింది హమీదా. అందంచందం ఉన్నప్పటికీ ఈమెకు పెద్దగా ఆఫర్లు రాలేదు. నటిగా రాణించేందుకు మంచి ఆఫర్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో బిగ్‌బాస్ నుంచి పిలుపు వచ్చింది. ఇంకేముందీ.. ఏం ఆలోచించకుండా వెంటనే ఓకే చెప్పేసింది. అలా బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో 11వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది.సింగర్ శ్రీరామ్‌ను స్నేహితుడి కన్నా ఎక్కువ ప్రేమికుడి కన్నా తక్కువగా ఊహించుకున్న ఆమె అతడికే ఎక్కువ అంకితమైంది. దీంతో హమీదా అసలు గేమ్ చూడలేమనుకున్నవాళ్లకోసం మరోసారి బిగ్‌బాస్ షోలో అడుగుపెట్టిందీ బూరబుగ్గల బ్యూటీ. మరి ఈసారి ఈ డేరింగ్ అండ్ డాషింగ్ హీరోయిన్ గేమ్ ఎలా ఉండబోతోంది? ప్రత్యర్థులను ఎలా మట్టికరిపించనుంది? అనేది ఇంట్రస్టింగ్‌గా మారింది. 17వ కంటెస్టెంట్‌గా అఖిల్ సార్థక్ 17వ కంటెస్టెంట్‌గా అఖిల్ సార్థక్ అదిరిపోయే పాట పాడుతూ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. బిగ్‌బాస్ నాల్గో సీజన్లో అఖిల్ రన్నరప్ గా నిలిచిన విషయం తెలిసిందే. అఖిల్ నటించిన సిసింద్రి చిత్రం విడుదలైన మరుసటి రోజే తాను జన్మించడంతో కుటుంబ సభ్యులు తనకు అఖిల్ అని పేరు పెట్టాడని గతంలో చెప్పుకొచ్చాడీ మోడల్. హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాలో మూడో స్థానం సంపాదించుకున్న అఖిల్ పలు సీరియల్స్‌లోనూ నటించాడు. బిగ్‌బాస్ హౌస్‌లో ఫైటర్‌గా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ ఈసారి రన్నరప్‌గా కాకుండా కప్ గెలుచుకుని విన్నర్‌గా బయటకు వస్తానన్నాడు. మరి అతడు తన కలను నెరవేర్చుకుంటాడా? లేదా? చూడాలి! సోషల్ మీడియాలో లీకైన లిస్టే.. బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో ప్రేక్షకుల్లో అంతగా ఉత్కంఠ కనపడలేదు. బిగ్‌బాస్ టీమ్ కడవరకు సస్పెన్స్ మెయింటెన్ చేసినా కూడా లీకులు మాత్రం ఆగలేదు. 84 రోజుల పాటు 17 మందితో సాగే ఈ షో.. రేపటి నుంచి కంటెస్టెంట్ల గొడవలు, ప్రేమలు, కోపాలు, అలకలతో రక్తికట్టించబోతోంది. -
బిగ్‌బాస్ నాన్‌స్టాప్: 24 గంటలు, 84 రోజులు, 17మంది కంటెస్టెంట్లు
Bigg Boss Telugu OTT Nonstop Promo: బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడే షో బిగ్‌బాస్. ఇప్పుడు 24గంటల పాటు ఎంటర్టైన్మెంట్ అందించేందుకు రెడీ అయ్యింది. 'బిగ్‌బాస్ నాన్‌స్టాప్' పేరుతో ప్రసారం కానున్న ఈ షో నేటి నుంచే ప్రారంభం కానుంది. 84 రోజుల పాటు 17 కంటెస్టెంట్లతో ప్రారంభం కానున్న బిగ్‌బాస్ షో సాయంత్రం 6గంటలకు ప్రసారం కానుంది. 'డిస్నీ+ హాట్‌స్టార్'లో 24/7 స్ట్రీమింగ్ కానున్న ఈ షో ప్రోమో రిలీజ్ అయ్యింది. 'ఈ ఇల్లును చూసుకోవడానికి ఓ మగాడు కావాలి'.. అనే వాయిస్‌తో షో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత నాగార్జున హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఇల్లు కలర్ఫుల్గా ఉందని, ఇక్కడి నుంచే హౌస్టింగ్ చేస్తే ఎలా ఉంటుంది అని తన అనుకుంటుండగా..ఇ ది నా అడ్డా నాగార్జున అంటూ బిగ్‌బాస్ సమాధానం చెబుతారు. ఇక కంటెస్టెంట్లను హౌస్ లోపలికి పంపే క్రమంలో నాగార్జున అడిగే ప్రశ్నలు ఆకట్టుకుంటాయి. నువ్వు పెళ్లి చేసుకున్న విషయం ఆడియెన్స్‌కి తెలుసా అంటూ కింగ్ నాగార్జున ఏ లేడీ కంటెస్టెంట్‌ని అడుగుతారు. మరి ఆ కంటెస్టెంట్ ఎవరు అన్నది మరికాసేపట్లో తెలియనుంది. చదవండి: బిగ్‌బాస్ నాన్‌స్టాప్.. చివరి నిమిషంలో ఆ కంటెస్టెంట్లు అవుట్ #BiggBossNonStop fans ready ikkada!! 🎉🎉🎉 The grand extravaganza coming to your screens at 6 PM! #Biggboss #disneyplushotstar @DisneyPlusHS @EndemolShineIND @iamnagarjuna https://t.co/4VJAOpdpoW — DisneyPlus Hotstar Telugu (@DisneyPlusHSTel) February 26, 2022