పెద్ద నోట్ల రద్దుకు 90 శాతం వ్యతిరేకమే: జూలకంటి
సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్లను రద్దుచేయడాన్ని దేశంలోని 90 శాతం మంది వ్యతిరేకిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాటా ్లడుతూ రోగులు చేతిలో డబ్బులున్నా వైద్యం చేరుుంచుకోలేని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
అలాగే భూములు అమ్మిన వారు ఆ డబ్బుతో వివాహాలకు ఖర్చు చేయ లేని దుస్థితి ఉందన్నారు. కూలీలు, రైతులు, చిన్నవ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడు తున్నారని చెప్పారు. అవినీతిని, నల్ల ్లధనాన్ని, కార్పొరేట్లను నియంత్రించడం చేత కాని ప్రధానమంత్రి మోదీ పేదలను ఇబ్బందులు పెడుతున్నారని జూలకంటి విమర్శించారు. సామాన్యులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.