బిగ్‌బాస్‌ ఓటీటీ: రవిపై ఫైర్‌ అయిన నటరాజ్‌ మాస్టర్‌? | Bigg Boss Telugu OTT: Nataraj Master Bigg Boss Buzz Interview After Elimination | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu OTT: రవిపై ఫైర్‌ అయిన నటరాజ్‌ మాస్టర్‌?

Published Mon, May 16 2022 8:36 PM | Last Updated on Mon, May 16 2022 8:45 PM

Bigg Boss Telugu OTT: Nataraj Master Bigg Boss Buzz Interview After Elimination - Sakshi

Nataraj Master Bigg Boss Buzz Interview After Elimination: బిగ్‌బాస్‌ తెలుగు ఓటీటీ చివరి దశకు చేరుకుంది. టైటిల్‌ను గెలిచేందుకు హౌజ్‌మేట్స్‌ గట్టిగా పోటీ పడుతున్నారు. ఇక గతవారం హౌస్‌మేట్స్‌ అందరూ నామినేషన్‌లో ఉన్నారు. బిందు, అఖిల్‌, బాబా బాస్కర్‌, నటరాజ్‌ మాస్టర్‌, ఆరియాన గ్లోరీ, మిత్ర, అనిల్‌, యాంకర్‌ శివ నామినేషన్‌ల్లో ఉండగా ఇందులో తక్కువ ఒట్స్‌ వచ్చిన నటరాజ్‌ మాస్టర్‌ ఎలిమినేట్‌ అయ్యి హౌజ్‌న వీడాడు. ఎలిమినేషన్‌ అనంతరం నటరాజ్‌ మాస్టర్‌ బిగ్‌బాస్‌ బజ్‌ ఎపిసోడ్‌లో యాంకర్‌ రవితో ముచ్చటించాడు. ఇందుకు సంబంధించిన ప్రోమోను తాజాగా డిస్ని ప్లస్‌ హాట్‌స్టార్‌ రిలీజ్‌ చేసింది.

చదవండి: చిక్కుల్లో కరాటే కల్యాణి, చిన్నారి దత్తతపై నోటీసులు

ఇక వచ్చి రాగానే ‘నా రాక కోసం ఎదురు చూస్తున్నావా?’ అని రవికి కౌంటర్‌ ఇచ్చాడు మాస్టర్‌. తాను ఒక్కడినే అనుకుంటే మీ తప్పు అంటూ రవి రీకౌంటర్‌ ఇచ్చాడు. అనంతరం ఒకరి వల్ల మధ్యలోనే ఇంటి నుంచి బయటకు వచ్చాననడంతో అంతా నెగిటివి ఎందుకు మాస్టర్‌ అని రవి అంటాడు. ఆ తర్వాత చెన్నై.. తమిళ్‌.. చేసుకుని వెళ్లిపోతారు అనే నటరాజ్‌ వ్యాఖ్యలను రవి తప్పబట్టినట్లు కనిపించాడు. దీనికి మాస్టర్‌ దానికి కూడా క్లారిటీ ఇస్తా అంటాడు. ఆ తర్వాత మాస్టర్‌ తనకు ఒక సక్సెస్‌ అనేది రాలేదడంతో.. టాలెంట్‌కి బౌండరీస్‌ లేవు అంటాడు రవి.

అనంతరం ‘నువ్వు ఏదో లోపల పెట్టుకుని ఒక పాయింట్స్‌ రాసుకుని నా మీద అటాక్‌ చేస్తున్నావ్‌ ప్రతి పాయింట్‌ అర్థమవుతుంది’ అని రవిపై ఫైర్‌ అయ్యాడు మాస్టర్‌. ఇలా ఇద్దరి మధ్య సంభాషణ కాస్తా ఘాటూగానే సాగింది. ఆ తర్వాత ఇంత క్రుయల్‌గా ఏ అమ్మాయిని చూడలేదని, ఆమె తీసే పాయింట్స్‌ అంటూ నటరాజ్‌ మాస్టర్‌ అంటుండగా ఈ రోజు బిందు పాయింట్స్‌ తీసింది కాబట్టే తనకు.. ఆడియాన్స్‌కి బిందు లోపట ఉండాలని ఓట్‌ వేశారు అంటాడు రవి. ఆ వెంటనే శకుని అనే ఓ నెగిటివ్‌ క్యారెక్టర్‌ ఒక అమ్మాయికి పెట్టడం ఎంతవరకు కరెక్ట్‌ అని అడగ్గా.. ఆడించేది ఎవరు మహా భారతంలో శకుని.. బిగ్‌బాస్‌లో ఆ ఇద్దరి ఆడిస్తున్నావంటే నువ్వు శకునే కదా అని సమాధానం ఇస్తాడు మాస్టర్‌.

చదవండి: త్వరలో పెళ్లి.. అంతలోనే బ్యాడ్‌న్యూస్‌ చెప్పిన పాప్‌ సింగర్‌

ఇక ఆరియానకు ఇంటి డబ్బులు వచ్చాయి ఇంటికి పంపించేయండనం ఏంటని అన్నదానికి.. బిడ్డ మీద ఒట్టు వేయమంటే గేమ్‌ అయిన వదిలేస్తాను కానీ ఒట్టు వేయను అంటాడు నటరాజ్‌ మాస్టర్‌. ఇక నువ్వు బాగానే ప్రిపేర్‌ అయ్యిన్నావ్‌ అర్థమైందంటూ రవిపై మాస్టర్‌ సటైరికల్‌ కామెంట్స్‌ చేస్తాడు. దీనికి రవి తాను చాలా బెటర్‌గా మాట్లాడుతున్నానని, బయటకు వెళ్లి చూస్తే మీరు చాలా బాధపడతారని సమాధానం ఇవ్వడం ఆసక్తి నెలకొంది. ఈ ఇంటర్య్వూలో రవి నటరాజ్‌ మాస్టర్‌రను ఎలాంటి ప్రశ్నలతో ఇబ్బంది పెట్టాడు.. నటరాజ్‌ మాస్టర్‌ ఎందుకు ఇంత అసహనానికి లోనయ్యాడనేది తెలియాంటే ఫుల్‌ ఎపిసోడ్‌ చూడాల్సిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement