Bigg Boss Non Stop Telugu Winner Is Bindu Madhavi: తెలుగు నాట అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షో బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షో గ్రాండ్ ఫినాలే శనివారం (మే 20) సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమైంది. ఫిబ్రవరి 26న ప్రారంభమైన ఈ బిగ్ రియాల్టీ షోకు శనివారం (మే 20) శుభం కార్డు పలికారు. 83 రోజులు జరిగిన ఈ షోలో టాప్ 7 కంటెస్టెంట్స్‌గా బాబా భాస్కర్, అనీల్ రాథోడ్, మిత్రా శర్మ, అరియానా గ్లోరి, యాంకర్ శివ, అఖిల్ సార్థక్, బిందు మాధవి నిలిచారు. అనీల్ రాథోడ్, మిత్రా శర్మ, బాబా భాస్కర్ ఎలిమినేషన్ తర్వాత ఆట రసవత్తరంగా మారింది.
అరియానా గ్లోరి రూ. 10 లక్షలతో బిగ్‌బాస్ నాన్‌స్టాప్ హౌజ్ నుంచి బయటకు వెళ్లింది. తర్వాత ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా యాంకర్ శివ బయటకు వెళ్లాడు. అనంతరం గోల్డెన్ బాక్స్‌తో హౌజ్‌లోకి వెళ్లిన నాగార్జున టాప్ 2 కంటెస్టెంట్స్ అయిన అఖిల్, బిందు మాధవి అనుభవాల గురించి అడిగి తెలుసుకన్నాడు. బిగ్‌బాస్ ఆదేశంతో వారిద్దరిని స్టేజ్‌పైకి తీసుకొచ్చాడు నాగార్జున. బిగ్‌బాస్ స్టేజ్‌పై ఫైనల్ విన్నర్‌గా బిందు మాధవిని ప్రకటించాడు నాగార్జున.
దీంతో తెలుగు బిగ్‌బాస్ చరిత్రలోనే మొదటిసారిగా ఒక మహిళ గెలిచింది. తెలుగు బిగ్‌బాస్ తొలి మహిళా విజేతగా బిందు మాధవి నిలిచింది. దీంతో ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయింది బిందు. బిగ్‌బాస్ కప్ కొట్టాలన్న అఖిల్ ఆశలు మరోసారి అడియాశలే అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment