harrasement
-
లైంగిక వేధింపుల కేసు.. రాజీ కుదుర్చుకున్నా రద్దు చేయలేం: సుప్రీం
న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల కేసులో సుప్రీంకోర్టు గురువారం కీల కీలకతీర్పు వెలువరించింది. లైంగిక వేధింపుల కేసులో ఫిర్యాదుదారుల కుటుంబంతో నిందితుడు రాజీ కుదుర్చుకున్నంత మాత్రాన కేసును కొట్టివేయడం కుదరదని తేల్చిచెప్పింది. ఈ కేసులోనిందితుడికి ఉపశమనం కలిగిస్తూ రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపైనా అత్యున్నత ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. దిగువ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను సైతం కొట్టివేసింది. 2022లో జస్థాన్‌లోని గంగాపూర్ నగరంలో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు మైనర్ బాలిక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై పోక్సో చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీల నిరోధక) కేసులు నమోదు చేశారు. మైనర్ బాలిక వాంగ్మూలాన్ని కూడా నమోదు చేశారు. ఆ తర్వాత నిందితుడు విమల్ కుమార్ గుప్తా స్టాంప్ పేపర్‌పై బాలిక కుటుంబం నుంచి ఓ వాంగ్మూలాన్ని తెచ్చాడు.అందులో తాము నిందితుడిని అపార్థం చేసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశామని.. ఇకపై ఉపాధ్యాయుడిపై ఎటువంటి చర్యలు తీసుకోకూడదని బాధిత కుటుంబం పేర్కొన్నట్టుగా ఉంది. పోలీసులు దీనిని అంగీకరించి కోర్టుకు నివేదిక సమర్పించారు. అయితే కింది కోర్టు ఈ చర్యను తోసిపుచ్చింది. దీంతో నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. బాధిత కుటుంబం వాంగ్మూలాన్ని అంగీకరించిన హైకోర్టు.. ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని పోలీసులను ఆదేశించింది.అయితే హైకోర్టు తీర్పును రామ్‌జీ లాల్ బైర్వా అనే సామాజిక కార్యకర్త సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఈ కేసు పూర్వాపరాలు గమనించిన జస్టిస్ సిటి రవికుమార్, జస్టిస్ పివి సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం.. హైకోర్టు తీర్పును రద్దు చేసింది. రాజీ కుదుర్చుకున్నంత మాత్రాన కేసును రద్దు చేయలేమని స్పష్టం చేసింది.అలాగే ఈ కేసును తిరిగి విచారించాలని ఆదేశించింది. -
విమానంలో మహిళకు వేధింపులు..వ్యక్తి అరెస్ట్
చెన్నై:ఢిల్లీ-చెన్నై ఇండిగో విమానంలో ఓ మహిళ లైంగిక వేధింపులకు గురైంది. ఈ విషయాన్ని చెన్నై విమానాశ్రయ అధికారులు తెలిపారు. విమానంలో నిద్రపోతున్నపుడు తన వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి కావాలని తన శరీరాన్ని తాకాడని ఓ మహిళ విమాన సిబ్బందికి ఫిర్యాదు చేశారు.మహిళను లైంగిక వేధింపులకు గురిచేసిన రాజేష్‌శర్మ అనే వ్యక్తిని చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్) చట్టం కింద శర్మపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.నిందితునిది రాజస్థాన్ అయినప్పటికీ చాలా కాలం నుంచి చెన్నైలోనే నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: జాక్‌పాట్ కొట్టిన మెకానిక్..లాటరీలో రూ.25 కోట్లు -
బీజేపీ, సీపీఎం నేతలా నన్ను ప్రశ్నించేది: సీఎం మమత ఫైర్
బెంగాల్లో టీఎంసీలు నిరసనలు అప్డేట్స్.. 👉బెంగాల్లో సీపీఎం, బీజేపీ పార్టీలపై సీఎం మమత సంచలన ఆరోపణలు చేశారు. ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో సీపీఎం, బీజేపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారని మమతా బెనర్జీ ఆరోపించారు.👉హత్యాచార ఘటనకు మమతా బెనర్జీ నిరసన తెలిపారు. ఈ సందర్బంగా మమత మాట్లాడుతూ..‘సీపీఎం, బీజేపీ కార్యకర్తలు అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఆస్పత్రిలోకి ప్రవేశించి అరాచకం సృష్టించారు. ఈ విషయం నాకు తెలుసు. సీపీఎం కార్యకర్తలు డీవైఎఫ్ఐ జెండాలతో, బీజేపీ కార్యకర్తలు జాతీయ పతాకాలు చేతిలో పట్టుకుని అరాచకానికి తెగబడ్డారు. ఇదంతా అక్కడున్న సీసీ టీవీ ఫుటేజీలో కనిపిస్తోంది. జాతీయ పతాకాన్ని దుర్వినియోగం చేసిన వీరిపై చర్యలు చేపట్టాలని కోరారు.#WATCH | Kolkata: West Bengal CM Mamata Banerjee says, "I know that CPM and BJP vandalised RG Kar Medical College and Hospital...They went there at 12-1 am in the night, the video shows that CPM took the DYFI flag and BJP took the national flag. They have misused the national… pic.twitter.com/WzEPz1Q0CT— ANI (@ANI) August 16, 2024👉మణిపూర్ భగ్గుమన్నప్పుడు బీజేపీ, సీపీఎంలు ఎన్ని బృందాలను అక్కడికి పంపాయని ఆమె ప్రశ్నించారు. హథ్రాస్, ఉన్నావ్‌కు ఎన్ని బృందాలను ఈ పార్టీలు పంపాయని మమత నిలదీశారు. మణిపూర్, యూపీల్లో అరాచకాలు జరిగినప్పుడు వీరంతా ఎక్కడ ఉన్నారని ఆమె ప్రశ్నించారు. సీపీఎం, బీజేపీ తనను బెదిరించలేవని, ఎన్నికల్లో ప్రజల మద్దతుతోనే తాము ఇక్కడ వరకూ వచ్చామని పేర్కొన్నారు. 👉పశ్చిమ బెంగాల్‌లోని ఆర్జీ కార్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ క్రమంలో నిందితులను శిక్షించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. మరోవైపు.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఈ ఘటనకు కారణమైన వారిని ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు.👉కాగా, హత్యాచారం ఘటనను ఖండిస్తూ కోల్‌కతాలో సీఎం మమతా, టీఎంసీ నేతలు శుక్రవారం ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం జరగాలని నినాదాలు చేశారు. #WATCH | West Bengal CM Mamata Banerjee holds a protest against the incident of rape and murder of a woman doctor at RG Kar Medical College and Hospital, in Kolkata She is demanding justice for the victim and capital punishment for the accused. pic.twitter.com/3wkc3V1aza— ANI (@ANI) August 16, 2024 #WATCH | West Bengal CM Mamata Banerjee takes out a rally against the incident of rape and murder of a woman doctor at RG Kar Medical College and Hospital, in KolkataShe is demanding justice for the victim and capital punishment for the accused. pic.twitter.com/z8rBxRuqGn— ANI (@ANI) August 16, 2024 -
సోషల్ మీడియాలో వేధింపులు.. తేజస్వినీ ఆత్మహత్య
సాక్షి, సంగారెడ్డి: ప్రేమ పేరుతో వేధింపుల కారణంగా బీఫార్మసీ విద్యార్థిని తేజస్వినీ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇక, విద్యార్ధిని ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా గుమ్మదిదల మండలం దోమడుగు గ్రామానికి చెందిన తేజస్వినీ బీఫార్మసీ చదువుతోంది. ఈ క్రమంలో ఓ యువకుడు ఇన్స్‌స్టాగ్రామ్ వేదికలో ప్రేమ పేరుతో ఆమెను వేధింపులకు గురి చేశాడు. దీంతో.. అతడి వేధింపులు భరించలేక తేజస్వినీ ఆత్మహత్య చేసుకుంది. తన ఇంటివద్ద నాలుగో అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది.ఈ క్రమంలో.. తల్లిదండ్రులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. దీంతో, ఆసుపత్రికి చేరుకునేలోపే తేజస్వినీ మృతి చెందింది. అయితే, తనను ప్రేమించాలంటూ అదే గ్రామానికి చెందిన యువకుడు అతని స్నేహితులతో కలిసి తరచూ ఆమెను వేధింపులకు గురిచేసినట్టు తేజస్వినీ పేరెంట్స్ చెప్పారు. దీంతో, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
నాపై ఈ అఘాయిత్యం..! నేనేమి చేశాను పాపం..?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: నాకు ఆరేళ్లు.. అమ్మానాన్న ప్రేమగా చూసుకునేవారు. ఏడు నెలల చెల్లితో బాగా ఆడుకునేదాన్ని. సంతోషంగా గడుస్తున్న జీవితంలో ఒక్కసారిగా ఇలా.. ఎవరికి ఏం కీడు చేశాను? ఇంకా ఎంత మంది చిన్నారులు బలికావాలి? ఏ అమ్మాయికి ఇలాంటి అఘాయిత్యం జరగకుండా చూడండి. ఏం చేస్తే బాగుంటుందో.. ఆలోచించండి. బాలికలను కాపాడండి. నాలాంటి బాధితులు సమాజంలో ఎందరో ఉన్నారు. మీకు తెలిసింది కొందరే. కొన్ని రోజులు బాధపడి వదిలేసే విషయం కాదు. నా వయసు చూడండి.. నాకేం తెలుసని ఇలా చేశారు? నా బాల్యాన్ని ఎందుకు దూరం చేశారు? మీ కూతురిలా.. చెల్లిలా.. కనిపించడం లేదా? సీ్త్రని దేవతగా పూజించే ఈ దేశంలో ఇంత దారుణ పరిస్థితులా? నిర్భయ.. దిశ.. వరంగల్ చిన్నారి.. ఇప్పుడు నేను.. దీనికి ముగింపు ఎప్పుడో? – ‘హత్యా’చారానికి గురైన చిన్నారి ఆత్మఘోషఅప్పటివరకు అమ్మానాన్న ఒడిలో ఆడుకుంటున్న పిల్లలు అకస్మాత్తుగా మాయమై, విగతజీవులుగా మారితే.. అదిచూసిన కన్నోళ్ల పరిస్థితి ఏమిటి? ఆకాశంలో గద్దలు అకస్మాతుగా నేల మీదకు వచ్చి కోడిపిల్లలను తన్నుకుపోయినట్లుగా పొత్తిళ్లలో, తల్లి ఒడిలో నిద్రపోతున్న పసిపిల్లలను ఎత్తకుపోతున్నారు. మద్యం, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలకు అలవాటుపడినవారు సమాజానికి ము ప్పుగా, పిల్లల పాలిట యమకింకరులుగా త యారయ్యారు.తాజాగా పెద్దపల్లి జిల్లా సుల్తానా బాద్ మండలంలోని కాట్నపల్లిలో గురువారం రాత్రి జరి గిన ఆరేళ్ల చిన్నారి అపహరణ, అత్యాచారం, ఆపై హత్య ఘటన భయానకవాతావరణం సృష్టించింది. ముక్కుపచ్చలారని చిన్నారిని మానవ మృగం చిదిమేసిన తీరుపై స్థానికులు భగ్గుమన్నారు. బడికి వెళ్లిన పిల్లలు క్షేమంగా ఇంటికి వస్తారన్న నమ్మకం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.‘వలస’ బతుకులు అగమ్యగోచరంవలస కార్మికుల బతుకులు అగమ్యగోచరంగా మారాయి. పనికి తగ్గ వేతనం, పని ప్రదేశాల్లో కనీస వసతులు మృగ్యమయ్యాయి. దీనికితోడు ఎప్పుడు ఎవరి నుంచి ఆపద ముంచుకొస్తుందోనన్న భయం వెంటాడుతోంది. వలస కార్మికులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎంతమంది ఉన్నారు.. వారి భద్రతకు యాజమాన్యాలు తీసుకుంటున్న చర్యలేంటి.. పని ప్రదేశాల్లో వసతుల కల్పనపై పట్టించుకునేవారు కరువయ్యారు.ఏ అండ లేకపోవడంతో లైగింక వేధింపులకు గురవుతున్నారు. కొన్ని సందర్భాల్లోనే కేసులు నమోదవుతుండగా, చాలావరకు పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కకుండానే వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని, సెటిల్ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. తాజాగా కాట్నపల్లి రైస్‌మిల్లులో పని చేయడానికి వచ్చిన కుటుంబాలకు వేర్వేరుగా వసతి గదులు, వాటికి తలుపులు లేకపోవడం వల్లే సంఘటన జరిగిందన్న చర్చ జరుగుతోంది.మద్యం, గంజాయి మత్తులో..మహిళలు, యువతులు, చిన్నారులపై వేధింపులు, అత్యాచార ఘటనలు ఎక్కువ శాతం మద్యం, గంజాయి మత్తులోనే చోటుచేసుకుంటున్నట్లు నేరాల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఏ గ్రామంలో చూసినా 24 గంటలు బెల్టుషాపుల్లో మద్యం లభిస్తుండంతోపాటు వలస కార్మికులు ఉన్న ప్రదేశాల్లో కొన్ని ముఠాలు గంజాయిని విచ్చలవిడిగా విక్రయిస్తున్నాయి.గుడ్ టచ్, బ్యాడ్ టచ్ తెలియాలి..పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఏంటో తెలియాలి. దీనిపై ప్రతీ పాఠశాలలో అవగాహన కల్పిస్తున్నారు. బాలికలతో ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు అనే విషయమై తల్లిదండ్రులు ఆరా తీస్తుండాలి. చుట్టుపక్కల ఉండేవారిపై ఓ కన్నేసి ఉంచాలి. లైంగిక దాడులు చిన్నారులపై దీర్ఘకాలిక మానసిక దుష్ప్రభావాలు చూపుతాయి. ఇలాంటి పని చేసినవారు వయసులో పెద్దవారు, బంధువు అని చూడకూడదు. ఒకవేళ వదిలేస్తే వారికి అడ్డూఅదుపు లేకుండా పోతుంది.పెద్దపల్లి జిల్లాలో 10 వేల మంది కార్మికులు..కార్మిక శాఖ లెక్కల ప్రకారం పెద్దపల్లి జిల్లాలో 10 వేల మంది వలస కార్మికులు ఉన్నారు. వీరిలో భవన నిర్మాణ కార్మికులు 6 వేల మంది వరకు, రైస్‌మిల్లుల్లో 2,500 మంది, ఇటుక బట్టీల్లో 1,500 మంది పని చేస్తున్నారు. యజమానులు దళారుల ద్వారా ఆయా రాష్ట్రాల వలస కూలీలకు అడ్వాన్స్ చెల్లించి, పనికి తీసుకువస్తున్నారు. డబ్బులకు ఆశపడి వచ్చిన కార్మికులు ఇక్కడి వాతావరణంలో పని చేయలేక, పని ఒత్తిడి, లైగింక వేధింపులతో ఇబ్బంది పడుతున్నారు.పక్కలో నుంచి ఎత్తుకుపోయి సంపిండు..మేము నెల కింద పని కోసం మిల్లుకు వచ్చాం. ఎప్పటిలాగే మా ఇద్దరు బిడ్డలతో కలిసి రేకుల కింద పడుకున్నం. వర్షం పడుతుండటంతో లోపలికి తీసుకుపోయిన. కరెంట్ పోవడంతో ఉక్కపోస్తోందని బయటకు వచ్చాం. పిల్లలను పడుకోబెట్టిన. రాత్రి 11 గంటలకు చూస్తే పాప కనబడలేదు. పక్కలో నుంచి ఎత్తుకపోయి సంపిండు. వాడిని విడిచిపెట్టొద్దు. – మృతురాలి తల్లి ఆవేదనపరిచయస్తులే నిందితులు..పోక్సో కేసులకు సంబంధించి బాధితుల్లో చాలామంది తమకు పరిచయస్తులు, బంధువుల చేతిలోనే లైంగికదాడులకు గురవుతున్నారు. కుటుంబ పరువు మంటగలుస్తుందని వారు బయటకు రావడం లేదు. ఇదే సమయంలో పరిచయం లేనివారు కూడా ఎక్కడినుంచో వచ్చి, అఘాయిత్యాలకు పాల్పడుతూ ప్రాణాలు తీసి, కన్నవారికి కడుపుకోత మిగులుస్తున్నారు. కాట్నపల్లి ఘటన నిందితుడు మృతురాలి తల్లిదండ్రులు పనిచేసే చోటే పని చేస్తుండటం గమనార్హం.గతంలో జరిగిన కొన్ని సంఘటనలు..2019లో ఎలిగేడు మండలం శివపల్లి పరిసరాల్లోని రైస్‌మిల్లులో వలస మహిళా కూలీపై అత్యాచారం జరిగింది.2021 నవంబర్‌లో పెద్దపల్లిలోని రంగాపూర్ ఇటుక బట్టీల్లో వలస కూలీపై అత్యాచారం చేయగా, ఇద్దరు నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు.2023 ఆగస్టులో అప్పన్నపేట వద్ద భవన నిర్మాణ పనులు చేసేందుకు వచ్చిన బాలిక రక్తస్రావంతో మృతిచెందింది. మొదట్లో సామూహిక అత్యాచారం చేశారని ప్రచారం జరిగింది. తర్వాత, క్రిమిసంహారక మందు తాగి, ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తేల్చారు.ఉమ్మడి జిల్లాలో పోక్సో కేసులు..కరీంనగర్ జిల్లాలో 2022లో 68, 2023లో 58, 2024లో 27 పోక్సో కేసులు నమోదయ్యాయి. రాజన్న సిరిసిల్లలో 2022లో 62, 2023లో 42, 2024లో 18, జగిత్యాల జిల్లాలో 2022లో 59, 2023లో 84, 2024లో 48, పెద్దపల్లి జిల్లాలో 2022లో 29, 2023లో 20, 2024లో 01 పోక్సో కేసులు నమోదయ్యాయి. -
Arvind Kejriwal: మోదీజీ.. దేవుడు మిమ్మల్ని క్షమించడు
న్యూఢిల్లీ: ప్రధాని మోదీపై ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కనీ్వనర్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మోదీ హద్దు మీరుతున్నారని, అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిదండ్రులను సైతం లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. కేజ్రీవాల్ గురువారం వర్చువల్‌గా మీడియాతో మాట్లాడారు. పద్ధతి మార్చుకోవాలని ప్రధానికి హితవు పలికారు. ‘‘నా ఎమ్మెల్యేలను, మంత్రిని అరెస్టు చేశారు. నన్ను జైలులో పెట్టి వేధించారు. ఈరోజు మీరు హద్దులు దాటారు. నన్ను లక్ష్యంగా చేసుకుని నా తల్లిదండ్రులను వేధిస్తున్నారు. ఆ దేవుడు మిమ్మల్ని క్షమించడు’’ అని మోదీని ఉద్దేశించి పేర్కొన్నారు. -
ర్యాపిడో డ్రైవర్ లైంగిక వేధింపులు.. సంస్థ రియాక్షన్ ఇదే..
బైక్ట్యాక్సీలపై ఆడా..మగా తేడా లేకుండా అందరికీ అవగాహన పెరుగుతోంది. మహిళలు ఎక్కువగా తమ గమ్యస్థానాలు చేరడానికి ఇటీవల బైక్ట్యాక్సీలను వినియోగించుకుంటున్నారు. అయితే తాజాగా ర్యాపిడో బైక్ ట్యాక్సీ డ్రైవర్ ఓ మహిళను లైంగికంగా వేధించిన సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ర్యాపిడో డ్రైవర్ తనను లైంగికంగా వేధించాడని ఓ మహిళ ఆరోపించడంతో సదరు సంస్థ అతని ఐడీని సస్పెండ్ చేసింది. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. మహిళ ఫిర్యాదు మేరకు శనివారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో టిన్ ఫ్యాక్టరీ ప్రాంతం నుంచి కోరమంగళకు రాపిడో బైక్‌పై వెళ్తుండగా డ్రైవర్ తనను లైంగికంగా వేధించినట్లు తెలిపారు. ఫోన్లో బ్యాటరీ తక్కువగా ఉందని చెప్పి ర్యాపిడో డ్రైవర్ రూట్ నావిగేట్ చేయడానికి తన ఫోన్ కావాలని అడిగాడన్నారు. ఆ తర్వాత బైక్‌పై వెళ్తుండగా తన పర్సనల్ విషయాలు అడిగాడని, పెట్రోల్ పంపులో అనుచితంగా తనను రెండు సార్లు తాకాడని వెల్లడించారు. ఇదీ చదవండి: పదాలతో సంగీతం..! ఎలాగో చూడండి.. చాలాకాలంగా ర్యాపిడో యాప్ ఉపయోగిస్తున్నప్పటికీ ఇలాంటి సంఘటన ఎప్పుడూ ఎదురుకాలేదని మహిళ చెప్పారు. దీనిపై ఫిర్యాదు చేయగా.. ఈ విషయాన్ని పరిశీలించి డ్రైవర్‌పై చర్యలు తీసుకుంటామని కంపెనీ వెల్లడించినట్లు బాధితురాలు తెలిపారు. ఆమె ఫిర్యాదు చేసిన కొన్ని గంటల్లోనే డ్రైవర్‌ను సస్పెండ్ చేసినట్లు ర్యాపిడో ప్రకటించిందని మహిళ వివరించారు. -
సర్పంచ్ నవ్య వర్సెస్ ఎమ్మెల్యే రాజయ్య కేసులో బిగ్ ట్విస్ట్
-
శేజల్‌తో బీఆర్ఎస్ నేతల చర్చలు.. ఎమ్మెల్యే చిన్నయ్యకు షాక్!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య లైంగికంగా వేధించారని శేజల్ అనే యువతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కాగా, తమపై కేసులు పెట్టించారని గత రెండు నెలలు నుంచి పలు రకాలుగా ఆందోళన చేస్తున్న ఆరిజన్ నిర్వాహకురాలు శేజల్‌తో బీఆర్ఎస్ ఎంపీలు శుక్రవారం చర్చలు జరిపారు. బీఆర్ఎస్ ఎంపీలు రంజిత్‌రెడ్డి, వెంకటేశ్ నేత, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్‌లు శేజల్, ఆదినారాయణలతో సుదీర్ఘంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ చర్చల్లో ప్రభుత్వ భూమి కొనుగోలు చేసిన డబ్బులు వాపస్, తమపై ఉన్న కేసుల ఎత్తివేత, ఎమ్మెల్యే చిన్నయ్యపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిసింది. ఇందుకు తప్పు చేసిన వారిపై పార్టీలో క్రమశిక్షణ చర్యలుంటాయని, అలాగే ఆమెకు న్యాయం చేస్తామని నాయకులు హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఇది కూడా చదవండి: దుర్గం చిన్నయ్యకు షాక్! -
ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై సీబీఐకి ఫిర్యాదు చేసిన శేజల్
-
ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై సీబీఐకి ఫిర్యాదు చేసిన శేజల్
ఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను లైంగికంగా వేధించాడంటూ ఆరోపణలు చేసిన శేజల్ అనే యువతి.. ఈసారి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐని ఆశ్రయించింది. దుర్గం చిన్నయ్యపై ఫిర్యాదు చేసినా తెలంగాణ పోలీసులు పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ సీబీఐకి ఫిర్యాదు చేసింది. ఇప్పటికైనా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై కేసు నమోదు చేయాలని సీబీఐని కోరింది. ఇటీవల దుర్గం చిన్నయ్య తనను లైంగికంగా వేధించాడంలూ జాతీయ మహిళా కమిషన్‌కు సైతం శేజల్ ఫిర్యాదు చేసింది. అయితే రోజుల వ్యవధిలోనే సీబీఐని ఆశ్రయించిన ఆమె.. తెలంగాణ పోలీసులు తన ఫిర్యాదును పట్టించుకోవట్లేదని తెలిపింది. ఇటీవల జాతీయ మహిళా కమిషన్‌కు సైతం ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో, జాతీయ మహిళా కమిషన్ స్పందిస్తూ తెలంగాణ డీజీపీకి లేఖ రాసింది. ఈ క్రమంలో శేజల్ ఫిర్యాదుపై విచారణ జరపాలని ఆదేశించింది. లైంగిక ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని లేఖలో ఆదేశించింది. ఇక, 15 రోజుల్లో దీనిపై అప్డేట్ ఇవ్వాలని కమిషన్ లేఖలో పేర్కొంది. కాగా, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని శేజల్ అనే యువతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎమ్మెల్యే వేధింపులకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఇప్పటికే పేర్కొంది. అందుకు సంబంధించిన ఓ వీడియో, ఫొటోను శేజల్ విడుదల చేసింది. దుర్గం చిన్నయ్యపై ఆరోపణలు.. వీడియో, ఫొటో రిలీజ్ చేసిన శేజల్ దుర్గం చిన్నయ్యకు షాక్!.. డీజీపీకి మహిళా కమిషన్ లేఖ -
మే 7న జరగాల్సిన WFI ఎన్నికలు వాయిదా
-
ప్రేమించి పెళ్లి.. కానిస్టేబుల్ భర్త వేధింపులు భరించలేక
సాక్షి, మలక్‌పేట: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త (కానిస్టేబుల్) పెట్టే వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు.. సికింద్రాబాద్‌కు చెందిన శ్రీనివాస్ కుమార్తె పవిత్ర(27), తిరుమలగిరిలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న అవినాష్ 2016 జూన్ 6న ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం మలక్‌పేటలోని బి–బ్లాక్ క్వార్టర్స్‌లో నివాసముంటున్నారు. వారికి ఓ కూతురు అవిక్షిత (5) ఉంది. అయితే కూతురు పుట్టినప్పటినుంచీ అవినాష్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. తాగుడుకు బానిసై అదనపు కట్నం కోసం భార్యను వేధించసాగాడు. మద్యం మత్తులో పవిత్రను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు. ఈ విషయమై మహిళా పోలీసుల వద్ద అతనికి కౌన్సిలింగ్ కూడా ఇప్పించారు. అయినా అతని ప్రవర్తన మారలేదు. ప్రవర్తన మార్చుకుంటానని, మద్యం మానేస్తానని మామ శ్రీనివాస్‌కు చెప్పగా.. కారు కొనుకోవడానికి రూ.2 లక్షలు ఇచ్చాడు. ఇదిలా ఉండగా.. సోమవారం ఉదయం అవినాష్ డ్యూటీకి వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. సాయంత్రం 4.30 గంటలకు అత్త రేణుకకు ఫోన్‌చేసి అరగంట నుంచి తనతో పవిత్ర గొడవ పడుతోందని చెప్పాడు. సాయంత్రం మామకు ఫోన్ చేసి పవిత్ర చీరతో ఉరేసుకుని చనిపోయిందని చెప్పాడు. అల్లుడు అవినాష్ అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేయడంతోనే తన కూతురు చనిపోయిందని మృతురాలు తండ్రి శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి పోలీసులు అవినాష్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
మొదటి పెళ్లి విషయం దాచి, ప్రేమిస్తున్నానన్నాడు.. మతం మార్చుకొని
సాక్షి, కరీంనగర్: ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు.. నువ్వు లేకుంటే బతకనన్నాడు.. నీకోసం మతం కూడా మార్చుకుంటానని నమ్మించాడు.. దీంతో అతని మాటలు నమ్మిన ఆమె.. ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వ్యక్తితో తల్లిదండ్రులు వివాహం నిశ్చయించినా వద్దని బంగారం, నగదు తీసుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.. చివరకు సర్వం కోల్పోయి.. మోసం చేసిన వ్యక్తి జాడ కోసం వెతుకుతూ కరీంనగర్ వచ్చింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. బాధితురాలి వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన దుర్గారెడ్డి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేసేది. ఆ సమయంలో అక్కడే ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో పని చేస్తున్న కరీంనగర్‌కు చెందిన ఎండీ.ఫారూఖ్ అలీతో పరిచయం ఏర్పడింది. దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకున్న అతను తనకు అప్పటికే పెళ్లయిన విషయాన్ని దాచాడు. ప్రేమిస్తున్నానని ఆమెను నమ్మించాడు. పెళ్లి చేసుకోకుంటే చనిపోతానని చెప్పాడు. అయోమయంలో ఉన్న దుర్గారెడ్డికి అప్పటికే ఇంట్లో పెళ్లి సంబంధం చూశారు. ప్రభుత్వ ఉద్యోగం చేసే వ్యక్తి పెళ్లి చేసుకుంటానని వచ్చినా కాదని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఫారూఖ్ మతం మార్చుకోవడంతో పెళ్లి చేసుకుంది. తర్వాత దుర్గ తెచ్చిన డబ్బులు అయిపోయాయి. ఆ సమయంలో దుర్గ వద్దకు వచ్చిన ఆమె అమ్మమ్మ రూ.3 లక్షలు ఇచ్చింది. వాటిని కూడా ఫారూఖ్ సొంతానికి వాడుకున్నాడు. తన చెల్లెలికి కరోనా వచ్చి, ఆరోగ్య పరిస్థితి బాగోలేదని దుర్గ నగలు తాకట్టుపెట్టి, డబ్బు తీసుకున్నాడు. ఈ క్రమంలో ఫారూఖ్‌కు పెళ్లయిన విషయం బయటపడింది. పిల్లలు కూడా ఉన్నట్లు తెలియడంతో నిలదీ సింది. అయిపోయిందేదే అయిపోయింది.. అందరం కలిసి ఉందామన్నాడు. ఆమె సర్దుకుపోయింది. నిరసన తెలుపుతున్న దుర్గ మొదటి భార్యతో కలిసి వేధింపులు.. ఫారూఖ్‌తోపాటు అతని మొదటి భార్య దుర్గను వేధించడం మొదలు పెట్టారు. తాను పని చేస్తున్న కంపెనీని కూడా అతను మోసం చేయడాన్ని గమనించిన దుర్గారెడ్డి యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. దీంతో ఆ కంపెనీవారు ఫారూఖ్‌పై దాడి చేశారు. దీంతో కోపం పెంచుకున్న భర్త, అతని మొదటి భార్య పలుమార్లు ఆమెపై దాడి చేశారు. వేధింపులు భరించలేక బాధితురాలు హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించింది. కానీ వారు పెద్దగా పట్టించుకోక పోవడంతో ఫారూఖ్ మరింత రెచ్చిపోయాడు. దుర్గను వదిలేసి, మొదటి భార్య, పిల్లలతోనే ఉంటున్నాడు. అలుగునూర్‌లో ఉంటున్నట్లు తెలుసుకొని.. ఫారూఖ్ ఇటీవల కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని అలుగునూర్‌కు వచ్చి, ఇల్లు నిర్మించుకొని ఉంటున్నట్లు దుర్గ తెలుసుకుంది. అతడి కోసం కరీంనగర్ వచ్చింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. మంగళవారం అతని ఇంటి ఎదుట నిరసన తెలిపింది. బీజేపీ, వీహెచ్‌పీ నాయకులు ఆమెకు మద్దతుగా నిలిచారు. అనంతరం బాధితురాలు ఎల్ఎండీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. చదవండి: మారేడుపల్లి ఎస్సైపై కత్తితో దాడి.. ఆసుపత్రికి తరలింపు -
యువతికి వేధింపులు.. పోకిరీని వాహనంతో సహా ఫోటో తీసి..
సాక్షి, హైదరాబాద్: బాధితురాళ్ల భయమే పోకిరీలకు అవకాశంగా మారుతోంది. ఫిర్యాదు చేయడానికి, ఆధారాలు అందించడానికి అనేక మంది వెనుకడుగు వేయడంతోనే పదేపదే వేధింపుల బారినపడుతున్నారు. నగరానికి చెందిన ఓ యువతి తనను వేధించిన పోకిరీని అతడి వాహనంతో సహా ఫొటో తీయడమే కాకుండా షీ–టీమ్స్ మెట్లు ఎక్కింది. వాహనం నంబర్ ఆధారంగా అతడిని పట్టుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం గురువారం అతడికి ఐదు రోజుల జైలు శిక్ష విధించింది. ఓ మహిళ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో పని చేస్తోంది. ఆమె విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో ఓ వ్యక్తి బైక్‌పై వెంట పడటంతో పాటు అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. రెండుసార్లు ఇలా చేయడంతో పాటు ఈ నెల 16న బంజారాహిల్స్ రోడ్ నం.12లోని లక్ష్మీనర్సింహ్మ స్వామి దేవాలయం వద్దా ఆమెను వేధించాడు. దీంతో ధైర్యం చేసిన బాధితురాలు పోకిరీతో పాటు అతడి వాహనాన్నీ ఫొటో తీసింది. షీ–టీమ్స్‌కు ఫిర్యాదు చేసి తన వద్ద ఉన్న ఫొటోను చూపించింది. వెంటనే స్పందించిన అధికారులు ఆ ఫొటోలో ఉన్న వాహనం నంబర్ ఆధారంగా అతడిని పట్టుకున్నారు. విచారణ నేపథ్యంలో అతడు బంజారాహిల్స్‌కు చెందిన ప్రైవేట్ ఉద్యోగి జి.నగేష్‌గా తేలింది. వెయిట్ లాస్ టెక్నిక్స్ పేరుతో ఆమెతో పరిచయం పెంచుకుని, స్నేహం చేయడానికి ప్రయత్నించాడని విచారణ లో తేలింది. నగేష్‌ను షీ–టీమ్స్ కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం ఐదు రోజుల జైలు శిక్ష విధించినట్లు అదన పు సీపీ (నేరాలు) ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. ప్రతి బాధితురాలు ఇలా ధైర్యం చేసి ముందుకు వస్తే పోకిరీలకు చెక్ పడుతుందని, ఫలితంగా వారితో పాటు మరికొందరూ వీరి బారినపడకుండా ఉంటారని అధికారులు చెప్తున్నారు. చదవండి: చక్రబంధంలో లింగంపల్లి.. చౌరస్తా మొత్తానికి ఒకే ఒక్కడు మరో ముగ్గురికీ జైలు శిక్ష బన్సీలాల్‌పేట్: మద్యం మత్తులో మహిళల పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించిన, స్థానికంగా న్యూసెన్స్ చేసిన మరో ముగ్గురికి గురువారం జైలు శిక్ష పడింది. వీరిలో ఒకరికి 112 రోజుల జైలు విధించడం గమనార్హం. భోలక్‌పూర్ ప్రాంతానికి చెందిన మణికంఠ, భువనేశ్వర్ మద్యం మత్తులో ఆటోలో వెళ్తున్న మహిళలను వేధిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పొట్టి శ్రీరాములు నగర్ వాసి భరత్ ఎలియాస్ భల్లుపై రౌడీషీట్ ఉంది. ఇతగాడు స్థానికంగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద ఎప్పుడు పడితే అప్పుడు మద్యం మత్తులో హంగామా చేస్తున్నాడు. ఇటీవల ఓ మహిళతో దురుసుగా ప్రవర్తించాడు. బాధితురాలి ఫిర్యాదుతో గాంధీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. ఇతగాడు విధి నిర్వహణలో ఉన్న పోలీసులతోనూ దురుసుగా ప్రవర్తించాడు. ఈ ముగ్గురినీ పోలీసులు గురువారం కోర్టులో హాజరుపరిచారు. వీరిపై దాఖలు చేసిన చార్జ్షీట్లు పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం భరత్‌కు 112 రోజులు, మణికంఠకు 37 రోజులు, భువనేశ్వర్‌కు 19 రోజుల జైలు శిక్ష విధించింది. -
ఆన్లైన్ లోన్ యాప్ వేధింపులతో యువకుడి ఆత్మహత్య
సాక్షి, జియాగూడ: ఆన్లైన్ యాప్‌లలో యువత రుణాలు తీసుకొని తిరిగి చెల్లించలేని పరిస్థితుల్లో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. లోన్లు తీసుకునే సమయంలో ఇచ్చే రెఫరెన్స్ నంబర్లకు మెసేజ్‌లు పెడుతుండటంతో అవమాన భారం భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. జియాగూడ న్యూ గంగానగర్‌లోని రాజ్‌కుమార్ యాదవ్(22) ప్రముఖ కార్ల కంపెనీలో డ్రైవర్ కమ్ డెలివరి బాయ్. దాంతోపాటు జియాగూడ మేకలమండిలో చిరు వ్యాపారం చేసుకుంటున్నాడు. ఇటీవల ఆన్లైన్ లోన్ యాప్‌లో రూ.12 వేల రుణం పొందినట్లు బంధువులు తెలిపారు. బకాయిలు చెల్లించలేదని లోన్ యాప్ నిర్వహకులు తీవ్రంగా ఇబ్బంది పెట్టడంతో పాటు స్నేహితులకు మెసేజ్‌లు పెడుతున్నారు. దీంతో మనోవేదనకు గురైన రాజ్‌కుమార్ యాదవ్ ఆదివారం తెల్లవారు జామున ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆరేళ్ల క్రితం వివాహం.. రూ. 10 లక్షలు కట్నం తేవాలని..
సాక్షి, మహబూబాబాద్ (వరంగల్): వరకట్న వేధింపులు, సూటిపోటి మాటలు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. మానుకోట జిల్లా కేంద్రంలో శనివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన గందె శ్రీనివాస్ – కళావతి దంపతుల పెద్ద కుమార్తె అనూష(26)ను మహబూబాబాద్‌కు చెందిన భూముల వెంకన్న– వెంకటమ్మ రెండో కుమారుడు రవిచందర్‌కు ఇచ్చి ఆరేళ్ల క్రితం వివాహం జరిపించారు. వివాహ సమయంలో ఆరు తులాల బంగారం, రూ.10 లక్షల నగదు కట్నం రూపంలో ఇచ్చారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా, బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే రవిచందర్ కరోనా కారణంగా ఇంటి వద్ద నుంచే వర్క్ ఫ్రం హోమ్ పనిచేస్తున్నాడు. ఇద్దరు కుమార్తెలే కావడంతో మరో రూ.10 లక్షల అదనపు కట్నంతేవాలని రవిచందర్ భార్య అనూషను వేధించడంతోపాటు సూటిపోటి మాటలతో మనోవేధనకు గురిచేశాడు. దీంతో మనస్తాపానికి గురైన అనూష ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేమాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించగా తహసీల్దార్ ఎం.రంజిత్‌కుమార్, సీఐ రవికుమార్ వివరాలు సేకరించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ ఇన్చార్జ్ సీఐ రవికుమార్ తెలిపారు. -
‘దెయ్యాల గుంపు వేధిస్తుంది.. నన్ను కాపాడండి సార్’
గాంధీనగర్: దెయ్యాలున్నాయో, లేవే తెలియదు కానీ.. వాటికి సంబంధించిన వార్తల మీద జనాలకు ఎంతో ఆసక్తి. దెయ్యాలను వదిలించే బాబాలకు మన సమాజంలో ఫుల్ డిమాండ్. ఇప్పుడు ఈ దెయ్యాల గొడవ ఎందుకంటే తాజాగా గుజరాత్లో ఓ వింత సంఘటన వెలుగు చూసింది. దెయ్యాల గుంపు తనను వేధిస్తుందని.. వాటి నుంచి తన ప్రాణాలు కాపాడిల్సిందిగా ఓ వ్యక్తి ఏకంగా పోలీసులను ఆశ్రయించాడు. వింత ఫిర్యాదు చూసి పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. ఆ వివరాలు.. గుజరాత్ పంచమహల్ జిల్లా జంబుఘోడ తాలుగా హమ్లెట్ గ్రామానికి చెందిన వర్సంగ్‌భాయ్ బరియా(35) అనే వ్యక్తి మంగళవారం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఓ దెయ్యాల గుంపు తనను వేధిస్తుందని.. ప్రశాంతంగా ఉడనివ్వడం లేదని తెలిపాడు. మరీ ముఖ్యంగా ఆ గ్రూపులోని రెండు దెయ్యాలు తనను చంపుతామని బెదిరిస్తున్నాయని వాపోయాడు. ఎలాగైనా తన ప్రాణం కాపాడాల్సిందిగా పోలీసులను అభ్యర్థించాడు. బరియా మాటలు, వాలకం చూసిన పోలీసులకు కాస్త తేడా కొట్టింది. దాంతో అతడిని పక్కకు కూర్చోబెట్టి.. కుటుంబ సభ్యులను పిలిచి విచారించారు. ఈ క్రమంలో బరియా మానసిక పరిస్థితి సరిగా లేదని.. గతేడాది నుంచి చికిత్స తీసుకుంటున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. గత పది రోజులగా మందులు తీసుకోవడం మానేశాడని.. అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాడని పోలీసులకు వెల్లడించారు. ఇక బరియా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. అతడికి వైద్యం అందిచాల్సిందిగా సూచించారు. చదవండి: వైరల్: ఈమె మనిషా.. దెయ్యామా?! -
కరోనా కష్టకాలంలో వృద్ధులపై పెరిగిన వేధింపులు
-
కట్టు తప్పాడని.. కడతేర్చిన తల్లి..ఇంటి ఆవరణలోనే...!
కొత్తకోట రూరల్: కొడుకు మద్యానికి బానిసై చెడు తిరుగుళ్లు తిరుగుతూ తాగొచ్చి కొట్టి.. లైంగికంగా వేధిస్తుండటంతో భరించలేని తల్లి అతడిని తుదముట్టించింది. హత్య చేశాక ఇంటి ఆవరణలోనే మృతదేహాన్ని పూడ్చిపెట్టింది. వనపర్తి జిల్లాలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. కొత్తకోట మండలం రామకృష్ణాపురానికి చెందిన హరిజన్ నాగమ్మకు 25 ఏళ్ల క్రితం పామాపురం వాసి శాంతన్నతో వివాహమైంది. వీరికి కుమారుడు శివ (25), కూతురు అంజలి ఉన్నారు. కొన్నేళ్ల క్రితమే భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో నాగమ్మ తన ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి వచ్చేసింది. తల్లి బుచ్చమ్మ వద్ద ఉంటూ కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. కూతురు అంజలికి వివాహం చేసి అత్తారింటికి పంపింది. కుమారుడు శివ ట్రాక్టర్ డ్రైవర్‌గా, హమాలీగా పనిచేస్తున్నాడు. అయితే శివ ఇటీవల మద్యానికి బానిసై పనికి సరిగా వెళ్లడం లేదు. తరచూ తల్లిని, అమ్మమ్మను దూషించడంతో పాటు కొడుతుండేవాడు. అలాగే తల్లిని లైంగికంగానూ వేధించసాగాడు. దీంతో అతడి ప్రవర్తనకు తట్టుకోలేక ఎలాగైనా అంతమొందించాలని నాగమ్మ, బుచ్చమ్మ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 16వ తేదీన రాత్రి గాఢ నిద్రలో ఉన్న శివను తాడుతో కాళ్లు, చేతులు కట్టేసి.. తర్వాత పక్కనే ఉన్న చెట్టుకు కట్టి కత్తితో పొడిచి చంపేశారు. బయట పడిందిలా.. ప్రస్తుతం గ్రామంలో ధాన్యం కొనుగోలు జోరుగా సాగుతోంది. శివ ఐదు రోజులుగా పనికి రాకపోవడంతో ఈనెల 21వ తేదీన సాయంత్రం తోటి హమాలీలు ఇంటికి వెళ్లి ఏమైందని తల్లి నాగమ్మను అడగ్గా ఆమె తడబడుతూ సమాధానం చెప్పింది. చివరకు 22న సర్పంచ్ లతకు అసలు విషయం చెప్పింది. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వగా వనపర్తి డీఎస్పీ కిరణ్‌కుమార్, ఇన్చార్జి సీఐ సీతయ్య, ఎస్ఐ నాగశేఖర్‌రెడ్డి ఆదివారం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. నాగమ్మ, బుచ్చమ్మలను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. సోమవారం ఉదయం డాక్టర్, తహసీల్దార్ సమక్షంలో శివ మృతదేహాన్ని వెలికితీస్తామని తెలిపారు. కాగా, ఈ హత్యలో మరికొందరి పాత్ర ఉండవచ్చని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
మహిళా సమస్యలపై పోరాడుతున్న యువతికి వేధింపులు..
సాక్షి, బంజారాహిల్స్: సోషల్ మీడియాలో మహిళల సమస్యలపై పోరాడుతున్న యువతిని వేధింపులకు గురి చేస్తున్న వ్యక్తులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బంజారాహిల్స్ రోడ్ నెం.14లోని నందినగర్‌లో నివాసముంటున్న యువతి(31) బ్యూటీషియన్‌గా పని చేస్తుంది. మహిళలపై జరుగుతున్న వేధింపులను తన ఫేస్బుక్ పేజీ ద్వారా వెలుగులోకి తీసుకొస్తుంటుంది. ఈ క్రమంలో ఫేస్బుక్ ద్వారా మల్లికార్జున్ రెడ్డి అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. తరచూ ఫోన్లు చేసి అసభ్యకరంగా మాట్లాడటంతో పాటు అశ్లీల ఫొటోలను పంపిస్తున్నారు. అతడితో పాటు కెరాటాల రాజేశ్వరి, తాళ్ల శివారెడ్డి, స్నేహారెడ్డి తదితరులు కూడా ఇదే విధంగా అసభ్యంగా మాట్లాడుతూ అశ్లీల ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేస్తూ తన పేరుతో ఫేక్ అకౌంట్‌ను నిర్వహిస్తున్నారని బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితులపై బంజారాహిల్స్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 354(ఏ), 66(డి), 67ఆఫ్ ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అల్లుడిని చెట్టుకు కట్టేసి చితక్కొట్టారు!
సాక్షి, పాలకుర్తి(ములుగు): భార్యాభర్తల మధ్య జరిగిన ఘర్షణ చివరకు భర్తకు దేహశుద్ధి చేయించే వరకు వెళ్లింది. ఎస్సై గండ్రాతి సతీష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జనగామ జిల్లా పాలకుర్తి మండలం మల్లంపల్లి గ్రామానికి చెందిన నీరజను వావిలాల గ్రామానికి చెందిన దొంగరి మురళికి ఇచ్చి వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యాభర్తల మధ్య తరచు గొడవలు జరుగుతుండగా.. భర్త చెడు వ్యసనాలకు అలవాటుపడి తనను పట్టించుకోకుండా వేధింపులకు గురి చేస్తున్నాడని నీరజ కేసు పెట్టింది. దీంతో మురళి జైలుకు వెళ్లి వచ్చాడు. అప్పటి నుంచి ఇరువురు విడిగా ఉంటున్నారు. ఇటీవల మురళి తల్లి మృతి చెందడంతో నీరజ వచ్చి వావిలాలలో అతడితో కలిసి ఉంటుంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. తనతో పాటు పిల్లల్ని కొట్టాడని నీరజ తిరిగి మల్లంపల్లికి వెళ్లి దాడి విషయం కుటుంబ సభ్యులకు వివరించింది. దీంతో ఆగ్రహానికి గురైన నీరజ కుటుంబ సభ్యులు వావిలాలకు వెళ్లి మురళిని మల్లంపల్లికి తీసుకువచ్చి చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. ఈ విషయమై పీఎస్‌లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. అనంతరం ఎస్సై సతీష్ ఇరువర్గాలకు కౌన్సెలింగ్ ఇచ్చి మరోసారి ఇలాంటి సంఘటన పునరావృతం కావొద్దని హెచ్చరించి పంపించారు. -
ఆడ పిల్లలు పుట్టారని భర్త వేధింపులు.. దీంతో ఆ మహిళ
సాక్షి, లింగంపేట(నిజామాబాద్): ఆడపిల్లలు పుట్టారని భర్త నిత్యం వేధిస్తుండంటంతో ఓ వివాహిత బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది.ఈ సంఘటన లింగంపేట మండలంలోని పొల్కంపేటలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన వడ్ల నాగవణి(27), సంజీవులు భార్యాభర్తలు. వీరికిపెళ్లయి 12 ఏళ్లు అవుతోంది. ఈదంపతులకుఇద్దరు ఆడపిల్లలు భవిత(11), లాస్య (ఏడాది)ఉన్నారు. సంజీవులు బతుకు దెరువు కోసం దుబాయి వెళ్లి తిరిగి వచ్చాడు. గల్ఫై నుంచి వచ్చిననాటి నుంచి ఆడపిల్లలు పుట్టారని సంజీవులు నాగమణిని వేధిస్తున్నాడు. దీంతో ఆమె ఈ విషయాన్నితన తల్లిదండ్రులకు వివరించింది. వారు వచ్చి పలుమార్లు నచ్చజేప్పారు. అయినా అతనిలోమార్పు రాలేదు. అంతేకాకుండా నాగమణి తల్లిదండ్రులను ఇంటికి రానిచ్చే వాడుకాదు. ఫోన్లో సైతం మాట్లాడవద్దని బెదిరించేవాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి నాగమణి తన తల్లితో ఫోన్ లోమాట్లాడింది. వారికి ఎందుకు ఫోన్ చేశావని సంజీవులు ఆమెతో గొడవపడ్డాడు. దీంతో మనస్తాపం చెందిన నాగమణి రాత్రి అందరు పడుకున్నాక ఇంటి నుంచి బయటకు వెళ్లింది. గురువారం ఉదయం గ్రామస్తులు వెతుకుతుండగా గ్రామ సమీపంలోని వాగులోని నీటి మడుగులో విగతజీవిగా కనిపించింది. ఆడ పిల్లలు పుట్టారని అల్లుడు వేధిస్తుండటంతోనే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని నాగమణి తల్లి వడ్ల లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
లైంగికంగా వేధించాడు: మహిళా ఐపీఎస్ ఫిర్యాదు
చెన్నై : స్పెషల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్( లా అండ్ ఆర్డర్) తనను లైంగికంగా వేధించాడంటూ తమిళనాడుకు చెందిన మహిళా ఐపీఎస్ అధికారి చేసిన ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి. వివరాల ప్రకారం..విధుల్లో ఉన్న తనపై రాజేష్ దాస్ అనే స్పెషల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ లైంగికంగా వేధించాడని, అసభ్యకరంగా ప్రవర్తించాడని మహిళా ఐపీఎస్ అధికారి ఫిర్యాదు చేసింది. ఇటీవల పలు జిల్లాల్లో ముఖ్యమంత్రి పళనిస్వామి పర్యటన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు బాధితురాలు పేర్కొంది. దీంతో పీఎం మోదీ రాష్ట్ర పర్యటనకు సంబంధించి చేపట్టిన భద్రతా సమావేశాల్లో సదరు డీజీపీని పాల్గొనకుండా సస్పెండ్ చేసినట్లు రాష్ట్ర హోం శాఖ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ ఎన్నికలు రానున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ పుదుచ్చేరి, తమిళనాడులో పర్యటించనున్నారు. మరికొన్ని వారాల్లో దీనికి సంబంధించిన షెడ్యూల్ విడుదల కానుంది. ఇక బాధితురాలి ఫిర్యాదుతో ప్రణాళిక, అభివృద్ధి శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి జయశ్రీ రఘునందన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు స్వయంగా ఓ ఐపీఎస్ అధికారి లైంగిక వేధింపులకు గురికావడం చాలా బాధకరమైన ఘటన అని ప్రతిపక్ష నేత, డిఎంకె చీఫ్ ఎంకె స్టాలిన్ విమర్శించారు. నిందితుడిని కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, ఇది చాలా సిగ్గుచేటని పేర్కొన్నారు. అదే సమయంలో ఫిర్యాదు చేసిన మహిళా ఐపీఎస్ అధికారిని ధైర్యాన్ని ఆయన ప్రశంసించారు. చదవండి : (ఎంపీ ఆత్మహత్య: 15 పేజీల లేఖ, వైరలవుతోన్న వీడియో) (పెళ్లి పేరుతో రూ.11కోట్లకు నకిలీ ఐపీఎస్ మోసం) -
లైంగిక వేధింపులు: దర్శకుడికి సమన్లు
ముంబై: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌కు ముంబైలోని వెర్సోవా పోలీసులు బుధవారం సమన్లు పంపించారు. అనురాగ్ కశ్యప్ తనను లైంగికంగా వేధించారని నటి పాయల్ ఘోష్ ఆరోపించిన విషయం తెలిసిందే. మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి మీటూ ఉద్యమం తరువాత అనురాగ్ కశ్యప్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే తనకు న్యాయం చేయాలంటూ పాయల్ ప్రధాని నరేంద్ర మోదీని కోరిన విషయం తెలిసిందే. పాయల్ ఘోష్ ఫిర్యాదు మేరకు ముంబైలోని వెర్సోవా పోలీస్ స్టేషన్లో పోలీసులు అనురాగ్‌పై కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా రేపు (గురువారం) ఉదయం 11 గంటలకు పోలీసు స్టేషన్లో అనురాగ్ కశ్యప్ హాజరు కావాలని సమన్లలో పోలీసులు పేర్కొన్నారు. చదవండి: (రూపా దత్తా లైంగిక ఆరోపణలు : నిజమేనా?) ఇప్పటికే అనురాగ్‌పై ఐపీసీ సెక్షన్లు 376(ఐ), 354, 341, 342 సెక్షన్ల కింద కేసు నమోదయ్యింది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరింత లోతుగా విచారణ చేయడానికి అనురాగ్‌కు బుధవారం సమన్లు పంపించినట్లు తెలుస్తోంది. ఇక 2013లో వెర్సోవాలోని యారి రోడ్డులో కశ్యప్ తనపై అత్యాచారం చేశారని ఇటీవల నటి పాయల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏడేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనపై విచారణలో భాగంగా అనురాగ్ కశ్యప్‌ను పోలీసులు విచారణ జరపనున్నారు. చదవండి: (అనురాగ్ కశ్యప్‌పై కేసు నమోదు)