వామపక్ష పార్టీల ప్రకటన.. కేజ్రీవాల్ అరెస్ట్‌కు ఖండన
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలపై బీజేపీ ప్రభుత్వం తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగిస్తూ, ప్రజా స్వామ్య హక్కులను కాల రాస్తోందని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యద ర్శివర్గ సభ్యులు ఎన్.బాలమల్లేశ్, ఎస్.వీరయ్య మండిప డ్డారు. వామపక్ష పార్టీల సమావేశం శుక్రవారం ఎంబీ భవన్‌లో జరిగింది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వ నిరంకుశ ధోరణులను సమావేశం తీవ్రంగా ఖండించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది. అందులో భాగంగా శనివారం ఉద యం 11 గంటలకు హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో నిరసన కార్యక్రమం ఉంటుందని తెలిపా రు.
స్వచ్ఛందంగా పనిచేసే ఈడీ, ఐటీ, సీబీఐలను తమ జేబు సంస్థలుగా కేంద్రం వాడుకుంటోందని మండిపడ్డారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో చట్ట ఉల్లంఘనలు జరుగుతున్నా పట్టించుకోకుండా, బీజేపీయేతర రాష్ట్రాల్లో మాత్రం కక్షపూరితంగా వ్యవహరిస్తూ ప్రతిపక్ష పార్టీల నా యకులను భయభ్రాంతులకు గురిచేస్తోందని విరుచుకుపడ్డారు. అందులో భాగంగానే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తోపా టు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితలను అరెస్టు చేసిందన్నారు.
మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేసి ఎన్నికల్లో దెబ్బతీయాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర నాయకులు డీజీ నరసింహారావు, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ నాయకులు రమ, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకులు గోవర్ధన్, ఎంసీపీఐ(యు) నాయకులు వనం సుధాకర్, ఎస్ యూసీఐ(యు) నాయకులు తేజ, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకులు కోటేశ్వరరావు, సీపీఐ (ఎంఎల్) నాయకులు ప్రసాద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment