Bigg Boss Telugu OTT
-
బిగ్‌బాస్‌లో రతికా రోజ్.. ఓకే చెప్పేసిందా?
గతేడాది బుల్లితెర ప్రేక్షకులను అలరించిన రియాలిటీ షో బిగ్‌బాస్. దాదాపు 100 రోజులకు పైగా సినీ ప్రేక్షకులను అలరించింది. డిసెంబర్ 17న ముగిసిన ఈ సీజన్లో రైతుబిడ్డగా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. బుల్లితెర నటుడు అమర్దీప్ రన్నరప్ స్థానం దక్కించుకున్నాడు. అయితే అంతకుముందు జరిగిన సీజన్లతో పోలిస్తే ఈ సారి ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన రావడంతో బిగ్‌బాస్ నిర్వాహకులు త్వరలోనే మరో సీజన్‌కు సిద్ధమైనట్లు తెలుస్తోంది. త్వరలోనే బిగ్‌బాస్ ఓటీటీ సీజన్ మొదలు కానున్నట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఈ రియాలిటీ షో ఫిబ్రవరి నెలలోనే ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. గతేడాది జరిగిన బిగ్‌బాస్ సీజన్-7లో అందరి దృష్టిని ఆకర్షించిన కంటెస్టెంట్ ఒకరు ఉన్నారు. ఏకంగా రెండుసార్లు ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. రెండో సారి కూడా ఎలిమినేట్ అయి బయటకొచ్చిన కంటెస్టెంట్ రతికా రోజ్. అయితే మరోసారి రతికా బిగ్‌బాస్ షోకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఓటీటీ సీజన్లో రతికా ఎంట్రీ ఇవ్వనుందని సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం రతికా ఓ సినిమాలో నటిస్తోంది. -
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విన్నర్ బిందు మాధవికి బంపర్ ఆఫర్!
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విజేతగా బిందు మాధవి నిలిచిన విషయం తెలిసిందే. తెలుగు బిగ్‌బాస్ చరిత్రలో ఓ మహిళ విన్నర్‌గా నిలవడం ఇదే తొలిసారి. దీంతో తెలుగు బిగ్‌బాస్ విన్నర్‌గా నిలిచి బిందు మాధవి చరిత్ర సృష్టించింది. టాస్క్‌లో.. మాటల్లో ఆడపులిలా రెచ్చిపోయిన బిందుకి ఒక్కసారిగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. ఇది వరకు ఆమె తెలుగులో పలు చిత్రాల్లో చేసిన రానీ గుర్తింపు ఒక్కసారిగా బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌తో తెచ్చుకుంది. దీంతో ఆమెకు టాలీవుడ్ నుంచి వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. చదవండి: కరణ్ జోహార్ బర్త్‌డే పార్టీ, ఒకే రంగు దుస్తుల్లో మెరిసిన రష్మిక, విజయ్ ఈ నేపథ్యంలో బిందుకు సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఏకంగా ఆమె ఓ స్టార్ డైరెక్టర్ సినిమాలో చాన్స్ కొట్టేసిందంటూ తాజాగా వార్తలు గుప్పుమన్నాయి. ఇండస్ట్రీలో వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న యంగ్ డైరెక్టర్ అనిల్‌రావిపూడి తదుపరి ప్రాజెక్ట్‌లో నటించే చాన్స్ కొట్టేసిందని వినికిడి. కాగా ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్ 3 మూవీ ప్రమోషన్‌తో బిజీగా ఉన్నాడు. దగ్గుబాటి హీరో విక్టరి వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించి ఈ చిత్రం రేపు(మే 27న) ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని అనంతరం ఆయన బాలకృష్ణతో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. చదవండి: రాత్రి 11 గంటలు, కానిస్టేబుల్ వల్ల అభద్రతకు గురయ్యా: హీరోయిన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన అనిల్ రావిపూడితో బాలయ్య సినిమా అనేసరికి అందరిలో ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమా అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రమంలో బిందు మాధవిని ఓ కీ రోల్ కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో హీరోయిన్గా మెహ్రీన్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. అంతేకాదు మరో యువ నటి శ్రీలీలా బాలయ్య కూతురిగా కనిపించబోతుందట. మరి ఇందులో బిందు మాధవి రోల్‌పై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇదిలా ఉంటే బాలయ్య కోసం తన కామెడీ టచ్‌ను పక్కన పెట్టి యాక్షన్‌పై దృష్టి పెట్టానని అనిల్ రావిపూడి ఇటీవల ఓ ఇంటర్య్వూలో చెప్పిన సంగతి తెలిసిందే. -
బిగ్‌బాస్ షోలో బిందుమాధవి పారితోషికం ఎంతో తెలుసా?
Bindu Madhavi Remuneration: బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ విన్నర్‌గా నిలిచింది బిందు మాధవి. షో విజేతగా అవతరించడంతో ఆమెకు రూ.40 లక్షలు దక్కాయి. నిజానికి విన్నర్ ప్రైజ్‌మనీ అరకోటి. కానీ గ్రాండ్ ఫినాలే రోజు బోల్డ్ బ్యూటీ అరియానా గ్లోరీ రూ.10 లక్షలు తీసుకుని రేసు నుంచి తప్పుకుంది. దీంతో ఆ పది లక్షలు ప్రైజ్‌మనీలో నుంచి కోత పెట్టారు. అలా బిందు చేతికి 40 లక్షల రూపాయలు వచ్చాయి. ఇకపోతే బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షో 12 వారాలు సాగింది. మరి 12 వారాలు హౌస్‌లో ఉన్నందుకు ఆమెకు ఎంత పారితోషికం వచ్చిందనుకుంటున్నారు? రూ. 55- 60 లక్షలు. అంటే మొత్తంగా బిందు ఇంచుమించు కోటి రూపాయలు గెల్చుకున్నట్లు తెలుస్తోంది. కానీ ట్యాక్స్ కటింగ్స్ వల్ల ఆమె చేతికి దాదాపు రూ.90 లక్షల మేరకు వచ్చే ఛాన్స్ ఉంది! మొత్తానికి బిందు ఈ రేంజ్లో రెమ్యునరేషన్ అందుకుందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది. కాగా బిందు తెలుగులో ఆవకాయ బిర్యానీ, బంపర్ ఆఫర్ సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే! తమిళ బిగ్‌బాస్ మొదటి సీజన్లో పాల్గొన్న బిందు అక్కడ నాలుగో రన్నరప్‌గా నిలిచింది. ఇక తెలుగులో ఏకంగా ట్రోఫీ అందుకుని బిగ్‌బాస్ కప్పు గెలిచిన మొట్టమొదటి మహిళా విజేతగా అవతరించింది. చదవండి 👇 స్టార్ హీరో తండ్రికి అస్వస్థత, పొత్తికడుపులో రక్తస్రావం నా సినిమాను చంపేశారు: శేఖర్ నిర్మాత ఆవేదన -
బయటకు రాగానే యాంకర్ శివ రచ్చ, క్లాస్ పీకిన మహిళ పోలీస్
Bigg Boss Telugu Non Stop: బిగ్‌బాస్ తెలుగు నాన్‌స్టాప్‌కు శనివారంతో ఎండ్‌కార్డ్ పడింది. బిగ్‌బాస్ ఓటీటీ తొలి సీజన్ విన్నర్‌గా బిందు మాధవి నిలిచిన సంగతి తెలిసిందే. హౌజ్‌లో చివరి రోజు వరకు బిందు మాధవి, అఖిల్ సార్థక్, యాంకర్ శివ, అరియాన గ్లోరీ, బాబా భాస్కర్ మాస్టర్, మిత్ర శర్మ టైటిల్ కోసం పోరాడగా.. చివరకు బిందు టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే హౌజ్ నుంచి బయటకు వచ్చిన కంటెస్టెంట్ హావా మామూలుగా ఉండదు. వారి ఫ్యాన్స్ భారీగా తరలి వచ్చి తమ ఫేవరెట్ కంటెస్టెంట్‌కు నీరాజనాలు పలుకుతుంటారు. చదవండి: 'శేఖర్' సినిమా వివాదం.. జీవితా రాజశేఖర్ గెలుపు? ఈ సందర్భంగా వారి ఫ్యాన్స్ చేసే రచ్చ, హడావుడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బిగ్‌బాస్ సెట్ నుంచి ఇంటి వరకు రోడ్‌షో నిర్వహిస్తారు. అలాగే హౌజ్ నుంచి బయటకు వచ్చిన యాంకర్ శివ కోసం అతడి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వాగతం పలికారు. దీంతో శివ ఓపెన్ టాప్ కారులో తన ఫ్యాన్స్‌కు అభివాదం చేస్తూ ముందుకు కదిలాడు. ఈ క్రమంలో శివ ఫ్యాన్స్ కారు వద్దకు చేరి నానా హంగామా చేశారు. కారు చూట్టు ముట్టి కారును ముందుకు కదలకుండా చేశారు. అంతేకాదు పెద్ద ఎద్దున అరుస్తూ రచ్చ చేశారు. దీంతో ఆ ఎరియాలో తీవ్ర ట్రాఫిక్ సమస్య నెలకొంది. చదవండి: ప్రేమపై నోరు విప్పిన సాయి పల్లవి, ఏమన్నదంటే.. శివ కారు కారణంగా వెనకాలే వచ్చు కార్లు కూడా ముందుకు కదలని పరిస్థితి ఏర్పడింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి యాంకర్ శివకు క్లాస్ పీకారు. ఇలా కార్ టాప్ మీదకు రావడం కరెక్ట్ కాదని, మీరు లోపల కూర్చొని ఇక్కడి నుంచి వెళ్లాలని ఓ మహిళ పోలీసు అధికారిని శివను వారించారు. అంతేకాదు మీ వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుందని, తొందరగా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు శివను వారించినట్లు సమాచారం. దీంతో యాంకర్ శివ కారు లోపల కూర్చొని వెళ్ళిపోయాడు. కాగా గతంలోనూ పలువురు కంటెస్టెంట్స్ ఇలాగే రచ్చ చేయడంతో పోలీసులు వారిని మందలించిన సంగతి తెలిసిందే. పర్మిషన్ లేకుండా ఇలాంటి ర్యాలీలు చేపడితే ఊరుకోమని పోలీసులు పేర్కొన్నారు. AnchorShiva craze ea verabba 😎 Anchor Shiva on the way home 🏡@anchor_shiva #AnchorShiva #BiggBossNonStop #BiggBossNonStopTelugu pic.twitter.com/Z5GsaDBb9Q — Shiva Fans Ikkada ⚡🔥❤️🥷 (@iamkundum) May 21, 2022 -
బాత్రూమ్లో సీక్రెట్ స్మోకింగ్.. బిందుమాధవి ఏమందంటే?
మొదట్లో బిగ్‌బాస్ షో అంటే కేవలం టీవీలకే పరిమితమయ్యేది. కానీ ఓటీటీలు వచ్చాక బిగ్‌బాస్ రూటు మారింది. గంట ఎపిసోడ్ మాత్రమే ఎందుకు చూపించాలి, హౌస్‌లో ఏం జరుగుతుందో ప్రత్యక్ష ప్రసారం చూపిస్తే పోలా అనుకున్నారు. అనుకున్నట్లుగా బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ప్రవేశపెట్టారు. 24 గంటలు లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులోకి తేవడమే కాకుండా నిరంతరం షో చూడలేనివాళ్ల కోసం ప్రత్యేకంగా గంట ఎపిసోడ్ కూడా పెట్టారు. కంటెస్టెంట్ల మీద ఓ కన్నేసి ఉంచే వాటినుంచి తప్పించుకుని ఏమీ చేయలేరు కంటెస్టెంట్లు. కానీ కెమెరాలకు సైతం కనబడకుండా అషూ, బిందు మాధవి సిగరెట్ తాగారంటూ ప్రచారం జరిగింది. అర్ధరాత్రి సిగరెట్లు మాయమవుతున్నాయని, బాత్రూమ్లో కూడా పొగ వాసన వస్తుందని నటరాజ్ ఎప్పుడో పసిగట్టాడు. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన సమయంలోనూ అషూకు సిగరెట్ తాగావా? అన్న ప్రశ్న ఎదురైంది. కానీ అషూ తెలివిగా దాని నుంచి తప్పించుకుంది. తాజాగా ఫ్యాన్స్‌తో సోషల్ మీడియాలో సరదాగా చిట్‌చాట్ చేసిన బిందుమాధవికి సైతం అదే ప్రశ్న ఎదురైంది. నువ్వు స్మోకింగ్ చేస్తున్నావని స్రవంతి.. అఖిల్‌తో పాటు అతడి ఫ్రెండ్స్‌కు చెప్పింది. అది నిజమేనా? అని ఓ అభిమాని అడిగారు. దీనికి బిందు స్పందిస్తూ.. తానసలు పొగ తాగలేదని స్పష్టం చేసింది. తనకా అలవాటు ఉండుంటే ఓపెన్‌గానే స్మోకింగ్ చేసేదాన్నని చెప్పుకొచ్చింది. చదవండి 👉🏾 హీరోయిన్ ప్రణీత బేబీ బంప్ ఫొటోలు వైరల్ కుంభకర్ణుడిలా పడుకుంది చాలు, ముందు అప్డేట్ ఇవ్వు -
బిందు మాధవితో లవ్ ట్రాక్.. క్లారిటీ ఇచ్చిన శివ
Anchor Shiva Gave Clarity On Love Story With Bindu Madhavi: బిగ్‌బాస్.. ప్రేక్షకుల నుంచి ఎంతో ఆదరణ పొందింది ఈ రియాలిటీ షో. గంట ఎపిసోడ్ కోసం రోజంతా ఎదురుచూసే ప్రేక్షకుల కోసం బిగ్‌బాస్ నాన్స్టాప్పేరుతో ఓటీటీలో ప్రవేశపెట్టారు. బిగ్‌బాస్ హౌజ్‌లో 24 గంటలు ఏం జరుగుతుందో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా చూసేయండంటూ షోపై మరింత ఆసక్తి పెంచారు. ఈసారి బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో వచ్చిన గొడవలు ఏ బిగ్‌బాస్ సీజన్లో రాలేదు. ఎంతలా అంటే ప్రేమలు, ఆప్యాయతలు కంటే కంటెస్టెంట్ల మధ్య వాగ్వాదాలతోనే మోస్ట్ పాపులర్ అయ్యారు. ఈ ఓటీటీ మొదటి సీజన్లో మొత్తం 18 మంది (ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీతో సహా) పాల్గొన్నారు. వీరిలో అనిల్ రాథోడ్, అరియానా గ్లోరీ, అఖిల్ సార్థక్, బిందు మాధవి, శివ, మిత్రా శర్మ, బాబా భాస్కర్ గ్రాండ్ ఫినాలేకు చేరుకున్నారు. బిందు మాధవి విన్నర్‌గా నిలవగా అఖిల్ రన్నరప్‌గా సరిపెట్టుకున్నాడు. ఇక కాంట్రవర్సీ యాంకర్‌గా పేరు తెచ్చుకున్న శివ టాప్ 3 కంటెస్టెంట్‌గా నిలిచాడు. అయితే హౌజ్‌లో ఉన్నప్పుడు యాంకర్ శివ, బిందు మాధవి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని అనేక రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే తర్వాత జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి చెప్పుకొచ్చాడు శివ. చదవండి: అనిల్, సునిల్‌ను దొంగసచ్చినోళ్లు అంటూ అరియానా తిట్లు.. బిందుతో లవ్ ట్రాక్ నడపడం వల్లే ఫైనల్ వరకు వచ్చారా అని అడిగిన ప్రశ్నకు 'అసలు రాంగ్ ఇన్ఫర్మేషన్ అనుకుంటా. నిజానికి నేను బిందుతో ఉన్నది లవ్ ట్రాక్ కాదు. మా ఇద్దరిది ఫ్రెండ్షిప్ మాత్రమే. అసలు లవ్ ట్రాక్ అయితే కానేకాదు.' అని తెలిపాడు శివ. తర్వాత బిగ్‌బాస్‌కు వెళ్లడం ఎలా ఉందన్న ప్రశ్నకు 'కాంట్రవర్సీ యాంకర్‌గా పేరు తెచ్చుకున్న నేను మొదట్లో భయపడ్డాను. ఎక్కడ నెగెటివిటీ వస్తుందో అని. నన్ను యాక్సెప్ట్ చేస్తారో లేదో అనుకున్నా. కానీ హౌజ్‌లోపలికి గెస్ట్‌లు, పేరెంట్స్ వచ్చి ఎంటర్టైనర్ ఎంటర్టైనర్ అంటే సంతోషంగా అనిపించింది. ఇంత మంచి పేరు వచ్చినందుకు హ్యాపీగా ఉంది.' అని పేర్కొన్నాడు. చదవండి: తెలుగు బిగ్‌బాస్ చరిత్రలోనే మొదటి మహిళా విజేతగా బిందు మాధవి.. -
నాకేం ఫరక్ పడదు, బిందు నా పండు: అఖిల్ సార్థక్
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షోకు శుభం కార్డు పడింది. తెలుగు బిగ్‌బాస్ చరిత్రలోనే తొలిసారిగా ఒక మహిళా కంటెస్టెంట్ విన్నర్‌గా నిలిచింది. 17 మంది కంటెస్టెంట్లతో పోటీపడి బిందుమాధవి ట్రోఫీ ఎగరేసుకుపోయింది. గతంలో గెలుపుకు ఒక అడుగు దూరంలో ఆగిపోయిన అఖిల్ సార్థక్ ఈసారి ఎలాగైనా ట్రోఫీని సొంతం చేసుకుకోవాలనుకున్నాడు. కానీ అతడికి మరోసారి భంగపాటు ఎదురైంది. ఓటింగ్‌లో అతడిని వెనక్కు నెట్టి మరీ బిందు మాధవి విజేతగా అవతరించడంతో అఖిల్ మరోసారి రన్నర్‌గా నిలిచాడు. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన అతడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'నేను రన్నర్ అయినా మావాళ్లు నన్ను విన్నర్‌గానే ట్రీట్ చేస్తారు. కానీ నేను ఏడ్చేశానంటూ కొందరు ఏవేవో రాశారు. ఆల్రెడీ ఒకసారి దెబ్బ తగిలినప్పుడు దానిపై మళ్లీ తాకితే పెద్దగా ఫరక్ పడదు. బిందు నా పండు. మేం చాలా సరదాగా ఉన్నాం. బిగ్‌బాస్ షో మొదటి నుంచే తనతో కలవడానికి ప్రయత్నిస్తున్నా. కానీ చివరి వారంలో కలిశాము. చాలా సంవత్సరాల నుంచి ఆమె విజయం కోసం ఎదురుచూస్తోంది. చివరకు తను అనుకున్నది సాధించినందుకు హ్యాపీ. హౌస్‌లో తేజు, శ్రీరాపాక, ముమైత్, నటరాజ్ మాస్టర్ బెస్ట్ కంటెస్టెంట్స్. యాంకర్ శివ నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వస్తాడట, అప్పుడు అతడి గురించి చెప్తా' అన్నాడు అఖిల్. చదవండి 👉🏾 నా నామినేషన్స్ బాగా నచ్చాయట, బిగ్‌బాస్‌కు మళ్లీ వెళ్తా: మిత్ర బిందుమాధవి గెల్చుకున్న ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా? -
బిగ్‌బాస్ నెక్స్ట్ సీజన్‌కి మళ్లీ వెళ్తా: మిత్ర శర్మ
బిగ్‌బాస్ ఓటీటీ నాన్‌స్టాప్‌లో టాప్ 5లో చోటు దక్కించుకుంది మిత్ర శర్మ. ఆమె ఫినాలేలో స్థానం సంపాదించినందుకు కొందరు సంతోషిస్తుంటే మరికొందరు ఈమె ఇక్కడిదాకా ఎలా వచ్చిందా? అని తలలు పట్టుకుంటున్నారు. బిగ్‌బాస్ షోలో ఆమె ఎక్కువగా కనిపించేది నామినేషన్స్‌లోనే. అందరి నామినేషన్ ఒక ఎత్తైతే మిత్ర నామినేషన్ మాత్రం వేరే లెవల్ ఉండేది. గంటల తరబడి వాదిస్తుంటే మిగతావాళ్ల కాళ్లు నొప్పులు పుట్టేవి. అన్న అన్న అనుకుంటూనే మహేశ్, శివను నామినేట్ చేసింది. బిందు, శివను నామినేట్ చేసేటప్పుడు మిత్రలో మరో యాంగిల్ బయటకు వచ్చేది. ఇమిటేట్ చేయడం, డ్రామా క్రియేట్ చేయడం, గార్డెన్ ఏరియాను అంతా వాడేసుకుంటూ పరిగెత్తుతూ అరిచేస్తూ గోలగోల చేసేది. ఎదుటివారిని మాట్లాడనీయకుండా తను చెప్పాలనుకున్న విషయాలను ముక్కుసూటిగా బల్లగుద్ది చెప్పేది. నామినేషన్స్‌లో ఓ రేంజ్లో విరుచుకుపడే మిత్ర తర్వాత మాత్రం అసలు ఎపిసోడ్లో ఎక్కడో ఓ చోట కనిపించేది. ఓపక్క గొడవపడుతూనే మళ్లీ వారితో సఖ్యతగా ఉండటానికి ప్రవర్తించేది. షో ప్రారంభంలో అయితే నోరు తెరిచి మాట్లాడేదే కాదు. తన అభిప్రాయాలను టిష్యూ పేపర్ల మీద రాసి వెల్లడించేది. ఈ ప్రవర్తనను అందరూ తప్పు పట్టడంతో అప్పటి నుంచి తన రూటు మార్చుకుంది. తనవరకు గేమ్‌లో బాగానే కష్టపడేది కానీ ఇతర హౌస్మేట్స్ నుంచి ఆమెకు ఎలాంటి సపోర్ట్ లభించేది కాదు. దీంతో ఎప్పుడూ తాను ఒంటరిని అని ఎక్కువగా ఫీల్ అయ్యేది. మొత్తానికి టాప్ 5లో చోటు దక్కించుకున్న మిత్ర తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఓ అమ్మాయిగా బిందు గెలిచినందుకు సంతోషంగా ఉందంది. తన నామినేషన్స్ జనాలకు బాగా నచ్చాయని, కాబట్టి తనకు మళ్లీ ఆఫర్ వస్తే ఆరో సీజన్‌కి తప్పకుండా వెళ్తానంది. మరి నిజంగానే బిగ్‌బాస్ ఆరో సీజన్‌కు మిత్రకు పిలుపొస్తుందా? నెక్స్ట్ సీజన్లో మరోసారి మిత్రను బిగ్‌బాస్ హౌస్‌లో చూస్తామా? అన్నది వేచి చూడాలి! చదవండి 👉🏾 బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విన్నర్ ఎన్ని లక్షలు గెలుచుకుందో తెలుసా? నటితో ఎఫైర్ పెట్టుకో, ఫేమస్ చేస్తామన్నారు -
ఆ కంటెస్టెంట్ వల్లే నాకు టైటిల్ దక్కింది: బిందు మాధవి
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విన్నర్‌గా బిందు మాధవి రికార్డు సృష్టించింది.టైటిల్ రేసులో ఉన్న అఖిల్ సార్థక్ నుంచి గట్టి పోటీ ఎదురైనా చివరికి బిందు మాధవి టైటిల్ విన్నర్‌గా నిలిచింది. తెలుగు బిగ్‌బాస్ చరిత్రలోనే తొలి లేడీ విన్నర్‌గా నిలిచి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ట్రోఫీతో పాటు రూ. 40లక్షల క్యాష్ ప్రైజ్‌ను సైతం సొంతం చేసుకుంది. 'మస్తీ' హ్యాష్ ట్యాగ్‌తో ఎంట్రీ ఇచ్చి 'ఆడపులి' అనే హ్యాష్ ట్యాగ్‌తో బయటికొచ్చింది. అనంతరం బిగ్‌బాస్ బజ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిందు మాధవి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. బిగ్‌బాస్ టైటిల్ గెలవడం తన మొదటి విజయంగా భావిస్తున్నానని, ఇప్పటి నుంచి ఇక విజయవంతంగా ముందుకు వెళ్తానని అనుకుంటున్నట్లు పేర్కొంది. ఇప్పుడు విన్నర్ అయ్యావ్ కానీ, ఒకసారి కూడా కెప్టెన్ ఎందుకు అవ్వలేదు అని యాంకర్ అడగ్గా అది తనకు కూడా తెలియదని చెప్పింది. హౌస్‌లో మోస్ట్ ఇరిటేటింగ్ కంటెస్టెంట్ ఎవరు అని అడగ్గా ఏమాత్రం తడుముకోకుండా వెంటనే నటరాజ్ మాస్టర్ అని తెలిపింది. ఈ సీజన్లో పలానా కంటెస్టెంట్ ఉన్నపపుడు నేను ఈ సీజన్‌కి రావాల్సింది లేకుండే అని ఎవరిని చూస్తే అనిపించింది?అని అడగ్గా వారి వళ్లే తనకీ టైటిల్ దక్కిందంటూ చెప్పుకొచ్చింది. చివరగా విన్నింగ్ మూమెంట్లో గెలుస్తానో, లేదో అని చాలా కన్ఫ్యూజన్లో ఉన్నానని బిందు పేర్కొంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట చక్కర్లు కొడుతుంది. -
బిందుమాధవి గెల్చుకున్న ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?
బిగ్‌బాస్ షో... గంట ఎపిసోడ్ కోసం రోజంతా ఎదురుచూసేవాళ్లు ప్రేక్షకులు. వారి ఆసక్తిని అర్థం చేసుకుని బిగ్‌బాస్ ఓటీటీని ప్రవేశపెట్టారు. 24 గంటలు హౌస్‌లో ఏం జరిగిందో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసేయండంటూ బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షో మొదలుపెట్టారు. విచిత్రంగా బిగ్‌బాస్ షోలో లేనన్ని గొడవలు ఈ ఓటీటీలో చోటు చేసుకున్నాయి. ప్రేమలు, ఆప్యాయతల కంటే గొడవలతోనే కంటెస్టెంట్లు ఎక్కువగా ఫేమస్ అయ్యారు. ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీతో కలిపి ఈ ఓటీటీ మొదటి సీజన్లో మొత్తం 18 మంది పాల్గొన్నారు. వీరిలో అనిల్, అరియానా, అఖిల్, బిందు, శివ, మిత్ర, బాబా ఫినాలేకు చేరుకున్నారు. శనివారం గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ జరగ్గా నాగార్జున బిందును విన్నర్‌గా ప్రకటించాడు. అఖిల్ సార్థక్ రన్నర్‌గా నిలిచాడు. యాంకర్ శివ సెకండ్ రన్నరప్ స్థానానికి పరిమితమయ్యాడు. ఈ స్థానాలను ముందుగానే అంచనా వేసిన అరియానా రూ.10 లక్షల సూట్‌కేస్‌తో రేస్ నుంచి తప్పుకుంది. మరి విజేతగా నిలిచిన బిందుమాధవి ఎంత గెలుచుకుందో తెలుసా? అక్షరాలా రూ.40 లక్షలు. నిజానికి బిందుకు అరకోటి దక్కాలి. కానీ మధ్యలో అరియానా రూ.10 లక్షలున్న సూట్‌కేస్ చేజిక్కించుకోవడంతో దాన్ని ప్రైజ్‌మనీలో నుంచి తగ్గించారు. మొత్తానికి బిందు ప్రజల మనసుతో పాటు భారీ ప్రైజ్‌మనీ కూడా గెల్చుకుంది. ఊహించని గెలుపుతో ఉక్కిరిబిక్కిరి అయిన బిందు బిగ్‌బాస్ స్టేజీపై భావోద్వేగానికి లోనైంది. కొందరికి కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు కష్టపడితే సక్సెస్ వస్తుంది. కానీ చాలామందికి ఎన్నో సంవత్సరాలు కష్టపడితేనే విజయం వరిస్తుంది. అలా ఆలస్యంగా విజయాన్ని అందుకునే లేట్ బ్లూమర్స్‌కు నా గెలుపు అంకితం. నేను కూడా లేట్ బ్లూమర్నే. చాలా సంవత్సరాలు కష్టపడ్డ తర్వాత నాకు ఈ ట్రోఫీ వచ్చింది అని చెప్తూ ఎమోషనలైంది. చదవండి 👉🏾 నటితో ఎఫైర్ పెట్టుకో, ఫేమస్ చేస్తామన్నారు తెలుగు బిగ్‌బాస్ చరిత్రలోనే మొదటి మహిళా విజేతగా బిందు మాధవి.. -
తెలుగు బిగ్‌బాస్ చరిత్రలోనే మొదటి మహిళా విజేతగా బిందు మాధవి..
Bigg Boss Non Stop Telugu Winner Is Bindu Madhavi: తెలుగు నాట అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షో బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షో గ్రాండ్ ఫినాలే శనివారం (మే 20) సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమైంది. ఫిబ్రవరి 26న ప్రారంభమైన ఈ బిగ్ రియాల్టీ షోకు శనివారం (మే 20) శుభం కార్డు పలికారు. 83 రోజులు జరిగిన ఈ షోలో టాప్ 7 కంటెస్టెంట్స్‌గా బాబా భాస్కర్, అనీల్ రాథోడ్, మిత్రా శర్మ, అరియానా గ్లోరి, యాంకర్ శివ, అఖిల్ సార్థక్, బిందు మాధవి నిలిచారు. అనీల్ రాథోడ్, మిత్రా శర్మ, బాబా భాస్కర్ ఎలిమినేషన్ తర్వాత ఆట రసవత్తరంగా మారింది. అరియానా గ్లోరి రూ. 10 లక్షలతో బిగ్‌బాస్ నాన్‌స్టాప్ హౌజ్ నుంచి బయటకు వెళ్లింది. తర్వాత ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా యాంకర్ శివ బయటకు వెళ్లాడు. అనంతరం గోల్డెన్ బాక్స్‌తో హౌజ్‌లోకి వెళ్లిన నాగార్జున టాప్ 2 కంటెస్టెంట్స్ అయిన అఖిల్, బిందు మాధవి అనుభవాల గురించి అడిగి తెలుసుకన్నాడు. బిగ్‌బాస్ ఆదేశంతో వారిద్దరిని స్టేజ్‌పైకి తీసుకొచ్చాడు నాగార్జున. బిగ్‌బాస్ స్టేజ్‌పై ఫైనల్ విన్నర్‌గా బిందు మాధవిని ప్రకటించాడు నాగార్జున. దీంతో తెలుగు బిగ్‌బాస్ చరిత్రలోనే మొదటిసారిగా ఒక మహిళ గెలిచింది. తెలుగు బిగ్‌బాస్ తొలి మహిళా విజేతగా బిందు మాధవి నిలిచింది. దీంతో ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయింది బిందు. బిగ్‌బాస్ కప్ కొట్టాలన్న అఖిల్ ఆశలు మరోసారి అడియాశలే అయ్యాయి. -
బిగ్‌బాస్ నుంచి బయటకు అరియానా.. ఎంత గెలుచుకుందంటే ?
Bigg Boss Non Stop Telugu Grand Finale: Ariyana Came Out With 10 Lakhs: బిగ్‌బాస్ నాన్‌స్టాప్ గ్రాండ్ ఫినాలే నుంచి అనిల్, బాబా భాస్కర్, మిత్రా శర్మ బయటకు వచ్చాక డబ్బుల ఎపిసోడ్ రసవత్తరంగా మారింది. డబ్బుల బ్రీఫ్‌కేసుతో హౌజ్‌లోకి వెళ్లిన అనిల్ రావిపూడి, సునీల్ డబ్బులతో బేరం చేశారు. అఖిల్ కప్ కోసం వచ్చానని చెప్పగా, బిందు మాధవి తెలుగు ప్రేక్షకులకు దగ్గరవడానికే వచ్చానని తెలిపింది. అరియానా అయితే డబ్బు కోసమే వచ్చానని, ఒక ప్లాట్ కొనాలనే కోరికతోనే వచ్చానని వెల్లడించింది. తన ఆర్థిక కష్టాలని తీర్చుకునేందుకు, కప్పు కూడా కొట్టాలని ఉద్దేశ్యంతోనే వచ్చినట్లు శివ చెప్పుకొచ్చాడు. దీంతో డబ్బుల బేరం మొదలైంది. ఈ బేరంలో అందరు సైలెంట్‌గా ఉంటే అరియానా మాత్రం ఎంత డబ్బు ఉండొచ్చని, డబ్బు తీసుకునేందుకే ఉత్సాహాన్ని చూపించింది. కానీ అందులో ఎంత డబ్బు ఉందనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. అందులో లక్షల్లో డబ్బు ఉందని నాగార్జున మాటిచ్చిన తర్వాత అరియానా ఈ సూట్‌కేస్‌ను తీసుకుంది. సూట్‌కేస్‌తో స్టేజ్‌పైకి వచ్చిన అరియానాతో నాగార్జున, అనిల్, సునీల్ ఆట ఆడుకున్నారు. అందులో డబ్బు ఉందంటే ఎలా నమ్మావ్ అని బాంబు పేల్చారు. దీంతో అనిల్, సునీల్‌లను దొంగసచ్చినోళ్లను నమ్మి వ్చచానని అరియానా తిట్టేసింది. కొద్దిసేపు అరియానా అనిల్, సునీల్, నాగార్జున, బాబా భాస్కర్ ఆడుకున్నారు. చివరికి అందులో రూ. 10 లక్షలు ఉన్నాయని నాగార్జున చెప్పడంతో అరియానా ఊపిరి పీల్చుకుంది. -
డబ్బులు పట్టుకుని పోదామనుకున్నా: బాబా భాస్కర్
Bigg Boss Non Stop Telugu Grand Finale: బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షో గ్రాండ్ ఫినాలే జోరుగా ప్రారంభమైంది. ఈషోలో బాబా భాస్కర్ మాస్టర్ ప్రయాణం ముగిసిపోయింది. టాప్ 7 నుంచి అనిల్ రాథోడ్ ఎలిమినేట్ కాగా తర్వాత సత్యదేవ్ చేతుల మీదుగా బాబా బాస్కర్ ఎలిమినేట్ అయి బయటకు వచ్చేశాడు. బాబా మాస్టర్ స్టేజ్‌పైకి వస్తూనే ఆయన భార్య రేవతికి దండం పెట్టేశాడు. ఇది గమనించిన నాగార్జున భలే కవర్ చేస్తున్నావ్ కదా ? అన్నట్లుగా సెటైర్ వేశాడు. దీని తర్వాత బాబా మాస్టార్ తన అనుభూతి గురించి తెలిపాడు. ఈ సీజన్ కంటే ముందుగా వచ్చిన సీజన్ అనుభవం బాగుంది. అప్పుడు మాకేం తెలియదు. కానీ ఈ సీజన్‌కు వచ్చే సరికి అంత ఎగ్జైట్మెంట్ లేదు. బిగ్‌బాస్ గురించి అంతా తెలుసు కాబట్టి అలా అనిపించలేదు. అయితే ఈ షోకు రావడం ఆనందగా ఉంది. సీక్రెట్ రూమ్‌లో ఉండటం, ఎవిక్షన్ పాస్ రావడం అన్ని బాగున్నాయి. కానీ శ్రీకాంత్ లోపలకు వస్తాడేమో, డబ్బులు పట్టుకుని పోదామనుకున్నా. అలా జరగలేదు. అదొక్క అసంతృప్తి మాత్రమే ఉంది. తర్వాత విన్నర్ ఎవరు అవుతారని నాగార్జున అడగ్గా, ముందుగా బిందు అని సమాధానం ఇచ్చాడు బాబా మాస్టర్. తర్వాత మళ్లీ శివ, అఖిల్ పేర్లు చెప్పాడు. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు కావాలని అన్నట్లుగా తెలిపాడు. -
Bigg Boss Non Stop Telugu: మరోసారి అఖిల్‌కు దక్కని బిగ్‌బాస్ ట్రోఫీ.. ఈసారి రన్నరప్‌గా
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ గ్రాండ్ ఫినాలే చాలా గ్రాండ్‌గా ప్రారంభమైంది. సిటీమార్ పాటలతో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు నాగార్జున. హౌజ్‌లోకి వెళ్లేముందు టాప్ 7లో ఉన్న కంటెస్టెంట్స్ ఫ్యామిలీస్‌తో మాట్లాడాడు నాగార్జున. అనంతరం మిత్రకోసం వచ్చిన బాలాని మిత్రా శర్మని ఎలా పడేశావ్ అని అడగ్గా, మేం ఫ్రెండ్స్ మాత్రమే అన్నాడు. దీనికి వెనుక ఉన్న తేజస్వీ 'వీళ్లది మాత్రం ఫ్రెండ్షిప్ కాదు' అని చెప్పింది. ఇదిలా ఉంటే ముందుగా అనిల్‌ను ఎలిమినేట్ అయ్యాడు. తర్వాత స్టేజ్‌పైకి హీరో సత్యదేవ్ వచ్చాడు. సత్యదేవ్‌తో 'గాడ్సే' మూవీ తన తదితర సినిమా ప్రాజెక్ట్స్, ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడాడు నాగార్జున. తర్వాత హౌజ్‌లోపలికి వెళ్లి ఒకరిని ఎలిమినేట్ చేసి తీసుకురావల్సిందిగా సత్యదేవ్‌కు చెప్తాడు నాగ్. దీంతో హౌజ్‌లోకి వెళ్లిన సత్యదేవ్ బాబా మాస్టర్‌ను ఎలిమినేట్ చేసి స్టేజిపైకి తీసుకువస్తారు. అనంతరం స్టేజిపైకి వచ్చిన బాబా మాస్టర్‌తో నాగార్జున కొద్దిసేపు ముచ్చటించి పంపించివేశారు. అనంతరం మేజర్ టీమ్ వచ్చి స్టేజిపై సందడి చేసింది. ఇదివరకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌కు ఒక్కో అవార్డు ఇచ్చారు నాగార్జున. ఆర్జే చైతుకి కొకొనట్, అజయ్‌కు మిస్టర్ కూల్, నటరాజ్ మాస్టర్‌కు రింగ్ మాస్టర్ అవార్డ్స్ ప్రదానం చేశారు. అనంతరం హాజ్లో ఉన్నవారికి కూడా అవార్డ్స్ ఇచ్చారు. బిందు మాధవికి అడ్వకేట్ అవార్డు ఇచ్చారు. తర్వాత మిత్రా శర్మ ఎలిమినేట్ అయినట్లుగా నాగార్జున ప్రకటించాడు. మిత్ర ఎలిమినేషన్ తర్వాత 'ఎఫ్ 3' చిత్రబృందం వచ్చి సందడి చేసింది. సినిమా విశేషాలు, మాజీ కంటెస్టెంట్స్‌తో కబుర్లు చెబుతూ నవ్వించారు. తర్వాత హౌజ్‌లోకి ఒక సూట్‌కేస్ పట్టుకుని డైరెక్టర్ అనిల్ రావిపూడి, సునీల్ వెళ్తారు. లోపల ఉన్న కంటెస్టెంట్స్‌తో కొద్దిసేపు కబుర్లు చెబుతూ సందడి చేశారు. అనంతరం బిందు మాధవి, అఖిల్, అరియానా, శివను వారు బిగ్‌బాస్‌కు ఎందుకు వచ్చారు అని అడగ్గా ఒక్కొక్కరి గోల్ చెబుతూ వచ్చారు. తర్వాత అనిల్, సునిల్ తీసుకొచ్చిన సూట్‌కేస్‌ను అరియానా తీసుకుంది. సూట్‌కేస్‌తోపాటు అరియానాను స్టేజ్‌పైకి తీసుకొచ్చారు అనిల్, సునీల్. ఆ సూట్‌కేసులో రూ. 10 లక్షలు ఉన్నట్లు నాగార్జున తెలిపాడు. అరియానా రూ. 10 లక్షలు ఉన్న సూట్‌కేస్ తీసుకొని స్టేజ్‌పైనుంచి మాజీ కంటెస్టెంట్ల మధ్య కూర్చుంది. తర్వాత హీరోయిన్ మెహ్రీన్ తన సూపర్ డ్యాన్స్‌తో అలరించింది. అనంతరం మళ్లీ ఎలిమినేషన్ ప్రక్రియ మొదలుపెట్టాడు నాగార్జున. ఈ ఎలిమినేషన్లో యాంకర్ శివ బిగ్‌బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చాడు. అనంతరం గోల్డెన్ బాక్స్‌తో నాగార్జున హౌజ్‌లోపలికి వెళ్లాడు. బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ప్రయాణంలో అఖిల్, బిందు మాధవి అనుభవాలను అడిగి తెలుసుకున్నాడు నాగార్జున. తర్వాత వారిద్దరిని స్టేజ్‌పైకి తీసుకెళ్లాడు. తర్వాత బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విజేతగా బిందు మాధవిని ప్రకటించాడు నాగార్జున. రన్నరప్‌గా అఖిల్ నిలిచాడు. బిగ్‌బాస్ విన్నర్‌గా కప్ కొట్టాలని ఇదివరకు ప్రయత్నించి ఓడిపోయిన అఖిల్‌కు మరోసారి ట్రోఫి దక్కలేదు. ఇక తెలుగు బిగ్‌బాస్ చరిత్రలోనే మొదటి మహిళా విన్నర్‌గా బిందు మాధవి నిలిచింది. -
బిగ్‌బాస్ ఓటీటీ గ్రాండ్ ఫినాలే ప్రోమో వచ్చేసింది
బిగ్‌బాస్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న గ్రాండ్ ఫినాలేకు సమయం ఆసన్నమైంది. ప్రస్తుతం హౌస్‌లో బాబా భాస్కర్, అరియానా, అనిల్, మిత్ర శర్మ, అఖిల్, బిందు మాధవి, యాంకర్ శివ ఉన్నారు. ఇలా ఏడుగురు కంటెస్టెంట్లు ఫినాలేకు చేరుకోవడం తెలుగు బిగ్‌బాస్ చరిత్రలోనే ఇదే తొలిసారి. కాగా నేడు (మే 21) సాయంత్రం గ్రాండ్ ఫినాలే జరగనున్నట్లు హాట్‌స్టార్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ప్రోమో రిలీజ్ చేసింది. ఇందులో గ్రాండ్ ఫినాలేను మరింత హుషారెత్తించేందుకు వచ్చిన మేజర్, ఎఫ్ 3 సినిమా టీమ్స్ స్టేజీపై సందడి చేశాయి. బిగ్‌బాస్ ఓటీటీలో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు సైతం స్టేజీపై సందడి చేశారు. స్పెషల్ గెస్ట్‌గా వచ్చిన అనిల్ రావిపూడి ఓ సూట్‌కేసుతో బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లాడు. అంటే హౌస్‌లో ఉన్న ఏడుగురిలో ఎవరో ఒకరు ఆ సూట్‌కేసును తీసుకునే అవకాశాలున్నాయి. అయితే పది లక్షల వరకు డబ్బున్న ఆ సూట్‌కేసును అరియానా గ్లోరీ ఎగరేసుకుపోయిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా బిగ్‌బాస్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక అమ్మాయి టైటిల్ సొంతం చేసుకుందంటూ నెట్టింట బిందుమాధవికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈసారి ఎలాగైనా ట్రోఫీ సొంతం చేసుకోవాలన్న అఖిల్ ఆశలు అడియాశలయ్యాయని మరోసారి అతడు రన్నరప్‌గా నిలిచినట్లు తెలుస్తోంది. ఈ గ్రాండ్ ఫినాలే సాయంత్రం ఆరు గంటల నుంచి ప్రసారం కానుంది. చదవండి 👉🏾 గుట్కా యాడ్ ఎఫెక్ట్: నలుగురు స్టార్ హీరోలపై కేసు ఆ నటిని పెళ్లాడనున్న రష్మిక మందన్నా మాజీ ప్రియుడు -
Bigg Boss OTT: 10 లక్షల సూట్‌కేస్‌తో తప్పుకున్న అరియానా!
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విన్నర్ ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. గత సీజన్ల కంటే భిన్నంగా ఏడుగురు కంటెస్టెంట్లతో గ్రాండ్ ఫినాలేకి చేరుకున్న బిగ్‌బాస్ చివరి మజిలీకి చేరుకుంది. బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే అప్డేట్స్ అప్పుడే సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. నెట్టింట లీక్ అవుతున్న సమాచారం ప్రకారం.. బిందు మాధవి బిగ్‌బాస్ నాన్‌స్టాప్ టైటిల్ విన్నర్‌గా నిలిచింది. దీంతో ఈసారైనా విన్నర్ అవ్వాలన్నా అఖిల్ కల కలగానే మిగిలిపోయింది. బిగ్‌బాస్ చరిత్రలోనే తొలిసారి ఒక అమ్మాయి టైటిల్ విన్నర్‌గా నిలవడం బిందుకే సాధ్యమైంది. ఆడపులి హ్యాష్‌ట్యాగ్‌తో ఫేమస్ అయిన బిందు ఓటీటీ విన్నర్‌గా నిలిచి సత్తా చాటింది. కాగా ఈ సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన బాబా మాస్టర్ టాప్7 స్థానంలో నిలవగా, అనిల్ 6వ స్థానంలో నిలిచారు. ఆ తర్వాత మిత్రా, అరియానా గ్లోరీ, శివ వరుసగా టాప్- 3 స్థానాల్లో నిలిచినట్లు టాక్ వినిపిస్తుంది. టాప్-4లో ఉన్న కంటెస్టెంట్లకు నాగార్జున డబ్బులు ఆఫర్ చేయగా అరియానా గ్లోరీ 10 లక్షల బ్రీఫ్ కేసును తీసుకొని టైటిల్ రేసు నుంచి స్వయంగా తప్పుకుంది. ఆ తర్వాత టాప్-3లో ఉండగా మరోసారి డబ్బులు ఆఫర్ చేయగా, శివ, బిందు, అఖిల్ ఆ ఆఫర్‌ను తిరస్కరించారు.ఫైనల్‌గా బిందు, అఖిల్‌కి మధ్య జరిగిన రేస్‌లో బిందు విజేతగా నిలిచినట్లు తెలుస్తుంది. దీంతో సోషల్ మీడియా వేదికగా బిందుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. -
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విన్నర్‌గా ఆడపులి! చరిత్ర సృష్టించిన బిందు!
బుల్లితెర హిట్ షో బిగ్‌బాస్‌ను అభిమానించేవాళ్లు ఎంతోమంది. సాధారణ ప్రేక్షకులే కాదు పలువురు సెలబ్రిటీలు సైతం ఈ షోను ఫాలో అవుతుంటారు. గత సీజన్లలో గ్రాండ్ ఫినాలేకు వచ్చిన పలువురూ ఇదే మాట చెప్పారు. ఇక వెండితెరపై రాణించాలనుకునేవాళ్లు, జనాల మనసులు గెల్చుకోవాలనుకునేవాళ్లు, ఆర్థిక సమస్యలు చక్కదిద్దుకోవాలనుకునేవాళ్లు ఈ షోకు రావాలని తహతహలాడుతుంటారు. ఆల్రెడీ ఫేమస్ అయిన వాళ్లనే కాకుండా ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని ముఖాలను కూడా తీసుకువచ్చి వారికి పాపులారిటీ, అవకాశాలను తెచ్చిపెట్టిందీ షో. తెలుగులో ఐదు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ ఈసారి నాన్‌స్టాప్ పేరిట ఓటీటీలో హడావుడి చేసింది. 17 మంది కంటెస్టెంట్లతో ఫిబ్రవరి 26న మొదలైన ఈ షోకు ఈవారంతో శుభంకార్డు పడనుంది. ప్రస్తుతం హౌస్‌లో ఏడుగురు ఉన్నారు. గతంలో ఐదుగురు మాత్రమే ఫినాలేకు చేరుకునే అవకాశం ఉండేది. కానీ ఈసారి ఏకంగా ఏడుగురు ఫినాలేలో అడుగుపెట్టడం విశేషమనే చెప్పాలి. అనిల్, బిందు, అఖిల్, బాబా భాస్కర్, మిత్ర, శివ, అరియానా ఫినాలే వీక్‌లో అడుగుపెట్టారు. వీరిలో టైటిల్ ఎవరి సొంతం అవుతుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే అప్పుడే బిగ్‌బాస్ విన్నర్‌గా బిందుమాధవి నిలిచిందంటూ ప్రచారం జరుగుతోంది. అఖిల్‌ను వెనక్కు నెట్టి ఆడపులి బిందు టైటిల్ ఎగరేసుకుపోయిందంటూ #BinduTheSensation, #BinduMadhavi అన్న హ్యాష్‌ట్యాగ్‌లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. తెలుగు బిగ్‌బాస్ చరిత్రలోనే తొలిసారిగా ఒక అమ్మాయి గెలిచిందంటూ ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బిగ్‌బాస్ అంటే కేవలం ఫిజికల్ టాస్కులే కాదని వ్యక్తిత్వానికి కూడా సంబంధించిందన్న విషయాన్ని అభిజిత్ నిరూపించాడు. ఇప్పుడు బిందు తన విజయంతో మరోసారి చాటిచెప్పింది అని కామెంట్లు చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం.. బిందు విన్నర్‌గా, అఖిల్ సార్థక్ రన్నర్‌గా నిలిచినట్లు తెలుస్తోంది. మిత్ర శర్మ మూడో స్థానంలో ఉండగా యాంకర్ శివ నాలుగో స్థానంలో, అరియానా ఐదో స్థానంలో ఉన్నారట. ఇప్పటికే బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ఫినాలే షూట్ కావడంతో ఈ లీకులు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాలంటే నాగార్జున అధికారికంగా ప్రకటించేవరకు వేచి చూడాల్సిందే! చదవండి 👇 తప్పు చేస్తే రోడ్డు మీద నిలబెట్టి కొట్టండి, అంతేకానీ.. విడాకుల బాటలో బాలీవుడ్ దంపతులు! -
బిగ్‌బాస్ తెలుగు నాన్‌స్టాప్‌లో పాయల్ సపోర్ట్ ఎవరికో తెలుసా?
Bigg Boss Telugu OTT: బుల్లితెరపై ఎంతో ఆదరణ పొందిచి రియాలిటీ షో బిగ్‌బాస్. తెలుగులో ఇప్పటికే 5 సీజన్లు పూర్తి చేసుకున్న ఈషో ఓటీటీలోకి కూడా అడుగు పెట్టింది. తొలిసారి ఈ సో బిగ్‌బాస్ ఓటీటీ నాన్‌స్టాప్ పేరుతో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతుంది. ఓటీటీలో ప్రసారం అవుతున్న ఈ షోకి కూడా మంచి ప్రేక్షక ఆదరణ లభించింది. ప్రస్తుతం ఈ షో చివరి వారానికి చేరుకుంది. బిగ్‌బాస్ ఓటీటీ తొలి సీజన్ టైటిల్‌ను సొంతం చేసుకునేదెవరో తెలిసేందుకు ఇంకా కొద్ది రోజులే మిగిలి ఉన్నాయి. దీంతో హౌజ్‌లోని కంటెస్టెంట్స్ అంతా ఒకరికి ఒకరు గట్టి పోటీ ఇచ్చుకుంటున్నారు. చదవండి: Bigg Boss Non Stop: బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే, అసలైన పోటీ ఆ ఇద్దరి మధ్యే! ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో తన సపోర్ట్ ఎవరికో బయటపెట్టింది ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. ప్రస్తుతం బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌజ్‌లో బిందు మాధవి, అఖిల్, అరియానా, బాబా భాస్కర్ మాస్టర్, యాంకర్ శివ, మిత్రా శర్మ ఉన్నారు. ఇక శనివారం లోపు టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరూ అనేదానిపై క్లారిటీ కూడా వచ్చేస్తుంది. అయితే ఇదే సమయంలో బయట ఉన్న ఫ్యాన్స్ తమకు నచ్చిన కంటెస్టెంట్స్‌కు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. తాజాగా నటి పాయల్ రాజ్‌పుత్ కూడా సోషల్ మీడియా వేదికగా బిందు మాధవికి తన మద్దతు తెలిపింది. చదవండి: సర్కారు వారి పాట విజయంపై సూపర్ స్టార్ కృష్ణ స్పందన బిందు మాధవికి ఓటు వేసి గెలిపించాలని తన ఫాలోవర్స్‌ను కోరింది. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో బిందు ఫొటోను షేర్ చేస్తూ.. ‘నువ్వు టైటిల్ గెలవడానికి అర్హురాలివి’ అంటూ బిందుకు సపోర్ట్ చేసింది పాయల్. అయితే ఇప్పటివరకు బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో ఓ అమ్మాయి టైటిల్ గెలవలేదు. అయితే బిగ్ బాస్ నాన్ స్టాప్‌లో ట్రోఫీ గెలుచుకునే రేసులో ముందంజలో ఉంది బిందు మాధవి. తన ఆటతీరుతో పాటు బిందు మాధవికి సంబంధించిన ఎన్నో అంశాలు ప్రేక్షకులను ఫిదా చేసేస్తున్నాయి. అందుకే టాప్ 5లో బిందు ఉండాలని చాలామంది కోరుకుంటున్నారు. -
బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే.. టైటిల్ గెల్చుకునేదెవరో?
బిగ్‌బాస్ షో అంటే ఇష్టపడేవాళ్లే కాదు, ఇష్టపడనివాళ్లు కూడా ఉంటారు. బిగ్‌బాస్ కాన్సెప్ట్‌ను తిట్టిపోస్తూనే తీరా సమయానికి షో చూసి ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఎవరేమన్నా బుల్లితెర ఆడియన్స్ మాత్రం బిగ్‌బాస్ షోను విపరీతంగా ఆదరిస్తారు. తెలుగులో ఇప్పటివరకు ఐదు సీజన్లను ప్రేక్షకులు విజయవంతం చేశారు. ఈ ధైర్యంతో నిర్వాహకులు బిగ్‌బాస్ ఓటీటీని కూడా ముందుకు తీసుకువచ్చారు. కాకపోతే ఇది ఫ్యామిలీ అంతా చూడటానికి వీల్లేకుండా టీవీలోకి బదులుగా హాట్‌స్టార్ యాప్‌కు మాత్రమే పరిమితమైంది. అయినా సరే ఓటీటీలో ప్రయోగాత్మకంగా మొదలుపెట్టిన బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విజయవంతంగా చివరిదశకు చేరుకుంది. 17 మందితో మొదలైన ఈ షోలో మధ్యలో ఓ వైల్డ్‌కార్డ్ ఎంట్రీ కూడా చేరడంతో మొత్తం కంటెస్టెంట్ల సంఖ్య 18కి చేరుకుంది. ఇప్పటివరకు శ్రీరాపాక, చైతూ, సరయు, తేజస్వి, ముమైత్ ఖాన్, స్రవంతి, మహేశ్, అజయ్, హమీదా, అషూ, నటరాజ్ వరసగా ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌస్‌లో అరియానా, అనిల్, మిత్ర, శివ, బిందు మాధవి, అఖిల్, బాబా భాస్కర్ మిగిలారు. ఈ టాప్ 7లో నుంచి ఒకరు వారం మధ్యలోనే హౌస్‌ను వీడే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. దీంతో మిగిలిన ఆరుగురు ఫినాలేలో అడుగుపెడతారు. ఒకవేళ ఇదే నిజమైతే ఆరుగురు కంటెస్టెంట్లు ఫినాలేకు చేరుకోవడం ఇదే మొదటిసారవుతుంది. అయితే ఎప్పటిలా ఈసారి వార్ వన్‌సైడ్ అయిపోలేదు. అఖిల్ సార్థక్, బిందుమాధవి మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. ఎలాగైనా ఈసారి టైటిల్ గెలవాలని కసిగా ఆడిన అఖిల్‌కు అతడి అభిమానులు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. హౌస్‌మేట్స్‌ను ఓ కబడ్డీ ఆడుకున్న బిందుమాధవి ధైర్యానికి ముగ్ధులైపోయిన ఫ్యాన్స్ ఆమెను ఎలాగైనా గెలిపించాలని తాపత్రయపడుతున్నారు. ఈరోజుతో ఓటింగ్ ముగియనుండటంతో ఇరువురి ఫ్యాన్స్ వీలైనన్ని ఓట్లు గుద్దుతున్నారు. ఇక గురు, శుక్రవారాల్లో గ్రాండ్ ఫినాలే షూటింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది. మరి ఫినాలే ఎపిసోడ్ కూడా రెండు రోజులు ప్రసారం చేస్తారేమో చూడాలి! చదవండి: కరాటే కల్యాణితో దెబ్బలు తిన్న యూట్యూబర్‌కు బిగ్‌బాస్ 6 సీజన్లో ఆఫర్ -
బిగ్‌బాస్ ఓటీటీ: రవిపై ఫైర్ అయిన నటరాజ్ మాస్టర్?
Nataraj Master Bigg Boss Buzz Interview After Elimination: బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ చివరి దశకు చేరుకుంది. టైటిల్‌ను గెలిచేందుకు హౌజ్‌మేట్స్ గట్టిగా పోటీ పడుతున్నారు. ఇక గతవారం హౌస్మేట్స్ అందరూ నామినేషన్లో ఉన్నారు. బిందు, అఖిల్, బాబా బాస్కర్, నటరాజ్ మాస్టర్, ఆరియాన గ్లోరీ, మిత్ర, అనిల్, యాంకర్ శివ నామినేషన్‌ల్లో ఉండగా ఇందులో తక్కువ ఒట్స్ వచ్చిన నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యి హౌజ్న వీడాడు. ఎలిమినేషన్ అనంతరం నటరాజ్ మాస్టర్ బిగ్‌బాస్ బజ్ ఎపిసోడ్లో యాంకర్ రవితో ముచ్చటించాడు. ఇందుకు సంబంధించిన ప్రోమోను తాజాగా డిస్ని ప్లస్ హాట్‌స్టార్ రిలీజ్ చేసింది. చదవండి: చిక్కుల్లో కరాటే కల్యాణి, చిన్నారి దత్తతపై నోటీసులు ఇక వచ్చి రాగానే ‘నా రాక కోసం ఎదురు చూస్తున్నావా?’ అని రవికి కౌంటర్ ఇచ్చాడు మాస్టర్. తాను ఒక్కడినే అనుకుంటే మీ తప్పు అంటూ రవి రీకౌంటర్ ఇచ్చాడు. అనంతరం ఒకరి వల్ల మధ్యలోనే ఇంటి నుంచి బయటకు వచ్చాననడంతో అంతా నెగిటివి ఎందుకు మాస్టర్ అని రవి అంటాడు. ఆ తర్వాత చెన్నై.. తమిళ్.. చేసుకుని వెళ్లిపోతారు అనే నటరాజ్ వ్యాఖ్యలను రవి తప్పబట్టినట్లు కనిపించాడు. దీనికి మాస్టర్ దానికి కూడా క్లారిటీ ఇస్తా అంటాడు. ఆ తర్వాత మాస్టర్ తనకు ఒక సక్సెస్ అనేది రాలేదడంతో.. టాలెంట్‌కి బౌండరీస్ లేవు అంటాడు రవి. అనంతరం ‘నువ్వు ఏదో లోపల పెట్టుకుని ఒక పాయింట్స్ రాసుకుని నా మీద అటాక్ చేస్తున్నావ్ ప్రతి పాయింట్ అర్థమవుతుంది’ అని రవిపై ఫైర్ అయ్యాడు మాస్టర్. ఇలా ఇద్దరి మధ్య సంభాషణ కాస్తా ఘాటూగానే సాగింది. ఆ తర్వాత ఇంత క్రుయల్గా ఏ అమ్మాయిని చూడలేదని, ఆమె తీసే పాయింట్స్ అంటూ నటరాజ్ మాస్టర్ అంటుండగా ఈ రోజు బిందు పాయింట్స్ తీసింది కాబట్టే తనకు.. ఆడియాన్స్‌కి బిందు లోపట ఉండాలని ఓట్ వేశారు అంటాడు రవి. ఆ వెంటనే శకుని అనే ఓ నెగిటివ్ క్యారెక్టర్ ఒక అమ్మాయికి పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని అడగ్గా.. ఆడించేది ఎవరు మహా భారతంలో శకుని.. బిగ్‌బాస్‌లో ఆ ఇద్దరి ఆడిస్తున్నావంటే నువ్వు శకునే కదా అని సమాధానం ఇస్తాడు మాస్టర్. చదవండి: త్వరలో పెళ్లి.. అంతలోనే బ్యాడ్‌న్యూస్ చెప్పిన పాప్ సింగర్ ఇక ఆరియానకు ఇంటి డబ్బులు వచ్చాయి ఇంటికి పంపించేయండనం ఏంటని అన్నదానికి.. బిడ్డ మీద ఒట్టు వేయమంటే గేమ్ అయిన వదిలేస్తాను కానీ ఒట్టు వేయను అంటాడు నటరాజ్ మాస్టర్. ఇక నువ్వు బాగానే ప్రిపేర్ అయ్యిన్నావ్ అర్థమైందంటూ రవిపై మాస్టర్ సటైరికల్ కామెంట్స్ చేస్తాడు. దీనికి రవి తాను చాలా బెటర్‌గా మాట్లాడుతున్నానని, బయటకు వెళ్లి చూస్తే మీరు చాలా బాధపడతారని సమాధానం ఇవ్వడం ఆసక్తి నెలకొంది. ఈ ఇంటర్య్వూలో రవి నటరాజ్ మాస్టర్రను ఎలాంటి ప్రశ్నలతో ఇబ్బంది పెట్టాడు.. నటరాజ్ మాస్టర్ ఎందుకు ఇంత అసహనానికి లోనయ్యాడనేది తెలియాంటే ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే. -
కరాటే కల్యాణితో పెట్టుకున్నాడు, బిగ్‌బాస్ ఛాన్స్ పట్టేశాడు!
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ముగింపుకు వచ్చేసింది. అఖిల్ సార్థక్, బిందు మాధవిలలో ఎవరు ఒకరు టైటిల్ ఎగరేసుకుపోనున్నారు. టాప్ 5కి చేరుకునేవారిలో నుంచి కొందరిని బిగ్‌బాస్ ఆరో సీజన్‌కు సైతం తీసుకోనున్నారు. ఆ జాబితాలో జనాలను ఎంటర్టైన్ చేసే యాంకర్ శివ తప్పకుండా ఉండే అవకాశముంది. అలాగే ఆరో సీజన్ కోసం ఇప్పటినుంచే కంటెస్టెంట్ల ఎంపిక మొదలైంది. బిగ్‌బాస్ టీమ్ రోషన్, మంజూష అనే మరో ఇద్దరు యాంకర్లను సైతం సంప్రదించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా ఓ యూట్యూబర్ బిగ్‌బాస్‌లోకి వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రాంక్ వీడియోలతో పాపులర్ అయిన శ్రీకాంత్ రెడ్డి బిగ్‌బాస్ ఆరో సీజన్లో పాల్గొనే అవకాశాలున్నట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి. మరి ఇదెంతవరకు నిజం? ఒకవేళ పిలుపు వస్తే నిజంగానే బిగ్‌బాస్ హౌస్‌కి వెళ్తాడా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. కాగా బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ కరాటే కల్యాణితో గొడవతో కొద్దిరోజులుగా అతడు వార్తల్లో నిలుస్తున్నాడు. ప్రాంక్ వీడియోల పేరుతో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ యువతను చెడుదోవ పట్టిస్తున్నాడని కరాటే కల్యాణి శ్రీకాంత్ రెడ్డి ఇంటివద్దకు వెళ్లి అతడిని చితకబాదింది. దీంతో అతడు కూడా కల్యాణిపై చేయిచేసుకున్నాడు. పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడంతో ఇరువురిపై కేసులు నమోదవగా పోలీసులు విచారణ చేపట్టారు. చదవండి: కరాటే కల్యాణి ఎక్కడికి వెళ్లింది..? ఎప్పుడు వస్తుంది..? హీరోయిన్ సీమంతం ఫంక్షన్, ఫొటోలు వైరల్ -
మిత్రా శర్మను మెచ్చుకున్న జీవిత, రాజశేఖర్..
Bigg Boss Non Stop Telugu OTT: Mithra Sharma Will Top 5 Contestants: బిగ్‌బాస్ నాన్‌స్టాప్ రియాలిటీ షో మరింత రసవత్తరంగా మారనుంది. హౌజ్ కంటెస్టెంట్స్ అందరూ టాప్ 5లో చేరండంపైనే దృష్టి పెట్టారు. ఇంటి సభ్యుల్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకున్న వాళ్లలో మిత్రా శర్మ ఒకరు. సాధారణంగా కంటెస్టెంట్‌గా చేరిన మిత్రా శర్మ ఇంటి సభ్యులకు మంచి పోటీ ఇస్తుంది. గత 70 రోజులకుపైగా జరిగిన రియాలిటీ షోలో రకరకాల టాస్కుల్లో పార్టిస్పేట్ చేస్తూ పర్వాలేదనిపించింది. ప్రత్యర్థుల ఆరోపణలకు సరైనా సమాధానాలు చెబుతూ స్ట్రాంగ్ కంటెస్టెంట్లో ఒకరిగా మారింది. అంతేకాకుండా ఇటీవల ఇంటిలోకి అతిథులుగా వచ్చిన సినీ తారలు, సెలబ్రిటీల ప్రశంసలు కూడా అందుకుంది. శేఖర్ సినిమా ప్రమోషన్స్ కోసం హీరో రాజశేఖర్, ఆయన సతీమణి, దర్శకురాలు జీవిత బిగ్‌బాస్ ఇంటిలోకి అడుగుపెట్టారు. అయితే కంటెస్టెంట్లకు రకరకాల టాస్క్‌లు ఇస్తూ.. వారిలోని ప్రతిభను వెలికి తీసే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ.. ఒక యాక్టింగ్ స్కూల్లో సీటు వస్తే ఎలా స్పందిస్తారు.. సీటు రాకపోతే ఎలా ఫీలవుతారు అనే థీమ్ ఆధారంగా నటించి చూపమన్నారు. దీంతో తనదైన శైలిలో రకరకాల భావాలు పలికిస్తూ నటించి చూపించింది మిత్రా శర్మ. ఓ దశలో భావోద్వేగంతో మిత్రా శర్మ నటించి చూపించిన తీరు చూసి జీవిత, రాజశేఖర్ మాత్రమే కాకుండా ఇంటి సభ్యులు కూడా ఎమోషనల్ అయ్యారు. అనంతరం మిత్రా శర్మను జీవిత, రాజశేఖర్ అభినందిస్తూ.. ఆమె నటనపై ప్రశంసలు కురిపించారు. ఇక ఆదివారం రోజున టాప్ 5 కంటెస్టెంట్లు ఎవరో తేలిపోనుంది. వారాంతంలో హోస్ట్ నాగార్జున వచ్చి తుదివారానికి, టైటిల్ రేసుకు పోటీపడే అభ్యర్థులను నిర్ణయిస్తారు. ఇలాంటి నేపథ్యంలో మిత్రా శర్మ టాప్ 5లో చోటు సంపాదించడానికి అన్ని అర్హతలను సాధించినట్లుగా తెలుస్తోంది. మరీ ఈ ఆదివారం ఏమవుతుందో వేచి చూడాలి. -
నటరాజ్ మాస్టర్‌కు కోలుకోలేని దెబ్బ, ఈ వారం అతడే ఎలిమినేట్!
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షోలో మరో ఎలిమినేషన్ జరగబోతోంది. 17 మందితో ప్రారంభమైన ఈ షోలో ఇప్పటివరకు 10 మంది ఎలిమినేట్ అయ్యారు. శ్రీరాపాక, చైతూ, సరయు, తేజస్వి, ముమైత్ ఖాన్, స్రవంతి, మహేశ్, అజయ్, హమీదా, అషూ వరుసగా ఎలిమినేట్ అయ్యారు. అయితే షో సగం దాకా వచ్చాక బాబా భాస్కర్ వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈమధ్య ఇచ్చిన టాస్క్‌లో ఎవిక్షన్ ఫ్రీ పాస్ కూడా గెలుచుకోవడంతో అతడు ఫినాలేలో అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఈ వారం హౌస్మేట్స్ అందరూ నామినేషన్లో ఉన్నారు. ఎప్పటిలాగే అఖిల్, బిందుకు పోటాపోటీగా ఓట్లు పడుతుండటంతో వీరు సేఫ్ జోన్లో ఉన్నారు. ఆ తర్వాత బాబా, శివకు సైతం భారీగానే ఓట్లు పడుతున్నాయి, కాబట్టి ఈ వారం వీళ్లు బయటకు వెళ్లే ప్రసక్తే లేదు. ఒకవేళ బాబా డేంజర్ జోన్లో ఉన్నా ఎవిక్షన్ ఫ్రీ పాస్ సాయంతో ఈజీగా గండం గట్టెక్కుతాడు. మిత్ర, అరియానా, అనిల్‌కు అంతంతమాత్రంగానే ఓట్లు వస్తున్నాయి. నటరాజ్ మాస్టర్‌కు అందరికంటే తక్కువ ఓట్లు పడ్డట్లు తెలుస్తోంది. దీంతో ఈ వారం నటరాజ్ మాస్టర్ ఇంటినుంచి బయటకు వెళ్లనున్నట్లు సమాచారం. మొదటి నుంచీ కష్టపడి ఆడుతూ వస్తున్న నటరాజ్ మాస్టర్ ఈ సీజన్లో ఫినాలేలో అడుగుపెట్టడం ఖాయం అనుకున్నారంతా! కానీ అనూహ్యంగా నామినేషన్స్‌లో బిందుతో, టాస్క్‌లో అఖిల్‌తో పెట్టుకుని నెగెటివిటీ మూటగట్టుకున్నాడు. ఫలితంగా అతడు పదకొండో వారంలోనే బిగ్‌బాస్ హౌస్‌కు వీడ్కోలు పలకబోతున్నాడు. చదవండి: ముగ్గురు ఖైదీలు తప్పించుకునేందుకు వేసిన ప్లాన్ -
నన్ను ఎక్కడ కొట్టకూడదో అక్కడ కొట్టావు, దేవుడున్నాడు
ఎంత కష్టపడ్డా ఫలితం రాకపోతే ఎవరికైనా ఆవేశం రాకమానదు. అందులోనూ బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షోలో మొదటి నుంచీ ఒంటరిగా పోరాడుతూ వస్తున్నాడు నటరాజ్ మాస్టర్. అవసరమైనప్పుడు తన ఫ్రెండ్స్‌కు సాయం కూడా చేశాడు. కానీ నిన్నటి టాస్క్‌లో మాత్రం తనకు బదులుగా అఖిల్ వేరొకరికి సాయం చేసి అతడిని గెలిపించడాన్ని తట్టుకోలేకపోయాడు. గెలుపు తథ్యం అనుకున్న సమయంలో ఓటమిపాలు కావడంతో భరించలేకపోయాడు. బాధపడ్డాడు, ఏడ్చేశాడు, ఆగ్రహించాడు. తాజాగా బిగ్‌బాస్ ఇచ్చిన బీబీ ఆవుల కొట్టం టాస్క్‌లో అఖిల్, నటరాజ్ మధ్య ఫైట్ జరిగింది. గేమ్‌లో నటరాజ్ తన చేయిని నెట్టేస్తుండటంతో అఖిల్ తన పాలన్నీ ఒలకబోసాడు. నీకు అత్యాశ ఎక్కువని ఫైర్ అయ్యాడు. దీనికి నటరాజ్ స్పందిస్తూ.. నన్ను ఎక్కడైతే కొట్టకూడదో అక్కడ కొట్టేశావు, దేవుడున్నాడు, నా కష్టానికి ఫలితం దక్కింది అని మాట్లాడాడు. నటరాజ్ మాటలను బట్టి అతడు ప్రేక్షకులను ఓట్లు అడిగే అవకాశాన్ని గెల్చినట్లు తెలుస్తోంది. మరి అఖిల్, నటరాజ్ మధ్య మాటల యుద్ధం ఎంతవరకు వెళ్లింది? వీళ్లు తిరిగి కలిసిపోయారా? లేదా? అన్నది తెలియాలంటే నేడు రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: ఆచార్య నుంచి ‘భలే భలే బంజారా’ ఫుల్ సాంగ్ అవుట్ సిరిని అర్థం చేసుకోవడం చాలా కష్టం: శ్రీహాన్ -
అఖిల్‌ని టార్గెట్ చేయడమేనా నీ గేమా? బిందుకు అనసూయ సూటి ప్రశ్న
వరుస గెస్టులతో బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షో జిగేలుమంటోంది. మొన్నటిదాకా బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ కంటెస్టెంట్లు హౌస్‌లోకి వచ్చి సందడి చేయగా ఆ తర్వాత అశోకవనంలో అర్జున కల్యాణం టీమ్ హౌస్‌ను ఓ ఊపు ఊపేసింది. తాజాగా ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ బిగ్‌బాస్ హౌస్‌లో అడుగు పెట్టింది. అయితే నవ్వడానికి, నవ్వించడానికో ఆమె రాలేదు. ప్రేక్షకుల మనసులో మెదులుతున్న ప్రశ్నలను తూటాల్లా వదిలేందుకు వచ్చింది. ఈ సందర్భంగా మొదట అరియానాకు ఆడియన్స్ రాసిన ప్రశ్నను వదిలింది. 'ఫ్యామిలీ వీక్ తర్వాత బిందుకు క్లోజ్ అయ్యావు. ఎందుకు వుమెన్ కార్డు వాడుతున్నావు? సడన్‌గా ఎందుకిలా మారిపోయావు?' అని ప్రశ్నించింది. దీంతో అరియానా ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక ఇందులో ఉమెన్ కార్డు అనిపించిందంటే అది మీకే వదిలేస్తున్నా అని బదులిచ్చింది. అనంతరం బిందును.. ఎప్పుడూ గ్రూప్ గేమ్స్ ఆడుతావు. కానీ అఖిల్ గ్రూప్ గేమ్స్ ఆడతాడని నిందిస్తావు. ఎందుకు? అని అడిగింది. అయితే బిందు మాత్రం ఎప్పుడూ గ్రూప్ గేమ్ ఆడలేదని కుండ బద్ధలు కొట్టింది. ఆ తర్వాత అఖిల్ వైపు తిరిగి.. వెకేషన్‌ను ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? గత వారం రోజులుగా బిందు గురించి నెగెటివ్‌గా మాట్లాడమే పనైపోయింది. కానీ ఫ్యామిలీ వీక్ తర్వాత బిందుతో మంచిగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నావు, ఎందుకు? అని అడిగింది. మరి దీనికి అఖిల్ ఏమని సమాధానం చెప్తాడో చూడాలి! ఆ తర్వాత శివ వైపు చూసి 'ఎలా అనిపిస్తోంది? అడిగే దగ్గర నుంచి అడిగించుకునే దాకా?' అని సరదాగా అనడంతో అక్కడున్నవారంతా ఘొల్లున నవ్వారు. చదవండి: ముంబైలో కళ్లు చెదిరే ఫ్లాట్ కొన్న బుల్లితెర నటుడు నరకం చూపించారు, బర్త్‌డే రోజే నా కూతుర్ని చంపేశారు: మోడల్ తల్లి