సాక్షి, హైదరాబాద్: ధాన్యం కొనుగోలు చేయకుండా రైతుల నెత్తిన టోపీ పెట్టాలని చూస్తున్న బీజేపీ, ధాన్యం కొనుగోలు గురించి కేంద్రంపై ఒత్తిడి చేయకుండా తప్పించుకోవాలని చూస్తున్న టీఆర్‌ఎస్‌లవి దొంగ పోరాటాలు, కొంగ జపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి ఎద్దేవా చేశారు. దేశ రైతాంగాన్ని చేపల్లా మింగేందుకు కొంగజపం చేస్తున్న బీజేపీపై తామేదో సాధించబోతున్నట్లు టీఆర్‌ఎస్ దొంగపోరాటాలు చేస్తోందని సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు.
2 పార్టీల నేతలు వీధిరౌడీలకు మించి వ్యవహరిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ఆరోపించారు. వెంటనే ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొను గోలు చేయకపోతే ఈ దొంగ పోరాటాలు, కొంగ జపాలకు రాష్ట్ర రైతాంగం తగిన బుద్ధి చెబుతుందని జూలకంటి హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment