opposite
-
బీజేపీకి వ్యతిరేక గాలి వీస్తోంది: మమత
కోల్‌కతా: దేశవ్యాప్తంగా భారతీయ జనతా పారీ్టకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, ఉప ఎన్నికల ఫలితాలే దీనికి నిదర్శనమని పశి్చమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. 13 సీట్లలో ఇండియా కూటమి 10 చోట్ల గెలవడంపై స్పందిస్తూ.. ఎన్డీయేకు 46 శాతం ఓట్లు రాగా. ఇండియా కూటమికి 51 శాతం ఓట్లు వచ్చాయని చెప్పారు. బెంగాల్లో నాలుగింటికి నాలుగు స్థానాల్లో టీఎంసీని గెలిపించడం పట్ల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మధ్యప్రదేశ్‌లో మినహా ఎక్కడా బీజేపీ మంచి ప్రదర్శన చేయలేకపోయిందని, దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీకి వ్యతిరేకంగానే తీర్పు వచి్చందన్నారు. ఇప్పుడు బీజేపీ మళ్లీ ‘ఏజెన్సీ రాజ్ (సీబీఐ, ఈడీ తదితర కేంద్ర దర్యాప్తు సంస్థలను విపక్షాలపైకి ఉసిగొల్పడం)’ను మొదలుపెట్టిందని ఆరోపించారు. కొత్త నేర చట్టాల్లో ఏముందో న్యాయవాదులు, పోలీసులకే స్పష్టమైన అవగాహన లేదన్నారు. ‘స్వేచ్ఛకు ముప్పు పొంచి వుంది. ప్రతి ఒక్కరూ, ఎలాంటి ఆధారాలు లేకపోయినా.. బాధితులుగా మారొచ్చు’ అని మమత అన్నారు. మార్పునకు సంకేతం: కాంగ్రెస్ బీజేపీ సృష్టించిన భయాలు, భ్రమలు పటాపంచలయ్యాయని ఉప ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. రైతులు, యువత, కారి్మకులు, వ్యాపారవేత్తలు, ఉద్యోగులు.. ఇలా దేశంలోని అన్ని వర్గాల వారూ నియంతృత్వానికి పాతరేయాలని కోరుకుంటున్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి, తమ జీవితాల బాగు కోసం ప్రజలు ఇండియా కూటమికే పూర్తిగా అండగా నిలుస్తున్నారని రాహుల్ అన్నారు. దేశంలో మారుతున్న రాజకీయ ముఖచిత్రానికి ఈ ఫలితాలు సంకేతమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. మోదీ, అమిత్ షాల విశ్వసనీయత పడిపోతుందనడానికి ఫలితాలు గట్టి నిదర్శనమన్నారు. -
కేంద్ర గెజిట్‌ను అడ్డుకుందాం
సాక్షి, పంజగుట్ట(హైదరాబాద్): ఈనెల 14నుంచి తెలుగురాష్ట్రాల్లోని కృష్ణా, గోదావరి నదులను, ప్రాజెక్టులను కేంద్రం చేతుల్లోకి తీసుకుంటున్న నేపథ్యంలో దానికి సంబంధించిన కేంద్రగెజిట్ను రెండు రాష్ట్రాల ప్రజలు అడ్డుకోవాలని అఖిలపక్షం నాయకులు పిలుపునిచ్చారు. కేంద్రం ఒకవైపు ప్రత్యేకరాష్ట్రంల ఇచ్చి మరోవైపు నీటిహక్కుల్ని లాక్కుంటే ఇక రాష్ట్రమిచ్చిన ప్రయోజనం ఏముందని నాయకులు ప్రశ్నించారు. అందుకే కేంద్ర గెజిట్ ప్రతుల్ని దగ్ధం చేయడంతోపాటుగా ఈ అంశంపై గవర్నర్‌కు వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించినట్లు శనివారం మీడియాకు తెలిపారు. పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘కృష్ణాలో తెలంగాణకు న్యాయపరమైన వాటా సాధిద్దాం’అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ.. నదీ జలాల పంపకం సరిగ్గా జరగలేదని, ఆంధ్రాలో కేవలం గేట్లు ఎత్తితే నీరు పారుతుందని, తెలంగాణలో ఎత్తిపోతల ద్వారానే నీటిని వాడుకోవాల్సి పరిస్థితి ఉందని వివరించారు. కృష్ణా నీటి పంపకాల్లో వివాదం ఉంటే గోదావరి ప్రాజెక్టులపై కూడా కేంద్ర పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. సీపీఐ నాయకులు చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ .. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కలల ప్రాజెక్టు కాళేశ్వరం కూడా కేంద్రం అధీనంలోకి వెళ్లబోతోందని, ఇప్పటికైనా అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రం పెత్తనాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. సమావేశంలో అధ్యయన వేదిక కన్వీనర్లు ఎం.రాఘవాచారి, ఎ.రాజేంద్రబాబు, టీడీపీ నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, సీపీఐ నాయకురాలు పశ్యపద్మ, పౌరహక్కుల సంఘం నాయకులు లక్ష్మణ్, రిటైర్డ్ ఇంజనీర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఇది దళితుల వ్యతిరేక ప్రభుత్వం
* దళితుల భూములు లాక్కొని అగ్రవర్ణాలకు కట్టబెడుతోంది.. * ఏఎన్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జి.చార్వాక ధ్వజం గుంటూరు ఎడ్యుకేషన్: దళితుల అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం దళితులకు చెందిన భూములను లాక్కుని అగ్రవర్ణాలకు కట్టబెడుతోందని అంటరానితన నిర్మూలన పోరాట సమితి (ఏఎన్‌పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జి.చార్వాక ఆరోపించారు. దళిత వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న ప్రభుత్వ తీరుకు నిరసనగా సోమవారం జెడ్పీ ప్రాంగణంలో దళితులతో కలిసి ఆందోళన నిర్వహించారు. ఈసందర్భంగా చార్వాక మాట్లాడుతూ ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రభుత్వం దళితులకు ఇచ్చిన భూములను అధికారుల అండదండలతో అగ్రకులాలలకు అప్పగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్తిపాడు, గుంటూరు, పెదనందిపాడు, వట్టిచెరుకూరు మండలాల్లో 1975లో అప్పటి కలెక్టర్ కత్తి చంద్రయ్య భూమిలేని దళితుల కుటుంబాలకు భూమిని మంజూరు చేయగా, కొర్నెపాడులో చెరువు భూములను అదే గ్రామానికి చెందిన దళితులకు మంజూరు చేశారన్నారు. నడింపాలెంలో దళితులకు ఇచ్చిన భూములను అగ్రకులాలకు దారాదత్తం చేస్తూ రెవెన్యూ అధికారులు పెద్దఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. దళితుడు కాండ్రు భాస్కరరావుకు ప్రభుత్వం మంజూరు చేసిన పట్టా భూమిని సైతం అదే ప్రాంతంలోని అగ్రకుల రాజకీయ నాయకులు కబ్జా చేసి నకిలీ డాక్యుమెంట్లు పుట్టించారని అన్నారు. దళతులకు న్యాయం చేయాలని జేసీ కృతికా శుక్లాను కోరారు. స్పందించిన జేసీ ఏఎన్‌పీఎస్ ఇచ్చిన ఫిర్యాదును సుమోటాగా స్వీకరించి కేసు నమోదు చేసి విచారణ జరిపి, దళితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆందోళనలో సమితి జిల్లా అధ్యక్షుడు టి.ప్రసాదరావు, నరసరావుపేట డివిజన్ కన్వీనర్ చెల్లి కిషోర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు తోటకూర సువర్ణకుమారి, కె.జయరాజు, ఇర్మియా, శ్యామ్‌బాబు, తిక్కరెడ్డిపాలెం బాబు పాల్గొన్నారు. -
పెద్ద నోట్ల రద్దుకు 90 శాతం వ్యతిరేకమే: జూలకంటి
సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్లను రద్దుచేయడాన్ని దేశంలోని 90 శాతం మంది వ్యతిరేకిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాటా ్లడుతూ రోగులు చేతిలో డబ్బులున్నా వైద్యం చేరుుంచుకోలేని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అలాగే భూములు అమ్మిన వారు ఆ డబ్బుతో వివాహాలకు ఖర్చు చేయ లేని దుస్థితి ఉందన్నారు. కూలీలు, రైతులు, చిన్నవ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడు తున్నారని చెప్పారు. అవినీతిని, నల్ల ్లధనాన్ని, కార్పొరేట్లను నియంత్రించడం చేత కాని ప్రధానమంత్రి మోదీ పేదలను ఇబ్బందులు పెడుతున్నారని జూలకంటి విమర్శించారు. సామాన్యులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. -
ఈ నెల 7 వరకూ ఆభరణాల వర్తకుల సమ్మె
న్యూఢిల్లీ: ఎక్సైజ్ సుంకం విధింపు ప్రతిపాదనకు వ్యతిరేకంగా గత 3 రోజులుగా సమ్మె చేస్తున్న ఆభరణాల వర్తకులు దీన్ని ఈ నెల ఏడవ తేదీ వరకూ పొడిగించారు. రత్నాలు, బంగారు ఆభరణాలపై 1% ఎక్సైజ్ సుంకం విధించడం పరిశ్రమ మనుగడపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యూయలరీ ట్రేడ్ ఫెడరేషన్(జీజేఎఫ్) చైర్మన్ జి.వి. శ్రీధర్ చెప్పారు. ఎక్సైజ్ సుంకం విధింపుపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన ఆశిస్తున్నామని చెప్పారు. తమ సమస్యలను పరిశీలిస్తానని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హామీ ఇచ్చారని, అయినప్పటికీ తమ సమ్మె కొనసాగుతుందని పేర్కొన్నారు. గతంలో ఈ విధంగానే ఎక్సైజ్ సుంకం విధించారని, కానీ సానుకూల ఫలితాలు రానికారణంగా తొలగించారని జీజేఎఫ్ మాజీ చైర్మన్, డెరైక్టర్ బచ్చరాజ్ బమల్వ చెప్పారు. కాగా 12 కోట్ల టర్నోవర్ మించిన వర్తకులపై మాత్రమే వెండి-యేతర ఆభరణాలపై 1% ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తామని ఆర్థిక శాఖ స్పష్టతనిచ్చింది. రూ. రెండు లక్షలు, అంతకు మించిన ఆభరణాల కొనుగోలు చేస్తే పాన్ నంబర్ తప్పనిసరిగా ఇవ్వాలన్న నిబంధనను కూడా ఆభరణాల వర్తకులు వ్యతిరేకిస్తున్నారు. పాన్ నంబర్ తప్పనిసరి నిబంధనను రెండు లక్షలకు కాక రూ. 10 లక్షలకు మించిన కొనుగోళ్లకు వర్తింపజేయాలని కోరుతున్నారు. 3 రోజుల సమ్మెతో పరిశ్రమకు రూ.21 వేల కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా. -
తమిళులకు వ్యతిరేకం కాదు
అమలాపురం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్ర పోలీసు యంత్రాంగం తమిళ ప్రజలకు ఎంత మాత్రం వ్యతిరేకం కాదని రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. పరిస్థితుల ప్రభావంతోనే శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లర్లపై ఎన్కౌంటర్ జరిగిందని చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా అల్లవరంలో బుధవారం పోలీసు స్టేషన్ భవనానికి శంకుస్థాపన చేసిన తర్వాత ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘ఎర్ర’ స్మగ్లర్లు అడవుల్లోకి చొరబడ్డారన్న పక్కా సమాచారంతో కూంబింగ్ చేస్తున్న పోలీసులు, అటవీ సిబ్బందిపై వందలాదిగా ఉన్న స్మగ్లర్లు ఎదురుదాడికి దిగారని చెప్పారు. గత్యంతరం లేక పోలీసులు కాల్పులకు దిగారన్నారు. -
దేవుని మన్నింపు
దైవికం మిజోరామ్‌లో కొంతకాలంగా దైవానికీ, దుష్టశక్తికీ మధ్య పోరు సాగుతోంది. పద్దెనిమిదేళ్లుగా ఆ రాష్ట్రంలో ఉన్న మద్య నిషేధాన్ని రద్దు చేయాలని కొందరు, నిషేధాన్ని కొనసాగించాల్సిందేనని కొందరు తమ వాదనలను వినిపిస్తున్నారు. ఈ రెండు వర్గాలలో ఎవరు దైవం వైపున, ఎవరు దుష్టశక్తి తరఫున ఉన్నట్లు? సాధారణంగా మద్యం ఆరోగ్యానికి హాని చేస్తుంది కనుక నిషేధాన్ని రద్దు చేయొద్దని కోరుతున్న వారిని దైవం వైపు ఉన్నట్లు అనుకోవాలి. నిషేధం రద్దు చేసి మద్యం అమ్మకాలను ప్రారంభించాలని కోరుతున్న వారిని దుష్టశక్తి ప్రేరేపిస్తుందని భావించాలి. ఎంచేతంటే దుష్టశక్తి పూర్తిగా దైవానికి వ్యతిరేకం కనుక మానవుల్ని కూడా దేవుడికి ఇష్టం లేని వాటి వైపు అది నడిపిస్తుంది కాబట్టి. అయితే మిజోరామ్‌లో వాదులాడుకుంటున్నవారు మామూలు ప్రజలు కాదు. మిజోరామ్ రాష్ట్ర మంత్రులు, ప్రతిపక్ష శాసనసభ్యులు. మంత్రులన్నాక ప్రజా సంక్షేమం కోసం ఏదైనా చేయాల్సి ఉంటుంది. అందుకు డబ్బు కావలసి ఉంటుంది. అంత డబ్బును రాబడిగా పొందడానికి వాళ్లకు కనిపించింది ఎక్సైజ్ శాఖ ఒక్కటే! అందుకే వృత్తి ధర్మంగా (లేదా సేవా ధర్మంగా) ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మద్యంపై నిషేధాన్ని ఎత్తివేయడమే ఉత్తమ మార్గంగా కనిపించింది. ఇలాంటి ప్రత్యేక సందర్భాలలో వృత్తి ధర్మం, లేదా సేవాధర్మం దేవుని అభీష్టానికి పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. దేవుడికి ఇష్టం లేదు. కానీ ప్రజల కోసం తప్పడం లేదు. ఏం చేయాలి? మంచైనా, చెడైనా ముఖ్యమంత్రి చెప్పినట్లు చెయ్యాలి. సరిగ్గా అదే పని చేశారు లాల్జిర్లియానా. లాల్జిర్లియానా మిజోరామ్ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి. అసెంబ్లీలో ఆయన సీటు ముఖ్యమంత్రి లాల్ థన్హావ్లా సీటు పక్కనే ఉంటుంది. లాల్జిర్లియానాకు వ్యక్తిగతంగా మద్యనిషేధాన్ని రద్దు చేయడం ఇష్టం లేనప్పటికీ, వాదోపవాదాల అనంతరం అయన ‘మిజోరామ్ లిక్కర్ (ప్రొహిబిషన్ అండ్ కంట్రోల్) బిల్లు’ను రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మద్య నిషేధాన్ని తొలగించడం దేవునికి ఇష్టం లేని కార్యమని తను నమ్మినప్పటికీ ఒక రాజకీయ అనివార్యత ఆయన్ని అటువైపుగా నడిపించింది. బలహీనమైన గొంతుతో ఆయన బిల్లుపై ప్రకటన చేసినప్పుడు నలభైమంది సభ్యులు గల మిజోరామ్ అసెంబ్లీలో కనీసం సగంమంది ఆయనకు మద్దతు పలికారు. నిషేధం కారణంగా కల్తీ మద్యం తాగి ఎంతోమంది యువకులు తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు కనుక, నిఖార్సయిన మద్యాన్ని అందుబాటులోకి తెస్తే కల్తీ మద్యం మరణాలు తగ్గుతాయని వారు అభిప్రాయపడ్డారు. విపక్షానికి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు ఆ అభిప్రాయాన్ని ఖండిస్తూ, ‘‘మద్యం అందుబాటులోకి వస్తే యువత నైతికంగా పాడైపోతుంది. అది మరణం కంటే ఘోరం. ఇంతటి ఘోరానికి పాల్పడుతున్నందుకు దేవుడు మనల్ని క్షమించడు’’ అన్నారు. దేవుడి మాట రాగానే మంత్రి జోడింత్లువంగ పైకి లేచారు. ఒకప్పుడు ఆయనదీ లిక్కర్ బిజినెస్సే. మద్యనిషేధాన్ని రద్దు చేసే బిల్లును సమర్థిస్తూ ఆయన, ప్రధాన ప్రతిపక్షం ‘మిజో నేషనల్ ఫ్రంట్’ వ్యవస్థాపకులు లాల్డెంగా గతంలో ఎప్పుడో చేసిన ప్రసంగంలోని రెండు మాటలను సభకు గుర్తు చేశారు. ‘‘మీ నాయకుడే అలా అన్నాక ఇంకా దేవుడి ప్రస్తావన ఎందుకు?’’ అన్నారు. ఇంతకీ ఏమిటీ రెండు మాటలు అంటే : ‘‘మద్యపానం మంచిదని చెప్పలేం, చెడ్డదని చెప్పలేం. అదొక కృత్యం. దీని గురించి మనం వెళ్లి ఏ మతాన్నీ సంప్రదించనవసరం లేదు. ఎందుకంటే మనది లౌకిక ప్రభుత్వం’’ అన్నారట లాల్డెంగా. చివరికి బిల్లు పాస్ అయింది. స్వయానా ఎక్సైజ్ మంత్రికే ఇష్టం లేకున్నా మద్యం బిల్లు మిజోరామ్‌లో మద్యపానానికి ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి కోసం, లేదా రాబడి కోసం, లేదా ప్రజాసంక్షేమం కోసం బల్ల మీద బిల్లు పెట్టిన మంత్రి లాల్జిర్లియానా బిల్లు పెట్టే ముందరి ఆదివారం ఏం చేశారో తెలుసా? అక్కడికి సమీపంలోని ఆర్మ్డ్వెంగ్ ప్రాంతంలోని చర్చి ప్రార్థనల్లో పాల్గొన్నారు. ప్రార్థనల ముగింపులో లేచి నిలబడి, అందరికీ వినబడేలా గద్గద స్వరంతో దేవుడిని మన్నించమని కోరారు! ‘‘సర్వశక్తి సంపన్నుడివైన ప్రభువా... ఈవారం నేను మద్యపాన నిషేధాన్ని రద్దుచేసే బిల్లును సభలో ప్రవేశపెట్టబోతున్నాను. అది నీ అభీష్టానికి విరుద్ధమైనట్లయితే, అది నాకు అసాధ్యం అయ్యేలా నాకు గానీ, నా కుటుంబానికి గానీ ఏదైనా అవాంతరం తెప్పించు’’ అని ప్రార్థించారు. కారుణ్యమూర్తి అయిన దేవుడు ఆయనకు ఏ అవాంతరమూ సృష్టించకపోవచ్చు. కానీ దేవునికి ఇష్టం లేదన్న ఆయనలోని స్పృహ చాలు ఆయనను దేవుని మన్నింపునకు అర్హుడిని చేసేందుకు. - మాధవ్ శింగరాజు -
కేడర్‌ను కాపాడుకునేందుకు తెలుగుదేశం పార్టీ తంటాలు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లాలో తెలుగుదేశం పార్టీ కేడర్‌ను కాపాడుకోవడానికి నేతలు పొత్తుల ఎత్తుగడ వేస్తున్నారు. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు చేసిన లాబీయింగ్‌తో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ‘దేశం’ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. జిల్లా అధ్యక్షుడు గోడం నగేష్ పార్టీని వీడగా, పలు నియోజకవర్గాల ఇన్చార్జీలు కూడా త్వరలోనే గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీని వీడుతున్న ఈ నేతలతో కలిసి కేడర్ కూడా వెళ్లకుండా నిలుపుకునేందుకు టీడీపీ నేతలు పొత్తును ఎత్తుగడగా వాడుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పార్లమెంట్లో తెలంగాణ బిల్లుకు ఆమోద ముద్ర పడటంలో బీజేపీ తనదైన పాత్రను పోషించింది. ఈ క్రెడిట్ ఉన్న బీజేపీతో పొత్తు ఉంటుందని చెబితే కొందరైనా నాయకులు, కార్యకర్తలను కాపాడుకోవచ్చనే ఉద్దేశంతోనే ‘దేశం’ నేతలు జిమ్మిక్కులకు పాల్పడుతున్నారనే అభిప్రాయం నెలకొంది. బీజేపీ నాయకులు మాత్రం పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వలసలను నివారించడానికి.. కార్యకర్తలను మభ్యపెట్టేందుకు టీడీపీ నేతలు పొత్తు అంశాన్ని వాడుకుంటున్నారని బీజేపీ నాయకులు పేర్కొంటున్నారు. దమ్ముంటే చంద్రబాబుతో పొత్తు విషయమై ప్రకటన చేయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆగని వలసలు.. తెలుగుదేశం పార్టీని వీడిన నగేష్ వెంట కేడర్ వెళ్లకుండా కాపాడుకునేందుకు ఆ పార్టీ నేతలు తంటాలు పడుతున్నారు. సమావేశాలు, ప్రెస్మీట్లు నిర్వహించి కార్యకర్తలకు సర్దిచెబుతున్నారు. సోమవారం బోథ్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశాన్ని ఇచ్చోడలో నిర్వహించారు. బీజేపీతో పొత్తు తప్పకుండా ఉంటుందని, కార్యకర్తలు అధైర్య పడవద్దని ఈ సమావేశానికి హాజరైన కార్యకర్తలకు ధైర్యం నూరిపోశారు. కానీ ఈ సమావేశానికి ఒక్క ఇచ్చోడ మండల పార్టీ అధ్యక్షుడు మినహా మిగిలిన ఐదు మండలాల టీడీపీ అధ్యక్షులు హజరుకాలేదు. కాగా పార్టీని వీడిన నగేష్ కూడా గురువారం ఇచ్చోడలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. రాథోడ్ రమేష్ నిర్వహించిన సమావేశానికి హాజరైన నేతల్లో సగం మందికి పైగా గురువారం నగేష్ నిర్వహించిన సమావేశానికి హాజరుకావడం గమనార్హం. -
అజిత్‌తో జత కట్టాలని..
ఇంతకుముందు హీరోయిన్లు సూపర్‌స్టార్ రజనీకాంత్, కమల హాసన్ సరసన నటించాలని ఎదురు చూసేవారు. అలాంటిది ప్రస్తుత హీరోయిన్లకు కలల హీరో అజిత్ అవ్వడం విశేషం. ఆ మధ్య నటి తమన్న అజిత్ సరసన నటించాలన్నది తన డ్రీమ్ అని పేర్కొన్నారు. ఆమె కల వీరం చిత్రంలో నెరవేరిం ది. తాజాగా నటి బిందుమాధవి ఈ జాబి తాలో చేరారు. వెప్పం చిత్రం ద్వారా కోలీవుడ్‌లో రంగ ప్రవేశం చేసిన ఈ తెలుగమ్మాయి కళగు, కేడి భిల్లా కిల్లాడి రంగ, దేసింగు రాజా వంటి హిట్ చిత్రాలతో మంచి గుర్తింపు పొందారు. టాలీవుడ్లో కొన్ని చిత్రాల్లో నటించిన బిందుమాధవి అక్కడ గ్లామర్ పాత్రల అవకాశాలే వచ్చాయని తనను పక్కింటి అమ్మాయిగా కుటుంబ కథా పాత్రలకు అవకాశాలిచ్చింది మాత్రం తమిళ చిత్ర పరిశ్రమనని అంటున్నారు. అంతేకాదు తానిక్కడే సాధించాల్సింది చాలా ఉందని, పారితోషికం ముడుతుంది కదా అని వచ్చిన అవకాశాలన్నీ ఒప్పేసుకోవాలనుకోవడం లేదని చెబుతున్నారు. కథ, అందులో తన పాత్ర నచ్చితేనే అంగీకరిస్తున్నట్టు పేర్కొన్నారు. తమిళంలో ఏ హీరో సరసన నటించారని కోరుకుంటున్నారన్న ప్రశ్నకు నటుడు అజిత్ సరసన ఒక్క చిత్రంలోనైనా జత కట్టాలని ఆశగా ఉందన్నారు. ఈ బ్యూటీ కోరి క త్వరలోనే నెరవేరుతుందేమో చూద్దాం. -
విలీనానికి వ్యతిరేకం
=స్పష్టం చేసిన ప్రజానీకం =‘గ్రేటర్’లో గ్రామాలు కలపొద్దని డిమాండ్ =ప్రజాభిప్రాయ సేకరణ రసాభాస అనకాపల్లి టౌన్, న్యూస్‌లైన్ : అనకాపల్లి పరిధిలో గల పంచాయతీలను గ్రేటర్లో విలీనం చేయడానికి సంబంధించి శుక్రవారం గ్రామాల్లో చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ గ్రామసభలు రసాభాసగా మారాయి. గ్రామస్తులు ఈ సభలలో అధిక సంఖ్యలో పాల్గొని, గ్రేటర్లో విలీనం చేయొద్దని ఎలుగెత్తి చాటారు. అనకాపల్లి మున్సిపాలిటీని ఇది వరకే గ్రేటర్ విశాఖలో విలీనం చేయడంతో మండలానికి చెందిన మూడు పంచాయతీలు గ్రేటర్లో కలసిపోయాయి. అయితే అప్పట్లో ఆయా పంచాయతీలకు చెందిన ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోకుండానే విలీనం చేయడంతో గ్రామస్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. విలీనం చేసిన సుమారు మూడు నెలల తర్వాత ఎట్టకేలకు అధికారులు స్పందించి శుక్రవారం కొప్పాక, వల్లూరు, రాజుపాలెం గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణకు గ్రామసభలు నిర్వహించారు. ఆ మూడు గ్రామాల ప్రత్యేకాధికారి పి.అచ్యుతరావు ఆధ్వర్యంలో వీటిని చేపట్టారు. అసలు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టకుండా ఎలా విలీనం చేశారంటూ అక్కడికి వచ్చిన అధికారులపై గ్రామస్తులు మండిపడ్డారు. గ్రేటర్లో విలీనం చేయొద్దంటూ పట్టుబట్టారు. దీంతో అధికారులు, గ్రా మస్తుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గ్రామసభ రసాభాసగా మా రింది. జీవీఎంసీలో విలీనం వల్ల పన్నుల భారం పెరుగుతుందని, కూలీలు ఉపాధి హామీ పథకానికి నోచుకోరని గ్రామస్తులు చెప్పారు. వెయ్యి మందికి పైగా ప్రజలు ఉపాధి కోల్పోతారన్నారు. అనేక సమస్యలు ఎదురవుతాయని, అందుకే జీవీఎంసీలో విలీనానికి తాము వ్యతిరేకమని అధికారులకు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ ప్రత్యేకాధికారి అచ్యుతరావు మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రజాభిప్రాయ సేకరణకు గ్రామసభ నిర్వహించామని తెలిపారు. ప్రజల అభిప్రాయాలను నేరుగా అధికారులకు నివేదిస్తామని చెప్పారు. తమ గ్రామాలకు జీవీఎంసీలో విలీనం చేయొద్దంటూ గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానం చేసి అధికారులకు తీర్మాన పత్రాన్ని అందజేశారు. రాజుపాలెం గ్రామంలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ సభలో మాత్రం కొందరు విలీనాన్ని వ్యతిరేకించగా, మరికొందరు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డీ ఆర్.ఎల్.ఎన్.కుమార్, పంచాయతీ కార్యదర్శి దుర్గా ప్రసాద్, వల్లూరు పంచాయతీ మాజీ సర్పంచ్ వై.వి.సత్యనారాయణ, వైఎస్సార్సీపీ నాయకుడు సిమ్మా ముసిలినాయుడు, ఎంపీటీసీ మాజీ సభ్యులు ఎం.గోపాలరావు, వి.ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.