మూలపొలంలో బాలకృష్ణ చిన్న కుమార్తె
సంక్రాంతి వేడుకలు జరుపుకొనేందుకు సినీహీరో నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని తన భర్త శ్రీభరత్‌తో కలిసి ఎస్.మూలపొలంలోని అత్తవారింటికి మంగళవారం వ చ్చారు. శ్రీభరత్ మాజీ ఎంపీ గీతమ్స్ విద్యా సంస్థల అధినేత ఎంవీవీఎస్ మూర్తి (గోల్డ్‌స్పాట్ మూర్తి) ( కొడుకు కొడుకు), కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు (కూతురి కొడుకు)ల మనుమడు. సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండడంతో బాలకృష్ణ రాలేకపోయినట్టు మూర్తి తెలిపారు.
ఇదిలా ఉండగా మనుమడు శ్రీభరత్ దంపతులతో గడిపేందుకు కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు కూడా ఎస్. మూలపొలంలోని గోల్డ్‌స్పాట్ మూర్తి ఇంటికి మంగళవారం వచ్చారు. సాంబశివరావు స్థానికులతో కలసి భోగి పండగ వేడుకల్లో పాల్గొన్నారు. మూర్తి ఆహ్వానం మేరకు ఇక్కడకు వచ్చినట్టు ఆయన విలేకరులకు తెలిపారు. తనకు ఏ విధమైన అధికారిక లాంఛనాలు వద్దని పోలీసు, రెవెన్యూ అధికారులను సాంబశివరావు పంపించి వేశారు.