సాక్షి, సంగారెడ్డి: ప్రేమ పేరుతో వేధింపుల కారణంగా బీఫార్మసీ విద్యార్థిని తేజస్వినీ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇక, విద్యార్ధిని ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.
వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా గుమ్మదిదల మండలం దోమడుగు గ్రామానికి చెందిన తేజస్వినీ బీఫార్మసీ చదువుతోంది. ఈ క్రమంలో ఓ యువకుడు ఇన్స్‌స్టాగ్రామ్ వేదికలో ప్రేమ పేరుతో ఆమెను వేధింపులకు గురి చేశాడు. దీంతో.. అతడి వేధింపులు భరించలేక తేజస్వినీ ఆత్మహత్య చేసుకుంది. తన ఇంటివద్ద నాలుగో అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది.
ఈ క్రమంలో.. తల్లిదండ్రులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. దీంతో, ఆసుపత్రికి చేరుకునేలోపే తేజస్వినీ మృతి చెందింది. అయితే, తనను ప్రేమించాలంటూ అదే గ్రామానికి చెందిన యువకుడు అతని స్నేహితులతో కలిసి తరచూ ఆమెను వేధింపులకు గురిచేసినట్టు తేజస్వినీ పేరెంట్స్ చెప్పారు. దీంతో, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment