కేసీఆర్‌ తీరు అప్రజాస్వామికం: సీపీఎం | cpm leaders slams cm kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ తీరు అప్రజాస్వామికం: సీపీఎం

Published Tue, Mar 14 2017 2:47 PM | Last Updated on Tue, Aug 14 2018 11:02 AM

cpm leaders slams cm kcr

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీరు అప్రకటిత ఎమర్జెన్సీని తలపిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శనరావు, పొన్నం వెంకటేశ్వరరావులు ఆరోపించారు. తమ పార్టీ ఈ నెల 19న తలపెట్టిన సామాజిక సమర సమ్మేళనం సభను నిజాం కళాశాలలో జరుపుకునేందుకు తొలుత అనుమతి ఇచ్చి తర్వాత రద్దు చేశారని,  దీంతో తాము సరూర్‌నగర్ ఔట్‌డోడోర్ స్టేడియంలో సభను ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చిందన్నారు. కేసీఆర్‌ తీరు అప్రజాస్వామికంగా ఉందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో తమ ప్రభుత్వానికి శాంతియుతంగా నిరసనలు తెలియజేయవచ్చు అని చెప్పిన సీఎం నేడు నిరసనలను, ఆందోళనలను అడ్డుకుంటున్నారని వారు విమర్శించారు.
 
1525 గ్రామాల్లో మహాజన పాదయాత్ర జరపగా ప్రజలు తమ సమస్యలపై 98వేల దరఖాస్తులు అందచేశారన్నారు. తమ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కేరళ సీఎం పినరయ్ విజయ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి, వామపక్ష పార్టీల నేతలు, సామాజిక ఉద్యమకారులు పాల్గొంటారన్నారు. కాగా, ఆరోజు ఇందిరా పార్కు నుండి సభా స్థలం వరకు ప్రదర్శన, వనస్థలిపురం స్పెన్సర్ నగర్ నుంచి మరో ప్రదర్శన ఉంటుందని పోతినేని, పొన్నం తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement