Bigg Boss Non Stop Telugu: Housemates Will Shock After Knowing Nataraj Master Is the Killer - Sakshi
Sakshi News home page

Bigg Boss Non Stop: అదరగొట్టిన నటరాజ్‌ మాస్టర్‌.. షాక్‌ అయిన హౌస్‌మేట్స్‌

Published Wed, Apr 27 2022 3:34 PM | Last Updated on Wed, Apr 27 2022 4:01 PM

Biggg Boss Non Stop: Housemates Will Shock After Knowing Nataraj Master Is The Killer - Sakshi

బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ రోజురోజుకూ రసవత్తరంగా సాగుతోంది. ఇక మంగళవారం నాటి ఎపిసోడ్‌ మరింత ఇంట్రెస్టింగ్‌గా సాగింది. కెప్టెన్సీ కంటెండర్స్‌ కోసం బిగ్‌బాస్‌ ఇచ్చిన కిల్లర్‌ టాస్క్‌లో నటరాజ్‌ మాస్టర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది షోగా నిలిచాడు. ఒక్క టాస్క్‌తో నటరాజ్‌ మాస్టర్‌ రేంజ్‌ మారిపోయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. హౌస్‌లో ఉన్న వాళ్లందర్నీ ముప్పుతిప్పులు పెట్టి అయిదుగిరిని మర్డర్‌ చేసినా మాస్టరే కిల్లర్‌ అని ఒక్కరు కూడా కనిపెట్టలేకపోయారు.

బిగ్‌బాస్‌ ఇచ్చిన సూచనలు పాటిస్తూ  కిరాక్ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టాడు. ఇక ఈరోజు ఎపిసోడ్‌లో నటరాజ్‌ మాస్టరే కిల్లర్‌ అని చెప్పడంతో షాక్‌ అవడం హౌస్‌మేట్స్‌ వంతవుతుంది. అఖిల్‌, అషూలు కిల్లర్‌ అయి ఉండొచ్చని హౌస్‌మేట్స్‌ భావించినా చివరకు కిల్ కిల్ కిలాడీ అంటూ నటరాజ్‌ మాస్టర్‌ ఎంట్రీ ఇవ్వడంతో హౌస్‌మేట్స్‌ అంతా నోరెళ్లబెట్టారు. దీనికి సంబంధించి ప్రోమో విడుదల అయ్యింది. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement