Bigg Boss Non-Stop Telugu OTT Finale Live Updates in Telugu - Sakshi
Sakshi News home page

Bigg Boss Non Stop Telugu Grand Finale: బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ విజేతగా బిందు మాధవి..

Published Sat, May 21 2022 7:20 PM | Last Updated on Sun, May 22 2022 10:16 AM

Bigg Boss Non Stop Telugu Grand Finale Updates - Sakshi

బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ గ్రాండ్‌ ఫినాలే చాలా గ్రాండ్‌గా ప్రారంభమైంది. సిటీమార్‌ పాటలతో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు నాగార్జున. హౌజ్‌లోకి వెళ్లేముందు టాప్‌ 7లో ఉన్న కంటెస్టెంట్స్‌ ఫ్యామిలీస్‌తో మాట్లాడాడు నాగార్జున. అనంతరం మిత్రకోసం వచ్చిన బాలాని మిత్రా శర్మని ఎలా పడేశావ్‌ అని అడగ్గా, మేం ఫ్రెండ్స్‌ మాత్రమే అన్నాడు. దీనికి వెనుక ఉన్న తేజస్వీ 'వీళ్లది మాత్రం ఫ్రెండ్‌షిప్‌ కాదు' అని చెప్పింది. ఇదిలా ఉంటే ముందుగా అనిల్‌ను ఎలిమినేట్‌ అయ్యాడు. 

తర్వాత స్టేజ్‌పైకి హీరో సత్యదేవ్‌ వచ్చాడు. సత్యదేవ్‌తో 'గాడ‍్సే' మూవీ తన తదితర సినిమా ప్రాజెక్ట్స్, ఎక్స్‌పీరియన్స్‌ గురించి మాట్లాడాడు నాగార్జున. తర్వాత హౌజ్‌లోపలికి వెళ్లి ఒకరిని ఎలిమినేట్‌ చేసి తీసుకురావల్సిందిగా సత్యదేవ్‌కు చెప్తాడు నాగ్‌. దీంతో హౌజ్‌లోకి వెళ్లిన సత్యదేవ్‌ బాబా మాస్టర్‌ను ఎలిమినేట్‌ చేసి స్టేజిపైకి తీసుకువస్తారు. అనంతరం స్టేజిపైకి వచ్చిన బాబా మాస్టర్‌తో నాగార్జున కొద్దిసేపు ముచ్చటించి పంపించివేశారు. అనంతరం మేజర్‌ టీమ్ వచ్చి స్టేజిపై సందడి చేసింది.

ఇదివరకు ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్స్‌కు ఒక్కో అవార్డు ఇచ్చారు నాగార్జున. ఆర్జే చైతుకి కొకొనట్‌, అజయ్‌కు మిస్టర్‌ కూల్‌, నటరాజ్‌ మాస్టర్‌కు రింగ్‌ మాస్టర్‌ అవార్డ్స్‌ ప్రదానం చేశారు.   అనంతరం హాజ్‌లో ఉన్నవారికి కూడా అవార్డ్స్‌ ఇచ్చారు. బిందు మాధవికి అడ్వకేట్‌ అవార్డు ఇచ్చారు. తర్వాత మిత్రా శర్మ ఎలిమినేట్‌ అయినట్లుగా నాగార్జున ప్రకటించాడు.

మిత్ర ఎలిమినేషన్‌ తర్వాత 'ఎఫ్‌ 3' చిత్రబృందం వచ్చి సందడి చేసింది. సినిమా విశేషాలు, మాజీ కంటెస్టెంట్స్‌తో కబుర్లు చెబుతూ నవ్వించారు. తర్వాత హౌజ్‌లోకి ఒక సూట్‌కేస్‌ పట్టుకుని డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి, సునీల్‌ వెళ్తారు. లోపల ఉన్న కంటెస్టెంట్స్‌తో కొద్దిసేపు కబుర్లు చెబుతూ సందడి చేశారు. అనంతరం బిందు మాధవి, అఖిల్, అరియానా, శివను వారు బిగ్‌బాస్‌కు ఎందుకు వచ్చారు అని అడగ్గా ఒక్కొక్కరి గోల్‌ చెబుతూ వచ్చారు. తర్వాత అనిల్‌, సునిల్‌ తీసుకొచ్చిన సూట్‌కేస్‌ను అరియానా తీసుకుంది. సూట్‌కేస్‌తోపాటు అరియానాను స్టేజ్‌పైకి తీసుకొచ్చారు అనిల్, సునీల్. ఆ సూట్‌కేసులో రూ. 10 లక్షలు ఉన్నట్లు నాగార్జున తెలిపాడు. 

అరియానా రూ. 10 లక్షలు ఉన్న సూట్‌కేస్‌ తీసుకొని స్టేజ్‌పైనుంచి మాజీ కంటెస్టెంట్ల మధ్య కూర్చుంది. తర్వాత హీరోయిన్ మెహ్రీన్‌ తన సూపర్‌ డ్యాన్స్‌తో అలరించింది. అనంతరం మళ్లీ ఎలిమినేషన్ ప్రక్రియ మొదలుపెట్టాడు నాగార్జున. ఈ ఎలిమినేషన్‌లో యాంకర్ శివ బిగ్‌బాస్‌ హౌజ్‌ నుంచి బయటకు వచ్చాడు. అనంతరం గోల్డెన్ బాక్స్‌తో నాగార్జున హౌజ్‌లోపలికి వెళ్లాడు. బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ ప్రయాణంలో అఖిల్, బిందు మాధవి అనుభవాలను అడిగి తెలుసుకున్నాడు నాగార్జున. తర్వాత వారిద్దరిని స్టేజ్‌పైకి తీసుకెళ్లాడు. 

తర్వాత బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌ విజేతగా బిందు మాధవిని ప్రకటించాడు నాగార్జున. రన్నరప్‌గా అఖిల్‌ నిలిచాడు. బిగ్‌బాస్‌ విన్నర్‌గా కప్‌ కొట్టాలని ఇదివరకు ప్రయత్నించి ఓడిపోయిన అఖిల్‌కు మరోసారి ట్రోఫి దక్కలేదు. ఇక తెలుగు బిగ్‌బాస్‌ చరిత్రలోనే మొదటి మహిళా విన్నర్‌గా బిందు మాధవి నిలిచింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement