'బిగ్‌బాస్'లో అమర్‌కి అది కష్టమే.. భార్య తేజస్విని కామెంట్స్ | Bigg Boss 7 Telugu: Tejaswini Gowda Comments On Amardeep - Sakshi
Sakshi News home page

Amardeep Bigg Boss 7: అమర్‌ది అలాంటి మనస్తత్వం.. బిగ్‌బాస్‌కి సెట్ కాడు!

Published Fri, Oct 13 2023 7:25 PM | Last Updated on Fri, Oct 13 2023 7:30 PM

Tejaswini Comments On Amardeep Bigg Boss 7 Telugu - Sakshi

'బిగ్‌బాస్ 7'లో అమరదీప్ ఆటపరంగా తడబడుతున్నాడు. టైటిల్ ఫేవరెట్ అనుకున్నోడు కాస్త ఎలిమినేట్ అయిపోతాడేమో అని రేంజుకి పడిపోయాడు. రైతుబిడ్డతో గొడవ తర్వాత నెగిటివిటీ ఎక్కువైపోయింది. గేమ్ పరంగా ఏ మాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు. మొన్నీమధ్య అమరదీప్ తల్లి కొడుకు గురించి మాట్లాడింది. ఇప్పుడు అతడి భార్య తేజస్విని.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

అమర్ చిన్నపిల్లాడు
బిగ్‌బాస్‌లోకి వెళ్లకముందు అమరదీప్-తేజస్విని కలిపి.. ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో భాగంగా అమర్ గురించి చెప్పుకొచ్చిన తేజస్విని.. అతడిది చిన్నపిల్లాడి మనస్తత్వం అని, పిల్లలు ఓసారి వింటారు, మరోసారి వినరు. వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలి. అమరదీప్‌కి కూడా ప్రతి విషయం ఇలానే చెప్పాలని తెలిపింది.

(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ఆ తెలుగు సినిమా)

అమర్‌కి అది కష్టమే
ఇకపోతే అమర్ టాస్కుల్లో కష్టపడతాడు కానీ మైండ్ గేమ్స్‌లో తడబడతాడని తేజస్విని చెప్పింది. బిగ్‌బాస్‌లోని కంటెస్టెంట్స్ స్ట‍్రాటజీలు, మైండ్ గేమ్స్ అమర్ అర్థం చేసుకుని ఆడలేడని చెప్పింది. ఎందుకంటే ఎవరేం చెప్పినా నమ్మేస్తాడని అలానే రోజంతా జరిగిన దానిలో గంట మాత్రమే అది కూడా గొడవపడిన, తప్పుగా మాట్లాడిన విషయాలే చూపిస్తారని చెప్పింది. దీనివల్ల నెగిటివిటీ ఎక్కువైపోతుందని, ఇలాంటి పరిస్థితిని అమర్ హ్యాండిల్ చేయడం కష్టమేనని తేజస్విని చెప్పుకొచ్చింది.

వర్కౌట్ కాని టిప్స్
అయితే బిగ్‌బాస్‌లోకి వెళ్లే ముందు అమరదీప్‌కి తేజస్విని చాలా జాగ్రత్తలు చెప్పింది. హైపర్ కావొద్దు, అర్థం చేసుకుని మాట్లాడు, ఎవరినీ నమ్మొద్దు ఇలా చాలా చెప్పి పంపించింది. కానీ అమర్ వీటన్నింటిలోనూ తడబడ్డాడు. దీంతో టాప్-5లో ఉంటాడనుకున్నోడు కాస్త డేంజర్‌లో పడిపోయాడు. ఈ వారం నామినేట్ అయిన ఏడుగురిలో అమర్ కూడా ఒకడు. కానీ ఓట‍్లు బాగానే పడుతున్న కారణంగా అమర్ ఎలిమినేషన్ ఇప్పట్లో ఉండకపోవచ్చు అనిపిస్తుంది.

(ఇదీ చదవండి: అకీరా హీరోగా ఎంట్రీ? రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement