protests
-
మణిపూర్‌లో మళ్లీ హింస, ఒకరు మృతి.. రంగంలోకి అమిత్ షా
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మరోసారి రగులుతోంది. భద్రతా బలగాల పహారాలో కొంతకాలం దాడులు ఆగినా.. తాజాగా మళ్లీ హింస చెలరేగింది. కుకీలు, మైతీ తెగల మధ్య వైరంతో ఆందోళనలు కొనసాగుతున్నాయి. మణిపూర్‌లోని లోయ ప్రాంతాల్లో ఆదివారం జరిగిన నిరసనలు,. హింసాత్మక ఘటనల్లో ఒకరు మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు. ఆందోళన కారులను చెదరగొట్టే క్రమంలో జిరిబామ్ జిల్లాలో భద్రతాదళాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో 20యేళ్ల అతౌబా మృతిచెందాడు. బాబుపరా వద్ద రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. బాబుపరా ప్రాంతంలో పలు పార్టీలకు చెందిన కార్యాలయాలపై ఆందోళనకారులు దాడులు చేశారు. జిరిబామ్ పోలీస్ స్టేషన్‌కు 500 మీటర్ల దూరంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ కార్యాలయాల్లోకి చొరబడిన ఆందోళనకారులు.. ఫర్నీచర్‌ను ఎత్తుకెళ్లి, ఆఫీసులను తగలబెట్టారు. దీంతో శాంతి భద్రతలకోసం భద్రతా దళాలు మోహరించడంతో జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గాయపడిన వ్యక్తిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి చికిత్స కొనసాగుతోంది.చదవండి: బీజేపీలో చేరనున్న ఢిల్లీ మాజీ మంత్రి కైలాష్ గహ్లోత్మరోవైపు మణిపూర్‌లో పరిస్థితిపై చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు(సోమవారం) అధికారులతో సమావేశం కానున్నారు. హోం మంత్రిత్వ శాఖలోని ఈశాన్య విభాగానికి చెందిన సీనియర్ అధికారులు, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్), అస్సాం రైఫిల్స్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.ఇదిలా ఉండగా కుకీ మిలిటెంట్లు ఇటీవల జిరిబామ్ జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్‌పై దాడి చేసిన విషయం తెలిసిందే. పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో 11 మంది కుకీలు మృత్యువాతపడ్డారు. అనంతరం ఆరుగురు మైతీ వర్గానికి చెందిన వారిని మిలిటంట్లు బందీలుగా చేసి తీసుకెళ్లారు. వారి మృతదేహాలు లభ్యం కావడంతో జిరిబామ్ జిల్లాలో హింస చెలరేగింది. దీంతో దాదాపు 7 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేసి కర్ఫ్యూ విధించారు అధికారులు. -
దీపావళి సంబరాల్లో ‘మాంసం, మద్యం’... స్టార్మర్ కార్యాలయం క్షమాపణలు
లండన్: దీపావళి సంబరాల్లో మాంసం, మద్యం చోటు చేసుకున్న ఉదంతంపై బ్రిటన్ ప్రధాని కార్యాలయం శుక్రవారం క్షమాపణలు తెలిపింది. దాన్ని అనుకోకుండా దొర్లిన తప్పిదంగా అభివర్ణించింది. ‘‘దీనిపై బ్రిటిష్ హిందూ సమాజం ఆందోళనలను అర్థం చేసుకోగలం. ఇకపై జరిగే సంబరాల్లో ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త పడతాం’’ అని హామీ ఇచ్చింది. ప్రధాని అధికారిక నివాసం 10, డౌనింగ్ స్ట్రీట్‌లో అక్టోబర్ 29న దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాటిలో ప్రధాని ప్రధాని కియర్ స్టార్మర్ పాల్గొనడమే గాక దీపాలు వెలిగించారు. అయితే ఆ వేడుకల్లో మాంసం, మద్యం చోటుచేసుకోవడంపై హిందూ సమాజం నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. డౌనింగ్ స్ట్రీట్ దీపావళి సంబరాలు హిందూ సమాజం విశ్వాసాలకు అనుగుణంగా జరగలేదంటూ కన్జర్వేటివ్ పార్టీకి చెందిన బ్రిటిష్ ఇండియన్ ఎంపీ శివానీ రాజా గురువారం స్టార్మర్‌కు లేఖ కూడా రాశారు. ఇకముందు వాటినెలా జరపాలో వివరించేందుకు సంసిద్ధత వెలిబుచ్చారు. -
‘వరద’ వైఫల్యాలపై స్పెయిన్‌లో భారీ నిరసనలు
వరదల విషయంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ స్పెయిన్‌లో లక్షలాది మంది రోడ్డెక్కారు. ముందస్తు హెచ్చరికలు జారీ చేయకుండా అధికారులు నిర్లక్ష్యం వహించారంటూ వాలెన్సియాలో శని, ఆదివారాల్లో ఆందోళనకు దిగారు. వాలెన్సియా రీజనల్ హెడ్ కార్లోస్ మజోన్ రాజీనామాకు డిమాండ్ చేశారు. దాదాపు 1,30,000 మంది ప్రజలు వీధుల్లోకి వచ్చారు. వాలెన్సియా సిటీ హాల్‌ను బురదతో నింపేశారు. కురీ్చలు, వస్తువులకు నిప్పు పెట్టారు. పలుచోట్ల పోలీసులతో ఘర్షణకు దిగారు. వాలెన్సియా, పరిసర ప్రావిన్సుల్లో ఇటీవల కుండపోత వర్షాలకు వరద ముంచెత్తి 200 మందికి పైగా మరణించడం తెలిసిందే. 80 మందికి పైగా గల్లంతయ్యారు. వేలాది మంది నిర్వాసితులయ్యారు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ వీధులు బురద, శిథిలాల్లో కూరుకుపోయి ఉన్నాయి. స్పెయిన్ వాతావరణ సంస్థ అక్టోబర్ 25 నుంచే ఈ ప్రాంతానికి తుపాను హెచ్చరికలు జారీ చేసినా వరదలు మొదలయ్యే దాకా వాలెన్సియా అధికారులు ప్రజలను అప్రమత్తం చేయలేదు. వారి అలసత్వం వల్లే భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని జనం మండిపడుతున్నారు. గత వారం పైపోర్టా పట్టణాన్ని సందర్శించిన స్పెయిన్ రాజు, రాణిపైనా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే. అనంతరం ప్రధాని పెడ్రో సాంచెజ్‌పై గుడ్లు తదితరాలు విసిరి నిరసన తెలిపారు. – వాలెన్సియా -
కశ్మీర్ అసెంబ్లీలో ఆఖరి రోజూ ఆగని ఆందోళనలు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఆఖరి రోజైన శుక్రవారం కూడా ఆందోళనల మధ్యే కొనసాగింది. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరుగుతున్న చర్చకు బీజేపీ సభ్యులు అడ్డుపడ్డారు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని పునరుద్ధరించాలంటూ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలంటూ నినాదాలతో హోరెత్తించారు. గొడవకు దిగిన ఎమ్మెల్యేలను స్పీకర్ ఆదేశాలతో మార్షల్స్ బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సమాధానమిస్తూ శుక్రవారం సీఎం ఒమర్ అబ్దుల్లా.. జమ్మూకశ్మీర్‌కు పూర్తి రాష్ట్ర హోదా పునరుద్ధరణ ప్రక్రియను కేంద్రం త్వరలోనే ప్రారంభిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర పాలిత ప్రాంత హోదాతో పరిమిత అధికారాలతో అభివృద్ధిని, శాంతిభద్రతలను సాధించలేమని చెప్పారు. సమావేశాల సందర్భంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బీజేపీ శాసనసభా పక్షం నేత సునీల్ శర్మతోపాటు ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలపై ఎన్సీ ఎమ్మెల్యే సజ్జాద్ షహీన్, మరొకరు హక్కుల తీర్మానం ప్రవేశపెట్టారు. వీటిని పరిశీలించి చర్యలు తీసుకుంటానని స్పీకర్ రథేర్ చెప్పారు. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. -
ఇజ్రాయెల్‌లో నిరసనలు
జెరుసలేం: ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలెంట్‌ను తొలగించడంతో అక్కడ నిరసనలు వెల్లువెత్తా యి. వీధుల్లోకొచ్చిన నిరసనకారులు ప్రధాని నెతన్యాహు రాజీనామా చేయాలని, కొత్త రక్షణ మంత్రి బందీ ఒప్పందానికి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. నెతన్యాహు దేశం మొత్తాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారని మండిపడ్డారు. కొందరు ఆందోళనకారులు అయలోన్ హైవేపై నిప్పు పెట్టడంతో ఇరువైపులా రాకపోకలకు అంతరాయం కలిగింది. అక్టోబర్ 7న హమాస్ బందీలుగా తీసుకున్న వ్యక్తుల కుటుంబాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక బృందం కూడా గెలాంట్ను తొలగించడాన్ని ఖండించింది. తొలగింపును.. విడుదల ఒప్పందాన్ని పక్కకుపెట్టే ప్రయత్నాలకు కొనసాగింపుగా పేర్కొంది. రాబోయే రక్షణ మంత్రి యుద్ధం ముగింపుపై స్పష్టమైన ప్రకటన చేయాలని, అపహరణకు గురైన వారందరినీ తక్షణమే తిరిగి తీసుకురావడానికి సమగ్ర ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్ చేసింది. రాజకీయ విభేదాలు... ప్రధాని నెతన్యాహు, మాజీ రక్షణ మంత్రి గాలెంట్ మధ్య చాలాకాలంగా విభేదాలు ఉన్నాయి. న్యాయ వ్యవస్థను సమూలంగా మార్చే వివాదాస్పద ప్రణాళికలపై విభేదాలు రావడంతో నెతన్యాహు 2023 మార్చిలో తొలిసారిగా గాలెంట్‌ను తొలగించారు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసన రావడంతో తిరి గి నియమించారు. ఈ సంఘటన ‘గాలెంట్ నైట్’ గా ప్రసిద్ధి చెందింది. అయితే గాజాకు యుద్ధానంత ర ప్రణాళిక సమస్యను పరిష్కరించడంలో ప్రభు త్వం విఫలమైందని ఈ ఏడాది మేలో గాలెంట్ బ హిరంగ అసహనం వ్యక్తం చేశారు. గాజాలో పౌర, సైనిక పాలనను చేపట్టే యోచన ఇజ్రాయెల్‌కు లేదని నెతన్యాహు బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, ఇజ్రాయెల్ అల్ట్రా ఆర్థోడాక్స్ పౌరులను సైన్యంలో పనిచేయడం నుంచి మినహాయించే ప్రణాళికలపై గాలెంట్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి నెతన్యాహు స్పందిస్తూ ప్రత్యర్థి పాలస్తీనా గ్రూపులు హమాస్, ఫతాహ్లను ప్రస్తావిస్తూ.. హమస్తాన్ను ఫతాస్తాన్గా మార్చడానికి తాను సిద్ధంగా లేనని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు నేతల మధ్య విశ్వాస సంక్షోభం తొలగింపు దాకా దారితీసిందని నెతన్యాహు చెప్పారు. ఇటీవలి నెలల్లో ఆయనపై తన విశ్వాసం క్షీణించిందని, అతని స్థానంలో విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ బాధ్యతలు తీసుకుంటారని వెల్లడించారు. ఇజ్రాయెల్ భద్రత నా జీవిత లక్ష్యం– గాలెంట్ కాగా, తొలగింపు అనంతరం గాలెంట్ స్పందించా రు. ఇజ్రాయెల్ భద్రత ఎప్పటికీ తన జీవిత లక్ష్యమ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మూడు అంశాలపై విభేదాల కారణంగానే తనను పదవి నుంచి తొలగించినట్లు మంగళవారం రాత్రి పూర్తి ప్రకటన విడుదల చేశారు. సైనిక సేవకు మినహాయింపులు ఉండకూడదని, పాఠాలు నేర్చుకోవాలంటే జాతీయ విచారణ అవసరమని, బందీలను వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకురావాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా.. గాజాపై యుద్ధంలో ఇజ్రా యెల్‌కు ప్రధాన మద్దతుదారు అమెరికాలో అధ్యక్ష ఎన్నికల రోజునే గాలెంట్‌ను తొలగిచండం చర్చనీయాంశమైంది. నెతన్యాహు కంటే గాలెంట్కు వైట్ హౌస్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ రక్షణకు సంబంధించిన అన్ని విషయాల్లోనూ మంత్రి గాలెంట్ కీలక భాగస్వామిగా ఉన్నారని వైట్‌హౌ స్ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి ఒకరు తెలిపా రు. సన్నిహిత భాగస్వాములుగా ఇజ్రాయెల్ తదుప రి రక్షణ మంత్రితో కలిసి పనిచేస్తామని చెప్పారు. -
రైతుభరోసా ఎగ్గొట్టిన కాంగ్రెస్ సర్కార్ తీరుపై నిరసన
-
నిరసన దీక్షను విరమించండి: సీఎం మమతా
కోల్‌కతా: ఆర్జీ కర్ ఆస్పత్రిలో హత్యాచారానికి గురైన ట్రెయినీ వైద్యురాలికి న్యాయం చేయాలంటూ ఆమరణ దీక్ష చేపట్టిన వైద్యులతో సీఎం మమతా బెనర్జీ శనివారం ఫోన్లో మాట్లాడారు. డిమాండ్లలో చాలా వరకు పరిష్కరించినందున దీక్ష విరమించాలని వారిని కోరారు. అదే సమయంలో, డాక్టర్లు డిమాండ్ చేస్తున్న విధంగా ఆరోగ్య శాఖ కార్యదర్శిని మాత్రం తొలగించబోమని స్పష్టం చేశారు. ఇప్పటికే పలువురిని తొలగించామంటూ ఆమె..ఫలానా అధికారిని తొలగించాలని మీరెలా అడుగుతారు? మమ్మల్ని మీరెలా ఆదేశిస్తారు? అని ప్రశ్నించారు. నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. అయితే, దీనివల్ల ప్రజా సేవలకు అంతరాయం కలగరాదని, వెంటనే దీక్ష విరమించాలని కోరారు. డిమాండ్లపై చర్చించేందుకు సోమవా రం తనను సెక్రటేరియట్‌కు వచ్చి కలుసుకోవాలని కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్ శనివారం కోల్‌కతాలోని ఎస్ప్లనేడ్లో దీక్షా శిబిరం వద్దకు వచ్చి చర్చలు జరిపారు. జూనియర్ వైద్యులు రెండు వారాలుగా నిరశన సాగిస్తున్నారు. ఆరోగ్యం విషమించడంతో దీక్షలో పాల్గొన్న ఆరుగురు వైద్యులు ఆస్పత్రుల్లో చేరారు. వైద్యుల డిమాండ్లను పరిష్కరించకుంటే ఈ నెల 22న రాష్ట్ర వ్యాప్త సమ్మె చేపడతామని రాష్ట్ర వైద్యుల సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి. మంగళవారం దేశవ్యాప్త నిరసన చేపట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
గ్రూప్-1 ఆందోళనలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: గ్రూప్ వన్ అభ్యర్థుల ఆందోళనలపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. శనివారం(అక్టోబర్19) సాయంత్రం హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని పోలీస్ అకాడమీలో జరిగిన కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు. గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చినపుడే జీవో నెంబర్ 29 ఇచ్చామని చెప్పారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి గ్రూప్ 1 నియామకాలు జరగలేదన్నారు. కొంత మంది ఉద్యోగాలు పోవడంతో రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం పదేళ్లు గ్రూప్ వన్ ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. ప్రతిపక్షాల ఉచ్చులో విద్యార్థులు పడొద్దని హితవు పలికారు. కాగా గ్రూప్ వన్ రద్దు చేయాలని శనివారం ఉదయం గ్రూప్ వన్ అభ్యర్థులు హైదరాబాద్ అశోక్‌నగర్‌తో పాటు సచివాలయం వద్ద ఆందోళనలు చేశారు. వీరి ఆందోళనలకు బీఆర్ఎస్, బీజేపీ నేతలు మద్దతు పలికారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ఇదీ చదవండి: గ్రూప్-1 రగడ..సచివాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత -
మండపాలు వేదికగా నిరసనలు
నవరాత్రి ఉత్సవాలు అంటే.. బెంగాల్. బెంగాల్ అంటే నవరాత్రి ఉత్సవాలు. అలాంటిది ఈ సారి పండుగ దృశ్యం పూర్తిగా మారిపోయింది. కోల్‌కతాలోని ఆర్.జి.కర్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య తరువాత.. దుర్గామాత మండపాలు సైతం నిరసనలను ప్రతిబింబిస్తున్నాయి. సాధారణంగా బెంగాల్‌లోని దుర్గా పూజ మండపాల్లో దేవత నిలబడి ఉంటుంది. ఇరువైపులా వినాయకుడు, కార్తికేయుడు, దేవతలు లక్ష్మీ, సరస్వతులు ఉంటాయి. ఆమె పాదాల దగ్గర రాక్షసుడు ఉంటాడు. ఇంకొందరైతే మరికొంత విశాలంగా ఆలోచించి.. బుర్జ్ ఖలీఫా ప్రతీకనో, సుందర్బన్ అడవులనో ప్రతిబింబిస్తారు. ఇంకొందరు నీటి సంరక్షణ, ప్రపంచశాంతి వంటి సామాజిక సందేశాలను ప్రదర్శిస్తారు. కానీ ఈసారి ఇవేవీ జనాన్ని ఆకర్షించడం లేదు. చాలా మండపాలు నిరసన ప్రదర్శనలుగా మారాయి. వాటిని చూడటానికి కూడా జనం ఆసక్తి చూపుతున్నారు. కోల్‌కతాలోని కంకుర్గచ్చిలో పూజ ఇతివృత్తంగా లజ్జ(õÙమ్)ను ఎంచుకున్నారు. దుర్గాదేవి కళ్లు మూసుకుని ఉండగా.. తెల్లని షీటుతో చుట్టిన ఒక మహిళ శరీరంపై ఓ సింహం నిఘా పెట్టింది. పక్కనే బాధిత కుటుంబాన్ని ప్రదర్శించారు. మంచంపై కూర్చున్న తల్లి, కుట్టు మిషన్ దగ్గర కూర్చున్న తండ్రి, గోడపై కుమార్తె ఫొటో ఉన్నాయి. మహిళల ఆధ్వర్యంలో నడిచే ఓ మండపం థీమ్ వివక్ష. ఈ సంవత్సరం వారు దుర్గా పూజను పండుగ అని కాకుండా ప్రతిజ్ఞ అని పిలుస్తున్నారు. భారత రాజ్యాంగాన్ని, అందులోని అధికరణలను నేపథ్యంగా తీసుకున్నారు. ఒక మహిళ న్యాయం చేయాలనే రెండు చేతులు పైకెత్తి శూన్యంలోకి సహాయం కోసం అరి్ధస్తోంది. ‘రాజ్యాంగం చెప్తున్నదేమిటి? వాస్తవానికి జరుగుతున్నదేమిటి?’అంటూ స్థానిక నటులు వీధి నాటకం ప్రదర్శిస్తున్నారు. మరోచోట దేవత శక్తిని.. నిరసనల్లోని కొవ్వొత్తిని ప్రతిబింబిస్తూ ఏర్పాటు చేశారు. దక్షిణ కోల్‌కతాలోని బాఘా జతిన్ మండపం... దుర్గా మాతను మరింత భయానకంగా ఏర్పాటు చేసింది. ఈ ఏడాది వేడుకలు జరుపుకొనే ఉత్సాహం లేదని.. అందుకే డ్యాన్సులను రద్దు చేసుకున్నామని మండపాల నిర్వాహకులు చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
దళిత సంఘాల కన్నెర్ర
సాక్షి నెట్వర్క్: ఎమ్మెల్యేలు కె.రఘురామకృష్ణరాజు, పంతం నానాజీ దురాగతాలపై దళిత సంఘాలు కన్నెర్ర చేశాయి. వారిద్దరి తీరుపై మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అంబేడ్కర్ ఫ్లెక్సీని చించేసిన ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును శాసనసభ నుంచి బర్తరఫ్ చేయాలని, దళిత వైద్యుడు ఉమామహేశ్వరరావుపై దాడికి తెగబడిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని దళిత సంఘాల నేతలు నినదించారు. విశాఖ ఎల్ఐసీ కూడలిలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద అంబేడ్కర్ మెమోరియల్ సొసైటీ, దళిత హక్కుల పోరాట సమితి, భీమ్‌సేన, కేవీపీఎస్, దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. రఘురామకృష్ణరాజు దురాగతాన్ని హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేయాలని, దళిత వైద్యుడు ఉమామహేశ్వరరావును దూషించి దాడి చేసిన ఎమ్మెల్యే పంతం నానాజీని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వైద్యుడి ఘటనపై స్పందించని కాకినాడ ఎస్పీ, కలెక్టర్‌ను వెంటనే బదిలీ చేయాలని కోరారు. కాగా.. ఉండి ఎమ్మెల్యే రఘురామ తీరుపై పల్నాడు జిల్లా అమరావతిలో అంబేడ్కర్ విగ్రహం వద్ద ప్రజాసంఘాల నాయకులు నిరసన తెలిపారు. రఘురామను శాసనసభ నుంచి బర్తరఫ్ చేయాలని, ఆయనను తక్షణమే అరెస్ట్ చేయాలని వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం నాయకుడు తోకల సూరిబాబు, మండల సీఐటీయు కార్యదర్శి బి.సూరిబాబు, వైఎస్సార్సీపీ కారి్మక విభాగం నాయకుడు దారా ప్రసాద్ డిమాండ్ చేశారు. ఉండి ఎమ్మెల్యేపై ఫిర్యాదు అంబేడ్కర్‌ను అవమానపరిచిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుపై కేసు నమోదు చేయాలని న్యాయవాదులు, ప్రజాసంఘాల నాయకులు బాపట్ల జిల్లా రేపల్లెలో అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జైభీమ్ యాక్సెస్ జస్టిస్ రాష్ట్ర కార్యదర్శి దోవా రమేష్ రాంజీ, న్యాయవాదులు దారం సాంబశివరావు, కర్రా ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. తక్షణ చర్యలకు కార్పొరేటర్ల డిమాండ్ అంబేడ్కర్ ఫ్లెక్సీని చించేసిన టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్టరాజు, దళిత డాక్టర్‌పై దాడి చేసిన జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ శాసనసభ సభ్యత్వాలను రద్దు చేయాలని వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ గొలగాని హరి వెంకటకుమారి అధ్యక్షతన మంగళవారం కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 100 రోజుల్లో దళితులపై దాడులు పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేడ్కర్‌ను, దళిత డాక్టర్‌ను అవమానించిన ఎమ్మెల్యేలపై తక్షణ చర్యలు తీసుకోవాలని ప్లకార్డులు ప్రదర్శించారు. నిరసనలను అడ్డుకునేందుకు జనసేన, టీడీపీ కార్పొరేటర్లు అడ్డుకోవడానికి ప్రయత్నించగా.. వారు వెనక్కి తగ్గలేదు.డీజీపీకి మెమోరాండం అంబేడ్కర్ ఫొటోతో ఫ్లెక్సీ చించేసి దళితుల్ని అవమానపర్చిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు, దళిత ప్రొఫెసర్‌పై దాడికి పాల్పడిన జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరినట్టు పీవీ రావు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పండు అశోక్‌కుమార్ విజయవాడలో తెలిపారు. మంగళవారం డీజీపీని కలిసి ఈ మేరకు మెమోరాండం అందజేసినట్టు తెలిపారు. ఇద్దర్నీ అరెస్ట్ చేయాల్సిందే జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ, టీడీపీ ఎమ్మెల్యే రఘురామపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు వడ్లమూరి కృష్ణస్వరూప్ డిమాండ్ చేశారు. మంగళవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ వంద రోజుల పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. -
నిరసనలు కేంద్రం కుట్ర: మమత
కోల్‌కతా: వైద్యురాలి హత్యాచారంపై నిరసనల వెనుక కేంద్ర ప్రభుత్వం కుట్ర ఉందని పశి్చమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. వామపక్షాలూ ఈ కుట్రలో భాగమయ్యాయన్నారు. సచివాలయం నబన్నాలో సోమవారం ఒక అధికారిక సమీక్షలో మమత ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్.జి.కర్ ఆసుపత్రిలో ఆగస్టు 9న పీజీ ట్రైనీ డాక్టర్ రేప్, హత్య ఉదంతంలో నెలరోజులుగా బెంగాల్లో ప్రజలు నిరసన ప్రదర్శనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. బాధితురాలి తల్లిదండ్రులకు తానెప్పుడూ డబ్బు ఇవ్వజూపలేదని మమత అన్నారు. ఈమేరకు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. దుర్గాపూజ సమీపిస్తున్నందున నిరసనలు వీడి.. పండుగ ఏర్పాట్లు చేపట్టాలని ప్రజలను కోరారు. ‘వైద్యురాలి కుటుంబానికి నేనెప్పుడూ డబ్బు ఇవ్వజూపలేదు. అభాండాలు వేస్తున్నారు. కూతురి జ్ఞాపకార్థం ఏదైనా కార్యక్రమం చేపట్టదలిస్తే మా ప్రభుత్వం అండగా ఉంటుందని తల్లిదండ్రులకు చెప్పాను. ఎప్పుడేం మాట్లాడాలో నాకు తెలుసు. నిరసనలు ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వ కుట్రే. కొన్ని వామపక్ష పార్టీలకు ఇందులో భాగస్వామ్యముంది. పొరుగుదేశంలో అస్థిరత చూసి.. ఇక్కడా అలాంటి ఆందోళనలు రేకెత్తించాలని కొందరు చూస్తున్నారు. భారత్, బంగ్లాదేశ్‌లు రెండు వేర్వేరు దేశాలని వారు మర్చిపోయారు’ అని మమత ధ్వజమెత్తారు. ఆందోళన నేపథ్యంలో కోల్‌కతా పోలీసు కమిషనర్ వినీత్ గోయల్ రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారని, దుర్గాపూజ వేళ శాంతి భద్రతలపై పట్టున్న అధికారి అవసరం ఉందని దాన్ని తిరస్కరించినట్లు తెలిపారు. సాధ్యమైనంత త్వరగా విధుల్లో చేరాలని జూనియర్ డాక్టర్లకు విజ్ఞప్తి చేశారు. -
ర్యాలీలతో హోరెత్తిన కోల్‌కతా
కోల్‌కతా: ఆర్జీ కర్ ప్రభుత్వ వైద్యకళాశాలలో వైద్యురాలి హత్యోదంతంపై కోల్‌కతా నగరంలో ఆదివారం మరోమారు నిరసనలు మిన్నంటాయి. విద్యాసంస్థల పూర్వ విద్యార్థులు, కుమ్మరి కారి్మకులు, రిక్షావాలాలు... ఇలా వేర్వేరు రంగాలకు చెందిన వేలాది మంది రోడ్లపైకి వచ్చారు. బాధితురాలి తల్లిదండ్రులు సైతం వీటిలో పాల్గొన్నారు. దోషులకు కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేశారు. పలు ర్యాలీలో అమ్మాయిలు దుర్గా మాత వేషాల్లో పాల్గొన్నారు. ‘ఇంకెంత కాలం?’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. పశి్చమబెంగాల్‌లోని పలు పట్టణాల్లోనూ నిరసనలు కొనసాగాయి. మరోవైపు, వైద్యురాలి హత్యోదంతంపై రాష్ట్ర కేబినెట్‌ను అత్యవసరంగా సమావేశపరిచి చర్చించాలని మమత సర్కారును గవర్నర్ సీవీ ఆనంద బోస్ ఆదేశించారు. -
IMA: ‘న్యాయం కోర్టుకు వదిలేసి.. వెంటనే విధుల్లో చేరండి’
ఢిల్లీ: కోల్‌కతా ఆర్జీ కర్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్‌పై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా డాక్టర్లు , వైద్య సిబ్బంది, మెడికల్ కాలేజీ విద్యార్థులు పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశారు. అయితే పశ్చిమబెంగాల్లో డాక్టర్లు, వైద్య సిబ్బంది నిరసనలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో డాక్టర్లు, వైద్య సిబ్బంది తిరిగి విధుల్లో చేరాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) విజ్ఞప్తి చేస్తూ లేఖ రాసింది.‘ఆర్జీ కర్ జూనియర్ డాక్టర్ ఘటన దేశంలో ఉన్న ప్రతిఒక్కరి మనస్సును కదిలించింది. ఈ దారుణ ఘటనపై దేశవ్యాప్తంగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెను దేశం తన కుమార్తెగా భావించింది. అయితే మొత్తం మెడికల్ కమ్యూనిటీ సుప్రీంకోర్టుకు ఆదేశాలకు కట్టుబడి ఉండాలి. వెంటనే విధుల్లోకి చేరి.. వైద్యసేవలు ప్రారంభించండి. న్యాయం జరగటం గురించి అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు వదిలేయండి. రోగుల సంరక్షణ, భద్రత వైద్య వృత్తి ప్రధాన విధి. ఈ ఘటనను సుప్రీం కోర్టు సుమోటోగా తీసుకుంది. డాక్టర్ల రక్షణ కోసం జాతీయ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. డాక్టర్లు తమను నమ్మాలని.. వైద్యం నిలిపివేయవద్దని ఇప్పటికే సుప్రీం కోర్టు తెలియజేసింది’ అని లేఖలో పేర్కొంది.ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. సీబీఐ అధికారులు.. నిందితులకు పాలిగ్రాఫ్ టెస్టులు నిర్వహించి సాక్ష్యాలు సేకరిస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, డాక్టర్లు, వైద్య సిబ్బందికి మెరుగైన భద్రతా చర్యలు చేపట్టాలని కోరుతూ వివిధ రాష్ట్రాల్లో డాక్టర్లు భారీగా నిరసనలు చేపట్టారు. మరోవైపు.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని ప్రతిపక్ష బీజేపీ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. -
అస్సాంలో బాలికపై సామూహిక అత్యాచారం
గౌహతి: ఈశాన్య రాష్ట్రం అస్సాంలో దారుణం జరిగింది. నాగావ్ జిల్లాలో 14 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రజలు ఆగ్రహంతో వీధుల్లోకి వచ్చి ఆందోళనకు దిగారు. మహిళలకు రక్షణ కలి్పంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందిస్తూ బాలికపై అత్యాచారానికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షిస్తామని, మహిళలకు రక్షణ కలి్పస్తామని హామీ ఇచ్చారు. నాగావ్ జిల్లాలోని ధింగ్ ప్రాంతంలో గురువారం రాత్రి 8 గంటల సమయంలో బాలిక ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా, ముగ్గురు వ్యక్తులు మోటార్ సైకిల్ వచి్చ, ఆమెను బంధించి అత్యాచారానికి పాల్పడి, రోడ్డు పక్కన విసిరేసి వెళ్లిపోయినట్లు పోలీసులు చెప్పారు. బాధితురాలు పదో తరగతి చదువుతోందని, దుండగుల దుశ్చర్య వల్ల గాయాలపాలై అపస్మారక స్థితికి చేరుకుందని తెలిపారు. స్థానికులు గమనించి, తమకు సమాచారం ఇచ్చారని వెల్లడించారు. బాధితురాలిని అసుపత్రికి తరలించామని, చికిత్స కొనసాగుతోందని పేర్కొన్నారు. నిందితుల్లో ఇద్దరిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని, పరారీలో ఉన్న మరొకడి కోసం గాలింపు ముమ్మరం చేశామని అస్సాం డీజీపీ జి.పి.సింగ్ చెప్పారు. ముష్కరుల ఆగడాలను అడ్డుకుంటాం బాలికపై అత్యాచారం గురించి తెలియగానే శుక్రవారం అస్సాం అట్టుడికిపోయింది. జనం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. నిరసన ప్రదర్శనలు చేపట్టారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండాపోయిందని మండిçపడ్డారు. బాధితురాలికి న్యాయం చేయాలని, దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాలు శుక్రవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో దుకాణాలు, విద్యా సంస్థలు మూతపడ్డాయి. మైనర్ బాలికపై అత్యాచార ఘటన ఘటన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితులను అరెస్టు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హిందూ మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడినవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత అస్సాంలో ఓ వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు ఇష్టారాజ్యంగా రెచి్చపోతున్నారని, వారి ఆగడాలను కచి్చతంగా అడ్డుకుంటామని స్పష్టంచేశారు. రాష్ట్రంలో గత రెండు నెలల్లో 23 మంది మహిళలపై అఘాయిత్యాలు జరిగాయన్నారు. ఇతర ప్రాంతాల నుంచి కొనసాగుతున్న వలసల వల్ల స్థానికులు మైనార్టీలుగా మారిపోతున్నారని చెప్పారు. -
మాకేదీ రుణమాఫీ?
సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలోని రైతులందరికీ రుణమాఫీ కాలేదంటూ అన్నదాతలు రోడ్డెక్కారు. సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేశారు. ప్రభుత్వం మూడో విడత రుణమాఫీ ప్రకటించిన తర్వాత కూడా తమకు రుణాలు మాఫీ కాలేదంటూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చాలాచోట్ల రహదారులపై రాకపోకలను అడ్డుకున్నారు.⇒ ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు, జైనథ్, బోథ్, భీంపూర్ మండలాల్లో పెద్దఎత్తున ఆందోళనలు చేశారు. తలమడుగులో 500మందికి పైగా రైతులు సీఎం దిష్టిబొమ్మతో డప్పుచప్పుళ్ల మధ్య శవయాత్ర నిర్వహించారు. కర్మకాండ కుండలతోనే మహారాష్ట్ర బ్యాంకులోనికి వెళ్లారు. సీఎం డౌన్‌డౌన్ అంటూ నినదించారు. జైనథ్ మండలం గిమ్మలో రైతులు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు తాళం వేసి నిరసన వ్యక్తంచేశారు. తర్వాత బ్యాంకు అధికారుల వినతిమేరకు తాళాలు తొలగించారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవ్వాల్‌లో రైతు జక్కుల లచ్చన్న పంచాయతీ కార్యాలయం వద్ద విషగుళికలు తిని ఆత్మహత్యకు యత్నించగా, అక్కడ ఉన్న మరో రైతు అడ్డుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.⇒ నిజామాబాద్ జిల్లా 63 నంబరు జాతీయ రహదారి వేల్పూర్ క్రాస్‌రోడ్డు వద్ద రైతులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మూర్, మోర్తాడ్ వైపు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు భారీ సంఖ్యలో బందోబస్తు నిర్వహించారు.⇒తమకు రుణమాఫీ కాలేదంటూ కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని ఆసిఫ్‌నగర్ శాఖ ఇండియన్ బ్యాంక్‌ను ముట్టడించి రైతులు షట్టర్‌ను మూసివేశారు. తర్వాత అధికారులు, పోలీసులు రైతులకు నచ్చజెప్పి ఈ నెల 20న రైతు వేదికలో చర్చిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. ఆ బ్యాంక్ పరిధిలోని ఆరు గ్రామాలకు సంబంధించి సుమారు 1,250 మంది రైతులకు ఖాతాలుండగా కేవలం 430 మందికే రుణమాఫీ జరిగిందన్నారు. ⇒ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్ క్రాస్‌రోడ్డు వద్ద కరీంనగర్–వరంగల్ జాతీయ రహదారిపై ధర్నా చేశారు. రుణమాఫీ జాబితాలో తమ పేర్లులేవంటూ సుమారు 500 మంది రైతులు బ్యాంక్ ఎదుట ఆందోళన చేపట్టారు. ⇒ జగిత్యాల జిల్లా మల్లాపూర్‌లోని రైతువేదికలో వ్యవసాయశాఖ, లీడ్ బ్యాంక్ అధికారులతో నిర్వహించిన రుణమాఫీ అవగాహన సమావేశం రసాభాసగా ముగిసింది. మూడో విడతలో కూడా తన పేరు లేకపోవడంతో ఏలేటి రాజారెడ్డి అనే రైతు పురుగుల మందు డబ్బాతో వచ్చి అధికారులతో వాగ్వాదానికి దిగాడు. ⇒ బౌరంపేట్లోని బ్యాంక్‌లో 632 మంది రైతులు రుణం పొందితే కేవలం 14 మందికే రుణమాఫీ అయ్యిందని, మిగతా రైతులకు ఎందుకు మాఫీ చేయలేదంటూ రైతులు ఆందోళన వ్యక్తంచేశారు.⇒ఖమ్మం రూరల్, కొనిజర్ల, వైరా, రఘునాథపాలెం తదితర మండలాల రైతులు కలెక్టర్ కార్యాలయం ఎదుట రాస్తారోకో చేపట్టారు. అనంతరం వ్యవసాయ శాఖ అధికారులకు వినతిపత్రం ఇచ్చారు.రుణమాఫీ రూ.83తిమ్మాపూర్: కేవలం రూ.83 మాత్రమే రుణమాఫీ కావడంతో ఓ రైతు కంగుతిన్నాడు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ గ్రామానికి చెందిన రైతు వేల్పుల మల్లయ్యకు రూ.83 మాఫీ అయినట్టు మొబైల్‌కు సందేశం వచ్చింది. గత డిసెంబర్లో ఎల్ఎండీలోని ఎస్బీఐ బ్రాంచ్‌లో రూ.1.50 లక్షల పంటరుణం తీసుకున్న మల్లయ్య మూడో విడతలో మాఫీ అవుతుందని సంతోషించాడు.కానీ.. రూ.83 రుణఖాతాలో జమ అయినట్లు ఇటీవల మెసేజ్ వచ్చింది. షాక్‌కు గురైన ఆయన శనివారం వ్యవసాయాధికారులను సంప్రదించగా, వారు బ్యాంకు స్టేట్మెంట్ తీసుకురావాలని సూచించారు. అయితే అప్పటికే బ్యాంక్ టైం అయిపోవడంతో చేసేదేమీలేక వెనుదిరిగాడు. మాఫీకి ప్రభుత్వం విధించిన నిబంధనలకు తాను అర్హుడినని, తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. -
బీజేపీ, సీపీఎం నేతలా నన్ను ప్రశ్నించేది: సీఎం మమత ఫైర్
బెంగాల్లో టీఎంసీలు నిరసనలు అప్డేట్స్.. 👉బెంగాల్లో సీపీఎం, బీజేపీ పార్టీలపై సీఎం మమత సంచలన ఆరోపణలు చేశారు. ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో సీపీఎం, బీజేపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారని మమతా బెనర్జీ ఆరోపించారు.👉హత్యాచార ఘటనకు మమతా బెనర్జీ నిరసన తెలిపారు. ఈ సందర్బంగా మమత మాట్లాడుతూ..‘సీపీఎం, బీజేపీ కార్యకర్తలు అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఆస్పత్రిలోకి ప్రవేశించి అరాచకం సృష్టించారు. ఈ విషయం నాకు తెలుసు. సీపీఎం కార్యకర్తలు డీవైఎఫ్ఐ జెండాలతో, బీజేపీ కార్యకర్తలు జాతీయ పతాకాలు చేతిలో పట్టుకుని అరాచకానికి తెగబడ్డారు. ఇదంతా అక్కడున్న సీసీ టీవీ ఫుటేజీలో కనిపిస్తోంది. జాతీయ పతాకాన్ని దుర్వినియోగం చేసిన వీరిపై చర్యలు చేపట్టాలని కోరారు.#WATCH | Kolkata: West Bengal CM Mamata Banerjee says, "I know that CPM and BJP vandalised RG Kar Medical College and Hospital...They went there at 12-1 am in the night, the video shows that CPM took the DYFI flag and BJP took the national flag. They have misused the national… pic.twitter.com/WzEPz1Q0CT— ANI (@ANI) August 16, 2024👉మణిపూర్ భగ్గుమన్నప్పుడు బీజేపీ, సీపీఎంలు ఎన్ని బృందాలను అక్కడికి పంపాయని ఆమె ప్రశ్నించారు. హథ్రాస్, ఉన్నావ్‌కు ఎన్ని బృందాలను ఈ పార్టీలు పంపాయని మమత నిలదీశారు. మణిపూర్, యూపీల్లో అరాచకాలు జరిగినప్పుడు వీరంతా ఎక్కడ ఉన్నారని ఆమె ప్రశ్నించారు. సీపీఎం, బీజేపీ తనను బెదిరించలేవని, ఎన్నికల్లో ప్రజల మద్దతుతోనే తాము ఇక్కడ వరకూ వచ్చామని పేర్కొన్నారు. 👉పశ్చిమ బెంగాల్‌లోని ఆర్జీ కార్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ క్రమంలో నిందితులను శిక్షించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. మరోవైపు.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఈ ఘటనకు కారణమైన వారిని ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు.👉కాగా, హత్యాచారం ఘటనను ఖండిస్తూ కోల్‌కతాలో సీఎం మమతా, టీఎంసీ నేతలు శుక్రవారం ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం జరగాలని నినాదాలు చేశారు. #WATCH | West Bengal CM Mamata Banerjee holds a protest against the incident of rape and murder of a woman doctor at RG Kar Medical College and Hospital, in Kolkata She is demanding justice for the victim and capital punishment for the accused. pic.twitter.com/3wkc3V1aza— ANI (@ANI) August 16, 2024 #WATCH | West Bengal CM Mamata Banerjee takes out a rally against the incident of rape and murder of a woman doctor at RG Kar Medical College and Hospital, in KolkataShe is demanding justice for the victim and capital punishment for the accused. pic.twitter.com/z8rBxRuqGn— ANI (@ANI) August 16, 2024 -
సెబీ చీఫ్‌పై ఆరోపణలు: దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
ఢిల్లీ:అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్ ఫండ్లలో సెబీ ఛైర్పర్సన్ మాధవి పురి, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని హిండెన్‌బర్గ్ ఇటీవల విడుదల చేసిన నివేదిక వివాదాస్పదంగా మారింది. ఈ క్రమంలో ఆమెను సెబీ ఛైర్ పర్సన్‌గా తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు తాజాగా ఆమెను ఛైర్మన్ పదవి నుంచి తొలిగించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ ఆగస్టు 22 దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయాల ముందు నిరసనలు చేపట్టనున్నట్లు ప్రకటించింది.కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, ఎంపీ కేసీ వేణుగోపాల్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆగస్టు 22న దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతాం. అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఈడీ ఆఫీసుల ముందు భైఠాయించి నిరసనలు తెలుపుతాం. ఇవాళ(మంగళవారం) కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీలు, ఇన్ఛార్జ్లు, పీసీసీ ప్రెసిడెంట్లతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆదానీ గ్రూప్, సెబీకి సంబంధించిన అతిపెద్ద కుంభకోణంపై చర్చించాం. అదానీ మెగా స్కామ్‌పై జేపీసీ ఆధ్వర్యంలో విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఆందోళన చేయాలని నిర్ణయం తీసుకున్నాం’’ అని అన్నారు.చదవండి: ముగిసిన ఏఐసీసీ మీటింగ్.. సెబీ, అదానీలే టార్గెట్ -
నిందితులెవరో తేల్చకుండా బెదిరింపులా?
సాక్షి, అమరావతి: రాజ్యాంగ రూపశిల్పిపై రాజ్యోన్మాదం ఘటన కేసు దర్యాప్తులో విజయవాడ పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు వ్యవహరిస్తున్న తీరుపై ప్రజాస్వామ్యవాదులు, అంబేడ్కర్ ఆలోచనాపరులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక న్యాయ మహాశిల్పాన్ని ధ్వంసం చేసేందుకు బరితెగించిన ఆగంతకులెవరో తేల్చకుండా.. ఆ సంఘటనను వక్రీకరించిన పత్రికలు, సామాజిక మాధ్యమాలపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించడంపై విస్తుపోతున్నారు. ఇది భావప్రకటనా స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛకు విఘాతం కల్పి0చడం కాదా? అని నిలదీస్తున్నారు.విజయవాడ నడిబొడ్డున రాజ్‌భవన్, పోలీసు కమిషనర్ కార్యాలయానికి కూత వేటు దూరంలోని అంబేడ్కర్ స్మృతివనంలో సామాజిక న్యాయ మహాశిల్పాన్ని ధ్వంసం చేసేందుకు ఈనెల 8న రాత్రి కొందరు దుండగులు తెగబడ్డారు. స్మృతివనంలో పనిచేస్తున్న సిబ్బందిని రాత్రి 9 గంటలకు అక్కడి నుంచి బయటకు పంపి లైట్లన్నీ ఆర్పేసి సామాజిక న్యాయ మహాశిల్పం బోర్డు, మాజీ సీఎం జగన్ పేరును ధ్వంసం చేశారు. ఈ ఘటన జరుగుతుండగానే మీడియా ప్రతినిధులు పోలీసు కమిషనర్‌కు తెలిపేందుకు ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదు. స్మృతివనం వద్దకు చేరుకున్న మీడియా ప్రతినిధులు, ప్రజాస్వామ్యవాదులు, అంబేడ్కర్ ఆలోచనాపరులను చూసి ఆగంతకులు పారిపోయారు. లేదంటే అంబేడ్కర్ విగ్రహం విధ్వంసానికి గురయ్యేదని ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజ్యోన్మాదంపై ఆగ్రహజ్వాల.. సామాజిక అభ్యున్నతి ద్వారానే దళిత వర్గాల తలరాత మారుతుందని బాబా సాహెబ్ అంబేడ్కర్ నినదించి ఆగస్టు 8వతేదీ నాటికి సరిగ్గా 95 ఏళ్లు. అదే రోజు విజయవాడ నడిబొడ్డున రాష్ట్రానికి తలమానికంగా ఉన్న అంబేడ్కర్ విగ్రహంపై టీడీపీ మూకలు ఉన్మాదంతో పేట్రేగిపోవడం దేశవ్యాప్తంగా యావత్ దళిత సమాజాన్ని నివ్వెరపోయేలా చేసింది. స్వయంగా ప్రభుత్వమే పూనుకుని రాజ్యాంగ నిర్మాతపై దాడికి ఉన్మత్త మూకలను ప్రేరేపించడంపై ప్రజాస్వామ్యవాదులు, అంబేడ్కర్ ఆలోచనాపరులు మండిపడుతున్నారు. అంబేడ్కర్ విగ్రహంపై దాడి ఘటనలో నిందితులెవరో తేల్చాలని ఉద్యమిస్తున్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన కొందరు అధికారులు, పోలీసుల సమక్షంలో సామాజిక న్యాయ మహాశిల్పాన్ని ధ్వంసం చేసేందుకు బరితెగించారని స్పష్టం చేస్తున్నారు. జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ప్రోద్బలంతో ఎంపిక చేసిన కొందరు అధికారుల సమక్షంలో అంబేడ్కర్ విగ్రహంపై దాడి జరిగినట్లు స్పష్టమవుతోందని ప్రజాస్వామ్యవాదులు పేర్కొంటున్నారు. అంబేడ్కర్ విగ్రహాన్ని విధ్వంసం చేసేందుకు తెగబడ్డ ఉన్మాదులెవరో తేల్చకుండా కొన్ని పత్రికలు, సామాజిక మాధ్యమాలు వక్రీకరించి దు్రష్ఫచారం చేస్తూ సామాజిక వర్గాలు, దళిత సంఘాలను రెచ్చగొడుతూ వైషమ్యాలను సృష్టిస్తున్నాయని విజయవాడ సీపీ ఎస్వీ రాజశేఖరబాబు వ్యాఖ్యానించడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు.సీపీ గారూ.. సమాధానం చెబుతారా?» రాజ్‌భవన్, పోలీసు కమిషనర్ కార్యాలయానికి కూత వేటు దూరంలో ఉన్న స్మృతివనంలో లైట్లన్నీ ఆర్పేసి అంబేడ్కర్ విగ్రహంపై కొందరు ఆగంతకులు దాడి చేయడం భద్రతా వైఫల్యం కాదా? » అంబేడ్కర్ విగ్రహంపై దాడి చేస్తున్నారనే సమాచారాన్ని మీడియా మీకు అందించడానికి ప్రయత్నించినప్పుడు మీరు అందుబాటులోకి రాలేదన్నది వాస్తవం కాదా? » మీడియా ప్రతినిధులు, అంబేడ్కర్ ఆలోచనాపరులు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద ఎత్తున స్మృతివనం వద్దకు చేరుకోవటాన్ని చూసే కదా ఆగంతకులు పారిపోయారు? ఆ తర్వాతే అక్కడికి పోలీసులు వచ్చారన్నది నిజం కాదా? » అంబేడ్కర్ స్మృతివనం చుట్టూ సీసీ కెమెరాలున్నాయి. వాటి ఫుటేజీని బయటపెట్టి నిందితులెవరో ఎందుకు తేల్చరు? » సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ కనుసన్నల్లో ఎంపిక చేసిన పచ్చమూకలే అంబేడ్కర్ విగ్రహంపై దాడికి తెగబడ్డాయన్న నిజం బయటపడుతుందనే సీసీ ఫుటేజీని బహిర్గతం చేయడం లేదా? ఇది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సింది పోయి ఖూనీ చేసిన వారికి వత్తాసు పలకడం కాదా? » సామాజిక న్యాయ మహాశిల్పం బోర్డు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరును అప్పటికే ధ్వంసం చేశారు. స్మతివనం వద్దకు మీడియా, అంబేడ్కర్ ఆలోచనాపరులు, ప్రజాస్వామ్యవాదులు చేరుకునే సరికి ఆగంతకులు పారిపోయారు. లేదంటే అంబేడ్కర్ విగ్రహాన్ని విధ్వంసం చేసే వారన్నది వాస్తవం కాదా? » అంబేడ్కర్ విగ్రహంపై దాడి ఘటనను బహిర్గతం చేయడం మీ దృష్టిలో వక్రీకరించడమా? అది సామాజిక వర్గాలను, దళిత సంఘాలను రెచ్చగొట్టి వర్గాల మధ్య వైషమ్యాలు సృష్టించడమా? -
అంబేడ్కర్ జోలికి వస్తే సహించం: వైఎస్సార్సీపీ శ్రేణులు
సాక్షి, నెట్వర్క్: విజయవాడ నగరం నడిబొడ్డున అంబేడ్కర్ స్మృతివనంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి జరిగిన ప్రయత్నాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు నిరసించారు. వైఎస్సార్సీపీ పిలుపు మేరకు శనివారం రాత్రి కొవ్వొత్తులతో ప్రదర్శనలు చేశారు. రాజ్యాంగ నిర్మాత విగ్రహం జోలికి వస్తే సహించబోమని నినదించారు. వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద కొవ్వొత్తులతో భారీ నిరసన కార్యక్రమం జరిగింది. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం వైఎస్సార్సీపీ కార్యకర్తలు, ప్రజలు కొవ్వొత్తులతో ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మేరుగు నాగార్జున, వైఎస్సార్సీపీ విజయవాడ నగర అధ్యక్షుడు మల్లాది విష్ణు పాల్గొన్నారు.» గుంటూరు నగరంలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి దద్దాల నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో రాస్తారోకో, కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. యర్రగొండపాలెంలో జరిగిన నిరసనలో జెడ్పీటీసీ చేదూరి విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరులో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, జెడ్పీటీసీ తెనాలి నిర్మలమ్మ తదితరులు పాల్గొన్నారు.» అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఎమ్మార్పీఎస్ నాయకులు రాస్తారోకో చేసి, మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలో వైఎస్సార్సీపీ నేత ఈర లక్కప్ప ఆధ్వర్యంలో, హిందూపురంలో పార్టీ నేత దీపిక ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కర్నూలులో మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ తదితరుల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. కల్లూరులో జరిగిన నిరసనలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.» విశాఖ నగరంలో వైఎస్సార్సీపీ విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె. రాజు ఆధ్వర్యంలో, అనకాపల్లిలో పార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు ఆధ్వర్యంలో, అడ్డరోడ్డు కూడలిలో మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ప్రదర్శన చేశారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, ఇచ్ఛాపురంలో ఎమ్మెల్సీ నర్తు రామారావు, రణస్థలంలో పార్టీ జిల్లా కార్యదర్శి పిన్నింటి సాయికుమార్, పాతపట్నంలో స్థానిక వైఎస్సార్సీపీ నాయకుల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీలు చేశారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో జరిగిన కొవొత్తుల ప్రదర్శనలో పార్టీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి పాల్గొన్నారు.» చిత్తూరులో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో వైఎస్సార్సీపీ జిల్లా మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలు గాయత్రీదేవి, ఇతర నాయకులు పాల్గొన్నారు. వైఎస్సార్ జిల్లాలో కడపలో జరిగిన కొవ్వొత్తుల ర్యాలీలో మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్బి అంజద్‌బాషా, కడప మేయర్ కె. సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. కమలాపురంలో వైఎస్సార్సీపీ నాయకుడు, నవ్యాంధ్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు శరత్‌బాబు ఆధ్వర్యంలో, అన్నమయ్య జిల్లా రాజంపేటలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ దండుగోపి తదితరుల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శనలు నిర్వహించారు. -
బంగ్లాదేశ్‌లో మళ్లీ చెలరేగిన అల్లర్లు.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రాజీనామా
బంగ్లాదేశ్‌లో మరోసారి అల్లర్లు భగ్గుమన్నాయి. బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వెంటనే రాజీనామా చేయాలని నిరసనలు డిమాండ్ చేశారు. సీజేఐతోపాటు ఇతర న్యాయమూర్తులు పదవి నుంచి దిగిపోవాలంటూ భారీ ఎత్తున విద్యార్ధులు ఢాకాలోని కోర్టు వద్ద గుమిగూడి నిరసనలు చేశారు. చీఫ్ జస్టిస్ గంటలో దిగిపోవాలంటూ డిమాండ్లు చేశారు.వీటికి సీజేఐ అంగీకరించారు. తన పదవికి రాజీనామా చేస్తానని ఒబైదుల్ హసన్ వెల్లడించారు. కాగా ఒబైదుల్ హసన్ గత ఏడాదిలోనే బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆయన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు విధేయుడిగా ఉండేవారు. అయితే దేశంలో రిజర్వేషన్లపై నిరసనలు హింసాత్మకంగా మారడంతో ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హసీనా భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. అయితే సీజేఐ కూడా దేశం విడిచి పారిపోవచ్చనే వార్తలతో ఈ నిరసనలు ఒక్కసారిగా చెలరేగాయి. బంగ్లాలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరుగుతోన్న ఆందోళనలు ఇటీవల ఉద్రిక్తంగా మారాయి. గత ఆదివారం మరోసారి హింస చెలరేగి.. 100 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నిరసనల్లో ఇప్పటి వరకు 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారత్ సహా పలు దేశాలు తమ పౌరులకు సూచనలు చేశాయి. బంగ్లాదేశ్‌లో ఎవరూ పర్యటించవద్దని హెచ్చరించాయి. మరోవైపు దేశాధ్యక్షుడు పార్లమెంటును రద్దు చేశారు. తాత్కాలిక పరిపాలన యంత్రాంగానికి యూనస్‌ను సారథిగా నియమితులయ్యారు. -
యూకే వెళ్లాలనుకునే భారతీయులకు కేంద్రం అడ్వైజరీ
బ్రిటన్‌లోని భారతీయులను కేంద్రం అప్రమత్తం చేసింది. ఇటీవల యూకేలో నెలకొన్న నిరసనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో బ్రిటన్ వెళ్లాలనుకునే వారు అప్రమత్తంగా ఉండాలని భారత పౌరులకు సూచించింది. ఈ మేరకు లండన్‌లోని భారత హైకమిషన్ మంగళవారం భారతీయులకు ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది.‘యూకేలోని పలు ప్రాంతాల్లో ఇటీవల జరిగిన అల్లర్ల గురించి భారత ప్రయాణికులకు తెలిసే ఉంటుంది. లండన్‌లోని భారత హైకమిషన్ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. భారత్ నుంచి యూకేకు వచ్చే సందర్శకులు అప్రమత్తంగా ఉండాలి. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. స్థానిక భద్రతా సంస్థలు, మీడియా సంస్థలు జారీ చేసే సూచనలను అనుసరించాలి. నిరసనలు జరుగుతున్న ప్రాంతాలకు దూరంగా ఉండటం మంచిది’ అని పేర్కొంది. మీ వ్యక్తిగత భద్రత కోసం నిరసనలు జరుగుతున్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించింది.Advisory for Indian Citizens visiting the UK.@VDoraiswami @sujitjoyghosh @MEAIndia pic.twitter.com/i2iwQ7E3Og— India in the UK (@HCI_London) August 6, 2024కాగా వలస వ్యతిరేక గ్రూప్‌లు బ్రిటన్‌లోని పలు నగరాలు, పట్టణాల్లో నిరసనలు చేపట్టాయి. ఇవి దేశమంతా విస్తరించిన క్రమంలో హింసాత్మకంగా మారాయి. గతవారం ఓ డ్యాన్స్ క్లాస్‌లో చిన్నారులపై దుండగులు కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు మృతి చెందారు. దేశవ్యాప్త ఆందోళనలకు కారణమైన ఈ ఘటన మెల్లమెల్లగా వలస వ్యతిరేక నిరసనలకు దారి తీసింది. పలు నగరాల్లో నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆందోళనకారులు రాళ్లు రువ్వడం, బాణసంచా కాల్చి విసరడం, శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తున్న హోటల్స్‌పై దాడి వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆందోళనకారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని కీర్ స్మార్టర్ అధికారులను ఆదేశించారు. -
Bangladesh Political Crisis: సంక్షోభ బంగ్లా
ఢాకా/న్యూఢిల్లీ: పొరుగుదేశం బంగ్లాదేశ్ పెను రాజకీయ సంక్షోభంలో చిక్కుకుంది. సోమవారం రోజంతా అత్యంత నాటకీయ పరిణామాలు చకచకా జరిగిపోయాయి. ప్రధాని షేక్ హసీనా (76)కు వ్యతిరేకంగా కొద్ది రోజులుగా జరుగుతున్న దేశవ్యాప్త ఆందోళనలు ఉధృత రూపం దాల్చాయి. నిరసనకారుల ‘లాంగ్ మార్చ్’ పిలుపునకు స్పందిస్తూ జనమంతా కర్ఫ్యూను ధిక్కరించి మరీ దేశ నలుమూలల నుంచీ రాజధాని ఢాకాకు తండోపతండాలుగా తరలారు. దాంతో ప్రజల డిమాండ్‌కు హసీనా తలొగ్గారు. ప్రధాని పదవికి రాజీనామా చేశారు. జనాగ్రహానికి జడిసి పలాయన మంత్రం పఠించారు. ఉన్నపళంగా దేశం వీడారు. సోదరితో కలిసి కట్టుబట్టలతో సైనిక విమానంలో భారత్ చేరుకున్నారు. వెంటనే సైన్యం పరిస్థితిని తమ చేతుల్లోకి తీసుకుంది. సైన్యాధ్యక్షుడు జనరల్ వకారుజ్జమాన్ జాతినుద్దేశించి టీవీలో ప్రసంగించారు. ప్రధాని రాజీనామాను అధికారికంగా ప్రకటించారు. ‘‘శాంతిభద్రతలతో పాటుదేశ బాధ్యతలన్నింటినీ తాత్కాలికంగా నేనే స్వీకరిస్తున్నా. దయచేసి సహకరించండి’’ అని ప్రకటించారు. నిరసనకారులపై ఒక్క తూటా కూడా పేల్చొద్దని సైన్యాన్ని, పోలీసు శాఖను ఆదేశించారు. ‘‘అందరికీ న్యాయం జరిగేలా చూస్తాం. నిరసనకారులు ఆందోళన విరమించాలి’’ అని కోరారు. వీలైనంత త్వరగా మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఆ వెంటనే పారీ్టలతో భేటీ అయ్యారు. తర్వాత ఆయా పారీ్టల నేతలతో కలిసి రాష్ట్రపతితో భేటీ అయ్యారు. అధికార అవామీ లీగ్ మినహా మిగతా పక్షాలు హాజరయ్యాయి. మరోవైపు హసీనా దేశం వీడారన్న వార్తతో ఆందోళనకారులంతా ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. దేశవ్యాప్తంగా బాణసంచా పేలుస్తూ, మిఠాయిలు పంచుకుంటూ సందడి చేశారు. హసీనా అధికార నివాసంలోకి చొరబడ్డారు. సర్వం లూటీ చేసి తమ ఆగ్రహావేశాలను ప్రదర్శించారు. ఆమె తండ్రి, బంగబంధు షేక్ ముజిబుర్ రెహా్మన్ విగ్రహాన్ని సుత్తెలతో పగలగొట్టి నేలమట్టం చేశారు. అధికార అవామీ లీగ్ కార్యాలయానికి నిప్పు పెట్టారు. పార్లమెంటులోకీ చొరబడ్డారు. పుట్టి ముంచిన రిజర్వేషన్లు రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమాలతో కొద్ది నెలలుగా బంగ్లాదేశ్ అట్టుడికిపోతుండటం తెలిసిందే. బంగ్లా విముక్తి యుద్ధవీరుల వారసులకు ప్రభుత్వోద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లను పునరుద్ధరిస్తూ గత జూన్‌లో హసీనా సర్కారు తీసుకున్న నిర్ణయం చివరికి ఆమె పుట్టి ముంచింది. ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ యువత, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో రోడ్డెక్కారు. దాంతో నెల క్రితం జరిగిన భారీ ఆందోళనలు, ఘర్షణల్లో 200 మందికి పైగా మరణించారు. చివరికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఆ రిజర్వేషన్లను 5 శాతానికి తగ్గించింది. దాంతో సమస్య సమసినట్టేనని అంతా భావించారు. కానీ హసీనా తప్పుకోవాలంటూ వారం రోజులుగా మళ్లీ నిరసనలు వెల్లువెత్తాయి. 200 మంది అమాయకుల మృతికి ఆమే కారణమంటూ ఆందోళనలు తీవ్ర రూపు దాల్చాయి. హసీనా రాజీనామా డిమాండ్‌తో జనం మరోసారి రోడ్డెక్కారు. శని, ఆదివారాల్లో దేశవ్యాప్త ఘర్షణల్లో 100 మందికి పైగా మరణించారు. హసీనా సర్కారు ఓ మెట్టు దిగి వారిని చర్చలకు ఆహా్వనించినా ససేమిరా అన్నారు. దాంతో వారిపై హసీనా తీవ్రంగా మండిపడ్డారు. ఆ క్రమంలో, ‘యువత ముసుగులో సంఘవిద్రోహ శక్తులే ఘర్షణలకు దిగుతున్నా’రంటూ ఆదివారం ఆమె చేసిన వ్యాఖ్యలతో పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది. హసీనాను గద్దె దింపడమే లక్ష్యంగా ‘ఢాకా లాంగ్ మార్చ్’కు నిరసనకారులు పిలుపునిచ్చారు. అది చివరికి హసీనా పలాయనానికి దారితీసింది. రిజర్వేషన్ల రగడ ఆమె 15 ఏళ్ల పాలనకు చివరికిలా తెరదించింది. నాలుగోసారి అధికారంలోకి వచ్చి ఆర్నెల్లు కూడా దాటకుండానే హసీనా సర్వం పోగొట్టుకుని శరణారి్థగా దేశం వీడాల్సి వచ్చింది! ఆలయాల విధ్వంసం హసీనా రాజీనామా చేశారన్న ప్రకటన వింటూనే దేశవ్యాప్తంగా జనం రెచ్చిపోయారు. ఢాకాలో ప్రధాని అధికార నివాసంతో పాటు హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ నివాసంలోకి చొచ్చుకెళ్లారు. వాటిని పూర్తిగా లూటీ చేశారు. హసీనా భర్త డాక్టర వాజెడ్ మియా ఇంటిని కూడా వదిలిపెట్టలేదు. దానికి నిప్పు పెట్టారు. బంగబంధు స్మారక మ్యూజియంతో పాటు బంగ్లాదేశ్‌తో భారత ద్వైపాక్షిక సంబంధాలకు ప్రతీకగా నిలిచిన ఇందిరాగాంధీ సాంస్కృతిక కేంద్రం తదితర కీలక భవనాలకు కూడా నిప్పు పెట్టారు. దేశ ప్రధాన న్యాయమూర్తి నివాసంపైనా అల్లరి మూకలు దాడికి దిగాయి. కాసేపటికే ఇంట్లోంచి కేకలు, ఆక్రందనలు, మూలుగులు విని్పంచినట్టు స్థానిక మీడియా పేర్కొంది. దేశవ్యాప్తంగా హింసాకాండ, ఆస్తుల విధ్వంసం తదితరాలు కొనసాగాయి. నాలుగు ఆలయాలను ధ్వంసం చేశారు. ఎంపీలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికారుల నివాసాలు, కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లు, రైల్వేస్టేషన్లపై రాళ్లు రువ్వారు. వాటికి నిప్పు పెట్టారు. రన్‌వే మీదా వెంటాడిన జనం... త్రుటిలో తప్పించుకున్న హసీనా సైనిక విమానంలో సోదరితో కలిసి ఢిల్లీకి ఉన్నపళంగా బంగ్లా వీడిన హసీనా తన సోదరి షేక్ రెహానాతో కలిసి భారత్ చేరుకున్నారు. ఆ క్రమంలో, వెల్లువెత్తిన జనాగ్రహం బారినుంచి ఆమె త్రుటిలో తప్పించుకున్నారు! హసీనాను వెంబడిస్తూ నిరసనకారులు ఢాకా విమానాశ్రయంలోకి కూడా చొచ్చుకొచ్చారు. వారిలో పలువురు గేట్లన్నింటినీ బద్దలు కొట్టుకుంటూ హసీనాకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తిస్తూ రన్‌వే మీదికి కూడా చేరుకున్నారు. అప్పటికే ఆమె, సోదరి బంగ్లా వైమానిక దళానికి చెందిన సి–130జె రవాణా విమానం ఎక్కేశారు. దాంతో నిరసన మూక బారిన పడకుండా తప్పించుకున్నారు. కాసేపటికి వారిద్దరూ ఢిల్లీ సమీపంలో గాజియాబాద్‌లోని హిండన్ వైమానిక స్థావరానికి చేరుకున్నారు. విమానం భారత వాయుతలంలోకి ప్రవేశించగానే మన వాయుసేన విమానాలు రక్షణగా తోడు వచ్చాయి. విమానాశ్రయంలో ఎయిర్‌ఫోర్స్ ఉన్నతాధికారులు హసీనాకు స్వాగతం పలికారు. హసీనాతో దోవల్ భేటీ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హిండన్ ఎయిర్‌బేస్‌లో హసీనాతో భేటీ అయ్యారు. వారు ఏం చర్చించిందీ తెలియరాలేదు. అనంతరం ఆమెను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఢిల్లీలో ఉన్న తన కూతురు సైమా వాజెద్‌ను కలిసిన అనంతరం హసీనా లండన్ వెళ్తారని సమాచారం. వాజెద్ ప్రపంచ ఆరోగ్య సంస్థలో ఆగ్నేయాసినా ప్రాంతీయ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. హసీనా ఇంటి ముట్టడి సర్వం దోచుకెళ్లిన జనం రెండేళ్ల క్రితం శ్రీలంక అంతర్యుద్ధం సందర్భంగా ఏం జరిగిందో గుర్తుందా? అధ్యక్ష నివాసాన్ని ముట్టడించిన జనం భవనమంతా కలియదిరిగారు. అధ్యక్షుని కురీ్చలో విలాసంగా కూర్చుని ఫొటోలకు పోజులిచ్చారు. సెలీ్పలు దిగారు. కిచెన్‌లో దూరి ఉన్నవన్నీ తింటూ సరదాగా గడిపారు. ఈత కొలనుల్లో ఈదులాడారు. సోమవారం ఢాకాలోనూ అవే దృశ్యాలు పునరావృతమయ్యాయి. ప్రధాని హసీనా రాజీనామా చేసి దేశం వీడినట్టు తెలియగానే నిరసనకారులు సంబరాలు చేసుకున్నారు. ఆమె అధికార నివాసం ‘గణభదన్’ను భారీ సంఖ్యలో ముట్టడించారు. డ్రమ్ములు వాయిస్తూ, కొమ్ముబూరాలు ఊదుతూ విజయనాదం చేశారు. జాతీయ పతాకాలు చేబూని స్వేచ్ఛా నినాదాలు చేశారు. లాన్ల నిండా పరుగులు తీస్తూ, స్విమింగ్‌పూల్స్‌లో ఈదులాడుతూ, భవనమంతా కలియదిరుగుతూ హసీనాపై తమ ఆగ్రహాన్ని వెలిగక్కారు. భద్రతా సిబ్బందితో కలిసి ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. కొందరు ప్రధాని కుర్చీలో కూర్చున్నారు. బెడ్రూంలో మంచంపై హాయిగా సేదదీరారు. అంతటితో ఆగకుండా వంట సామగ్రి మొదలుకుని ఫరి్నచర్, పురాతన వస్తువుల దాకా సర్వం ఎత్తుకెళ్లారు. ఎవరికి ఏది చేతికందితే అది తీసుకెళ్లారు. భవనాన్ని పూర్తిగా లూటీ చేసి వదిలారు. ఒక వ్యక్తి లిప్‌స్టిక్‌లు చేతబట్టుకుని మీడియా కంటబడ్డాడు. ‘‘నియంత కబంధ హస్తాల నుంచి దేశాన్ని విముక్తం చేశాం. మా పోరాటానికి ప్రతీకగా ఈ లిప్‌స్టిక్‌ను నా దగ్గరుంచుకుంటా’’ అని చెప్పుకొచ్చాడు! దేశ పార్లమెంటులోకి కూడా జనం వెల్లువలా దూసుకెళ్లారు. ప్రజాప్రతినిధురల కురీ్చల్లో కూర్చుని విలాసంగా పొగ తాగుతూ, సెల్పీలు తీసుకుంటూ గడిపారు. ఇక తిరిగి రారు: కుమారుడు లండన్: హసీనా తిరిగి బంగ్లాదేశ్ రాజకీయాల్లో వేలు పెట్టబోరని ఆమె కుమారుడు సజీవ్ వాజెడ్ జాయ్ ప్రకటించారు. ఆమె క్షేమం కోరి కుటుంబీకులమంతా ఒత్తిడి చేసిన మీదటే దేశం వీడారని బీబీసీకి ఇచి్చన ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. ఖలేదా జియాకు విముక్తిఢాకా: జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని ఖలేదా జియాను వెంటనే విడుదల చేయాలని బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేయడంతోపాటు దేశం విడిచిపెట్టిన కొన్ని గంటల్లోనే ఈ పరిణామం సంభవించడం గమనార్హం. అధ్యక్షుడు షహబుద్దీన్ ప్రతిపక్ష పార్టీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) చీఫ్ ఖలేదా జియాను తక్షణమే విడుదల చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయానికి వచ్చినట్లు ఒక అధికారిక ప్రకటన వెలువడింది. షేక్ హసీనా మొదటిసారిగా 1996లో దేశ ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత ఖలేదా జియా అధికారంలోకి వచ్చారు. అప్పటి నుంచి ప్రధాని కుర్చీ వారిద్దరి మధ్య మారుతూ వచ్చింది.నిరసనలు ఇలా... జూన్ 5: స్వాతంత్య్ర సమర యోధుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్ల కోటాను పునరుద్ధరిస్తూ కోర్టు తీర్పు జూన్ 6: యూనివర్సిటీల్లో మొదలైనఆందోళనలు. దేశమంతటికీ వ్యాప్తి.జూన్ 7: విద్యార్థుల రహదారుల దిగ్బంధం జూన్ 15: పెరిగిన నిరసనల తీవ్రత జూలై 15: హింసాత్మకంగా మారిన నిరసనలు జూలై 18: ఆందోళనలు తీవ్రరూపం..19 మంది మృతి. కర్ఫ్యూ, రంగంలోకి సైన్యం జూలై 19: దేశమంతటా హింసజూలై 21: కోటాను 5 శాతానికి తగ్గిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఆగస్ట్ 3: మృతి చెందిన వారి కుటుంబాలకు న్యాయం చేయాలంటూ మళ్లీ నిరసనలు ఆగస్ట్ 4: దేశవ్యాప్త ఆందోళనల్లో మరో 100 మందికి పైగా మృతి. న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశం. అయినా చల్లారని జనాగ్రహం ఆగస్ట్ 5: ప్రధాని షేక్ హసీనా రాజీనామా. దేశం విడిచి పలాయనం భారత్‌పై ప్రభావం ఎంత?! బంగ్లా్లదేశ్ సంక్షోభం భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది. హసీనా తొలి నుంచీ భారత్‌కు గట్టి మద్దతుదారు. ఆమె హయాంలో 15 ఏళ్లుగా ద్వైపాక్షిక బంధం నానాటికీ దృఢమవుతూనే వస్తోంది. ముఖ్యంగా బంగ్లాదేశ్‌లోని భారత వ్యతిరేకుల నోళ్లకు హసీనా గట్టిగా తాళం వేశారు. 2009లో ఆమె రెండోసారి గద్దెనెక్కినప్పుడు యూపీఏ–2 మన్మోహన్సింగ్ ప్రధానిగా ఉన్నారు. ఆ ఐదేళ్లలో ఇరు దేశాల బంధం గట్టిపడింది. 2014లో నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక సంబంధాలు మరింతగా బలపడుతూ వచ్చాయి. మన ప్రబల ప్రత్యర్థి చైనాకు బంగ్లాదేశ్ మరీ దగ్గరవకుండా ఉండేందుకు పలు అంశాల్లో బంగ్లాకు ఇతోధికంగా సాయపడుతూ వచి్చంది. ఖలీదా జియా హయాంలో ఇరు దేశాల మధ్య మనస్ఫర్ధలు తలెత్తాయి. భారత వ్యతిరేకతే జియా ప్రధాన ఎన్నికల ప్రచారాస్త్రంగా ఉంటూ వస్తోంది కూడా! బంగ్లాదేశ్ మేలు కంటే హసీనా, అవామీ లీగ్ రాజకీయ ప్రయోజనాల పరిరక్షణే భారత్‌కు ప్రధానమని ఆ దేశంలో ఒక వర్గంలో ఉన్న అభిప్రాయానికి ఆమె గట్టి సమర్థకురాలు. జియా హయాంలో ఉల్ఫా తీవ్రవాదులు బంగ్లా కేంద్రంగా ఈశాన్య భారతంలో ధ్వంసరచన చేశారు. కొద్ది నెలల క్రితం బంగ్లాదేశ్‌లో సాగిన ‘బాయ్‌కాట్ భారత్’ ప్రచారానికి జియా, బీఎన్పీ నేతలు బాహాటంగా మద్దతిచ్చారు. ఈ నేపథ్యంలో జియా జైలు నుంచి విడుదలవడమే గాక సైన్యం దన్నుతో కూడిన మధ్యంతర ప్రభుత్వానికి సారథ్యం వహించవచ్చన్న వార్తలు భారత్‌కు ఇబ్బందికరమే.పరిస్థితిని సమీక్షించిన మోదీబంగ్లా సంక్షోభం నేపథ్యంలో ప్రధాని మోదీ సారథ్యంలో భద్రతపై కేబినెట్ కమిటీ అత్యవసరంగా సమావేశమైంది. హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్, విదేశాంగ మంత్రి జైశంకర్, ఆర్థిక మంత్రి సీతారామన్ భేటీలో పాల్గొన్నారు. బంగ్లాలో తాజా పరిస్థితిని మోదీకి జైశంకర్ నివేదించారు. సరిహద్దుల్లో అప్రమత్తత బంగ్లాదేశ్‌తో 4,096 కిలోమీటర్ల పొడవునా సరిహద్దుల వెంబడి భద్రతను కట్టుదిట్టం చేశారు. బీఎస్ఎఫ్ హై అలర్ట్ జారీ చేసింది. అదనపు బలగాలను మోహరించారు. మన విద్యార్థులు వెనక్కి ..బంగ్లాదేశ్ సంక్షోభం నేపథ్యంలో అక్కడున్న భారత విద్యార్థులు పెద్ద సంఖ్యలో వెనక్కొస్తున్నారు. జూలై చివరికల్లా 2,894 మంది తిరిగొచ్చారు. మరో 3,000 మంది త్వరలో రానున్నట్టు అధికారులు వెల్లడించారు. -
భారత్‌లో షేక్ హసీనా.. అజిత్ దోవల్‌తో భేటీ!
బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు సంబంధించిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో దేశ ప్రధాని షేక్ హసీనా తన పదవికి సోమవారం రాజీనామా చేశారు. తన సోదరి షేక్ రెహానాతో కలిసి ఆర్మీ హెలికాప్టర్లో దేశం విడిచి సురక్షిత ప్రాంతానికి వెళ్లారు. ప్రస్తుతం దేశం మొత్తాన్ని సైన్యం చేతుల్లోకి తీసుకుంది. నేటి రాత్రి లోపు దేశంలో పరిస్థితులను అదుపులోకి తీసుకొస్తామని ఆర్మీ చీఫ్ వాకర్-ఉజ్-జమాన్ ప్రకటించారు. త్వరలోనే తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.ఆర్మీ హెచ్చరికల నేపథ్యంలోనే బంగ్లాదేష్ ప్రధాని పదవి నుంచి 76 ఏళ్ల షేక్ హసీనా దిగిపోయినట్లు తెలుస్తోంది. ఆమె పదవి నుంచి దిగిపోయేందుకు 45 నిమిషాల సమయం ఇచ్చినట్లు.. క్రమంలోనే రాజీనామా చేసినట్లు సమాచారం. తీవ్ర ఆందోళనలతో ఢాకాలో ఆమె ప్రాణాలకు ముప్పు ఉన్న నేపథ్యంలో సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోవాలని సెక్యూరిటీ ఆదేశించడంతో ఆగమేఘాల మీద దేశం విడిచి వెళ్లినట్లు వినికిడి.భారత్‌లో షేక్ హసీనా..అయితే షేక్ హసీనా భారత్‌కు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె కట్టుదిట్టమైన భద్రత మధ్య సోమవారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని హిండన్ ఎయిర్‌బేస్‌కు చేరుకున్నారు. ఇది యూపీలోని ఘజియాబాద్‌లో ఉంది. అక్కడ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ను కలిశారు. అనంతరం ఆమె లండన్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బంగ్లాదేశ్‌లో పరిస్థితిని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రధాని నరేంద్ర మోదీఇ వివరించారు. అయితే మోదీ హసీనాను కలుస్తారో లేదన్న విషయంపై స్పష్టత లేదు.బీఎస్ఎఫ్ అలెర్ట్..బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో భారత సరిహద్దులను రక్షించే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అప్రమత్తమైంది. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి హై అలర్ట్ ప్రకటించింది. సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. తాజా పరిస్థితి నేపథ్యంలో ముందస్తు చర్యల కోసం బీఎస్ఎఫ్ డీజీ ఇప్పటికే కోల్‌కతాకు చేరుకున్నట్లు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. మరోవైపు పొరుగు దేశంలోని పరిస్థితుల దృష్ట్యా బంగ్లాదేశ్‌తో అన్ని రైళ్ల సేవలను నిలిపివేసినట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. -
బంగ్లాదేశ్: 100 దాటిన ఘర్షణ మృతుల సంఖ్య
ఢాకా: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో నిరసనకారులు, విద్యార్థులు చేపట్టిన సహాయ నిరాకరణోద్యమం ఆదివారం హింసాత్మకంగా మారింది. అధికార ఆవామీ పార్టీ కార్యకర్తలకు, ఆందోళకారులకు మధ్య దేశవ్యాప్తంగా 13 జిల్లాల్లో జరిగిన ఘర్షణల్లో మరణించినవారి సంఖ్య 100కు చేరింది. ఇందులో 14 మంది పోలీసులు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు.. ఆందోళనల నేపథ్యం ప్రభుత్వం నేటి (సోమవారం) నుంచి మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. నిరసనలు జరుగుతున్న ప్రాంతాల్లో కర్ఫ్యు విధించి, ఇంటర్నెట్ సేవలను తెలిపివేశారు. బంగ్లాదేశ్‌లో మళ్లీ అల్లర్ల చెలరేగటంతో అక్కడ ఉండే భారతీయ విద్యార్థులు, పౌరులకు కేంద్ర ప్రభుత్వ అడ్వైజరీ జారీ చేసింది. భారతీయులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సాయం కోసం ఢాకాలోని భారత హైకమిషన్ సంప్రదించాని పేర్కొంది. .. ప్రస్తుత సమయంలో బంగ్లాదేశ్‌కు భారతీయులు ఎవరూ వెళ్లవద్దని తెలిపింది. అత్యవసర సాయం కోసం భారత హైకమిషన్ ఫోన్ నంబర్లను +8801958383679 +8801958383680 +8801937400591 విడుదల చేసింది. ఇక.. బంగ్లాదేశ్ విముక్తి యోధుల వారసులకు ప్రభుత్వోద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్ల నిర్ణయం ఇటీవల బంగ్లాలో చిచ్చు రేపడం తెలిసిందే. దాంతో సుప్రీంకోర్టు వాటిని 5 శాతానికి తగ్గించింది. -
UAE: బంగ్లాదేశీయుల నిరసనలు.. 53 మందికి జైలుశిక్ష
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో బంగ్లాదేశ్ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టిన పలువురు స్థానిక బంగ్లాదేశీయులకు ఒక కోర్టు జైలు శిక్ష విధించింది. ఆందోళనకారులలో ముగ్గురికి జీవిత ఖైదు కూడా విధించింది. ఈ వివరాలను యూఏఈ ప్రభుత్వ మీడియా వెల్లడించింది.యూఏఈ ప్రభుత్వ వార్తా సంస్థ డబ్ల్యూఏఎం తెలిపిన వివరాల ప్రకారం అబుదాబిలోని ఫెడరల్ అప్పీల్ కోర్టు 53 మంది బంగ్లాదేశీయులకు 10 ఏళ్ల జైలు శిక్ష, ఒక బంగ్లాదేశీయునికి 11 ఏళ్ల జైలు శిక్ష, ముగ్గురికి జీవిత ఖైదు విధించింది. శిక్షాకాలం పూర్తయిన తర్వాత ఈ బంగ్లాదేశీయులను దేశం నుంచి బహిష్కరించాలని కూడా కోర్టు ఆదేశించింది.బంగ్లాదేశ్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా యూఏఈలోని పలు వీధుల్లో స్థానిక బంగ్లాదేశీయులు భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ కేసులో కోర్టు సాక్షులను కోర్టు విచారించింది. అరెస్టయిన బంగ్లాదేశీయులకు సంబంధించిన వివరాలను యూఏఈ అధికారులు విడుదల చేశారు. యూఏఈఏ ప్రభుత్వం రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్ల ఏర్పాటును నిషేధిస్తుంది. ఇక్కడ అమలులో ఉన్న చట్టం ప్రకారం భావప్రకటనా స్వేచ్ఛకు కొన్ని హద్దులు ఉన్నాయి.బంగ్లాదేశ్ ప్రభుత్వం 1971లో ముక్తిసంగ్రామ్లో పాల్గొన్న ముక్తి వాహిని సభ్యుల బంధువులకు ప్రభుత్వ ఉద్యోగాలలో 30 శాతం మేరకు రిజర్వేషన్లు కల్పించింది. దీనికి వ్యతిరేకంగా దక్షిణాసియా దేశంలో హింసాత్మక నిరసనలు జరిగాయి. ఇవి యూఏఈలోనూ చోటుచేసుకున్నాయి. కాగా బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ముక్తివాహిని సభ్యుల రిజర్వేషన్ పరిమితిని ఏడు శాతానికి తగ్గించింది. ఈ నిర్ణయం నిరసనకారుల పాక్షిక విజయంగా పరిగణిస్తున్నారు.