Bindu Madhavi
-
ఇప్పటివరకు బిగ్‌బాస్ గెలిచినవారి జాతకాలివే!
ఫేమస్ అవడానికో లేదా డబ్బు సంపాదించడానికో బిగ్‌బాస్ షోకు వచ్చేవాళ్లు చాలామందే ఉన్నారు! అయితే వచ్చిన ప్రతి ఒక్కరూ అంతో ఇంతో డబ్బు వెనకేసుకుంటారేమో కానీ మంచి పేరు రావడం కష్టం. ఇక్కడ అడుగుపెట్టినవాళ్లలో నెగెటివిటీని మూటగట్టుకుని బయటకు వెళ్లినవాళ్లే ఎక్కువ. కొందరు మాత్రమే తామేంటో నిరూపించుకుని విజేతలుగా నిలిచి ప్రేక్షకుల మనసులు గెలిచారు. మరి ఇప్పటివరకు జరిగిన సీజన్లలో గెలిచినవారు ఇప్పుడు ఏం చేస్తున్నారో చూసేద్దాం..బిగ్‌బాస్ 1బిగ్‌బాస్ తెలుగు మొదటి సీజన్లో సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కంటెస్టెంట్లనే ఎక్కువగా తీసుకొచ్చారు. నవదీప్, హరితేజ, ఆదర్శ్ అందరినీ వెనక్కు నెట్టి శివబాలాజీ విజేతగా నిలిచాడు. ఈ విజయంతో తన కెరీర్ ఏమైనా మారిందా? అంటే లేదనే చెప్పాలి. 2017లో బిగ్‌బాస్ 1 సీజన్ జరగ్గా దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత 2022లో మళ్లీ బిగ్స్క్రీన్పై కనిపించాడు. ఒకప్పటి అంత స్పీడుగా సినిమాలు చేయకపోయినా ఆచితూచి ప్రాజెక్టులు ఎంపిక చేసుకుంటున్నాడు.బిగ్‌బాస్ 2బిగ్‌బాస్ రెండో సీజన్లో కౌశల్ మండా విజయం సాధించాడు. ఇతడి కోసం జనాలు ర్యాలీ చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. తన చేతిలో బోలెడన్ని ఆఫర్లు ఉన్నాయి, సినిమాలు చేస్తున్నాను అని చెప్పుకునే అతడు ఎక్కువగా బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్, షోలలోనే కనిపిస్తున్నాడు తప్ప సినిమాల ఊసే లేదు.బిగ్‌బాస్ 3శ్రీముఖిని వెనక్కు నెట్టి రాహుల్ సిప్లిగంజ్ బిగ్‌బాస్ 3 టైటిల్ ఎగరేసుకుపోయాడు. ఇతడికి ఉన్న టాలెంట్‌తో పెద్ద సినిమాల్లోనూ పాటలు పాడే ఛాన్సులు అందుకున్నాడు. అలా ఆర్ఆర్ఆర్ మూవీలోని ఆస్కార్ విన్నింగ్ సాంగ్ 'నాటు నాటు..'ను కాలభైరవతో కలిసి ఆలపించాడు. బిగ్‌బాస్‌కు వెళ్లొచ్చాక స్టార్ స్టేటస్ అందుకున్న ఏకైక విన్నర్ బహుశా ఇతడే కావచ్చు.బిగ్‌బాస్ 4కండబలం కన్నా బుద్ధిబలం ముఖ్యం అని నిరూపించాడు అభిజిత్. ఎక్కువగా టాస్కులు గెలవకపోయినా మైండ్ గేమ్ ఆడి, తన ప్రవర్తనతో టైటిల్ గెలిచేశాడు. బిగ్‌బాస్ తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకుని మోడ్రన్ లవ్ హైదరాబాద్ అనే సిరీస్‌లో తళుక్కున మెరిశాడు. మళ్లీ రెండేళ్లు గ్యాప్ తీసుకుని మెగా కోడలు లావణ్య త్రిపాఠితో కలిసి మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ చేశాడు. ఇప్పుడు మళ్లీ ఖాళీగానే ఉన్నట్లున్నాడు.బిగ్‌బాస్ 5బిగ్‌బాస్ ఐదో సీజన్లో వీజే సన్నీ విన్నర్‌గా నిలిచాడు. అప్పటివరకు సీరియల్స్‌లోనే కనిపించిన అతడిని వెండితెరకు పరిచయం చేయడానికి ఈ షో మంచి ప్లాట్‌ఫామ్ అని భావించాడు. బిగ్‌బాస్ విజేతగా బయటకు వచ్చి హీరోగా ఏడాదికో సినిమా చేశాడు. కానీ మంచి హిట్టు అందుకోలేకపోయాడు.'బిగ్‌బాస్ 6ఈ సీజన్ విన్నర్ సింగర్ రేవంత్ మంచి టాలెంటెడ్. అప్పటివరకు ఎన్నో హిట్ సాంగ్స్ పాడాడు. ఈ షో తర్వాత కూడా తన జీవితం అలాగే కొనసాగిందే తప్ప ఊహించని మలుపులు అయితే ఏమీ జరగలేదు. ఇంకా చెప్పాలంటే అప్పటికన్నా ఇప్పుడే కాస్త ఆఫర్లు తగ్గాయి.బిగ్‌బాస్ 7రైతుబిడ్డ.. ఈ ఒకే ఒక్క పదం అతడిని బిగ్‌బాస్ విన్నర్‌ను చేసింది. గెలిస్తే రైతులకు సాయం చేస్తానంటూ ఆర్భాటాలు పోయిన ఇతడు ఆ తర్వాత ఒకరిద్దరికి సాయం చేసి చేతులు దులిపేసుకున్నాడు. ఈ బిగ్‌బాస్ షో తర్వాత కూడా ఎప్పటిలాగే రోజూ పొలం వీడియోలు చేసుకుంటూ బతికేస్తున్నాడు.బిగ్‌బాస్ నాన్‌స్టాప్ (ఓటీటీ)హీరోయిన్ బిందుమాధవి.. లేడీ ఫైటర్‌గా పోరాడి బిగ్‌బాస్ నాన్‌స్టాప్ టైటిల్ ఎగరేసుకుపోయింది. ఈ తెలుగమ్మాయికి బిగ్‌బాస్ తర్వాత మంచి అవకాశాలే వచ్చాయి. యాంగర్ టేల్స్, న్యూసెన్స్, మాన్షన్ 24, పరువు వెబ్ సిరీస్‌లలో కనిపించింది. అయితే ఇప్పటికీ తమిళంలోనే సినిమాలు చేస్తోంది తప్ప టాలీవుడ్లో మాత్రం రీఎంట్రీ ఇవ్వలేదు.ఇప్పటివరకు బిగ్‌బాస్ గెలిచినవారి జాతకాలు ఇలా ఉన్నాయి. మరి ఈసారి ఇంట్లో అడుగుపెట్టిన పద్నాలుగో మందిలో ఎవరు గెలుస్తారో? తర్వాత వారి కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి! -
Bindu Madhavi: బిందు మాధవి హాట్ ఫోటోషూట్..
-
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నటి వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటించిన హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మాన్షన్ 24. అవికా గోర్, సత్యరాజ్, బిందు మాధవి, రాజీవ్ కనకాల, రావు రమేశ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ప్రముఖ యాంకర్ కమ్ డైరెక్టర్ ఓంకార్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ట్రైలర్‌ను బుధవారం రిలీజ్ చేశారు. 'జాతీయ సంపదను దోచుకున్న కాళిదాసు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు' అన్న హెడ్‌లైన్‌తో ట్రైలర్ మొదలైంది. అయితే తాను దేశద్రోహి కూతుర్ని కాదని, నిజాయితీపరుడైన కాళిదాసు కూతుర్ని, దాన్ని నిరూపిస్తానంటూ సీన్లోకి ఎంటరైంది వరలక్ష్మి శరత్‌కుమార్. కనిపించకుండా పోయిన తండ్రి కోసం, అతడి మీద వేసిన దేశద్రోహి అనే నిందను తొలగించేందుకు తనే స్వయంగా రంగంలోకి దిగుతుంది. తండ్రి కోసం వెతుకులాట మొదలుపెడుతుంది. ఈ క్రమంలో అతడి తండ్రి చివరిసారిగా ఓ కోటకు వెళ్లినట్లు తెలుసుకుంటుంది. అక్కడికి వెళ్లినవారెవరూ తిరిగి రాలేదని అందరూ చెప్తూ ఉంటారు. అయినా సరే, తన తండ్రి ఏమయ్యాడో తెలుసుకోవాలని పాడుబడ్డ మాన్షన్‌లోకి అడుగుపెడుతుంది. అక్కడ వరలక్ష్మికి ఎదురైన పరిణామాలేంటి? తన తండ్రి నిజాయితీపరుడా? దేశద్రోహా? వరలక్ష్మి అక్కడి నుంచి తిరిగి ప్రాణాలతో బయటపడిందా? వంటి విషయాలు తెలియాలంటే ఓటీటీలో చూడాల్సిందే! ఈ వెబ్ సిరీస్ అక్టోబర్ 17 నుంచి హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. చదవండి: సీక్రెట్‌గా బిగ్‌బాస్ బ్యూటీ ఎంగేజ్మెంట్? ఎవరా మిస్టరీ మ్యాన్? -
రెచ్చిపోతున్న తెలుగమ్మాయి.. 'జవాన్' బ్యూటీ గ్లామర్ ట్రీట్
రెడ్ డ్రస్‌లో కేక పెట్టిస్తున్న హీరోయిన్ బిందుమాధవి వీకెండ్ ఎంజాయ్ చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ నాగిని బ్యూటీ మౌనీ రాయ్ మెరుపుల డ్రస్ అందాల విందుతో రెచ్చిపోయిన నిఖితా శర్మ కర్రసాముతో ఆశ్చర్యపరిచిన హీరోయిన్ శాన్వీ చీరకట్టులో పద్ధతిగా కనిపించిన కరీనా కపూర్ శరీర ఒంపుసొంపులతో వాణీకపూర్ సెగలు గోల్డెన్ డ్రస్‌లో సన్య మల్హోత్రా గ్లామర్ ట్రీట్ View this post on Instagram A post shared by Bindu Madhavi (@bindu_madhavii) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Nikita Sharma (@nikitasharma_official) View this post on Instagram A post shared by Shanvi Srivastava (@shanvisri) View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) View this post on Instagram A post shared by Vaani Kapoor (@_vaanikapoor_) View this post on Instagram A post shared by SanyaM (@sanyamalhotra_) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Gayatri Bhardwaj (@gayatribhardwaj__) -
న్యూసెన్స్ వెబ్ సిరీస్ రివ్యూ.. ఎలా ఉందంటే?
వెబ్ సిరీస్: న్యూసెన్స్ నటీనటులు: నవదీప్, బిందుమాధవి, మహిమా శ్రీనివాస్, నంద గోపాల్, చరణ్ కురుగొండ, జ్ఞానేశ్వర్ దర్శకుడు: శ్రీ ప్రవీణ్ కుమార్ నిర్మాత: టీజీ విశ్వప్రసాద్ నిర్మాణ సంస్థ: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంగీతం: సురేశ్ బొబ్బిలి ఓటీటీ ప్లాట్‌ఫామ్: ఆహా రిలీజ్ డేట్: మే 12, 2023 మీడియా.. మూడు అక్షరాల పదం. బలవంతుడికి, బలహీనుడికి కావాల్సిన ఆయుధం. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధి. పక్కన ఉన్న స్నేహితుడిని నమ్మకపోయినా సరే పొద్దున్నే పేపర్లో వచ్చే వార్తను మాత్రం నమ్ముతారు. అంతటి పవర్ పెన్నుకు ఉంది. ఆ కలం కల్పితాలను సృష్టిస్తే, నిజాన్ని కప్పేసి అబద్ధాన్ని ప్రచారం చేస్తే, పైసా ఉన్నోడికి లొంగిపోయి తప్పులను కప్పిపుచ్చేస్తే.. మీరే దిక్కంటూ మీడియానే నమ్ముకున్న అనామకులను సైతం నయవంచన చేస్తే.. నిజం చాటున నిలబడాల్సిన వాళ్లు ఎందుకలా తయారయ్యారు? వంటి పరిస్థితులను కళ్లకు కట్టినట్లుగా చూపించిన సిరీస్ న్యూసెన్స్. కథ: ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లి ప్రెస్‌క్లబ్ చుట్టూ కథ తిరుగుతుంది. అక్కడ ఏది రాస్తే అదే నిజం అని జనాలు గుడ్డిగా నమ్ముతుంటారు. సమస్య ఎక్కడుంటే అక్కడ పోలీసుల కన్నా ముందే వాలిపోతారు పాత్రికేయులు. నిజానిజాలు తెలిసినా బలం, బలగం, డబ్బు ఉన్నవాళ్లకు అమ్ముడుపోయి అబద్ధాన్నే ప్రచారం చేస్తారు. వీళ్లకు కావాల్సిందల్లా సాయంత్రానికి పైసల కవర్ వచ్చిందా? లేదా! ఇదే వీళ్లు నేర్చుకున్న, అలవాటు పడిన జర్నలిజం. ఈ ప్రెస్‌క్లబ్‌లో శివ(నవదీప్) ఓ న్యూస్ ఛానల్లో రిపోర్టర్‌గా పని చేస్తుంటాడు. అక్కడే లోకల్ న్యూస్ ఛానల్లో నీల (బిందు మాధవి) న్యూస్ రీడర్‌గా పని చేస్తుంది. వీరిద్దరి మధ్య చిన్న లవ్ ట్రాక్ ఉంటుంది. ఇకపోతే పోలీసులకు, ప్రభుత్వాధికారులకు చెప్పినా పట్టించుకోని సమస్యను పాత్రికేయులకు చెప్తే న్యాయం దొరుకుతుందని భావిస్తూ ప్రెస్‌క్లబ్ మెట్లెక్కుతారు అమాయక జనాలు. కానీ వారికి అండగా ఉండాల్సింది పోయి బాధలు పెడుతున్న రాబంధులకే సలాం కొడతారు. న్యాయం దొరక్క అమాయకులు ప్రాణాలు పోతున్నా వారి మనసు కరగకపోవడం గమనార్హం. అధికార పక్షానికి, ప్రతిపక్షానికి మధ్య జర్నలిస్టులు నలిగిపోయే తీరు, ఎవరికి వత్తాసు పలకాలో తెలియని డైలమా, ఇద్దరి దగ్గరా డబ్బులు తీసుకుని సమన్యాయం చేసే నక్క తెలివితేటలు.. ఇలా చాలానే ఉన్నాయి. మధ్యలో హీరో.. పవర్ ఉన్నోడిని ఎదిరించలేక, అరిగోసలు పడ్తున్న అమాయకులకు అండగా ఉండలేక నలిగిపోతుంటాడు. చివర్లో వచ్చిన కొత్త పోలీసాఫీసర్ రాజకీయ నాయకులకు, ప్రెస్ వాళ్లకు చుక్కలు చూపిస్తాడు. మరి ప్రజల సమస్యలకు చెక్ పడిందా? పోలీసాఫీసర్‌కు, శివకు మధ్య వైరం ఏంటి? రిపోర్టర్స్‌ను రాజకీయ నాయకులు ఎలా వాడుకున్నారు? వంటి విషయాలు తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే! విశ్లేషణ మీడియాపై సినిమాలు రావడం చాలా అరుదు. డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ ఈ పాయింట్‌ను ఎంచుకోవడం సాహసమనే చెప్పాలి. అయినప్పటికీ కథను తెరకెక్కించడంలో సఫలమయ్యాడు. న్యూసెన్స్‌లో మొత్తం ఆరు ఎపిసోడ్లు ఉన్నాయి. కొన్నిచోట్ల అనవసరమైన సన్నివేశాలు చొప్పించి సాగదీసినట్లుగా అనిపిస్తుంది. రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల మంచి చేయలేని నిస్సహాయుడిగా హీరోను చూపించారు. దీనివల్ల నిరంతరం అతడు సంఘర్షణకు లోనవుతున్నట్లు కనిపిస్తుంది. లోపల మంచితనం ఉన్నా దానికి ముసుగు వేస్తూ బతకడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉంటుంది. చివర్లో అయినా హీరో మారి అన్యాయాన్ని ఎదిరిస్తాడనుకుంటే నిరాశే ఎదురవుతుంది. బహుశా రెండో సీజన్లో అతడి మార్పును చూపిస్తారేమో! మధ్యలో మదర్ సెంటిమెంట్‌ను కూడా వాడారు. ఈ సీన్ మాత్రం హైలైట్ ఓ పేద రైతు కష్టపడి సాగు చేస్తున్న భూమిని ఓ రాజకీయ నాయకుడి మనుషులు కబ్జా చేస్తారు. ఎక్కడా న్యాయం దొరక్క జరల్నిస్టుల దగ్గరకు వస్తారు. వాళ్లు అతడికి సాయం చేస్తామని మాయమాటలు చెప్పి రైతును అడ్డుపెట్టుకుని వారి సొంత పనులు చేసుకుంటారు. నిజం తెలిసిన రైతు చివరకు తెగించి తనే భూమిని కాపాడుకోవాలని పొలానికి వెళ్తాడు. అక్కడున్న రౌడీలు అతడిని అదే భూమిలో చంపేసి ఆత్మహత్య చేసుకున్నాడని వార్తలు రాయిస్తారు. ఈ సీన్ వల్ల జర్నలిస్టులు ఇంత రాక్షసంగా ఉంటారా అనిపిస్తుంది. మరో సంఘటనలో ఓ మహిళ భర్తను పొలిటీషియనే హత్య చేయిస్తాడు. కానీ ఆమె అక్రమ సంబంధం వల్లే అతడు చనిపోయాడంటూ వార్త రాస్తారు. ఈ సీన్లో పాత్రికేయులు మరీ ఇంత నీచానికి దిగజారతారా? అనిపించక మానదు. న్యూస్ రాస్తే రూ.200, రాయకుంటే రెండు వేలు అన్న డైలాగ్ నేటి పరిస్థితులకు అద్దం పడుతుంది. బలవంతుడికి చేతులెక్కి మొక్కాలే కానీ రాళ్లు విసరకూడదు అన్న మాట నాయకులకు వ్యతిరేకంగా ఏమీ చేయలేమన్న చేతకానితనాన్ని చూపిస్తుంది. న్యూస్ రాసేవాడి చేతిలోనే చరిత్ర ఉంటుంది అన్న డైలాగ్ ముమ్మాటికీ నిజం. సిరీస్ అంతా ఓకే కానీ క్లైమాక్స్ మాత్రం అస్సలు రుచించదు. రెండో సీజన్ ఉంటుందని హైప్ క్రియేట్ చేయాలనుకున్నారు. అక్కడిదాకా బాగానే ఉంది కానీ క్లైమాక్స్ ఓ అర్థంపర్థం లేకుండా గాలికొదిలేనిట్లు అనిపిస్తుంది. క్లైమాక్స్‌ను సగంలోనే వదిలేసినట్లుగా ఉంటుంది. ఎలా నటించారంటే? నవదీప్ ఆకలి మీదున్న సింహంలా కనిపించాడు. చిత్తూరు యాసలో డైలాగ్స్ అదరగొట్టేశాడు. నిజానికి, అబద్ధానికి మధ్య నలిగిపోయే సన్నివేశాల్లో బాగా నటించాడు. బిందుమాధవి హీరో ప్రేయసి పాత్రగా అందంతో ఆకట్టుకుంది. అయితే ఈ సిరీస్‌లో నటనపరంగా తనకు పెద్దగా స్కోప్ లభించలేదు. తిక్కలోడిగా కనిపించే పోలీసాఫీసర్ ఎడ్విన్ పాత్రలో నందగోపాల్ నటనకు నూటికి నూరు మార్కులు వేయొచ్చు. ఆయన క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చాకే సిరీస్‌కు ఓ ఎనర్జీ వచ్చింది. మిగతా నటీనటులు పర్వాలేదనిపించారు. సురేశ్ బెబ్బులి బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా ప్లస్ అయింది. అనంతనాగ్ కావూరి, ప్రసన్న, వేదరామన్ సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. సింగిల్ లైన్లో చెప్పాలంటే.. న్యూసెన్స్‌ను న్యూస్‌గా రాస్తారు, కానీ ఇక్కడ న్యూసే న్యూసెన్స్ అయింది! -
త్రిష మాజీ ప్రియుడితో ఎఫైర్ నిజమే: బిందు మాధవి
ఆవకాయ్ బిర్యానీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది బిందుమాధవి. తర్వాత తమిళంలోనూ పలు సినిమాలు చేసిన ఆమె బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ఓటీటీ షో ద్వారా మరోసారి అభిమానులను అలరించింది. ఈ రియాలిటీ షో ద్వారా వచ్చిన గుర్తింపుతో ఇండస్ట్రీలో మరోసారి అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన న్యూసెన్స్ వెబ్ సిరీస్ మే 12 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో శనివారం న్యూసెన్స్ ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బిందుమాధవికి యాంకర్ సూటిప్రశ్న విసిరింది. త్రిష ప్రియుడిని ప్రేమించారా? అని ముఖం మీదే అడిగేసింది. దీనికామె క్షణంపాటు ఏం చెప్పాలో అర్థం కాక తల పట్టుకుంది. ఆ వెంటనే స్పందిస్తూ.. అందులో కొంత నిజం, కొంత అబద్ధం ఉందని చెప్పింది. త్రిష ప్రియుడిని ప్రేమించిన మాట వాస్తవమే కానీ ఒకేసారి తామిద్దరం ప్రేమించలేదని స్పష్టం చేసింది. త్రిష అతడికి మాజీ ప్రేయసి అయ్యాకే తాము ప్రేమలో పడ్డామంది. అయితే వీరి బంధం కూడా ఎంతోకాలం నిలవలేదు. ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. కాగా కొన్నేళ్లక్రితం త్రిష వ్యాపారవేత్త, నిర్మాత వరుణ్ మణియన్‌ను ప్రేమించింది. వీరిద్దరూ ఘనంగా నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అయితే ఎంగేజ్మెంట్ అయిన కొద్ది రోజులకే వీరిద్దరూ పెళ్లి రద్దు చేసుకుని విడిపోయారు. ఇది జరిగిన కొంతకాలానికి వరుణ్ మణియన్ బిందుమాధవితో ప్రేమలో పడ్డట్లు ప్రచారం జరిగింది. కొన్ని నెలలు సీరియస్ రిలేషన్షిప్లో ఉన్న వీరు ఫారిన్ టూర్లకు, పార్టీలకు కలిసి వెళ్లేవారు. ఈ క్రమంలో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. అయితే వీరి ప్రేమ కూడా పెళ్లి వరకు రాకుండానే ఆగిపోయింది. చదవండి: సింగర్‌తో ఛత్రపతి హీరోయిన్ డేటింగ్, నటి ఏమందంటే? -
మామూలోడు కాదురా బాబు..సీరియస్ గానే కామెడీ చేసేశాడు
-
అల్లు అర్జున్ తో సినిమా ఎప్పుడంటే..!
-
న్యూసెన్స్ ట్రైలర్ వచ్చేసింది, అప్పటినుంచే స్ట్రీమింగ్!
‘నటీనటులుగా ప్రేక్షకులను మెప్పించే కంటెంట్ ఉండేలా చూసుకోవడమే కాదు, అందరిలో ఓ పాజిటివ్ దృక్పథాన్ని కల్పించే కంటెంట్ క్రియేట్ చేయడం మా బాధ్యత' అంటోంది బిగ్‌బాస్ బ్యూటీ బిందుమాధవి. కచ్చితంగా అలాంటి ప్రభావాన్ని న్యూసెన్స్ క్రియేట్ చేస్తుందని ధీమాగా చెప్తోంది. నేటి మీడియా రంగం సమాజంపై చూపుతున్న ప్రభావంపై ఆందోళన చెందేవారందరూ తప్పనిసరిగా ఈ సిరీస్ చూడాల్సిందే అంటోంది. నవదీప్, బిందుమాధవి ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ న్యూసెన్స్. ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో మే 12న విడుదల కానుంది. ఈ క్రమంలో శనివారం ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నవదీప్ మాట్లాడుతూ ‘‘ఇప్పటి సమాజంలో మీడియాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలాంటి దానిపై ఓ ప్రత్యేక దృక్పథాన్ని ఏర్పరిచేలా రూపొందిన న్యూసెన్స్‌లో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రారంభం నుంచి చివరి వరకు ఆడియెన్స్‌ను ఈ సిరీస్ కట్టిపడేస్తుంది' అన్నాడు. దర్శకుడు శ్రీ ప్రవీణ్ మాట్లాడుతూ.. 'మన సమాజం ఎలా ఉంది? దాని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? అనే విషయాలను తెలియజేయడం క్రియేటర్‌గా నా బాధ్యత. న్యూస్ స్ట్రింగర్స్ ప్రపంచంలోకి వెళ్లి లోతుగా అధ్యయనం చేసేలా ఉండేదే ఈ న్యూసెన్స్ సిరీస్. ఉన్నది ఉన్నట్లుగా, నిజాయితీతో ఓ రంగానికి సంబంధించిన విషయాలను చూపించేలా రూపొందిన ఈ సిరీస్ ఆడియన్స్‌కు నచ్చుతుందని భావిస్తున్నాం' అన్నారు. కాగాఈ సిరీస్ టీజర్ విడుదలైనప్పుడు డబ్బుకి మీడియా దాసోహమా? అనే లైన్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. నిజంగానే డబ్బుకు మీడియా దాసోహమైందా? బానిసగా మారిందా? అనే ప్రశ్న మన మదిలో వస్తుంది. మీడియాలో ప్రసారమవుతున్న వార్తల ప్రామాణికతకు సంబంధించిన ప్రశ్న మనసులో రావడమే కాకుండా సమాజంపై మీడియా ప్రభావం గురించి ఆందోళన చెందుతున్న వారిపై కూడా ఇది ప్రభావం చూపిస్తుంది. త్వరలో స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్ ఎలాంటి బజ్ క్రియేట్ చేస్తుందో చూడాలి! -
తెలుగమ్మాయి బిందు మాధవి గురించి ఈ విషయాలు తెలుసా?
చిత్తూరు జిల్లాలోని మదనపల్లి బిందు మాధవి జన్మస్థలం. తండ్రి వృత్తి రీత్యా చెన్నైలో స్థిరపడటంతో, ఆమె చదువు అక్కడే సాగింది. పాకెట్ మనీ కోసం మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. పలు వాణిజ్య ప్రకటనల్లో నటించింది. తనిష్క్ జ్యూలరీ ప్రకటనలో ఆమెను గమనించిన శేఖర్ కమ్ముల ‘ఆవకాయ్ బిర్యానీ’ సినిమాలో కథానాయికగా అవకాశం ఇచ్చారు. తర్వాత ‘బంపర్ ఆఫర్’, ‘రామ రామ కృష్ణ కృష్ణ’, ‘పిల్ల జమీందార్’ సినిమాలు చేసింది. గౌతం మీనన్ శిష్యురాలైన అంజనా అలీఖాన్ దర్శకత్వంలో వచ్చిన ‘వప్పం’ తమిళ చిత్రంలో ఓ వేశ్య పాత్రలో నటించి మెప్పించింది. ఆ సినిమా పెద్దగా ఆడకపోయినా, తన నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. సినిమా చాన్స్‌లు క్యూ కట్టాయి. దాదాపు పదికిపైగా పరభాషా చిత్రాల్లో నటించి చక్కటి గుర్తింపు తెచ్చుకుంది. మళ్లీ పన్నేండేళ్ల తర్వాత తెలుగులో ఓ బుల్లితెర షోలో ప్రత్యక్షమైంది. తెలుగు బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ఓటీటీ రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి, అద్భుత ఆట కనబరచి టైటిల్ విన్నర్‌గా నిలిచింది. ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారమవుతున్న ‘యాంగర్ టే ల్స్’ అంథాలజీలో ఒక గృహిణిగా.. తనకెంతో అవసరమైన మధ్యాహ్న నిద్రను చెడగొట్టే వారి అంతు చూసే పాత్రలో జీవించి అదరగొట్టింది. చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్, యాక్టింగ్ అంటే ఆసక్తి. స్కూల్ డేస్‌లో రన్నింగ్, సైక్లింగ్‌లో చాంపియన్. పుస్తకాలు కూడా బాగా చదువుతుంది.తెలుగు సినిమాల్లోనే కాదు, పరభాషా చిత్రాల్లోనూ అదరగొడుతూ సత్తా చాటుతున్న తెలుగు నటీమణుల్లో బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విన్నర్ బిందు మాధవి కూడా ఉంది. ఇతరుల డ్రెస్సింగ్ స్టయిల్‌పై చాలామంది ట్రోల్ చేస్తుంటారు. మనం ధరించే దుస్తులను బట్టి ఇచ్చే గౌరవ మర్యాదలు నాకు అస్సలు అవసరం లేదు. – బిందు మాధవి -
డ్రెస్సింగ్‌పై ట్రోల్.. తనదైన స్టైల్లో నెటిజన్ నోరుమూయించిన బిందు
సోషల్ మీడియాలో తనపై నెగిటివ్ కామెంట్ చేసిన ఓ నెటిజన్‌కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది బిగ్‌బాస్ శివంగి బిందు మాధవి. అవకాయా బిర్యానీ, బంపర్ ఆఫర్ వంటి చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు పొందింది బిందు. తెలుగు అమ్మాయి అయిన బిందు ఇక్కడ అవకాశాలు తగ్గడంతో కోలీవుడ్‌లో అదృష్టం పరీక్షించుకుంది. అక్కడ వరుస ఆఫర్లు అందుకుంటూ సౌత్‌లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో తెలుగు బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ఓటీటీ కంటెస్టెంట్‌గా దర్శనం ఇచ్చింది. హౌజ్‌లో తనదైన ఆట, యాటిటూడ్, మాటలతో గట్టి పోటి ఇస్తూ చివరికి బిగ్‌బాస్ నాన్‌స్టాప్ టైటిల్ గెలిచింది. చదవండి: నందమూరి ఫ్యామిలీకి కలిసిరాని ఆగస్టు, విషాదాలన్నీ ఈ నెలలోనే.. అంతేకాదు సంప్రాదాయమైన దుస్తులనే ధరించి బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న బిందుమాధవి తన తాజా పోస్ట్‌లో కాస్తా ట్రెండి డ్రెస్‌లో కనిపించింది. ఈ ఫొటోను తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేయగా ఓ నెటిజన్ తన డ్రెస్సింగ్‌పై అభ్యంతరం వ్యక్తం చేసింది. బిగ్‌బాస్‌లో హౌజ్‌లో అందరు శరీరం కరిపించేలా డ్రెస్స్‌లు వేసుకుంటే.. తను మాత్రం కేవలం సంప్రదాయమైన అలంకరణకే ప్రాధాన్యత ఇచ్చింది. దీంతో బిందు మాధవి అంటే రెస్పాక్ట్ పెరిగింది. కానీ ఇప్పుడు అది పోయింది. అందరి దగ్గర మార్కులు కొట్టాలనే ఉద్దేశంతోనే తను హౌజ్‌లో అలా ఉంది’ అంటూ విమర్శించారు. చదవండి: ‘కార్తీకేయ 2’ ప్రమోషన్స్‌కి అనుపమ డుమ్మా.. నిఖిల్ షాకింగ్ కామెంట్స్! Why this narrow minded people judge a women by her dressing they like a women by her clothes and not by her character. In telugu der is a saying "ఆడదానికీ ఆడదే శత్రువు" this is apt 4 dis girl🤨 Bindu gave slipper shot answer 👏 you go girl more power to you 🔥#BinduMadhavi pic.twitter.com/78NhUznHO3 — SiriKota (@SiriKota_04) August 2, 2022 దీంతో సదరు నెటిజన్ కామెంట్స్ బిందు స్పందించి తనదైన స్టైల్లో గట్టి కౌంటర్ ఇచ్చింది. ‘హో.. మనం ధరించే దుస్తులను బట్టే వ్యక్తికి గౌరవం ఇస్తారంటే.. అలాంటి గౌరవం నాకు వద్దు’ అంటూ నెటిజన్ నోరు మూయించింది ఈ ఆడపులి. ప్రస్తుతం బిందు మాధవి సమాధానం నెట్టింట చర్చనీయాంశమైంది. బిందు ఇచ్చిన రిప్లైకు ఓ నెటిజన్ ఫిదా అయ్యాడు. ఈ కామెంట్సకు సంబంధించిన స్క్రీన్ షాట్ తీసి ట్విటర్లో పోస్ట్ చేస్తూ బిందుకు మద్దుతు తెలిపాడు. -
Fashion: ఈ హీరోయిన్ ధరించిన డ్రెస్ ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!
ఆవకాయ బిర్యానీ గుర్తుంది కదా.. వంటకం కాదండీ.. రెస్టారెంట్ పేరు అంతకన్నా కాదు. అచ్చతెలుగు హీరోయిన్.. మదనపల్లె మగువ.. బిందు మాధవి. గ్లామర్‌తో వెండి తెర మీదే కాదు తనదైన సిగ్నేచర్ స్టయిల్‌తో ఫ్యాషన్ వరల్డ్‌లోనూ మెరిసిపోతోంది ఇలా.. నైనా జైన్ తరాల నాటి విభిన్న చేనేత కళలను ఒక్కచోట చేర్చి.. వాటికి ఆధునిక రూపమిచ్చే బ్రాండే నైనా జైన్. క్లాసిక్ లుక్స్‌నే కాదు.. ధరించడంలోని సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని డిజైన్ అవుతుంది ఈ బ్రాండ్ వేర్. పెళ్లికూతురి దుస్తులకు ప్రసిద్ధి ఈ లేబుల్. గుజరాత్‌లోని కచ్ ప్రాంతపు బందినీ వర్క్ నైనా జైన్ యూఎస్పీ. ధరలు కాస్త ఎక్కువే. ఆన్‌లైన్‌లోనూ దొరుకుతాయి. బ్రాండ్ వాల్యూ ►డ్రెస్ : రెండ్ – యెల్లో లెహెంగా ►బ్రాండ్: నైనా జైన్ ►ధర: రూ. 45,500 ఇషారా నగల డిజైన్ల పట్ల ఆసక్తి, అభిరుచి ఉన్న కొంతమంది ఉత్సాహవంతులు కలసి 2014లో ఏర్పాటు చేసిన బ్రాండే ‘ఇషారా’. తరాల నాటి సంప్రదాయక నగలు, కుందన్, టెంపుల్ జ్యూయెలరీ ఇలా ఏ వెరైటీ డిజైన్లయినా.. ఆయా వేడుకలు.. సందర్భాలకనుగుణంగా.. కొనుగోలుదారులకు నప్పే.. నచ్చే విధంగా తయారు చేసివ్వడం ఈ బ్రాండ్ ప్రత్యేకత. ధరలూ అందుబాటులోనే. నగలు ఆన్‌లైన్‌లోనూ లభ్యం. ‘నన్ను చాలామంది సిల్క్ స్మితతో పోలుస్తుంటారు. నా కళ్లు ఆమె కళ్లలాగే ఉంటాయని.. నేనూ ఆమెలాగా కళ్లతోనే హావభావాలు పలికిస్తానని మెచ్చుకుంటుంటారు. అంతకన్నా గొప్ప ప్రశంసేం ఉంటుంది! ఆవిడ వండర్ ఫుల్ ఆర్టిస్ట్.. నా అభిమాన తార!’ – బిందు మాధవి బ్రాండ్ వాల్యూ ►జ్యూయెలరీ: పోల్కీ చోకర్, చాంద్‌బాలీలు ►బ్రాండ్: ఇషారా ►ధర: రూ. 3,000 --దీపిక కొండి -
బిందు మాధవి ఇలా చూస్తే కలవరమవదా మదిలో..
-
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విన్నర్ బిందు మాధవికి బంపర్ ఆఫర్!
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విజేతగా బిందు మాధవి నిలిచిన విషయం తెలిసిందే. తెలుగు బిగ్‌బాస్ చరిత్రలో ఓ మహిళ విన్నర్‌గా నిలవడం ఇదే తొలిసారి. దీంతో తెలుగు బిగ్‌బాస్ విన్నర్‌గా నిలిచి బిందు మాధవి చరిత్ర సృష్టించింది. టాస్క్‌లో.. మాటల్లో ఆడపులిలా రెచ్చిపోయిన బిందుకి ఒక్కసారిగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. ఇది వరకు ఆమె తెలుగులో పలు చిత్రాల్లో చేసిన రానీ గుర్తింపు ఒక్కసారిగా బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌తో తెచ్చుకుంది. దీంతో ఆమెకు టాలీవుడ్ నుంచి వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. చదవండి: కరణ్ జోహార్ బర్త్‌డే పార్టీ, ఒకే రంగు దుస్తుల్లో మెరిసిన రష్మిక, విజయ్ ఈ నేపథ్యంలో బిందుకు సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఏకంగా ఆమె ఓ స్టార్ డైరెక్టర్ సినిమాలో చాన్స్ కొట్టేసిందంటూ తాజాగా వార్తలు గుప్పుమన్నాయి. ఇండస్ట్రీలో వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న యంగ్ డైరెక్టర్ అనిల్‌రావిపూడి తదుపరి ప్రాజెక్ట్‌లో నటించే చాన్స్ కొట్టేసిందని వినికిడి. కాగా ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్ 3 మూవీ ప్రమోషన్‌తో బిజీగా ఉన్నాడు. దగ్గుబాటి హీరో విక్టరి వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించి ఈ చిత్రం రేపు(మే 27న) ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని అనంతరం ఆయన బాలకృష్ణతో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. చదవండి: రాత్రి 11 గంటలు, కానిస్టేబుల్ వల్ల అభద్రతకు గురయ్యా: హీరోయిన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన అనిల్ రావిపూడితో బాలయ్య సినిమా అనేసరికి అందరిలో ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమా అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రమంలో బిందు మాధవిని ఓ కీ రోల్ కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో హీరోయిన్గా మెహ్రీన్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. అంతేకాదు మరో యువ నటి శ్రీలీలా బాలయ్య కూతురిగా కనిపించబోతుందట. మరి ఇందులో బిందు మాధవి రోల్‌పై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇదిలా ఉంటే బాలయ్య కోసం తన కామెడీ టచ్‌ను పక్కన పెట్టి యాక్షన్‌పై దృష్టి పెట్టానని అనిల్ రావిపూడి ఇటీవల ఓ ఇంటర్య్వూలో చెప్పిన సంగతి తెలిసిందే. -
బిగ్‌బాస్ షోలో బిందుమాధవి పారితోషికం ఎంతో తెలుసా?
Bindu Madhavi Remuneration: బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ విన్నర్‌గా నిలిచింది బిందు మాధవి. షో విజేతగా అవతరించడంతో ఆమెకు రూ.40 లక్షలు దక్కాయి. నిజానికి విన్నర్ ప్రైజ్‌మనీ అరకోటి. కానీ గ్రాండ్ ఫినాలే రోజు బోల్డ్ బ్యూటీ అరియానా గ్లోరీ రూ.10 లక్షలు తీసుకుని రేసు నుంచి తప్పుకుంది. దీంతో ఆ పది లక్షలు ప్రైజ్‌మనీలో నుంచి కోత పెట్టారు. అలా బిందు చేతికి 40 లక్షల రూపాయలు వచ్చాయి. ఇకపోతే బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షో 12 వారాలు సాగింది. మరి 12 వారాలు హౌస్‌లో ఉన్నందుకు ఆమెకు ఎంత పారితోషికం వచ్చిందనుకుంటున్నారు? రూ. 55- 60 లక్షలు. అంటే మొత్తంగా బిందు ఇంచుమించు కోటి రూపాయలు గెల్చుకున్నట్లు తెలుస్తోంది. కానీ ట్యాక్స్ కటింగ్స్ వల్ల ఆమె చేతికి దాదాపు రూ.90 లక్షల మేరకు వచ్చే ఛాన్స్ ఉంది! మొత్తానికి బిందు ఈ రేంజ్లో రెమ్యునరేషన్ అందుకుందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది. కాగా బిందు తెలుగులో ఆవకాయ బిర్యానీ, బంపర్ ఆఫర్ సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే! తమిళ బిగ్‌బాస్ మొదటి సీజన్లో పాల్గొన్న బిందు అక్కడ నాలుగో రన్నరప్‌గా నిలిచింది. ఇక తెలుగులో ఏకంగా ట్రోఫీ అందుకుని బిగ్‌బాస్ కప్పు గెలిచిన మొట్టమొదటి మహిళా విజేతగా అవతరించింది. చదవండి 👇 స్టార్ హీరో తండ్రికి అస్వస్థత, పొత్తికడుపులో రక్తస్రావం నా సినిమాను చంపేశారు: శేఖర్ నిర్మాత ఆవేదన -
బింధుమాధవి పెళ్లిపై ఆమె తండ్రి ఏమన్నాడంటే..
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విజేతగా బిందు మాధవి నిలిచిన విషయం తెలిసిందే. చివరి వరకు అఖిల్ గట్టి పోటీ ఇచ్చినా.. బిందు విజేతగా నిలిచి ట్రోపీతో పాటు రూ.40 లక్షలు దక్కించుకుంది. తెలుగు బిగ్‌బాస్ చరిత్రలో ట్రోపీ అందుకున్న తొలి మహిళగా బిందు మాధవి నిలిచింది. గతంలో పలు తెలుగు సినిమాల్లో నటించిన రాని గుర్తింపు..బిగ్‌బాస్ రియాల్టీ షోతో ఆమెకు వచ్చింది. ప్రస్తుతం బిందు వరుస ఇంటర్వ్యలతో ఫుల్ బిజీగా ఉంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు బిందు మాధవి పెళ్లిపై నెట్టింట చర్చ జరుగుతోంది. త్వరలోనే బిందు పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా బిందు పెళ్లిపై ఆమె తండ్రి స్పందించారు. పెళ్లి గురించి తాము ఆలోచించడం లేదని, ఆమెకు ఇష్టం ఉన్నప్పుడే చేస్తామని చెప్పుకొచ్చాడు. (చదవండి: బాత్రూమ్లో సీక్రెట్ స్మోకింగ్.. బిందుమాధవి ఏమందంటే?) ‘బిందు ఇంజనీరింగ్ చదివేటప్పుడే పెళ్లి గురించి చాలా ఒత్తిడి చేశా. అప్పుడు చాలా మంచి సంబంధాలు వచ్చాయి. ఐపీఎస్, ఐఆర్ఎస్, డాక్టర్, అమెరికా ఇంజనీరింగ్ సంబంధాలు వచ్చాయి. అప్పుడు ఒక తండ్రిగా నేను ఇంతమంచి సంబంధాలు వస్తున్నాయి.. పెళ్లి చేసుకో అని బిందుపై ఒత్తిడి తెచ్చాను. నేను కూడా చాలా బాధపడ్డాను. ఇక సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని సంబంధాలు చూశాను.కానీ ఒప్పుకోలేదు. ‘నేనే చూసుకుంటాను నాన్న..నేనేం చిన్నపిల్లను కాదు కదా? నా మంచి చెడుల గురించి నాకు తెలుసు. నేను చెప్పినప్పుడు నా పెళ్లి చేయండి ’అని బిందు చెప్పింది. అప్పటి నుంచి ఆమె ఆకాంక్షలకు, అభిలాషకు నేను పూర్తిగా వదిలేశాను. కాలాలు మారాయి. పిల్లల ఆకాంక్షలకు, అభిలాషలకు అనుగుణంగా తల్లిదండ్రులు ప్రవర్తించాల్సిన బాధ్యత ప్రతి తల్లికి, తండ్రికి ఉంది’ అని బిందు మాధవి తండ్రి అన్నారు. -
బాత్రూమ్లో సీక్రెట్ స్మోకింగ్.. బిందుమాధవి ఏమందంటే?
మొదట్లో బిగ్‌బాస్ షో అంటే కేవలం టీవీలకే పరిమితమయ్యేది. కానీ ఓటీటీలు వచ్చాక బిగ్‌బాస్ రూటు మారింది. గంట ఎపిసోడ్ మాత్రమే ఎందుకు చూపించాలి, హౌస్‌లో ఏం జరుగుతుందో ప్రత్యక్ష ప్రసారం చూపిస్తే పోలా అనుకున్నారు. అనుకున్నట్లుగా బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ప్రవేశపెట్టారు. 24 గంటలు లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులోకి తేవడమే కాకుండా నిరంతరం షో చూడలేనివాళ్ల కోసం ప్రత్యేకంగా గంట ఎపిసోడ్ కూడా పెట్టారు. కంటెస్టెంట్ల మీద ఓ కన్నేసి ఉంచే వాటినుంచి తప్పించుకుని ఏమీ చేయలేరు కంటెస్టెంట్లు. కానీ కెమెరాలకు సైతం కనబడకుండా అషూ, బిందు మాధవి సిగరెట్ తాగారంటూ ప్రచారం జరిగింది. అర్ధరాత్రి సిగరెట్లు మాయమవుతున్నాయని, బాత్రూమ్లో కూడా పొగ వాసన వస్తుందని నటరాజ్ ఎప్పుడో పసిగట్టాడు. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన సమయంలోనూ అషూకు సిగరెట్ తాగావా? అన్న ప్రశ్న ఎదురైంది. కానీ అషూ తెలివిగా దాని నుంచి తప్పించుకుంది. తాజాగా ఫ్యాన్స్‌తో సోషల్ మీడియాలో సరదాగా చిట్‌చాట్ చేసిన బిందుమాధవికి సైతం అదే ప్రశ్న ఎదురైంది. నువ్వు స్మోకింగ్ చేస్తున్నావని స్రవంతి.. అఖిల్‌తో పాటు అతడి ఫ్రెండ్స్‌కు చెప్పింది. అది నిజమేనా? అని ఓ అభిమాని అడిగారు. దీనికి బిందు స్పందిస్తూ.. తానసలు పొగ తాగలేదని స్పష్టం చేసింది. తనకా అలవాటు ఉండుంటే ఓపెన్‌గానే స్మోకింగ్ చేసేదాన్నని చెప్పుకొచ్చింది. చదవండి 👉🏾 హీరోయిన్ ప్రణీత బేబీ బంప్ ఫొటోలు వైరల్ కుంభకర్ణుడిలా పడుకుంది చాలు, ముందు అప్డేట్ ఇవ్వు -
బిందు మాధవితో లవ్ ట్రాక్.. క్లారిటీ ఇచ్చిన శివ
Anchor Shiva Gave Clarity On Love Story With Bindu Madhavi: బిగ్‌బాస్.. ప్రేక్షకుల నుంచి ఎంతో ఆదరణ పొందింది ఈ రియాలిటీ షో. గంట ఎపిసోడ్ కోసం రోజంతా ఎదురుచూసే ప్రేక్షకుల కోసం బిగ్‌బాస్ నాన్స్టాప్పేరుతో ఓటీటీలో ప్రవేశపెట్టారు. బిగ్‌బాస్ హౌజ్‌లో 24 గంటలు ఏం జరుగుతుందో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా చూసేయండంటూ షోపై మరింత ఆసక్తి పెంచారు. ఈసారి బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో వచ్చిన గొడవలు ఏ బిగ్‌బాస్ సీజన్లో రాలేదు. ఎంతలా అంటే ప్రేమలు, ఆప్యాయతలు కంటే కంటెస్టెంట్ల మధ్య వాగ్వాదాలతోనే మోస్ట్ పాపులర్ అయ్యారు. ఈ ఓటీటీ మొదటి సీజన్లో మొత్తం 18 మంది (ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీతో సహా) పాల్గొన్నారు. వీరిలో అనిల్ రాథోడ్, అరియానా గ్లోరీ, అఖిల్ సార్థక్, బిందు మాధవి, శివ, మిత్రా శర్మ, బాబా భాస్కర్ గ్రాండ్ ఫినాలేకు చేరుకున్నారు. బిందు మాధవి విన్నర్‌గా నిలవగా అఖిల్ రన్నరప్‌గా సరిపెట్టుకున్నాడు. ఇక కాంట్రవర్సీ యాంకర్‌గా పేరు తెచ్చుకున్న శివ టాప్ 3 కంటెస్టెంట్‌గా నిలిచాడు. అయితే హౌజ్‌లో ఉన్నప్పుడు యాంకర్ శివ, బిందు మాధవి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని అనేక రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే తర్వాత జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి చెప్పుకొచ్చాడు శివ. చదవండి: అనిల్, సునిల్‌ను దొంగసచ్చినోళ్లు అంటూ అరియానా తిట్లు.. బిందుతో లవ్ ట్రాక్ నడపడం వల్లే ఫైనల్ వరకు వచ్చారా అని అడిగిన ప్రశ్నకు 'అసలు రాంగ్ ఇన్ఫర్మేషన్ అనుకుంటా. నిజానికి నేను బిందుతో ఉన్నది లవ్ ట్రాక్ కాదు. మా ఇద్దరిది ఫ్రెండ్షిప్ మాత్రమే. అసలు లవ్ ట్రాక్ అయితే కానేకాదు.' అని తెలిపాడు శివ. తర్వాత బిగ్‌బాస్‌కు వెళ్లడం ఎలా ఉందన్న ప్రశ్నకు 'కాంట్రవర్సీ యాంకర్‌గా పేరు తెచ్చుకున్న నేను మొదట్లో భయపడ్డాను. ఎక్కడ నెగెటివిటీ వస్తుందో అని. నన్ను యాక్సెప్ట్ చేస్తారో లేదో అనుకున్నా. కానీ హౌజ్‌లోపలికి గెస్ట్‌లు, పేరెంట్స్ వచ్చి ఎంటర్టైనర్ ఎంటర్టైనర్ అంటే సంతోషంగా అనిపించింది. ఇంత మంచి పేరు వచ్చినందుకు హ్యాపీగా ఉంది.' అని పేర్కొన్నాడు. చదవండి: తెలుగు బిగ్‌బాస్ చరిత్రలోనే మొదటి మహిళా విజేతగా బిందు మాధవి.. -
నాకేం ఫరక్ పడదు, బిందు నా పండు: అఖిల్ సార్థక్
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షోకు శుభం కార్డు పడింది. తెలుగు బిగ్‌బాస్ చరిత్రలోనే తొలిసారిగా ఒక మహిళా కంటెస్టెంట్ విన్నర్‌గా నిలిచింది. 17 మంది కంటెస్టెంట్లతో పోటీపడి బిందుమాధవి ట్రోఫీ ఎగరేసుకుపోయింది. గతంలో గెలుపుకు ఒక అడుగు దూరంలో ఆగిపోయిన అఖిల్ సార్థక్ ఈసారి ఎలాగైనా ట్రోఫీని సొంతం చేసుకుకోవాలనుకున్నాడు. కానీ అతడికి మరోసారి భంగపాటు ఎదురైంది. ఓటింగ్‌లో అతడిని వెనక్కు నెట్టి మరీ బిందు మాధవి విజేతగా అవతరించడంతో అఖిల్ మరోసారి రన్నర్‌గా నిలిచాడు. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన అతడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'నేను రన్నర్ అయినా మావాళ్లు నన్ను విన్నర్‌గానే ట్రీట్ చేస్తారు. కానీ నేను ఏడ్చేశానంటూ కొందరు ఏవేవో రాశారు. ఆల్రెడీ ఒకసారి దెబ్బ తగిలినప్పుడు దానిపై మళ్లీ తాకితే పెద్దగా ఫరక్ పడదు. బిందు నా పండు. మేం చాలా సరదాగా ఉన్నాం. బిగ్‌బాస్ షో మొదటి నుంచే తనతో కలవడానికి ప్రయత్నిస్తున్నా. కానీ చివరి వారంలో కలిశాము. చాలా సంవత్సరాల నుంచి ఆమె విజయం కోసం ఎదురుచూస్తోంది. చివరకు తను అనుకున్నది సాధించినందుకు హ్యాపీ. హౌస్‌లో తేజు, శ్రీరాపాక, ముమైత్, నటరాజ్ మాస్టర్ బెస్ట్ కంటెస్టెంట్స్. యాంకర్ శివ నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వస్తాడట, అప్పుడు అతడి గురించి చెప్తా' అన్నాడు అఖిల్. చదవండి 👉🏾 నా నామినేషన్స్ బాగా నచ్చాయట, బిగ్‌బాస్‌కు మళ్లీ వెళ్తా: మిత్ర బిందుమాధవి గెల్చుకున్న ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా? -
ఆ కంటెస్టెంట్ వల్లే నాకు టైటిల్ దక్కింది: బిందు మాధవి
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విన్నర్‌గా బిందు మాధవి రికార్డు సృష్టించింది.టైటిల్ రేసులో ఉన్న అఖిల్ సార్థక్ నుంచి గట్టి పోటీ ఎదురైనా చివరికి బిందు మాధవి టైటిల్ విన్నర్‌గా నిలిచింది. తెలుగు బిగ్‌బాస్ చరిత్రలోనే తొలి లేడీ విన్నర్‌గా నిలిచి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ట్రోఫీతో పాటు రూ. 40లక్షల క్యాష్ ప్రైజ్‌ను సైతం సొంతం చేసుకుంది. 'మస్తీ' హ్యాష్ ట్యాగ్‌తో ఎంట్రీ ఇచ్చి 'ఆడపులి' అనే హ్యాష్ ట్యాగ్‌తో బయటికొచ్చింది. అనంతరం బిగ్‌బాస్ బజ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిందు మాధవి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. బిగ్‌బాస్ టైటిల్ గెలవడం తన మొదటి విజయంగా భావిస్తున్నానని, ఇప్పటి నుంచి ఇక విజయవంతంగా ముందుకు వెళ్తానని అనుకుంటున్నట్లు పేర్కొంది. ఇప్పుడు విన్నర్ అయ్యావ్ కానీ, ఒకసారి కూడా కెప్టెన్ ఎందుకు అవ్వలేదు అని యాంకర్ అడగ్గా అది తనకు కూడా తెలియదని చెప్పింది. హౌస్‌లో మోస్ట్ ఇరిటేటింగ్ కంటెస్టెంట్ ఎవరు అని అడగ్గా ఏమాత్రం తడుముకోకుండా వెంటనే నటరాజ్ మాస్టర్ అని తెలిపింది. ఈ సీజన్లో పలానా కంటెస్టెంట్ ఉన్నపపుడు నేను ఈ సీజన్‌కి రావాల్సింది లేకుండే అని ఎవరిని చూస్తే అనిపించింది?అని అడగ్గా వారి వళ్లే తనకీ టైటిల్ దక్కిందంటూ చెప్పుకొచ్చింది. చివరగా విన్నింగ్ మూమెంట్లో గెలుస్తానో, లేదో అని చాలా కన్ఫ్యూజన్లో ఉన్నానని బిందు పేర్కొంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట చక్కర్లు కొడుతుంది. -
బిందుమాధవి గెల్చుకున్న ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?
బిగ్‌బాస్ షో... గంట ఎపిసోడ్ కోసం రోజంతా ఎదురుచూసేవాళ్లు ప్రేక్షకులు. వారి ఆసక్తిని అర్థం చేసుకుని బిగ్‌బాస్ ఓటీటీని ప్రవేశపెట్టారు. 24 గంటలు హౌస్‌లో ఏం జరిగిందో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసేయండంటూ బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షో మొదలుపెట్టారు. విచిత్రంగా బిగ్‌బాస్ షోలో లేనన్ని గొడవలు ఈ ఓటీటీలో చోటు చేసుకున్నాయి. ప్రేమలు, ఆప్యాయతల కంటే గొడవలతోనే కంటెస్టెంట్లు ఎక్కువగా ఫేమస్ అయ్యారు. ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీతో కలిపి ఈ ఓటీటీ మొదటి సీజన్లో మొత్తం 18 మంది పాల్గొన్నారు. వీరిలో అనిల్, అరియానా, అఖిల్, బిందు, శివ, మిత్ర, బాబా ఫినాలేకు చేరుకున్నారు. శనివారం గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ జరగ్గా నాగార్జున బిందును విన్నర్‌గా ప్రకటించాడు. అఖిల్ సార్థక్ రన్నర్‌గా నిలిచాడు. యాంకర్ శివ సెకండ్ రన్నరప్ స్థానానికి పరిమితమయ్యాడు. ఈ స్థానాలను ముందుగానే అంచనా వేసిన అరియానా రూ.10 లక్షల సూట్‌కేస్‌తో రేస్ నుంచి తప్పుకుంది. మరి విజేతగా నిలిచిన బిందుమాధవి ఎంత గెలుచుకుందో తెలుసా? అక్షరాలా రూ.40 లక్షలు. నిజానికి బిందుకు అరకోటి దక్కాలి. కానీ మధ్యలో అరియానా రూ.10 లక్షలున్న సూట్‌కేస్ చేజిక్కించుకోవడంతో దాన్ని ప్రైజ్‌మనీలో నుంచి తగ్గించారు. మొత్తానికి బిందు ప్రజల మనసుతో పాటు భారీ ప్రైజ్‌మనీ కూడా గెల్చుకుంది. ఊహించని గెలుపుతో ఉక్కిరిబిక్కిరి అయిన బిందు బిగ్‌బాస్ స్టేజీపై భావోద్వేగానికి లోనైంది. కొందరికి కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు కష్టపడితే సక్సెస్ వస్తుంది. కానీ చాలామందికి ఎన్నో సంవత్సరాలు కష్టపడితేనే విజయం వరిస్తుంది. అలా ఆలస్యంగా విజయాన్ని అందుకునే లేట్ బ్లూమర్స్‌కు నా గెలుపు అంకితం. నేను కూడా లేట్ బ్లూమర్నే. చాలా సంవత్సరాలు కష్టపడ్డ తర్వాత నాకు ఈ ట్రోఫీ వచ్చింది అని చెప్తూ ఎమోషనలైంది. చదవండి 👉🏾 నటితో ఎఫైర్ పెట్టుకో, ఫేమస్ చేస్తామన్నారు తెలుగు బిగ్‌బాస్ చరిత్రలోనే మొదటి మహిళా విజేతగా బిందు మాధవి.. -
తెలుగు బిగ్‌బాస్ చరిత్రలోనే మొదటి మహిళా విజేతగా బిందు మాధవి..
Bigg Boss Non Stop Telugu Winner Is Bindu Madhavi: తెలుగు నాట అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షో బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షో గ్రాండ్ ఫినాలే శనివారం (మే 20) సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమైంది. ఫిబ్రవరి 26న ప్రారంభమైన ఈ బిగ్ రియాల్టీ షోకు శనివారం (మే 20) శుభం కార్డు పలికారు. 83 రోజులు జరిగిన ఈ షోలో టాప్ 7 కంటెస్టెంట్స్‌గా బాబా భాస్కర్, అనీల్ రాథోడ్, మిత్రా శర్మ, అరియానా గ్లోరి, యాంకర్ శివ, అఖిల్ సార్థక్, బిందు మాధవి నిలిచారు. అనీల్ రాథోడ్, మిత్రా శర్మ, బాబా భాస్కర్ ఎలిమినేషన్ తర్వాత ఆట రసవత్తరంగా మారింది. అరియానా గ్లోరి రూ. 10 లక్షలతో బిగ్‌బాస్ నాన్‌స్టాప్ హౌజ్ నుంచి బయటకు వెళ్లింది. తర్వాత ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా యాంకర్ శివ బయటకు వెళ్లాడు. అనంతరం గోల్డెన్ బాక్స్‌తో హౌజ్‌లోకి వెళ్లిన నాగార్జున టాప్ 2 కంటెస్టెంట్స్ అయిన అఖిల్, బిందు మాధవి అనుభవాల గురించి అడిగి తెలుసుకన్నాడు. బిగ్‌బాస్ ఆదేశంతో వారిద్దరిని స్టేజ్‌పైకి తీసుకొచ్చాడు నాగార్జున. బిగ్‌బాస్ స్టేజ్‌పై ఫైనల్ విన్నర్‌గా బిందు మాధవిని ప్రకటించాడు నాగార్జున. దీంతో తెలుగు బిగ్‌బాస్ చరిత్రలోనే మొదటిసారిగా ఒక మహిళ గెలిచింది. తెలుగు బిగ్‌బాస్ తొలి మహిళా విజేతగా బిందు మాధవి నిలిచింది. దీంతో ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయింది బిందు. బిగ్‌బాస్ కప్ కొట్టాలన్న అఖిల్ ఆశలు మరోసారి అడియాశలే అయ్యాయి. -
Bigg Boss OTT: 10 లక్షల సూట్‌కేస్‌తో తప్పుకున్న అరియానా!
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విన్నర్ ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. గత సీజన్ల కంటే భిన్నంగా ఏడుగురు కంటెస్టెంట్లతో గ్రాండ్ ఫినాలేకి చేరుకున్న బిగ్‌బాస్ చివరి మజిలీకి చేరుకుంది. బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే అప్డేట్స్ అప్పుడే సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. నెట్టింట లీక్ అవుతున్న సమాచారం ప్రకారం.. బిందు మాధవి బిగ్‌బాస్ నాన్‌స్టాప్ టైటిల్ విన్నర్‌గా నిలిచింది. దీంతో ఈసారైనా విన్నర్ అవ్వాలన్నా అఖిల్ కల కలగానే మిగిలిపోయింది. బిగ్‌బాస్ చరిత్రలోనే తొలిసారి ఒక అమ్మాయి టైటిల్ విన్నర్‌గా నిలవడం బిందుకే సాధ్యమైంది. ఆడపులి హ్యాష్‌ట్యాగ్‌తో ఫేమస్ అయిన బిందు ఓటీటీ విన్నర్‌గా నిలిచి సత్తా చాటింది. కాగా ఈ సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన బాబా మాస్టర్ టాప్7 స్థానంలో నిలవగా, అనిల్ 6వ స్థానంలో నిలిచారు. ఆ తర్వాత మిత్రా, అరియానా గ్లోరీ, శివ వరుసగా టాప్- 3 స్థానాల్లో నిలిచినట్లు టాక్ వినిపిస్తుంది. టాప్-4లో ఉన్న కంటెస్టెంట్లకు నాగార్జున డబ్బులు ఆఫర్ చేయగా అరియానా గ్లోరీ 10 లక్షల బ్రీఫ్ కేసును తీసుకొని టైటిల్ రేసు నుంచి స్వయంగా తప్పుకుంది. ఆ తర్వాత టాప్-3లో ఉండగా మరోసారి డబ్బులు ఆఫర్ చేయగా, శివ, బిందు, అఖిల్ ఆ ఆఫర్‌ను తిరస్కరించారు.ఫైనల్‌గా బిందు, అఖిల్‌కి మధ్య జరిగిన రేస్‌లో బిందు విజేతగా నిలిచినట్లు తెలుస్తుంది. దీంతో సోషల్ మీడియా వేదికగా బిందుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. -
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విన్నర్‌గా ఆడపులి! చరిత్ర సృష్టించిన బిందు!
బుల్లితెర హిట్ షో బిగ్‌బాస్‌ను అభిమానించేవాళ్లు ఎంతోమంది. సాధారణ ప్రేక్షకులే కాదు పలువురు సెలబ్రిటీలు సైతం ఈ షోను ఫాలో అవుతుంటారు. గత సీజన్లలో గ్రాండ్ ఫినాలేకు వచ్చిన పలువురూ ఇదే మాట చెప్పారు. ఇక వెండితెరపై రాణించాలనుకునేవాళ్లు, జనాల మనసులు గెల్చుకోవాలనుకునేవాళ్లు, ఆర్థిక సమస్యలు చక్కదిద్దుకోవాలనుకునేవాళ్లు ఈ షోకు రావాలని తహతహలాడుతుంటారు. ఆల్రెడీ ఫేమస్ అయిన వాళ్లనే కాకుండా ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని ముఖాలను కూడా తీసుకువచ్చి వారికి పాపులారిటీ, అవకాశాలను తెచ్చిపెట్టిందీ షో. తెలుగులో ఐదు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ ఈసారి నాన్‌స్టాప్ పేరిట ఓటీటీలో హడావుడి చేసింది. 17 మంది కంటెస్టెంట్లతో ఫిబ్రవరి 26న మొదలైన ఈ షోకు ఈవారంతో శుభంకార్డు పడనుంది. ప్రస్తుతం హౌస్‌లో ఏడుగురు ఉన్నారు. గతంలో ఐదుగురు మాత్రమే ఫినాలేకు చేరుకునే అవకాశం ఉండేది. కానీ ఈసారి ఏకంగా ఏడుగురు ఫినాలేలో అడుగుపెట్టడం విశేషమనే చెప్పాలి. అనిల్, బిందు, అఖిల్, బాబా భాస్కర్, మిత్ర, శివ, అరియానా ఫినాలే వీక్‌లో అడుగుపెట్టారు. వీరిలో టైటిల్ ఎవరి సొంతం అవుతుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే అప్పుడే బిగ్‌బాస్ విన్నర్‌గా బిందుమాధవి నిలిచిందంటూ ప్రచారం జరుగుతోంది. అఖిల్‌ను వెనక్కు నెట్టి ఆడపులి బిందు టైటిల్ ఎగరేసుకుపోయిందంటూ #BinduTheSensation, #BinduMadhavi అన్న హ్యాష్‌ట్యాగ్‌లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. తెలుగు బిగ్‌బాస్ చరిత్రలోనే తొలిసారిగా ఒక అమ్మాయి గెలిచిందంటూ ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బిగ్‌బాస్ అంటే కేవలం ఫిజికల్ టాస్కులే కాదని వ్యక్తిత్వానికి కూడా సంబంధించిందన్న విషయాన్ని అభిజిత్ నిరూపించాడు. ఇప్పుడు బిందు తన విజయంతో మరోసారి చాటిచెప్పింది అని కామెంట్లు చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం.. బిందు విన్నర్‌గా, అఖిల్ సార్థక్ రన్నర్‌గా నిలిచినట్లు తెలుస్తోంది. మిత్ర శర్మ మూడో స్థానంలో ఉండగా యాంకర్ శివ నాలుగో స్థానంలో, అరియానా ఐదో స్థానంలో ఉన్నారట. ఇప్పటికే బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ఫినాలే షూట్ కావడంతో ఈ లీకులు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాలంటే నాగార్జున అధికారికంగా ప్రకటించేవరకు వేచి చూడాల్సిందే! చదవండి 👇 తప్పు చేస్తే రోడ్డు మీద నిలబెట్టి కొట్టండి, అంతేకానీ.. విడాకుల బాటలో బాలీవుడ్ దంపతులు! -
బిగ్‌బాస్ తెలుగు నాన్‌స్టాప్‌లో పాయల్ సపోర్ట్ ఎవరికో తెలుసా?
Bigg Boss Telugu OTT: బుల్లితెరపై ఎంతో ఆదరణ పొందిచి రియాలిటీ షో బిగ్‌బాస్. తెలుగులో ఇప్పటికే 5 సీజన్లు పూర్తి చేసుకున్న ఈషో ఓటీటీలోకి కూడా అడుగు పెట్టింది. తొలిసారి ఈ సో బిగ్‌బాస్ ఓటీటీ నాన్‌స్టాప్ పేరుతో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతుంది. ఓటీటీలో ప్రసారం అవుతున్న ఈ షోకి కూడా మంచి ప్రేక్షక ఆదరణ లభించింది. ప్రస్తుతం ఈ షో చివరి వారానికి చేరుకుంది. బిగ్‌బాస్ ఓటీటీ తొలి సీజన్ టైటిల్‌ను సొంతం చేసుకునేదెవరో తెలిసేందుకు ఇంకా కొద్ది రోజులే మిగిలి ఉన్నాయి. దీంతో హౌజ్‌లోని కంటెస్టెంట్స్ అంతా ఒకరికి ఒకరు గట్టి పోటీ ఇచ్చుకుంటున్నారు. చదవండి: Bigg Boss Non Stop: బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే, అసలైన పోటీ ఆ ఇద్దరి మధ్యే! ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో తన సపోర్ట్ ఎవరికో బయటపెట్టింది ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. ప్రస్తుతం బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌజ్‌లో బిందు మాధవి, అఖిల్, అరియానా, బాబా భాస్కర్ మాస్టర్, యాంకర్ శివ, మిత్రా శర్మ ఉన్నారు. ఇక శనివారం లోపు టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరూ అనేదానిపై క్లారిటీ కూడా వచ్చేస్తుంది. అయితే ఇదే సమయంలో బయట ఉన్న ఫ్యాన్స్ తమకు నచ్చిన కంటెస్టెంట్స్‌కు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. తాజాగా నటి పాయల్ రాజ్‌పుత్ కూడా సోషల్ మీడియా వేదికగా బిందు మాధవికి తన మద్దతు తెలిపింది. చదవండి: సర్కారు వారి పాట విజయంపై సూపర్ స్టార్ కృష్ణ స్పందన బిందు మాధవికి ఓటు వేసి గెలిపించాలని తన ఫాలోవర్స్‌ను కోరింది. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో బిందు ఫొటోను షేర్ చేస్తూ.. ‘నువ్వు టైటిల్ గెలవడానికి అర్హురాలివి’ అంటూ బిందుకు సపోర్ట్ చేసింది పాయల్. అయితే ఇప్పటివరకు బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో ఓ అమ్మాయి టైటిల్ గెలవలేదు. అయితే బిగ్ బాస్ నాన్ స్టాప్‌లో ట్రోఫీ గెలుచుకునే రేసులో ముందంజలో ఉంది బిందు మాధవి. తన ఆటతీరుతో పాటు బిందు మాధవికి సంబంధించిన ఎన్నో అంశాలు ప్రేక్షకులను ఫిదా చేసేస్తున్నాయి. అందుకే టాప్ 5లో బిందు ఉండాలని చాలామంది కోరుకుంటున్నారు. -
బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే.. టైటిల్ గెల్చుకునేదెవరో?
బిగ్‌బాస్ షో అంటే ఇష్టపడేవాళ్లే కాదు, ఇష్టపడనివాళ్లు కూడా ఉంటారు. బిగ్‌బాస్ కాన్సెప్ట్‌ను తిట్టిపోస్తూనే తీరా సమయానికి షో చూసి ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఎవరేమన్నా బుల్లితెర ఆడియన్స్ మాత్రం బిగ్‌బాస్ షోను విపరీతంగా ఆదరిస్తారు. తెలుగులో ఇప్పటివరకు ఐదు సీజన్లను ప్రేక్షకులు విజయవంతం చేశారు. ఈ ధైర్యంతో నిర్వాహకులు బిగ్‌బాస్ ఓటీటీని కూడా ముందుకు తీసుకువచ్చారు. కాకపోతే ఇది ఫ్యామిలీ అంతా చూడటానికి వీల్లేకుండా టీవీలోకి బదులుగా హాట్‌స్టార్ యాప్‌కు మాత్రమే పరిమితమైంది. అయినా సరే ఓటీటీలో ప్రయోగాత్మకంగా మొదలుపెట్టిన బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విజయవంతంగా చివరిదశకు చేరుకుంది. 17 మందితో మొదలైన ఈ షోలో మధ్యలో ఓ వైల్డ్‌కార్డ్ ఎంట్రీ కూడా చేరడంతో మొత్తం కంటెస్టెంట్ల సంఖ్య 18కి చేరుకుంది. ఇప్పటివరకు శ్రీరాపాక, చైతూ, సరయు, తేజస్వి, ముమైత్ ఖాన్, స్రవంతి, మహేశ్, అజయ్, హమీదా, అషూ, నటరాజ్ వరసగా ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌస్‌లో అరియానా, అనిల్, మిత్ర, శివ, బిందు మాధవి, అఖిల్, బాబా భాస్కర్ మిగిలారు. ఈ టాప్ 7లో నుంచి ఒకరు వారం మధ్యలోనే హౌస్‌ను వీడే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. దీంతో మిగిలిన ఆరుగురు ఫినాలేలో అడుగుపెడతారు. ఒకవేళ ఇదే నిజమైతే ఆరుగురు కంటెస్టెంట్లు ఫినాలేకు చేరుకోవడం ఇదే మొదటిసారవుతుంది. అయితే ఎప్పటిలా ఈసారి వార్ వన్‌సైడ్ అయిపోలేదు. అఖిల్ సార్థక్, బిందుమాధవి మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. ఎలాగైనా ఈసారి టైటిల్ గెలవాలని కసిగా ఆడిన అఖిల్‌కు అతడి అభిమానులు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. హౌస్‌మేట్స్‌ను ఓ కబడ్డీ ఆడుకున్న బిందుమాధవి ధైర్యానికి ముగ్ధులైపోయిన ఫ్యాన్స్ ఆమెను ఎలాగైనా గెలిపించాలని తాపత్రయపడుతున్నారు. ఈరోజుతో ఓటింగ్ ముగియనుండటంతో ఇరువురి ఫ్యాన్స్ వీలైనన్ని ఓట్లు గుద్దుతున్నారు. ఇక గురు, శుక్రవారాల్లో గ్రాండ్ ఫినాలే షూటింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది. మరి ఫినాలే ఎపిసోడ్ కూడా రెండు రోజులు ప్రసారం చేస్తారేమో చూడాలి! చదవండి: కరాటే కల్యాణితో దెబ్బలు తిన్న యూట్యూబర్‌కు బిగ్‌బాస్ 6 సీజన్లో ఆఫర్ -
అఖిల్‌ని టార్గెట్ చేయడమేనా నీ గేమా? బిందుకు అనసూయ సూటి ప్రశ్న
వరుస గెస్టులతో బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షో జిగేలుమంటోంది. మొన్నటిదాకా బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ కంటెస్టెంట్లు హౌస్‌లోకి వచ్చి సందడి చేయగా ఆ తర్వాత అశోకవనంలో అర్జున కల్యాణం టీమ్ హౌస్‌ను ఓ ఊపు ఊపేసింది. తాజాగా ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ బిగ్‌బాస్ హౌస్‌లో అడుగు పెట్టింది. అయితే నవ్వడానికి, నవ్వించడానికో ఆమె రాలేదు. ప్రేక్షకుల మనసులో మెదులుతున్న ప్రశ్నలను తూటాల్లా వదిలేందుకు వచ్చింది. ఈ సందర్భంగా మొదట అరియానాకు ఆడియన్స్ రాసిన ప్రశ్నను వదిలింది. 'ఫ్యామిలీ వీక్ తర్వాత బిందుకు క్లోజ్ అయ్యావు. ఎందుకు వుమెన్ కార్డు వాడుతున్నావు? సడన్‌గా ఎందుకిలా మారిపోయావు?' అని ప్రశ్నించింది. దీంతో అరియానా ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక ఇందులో ఉమెన్ కార్డు అనిపించిందంటే అది మీకే వదిలేస్తున్నా అని బదులిచ్చింది. అనంతరం బిందును.. ఎప్పుడూ గ్రూప్ గేమ్స్ ఆడుతావు. కానీ అఖిల్ గ్రూప్ గేమ్స్ ఆడతాడని నిందిస్తావు. ఎందుకు? అని అడిగింది. అయితే బిందు మాత్రం ఎప్పుడూ గ్రూప్ గేమ్ ఆడలేదని కుండ బద్ధలు కొట్టింది. ఆ తర్వాత అఖిల్ వైపు తిరిగి.. వెకేషన్‌ను ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? గత వారం రోజులుగా బిందు గురించి నెగెటివ్‌గా మాట్లాడమే పనైపోయింది. కానీ ఫ్యామిలీ వీక్ తర్వాత బిందుతో మంచిగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నావు, ఎందుకు? అని అడిగింది. మరి దీనికి అఖిల్ ఏమని సమాధానం చెప్తాడో చూడాలి! ఆ తర్వాత శివ వైపు చూసి 'ఎలా అనిపిస్తోంది? అడిగే దగ్గర నుంచి అడిగించుకునే దాకా?' అని సరదాగా అనడంతో అక్కడున్నవారంతా ఘొల్లున నవ్వారు. చదవండి: ముంబైలో కళ్లు చెదిరే ఫ్లాట్ కొన్న బుల్లితెర నటుడు నరకం చూపించారు, బర్త్‌డే రోజే నా కూతుర్ని చంపేశారు: మోడల్ తల్లి -
నటరాజ్ మాస్టర్‌తో ఫైటింగ్, ఉమ్మేసిన బిందు, నెట్టింట రచ్చరచ్చ
సాధారణంగా నామినేషన్స్ ప్రక్రియను బిగ్‌బాస్ ప్రేమికులు ఎంజాయ్ చేస్తారు. కానీ రెండు రోజులుగా సాగిన నామినేషన్స్‌తో ప్రేక్షకుల తల బొప్పి కట్టింది. కొట్టుకోవడం ఒక్కటే తక్కువగా అన్నట్లుగా పోట్లాడుకున్నారు హౌస్మేట్స్. ఆటలో రఫ్ఫాడించే నటరాజ్ మాస్టర్ నామినేషన్స్‌లోనూ జూలు వదిలిన సింహంలా పోరాడాడు. తనకు టాప్ 5లో ఉండే అర్హత లేదు అన్నందుకు బిందుమాధవిపై నిప్పులు చెరిగాడు. బయట పీఆర్ టీంలు పెట్టుకుని హౌస్‌లో కొనసాగుతోందని ఆరోపించాడు. ఈ క్రమంలో నటరాజ్ మాస్టర్ ముందు నిలబడిన బిందు అతడిని చూస్తూ ఉమ్మేసింది. ఆమె ప్రవర్తనకు అక్కడున్నవారంతా షాకయ్యారు. అటు సోషల్ మీడియాలోనూ నట్టూ ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఆడపులి అని పిలిపించుకోవచ్చు గానీ దానికి సమర్థత కూడా ఉండాలని చెప్తున్నారు. కనీసం అతడి వయసుకైనా గౌరవం ఇచ్చి ఉండాల్సిందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయినా స్ట్రాంగ్‌గా ఆడే నటరాజ్ మాస్టర్ ఎక్కడ? ఏమీ ఆడకుండా కూర్చునే బిందు ఎక్కడ? అని విమర్శిస్తున్నారు. కిల్లర్ టాస్క్ దగ్గర నుంచి ప్రతీ టాస్క్‌లోనూ నటరాజ్ చెడుగుడు ఆడేస్తూ అందరి మనసులు గెలుచుకున్నాడని, కానీ బిందు ఎక్కడ గేమ్ ఆడిందో కనిపించడం లేదని సెటైర్లు వేస్తున్నారు. ఆమె పీఆర్ టీం బిందుమాధవికి ఆడపులి అన్న ట్యాగ్ ఇచ్చిందని, ఇతర కంటెస్టెంట్లు ఆమెను ఏమన్నా సరే వారిపై బూతులతో రెచ్చిపోతూ కామెంట్లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమెను గెలిపించుకోవడానికి పీఆర్ టీం అహర్నిశలు కష్టపడుతోందని, అటు బిగ్‌బాస్ కూడా ఈసారి లేడీ విన్నర్‌కే కిరీటం పెట్టాలని ముందే ఫిక్స్ అయిపోయినట్లు కనిపిస్తోందని కామెంట్లు చేస్తున్నారు. అటు బిందు ఫ్యాన్స్ ఈ విమర్శలను తిప్పికొడుతున్నారు. ముందు నటరాజ్ మాస్టర్‌కు అమ్మాయిలను గౌరవించడం నేర్పించండని కౌంటర్ ఇస్తున్నారు. బిందు ఉమ్మేసినందుకే తప్పంటున్నారు, మరి అతడు బాబా భాస్కర్ ముందు కాండ్రించి ఉమ్మేశాడు. అప్పుడు మీకు రోషం పొడుచుకురాలేదా? అని తిట్టిపోస్తున్నారు. మొత్తానికి ఈ ఫ్యాన్స్ వార్తో సోషల్ మీడియాలో #BiggBossNonStop, #BinduMadhavi హ్యాష్‌ట్యాగ్ తెగ ట్రెండ్ అవుతున్నాయి. Tamil bigg boss antene istam anta... kamal hassan norella bettaru.. ee ammayi enti mother tongue ki value ivvatledu ani.. So nat master correct ganey guess chesaru.. cup kosamey telugollu kavali..aa tarvatha vadilestundi ani🔥 #BiggBossNonStop #BiggBossNonStopTelugu pic.twitter.com/98QOVa2UZv — BiggBossTeluguSpy (@bbteluguspy) May 11, 2022 One Contestant Vs All Other Contestants & BB Management & PR &Paid mafia & Trolls,Abuses,Harassment But Fighting like a warrior One &Only @thebindumadhavi#BinduMadhavi🐯 #BiggBossNonStop VOTE FOR BINDU MADHAVI pic.twitter.com/GvqJrvSG01 — Shareef (@UrsShareef) May 11, 2022 #BiggBossNonStop No Drama No Safe game No Fakeness No sympathy drama Only Genuine Honest Fearless in debate. Lady tigress #BinduMadhavi. VOTE FOR BINDU MADHAVI. Go to DISNEY PLUS HOTSTAR. Search BIGBOSS NONSTOP Select VOTE Click BINDU MADHAVI Give 10 VOTES. pic.twitter.com/Fm4vuqNKUk — N Harsha (@harshanamburi) May 11, 2022 #BiggBossNonStop For me this is her best It needs lots of guts and strength Becoz of this treatment, yesterday Mithraw behaved 80% normal and ariyana and Siva ripped her with point to point.#BinduMadhavi is a Brand now pic.twitter.com/GnVmup0Tsj — Vijay (@Vijay2itz) May 11, 2022 I am from Chennai, I support Baba Master.I don't support people who spit when others are speaking and people who are arrogant. All Tamilians support #BabaMaster Thanks #NatrajMaster for exposing #BinduMadhavi and asking us to vote for genuine people like Baba. #BiggBossNonStop https://t.co/a5caXnzjHM — AYUSH (@ayush45MM) May 11, 2022 చదవండి: నా విషయం పక్కనపెట్టు, నీ ముఖం సంగతేంటి?: ట్రోలింగ్‌కు నటి కౌంటర్ పరాశక్తిలా బిందు మాధవి ఫోజు.. శూర్పణఖ ఆడియెన్స్ నీ ముక్కు కోస్తారు -
పరాశక్తిలా బిందు మాధవి ఫోజు.. శూర్పణఖ ఆడియెన్స్ నీ ముక్కు కోస్తారు
Bigg Boss Non Stop Telugu Bindu Madhavi Vs Nataraj Master Fight: బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షో రసవత్తరంగా మారింది. మరికొన్ని రోజుల్లో గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ తరుణంలో ఫైనల్‌కు చేరుకునేది ఎవరా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ప్రస్తుతం బిగ్‌బాస్ హౌజ్‌లో అరియానా, బిందు మాధవి, నటరాజ్ మాస్టర్, మిత్ర, యాంకర్ శివ, అఖిల్, అనిల్, బాబా మాస్టర్ ఉన్నారు. అయితే పదకొండో వారం నామినేషన్స్‌లో భాగంగా బిగ్‌బాస్ ఏ ముగ్గురు ఫినాలేకు చేరుకోవడానికి అర్హులు కారో చెప్పాలని హౌస్‌మేట్స్‌ను ఆదేశించిన విషయం తెలిసిందే. తర్వాత 72వ రోజు ఈ టాస్క్‌ను కొనసాగించమని సూచించాడు. ఈ క్రమంలో అరియానా, బిందు మాధవి, బాబా మాస్టర్ అర్హులు కానివారిగా నటరాజ్ ఎంపిక చేశాడు. దీనికి సంబంధించిన ప్రొమోను మంగళవారం (మే 10) విడుదల చేశారు. ఈ ఎంపికలో బిందు మాధవిపై విరుచుకుపడ్డాడు నటరాజ్ మాస్టర్. 'నెగెటివిటీ మాత్రమే కంప్లీట్‌గా ఉన్న ఏకైక పర్సన్ నువ్ మాత్రమే' అని నటరాజ్ అనగా, 'నీ సైడ్ ఏమొచ్చింది ఇన్ని రోజులు పాజిటివిటీనా' అని తిరిగి క్వశ్చన్ చేస్తుంది బిందు మాధవి. 'నీ బెస్ట్ గేమ్ ఏంటి' అని నటరాజ్ అడిగిన ప్రశ్నకు 'ఐయామ్ ది మోస్ట్ స్ట్రాంగెస్ట్ పర్సన్ ఇన్ దిస్ హౌజ్' అని బిందు గట్టిగానే చెబుతుంది. తర్వాత ఇద్దరిమధ్య మాటలు పెరిగి నీ బండారం బయట పెడుతున్న కెమెరా వైపు చూసి అని నటరాజ్ చెబుతాడు. దీనికి బిందు మాధవి పరాశక్తిలా అవతారంలా ఫోజు ఇస్తుంది. దీనికి 'శూర్పణఖ నీ టైమ్ ఆసన్నమైంది ఇదిగో లక్ష్మణ బాణం. ఆడియెన్స్ నీ ముక్కు కోస్తారు.. పక్కా' అంటూ బాణం విసిరినట్టుగా ఫోజు ఇస్తాడు నటరాజ్ మాస్టర్. అలాగే అఖిల్-శివ, అఖిల్-బిందు మాధవి, నటరాజ్-బాబా మాస్టర్ మధ్య మాటల రచ్చను కూడా ఈ ప్రొమోను చూపించారు. చదవండి: పిచ్చి ముదిరింది, శూర్పణఖ అంటూ రెచ్చిపోయిన నటరాజ్ -
'బిందుమాధవికి పిచ్చి ముదిరింది', 'అఖిల్‌కు మైండ్ లేదు'
బిగ్‌బాస్ కథ క్లైమాక్స్‌కు చేరుకుంటోంది. మరో రెండు వారాల్లో బిగ్‌బాస్ నాన్‌స్టాప్ గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ క్రమంలో ఎవరు ఫైనల్‌కు చేరుకుంటారన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం హౌస్‌లో అరియానా, నటరాజ్ మాస్టర్, అనిల్, మిత్ర, యాంకర్ శివ, బిందు మాధవి, అఖిల్, బాబా భాస్కర్ ఉన్నారు. వీరిలో అఖిల్, బిందుమాధవి, యాంకర్ శివ, బాబా భాస్కర్, నటరాజ్ మాస్టర్ ఫినాలేలో చోటు దక్కించుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఈసారి టాప్ 5కి బదులుగా టాప్ 6 ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే ఆ ఐదుగురితో పాటు మిత్ర, అరియానాలలో ఒకరికి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే బిగ్‌బాస్ కథ చివరికి చేరుకుంటున్నా నామినేషన్స్‌లో మాత్రం ఫైర్ తగ్గడం లేదు. తాజాగా పదకొండో వారం నామినేషన్స్‌లో భాగంగా బిగ్‌బాస్ ఏ ముగ్గురు ఫినాలేకు చేరుకోవడానికి అర్హులు కారో చెప్పాలని హౌస్‌మేట్స్‌ను ఆదేశించాడు. దీంతో బిందుమాధవి ఊహించినట్లుగానే మిత్ర, అఖిల్, నటరాజ్‌లు ఫినాలేకు అనర్హులని చెప్పింది. నేనొకటి మాట్లాడుతుంటే అన్సింక్లో నువ్వొకటి మాట్లాడుతుంటవ్ అని అఖిల్ అనగా.. 'నీకు బ్రెయిన్ లేదు కదా, ఉంటే ఏం మాట్లాడుతున్నానో అర్థమయ్యేది అని ఫైర్ అయింది. ఎమోషన్స్ వాడుకుంటూనే ఎమోషన్స్ వాడనంటుంది, వాహ్.'. అని అఖిల్ బిందుపై సెటైర్ వేశాడు. అటు నటరాజ్.. నీ వల్ల మీ నాన్న ఫెయిల్ అయ్యాడు. ఈమెకు జ్ఞానాన్ని నేర్పండి. తెలుగమ్మాయికి ఉన్న ఒక్క లక్షణం కూడా నీకు లేదు అంటూ బిందు తండ్రికి రిక్వెస్ట్ చేశాడు. నిద్రపోయిన సింహాన్ని లేపావు అంటూ నటరాజ్ మాస్టర్ ఉడికిపోయాడు. 'పిచ్చి ముదిరిపోయింది, నీకు పిచ్చి, నీ పిచ్చి మొత్తం బయటకు తీస్తా, ఒక్కసారి కూడా గేమ్ ఆడలేదు, పనికిరాని పిల్లి' అని బిందును తిడుతూ రెచ్చిపోయాడు. మరి ఇంతకీ ఈ నామినేషన్స్‌లో ఎవరెవరున్నారో తెలియాలంటే రాత్రి 9 గంటల వరకు వేచి చూడాల్సిందే! చదవండి: అశును వరస్ట్ అన్న రవి, కోపంతో ఆమె ఏం చేసిందంటే? 'బిగ్ డే, నా కల నెరవేరబోతోంది' డైమండ్ రింగ్‌తో హీరోయిన్ -
ఇదేం ట్విస్టు, శివ వల్లే బిందుమాధవికి లక్కీ ఛాన్స్!
బిగ్‌బాస్ షోలో ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం హౌస్మేట్స్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. ఎలిమినేషన్ నుంచి గట్టెక్కించే ఈ ఆయుధాన్ని బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు అంత ఈజీగా ఇస్తాడా? ఛాన్సే లేదు. నానా టాస్క్‌లు ఆడిస్తూ హౌస్‌మేట్స్‌లో మరింత పట్టుదలను పెంచుతున్నాడు. ఈ క్రమంలో తాజగా యాంకర్ రవి హౌస్‌లో అడుగుపెట్టగా ఎవిక్షన్ ఫ్రీ పాస్ పోటీదారుడిగా యాంకర్ శివను ప్రకటించినట్లు తెలుస్తోంది. కానీ ఆ ఆనందం శివకు ఎంతోకాలం నిలవలేదు. తను అందుకున్న బాక్స్‌లో తన అవకాశాన్ని వేరొకరికి బదిలీ చేయాలని ఉంది. దీంతో శివ.. బిందుమాధవి ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం పోటీపడుతుందని ప్రకటించాడు. మూడు రోజులన ఉంచి నువ్వు జీరో పాయింట్స్ దగ్గరున్నావు, ఆడు అని చెప్పాడు. అంటే నేను ఆడలేదని ఇస్తున్నావా? నాకొద్దని తిరస్కరించింది బిందు. నేను సరిగా గేమ్ ఆడుతున్నానని నీకు నమ్మకం లేదు కదా అని ఆమె ఏడుపందుకోవడంతో శివ బిందును ఓదార్చాడు. కాస్త బుజ్జగింపుల తర్వాత బిందు కంటెండర్‌గా నిలిచేందుకు అంగీకరించింది. మరి ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం ఇంకా ఎవరెవరు పోటీదారులుగా నిలుస్తారో తెలియాలంటే బిగ్‌బాస్ నాన్‌స్టాప్ చూడాల్సిందే! చదవండి: నన్ను సెక్స్ స్కామ్‌లో ఇరికించి సోనాక్షిని స్టార్‌ను చేశారు సమంతతో పోల్చుకున్న ఉర్ఫీ, ఇదెక్కడి న్యాయం అంటూ ఆగ్రహం -
ఒక్క ఎపిసోడ్‌తో పాతాళానికి పడిపోయిన బిందు!
Bindu Madhavi: ఫ్యామిలీ ఎపిసోడ్‌తో బిగ్‌బాస్ ఓటీటీ మరింత రసవత్తరంగా మారింది. ముఖ్యంగా అఖిల్, బిందుమాధవి, యాంకర్ శివ మధ్యే టైటిల్ పోరు ఉందన్న విషయం స్పష్టమైంది. మరీ ముఖ్యంగా ఈసారి లేడీ కంటెస్టెంట్ గెలిచే అవకాశాలున్నాయంటూ సోషల్ మీడియాలో బిందుమాధవి గురించి విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఫినాలే దగ్గరపడిన తరుణంలో ఎంతో జాగ్రత్తగా, ఆచితూచి ఆటాడాల్సిన క్రమంలో బిందు మాధవి అదుపు తప్పుతోంది. గట్టిగట్టిగా అరుస్తూ తను చెప్పేదే రైట్ అని బల్లగుద్ది చెప్పే తను నిన్నటి ఎపిసోడ్లో చిత్రవిచిత్రంగా ప్రవర్తించింది. సాధారణంగా నామినేషన్స్‌లో మిత్ర తను నామినేట్ చేయాలనుకునేవాళ్లను ఇమిటేట్ చేసి ఇరిటేట్ చేస్తుంటుంది. కానీ ఈసారి మాత్రం బిందు ఆ పనిని తన భుజానెత్తుకుంది. మిత్రను నామినేట్ చేస్తూ ఆమె ఎలా ప్రవర్తించేదో ఇమిటేట్ చేసి చూపించింది. ఈ క్రమంలో ఆమె ప్రవర్తన అతిగా అనిపించింది. ఒకరకంగా చెప్పాలంటే తనను చులకన చేస్తూ మాట్లాడింది. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో 'ఎలిమినేట్ బిందుమాధవి'(#Eliminate Bindu Madhavi) అన్న హ్యాష్‌ట్యాగ్ ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. మిత్ర మాట్లాడుతున్నంతసేపూ బిందు ఆమెను ఇమిటేట్ చేస్తూ పిచ్చి పిచ్చి చేష్టలతో ఈ సీజన్లోనే వరస్ట్ బిహేవియర్ అనిపించిందని పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. దగ్గరైనవాళ్లకే వెన్నుపోటు పొడుస్తావని మిత్రను నిందించిన బిందు.. మరి తనకు క్లోజ్ అయిన శివను నామినేట్ చేయడం వెన్నుపోటు కాదా? అని ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా టైటిల్ రేసులో ఉన్న బిందు ఈ ఒక్క ఎపిసోడ్‌తో పాతాళానికి పడిపోయిందంటున్నారు. కానీ బిందు ఫ్యాన్స్ మాత్రం ముళ్లును ముళ్లుతోనే తీయాలని, మిత్రకు సరిగ్గా బుద్ధి చెప్పిందని సపోర్ట్ చేస్తున్నారు. Motham pre-planned nomination from #BindhuMadhavi Eliminate Bindu Madhavi pic.twitter.com/AaCw8tjKne — Wierd_explorer1 (@Explorer1Wierd) May 3, 2022 From the first day I didn't likes her she behaves very worst she should be kicked out of the house Eliminate Bindu Madhavi pic.twitter.com/LcoOhBrJmh — rajesh (@ujjwalsaaho3) May 3, 2022 Targeting someone on the personal aspects is worst from any contestants and she has been then worst in that Eliminate Bindu Madhavi pic.twitter.com/TbCRt9m3Iz — Chandini (@LoveForChandini) May 3, 2022 చదవండి: నేను కథ వినను: ఎడిటర్ ఆయన ఫోటో చూసి బోరున విలపించిన మిత్రాశర్మ -
అమ్మాయిలా, రాక్షసులా? మిత్ర చేయి విరగ్గొట్టేలా ఉన్నారే!
బాబా భాస్కర్ ఎంట్రీతో బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షో మరింత రసవత్తరంగా మారింది. ఆయన వచ్చీరావడంతోనే బిందుమాధవిని సేవ్ చేయడంతో అందరూ ముక్కున వేలేసుకున్నారు. తాజాగా అతడు కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో సంచాలక్‌గా ఉన్నాడు. అరియానా, హమీదా, బిందుమాధవి, అజయ్, నటరాజ్ మాస్టర్ ఏలియన్స్ టీమ్‌లో, మిగిలినవారంతా హ్యూమన్స్ టీమ్‌లో ఉన్నారు. ఏలియన్స్ దగ్గర ఉన్న బ్యాటరీలను దొంగిలించి పగలగొట్టడం హ్యూమన్స్ పనైతే వారి చేతులకు రంగు పూయడం ఏలియన్స్ పని. ఈ టాస్క్ కోసం రక్తాలు కారేలా ఆడారు హౌస్మేట్స్. అమ్మాయిలా, ఆటంబాంబులా అనేలా రెచ్చిపోయారు ఏలియన్స్ టీమ్ సభ్యులు. అయితే ఈ క్రమంలో వారు గేమ్‌లో శృతి మించిపోయినట్లు కనిపిస్తోంది. హ్యూమన్స్ టీమ్‌లోని మిత్ర శర్మను దొరపుచ్చుకుని ఆమె చేతికి రంగు పూయాలని భావించింది ఏలియన్స్ టీమ్. అనుకున్నదే తడవు పదేపదే ఆమెను టార్గెట్ చేస్తూ దాడి చేసింది. ఆమె చేయి పట్టుకుని లాగుతూ, కిందపడేస్తూ నానారచ్చ చేశారు. కిందపడేసినప్పుడు తనకు దెబ్బలు తాకినా ఏమాత్రం పట్టించుకోకుండా బిందు మాధవి ఆమె చేయి పట్టుకుని లాగింది. ఒకరకంగా చెప్పాలంటే హమీదా, అరియానా, బిందు ఆమెను హింసించారు. దీంతో సోషల్ మీడియాలో వీరిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆమె చేయి విరగ్గొట్టేలా ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిత్ర అవస్థను గుర్తించిన బాబా భాస్కర్వెంటనే వెళ్లి జుట్టు సరిచేసి చెమట తుడిచి గేమ్ పాజ్ చేశాడు. అటు అఖిల్ ఆమె షర్ట్ పైకి పోవడంతో దాన్ని కిందకు సరిచేశాడు. వీళ్లిద్దరూ అంత మానవత్వంతో ప్రవర్తిస్తుంటే ఆ ముగ్గురు మాత్రం మరీ దారుణంగా వ్యవహరించారని తిట్టిపోస్తున్నారు నెటిజన్లు. మిత్ర గేమ్ ఆడిన విధానం బాగుందని మెచ్చుకుంటున్నారు. చదవండి: యశ్ నుంచి ప్రకాశ్ రాజ్ దాకా.. కేజీఎఫ్ 2 నటీనటుల పారితోషికం ఎంతంటే? నన్ను కొట్టింది, నేనూ కొడ్తా: మిత్ర వెనకాల హమీదా పరుగు -
బిందు మాధవి లేకుండానే మొదలైన షూటింగ్
బిందుమాధవి ప్రధాన పాత్రలో నటిస్తున్న భక్తి కథా చిత్రం నాగ.. చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. నటుడు శ్రీకాంత్ హీరోగా నటిస్తున్న ఇందులో మరో నాయికగా నటి రైసా నెల్సన్ నటిస్తున్నారు. ఎమ్మెస్ మూవీస్ అధినేత కె.మురుగన్ నిర్మిస్తున్న తాజా చిత్రం ఇది. ప్రస్తుతం ప్రభుదేవా, మహిమా నంబియార్ జంటగా ఈయన నిర్మిస్తున్న గరుడ పంచమి చిత్రం నిర్మాణదశలో ఉంది. తాజాగా నిర్మిస్తున్న నాగ చిత్రానికి ఛార్లెస్ దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ బ్రహ్మాండమైన గ్రాఫిక్స్ సన్నివేశాలతో రూపొందిస్తున్న చిత్రం ఇదని చెప్పారు. పురాణాల్లో చెప్పినట్లుగా నాగలోకం ఇప్పటికీ ఉన్నట్లు గ్రాఫిక్ సన్నివేశాలతో ఈ చిత్రంలో చూపిస్తున్నట్లు తెలిపారు. సముద్రగర్భం నుంచి పైకి వచ్చే మానసాదేవి అనే పంచ తల్లి నాగదేవతకు సంబంధించిన సన్నివేశాలు ఆ బాలగోపాలాన్ని అలరిస్తాయన్నారు. తమిళనాడులోని నాగ ర్ కోవిల్ తదితర ప్రాంతాల్లో ఉన్న నాగరాజా ఆలయాల్లో చిత్రీకరణ నిర్వహించినట్లు చెప్పారు. -
నామినేషన్స్ రచ్చ.. ఈవారం నామినేషన్స్‌లో ఎవరున్నారంటే
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ రసవత్తరంగా సాగుతోంది. ఈ షోలో అన్ని రోజులు ఒక ఎత్తైతే, నామినేషన్స్ రోజు మరొక ఎత్తు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆరోజు వీరు చేసే రచ్చ మామూలుగా ఉండదు. అప్పటిదాకా కలిసిమెలిసి ఉన్నవాళ్లు కూడా నామినేషన్స్ వచ్చేసరికి మాత్రం అన్నీ పక్కనపెట్టేసి నామినేట్ చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షోలో ఎనిమిదో వారం నామినేషన్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారాయి. షోలో మొదటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్‌లా కలిసున్న అషూ, అరియానా నామినేషన్స్‌లో మాత్రం బద్ద శత్రువులుగా మారినట్లు ప్రోమో చూస్తే అర్థమవుతుంది. ఇక మరోవైపు ఎప్పటిలాగే బిందు, అఖిల్ ఈసారి కూడా నామినేషన్స్‌లో గొడవ పడ్డారు. స్రవంతి అనే ఎమోషన్‌ను యూజ్ చేసుకున్నావంటూ బిందు ఫైర్ అయ్యింది. దీంతో చిర్రెత్తిపోయిన అఖిల్ ఏం మాటలు మాట్లాడుతున్నావ్? పిచ్చిదానిలా మాట్లాడుతున్నావ్ అంటూ మండిపడ్డాడు. అజయ్, హమీదా కూడా ఒకరిని ఒకరు నామినేట్ చేసుకున్నారు. మొత్తానికి వాడివేడిగా సాగిన ఈ ప్రక్రియలో అఖిల్, అషూ, అజయ్, అనిల్, హమీదా, బిందు నిలిచారు. వీరిలో బాబా భాస్కర్ మాస్టర్ పన పవర్‌ని ఉపయోగించి బిందుని సేవ్ చేసినట్లు తెలుస్తోంది. -
నా కన్నతల్లిని ఎప్పుడూ చూడలేదు: కన్నీళ్లు పెట్టుకున్న మిత్ర
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షోలో ఎన్నో ప్రయత్నాల అనంతరం ఎట్టకేలకు కెప్టెన్ అయ్యాడు యాంకర్ శివ. మరోపక్క కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో అయోమయంతో నిర్ణయాలు తీసుకున్న అషూ వరస్ట్ కంటెస్టెంట్‌గా ఎంపికై జైలు పాలయ్యింది. ఇదిలా ఉంటే తాజాగా బిగ్‌బాస్ వారికి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకునే అవకాశం కల్పించాడు. కొన్ని ఫ్యామిలీ ఫొటోలను పంపించి దానితో మీకున్న అనుభవాలను తెలియజేయమన్నాడు. ఈ సందర్భంగా నటరాజ్ మాస్టర్ తను డ్యాన్స్ చేస్తున్నట్లుగా ఉన్న ఫొటో చూపిస్తూ ఎమోషనలయ్యాడు. 'చదువుకోకుండా డ్యాన్సులేంట్రా? ప్రభు మాస్టర్ ఏమైనా ఫుడ్ పెడతాడా? అని తిట్టేవారు. కానీ ఈరోజు నేను ఫుడ్ తింటున్నాను, నా ఫ్యామిలీని చూసుకుంటున్నాను, ఇంతపెద్ద ప్లాట్‌ఫామ్ మీదకు వచ్చి మీకు ఫుడ్ పెడుతున్నాను అంటే అదంతా ప్రభు మాస్టర్ వల్లే' అని చెప్పుకొచ్చాడు. శివ తన ఫ్యామిలీ ఫొటో చూపిస్తూ.. ఈ ఫొటో తర్వాత అమ్మవాళ్లతో కలిసిలేను. అమ్మ నన్ను ఇంట్లో నుంచి పంపించేసింది అని బాధపడ్డాడు. తర్వాత మిత్ర తన చిన్ననాటి ఫొటో చూపిస్తూ భావోద్వేగానికి లోనైంది. 'నన్ను పట్టుకున్న చేయి మా అమ్మది, కానీ నా కన్నతల్లిని నేనెప్పుడూ చూడలేదు. అమ్మ చేయి మాత్రమే నాకు తెలుసు' అని తెలిపింది. తర్వాత అనిల్ వంతు రాగా నా కంటే ముందు అన్నయ్య ఉండేవాడు, కానీ పుట్టిన రెండు రోజులకే చనిపోయాడు అంటూ ఏడ్చేశాడు. అటు బిందుమాధవి కూడా అన్నయ్యతో దిగిన ఫొటోలు చాలా తక్కువ అని, అతడిని మిస్ అవుతున్నానని చెప్పింది. చదవండి: ప్రియురాలితో యాంకర్ వివాహం, నెట్టింట ఫొటోలు వైరల్ ప్రేక్షకులు మెచ్చిన తెలుగు వెబ్ సిరీస్‌లు ఇవే.. -
ఛీ, అషూ నువ్వు అమ్మాయివేనా? అజయ్ నోటికొచ్చినట్లు వాగుతావా?
బిగ్‌బాస్ షోలో హద్దులు మీరి ప్రవర్తించినా, బూతులు మాట్లాడినా దాన్ని ఎడిటింగ్‌లో తీసే ఆస్కారం ఉండేది. కానీ బిగ్‌బాస్ తెలుగు ఓటీటీలో మాత్రం అలాంటి చాన్స్ లేదు. 24 గంటలు లైవ్ స్ట్రీమింగ్ ఉండటంతో కంటెస్టెంట్లు ఏం మాట్లాడినా, ఏం చేస్తున్నా ప్రతీది ప్రేక్షకుడు ఓ కంట గమనిస్తూనే ఉంటాడు. అయితే నాన్‌స్టాప్ షోలో ఆది నుంచి వల్గర్ జోకులు, బూతుపురాణం నడుస్తూనే ఉంది. ఈసారి ఆ హాస్యం మరింత హద్దు మీరింది. నిన్నటి కెప్టెన్సీ కంటెండర్స్ టాస్కులో అఖిల్, బిందును ఒక టీమ్‌గా ఏర్పాటు చేశాడు బిగ్‌బాస్. వీళ్లు మిగతా జోడీలకంటే బాగానే ఆడుతున్నారు. అయితే ఈ గేమ్‌కు సంచాలకురాలిగా ఉన్న అషూ మాత్రం ఎప్పటిలాగే తన నోటి దురుసు ప్రదర్శించింది. అఖిల్.. మిత్ర దగ్గరకు వెళ్లి తనకు, బిందుకు రెండు యాపిల్స్, రెండు అరటిపండ్లు, రెండు ఆరెంజ్ కావాలని డీల్ మాట్లాడుకుంటున్నాడు. ఇది విన్న అషూ టాస్క్ ఆడబోతున్నారా? ఫస్ట్ నైట్‌కు పోతున్నారా? అంటూ సెటైర్ వేసింది. దీనికి అఖిల్ ఏమీ అనకుండా ఓ నవ్వు విసిరాడు. ఇక మరో చోట అఖిల్, అషూ, అజయ్, నటరాజ్ బెడ్ మీదకు చేరి ముచ్చట్లు పెట్టారు. ఆ సమయంలో అఖిల్.. అజయ్ చెవిలో శివ, బిందు హీరోహీరోయిన్స్ అంటూ ఊదాడు. దీనికి అజయ్ దుప్పట్లో దడదడే అంటూ కామెంట్ చేయగా మధ్యలో అషూ అందుకుని ముసుగులో గుద్దులాట అని మాట్లాడింది. దీంతో ఓ అడుగు ముందుకేసిన అజయ్ గోడకేసి గుద్దు అంటూ ఓ టైటిల్ ఇచ్చాడు. ఈ సంభాషణ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారగా ఇంత నీచంగా మాట్లాడతారా? అని ఫైర్ అవుతున్నారు నెటిజన్లు. అషూ ఒక అమ్మాయి అయి ఉండి మరో ఆడదాని గురించి ఇంత దారుణంగా మాట్లాడుతుందా? అని తిట్టిపోస్తున్నారు. ఇక నటరాజ్ మాస్టర్, అజయ్.. నామినేషన్స్ గురించి మాట్లాడుకున్నారు. హమీదా తల మీద చేయి వేసి మాట్లాడుతుంది. ఆమె తనకు అమ్మలాగా అనిపిస్తుందని, తనకోసమే నామినేట్ అయ్యానని అనిల్ బిందుతో చెప్పాడట అంటూ నటరాజ్ మాస్టర్ చెప్పుకొచ్చాడు. దీనికి అజయ్.. వాడు అమ్మాయి టచ్ కోరుకున్నాడు అని అడ్డగోలుగా ఆన్సరిచ్చాడు. దీంతో అజయ్‌ను సైతం నెట్టింట ఆడేసుకుంటున్నారు. బిందుమాధవి, హమీదాలకు కనీస మర్యాద ఇవ్వండని డిమాండ్ చేస్తున్నారు. “Whenever you think about disrespecting a woman, think about how you were born into this world.” #BinduMadhavi RESPECT GIRLS IN BB NON STOP#BiggBossNonStop pic.twitter.com/nYm0SZRgeO — Raju Reddy (@RajuRed55149023) April 12, 2022 Statements passed by AS which exposed male chauvinist attitude out of him 1. Pampering kaavala? 2. Nenu kalaloki vastunna anindi 3. Punishment ga massage cheyamani adgatam All on a single strng woman #Bindu Y soo insecure Mr. AS? Verry disgusting to c this#BiggBossNonStop — 𝑀𝒶𝒽𝑒𝓈𝒽 ✨😇 (@ursTrulyMahi88) April 9, 2022 #BinduMadhavi #BiggBossNonStop I want body massage I want Mango pandu I want eat Mango pandu I want Mango Pandu rasalu Dupatlo dadthad Musugulo gudulata Godamida vese dadthad. Aada sentiment drama .#akhilsarthak and gang talks about a woman. RESPECT GIRLS IN BB NON STOP — N Harsha (@harshanamburi) April 12, 2022 Again and again. Akhil to Mithraw on deal: Me and Bindu need 2 apple, 2 banana, 2 orange Ashu to akhil: Task adapothunara, first night ku pothunara 😡😡😡 its going worse day by day. Passing sexualized jokes over Bindu.#BiggBossNonStop — Vijay (@Vijay2itz) April 12, 2022 🤐 no words .. very disturbing behavior.. @DisneyPlusHSTel @DisneyPlusHS @iamnagarjuna @StarMaa please address this or eliminate them . #BiggBossNonStop #BinduMadhavi https://t.co/XBZh1F5WzO — Sirisha (@jayareddyv) April 13, 2022 చదవండి: మిత్ర శర్మ నాకు రూ.5 లక్షలు ఇస్తానని చెప్పింది: స్రవంతి చిరంజీవిని గట్టిగా కొట్టాను, ముఖం ఎరుపెక్కిపోయింది: రాధిక -
కలిసిపోయిన అఖిల్- బిందు, ఇక రచ్చరచ్చే!
'అరేయ్ అఖిల్.. ఒసేయ్ బిందూ..' అంటూ ఒకరి మీద ఒకరు నోరు పారేసుకున్నారు బిగ్‌బాస్ కంటెస్టెంట్లు. ఎవరూ తగ్గేదేలే అన్న రీతిలో గొడవపడ్డారు. ఈ దెబ్బతో అఖిల్, బిందు మాట్లాడుకోవడం కల్ల అనుకున్న తరుణంలో బిగ్‌బాస్ అనూహ్యంగా వాళ్లిద్దరినీ కలిపాడు. అవును, ఓ టాస్క్‌లో ఈ ఇద్దరినీ ఒక టీమ్‌గా ఏర్పాటు చేశాడు. బిగ్‌బాస్ హౌస్‌మేట్స్‌కు 'ఇది మా అడ్డా' అనే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా ఇంటిని ఐదు ప్రాంతాలుగా విభజించాడు. ఇంటిసభ్యులను కూడా ఐదు టీములుగా విభజిస్తూ ఒక్కో ప్రాంతాన్ని వారికి అప్పగించాడు. అఖిల్ - బిందు, అజయ్- అరియానా, యాంకర్ శివ- నటరాజ్, అనిల్- హమీదా జంటలుగా విడిపోయారు. కెప్టెన్ అషూ సంచాలకురాలిగా వ్యవహరించింది. ఈ గేమ్‌లో అఖిల్- బిందు కలిసి ఆడుతూ ఎత్తుకు పైఎత్తులు వేశారు. బిందు అయితే ఏకంగా అరియానా పాస్‌లు కొట్టేసి అఖిల్ చేతిలో పెట్టింది. ఇప్పటివరకు వీళ్ల కొట్లాటలనే చూశాం, మరి వీరి గేమ్ చూడాలంటే రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: ఆస్కార్ విన్నర్ నిర్మాత నిశ్చితార్థం.. ఎమోషనల్‌గా పోస్ట్ మిత్ర శర్మ నాకు రూ.5 లక్షలు ఇస్తానని చెప్పింది: స్రవంతి -
కోలీవుడ్ హీరోతో బిందు మాధవి ప్రేమలో ఉందా? ట్వీట్ వైరల్
తెలుగమ్మాయి బిందు మాధవి టాలీవుడ్లో కంటే కోలీవుడ్‌లోనే ఎక్కువ పాపులర్ అయ్యింది. ఆవకాయ బిర్యానీతో తెలుగులో హీరోయిన్గా మంచి గుర్తింపు సాధించినా అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. దీంతో కొన్నాళ్లు తెలుగుతెరపై ఎక్కడా కనిపించలేదు. కానీ బిగ్‌బాస్ పుణ్యమా అని మళ్లీ ఇన్నాళ్లకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తనదైన ఆటతీరుతో ఆశ్చర్యపరుస్తున్న బిందుకు సోషల్ మీడియాలోనూ సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వోటింగ్ విషయంలోనూ ముందంజలో ఉంటూ టైటిల్ హాట్ ఫేవరేట్‌గా దూసుకుపోతుంది. అయితే తాజాగా బిందు లవ్ ఎఫైర్ గురించి ఓ వార్త సోషల్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. తమిళ యంగ్ హీరో హరీష్ కళ్యాణ్ బిందు మాధవికి సపోర్ట్ చేస్తూ చేసిన ట్వీట్ ఇందుకు కారణం. గతంలో వీరిద్దరు రిలేషన్లో ఉన్నారని జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా ఈ కోలీవుడ్ హీరో బిందుకు సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేయడంతో మరోసారి ఈ రూమర్స్ తెరపైకి వచ్చాయి. కాగా తమిళ సీజన్1లో బిందు మాధవి పాల్గొన్న సంగతి తెలిసిందే. హీరో హరీష్ కళ్యాణ్ కూడా అదే సీజన్లో మరో కంటెస్టెంట్‌గా ఉన్నాడు. ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందని టాక్ వచ్చింది. తాజాగా మరోసారి ఈ విషయం తెరపైకి వచ్చింది. Best wishes to my dear friend @thebindumadhavi your doing a great job in #BiggBossNonStopTelugu 🔥👌🤗#BiggBossNonStopTelugu #ShowStealerBindu — Harish Kalyan (@iamharishkalyan) April 10, 2022 -
కత్తితో దాడి చేద్దామనుకున్నాను: శివను బెదిరించిన నటరాజ్
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షో వీకెండ్‌కు రెడీ అవుతోంది. అయితే ఎలిమినేషన్ కన్నాముందు వరస్ట్ పర్ఫామర్‌ను ఎన్నుకోవాల్సిన సమయం వచ్చేసింది. దీంతో మెజారిటీ ఇంటిసభ్యులు బిందుమాధవి పేరును ప్రస్తావించినట్లు తెలుస్తోంది. గేమ్‌లో నిర్లక్ష్యంగా వ్యవహరించి కాయిన్స్ పోగొట్టుకుందంటూ చాలామంది ఆమెను చెత్త ప్లేయర్‌గా అభిప్రాయపడ్డారు. ఆఖరికి ఆమె ఫ్రెండ్ యాంకర్ శివ కూడా కాయిన్స్ పోగొట్టుకోవడం తప్పంటూ బిందుకు వరస్ట్ పర్ఫామర్ ట్యాగ్ ఇచ్చాడు. ఈ క్రమంలో బిందు తన ఆటను తప్పుపట్టిన హౌస్మేట్స్ తీరును తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. దీంతో మరోసారి అఖిల్, బిందుమాధవి మధ్య గొడవ రాజుకుంది. ఈ వారం బిందు వరస్ట్ పర్ఫామర్‌గా ఎంపికై జైల్లో పడ్డట్లు కనిపిస్తోంది. మరోవైపు అటు నటరాజ్ మాస్టర్, యాంకర్ శివ మధ్య కూడా పెద్ద ఫైట్ నడిచినట్లు కనిపిస్తోంది. కొట్టకపోతే అడుగు అంటూ శివకు సవాలు విసిరాడు నటరాజ్. ఇద్దరూ ఒకరిమీదకు ఒకరు దూసుకెళ్తుండటంతో వీరి కొట్లాటను ఆపే ప్రయత్నం చేసింది కెప్టెన్ అషూ. కోపంతో రగిలిపోయిన నటరాజ్ మాస్టర్ కిచెన్‌లో కూడా చిందులు తొక్కాడు. నాకు రక్తం మరిగిపోతుంది, ఎన్నిసార్లు ఊరుకుంటాను? కత్తి తెచ్చి కట్ చేసి పాడేద్దామనుకున్నాను అని ఆవేశంతో ఊగిపోయాడు. చివర్లో మనిషికి రెండు కళ్లు, శివుడికి మూడు కళ్లు, నటరాజ్‌కు ఒళ్లంతా కళ్లు అన్న తనదైన స్టైల్లో డైలాగ్ వదిలాడు నటరాజ్ మాస్టర్. చదవండి: ఓటీటీల్లో మిస్ అవ్వకూడని టాప్ 6 సినిమాలు.. ఏడేళ్ల లవ్.. బావ అనుమానించాడు: అరియానా బ్రేకప్ స్టోరీ -
Bigg Boss: అఖిల్- బిందుమాధవికి విడాకులు, ముమైత్ రీఎంట్రీ!
బుల్లితెరపై ప్రసారమయ్యే బిగ్‌బాస్ ఇప్పుడు అరచేతిలోకి వచ్చేసింది. టీవీలో కాకుండా కేవలం ఓటీటీలోనే ప్రసారమవుతోంది బిగ్‌బాస్ ఓటీటీ. వినోదానికి లేదు ఫుల్స్టాప్ అంటూ బిగ్‌బాస్ నాన్‌స్టాప్ 24 గంటలు స్ట్రీమింగ్ అవుతోంది. 17 మందితో ప్రారంభమైన ఈ షోలో ఇప్పటికే నలుగురు ఎలిమినేట్ అయ్యారు. అందులో ముమైత్, శ్రీరాపాక, చైతూ, సరయు ఉన్నారు. అయితే మొట్టమొదటగా ఎలిమినేట్ అయిన ముమైత్ తాజాగా హౌస్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఈ మేరకు ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో అఖిల్.. బిందుమాధవి గురించి మాట్లాడటంతో హర్ట్ అయినట్లుంది అషూ. ఇక హౌస్‌లో ఓ టాస్క్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. భార్యాభర్తలకు మధ్య జరిగిన గొడవను పరిష్కరించేందుకు కోర్టు సీన్‌ను ఏర్పాటు చేయగా.. ఇందులో శివ లాయర్‌గా వాదిస్తున్న సమయంలో సడన్‌గా ముమైత్ రీఎంట్రీ ఇచ్చింది. ఆమె రాకతో హౌస్మేట్స్ సర్ప్రైజ్ అయ్యారు. వచ్చీరాగానే జడ్జి స్థానంలో కూర్చున్న ముమైత్ విడాకుల సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేసింది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం అఖిల్, బిందుమాధవిలకు ముమైత్ విడాకులు మంజూరు చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ ఎపిసోడ్ ఎలా సాగిందో తెలియాలంటే రాత్రి 9 గంటల వరకు వేచి చూడాల్సిందే! చదవండి: ఆమెను సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని హాస్టల్లో పెట్టాను: యాంకర్ భర్త -
అఖిల్- బిందు మధ్య బిగ్ ఫైట్... హీటెక్కిస్తున్న ప్రోమో
Bigg Boss Non Stop Latest Promo Is Out: బుల్లితెరపై బిగ్‌బాస్ నాన్‌స్టాప్ రసవత్తరంగా సాగుతోంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 24గంటల పాటు ప్రసారం అవుతున్న బిగ్‌బాస్‌లో వినోదంతో పాటు గొడవలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. అప్పటి వరకు ఫ్రెండ్స్‌గా ఉన్న వారు కూడా టాస్క్‌లు వచ్చేవరకు ఎనిమీలుగా మారుతున్నారు. ఇక బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో ప్రస్తుతం కెప్టెన్సీ టాస్క్ జరుగుతున్న సంగతి తెలిసిందే. శివను ఆ రౌండ్లో ఎలిమినేట్ చేసే ప్రక్రియలో అఖిల్, బిందు మాధవికి మధ్య పెద్ద గొడవ జరిగింది. నువ్వు ఇప్పటివరకు ఎన్ని సార్లు కెప్టెన్సీ కంటెండర్ అయ్యావని అఖిల్ ప్రశ్నించగా.. నీలా నాకు ఫ్రెండ్స్ సపోర్ట్ చేయలేదు అంటూ బిందు కౌంటర్ వేసింది. 'ఫ్రెండ్స్ సపోర్ట్ లేకుండా నువ్వు ఒక్క గేమ్ కూడా ఆడలేవు. ఫ్రెండ్స్ సపోర్ట్‌తో బతుకుతుంది నువ్వు.. నేను కాదు. ఫ్రెండ్స్ సపోర్ట్ లేకుండా అఖిల్ ఈ ఇంట్లో బతకలేడు'.. అంటూ మండిపడింది. 'ఈ మాటలు పడటానికి వచ్చానా నేను.. ఇష్టం వచ్చిన మాటలు అంటున్నావ్' అంటూ అఖిల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ ఫైట్‌లో అజయ్ తన ఫ్రెండ్స్ అఖిల్‌కి సపోర్ట్‌గా నిలుస్తాడు. మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడాలని బిందుతో గొడవకు దిగుతాడు. దీనికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. -
అందంపై నటరాజ్ మాస్టర్ సెటైర్లు, ఇచ్చిపడేసిన బిందు మాధవి!
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షోలో వినోదం కంటే గొడవలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. బిగ్‌బాస్ కంటెస్టెంట్లను వారియర్స్, చాలెంజర్స్ అంటూ రెండు టీములుగా విభజించడంతో వారి మధ్య పోటీ రసవత్తరంగా మారింది. తాజాగా మరోసారి ఈ రెండు టీముల మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయి. ఈ మేరకు హాట్‌స్టార్ తాజాగా ప్రోమో రిలీజ్ చేసింది. వారియర్స్.. వారి వసతులు గెలుచుకునేందుకు చివరి అవకాశంగా ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. బాస్కెట్ బొనాంజా టాస్క్‌లో వారియర్స్ గెలవగా వారు లగేజీ, బెడ్రూమ్ యాక్సెస్‌లో ఏదో ఒకటి పొందే చాన్స్ దక్కింది. దీంతో వారియర్స్ లగేజీ తీసుకుంటున్నామని ప్రకటించారు. ఆ తర్వాత వారియర్స్ వంట చేయడంలో బిజీగా అయిపోగా ఆర్జే చైతూ చాలెంజర్స్‌ను వెంటేసుకుని కిచెన్‌లో అడుగుపెట్టాడు. 'బెడ్రూం లేదా లగేజీ యాక్సెస్.. ఈ రెండింటిలో ఏ వసతిని వారియర్స్‌కు ఇవ్వాల్సి ఉంటుందో చాలెంజర్స్ సభ్యులు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది' అని కొత్త నిబంధనను వినిపించాడు చైతూ. దీంతో కెప్టెన్ అషూ.. మా లగేజీని వెనక్కు తీసుకోవాలుకుంటున్నారా? అని అడిగింది. ఏదివ్వాలని మేము నిర్ణయించాలి, కానీ మీరు ముందుగానే తీసేసుకున్నారని చెప్పడానికి వచ్చామని బిందుమాధవి తెలిపింది. దీనికి నటరాజ్ మాస్టర్ స్పందిస్తూ.. మనకు అందమెంత ఇచ్చాడో మన మనసు, ఆలోచన కూడా అంతే అందంగా ఉండాలని తేజస్వితో చెప్పుకొచ్చాడు. ఫేస్ టు ఫేస్ డైరెక్ట్‌గా చెప్తే వింటాను అని గట్టిగా ఇచ్చిపడేసింది బిందు. అందమైన మనసుండాలని చెప్పానంతేనని నటరాజ్ మాస్టర్ ఆన్సరిచ్చాడు. మరి వీరి గొడవ ఎంతదూరం వెళ్తుందో చూడాలంటే నేడు రాత్రి 9 గంటలకు హాట్‌స్టార్‌లో ప్రసారమయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే! E choose the answer ki anni aatankale! Mana housemates edi enchukuntaru? Catch them on @DisneyPlusHS today at 9 PM on #BiggBossNonStop #BiggBoss #BiggBossTelugu @endemolsunshineind pic.twitter.com/fnJRkzi7mr — DisneyPlus Hotstar Telugu (@DisneyPlusHSTel) March 9, 2022 -
ప్రేమించుకున్నాం, కానీ విడిపోయాం, అది మాత్రం చెప్పను: హీరోయిన్
ఈసారి 'నాన్‌స్టాప్' ఎంటర్టైన్మెంట్తో సరికొత్తగా ముందుకు వచ్చింది బిగ్‌బాస్. 17 మంది కంటెస్టెంట్లతో ఫిబ్రవరి 26న గ్రాండ్‌గా ప్రారంభమైందీ షో. ఈసారి కొత్త కంటెస్టెంట్లే కాకుండా మాజీలు సైతం రంగంలోకి దిగారు. అందులో రన్నరప్ అఖిల్‌తో పాటు అరియానా, తేజస్వి, అషూ, మహేశ్ విట్టా, నటరాజ్ మాస్టర్, సరయు, హమీదా, ముమైత్ ఖాన్ ఉన్నారు. వీరంతా వారియర్స్ టీమ్‌లా ఏర్పడగా కొత్తగా ఎంట్రీ ఇచ్చిన చైతూ, బిందుమాధవి, మిత్ర శర్మ, శ్రీరాపాక, అజయ్, అనిల్, శివ, స్రవంతి చాలెంజర్స్ టీమ్‌లో ఉన్నారు. ఇప్పటివరకు జరిగిన ఆటల్లో దాదాపు వారియర్స్‌దే పైచేయి అవుతూ వస్తోంది. దీంతో చాలెంజర్స్ ఎలాగైనా వారియర్స్‌ను ఓడించాలని కసిగా ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా కంటెస్టెంట్లు వారి వ్యక్తిగత విషయాలను హౌస్‌మేట్స్‌తో పంచుకోవాలనే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. అందులో భాగంగా 'ఆవకాయ బిర్యానీ' హీరోయిన్ బిందుమాధవి తన లవ్ లైఫ్‌ను వివరించింది. కాలేజీలో చదువుకునే రోజుల్లో ఇద్దరం ప్రేమించుకున్నామని, కానీ కెరీర్ కోసం దూరమవ్వాల్సి వచ్చిందని తెలిపింది. అతడు పై చదువుల కోసం అమెరికా వెళ్లిపోగా తాను నటన మీదున్న ఆసక్తితో సినీరంగంలోకి వచ్చేశానని పేర్కొంది. అయితే ఇప్పటికీ ఆ రిలేషన్ తనకెంతో స్పెషల్ అన్న బిందు ప్రియుడి పేరును మాత్రం వెల్లడించలేదు. అంతేకాదు, అతడికి పెళ్లి కూడా అయిపోయిందని తెలిపింది. కాగా ప్రియుడితో బ్రేకప్ అయిన సమయంలో డిప్రెషన్లోకి వెళ్లిపోయానని గతంలో బిందు బిగ్‌బాస్ స్టేజీ మీదే చెప్పుకొచ్చింది. అలాంటి సమయంలో తమిళ బిగ్‌బాస్ నుంచి ఆఫర్ రావడంతో షోకి వెళ్లగా.. ఆశ్చర్యంగా కొన్నిరోజుల్లోనే డిప్రెషన్ నుంచి బయటపడినట్లు చెప్పింది. ఇప్పుడు తెలుగులోనూ ఛాన్స్ రావడంతో ఇక్కడి ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు నాన్‌స్టాప్ షోలో అడుగుపెట్టింది బిందుమాధవి. -
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విన్నర్‌గా బిందుమాధవి
బిందుమాధవి అచ్చ తెలుగు హీరోయిన్. 'ఆవకాయ బిర్యానీ', 'రామరామ కృష్ణకృష్ణ' సినిమాల్లో కథానాయికగా నటించిన ఈమెకు తెలుగులో పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో కన్నడ ఇండస్ట్రీలో వాలిపోయిన ఆమెకు అక్కడ అవకాశాలతోపాటు ఆదరణ కూడా బాగానే ఉండటంతో అక్కడే సెటిలైంది. కన్నడ బిగ్‌బాస్‌లోనూ పాల్గొన్న బిందు తెలుగు బిగ్‌బాస్ ఓటీటీలో పాల్గొంది. షో ప్రారంభంలో ఆమె మాట్లాడుతూ.. 'కన్నడ బిగ్‌బాస్ షోలో వైల్డ్‌కార్డ్ ఎంట్రీగా అడుగుపెట్టాను. అప్పుడు నేను డిప్రెషన్లో ఉన్నాను. లవ్ ఫెయిల్యూర్ వల్ల నేను ఎంతో బాధలో ఉన్నాను. కానీ షో నుంచి బయటకు వచ్చేసరికి డిప్రెషన్ నుంచి బయటపడ్డాను. నా స్వస్థలం చిత్తూరులోని మదనపల్లి. బిగ్‌బాస్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వాలనుకుంటున్నాను' అని చెప్పుకొచ్చింది. మస్తీ ట్యాగ్‌తో హౌస్‌లో అడుగుపెట్టిన హీరోయిన్ బిందుమాధవికి ఆడపులిగా పేరు తెచ్చుకుంది. తన ఆటతో, ధైర్యంతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుని విజేతగా అవతరించింది. -
బిగ్‌బాస్ బ్యూటీకి బంపర్'ఆఫర్స్'
సాక్షి, చెన్నై: బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షోలో పాల్గొన్న అనంతరం బిందుమాధవి చాలా ఖుషీగా ఉంది. షో ద్వారా చాలా మంది పాపులారిటీ తెచ్చుకున్నారు. నటి ఓవియ, రైసా లాంటి హీరోయిన్లకు బిగ్‌బాస్ ముందు, ఆ తరువాత అని చెప్పుకునేలా కెరీర్ మారింది. బిగ్‌బాస్ గేమ్‌లోకి కాస్త ఆలస్యంగా వచ్చిన నటి బిందుమాధవి కేరీర్ ఇప్పుడు జోరందుకుంది. పళనియప్పన్ దర్శకత్వంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. పార్తీపన్ కణవు లాంటి వైవిధ్య కథా చిత్రాల దర్శకుడు పళనియప్పన్ చాలా గ్యాప్ తరువాత మోగాఫోన్ పడుతున్నారు. ఆయన పెగళేంది ఎనుమ్ నాన్ అనే చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇందులో అరుళ్‌నిధి హీరోగానూ, బిందుమాధవి హీరోయిన్‌గానూ నటించనున్నారు. ఈ సందర్భంగా బిందుమాధవి స్పందిస్తూ అవకాశాలు చాలానే వస్తున్నాయని, అయితే వాటిని ఎంపిక చేసుకునే విషయంలో కేర్ తీసుకుంటున్నానని తెలిపింది. నటనకు అవకాశం ఉన్న కథా పాత్రల్నే కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. అలాంటి చిత్రమే పుగళేంది ఎనమ్ నాన్ అని తెలిపింది. కరు పళనియప్పన్ చిత్రాలలో కథానాయికలకు ప్రాముఖ్యం ఉంటుందని, అలాంటి దర్శకుడితో పని చేయనుండటం సంతోషంగా ఉందని అంది. పుగళేంది ఎనుమ్ నాన్ రాజకీయ నేపధ్యంలో సాగే కథ అని, అయినా తన పాత్రలో నటనకు అవకాశం ఉంటుందని చెప్పింది. అదే విధంగా అరుళ్‌నిధికి జంటగా నటించడం ఆనందంగా ఉందని అంది. ఈ చిత్రం తరువాత నటుడిగా ఆయన స్థాయి మరింత పెరుగుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ చిత్రం డిసెంబరులో సెట్‌పైకి వెళ్లనుందనీ, ఆ రోజు కోసం చాలా ఎగ్జైట్‌గా ఎదురు చూస్తున్నట్లు చెప్పింది. -
త్రిష ఇల్లన్నా బిందుమాధవి
త్రిష లేకుంటే నయనతార (త్రిష ఇల్లన్నా నయనతార) అన్న సినిమా టైటిల్ విన్నాం. ఇదేంటి త్రిష లేకుంటే బిందుమాధవి అంటున్నారు అన్నదేగా మీ సందేహం. ఇంతకు ముందు మీరు విన్నది రీల్ కథ. ఇది రియల్ కహానీ. నటి త్రిష నిర్మాత, వ్యాపారవేత్త వరుణ్ మణియన్ ల రియల్ ప్రేమ భాగోతం అందరికీ తెలిసిందే. వారి ప్రేమ నిశ్చితార్థం వరకూ వెళ్లి పెళ్లి పీటలెక్కలేకబోయింది. అయితే పెళ్లికి ముందే వరుణ్ మణియన్ తో త్రిష ప్రత్కేక విమానంలో విహారయాత్ర పేరుతో వెళ్లి ఆగ్రాలో ప్రేమికుల చిహ్నంగా భావించే తాజ్‌మహాల్ ప్రాంతాలను చుట్టి ఎంజాయ్ చేసొచ్చిన విషయం తెలిసిందే. అయితే వివాహానంతరం నటనకు స్వస్తి చెప్పాలన్న వరుణ్‌మణియన్ షరతు ఆమోదనీయంగా లేక పోవడంతో త్రిష ఆయనతో పెళ్లిని రద్దు చేసుకున్నట్లు అప్పట్లో ప్రచారం జోరుగా సాగింది. ఆ ప్రేమ కథ ముగిసి ఏడాది దాటిందో లేదో నిర్మాత వరుణ్‌మణియన్ గురించి మరో ప్రేమ కథ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ సారి నటి త్రిషకు బదులు నటి బిందుమాధవి ఆయనతో చేరారు. కేడి బిల్లా కిల్లాడి రంగా, కళుగు, దేసింగ్‌రాజా, జాక్సన్ దురై తమిళ చిత్రాల్లో నటించిన బిందుమాధవి తెలుగమ్మాయన్నది తెలిసిన విషయమే. ఈ మధ్య పెద్దగా అవకాశాలు లేని ఈ బ్యూటీ నిర్మాత వరుణ్‌మణియన్ తో కలిసి విహారయాత్రకు వెళ్లి షికార్లు కొట్టొచ్చారు. ఆ ఫొటోలను ఇంటర్నెట్లో పోస్ట్ చేసి, ఆనక వెంటనే డెలిట్ చేశారు.అయినా జరగాల్సిందేదో జరిగిపోయింది. నటి బిందుమాధవి, వరుణ్‌మణియన్ ల సన్నిహిత ఫొటో దృశ్యాలిప్పుడు సోషల్‌మీడియాల్లో హల్చల్ చేస్తున్నాయి. మరి వీరి విహారకథ ఏ మలుపు తిçరుగుతుందో వేచి చూడాలి. -
హైకూ టైటిల్ మారింది
సూర్య అతిథి పాత్రలో నటిస్తూ 2డీ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం హైకూ. పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అమలాపాల్, బిందుమాధవి, కార్తీక్‌కుమార్ ప్రధాన పాత్రలు పోషించగా కవిన్, నయన,అభిమాన్ తదితర నవ నటీనటులు ముఖ్య పాత్రలు పరిచయం అవుతున్నారు. బాలల ఇతివృత్తంగా రూపొందుతున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. అయితే ఈ పరిస్థితుల్లో ఇప్పుడీ చిత్ర పేరు మారనుంది. హైకూ అనేది ఆంగ్లం పేరు కావడంతో రాష్ట్ర ప్రభుత్వ రాయితీలకు చిత్రం అర్హత లేని కారణంగా పసంగ-2గా పేరు మార్చినట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. ఇంతకు ముందు పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందిన పసంగ చిత్రం మంచి ప్రేక్షకాదరణ పొందడంతో పాటు జాతీయ అవార్డులను గెలుచుకున్న విషయం అందరికీ తెలిసిందే. దీంతో ఈ పసంగ చిత్రంపైనా ఎక్కడలేని అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇటీవల చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్లు విడుదలయ్యాయి. ఈ చిత్రానికి అరోల్ కొరెల్లి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని వచ్చే నెలలో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ సంస్థ త్వరలో విడుదల చేయనుంది. -
లవ్ ఆఫ్ భల్లాల దేవ!
అచ్చమైన తెలుగందం బిందుమాధవి చాలా విరామం తర్వాత ఓ అనువాద చిత్రంతో మళ్లీ తెలుగు ప్రేక్షకులను అలరించనున్నారు. తమిళంలో విమల్, బిందుమాధవి జంటగా ఎళిల్ దర్శకత్వంలో రూపొందిన ‘దేశింగు రాజా’ చిత్రాన్ని ‘భల్లాల దేవ’ పేరుతో రావిపాటి సత్యనారాయణ తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ సినిమా టీజర్‌ను మంగళవారం హైదరా బాద్‌లో సీనియర్ దర్శకుడు కోదండరామిరెడ్డి ఆవిష్కరించారు. ‘‘ఈ సినిమాకు ‘భల్లాల దేవ’ అనే టైటిల్ పెట్టడం తమాషాగా ఉంది. తమిళంలో లాగే తెలుగులో కూడా విజయం సాధించాలి’’ అని కోదండరామిరెడ్డి ఆకాంక్షించారు. -
చాలా రోజుల తరువాత..!
‘ఆవకాయ్ బిర్యానీ’, ‘పిల్ల జమీందార్’ చిత్రాల ఫేం బిందు మాధవి గుర్తున్నారా? చాలా కాలంగా ఆమె ఏ తెలుగు చిత్రంలోనూ కనిపించలేదు. ఎందుకంటే తమిళంలో వరుసగా సినిమాలు చేస్తున్నారామె. అక్కడ ఆమె కథానాయికగా నటించిన ‘దేశింగు రాజా’ చిత్రాన్ని ‘భల్లాల దేవ’ పేరుతో రావిపాటి సత్యనారాయణ తెలుగులోకి అనువదించారు. ఎళిల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విమల్ హీరో. నిర్మాత మాట్లాడుతూ- ‘‘బిందు మాధవి నటన, గ్లామర్ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి. పూర్తి వినోదభరితంగా తెరకెక్కిన ఈ చిత్రం తమిళంలో మంచి విజయం సాధించింది. ఈ నెలాఖరున లేదా సెప్టెంబరులో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: డి.ఇమాన్, మాటలు: కృష్ణతేజ. -
విక్రమ్‌కు జంటగా బిందుమాధవి
చెన్నై : ఊహించనవి జరగడమే జీవితం అంటారు. అలాగే అదృష్టం అన్నది ఎప్పుడు ఏ రూపంలో తలుపు తడుతుందో చెప్పలేము. నిన్నటివరకు అరకొర అవకాశాలతో అదీ చిన్న హీరోలతో నటిస్తూ ఆశ నిరాశల మధ్య జీవితాన్ని ఈడ్చుకొస్తున్న నటి బిందుమాధవికిప్పుడు లడ్డులాంటి అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. ఏకంగా సియాన్ విక్రమ్‌తో డ్యూయెట్లు పాడడానికి రెడీ అయిపోతోంది. ఎస్ విక్రమ్ సరసన ఒక హీరోయిన్గా నటించే అవకాశం బిందుమాధవిని వరించింది. పత్తుఎండ్రదుకుళ్ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్న విక్రమ్ తదుపరి చిత్రానికి సిద్ధం అయ్యారు. ఈ చిత్రానికి మర్మ మనిదన్ అనే పేరును కూడా నిర్ణయించారు. అరిమానంబి చిత్రం ఫేమ్ ఆనంద్‌శంకర్ దర్శకత్వం వహించనున్న ఈచిత్రాన్ని ఐయిన్గారన్ సంస్థ నిర్మించనుంది. ఇందులో ఒక హీరోయిన్గా కాజల్‌అగర్వాల్ ఎంపిక కాగా మరో హీరోయిన్గా ప్రియాఆనంద్ ఎంపికైంది. అయితే ఇప్పుడామెను తొలగించి ఆ పాత్రలో బిందుమాధవిని ఎంపిక చేశారు. ఆ చిత్ర షూటింగ్ బుదవారం లాంఛనంగా ప్రారంభించారు. అధిక భాగం షూటింగ్‌ను మలేషియా, బ్యాంకాక్, చెన్నై ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు సమాచారం. మొత్తం మీద బిందుమాధవి పెద్ద అవకాశాన్నే కొట్టేసింది. ఈ చిత్రం ఆమెను ఏ స్థాయికి చేర్చుతుందో వేచి చూడాల్సిందే. -
నమ్మకాన్ని నూరిపోశాడా!
విజయం ఎండమావిగా మారితే నిరాశ, నిస్ఫృహలు చుట్టుముట్టడం సహజం. నటి బిందుమాధవి పరిస్థితి ఇంచుమిం చు అలాంటిదే. ఈ తెలుగమ్మాయికి తెలుగు మార్కెట్ కన్నా తమిళంలో కాస్త బెటర్ అనుకున్నా ఇక్కడా ఆమె విజయం కోసం చకోరి పక్షిలా ఎదురు చూసున్నారన్నది నిజం. తొలి రోజల్లో కళుగు, కేడిబిల్లా కిల్లాడిరంగా, దేసింగ్ రాజా వంటి చిత్రాలు బిందుమాధవికి విజయానందాన్నిచ్చినా ఆ తరువాత అవి ముఖం చాటేశాయనే చెప్పాలి. అవకాశాలు కూడా తగ్గుముఖం పట్టాయి. అలాంటి సమయంలో పాండిరాజ్ దర్శకత్వంలో హైకూ చిత్రంలో నటించే అవకాశం రావడంతో మరుమాట లేకుండా ఒప్పేసుకుంది. అయితే అది పసంగ, మెరీనా వంటి బాలల ఇతి వృత్తంతో రూపొందుతున్న చిత్రం కావడం నటుడు సూర్య, అమలాపాల్ లు అతిథి పాత్రల్లో నటించడంతో ఆ చిత్రం తన కేరీర్‌కు ఏమాత్రం హెల్ప్ అవుతుందోనన్న సందిగ్ధంలో పడ్డ బిందుమాధవికి తాజాగా సిబి రాజ్‌తో జాక్సన్ దురై చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. నాయ్‌గళ్ జాగ్రతై చిత్రంతో హిట్‌ను అందుకున్నా అంతకు ముందు సిబి రాజ్‌కు సరైన విజయం లేదన్నది గమనార్హం. దీంతో ఆయనతో నటిస్తున్న జాక్సన్ దురై విజయతీరం చేరుకుంటుందా అన్న అనుమానం బిందుమాధవిని పట్టి పీడిస్తోందట. ఆమె చింతను పసిగట్టారో ఏమో గానీ జక్సన్ దురై చిత్ర షూటింగ్ సెట్లో కూర్చున్న బిందుమాధవితో ఈ చిత్రం సాధారణ దెయ్యం కథా చిత్రం కాదు హాలీవుడ్ చిత్రాల స్థాయిలో రూపొందుతున్న చిత్రం కచ్చితంగా సక్సెస్ అవుతుంది.. అని ధైర్యాన్ని నూరిపోశారట. మరి బిందు మాధవి ఎంత వరకు కన్వెన్స్ అయిందో గానీ ప్రస్తుతం ఆమె ఆశలన్నీ హైకూ, జాక్సన్ దురై చిత్రాలపైనే పెట్టుకుందన్నది నిజం. -
సినీనటి బిందుమాధవి పరిస్థితి విషమం
సినీ నటి బిందుమాధవి తీవ్ర ఆనారోగ్యంతో నిమ్స్‌లో చేరారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. తీవ్రమైన కాలేయ సమస్యతో బాధపడుతున్నట్టు జూనియర్ వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. -
అండర్ స్టాండింగ్ ఉంది
అట్టకత్తి ఫేమ్ దినేష్‌కు తనకు మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉండటంతో చిత్ర అవుట్‌పుట్ బాగా వచ్చిందని నటి బిందుమాధవి తెలిపారు. వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం తమిళుక్కు ఎన్ 1 ఐ అళుత్తువుం. మరో జంటగా నకుల్, ఐశ్వర్యదత్ నటిస్తున్నారు. రామ్ ప్రకాష్ రాయప్ప దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వీఎల్‌కే రాక్ సినిమా పతాకంపై నిర్మాత వి.చంద్రన్ నిర్మిస్తున్నారు. విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం వివరాలను తెలియచేయడానికి చిత్ర యూనిట్ శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిందుమాధవి మాట్లాడారు. తానింతవరకు నటించిన చిత్రాల్లోనే వైవిధ్యభరిత పాత్రను ఈ చిత్రంలో పోషించానని చెప్పారు. చిత్ర హీరో దినేష్‌కు తనకు మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉండడంతో తాము నటించిన సన్నివేశాలకు మంచి అవుట్‌ఫుట్ వచ్చిందన్నారు. చిత్ర దర్శకుడు, ఛాయాగ్రాహకుడితోను తనకు మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యిందని తెలిపింది. అనంతరం ఈ చిత్రానికి పని చేసిన సహాయ దర్శకులందరినీ వేదిక పైకి పిలిచి వీరి సహకారం మరువలేనిదని పేర్కొన్నారు. భాషరాని తనకు వీరి సహకారం లేనిదే పాత్రకు న్యాయం చేయడం సాధ్యం కాదని వారి శ్రమను బిందుమాధవి ప్రశంసించారు. -
స్విట్జర్లాండ్‌లో అశోక్ సెల్వన్‌తో..
నగర వాతావరణంలో పుట్టి పెరిగిన నటి బిందుమాధవి. అయితే ఈ అచ్చ తెలుగు అమ్మాయికి కోలీవుడ్‌లో ఎక్కువగా పల్లెపడుచు పాత్రలే వరించడం విశేషం. ఇటీవల నటిగా కాస్త వెనుకబడిన బిందుకు తాజాగా ఒక చిత్రం వచ్చింది. ఈ చిత్రం కోసం ఈ బ్యూటీ ఏకంగా స్విట్జర్లాండ్ చుట్టి రానుండడం విశేషం. బిందుమాధవి నటిస్తున్న తాజా చిత్రం సవాలే సమాలి. ఇప్పటి వరకు పోషించని సరికొత్త పాత్రను ఈ చిత్రంలో చేస్తున్నారట ఈ అమ్మడు. కోలీవుడ్‌లో అధికంగా గ్రామీణ పాత్రలే పోషించిన బిందుమాధవి ఈ చిత్రంలో చాలా మోడ్రన్ పాత్రను ధరిస్తున్నారట. దీని గురించి ఈ జాణ మాట్లాడుతూ సవాలే సమాలి చిత్రం తన గత ఇమేజ్ను పూర్తిగా మార్చేస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. నిజం చెప్పాలంటే ఈ చిత్రంలోని పాత్ర తనకు చాలా రిలీఫ్ నిస్తుందనే చెప్పాలన్నారు. హోమ్లీ ఇమేజ్ను కూడా ఈ పాత్ర బ్రేక్ చేస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతే కాదు ఈ చిత్రం కోసం తొలిసారిగా స్విట్జర్లాండ్ చుట్టొస్తున్నట్లు పేర్కొన్నారు. హీరో అశోక్ సెల్వన్‌తో కలసి అక్కడ ఒక డ్యూయెట్ పాడుకున్నట్లు తెలిపారు. సవాలే సమాలి వైవిధ్య భరిత కామెడీ ఎంటర్టైనర్ చిత్రం అని చెప్పారు. తనకు అశోక్ సెల్వన్‌కు మధ్య లవ్ ట్రాక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నారు. మరో విషయం ఏమిటంటే త్వరలో మరోసారి పాండిరాజ్ దర్శకత్వంలో నటించనున్నట్లు చాలా ఎగ్జైటింగ్‌తో చెప్పారు. ఈ చిత్రం గురించిన విషయాలను తానిప్పుడు చెప్పలేనన్నారు. ప్రస్తుతం పాండిరాజ్ శింబు, నయనతార జంటగా నటిస్తున్న ఇది నమ్మ ఆళు చిత్రాన్ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. -
సేవకురాలిగా
ఈతరం నాయికల్లో హన్సిక, త్రిష వంటి వారు తమ నటనతో ప్రేక్షకులను అలరిస్తూనే మరో పక్క సామాజిక సేవల్లో తరిస్తున్నారు. అలా ప్రస్తతం కళా సేవ చేస్తున్న అచ్చ తెలుగు ముద్దుగుమ్మ బిందుమాధవి. నిజ జీవితంలో సామాజిక సేవ గురించి పక్కనపెడితే అలాంటి పాత్రను మాత్రం తన తాజా చిత్రంలో పోషిస్తున్నారు. కోలీవుడ్‌లో మోస్ట్ గ్లామరస్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం తమిళుక్కు ఎన్ ఒండ్రై అళుత్తవుం (ప్రెస్ 1 పర్ తమిళ్) చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఈ ముద్దు గుమ్మ సోషల్ వర్కర్ పాత్రలో నటిస్తున్నారట. దీని గురించి బిందుమాధవి తెలుపుతూ ఈ చిత్రంలో తన పాత్ర చాలా హోమ్లీగా ఉంటుందన్నారు. బ్యాంక్‌లో పని చేసే ఈ పాత్ర పేరు సిమి అని తెలిపారు. సామాజిక దృక్పథంతో కూడిన ఈ పాత్ర తనకు చాలా బాగా నచ్చిందన్నారు. జీవితంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కొనే సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న తమిళుక్కు ఎన్ ఒండ్రై అళుత్తవుం చిత్రంలో నటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. చిత్రంలోని పాత్రలన్నీ ఆ సంఘటన చుట్టూనే తిరుగుతాయని వివరించారు. తన పక్కన అట్టకత్తి దినేష్ నటిస్తున్నారని మరో జంటగా నకుల్, ఐశ్వర్య దత్‌లు నటిస్తున్నారని వెల్లడించారు. దర్శకుడు రామ్‌ప్రకాశ్, తన పాత్రను చాలా వైవిధ్యంగా తీర్చిదిద్దారని చెప్పారు. ఇలాంటి పాత్రలో నటించడం ఆనందంగా ఉందని బిందుమాధవి అంటున్నారు. తమిళుక్కు ఎన్ ఒండ్రై అళుత్తవుం చిత్రం మూడు ప్రేమ కథలతో తెరకెక్కిస్తున్న థ్రిల్లర్ చిత్రం అని దర్శకుడు తెలిపారు. -
జూన్‌లో తమిళుక్కు ఒండ్రై అలుత్తవుం
తమిళుక్కు ఒండ్రై అలుత్తవుం చిత్రం జూన్‌లో విడుదలకు సిద్ధం అవుతోంది. యువ నటుడు నకుల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో మరో హీరోగా అట్టకత్తి దినేష్ నటిస్తున్నారు. హీరోయిన్లుగా బిందుమాధవి, నవ నటి ఐశ్వర్య నటిస్తున్నారు. వి.ఎల్.ఎస్.రాక్ సినిమా పతాకంపై వి.చంద్రన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా నూతన దర్శకుడు రామ్‌ప్రకాష్ పరిచయం అవుతున్నారు. ఈయన దర్శకుడు శరవణన్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేశారు. పలు యాడ్ ఫిలిం చేసినా రామ్ ప్రకాష్ తన తొలి చిత్రం తమిళుక్కు ఒండ్రై అలుత్తవుం చిత్రం గురించి తెలుపుతూ ఒక సంఘటనతో వేదనకు గురై కథలోని పాత్రలు చివరికి ఆ వేదన నుంచి ఎలా బయటపడతాయనేది ఈ చిత్రం అని తెలిపారు. చిత్రంలోని ప్రధాన పాత్రలను ఆ సంఘటన కలుపుతుందన్నారు. చిత్రంలో లవ్, యాక్షన్, థ్రిల్లర్, సస్పెన్స్ అంటూ అన్ని కమర్షియల్ అంశాలు చోటు చేసుకుంటాయని తెలిపారు. అయితే ఇతర కమర్షియల్ చిత్రాలకు పూర్తి డిఫరెంట్‌గా ఉంటుందని చెప్పగలనన్నారు. ఇది ట్రెండ్ సెట్ చేస్తుందన్నారు. చిత్రంలో నకుల్ పోరాట దృశ్యాలు అచ్చెరువు పరుస్తాయన్నారు. అట్టకత్తి దినేష్ పాత్ర కూడా చాలా కొత్తగా ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈయనకు జంటగా బిందు మాధవి, నకుల్ సరసన ఐశ్వర్య నటిస్తున్నారని ఈ చెన్నై బేస్డ్ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి అయ్యిందని ఒక్క పాటను దినేష్, బిందుమాధవిలపై చిత్రీకరించాల్సి ఉందని దర్శకుడు వెల్లడించారు. చిత్రాన్ని జూన్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
బిందు టైమ్ బాగుంది
జయాపజాయాలే హీరోహీరోయిన్ల మార్కెట్‌ను డిసైడ్ చేస్తాయన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొందరి విషయంలో నటనలో ప్రతిభ ఉన్నా అదృష్టం దోబూచులాడుతూ ఉంటుంది. ఈ కోవలోకి నటి బిందు మాధవి వస్తుం ది. ఈ తెలుగింటి భామ కొన్ని తెలుగు చిత్రాల్లో నటించినా ప్రస్తుతం తమిళ చిత్రాలపైనే దృష్టిసారించింది. తొలి రోజుల్లో విజయం ముఖం చాటేసినా ఆ తర్వాత కేడీబిల్లా కిల్లాడి రంగా, దేసింగురాజా వంటి చిత్రాలతో సక్సెస్ఫుల్ హీరోయిన్ అని అనిపించుకుంది. ఈ బ్యూటీకి ఎందుకో రావలసినంత పేరు రాలేదు. అలాగే స్టార్స్‌తో రొమాన్స్ చేసే అవకాశాలు తలుపుతట్టలేదు. ఇటీవల అరుళ్‌నిధి సరసన నటించిన ఒరు కన్నియుం మూండ్రు కలవాణిగలుమ్ చిత్రం బిందుమాధవి కెరీర్‌కు ఏ మాత్రం హెల్ప్కాలేదు. ఇప్పుడీ బ్యూటీ టైమ్ తిరిగిందనిపిస్తోంది. తాజాగా రెండు చిత్రాల్లో నటించే అవకాశాలొచ్చాయి. వీటిలో ఒకటి సక్సెస్ఫుల్ యువ నటుడు విజయ్ సేతుపతితో రొమాన్స్ చేసే అవకాశం. మరొకటి తెగిడి ఫేమ్ అశోక్ సెల్వన్ సరసన నటించే అవకాశం. విజయ్ సేతుపతి సరసన నటించే చిత్రానికి వసంత కుమారన్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. నగర నేపథ్యంలో సాగే ఈ రొమాంటింక్ లవ్ స్టోరీ చిత్రానికి నవ దర్శకుడు ఆనంద్ కుమరేశన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బిందుమాధవి చెన్నై చిన్నదిగా మోడ్రన్ పాత్రలో నటించనుంది. ఈ చిత్రం జూలైలో ప్రారంభంకానుంది. ఇకపోతే అశోక్ సెల్వన్‌కు జంటగా నటించనున్న చిత్రాన్ని నటుడు అరుణ్ పాండియన్ కూతురు నిర్మించనున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం సిటీ తరహా కథతో తెరకెక్కనుంది. ప్రస్తుతం బిందుమాధవి తమిళుక్కు తనయై అళుక్కవుం అనే చిత్రంలో నటిస్తోంది. మొత్తం మూడు చిత్రాలతో ఈ బ్యూటీ మళ్లీ ఫామ్‌లోకి వస్తోందన్నమాట. -
అజిత్‌తో జత కట్టాలని..
ఇంతకుముందు హీరోయిన్లు సూపర్‌స్టార్ రజనీకాంత్, కమల హాసన్ సరసన నటించాలని ఎదురు చూసేవారు. అలాంటిది ప్రస్తుత హీరోయిన్లకు కలల హీరో అజిత్ అవ్వడం విశేషం. ఆ మధ్య నటి తమన్న అజిత్ సరసన నటించాలన్నది తన డ్రీమ్ అని పేర్కొన్నారు. ఆమె కల వీరం చిత్రంలో నెరవేరిం ది. తాజాగా నటి బిందుమాధవి ఈ జాబి తాలో చేరారు. వెప్పం చిత్రం ద్వారా కోలీవుడ్‌లో రంగ ప్రవేశం చేసిన ఈ తెలుగమ్మాయి కళగు, కేడి భిల్లా కిల్లాడి రంగ, దేసింగు రాజా వంటి హిట్ చిత్రాలతో మంచి గుర్తింపు పొందారు. టాలీవుడ్లో కొన్ని చిత్రాల్లో నటించిన బిందుమాధవి అక్కడ గ్లామర్ పాత్రల అవకాశాలే వచ్చాయని తనను పక్కింటి అమ్మాయిగా కుటుంబ కథా పాత్రలకు అవకాశాలిచ్చింది మాత్రం తమిళ చిత్ర పరిశ్రమనని అంటున్నారు. అంతేకాదు తానిక్కడే సాధించాల్సింది చాలా ఉందని, పారితోషికం ముడుతుంది కదా అని వచ్చిన అవకాశాలన్నీ ఒప్పేసుకోవాలనుకోవడం లేదని చెబుతున్నారు. కథ, అందులో తన పాత్ర నచ్చితేనే అంగీకరిస్తున్నట్టు పేర్కొన్నారు. తమిళంలో ఏ హీరో సరసన నటించారని కోరుకుంటున్నారన్న ప్రశ్నకు నటుడు అజిత్ సరసన ఒక్క చిత్రంలోనైనా జత కట్టాలని ఆశగా ఉందన్నారు. ఈ బ్యూటీ కోరి క త్వరలోనే నెరవేరుతుందేమో చూద్దాం.