బిగ్‌బాస్ నాన్‌స్టాప్.. తొలివారం పూర్తి చేసుకుంది. నో కామా నో ఫుల్ స్టాప్ అంటూ నాగార్జున మొదలుపెట్టిన ఈ షో నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ముందుకి సాగుతుంది. . ఫన్, ఫ్రస్టేషన్, ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ ఇలా 17మందితో మొదలైన బిగ్‌బాస్ షో రసవత్తరంగా సాగుతుంది. మాజీ కంటెస్టెంట్లతో పోటీపడి మరీ కొత్త కంటెస్టెంట్లు తమదైన ఆట కొనసాగిస్తున్నారు.
ఇక 24/7 డిస్నీ హాట్ స్టార్‌లో ప్రసారం కానుండటంతో ప్రేక్షకులకు బోలెడంత ఎంటర్‌టైన్‌మెంట్ దొరుకుతుంది. ఇక బిగ్‌బాస్ ఓటీటీలో మొదటి వారం నామినేషన్స్‌లో సరయు, ముమైత్ ఖాన్, మిత్రా శర్మ, ఆర్జే చైతు అరియానా గ్లోరి, నటరాజ్ మాస్టర్ ఉన్నారు. వీరిలో ఎవరు మొదటి వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే చర్చ జరుగుతుంది. అయితే సోషల్ మీడియాలో అందుతున్న సమాచారం ప్రకారం.. ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తుంది.
నిజానికి మిత్రా శర్మ ఎలిమినేట్ అవుతుందని అంతా భావించారు. కానీ లాస్ట్ మినిట్‌లో ఓటింగ్ తారుమారు అవ్వడంతో ఆమె సేఫ్ అయ్యి ముమైత్ ఎలిమినేట్ అయినట్లు లీకు వీరులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. మరి నిజంగానే ముమైత్ ఎలిమినేట్ అయ్యిందా అనేది తెలియాలంటే రేపు జరగనున్న సండే ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment