అప్పు చెల్లించలేక భర్త పరారీ: భార్య నిర్బంధం | wife harrased by financiar after her husband escaped | Sakshi
Sakshi News home page

అప్పు చెల్లించలేక భర్త పరారీ: భార్య నిర్బంధం

Published Sat, Nov 23 2013 8:30 PM | Last Updated on Sat, Sep 2 2017 12:54 AM

wife harrased by financiar after her husband escaped

అనంతపురం:  సమాజంలో మానవతా విలువలు నానాటికీ అంతరించిపోతున్నాయి. భర్త చేసిన అప్పు కారణంగా భార్యను నిర్బంధంలోకి తీసుకున్న ఘటన జిల్లాలోని ధర్మవరంలో కలకలం రేపింది. చేనేత కార్మికుడు శివప్ప  గతంలో రామచంద్ర అనే వ్యక్తి వద్ద రూ.లక్ష అప్పు తీసుకున్నాడు. తన అప్పు తీర్చాలని  రామచంద్ర ఒత్తిడి చేయడంతో శివప్ప పరారీ అయ్యాడు.  దీంతో ఆ చేనేత కార్మికుని భార్య లీలావతిని రామచంద్ర తన నిర్బంధంలోకి తీసుకున్నాడు. అంతటి ఆగని రామచంద్ర ఆమెను వేధింపులకు గురిచేశాడు. తన వద్ద తీసుకున్న అప్పుని  ఎలాగైనా తీర్చాలని బలవంతపెట్టడం ఆరంభించాడు. ఇక ఎటుదిక్కు తోచని ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement