గుంటూరు జిల్లా రేపల్లెలో శుక్రవారం వెలుగు చూసిన ఇంటర్ విద్యార్థిని తేజస్విని మృతిపై ఆందోళనలు కొనసాగుతున్నాయి.
గుంటూరు: గుంటూరు జిల్లా రేపల్లెలో శుక్రవారం వెలుగు చూసిన ఇంటర్ విద్యార్థిని తేజస్విని మృతిపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. కుటుంబసభ్యుల డిమాండ్ మేరకు ప్రత్యేక వైద్యాధికారుల బృందంతో ఆదివారం మధ్యాహ్నం తేజస్విని మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. అయితే, ఆమె మృతిపై కేసును పక్కదారి పట్టించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని కుటుంబసభ్యులు ఆరోపించారు. తేజస్వినిది ఆత్మహత్యగా కేసు నమోదు చేయటంపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాగరాజును అదుపులోకి తీసుకోవాలని, నిందితులు నలుగురిపై నిర్భయ కేసు నమోదు చేయాలని, కఠినంగా శిక్షించాలని కోరారు. తేజస్విని మృతదేహంతో ఆదివారం మధ్యాహ్నం రేపల్లె పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు వారితో చర్చలు జరుపుతున్నారు.