Tamil people
-
‘థాయ్‌పుసం’ తెలంగాణ స్టైల్లో!
థాయ్‌పుసం.. తమిళులకు ఇదో ప్రధాన ఉత్సవం. ఒంటికి శూలాలు గుచ్చుకుని అత్యంత భక్తిప్రపత్తులతో సుబ్రమణ్యస్వామికి మొక్కులు చెల్లించే వేడుక. తమిళనాడుతోపాటు మలేషియా, సింగపూర్, శ్రీలంక, ఇండోనేషియా, ఆ్రస్టేలియా తదితర దేశాల్లో స్థిరపడిన తమిళ ప్రజలు ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తారు. అయితే, తెలంగాణలోనూ థాయ్‌పుసంను జరుపుతారు. అదెక్కడ? ఎలా జరుపుతారు? థాయ్‌పుసంకు మనకు ఉన్న సంబంధమేంటి?అన్న వివరాలు తెలుసుకోవాలంటే.. వందలఏళ్లతరువాత మాతృదేశానికి.. 1962లో బర్మాలో సైనిక తిరుగుబాటు జరిగిన అనంతరం అక్కడి భారతీయులను కట్టుబట్టలతో దేశం ఖాళీ చేయించారు. భారతీయ మహిళల మెడలోని బంగారు పుస్తెలతాళ్లను సైతం లాక్కుని వెనక్కి పంపారు. దీంతో బతుకుజీవుడా అంటూ పలువురు భారతీయులు మాతృదేశానికి వచ్చారు. వీరి కోసం అప్పట్లో కేంద్ర ప్రభుత్వం దేశంలోని పలు ప్రాంతాల్లో శరణార్థుల శిబిరాలను ఏర్పాటు చేసింది. వాటిల్లో పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం అంతర్గాం శిబిరం ఒకటి. 1975లో ఇక్కడ శ్రీలంక, తమిళనాడు, ఆంధ్ర నుంచి బర్మాకు వలస వెళ్లిన భారత సంతతివారికి పునరావాసం కల్పించారు. ఈ క్రమంలో అక్కడ జమ్మిచెట్టు కింద స్వయంభూ వెలసిన అమ్మవారిని అప్పటి నుంచి వీరంతా నూకాంబిక–పోచమ్మ అమ్మవారిగా కొలుస్తున్నారు. థాయ్‌పుసం తరహాలో ఇక్కడ కూడా నూకాంబిక అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఒంటినిండా శూలాలు గుచ్చుకుని.. అంతర్గాంలో స్థానిక శరణార్థులు ఏటా ఉగాదికి ముందు అమ్మవారికి నవరాత్రులు నిర్వహించి చివరికి అమావాస్య రోజున ఒంటికి పదునైన శూలాలను గుచ్చుకుని మొక్కులు చెల్లించుకుంటారు. తమను ఆపదలో ఆదుకుంటుందనే నమ్మకంతో అమ్మవారికి ఇలా కృతజ్ఞతలు తెలుపుకుంటారు. శూలాలు గుచ్చుకున్నా.. భక్తుల శరీరాలపై రక్తం కారదు. సిద్ధహస్తులు, అనుభవజ్ఞులైనవారు రక్తనాళాలు తక్కువగా ఉన్న చోటే శూలాలు, కొక్కాలను గుచ్చుతారట. కొందరు వీపుపై కొక్కెలు గుచ్చుకుని చిన్న రథాలు కూడా లాగి తమ భక్తి చాటుకుంటారు. ఈ క్రమంలో భక్తుల నెత్తిన మిగతా భక్తులు పాలు పోస్తుంటారు. తరువాత కావడి ఆట్టంపేరిట అమ్మవారి విగ్రహాన్ని ఊరేగిస్తూ లయబద్ధంగా నర్తిస్తారు. రాత్రిపూట మరికొందరు భక్తులు చింత నిప్పులగుండంలో నడుస్తారు. శరణార్థులంతా అమ్మవారికి మాలధారణ ఆచరిస్తారు. పసుపు వ్రస్తాలు ధరించిన పురుషులు 21 రోజులు, మహిళలు వారం లేదా 11 రోజులపాటు మాలధారణలో ఉంటారు. ఈ ఉత్సవానికి తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా స్థిరపడ్డ వీరి సంతతివారే కాకుండా, లండన్, న్యూజిలాండ్, అండమాన్ నికోబార్, శ్రీలంక నుంచి భక్తులు వస్తుంటారు. ఈ క్రమంలో మంగళవారం అంతర్గాంలో నూకాంబిక అమ్మవారి ఉత్సవాలు ఘనంగానిర్వహించారు. అత్యంత భక్తిశ్రద్ధలతో చేస్తున్నాం:రామారావు,ఉత్సవ నిర్వాహకుడు మా ముత్తాతలను బ్రిటిష్ వారు తోటల్లో పనిచేసేందుకు కూలీలుగా బర్మా (మయాన్మార్)లోని రంగూన్ (ఇప్పుడుయాంగాన్)కు తీసుకెళ్లారు. వారు తమతోపాటు భారతీయ ఆచార వ్యవహారాలను సైతం తీసుకెళ్లారు. తిరిగి ఇండియాకు వచ్చాక మేం మా పూర్వీ కుల ఆచారాలను కొనసాగిస్తున్నాం. గ్రామంలో వెలిసిన అత్యంత శక్తిమంతురాలైన నూకాంబిక–పోచమ్మ అమ్మవారికి ఏటా ఉత్సవాలు నిర్వహించి మా భక్తిని చాటుకుంటున్నాం. అత్యంత భక్తి, నిష్టలతో శూలాలతోఒంటికి గుచ్చుకుని, బొనమెత్తుకొని చింతనిప్పులపై నడిచి మొక్కులు చెల్లిస్తుంటాం. - సాక్షి ప్రతినిధి, కరీంనగర్ -
ఏపీ- తమిళనాడు సరిహద్దుల్లో ఉద్రిక్తత
సాక్షి, నెల్లూరు: ఆంధ్రప్రదేశ్- తమిళనాడు సరిహద్దుల్లో సోమవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏపీలో నేటి నుంచి మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ్వడంతో.. నెల్లూరు జిల్లాలోని తడ మండలం బీవీ పాలెం, రామాపురం ప్రాంతాల్లోని మద్యం షాపుల వద్దకు తమిళులు భారీగా చేరకుంటున్నారు. ఒక్కసారిగా తమిళులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో వైన్ షాపుల వద్ద తోపులాట చోటుచేసుకుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మద్యం షాపులను మూయించి పరిస్థితిని అదుపులోని తీసుకువచ్చారు. మరోవైపు కేంద్రం మార్గదర్శకాల ప్రకారం ఏపీలో మద్యం అమ్మకాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. అయితే మద్యం అమ్మకాలు తగ్గించేందుకే ధరలు పెంచినట్టు ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మద్యం ధరల పెంపు నిర్ణయం తీసుకున్నారని ఆయన చెప్పారు. చదవండి : ఏపీలో కొత్తగా 67 కరోనా కేసులు.. సడలింపు కొంతే.. ఆదేశాలు పక్కగా అమలు! మందు బాబుల బారులు.. 30 శాతం ధరల పెంపు -
తమిళ ప్రజలకు దుల్కర్ క్షమాపణ
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ తమిళ సినీ ప్రేక్షకులకు క్షమాపనలు చెప్పారు. దుల్కర్ నటించిన వారణే అవశ్యముండే చిత్రం ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల అయింది. అయితే ఈ చిత్రంలోని ఓ చిన్న సన్నివేశ ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్‌ను అవమానించేలా ఉందని పలువురు తమిళ ప్రేక్షకులు ఆరోపించారు. ఇది తమిళుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి దుల్కర్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ ప్రారంభించారు. దుల్కర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో తన తరఫున, చిత్ర యూనిట్ తరఫున వారికి క్షమాపణలు చెబుతూ ట్విటర్లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. ‘వారణే అవశ్యముండే చిత్రంలో ప్రభాకరన్ జోక్ తమిళ ప్రజలను అవమానించేలా ఉందని చాలా మంది నా దృష్టికి తీసుకువచ్చారు. ఇది కావాలని చేసింది కాదు. 1988లో వచ్చిన మలయాళ చిత్రం పట్టణ ప్రవేశం చిత్రంలోని జోక్ స్పూర్తితో ఆ సన్నివేశాన్ని రూపొందించాం. అది కేరళలో మీమ్స్‌గా బాగా ఫేమస్. ఇది కేరళలో సాధారణమైన పేరు కావడంతో.. అందుకే చిత్ర ప్రారంభంలో ఇది ఎవరికి ఉద్దేశించింది కాదని పేర్కొన్నాం. చాలా మంది సినిమా చూడకుండానే ద్వేషాన్ని ప్రచారం చేస్తున్నారు. నాపై, మా దర్శకుడు అనుప్ విమర్శలు చేయడాన్ని మేము అంగీకరిస్తాం. కానీ మా కుటుంబ సభ్యులను, సినిమాలో నటించిన సీనియర్ నటులపై దయచేసి విమర్శలు చేయకండి. ఈ సన్నివేశం ద్వారా బాధపడిన దయ హృదయం కలిగిన తమిళ ప్రజలకు నేను క్షమాపణ చెప్తున్నాను. నా సినిమాల ద్వారా, మాటల ద్వారా నేను ఎవరినీ కించపరచాలని చూడను. దీనిని కచ్చితంగా అపార్థం చేసుకున్నారు. కొందరు చాలా అసభ్యకరంగా విమర్శలు చేయడంతోపాటుగా బెదిరింపులకు పాల్పడుతున్నారు. నాతో పాటు కుటుంబాన్ని కూడా దూషించడం చాలా బాధగా అనిపిస్తుంది. వారు ఇలా చేయకూడదని కోరుకుంటున్నాను’ అని దుల్కర్ పేర్కొన్నారు. కాగా, ఈ చిత్రంలో దుల్కర్‌తో పాటుగా శోభన, కల్యాణి ప్రియదర్శన్, సురేష్ గోపి ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 25 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. -
తమిళులకు వ్యతిరేకం కాదు
అమలాపురం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్ర పోలీసు యంత్రాంగం తమిళ ప్రజలకు ఎంత మాత్రం వ్యతిరేకం కాదని రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. పరిస్థితుల ప్రభావంతోనే శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లర్లపై ఎన్కౌంటర్ జరిగిందని చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా అల్లవరంలో బుధవారం పోలీసు స్టేషన్ భవనానికి శంకుస్థాపన చేసిన తర్వాత ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘ఎర్ర’ స్మగ్లర్లు అడవుల్లోకి చొరబడ్డారన్న పక్కా సమాచారంతో కూంబింగ్ చేస్తున్న పోలీసులు, అటవీ సిబ్బందిపై వందలాదిగా ఉన్న స్మగ్లర్లు ఎదురుదాడికి దిగారని చెప్పారు. గత్యంతరం లేక పోలీసులు కాల్పులకు దిగారన్నారు.