బిందుమాధవి
ఇంతకుముందు హీరోయిన్లు సూపర్‌స్టార్ రజనీకాంత్, కమల హాసన్ సరసన నటించాలని ఎదురు చూసేవారు. అలాంటిది ప్రస్తుత హీరోయిన్లకు కలల హీరో అజిత్ అవ్వడం విశేషం. ఆ మధ్య నటి తమన్న అజిత్ సరసన నటించాలన్నది తన డ్రీమ్ అని పేర్కొన్నారు. ఆమె కల వీరం చిత్రంలో నెరవేరిం ది. తాజాగా నటి బిందుమాధవి ఈ జాబి తాలో చేరారు. వెప్పం చిత్రం ద్వారా కోలీవుడ్‌లో రంగ ప్రవేశం చేసిన ఈ తెలుగమ్మాయి కళగు, కేడి భిల్లా కిల్లాడి రంగ, దేసింగు రాజా వంటి హిట్ చిత్రాలతో మంచి గుర్తింపు పొందారు.
టాలీవుడ్‌లో కొన్ని చిత్రాల్లో నటించిన బిందుమాధవి అక్కడ గ్లామర్ పాత్రల అవకాశాలే వచ్చాయని తనను పక్కింటి అమ్మాయిగా కుటుంబ కథా పాత్రలకు అవకాశాలిచ్చింది మాత్రం తమిళ చిత్ర పరిశ్రమనని అంటున్నారు. అంతేకాదు తానిక్కడే సాధించాల్సింది చాలా ఉందని, పారితోషికం ముడుతుంది కదా అని వచ్చిన అవకాశాలన్నీ ఒప్పేసుకోవాలనుకోవడం లేదని చెబుతున్నారు. కథ, అందులో తన పాత్ర నచ్చితేనే అంగీకరిస్తున్నట్టు పేర్కొన్నారు. తమిళంలో ఏ హీరో సరసన నటించారని కోరుకుంటున్నారన్న ప్రశ్నకు నటుడు అజిత్ సరసన ఒక్క చిత్రంలోనైనా జత కట్టాలని ఆశగా ఉందన్నారు. ఈ బ్యూటీ కోరి క త్వరలోనే నెరవేరుతుందేమో చూద్దాం.