julakanti Ranga Reddy
-
గొత్తికోయలను వెళ్లగొట్టాలనడం రాజ్యాంగ వ్యతిరేకచర్య: జూలకంటి
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: గొత్తికోయలను రాష్ట్రం నుంచి వెళ్లగొట్టాలనడం రాజ్యాంగ వ్యతిరేక చర్య అని సీపీఎం మాజీ శాసనసభ పక్ష నాయకుడు జూలకంటి రంగారెడ్డి పేర్కొన్నారు. ఆదివాసీలకు రాష్ట్రాల మధ్య సరిహద్దులు ఉన్నాయన్న విషయం తెలియకుండా శతాబ్దాలుగా అడవే జీవనా«ధారంగా జీవిస్తున్నారని తెలిపారు. గత రెండు, మూడు దశాబ్దాల నుంచి ఛతీస్‌గఢ్ రాష్ట్రం నుంచి పక్కనే ఉన్న ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు గొత్తికోయలు వలస వచ్చారన్నారు. గురువారం సుందరయ్యవిజ్ఞానకేంద్రంలో ఆదివాసీ అటవీహక్కుల పరిరక్షణ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ‘గొత్తికోయలు – పోడుభూముల సమస్యలు’అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ...దశాబ్దాలుగా ఇక్కడికి వచ్చి జీవనం సాగిస్తున్న గొత్తికోయల జీవించే హక్కును కాలరాస్తూ వెళ్లగొట్టాలని చూడటం దుర్మార్గమైన చర్య అన్నారు. వారు తెలంగాణ పౌరులు కాదని మంత్రి సత్యవతిరాథోడ్, అటవీఅధికారులు బహిరంగ ప్రకటనలు ఇవ్వడం రాజ్యాంగ వ్యతిరేక చర్య అని విమర్శించారు. అటవీశాఖ అధికారి శ్రీనివాసరావు హత్యను బూచీగా చూపి వారికి పోడు భూములపై హక్కులు కల్పించకుండా ప్రభుత్వం కుట్ర చేస్తుందని విమర్శించారు. కార్యక్రమంలో సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు వేములపల్లి వెంకట్రామయ్య, గిరిజన సంఘం కార్యదర్శి ఆర్.శ్రీరాంనాయక్, రమణాల లక్ష్మయ్య, ప్రొఫెసర్ కోదండరాం, సీపీఐ మాజీ ఎమ్మెల్యే యాదగిరిరావు తదితరులు పాల్గొని ప్రసంగించారు. -
మోదీ పాలనలో ప్రజలకు కష్టాలు తప్ప ఒరిగిందేమీ లేదు
ఎనిమిదిన్నర ఏండ్ల ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో ప్రజలకు మేలు చేసిన పని ఒకటి కూడా లేదనే చెప్పాలి. అధికారంలోకి వచ్చినప్పటి నుండి దేశ ప్రజలపై మోయలేని భారాలు వేసి కడ గండ్లపాలు చేశారు. బీజేపీ సర్కార్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు, దివాలాకోరు ఆర్థిక విధానాలు దేశాన్ని అధోగతిలోకి నెట్టాయి. ఈరోజు దేశంలో ఆర్థిక వ్యవస్థ పతనానికి బీజేపీ ప్రభుత్వ ఆర్థిక విధానాలే ప్రధాన కారణం. 2016లో పెద్ద నోట్లను అకస్మాత్తుగా రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఏటా రెండు కోట్ల మంది నిరుద్యోగులకు కొలువులు ఇస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన బీజేపీ ప్రభుత్వం ఈ దేశ నిరుద్యోగ యువతను నిండా ముంచింది. ఎనిమిదిన్నర ఏండ్లలో ఇవ్వాల్సిన 16.05 కోట్ల ఉద్యోగాల లెక్క చెప్ప మని ప్రశ్నిస్తే పకోడీలు, బజ్జీల బండ్లు పెట్టుకొని అమ్ము కోండని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 16 లక్షలకు పైగా ఉన్న పోస్టులను భర్తీ చేయకుండా కాలం గడుపుతూ దగా చేస్తున్నారు. అంతే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ హోల్ సేల్‌గా బడా కార్పొరేట్లకు అమ్మేస్తున్నారు. డిజిన్వెస్ట్‌మెంట్ పేరుతో 35 సంస్థలను 3 లక్షల 72 వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అమ్మేశారు. బ్యాంకులకు వేలకోట్లు ఎగవేసిన కార్పొరేట్ పెద్దలపై మోదీ సర్కార్ జాలి పడి ఏకంగా 12 లక్షల కోట్ల రుణాలను రైటాఫ్ చేసి వాళ్ళ రుణం తీర్చుకుంది. కానీ ఓట్లేసి గెలి పించిన సామాన్య ప్రజలకు ఆసరాని ఇచ్చే అనేక సంక్షేమ పథకాలను ఉచితాలుగా ప్రచారం చేస్తూ వాటిని రద్దు చేయించడానికి ప్రయత్నిస్తున్నది. చివరకు నిత్యావసర వస్తువులైన పాలు, పెరుగు, పప్పు, ఉప్పు తదితర వస్తు వులపైన కూడా జీఎస్టీని పెంచి సామాన్యుల బ్రతుకులను దుర్భరంగా మార్చారు. 2014 లో రూ. 410 ఉన్న గ్యాస్ సిలిండర్ల ధర ఇప్పుడు రూ. 1100 దాటింది. అడ్డగోలుగా ఎక్సైజ్ సెస్సులు వడ్డించి పెట్రోల్, డీజిల్ ధరలను హద్దు పద్దు లేకుండా పెంచి ఎనిమిదేండ్లలో 30 లక్షల కోట్ల రూపాయలను ప్రజల నుండి వసూలు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు రిజర్వేషన్ కోటాకు గండికొట్టారు. హైదరాబాద్ కు ముంజూరైన ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసి లక్షలాది ఐటీ ఉద్యోగాలకు గండి కొట్టి తెలంగాణ యువతకు తీరని ద్రోహం చేసింది మోదీ సర్కార్. దేశానికి అన్నం పెట్టే రైతన్నల పొట్ట గొట్టడానికి మూడు వ్యవసాయ నల్ల చట్టాలను తెచ్చి వాటికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులను దేశ ద్రోహు లుగా చిత్రించింది. 750 మంది రైతుల మరణాలకు కారణ మైన నల్ల చట్టాలను చివరికి మోదీ సర్కార్ ఉపసంహ రించుకుంది. కేంద్రం అసమర్థ ఆర్థిక విధానాల ఫలితంగా మన దేశ రూపాయి విలువ గింగిరాలు తిరిగి 83 రూపాయలకు పడిపోయింది. దీనితో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతోంది. ‘మేకిన్ ఇండియా’ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దేశం అప్పుల కుప్పగా తయారయ్యింది. స్వతంత్ర భారత దేశంలో 67 ఏండ్ల కాలంలో పాలించిన ప్రధానులందరూ చేసిన అప్పు రూ. 55.87 లక్షల కోట్లు. 2014 లో మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎని మిదిన్నర ఏండ్లలో చేసిన అప్పు అక్షరాల 80 లక్షల కోట్లు. ఇప్పుడు మొత్తం దేశం అప్పు రూ. 135.87 లక్షల కోట్లకు చేరుకుంది. అంతర్జాతీయ ఆకలి సూచిలో భారతదేశ ర్యాంక్ దారుణంగా దిగజారి 107వ స్థానానికి చేరుకుంది. మన చుట్టూ ఉన్న దేశాల కంటే మన దేశంలోనే ఆకలితో అలమటించే వారు ఎక్కువని ఈ ర్యాంక్ స్పష్టం చేస్తోంది. రైతుల వ్యవసాయ బావుల మోటార్లకు మీటర్లు పెట్టాలని నెల నెలా రైతులు కరెంట్ బిల్లులు కట్టాల్సిందేనని రాష్ట్రాల మెడల మీద కత్తి పెట్టి బెదిరి స్తుంది మోదీ సర్కార్. ఉచిత విద్యుత్తును రైతులకు ఇవ్వొ ద్దని ఆదేశిస్తున్నది. కృష్ణా నది జలాల్లో తెలంగాణ వాటా తేల్చకుండా రాజకీయం చేస్తూ రెండు రాష్ట్రాల మధ్య తగువు పెంచుతోంది. దేశంలో కొత్తగా 157 మెడికల్ కాలేజీలను మంజూరు చేసిన మోదీ ప్రభుత్వం అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా తెలంగాణకు ఇవ్వకపోవడం కేంద్రం వివక్షకు సంకేతం. ప్రతి జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఇవ్వాలని చట్టం చెబుతున్నా తెలంగాణ లోని కొత్త జిల్లాల్లో ఒక్క నవోదయ పాఠశాల కూడా ఏర్పాటు చేయకుండా కక్ష పూరితంగా వ్యవహరించింది. ఎనిమిదిన్నరేండ్లలో ఐఐటీ, ఐఐఎం, ట్రిపుల్ ఐటీ లాంటి 36 ప్రీమియర్ విద్యాసంస్థలను వివిధ రాష్ట్రాల్లో నెలకొల్పిన కేంద్రం తెలంగాణలో ఒక్క ఉన్నత విద్యాసంస్థను కూడా ఏర్పాటు చేయలేదు. విభజన చట్టం ప్రకారం ట్రైబల్ వర్సిటీ ఏర్పాటు చేయాల్సి ఉండగా కొర్రీలు పెడుతూ, జాప్యం చేస్తూ రాష్ట్ర విద్యార్థులకు అన్యాయం చేస్తున్నది. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ విషయంలో మోసానికి పాల్పడింది మోదీ సర్కారు. ఇక్కడ పెట్టాల్సిన కోచ్ ఫ్యాక్టరీని వేరే చోటుకు తరలించి రాష్ట్రంలోని ప్రజల దశాబ్దాల కలల్ని కాల్చేసింది. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పై అబద్ధాలు చెబుతూ ఫ్యాక్టరీ పెట్టడం కుదరదని చావు కబురు చల్లగా చెప్పారు. గిరిజన ప్రజల ఆశల్ని అవకాశాల్ని ఆవిరి చేశారు. పక్క రాష్ట్రాల ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇస్తున్న కేంద్రం పాలమూరు రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టులకు హోదా అడిగితే కుదరదని చెప్పి తెలంగాణ రైతాంగంపై పగ పట్టినట్టు వ్యవహరిస్తున్నారు కేంద్ర పెద్దలు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధులను ఎగ్గొడుతూ బకాయిల్ని విడుదల చేయకుండా తప్పించుకు తిరుగుతున్నది మోదీ ప్రభుత్వం. 9, 10 షెడ్యూళ్లలోని సంస్థలను విభజించకుండా నాన్చుతూ రెండు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టి చోద్యం చూస్తున్నది. ఈ విధంగా మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ ఇచ్చిన హామీలు నెరవేర్చ కుండా మత విద్వేషాలను రెచ్చ గొడుతూ పబ్బం గడుపుకుంటున్నది. ప్రజలు ఎన్నుకున్న బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడానికి ప్రయత్నిస్తున్నారు. తమను వ్యతిరేకించిన వారిని ఈడీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి కేసులు పెట్టి వేధించి లొంగదీసు కుంటున్నారు. బీజేపీ యేతర రాష్ట్ర ప్రభుత్వాలను గవర్నర్ల ద్వారా అనేక ఇబ్బందులు పెడుతున్నారు. ఒకే భాష, ఒకే మతం, ఒకే ఎన్నిక, ఒకే పార్టీ ఉండాలనే లక్ష్యంతో ఫాసిస్టు పోకడలతో మోదీ ఈ ఎనిమిదిన్నర సంవత్సరాలు పాలన సాగిస్తూ వచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి ఏ విధమైన సహాయం అందిం చకపోగా ఈ ప్రభుత్వాన్ని అక్రమ పద్ధతుల్లో పడగొట్టడానికి ఢిల్లీ బ్రోకర్ల ద్వారా వందల కోట్ల రూపాయలతో ఎమ్మె ల్యేలకు ఎరజూపి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న క్రమంలో ఆ దొంగలు బయటపడ్డారు. తమ పప్పులు ఉడకకపోవడంతో గవర్నర్‌ని ఉపయోగించి ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కుట్రలు పన్నుతున్నారు. (క్లిక్ చేయండి: రాష్ట్రాల వృద్ధిలో కేంద్రం పాత్రేమిటి?) ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటిది. దీన్ని తిప్పి కొట్టవలసిన సమయం ఆసన్నమైంది. అధికార టీఆర్ఎస్ ఒక్కటే కాకుండా రాష్ట్రంలోని వామపక్షాలు, అభ్యదయ, లౌకిక శక్తులు అందరినీ కలుపుకొని కేంద్రం మీద యుద్ధభేరి మోగించాలి. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో తాను ఇచ్చిన హామీలు, వాగ్దానాలు అమలుకు పూనుకోవాలి. ప్రగతిభవన్‌లో ప్రజా దర్బార్ ప్రారంభించాలి. ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఆ బాధ్యతను భుజానికెత్తు కోవాలి. ఇవన్నీ చేసినప్పుడే బీజేపీ ఆటలు సాగకుండా నివారించగలుగుతాము. అదే మనందరి కర్తవ్యం. - జూలకంటి రంగారెడ్డి సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే -
Munugode: ఉప ఎన్నికకు కారణం స్వార్థమే!.. ఈ రెండు అంశాలే కీలకం..
తెలంగాణ రాష్ట్ర శాసనసభ కాల పరిమితి ఇంకో ఏడాదిన్నర మాత్రమే ఉంది. ఇలాంటి స్థితిలో మునుగోడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి ఉప ఎన్నిక తీసుకురావడం సరైంది కాదు. తన నియోజకవర్గంలో ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం లేదని అందుకు నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు ఆయన ఆరోపణ చేస్తున్నాడు. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అంశాలు రెండు ఉన్నాయి. రాజీనామా చేయడం వల్లనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయనే తప్పుడు సంకేతం ప్రజలకు ఇవ్వడం ఒకటి కాగా, రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పక్షాన గెలిచి ఆ పార్టీకి ద్రోహం చేసి ఆయన తాజాగా బీజేపీ అభ్యర్థిగా ఉప ఎన్ని కల్లో పోటీ చేయటం వింతైన రెండో అంశం. మునుగోడు నియోజకవర్గం పట్ల ప్రభుత్వం నిజంగానే పక్షపాత వైఖరి అవలంబిస్తుందని ఆయన భావించినట్లయితే గతంలో ఎంపీగా, ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహించినప్పుడు జరిగిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించాలి. అభివృద్ధి కార్యక్రమాలు జరక్కపోతే శాసనసభ్యుడిగా ఆయన చట్టసభలో ప్రభు పై ప్రజా వాణి గట్టిగా వినిపించి ప్రభుత్వం నుండి నిధులు రాబట్టాలి లేదా ప్రజా ఉద్యమాల ద్వారా ప్రభుత్వం మెడలు వంచి అభివృద్ధి కార్యక్రమాలు జరగడానికి కృషి చేయాలి. ఆ పని చేయకుండా రాజీనామా చేసి ఉప ఎన్నిక తీసుకురావడం సరికాదు. వాస్తవంగా తన సొంత ప్రయోజనాల కొరకే ఈ ఎన్నిక తీసుకొచ్చారని ప్రజలు భావిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు దేశంలో గుర్తించబడిన కాంట్రాక్టర్ల లిస్టులో వీరి కుటుంబం ఒకటి. కేంద్ర బీజేపీ పాలకులు తనకు 18 వేల కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టు పని కట్టపెట్టారని ఆయన స్వయంగా ప్రకటించడం గమనార్హం. తన స్వప్రయోజనాలకు అభివృద్ధి కార్యక్రమాలకి ముడివేయడాన్ని ప్రజలు అర్థం చేసుకోవడంతో... ఆయనకు భయం పట్టుకుంది. మునుగోడు నియోజక వర్గంలో తమ ఓటమి ఖాయమని తెలిసిన రాజగోపాల్ రెడ్డి, ఆయనకి బడా కాంట్రాక్టు అప్పగించడంతో పాటు, రాజకీయ ఆశ్రయం ఇచ్చిన బీజేపీ నేతలు కమ్యూనిస్టుల మీద విమర్శలకు దిగటం తగదు. బీజేపీ దక్షిణ తెలంగాణలో కృత్రిమ ఊపును... ఒక్క మాటలో చెప్పాలంటే వాపును సృష్టించేందుకు రాజగోపాల్ రెడ్డిని ఒక ఎరగా ప్రయోగించి బలపడడానికి ప్రయత్నిస్తున్నది. కేంద్రంలో అధికారంలో ఉండి వారికి వ్యతిరేకంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను అక్రమ పద్ధతుల్లో, అనైతికంగా, అప్రజాస్వామికంగా కూల్చి తమకు అనూకూలమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలను నామ రూపాలు లేకుండా చేయడానికి పూనుకుంటున్నారు. దాంట్లో భాగంగానే తెలంగాణ టీఆర్ఎస్ శాసన సభ్యులను వందల కోట్ల రూపాయలతో కొనడానికి చేసిన ప్రయత్నం అందరికీ తెలిసిందే. వారికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఈడీ, సీబీఐలతో దాడులు చేయించి కేసులు పెట్టి వేధిస్తున్నారు. అంతే కాకుండా బీజేపీ పాలకులు ‘ఒకే దేశం, ఒకే జాతి, ఒకే సంస్కృతి’ అంటూ ప్రజలను చీలుస్తూ మత సామరస్యాన్ని సమాధి చేస్తున్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని ధ్వంసం చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో పాగా వేసేందుకు ఉప ఎన్నిక ద్వారా మునుగోడు నియోజకవర్గాన్ని, బీజేపీ ఒక ప్రయోగశాలగా ఎంపిక చేసుకుంది. అందుకు రాజగోపాల్ రెడ్డి కుటుంబం, బీజేపీకి బలమైన ఎరగా కనబడింది. అయితే, చైతన్యవంతమైన ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రజలందరితో పాటు మునుగోడు నియోజకవర్గ ప్రజలు, ఈ ఉప ఎన్నికకి సంబంధించి భారతీయ జనతాపార్టీ అంతర్గత ఎజెండాను స్పష్టంగా అర్థం చేసుకున్నారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మతతత్త్వ విచ్ఛిన్న కర, ఫాసిస్ట్ విధానాల్ని తిప్పికొట్టేందుకు, ఈ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థికి మద్దతు ఇవ్వడం జరుగుతోంది. రానున్న ప్రజా తీర్పు దేశ ప్రజలకు ఆదర్శం కాబోతోంది. వ్యాసకర్త సీపీఎం మాజీ శాసనసభా పక్ష నాయకుడు- జూలకంటి రంగారెడ్డి -
ఈటల వ్యాఖ్యలు దురదృష్టకరం: జూలకంటి
సాక్షి, హైదరాబాద్: మునుగోడు బీజేపీ సభలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కమ్యూనిస్టులపై చేసిన ఆరోపణలను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో ఖండించారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమ స్యలపై పోరాటాలు నడిపిస్తున్న చరిత్ర కమ్యునిస్టులకు ఉందన్నారు. ముఖ్యంగా కొంత కాలంగా రాష్ట్రంలో పోడు భూముల సమస్య, కౌలు రైతుల సమస్యలపై పోరాడుతున్నామన్నారు. ఈ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఏ ప్రభుత్వం ఉన్నా పోరాటాలు సాగిస్తూనే ఉంటామన్నారు. ఇవన్నీ చూస్తూ కూడా ఈటల రాజేందర్ మునుగోడులో కమ్యూనిస్టులపై విమర్శలు చేయడం దురదృష్టకరమని రంగారెడ్డి విచారం వ్యక్తంచేశారు. -
లిఫ్టులను ప్రభుత్వమే నిర్వహించాలి!
నాగార్జున సాగర్ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లాకు త్రాగునీరు, సాగునీరు ఎక్కువగా వచ్చే అవకాశం లేకుండా పోతుందని ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న మొదట్లోనే నల్లగొండ జిల్లా ప్రజలు, అఖిలపక్ష నాయకులు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆ క్రమంలో ప్రభుత్వం నల్లగొండ జిల్లాకు ఎడమ కాల్వపై ప్రత్యేకంగా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలు ఏర్పాటు చేసి లక్ష ఎకరాలకు నీళ్ళు అందిస్తామని హామీ ఇచ్చింది. ఆ లిఫ్టులు కూడా ప్రాజెక్టులో అంతర్భాగంగా ప్రభుత్వమే నిర్వహిస్తుందని తెలియపరిచారు. కానీ అది నేటికీ పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం వల్ల లిఫ్టుల ఆయకట్టు రైతులు నష్టపోతూనే ఉన్నారు. ప్రభుత్వం లిఫ్టులు ఏర్పాటు చేయటానికి ముందుకు రాకపోవడం వలన రైతులే స్వయంగా 1970లో కో–ఆపరేటివ్ సొసైటీలు ఏర్పాటు చేసుకొని భూములు బ్యాంకుల్లో కుదువ పెట్టి అప్పులు తీసుకుని 18 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలు చేపట్టి 1980–81 వరకు నడిపించారు. తర్వాత వీటిని నిర్వహించడం తమ వల్ల కాదనీ, ప్రభుత్వమే నిర్వహించాలనీ పెద్ద ఎత్తున రైతులు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చారు. దాని ఫలితంగా ఆనాటి ప్రభుత్వం ఐడీసీ డిపార్ట్మెంట్కు ఆ లిఫ్టుల నిర్వహణ బాధ్యతను అప్పగించింది. తర్వాత కాలంలో అంచెలంచెలుగా మొత్తం 54 లిఫ్టులు ఎడమ కాల్వపై ఐడీసీ ద్వారా ఏర్పాటు చేశారు. ఆనాడు లిఫ్టులకు కరెంటు సప్లై సరిగ్గా లేక సగం ఆయకట్టుకు కూడా నీళ్ళు అందని పరిస్థితి ఏర్పడింది. అలాంటి పరిస్థితుల్లో రైతుల ఇబ్బందులను గమనించి నాగార్జున సాగర్ నుండి నడిగూడెం మండలంలో ఉన్న చివరి లిఫ్టు వరకూ రైతులందరినీ వెంట తీసుకొని 2007లో సీపీఎం పాదయాత్ర నిర్వహించింది. నాతో పాటు నంద్యాల నర్సింహారెడ్డి, నోముల నర్సింహయ్య, మరికొంత మంది నాయకులూ పాల్గొన్న ఈ పాదయాత్ర వారం రోజుల పాటు సాగింది. ఇది ప్రభుత్వం మీద బలమైన ఒత్తిడి కలుగజేసింది. ఫలితంగా... సెపరేట్ ఫీడర్ లైన్ నిర్మాణం జరిగి 18 గంటలు కరెంట్ సప్లై అయ్యే విధంగా ఏర్పాటు జరిగింది. అయినా తర్వాత కాలంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా లిఫ్టులు నడపలేని పరిస్థితి వచ్చింది. 2013–14లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఆధునికీ కరణ పనులకు వరల్డ్ బ్యాంక్ అందించిన 4 వేల కోట్లలో రూ. 100 కోట్లు కేటా లిఫ్టుల మరమ్మతులకు కేటాయించారు. ఈ నిధులతో 50 శాతం పనులు మాత్రమే చేపట్టి వదిలేశారు. తర్వాత లిఫ్టుల నిర్వహణ బాధ్యతను ఎన్ఎస్పీ డిపార్ట్మెంట్కు, తర్వాత ఐబీ డిపార్ట్మెంట్కు అప్పగించారు. బాధ్యత ఏ శాఖకు ఇచ్చినా శాశ్వత సిబ్బందిని మాత్రం నియమించలేదు. పైగా ఐబీ శాఖకు ఈ లిఫ్టులపై కనీస అవగాహన లేదు. ఈనాడు ఈ లిఫ్టులన్నీ పరిశీలిస్తే మోటార్లు, స్టార్టర్లు, కాల్వలు, తూములు దెబ్బతిని రైతులు నడపలేని పరిస్థితి ఏర్పడింది. కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సందర్భంలోనూ; 2014, 2018 ఎన్నికల ప్రచార సభల్లోనూ; వారి ఎన్నికల మ్యానిఫెస్టోలో సాగర్ ఎడమ కాల్వపై ఉన్న లిఫ్టులన్నింటినీ ప్రాజెక్టులో అంతర్భాగంగా ప్రభుత్వమే నడిపిస్తుందని హామీ ఇచ్చారు. కానీ అమలు మర చారు. నాగార్జున సాగర్ ఎడమ కాల్వపై ఉన్న లిఫ్టులను ప్రభుత్వమే నడిపించాలి. యుద్ధ ప్రాతిపదికపైన మరమ్మతులు చేపట్టాలి. బావుల, కాల్వల పూడికలు; తూములు, మోటార్లు, షట్టర్లు, ప్యానల్ బోర్డులు, పంపులు, పైప్ లైన్స్ తదితర పనులు చేపట్టాలి. లిఫ్టుల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని నియమించాలి. లిఫ్టుల నిర్వహణ బాధ్యత ఐడీసీకి అప్పజెప్పాలి. వీరి న్యాయమైన సమస్యల పరిష్కారం కొరకు మరొకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో నల్లగొండ ఐబీసీఈ ఆఫీసు ముందు నేడు (జూన్ 27) ధర్నా చేస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. (క్లిక్: శాస్త్రశోధనల గొంతు నొక్కితే ఎలా?) - జూలకంటి రంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, రైతు సంఘం నాయకుడు -
ఆయన వారసత్వాన్ని నిలబెడదాం!
ఆదర్శవంతమైన రాజకీయనేతగా, దక్షిణ భారత కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాతగా, పీడిత ప్రజల ప్రియ తమ నాయకునిగా కామ్రేడ్ పుచ్చల పల్లి సుందరయ్య (పీఎస్)కు ఆధునిక భారత చరిత్రలో చెరగని స్థానం ఉంది. 1913 మే 1వ తేదీన నెల్లూరు జిల్లా అలగానిపాడులో ఒక భూస్వామ్య కుటుంబంలో జన్మించిన పీఎస్... చిన్న వయసులోనే సంఘ సంస్కరణ, స్వాతంత్ర పోరాట దీక్ష అలవర్చుకున్నారు. 1930వ దశకంలో దక్షిణ భారత దేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాణానికి బీజాలు వేశారు. దేశంలోనే తొలి వ్యవసాయ కార్మిక సంఘాన్ని స్థాపించారు. తన వాటాకి వచ్చిన యావదాస్తినీ పార్టీకీ, ఉద్యమానికీ ధారబోసి అత్యంత నిరాడంబరంగా, నియమబద్ధంగా, నిర్మాణాత్మకంగా జీవించారు. 1934లో ఏర్పడిన తొలి ఆంధ్ర కమ్యూనిస్ట్ కమిటీలో సభ్యుడైన సుందరయ్య వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ప్రత్యక్షంగా నాయకత్వం వహించారు. భూమి లేని నిరు పేదలకు ఆ పోరాటం 10 లక్షల ఎకరాల భూమిని పంచింది. 3,000 గ్రామాల్లో గ్రామ రాజ్యాలు ఏర్పర్చారు. నైజాంను భారతదేశంలో విలీనం చేయడానికి భారత సైన్యాలు వచ్చినప్పటికీ అవి కమ్యూనిస్టులను అణచివేయ చూసినప్పుడు... సాయుధ పోరాటం కొనసాగిస్తూ ఉద్య మాన్ని ముందుకు తీసుకు వెళ్లడంలో ఆయన కృషి గణ నీయమైనది. కమ్యూనిస్ట్ పార్టీ తొలి కేంద్ర కమిటీలో సభ్యుడైన సుందరయ్య ఆఖరి వరకు సీపీఎం కేంద్ర కమిటీ సభ్యునిగా ఉన్నారు. మితవాద, ఉగ్రవాద పెడ ధోరణులు తలెత్తినపుడు మార్క్సిజం సిద్ధాంత స్వచ్ఛతను కాపాడడం కోసం అంతర్గత పోరాటాన్ని సాగించడమే గాక చాలా కాలం కారాగారవాసం కూడా అనుభవించారు. సీపీఎం ఏర్పడినప్పుడు తొలి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి ప్రధాన కమ్యూనిస్టు పార్టీగా తీర్చిదిద్దడానికి పునాదులు వేశారు. పశ్చిమబెంగాల్లో ‘అర్ధ ఫాసిస్టు బీభత్స కాండ’ కాలంలో రంగంలో ఉండి వారికి చేయూతనందించారు. ఎమర్జెన్సీ తర్వాత కాలంలో ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి వచ్చి మళ్ళీ ఉద్యమ నిర్మాణాన్ని పటిష్టం చేసేం దుకూ, విస్తృత పరిచేందుకూ అంకితమైనారు. రెండేళ్ల పాటు రాష్ట్ర కార్యదర్శిగానూ పనిచేశారు. ప్రజా ఉద్యమాలు పోరాటాలతో పాటు చట్టసభల్లోనూ సుందరయ్య ప్రజల వాణి వినిపించడంలో గొప్పపాత్ర నిర్వహించారు. భారత పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడిగా 1952– 54 మధ్య రాజ్యసభలో ఉండి నాటి ప్రధాన ప్రతిపక్షమైన కమ్యూనిస్టు సభ్యులకు నేతృత్వం వహించారు. పార్లమెంటుకు సైకిల్‌పై వెళ్లిన ఆయన నిరాడంబరత్వం చరిత్రలో నిలిచిపోయింది. 1955లో ఆంధ్ర శాసనసభ మధ్యంతర ఎన్నికలలో పాలకవర్గాలు, బడా పత్రికలు విషపు ప్రచారాలు సాగించినా వాటిని లెక్కచేయకుండా నికరంగా పోరాడారు. 1962లో గెలుపొంది విశాఖ ఉక్కు సమస్యపై రాజీనామా చేసి మళ్ళీ 1978 – 83 మధ్య శాసనసభ్యుడుగా ఉన్నారు. సుందరయ్య, ఆయనను వివాహమాడిన కమ్యూనిస్ట్ కార్యకర్త కామ్రేడ్ లీల ఇద్దరూ... సంతానాన్ని కూడా వద్దనుకుని ఉద్యమ నిర్మాణానికే అంకితమైన తీరు ఒక ఉదాత్త ఉదాహరణగా మిగిలిపోయింది. కామ్రేడ్ సుందరయ్య రాజకీయాలతో పాటు కళా, సాహిత్య, సాంస్కృతిక రంగాలలోనూ మహత్తర కృషి చేశారు. తెలుగు జాతి సాహిత్య సాంస్కృతిక పునరు జ్జీవనానికి సదా శ్రద్ధ వహించారు. ‘విశాలాంధ్రలో ప్రజారాజ్యం’ పుస్తకం రాసి భావి బాషా రాష్ట్రాల స్థాపన బాట చూపారు. ‘నవ శక్తి’, ‘స్వతంత్ర భారత్’, ‘ప్రజాశక్తి’, ‘విశాలాంధ్ర’, తిరిగి ‘ప్రజాశక్తి’ వంటి పత్రికలు స్థాపించడం ద్వారా కమ్యూనిస్ట్ భావాల వ్యాప్తికి కృషి చేశారు. (చదవండి: రాజ్యాంగస్ఫూర్తే విరుగుడు!) అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలో గౌరవాభిమానాలు పొందిన సుందరయ్య... శ్రామిక వర్గ అంతర్జాతీయతను నిలబెట్టిన యోధుడు. ఈ నిర్విరామ కృషిలో ఆయన అనారోగ్యంతో పెనుగులాడుతూ వచ్చారు. రాష్ట్ర కార్యదర్శిగా ఉండగానే 1985 మే 19వ తేదీన ఆయన కన్నుమూశారు. బహుముఖ కార్యక్రమాలతో సుందరయ్య స్ఫూర్తిని ఈ తరానికి అందించడం మనందరి కర్తవ్యం. (Enugula Veeraswamy: ఆ యాత్ర ఓ చరిత్ర) - జూలకంటి రంగారెడ్డి సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు (మే 19న పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి) -
అన్నీ అబద్ధాలు! అసంబద్ధ విధానాలు!!
కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి... మతవాద, మితవాద నియంతృత్వ పోకడలతో పయనిస్తోంది. అచ్ఛే దిన్ వచ్చేస్తాయని ప్రజలకు నమ్మ బలికారు. 2015–16 కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రసంగంలో 2022 నాటి కల్లా 6 కోట్ల మంది నిరుపేదలకు పక్కా ఇళ్ళు కట్టిస్తామని హామీ ఇచ్చారు. విద్య, వైద్యం అందరికీ ఉచితంగా అందిస్తామని; రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, ప్రతి ఏటా 2 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని, నల్లధనాన్ని బయటకు తీసి ప్రతి కుటుంబానికి 15 లక్షల చొప్పున అందిస్తామని వాగ్దానాలు చేశారు. వీటిలో ఏ ఒక్కటీ అమలుకు నోచు కోలేదు. ప్రజలు చచ్చే దిన్ వచ్చాయి. మోదీ రాజ్యసభలో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అక్రమ పద్ధతుల్లో విభజించారని వాపోయారు. విభజన జరగడంలో బీజేపీ పాత్ర ఉందనేది మర్చిపోయారా? అక్రమ పద్ధతుల్లో జరుగుతున్నప్పుడు ఆనాడు ఎందుకు ప్రశ్నించలేదు? గుడ్డిగా ఎందుకు బలపరిచారు? ఈ నాటకాలు ప్రజలు అర్థం చేసుకోలేరని అనుకుంటున్నారా? కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి ఏడున్నర సంవత్సరాలు అవుతున్నా... తెలుగు రాష్ట్రాలకు విభజన చట్టంలో ఉన్నవి ఏ ఒక్కటీ అమలు చేయకుండా ప్రతి బడ్జెట్లో మొండి చేయి చూపిస్తూ తెలుగు ప్రజలకు అన్యాయం చేస్తున్నది. ప్రధాని ఇలా అబద్ధాలు చెప్పడం తగునా? కేంద్ర ప్రభుత్వం తాజాగా పార్లమెంటులో ప్రవేశ పెట్టిన 2022–23 ఆర్థిక సంవత్సర బడ్జెట్ దేశ ప్రజలను మరోసారి మోసగించి మభ్యపెట్టే విధంగా ఉంది. ఈ బడ్జెట్ ప్రజలకు తీరని నష్టం చేసేలాగా, కార్పొరేట్లకు అధిక లాభదాయకంగానూ ఉంది. వ్యవసాయ రంగానికి కేటాయింపులు తగ్గించారు. ఎరువుల సబ్సిడీని తగ్గించారు. రైతు పంటకు గిట్టుబాటు ధరల గ్యారెంటీ లేదు. (చదవండి: వారికి ఆర్థిక స్థిరత్వం అక్కర్లేదా?) రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి కార్పొరేట్ శక్తులకు ఆదాయం పెంచే విధానాలు చేపడుతున్నారు. వ్యవసాయ రంగాన్ని మరింత సంక్షోభానికి నెట్టి వేస్తు న్నారు. పేదల ఆహార సబ్సిడీ సవరించిన అంచనాలతో 27.75 శాతం తగ్గించి కోత పెట్టారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి గత బడ్జెట్ కంటే 25 వేల కోట్లు తగ్గించారు. ఇది ఉపాధి కూలీల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. (చదవండి: ఇది మనుషులు పట్టని అభివృద్ధి) కరోనా రెండోదశ సృష్టించిన మృత్యు విలయం నుంచి గుణపాఠాలు తీసుకొని ఆరోగ్య రంగానికి పెద్ద పీట వేయాలి. అందుకు సరిపడే బడ్జెట్ కేటాయించాల్సిన అవ సరం ఎంతో ఉన్నప్పటికీ ఈ బడ్జెట్లో నామమాత్రంగా, స్వల్పంగా ఆరోగ్య మిషన్ కింద కేటాయింపులు చేశారు. విద్యారంగం కరోనాకు కుదేలైనా దాన్ని మళ్లీ గాడిలో పెట్టే చొరవ అంతగా కనిపించలేదు. ఏటా 3.5 లక్షల కోట్ల రూపాయల నుంచి 4 లక్షల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టే స్థితిలో ఉన్న ఎల్ఐసీని 74 శాతం వాటాను కార్పొరేట్లకు ఇవ్వడం ద్వారా ప్రైవేటుపరం చేయడానికి పూనుకుంది. జాతీయ బ్యాంకుల ప్రైవేటీకరణ మొదలైంది. దీని వల్ల సామాన్య ప్రజలకు తీరని నష్టం జరుగుతుంది. ఎయిర్ ఇండియా, రైల్వే రంగం, జాతీయ రహదారులు, బీఎస్ఎన్ఎల్, బొగ్గు గనులు, ఓడరేవులు వంటి ప్రభుత్వం కింద ఉన్నవాటిని కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టడానికి మోదీ ప్రభుత్వం ఒక మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నది. కరోనాను ఎదుర్కొనడంలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ప్రభుత్వం అనుసరించిన తప్పుడు విధానాల వలన కరోనా కేసులు, మరణాలు విపరీతంగా పెరిగాయి. 2020 మార్చిలో ముందస్తు ప్రణాళిక లేకుండా అకస్మాత్తుగా లాక్డౌన్ ప్రకటించడం వలన ప్రజలు ఆర్థి కంగా చితికి పోయారు. ఈ నష్టానికి కేంద్రానిదే బాధ్యత. ఇలాంటి విధానాలతో దేశాన్ని తిరోగమనం వైపు తీసు కెళ్తున్నారు. ప్రజలు వీరి మోసపూరిత విధానాలను అర్థం చేసుకొని వారి రాజకీయ కుయుక్తులను తిప్పి కొడుతూ దేశ సంపదను, ప్రజల హక్కులను, ప్రజాస్వామ్యాన్ని కాపాడు కోవడానికి చైతన్యంతో వ్యవహరించాలి. - జూలకంటి రంగారెడ్డి మాజీ శాసనసభ్యులు, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు -
వారివి దొంగ పోరాటాలు, కొంగ జపాలు
సాక్షి, హైదరాబాద్: ధాన్యం కొనుగోలు చేయకుండా రైతుల నెత్తిన టోపీ పెట్టాలని చూస్తున్న బీజేపీ, ధాన్యం కొనుగోలు గురించి కేంద్రంపై ఒత్తిడి చేయకుండా తప్పించుకోవాలని చూస్తున్న టీఆర్ఎస్లవి దొంగ పోరాటాలు, కొంగ జపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి ఎద్దేవా చేశారు. దేశ రైతాంగాన్ని చేపల్లా మింగేందుకు కొంగజపం చేస్తున్న బీజేపీపై తామేదో సాధించబోతున్నట్లు టీఆర్ఎస్ దొంగపోరాటాలు చేస్తోందని సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. 2 పార్టీల నేతలు వీధిరౌడీలకు మించి వ్యవహరిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ఆరోపించారు. వెంటనే ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొను గోలు చేయకపోతే ఈ దొంగ పోరాటాలు, కొంగ జపాలకు రాష్ట్ర రైతాంగం తగిన బుద్ధి చెబుతుందని జూలకంటి హెచ్చరించారు. -
తెలంగాణ విమోచన దినోత్సవం: స్ఫూర్తిదాయక పోరాటం
ఈ నేల మీద సాగిన వీరోచిత త్యాగాల చరిత్ర, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. నాలుగు వేల మంది రక్త తర్పణంతో తెలంగాణ పునీత మైంది. ‘బాంచన్ దొర, నీ కాళ్లు మొక్కుతా’ అన్న చేతులే బందూకులెత్తి పోరాటం సాగించాయి. ఈ పోరాటం పదిలక్షల ఎకరాల భూమిని పేదలకు పంచింది. 3 వేల గ్రామాలలో గ్రామ రాజ్యాలు నెలకొల్పింది. ఈ క్రమం సాగుతుండగానే 1948 సెప్టెంబర్ 13న భారత సైన్యం ఆపరేషన్ పోలో పేరుతో హైదరాబాద్ స్టేట్‌పై యుద్ధం ప్రకటించింది. భారీ మర ఫిరంగులతో 50 వేల సైన్యం కవాతు తొక్కింది. కేవలం ఐదు రోజుల్లోనే యుద్ధం ముగి సింది. సెప్టెంబర్ 17న ఏడవ నిజాం భారత సైన్యాలకు లొంగిపోయాడు. కానీ నిజాంను లొంగ దీసుకోవడానికి వచ్చిన నెహ్రూ సైన్యాలు రైతాంగ ఉద్యమాన్ని అణచడానికి మూడేళ్ల పాటు శత విధాలా ప్రయత్నించాయి. అనేకులైన రైతు యోధులు, కమ్యూనిస్టులు నెహ్రూ సైన్యాల చేతిలో హత్యకు గురయ్యారు. పదివేల మంది కార్యకర్తలను కాన్సంట్రేషన్ క్యాంపులలో నిర్బం ధానికి గురిచేశారు. బ్రిగ్స్ ప్లాన్ పేరుతో గ్రామాలను దహనం చేశారు. అయినా సాయుధ పోరాట విరమణ జరగలేదు. 1946లో ప్రారంభమైన పోరాటాన్ని 1951 అక్టోబర్ 21న భారత ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు విరమిస్తున్నట్టు కమ్యూనిస్టు పార్టీ ప్రకటించింది. ఇది చరిత్ర కాగా, భారతీయ జనతా పార్టీ నిజాం లొంగుబాటును విమోచన దినంగా ప్రకటి స్తున్నది. హైదరాబాద్ సంస్థానంలో ముస్లిం రాజుకు, హిందూ ప్రజలకు మధ్య జరిగిన యుద్ధ మని గోబెల్స్ పలుకులు పలుకుతోంది. సాయుధ పోరాటంతో గానీ, నిజాం వ్యతిరేక ఉద్యమాలతో గానీ ఆనాటి జనసంఘ్‌కూ, ఈనాటి బీజేపీకీ ఏ సంబంధమూ లేదు. ఇది కులానికి, మతానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం కాదు. నిరంకు శమైన నిజాం పాలనకు, భూస్వామ్య శక్తులకు వ్యతిరేకంగా ఆనాడు హిందూ ముస్లిం తేడా లేకుండా సాగించిన వర్గపోరాటం ఇది. 1943లో పరమ దుర్మార్గుడైన పాలకుర్తి, విసునూరు దొరలపై చట్ట బద్ధంగా తిరగబడి సవాల్ చేసిన పేద ముస్లిం రైతు బందగీ. తన భూమిని దక్కించుకునే ప్రయ త్నంలో భూస్వాముల గుండాల దాడిలో బలైన తొలి అమరుడు. ఇమ్రోజ్ పత్రిక సంపాదకుడు షోయబుల్లాఖాన్ నిజాంకు వ్యతిరేకంగా రాస్తు న్నాడని దొంగచాటుగా రజాకార్లు ఆయన కాళ్ళు చేతులు నరికి వేశారు. ఎందరో ముస్లిం మేధా వులు, కమ్యూనిస్ట్ నాయకుడు, కవి మఖ్దూమ్ లాంటి వారి నుంచి మొదలుకొని సామాన్య ప్రజల వరకు రజాకార్లకు వ్యతిరేకంగా పోరా డారు. గత రెండు వందల సంవత్సరాలలో తెలం గాణ ప్రజా పోరాటంతో పోల్చదగిన ఉద్యమం గానీ, పోరాటం గానీ దేశ చరిత్రలో కానరాదు. బ్రిటిష్ పరిపాలన అంతం కావడం, దేశానికి స్వాతంత్రం రావడం, దాదాపు 565 సంస్థానాలు భారతదేశంలో విలీనం కావడం జరిగింది. కానీ, స్వాతంత్య్రానంతరం ఐదు సంస్థానాలు స్వతం త్రంగా వ్యవహరించడానికి నిర్ణయించుకున్నాయి. అందులో హైదరాబాద్ స్టేట్ ఒకటి. నిజాం రాజు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా పేరు గాంచాడు. ఆనాడే 236 బిలియన్ల సంపద కలిగి ఉన్నాడు. ఐదు టన్నుల బంగారం కలిగి ఉన్నాడు. హైదరాబాద్ సంస్థానం స్వతంత్రంగా ఉండటానికి నిర్ణయించుకున్నట్లు 1947 జూన్ 11న నిజాం పర్మాన ప్రకటించాడు. నిజాం దేవుడి ప్రతి రూపం అంటూ ఎంఐఎం ప్రచారం ప్రారంభించింది. ప్రజ లను భయభ్రాంతులకు గురిచేయడం, దోచు కోవడం, హత్యలు లూటీలు చేయడం, దొరలకు జాగీర్దార్లకు అండగా నిలవడం రజాకార్ల నిత్య కృత్యంగా మారింది. ప్రజలలో నిజాం పాలన పట్ల తీవ్ర వ్యతిరేకత పెరిగింది. అది కమ్యూనిస్టుల నేతృత్వంలో సాయుధ పోరాటంగా రూపు దిద్దుకుంది. పోలీస్ యాక్షన్, నిజాం పాలన అంతంతో ప్రజల కష్టాలు తీరుతాయని అందరూ భావిం చారు. తెలంగాణలో నైజాం పాలన స్థానంలో నెహ్రూ పాలన వచ్చింది. ఆనాటి దొరలే తిరిగి కాంగ్రెస్ నాయకులు అయ్యారు. పాలనలో మార్పు లేదు, ప్రజల బతుకుల్లో మార్పులేదు. అందుకే నిజాం లొంగిపోయిన 1948 సెప్టెంబర్ 17 తర్వాత కూడా తెలంగాణ పోరాటం కొనసాగింది. ప్రజలపై దాడులను ప్రతిఘటించాలని పార్టీ నిర్ణయించింది. చివరకు పార్టీ నాయ కత్వంతో భారత ప్రభుత్వం సంప్రదింపులు జరిపి పోరాట విరమణకు కొన్ని హామీలను ఇచ్చింది. నాయకత్వం పోరాట విరమణ ప్రకటించింది. ఆ తర్వాత ఇచ్చిన హామీలకు భిన్నంగా ప్రభుత్వం వ్యవహరించింది. అయితే వీరుల త్యాగాలు వృధా కాలేదు. వర్తమాన సమాజంలో ఆ స్ఫూర్తి నేటికీ కొనసాగుతూనే ఉన్నది. - వ్యాసకర్త రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ -
కేసీఆర్ మద్దతివ్వాలి: జూలకంటి
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మద్దతివ్వాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. జూలకంటి, తెలంగాణలోని సూర్యాపేట, నల్లగొండ జిల్లాలకు చెందిన రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు, సీఐటీయూ, విద్యార్థి యువజన సం ఘాల నేతృత్వంలో వందలాది మంది ఆదివారం ఆందో ళన శిబిరాలను సందర్శించారు. టీఎస్ యూటీఎఫ్ రూ.3లక్షల ఆర్థిక సాయం రైతు ఉద్యమానికి సంఘీభావంగా తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్).. రూ.3 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేసింది. యూటీఎఫ్ ప్రతి నిధులు రైతు శిబిరాలను ఆదివారం సందర్శించారు. (చదవండి: పంతం వీడండి) -
సిబ్బంది లేనిదే నిర్వహణ ఎలా?
తెలంగాణ ప్రభుత్వం కోటి ఎకరాలకు నీళ్లందించాలనే లక్ష్యంతో కొత్త ప్రాజెక్టుల నిర్మాణాలు చేస్తోంది. కానీ ప్రాజెక్టుల నిర్వహణకు కావాల్సిన సిబ్బందిని నియమించకపోవడంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. ప్రాజెక్టులలో ఇంజ నీర్లను భర్తీ చేస్తున్నది గానీ, ప్రాజెక్టుల నిర్వహణలో కీలకమైన వ్యవస్థ వర్క్ ఛార్జ్డ్ సాంకేతిక ఉద్యోగులను, కార్మికులను భర్తీ చేయడం లేదు. ప్రాజెక్టులు, కాల్వల ద్వారా లక్షలాది ఎకరాలకు నీరందించే లస్కర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు నేడు నామమాత్రంగా మిగిలిపోయారు. ప్రాజెక్టులపై వర్క్ ఛార్జ్డ్ సిబ్బంది మెకానికల్ పనులను నిర్వహిస్తూ ప్రాజెక్టులను కాపాడేవారు. నట్లు, బోల్ట్, స్పానర్, స్టీరింగ్, విద్యుత్ సిబ్బంది ప్రాజెక్టులకు జవసత్వాలుగా పని చేస్తారు. వీరు మజ్దూర్, హెల్పర్, ఫిట్టర్, మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఆపరేటర్, ఫోర్‌మెన్ పేర్లతో వివిధ కేటగిరిల్లో ప్రాజెక్టులపై పని చేస్తుంటారు. ఉదాహరణకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఐదు వేల మంది వర్క్ ఛార్జ్డ్ సిబ్బంది పని చేశారు. ప్రాజెక్టుల భారీ గేట్లు ఆపరేట్ చేయడం, వాటికి డ్యామ్ సేఫ్టీ అథారిటీ సిఫార్సులు, మాన్యువల్స్ ప్రకారం మరమ్మతులు నిర్వహించడం లాంటి పనులు సాంకేతిక సిబ్బంది చేయాల్సి ఉంటుంది. బ్రిటిష్ హయాంలో, ఆ తర్వాత పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖలలో వర్క్ ఛార్జ్డ్ సిబ్బంది సాంకేతికపరమైన అనుభవం కలిగి స్కిల్డ్, సెమీ స్కిల్ట్ నిపుణులుగా నిర్వహణ, మరమ్మత్తుల పనులు నిర్వహించేవారు. అదే ఒరవడిని స్వాతంత్య్రానంతరం వివిధ ప్రభుత్వాలు కొనసాగిస్తూ వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2/94 యాక్ట్ తెచ్చింది. దీనివలన రెగ్యులరైజేషన్ నిలిచిపోయింది. సుప్రీంకోర్టు దాకా వెళ్లి 212 జీవో తెచ్చుకున్నారు. అది కొంతమందికి మాత్రమే ఉపయోగపడింది. ఎన్ఎంఅర్లుగా, కంటింజెంట్‌గా పనిచేస్తున్న సిబ్బంది 20, 30 ఏళ్లు గడిచినా పర్మినెంట్ కాలేదు. గత 30 సంవత్సరాలుగా కొత్త రిక్రూట్మెంట్ లేకపోవడంతో అనుభవం కలిగిన సిబ్బంది క్రమంగా రిటైర్ అవుతున్నారు. వారి స్థానాలలో సిబ్బందిని మాత్రం భర్తీ చేయడం లేదు. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో నిర్వహణ అనుభవం, అర్హత కలిగిన వాళ్లు లేకపోవడంవల్ల తరచుగా ప్రమాదాలు జరిగి నష్టం వాటిల్లుతోంది. 2009లో శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు గత వంద సంవత్సరాలలో కనీవినీ ఎరుగని వరద వచ్చింది. ఆనాడు కొద్దిమందిగా ఉన్న అనుభవం కలిగిన సిబ్బంది ప్రాణాలకు తెగించి గేట్ల సమర్థవంత నిర్వహణ ఫలి తంగా ప్రాజెక్టులకు పెనుప్రమాదం తప్పింది. ప్రభుత్వం వర్క్ఛార్జ్డ్ సిబ్బందిని ప్రశంసించింది. ప్రాజెక్టులపై ఆపరేషన్ మెయింటెనెన్స్ సిబ్బంది నియామకాలను త్వరలో చేపడతామని శాసనసభలో నీటి పారుదల శాఖ మంత్రి ప్రకటించడం జరిగింది. కానీ నేటికీ అతీగతీ లేదు. ఒక ప్రాజెక్టు పూర్తయితే దాని మీద ఎంత మంది సిబ్బంది ఉండాలి? ఏ కేటగిరిలు కావాలి? తగు విధంగా నివేదికలను అందజేయాలని ప్రభుత్వాలు వివిధ కమిటీలు వేశాయి. రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐజే.నాయుడు చైర్మన్‌గా మరో నలుగురు సభ్యులతో కూడిన కమిటీ, అర్.కె.కొండల్రావు ఆధ్వర్యంలో ముగ్గురు ఇంజనీర్లతో కూడిన కమిటీ, ఆ తర్వాత ఎన్.సుబ్బరామిరెడ్డి కమిటీ... ఆయా కమిటీలు ప్రభుత్వాలకు నివేదికలను అందించడం జరిగింది. వివిధ సిఫార్సులను చీఫ్ ఇంజనీర్స్ బోర్డు కూడా ఆమోదించింది. కానీ ఆచరణలో ఎక్కడా ఆ సిఫార్సులు అమలు జరగలేదు. ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 170 ప్రాజెక్టుల వరకూ ఉండేవి. ప్రతి ప్రాజెక్టులో వర్క్ ఛార్జ్డ్ సిబ్బంది కీలకంగా ఉండేవారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 2/94 యాక్ట్‌కు సవరణలు తీసుకొచ్చి సిబ్బంది భర్తీతో పాటు, ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తారని భావించారు. ఆనాడు ఇరిగేషన్ శాఖా మంత్రిగా ఉన్న హరీశ్‌రావు దృష్టికి కూడా ఈ విషయాన్ని సంఘాలు తీసుకువెళ్ళాయి. మాకోసం కాదు, ప్రాజెక్టులను కాపాడుకోవటం కోసం సిబ్బంది అవసరమని చెప్పారు. అలాగే కేసీఆర్ అన్న మాటలను ఒకసారి గుర్తు చేసుకుందాం. ‘అధికారం చేపట్టగానే ముందుగా శ్రమదోపిడీకి మారుపేరైన ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగులను క్రమబద్ధీకరిస్త్తం. కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ మాటే వినబడదు. ప్రభుత్వ వ్యవస్థలలోని అన్ని శాఖలలో ఉద్యోగాల భర్తీ జరిపి తీరుతాం’. అధికారంలోకొచ్చి ఆరేండ్లు గడిచిపోయింది. 2/94 యాక్ట్ సవరణ జరగలేదు. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పర్మినెంట్ కాలేదు. ప్రభుత్వ ఖాళీల భర్తీ లేదు. ఇప్పటికైనా కేసీఆర్ తన వాగ్దానాలను నిలుపుకోవాలి. -జూలకంటి రంగారెడ్డి వ్యాసకర్త సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు -
ఉపాధి హామీ కూలీలకు న్యాయం చేయాలి
కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా కరోనా కట్టడి కోసం లాక్డౌన్ ప్రకటించి, అందరూ ఇళ్లకే పరిమితం కావాలని హెచ్చరిస్తూనే మరోవైపు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు ఏప్రిల్ నుంచి వేగవంతం చేసింది. కూలీలు 20–25 మంది బృందాలుగా ఏర్పడి ఒకేచోట పనులు చేస్తున్నారు. భౌతికదూరాన్ని పాటించేందుకు అవ కాశం లేదు. కుటుంబ పోషణకు గత్యంతరం లేకనే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొనైనా వీరు పనులకు వెళ్లక తప్పడం లేదు. దేశ వ్యాప్తంగా ఈ పథకం కింద 13.65 కోట్ల జాబ్‌కార్డులున్న కుటుంబాలున్నాయి. తెలంగాణలో 52.46 లక్షల కుటుంబాలున్నాయి. ఉపాధి హామీ కూలీలకు ఇచ్చే రోజువారీ వేతనాన్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీలో భాగంగా రూ. 211 నుంచి రూ. 237కు నామమాత్రంగా పెంచుతూ ఈ మేరకు మార్చి 26న ప్రధానమంత్రి ప్రకటన చేశారు. రోజుకు ఏడు గంటలు పని చేస్తేనే పెరిగిన కూలి వర్తిస్తోంది. ఈ పెంపు 2020 ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తున్నట్టు ఉత్తర్వులో పేర్కొన్నారు. కానీ వాస్తవంగా తమకు రోజూ రూ. 100–150 లోపే అందుతోందని కూలీలు వాపోతున్నారు. పైగా పని ప్రదేశాలకు సుమారు 5–6 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తోంది. కనీసం రూ. 500 వరకూ చెల్లించాలని వీరు కోరుతున్నారు. పైగా వీరికి పని ప్రదేశాల్లో ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదు. వేసవి కావడంతో ఎండలు అధికంగా ఉన్న నేపథ్యంలో టెంట్ సౌకర్యం కల్పించాలి. ఏదైనా ప్రమాదం జరిగితే తక్షణ వైద్యం కోసం మెడికల్ కిట్లు, మందులు అందుబాటులో ఉంచాలి. ఇవన్నీ కల్పించాలని ఉపాధి చట్టంలో పేర్కొన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. కనీసం తాగడానికి నీటి ఏర్పాటు లేకపోవడంతో ఇంటి వద్ద నుంచే కూలీలు తెచ్చుకుంటున్నారు. రైతుబంధు పథకం లాగానే కూలీబంధు పథకం ప్రవేశపెట్టాల్సిన అవసరముంది. వ్యవసాయ, ఇతర అన్ని రకాల పనులు ఎక్కువగా కష్టపడి పని చేస్తున్న శ్రామికవర్గం ఈ కూలీలే. ఎక్కువ పేదరికం అనుభ విస్తుంది కూడా వీరే. వీరికి బీమా సౌకర్యం కల్పించాలి. పని లేని సమయంలో నెలకు రూ.7500 భృతి అందించాలి. ప్రస్తుతం సంవత్సరంలో వంద రోజులు మాత్రమే పని కల్పిస్తున్నారు. కనీసం 150–200 రోజులకు పొడిగించాలి. ఇండ్లు లేని వారికి పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వాలి. వృద్ధ కూలీలకు పెన్షన్ కల్పించాలి. గ్రామీణ ప్రాంతాలకే పరిమితమైన ఈ పథకాన్ని పట్టణ ప్రాంతాలకూ వర్తింపజేయాలి. పట్టణాల్లోనూ అత్యధిక సంఖ్యలో కూలీలున్నారు. ఏడాదిలో కొన్ని మాసాలు ఎలాంటి పనుల్లేక ఇతర ప్రాంతాలకు వలసలు పోతున్నారు. వికలాంగ కూలీలకు కూడా ఉపాధి హామీలో తీరని అన్యాయమే జరుగుతోంది. వీరితో స్థానికంగా గ్రామ శివారుల్లోనే పనులు చేయించాలి. కానీ దూర ప్రాంతాల్లో రెండు, మూడు కిలోమీటర్ల దూరంలో నున్న లోతైన కాల్వ పనులు, వారు చేయలేని పనులు చేయిస్తున్నారు. పైగా వీరు చేసే పనికి అదనంగా 40 శాతం కూలి కలిపి ఇవ్వాల్సి వుండగా, చేసిన పనికి మాత్రమే ఇస్తున్నారు. వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మానవతా దృక్పథంతో న్యాయంగా రావాల్సింది అందించాలి. రాష్ట్రంలో 7,800 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. గత 14–15 ఏళ్లనుంచి నామ మాత్రపు వేత నాలతో పని చేస్తున్నారు. వీరంతా డిగ్రీ, పీజీ చదు వుకున్నా ఉద్యోగావకాశాలు లేక ఫీల్డ్ అసిస్టెంట్లుగా చేస్తున్నారు. వారి న్యాయమైన డిమాండ్లయిన నెలకు 10 వేల రూపాయల వేతనం ఇవ్వాలనీ, ఉద్యోగ భద్రత కల్పించాలనీ మార్చి 12 నుంచి 23 వరకూ సమ్మెలో ఉన్నారు. కానీ ప్రభుత్వం వారిని నిరంకుశంగా సస్పెండ్ చేయడంతో వీధిన పడ్డారు. గతంలో చేసిన పనులకు సైతం జీతాలు నిలుపుదల చేశారు. దీంతో ప్రస్తుతం గ్రామాల్లో ఉపాధి పనులు ఫీల్డ్ అసి సెంట్లు లేకుండానే జరుగుతున్నాయి. ఆ బాధ్యతను ఎలాంటి అనుభవం లేని గ్రామ కార్యదర్శులకు బల వంతంగా అప్పజెప్పారు. ఇన్నేళ్లుగా ఎంతో కష్టపడి పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల సస్పెన్షన్ ఎత్తివేసి, వారిని ప్రభుత్వం తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి కేంద్రం కేటాయించే బడ్జెట్‌తోపాటు, ప్రతి సంవ త్సరం అదనంగా రూ. వెయ్యి కోట్లు కేటాయిస్తోంది. కొలతతో సంబంధం లేకుండా గిట్టుబాటు కూలీ లను చెల్లిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా పట్టణ ప్రాంతాలలో కూడా పనులు కల్పిస్తోంది. ఈ తరహాలో తెలంగాణ ప్రభుత్వం కూడా తగు చర్యలు చేపట్టాలి. – వ్యాసకర్త: జూలకంటి రంగారెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు -
నిస్వార్థ సేవకుడు వర్ధెల్లి బుచ్చిరాములు
సూర్యాపేట: తాను పట్టిన ఎర్రజెండాను విడనాడకుండా చనిపోయేంత వరకు పార్టీ కోసం, ప్రజల కోసం పనిచేసిన స్వార్థం లేని నాయకుడు వర్ధెల్లి బుచ్చిరాములు అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పబ్లిక్ క్లబ్లో సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుచ్చిరాములు ప్రథమ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడుతూ, తన జీవితానంతా పేదల కోసం ధారపోసిన కమ్యూనిస్టు యోధుడు బుచ్చిరాములు అని, నమ్మిన సిద్ధాంతం కోసం ఏనాడూ రాజీపడని వ్యక్తి అని కొనియాడారు. సమసమాజ స్థాపనకు నాటి సాయుధ పోరాటం నుంచి నేటి తెలంగాణ ఉద్యమం వరకు పోరాడిన ఏకైక వ్యక్తిగా నిలిచారన్నారు. రాజకీయాల్లో విలువలు తగ్గుతున్నా, తాను నమ్మిన సిద్ధాంతాలకే కట్టుబడి సమాజసేవకు పాటుపడ్డారని కొనియాడారు. బహుజన రాజ్యాధికారం సాధించేందుకు పునాది వేసి పోరాటాలు నడిపారన్నారు. బీఎన్, ధర్మభిక్షం, నల్లా రాఘవరెడ్డిలు తొలితరం పోరాట నాయకులుగా కొనసాగితే .. రెండోతరాని కి బుచ్చిరాములు నాయకత్వం వహించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బుచ్చిరాములు కుమారుడు, సాక్షి ఎడిటర్ వర్ధెల్లి మురళి, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
‘మిర్యాలగూడ జిల్లా కావాలి’
హైదరాబాద్: మిర్యాలగూడను జిల్లాగా ఏర్పాటు చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మాజీ ఎమ్మెల్యే, సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి లేఖ ద్వారా కోరారు. ఒక జిల్లాకు కావాల్సిన భౌగోళిక స్వరూపం మిర్యాలగూడకు ఉందని, అంతేకాకుండా ఈ ప్రాంతంలో అతిపెద్ద యాదాద్రి పవర్ ప్రాజెక్టు దామరచర్లలో నిర్మాణం జరుగుతోందని తెలిపారు. వందల సంఖ్యలో రైస్‌మిల్లులతో పాటు, సిమెంటు పరిశ్రమలు, ఫార్మా ఇండస్ట్రీలు ఉన్నాయని వెల్లడించారు. కృష్ణా నది పరివాహక ప్రాంతంతో పాటు, అతిపెద్ద భారీ ప్రాజెక్టు నాగార్జునసాగర్ కూడా ఈ ప్రాంతంలోనే ఉందని పేర్కొన్నారు. జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన వివిధ ప్రభుత్వ శాఖల భవనాలు, ఖాళీ స్థలాలు మిర్యాలగూడ పట్టణంలో అందుబాటులో ఉన్నట్లు వివరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసే సమయంలో మిర్యాలగూడను కూడా జిల్లాగా ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు, దీక్షలు, బంద్‌లు జరిగాయన్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మిర్యాలగూడ, నాగార్జునసాగర్, హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన టీఆర్ఎస్ అభ్యర్థులు తమ పార్టీ అధికారంలోకి వస్తే మిర్యాలగూడను వెంటనే జిల్లాగా ప్రకటింపజేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారని, ఇప్పుడు కొత్తగా ప్రకటించిన జిల్లాల్లో మిర్యాలగూడ పేరు లేకపోవడంతో ప్రజలు మరోసారి ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. సీఎం సహృదయంతో పరిశీలించి మిర్యాలగూడను కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరుతున్నట్లు వెల్లడించారు. -
ఎర్రజెండా నీడన చల్లని రంగన్న
జూలకంటి రంగారెడ్డి అంటే మిర్యాలగూడ ప్రజలకు బొత్తిగా అలవాటు లేని పేరు. వారిని ఆప్యాయంగా చూసుకునే రంగన్నగానే పరిచయం. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఎర్ర జెండా నీడన పేదల కన్నీళ్లను తూడుస్తూ వెళుతున్న నేత జూలకంటి రంగారెడ్డి. తన తండ్రి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఉద్యమ స్పూర్తిని తీసుకుని ఎత్తిన ఎర్ర జెండాను నేటి వరకు మోస్తూనే ఉన్నాడు. కరుడుగట్టిన సీపీఎం నాయకుడు. తండ్రి చిన్నతనంలోనే చనిపోతే కుటుంబ భారాన్ని చూసుకుంటూనే, కష్టాలలో ఉన్న పేదల పక్షాన పోరాడారు. తన కుటుంబాన్ని పోషించడానికి వ్యవసాయం, చిన్న చిన్న వ్యాపారాలు చూసుకుంటూనే రాజకీయాల వైపు అడుగులు వేశారు. పేదల కోసం పోరాడే క్రమంలో ఎన్నోఅవమానాలు, మరెన్నో ఒత్తిడులు, బెదిరింపులు.. అంతకు మించి కేసులు, కోర్టుల చుట్టు ప్రదక్షణలు... వేటికి బయపడని రంగన్న తను నమ్మిన సిద్ధాంతం వైపే అడుగులు వేశారు. రాష్ట్రంలో కమ్యూనిస్ట్లందరూ ఎవరి దారి వారు చూసుకుని వెళ్తుంటే తను మాత్రం ' సంపద అందరికి చేరాలన్నా, పేద, ధనిక వర్గాలు లేని సమసమాజ నిర్మాణం జరగాలన్నా మార్క్సిస్ట్ సిద్ధాంతాలతోనే సాధ్యమవుతుందని, పార్టీలో ఉండే వ్యక్తులు బలహీనులు కావచ్చు కానీ పార్టీ సిద్ధాంతాలు ఎప్పటికీ బలహీనం కావని నమ్మి' పోరాట పంథానే కొనసాగిస్తున్నారు. 1978 లో మొదటిసారి కమ్యూనిస్ట్ పార్టీలో సభ్యత్వం తీసుకున్నారు. అక్కడి నుంచి యువజన సంఘ నాయకునిగా, సీఐటీయూ (కార్మిక సంఘం) సభ్యులుగా, నల్గొండ జిల్లా కార్యదర్శిగా పనిచేసి ప్రస్తుతం రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా కొనసాగుతున్నారు. తన 40 ఏళ్ల ప్రజా ఉద్యమంలో పేదల విద్య, వైద్యం కోసం ఎనలేని కృషి చేశారు. తాను ఎమ్యెల్యేగా పనిచేస్తూ మిర్యాలగూడ నియోజకవర్గానికి నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్యారా సాగునీరు అందించేందుకు ఆమరణ నిరాహర దీక్ష చేసి బీడు భూములకు కృష్ణమ్మ నీటిని మలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్‌రెడ్డి, కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో సీఎం సహయ నిధి చెక్కులను రాష్ట్రంలోనే అత్యదికంగా మిర్యాలగూడకు తీసుకెళ్లిన ఘనత ఆయన సొంతం. 2009 ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం సీపీఎం పార్టీ తుడుచిపెట్టుకుపోయిన తను మాత్రం మిర్యాలగూడలో గెలిచారు. కుటుంబ నేపథ్యం : తండ్రి : జూలకంటి కాశిరెడ్డి పుట్టిన తేదీ : అక్టోబర్ 24, 1958 ఊరు : కొత్తగూడ (గ్రామం), తిప్పర్తి మండలం, నల్గొండ జిల్లా భార్య : సుజాత (ఒక కుమారుడు ఒక కుమార్తె) కుటుంబం : ఇద్దరు సోదరులు, ముగ్గురు సోదరిలు వృత్తి : వ్యవసాయం చదువు : స్కూల్ విద్య రాజకీయ నేపథ్యం : - 1994 లో మొదటిసారి ఎమ్మెల్యేగా విజయం - 2004 లో రెండంసారి ఎమ్మెల్యేగా గెలిచారు - 2009 లో తిరునగరి గంగాధర్ (కాంగ్రెస్) పై గెలిచారు - ఆగస్ట్ 31, 2015 - సీపీఎం నల్గొండ జిల్లా కార్యదర్శిగా నియామకం - జూన్ 26, 2018 - ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు గృహ నిర్భంధం - ప్రస్తుతం సీపీఎం తరఫున మరోసారి మిర్యాలగూడ ప్రజలముందు నిలబడ్డారు. - విష్ణువర్ధన్ రెడ్డి.మల్లెల (ఎస్ఎస్ జే) -
ప్రభుత్వానికే ఇది చివరి విడత: జూలకంటి
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగితే ఇదే చివరి సమ్మె అవుతుందని ప్రభుత్వం హెచ్చరించడాన్ని సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. అలా అయితే ఈ ప్రభుత్వానికి కూడా ఇదే చివరి విడత అవుతుందని హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించి సంస్థను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాల్సిన అవసరం ఉందని, చివరి పీఆర్సీ కాలవ్యవధి ముగిసి 14 నెలలు గడిచినా కార్మికులు ఎంతో ఓపికతో ఉన్నారన్నారు. ఆర్టీసీ నష్టాల్లో ఉందని ముఖ్యమంత్రి చెబుతున్నారని, దీనికి ప్రభుత్వం అనుసరిస్తున్న అసమర్థ విధానాలే కారణమన్నారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడానికే కార్మిక వ్యతిరేక వైఖరిని ముఖ్యమంత్రి అనుసరిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వం ఇప్పటికైనా కార్మిక సంఘాలతో చర్చించి, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు. -
సీఎం కార్యాలయం పేరుతో లెటర్
మిర్యాలగూడ : ఫోన్ చేసి ఎటీఎం నంబర్ చెప్పమనడంతోపాటు పిన్‌నంబర్ చెప్పాలని అమాయకులను సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారు. కానీ ఏకంగా సీఎం కార్యాలయ అడ్రస్ పేరుతోనే సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్) కోసం కనీసం దరఖాస్తు కూడా చేసుకోకపోయినా సీఎంఆర్ఎఫ్ మంజూరైందని ముఖ్యమంత్రి కార్యాలయం పేరుతో లెటర్ వచ్చింది. అది చూసిన గిరిజనులు అవాక్కయ్యారు. అడవిదేవులపల్లి మండలం ముల్కచర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని బంగారుకుంట తండాకు చెందిన ఐదుగురు గిరిజనులు కరోం టోతు సేవా, అజ్మీరా శ్రీను, కుర్రా సేవ, మేరావత్ బోడ్కా, కుర్రా మంగ్తాల పేరున స్పీడ్‌పోస్టు ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ ఐదు లక్షల రూపాయల మంజూరైనట్లు లెటర్లు (ఎల్ఆర్.70/సీఎంఆర్ఎఫ్ – ఎల్ఓసి 2018, 12–05–2018) వచ్చాయి. అందుకు ఈ నెల 21వ తేదీ లోగా 47 వేల రూపాయలు ఎకౌంట్లో వేయాలని (సెక్రటేరియట్ ఆఫీసర్ కిరణ్ కుమార్ ఎకౌంట్ నెం. 6220181 2298 ఎస్బీఐ) కోరారు. 47 వేల రూపాయలు ఎకౌంట్లో వేసిన తర్వాత ఈ నెల 26వ తేదీ వరకు ఐదు లక్షల రూపాయల చెక్ స్పీడ్ పోస్టు ద్వారా ఇంటికి వస్తుందని లెటర్లో పేర్కొన్నారు. ప్రతులు కేటీఆర్‌కు పంపినట్లుగా: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు గిరిజనులతో పేరున పంపడంతోపాటు తెలంగాణ ఐటీ మంత్రి, కల్వ కుంట్ల తారక రామారావుకు కూడా పంపినట్లుగా లెటర్లో పేర్కొన్నారు. ఈ లెటర్‌ను కిరణ్‌కుమార్, సెక్రటేరియట్ బిల్డింగ్, 5వ అంతస్తు, సీ–బ్లాక్, హైదరాబాద్ పేరుతో ఉంది. దానిలో ఫోన్ నెం, 040–23450461 ఉండటం, లెటర్‌పైన ప్రభుత్వ అధికారిక రాజముద్ర ఉండడం గమనార్హం. తెలిసిన వారే ఉండవచ్చునని అనుమానం బంగారికుంట తండాకు చెందిన ఐదుగురు గిరిజనులకు సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కులు మంజూరైనట్లుగా వచ్చిన లెటర్లను పరిశీలిస్తే తెలిసిన వారే ఈ పనిచేశారని అర్థమవుతుంది. గిరిజనుల పేరుతోపాటు వారి తండ్రి పేరును పూర్తి అడ్రస్‌ను లెటర్లో పేర్కొన్నారు. పోలీసులు లెటర్లో ఉన్న ఎకౌంట్ నంబర్, పూర్తి వివరాలను సేకరిస్తే బయటపడే అవకాశాలు ఉన్నాయి. పోలీసులను, జూలకంటిని ఆశ్రయించిన గిరిజనులు ఐదు లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు మంజూరైనట్లు లెటర్ రావడంతో బంగారికుంట తండాకు చెందిన ఐదుగురు గిరిజనులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే విధంగా మా జీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డిని ఆశ్రయిం చారు. దీంతో నకిలీ లెటర్‌గా గుర్తించారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు మంజూరైతే డబ్బులు ఎకౌంట్లో ఎందుకు వేయమంటారని భావించిన వారు నకిలీ లెటర్ అని తెలుసుకున్నారు. ఇంటికి లెటర్లు వచ్చాయి మాకు సీఎం రిలీఫ్ ఫండ్ 5 లక్షల రూపాయలు మంజూ రైనట్లు ఇంటికి లెటర్లు వచ్చాయి. ముందుగా 47 వేల రూపాయలు కిరణ్‌కుమార్ ఎకౌంట్లో వేయాలని కోరారు. ఆ తర్వాత ఐదు లక్షల రూపాయలు పోస్టులో పంపుతామని లెటర్లో ఉంది. మొదట్లో ప్రభుత్వం పేరుతో లెటర్ రావడం వల్ల మేము కూడా నమ్మాము. కానీ ముందుగా ఎకౌంట్లో డబ్బులు వేయాలని ఉండటం వల్ల జూలకంటి రంగారెడ్డి వద్దకు వచ్చాం. – అజ్మీరా శ్రీను, మేరావత్ బోడ్కా, అడవిదేవులపల్లి విచారణ జరిపించాలి సీఎం కార్యాలయం పేరుతో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మంజూరయ్యాయని వచ్చిన లెటర్‌పై పూర్తి స్థాయి విచారణ జరిపించాలి. లెటర్లో ఉన్న కిరణ్‌కుమార్ ఎకౌంట్‌ను కూడా పరిశీలించాలి. సీఎం కార్యాలయం పేరుతో వచ్చిన లెటర్ కావడం వల్ల పోలీసులు పూరి ్తస్థాయి విచారణ జరిపి ఇలాంటి లెటర్లు పంపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. గి రిజనులు నమ్మకపోవడం వల్లే మోసపోలేదు. – జూలకంటి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే -
అన్నదాతల ఆత్మహత్యలపై చోద్యం
గజ్వేల్ రూరల్: దేశంలో నాలుగేళ్లలో 40 వేల మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయని సీపీఎం నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని మార్చి 24న ప్రారంభమైన బస్సుయాత్ర మంగళవారం రాత్రి సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో నిరుద్యోగ సమస్య, మహిళలు, ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు గోపాల్, ఆశయ్య, స్కైలాబ్ బాబు, సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ అసమర్థతే ప్రాజెక్టులకు గండం
సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ప్రభుత్వం తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్షాలపై నిందలు మోపుతోందని సీపీఎం నేత, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. పునరావాస ప్యాకేజీలు లేకుండా, నిర్వాసితులను ఆదుకోకుండా ప్రాజె క్టులను పూర్తి చేయాలనుకుంటే ఎవరూ హర్షించరన్నారు. ప్రాజెక్టులు పూర్తికాకుండా ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయ ని అధికార టీఆర్ఎస్ నేతలు, మంత్రులు చేస్తున్న ప్రకటనలు సరికాదని సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నల్లగొండ జిల్లాలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులకు నిధుల కొరతే ప్రధాన అడ్డంకి అని, ఆ ప్రాజెక్టుకు ఏ ప్రతిపక్షాలు అడ్డుపడ్డాయని ప్రశ్నించారు. సాగర్ వరదకాల్వ, ఎస్సారెస్పీ ఫేజ్ టూ పనులకూ అరకొర నిధులు కేటాయించడం వల్లే పనులు పూర్తికావడం లేదన్నారు. -
దామాషా ప్రకారం కృష్ణా జలాలు వదలాలి
సీపీఎం నేత జూలకంటి సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు కృష్ణానదిపై అక్రమంగా కొత్త ప్రాజెక్టులు నిర్మించడంతో పాటు, ఉన్న ప్రాజెక్టుల సామర్థ్యం పెంచుకుని వచ్చే నీటిని మొత్తం వారే వాడుకుంటున్నారని సోమవారం సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. ప్రస్తుతం కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు పూర్తిగా నిండిఉన్నాయని, అయినా, కిందకు నీటిని వదలడం లేదని అన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు చుక్కనీరు రాలేదని, ఇక ముందు వస్తుందన్న ఆశకూడా లేకుండా పోయిందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు నీళ్లు రావాలంటే ఎగువ నుంచి వచ్చే నీటిని ఎప్పటికప్పుడు మహారాష్ట్ర, కర్ణాటకలు కొంత వాడుకుని, కొంత నీటిని దామాషా పద్ధతిలో కిందకు విడుదల చేయాలని, అప్పుడే అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం, కృష్ణాబోర్డు నిర్ణయం తీసుకుని అమలు చేయాలని కోరారు. -
సొంత సర్వేలు విడ్డూరం: జూలకంటి
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ గత కొంతకాలంగా సర్వేలు నిర్వహిస్తూ టీఆర్ ఎస్‌కు, తనకు తానే ర్యాంకులు, మార్కులు ప్రకటించుకోవడం విడ్డూరంగా ఉందని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి వ్యాఖ్యా నించారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉం డగా వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా అంతా బావుందని తనకు తానే సర్టిఫికెట్లు ఇచ్చుకోవడం సరికాదన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకో వాలని, వాగాడంబరాన్ని పక్కన పెట్టాలని ఆయన సీఎంకు సూచించారు. కనీసం మిగి లిన రెండేళ్లు అయినా ప్రజలకిచ్చిన హామీ లను నెరవేర్చేందుకు చర్యలు తీసుకుని వారి మనసును గెలిచేందుకు ప్రయత్నిం చాలని సోమవారం ఒక ప్రకటనలో హితవు పలికారు. ప్రభుత్వం గురించి, సీఎం గురిం చి ప్రజలు ఏమనుకుంటున్నారో ముఖ్య మని, ముందుగా దానిని తెలుసుకునే ప్రయత్నం చేస్తే మంచిదని అన్నారు. -
మూడేళ్ల పాలనలో ఒరగబెట్టిందేమీలేదు
టీఆర్ఎస్, బీజేపీలపై జూలకంటి సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హామీల అమల్లో విఫలమయ్యాయని, మూడేళ్ల పాలనలో ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్, బీజేపీలు అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నాయన్నారు. శుక్రవారం ‘సాక్షి’తో ఆయన మాట్లాడుతూ బీజేపీ విషయంలో టీఆర్ఎస్ వైఖరేమిటో స్పష్టం చేయాలన్నారు. ఒకవైపు ప్రధాని మోదీని సమర్థిస్తూ, మరోవైపు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాను సీఎం కేసీఆర్ విమర్శించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని బలపరుస్తామని కేసీఆర్ చెప్పడాన్ని తప్పుబట్టారు. బీజేపీ, టీఆర్ఎస్ మతపరమైన సెంటిమెంట్లను రెచ్చగొట్టి ఓటుబ్యాంక్ రాజకీయాలు చేస్తున్నాయన్నారు. -
కేసీఆర్‌ది ద్వంద్వ వైఖరి
మిర్యాలగూడ : సీఎం కేసీఆర్ బీజేపీ పట్ల ద్వంద వైఖరి ప్రదర్శిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. గురువారం మిర్యాలగూడలో సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను విమర్శిస్తున్న కేసీఆర్.. ప్రధాని మోడీ మంచివాడని చెప్పడంలో అర్ధం లేదన్నారు. మోడీ, అమిత్‌షా వేర్వేరు కాదని, కేసీఆర్ ప్రకటనను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. తెలంగాణాకు రూ.లక్ష కోట్లు ఇచ్చామని చెప్పిన అమిత్‌షా ఆయన ఇంట్లో నుంచి ఇచ్చాడా? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో రూ.5 లక్షల కోట్లు వసూలు చేసి కేవలం రూ.లక్ష కోట్లు ఇచ్చామని చెబుతున్నారని తెలిపారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఏయే రంగాలకు కేటాయించారో సీఎం కేసీఆర్ తెలంగాణా ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. దళితుల పట్ల దాడులు చేస్తూనే.. వారితో బీజేపీ నాయకులు సహపంక్తి భోజనాలు చేస్తున్నారని చెప్పారు. అమిత్‌షా దళిత వాడల్లో సహపంక్తి భోజనాలు చేయడం చూస్తుంటే.. పెళ్లి భోజనాలు చేసినట్లుగా ఉందని అభిప్రాయపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజలను మోసం చేస్తున్నాయని చెప్పారు. ఎన్నికల మెనిఫెస్టోలో పేర్కొన్న హామీలను అమలు చేయడం లేదని పేర్కొన్నారు. మూడేళ్లుగా అధికారంలో ఉన్నా.. హామీల గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని చెప్పారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, నాయకులు మల్లు గౌతమ్‌రెడ్డి, మహ్మద్‌బిన్ సయ్యద్, రెమడాల పరుశురాములు తదితరులు పాల్గొన్నారు. -
మిర్చి రైతులను ఆదుకోవాలి : జూలకంటి
దామరచర్ల(మిర్యాలగూడ): ప్రభుత్వం మిర్చి రైతులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. దామరచర్ల మండలం కల్లేపల్లిలో మంగళవారం ఆయన మిర్చి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు అప్పుల పాలవుతున్నారన్నారు. మిర్చి ధరలు గత ఏడాదితో పోలిస్తే సగం తగ్గడంతో రైతులకు పెట్టుబడులు సైతం వచ్చే పరిస్థితులు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ౖ రెతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని.. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మద్దతు ధర అందించి వారిని ఆదుకోవాలన్నారు. మిర్చి రైతుల సమస్యలపై సీపీఎం ఆధ్వర్యంలో త్వరలో ముఖ్యమంత్రిని కలిసి విన్నవిస్తామన్నారు. జూలకంటి వెంట రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వీరేపల్లి వెంకటేశ్వర్లు, డి.మల్లేశ్, డి.చంద్రశేఖర్ యాదవ్, పాపానాయక్, బైరం దయానంద్, ఎర్రానాయక్, మల్లు గౌతమ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
లారీల సమ్మె ఉధృతం..!
రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో నిలిచిపోయిన లారీలు - సిమెంటు, ఇసుక, స్టీలు సరఫరా పూర్తిగా బంద్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా లారీల సమ్మె తీవ్రమవుతోంది. శనివారం అర్ధరాత్రి నుంచి వేల సంఖ్యలో లారీలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. సిమెంటు, స్టీలు, ఇసుక వంటివాటి రవాణా పూర్తిగా నిలిచిపోయింది. రాష్ట్రంలో కూరగాయల లారీలకు మినహాయింపునిచ్చినా.. పొరుగు రాష్ట్రాల్లో సమ్మె ఉధృతంగా కొనసాగుతుండడంతో అక్కడి నుంచి లారీలు రావడం లేదు. మహారాష్ట్రలో పది వేలకు పైగా లారీలు నిలిచిపోయాయి. దీంతో ఆ రాష్ట్రం నుంచి సరఫరా అయ్యే క్యాబేజీ, ఉల్లి, ఆలుగడ్డల రవాణా నిలిచిపోయింది. ఇటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల నుంచి సరఫరా కావాల్సిన టమాటా, మిర్చి కూడా తగ్గిపోయింది. దీంతో సమీప ప్రాంతాల నుంచి చిన్నలారీలు, ఆటో ట్రాలీల్లో హైదరాబాద్‌కు సరుకు తరలుతోంది. మరోవైపు ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడంతో ఆదివారం ఉదయం నుంచి సమ్మెను మరింత తీవ్రం చేయాలని లారీ యజమానుల సంఘం నిర్ణయించింది. ఆదివారం రాత్రి వరకు కూడా ప్రభుత్వం స్పందించకుంటే.. సోమవారం నుంచి అత్యవసర సరుకులు తరలించే లారీలను కూడా నిలిపివేయాలని నిర్ణయించినట్టు తెలంగాణ లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు భాస్కరరెడ్డి, ప్రధాన కార్యదర్శి జి.దుర్గాప్రసాద్, తెలంగాణ స్టేట్ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బూడిద నందారెడ్డి ప్రకటించారు. రహదారులపై ఆందోళనలు.. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల లారీల డ్రైవర్లు, యజమానులు ఆందోళనలకు దిగుతున్నారు. శనివారం హైదరాబాద్‌లోని హయత్‌నగర్, ఎల్బీనగర్, రాజేంద్రనగర్ సహా రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల రాస్తారోకోలు చేశారు. హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో విజయవాడ జాతీయ రహదారిపై ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో లారీ యజమానుల సంఘం భారీ ర్యాలీ నిర్వహించింది. ‘సింగిల్ పర్మిట్’పై స్పందించట్లేదు.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సింగిల్ పర్మిట్ విధానానికి తెలంగాణ ప్రభుత్వం సుముఖంగా ఉన్నా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే, రాష్ట్ర లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు వి.శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. బస్సుల్లో సరుకు తరలించండి: సీఎస్ లారీల సమ్మె తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది. అవసరమైతే ఆర్టీసీ బస్సుల్లో అత్యవసర సరుకులను తరలించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం సమ్మె పరిస్థితిపై సచివాలయంలో సమీక్షించారు. పాలు, కూరగాయలు, నీళ్లు, పెట్రోల్, డీజిల్, గ్యాస్, మందులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. లారీ యజమానుల సంఘంతో చర్చలు జరపాలని ఆదేశించారు. కాగా.. లారీల బీమాకు సంబంధించి థర్డ్‌పార్టీ చెల్లింపుల అంశంపై ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ శనివారం సమావేశమైంది. దీనికి సంబంధించి ఆదివారం నిర్ణయాలు వెలువడే అవకాశముంది. ఇదిలా ఉండగా.. లారీల సమ్మె విరమింపచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు.