బెంగాల్‌లో టీఎంసీలు నిరసనలు అప్‌డేట్స్..
👉బెంగాల్‌లో సీపీఎం, బీజేపీ పార్టీలపై సీఎం మమత సంచలన ఆరోపణలు చేశారు. ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో సీపీఎం, బీజేపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారని మమతా బెనర్జీ ఆరోపించారు.
👉హత్యాచార ఘటనకు మమతా బెనర్జీ నిరసన తెలిపారు. ఈ సందర్బంగా మమత మాట్లాడుతూ..‘సీపీఎం, బీజేపీ కార్యకర్తలు అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఆస్పత్రిలోకి ప్రవేశించి అరాచకం సృష్టించారు. ఈ విషయం నాకు తెలుసు. సీపీఎం కార్యకర్తలు డీవైఎఫ్‌ఐ జెండాలతో, బీజేపీ కార్యకర్తలు జాతీయ పతాకాలు చేతిలో పట్టుకుని అరాచకానికి తెగబడ్డారు. ఇదంతా అక్కడున్న సీసీ టీవీ ఫుటేజీలో కనిపిస్తోంది. జాతీయ పతాకాన్ని దుర్వినియోగం చేసిన వీరిపై చర్యలు చేపట్టాలని కోరారు.
#WATCH | Kolkata: West Bengal CM Mamata Banerjee says, "I know that CPM and BJP vandalised RG Kar Medical College and Hospital...They went there at 12-1 am in the night, the video shows that CPM took the DYFI flag and BJP took the national flag. They have misused the national… pic.twitter.com/WzEPz1Q0CT
— ANI (@ANI) August 16, 2024
👉మణిపూర్ భగ్గుమన్నప్పుడు బీజేపీ, సీపీఎంలు ఎన్ని బృందాలను అక్కడికి పంపాయని ఆమె ప్రశ్నించారు. హథ్రాస్, ఉన్నావ్‌కు ఎన్ని బృందాలను ఈ పార్టీలు పంపాయని మమత నిలదీశారు. మణిపూర్, యూపీల్లో అరాచకాలు జరిగినప్పుడు వీరంతా ఎక్కడ ఉన్నారని ఆమె ప్రశ్నించారు. సీపీఎం, బీజేపీ తనను బెదిరించలేవని, ఎన్నికల్లో ప్రజల మద్దతుతోనే తాము ఇక్కడ వరకూ వచ్చామని పేర్కొన్నారు.
👉పశ్చిమ బెంగాల్‌లోని ఆర్‌జీ కార్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ క్రమంలో నిందితులను శిక్షించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. మరోవైపు.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఈ ఘటనకు కారణమైన వారిని ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు.
👉కాగా, హత్యాచారం ఘటనను ఖండిస్తూ కోల్‌కతాలో సీఎం మమతా, టీఎంసీ నేతలు శుక్రవారం ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం జరగాలని నినాదాలు చేశారు.
#WATCH | West Bengal CM Mamata Banerjee holds a protest against the incident of rape and murder of a woman doctor at RG Kar Medical College and Hospital, in Kolkata
She is demanding justice for the victim and capital punishment for the accused. pic.twitter.com/3wkc3V1aza— ANI (@ANI) August 16, 2024
#WATCH | West Bengal CM Mamata Banerjee takes out a rally against the incident of rape and murder of a woman doctor at RG Kar Medical College and Hospital, in Kolkata
She is demanding justice for the victim and capital punishment for the accused. pic.twitter.com/z8rBxRuqGn— ANI (@ANI) August 16, 2024
Comments
Please login to add a commentAdd a comment