
కీసర-యాదాద్రి బైపాస్ వద్దు: జూలకంటి
సాక్షి, హైదరాబాద్: కీసర నుంచి యాదాద్రికి నాలుగు లేన్ల బైపాస్ రోడ్డు వేయాలన్న ఆలోచనను సీఎం కేసీఆర్ విరమించుకోవాలని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. ప్రస్తుత రోడ్డునే విస్తరించాలని, కొత్తగా బైపాస్ వేయడం వల్ల ఆర్థిక భారంతోపాటు 4, 5 గ్రామాల రైతులు నష్టపోతారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
బైపాస్ నిర్మాణం పేరిట దాదాపు వెయ్యి ఎకరాల మేర రైతులు నష్టపోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. ఈ భూమి కూడా విలువైనదని, పరిహారం కింద రైతులకు రూ.4, 5 లక్షలు చెల్లించి ప్రభుత్వం చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. 15 రోజులుగా రైతులు నిరసనలు తెలుపుతున్నారని చెప్పారు.