
బుల్లితెర బిగ్గెస్ట్ హిట్ షో బిగ్‌బాస్.. తెలుగులో విజయవంతంగా ఐదు సీజన్లు పూర్తి చేసుకుందీ రియాలిటీ షో. ఈ క్రమంలో హౌస్‌లో 24 గంటలు ఏం జరుగుతుందో చూడండంటూ లైవ్ స్ట్రీమింగ్‌తో ముందుకు వచ్చింది ఓటీటీ. బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ద్వారా కావాల్సినంత వినోదాన్ని పంచుతోంది. ఫిబ్రవరి 26న 17 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ షోలో ఇప్పటికే ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు. అందులో ముమైత్ ఖాన్, శ్రీరాపాక, ఆర్జే చైతూ ఉన్నారు.
తాజాగా నాలుగో కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యే సమయం ఆసన్నమైంది. ఈ క్రమంలో ఈ వారం సరయు హౌస్‌ను వీడనుందని ప్రచారం చేస్తున్నారు లీకువీరులు. ఇప్పటివరకు వారు చెప్పిందే నిజమవుతూ వచ్చింది కాబట్టి ఇది కూడా నిజమయ్యే అవకాశాలున్నాయి. నిజానికి నాలుగోవారం చాలెంజర్స్‌లో నుంచి ఒకరు ఎలిమినేట్ అవుతారనుకున్నారంతా. పెద్దగా పాపులారిటీ లేని అనిల్, మిత్ర శర్మలలో ఎవరో ఒకరు బయటకు వచ్చేయడం తథ్యం అని ఫిక్స్ అయ్యారు.
కానీ అంచనాలను తలకిందులు చేస్తూ చాలెంజర్స్‌లో నుంచి కాకుండా వారియర్స్‌లో నుంచి సరయు ఎలిమినేట్ అయిపోవడం కొంత ఆశ్చర్యకరమే! కాగా సరయు నాలుగో సీజన్‌లో ఎంట్రీ ఇచ్చి తొలి వారమే ఎలిమినేట్ అయింది. ఆమెకు మరోసారి ఓటీటీ నుంచి పిలుపు రావడంతో ఈసారి టాప్ 5లోకి అయినా చేరుకోవాలనుకుంది. కానీ నాలుగువారాలకే తిరుగుముఖం పట్టినట్లు కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment