
Bigg Boss Non Stop Telugu Grand Finale: Ariyana Came Out With 10 Lakhs: బిగ్‌బాస్ నాన్‌స్టాప్ గ్రాండ్ ఫినాలే నుంచి అనిల్, బాబా భాస్కర్, మిత్రా శర్మ బయటకు వచ్చాక డబ్బుల ఎపిసోడ్ రసవత్తరంగా మారింది. డబ్బుల బ్రీఫ్‌కేసుతో హౌజ్‌లోకి వెళ్లిన అనిల్ రావిపూడి, సునీల్ డబ్బులతో బేరం చేశారు. అఖిల్ కప్ కోసం వచ్చానని చెప్పగా, బిందు మాధవి తెలుగు ప్రేక్షకులకు దగ్గరవడానికే వచ్చానని తెలిపింది. అరియానా అయితే డబ్బు కోసమే వచ్చానని, ఒక ప్లాట్ కొనాలనే కోరికతోనే వచ్చానని వెల్లడించింది. తన ఆర్థిక కష్టాలని తీర్చుకునేందుకు, కప్పు కూడా కొట్టాలని ఉద్దేశ్యంతోనే వచ్చినట్లు శివ చెప్పుకొచ్చాడు. దీంతో డబ్బుల బేరం మొదలైంది.
ఈ బేరంలో అందరు సైలెంట్‌గా ఉంటే అరియానా మాత్రం ఎంత డబ్బు ఉండొచ్చని, డబ్బు తీసుకునేందుకే ఉత్సాహాన్ని చూపించింది. కానీ అందులో ఎంత డబ్బు ఉందనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. అందులో లక్షల్లో డబ్బు ఉందని నాగార్జున మాటిచ్చిన తర్వాత అరియానా ఈ సూట్‌కేస్‌ను తీసుకుంది. సూట్‌కేస్‌తో స్టేజ్‌పైకి వచ్చిన అరియానాతో నాగార్జున, అనిల్, సునీల్ ఆట ఆడుకున్నారు. అందులో డబ్బు ఉందంటే ఎలా నమ్మావ్ అని బాంబు పేల్చారు. దీంతో అనిల్, సునీల్‌లను దొంగసచ్చినోళ్లను నమ్మి వ్చచానని అరియానా తిట్టేసింది. కొద్దిసేపు అరియానా అనిల్, సునీల్, నాగార్జున, బాబా భాస్కర్ ఆడుకున్నారు. చివరికి అందులో రూ. 10 లక్షలు ఉన్నాయని నాగార్జున చెప్పడంతో అరియానా ఊపిరి పీల్చుకుంది.
Comments
Please login to add a commentAdd a comment