tejaswini
-
దిల్ రాజు, ఆయన సోదరుడు, కుమార్తె నివాసాల్లో ఐటీ సోదాలు
-
రాజేంద్రప్రసాద్ మనవరాలి చిత్రం.. రిలీజ్ ఎప్పుడంటే?
సుమన్ బాబు స్వీయ దర్శకత్వంలో వస్తోన్న చిత్రం "ఎర్రచీర - ది బిగినింగ్". ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని నటిస్తోంది. మదర్ సెంటిమెంట్, హార్రర్, యాక్షన్ కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ పద్మాలయా ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా బిజినెస్ షో వేశారు. ఈ సినిమా చూసిన డిస్ట్రిబ్యూటర్లందరూ సినిమా అద్భుతంగా ఉందని అన్నారు.అయితే ఈ మూవీని వచ్చే శివరాత్రికి థియేట్రికల్ రిలీజ్‌కు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో డివోషనల్ టచ్ ఉండడంతో ఇప్పుడు రిలీజ్ చేయడం మంచిది కాదని భావిస్తున్నారు. దీంతో వచ్చే ఏడాది శివరాత్రి సందర్భంగా అంటే ఫిబ్రవరి 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.ఈ సందర్భంగా దర్శకుడు సుమన్ బాబు మాట్లాడుతూ..'సినిమా చూసిన వారందరూ అద్భుతంగా ఉందని కొనియాడారని అన్నారు. సినిమా ఆలస్యం కావచ్చు.. కానీ కంటెంట్ మాత్రం కంటెంట్ అద్భుతంగా ఉందని చూసినవారు చెప్పారు' అని అన్నారు. ఈ చిత్రంలో శ్రీరామ్, కమల్ కామరాజు, కారుణ్య చౌదరి, అయ్యప్ప పి శర్మ , సురేష్ కొండేటి, రఘుబాబు కీలక పాత్రలు పోషించారు. కాగా.. ఈ చిత్రానికి ప్రమోద్ పులిగార్ల సంగీతమందిస్తున్నారు. -
బుల్లితెర భామ తేజస్విని గౌడ స్మైలీ లుక్స్.. ఫోటోలు
-
క్యూట్‌గా మెరిసిపోతున్న 'బిగ్ బాస్' ఫేమ్ అమర్ దీప్ సతీమణి తేజశ్విని (ఫోటోలు)
-
సోషల్ మీడియాలో వేధింపులు.. తేజస్వినీ ఆత్మహత్య
సాక్షి, సంగారెడ్డి: ప్రేమ పేరుతో వేధింపుల కారణంగా బీఫార్మసీ విద్యార్థిని తేజస్వినీ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇక, విద్యార్ధిని ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా గుమ్మదిదల మండలం దోమడుగు గ్రామానికి చెందిన తేజస్వినీ బీఫార్మసీ చదువుతోంది. ఈ క్రమంలో ఓ యువకుడు ఇన్స్‌స్టాగ్రామ్ వేదికలో ప్రేమ పేరుతో ఆమెను వేధింపులకు గురి చేశాడు. దీంతో.. అతడి వేధింపులు భరించలేక తేజస్వినీ ఆత్మహత్య చేసుకుంది. తన ఇంటివద్ద నాలుగో అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది.ఈ క్రమంలో.. తల్లిదండ్రులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. దీంతో, ఆసుపత్రికి చేరుకునేలోపే తేజస్వినీ మృతి చెందింది. అయితే, తనను ప్రేమించాలంటూ అదే గ్రామానికి చెందిన యువకుడు అతని స్నేహితులతో కలిసి తరచూ ఆమెను వేధింపులకు గురిచేసినట్టు తేజస్వినీ పేరెంట్స్ చెప్పారు. దీంతో, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
Tejaswini Gowda: తేజు అందాన్ని రెట్టింపు చేసేది ఆ నవ్వే! (ఫోటోలు)
-
Tejaswini Gowda: సీతామహాలక్ష్మిలా మురిపిస్తోన్న బుల్లితెర నటి (ఫోటోలు)
-
చీరలో కుందనపు బొమ్మలా సీరియల్ బ్యూటీ తేజస్విని (ఫొటోలు)
-
సతీమణితో దిల్ రాజు.. నెట్టింట ఫోటోలు వైరల్
-
కొత్త కారు కొన్న అమర్ దీప్, తేజస్విని.. ధర ఎంతో తెలుసా?
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అమర్దీప్ చౌదరి మెగాస్టార్ లెక్క.. సీరియల్స్ ద్వారా తెలుగు ఆడియెన్స్‌కు బాగా చేరువైన అమర్ ఆ గుర్తింపుతో బిగ్‌బాస్ సీజన్ 7లోకి ఎంట్రీ ఇవ్వడం. ఆపై రన్నర్‌గా నిలిచాడు. ఇక సీరియల్ నటి, కన్నడ బ్యూటీ అయిన తేజస్వని గౌడను ఆమర్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అలా ఇద్దరూ సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.బిగ్ బాస్ తర్వాత అమర్ జీవితమే మారిపోయిందని చెప్పవచ్చు. పలు సినిమా ఛాన్స్‌లతో పాటు సీరియల్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే సురేఖా వాణి కూతురు సుప్రితతో అమర్ ఒక సినిమాలో నటిస్తున్నాడు. షూటింగ్ కార్యక్రమాలు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో తాజాగా తన అభిమాన హీరో రవితేజతో కూడా సినిమా ఛాన్స్ దక్కించుకున్నాడు.అయితే, అమర్ దీప్, తేజస్విని తాజాగా కొత్త కారు కొన్నారు. బ్లాక్ కలర్లో ఉన్న టాటా సఫారి కారును వారు కొన్నారు. దీని ధర రూ. 25 లక్షలకు పైగానే ఉండవచ్చని తెలుస్తోంది. కారు ముందు తేజస్విని తన స్నేహితులతో సందడి చేసింది. అమర్‌తో కలిసి వారందరు దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Tejaswini Gowda (@_tejaswini_gowda_official) -
లంగా ఓణీలో తేజస్విని గౌడ.. ఇంత అందంగా ఉందేంటి! (ఫొటోలు)
-
Tejaswini Gowda: సముద్రతీరాన ఏంజెల్లా తేజస్విని (ఫోటోలు)
-
Tejaswini Gowda: ఉగాది సెలబ్రేషన్స్.. క్యూట్ పిక్స్‌తో సీరియల్ బ్యూటీ తేజస్విని సెన్సేషన్ (ఫోటోలు)
-
ఆ సమస్యతో బాధపడుతున్న అమర్.. లోపల ట్రీట్మెంట్ లేదు!
బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్లో పల్లవి ప్రశాంత్, అమర్దీప్ చౌదరి టైటిల్ రేసులో ఉన్నారు. మొదటి నుంచీ ఏ ముసుగు వేసుకోకుండా మాట్లాడుతున్నాడు అమర్. అయితే తను చేసే తింగరి పనుల వల్ల సోషల్ మీడియాలో ఎక్కువ ట్రోల్ అవుతుంటాడు. ఇక హౌస్‌లో శివాజీ మొదటి నుంచీ అమర్‌ను టార్గెట్ చేస్తూ అతడిని చులకన చేస్తూ మాట్లాడుతూ వచ్చాడు. ఈ వైఖరిని తాను కూడా సహించలేకపోయానంటోంది అమర్ భార్య, నటి తేజస్విని. హౌస్‌లో అడుగుపెట్టాక అంతా మర్చిపోయా తాజాగా తేజస్విని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'కొన్ని విషయాల్లో శివాజీ ప్రవర్తన వల్ల నేను బాధపడ్డాను. ఎందుకలా మాట్లాడుతున్నారు అనుకునేదాన్ని. బహుశా అమర్ టఫ్ కాంపిటీషన్ ఇస్తాడనుకున్నారేమో, అందుకే తనతో అలా ప్రవర్తించారేమో! నేను బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లినప్పుడు చాలా అనుకున్నాను, ఎన్నో చెప్పాలనుకున్నాను. కానీ హౌస్‌లోకి వెళ్లాక ఏదీ గుర్తులేదు. అమర్ తప్ప ఎవరూ కనిపించలేదు. తనే అందరినీ పరిచయం చేశాడు. అమర్‌కు శివాజీ అంటే ప్రత్యేక గౌరవం ఉంది. అందుకే నన్ను ఆయన దగ్గరకు తీసుకెళ్లాడు, ఆశీర్వాదం తీసుకున్నాం. ఆ సమస్యతో అమర్‌కు ఫిజియోథెరపీ అమర్‌కు అనారోగ్యసమస్యలు ఉన్నాయి. బిగ్‌బాస్ షోలోకి వెళ్లేముందు కూడా తనకు విపరీతమైన బ్యాక్‌పెయిన్ ఉంది. హౌస్‌లోకి వెళ్లే ఒకరోజు ముందు కూడా అతడికి ఫిజియోథెరపీ జరిగింది. నీతోనే డ్యాన్స్ షో ఫినాలే రోజు పెయిన్ కిల్లర్స్ ఇంజక్షన్స్ వేయించుకున్నాడు. అంత నొప్పి అనుభవిస్తూనే షోకి వెళ్లాడు. ఇప్పటికీ అతడు నొప్పి అనుభవిస్తున్నాడు. హౌస్‌లో తనకు వెన్ను నొప్పి ఉన్న విషయాన్ని బయటకు చెప్పడం లేదు. ఏ ట్రీట్మెంట్ తీసుకోవడం లేదు. దెబ్బ తగిలితే ఫ్రాక్చర్.. ఎక్కడ సింపతీ అనుకుంటారోనని తన అనారోగ్య సమస్యను ఎవరికీ చెప్పట్లేదని నాకు చెప్పాడు. తనకు నొప్పి తగ్గడానికి డాక్టర్ రాసిచ్చిన క్రీమ్ పంపిస్తూనే ఉన్నాను. అమర్ రోజూ అది రాసుకునే పడుకుంటున్నాడు. తనకు కండరాల బలహీనత కూడా ఉంది. దీనివల్ల ఏదైనా దెబ్బ తగిలితే అక్కడ ఫ్రాక్చర్ అవుతుందని డాక్టర్ చెప్పారు. అయినా సరే ఏమీ లెక్క చేయకుండా అమర్ బిగ్‌బాస్ షోకి వెళ్లాడు. అందుకే మొదట్లో టాస్కులు పెద్దగా ఆడలేకపోయాడు. కానీ తర్వాత ఏదైతే అదైందని ఆడుతూ పోయాడు' అని చెప్పుకొచ్చింది తేజస్విని. చదవండి: స్టార్ హీరోయిన్ మాజీ భర్తతో నాలుగేళ్లుగా డేటింగ్.. బ్రేకప్‌కు అదే కారణమంటూ.. -
Tejaswini Gowda: అమర్దీప్ భార్య, నటి తేజస్విని బ్యూటిఫుల్ లుక్స్ (ఫోటోలు)
-
'బిగ్‌బాస్'లో అమర్‌కి అది కష్టమే.. భార్య తేజస్విని కామెంట్స్
'బిగ్‌బాస్ 7'లో అమరదీప్ ఆటపరంగా తడబడుతున్నాడు. టైటిల్ ఫేవరెట్ అనుకున్నోడు కాస్త ఎలిమినేట్ అయిపోతాడేమో అని రేంజుకి పడిపోయాడు. రైతుబిడ్డతో గొడవ తర్వాత నెగిటివిటీ ఎక్కువైపోయింది. గేమ్ పరంగా ఏ మాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు. మొన్నీమధ్య అమరదీప్ తల్లి కొడుకు గురించి మాట్లాడింది. ఇప్పుడు అతడి భార్య తేజస్విని.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అమర్ చిన్నపిల్లాడు బిగ్‌బాస్‌లోకి వెళ్లకముందు అమరదీప్-తేజస్విని కలిపి.. ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో భాగంగా అమర్ గురించి చెప్పుకొచ్చిన తేజస్విని.. అతడిది చిన్నపిల్లాడి మనస్తత్వం అని, పిల్లలు ఓసారి వింటారు, మరోసారి వినరు. వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలి. అమరదీప్‌కి కూడా ప్రతి విషయం ఇలానే చెప్పాలని తెలిపింది. (ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ఆ తెలుగు సినిమా) అమర్‌కి అది కష్టమే ఇకపోతే అమర్ టాస్కుల్లో కష్టపడతాడు కానీ మైండ్ గేమ్స్‌లో తడబడతాడని తేజస్విని చెప్పింది. బిగ్‌బాస్‌లోని కంటెస్టెంట్స్ స్ట్రాటజీలు, మైండ్ గేమ్స్ అమర్ అర్థం చేసుకుని ఆడలేడని చెప్పింది. ఎందుకంటే ఎవరేం చెప్పినా నమ్మేస్తాడని అలానే రోజంతా జరిగిన దానిలో గంట మాత్రమే అది కూడా గొడవపడిన, తప్పుగా మాట్లాడిన విషయాలే చూపిస్తారని చెప్పింది. దీనివల్ల నెగిటివిటీ ఎక్కువైపోతుందని, ఇలాంటి పరిస్థితిని అమర్ హ్యాండిల్ చేయడం కష్టమేనని తేజస్విని చెప్పుకొచ్చింది. వర్కౌట్ కాని టిప్స్ అయితే బిగ్‌బాస్‌లోకి వెళ్లే ముందు అమరదీప్‌కి తేజస్విని చాలా జాగ్రత్తలు చెప్పింది. హైపర్ కావొద్దు, అర్థం చేసుకుని మాట్లాడు, ఎవరినీ నమ్మొద్దు ఇలా చాలా చెప్పి పంపించింది. కానీ అమర్ వీటన్నింటిలోనూ తడబడ్డాడు. దీంతో టాప్-5లో ఉంటాడనుకున్నోడు కాస్త డేంజర్లో పడిపోయాడు. ఈ వారం నామినేట్ అయిన ఏడుగురిలో అమర్ కూడా ఒకడు. కానీ ఓట్లు బాగానే పడుతున్న కారణంగా అమర్ ఎలిమినేషన్ ఇప్పట్లో ఉండకపోవచ్చు అనిపిస్తుంది. (ఇదీ చదవండి: అకీరా హీరోగా ఎంట్రీ? రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్) -
Tejaswini Pandit: ఆదిపురుష్‌లో శూర్పనఖ.. రియల్ లైఫ్‌లో ఎలా ఉందంటే? (ఫొటోలు)
-
తేజస్వినిని అసలు ఎందుకు చంపాడు?
లండన్‌లో తెలుగు యువతి తేజస్విని(27) దారుణ హత్య కేసులో పురోగతి కనిపించడం లేదు. ఆమెను చంపాడన్న విషయాన్ని నిందితుడు, బ్రెజిల్‌కి చెందిన వ్యక్తి పోలీసులకు చెప్పనట్లు తెలుస్తోంది. విచారణలో అతను ఏమాత్రం సహకరించడం లేదని, అతన్ని మళ్లీ మళ్లీ ప్రశ్నించాల్సి ఉందని పోలీసులు అంటున్నారు. దీంతో ఈ కేసులో దర్యాప్తు జాప్యం కలిగేలా కనిపిస్తోంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన కొణతం తేజస్వినిరెడ్డి లండన్‌లో స్నేహితులతో పాటు కలిసి మాస్టర్స్ డిగ్రీ చేస్తోంది. తాజాగా బయటికి వెళ్లిన క్రమంలో తేజస్విని, ఆమె ఫ్రెండ్ అఖిలపై బ్రెజిల్‌కు చెందిన ఓ వ్యక్తి దాడి చేశాడు.ఈ దాడిలో తేజస్విని తీవ్రగాయాల పాలై ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచింది. ఆమె స్నేహితురాలు అఖిలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి కానీ ఆమె ప్రాణాలతో బయటపడగలిగింది. మృతదేహాన్ని రప్పించండి, ఎం.ఎస్ పూర్తి అయిన తర్వాత తేజస్వినికి మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయాలని ఆమె తండ్రి ఎంతో తపనపడ్డాడు. ఈలోపే ఘోరం జరగడం కన్నీరుమున్నీరు అవుతున్నారు. తేజస్విని మృతదేహాన్ని వీలైనంత త్వరగా ఇండియాకి పంపించాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు. -
లండన్‌లో హైదరాబాద్ యువతి హత్య
తుర్కయాంజాల్ (హైదరాబాద్)/లండన్: ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన తుర్కయాంజాల్ మున్సిపాలిటీ బ్రాహ్మణపల్లికి చెందిన తేజస్విని రెడ్డి (27) హత్యకు గురైంది. ఆమె అద్దెకు ఉంటున్న అపార్ట్మెంట్లోనే ఈ దారుణం జరిగింది. బ్రెజిల్ దేశానికి చెందిన యువకుడు కత్తితో విచక్షణా రహితంగా దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. కాగా తేజస్విని స్నేహితురాలు జనగామకు చెందిన అఖిల దాడిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలి సింది. ఆమెకు ప్రాణాపాయం లేదని సమాచారం. రాగానే పెళ్లి జరిపించాలనుకున్నారు.. బ్రాహ్మణపల్లికి చెందిన కొంతం శ్రీనివాస్‌రెడ్డి, రమాదేవిల కుమార్తె తేజస్విని మూడేళ్ల క్రితం ఎంఎస్ చదివేందుకు లండన్ వెళ్లింది. వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్ అయిన శ్రీనివాస్‌రెడ్డి పిల్లలు ఇద్దరిని ఉన్నత చదువులు చదివించాలనే ఉద్దేశంతో తేజస్వినిని లండన్‌కు, కుమారుడు పవన్‌కుమార్ రెడ్డిని ఆస్ట్రేలియా పంపించాడు. 2022 ఆగస్టులో ఒకసారి ఇంటికి వచ్చిన తేజస్విని సెప్టెంబర్‌లో తిరిగి లండన్ వెళ్లింది. గత మే నెల చివరి వారంలోనే మరోసారి ఇండియాకు తిరిగిరావాల్సి ఉండగా మరో రెండు నెలలు ఉండి వస్తానని చెప్పినట్లు తల్లిదండ్రులు తెలిపారు. కాగా తేజస్విని ప్రతిరోజూ మధ్యా హ్నం రెండు గంటల సమయంలో తల్లిదండ్రులకు ఫోన్ చేసేదని, మంగళవారం కూడా తల్లితో మాట్లాడినట్లు తెలిసింది. చదువు పూర్తి చేసుకుని ఉద్యోగంలో స్థిరపడుతున్న తేజస్వినికి ఇంటికి రాగానే పెళ్లి జరిపించాలని తల్లిదండ్రులు అనుకున్నారు. పెళ్లి సంబంధం కుదిరితే వెంటనే వస్తానని కూడా తేజ స్విని చెప్పింది. ఇంతలోనే హత్యకు గురైంది. ఇందుకు కారణాలపై లండన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం ఉదయం అందిన తేజ స్విని మరణవార్త తల్లిదండ్రులను షాక్‌కు గురిచేసింది. తల్లి రమాదేవి స్పృహతప్పి పడిపోగా, తండ్రి బోరు న విలపించాడు. హత్య ఎప్పుడు జరిగిందో తెలియదని, ఆమె మీద దాడి జరిగిందని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తొలుత తమకు సమాచా రం అందిందని శ్రీనివాస్‌రెడ్డి తెలిపాడు. సోదరి మృతి విషయం తెలుసుకున్న పవన్ కుమార్‌రెడ్డి ఆస్ట్రేలియా నుంచి నగరానికి బయలుదేరాడు. పోలీసుల అదుపులో హంతకుడు! యూకే మెట్రోపాలిటన్ పోలీసుల కథనం ప్రకారం.. లండన్ వెంబ్లీలోని నీల్డ్ క్రిసెంట్ నివాస సముదాయంలో ఈ హత్య జరిగింది. ఈ ఘటనకు సంబంధించి హంతకుడిగా అనుమానిస్తున్న 23 ఏళ్ల కెవిన్ ఆంటోనియో లారెన్సో డి మొరాయిస్తో పాటు మరో యువతిని అదుపులోకి తీసుకున్నా, తర్వాత యువతిని వదిలిపెట్టినట్లు వారు తెలిపారు. హత్యకు గురైన యువతిని అధికారికంగా గుర్తించాల్సి ఉందని, పోస్టుమార్టమ్ నివేదిక తర్వాతే వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. కత్తిపోట్లకు గురై చికిత్స పొందుతున్న మరో యువతికి ఎలాంటి ప్రాణాపాయం లేదని తేలినట్లు తెలిపారు. తేజస్విని మరణ వార్తతో తుర్కయంజాల్‌లోని శ్రీరామ్ నగర్ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తేజస్విని తల్లిదండ్రులను ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పరామర్శించారు. -
వివాహబంధంలోకి అడుగుపెట్టిన బుల్లితెర జంట.. ఫోటోలు వైరల్
ఇటీవల సినీ ప్రముఖుల పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే పలువురు హీరోయిన్స్ మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. తాజాగా ఈ లిస్ట్‌లో మరో సెలబ్రిటీ జంట వచ్చి చేరింది. తెలుగు బుల్లితెర నటుడు అమర్దీప్.. నటి తేజస్వినిని వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ సందర్భంగా కొత్త జంటకు పలువురు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఆగస్టులో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట ఇవాళ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్న వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా అమర్ దీప్.. జానకి కలనగలేదులో హీరోగా నటిస్తుండగా తేజస్వి కేరాఫ్ అనసూయ సీరియల్ చేస్తోంది. అమర్దీప్ పలు ఓటీటీ సిరీస్‌ల్లోనూ నటిస్తున్నారు. View this post on Instagram A post shared by CelebrityNews (@industrycelebritynews) -
బుల్లితెర జంట హల్దీ ఫంక్షన్, ఫోటోలు వైరల్
బుల్లితెర నటుడు అమర్దీప్ ఇంట పెళ్లి వేడుకలు షురూ అయ్యాయి. ఇటీవలే అమర్దీప్- తేజస్వినిల నిశ్చితార్థం ఘనంగా జరగ్గా అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట హల్చల్ చేశాయి. ఆ తర్వాత ఓ షోలో నెచ్చెలికి మర్చిపోలేని కానుకనిచ్చాడు అమర్. చనిపోయిన ఆమె తండ్రి మైనపు విగ్రహాన్ని బహుమతిగా ఇవ్వడంతో తేజస్వి ఎమోషనలైంది. ఇదిలా ఉంటే వీరి పెళ్లికి ముహూర్తం ఆసన్నమైనట్లు కనిపిస్తోంది. తాజాగా అమర్దీప్- తేజస్వినిల హల్దీ వేడుక ఘనంగా జరిగింది. బుల్లితెర నటీనటులు ఈ హల్దీ ఫంక్షన్లో తెగ సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by Amar❤️Teju (@amar_teju_fandom) చదవండి: యాంకర్‌కు ఇచ్చిపడేసిన ఇనయ తండ్రి కాబోతున్న రామ్‌చరణ్ -
అదొక్కటే నాకున్న వ్యాపకం.. రెండో పెళ్లిపై దిల్‌రాజు కామెంట్స్
ప్రముఖ నిర్మాత దిల్‌రాజు డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ ప్రారంభించి ప్రస్తుతం స్టార్‌ప్రొడ్యూసర్‌గా కొనసాగుతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ చిత్రాలను రూపొందిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక దిల్‌రాజు వ్యక్తిగత జీవితానికి వస్తే.. 2017లో ఆయన మొదటి భార్య అనిత గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీంతో 2020లో తేజస్విని(వైఘా రెడ్డి)తో ఆయనకు రెండో వివాహం జరిగింది. తాజాగా తన రెండో పెళ్లిపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన దిల్‌రాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు. '' నా భార్య అనిత చనిపోయాక రెండేళ్ల వరకు మెంటల్లీ చాలా స్ట్రగుల్ అనిపించింది. ఆ టైంలో కూతురు, అల్లుడు నాతోనే ఉండేవారు. ఆ బాధ నుంచి తేరుకోవడానికి చాలా ప్రయత్నించా. నాకున్న వ్యాపకం ఒక్కటే గ్యాంబ్లింగ్. నన్ను అలా చూస్తూ మా పేరెంట్స్ ఉండలేకపోయారు. వాళ్లే నన్ను రెండో పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేశారు. నా కూతురు హన్షితా కూడా సపోర్ట్ చేసింది. నా ఫ్యామిలీ డిస్టర్బ్ కావొద్దనే ఆలోచనతో అన్ని విధాలుగా ఆలోచించి రెండో పెళ్లి చేసుకున్నా'' అంటూ దిల్‌రాజు పేర్కొన్నారు. కాగా ఇటీవలె ఈ దంపతులకు కుమారుడు జన్మించాడు. అతనికి ఇద్దరి భార్యల పేర్లు కలిసొచ్చేలా అన్వయ్ రెడ్డి అని పేరు పెట్టారు. చదవండి : హీరోల క్యారవాన్ కల్చర్‌పై దిల్‌రాజు షాకింగ్ కామెంట్స్ -
త్వరలోనే టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్న బాలయ్య చిన్నకూతురు!
నందమూరి బాలకృష్ణ ఓ వైపు సినిమాలు చేసుకుంటూనే మరోవైపు అన్‌స్టాపబుల్ షోతో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షో టీఆర్పీ రేటింగులోనూ అత్యధిక వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఇదిలా ఉండగా బాలకృష్ణ చిన్నకూతురు తేజస్విని త్వరలోనే టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే అన్‌స్టాపబుల్ షోకు క్రియేటివ్ కన్సల్టెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న తేజస్విని.. బాలయ్య స్ట్రిప్ట్ వర్క్‌కి సంబంధించి కీలక వ్యవహారాలనూ కూడా చూసుకుంటుందట. అన్‌స్టాపబుల్ షో అంత పెద్ద హిట్ కావడం వెనుక ఆమె పాత్ర కూడా ఎంతో ఉన్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఆమె నిర్మాతగా టాలీవుడ్‌కు పరిచయం కానున్నట్లు సమాచారం. బాలయ్య హీరోగా నటించే ఓ సినిమాకు ఆమె నిర్మాత బాధ్యతలు స్వీకరించబోతున్నారట. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలుస్తుంది. మరి తేజస్విని నిర్మాతగా సక్సెస్ అవుతారా లేదా అన్నది చూడాలి. -
నటితో బుల్లితెర హీరో ఎంగేజ్మెంట్!
తెలుగు బుల్లితెర నటుడు అమర్దీప్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. నటి తేజస్వినిని పెళ్లాడబోతున్నాడు. తాజాగా అమర్దీప్, తేజస్వినిల నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు బిగ్‌బాస్ బ్యూటీ అరియానా హాజరైంది. పూలదండలు మార్చుకుని సంతోషంలో మునిగి తేలిపోతున్న అమర్- తేజస్వినిలతో ఫొటోలు దిగి వారికి శుభాకాంక్షలు తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియోను అరియానా సోషల్ మీడియా షేర్ చేసింది. ఇది చూసి సర్ప్రైజ్ అయిన ఫ్యాన్స్.. అదేంటి? అమర్, తేజు నిశ్చితార్థం చేసుకున్నారా? ఇదెప్పుడు జరిగిందని ప్రశ్నిస్తున్నారు. సడన్ షాకిచ్చారేంటి అంటూ కొందరు అభిమానులు సీరియల్ హీరోను నిలదీస్తున్నారు. ఇక త్వరలో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్న కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా అమర్ దీప్.. జానకి కలనగలేదులో హీరోగా నటిస్తుండగా తేజస్వి కేరాఫ్ అనసూయ సీరియల్ చేస్తోంది. View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) చదవండి: ఓటీటీలో అమలాపాల్ విక్టిమ్ సిరీస్, ఎప్పటినుంచంటే? ఆ హీరోయిన్‌తో డేటింగ్ వార్తలపై నోరు విప్పిన చై, ఏమన్నాడంటే. -
దిల్ రాజు కొడుకు పేరేంటో తెలుసా ?
Is Dil Raju Reveals His New Born Son Name: తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. ఆయన ఇటీవల మరోసారి తండ్రి అయిన విషయం తెలిసిందే. దీంతో దిల్ రాజు ఇంటికి వారసుడొచ్చాడని నెటిజన్లు, టాలీవుడ్ సెలబ్రిటీలు శుభాకాంక్షలు కూడా తెలిపారు. అయితే దిల్ రాజు కుమారుడికి అద్భుతమైన పేరు పెట్టినట్లు ప్రస్తుతం టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. దిల్ రాజు వారసుడికి 'అన్వి రెడ్డి' అని నామకరణం చేసినట్లు సమాచారం. అయితే దిల్ రాజు మొదటి భార్య అనిత పేరు కలిసివచ్చేలా ఈ పేరు పెట్టినట్లు టాక్. ఈ పేరు విషయంలో దిల్ రాజు రెండో భార్య తేజస్వినికి ఎలాంటి ఇబ్బందిలేదని, అలాగే సంస్కృతంలో కూడా ఆ పేరుకు మంచి అర్థం ఉండటంతో అడ్డుచెప్పలేదట. కాగా దిల్ రాజు మొదటి భార్య అనిత గుండెపోటుతో 2017లో మరణించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన తేజస్విని రెండో వివాహం చేసుకున్నారు. డిసెంబర్ 10, 2020న నిజామాబాద్‌లో దిల్ రాజు, తేజస్వినిల వివాహం జరిగింది. చదవండి: ఘోరంగా ఉన్న నిన్ను సినిమాల్లోకి ఎలా తీసుకుంటున్నారో?.. నితిన్ పాటకు మహేశ్ బాబు స్టెప్పులు !.. వీడియో వైరల్ ఆ పుకార్లు నిజమే.. తేల్చి చెప్పేసిన రష్మిక మందన్నా.. -
మరోసారి తండ్రి అయిన నిర్మాత దిల్ రాజు..
Producer Dil Raju Blessed With Baby Boy With Wife Tejaswini: తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. ఆయన తాజాగా మరోసారి తండ్రి అయ్యారు. దిల్ రాజు సతీమణి తేజస్విని బుధవారం (జూన్ 29) ఉదయం మగ బిడ్డకు జన్మనిచ్చారు. దీంతో దిల్ రాజు ఇంట పండుగ వాతావరణం నెలకొంది. దీంతో దిల్ రాజు ఇంటికి వారసుడొచ్చాడు అంటూ టాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా దిల్ రాజు మొదటి భార్య అనిత గుండెపోటుతో 2017లో మరణించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన తేజస్విని రెండో వివాహం చేసుకున్నారు. డిసెంబర్ 10, 2020న నిజామాబాద్‌లో దిల్ రాజు, తేజస్వినిల వివాహం జరిగింది. దిల్ రాజు, అనితలకు ఒక కుమార్తె హన్షిత ఉంది. కాగా ప్రస్తుతం దిల్ రాజు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌తో 'వారసుడు' సినిమా చేస్తున్నారు. ఈ సమయంలోనే దిల్ రాజు ఇంటికి నిజంగానే వారసుడు వచ్చాడు. చదవండి: తెరపైకి అటల్ బిహారీ వాజ్‌పేయి జీవిత కథ.. ఒకే ఫ్రేమ్‌లో టాలీవుడ్ ప్రముఖులు.. అమితాబ్ ఆసక్తికర పోస్ట్ తొలిసారిగా అది చూపించబోతున్నాం: మాధవన్ Superhit Producer Dil Raju blessed with a baby boy. Congratulations 🎉 — BA Raju's Team (@baraju_SuperHit) June 29, 2022 -
పెళ్లి చేసుకోవాలని కోరితే.. తల్లిని అడగాలని వెళ్లాడు.. అంతలోనే..
సాక్షి, గోరంట్ల (సత్యసాయి జిల్లా): యువతి అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఘటన మండల పరిధిలోని మల్లాపల్లిలో చోటు చేసుకుంది. సీఐ జయనాయక్ తెలిపిన వివరాల మేరకు.. గోరంట్ల పట్టణానికి చెందిన గోపీకృష్ణ కుమార్తె తేజశ్విని (22) తిరుపతిలో బీఫార్మసీ చదువుతోంది. తమ వీధిలోనే నివాసముంటున్న ముస్తఫా (లేట్), హసీనా దంపతుల కుమారుడు సాధిక్, తేజస్విని కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. మండలంలోని మల్లాపల్లి సమీపంలో ఇటుక బట్టీ నడుపుతున్న సాధిక్ అక్కడే ఓ రేకుల షెడ్ ఏర్పాటు చేసుకున్నాడు. సాధిక్ అక్కడ ఉన్నాడని తెలుసుకున్న తేజశ్విని గురువారం కళాశాల నుంచి నేరుగా సాధిక్ వద్దకు వచ్చింది. కొద్దిసేపు ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే తనను పెళ్లి చేసుకోవాలని తేజశ్విని కోరగా, తన తల్లిని అడిగి వస్తానని సాధిక్ గోరంట్లకు వచ్చేశాడు. అతను తిరిగి వెళ్లి చూసే సరికి తేజశ్విని ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. చదవండి: (ఆఖరుసారిగా బన్నీతో గడుపుతానంటూ.. ఏకాంతంగా ఉండగా..) సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిని తండ్రి గోపికృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ జయనాయక్ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం బంధువులు తేజశ్విని మృతదేహంతో గోరంట్ల పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ప్రేమ పేరుతో సాధిక్ తమ బిడ్డను హత్య చేశాడని, నిందితున్ని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ధర్మవరం డీఎస్పీ రమాకాంత్ గోరంట్ల పోలీసుస్టేషన్ చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. పారదర్శకంగా కేసును విచారిస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. చదవండి: ('లోన్ కట్టకపోతే.. న్యూడ్ ఫొటోలు ఇంట్లో వాళ్లకు పంపిస్తాం') -
నేను కడుపులో ఉండగానే అమ్మను వదిలేశాడు : 'కస్తూరి' నటి
Kasturi Serial Heroine Aishwarya Gets Emotional: ఇండస్ట్రీ అనే రంగుల ప్రపంచంలో ఎన్నో కథలు, వ్యధలు కనిపిస్తుంటాయి. తెరపై కనిపించే నవ్వుల వెనుక ఎన్నో కష్టాలు, కన్నీళ్లు ఉంటాయి. వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా స్క్రీన్ ముందుకు వచ్చేసరికి అన్నీ మర్చిపోయి సరదాగా కనిపిస్తుంటారు. తాజాగా ఓ షోలో పాల్గొన్న పాపులర్ సీరియల్ హీరోయిన్స్ ఐశ్వర్య, తేజస్విని తమ జీవితంలో జరిగిన చేదు సంఘటనల్ని గుర్తుచేసుకొని కన్నీటి పర్యంతమయ్యారు. స్టార్‌మాలో ప్రసారం అవుతున్న ‘కస్తూరి’, ‘C/O అనసూయ’సీరియల్స్‌తో బోలెడంత పాపులారిటీ సంపాదించుకున్న తేజస్విని(శివాణి), ఐశ్వర్య(కస్తూరి)లు తమ జీవితాల్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ గురించి ఓపెన్ అయ్యారు. చిన్నప్పటి నుంచి తండ్రి ప్రేమ అంటే ఏంటో తెలియకుండా పెరిగానని, ఆఖిరికి తన తండ్రి చివరిచూపుకు కూడా నోచుకోలేదని నటి తేజస్విని పేర్కొంది. 'ఇంటర్లో ఉండగా మా నాన్న చనిపోయారు. అప్పటివరకు తెలియదు. ఆరోజు రాత్రంతా జర్నీ చేసి ఊరెళ్లాను. అప్పటికే అన్నీ చేసేశారు. ఆయన చనిపోయేవరకు కూడా నాన్న ప్రేమను పొందలేకపోయాను. నా జీవితంలో చాలా కోల్పోయాను' అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇక కస్తూరి సీరియల్ హీరోయిన్ ఐశ్వర్య తన తండ్రి చేసిన మోసాన్ని తలుచుకొని ఎమోషనల్ అయ్యింది. 'నేను కడుపులో ఉండగానే మా నాన్న అమ్మని వదిలేసి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడి అమ్మ నన్ను ఇక్కడివరకు తీసుకొచ్చింది. ఇష్టం లేకపోతే పెళ్లి ఎందుకు చేసుకోవాలి? ఒక ఆడదాన్ని జీవితాన్ని ఎందుకు పాడు చేయాలి? దయచేసి మీకు ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోకండి.. ఇలా ఒక ఆడదాని జీవితాన్ని పాడుచేయకండి ప్లీజ్' అంటూ చేతులు జోడించి కన్నీళ్లు పెట్టుకుంది. -
తండ్రి కాబోతున్న అగ్ర నిర్మాత దిల్ రాజు..!
ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన మొదటి భార్య అనారోగ్యంతో అకాల మరణం చెందడంతో ఆయన ద్వితీయ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఈ దంపతులు త్వరలోనే ఓ బిడ్డకు జన్మను ఇవ్వబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ విషయం పై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఇక దిల్ రాజుకు ఇప్పటికే ఓ కుమార్తె ఉన్న విషయం తెలిసిందే. భార్య మరణానంతరం కుమార్తె హన్షిత రెడ్డి, పెద్దల సలహాతో కరోనా లాక్ డౌన్ సమయంలో వైగా రెడ్డి (తేజస్విని)ని దిల్ రాజు రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక దిల్ రాజు నిర్మాతగా రామ్ చరణ్, శంకర్ కాంబోలో పాన్ ఇండియా చిత్రం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. -
షాకింగ్: తండ్రితో పాటు అన్‌స్టాపబుల్ షోకు పని చేసిన బాలయ్య చిన్న కూతురు
నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే’ షో ఆహా ఓటీటీలో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. ఓటీటీ చరిత్రలోనే అత్యధిక వ్యూస్‌తో సంచలనం సృష్టిస్తోన్న ఈ షో దిగ్విజయంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే 9ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు గ్రాండ్ ఫినాలేలోకి అడుగుపెట్టింది. ఈ షోలో బాలయ్య తనదైన మ్యానరిజం, డైలాగ్స్, లుక్స్, సెన్స్ ఆఫ్ హ్యూమర్‌తో సక్సెస్‌ఫుల్‌గా ఈ షోను నడిపించాడు బాలయ్య. చదవండి: హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సింగర్ సునీత కుమారుడు! దీంతో తొలి సీజన్ ముగుస్తుండటంతో ఈ షో రెండో సీజన్‌కు సన్నాహాలు చేస్తున్నారు నిర్వహకులు. ఈ సీజన్ కూడా మరో లెవెల్ లోనే సెట్ చేస్తుంది ఆహా టీం. అయితే ఈ షో ఇంత సక్సెస్ కావడానికి బాలయ్య ఒక కారణమైతే.. తెర వెనక దీని కోసం ఎంతో మంది కష్టపడ్డారట. అయితే వీరిలో బాలయ్య రెండవ కూమార్తె తెజస్వీని కూడా ఉండటం విశేషం. ఈ షోకు తేజస్వీని కూడా పనిచేసిందని తెలిసి చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రముఖ రైటర్, దర్శకుడు బీవీఎస్ రవి ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. చదవండి: ఆ మూవీ నుంచి రాజశేఖర్‌ను తప్పించారా? జీవిత వల్లే ఆయనకు ఆఫర్ పోయిందట! కాగా అన్‌స్టాపబుల్ షోకు ఆయన రైటర్‌గా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో సక్సెస్ కావడంతో పలు టీవీ, యూట్యూబ్ చానల్ ఆయనతో ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రవి ఈ షోకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ క్రమంలో బాలయ్య అన్ స్టాపబుల్ షో కోసం బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని కూడా పనిచేశారని చెప్పాడు. బాలయ్యను కొత్తగా చూపేందుకు తేజస్విని చాలా రీసెర్చ్ చేశారని.. ‘అన్‌స్టాపబుల్’ టీమ్‌తో పనిచేస్తూ బాలయ్య లుక్, కాస్ట్యూమ్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపాడు. ఇక విషయం తెలిసి నందమూరి ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: వైరల్‌గా ప్రభాస్ ‘ఆది పురుష్’ న్యూ లుక్! శ్రీరాముడిగా ‘డార్లింగ్’ను చూశారా? -
మహిళ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీపీ అంజనీకుమార్, మిస్ ఇండియా ఎర్త్ తేజస్విని
-
ఇండస్ట్రీలోకి దిల్‌రాజు సతీమణి..!
కరోనా వైరస్ విజృంభణతో చిత్ర పరిశ్రమ తీవ్ర నష్టాలను చవిచూస్తోంది. తొమ్మిది నెలల విరామం అనంతరం ఇప్పుడిప్పుడే థియేటర్లు తెరుచుకుంటున్నా.. ప్రేక్షకుడు మాత్రం ఆ వైపుకు కన్నెత్తికూడా చూడటంలేదు. మరోవైపు కరోనా సెకండ్ వేవ్ భయం దర్శక, నిర్మాతలను తీవ్రంగా వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో నిర్మించబోయే సినిమాలను ఓటీటీని వేదికగా చేసుకుని విడుదల చేయాలనే ఆలోచనలో పడ్డారు. దీనికి అనుగుణంగానే కథలను సిద్ధం చేసుకుంటున్నారు. కొత్త ఆలోచనలకు పదునుపెడుతూ.. ఓటీటీ దిశగా అడుగులు వేస్తున్నారు. (కొత్త ప్రయాణం ప్రారంభిస్తున్నా) ఈ క్రమంలో టాలీవుడ్ బడా నిర్మాత దిల్‌రాజు సైతం ఓటీటీకి తగ్గకథల కోసం వెతుకులాట ఆరంభించారు. అయితే భర్త కోసం తన సతీమణి తేజస్వీని స్వయంగా ఓ కథను సిద్ధం చేశారని చిత్రపరిశ్రమలో టాక్ వినిపిస్తోంది. లాక్డౌన్ సమయంలో ఇంటికే పరిమితమైన ఆమె కొత్త కథలపై దృష్టిసారించారని, ఓటీటీకి అనుగుణంగా సృజనాత్మకతతో కూడిన ఓ కథను భర్తకు బహుమతిగా ఇచ్చారని సమాచారం. భార్య స్టోరీకి ఫిదా అయిన దిల్‌రాజు.. ఆ కథకు మరింత మెరుగులు దిద్దేందుకు ఆమెకు సహాయంగా ఓ రచనా బృందాన్ని ఏర్పాటు చేశాడని తెలిసింది. (దిల్‌రాజుకు షాకిచ్చిన వరుణ్, వెంకీ..!) ఓటీటీ విస్తరిస్తున్న నేపథ్యంలో భార్య రూపొందించిన కథాంశాన్ని తెరక్కించాలని నిర్ణయించినట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. అనుకున్నట్లు కథ కార్యరూపం దాల్చితే తేజస్వీని సైతం చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. దిల్‌రాజు ప్రస్తుతం విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న ఎఫ్3 మూవీ నిర్మాణ బాధ్యతల్లో బిజిబిజీగా ఉన్నారు. కాగా దిల్’రాజు మొదటి భార్య అనిత 2017లో గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. అనంతరం హైదరాబాద్‌కు చెందిన తేజస్విని (వైఘా రెడ్డి)ని గత మార్చిలో వివాహం చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని నర్సింగ్‌పల్లిలోగల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిరాడంబరంగా వీరి వివాహం జరిగింది. -
దిల్ వాకిట్లో తేజస్విని
ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు (వెంకట రమణారెడ్డి) వివాహం హైదరాబాద్‌కు చెందిన తేజస్విని (వైఘా రెడ్డి)తో ఆదివారం రాత్రి జరిగింది. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని నర్సింగ్‌పల్లిలోగల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిరాడంబరంగా జరిగిన ఈ వివాహ వేడుకలో కేవలం ఇరు కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. ఆదివారం రాత్రి 7.23 గంటలకు పెళ్లి జరిగింది. నూతన దంపతులిద్దరూ సోమవారం ఆలయంలో సత్యనారాయణ వ్రతం చేశారు. కాగా ‘దిల్’ రాజు భార్య అనిత 2017లో గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. తన కుమార్తె హన్షితా రెడ్డితో పాటు కుటుంబ సభ్యులు ఆరు నెలల క్రితమే ‘దిల్’రాజుకు తేజస్వినితో వివాహ ముహూర్తాన్ని నిశ్చయించినట్లు సమాచారం. ‘‘జీవితంలో ఈ కొత్త ప్రారంభం అద్భుతంగా కొనసాగాలని కోరుకుంటున్నాను నాన్నా. మీ ఇద్దరూ ప్రేమతో, సంతోషంగా ఉండాలి’’ అని ‘దిల్’ రాజు కుమార్తె హన్షితా రెడ్డి సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. అన్నట్లు ‘దిల్’ రాజు నిర్మించిన సూపర్ హిట్ చిత్రాల్లో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఒకటి. ఇప్పుడు పెళ్లి జరిగిన సందర్భంగా ఆయన జీవితానికి ఈ టైటిల్ ని ఆపాదించి ‘దిల్ వాకిట్లో తేజస్విని’ అనొచ్చు. -
హీరోయిన్ తేజస్విని ఫోటోలు
-
‘బెయిల్‌పై బయటికొస్తాడేమోనని భయంగా ఉంది’
సాక్షి, పోడూరు : ప్రేమోన్మాది దాడి చేస్తాడని కలలో కూడా ఊహించలేకపోయానని, దాడి వల్ల గాయాలతో తాను చావకుండానే నరకం చూశానని కవిటం గ్రామంలో ఈ ఏడాది అక్టోబర్ 16న ప్రేమోన్మాది చేతిలో హత్యాయత్నానికి గురైన కళాశాల విద్యార్థిని కొవ్వూరి తేజస్విని చెప్పింది. దాడి తరవాత ఏలూరు ఆశ్రం ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆమె కొద్దిరోజుల కిందట కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయి కవిటంలో తన నివాసానికి వచ్చింది. ఇంటి వద్ద మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. తనపై దాడి చేసిన సుధాకర్‌రెడ్డి లాంటి సైకోలు సమాజంలో తిరగకూడదని చెప్పింది. తన లాంటి పరిస్థితి ఏ అమ్మాయికి రాకూడదని పేర్కొంది. పెనుగొండ ఎస్వీకేపీ కళాశాలలో తాను ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్టీ్ర ఫస్టియర్ చదువుతున్నానని, ఈ కోర్సు పూర్తి చేసి మంచి ఉద్యోగం చేయాలనుకున్నానని.. ఈ కోర్సు పూర్తి చేయడమే తన లైఫ్ టర్నింగ్‌పాయింట్ అని.. ఇటువంటి తరుణంలో ప్రేమ పేరుతో కొంతకాలంగా తనను వేధిస్తున్న మేడపాటి సుధాకర్‌రెడ్డి అనే వ్యక్తి తనను చంపే ప్రయత్నంతో కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చడంతో తాను జీవితంలో కోలుకోలేని దెబ్బతిన్నానని తేజస్విని ఆవేదన వ్యక్తం చేసింది. తనపై ఉన్మాదంతో దాడి చేసిన మేడపాటి సుధాకర్‌రెడ్డి బెయిల్ తీసుకొని జైలు నుంచి బయటకు వస్తాడని వదంతులు వస్తుండడంతో కొద్దిరోజులుగా తాను ఎంతో ఆందోళన చెందుతున్నట్టు తేజస్విని చెప్పింది. సుధాకర్‌రెడ్డి తనపై దాడి తరవాత వెంటనే స్పందించి ఆసుపత్రికి చేర్చిన పోలీసులకు, గ్రామస్తులకు, మంచి వైద్యం అందేలా కృషి చేసిన రాష్ట్ర మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు, ఆళ్లనానికి, వైఎస్సార్సీపీ నేత గుంటూరి పెద్దిరాజుకు, గ్రామ నాయకులు కర్రి శ్రీనివాస్‌రెడ్డికి, సత్తి మురళీకృష్ణారెడ్డికి తేజస్విని కృతజ్ఞతలు తెలిపింది. -
తేజస్విని ‘టోక్యో’ గురి
దోహా (ఖతర్): అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న భారత మహిళా సీనియర్ స్టార్ షూటర్ తేజస్విని సావంత్ టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. శనివారం జరిగిన మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ క్వాలిఫయింగ్ ఈవెంట్లో 39 ఏళ్ల ఈ మహారాష్ట్ర షూటర్ 1171 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. ఫైనల్‌కు చేరిన ఎనిమిది మందిలో ఆరుగురు ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంతో అందుబాటులో ఉన్న రెండు బెర్త్‌లలో ఒకటి భారత్‌కు, మరోటి జపాన్ (షివోరి)కు లభించాయి. ఫైనల్లో తేజస్విని 435.8 పాయింట్లు స్కోరు చేసి నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో పతకాన్ని కోల్పోయింది. 2010లో 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ విభాగంలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా షూటర్‌గా గుర్తింపు పొందిన తేజస్వినికి ఇప్పటివరకు ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కలేదు. ట్రయల్స్ లేకపోతే మాత్రం... ఆమె ఒలింపిక్ కల ఈసారి సాకారం అవుతుంది. ట్రయల్స్ నిర్వహిస్తే తేజస్విని అందులో నెగ్గాల్సి ఉంటుంది. ఓవరాల్‌గా ఇప్పటివరకు భారత్ నుంచి 12 మంది షూటర్లు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందారు. తేజస్విని, కాజల్, గాయత్రిలతో కూడిన భారత బృందానికి 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ టీమ్ ఈవెంట్లో కాంస్యం దక్కింది. పురుషుల 25 మీటర్ల సెంటర్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో గుర్ప్రీత్ సింగ్ 586 పాయింట్లతో రజతం నెగ్గగా... గుర్ప్రీత్, యోగేశ్, ఆదర్శ్‌లతో కూడిన భారత బృందం కాంస్యం గెలిచింది. -
దాడులకు పాల్పడితే కఠినచర్యలు: ఆళ్ల నాని
సాక్షి, ఏలూరు: ప్రేమోన్మాది పాశవిక దాడిలో గాయపడి.. ఏలూరు ఆశ్రమం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని తేజస్వినిని శనివారం డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని పరామర్శించారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..విద్యార్థినిపై దాడి ఘటన దురదృష్టకరమని..తేజశ్విని కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వివరాలు అడిగి తెలుసుకున్నారని తెలిపారు. దాడికి పాల్పడిన ప్రేమోన్మాదిపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు. తేజస్వినికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను డిప్యూటీ సీఎం కోరారు. భవిష్యత్‌లో విద్యార్థినికి భద్రత కల్పిస్తామని చెప్పారు. ఎవరైనా ఇటువంటి దాడులకు పాల్పడితే సహించేది లేదని.. కఠినంగా వ్యవహరిస్తామని ఆళ్ల నాని హెచ్చరించారు. -
పక్కా పథకం ప్రకారమే తేజస్వినిపై దాడి
సాక్షి, ఏలూరు: ప్రేమ పేరుతో వేధిస్తూ ఉన్మాది దాడిలో గాయపడి ఏలూరు ఆశ్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొవ్వూరి తేజస్వినిని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ రంగనాథరాజు పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కాగా పోడూరు మండలం కవిటంకు చెందిన డిగ్రీ విద్యార్థిని తేజస్వినిని పథకం ప్రకారమే మేడపాటి సుధాకర్‌రెడ్డి హతమార్చేందుకు కత్తితో దాడికి పాల్పడినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. సుధాకర్‌రెడ్డి అనే వ్యక్తి తేజస్వినిని ప్రేమపేరుతో కొంతకాలంగా వేధిస్తుండటంతో ఆమె కుటుంబసభ్యులకు విషయాన్ని తెలిపింది. దీంతో కుటుంబసభ్యులు విషయాన్ని గ్రామ పెద్దలు దృష్టికి తీసుకు వెళ్లడంతో తేజస్వినిని ఇబ్బంది పెట్టనని సుధాకర్‌రెడ్డి లిఖితపూర్వకంగా రాసిచ్చాడు. ఈ ఘటనతో తేజస్వినిపై కక్ష పెంచుకున్న సుధాకర్‌రెడ్డి ఆమెను హతమార్చేందుకు పక్కా స్కెచ్ వేశాడు. సమయం కోసం మాటువేసి కత్తితో ఆమెపై దాడి చేశాడు. తేజస్విని పెనుగొండ ఎస్వీకేపీ కళాశాలలో ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. పెద్దల సమక్షంలో రాజీ జరిగినప్పట్నుంచీ కళాశాలకు వెళ్లేటపుడు రోజూ ఆమె మేనమామ శ్రీనివాసరెడ్డి బస్సు ఎక్కించి వస్తున్నారు. అయితే బుధవారం పని ఉండి మేనమామ ఆమె వెంట రాలేదు. తేజస్విని ఒంటరిగా ఉండటాన్ని పసిగట్టిన సుధాకర్‌రెడ్డి వెస్పాపై కత్తులు ఉన్న సంచి తీసుకుని ఆమెను వెంబడించాడు. కత్తితో దాడికి తెగబడ్డాడు. సమీపంలోని ఇంటి పెరట్లోకి తేజస్విని పరుగెత్తడంతో అక్కడే ఉన్న ఆ ఇంటి యజమానితో పాటు మరొకరు సుధాకర్‌రెడ్డిని అడ్డుకున్నారు. ఓవైపు వారిని విదిలించుకునే ప్రయత్నం చేస్తూనే మరోవైపు తేజస్వినిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డటంతో ఆమె తీవ్రంగా గాయపడింది. దాడి తరువాత సుధాకర్‌రెడ్డి నోటి నుంచి నురుగ రావడంతో దాడి చేయడానికి ముందే అతడు పురుగుమందు తాగినట్లు తెలుసతఓంది.. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఇద్దరినీ చికిత్స నిమిత్తం పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే మెరుగైన చికిత్స నిమిత్తం తేజస్విని ఏలూరు ఆశ్రం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా సుధాకర్‌రెడ్డికి గతంలోనే వివాహం అయింది. అయినా తేజస్వినిని ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడ్డాడు. -
బ్యూటీ ఫెస్ట్
-
అనంత్‌కుమార్ భార్యకు బీజేపీ షాక్
బెంగళూరు/లక్నో: ఆరు పర్యాయాలు ఎన్నికైన కేంద్రమంత్రి దివంగత అనంత్ కుమార్ స్థానం నుంచి ఆయన సతీమణి తేజస్వినికి బెంగళూరు(దక్షిణ)టికెట్ నిరాకరించిన బీజేపీ.. సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదకు పార్టీలో చేరిన కొద్ది గంటల్లోనే టికెట్టిచ్చింది. అనంత్ విజయాల వెనుక కీలకంగా ఉన్న తేజస్విని అందుకు తగినట్లుగా ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. కానీ, సోమవారం రాత్రి తేజస్వి సూర్య(28) అనే యువనేతకు బీజేపీ టికెట్ ఇచ్చింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప స్పందించారు. ‘ తేజస్విని పేరును మాత్రమే రాష్ట్ర కమిటీ ప్రతిపాదించింది. కానీ, అధిష్టానం పేరును మార్చివేసింది. ఇలా ఎందుకు జరిగిందో నాకూ తెలియదు’ అని అన్నారు. పార్టీ నిర్ణయం తనతోపాటు మద్దతుదారులను కూడా షాక్‌కు గురిచేసిందని తేజస్విని మీడియాతో అన్నారు. కాగా, టికెట్ కేటాయించిన సమాచారం తెలిసిన వెంటనే తేజస్వి సూర్య తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యారు. 39 మందితో మరో జాబితా మంగళవారం బీజేపీ మరో 39 మంది అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితా విడుదల చేసింది. ఇందులో యూపీకి 29, బెంగాల్‌కు సంబంధించి 10 పేర్లు ఉన్నాయి. కేంద్ర మంత్రి మేనకా గాంధీకి సిట్టింగ్ స్థానం ఫిలిబిత్ బదులు సుల్తాన్‌పూర్‌ను కేటాయించింది. కొడుకు వరుణ్ గాంధీకి ఫిలిబిత్‌ను కేటాయించింది. కేంద్ర మంత్రి మనోజ్ సిన్హాను సిట్టింగ్ స్థానం ఘాజీపూర్ నుంచి, యూపీ మంత్రులు రీటా బహుగుణ జోషి, సత్యదేవ్ పచౌరీలను అలహాబాద్, కాన్పూర్‌ల నుంచి బరిలో నిలపనున్నట్లు బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటించారు. మంగళవారమే బీజేపీ కండువా కప్పుకున్న సినీ నటి, మాజీ ఎంపీ అయిన జయప్రదకు రాంపూర్ స్థానాన్ని కేటాయిస్తున్నట్లు తెలిపారు. -
కన్నడ కోయిలమ్మ
సంగీతమే ప్రాణంగా ‘కోయిలమ్మ’ సీరియల్లోని చిన్ని పాత్ర ఉంటుంది. స్టార్ మా టీవీలో వచ్చే ఈ సీరియల్ ద్వారా చిన్ని పాత్రతో తెలుగింటికి పరిచయం అయ్యింది తేజస్విని. అందంలోనూ, అభినయంలోనూ భేష్ అనిపించుకుంటున్న ఈ కన్నడ కోకిల ‘సాక్షి’తో పంచుకున్న ముచ్చట్లు... మీరు కన్నడ, తెలుగు బుల్లి తెరకు ఎలా పరిచయం అయ్యారు? బెంగుళూరులోని థియేటర్ ఆర్ట్స్‌లో జాయిన్ అయ్యాను. అంతకు మూడునెలల ముందు ‘బిలీ హెన్సీ’ అనే కన్నడ ప్రాజెక్ట్‌లో వర్క్ చేశాను. థియేటర్ ఆర్ట్స్ నుంచే నాకు ‘కోయిలమ్మ’ సీరియల్ ఆఫర్ వచ్చింది. తెలుగింటికి పరిచయం చేసిన ‘స్టార్ మా’ వాళ్లకు ముందుగా థాంక్స్. ఈ ప్రాజెక్ట్‌కు ముందు ‘కోయిలమ్మ’ సీరియల్ చూశాను. బాగా నచ్చింది. పెద్దయ్యాక ‘చిన్ని’గా నేను ఎలా ఉంటానో, ఆ పాత్ర ద్వారా తెలుగువారు నన్ను రిసీవ్ చేసుకుంటారోలేదోనని నాలుగు వారాలు చాలా టెన్షన్ పడ్డాను. ఇప్పుడు బయటకు వెళితే ‘చిన్ని చిన్ని’ అని పిలుస్తున్నారు. ఈ పాత్ర ద్వారా నాకు మంచి పేరు వస్తున్నందుకు ఆనందంగా ఉంది. మీ ఫ్యామిలీ గురించి.. నేను, అమ్మ భ్రమరాంబ బెంగుళూరులో ఉంటాం. అమ్మ సివిల్ ఇంజనీర్‌గా జాబ్ చేస్తున్నారు. అమ్మనాన్నలకు నేను ఒక్కత్తే కూతురుని. ఐదేళ్ల క్రితం మా నాన్నగారు(మల్లికార్జున్) చనిపోయారు. టీవీ ఇండస్ట్రీకి రాకముందు సాఫ్ట్వేర్ ఉద్యోగిని. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడంలో ఆసక్తి ఉండటం వల్ల డ్యాన్స్ నేర్చుకున్నాను. జాబ్ మానేసి థియేటర్ ఆర్ట్స్‌లో జాయిన్ అయ్యాను. సీరియల్లో మాదిరిగానే లైఫ్‌లో మలుపులు.. (నవ్వుతూ) సీరియల్లో చాలా ట్విస్టులు ఉన్నాయి. నా జీవితంలో అలాంటివేవీ లేవు. చాలా సింపుల్‌గా గడిచిపోతోంది. నన్ను ఈ రంగంలోకి పంపే ముందు అమ్మ కొంత ఆలోచించారు. కానీ, సాంస్కృతిక రంగం పట్ల నాకుండే ఆసక్తిని గమనించి ప్రోత్సహించారు. ఇక్కడ షూటింగ్ వారం విడిచి వారం ఉంటుంది. అందువల్ల వారానికి ఓసారి హైదరాబాద్ వచ్చి వర్క్ చేసుకొని వెళతాను. ‘చిన్ని’పాత్ర సింగర్.. బయట ? నాకు సంగీతంలోనూ ప్రవేశం ఉంది. మ్యూజిక్ నేర్చుకున్నాను. ‘కోయిలమ్మ’ కూడా సింగింగ్ రిలేటెడ్ కాన్సెప్ట్. నాకు నచ్చిన కాన్సెప్ట్ అవడంతో మరింత హ్యాపీ. ఈ పాత్ర ద్వారా తెలుగింటి వారినుంచి మంచి పేరు తెచ్చుకోవాలని ఉంది. జనాలంతా గుర్తించాలి. ఈ ఇండస్ట్రీకి రాకముందు డ్యాన్స్, మ్యూజిక్ ..అంటే ఇష్టం ఉండేది. ఇప్పుడు వీటితో పాటు ఈ ఇండస్ట్రీయే నా ఇంట్రస్ట్ గా మారిపోయింది. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అంటుంటారు. ‘సాఫ్ట్వేర్ రొటీన్ ఫీల్డ్. నువ్వు లక్కీ. నచ్చిన క్రియేట్ ఫీల్డ్‌ను ఎంచుకున్నావు..’ అంటూ మెచ్చుకుంటూ ఉంటారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ మీ అందరి మనసుల్లో నిలిచిపోవాలన్నదే నా లక్ష్యం. – నిర్మలారెడ్డి -
తేజస్విని డబుల్ ధమాకా
సాక్షి, హైదరాబాద్: ‘లెట్స్ షటిల్’ కార్పొరేట్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఉదయ్, తేజస్విని విజేతలుగా నిలిచారు. పీబీఎల్ ఫ్రాంచైజీ హైదరాబాద్ హంటర్స్ ఈ టోర్నీని నిర్వహించింది. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఉదయ్ 21–6, 19–10తో భరత్‌పై గెలుపొందగా... మహిళల సింగిల్స్ ఫైనల్లో తేజస్విని 21–12, 23–21తో అలేఖ్యపై విజయం సాధించింది. తేజస్విని సింగిల్స్ టైటిల్‌తో పాటు మిక్స్డ్ డబుల్స్‌లోనూ విజేతగా నిలిచింది. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో తేజస్విని–చైతన్య జంట 23–21, 21–7తో ఆకాశ్ సింగ్ గౌతమ్–మంజు జోడీపై గెలిచింది. పురుషుల డబుల్స్ ఫైనల్లో అనురాగ్–ముహీబ్ ద్వయం 23–21, 21–13తో చైతన్య–ఉదయ్ జంటపై గెలిచింది. మహిళల డబుల్స్ ఫైనల్లో మంజుల–హారిక జోడీ 14–21, 21–19, 21–17తో ఆస్థ, తేజస్విని ద్వయంపై నెగ్గింది. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో ‘శాట్స్’ ఎండీ దినకర్ బాబు విజేతలకు ట్రోఫీలు అందజేశారు. -
అత్తింటి ఆరళ్లకు ఆహుతి
ఆడపిల్లకు అన్నిచోట్లా కష్టాలే. చిత్రంలో కనిపిస్తున్న తేజస్విని అనే వివాహిత అత్తింట ఆహుతైంది. కొప్పళ జిల్లా శ్రీరామనగర్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది. కర్ణాటక, గంగావతి రూరల్: తాలూకాలోని శ్రీరామనగర్‌లో ఓ మహిళ అనుమానాస్పద రీతిలో ఆహుతైన ఘటన బుధవారం వెలుగు చూసింది. స్థానికుల కథనం మేరకు.. శ్రీసుబ్రమణ్యేశ్వర స్వామి దేవస్థానం పక్కన ఉన్న ఫ్యాన్సీ స్టోర్ యజమాని కిరణ్ భార్య తేజస్విని (26) ఇంట్లోనే సగం కాలిన స్థితిలో శవమై ఉండటాన్ని స్థానికులు గుర్తించి గంగావతి రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. కిరణ్, తేజస్విని దంపతులకు ఆరు నెలల పాప ఉంది. ఆడపిల్ల పుట్టిందని భర్త, అత్తమామలు నిత్యం సూటిపోటి మాటలతో హింసిస్తూండేవారు. ఆమె జీవితంపై విరక్తితో ఆత్మహత్యకు పాల్పడిందని అత్తింటివారు చెబుతుండగా, భర్త, అత్తమామలే హింసించి నిప్పంటించి చంపారని తేజస్విని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆమెను ఎక్కడో చంపి మృతదేహాన్ని ఇంట్లో వేసి నిప్పంటించి ఉంటారని స్థానికులు చెబుతున్నారు. పరారీలో అత్తమామలు మృతురాలి భర్త పోలీసు కస్టడీలో ఉండగా, అత్తమామలు పరారీలో ఉన్నారు. ఇంటిలో సగభాగం కాలిన మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు శవాన్ని పోస్ట్‌మార్టం కోసం గంగావతి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై గంగావతి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
పరిచయాలు లేకుండా పరిచయం అవుతున్నా
‘‘సినిమాల మీద ఉన్న ఆసక్తి, ఇష్టమే నన్ను యూకే నుంచి ఇక్కడికి తీసుకు వచ్చాయి. బిక్షపతి అనే పేరుని యూకేలో వాళ్లకు పలకడానికి రాకపోవడంతో బిక్స్గా మార్చుకున్నాను. అదే నా స్క్రీన్ నేమ్ అయింది’’ అన్నారు బిక్స్ ఇరుసడ్ల. నందు, తేజస్విని జంటగా బిక్స్ దర్శకత్వంలో భాస్కర్ భాసాని నిర్మించిన చిత్రం ‘కన్నుల్లో నీ రూపమే’. ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా బిక్స్ మాట్లాడుతూ – ‘‘ఓ అందమైన ప్రేమ కథను హృదయానికి హత్తుకునేలా చెప్పాం. ఎటువంటి కష్టంలో ఉన్నా లైఫ్ ముందుకు సాగాలి అనే సందేశాన్ని అంతర్లీనంగా చెప్పాం. నందు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. తేజస్విని నటనలో పర్ణిపూర్ణత కనిపిస్తుంది. సంగీత దర్శకుడు సాకేత్ ఫస్ట్ సినిమా అయినా బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు. మా సినిమా చూసి విడుదల చేయడానికి ముందుకు వచ్చిన రామమోహనరావు ఇప్పిలి, శ్రీకాంత్‌రెడ్డికి కృతజ్ఞతలు. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుండేవాణ్ణి. ఇండస్ట్రీలో పరిచయాలు లేకుండానే డైరెక్టర్‌గా తొలి అడుగు వేసి, ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నా. ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. -
నా చావుకు నువ్వే కారణం.. ఈ పాపాన్ని అనుభవిస్తావు
టీవీ యాంకర్ తేజస్వినిది ఆత్మహత్యే అని విజయవాడ ఈస్ట్ జోన్ ఏసీపీ విజయభాస్కర్ తెలిపారు. భర్త వేధింపులు, అక్రమ సంబంధాలు, అనుమానాలు వ్యక్తం చేస్తుండటంతో మనస్తాపానికి గురై ఈ నెల 16వ తేదీ రాత్రి అద్దె ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందన్నారు. ఘటనాస్థలంలో లభించిన మరణ వాంగ్మూలం, సెల్ ఫోన్ల ద్వారా పంపిన మెసేజ్‌లను నిర్ధారణగా చేసుకుని అనుమానాస్పద మృతి కేసును 306, 498ఎ సెక్షన్ల కింద కేసును మార్పు చేశామన్నారు. కంకిపాడు(పెనమలూరు): టీవీ యాంకర్ తేజస్వినిది ఆత్మహత్యే అని విజయవాడ ఈస్ట్ జోన్ ఏసీపీ విజయభాస్కర్ తెలిపారు. పట్టణంలోని సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ గుంటూరు జిల్లాకు చెందిన తేజస్విని, మట్టపల్లి పవన్‌కుమార్ ఇద్దరూ కలిసే చదువుకున్నారని, ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారి 2014లో వివాహం చేసుకున్నారన్నారు. వివాహం అనంతరం దుబాయ్‌లో, భీమవరంలోనూ నివాసం ఉన్నారన్నారు. అక్కడ ఉండగానే ఓ టీవీ ఛానల్లో న్యూస్ రీడర్‌గా పనిచేసిందని చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఈడుపుగల్లు ఎంబీఎంఆర్‌లోని అద్దె ఇంట్లోకి వచ్చారన్నారు. భర్త వేధింపులు, అక్రమ సంబంధాలు నెరపటం, అనుమానాలు వ్యక్తం చేస్తుండటంతో మనస్తాపానికి గురై ఈనెల 16వ తేదీ రాత్రి అద్దె ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని వివరించారు. ఘటనా స్థలంలో లభించిన మరణ వాంగ్మూలం, సెల్ ఫోన్ల ద్వారా పంపిన మెసేజ్‌లను నిర్ధారణగా చేసుకుని అనుమానాస్పద మృతి కేసును 306, 498ఎ సెక్షన్ల కింద కేసును మార్పు చేశామన్నారు. చనిపోయే రెండు రోజులు ముందు 14వ తేదీ ఉదయం భర్తకు ‘ నీ వేధింపుల వల్లే చనిపోతున్నానని, నా చావుకు నువ్వే కారణం. ఈ పాపాన్ని అనుభవిస్తావు. ఆ గోవిందుడే సాక్షి’ అంటూ మెసేజ్ ఫోన్లో పంపిందన్నారు. ఆ సమయంలో భర్త పవన్‌కుమార్ షిరిడీలో ఉన్నారన్నారు. రెవెన్యూ శాఖ ద్వారా తేజస్విని మృతదేహాన్ని పంచనామా చేయించి ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. భర్త పవన్‌కుమార్‌ను కూడా అరెస్టు చేసి కోర్టుకు పంపామన్నారు. మృతురాలి మరణ వాంగ్మూలంలో రాత, గతంలో ఉన్న చేతి రాతను పరిశీలించామని, నిపుణులకు కూడా పంపుతున్నామన్నారు. ఈడుపుగల్లు వచ్చి కొద్ది నెలలే అయ్యిందని, రాజకీయంగా ఓ ఎమ్మెల్యేతో సంబంధాలు ? అంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. తేజస్వినిది ఆత్మహత్యేనని స్పష్టం చేశారు. సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ కోమాకుల శివాజీ, ఎస్ఐ షరీఫ్ పాల్గొన్నారు. అనుమానాలెన్నో.. విజయవాడ: టీవీ యాంకర్ తేజస్విని అనుమానాస్పద స్థితిలో కేసులో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈనెల 16వ తేదీన తేజస్విని తాను నివాసం ఉండే ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఈ విషయం 17వ తేదీ వరకు ఈ విషయం వెలుగు చూడలేదు. కాగా తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు భర్త మట్టపల్లి పవన్‌కుమార్ వేధింపులే కారణమని ఆమె ఆత్మహత్య నోట్కూడా రాసింది. పోలీసులు ముందుగా 174సెక్షన్ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఆతరువాత భర్త పవన్ కుమార్‌పై 498ఏ, 306 సెక్షన్లపై కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో రెండు రోజులుగా తేజస్విని మృతిపై వేరే కోణంలో పుకార్లు ప్రచారం చేస్తున్నారు. ఆమె మృతి కేసులో భర్తను ఇరికించారని కొందరు ప్రచారం చేస్తున్నారు. సుసైడ్ నోట్ కూడా కట్టుకథగా చెబుతున్నారు. -
నవ్వుల్ నవ్వుల్
నందు, తేజస్విని ప్రకాష్ జంటగా నటించిన చిత్రం ‘కన్నుల్లో నీ రూపమే’. బిక్స్ ఇరుసడ్ల దర్శకత్వంలో భాస్కర్ భాసాని నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ– ‘‘వినోదాత్మకంగా తెరకెక్కిన చిత్రమిది. ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా నవ్వుకుంటూ చూడొచ్చు. నందు కెరీర్లో ఓ డిఫరెంట్ చిత్రమిది. తన గత చిత్రాలతో పోలిస్తే ఇందులో చాలా బాగా నటించాడు. నటి తేజస్విని పాత్రకు ఆడియన్స్ ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు. మాతో అసోసియేట్ అయిన నిర్మాతలు ఎస్. శ్రీకాంత్ రెడ్డి, రామ్మోహనరావులకు (హరిహర చలనచిత్ర) కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘ఈ నెల 29న విడుదల కానున్న మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాత. -
యాంకర్ ఆత్మహత్య కేసులో మలుపు
కృష్ణా, కంకిపాడు: వివాహిత ఆత్మహత్య కేసులో మలుపు చోటుచేసుకుంది. తన భర్త ప్రవర్తన నచ్చక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మృతురాలు తేజస్విని సూసైడ్ నోట్ రాసింది. ఈ నోట్ పోలీసులకు లభ్యం కావటంతో అనుమానాస్పద మృతిగా నమోదు చేసిన కేసును 498ఏ, 306 సెక్షన్ల కింద మార్పు చేస్తూ సోమవారం సాయంత్రం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...గుంటూరు జిల్లా నల్లపాడుకు చెందిన తేజస్విని (26) ఐదేళ్ల క్రితం మట్టపల్లి పవన్‌కుమార్‌ను ప్రేమించి పెళ్లిచేసుకుంది. తేజస్విని విజయవాడలోని ఓ ప్రైవేటు చానల్లో న్యూస్ రీడర్‌గానూ, పవన్‌కుమార్ ఉయ్యూరులోని బజాజ్ రిలయన్స్‌లో పనిచేస్తున్నారు. ఈనెల 16వ తేదీ రాత్రి అనుమానాస్పద స్థితిలో ఈడుపుగల్లులోని ఎంబీఎంఆర్ కాలనీలోని అద్దె ఇంట్లో ఉరివేసుకుని తేజస్విని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు అర్థరాత్రి సమయంలో ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసులో సెక్షన్లు మార్పు తేజస్విని ఆత్మహత్యపై తొలుత 174 సెక్షన్ కింద అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. చనిపోయే ముందు తేజస్విని రాసిన సూసైడ్ నోట్ పోలీసులకు లభ్యమైంది. మృతురాలి తల్లి మంగళగిరి వెంకటరమణమ్మ తన కుమార్తెను ఐదేళ్ల కిందట పవన్‌కుమార్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని, ఆత్మహత్యకు గల కారణాలు తెలీదని, విచారించాలని అదేరోజు రాత్రి ఫిర్యాదులో పేర్కొంది. ఆ దిశగా పోలీసులు విచారణ చేపట్టారు. ఫేస్బుక్, ఈమెయిల్స్‌ను ఆమె ల్యాప్‌టాప్‌లో పరిశీలించారు. ‘ప్రేమించి, నమ్మి వచ్చినందుకు వేధించాడని, ఇబ్బందులు పెడుతున్నాడని, స్నేహితులే ఎక్కువ అయ్యారని, తనను పట్టించుకోవటం లేదని, ప్రవర్తన సరిగా లేదని అందుకే మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నట్లు’ సూసైడ్ నోట్లో తేజస్విని పేర్కొన్నట్లు సమాచారం. విజయవాడ ఈస్ట్ జోన్ ఏసీపీ విజయభాస్కర్ సోమవారం స్థానిక పోలీసుస్టేషన్‌ను సందర్శించి వివరాలు సేకరించారు. ఈడుపుగల్లులోని ఘటనాస్థలానికి వెళ్లి విచారణ జరిపారు. ఈ నేపథ్యంలో 498ఎ, 306 సెక్షన్ల కింద కేసులో మార్పులు చేసి దర్యాప్తు చేపట్టారు. తేజస్విని భర్త పవన్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఇదిలా ఉంటే మధ్యాహ్నం వరకూ మృతురాలి కుటుంబ సభ్యులు, పవన్‌కుమార్ కుటుంబ సభ్యులతో పోలీసుస్టేషన్ వద్ద రాజీ మంతనాలు జరిగినట్లు సమాచారం. -
తేజస్విన్‌కు ఎన్సీఏఏ హైజంప్ టైటిల్
భారత అథ్లెట్ తేజస్విన్ శంకర్ అమెరికాలో జరిగిన యూనివర్సిటీ గేమ్స్‌లో మెరిశాడు. నేషనల్ కాలేజియేట్ అథ్లెటిక్ అసోసియేషన్ (ఎస్సీఏఏ) ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీల్లో 19 ఏళ్ల తేజస్విన్ హైజంప్‌లో స్వర్ణం నెగ్గాడు. కాన్సస్ యూనివర్సిటీ తరఫున బరిలోకి దిగి 2.24 మీటర్లతో విజేతగా నిలిచాడు. -
పునరాగమనం కాదు... కొనసాగింపే: తేజస్విని
ముంబై: తన క్రీడా పయనం కొనసాగుతుందని... మధ్యలో వచ్చింది విరామమేనని అంటోంది భారత షూటర్ తేజస్విని సావంత్. గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ క్రీడల్లో 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ విభాగంలో స్వర్ణం గెలిచిన తేజస్విని... ఈ క్రీడల్లో కొత్త రికార్డు కూడా నెలకొల్పింది. దీంతోపాటు మహిళల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్‌లో రజతం నెగ్గింది. అయితే, 2014 కామన్వెల్త్, అనంతరం ఇతర అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనలేకపోయిన ఆమె కెరీర్లో కొంత వెనుకబడింది. దీంతో గోల్ట్‌కోస్ట్ విజయాన్ని విశ్లేషకులు తేజస్వినికి ‘కమ్ బ్యాక్’గా పేర్కొంటున్నారు. కానీ, కుటుంబ కారణాలరీత్యా రెండు నెలలు విరామం తీసుకోవడంతో 2014 కామన్వెల్త్ పోటీలకు అర్హత సాధించలేకపోయినట్లు ఆమె చెప్పింది. మూడేళ్లుగా భారత నంబర్‌వన్ క్రీడాకారిణిగా తానే ఉండటాన్ని ప్రస్తావించింది. 2020 ఒలింపిక్స్‌ను లక్ష్యంగా పెట్టుకున్న ఆమె... ఈ క్రమంలో ఆసియా క్రీడల్లో రాణించాలని భావిస్తోంది. -
స్వర్ణం నెగ్గిన 15 ఏళ్ల భారత షూటర్ అనీశ్
-
భారత్ స్వర్ణాల వేట మొదలైంది..
గోల్డ్‌కోస్ట్, క్వీన్స్లాండ్ : 21వ కామన్వెల్త్ గేమ్స్‌లో తొమ్మిదో రోజు భారత్ స్వర్ణం, రజతంతో పతకాల ఖాతాను తెరచింది. 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్లో భారత మహిళా షూటర్లు తేజస్విని సావంత్ స్వర్ణానికి గురి పెట్టగా, అంజుమ్ రెండు పాయింట్ల తేడాతో రజతం పతకం సాధించారు. తేజస్విని 457.9 పాయింట్లతో కామన్వెల్త్ గేమ్స్‌లో రికార్డు సాధించి పసిడిని గెలిచారు. కాగా, రైఫిల్ ప్రోన్ ఈవెంట్లో తేజస్విని ఇప్పటికే రజతం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకూ గేమ్స్‌లో భారత్ సాధించిన పతకాల సంఖ్య 33కు చేరింది. ఇందులో 15 స్వర్ణాలు ఉన్నాయి. రెజ్లింగ్, షూటింగ్, బాక్సింగ్, జావెలిన్ త్రో, టేబుల్ టెన్నిస్, 400 మీటర్ల రిలే తదితర ఈవెంట్ల పలువురు భారతీయ ఆటగాళ్లు ఇప్పటికే ఫైనల్‌కు చేరుకున్నారు. -
రామనగర బీజేపీ అభ్యర్థిగా ఫైర్‌బ్రాండ్ ?
దొడ్డబళ్లాపురం: రాబోవు అసెంబ్లీ ఎన్నికలలో రామనగర నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ ఫైర్‌బ్రాండ్ తేజస్వినిగౌడ పోటీ చేయడం ఖాయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి చెన్నపట్టణ, రామనగర రెండు నియోజక వర్గాల నుండీ పోటీ చేస్తారని ప్రకటన వెలువడడంతో బీజేపీ ఇందుకు ప్రతితంత్రంగా తమ పార్టీ నుండి తేజస్వినిగౌడను బరిలోకి దింపడానికి పావులు కదుపుతోంది. 2004లో కనకపుర స్థానం నుండి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన తేజస్వినిగౌడ తన ప్రత్యర్థి మాజీ ప్రధాని దేవెగౌడకు ఓటమి రుచి చూపించారు. ఇప్పుడు దేవెగౌడ కుమారుడు కుమారస్వామి మట్టికరిపించేందుకు తేజస్వినిగౌడ అస్త్రాన్నే ప్రయోగిస్తున్నారు. ఈ రాజకీయమంతా చెన్నపట్టణ ఎమ్మెల్యే సీపీ యోగేశ్వర్ పథకం ప్రకారమే జరుగుతోందని తెలుస్తోంది. కుమారస్వామిని ఎలాగయినా ఓడించచేందుకు బీజేపీ కంకణం కట్టుకున్నట్టుంది. కాంగ్రెస్ నుంచి డీకే సురేష్ ? ఇలా ఉండగా కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రస్తుత కనకపుర ఎంపీ, మంత్రి డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్ రామనగర నియోజకవర్గం నుండి పోటీ చేస్తారనే వార్త వినిపిస్తోంది. ఏదిఏమయినా కుమారస్వామి ముఖ్యమంత్రి కావడానికి అవకాశం ఏమాత్రం కల్పించరాదని ప్రతినబూనిన బీజేపీ కాంగ్రెస్ పార్టీలు రామనగర,చెన్నపట్టణ నియోజకవర్గాలలో ఒక్క చోట కూడా కుమార స్వామి గెలవకుండా చేయాలని ఉన్న అన్ని అస్త్రాలూ ప్రయోగిస్తున్నాయి. ఒకవేళ కుమారస్వామిపై డీకే సురేష్, తేజస్వినిగౌడ పోటీ చేస్తే రామనగర ఎన్నికలు అత్యంత రసవత్తరంగా సాగుతాయనడంలో సందేహం లేదు. -
కన్నుల్లో నీరూపమే ట్రైలర్ రిలీజ్ చేసిన సుకుమార్
-
వెండితెరపై బుల్లితెర వెన్నెల
+‘వెన్నెల’ పోగ్రామ్‌తో బుల్లి తెర ప్రేక్షకులను అలరించిన జయతి ఇప్పుడు వెండితెరపైనా మెరవనున్నారు. ఆమె తొలిసారి హీరోయిన్గా నటిస్తూ, నిర్మించిన ‘లచ్చి’ సిన్మాలోని తొలి పాటను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈశ్వర్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి సురేష్ యువన్, పాల్ పవన్ స్వరకర్తలు. ‘‘పలు టీవీ ప్రోగ్రామ్స్ ప్రొడ్యూస్ చేసిన అనుభవంతో ఫస్ట్ టైమ్ సినిమా నిర్మించా. లచ్చి పాత్ర చుట్టూనే కథంతా తిరుగుతుంది. హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. నవంబర్ మూడో వారంలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు జయతి. దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకుడు వి.ఎన్.ఆదిత్య, నటుడు కృష్ణుడు పాల్గొన్నారు. తేజశ్విని, చంద్రమెహన్, రఘుబాబు, తాగుబోతు రమేష్, ధనరాజ్ నటించిన ఈ సినిమాకి మాటలు: మరుదూరి రాజా. -
ప్రతిక్షణం థ్రిల్ చేస్తుంది
‘‘ప్రతిక్షణం’ టైటిల్ చాలా బాగుంది. ‘క్షణం’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ‘ప్రతిక్షణం’ అంతకన్నా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా’’ అని నిర్మాత రాజ్‌కందుకూరి అన్నారు. మనీష్‌బాబు, తేజస్విని జంటగా తెరకెక్కిన చిత్రం ‘ప్రతిక్షణం’. నాగేంద్రప్రసాద్ దర్శకత్వంలో జి. మల్లిఖార్జునరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రీ–రిలీజ్, ప్లాటినమ్ డిస్క్ వేడుకలను నిర్వహించారు. చిత్రనిర్మాత మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ –‘‘ఇందులోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులను థ్రిల్‌కు గురి చేసి, కొత్త అనుభూతినిస్తుంది. రఘురామ్ సంగీతానికి మంచి స్పందన వస్తోంది’’ అన్నారు. తెలంగాణ డ్రగ్ కంట్రోల్ సంస్థ డైరెక్టర్ అమృతరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ దేవారెడ్డి, ఓంనాథ్‌రెడ్డి, రఘురామ్ తదితరులు పాల్గొన్నారు. -
పెళ్లి కళ!
నిఖిల్ హ్యాండ్సమ్గా ఉంటారు. ఇప్పు డింకా హ్యాండ్సమ్గా తయారయ్యారు. అదంతా పెళ్లి కళ అన్నమాట. ఈ యంగ్ హీరో పెళ్లి కుదిరింది. హైదరాబాద్‌కి చెందిన తేజస్వినీతో ఈ నెల 24న నిశ్చితార్థం జరగనుంది. అక్టోబర్ 1న ఈ ఇద్దరూ పెళ్లి పీటల మీద కూర్చోనున్నారు. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం. -
శిరీష ఘటనతో లింకుపై దర్యాప్తు
కుకునూర్‌పల్లికి రాజీవ్, శ్రవణ్, తేజస్విని! గజ్వేల్/కొండపాక: ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్యకు, హైదరాబాద్‌లో మేకప్ ఆర్టిస్ట్ శిరీష మృతి ఘటనకు లింకుపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎస్సై ఆత్మహత్య ఘటనకు నాలుగు రోజుల ముందు నుంచీ జరిగిన పరిణామాలపై దృష్టి కేంద్రీకరించారు. సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న శిరీష ఘటనతో ప్రమేయమున్న రాజీవ్, శ్రవణ్, తేజస్వినిలను కుకునూర్‌పల్లి పోలీస్ క్వార్టర్స్‌కు తీసుకువచ్చి విచారించినట్లు తెలిసింది. ఎస్సై క్వార్టర్లో 12వ తేదీ రాత్రి ఏం జరిగింది, ఏం మాట్లాడారనే అంశాలపై ప్రశ్నించినట్లు సమాచారం. -
అమెరికాలో తెలుగు యువతి మృతి
2 నెలల్లో పూర్తికానున్న చదువు.. అంతలోనే రోడ్డు ప్రమాదంలో దుర్మరణం విజయవాడ(రామవరప్పాడు): అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి మరణించింది. ఏపీలోని ప్రసాదంపాడు బీఎమ్పీఎస్ రోడ్డులో నివాసం ఉంటున్న చుండూరి విష్ణువర్ధన్, కోటేశ్వరీ దంపతులకు ముగ్గురు సంతానం. జ్యోత్స్న, తరుణ్ సాయి ఇంజినీరింగ్ చదువుతున్నారు. పెద్ద కుమార్తె సాయి తేజస్వీ ఎమ్ఎస్ చేయడానికి అమెరికాకు 16 నెలల కిందట వెళ్లిం ది. నార్త్ వెస్ట్రన్ పాలిటెక్నిక్ వర్సిటీలో విద్య ను అభ్యసిస్తోంది.కాలిఫోర్నియాలో సోమవారం రాత్రి నడుచుకుంటూ రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది. వెంటనే తేజస్వీని ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మరణించింది. చిన్నతనం నుంచి చదువులో ముందంజ చిన్నతనం నుంచి తేజస్వీ చదువులో ముందుండేది. చదువుపై ఉన్న ఇష్టాన్ని గమనించి రైతు అరుున తండ్రి విష్ణువర్ధన్ ఆమెను కష్టపడి చదివించాడు. అమెరికాలో ఎమ్ఎస్ చేయడానికి పంపించారు. మరో రెండు నెలల్లో చదువు పూర్తి కానుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. మంచి ఉద్యోగంలో స్థిరపడి మన కుటుంబాన్ని దేనికి లోటు లేకుండా బాగా చూసుకుంటానని తరచూ అంటుండేదని కుటుంబ సభ్యులు విలపిస్తూ తెలిపారు. కాగా, సారుు తేజస్వి మృతదేహం అమెరికా నుంచి దేశానికి త్వరగా వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి అరుు్యందని తెలిపారు. అక్కడి నుంచి మృతదేహం త్వరగా వచ్చేలా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేయాలని కోరుతున్నారు. -
క్షణ క్షణం ఉత్కంఠగా..!
మనీశ్, తేజస్విని జంటగా నాగేంద్రప్రసాద్ దర్శకత్వంలో మల్లికార్జున్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘ప్రతిక్షణం’. రఘురామ్ స్వర కర్త. సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ పాటల సీడీలను విడుదల చేసి, తొలి సీడీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు అందించారు. ఆర్పీ మాట్లాడుతూ - ‘‘పాటలు, ట్రైలర్ బాగున్నాయి. రఘురామ్ గాయకుడిగా తెలుసు. వృత్తిపట్ల అంకితభావం ఉన్న వ్యక్తి. సంగీత దర్శకుడిగా మంచి పేరు సంపాదిస్తాడు’’ అన్నారు. ‘‘కమర్షియల్ హంగులతో కూడిన రొమాంటిక్ థ్రిల్లర్ అండ్ హారర్ చిత్రమిది. ప్రతి సన్నివేశం ఉత్కంఠగా సాగు తుంది’’ అన్నారు దర్శకుడు. నిర్మాత మల్లికార్జున్‌రెడ్డి మాట్లాడుతూ - ‘‘హారర్ చిత్రమే కానీ దెయ్యం ఉండదు. ట్విస్టులతో ప్రతి క్షణం ఆసక్తిగా సాగుతుంది. రఘు రామ్ పాటలు, నేపథ్య సంగీతం చిత్రానికి ప్లస్ పాయింట్స్. అక్టోబర్‌లో రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. నిర్మాతలు కేఎల్ దామోదర్ ప్రసాద్, సాయి వెంకట్, హీరో హీరోయిన్లు మనీశ్, తేజస్విని, స్వరకర్త రఘురామ్ పాల్గొన్నారు. -
నవ వధువు ఆత్మహత్య
బెంగళూరు (బనశంకరి) : పెళ్లయిన ఆరు నెలలకే నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శుక్రవారం కొడిగేహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. నగరానికి చెందిన తేజస్విని (25) ఇక్కడి ఫిలిప్స్ కంపెనీలో ఇంజినీరుగా పనిచేస్తోంది. చెన్నైకి చెందిన దేవరాజ్ మెట్రిమోని ద్వారా తేజస్వినిని ఆరు నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. నగరంలోని తిండ్లుక్రాస్‌లోని ఓ అపార్టుమెంట్లో దంపతులు నివాసముంటున్నారు. ఇదిలా ఉంటే వ్యాపారం కోసం కొంత పెట్టుబడి కావాలని తరచూ భార్య తేజస్విని దేవరాజ్ వేధించేవాడని సమాచారం. తేజస్విని తల్లిదండ్రులు కూడా సమీపంలోనే నివాసముంటున్నారు. ఇదిలా ఉంటే శుక్రవారం మధ్యాహ్నం తేజస్విని చివరిగా తల్లితో ఫోన్లో మాట్లాడింది. కొద్దిసేపు అనంతరం తేజస్విని ఉరి వేసుకుందని ఫోన్ రావడంతో తల్లిదండ్రులు హుటాహుటిన కుమార్తె ఇంటికి వెళ్లారు. అక్కడ తేజస్విని ఉరి వేసుకున్నృదశ్యం అనుమానంగా ఉండటంతో వారు కొడిగేహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు న మోదు చేసుకున్న పోలీసులు దేవరాజ్‌ను అదుపులోకి తీసుకుని తమదైనశైలిలో విచారణ చేస్తున్నారు. డబ్బు ఇవ్వకపోవడంతో భర్త దేవరాజ్, తేజస్వనిని హత్య చేశారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. -
నగరంలో మెరిసిన తేజస్విని..
సాక్షి, సిటీబ్యూరో: ఫ్యాషన్, స్టైల్, లుక్ ప్రస్తుత జీవనశైలిలో భాగంగా మారాయని, తగిన జాగ్రత్తలు, ట్రీట్మెంట్స్తో అందాన్ని మరింతగా మెరిపించొచ్చని సినీ తార తేజస్విని అన్నారు. మాదాపూర్‌లో అనూస్ ఫ్రాంచైజీ సెలూన్‌ను ఆమె గురువారం ప్రారంభించారు. -
విష జ్వరంతో చిన్నారి మృతి
చెన్నూరు: స్థానిక సరస్వతీనగర్‌లో నివాసముంటున్న కె రవి, మహేశ్వరిల కుమార్తె తేజస్విని(2) విషజ్వరంతో శనివారం తెల్లవారుజామున మృతి చెందింది. బంధువులు తెలిపిన ప్రకారం తేజస్వినికి మూడు రోజులుగా జ్వరం వస్తుండటంతో స్థానిక ప్రభుత్వ వైద్యశాల, ఆర్ఎంపీ వైద్యుని వద్ద చికిత్స చేయించారు. శుక్రవారం వైద్యశాలలో చికిత్స అనంతరం ఇంటికి తీసుకురాగా రాత్రి తీవ్ర జ్వరం, శ్వాస తీసుకోవడానికి కష్టంగా ఉండటంతో స్థానిక ఆర్ఎంపీ వైద్యుని వద్దకు తీసుకెళ్లగా, కడపకు తీసుకెళ్లాలని సూచించారు. రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందింది. విజృంభిస్తున్న విష జ్వరాలు : చెన్నూరు మండలంలోని చిన్నమాచుపల్లె, శివాలపల్లె, చెన్నూరు, బయనపల్లె గ్రామాల్లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. చెన్నూరు తూర్పు దళితవాడకు చెందిన బాలిక డెంగీ లక్షణాలతో చికిత్స పొందుతోంది. వనంవీధికి చెందిన సురేష్ కుమార్తె అలేఖ్య (7) విషజ్వరంతో బాధపడుతుండగా కడపకు తీసుకెళ్లగా డెంగీ జ్వరమని అక్కడి వైద్యులు నిర్ధారించడంతో కర్నూలుకు తరలించారు. మండలంలో పలు గ్రామాల్లో జ్వరాలతో బాధపడుతున్నారని అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. -
రోడ్డుపైనే భార్యను నరికిన భర్త
అందరూ చూస్తుండగానే ఓ భర్త భార్యపై దాడికి పాల్పడ్డాడు. విజయవాడ నగరం పెజ్జోనిపేటలో పట్టపగలే ఈ దారుణం చోటుచేసుకుంది. మహేశ్, తేజస్వినిల వివాహం ఏడాది క్రితం అయింది. అప్పటి నుంచి వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం మధ్యాహ్నం సోదరునితో కలసి చర్చికి వెళ్లి వస్తున్న భార్యపై మహేశ్ కత్తితో దాడి చేశాడు. మెడపై నరకటంతో ఆమె అక్కడే పడిపోయింది. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. పరారీలో ఉన్న మహేశ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
కన్నతండ్రే కాళ్లయ్యాడు..
‘నన్ను 20 ఏళ్లుగా తన భుజస్కంధాలపై మోస్తున్నాడు నాన్న. ప్రస్తుతం ఐసెట్ రాశాను. గ్రూప్-2కి ప్రిపేర్ అవుతున్నాను. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి నా కోసం సర్వం ధారపోసిన తండ్రి రుణం తీర్చుకుంటానంటోం’ది తేజస్విని. రాంనగర్‌లోని బాప్టిస్టు చర్చి సమీపంలో నివాసముండే ముజ్జి వెంకటేశ్వరరావు, రమాదేవిల కూతురు తేజస్విని. ఈమెకు పుట్టుకతోనే పోలియో సోకడం తో కదల్లేని పరిస్థితి. కాలు ఇంటి బయట పెట్టాలన్నా సపోర్ట్ కావాల్సిందే. చిన్నప్పుడు హయత్‌నగర్‌లోని ఓ స్కూల్లో చదువుకున్నప్పుడు తల్లిదండ్రులు ఆమెను రోజూ స్కూల్లో వదిలి వచ్చేవారు. రాంనగర్ సెయింట్ పాయిస్లో ఇంటర్ చేసినప్పుడు తరగతి గది మూడో అంతస్తులో ఉండటంతో తండ్రి వెంకటేశ్వరరావు కూతురును ఎత్తుకొని వెళ్లి, ఎత్తుకొచ్చేవారు. రెండేళ్లు రోజూ ఇదే విధంగా చేశారు. మారేడ్‌పల్లిలోని కస్తూర్భా మహిళా డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో చదివినప్పుడు మూడేళ్లు కూడా తరగతి గదిలో కూర్చోబెట్టి వచ్చేవారు. అన్ని పనులు మానుకొని కూతురికే అత్యధిక సమయం వెచ్చించడంతో కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా దిగజారిపోయింది. అయినా పట్టించుకోలేదు. ఆమె కోసం ఆటో కొని అందులో పాపను తీసుకువెళ్లి, తీసుకొచ్చేవారు. ప్రతి రోజూ క్రమం తప్పకుండా పాపను తన భుజాలపై మోసుకుంటూ తరగతి గదిలో కూర్చొబెట్టిన వెంకటేశ్వరరావును కళాశాల వార్షికోత్సవం సందర్భంగా ‘బీయింగ్ ఎగ్జామ్ప్లరీ పేరెంట్స్’ పేరుతో సత్కరించారు కూడా. -
ఉరేసుకుని సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
హైదరాబాద్: నగరంలోని కేపీహెచ్‌బీ లో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని 5వ ఫేజ్ హాస్టల్ ఉంటున్న తేజస్విని (25) అనే సాఫ్ట్వేర్ ఉద్యోగిని గురువారం తన మేనమామ ఇంట్లో ఆత్మహత్య చేసింది. ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. తేజస్విని సొంతూరు వరంగల్ జిల్లా ఖాజీపేట. తండ్రి రైల్వేలో ఉద్యోగం చేస్తున్నాడు. తేజస్విని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. -
మృతదేహంతో పోలీస్‌స్టేషన్ ఎదుట నిరసన
గుంటూరు: గుంటూరు జిల్లా రేపల్లెలో శుక్రవారం వెలుగు చూసిన ఇంటర్ విద్యార్థిని తేజస్విని మృతిపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. కుటుంబసభ్యుల డిమాండ్ మేరకు ప్రత్యేక వైద్యాధికారుల బృందంతో ఆదివారం మధ్యాహ్నం తేజస్విని మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. అయితే, ఆమె మృతిపై కేసును పక్కదారి పట్టించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని కుటుంబసభ్యులు ఆరోపించారు. తేజస్వినిది ఆత్మహత్యగా కేసు నమోదు చేయటంపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగరాజును అదుపులోకి తీసుకోవాలని, నిందితులు నలుగురిపై నిర్భయ కేసు నమోదు చేయాలని, కఠినంగా శిక్షించాలని కోరారు. తేజస్విని మృతదేహంతో ఆదివారం మధ్యాహ్నం రేపల్లె పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు వారితో చర్చలు జరుపుతున్నారు. -
దారుణం..!
♦ పరిచయస్తుని గదిలో ఇంటర్ విద్యార్థిని మృతదేహం ♦ గుండెలవిసేలా రోదిస్తున్న తల్లిదండ్రులు ♦ రూమ్‌కు తీసుకువచ్చి హత్య చేశారని ఆరోపణ ♦ పోలీసుల అదుపులో నిందితుడు ? ‘ కాలేజీకి వెళ్లి వస్తానమ్మా’ అంటూ వెళ్లిన కుమార్తె విగతజీవిలా పడిఉండడాన్ని చూసిన ఆమె తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. కన్నబిడ్డ కళ్ల ఎదుటే మృతదేహంలా పడివుండటాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు. ఇంటిలో భోజనం చేసి వెళ్లిన కుమార్తె తేజశ్విని పరిచయస్తుని గదిలో నిర్జీవంగా పడిఉండడాన్ని అనుమానిస్తున్నారు. తన బిడ్డకు మాయమాటలు చెప్పి గదికి తీసుకువచ్చి హత్య చేశారని ఆరోపిస్తున్నారు. ఇంటర్మీడియెట్ విద్యార్థిని హత్యోదంతం రేపల్లె పట్టణంలో శుక్రవారం సంచలనం సృష్టించింది. రేపల్లెటౌన్ : పట్టణంలోని 14వ వార్డుకు చెందిన బొమ్మిడి సాంబశివవరప్రసాద్, రాజేశ్వరి దంపతులకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. స్థానికంగా వెల్డింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. కుమార్తె తేజశ్వినిని నాలుగు రోజుల క్రితం ఇంటర్మీడియెట్‌లో చేర్పించారు. కుమారులు జ్యోతిప్రకాష్, దినేష్‌లు 9, 6వ తరగతి చదువుతున్నారు. 12వ వార్డులో అద్దెకు ఉంటున్న నిజాంపట్నం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన చిప్పల నాగరాజు స్థానికంగా రొయ్యల కంపెనీలో పనిచేస్తున్నాడు. కొద్ది రోజుల కిందట నాగరాజు, తేజశ్విని మధ్య పరిచయం ఏర్పడింది. ఇదిలా ఉండగా తేజశ్విని గురువారం ఉదయం కాలేజీకి వెళ్లి భోజనానికి మధ్యాహ్నం ఇంటికి వచ్చింది. భోజనం చేసి కాలేజీకి వెళ్లివస్తానమ్మా అంటూ తల్లి రాజేశ్వరికి చెప్పి వెళ్లింది. సాయంత్రం దాటినా తేజశ్విని ఇంటికి రాకపోయేసరికి తల్లిదండ్రులు కాలేజీకి వెళ్లి వాకబు చేశారు. మధ్యాహ్నం నుంచి కాలేజీకి రాలేదని అక్కడ చెప్పటంతో ఆందోళనకు గురయ్యారు. కొత్తపాలెంలోని అమ్మమ్మ, నిజాంపట్నంలో పెద్దమ్మ ఇళ్లతో పాటు బంధువులకు ఫోన్లు చేసినా ఫలితం కనిపించలేదు. చివరకు ఇంటిలో ఉన్న సెల్‌ఫోన్‌కు నాలుగు సార్లు కాల్ వచ్చిన నంబర్‌ను వాకబు చేసి, అది రొయ్యల కంపెనీలో పనిచేసే చిప్పల నాగరాజుదిగా గుర్తించారు. దీంతో నాగరాజు సోదరి ఇంటికి వెళ్లగా, ఆమె బెదిరింపు ధోరిణితో మాట్లాడటంతో నాగరాజుపై అనుమానం వచ్చి బంధువులతో కలసి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో నాగరాజు రూమ్ యజమాని అడుసుమల్లి శాంతకుమారి ఓ బాలిక మృతదేహం నాగరాజుకు అద్దెకు ఇచ్చిన గదిలో పడివున్నట్టు పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. దీంతో అనుమానం వచ్చి సీఐ మల్లిఖార్జునరావు తో పాటు వెళ్లి చూడగా, తేజశ్వినిగా గుర్తించి బోరున విలపించారు. నా బిడ్డను హత్య చేశారు.. తేజశ్వినికి మాయమాటలు చెప్పి గదికి తీసుకువెళ్లి హత్య చేశారని మృతురాలి తల్లిదండ్రులు రాజేశ్వరి, సాంబశివవరప్రసాద్, బంధులు ఆరోపిస్తున్నారు. దీంట్లో నాగరాజుతో పాటు కొంత మంది ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మృతదేహం మెడపై రక్తం మరకలు, నోటిపై నురగ ఉన్నాయి. గదిలో డ్రింక్ బాటిల్స్, వాటర్ బాటిల్స్ పడివుండి ఉన్నాయి. తేజశ్విని తానే స్వయంగా ఈ గదికి వచ్చిందా లేక ఎవరైనా ఎత్తుకొచ్చారా, హత్యకు ఎలా గురైంది అనే అంశాలు మిస్టరీగానే ఉన్నాయి .ఇదిలా ఉండగా నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. హత్య కేసుగా నమోదు.. శవపంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం విద్యార్థిని మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్యకేసుగా నమోదు చేసినట్టు సీఐ మల్లిఖార్జునరావు చెప్పారు. నిందితులను కఠినంగా శిక్షించాలి... విద్యార్థిని హత్య వార్త క్షణాల్లో పట్టణంలో వ్యాపించటంతో అధిక సంఖ్యలో జనం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తేజశ్విని మృతికి కారణమైన చిప్పల నాగరాజును కఠినంగా శిక్షించాలని ప్రజలు, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అదే విధంగా నాగరాజుతో పాటు ఆ గదికి వెళ్లింది ఎవరు అనే అంశంపై, ఆ లోపల ఏం జరిగిందనే విషయంపై క్షుణ్ణంగా దర్యాప్తు నిర్వహించి నిజాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. -
ఇద్దరు భర్తలు... ఇద్దరు భార్యలు...ఒక్క ఎంపీ సీటు
ఈ లోకసభ ఎన్నికల్లో బెంగుళూరు సౌత్ లో చాలా ఆసక్తిదాయకమైన పోటీ నెలకొంది. ఐటీ రంగ దిగ్గజం నందన్ నీలేకని, ఓటమినెరుగని బిజెపి నేత అనంతకుమార్ లు ఇక్కడ నుంచి పోటీ పడుతున్నారు. నీలేకని కాంగ్రెస్ నుంచి పోటీలో ఉంటే, అనంతకుమార్ బిజెపి నుంచి పోటీ పడుతున్నారు. ఇద్దరు నాయకుల భార్యలు కూడా ప్రచారంలో తలమునకలై ఉన్నారు. అనంత్ కుమార్ భార్య తేజస్విని, నీలేకని భార్య రోహిణి ల ప్రచార శైలి కూడా చాలా భిన్నం. రోహిణి రాజకీయాలకు కొత్త. ముఖ్యంగా ప్రజల్లోకి వెళ్లడం ఆమెకు అలవాటు లేదు. ఐటీ ఉద్యోగులతో కలిసి మాట్లాడటం కాస్త సులువుగానే ఉన్నా మిగతా ప్రజలతో ఆమె కలవడంలో కాస్త ఇబ్బంది పడుతున్నారు. అసలు భర్త రాజకీయాల్లోకి వస్తారన్న విషయాన్ని ఆమె ఏనాడూ ఊహించలేదు. ఆమె ఇప్పటికీ జీర్ఝించుకోలేకపోతోంది. అయితే మారిన పరిస్థితులకనుగుణంగా తనను తాను మలచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తేజస్విని అనంత్ కుమార్ 1988 నుంచే ప్రజా జీవనంలో ఉన్నారు. ఆమెకు ప్రజలను కలవడం బాగా అలవాటు. నిజానికి అనంత్ కుమార్ కు మొదటి నుంచీ ఆమె వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్నారు. అసలు అనంత్ సక్సెస్ కు కారణం తేజస్వినే అని చాలా మంది చెబుతున్నారు. ఆమె గతంలో లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ విభాగంలో పనిచేశారు. భర్త క్రియా శీల రాజకీయాల్లోకి రాగానే ఆమె ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంటిని, భర్త కార్యాలయాన్ని మేనేజ్ చేస్తున్నారు. నందన్ ఆస్తులు 770 కోట్లు. ఆయనకు ఇన్ఫోసిస్ లో 1.45 శాతం షేర్లున్నాయి. రోహిణికి కూడా 1.30 శాతం షేర్లున్నాయి. అనంత్ కుమార్ భార్యకు 4/2 కోట్ల ఆస్తి, అనంతకుమార్ కి 51.13 లక్షల విలువైన ఆస్తులున్నాయి. -
మూలపొలంలో బాలకృష్ణ చిన్న కుమార్తె
సంక్రాంతి వేడుకలు జరుపుకొనేందుకు సినీహీరో నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని తన భర్త శ్రీభరత్‌తో కలిసి ఎస్.మూలపొలంలోని అత్తవారింటికి మంగళవారం వ చ్చారు. శ్రీభరత్ మాజీ ఎంపీ గీతమ్స్ విద్యా సంస్థల అధినేత ఎంవీవీఎస్ మూర్తి (గోల్డ్‌స్పాట్ మూర్తి) ( కొడుకు కొడుకు), కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు (కూతురి కొడుకు)ల మనుమడు. సినిమా షూటింగ్లో బిజీగా ఉండడంతో బాలకృష్ణ రాలేకపోయినట్టు మూర్తి తెలిపారు. ఇదిలా ఉండగా మనుమడు శ్రీభరత్ దంపతులతో గడిపేందుకు కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు కూడా ఎస్. మూలపొలంలోని గోల్డ్‌స్పాట్ మూర్తి ఇంటికి మంగళవారం వచ్చారు. సాంబశివరావు స్థానికులతో కలసి భోగి పండగ వేడుకల్లో పాల్గొన్నారు. మూర్తి ఆహ్వానం మేరకు ఇక్కడకు వచ్చినట్టు ఆయన విలేకరులకు తెలిపారు. తనకు ఏ విధమైన అధికారిక లాంఛనాలు వద్దని పోలీసు, రెవెన్యూ అధికారులను సాంబశివరావు పంపించి వేశారు. -
బాలకృష్ణ కూతురు పెళ్లిలో ప్రముఖుల సందడి!
-
నందమూరి ఫ్యామిలీ 'వార్'
నందమూరి కుటుంబంలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. తమ కుటుంబం మధ్య ఎలాంటి విబేధాలు లేవని తామంతా ఒక్కటే అన్న సంకేతాలు ఇచ్చినా..... బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని వివాహం వేదికగా అన్నదమ్ముల మధ్య విభేదాలు బహిర్గతం అయ్యాయి. బాలయ్య ఇంట శుభకార్యానికి ఆయన సోదరుడు, టీడీపీ ఎంపీ నందమూరి హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాకపోవటం రాజకీయ వర్గాల్లోనూ, సినీ పరిశ్రమలోనూ చర్చనీయాంశమైంది. అయితే హరికృష్ణ పెద్ద కుమారుడు కళ్యాణ్ రామ్ వివాహానికి హాజరయ్యారు. మరోవైపు అసలు జూనియర్ ఎన్టీఆర్‌కు వివాహ ఆహ్వానం అందలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందుకు జూనియర్ ఎన్టీఆర్,చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్‌ల మధ్య ఏర్పడ్డ విభేదాల కారణంగానే ఎన్టీఆర్‌కు పెళ్లిపిలుపు అందలేదన్న చర్చ జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్‌ను పెళ్లికి పిలవనందునే హరికృష్ణ కూడా ఈ వివాహా కార్యాక్రమానికి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. తేజస్విని వివాహ వేడుకను జూనియర్ ఎన్టీఆర్ తన ఇంట్లో టీవీలో వీక్షించినట్లు సమాచారం. ఇక హరికృష్ణ, బాలకృష్ణల మధ్య విబేధాలు చోటు చేసుకున్న సంగతి బహిరంగ రహస్యమే. బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రహ్మణిని చంద్రబాబు కుమారుడు లోకేష్ వివాహం చేసుకున్న తర్వాత బాలయ్య, బాబుల దోస్తీ మరింత బలపడింది. బాలకృష్ణ పూర్తిగా చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరించడం హరికృష్ణ అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్‌కు ప్రాధాన్యత ఇవ్వని విషయంలో ఏర్పడిన విబేధాలు హరికృష్ణకు చంద్రబాబుకు మధ్య అంతరం పెంచాయి. తెలుగుదేశం పార్టీ పగ్గాలను చంద్రబాబు తన తనయుడు లోకేష్‌కు అప్పగించాలనే ప్రయత్నాలతోనే వారు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అంతేకాకుండా సోదరుడు బాలయ్య భవిష్యత్తులో బావ నుండి పార్టీ బాధ్యతలు తీసుకొని ‘ముఖ్య’ పదవులను అధిష్టించడమో లేక తన అల్లుడు లోకేష్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ కూడా లోకేష్ చేతికి పగ్గాలు పోతే పార్టీ తన చేతుల్లోకి రావడం కుదరదని భావించి పార్టీలో పట్టుకోసం ప్రయత్నించి విఫలమయ్యారు. ఆ మధ్యకాలంలో బాలయ్య,ఎన్టీఆర్‌లు కొన్ని వేదికలపై కలిసి కనిపించినా, తదుపరి కాలంలో మళ్లీ అంతరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో బాబాయ్, అబ్బాయ్‌ల మధ్య విభేదాలు వచ్చాయని అంటున్నారు. ఆ కారణంగానే జూనియర్ తన మావయ్య, బాబాయ్‌ల పైన అసంతృప్తితోనే ఉన్నారనే ప్రచారం జరిగింది. వీటికి స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ ....రాజకీయాల్లోకి వచ్చేంత వయసు తనకు రాలేదని.... ప్రస్తుతం సినిమాలపైనే తన దృష్టి అని స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఇటీవల ఈ విభేదాలు సద్దుమణగినట్లు కనిపించినా హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ తమ రాజకీయాలకు పదును పెడుతూనే ఉన్నారని తెలుస్తోంది. రాజకీయాలపై జూనియర్ ఎన్టీఆర్ వ్యూహం, తాత సీనియర్ ఎన్టీఆర్ వారసత్వాన్ని అందుకోవాలనే తపన వెరసి ప్రస్తుతం నందమూరి కుటుంబంలో ప్రచ్ఛన్న యుద్ధానికి కారణమని తెలుస్తోంది. అంతే కాకుండా తెలంగాణ విషయంలో పార్టీ అధ్యక్షుడు, బావ చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హరికృష్ణ బహిరంగంగానే లేఖాస్త్రాలు సంధించారు. సమైక్యాంధ్ర నినాదాన్ని ఎత్తుకున్న హరికృష్ణ త్వరలో రాష్ట్రవ్యాప్తంగా చైతన్య రథయాత్ర చేపట్టనున్నట్లు సమాచారం. తాజా పరిణామాలు తెలుగుదేశం పార్టీపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది కూడా ఆసక్తికరంగా మారింది. -
తేజస్విని పెళ్లిలో సినీ, రాజకీయ ప్రముఖుల సందడి
సినీనటుడు బాలకృష్ణ రెండవ కూతురు తేజస్విని వివాహం హైదరాబాద్ లోని హైటెక్స్ ప్రాంగణంలో అత్యంత వైభవంగా జరిగింది. తేజస్విని వివాహానికి భారీ ఎత్తున వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. హైటెక్స్ ప్రాంగణమంతా రాజకీయ నేతలు, సినీ తారలతో కళకళలాడింది. వివాహా వేదిక వద్ద రాజకీయాలకు అతీతంగా, హోదాలను పక్కన పెట్టి ఒకరికొకరు కులాసాగా, ఆత్మీయంగా కబుర్లు చెప్పుకోవడం అందర్నిని ఆకర్షించింది. ఇక చిరంజీవి, బాలకృష్ణలు ఆత్మీయంగా ఆలింగనం చేసుకోని, కులాసాగా మాట్లాడుకోవడం అభిమానులతోపాటు పలువుర్ని ఆనందానికి లోను చేసింది. వివాహానికి హాజరైన వారిలో కేంద్ర మంత్రులు చిరంజీవి, పురందేశ్వరి, జైపాల్ రెడ్డి, కావూరి సాంబశివరావు, బలరాం నాయక్, తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య, ఎంపీలు నామా నాగేశ్వరరావు, మాగుంట శ్రీనివాసుల రెడ్డి, కనుమూరి బాపిరాజు, రాయపాటి సాంబశివరావు, మధు యాష్కీ, కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ ఆలీ, తెలుగుదేశం నేతలు యనమల రామకృష్టుడు, ఎర్రబెల్లి దయాకర్ రావు, అంబికా కృష్ణ, దేవినేని ఉమా, కరణం బలరాం, కాలువ శ్రీనివాసులు, సుజానా చౌదరీ, వర్ల రామయ్య, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయతోపాటు సినీ ప్రముఖులు రామానాయుడు, దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు, మోహన్ బాబు, మురళీ మోహన్, పరుచూరి బ్రదర్స్, జయసుధ, బ్రహ్మనందం, బాబు మోహన్, సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల, మంచు మనోజ్, లక్ష్మి, వెంకటేశ్, గోపిచంద్, బోయపాటి శ్రీను, జగపతిబాబు, కోడి రామకృష్ణ లు ఉన్నారు. ఇక ఈ వివాహానికి బాలకృష్ణ సోదరుడు హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లు హాజరుకాకపోవడం గమనార్హం. -
బాలకృష్ణ కూతురు వివాహనికి హరికృష్ణ డుమ్మా
నందమూరి కుటుంబంలో విభేదాలు మరోసారి తారస్థాయికి చేరాయి. ప్రముఖ నటుడు బాలకృష్ణ రెండవ కుమార్తె తేజస్వీని వివాహ మహోత్సవానికి ఆయన సోదరుడు హరికృష్ణతోపాటు ఆయన కుమారుడు, ప్రముఖ టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌లు హాజరుకాలేదు. దీంతో వారిరువురి కుటుంబాల మధ్య విభేదాలు మరో సారి బయటపడ్డాయని స్పష్టమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే రాష్ట విభజనకు చంద్రబాబు అనుకూలంగా కేంద్రప్రభుత్వానికి లేఖ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ విభజనకు చంద్రబాబే ముఖ్య కారణమని సర్వత్రా నిరసనలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హరికృష్ణ ఆ వివాహవేడుకలను దూరంగా ఉన్నారని సమాచారం. బుధవారం ఉదయం మాదాపూర్‌లోని హైటెక్స్‌లో తేజస్వీని- శ్రీభరత్‌ల వివాహ వేడుకలు అంగరంగవైభవంగా జరిగాయి. తెలుగు చిత్ర పరిశ్రమ, రాజకీయ రంగానికి చెందిన అతిరథమహారథులతోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఆ వివాహ వేడుకలకు హాజరై ఆ నూతన వధువువరులను ఆశీర్వదించారు. బాలకృష్ణ మొదటి కుమార్తె బ్రహ్మణీని తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కుమారుడు లోకేశ్ బాబుకు ఇచ్చి గతంలో వివాహాం చేసిన సంగతి తెలిసిందే. -
బాలకృష్ణ కూతురు వివాహనికి హరికృష్ణ డుమ్మా
-
బాలకృష్ణ కుమార్తె పెళ్లి ఫోటోలు
సినీనటుడు నందమూరి బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్విని వివాహం శ్రీభరత్‌తో బుధవారం హైటెక్స్‌లో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి పలువురు కేంద్ర మంత్రులతోపాటు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన దిగ్గజాలు హాజరయ్యారు. -
బాలకృష్ణ కూతురు తేజస్వి వివాహ వేడుక
-
బాలయ్య ఇంట పెళ్లి సందడి
నందమూరి బాలకృష్ణ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఈ నెల 21న బాలయ్య, వసుంధరాదేవిల రెండో కుమార్తె తేజస్విని వివాహం మతుకుమల్లి శ్రీభరత్‌తో జరగనుంది. హైదరాబాద్‌లోని హైటెక్స్ ప్రాంగణంలో ఈ వేడుకను వైభవంగా జరపనున్నారు. అత్యంత సుందరంగా కళ్యాణ మండపాన్ని తయారు చేయిస్తున్నారు. పలు భారీ చిత్రాలకు అద్భుతమైన సెట్స్ వేయడంతో పాటు ఇప్పటివరకు టాలీవుడ్లో జరిగిన చిరంజీవి తనయ సుస్మిత వివాహం, రామ్‌చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్‌ల వివాహానికి వీక్షకులను అబ్బురపరిచే మండపాలు తయారు చేసిన ఆనంద్‌సాయి ఈ నందమూరి ఇంటి పెళ్లికి కూడా మండపం తయారు చేస్తున్నారు. మండపం నమూనాని బాలకృష్ణ దంపతులకు ఆనంద్‌సాయి చూపించగానే ఓకే చేశారట. స్వర్ణ వర్ణంతో ఉండబోయే ఈ మండపం నీలం రంగు లైటింగ్‌తో తళతళలాడబోతోందని సమాచారం. దాదాపు 45 రోజులుగా 175 మంది ఈ మండపాన్ని తయారు చేసే పని మీద ఉన్నారట. ఈ మండపానికి హైలైట్‌గా నిలవబోయే వాటిలో ‘హ్యాంగింగ్ వాటర్ ఫౌంటెన్స్’ ఒకటి అని వినికిడి. మామూలుగా వాటర్ ఫౌంటెన్స్ అంటేనే అందంగా ఉంటాయి. ఇక వేలాడే ఫౌంటెన్స్ అంటే సరికొత్త అనుభూతికి గురి చేయడం ఖాయం. ఈ కళ్యాణ మండపానికి రెండు ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేస్తున్నారట. దాదాపు పదిహేను వేలమందికి సరిపడా ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. ఏ ఒక్కరూ అసౌకర్యానికి గురి కాకూడదనే ఆలోచనతో బాలకృష్ణ దగ్గరుండి మరీ కళ్యాణ మండపం నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారట. ‘ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్’ అనదగ్గ విధంగా ఈ మండపం ఉంటుందని విశ్వసనీయవర్గాల సమాచారం. -
21న బాలకృష్ణ కుమార్తె వివాహం
సాక్షి, హైదరాబాద్: సినీనటుడు నందమూరి బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్విని వివాహం ఈ నెల 21వ తేదీన ఉదయం 8.52కు హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో మతుకుమిల్లి శ్రీభరత్‌తో జరగనుంది. ఆదివారం బాలకృష్ణ నివాసంలో వారి వివాహ నిశ్చితార్థం జరిగింది. శ్రీభరత్ కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావు సోదరి కుమారుడు, విశాఖపట్నం టీడీపీ నాయకుడు ఎంవీఎస్ మూర్తికి మనుమడు. ఈ సంబంధాన్ని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుదిర్చారు. బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రహ్మణికి, చంద్రబాబు కుమారుడు లోకేష్‌కు 2007 ఆగస్టులో వివాహం జరిగిన విషయం తెలిసిందే. కాగా.. ఈ నిశ్చితార్థ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. ఢిల్లీలో ఉన్న హరికృష్ణ హాజరు కాలేదు.