బిగ్‌బాస్ షోలో నామినేషన్స్, ఎలిమినేషన్స్ మనం ఊహించినట్లుగా ఉండవు. మరీ ముఖ్యంగా ఎలిమినేట్ అవుతారనుకున్న కంటెస్టెంట్లు ఎక్కువ వారాలు హౌస్‌లో కొనసాగుతే, ఫినాలేకు చేరుకునే సత్తా ఉన్న హౌస్‌మేట్స్ మధ్యలోనే వెనుదిరుగుతారు. ఇలాంటి అద్భుతాలు ఒక్క బిగ్‌బాస్‌లోనే జరుగుతాయి. తాజాగా బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ షోలో నుంచి మహేశ్ విట్టా ఎలిమినేట్ అయ్యాడు. అతడి స్థానంలో కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్‌ను హౌస్‌లోకి పంపించారు.
బాబాను ఇంట్లోకి పంపడం మంచి నిర్ణయమే కానీ చాలా ఆలస్యంగా దాన్ని అమలు చేశారు. అయితే గేమ్‌లో ప్రత్యర్థులకు టఫ్ కాంపిటీషన్ ఇస్తున్న మహేశ్‌ను ఎలిమినేట్ చేయడమే అస్సలు బాగోలేదంటున్నారు ఆయన ఫ్యాన్స్. తాజాగా సరయు సైతం ఇది అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అని అభిప్రాయపడింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో నేను నమ్మకం కోల్పోయాను. దేవుడా, అసలు నువ్వు నిజంగానే ఉన్నావా? ఇక్కడ జరిగేది గమనిస్తున్నావా? అంటూ భావోద్వేగానికి లోనైంది.
ఇతరులను బాధపెట్టడానికి ట్రోల్స్ చేస్తుంటారు. కానీ దానివల్ల వారి కుటుంబాలు నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది. మానసిక ఆరోగ్యం దెబ్బతిని డిప్రెషన్‌లోకి కూడా వెళ్తుంటారు అని అఖిల్ సార్థక్ తల్లి దుర్గ ఓ పోస్ట్ షేర్ చేసింది. దీనికి సరయు స్పందిస్తూ కరెక్ట్‌గా చెప్పారు ఆంటీ అంటూ ఆ పోస్ట్‌ను తిరిగి షేర్ చేసింది.
చదవండి: సమంత ఒంటిపై మూడు టాటూలు, పచ్చబొట్టు వేయించుకోవద్దంటున్న సామ్
Comments
Please login to add a commentAdd a comment