
సండేను ఫండే చేసేందుకు నాగార్జున వచ్చేశాడు. కంటెస్టెంట్ల లెక్క సరిచేసేందుకు ఆయన రెడీ అయ్యాడు. దీనికంటే ముదు హీరోయిన్ శ్రద్ధా దాస్ స్టేజీపై చిందులేసి అలరించింది. ఆ తర్వాత ఎప్పటిలాగే హౌస్‌మేట్స్‌తోనూ డ్యాన్సులేయించాడు నాగ్. ఈ క్రమంలో అషూ, హమీదా రెచ్చిపోయి మరీ చిందేశారు. అనంతరం గతవారం జరిగిన మోస్ట్ ఇరిటేట్ పర్సన్ ఎవరన్న ఓటింగ్ ఫలితాలను అందరిముందు ప్రకటించాడు నాగ్. అందరూ అనుకున్నట్లుగా శివకు కాకుండా ఆర్జే చైతూకు ఎక్కువ ఓట్లు రావడం గమనార్హం.
అలాగే హౌస్‌లో మోస్ట్ ఫేక్ హౌస్ పర్సన్ ఎవరని చేపట్టిన ఓటింగ్ ఫలితాలను సైతం రివీల్ చేశాడు. అనంతరం సరయు తన మీద బాడీ షేమింగ్ జరిగిన విషయాన్ని నాగార్జునకు తెలిపింది. నేను నడుచుకుంటూ వస్తుంటే భూకంపం వచ్చినట్లు ఉందని అరియానా కామెంట్ చేసిందని చెప్పుకొచ్చింది. దీంతో అరియానా తనేమీ సీరియస్‌గా అనలేదని కవర్ చేసే ప్రయత్నం చేయగా నాగ్ వీడియో చూపించాడు. అందులో అరియానా తప్పు చేసినట్లు అడ్డంగా దొరికిపోవడంతో మారు మాట్లాడకుండా నిల్చుండిపోయింది.
ఇక అరియానా చేసింది తప్పా? ఒప్పా? అన్నదానిపై హౌస్‌మేట్స్ అభిప్రాయాలు తెలుసుకోనున్నాడు నాగ్. మరి కంటెస్టెంట్లు సరయు పక్కన నిలబడతారా? లేదంటే అరియానాకు మద్దతిస్తారా? అన్నది తెలియాలంటే రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే!
చదవండి: మేఘన్‌తో పడుకున్నానని చెప్తే రూ.50 లక్షలిస్తామని ఆఫర్!
Comments
Please login to add a commentAdd a comment