సినీ రచయితలతో ప్రచారాలా? | Sunnam Rajaiah commented on kcr | Sakshi
Sakshi News home page

సినీ రచయితలతో ప్రచారాలా?

Published Mon, May 15 2017 2:31 AM | Last Updated on Wed, Aug 15 2018 8:04 PM

సినీ రచయితలతో ప్రచారాలా? - Sakshi

సినీ రచయితలతో ప్రచారాలా?

సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య
సాక్షి, హైదరాబాద్‌: పంటలను కొనుగోలు చేయకుండా, రైతులకు బేడీలు వేయించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇప్పుడు సినీ రచయితలతో ఏమని ప్రచారం చేయించుకుంటారని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆదివారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. మిర్చి, కందులకు మద్దతు ధర ఇవ్వకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు తిలోదకాలు ఇచ్చారని విమర్శించారు. నకిలీ విత్తనాల వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వలేదని ఆరోపించారు.

ఎకరానికి రూ.4 వేలు ఇస్తామని టీఆర్‌ఎస్‌ ప్లీనరీ, బహిరంగ సభల్లో ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప కౌలు రైతుల ప్రస్తావన లేదన్నారు. విత్తన చట్టం చేయకుండా కార్పొరేట్‌ విత్తన కంపెనీలతో లాలూచీ పడుతున్నారని ఆరోపించారు. వ్యవసాయ ఉపకరణాలన్నింటినీ ప్రభుత్వమే ఇవ్వాలని, వాటిని కౌలు రైతులకూ వర్తింపజేయాలని పేర్కొన్నారు. పంటలకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement