సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ప్రభుత్వం తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్షాలపై నిందలు మోపుతోందని సీపీఎం నేత, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. పునరావాస ప్యాకేజీలు లేకుండా, నిర్వాసితులను ఆదుకోకుండా ప్రాజె క్టులను పూర్తి చేయాలనుకుంటే ఎవరూ హర్షించరన్నారు.
ప్రాజెక్టులు పూర్తికాకుండా ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయ ని అధికార టీఆర్‌ఎస్ నేతలు, మంత్రులు చేస్తున్న ప్రకటనలు సరికాదని సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నల్లగొండ జిల్లాలోని ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులకు నిధుల కొరతే ప్రధాన అడ్డంకి అని, ఆ ప్రాజెక్టుకు ఏ ప్రతిపక్షాలు అడ్డుపడ్డాయని ప్రశ్నించారు. సాగర్ వరదకాల్వ, ఎస్సారెస్పీ ఫేజ్ టూ పనులకూ అరకొర నిధులు కేటాయించడం వల్లే పనులు పూర్తికావడం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment