సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ గత కొంతకాలంగా సర్వేలు నిర్వహిస్తూ టీఆర్ ఎస్‌కు, తనకు తానే ర్యాంకులు, మార్కులు ప్రకటించుకోవడం విడ్డూరంగా ఉందని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి వ్యాఖ్యా నించారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉం డగా వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా అంతా బావుందని తనకు తానే సర్టిఫికెట్లు ఇచ్చుకోవడం సరికాదన్నారు.
ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకో వాలని, వాగాడంబరాన్ని పక్కన పెట్టాలని ఆయన సీఎంకు సూచించారు. కనీసం మిగి లిన రెండేళ్లు అయినా ప్రజలకిచ్చిన హామీ లను నెరవేర్చేందుకు చర్యలు తీసుకుని వారి మనసును గెలిచేందుకు ప్రయత్నిం చాలని సోమవారం ఒక ప్రకటనలో హితవు పలికారు. ప్రభుత్వం గురించి, సీఎం గురిం చి ప్రజలు ఏమనుకుంటున్నారో ముఖ్య మని, ముందుగా దానిని తెలుసుకునే ప్రయత్నం చేస్తే మంచిదని అన్నారు.