లండన్‌లో తెలుగు యువతి తేజస్విని(27) దారుణ హత్య కేసులో పురోగతి కనిపించడం లేదు. ఆమెను చంపాడన్న విషయాన్ని నిందితుడు, బ్రెజిల్‌కి చెందిన వ్యక్తి పోలీసులకు చెప్పనట్లు తెలుస్తోంది. విచారణలో అతను ఏమాత్రం సహకరించడం లేదని, అతన్ని మళ్లీ మళ్లీ ప్రశ్నించాల్సి ఉందని పోలీసులు అంటున్నారు. దీంతో ఈ కేసులో దర్యాప్తు జాప్యం కలిగేలా కనిపిస్తోంది.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన కొణతం తేజస్వినిరెడ్డి లండన్‌లో స్నేహితులతో పాటు కలిసి మాస్టర్స్ డిగ్రీ చేస్తోంది. తాజాగా బయటికి వెళ్లిన క్రమంలో తేజస్విని, ఆమె ఫ్రెండ్ అఖిలపై బ్రెజిల్‌కు చెందిన ఓ వ్యక్తి దాడి చేశాడు.ఈ దాడిలో తేజస్విని తీవ్రగాయాల పాలై ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచింది. ఆమె స్నేహితురాలు అఖిలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి కానీ ఆమె ప్రాణాలతో బయటపడగలిగింది.
మృతదేహాన్ని రప్పించండి,
ఎం.ఎస్ పూర్తి అయిన తర్వాత తేజస్వినికి మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయాలని ఆమె తండ్రి ఎంతో తపనపడ్డాడు. ఈలోపే ఘోరం జరగడం కన్నీరుమున్నీరు అవుతున్నారు. తేజస్విని మృతదేహాన్ని వీలైనంత త్వరగా ఇండియాకి పంపించాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment