
సరయు పూర్తి పేరు సరయు రాయ్. నిన్నే పెళ్లాడతా సీరియల్‌లో నెగెటివ్ రోల్‌లో నటించింది. 7 ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్‌లో అడల్ట్ కామెడీ వీడియోలు చేస్తూ ఫేమస్ అయింది. బిగ్‌బాస్ ఐదో సీజన్‌లో 13వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన సరయు మొదటివారంలోనే ఎలిమినేట్ అయ్యింది. తన ఆటను చూడకుండా ఒక్కవారానికే ఎలా ఎలిమినేట్ చేస్తారని బాధపడిపోయిన సరయు మరోసారి బిగ్‌బాస్ షోలో అడుగుపెట్టింది. తనేంటో, తన పవరేంటో ఇప్పుడు చూపిస్తానంటోందీ భామ. హౌస్‌లో ఎలా మంటపెడతాన్నో చూడండి అంటూ ఫైర్ ట్యాగ్‌తో హౌస్‌లోకి వెళ్లింది సరయు. మరి ఆమె నోటిప్రవాహాన్ని ఇతర కంటెస్టెంట్లు తట్టుకోగలరా? ఆమె బూతుల దండకానికి ఆడియన్స్ ఓట్లు గుద్దుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది.