తమిళులకు వ్యతిరేకం కాదు | Not against the Tamils | Sakshi
Sakshi News home page

తమిళులకు వ్యతిరేకం కాదు

Published Thu, Apr 9 2015 2:46 AM | Last Updated on Sun, Sep 3 2017 12:02 AM

తమిళులకు  వ్యతిరేకం కాదు

తమిళులకు వ్యతిరేకం కాదు

అమలాపురం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్ర పోలీసు యంత్రాంగం తమిళ ప్రజలకు ఎంత మాత్రం వ్యతిరేకం కాదని రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. పరిస్థితుల ప్రభావంతోనే శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లర్లపై ఎన్‌కౌంటర్ జరిగిందని చెప్పారు.

తూర్పు గోదావరి జిల్లా అల్లవరంలో బుధవారం పోలీసు స్టేషన్ భవనానికి శంకుస్థాపన చేసిన తర్వాత ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘ఎర్ర’ స్మగ్లర్లు అడవుల్లోకి చొరబడ్డారన్న పక్కా సమాచారంతో కూంబింగ్ చేస్తున్న పోలీసులు, అటవీ సిబ్బందిపై వందలాదిగా ఉన్న స్మగ్లర్లు ఎదురుదాడికి దిగారని చెప్పారు. గత్యంతరం లేక పోలీసులు కాల్పులకు దిగారన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement